*శ్రీ అన్నమాచార్య సంకీర్తన*
గానం. శ్రీ సత్తిరాజు వేణుమాధవ్ గారు
రేకు: 173-2
సంపుటము: 2-357
రేకురాగము: ధన్నాసి.
ఒకటి సుజ్ఞానము ఒకటి అజ్ఞానము
ప్రకటించి వొకటి చేపట్టరో వివేకులు!!
తనుఁ దలచుకొంటేను తక్కిన దేహభోగాలు
పనికిరావు అవి ప్రకృతి గాన
ఘనమైన లోకభోగములతో లోలుఁడైతే
తనుఁ గానరాదు జీవతత్వము గాన!!
దైవము నెఱిఁగితేను తన కామ్యకర్యములు
భావించి మఱవవలె బంధాలు గాన
కావించేటి తన కామ్యకర్మాలఁ గట్టువడితే
దైవము లోను గాఁడు స్వతంత్రుఁడు గాన!!
సరిమోక్షము గోరితే స్వర్గము తెరువు గాదు
అరయ స్వర్గము తెరువల మోక్షానకు
పరగ నలమేల్మంగపతి శ్రీవేంకటేశుని
శరణాగతియె సర్వసాధనము గాన!!
.........
*****
*శ్రీ అన్నమయ్య సంకీర్తన*
ఆథ్యాత్మిక సంకీర్తన రేకు: 65-౧ సంపుటము: 1-౩౩౪ , రాగము: సామంతం.
|| పల్లవి || ఇందరికి నభయంబు లిచ్చుఁ జేయి
కందువగు మంచి బంగారు చేయి!!
|| చ 1 || వెలలేనివేదములు వెదకి తెచ్చిన చేయి
చిలుకుగుబ్బలికిందఁ జేర్చు చేయి
కలికియగు భూకాంతఁ గాఁగిలించిన చేయి
వలనైన కొనగోళ్ళవాఁడి చేయి!!
|| ఇందరికి ||
|| చ 2 || తనివోక బలిచేత దానమడిగిన చేయి
వొనరంగ భూదానమొసఁగు చేయి
మొనసి జలనిధి యమ్ము మొనకుఁ దెచ్చిన చేయి
యెనయ నాఁగేలు ధరింయిచు చేయి!!
|| ఇందరికి ||
|| చ 3 || పురసతుల మానములు
పొల్లసేసిన చేయి
తురగంబుఁ బరపెడి దొడ్డ చేయి
తిరువేంకటాచలధీశుఁడై మోక్షంబు
తెరువు ప్రాణులకెల్లఁదెలిపెడి చేయి!!
.........
శ్రీ అన్నమాచార్య అధ్యాత్మ సంకీర్తన
.......
గానం. రేకు: 313-౨, సంపుటము: 4-౭౪, రేకు రాగము: శ్రీరాగం.
చదివితిఁ తొల్లి కొంత చదివే ఇంకాఁ కొంత
యెదిరి నన్నెఱఁగను యెంతైనా అయ్యో!!
వొరుల దూషింతుఁగాని వొకమారైన నా-
దురిత కర్మములను దూషించను
పరుల నవ్వుదుఁగాని పలుయోని కూపముల
నరకపు నామేను నవ్వుకోను!!
లోకులఁ కోపింతుఁగాని లోని కామాదులనేటి-
కాకరి శత్రులమీఁదఁ కడుఁ కోపించ
ఆకడ బుద్దులు చెప్పి అన్యుల బోధింతుఁగాని
తేకువ నాలోని హరిఁ దెలుసుకోలేను!!
యితరుల దుర్గణము లెంచి యెంచి రోతుఁగాని
మతిలో నా యాసలు మానలేను
గతిగా శ్రీవేంకటేశుఁ కని బ్రతికితిఁగాని
తతి నిన్నాళ్లదాఁకా దలపోయ లేను!!
......
*శ్రీ అన్నమాచార్య సంకీర్తన*
రేకు: 47- ౭ , సంపుటము: 1-292 , రేకు రాగము: భూపాళం.
ఏ కులజుడైననేమి యెవ్వడైననేమి
ఆకడ నాతడే హరినెఱిగినవాడు!!
పరగిన సత్యసంపన్నుడైన వాడే
పరనిందసేయ తత్పరుడు కాని వాడు
అరుదైన భూతదయానిధి యగువాడే
పరులు తానేయని భావించువాడు!!
నిర్మలుడై ఆత్మనియతి కలుగువాడే
ధర్మతత్పర బుద్ధి తగిలినవాడు
కర్మమార్గములు తడవని వాడే
మర్మమై హరిభక్తి మఱవని వాడు!!
జగతిపై హితముగా చరియించువాడే
పగలేక మతిలోన బ్రదికినవాడు
తెగి సకలము నాత్మ తెలిసినవాడే
తగిలి వేంకటేశు దాసుడయినవాడు!!
***
౩౦..ఆడ వారి ముచ్చటలోన తాను చూడు
నిన్న మొన్న సంగతులను నీడ లగుట
వీరుడగుటయే ఆలికి నెచ్చెలియగు
నన్ను పాలించు నిత్యము నరహరిగను
31 ..జరుగు వ్యవహార మంతయు జయము నిచ్చు
పరిసరాలన్నిటిగసార ప్రభలు యగుట
చూచెడి నిలబడెడి దూర చూపు లౌను
నన్ను పాలించు నిత్యము నరహరిగను
ఉత్సుకత కార మనసులో ఉన్నతమగు
 
No comments:
Post a Comment