*🧘♂️77-ఉపనిషత్ సూక్తి 🧘♀️*
*108 ఉపనిషత్తులలో గల 108 మహా వాక్యములు*
*77. స్వాత్మన్యేవ స్వయం సర్వంసదా పశ్యతి నిర్భయః||*
*(పాశుపత బ్రహ్మోపనిషత్)*
*- తన ఆత్మ యందే సర్వమును నిర్భయుడై స్వయముగా దర్శించుచున్నాడు.*
*లోకా స్సమస్తా స్సుఖినోభవన్తు!*
.............
*సుఖం, దుఃఖమనే కిరీటాన్ని ధరించి మానవుని వద్దకు వస్తుంది. సుఖానికి స్వాగతం చెప్పేవాడు దుఃఖానికి కూడా స్వాగతం చెప్పి తీరవలసిందే!*
.............
*బలాన్ని స్మరించడమే బలహీనతల నుండి బయటపడే మార్గం, కానీ బలహీనులమని బాధపడటం కాదు.*
.........
*🧘♂️ప్రార్ధన🧘♀️*
*మానవుని ప్రార్ధనల ద్వారా, మరియు దేవుని సర్వశక్తిత్వం అర్ధం చేసుకోవడం ద్వారా సఫలత యొక్క అధిచేతనగా నియమం అమలులోకి వస్తుంది. మీ ప్రయత్నాలను మానకండి. అలాగని , మీ సహజ సామర్ధ్యం మీదనే ఆధారపడకండి. మీరు చేసే ప్రతి కార్యంలోనూ దైవసహాయాన్ని అర్ధించండి.*
*శ్రీ పరమహంస యోగానంద / " Scientific Healing Affirmations "*
.........
*12) దినయామిన్యౌ సాయం ప్రాతః శిశిరవసంతౌ పునరాయాతః|*
*కాలః క్రీడతి గచ్ఛత్యాయుః తదపి న ముంచత్యాశావాయుః ||*
*పగలు - రాత్రి , సాయంకాలము - ప్రాతఃకాలము , శిశిర ఋతువు - వసంత ఋతువు ఇవన్నీ మళ్ళీ మళ్ళీ వచ్చును.కాలము ఆటలాడుచున్నది.ఆయుష్షు క్షీణించుచున్నది అయినా ఆశ విడవకున్నది.*
.......
*భగవద్గీతా శ్లోకం:-*
*జ్ఞానేన తు తదజ్ఞానం యేషాం*
*నాశితమాత్మనః*
*తేషామాదిత్యవద్ జ్ఞానం*
*ప్రకాశయతి తత్పరం*
(గీ. 05-16)
*పెదతిరుమలయ్య వ్రాసిన శ్లోక భావం:-*
యెవ్వరైనా నేమి సంతతమున్ను
అభ్యసింపబడిన జ్ఞానము చాతను తమ అజ్ఞానం నశింపజేయుదురు. వారికి ఆ తరువాతను ఆదిత్యునివలెనే జ్ఞానం ప్రకాశించును.
ఒకటి మంచిదైన జ్ఞానం. ఇంకొకటి మంచిది కాని జ్ఞానం. వివేకమున్న వాళ్లు రెండింటిలో ఒకదానిని - తాము దేనిని గ్రహిస్తున్నారో లోకానికి ప్రకటించి - గ్రహించండి.
1. తనని - అంటే - భగవంతుని తలచుకొంటే అన్నింటిలోను ఆయనని చూస్తూ ఉంటే ఆ భోగం ముందు - మిగిలిన తాత్కాలికమైన శరీర భోగాలు పనికిరావనిపిస్తాయి. ఎందుకంటే ఆ శరీర భోగాలు అపరా ప్రకృతి కనుక. మాయతో గొప్పగా అనిపించే లోకంలోని భోగాలయందు ఆసక్తిని పెంచుకొంటే - తను ఆ దైవాంశ నీకు కనబడదు. ఎందుకంటే అతను జీవ తత్త్వం కనుక, (అన్నింటిలో స్వామిని చూడటం సుజ్ఞానం. లౌకిక భోగాలలో మనస్సు పెట్టడం అజ్ఞానం అని భావం).
2. సన్యాసిగా మారి - ఫలం కోరి చేసే కర్మలను (కావ్య కర్మలను) మోక్షానికి అడ్డంకులని భావించి వాటిని చేయటం మరిచిపోవాలి. ఎందుకంటే అవి బంధాలు పెంచుతాయి కనుక. ఇది సుజ్ఞానం. అలా కాకుండా అజ్ఞానంతో కామ్య కర్మల బంధంలో చిక్కుపడితే - బంధంలేని స్వతంత్రుడైన దేవుడిని వశం చేసుకోలేవు.
3. సరిలేని మోక్షాన్ని కోరుకొంటే - స్వర్గం నీ మార్గం కాదు. మోక్షాన్ని కోరుకొనేవాడు స్వర్గాన్ని కోరుకోవటం అజ్ఞానం, ఎందుకంటే స్వర్గం వెళ్లినా మళ్లీ అక్కడ మోక్షానికి మార్గం వేసుకోవాలి. కాబట్టి అలమేల్మంగ భర్త శ్రీవేంకటేశ్వరుడిని శరణు కోరటం అన్నింటిని నీకు కలిగిస్తుంది. ఇది సుజ్ఞానం.
.....
జ్ఞాన ప్రతిబంధ త్రయమని ఒక మాట ఉంది. అంటే జ్ఞానాన్ని మూడు విషయాలు అడ్డగిస్తూ, అజ్ఞానంలో పడేస్తుంటాయి. ఆ మూడింటిని అన్నమయ్య తన మూడు చరణాలలో నిరూపించి వాటి నివారణోపాయాలు చెప్పాడు.
*1. సంశయం:-* 'కలడు కలండనెడువాడు కలడో లేడో అనే సంశయంతో - 'ఉన్న దేహాన్ని, వయస్సును వ్యర్ధం చేసుకోవటం దేనికి? చక్కగా దేహ భోగాలు అనుభవిస్తే సరిపోతుంది. పోయిన వయస్సు మళ్లీ రాదు' అని అష్ట భోగాలు - (అన్నం, వస్త్రం, గంధం, పుష్పం, శయ్య, తాంబూలం, స్త్రీ, గానం) అనుభవించాలని కొంతమంది మనస్సు ఉవ్విళ్లూరుతుంది. ఇది జీవుడి తప్పు కూడ కాదు, అజ్ఞాన ప్రకృతి ఈ పని చేయిస్తుంటుంది. ఈ సంశయం తొలగటానికి ఒక ఉపాయం ఉంది. అది *స్వామివారిని కీర్తనాదులద్వారా శ్రవణం చేయటం*. దీనినే అన్నమయ్య *'తను తలుచుకొంటేను'* అన్నాడు. భోగాలకు లోను కాకుండా ప్రయత్న పూర్వకంగా ఆయనని తలుచుకొంటుంటే జీవితాన్ని తప్పక ప్రతివాడు గెలుచుకొంటాడు. భోగమంటే పాము పడగ అని ఇంకో అర్థం ఉంది. పడగ మెత్తగా ఉందని స్పర్శ సుఖం అనుభవించాలని మొదలుపెడితే కాటుకు గురికాక తప్పదు. ఇది మరిచిపోకూడదు.
*2. అసంభావన :-* ఫలం కోరి చేసే శుభ కర్మలని కార్యకర్మలు అంటారు. యజ్ఞం, దానం, తపస్సు మొదలైనవి కామ్య కర్మలు, యోగ ధ్యానాదులు చేయటానికి వేదాలలో పదునాలుగు కామ్య విద్యలు చెప్పారు. (తైత్తిరీయే పురుష విద్య మొదలైనవి). ఈ కామ్య కర్మలను విడిచి పెట్టటమే సన్యాసమని గీతలో స్వామి చెప్పాడు. ( 18-02) అన్నమయ్య కూడ ఈ గీతా భావాన్నే రెండవ చరణంలో పేర్కొంటూ కామ్య కర్మలు బంధాలు కలిగిస్తాయని, బంధాలు స్వామి సన్నిధికి పోనీవని చెబుతూ అందుకోసం దైవాన్ని ఎరగాలన్నాడు. అంటే - *మననం చేయాలని భావం*, దీనివల్ల రెండవ జ్ఞాన ప్రతిబంధం తొలగిపోతుంది.
*3. విపరీత భావన :-* ఒక వస్తువునందలి నైజాన్ని వేరొక విధంగా తలిచే వ్యతిరేక భావనని విపరీత భావన అంటారు. స్వర్గమంటే మోక్షం అనుకోవటం విపరీత భావన. నిధి ధ్యాసనం (ఏకాగ్ర చిత్తంతో మననం చేయటం వలన నేనే బ్రహ్మాన్ని అనే ఆనందం పొందటం) ద్వారా దీనిని పోగొట్టుకోవచ్చు. ధ్యాన మార్గం అన్నమయ్య శరణం చేయమన్నాడు.
*సర్వ ధర్మాన్ పరిత్యజ్య..* అనే గీతా శ్లోకాన్ని చరమ శ్లోకం అంటారు. స్వామిని శరణు వేడితే అన్నింటినుంచి రక్షణ కలుగుతుందని ఆ శ్లోకం గొప్ప నైతిక స్థైర్యాన్ని ఇస్తుంది. *మన అన్నమయ్య కూడా అదే గీతా పద్ధతిలో శరణం సర్వ సాధనమని తిరుగులేని నిర్వచనమిచ్చాడు.*
ప్రకృతి అంటే స్వభావం, ఇది ప్రతి జన్మలో త్రిగుణాలుగా, రాగ ద్వేషాలుగా మార్పు చెందుతుంది. నేనే కర్తని అనే అహంకారంతో అజ్ఞానం మనిషిని కప్పివేస్తుంటుంది. ఈ దశలో అజ్ఞానానికి, విజ్ఞానానికి ఉదాహరణలు చెప్పి మనలను వివేకులుగా చేయటానికి తిరుమల దేవుని పాదములనుండి అవతరించిన ఈ అన్నమయ్య కీర్తనా గంగ తలదాల్చిన వారిని పునీతం చేస్తూ ఉంటుంది.
..........
75. మన ఏవ సవితా వాక్సావిత్రీ స యత్ర మనస్త ద్వాక్||
(సావిత్య్రుపనిషత్)
*- మనస్సే సవిత, వాక్కు సావిత్రి. ఎక్కడ మనస్సో అదియే వాక్కు.
*స్త్రీకి గాని, పురుషుడుకి గాని - హృదయపవిత్రతే మొదటి సుగుణం.
****
*ప్రతి వ్యక్తి పురోగతికి, ప్రతి దేశాభివృద్ధికి మూడు విషయాలు అవసరం.
1. నిస్వార్థ పర్వతానికి ఉన్న అఖండ శక్తి లో ధృఢ విశ్వాసం,
2. అసూయ, అనుమానాలు లేకపోవడం,
3.పవిత్రంగా ఉండేందుకు ప్రయత్నిస్తూ, పరహితానికై పాటుపడే వారందరికీ తోడ్పడడం.
*ప్రార్ధన చేసే ఉత్తమ మార్గం ఇది:
"భగవంతుడా నిన్ను తెలుసుకొనే ఆనందం నాకు కలుగజేయి. నాకు ఐహిక వాంఛల నుండి విముక్తి కలిగించు; ముఖ్యంగా జీవితంలోని సుఖ దు:ఖాలకు అతీతంగా ఉండే నీ ఆనందాన్ని నాకు ప్రసాదించు."*
శ్రీ పరమహంస యోగానంద / Man's Eternal Quest
శ్రీ ఆదిశంకరాచార్య విరచితము భజగోవిందం
10) వయసిగతే కః కామవికారః శుష్కే నీరే కః కాసారః|
క్షీణేవిత్తే కః పరివారః జ్ఞాతే తత్త్వే కః సంసారః ||
వయస్సు మళ్ళినచో కామవికారమెక్కడ? నీరెండిపోగా చెరువెక్కడ? సంపదక్షీణించినచో బంధువులెక్కడ? తత్త్వజ్ఞానమేర్పడగా సంసారమెక్కడ?
****
*74. నమే దేహేన సంబంధో మేఘేనేవ విహాయ విహాయనః||*
*(కుండికోపనిషత్)*
*- నాకు దేహముతో సంబంధము, మేఘముతో ఆకాశమునకు సంబంధము లేనట్లే, లేనేలేదు.*
*లోకా స్సమస్తా స్సుఖినోభవన్తు!*
.........
*ఒక ప్రాపంచిక కీటకం మాదిరి చావటంకంటే, సత్యాన్ని భోధిస్తూ కార్యరంగంలో మరణించటం ఉత్తమం.*
..........
*🧘♂️భాగవతము🧘♀️*
*గరుత్మంతుడు అనగా మనలో జరిగే స్పందనము. స్పందనమును అధిష్టించి విష్ణువు ఉంటాడు. గరుత్మంతుని రెక్కలే మన ఊపిరితిత్తులు. మనము శ్వాస అందుకునే భాగము గరుత్మంతుడు. మన ఊపిరి తిత్తులు సంకోచం, వ్యాకోచం చెందడానికి కారణము ప్రాణస్పందన. అధిష్టించి ఉన్న దైవము వలన ప్రాణస్పందన జరుగును.*
*కనుక స్పందనకు మూలమైన వాడిని ధ్యానము చేయవలెను. భాగవతములో ప్రతి చిన్న విషయములో పెద్ద పెద్ద రహస్యాలు ఇమిడి ఉంటాయి.*
............
*ఆచార్య సద్బోధన*
*స్ఫూర్తిని పొందేందుకు, ఉన్నత దృష్టిని అలవరుచుకునేందుకు మూల్యాన్ని ఎంతైనా చెల్లించవచ్చు. మూల్యం అంటే ఇక్కడ సంపద కాదు, ఎంతటి కష్టాన్నైనా సహించవచ్చని అర్థం.*
*శాస్త్రీయ పరిజ్ఞానంతో సంతృప్తినొందలేం. ఆరంభంలో దానిని ఆలంబనగా చేసుకున్నా తర్వత మరింత లోతుల్లోకి మునగవలసి ఉంటుంది. చివరకు అసలైన జ్ఞానఖనిని చేరవలసి ఉన్నది.*
*శాస్త్రం, భగవంతుడు కలిస్తేనే యోగం ఏర్పడుతుంది. "యోగం" అనే పదం చాలా పవిత్రమైనది, ఎంత పవిత్రమంటే ఉచ్చారణలోనే నిశ్శబ్ధాన్ని ఇముడ్చుకుని ఉంది. పరమాత్మునితో కలయికను యోగం సూచిస్తుంది.*
*మనం మనలోని ఆత్మను కనుగొనేందుకు అనువైన మార్గాన్ని ఎంచుకుంటే ఆచరించే విధానాన్ని యోగం బోధిస్తుంది.*
*శుభం భూయాత్*
.........
*🧘♂️ప్రార్ధన🧘♀️*
*ఒక్కసారి కనక మీరు ఆయనతో కలిసి " భుజిస్తే" , ఆయన మౌనానికి భంగం కలిగిస్తే ఆయన మీతో తరుచుగా మాట్లాడుతూ ఉంటాడు. కాని మొదట్లో ఇది చాలా కష్టం. దేవునికి పరిచయస్తుడు కావడం సుళువుకాదు; ఎంచేతంటే , మీరు నిజంగా ఆయనను తెలుసుకోవాలని కోరుతున్నారనే సంగతి ఆయనకు రూఢి కావాలి. భక్తుడికి నిజంగా తానే కావాలో మరొకటేదైనా కావాలో చూడటానికి ఆయన పరీక్షలు పెడుతుంటాడు. మీ హృదయంలో మరో కోరిక ఏది దాగి ఉండలేదన్న నమ్మకం ఆయనకి కలిగేదాకా మీతో మాట్లాడడు. ఆయనిచ్చే కానుకల కోసమే కోరికలతో మీ హృదయం నిండి ఉన్నప్పుడు ఆయన మీ కెందుకు వెల్లడి కావాలి ?*
*శ్రీ పరమహంస యోగానంద / దేవుడితో మాట్లాడ్డం ఎలా?*
*శ్రీ ఆదిశంకరాచార్య విరచితము భజగోవిందం*
*9):సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వమ్|*
*నిర్మోహత్వే నిశ్చలతత్త్వం నిశ్చలతత్త్వే జీవన్ముక్తిః ||*
*సత్పురుష సాంగత్యము వలన భవబంధములూ తొలగును.బంధములు తొలగినచో మోహము నశించును. మోహము నశించగా స్థిరమైన జ్ఞానమేర్పడును. స్థిరజ్ఞానమేర్పడగా జీవన్ముక్తి కలుగును.*
....
*🧘♂️శక్తిమంత్రం
🔥ఓంశ్రీమాత్రే నమః🔥
.........
*(విపత్తుల నివారిణి)*
*ఓం తేజోసి తేజో మయి దేహి!*
*వీర్యమసి వీర్యమ్ మయి దేహి!*
*బలమసి బలం మయి దేహి!*
*ఓజోసి ఓజో మయి దేహి!*
*మన్యురసి మన్యుం మయి దేహి!*
*సహోసి సహో మయి దేహి!!*
* ఓం *
*(శక్తి మంత్రం)*
*(శుక్ల యజుర్వేదము, 19.9)*
*‘శరీరానికి, మనస్సుకూ సంబంధించిన అన్ని క్లేశాలు బలహీనత నుండే పుట్టుకొస్తాయి. బలహీనతే మరణం’ అంటారు స్వామి వివేకానంద. జీవిస్తూ ఉన్నప్పుడే అలా మరణం బారిన పడకుండా ఉండగోరితే శక్తి అవసరం – దేహశక్తి అవసరం, మానసికశక్తి అవసరం, ఆత్మశక్తి ఆవశ్యకం. అట్టి శక్తికి ప్రార్థిస్తుంది యీ మంత్రం.*
*ఓం తేజో సి తేజో మయి దేహి | వీర్యంసి వీర్యమ్ మయి దేహి | బలమసి బలం మయి దేహి | ఓజో సి ఓజో మయి దేహి |మన్యురసి మన్యుం మయి దేహి | సహో సి సహా మయి దేహి ఓం||*
*తేజః=ఆత్మశక్తిగా; అని=ఉంటున్నావు; మయి=నాకు; తేజః=ఆత్మశక్తిని; దేహి=ప్రసాదించు; వీర్యం=సంయమశక్తి; బలం=శరీరశక్తి; ఓజః=దివ్యశక్తిః; మన్యుః=ధైర్యం; సహః=సహనం.*
*భగవంతుడా! నువ్వు ఆత్మశక్తిగా ఉంటున్నావు. నాకు ఆత్మశక్తిని ప్రసాదించు. నువ్వు సంయమశక్తిగా ఉంటున్నావు. నాకు సంయమ శక్తిని చేకూర్చు. నువ్వు శారీరకశక్తిగా ఉంటున్నావు, నాకు శారీరకశక్తిని అనుగ్రహించు. నువ్వు దివ్యశక్తిగా అలరారుతున్నావు, నాకు దివ్య శక్తిని ప్రసాదించు. నువ్వు ధైర్యంగా భాసిల్లుతున్నావు, నాకు ధైర్యాన్ని ప్రసాదించు. నువ్వు సహనశీలివిగా ఉంటున్నావు, నాకు సహనతను ప్రసాదించు.*
*ధైర్యంతోపాటు సహనత కోసం కూడ ప్రార్థించడం యిక్కడ కానవస్తున్నది. ధైర్యం వీర్యం శక్తి ఉన్నాయని పరిశోధించకుండా ఏ కార్యంలోను దిగరాదు. సహనట వహించి పరిస్థితిని సమీక్షించుకోవాలి. తదనంతరం అవసరమైతే మాత్రమే కార్యరంగంలోకి దిగాలి. సహనటసైతం ఒక శక్తే. సహనట నరాలను బలవత్తరం చేస్తుంది. ‘ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, దానితోపాటు…నిర్నిరోధమైన సంకల్పమే మనకు ఇప్పుడు ఆవశ్యకం’ అంటారు స్వామి వివేకానంద. ఇనుముతో తయారైన కండరాలను పోలిన కండరాలను వ్యాయామం అభ్యసించి పొందవచ్చు. ఉక్కు నరాలు పొందడ మెలా? ఇది సహనత వలననే పొంద సాధ్యం. సహనం పాటిస్తున్నప్పుడు ఒత్తుడులను సంబాళించుకొనే శక్తి (Stress – bearing power) అధికరిస్తుంది. అందుచేతనే సహనతను కూడ ఒక శక్తిగా యిక్కడ పేర్కొన్నారు. కాని ‘సాధన లన్నిటిలోను యిది ఎంతో కష్టమైన సాధన’ అని స్వామి వివేకానంద వక్కాణించారు.*
*భగవంతుడిని ఆత్మ శక్తిగా, సంయమ శక్తిగా, శారీరక మానసిక శక్తులుగా, దివ్య శక్తిగా, ధైర్య శక్తిగా, సహన శక్తిగా భావిస్తూ ఆయా శక్తులను ప్రసాదించమని ప్రార్థించే మంత్రమిది. ఈ మంత్ర జపం వల్ల సాధకుడు తేజస్సంపన్నుడై ఒత్తిడులను సంభాళించుకునే శక్తిని సంపాదిస్తాడు.*
*అలాగే ఋగ్వేదంలోని సూర్యసూక్తం కూడా సూర్యుడిని జీవితానికి ఆధారభూతునిగా, దేహానికి శక్తిగా, వర్షాన్ని, ఆహారాన్ని ఇచ్చేవాడిగా, ప్రపంచాన్ని రూపొందించి, పోషించేవాడిగా, పర్యావరణాన్ని కాపాడేవాడిగా, సకల కార్యాలనూ సాధించేందుకు ప్రేరణ శక్తిగా, ఉన్నత జీవనాన్ని ప్రసాదించే వాడిగా చెపుతుంది. అంతేకాదు.. చేసే పనిలో శ్రద్ధను, ఆసక్తిని కలిగి ఉండాల్సిన అవసరాన్ని ఈ వేదసూక్తాలు చెబుతాయి. వ్యక్తి తన మనసును, శరీరాన్ని, సమాజాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన ప్రాముఖ్యతను వాటిని సాధించేందుకు అవసరమైన మార్గాలను సూచిస్తాయి. అక్షరాలుగా ఒకచోట కూర్చబడిన మంత్రాలకు ఈ శక్తి ‘నమ్మకం’ ద్వారా కలుగుతుంది. జీవన యాన కేంద్రం నమ్మకమైనప్పుడు అది అన్నింటినీ తనవైపు ఆకర్షించు కుంటుంది.*
*పలికే ప్రతి అక్షరాన్నీ నిర్ణీత అంతరాలలో పలికినపుడు అవి మన కండరాలపై, నరాలపై, రక్తప్రసరణపై, గుండెపై తద్వారా శరీర ఆరోగ్యంపై మంత్రం తన ప్రభావాన్ని చూపుతుంది. అలాగే పలికిన పదాలు సూచనలుగా మన మనసుపై ముద్రింపబడతాయి. ఆ ముద్రలు బలీయమైతే దానికి సంబంధించిన కార్యావిష్కరణకు దారి చూపుతాయి. మన మనసు చాలా శక్తివంతమైనది.*
*అది మన మిచ్చుకున్న సూచనలకు అనుగుణంగా పనిచేస్తుంది. మనస్సు బలీయమైతే, శారీరక ధర్మాన్ని అధిగమించి ముందుకు సాగుతుంది. కాబట్టి వేద మంత్రాల రూపంలో ఉచ్చరించిన అక్షరాలు శారీరకంగా మానసికంగా ప్రభావాన్ని చూపుతాయి. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా భయపెడుతున్న కరోనా లాంటి క్రిమి చేసే నష్టాన్ని తగ్గించుకునేందుకు అవసరమైన మానసిక, శారీరక సన్నద్ధతను ఈ వేద మంత్రాలు లేదా సూక్తాలు ఇస్తాయి. అయితే ఒక్క విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవాలి.*
*ఇవి వైద్యానికి అనుబంధంగా పనిచేస్తాయే కానీ ప్రత్యామ్నాయంగా జబ్బును తగ్గించేందుకు ఉపకరించవు. మనం ఈ మంత్రాలను ఉచ్చరించే సమయంలో వాటి అర్థాలను తెలుసుకొని వాటిని ఊహించ గలగాలి. ఎంత బాగా, దగ్గరగా ఊహించుకోగలిగితే అంత మంచి ఫలితాన్ని రాబట్టుకోగలము.*
*కల్పన లేదా ఊహ మరియు నమ్మకం ఈ రెండూ ఒక పక్షికి రెండు రెక్కల లాంటివి. రెండూ బలంగా ఉన్న పక్షి ఆకాశంలో చక్కగా విహరించ గలదు. కాబట్టి నమ్మకాన్ని, కల్పనను ఆదరించి ఈ మంత్రాల ద్వారా ఉపశమనం పొందుదాం.*
..........
🧘♂️73-ఉపనిషత్ సూక్తి 🧘♀️
73.స్వయం విశ్వమిదం సర్వం స్వస్మా దన్యన్న కించన||
(అధ్యాత్మోపనిషత్)
*- విశ్వరూపములోనున్న ఉపాధి అంతయు సర్వమును ఆత్మయే. ఆత్మ కంటే వేరుగానున్న వస్తువు లేనే లేదు.
*విజయం పొందాలంటే, మొక్కవోని పట్టుదలను, ప్రబలమైన సంకల్ప శక్తిని నీవు కలిగి ఉండాలి. 'నేను సముద్రాన్నే తాగేస్తాను. నా సంకల్ప శక్తితో పర్వతాలు కూడా పొడి పొడి కావలసిందే! అని పట్టుదల గలవాడు అంటాడు. అటువంటి వీర్యోత్సాహంతో, ధృఢ సంకల్పంతో కష్టపడి పని చేయి. తప్పక గమ్యాన్ని చేరతావు.
*వేయి ఓటములనైనా ఓర్చుకొని, పట్టువదలకుండా ప్రయత్నించినప్పుడే సద్గుణాలను, శీలసంపత్తిని సమకూర్చుకోగలము.
***
8) కా తే కాంతా కస్తే పుత్రః సంసారోఽయమతీవ విచిత్రః|
కస్య త్వం కః కుత ఆయాతః తత్త్వం చింతయ తదిహ భ్రాతః ||
నీ భార్య ఎవరు? నీ పుత్రుడు ఎవరు? ఈ సంసారము చాలా విచిత్రమైనది. నీవెవడివాడవు? ఎవడవు? ఎక్కడి నుండి వచ్చావు? ఓ సోదరుడా! తత్త్వమును ఆలోచింపుము.
*****
🐒హనుమంతుడు యోగమార్గం🧘♂️
🧘♂️సుందరకాండ- యోగ రహస్యము🧘♀️
1) శ్లోకం :- తతో రావణనీతాయాః సీతాయాశ్శత్రు కర్మణః |
ఇయేష పదమన్వేష్టుం చారణాచరితే పథి ||
తాత్పర్యం :- రావణుని చేత అపహరింపబడిన సీత యొక్క జాడను అన్వేషించడం కోసం చారణాది దివ్యజాతులు సంచరించు ఆకాశమార్గమున వెళ్ళడానికి హనుమంతుడు నిర్ణయించుకున్నారు.
రావణుని చేత అంటే మన దశవిధ ఇంద్రియముల చేత ఆత్మ పట్టుబడితే అది అహం. సీతమ్మ వారికి జీవ లక్షణంగా అహం వచ్చినది. ఆభరణాలు తీసేసి, రాజ్యాన్ని వదిలి పెట్టి అరణ్యాలకు తన ఇష్టంతోనే వచ్చింది సీతమ్మ వారు. కానీ బంగారు లేడిని చూసి భ్రమకు లోనైంది. అంటే అన్నీ పరిత్యాగం చేసినా శ్వాస ఉన్నంతవరకూ జీవుడు ఎక్కడో ఒక చోట భ్రమకు లోనవుతాడు. కాబట్టి ఎల్లప్పుడు అప్రమత్తంగా ఉండాలి.
సీతాయాః శ్శత్రుకర్మణః అన్నారు . ఇక్కడ సీత అంటే జీవాత్మ. ఈ జీవాత్మకు శత్రువులు ఎవరు అంటే దశ ఇంద్రియాలు అనబడే రావణుడు. పరమాత్మతో అనుసంధానం అయి ఉండవలసిన జీవాత్మను దశ ఇంద్రియాలు బంధించి ధేహం అనే లంకలో పడేస్తాయి. ఇయేష పదమన్వేష్టుం ఏ దారిలో తీసుకుని వెళ్ళాడో తెలుసుకోవడానికి అంటే దశ ఇంద్రియాలు అని పలివబడే రావణాసురుడు జీవాత్మ అనబడే సీతమ్మను ఏ దారిలో తీసుకుని వెళ్ళాడో తెలుసుకోవడానికి చారణాచరితే పథి .. అంతరిక్ష మార్గంలో వెళ్ళడానికి ఉద్యుక్తుడయ్యాడు హనుమంతుడు. చారణాచరితే అంటే యక్షులు, గంధర్వులు మొదలైనవారు సంచరించే అంతరిక్ష మార్గం అని అర్థం. యోగ మార్గము లో చెప్పాలంటే శ్వాసను పైకి పంపడం అని అర్థం. పదం అన్వేష్టం అంటే ఈ శ్వాస ఎక్కడ పుట్టి ఎక్కడ అంతం అవుతుందో తెలుసుకోవడమే యోగం.
జీవి యొక్క సర్వ చైతన్యములు బ్రహ్మరంద్రం నందు పుట్టి బీజాలుగా మారి సహస్రారం, ఉన్మని, ఆజ్ఞా, విశుద్ధ, దహరం, మణిపూర, స్వాధిష్ఠాన, మూలాధార మొదలైన చక్రముల దగ్గర భావసంపుటి , పదార్థ సంపుటి, పదార్థ జ్ఞానం అవుతాయి. తల్లి యొక్క గర్భమందు పిండరూపంలో ఉన్న జీవుని లోపలికి బ్రహ్మ రంద్రం ద్వారా ప్రవేశించిన ఆత్మ పైన చెప్పిన వరుస క్రమంలో దహరమును చేరి జీవాత్మ అవుతుంది. ఈ జీవాత్మ ఇంద్రియానుభవముల కోసం తపిస్తూ రక్త సహస్రారం వరకూ చేరుకుంటుంది. జీవుని లోపలికి చేరిన ఆత్మే పరమాత్మ నుండి చ్యుతిని పొంది జీవాత్మ అయినదో అలాంటి జీవాత్మను మళ్ళీ ఆ పరమాత్మ దగ్గరకు చేర్చేదే యోగం. యోగం ద్వారా శ్వాసను కాంతిగా మార్చి మళ్ళీ బ్రహ్మరంద్రం వరకూ పంపాలి. మూలాధార చక్రము నుండి ఆజ్ఞాచక్రం వరకూ పది చక్రాలు ఉన్నాయి. ఈ పది చక్రాలలో శ్వాస తిరిగేటప్పుడు బ్రహ్మ సాక్షాత్కారం కాదు. ఈ పది చక్రాల యందు శ్వాసను తిప్పడానికి జ్ఞానం కావాలి. ఆజ్ఞాచక్రం లో ఆత్మ సాక్షాత్కారం అవుతుంది. దానినే విరాట్ పురుష దర్శనం అంటారు. దీనిని తెలుసుకోవడాన్ని పదార్థ జ్ఞానం అంటారు. ఈ పదార్థ జ్ఞానం ఆజ్ఞతో సరి. ఆజ్ఞ నుంచి ఉన్మని వరకు జ్ఞానం, ఉన్మని నుంచి సహస్రారం వరకు ప్రజ్ఞానం. సహస్రారం పైన ఇంక ఎటువంటి జ్ఞానంతోనూ పని లేదు. అక్కడ ఉంది కేవలం పరమాత్మ జ్యోతి మాత్రమే. తురీయాతీత దగ్గర ఇవేవి తెలియని అలౌకిక ఆనంద స్థితి ఉంటుంది.
ఇంకా చెప్పాలంటే బ్రహ్మ రంద్రం నుంచి బ్రహ్మ బీజంగా మనలోకి ప్రవేశించిన ఆత్మ దహరమును చేరి తాను అనంతం నుంచి వచ్చాననే సంగతి మర్చిపోయి శరీరమే అనంతం అనుకుంటుంది. అప్పుడే దానికి అహం అనే భావన ఏర్పడుతుంది. అహం అన్న భావన వచ్చిన వెంటనే తన స్థితిని మర్చిపోయి దశ ఇంద్రియాలు చేత చిక్కి బందీయై ఏమీ చేయాలో తెలియని స్థితిలో ఉంటుంది జీవాత్మ. ఆ బంధనాలు తెంచి జీవాత్మను పరమాత్మ వద్దకు చేర్చే శ్వాస క్రియయే హనుమంతుడు అనబడే పవనసుతుడు. సుందరకాండ లో ప్రధమ సర్గలో మొదటి శ్లోకం లో వర్ణించింది ఇదే.
తతో రావణ నీతయాః సీతాయా శత్రుకర్మణః -- రావణుడు అనబడే శత్రువు చేత చిక్కిన సీతయొక్క ,ఇయేష పదమన్వేష్టుం .. జాఢను అన్వేషించడం కోసం , చారణాచరితే పథి.. యక్ష , కిన్నెర, గంధర్వులు మొదలైనవారు సంచరించే మార్గములో వెళ్ళడానికి నిర్ణయించుకున్నాడు హనుమంతుడు.
ఇంద్రియాల చేతిలో బందీగా ఉన్న ఆత్మను బంధ విముక్తం చేయాలంటే శ్వాస ద్వారానే సాధ్యం అవుతుంది అని రహస్యంగా పరోక్షంగా ఈ శ్లోకం లో చెప్పడం జరిగింది.
2) రెండవ శ్లోకం:-
|| దుష్యరం నిష్ర్పతి ద్వంద్వం చికీర్షన్ కర్మ వాసరః
| సముదగ్రశిరోగ్రీవో గవాంపతి రివాబభౌ||
తాత్పర్యము :- దుష్కరమయిన, సాటిలేని ఆ కార్యమును సాధింపనెంచినవాడై హనుమంతుడు తన మెడను, శిరస్సును నిటారుగా నిలిపి వృషభేంద్రుని వలే ప్రకాశించుచుండెను అన్నది సామాన్యార్థం.
ఒక యోగి యోగం చేయడానికి ఎలా కూర్చోవాలో "సముదగ్రశిరోగ్రీవో" అన్న మాట ద్వారా చెబుతున్నారు. తన మెడను, శిరస్సును నిటారుగా నిలిపి కూర్చోవాలి. "గవాంపతి రివాబభౌ" వృషభేంద్రుని వలన ప్రకాశించడం. వృష అంటే కాంతి అని అర్థం. వృషభం అంటే ఎద్దు అని మనందరికీ తెలుసు. కష్టసాధ్యమైన పనిని చేసే వారిని ఎద్దుతో పోలుస్తారు కదా! సీతమ్మను వెదకడానికి సముద్రమును లంఘించటమనే కష్టసాధ్యమైన కార్యాన్ని నిర్వర్తించ నిర్చయించుకున్నవాడైన హనుమంతుడు తన మెడను, శిరస్సును నిటారుగా నిలిపి అక్కడ నిలబడి ఉన్నప్పుడు చూపరులకు ఒక వృషభరాజం వలనే ప్రకాశిస్తూ కనిపించాడు అని చెబుతున్నారు.
యోగం చేసేటప్పుడు మెడ, తల, నిటారుగా ఉంచాలి. అంటే వెన్నెముకను నిటారుగా ఉంచి యోగమునకు కూర్చోవాలి. అప్పుడే యోగి యొక్క శ్వాసకు ఏ విధమైన ఆటంకం కలగదు. దాని వలన శ్వాస కాంతిగా మారి నిరాటంకంగా పైకి ప్రయాణిస్తుంది అనేది ఇక్కడ క్రియా యోగ రహస్యం.
3) మూడవ శ్లోకం.
|| అధ వైడూర్యవర్ణేషు శాద్వలేషు మహబలః |
ధీరస్సలిలకల్పేషు విచచార యథాసుఖమ్ ||
తాత్పర్యం :- అచట పచ్చికబయళ్ళు వైడూర్య వర్ణ శోభితములై చల్లదనము కలిగి మృదువుగా స్వచ్చములై ఉండుటచే అవి సలిలకల్పములై వాయుస్పర్శచే తరంగాయితములై అలరారుచుండెను. అంతట ధీరుడును, మహబలశాలియు అయిన హనుమంతుడు వాటిపై అటు ఇటు సంచరించు చుండెను.
ఇక ఆ శ్వాస ఎటు వెళుతుందో చెబుతున్నారు. ఆ శ్వాస వైడూర్య వర్ణం అంటే తెలుపు, నాచురంగు కలిగిన వర్ణం కలిగి ఉంటుంది అంట. మూలాధార కుంభకం చేసినప్పుడు శ్వాస వైడూర్య వర్ణం లో కనిపిస్తుంది. తెలుపు వర్ణం సుషుమ్న. అటూ ఇటూ ఉన్న ఇడ, పింగళ నాడులు నాచు వర్ణంలో ఉంటాయి. మహబలః అన్నారు ఇక్కడ. శ్వాసకు మహబలం కుంభకమే. హనుమంతుడు మహబలుడై ఉన్నాడని కథాపరంగా చెప్పడం. ఇక్కడ శ్వాసే హనుమంతుడు. మణిపూర కుంభకం చేసినప్పుడు స్వాధిష్ఠాన చక్రం యందు అగ్ని యొక్క వేడి మూలాధారానికి తగిలి అప్పుడు కుండలినీ జాగృతం అవుతుంది. అప్పటి వరకు అది బ్రహ్మ రంద్రం నుంచి వచ్చే అమృత స్రావమును సేవిస్తూ షట్కోణము నందు త్రికోణం పై ఉన్న శివలింగాన్ని చుట్టుకొని మత్తుగా పడి ఉంటుంది. అదే జీవ లక్షణం. అదే భోగ లక్షణం. అలా మత్తుగా పడి ఉన్న కుండలినీ పై నుంచి వచ్చే అమృతాన్ని శరీరానికి పంచి భోగిని అవుతుంది.
4) నాల్గవ శ్లోకం.
|| ద్విజాన్ విత్రాసయన్ ధీమాన్ ఉరసా పాదపాన్ హరన్ |
మృగాంశ్చ సుబాహూన్ నిఘ్నన్ ప్రవృధ్ధ ఇవ కేసరీ ||
తాత్పర్యం:-
ప్రతిభాశాలి అయిన హనుమంతుడు ఒక మహ సింహమువలె విజృంభించి తిరుగుతుండగా ఆయన వక్ష స్థలము యొక్క తాకిడికి అచటి వృక్షములు కూలిపోసాగినవి. వాటిపైగల పక్షులు భయపడ్డాయి. పెక్కు మృగములు అసువులు బాసినవి.
శ్వాస అన్ని వైపుల నుండి మనలో ప్రవేశించేటప్పుడు మనలో ఉన్న కోరికలనే మృగములు. పక్షులు, చెట్లు మొదలైనవన్నీ కూడా దానిని తినేస్తాయి. అలా తినడం వలన మనకొక తృప్తి కలుగుతుంది. దానినే జీవానందం అంటారు. యోగం వలన కలిగేది ఆత్మానందం. మామూలు శ్వాస వలన కలిగేది జీవానందం . మనం తీస్తున్న శ్వాసను ఆకాశ దారి పట్టిస్తే అది ఆత్మానందాన్ని కలిగిస్తుంది. శ్వాసను పైకి పంపడం అంటే ఆత్మను వెతుక్కోవడం. శ్వాసను క్రిందకు పంపడం అంటే పాప కూపంలో పడటం. అదే మాయ. కుంభకం చేత శ్వాస బలంగా మారితే దీని తాకిడికి కోరికలనే మృగములు నశిస్తాయి.
ఇక్కడ హనుమంతుని "ధీమాన్" అని వర్ణించారు. ఆత్మ కోసం యోగం చేయడానికి కృతనిశ్చయుడై కూర్చున్న యోగిని "ధీమాన్" అంటారు. లేకపోతే "చిత్తవాన్" అంటారు. యోగం చేత "ధీమాన్" లక్షణం వస్తే మామూలు శ్వాస చేత చిత్తవంతుల లక్షణం వస్తుంది. చిత్తవంతుల లక్షణం అంటే వృత్తి తిరగడం. అంటే అశాశ్వతమును శాశ్వతం అని భ్రమించి దాని వద్దే మనసును లగ్నం చేయడం. "ధీమాన్" అంటే అనేకమునందు, జీవానందం నందు రమించే జీవుని ప్రాణం అనబడే తాడుతో కట్టి ఆకాశానికి తీసుకుని వెళ్ళడానికి ఎవరైతే ప్రయత్నం చేస్తారో వారు ధీమంతులు. "ఉరసా" దహర కుంభకంతో,"పాదపాన్ హరన్" పాదపాన్ అంటే చెట్లు, మొక్కలు. అవే మనలోని కోరికలు,అదే కామం, "హరన్" అంటే పోగొట్టుకోవడానికి అంటే నిష్కామం కావాలంటే దహర కుంభకం చేయాలి. కామంపైనే వెళ్ళాలంటే మణిపూర కుంభకం అని అర్థం. మణిపూరం జీవానందం, దహరం ఆత్మానందం. పాదపాన్ అనడం చేత పాదముల నుండి మొదలు పెట్టి మణిపూరం వరకు ఉండేటటువంటి కోరికలన్ని అంటే నాభి క్రిందనే కోరికలన్నీ పుడతాయి. మణిపూరం క్రిందనే భోగమంతా ఏర్పాటు చేయబడి ఉంది. అందుకే దాన్ని అనుభవ కుహరం అంటారు.
"మృగాంశ్చ సుబాహూన్ నిఘ్నన్" మన జీవ సంస్కారములే మృగములు. అహంత, ఇదంత,మమతతో దేహానికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చే అన్వేషణ యొక్క ఫలితాలే జీవ సంస్కారాలు. మణిపూరమనే అరణ్యంలో తిరుగుతున్న జీవ సంస్కార సంపుటి కి సంబంధించిన కోరికలు అన్నీ కూడా దహరములోకి వచ్చేటప్పటికి పెకలించబడతాయి. హనుమంతుని జీవానందానికి సంబంధించిన కోరికలే లేవు కాబట్టి ఒకేసారి దహర కుంభకం లోకి వెళ్ళగలిగినట్లు చెప్పారు. కానీ సాధకుడు ప్రారంభం నందు ముందుగా మణిపూర కుంభకం చేసిన తర్వాత మాత్రమే దహర కుంభకం లోకి వెళ్ళాలి.
సుందరకాండ. 5) ఐదవ శ్లోకం.
|| నీలలోహితమాంజిష్ఠపత్రవర్ణై స్సితాసితైః |
స్వభావవిహితైశ్చిత్తైః ధాతుభిస్సమలంకృతమ్||
తాత్పర్యం : ఆ మహేంద్రగిరి సహజంగానే నీలం, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, తెలుపు,నలుపు మొదలైన చిత్రవిచిత్రమైన వర్ణములు గల ధాతువులఛే అలంకృతమై ఉండెను.
మూలాధార చక్రము ఇంద్రగిరి, దహరము మహేంద్రగిరి, మహేంద్రగిరి అంటే కొంత వ్యక్తం, కొంత అవ్యక్తం అయిన మాయ. దహరమునందే అహం పుడుతుంది. ఆత్మ ఇక్కడే జీవాత్మ అవుతుంది. దహర కుంభకం యొక్క విశేషములను ఇక్కడ చెబుతున్నారు. "నీల, లోహిత, మాంజిష్ఠ, పత్రవర్ణ, స్సతాసిత్తైః " దహర కుంభకం చేస్తున్నప్పుడు ముందుగా నీల వర్ణం, తర్వాత ఎరుపు, ఆ తర్వాత పసుపు, ఆ తర్వాత ఆకుపచ్చ, ఆ తర్వాత తెలుపు , చివరిగా నలుపు వర్ణములు కనిపిస్తాయి.
ఈ రంగులన్ని మన గుణములతో మేళవించి ఉంటాయి. అయితే తెలుపు రంగు కనిపించగానే జ్యోతి దర్శనం అయింది అని భ్రమ పడి కళ్ళు తెరుస్తాం. తెలుపు తర్వాత నలుపు కనబడాలి. అంటే చూసేందుకు ఏమీ ఉండదు అక్కడ. పరంజ్యోతి దృక్ చేతగానీ, దృశ్యం చేతగాని కనబడేది కాదు. అది దృక్, దృశ్య అతీతం. ఇది దహరం లోనే జరుగుతుంది. దృక్, దృశ్య వివేకం దహరములోనే తెలుస్తుంది. ఈ రంగులు అన్నీ కనిపించడం అంటే ఇంకా మాయ జీవుడిని వదిలలేదని గుర్తు. దహరంలో నలుపు కనిపిస్తేనే ఆత్మ మేల్కొనట్లు ! లేకపోతే దహర కుంభకం లో జీవుడు జీవాత్మగానే ఇవన్నీ చూస్తాడు. అన్నీ చూడగలిగిన రోజు జీవాత్మ. ఏమీ చూడలేనిది ఆత్మ. గుణబీజములు ఆజ్ఞలో పుట్టి, దహరములో చిగురులు వేసి, మణిపూరంలో వృక్షములై అరణ్యముగా మారుతాయి.
9) తొమ్మిదవ శ్లోకం .
|| అంజలిం ప్రాజ్ఞ్మఖః కృత్వా పవనాయాత్మ యోవయే |
తతోహి వవృధే గంతుం దక్షిణో దక్షిణాం దిశమ్ ||
తాత్పర్యం : కార్యదక్షుడైన మారుతి తన తండ్రి యగు వాయుదేవునకు ప్రణమిల్లి దక్షిణ దిశగా వెళ్ళదలచినవాడై తన శరీరాన్ని పెంచెను.
హనుమంతుడు తూర్పుకు తిరిగి అంజలి ఘటించి నిలబడ్డాడు. ఎవరికి అంజలి ఘటించాడు అంటే తన తండ్రి అయిన వాయుదేవునికి అంటే ముఖ్యప్రాణమైన శ్వాసకు అని అర్థం. ప్రాణం దహరమునందు ముఖ్య ప్రాణం అవుతుంది.
"తతోహి వవృధే గంతుం దక్షిణో దక్షిణాం దిశమ్" ఆ విధంగా నమస్కారం చేసి "దక్షిణాం దిశమ్" అంటే దక్షిణ దిశను పట్టించి అంటే ఇక్కడ సూర్య నాడిని ప్రజ్వలితం చేసి అని అర్థం. సూర్య నాడిని ప్రజల్వింప చేసినప్పుడే ఆత్మ దర్శనం జరుగుతుంది. చంద్రనాడి ప్రజ్వలిస్తే జీవ దర్శనం లేదా ప్రాణ దర్శనం మాత్రమే జరుగుతుంది. జీవనాడి దర్శనం మణిపూరంలో జరుగుతుంది. ముఖ్యప్రాణం దహరంలో రూపొందుతుంది. "గంతుం దక్షిణో దక్షిణాం దిశమ్" దక్షిణదిశవైపు వెళ్ళడానికి తూర్పు నుండి దక్షిణం వైపు తిరిగాడు. అంటే పూర్తిగా తన శ్వాసను సూర్య నాడి ద్వారా చేస్తున్నాడని అర్థం.
10) పదవ శ్లోకం .
|| ప్లవంగ ప్రవరై ర్దృష్టః ప్లవనే కృతనిశ్చయః| వవృధే రామవృద్థ్యర్థం సముద్ర ఇవ పర్వసు||
తాత్పర్యం :- రామకార్య సిద్దికై సముద్రమును లంఘింప నిశ్చయించుకొని, వానరవీరులందరూ చూస్తుండగా అతడు పున్నమి దినముల యందు ఉప్పొంగు సముద్రం వలె వృద్ధి చెందెను.
"సముద్ర ఇవ పర్వసు " పౌర్ణమి దినముల యందు సముద్రం ఉప్పొంగుతుంది. ఆ విధంగా దహర కుంభకం చేస్తే కానీ ప్రాణ జ్యోతి మహేంద్రగిరి అనబడే దహరమును దాటలేదు. "వవృధే రామవృద్థ్యర్థం" రామకార్య సిద్దికై సముద్రమును లంఘింప నిశ్చయించుకున్నాడు హనుమంతుడు. అంటే ఇక్కడ ప్రాణం దహరంలోనే ఆగిపోతే కుదరదు. కాబట్టి దహరమును దాటి పైకి వెళ్ళాలి.
కాబట్టి యోగి లేదా సాధకుడు దహర కుంభకం చాలా ఎక్కువగా చేయాలి . మన హృదయం మన మనసును అంత తేలికగా వదలదు. దహర కుంభకం ఎక్కువ చేస్తే ఒక విధమైన దివ్య ఆవేశం కలుగుతుంది. అప్పుడే దహరం దాటి ప్రాణ జ్యోతి పైకి వెళ్ళగలుగుతుంది. "రామవృధ్ధ్యర్థం" రామకార్య సిద్ది అంటే పరమాత్మ దర్శనం కోసం అని అర్థం. జీవాత్మ పరమాత్మ దారి పట్టించాలనే కృతనిశ్చయంతో యోగి దహర కుంభకం ఎక్కువగా చేయాలని చెబుతున్నారు.
16 వ శ్లోకం:-
|| మమోచ చ శిలాశ్శైలో విశాలాస్సమనశ్శిలాః| మద్యమేనార్చిషా జుష్టో ధూమరాజీ రవానలః||
తాత్పర్యం :- అగ్ని యొక్క సప్తార్చులలో "మధ్యమార్చి" అనునది సులోహిత. దాని జ్వాలల నుంచి పొగలు వెలువడుచున్నట్లు , హనుమంతునిచే అదుమబడిన ఆ మహేంద్రగిరి నుంచి పెద్ద పెద్ద ఎఱ్ఱని శిలలు ముక్కలు ముక్కలుగా బయటపడసాగెను.
ఇక్కడ ప్రాణం అగ్నిలక్షణమును పొందటాన్ని చెబుతున్నారు. కాళీ, కరాళి, మనోజవ, సులోహిత, సుధూమ్రవర్ణ, స్పులింగిని,విశ్వరుచి అన్నవి ఏడూ అగ్ని యొక్క సప్త జిహ్వలు. "మధ్యమార్చి" అనడం చేత ఈ ఏడింటిలోనూ మధ్యదైన "సులోహిత" అనే దానిని తీసుకోవాలి. మనలో సప్త ధాతువులు ఉన్నాయి. దహర కుంభకం చేసినప్పుడు సప్త వర్ణాలు కనిపిస్తాయి. వాటినన్నిటినీ ఈ సప్త జిహ్వలు భస్మం చేస్తాయి. అప్పుడు మన ప్రాణం "సులోహిత" అన్న మధ్యమ అగ్ని ద్వారా పైకి వెళుతుంది. ఈ "సులోహిత" "అగ్ని శిఖ" అంటారు.
ఇక్కడ ప్రాణశిఖను ఆత్మశిఖగా మార్చడాన్ని "మధ్యమార్చి" అన్న మాట ద్వారా వ్యక్తం చేశారు. మధ్యమార్చితో ప్రాణం విశుద్దంలోకి వెళుతుంది. ఇడ, పింగళ నాడుల మధ్య ఉన్నది సుషుమ్న అనబడే ముఖ్య ప్రాణం. సులోహితతోనే ముఖ్య ప్రాణం పైకి వెళుతుంది అనే ఇక్కడ రహస్యం. "మమోచ చ శిలాశ్శైలో విశాలాస్సమనశ్శిలాః" అన్నారు. మహేంద్రగిరిని అదమటం చేత ఎఱ్ఱని శిలలు ముక్కలు ముక్కలుగా బయట పడ్డాయట.
ఇంకా ఇక్కడ ఇడానాడికి ఉచ్ఛ్వాస నిశ్వాస కుంభకములు మూడు, అలాగే పింగళానాడికి ఉచ్ఛ్వాస నిశ్వాస కుంభకములు మూడు, మధ్యలో ఉన్నది సుషుమ్న. దహర కుంభకం చేత సుషుమ్న నాడి ప్రజ్వలితమై ప్రాణజ్యోతిగా రూపొంది దహరమును దాటేటప్పుడు ఇడా, పింగళ నాడుల ద్వారా వచ్చే శ్వాస ఆ వేడికి ఎలా చెదిరిపోతుందో చెబుతున్నారు. అప్పుడు సుషుమ్న అనబడే ముఖ్య ప్రాణం సులోహిత నుండి పైకి వెళుతుంది. సులోహిత అంటే ఎరుపు అని కాదు అర్దం. దహరంలో సుషుమ్న ప్రస్పుటం అవుతుంది అని చెబుతున్నారు.
🕉️🌞🌏🌙🌟🚩
నది
కాలుష్య వరదలో చిక్కి
కొండ చేరియలకు చిక్కి
జలచరాలకు ఆహారముగా చిక్కి
నావల బరువులతొ అనగ దొక్కి
సూర్య వెలుగులో ఆవిరికి చిక్కి
గాలికి తుంపరులుగా గాలిలోకి చెక్కి
స్నానాలతో బయటదాక పాదాలకు చిక్కి
ప్రతి ఒక్కరికి ఆకలికి మంచినీరుగా దక్కి
పంటలకు అహారముగా చిక్కి , మానవులకు దక్కి
అక్క చెల్లెల్లతొ కలసి కొండలు మిట్టలు ఎక్కి
ఉరకలు వెస్తూ సముద్రములో కలుస్తూ చూడదు వెనక్కి
🧘♂️66-ఉపనిషత్ సూక్తి 🧘♀️
*. స సర్వ వేత్తాభువనస్యగోప్తా నాభిః ప్రజానాం నిహితా జనానామ్||
(ఏకాక్షరోపనిషత్)
- ఆతడు సర్వవేత్త, భువనములకు రక్షకుడు,జనులకు ప్రజలకు నాభి(ఆధార) భూతుడు.
*సుఖం కంటే దుఃఖమే ఎక్కువగా మానవుడికి జ్ఞానాన్ని అందివ్వగలుగుతుంది.
*స్త్రీలు ఆదరించబడుతూ, ఆనందంగా ఉన్న కుటుంబాలపై పరమేశ్వరుని కృప ప్రసరిస్తుంది.
🧘♂️ప్రార్ధన🧘♀️
ఇంకే ఇతర బాంధవ్యాలలో కంటె జగన్మాత రూపంలోని పరమాత్మను సమాధాన మిమ్మని ఒక హక్కుగాను, సహజంగాను గట్టిగా కోరవచ్చు; జవాబు ఇవ్వక తప్పదు. ఎందుచేతంటే, తల్లికి ---- తన బిడ్డ ఎంత పెద్దపాపి అయినప్పటికి వాణ్ణి ప్రేమించడం, క్షమించడం ( సహజమయిన) మూల గుణం ఈశ్వరుడు మనకిచ్చిన మానవ ప్రేమ తాలూకు అత్యంత కమనీయమైన రూపం మాతా శిశు సంబంధం.
శ్రీ పరమహంస యోగానంద / దేవుడితో మాట్లాడ్డం ఎలా.
శ్రీ ఆదిశంకరాచార్య విరచితము భజగోవిందం
4)నలినీదలగత జలమతితరలం తద్వజ్జీవితమతిశయచపలమ్|
విద్ధి వ్యాధ్యభిమానగ్రస్తం లోకం శోకహతం చ సమస్తమ్||
తామరాకుపై నీటిబొట్టువలే జీవితము మిక్కిలి చంచలమైనది.లోకమంతా వ్యాధులతో దురభిమానముతో నిండి శోకించు చున్నదని తెలుసుకొనుము.
🕉️🌞🌏🌙🌟🚩
*🧘♂️328) యోగవాసిష్ఠ రత్నాకరము🧘♀️*
ఆకాశవిశదం బ్రహ్మ యత్నేనాపి న లభ్యతే
దృశే దృశ్యతయా దృష్టే త్వస్య లాభః సుదూరతః.
ఆకాశము వలె నిర్మలమై, సర్వత్ర వెలయుచున్నప్పటికిని బ్రహ్మము (దృశ్య బుద్ధి గలవారికి) యత్నముచే గూడ లభించుట లేదు. ఏలయనగా, దృశ్యమును (దృక్ మాత్రముగ వీక్షింపక,) దృశ్యరూపముగ వీక్షించినచో ఈ బ్రహ్మముయొక్క ప్రాప్తి అతిదూరముగ నుండును. (లభింపదని భావము.)
దృశ్యం చ దృశ్యతే తేన ద్రష్టా రామ న దృశ్యతే
ద్రష్టైవ సంభవత్యేకో న తు దృశ్యమిహాస్తి హి.
ఓ రామచంద్రా! దృశ్యమును జూచుట వలన ద్రష్టయగు ఆత్మ చూడబడుట లేదు. వాస్తముగ ఇచట ద్రష్ట (ఆత్మ) యొకటి మాత్రమే కలదు గాని దృశ్యమనునది లేనేలేదు.
స్వయమన్తః ప్రపశ్యన్తి యే జగజ్జీవవిభ్రమమ్
తైఃతైః కైశ్చిత్తతం దృశ్యమసత్స్వప్నవదాశ్రితమ్.
ఎవరీ జగజ్జీవ విభ్రమమును స్వయముగ తమయందే వీక్షించుదురో, అట్టి కొందఱు మాత్రము ఈ వ్యాప్తమగు దృశ్యమును స్వప్నమువలె అసత్తుగ నిశ్చయించుదురు.
🧘♂️70-ఉపనిషత్ సూక్తి 🧘♀️
*. ఆత్మవ్యతీతే సర్వస్మాత్సర్వరూపే2థవాతతే| కోబంధః? కశ్చవామోక్షః?||
(అన్నపూర్ణోపనిషత్)
*– ఆత్మ అన్నింటికి అతీతమైనది, సర్వరూపమైనది. ఇంక బంధమేమిటి? మోక్షమేమిటి? *
*మీలోని దివ్యత్వాన్ని పెంపొందించేది పుణ్యం; పాశవికతను పెంచేది పాపం.
జాగృతి
స్వామివివేకానంద స్ఫూర్తి వచనాలు
బాధలన్నింటినీ సహిస్తూ, అనుక్షణం క్షమిస్తూ, నిస్వార్థానికి మారుపేరైన మాతృత్వమే భారతీయ నారీమణులకు ఆదర్శం.
🧘♂️ప్రార్ధన🧘♀️
దేవుడు మన ప్రార్ధనలన్నిటినీ వింటున్నప్పటికి ఆయన ప్రతిదానికి సమాధనమివ్వడు. తల్లిని పిలిచే పిల్లవాడి మోస్తరు మన పరిస్థితి ; కాని తల్లి రావలసిన అవసరం ఉందని అనుకోదు. వాణ్ణి ఊరుకోబెట్టడానికి ఒక ఆట వస్తువు పంపిస్తుంది. కాని తల్లి దగ్గరుంటే తప్ప మరిదేనివల్లా ఊరుకోవడానికి పిల్లవాడు ఒప్పుకోనప్పుడు తల్లి వస్తుంది. దేవుణ్ణి తెలుసుకోవాలంటే తల్లి వచ్చేదాకా ఏడుస్తూ ఉండే అల్లరి పిల్లవాడిలా ఉండాలి మీరు.
శ్రీ ఆదిశంకరాచార్య విరచితము భజగోవిందం
5) యావద్విత్తోపార్జన సక్తస్తావన్నిజ పరివారో రక్తః|
పశ్చాజ్జీవతి జర్జర దేహే వార్తాం కోఽపి న పృచ్ఛతి గేహే ||
ధనము సంపాదించునంతవరకే తన వారు ప్రేమ చూపుదురు.శరీరం కృశించినప్పుడు ఇంటిలో ఎవడూ నీ విషయమడుగడు.
*🧘♂️325) యోగవాసిష్ఠ రత్నాకరము🧘♀️*
వ్యపగతమమతామహాన్ధకారః
పదమమలం విగతైషణం సమేత్య,
ప్రభవసి యది చేతసో మాహాత్మం
స్దదతిధియే మహతే సతే నమస్తే.
మహాత్ముఁడవగు రామచంద్రా! మమత్వమను గొప్ప చీకటిని పోగొట్టుకొనిన వాడవై ఇచ్ఛారహితమై, నిర్మలమై, అవిద్యాది శూన్యమైనట్టి ఆత్మపదమును బొంది, చిత్తమును వధించుట యందు సమర్థుడ వగుచో, అత్తఱి అపరిమిత బుద్ధి గలవాడవును,
పరిపూర్ణుఁడవును, సద్రూప బ్రహ్మభూతుఁడవు నగు నీకు నమస్కారము (అపుడు మా వంటి వారికిని నీవు సదా వంద్యుడ వగుదువని భావము.)
ఓ రామచంద్రా! భగవంతుఁడగు యముడు వెడలిన పిదప అవశ్య మాచరింపదగిన భావికర్మయొక్క గతిని, నియతియొక్క అనివార్యత్వమును విచారించి శుక్రుఁడంతట కాలవశముచే శుష్కించినదియు, భావికాలమున శుభదాయకములగు పుష్పముల నొసంగునదియు నగు లేత తీగెయందు వసంతర్తువు ప్రవేశించునట్లు తన పూర్వపు శరీరమున ప్రవేశించెను. అటుపిమ్మట ఎఱుఁగదగిన బ్రహ్మ వస్తువును ఎఱింగినవారును జీవన్ముక్తులును, జగద్గురువులునగు ఆ భృగుశుక్రు లిరువురును దేశకాల శుభాశుభాది దశలందు హర్ష విషాదముల బొందక సమరూపులై, సుస్థిర చిత్తులై వ్యవహరింపదొడగిరి.
సర్వైషణానాం సంశాన్తౌ శుద్ధచిత్తస్య యా స్థితిః
తత్సత్యముచ్యతే సైషా విమలా చిదుదాహృతా.
ఓ రామచంద్రా! అన్ని కోర్కెలున్ను లెస్సగ శమింప శుద్ధ చిత్తము యొక్క స్థితి యేది కలదో, అదియే సత్య మనంబడును, మఱియు అదియే నిర్మలమగు చైతన్య మనియు పేర్కొనబడినది. ఈ ప్రకారముగ భృగుతనయుడగు శుక్రుని చిత్తమున జగద్భ్రమ స్వయముగ నెట్లుత్పన్న మయ్యెనో, అట్లే ప్రతి జీవుని చిత్తమునను ఉత్పన్న మగును. భృగునందనుఁడే యిందులకు దృష్టాంతము.
*🧘♂️326) యోగవాసిష్ఠ రత్నాకరము🧘♀️*
చిరమేకదృఢాభ్యాసాచ్ఛుద్దిర్భవతి చేతసః
అనాక్రాన్తస్య సంకల్పైః ప్రతిబోధేతి చేతసః
ఏకాగ్రతతో గూడిన చిరకాల దృఢాభ్యాసముచే చిత్తముయొక్క శుద్ధి సంభవించును, మఱియు సంకల్పముచే ఆక్రమింపబడని చిత్తమందు జ్ఞానప్రకాశ ముదయించును.
సువర్ణం న స్థితిం యాతి మలవత్యంశుకే యథా
ఏకా దష్టిః స్థితిం యాతి న మ్లానే చిత్తకే తథా.
మలిన వస్త్రమందు రంగు నిలువనట్లు, మలిన చిత్తమున అద్వైతాత్మజ్ఞానము స్థితిని బొందదు.
జీవో యద్వాసనాబద్ధస్తదేవాన్తః ప్రపశ్యతి
స్వరూపం చాత్ర దృష్టాన్తో దీర్ఘస్వప్నస్త్విదం జగత్.
జీవుడెట్టి వాసనచే బద్ధుడై యుండునో, ఆ ప్రకారమే తనయందు గాంచును. స్వప్నమందలి తనయొక్క రూపమే ఇట దృష్టాంతము. ఈ జగత్తున్ను ఒక దీర్ఘస్వప్నమే అయియున్నది.
🧘♂️72-ఉపనిషత్ సూక్తి 🧘♀️
*. పాపా ద్బిభేతి సతతంనచభోగమపేక్షతే||
(అక్ష్యుపనిషత్)
- జిజ్ఞాసువు సర్వదాపాపభీతి కలిగియుండును. మరియు నట్టివాడు భోగములనుఅపేక్షించక యుండును.
*దేవుని యందు, తన ఆత్మ యందు గల విశ్వాసం ధర్మం. సందేహించడం పాపం.
*నేను బోధించే వాటిలో ఇది ప్రధానమైనదిగా నొక్కి చెబుతాను: ఆధ్యాత్మిక, మానసిక, శారీరక దౌర్బల్యం కలిగించే దేనినీ కూడా నీ కాలి బొటనవ్రేలితో అయినా ముట్టవద్దు.
*****
🧘♂️ప్రార్ధన🧘♀️
నేను పూజామందిరంలో మోకరిల్లి ప్తార్ధనలో ఉన్నాను. నాలో భయ సందేహాలు నింపుతూ నా జీవితంలో ప్రవేశించబోతున్న ఒక విషయం గురించి ఆలోచిస్తున్నాను. నేను ఆ అనుభవాల నుండి తప్పించుకోవడం దైవసంకల్పం కాదని నాకు తెలుసు. అది ఆ క్షణంలో కూడా నన్ను సమీపిస్తూనే ఉంది. హఠాత్తుగా , దేవుడు తనకు సమ్మతమైన ప్రార్ధనను నాకు తెలియచేశాడు ; నేను వెంటనే ఇలా ప్రార్ధించాను. " నా జీవితంలోని ఏ పరిస్థితినీ మార్చవద్దు ---- నన్ను మార్చు.".
శ్రీ జ్ఞానమాత / God Alone: The Life and Letters Of a Saint
****
7) బాలస్తావత్క్రీడాసక్తః తరుణస్తావత్తరుణీసక్తః|
వృద్ధస్తావచ్చింతాసక్తః పరే బ్రహ్మణి కోఽపి న సక్తః ||
బాలుడు ఆటలపై మనస్సు పెట్టును. యువకుడు యువతిపై మనస్సు పెట్టును. ముసలివాడు చింతపై మనస్సు పెట్టును. పరబ్రహ్మపై ఎవడూ మనస్సు పెట్టడు.
*****
. శ్రీ హనుమాన్ జయంతి విశిష్టత /. శ్రీ హనుమాన్ జయంతి (విజయోత్సవం) శుభాకాంక్షలు అందరికి Happy Hanuman Jayanthi 🍀
హనుమజ్జయంతి ఏడాదిలో మూడుసార్లు వస్తుంది. ఎలా అంటే, ఒక్కో ప్రాంతవాసులు ఒక్కోసారి జరుపుకుంటారు. కొందరు చైత్ర పౌర్ణమినాడు హనుమాన్ జయంతి చేయగా, మరికొందరు వైశాఖమాసం దశమినాడు హనుమజ్జయంతి జరుపుతారు. ఇక తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో మార్గశిర మాసంలో హనుమజ్జయంతి జరుపుకుంటారు.
పరాశర సంహిత అనే గ్రంథం ప్రకారం ఆంజనేయుడు వైశాఖ బహుళ దశమి , శనివారం జన్మించారని తెలిపారు... అదే రోజున హనుమంతుని జన్మ తిథి చేసుకోవాలని చెబుతారు... అయితే కొన్ని ఐతిహాసాల ప్రకారం చైత్ర పౌర్ణమి నాడు నికుంభుడు తదిరత రాక్షసులను సంహరించి హనుమంతుడు విజయం సాధించినట్లు కనిపిస్తుంది. ఈ కారణంగా ఆ రోజు హనుమద్ విజయోత్సవం చేసుకునే సంప్రదాయం కొన్ని చోట్ల ఉంది. దీన్ని ఉత్తరాదిలో హనుమంతుని జన్మ తిథిగా చేసుకుంటారని పండితులు సూచిస్తున్నారు...
చైత్ర పూర్ణిమ నాడు హనుమంతుని విజయోత్సవం దక్షిణాదిలో ముఖ్యంగా తెలంగాణా ప్రాంతంలో చాలా ఘనంగా జరుపుకుంటారు.. ఆంజనేయస్వామి వారి నిలువెత్తు విగ్రహం దగ్గర దగ్గరగా 60 అడుగుల శోభా యాత్రగా ఊరేగిస్తారు. చైత్ర పూర్ణిమ హనుమత్ విజయోత్సవం నుండి నుంచి 41 రోజుల పాటు ఆంజనేయునికి దీక్ష చేస్తారు, ఈ దీక్ష చివరి రోజున హనుమంతుని జన్మ తిథి చేసుకుంటారు. ఈ 41 రోజులు తెలుగు ప్రజలు ఆంజనేయునికి ఉత్సవాలను జరుపుతారు. వైశాఖ బహుళ దశమి నాడు దీక్షా విరమణ చేసి.. వైభవంగా పూజలు నిర్వహిస్తారు...
వాయుపుత్రుడైన హనుమంతుడు గాల్లో పయనించ గలడు. పర్వతాన్ని ఎత్తి, చేత్తో పట్టుకోగలడు. భూత ప్రేత పిశాచాల్లాంటి క్షుద్రశక్తులను తరిమికొట్టగలడు. శ్రీరాముని నమ్మినబంటు అయిన హనుమంతుడు బలానికి, ధైర్యానికి ప్రతిరూపం. హనుమంతుని ఆరాధించడంవల్ల ధైర్యం,స్థైర్యం కలుగుతాయి. భయాలూ భ్రమలూ పోతాయి. చింతలు, చిరాకులు తీరతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరి, కీర్తిప్రతిష్టలు వస్తాయి. నిత్యం హనుమంతుని నామస్మరణ చేసేవారికి ఎలాంటి ఆందోళనా దరిచేరదు. సదా ఆనందంగా ఉంటారు. ఇక హనుమజ్జయంతి విశేష దినాన మరింత భక్తిశ్రద్దలతో హనుమంతుని అర్చిస్తారు.
''కలౌ కపి వినాయకౌ : అంటే కలియుగంలో త్వరగా ప్రత్యక్షమయ్యే దేవతా రూపాలు వినాయకుడు, హనుమంతుడు.
*****
. హిందూమతంలో ప్రాముఖ్యత :
హనుమానంజనానూను: వాయుపుత్రోమహాబలః
రామేష్ఠ: ఫల్గుణసఖః పింగాక్షో: అమిత విక్రమః
ఉదధిక్రమణశ్చైవ సీతాశోక వినాశకః
లక్ష్మణప్రాణదాతాచ దశగ్రీవస్య దర్పహా
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్యమృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్
హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు, శ్రీరామదాసుడు, అర్జునుని సఖుడు, ఎఱ్ఱని కన్నులుగల వానరుడు, అమిత విక్రముడు, శతయోజన విస్తారమైన సముద్రాన్ని దాటినవాడు. లంకలో బందీయైన సీతమ్మతల్లి శోకాన్ని హరించినవాడు, ఔషధీ సమేతంగా ద్రోణాచలం మోసుకుని వచ్చిన యుద్ధంలో వివశుడైన లక్ష్మణుని ప్రాణాలు నిలిపినవాడు. దశకంఠుడైన రావణాసురుని గర్వం అణచినవాడు. హనుమంతుని ఈ నామాలు నిద్రించడానికి ముందు, ప్రయాణానికి ముందు స్మరించినవారికి మృత్యుభయం లేదు. వారికి సర్వత్రా విజయం లభిస్తుంది.
*****
. హనుమంతుని నైజం
యాత్ర యాత్ర రఘునాధ కీర్తనం - తత్ర తత్ర కృతమస్తాకాంజిలమ్
బాష్పవారి పరిపూర్ణలోచనం - మారుతిం నమత రాక్షసాంతకమ్
శ్రీరాముని కీర్తన జరిగే చోట హనుమంతుడు పులకితుడై అంజలి జోడించి ఉంటాడు. రాక్షసాంతకుడైన అటువంటి హనుమంతునికి నమస్కరిస్తున్నాను.
కేసరి, అంజనాదేవీల కుమారుడు శ్రీ హనుమంతుడు. ఏకాదశ (11) రుద్రులలో ఒకరు శ్రీ ఆంజనేయస్వామి. పరమశివును అంశతో జన్మించారు. సప్త(7) చిరంజీవులలో ఒకరు. ఆంజనేయస్వామి వారు హిమాలయాల్లో కైలాసమానస సరోవరం సమీపంలో రామ నామ జపం చేస్తూ ఈనాటికి జీవించి ఉన్నారు.
హనుమతుడికి 5 సంఖ్య చాలా ఇష్టం. 5 ప్రదక్షిణలు చేయండి. అరటిపళ్ళు, మామిడి పళ్ళంటే చాలా ఇష్టం. వీలుంటే 5 పళ్ళు సమర్పించండి. 5 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. 15 ఏప్రియల్, చైత్ర పౌర్ణిమ నుండి 23 మే, వైశాఖ బహుళ దశమి వరకు 40 రోజుల (మండలం) పాటు ప్రతిరోజు 1,3,5,11 లేక 41.....(మీకు వీలైనన్ని సార్లు)హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఇలా చేయడం చాలా శుభకరం, అనుకున్న పనులు త్వరగా పూర్తవుతాయి. కొరిన కోరికలు నెరవేరుతాయి. హనుమంతుని అనుగ్రహం కలుగుతుంది. సంతానం కలగాలని కోరుకునే దంపతులు ఇద్దరు, ఈ 40(మండలం) రోజుల పాటు కఠిన బ్రహ్చర్యం పాటిస్తూ, నిష్ఠగా హనుమాన్ చాలీసా పారాయణ చేసి, రోజ…
. హనుమంతుని జన్మ వృత్తాంతము - పురాణ వర్ణన 🌹
శ్రీ హనుమాన్ జయంతి పర్వదిన సందర్భంగా ....
భక్తులెందరో హనుమంతున్ని ఆదర్శనీయ దైవంగా ఆరాధిస్తారు. అతణ్ణి మహాహలుడు, బుద్ధిశాలి, కపిశ్రేష్టుడు, సర్వశాస్త్ర పారంగతుడు, స్వామిభక్తి పరాయణుడు, రామదూత అంటూ ఎన్నోవిధాలుగా ప్రస్తుతిస్తారు. తల్లి అంజనాదేవి కనుక అతణ్ని ఆంజనేయుడంటారు. అతని తండ్రి ఎవరనే విషయంలో శివమహాపురాణం, రామాయణం, పరాశరసంహిత మొదలైన గ్రంథాల్లోని వైవిధ్యగాథలతో అతడి దివ్యజననం ముడివడి ఉంది. రామకార్యంలో సహాయపడాలనే ఉద్దేశంతో శివుడు తన వీర్యాన్ని స్థలనం చేశాడు. దాన్ని సప్తర్షులు సాదరంగా పొందుపరచి, గౌతముడి కూతురైన అంజనాదేవిలో చెవిద్వారా ప్రవేశపెట్టారు. ఫలితంగా శంభుడు మహాబల పరాక్రమాలగల వానరదేహంతో ఆమెకు జనించాడని (శంభుర్జజ్ఞే కపి తనుర్మహాబల పరాక్రమ:) శివమహాపురాణం (శతరుద్ర సమ్హిత 20-7) తెలిపింది.…
*🧘♂️327) యోగవాసిష్ఠ రత్నాకరము🧘♀️*
శుద్ధిర్హి చిత్తస్య వివాసనత్వం
అభూతసంవేదనమేకరూపమ్
తస్యాశు శుద్ధ్యా భవతి ప్రబుద్ధః
తన్మాత్రయుక్త్యా పరసంగమేతి.
అత్యంతిక వాసనాక్షయము, పంచభూతరూప దృశ్యముయొక్క జ్ఞానము లేకుండుట, ఏకమగు ఆత్మస్వరూపము యొక్క జ్ఞానముతో గూడియుండుట - ఇదియే చిత్తము యొక్క శుద్ధి యగును. అట్టి చిత్తము యొక్క చిన్మాత్ర పరిశేషత్వ రూపశుద్ధిచే జీవుడు ప్రబుద్ధుడై పరమాత్మతోటి ఐక్యమను మోక్షమును శీఘ్రముగ బొందును.
1-55
దృశ్యం
పశ్యన్స్వమాత్మానం న ద్రష్టా సంప్రపశ్యతి ప్రపఞ్చాక్రాన్తసంవిత్తేః కస్యోదేతి నిజా స్థితిః
ద్రష్టయగు జీవుడు దృశ్యమును చూచుచు తన ఆత్మను చూడజాలడు. (అనగా దృశ్యవిషయములందు నిమగ్నుడగువాడు ఆత్మానుభూతి నొందజాలడు.) ఏలయనిన, దృశ్యప్రపంచముచే ఆక్రమింపబడిన బుద్ధిగల యెవనికి స్వరూపస్థితి యుదయించును?!
ఆకాశవిశదో ద్రష్టా సర్వాఙ్గోఽపి న పశ్యతి
నేత్రం నిజమివాత్మానం దృశీభూతమహో భ్రమః.
నేత్రము తన రూపమును జూడనట్లు, తన ఆత్మరూపము ఆకాశమువలె నిర్మలమై, సర్వవ్యాపకమై, స్వప్రకాశమై, ప్రత్యక్షమై యున్నప్పటికిని జీవు డద్దానిని గాంచుట లేదు, ఆహా! భ్రమయొక్క ప్రాబల్య మెట్టిదై యున్నది!
*🧘♂️71-ఉపనిషత్ సూక్తి 🧘♀️*
*71.నమస్తే ఆదిత్య త్వమేవప్రత్యక్షం కర్మ కర్తాసి, త్వమేవప్రత్యక్షం బ్రహ్మాసి||*
*(సూర్యోపనిషత్)*
*- ఓ ఆదిత్యదేవా! నీవే ప్రత్యక్షమైన కర్మ కర్త వైతివి. నీవే కంటి కెదురుగా కనబడు ప్రత్య క్ష పర బ్రహ్మవు.*
*మనిషి కోరికలకు అంతులేదు. విధివిరామం లేకుండా మనిషి విషయభోగాలను కోరుకుంటూ, ఆ కోరికలు నెరవేరకుంటే దుఃఖిస్తుంటాడు.*
*_విద్య_*
*మనిషి పాపాత్ముడు అనవద్దు.
అతడొక దైవమని తెలియజేయండి.*
*శ్రీ ఆదిశంకరాచార్య విరచితము భజగోవిందం*
*6)యావత్పవనో నివసతి దేహే తావత్పృచ్ఛతి కుశలం గేహే|*
*గతవతి వాయౌ దేహాపాయే భార్యా బిభ్యతి తస్మింకాయే ||*
*శరీరంలో ప్రాణములు ఉన్నంత వరకే కుశలమును అడుగుదురు. ప్రాణములు పోయిన పిదప ఆ శవమును చూచి భార్య కూడా భయపడును.*
*🧘♂️323) యోగవాసిష్ఠ రత్నాకరము🧘♀️*
త ఏవ సుఖసంభోగసీమాన్తం సముపాగతాః మహాధియా శాంతిధియో యే యాతా విమనస్కతామ్.
ఎవరు అమనస్కస్థితిని బొందిరో అట్టి శాంతబుద్ధి గల మహాధీమంతులే సమస్త సుఖభోగములయొక్క పరమావధిని (భూమానందమును) బొందినవారగుదురు.
ముక్తబుద్ధీన్ద్రియో ముక్తో బద్ధకర్మేన్ద్రియోఽపి హి బద్ధబుద్ధీన్ద్రియో బద్ధో ముక్తకర్మేన్ద్రియోఽపి హి.
ఎవడు జ్ఞానేంద్రియములచే అసంగముగ (ఆసక్తిరహితుడై) లోకమున కార్యముల నాచరించునో, అతని యొక్క కర్మేంద్రియములు కార్యములందు సంగమ యుక్తములై యున్నప్పటికిని అతడు ముక్తుడే యగును. ఎవడు జ్ఞానేంద్రియములచే సంగయుక్తుడై (ఆసక్తియుతుడై) యుండునో, అతని కర్మేంద్రియములు కార్యములందు సంగరహితములై యున్నప్పటికిని అనగా కర్మేంద్రియములచే ఏ కార్యము చేయనప్పటికిని అతడు బద్ధుడే యగును.
బహిర్లోకోచితాచారస్త్యన్తరాచారావర్జితః
సమో హ్యాతీవ తిష్ఠ త్వం సంశాన్తసకలైషణః.
ఓ రామచంద్రా! నీవు బాహ్యమున లోకోచితములగు ఆచార, వ్యవహారములఁగావించుచు, లోన (అంతఃకరణమున) నిష్క్రియుడవై అనఁగా కూటస్థాత్మను గూర్చిన దృఢనిశ్చయము గలవాడవై, మిగుల సమత్వముతో గూడియుండి, శమించిన సకల కోర్కెలు గలవాడవై యుండుము.
****

No comments:
Post a Comment