మనకు మనసు నిచ్చు...పంచ పుష్ప సౌరభాలు.పరమాత్మకు కూడా 
గులాబి-1
గురుతులుగ ముళ్ళు నినుగన గుర్తు రెక్క 
కనుగొన,మనసుకు గులాబి కమ్మనైమ్ది 
పరుగులను బెట్టె వయసున పగ్గమేయు 
మురిపమగుటయే నినుగొని ముఖ్య మౌజు
మల్లె-2
సరసమును పెంచు వేళను సానుభూతి 
సరిగమలు తెల్పు తూగుచు సమయమందు
పరిమళ  కుటజము ఇదియు పర్వముగను 
పరిపరి విధాలు దెలుపును  పలుకులకులు
జాజి-3
పరిమళము నకునెల నెల పలుకు చుండు 
సరియను గుబులును నిలుపు సరసపు విధి 
కరములు తగిలి పరిమళం కనుల విందు 
కురులకే యంద మకుటయు కులుకులన్ని 
మొగిలి-4
రంగు పసిడిగ మెరిసెను రవ్వ వె లుగు 
ఖంగు దినగ నులిమి వెట్టు కనుల పొత్తె 
చెంగు బట్టను  అతివది చేరు వగుట 
రంగు మారెను  ముఖమున  రంగమందు 
సంపంగి-5
అల్లు కొనంగ నిన్నేను ఆశ తోను 
ఝల్లున మదిన తలపుల ఝల్లికయది 
చెల్లు పొత్తేను నీతోను చెలిమి చేయు 
చెలియమది సంపదయు నూనె చేరగవిధి
0 కామెంట్
మిత్రులారా శుభాభినందనలు 
మన కలయిక  గూర్చిన మనసు ఇదియు, 
బహు చెలిమి బాగు బలము గళమిదియగు, 
చిన్న నాటి నా వాలంద రికళ కలువ,
నొకరొ కరు చోట జేరుటం నియమ మిదియు,
మనసు నిండక పోయేనె మాయ వల్ల, 
ఆదియనెడి పరమపధిం చేది చెలెమి 
కన్ను లార చూసెదనుచు కలలు కంటి 
నోచుకొనక మన గురువు కాల మిదియు
నింగిలో చంద్ర వెన్నెల మిగిలి పోయె 
కలతనై కంటిలో మిమ్ము కలవ లేదు 
నిలచి పోయాను పనివళ్ళ నిర్ణయమ్ము 
గుండెనే తడుము చెలెమి గుర్తు ఉంది
గేయమై పాటలో ఒదిగి గీత ఇదియు 
కనుల లో బిందువై కళ కదిలి నాను 
వానలో చుక్కగా  కురిసి వరుస కలలు   
కంటిలో అందమే  చూపు కాలమగుట
చెదిరి పోయాను మనసున  చెమురు తుండె 
పువ్వులా గాలి పరిమళం పుడమి నందు 
సంధ్యలో వడలుతు రాలి సహన మయ్యి  
మౌన పదవిలో మాటలే మానసమ్ము
విప్పలేని వాణి నిలచి విజయ మగుట
మకుటమే లేని చెలిమిగా మనస నకుము
వృత్తి వినయమై వాకిట వేళ్ళు విరిసె
చెప్పలేక మీకు తెలప చెలిమి కలలు
కాల నిర్ణయమది మిమ్ము కలవ గలను
ఆశీసులొందలెక  మనుసు నాహృదయ స్పందిస్తోంది
Oooooo
మనసు తాకు 🙏విభజన రేఖలు❤️
గాజు పలకలు పగిలితే, గాయ మనియు
మనసులు విరిగిపోతేను, మనుగడనియు
బ్రతుకు దివ్యౌషధమనేది, బంధ మనెను 
ప్రాంజలి ఘటించి, చండికా, పద్య గీత 
విరిగిన మనసులను, కల్పు, విధియనుటయ
తత్వ సారాంశ సృష్టియే, తపన యనియు  
గంధ సంస్కరణలకు, మూలగళమనియు  
ప్రాంజలి ఘటించి, చండికా, పద్య గీత
మనుసు మధ్య దూరము, కొంత మాయ, చేరి 
విధియు మెంతైన, సృష్టించ,  వచ్చ, గలుగు  
మధ్య దూరాన్ని చెరిపేను, మనుగడవిధి 
ప్రాంజలి ఘటించి, చండికా, పద్య గీత
తెలియనిది, లీల మాత్రమే, తెలుపు చుండు    
హృదయ కళ మధ్య పరిణామ హాయి చిగురు
మూల మంత్రము మాటల మంత్రమౌను   
ప్రాంజలి ఘటించి, చండికా, పద్య గీత
మౌనపు, సుగంధ భావము, మాపరిమళ 
భాషకందని, భావమే, భాద తెచ్చు  
మౌన వేదన, అవతరిం చేటి మనసు 
ప్రాంజలి ఘటించి, చండికా, పద్య గీత
మనసు చెప్పక వ్యథలో మంచు గాను  
రగిలె కాలమె కరిగితే రమ్య మగును 
ఆమని అడుగులు అజరామరమ్ము గాను 
ప్రాంజలి ఘటించి, చండికా, పద్య గీత
మనసువేసే తప్పటడుగు మాయకమ్ము  
మనసు భావపరంపర మనుగడ తెర
పలుకు పరమౌషధంగాను పలకరించు
ప్రాంజలి ఘటించి, చండికా, పద్య గీత
***
హనుమంతుడే కలియుగ  జీవన గమనాన్ని చూసి రామునితో తెల్పిన మత్తకోకిల   
శ్రీరామ జయరామ, జయ జయ రామ, జానకీరామ,
 పట్టాభిరామ, కారుణ్యరామ 
మమ్మేలు గుణాభిరామ, దుష్టసంహార రామ, సర్వలోకరక్షణ రామ       
చాలు నంటిని లీల ఏలను చింత లేలను ఎప్పుడూ 
మేలుచేయుము నిన్ను కోరితి మీదు భక్తితొ ఎప్పుడూ 
తేల కుంటిన భాద్యతేయగు తీవ్రజాప్యము ఎప్పుడూ  
కాలమే ఇది చూసి చెప్పవు  కన్న ప్రేమయు ఎప్పుడూ  
వల్ల దన్నను ను మాటమీరను విద్య నామము ఎప్పుడూ 
చల్ల నైనను వెచ్చ నైనను చింత లేదును ఎప్పుడూ  
కుల్లు లోకము ఏమి చెప్పెద కూడుకష్టము ఎప్పుడూ 
జల్లు ఏకము ముంచివేసెను జాతి యందును ఎప్పుడూ  
గొంతు విప్పిన మోనముండిన గొప్పతగ్గదు ఎప్పుడూ
కాంతు లొచ్చిన నష్ట మోచ్చిన కాపు రమ్ముయు ఎప్పుడూ
శాంతులన్నియు గోప్ప వారికి స్పష్ట కీర్తియు ఎప్పుడూ
వంత మాటలు చెడ్డమాటలు వాల కమ్ముయు ఎప్పుడూ
వేదశాస్త్రము సృష్టి ధర్మము విద్య మార్గము ఎప్పుడూ
మంద బుద్ధియు జ్ఞాన దాతయు మచ్చ వెల్లువ ఎప్పుడూ
పొందు సాధన మోహ బంధము పోరు వైనము ఎప్పుడూ
బుద్ధి నందున భక్తి యుండిన భుక్తి ఉండును ఇప్పుడూ
శ్రీరామ జయరామ, జయ జయ రామ, జానకీరామ,
 పట్టాభిరామ, కారుణ్యరామ 
మమ్మేలు గుణాభిరామ, దుష్టసంహార రామ, సర్వలోకరక్షణ రామ
0***
పువ్వు తారగా?
నింగిలో తారగా మిగిలి వెలిగేను 
కలతనై కంటిలో నిల్చి కలసి బ్రతికె
గాయ మై గుండెనే తట్టె కాలమిదియు
గేయమై పాటలోకల్సి పోయె గుణము 
కడలిలో బిందువై కల్సి కరిగి పోయె 
వానలో చుక్కగా  కుర్సి  వయసు తడిసె 
కాటుకా కంటిలో చూపు కలసి మెలసి 
చింతతో చెమరు చెదిరి పోయె రీతి
సాహసమ్ము ఇదియు నిత్య సాధన మది 
పువ్వుతో గాలి పరిమళం పుడమి నందు 
సంధ్యలో వడలియు రాలి చిత్ర మాయె 
మౌనమే పెదవి పలుకు మౌఖ్యమగుట 
విప్పలేని వాణి నిలచి విజయ మగుట
చెప్పుకోని వాణి మనసు చరిత ఇదియు
ఒప్పుకోని వాణి వలపు ఓడి గెలుచు
0
ప్రేమెక్కడ?
దేహంలో  వెచ్చ లేక చల్లగా ప్రేమె క్కడ?
బలహీన బలాఢ్యులు వేధింపు ప్రేమె క్కడ?
పుణ్య కర్మ ఏమాత్రం చేయ నట్టి లోకమిది
అమానుషం ఆరాచకం దొర్లినా ప్రేమెక్కడ?
మానవత మరచిపోయె భావతత్వ సేవయేల
విద్వేషం రగిలించే జీవితం  ప్రేమెక్కడ?
సర్వ సృష్టి  దాహమైన మదంబుతో కాలమై
శీలం మంట పెరుగునా కల్పించే ప్రేమెక్కడ?
 అవినీతికి నీతి బలై స్వార్ధమ్ము పెరుగుటేను 
 కొరడాలను ఝళిపించే బ్రతుకులోన ప్రేమెక్కడ?
తనవారని మనవారని గుర్తింపే లేరనే 
నిత్యమూ పక్షపాత వైఖరిగను ప్రేమె క్కడ?
విధిగానే విలాసాలు వైభోగం ప్రిమెక్కడ?
లోకంలో జీవకళలు విజ్రుoభన ప్రేమె క్కడ?
***
జీవితం సాగు ఓర్పుగా 
ప్రవాహానికి అడ్డే లేదులే కదలికలు సాగు
జలధి కెరటాలను ఆపనూ లేములే ఓర్పు గా
పువ్వులు వికసించిన మనసుకే పరిమళం సాగు
నవ్వుల నేరజాన కళలన్ని ధనముకె ఓర్పు గా
సంబురాలకై రమ్మనె పర్యాటక శాఖ సాగు 
కుల మతాల అతీతం గాను అందరూ ఓర్పు గా 
తాగమని మందు అమ్ముటే ఆప్కారి శాఖ సాగు 
మనిషి బలహీనత ధనం దోచు నిత్యం ఓర్పు గా
పోలీసుశాఖ డబ్బుకోరి ఏడిపించుట సాగు
వృత్తి ధర్మం అంటూ రక్షణ నిత్యం ఓర్పు గా
న్యాయశాఖ ధనము కోసం వాయిదా తీర్పు సాగు 
ఆర్థిక శాఖ నాయకుల రక్షగానే ఓర్పు గా
కృష్ణ జన్మ స్థానం రాక్షగా జైల్ల శాఖ సాగు 
హోంశాఖ స్వర్గ సీమ అందరికీ చూపు ఓర్పు గా
అంబరం పైన  మేఘాలు గాలి బట్టియే సాగు
నేల ఋణం తీర్చుటకుమేఘం కురియు ఓర్పుగా
***
కొత్త సెల్ పిచ్చి తోడైంది
సెల్ఫీ చూడు చూడు అంటుంది 
పిల్లలు చదువు తీరు మారుతున్నది
గురువు పాఠాల చదువులే మార్చింది
ధనము ఇచ్చి పుచ్చు కొమ్మంటుంది 
సినిమా అందచందాలు కోడై కొస్తుంది
పుస్తకాలు చదవటంలో మార్పు తెచ్చింది 
ప్రమాదాలు తెల్పి ప్రమిదలా వెలుగుతుంది
ఒక్కొకపుడు విసుగు పుట్టిస్తుంది
మెదడులోచేరి భయాన్ని పుట్టిస్తుంది
మనకి మనమేనా అనిపిస్తూవుంటుంది
ఎదుటివారిని చూడని మైకం పుట్టిస్తుంది
నిజమో అబద్దమో తెలపలేని స్థితికి తెస్తుంది 
గతియు మతియు కాలము వ్యర్థం చేస్తుంది 
 కొత్త సంవత్సరం కోర్కెల పుట్టతో ముంచేస్తుంది 
మారేదెప్పుడు మనిషి మాయలా కామ్మేస్తుంది 
మనిషిని భ్రమ లోకి దించేస్తూ ఉంటున్నది
నిర్లక్షంగా ఉన్నట్లయితే ప్రాణాల్ని తినేస్తుంది
మాటల గారడీకి మనిషి  చిక్కెటట్లు చేస్తుంది
మాట సెల్ విననోడిని ఊబి లోనికి తోసేస్తుంది
ఉపయోగం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటున్నది
***
ద్విపద
చలిగాలి స్పర్శతో చలనము కలుగు
చెలికాని స్పర్శతో చింతలు తొలగు
పూబంతి పగడమై పున్నమి వెలుగు
శోభంబు కళలన్ని సోకులై పరుగు
అంగాంగ సౌందర్య ఆత్రుతే ఇదియు
శృంగాగ చేష్టలు శృతి లయ యగుట
స్నేహపు ముసుగేను సేతువై యగుట
దాహంబు తీర్చుట దారియే యగుట
మనసు అర్ధము తెల్ప మనుగడ మనిషి
అణువుగా జీవితం అనుబంధ మనిషి
తనువున తాపము తగ్గించు మనిషి
వినుమని తెలిపెడి వినయమ్ము మనిషి
అందచందముల అతివిల కొరతయు
పొందగ తెలుపుట కొలువగు వయసు
భోగ భాగ్య మనసు పొందియు ఉరుకు
రోగ లక్ష్యము కల్గి కోరిక చెలిమి
తిరిగి తిరిగి యింక తిరుగంగ తపము
తిరిగి లేదనియని తిరుగుట తపము
ఇరువురు మధ్యన ఇరకాట మనసు
సరిగమలు పలుకు సమయము మనసు
కరుణ జాలి దయయే కనికరం కృపయె
తరుణ మాధుర్యము యే తపనగా కృపయె
***
***
*తొలివలపుల సిగపట్లు* 
అందమైన వెన్నెలలోన ఆదమరచి
ముద్దబంతి ముగ్గుల లోకి ముడిచి ఏల
నురుగు తరగల ఆవేశ నురికి తగ్గి
మల్లె పూలపందిరిలోన మనసు పంచి
మరులు గొలుపు కలలు తీర్చి మాయ తించి
వయసు ఉరకలు పగ్గాలు వరుస పట్టి
ముసి ముసి నగవులవి ఇక మూయు టేల
అభినయము పొంది ఆనంద మాటలోన
కలువ రేకుల కళ్ళు యే కలసి పోవు
పచ్చని చిలకలు కలసి పకపక లగు
వెచ్చని వలపుకు కులుకు వినయ విందు
మచ్చలు మటుమాయ బ్రతుకు మనసు పంచు
చిలక లకళయిక కథలు చిగురు కొరకు
నవ్వులు కలసి పువ్వులై నలి గి పోవు
హృదయ కలయిక కలలవ్వి హారతగుట
నిత్య కారుణ్య భావదా నియమ మదియు
కరుణ తారుణ్య రశ్మిదా కలసి మదియు
విధిగ సారూప్య దర్శన విజయమగుట
దేవతయని మమతలగుటేను మనసు 
చిట్టి గుమ్మపదవె కళ చేష్ట తలపు
తరగని కలలు మనలోన తపన లేల
కళల రాయుడు కలసియే కథలుచెప్ప
కన్నె సొగసు పంచియు విద్య కనులు విప్ప
చలువరాతి కూడ కరిగి చెలియ చేరె
నిత్య కారుణ్య భావదా నియమ మదియు
కరుణ తారుణ్య రశ్మిదా కలసి మదియు
విధిగ సారూప్య దర్శన విజయమగుట
దేహమునుపాత్రనే ధరించు సమయమ్ము
పాత్రతో మమేకమ్ముగా పాల్గొను టయు  
పాత్ర రక్తి  తాత్కాలిక  పలుకు మరపు 
రవికి వందనాలు తెలప రాజ్య మునకు
మాదు జీవితాల ఫణమే మార్గ మగుట
భయము బ్రాంతిలేమి మనసు బంధ మగుట
శాంతిసౌఖ్య మెల్ల నియమ  శాశ్వతమ్ము
వయసు సూత్రం ముదితలకు వలపు చూపు
పడుచు ఆత్రం వయసు కాదు పడక సుఖము
కొలుచు విప్పారి నేత్ర మనోభవాలు
హంగులు అమరే టి కలత్రం హాయి గొలుపు
జాము రాత్రి జాబిల్లీగ జపముచూడు
నిప్పుకే పిల్లి వనికే నీడచేరి
అల్లికవలె చుట్టి కదిలే ఆటకోరె
మల్లి మనసు గెలిచె సుసమయము ధీర  
***
వదులుట తెలిసి కలుపుటే వసుధ నిధియు 
ధరణిదెలుపు మనకునిత్య ధర్మమోదొ
స్వర్గమనుచు తలచి బాధ  సర్వమవదు
కులపుగోల తోడ యగుట కుంగుటేల! 
పగలు,రాత్రి లేదు పరుగు బతుకులగుట 
తొంగిచూడఏ లేబ్రతుకు తొఱ్ఱయేను
రెచ్చగొట్టు పిచ్చిమనసు రెక్కలుడికి 
నీదుతెలివి జూపినిజము నిలుపుయన్ని.
మనసులోని మంచికళలు మందిబ్రతుకు 
చేసిచూపు పనులునిత్య చేతనయిన 
 జగతి లోన వెలుగు కళ జాబిలియగు 
నీతితోడ చేయి వెలుగు నీదు పనులె 
మరణమంచున జీవితం మరుగునపడు
మనిషి బతుకు కదులు చింత మనకు తెలియు      
పుట్టిన కట్టిన బట్టల పూర్తి విలువ
1 comment
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత  
తాడు బొంగరం లేని అనాధ చెప్పె 
గుండె ధైర్యముతో ఉండి గుబులు సాగె 
పనిలొ కామాందు నికి చిక్కి  పడతి  నలిగె 
నిండు గర్భిణిగా మారి నియమ బ్రతుతికె 
కడుపు లోపెర్గె బిడ్డతో కష్ట పడియు   
కూటి కోసము నిత్యమూ  కూరలమ్మె  
నడిచి తరుము కుంటూకాల నాన సాగె   
వైద్యము యులేక నిగ్రహ వ్యక్తి తోడు  
మాసములు నిండినను  గంప మోయసాగి  
కదులు కడుపున బిడ్డయు గట్టి గున్న   
కూని రాగంతో పుట్టే బా లునికి జోల 
పాడ్తు, నడక సాగించింది పృథ్వి పైన  
బాబు రాదిగి రాతొంద భాధ ఏల 
ఓర్చు కోరాక సమయముం ఓడిపోయె   
నేర్చు కోరాక  సహనము నిజము అయ్యె   
సంప దేరాక గొప్పగా సాకు చుండె   
కధలు వేదాలు నేర్పను కానిదాన్ని    
కష్టమును  నేర్పుతానురా కలలు వద్దు       
బ్రతికి  బ్రతికించె మార్గాన్ని భంద మాయె   
మాధవుడిగగా వేడుతా మనసు పెట్టి   
కాన్పు అనునది మహిళకు కాల జన్మ  
బ్రతుకు అంత ఆదుకొనుట బ్రహ్మ సృష్టి    
పృథ్వి మాతకు బరువును పీఠ మగుట   
వంశ మనునది ఏమో స్త్రీ వచ్చె కాన్పు 
నెప్పు లన్నియు వచ్చెను నెమ్మదిగను   
నల్ల మందుని తిన్నట్లు నలిగి పోయె  
తెలియ ని భయమ్ము వచ్చెను తిరిగె బుర్ర    
నడక వేగము తగ్గించి అడుగు వేయు  
కడుపు లోకదలికగుండె కంపరమగు    
కన్నవారు భంధువుతోడు కాన రాదు 
నాదు స్థితియు మారెను నాడి బ్రతుకు   
దడతొ ఊపిరి బిగపెట్టె  దమ్ము ఉంచి  
దేవ నీవెక్కడా నాకు దినము మారు  
అమ్మ  దయలేదు నాపైన అలక వుంది  
నమ్మి  మోస పో వుటమేగ  నేను తప్పు 
ఆడ దానికే ఎందుకు అంత బాధ   
స్దన బరువులు కదలికల స్థిరములేదు    
జారు తున్నధైర్యమ్మయే జరుపు కలిగె    
వళ్ళు తడిసి తల తిరిగి వయసు ఉడికె   
నడవ లేక క్రిందనుపడే నడిచి జారె  
బాధ నంత భరించియు బలముతోను   
హృదయ మంతాను చేతుల హాఐ కుంచె   
గట్టి గాగాలి  బిగించి గడవ సాగె   
కష్టము గ తొడలువెడల్పు కప్పి ఉంచె  
తెలియ కుండగ కెవ్వుగా తెగువ చూపు   
చెట్టు అనునది లేకయు చెలిమి  లేక  
కళ్ళు మూసుకొ నియు ఊపి కామ్య బుద్ధి   
దేహమంతయు కదిలంగ ధరణి పుట్టె   
షాకు మనిషిలా  కష్టమ్ము సహనమాయె   
కాళ్ళ మధ్య జారిన బిడ్డ  కెవ్వు కేక  
దైవ ఫలితముగను బిడ్డ ధ్యానమగుట   
దేహ చల్లదనంతోను ధీన మాయె    
ఓపిక తోను ప్రక్కన  రాయి ఓర్పు బొట్టు 
కోసి కట్టిన చీరను తోడు చుట్టి 
నడుము నకుచుట్టి కదల లేకయు కదలెను  
నెమ్మ దిగను అడుగులోన  అడుగు వేసె  
బుట్ట లోనివి అక్కడే బుద్ధి చూపె   
గుడ్డలో ఉన్న రక్తపు గుడ్డు పెట్టి 
నేను కోరింది బిడ్డకు నీడ నివ్వ 
నాకు వచ్చిన కష్టము నాది కాదు    
   .  
స్త్రీల కష్టం వర్ణించ తరము కాదు ) 
--((**))--
భిన్నత్వంలో ఏకత్వం.. తేటగీతి 
 భిన్న భిన్నమే ఓకథ భిన్నమేను 
తల్లి తండ్రి మధుర ప్రేమ స్థైర్య భిన్న 
చెల్లి  తమ్ముడు  అనుబంధ చెలిమి భిన్న
భార్య పిల్లలు సంసార బంధ భిన్న 
ఆస్తి అంతస్తు  హోదాల ఆశ భిన్న
నిర్మలత్వ ఆప్యాయత నిజము భిన్న 
చెలెమి మోహము శాకపు చేరు  భిన్న
వీర్య విరహమ్ము ధ్యాసయు వీక్ష భిన్న 
ధ్యాస భిన్నాలు సహజమే దాస్య భిన్న 
వర్ణ వెటకార సహకార వ్యాధి భిన్న 
రంగు  పొంగు సంతోషాల రమ్య  భిన్న
బ్రతుకు మెతుకు అతుకులైన బంధ భిన్న
 బాధ బాధ్యతాయుత మొద బంధ భిన్న 
కక్ష శిక్ష రక్షగనులే కామ్య భిన్న 
రక్త  తటస్థాల కళలు గా  రక్ష భిన్న
జీవుడికి జిలుగులద్దిన జగతి భిన్న
హరి హరాదులె కాదు బ్రహ్మ భిన్న 
ఇంద్రుడాదిగా దేవత ఇష్ట భిన్న 
నిత్య  బ్రహ్మాండముగ ఆత్మ నీదు భిన్న 
ఆత్మ భిన్నముగా మది అసలు భిన్న
బ్రహ్మ వేరు, బ్రహ్మము వేరు బంధభిన్న              
ఆత్మ యందె దృష్టి యనువుగాను నొనరు 
 నిశ్చలముగ దృష్టి నిలిపెనేని యతడు 
యతడు నీవే సుమ్మి యనుమాన మేనురా
***
****బాలలం మేం బాలలం****
బాలలం మేము పౌరులం బంధ మేల 
అమ్మ చాటు బిడ్డలమేను ఆట లేల 
కొమ్మ చాటు పిందెలమేను కొరక నేల 
పరుగు తీసే చిరుతలమే పగలు ఏల
ఎగిసి పడు తార జువ్వలం యదను చూడు 
పాలు తాగేటి దూడలం పలుకు చూడు 
జారు జల పాత మల్లెను జయము చూడు 
పెరుగుతున్న తరువులమే ప్రేమ చూడు
ఉరుకు తున్న జింక లముగా ఊయలాట
నెమలి నాట్యమై కదులుతూ నియమ మాట
నిత్య విశ్వాస బుద్దిగా నియమ ఆట
తల్లితండ్రుల తోడుగా చదువు బాట
తెలుగు తల్లి బిడ్డలము గా తీయతనము
తేనియల తెలుగు పలుకుతిక్క తనము
భావి తరముగా భారతి భాగ్య తనము 
చెణుకు సూత్ర చెకుముకిగా చేష్ట తనము
ప్రాంత పొంత పులకరింప ప్రాభవముయె 
వికట కవి రామ కృష్ణగా వైభవముయె 
తెలుగు పద్య గద్యము మాల తేటకళయె
 సలలిత తెనుగు బ్రతుకుగా సమయ కళయె
0 comments
001 దాన మిచ్చె బ్రతుకు దాశ్యము కాదులే
వీర విపృని వలెను విజయ మౌను
సూర మదిని కలిగి సూర్యుని తేజమై
ప్రాంజలి కళ గీత పద్య హృదయ  
002 కంటిలో గుడ్డు వెలుగుగా కనుల విందు 
దృశ్య కళలుగా కనులందు దక్క గల్గు 
నింగి తాపపు సిరిగాను నిన్నుచూడు
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత 
003 పదలయలుగా పలకరింపు పరవశించ
దినకరునికివేడి ఉదయం తెలుగు సేవ
సమయ పాలనా పరమగు సహనశీలి 
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
004 ఉదయ వెల్గు సూర్య సహన ఉజ్వలమది
జ్ఞానమే దుష్ట లనుమార్చి జ్ఞప్తి పరచు
వన మృగ చెలిమి వింతగా వళ్లెవే యు
ప్రాంజలి ఘటంచి చండికా పద్యగీత
005 బురదలో పుట్టు తామర బుద్ధి వెలుగు
లక్ష్యమై పుట్టి న మనిషిl లయలు మాయ
చలము నీరు తియ్యని మౌన చలిత మనసు
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
006 నిరుప యోగ ఉప్పు జలము నిత్య మెగురు
జ్ఞాని బోధల పాఠము జాతి వెలుగు
అహము కోపఅజ్ఞాని గా అరుపు కళలు
ప్రాంజలి ఘటించు చెండికా పద్య గీత
007 ఖలులు తింటినా గళమున గలత లేల
వారి తిట్లు కళలు తీర్చ వాసి మారు
సజ్జనుల తిట్టినా పాప శాప మగుట
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
008 రాతయే మార్చు గీతయే రాశి వెలుగు
చిత్త మెచట భయము శున్యచేరు చెలిమి
జ్ఞాన మెచటఉన్ముక్తమౌ జ్ఞాని బోధ
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
009 శీర్ష మెచట ఉత్తంగమో శీగ్ర మౌను
ఇనుప కండరాల జపమే ఇనమదించు
జీవమూ ఆత్మ స్తేర్యము జీవ గమన
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
010 ఉండబట్టలేక మనసు ఊహళాయె
ఉడుకు రక్తము ఉరిమింది ఉన్నతమగు
తోడు కోరి తోటను చేరి కోల లాట
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
011 తిప్పెడిగ మూతి తైతక్క తిక్క మతియు 
అర్థమైన రీతి మగడు ఆట గతియు    
చిక్కనిది చుప్పనాతి ఏ చేష్ట స్థితియు 
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత 
   
012 చేతిలో మగవాడుగా చిక్కు కోతి
ముదితకు మగవాడు పరము ముఖ్య నాతి   
మగని అంతు చిక్కని కధ మగువ నీతి
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత 
   
013 అతివల కళల చూడాలి అతిగస్థితి     
తోక లాడించె బుద్ధియు తోలు జాతి 
ముక్కుతాడువేసి పిలుచు ముక్తినాతి   
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
014 నీదు సాంగత్య దోషమే నిన్ను మార్చు
సకల దుర్జన కల్లోల సమయ మి దియు
మనసు దుర్బోధ నరకమే మనుగడేల?
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత
015 విశ్వ మందు గోముఖమున వేద పలుకు
శిలలు సందేశ మిచ్చుతే శివుని ఆజ్ఞ
వృక్షములు పక్షులు పలుకు వేద మగుట
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత
016 మంచి తనపు విశ్వాసము మరులు గొలుపు
అణువు అనుమానము అసూయ అనవసరము
తీపి చేదు అనుభవాలు తేట పరుచు
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత
017 హృదయ మేల్కొల్పు అవసరం హరహరిగను
హద్దు లేని ఆకాశమే అంతరాన
బాహ్య సమతుల్యత కలిగి బంధ మయ్యి
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత
018 నీవు ఎవరివల్ల జననం నీదు సేవ
నిన్ను నీవుగా గమనించు నటన వలదు
నీవు ఆధ్యాత్మికముగాను నీకు మనసు
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత
019 మా కలల పంట మాధురి  మనసు నింప
మా చిరునగవు చిన్నారి మధువు యదియు
మా మరులుగోలుపు కళ గా మంగళమగు
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత
020 ఎంత అణచి వేసిన యంత ఎదుగు తారు
ఎంత ఒదిగి ఉండగలిగి యదను తట్టు
ఎంత  ఓటమి విజయమే ఏల యనకు
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత
021 ఓటమియు గెలుపుకు దారి ఓర్పు నున్న
ధైర్యమే కాదు యుక్తియు ధర్మ బుద్ధి
పిల్లలకు నైతికవిలువ నేర్పు తల్లి
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత
022 గానమీ రీతి చేయుచు కడుముదమున
ప్రొద్దుపుచ్చుచు మనుటయే పొసగనేని
సార్వ భౌముని తో నేను సాటి నగదు
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత
023 పలక రింపల కిరణమై పత్రమందు
ప్రాణ రక్ష గాలిగనులే పలుకుచు కళ
హృదయ వాంచ్ఛ తీర్చు ఫలము హారతగుట
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత
024 చితికి పోవగ వగచియు చేష్ట లుడికి
నిత్య ఛీత్కార పిలుపు లనేక కళలు 
వెతికి శిక్షించ మనియున్న వెతలు తోను 
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత
025 శమము గృహిణిగా నిత్యమూ సేవలగుట
దమము ఆకర్షణ జగతి ధరణి నందు 
హిలము పంచెటి పురుషుని హేతు వగుట
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత
026 నాటి తనవారి మితముగా నాన్యముగను  
మగని చుట్టాల నేవేళ దెగుడుచుండు 
భోజనముసేయుదురటంచు బొగడుచుండు  
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత
027 ఆకసమునంటు తరువులు ఆత్రముగను
ఏ చిటారుకొమ్మలలోనొ యింపు లొలకు
ఫలము ఫలియించె దానిని భవ్య మలర
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత
028 బట్ట చింపిరి భాద్యత బాధ పెట్టు   
మాననిగ పుండు జాతికి మహిమ ఏల    
చరచు చప్పట్లు మనలోన చెడును చేయు   
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత
029 అక్షరము నేర్పు విద్యలే లక్షలగుట 
ఊరికే అనలేదులే ఉహలకళ    
మనసు పూర్వీకులు కళలు మనుగడయగు      
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత
030 బాదలవి మననొదిలుండ బలము తగ్గు     
పలకరించు సుఖములవి భయము తగ్గు      
జగతి లో సుఖ దుఃఖాలు జాము తగ్గు     
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత
031 తాగు తూ తూగి కూర్చున్న త్యాగి కధలు   
రాక కై సతి ఎదురు సరాగ గీత   
తీర సంతోష మన చెప్ప తలను పట్టు  
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత
032 నాటి అలవాటు అనుకరణమ్ము చూడు   
వొంటికది మేలు చేకూర్చె బోను అయిన 
బతుకునకు తప్పు లన్నవి భాద్యతగనె
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత
033 గుండె కదిపి చూచు మనసు గుర్తు చేయు    
గాలి నిలువెల్ల వీచును గయా పరచు         
చావు బతుకు వేదాంతము చపల చేష్ట   
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత
 034 పెరిగి కోరలు సాచుటే పిరికివాడు  
  పద పదండని మూపులు పట్టి త్రోచి     
  నీకు ఆరోగ్య మను లోటు నిన్ను మార్చు  
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత
035 ఉనికి అనునది ఏకవచనము యగుట
రెండు ఆభరణాలుండు రంగు వెలుగు
రెండు బంగారములనరే వెళయు బుద్ధి
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత
036 మనము కాకుంటె ధూతలం మనసు పంచు
ఒడ్డుకు ప్రయాణిస్తునే ఓడి గెలుచు
కాల నిర్ణయ తలపులే కలసి వచ్చు
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత
037 ఆత్మ వెలుగుగా నీవుయే ఆలనేను
వ్యర్థ పలుకులు లేకయే వ్యక్తి గుండు
ఉనికి కేవలం శ్రవణమై ఉదయ పలుకు
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత
038 క్షోభ లను భరించుట మేలు క్షమకు మార్గ
అల్పు డైనచో కోపమై ఆశ మార్గ
రత్నము సహించు ఘర్షణ రమ్య మార్గ
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత
039 నిర్మలమె పరాత్పరశక్తి నిజము తెలుపు
నిత్య చైతన్య దీశక్తి నిర్మలమగు
సాత్విక మె బుద్ధి కదలిక సామరస్య
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత
040 సంధి సంయోగ సక్యత సంభవమ్ము
సలపు సంతోష పర్యావ సాన మమత
సమయ సాధ్య అసాధ్యము సమర మవదు
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత
041 బయట ఆనంద మనునది బంధ మవదు
మనసు లోనున్న ఆనంద మార్గ బ్రతుకు
విషయ ఏకాంత మై అర్ధ వినయ maguta 
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత
042 సూర్యుని పయణం చీకటి చూచు వరకు
చంద్రుని పయణం పగలు వచ్చె వరకు కళ
సృష్టి ఉన్నంత పయనమే చెలిమి బ్రతుకు
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత
043 అర్థమైతేను 'అవ'ధూత లం కళలగు
ఒడ్డున పడెడి మనిషిగా ఓర్పు తెలుపు
అర్ధ పరమార్ధ తెలుపుటే ఆశ యమగు
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత           
044 వాగునీరు పొంగియు పొంగి ముంచివేయు 
కాలువంకర ఐనను కథలు రావు 
మేలుమారిన కధలుగా మేళమగుట 
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత
045 నీకు బాటసారులవళ్ళ నీడలొచ్చు   
తోడు దొరకొచ్చు అవకాశ చోరులగుట  
నీ ప్రయాణమ్ము ప్రగతికై నియమ మగుట      
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత
046 నిన్ను చేరేది నడమంత్ర సిరులు యగుట 
నోరు చేదుగా నున్నను నొప్పి కాదు  
మనసు నిర్మలంగానూలె మమత నొప్పి   
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత
047 ఎవరెలా మారిపోయారొ యదలొ నొప్పి   
అందరికళల లెక్కలూ ఆస్తి నొప్పి .
నన్ను చూడగా నవ్వేటి నయనములగు  
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత
048 గుర్తు పట్టిందిలేదన్న గుప్త మగును     
అన్న తృప్తిగా మిగిలించు అభినయనము 
కలలొ వదనమ్మును మరల్చు కాలమేళ
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత  
049 పోతె పోనీ కలల తీరు పోరుకా దు 
ఐతెఉండనీ మనసుకు ఐక్యత యది 
ఆలుమగలుగా కలిసియే ఆత్ర మగను 
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత
050 వాలుచూపుల కలలన్ని వాలిపోవు
పేగుబంధము ఇదియేను ప్రేమగాను 
కాగుజలముగా ఆవిరి కామ్య మగుట 
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత
051 తావెలేనిది పువ్వుకు తాపమేల 
చావెలేనిది పుట్టుక చావడేది
నాగుగుణముయే విషముగా కాలతీర్పు 
ప్రాంజలి హృదయ చండికా పద్య గీత
052 సత్యమే తీపి మాటల సమయ తృప్తి    
గురుత త్వంరమణీయము గుర్తు దివ్య 
దుర్మతుల కనిపించేది దుష్టబుద్ధి 
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
053 భూమి పై సూర్యు తేజత్వ భుక్తి నిచ్చు 
లోక వెన్నెల ఆహ్లాద శోకమవదు  
తరగనిది ఆధి పత్యము తపన తీరు 
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత 
 
054 విశ్వ రూప విఖ్యాతము విజయ మేను 
కానుకల పరాక్రమమేను కలసి వచ్చు   
చిందు హృదయాల తేజస్సు చేష్టలివియు
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత 
055 ఆర్థతమది నిండిన సర్వ లోక శ్రేష్ట
కదిలి పోరాట గెలుపులే కలయు నీతి 
లోకమే ఆశ్రయించేను లోక విధియు 
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత 
056 చల్లని మనుగడత్వమే సహన మగుట
అగణిత అలౌకికపరమానంద మగుట
సుందర దరహాసముప్రేమ సుమధురమ్ము   
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత 
  
057 ఆశ్రిత జన ఆనందమే వాత్స మగుట 
నా అదృష్ట తారక మంత్ర రాముడగుట 
స్మరణలకు మాత్రమే అందె శరణు రామ  
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
స్వచ్ఛ మైన మనసు స్వాగత మగు గాలి     
నీడ లందు చేరి నియమ బ్రతుకు
ప్రకృతి ప్రాభవమ్ము ప్రగతిగా ప్రతిభఏ     
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత 
భవ భవ భయ భావ భాగ్య బంధ మగుతే
బ్రహ్మ చరిత కథలు బ్రతుకు తెరువు
శరణ యుద్ధ మిడియు సంఖ్య అనుట ఏల
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత 
గురువు లగువు తగువు కూడి గుర్తు తెచ్చు కళలు
లగువు గురువు ఒకరొకరు లాగి లాగి
బిగువు కవితలు చెప్పగా బిగిసి పోయె
ప్రంజలి ఘటించి చండికా పద్య గీత 
గ్రంథ శోధనలకు   ద్రవ్య వ్యయముఏల 
ప్రకృతిని జయించడానికే ప్రతిభ జూపు
ధీరులను చేయు విద్యయే దివ్య మగుట
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
స్వార్థ మనడి ఘనత సౌమ్య సానయగుట 
స్వార్ధమను మిగుల వ్యాధి  సమయ మంత 
స్వార్ధ మడచె నే గోర్కెలు సాయ మవవు 
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
ఘడియ గడియార కదలిక ఘనత చెంది
గుండె శబ్దమ్ము సమయమే గుర్తు మరచి
నీడ కలసియు కథచేరి నిదనె నాడి
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
సార వంత పరచు చర్య సాగ నివ్వు
నిత్య భూతాల నీడలు నిజము అయిన
పంచ భూతాల తోడుగా పక్వ మెరిగి
ప్రాంజలి ఘటించి చండికా పద్య నీతి
పంచభూతాత్మకము విధి పగలు రాత్రి
భూమిలోనుంచి పుట్టిన భుక్తి మనిషి
గాలితో మమేకం నీరు కాల మగ్ని
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
లోకమున తల్లితండ్రితోడొకటి ప్రకృతి
అందమైన తనయలుగా ఆదు కొనుట
ఎవరు పొగడినా తల్లితండ్రేల మారు
ప్రంజలి ఘటించి చండికా పద్య నీతి
మంచి మాట దానము పుణ్య మగుట సాను
కూల సంభాషనుల తృప్తి పూజ్య మగుట
ఫలము నాశించకనె చేయు పనులు శాంతి
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
జలము తాను బుడగలుగా జపముగాను
నురుగులై కెరటము లుగా నూతనమ్ము
తోచినట్లు దాహపు ప్రాణ తీపి పెంచు
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
ఇంద్రియములనెదె విషయము ఇష్ట గోష్టి
యెరిగి తన్నుపిదప యోగి నెరగకున్న
జ్ఞాని యోనని యందులే జ్ఞప్తి పరచ
ప్రంజలి ఘటించి చండికా పద్య గీత
చిత్తమున బ్రహ్మ సృష్టిగా తేల్చగ వలె
బ్రహ్మ మను ఆత్మ ఏకమై బంధమేగు
లౌకిక మొదలి బ్రహ్మము లౌక్యగమన
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
ఆత్మ జ్ఞాన మనసు శుద్ధ ఆశయమగు
నిరత మిచ్ఛా రహితుడుగు నిర్మలమగు
తెరచి ఉంచిన హృదయమై తీరు కలుగు
ప్రంజలి ఘటించి చండికా పద్య గీత
మిత్రమా ఉదయించుటే మేలుకొలుపు
అస్తమించదు అనుభూతి ఆత్రమేల
కాల  సుందర ప్రకృతియే కలసి వచ్చు
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత 
ఎదుటి వారి గుణాలతో ఏల నీకు
నీదు గుణముమంచి దయినా నీకు తోడు
లేని కష్టాల కొలిమియే నేటి బ్రతుకు
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
ఎదుగు ఒదుగుల నేర్పరి ఎదన నాన్న
అడుగుల అభి మానము పొంది ఆదుకొనెది
జన్మ దిన శుభా కాంక్షలు జాతి నందు
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
అమృత ఘడియ ఆలోచన ఆదమరిచె
తప్పు ఒప్పులు తెలియవు తపము ఇదియు
జన్మ వాహన చోదక జాతి కొరకు
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
ఏ కలువ ఎప్పుడు జననం ఎవరి ఎరుక
ఇదొక సుఖము పంచుటకు లే ఇష్ట పడియు
నిత్య ఉదయించి మకులించు నియమ నీడ
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
ఆత్మ కళ్యాణము కొరకు ఆశవలదు
భేద బుద్ధి ఏల మనకు బిడియ మేల
జన్మ కర్మ ఆవిర్భవం జగడ మేల
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
శ్రమ అనే ఆయుధము నీదు సమయ తృప్తి
భ్రమలు నీ ఆశయము మార్చు ప్రీతి కోరి
ప్రభల వెలుగు నీ గమ్యము ప్రతిభ బట్టి
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
నీవు నేను రేపటి కళ నీడ మార్చు
నిన్న నేడు రేపు కలలు నిన్ను మార్చు
ఉన్న లేకున్న భుక్తికి ఊయలాట
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
మీదు ఆరోగ్య కుదుటయే మీకు శాంతి
కాల నిర్ణయం ఇదియని కథలు వలదు
ధైర్యమే మన శక్తి అ ధైర్య మేల
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
నోరు జారకు తగువులు కోరవద్దు
విధి బజారులో బేజారి వినయ మేల
మంట పుట్టించి అరుపుల మనసు ఏల
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
ఎదుగు ఒదుగుల నేర్పరి ఎదన తల్లి 
అడుగుల అభి మానము పొంది ఆదుకొనెది
జన్మ దిన శుభా కాంక్షలు జాతి నందు
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
0
మనసు బెదిరెను బ్రతికే దిమా కరాబు
తానుగా చెదిరే కలతల వలన నె
తిక్క కుదిరేము లే చేతి చమురు వదిలె
వాస్తు పిచ్చి ముదరెనులే వలదు యన్న
ఇకను మొతలేదు సెళ్ళుంటె ఇష్ట చదువు
నిత్య అధ్యాపకులు శ్రమ లేదు వినుట ఏను
పలుకు మేధావి చరవాణి పాఠ చదువు
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
0 comm
దివికి భువికి మధ్య దివ్యమైనది ప్రేమ
మేఘ వర్ష మగుట మేలు చేయు
చినుకులై కబుర్లు కదిలే చెలిమి కొరకు
సహన ప్రాంజలి కళ శారదాంబ
నమ్మకము పదో చరవాణి నమ్మ లేక
అనుభవము ఆవిరియగు ఆట మల్లె
ఇది దురదృష్టమో మది ఇష్టమేల
ప్రంజలి ఘటించి చండికా పద్య గీత
చరకు వింటిగమన్మధ చేష్ట లుడికె
పూల భాణాలు మనసుపై పురులు విప్పె
గాలి బాణాల కాంతులు కలసి పోయె
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
నవ్వె ను చిలిపిగ కనులు నాట్యమైన
రువ్వె ను మనసు వలపులు ఋణముమల్లె
సవ్వడి విసురు శబ్దము సమయ మాయె
ప్రాంజలి ఘటించు చండికా పద్య గీత
సిరి కలలు ఆశ పాశము చిద్విలాస
సిరిని యదనుంచి శీఘ్ర ము చిత్ర మాయె
విరి విలాస పురుష నీవు వినయమిదియు
పరిపరి విధము ప్రార్ధన పాద పరమె
చావు పుట్టుక దొర్లును చాప క్రింద
నీవు నేను ఒకటిగాను నియమ మేది
పోవు కాలమాగదు నీదు పోరు నిజము
రావు అనుటలో  వచ్చును రాత్రి పగలు
భారమవదు బంధము తృప్తి భాద్యతగుట
సార మున్నను లేకున్న సహన మధియె
కారము మమ కారమునయ్యె కాని దైన
దూరము అనక దగ్గర దూత యగుట
భేద బుద్ధి ఎందుకు నీకుఁ బేరమేల
ఆరు నూరైన తెలుసుకో ఆశయేల
కారుచీకటి ఉపయోగ కామ్య బ్రతుకు
ప్రాంజలి ఘటించి చండికా పద్యగీత
కీర్తి ధనము పొందనులేవు కీడు తెచ్చు
నిత్య సౌశీల్యమే మన నీడ రక్ష
నోరు జారక బ్రతుకుటే నొప్పి తెచ్చు
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
అహము పుట్టుకతో వచ్చు అందరికిని
పెంచి పోషించు గుణము పెరుగు వెన్న
సక్రమ నెయ్యి ఉపకర శక్తి సకల పలుకు
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
విషమమృత మవదు విధిగా వీర చావు
వ్యర్థ పలుకుల నష్టము వ్యసనమ గుట
స్వార్ధమే మనమాయగా సాగు నీడ
ప్రాంజలి ఘటించిచండికా పద్య 😂గీత
అద్దమైన పగులు అందానికి దిగులు
ఆద మరచి పలుకు అసలు నలుగు
హృదయ కదలికాగు హాయి నిశ్శబ్ద మే
సహన ప్రాంజలి కళ శారదాంబ
న్యాయమన్నది కష్టమే నటన ఏల
తీర్పు రెండు నెలలు మించి తిట్టు తేట
చేయు ఆలస్యము జనుల చింత ధనము
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
ఎదుటి మౌనము ఆసరా ఏల నీకు
నీగుణము తెల్పి తొందర నీకు వలదు
దూషణ గుణాలు దగ్గరై దురద ఏల
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
కట్టి పడవేయు కనులతో  కాల మహిమ
వట్టి మాటలని అనకు వణుకు పుట్టు
గట్టి పోరుతప్పదు ఇక గళము ఏల
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
 అందమైన వెన్నెలలోన ఆదమరచి
ముద్దబంతి ముగ్గుల లోకి ముడిచి ఏల
నురుగు తరగల ఆవేశ నురికి తగ్గి
ప్రాంజలి ఘటించి చండికా పద్యగీత
 మల్లె పూలపందిరిలోన మనసు పంచి
మరులు గొలుపు కలలు తీర్చి మాయ తించి
వయసు ఉరకలు పగ్గాలు వరుస పట్టి
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
 ముసి ముసి నగవులవి ఇక మూయు టేల
అభినయము పొంది ఆనంద మాటలోన
కలువ రేకుల కళ్ళు యే కలసి పోవు
ప్రాంజలి ఘటించి చండికా పద్యగీత
 పచ్చని చిలకలు కలసి పకపక లగు
వెచ్చని వలపుకు కులుకు వినయ విందు
మచ్చలు మటుమాయ బ్రతుకు మనసు పంచు
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
 చిలక లకళయిక కథలు చిగురు కొరకు
నవ్వులు కలసి పువ్వులై నలి గి పోవు
హృదయ కలయిక కలలవ్వి హారతగుట
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
 నిత్య కారుణ్య భావదా నియమ మదియు
కరుణ తారుణ్య రశ్మిదా కలసి మదియు
విధిగ సారూప్య దర్శన విజయమగుట
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత 
 దేవతయని మమతలగుటేను మనసు 
చిట్టి గుమ్మపదవె కళ చేష్ట తలపు
తరగని కలలు మనలోన తపన లేల
ప్రాంజలి ఘటించి చండికా పద్యగీత
 కళల రాయుడు కలసియే కథలుచెప్ప
కన్నె సొగసు పంచియు విద్య కనులు విప్ప
చలువరాతి కూడ కరిగి చెలియ చేరె
ప్రాంజలి ఘటించి పద్య గీత
 నిత్య కారుణ్య భావదా నియమ మదియు
కరుణ తారుణ్య రశ్మిదా కలసి మదియు
విధిగ సారూప్య దర్శన విజయమగుట
ప్రాంజలి ఘటించి చండికా పద్య  గీత
 రవికి వందనాలు తెలప రాజ్య మునకు
మాదు జీవితాల ఫణమే మార్గ మగుట
భయము బ్రాంతిలేమి మనసు బంధ మగుట
శాంతిసౌఖ్య మెల్ల నియమ  శాశ్వతమ్ము
 వయసు సూత్రం ముదితలకు వలపు చూపు
పడుచు ఆత్రం వయసు కాదు పడక సుఖము
కొలుచు విప్పారి నేత్ర మనోభవాలు
హంగులు అమరే టి కలత్రం హాయి గొలుపు
 దేహమునుపాత్రనే ధరించు సమయమ్ము
పాత్రతో మమేకమ్ముగా పాల్గొను టయు  
పాత్ర రక్తి  తాత్కాలిక  పలుకు మరపు 
 ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
 జాము రాత్రి జాబిల్లీగ జపముచూడు
నిప్పుకే పిల్లి వనికే నీడచేరి
అల్లికవలె చుట్టి కదిలే ఆటకోరె
మల్లి మనసు గెలిచె సుసమయము ధీర  
ప్రాంజలి ప్రభ ఉదయ చండికా  పద్య గీత 12 -12 -2022 
 
ఎవరు నీవు ఎవరనెడి ఏల బ్రతుకు
ఏది నిజ ఎదబద్దము ఎపుడెరుకయు
ఏల యన్న ఇదేవిది ఏమిఅనక
ప్రాంజలి ఘటించి చండికా పద్యగీత
 చనువు చపలమనేదియే, చక్క చేయు
చేరువగుట కూడ, కళయే చింత వలదు
చెలిమి కలలన్ని శుభముగా, చలవ నీరు
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
 తనువు తపనల వయసుగా, తరుము చుండు
తప్పుయైనేది ఒప్పుగా, తారుమారు
తనివితీరా ఇదియు కథ తడిక బ్రతుకు
ప్రాంజలి ఘటించి చండికా  పద్య గీత
 నీవు నేరుగా భగవంతుని కలిసేటి
పుణ్య మన్నది కేవలం పులుసు ముక్క
పాప మన్నది బానిసగాను చేయు
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత
 ఉన్నదాన్ని చూసి అధిరి ఉరకవద్దు
ఉన్నది మరువకున్నను ఊయలగుట
ఉన్న లేకున్న బంధము ఉల్లి పొరయు
ప్రాంజలిఘటించి చండికా పద్యగీత  
మంచుగడ్డవలె అవరోహణము చెంది 
నీరు ఆవిరి వలెను ఆరోహణమగు
క్రమము నేర్పరచు మనసు కళల జీవి       
ప్రాంజలి ఘటించి, చండికా పద్య గీత 
జడముచే ఆవరించేటి జపము శక్తి 
ఎముక అత్యంత ఘనమగు ఏల అనకు
మాత ఏడు లోకములలో మనసు నిచ్చు 
ప్రాంజలి ఘటించి, చండికా పద్య గీత 
 
సృష్టి కార్యము జడ శక్తి, సమయమగుట 
నిత్య చైతన్య స్థితిగాను, నీడ నిచ్చు 
చిత్తమెంత అవసరమో, చెలిమి తోడు  
ప్రాంజలి ఘటించి, చండికా పద్య గీత
మీరు క్షణికము కాదులే మేలు చేయ 
శాశ్వతం, మారుతున్నాను సేతువవరు 
మార్పులేని వారు అనియు మారనిదియు  
ప్రాంజలి ఘటించి, చండికా పద్య గీత
పువ్వు పుట్టి రాలట విధి పుడమినందు 
నిత్య అందము మారదు నియమ పువ్వు 
మనిషి ఎదిగికొద్దీ మారు మనసు పువ్వు 
ప్రాంజలి ఘటించి, చండికా పద్య గీత
వాస్తవికత అనుభవించ వ్యాధి కలుగు 
పగలు ఒకరకం చీకటి పడక వేరు 
శాశ్వ తంగా మనసు బుద్ది శాంతి లేదు 
ప్రాంజలి ఘటించి, చండికా పద్య గీత
    
రాలి పడ్డ ఆకు కయినా, ఆత్మ తెలుప
క్షణము తిరిగిరాదనునది, క్షమయు గుణము 
జీవితాన తెలియరాదు. జీవ రక్ష
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత 
    
కలవరాలు ఎన్నెన్నోను కట్టె కాలె
బ్రతుకునుబలి చేయను రాదు బంధ మాయె   
జీవితాననే కన్నీళ్ళ గీతమాయె 
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత 
ప్రేమయెపుడు అశాశ్వత మేను మాయె 
ప్రేమ మారరాదు మనసు  జీవితాన
బలిపశువుగాను మార్చుతా యేను విధిగ
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత 
ఎన్నిసార్లు తలనరికిన జంకరాదు
ముసురుకున్న  దిగులు పడకు బ్రతుకంత
బ్రతుకుతున్న ఓడను రాదు జీవితాన
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత 
చివరి దాక నీధైర్యము వీడరాదు
మృత్యువెదుట నిల్చి మనసు మీడ లేదు   
బ్రతుకు స్వేచ్చ ఎపుడు వుండు బాధ లేదు    
ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత 
శమము = అంతరింద్రియ నిగ్రహము
దమము = బాహ్యేంద్రియ నిగ్రహము
హిలము = రేతస్సు, వీర్యము
0 comm
 *🧘♂️78-ఉపనిషత్ సూక్తి 🧘♀️*
*108 ఉపనిషత్తులలో గల 108 మహా వాక్యములు*
*78. యేన సర్వమిదంప్రోతం సూత్రే మణి గణా ఇవ తత్సూత్రం ధారయేద్యోగీయోగవిత్ బ్రాహ్మణోయతిః||*
*(పరబ్రహ్మోపనిషత్)*
*- దారమున మణిగణములవలె, ఎవనియందీ సర్వము గ్రుచ్చబడియున్నదో(ఓతప్రోతమై) ఆ సూత్రమును,యోగవేత్త,యోగి, బ్రాహ్మణుడును నగు యతి ధరించవలెను.*
*లోకా: స్సమస్తా: స్సుఖినోభవన్తు!
...........
*🧘♂️సంతోషం🧘♀️*
*నేనొక కష్టంలో ఉన్నప్పుడు నీ కంఠస్వరం ఇలా వినిపించింది:*
*" నా రక్షణ- భానుడు నీ ఉజ్జ్వల గడియలలోనూ, అంధకారమయ గడియలలోనూ సమానంగానే ప్రకాశిస్తాడు. విశ్వాసం ఉంచి చిరునవ్వుతో ఉండు. విచారంగా ఉండడం ఆనంద స్వరూపమైన ఆత్మకు ద్రోహం చేయడమే. జీవితాన్ని మార్చెయ్యగల నా కాంతిని చిరునవ్వుల పారదర్శకత ద్వారా వ్యక్తమవనీ. నా బిడ్డా, నీవు ఆనందంగా ఉండడం వల్ల నేను సంతుష్టుణ్ణవుతాను ."*
*శ్రీ పరమహంస యోగానంద / Whispers From Eternity*
...........
*ॐ卐సుభాషితమ్ॐ*
*శ్రీ ఆదిశంకరాచార్య విరచితము భజగోవిందం*
*13) కా తే కాంతా ధన గతచింతా వాతుల కిం తవ నాస్తి నియంతా|*
*త్రిజగతి సజ్జనసం గతిరైకా భవతి భవార్ణవతరణే నౌకా ||*
*ఓ మూర్ఖుడా! నీకు కాంత - ధనములపై చింత ఎందుకు? నిన్ను శాసించువాడెవడూ లేడా ఏమి? మూడులోకములలోనూ, సత్పురుషసాంగత్యమొక్కటే సంసారసముద్రము దాటించు నౌక.*
........
ఎందరో మహానుభావులు రచించిన సంస్కృతము శ్లోకాల తాత్పర్యాలు 
సేకరణ మల్లాప్రగడ రామకృష్ణ  (01 to 09) 
ద్రవ్యయజ్ఞాస్తపోయజ్ఞా యోగయజ్ఞాస్తథాపరే |
*స్వాధ్యాయజ్ఞానయయజ్ఞాశ్చ యతయ: సంశితవ్రతా: ||
 (4 వ అధ్యాయము - జ్ఞాన యోగము  - 28)
 
తాత్పర్యం : కఠిన వ్రతములను చేపట్టి కొందరు తమ సంపత్తిని అర్పించుట ద్వారా మరియు మరికొందరు తీవ్రతపస్సులను చేయుట ద్వారా, అష్టాంగయోగ పద్ధతిని పాటించుట ద్వారా లేదా దివ్యజ్ఞానపురోగతికై వేదాధ్యయనము నొనరించుట ద్వారా జ్ఞానవంతులగుదురు.
****
కిం పునరాహ్మణాః పుణ్యా భక్తా రాజర్షయస్తథా |
అనిత్య మసుఖం లోక మిమం ప్రాప్య భజస్వ మామ్ || 33
{9వ అధ్యాయము - రాజవిద్య రాజగుహ్య యోగము - 33)
తాత్పర్యము : అన్ని జాతులవారును అనన్యభక్తి మార్గమున నన్ను పొందగలిగినపుడు పుణ్యాత్ములగు బ్రాహ్మణులు, భక్తులగు రాజర్షులు కూడ నన్ను పొందగలరని వేరుగ చెప్పనవసరము లేదు గదా! ఈ లోక మనిత్యము. ఇందు సుఖము లేదు. కావున నన్ను సేవించుచు ఆనందము పొందుము.
****
కవి: కరోతి కావ్యాని రసం జానాతి పండి తతః ౹
తరుః సృజతి పుష్పాణి మరుద్వహతి సౌరభం ౹౹
కవి కావ్యాలను రచిస్తాడు అయితే సారాన్ని పండితుడు గ్రహిస్తాడు.వృక్షవు పువ్వులను   ఇస్తుంది,వాటి సువాసనను గాలి అన్ని చోట్లకు తీసుకెళ్లుతుంది.
****
*రాజా రాష్ట్ర కృతం పాపం  రాజా పాపం పురోహితః 
భర్తాచ స్త్రీ కృతం పాపం శిష్యపాపం గురుర్వజేత్ 
తా:-రాష్ట్రము లోని ప్రజలు చేసిన పాపములు రాజుకు తగులును,రాజు చేసిన పాపము పురోహితునికి చెందును, భార్యచేసిన పాపము భర్త పొందును, శిశుడు చేసిన పాపము గురువుకే చెందును.
****
*ధనికః శ్రోత్రియో రాజా నదీ వైద్యస్తు పంచమః 
పంచ యాత్ర న విద్యన్తే తత్ర వాసం నకారయేత్ 
ధనికుడు, వేదవేత్తయగు బ్రాహ్మణుడు, రాజు, నది, వైద్యుడు, ఈ ఐదుగురూ లేనిచోట నివసించ కూడదు.
****
*హితం భుంజాన్మితం  భుంజ్యాత్ న భుంజ్యా దమితం హితం 
హిత మిష్టంచ భు౦జీయాత్ ఏష ధర్మ స్సనాతనః 
తా:-- హితమైన పదార్థములనే తినాలి. ఏవైనా మితముగానే తినవలయును. హితవైనవే యైనా అమితంగా తినవకూడదు. హితవైనవి పరిమితంగానే తినవలయును.
****
*అహో దుర్జన సంసగ్రాన్మాన హానిః పదే పదే౹
 పావకో లోహసంగేన ముద్గర్తెరభిహన్యతే ౹౹
దుర్జనుల కలియకతో మళ్ళీ మళ్ళీ హాని జరుగుతూ ఉంటుంది.ఇనుముతో అగ్ని చేరడంవలన లోహం దెబ్బలను తప్పదే సహించవలసి వస్తుంది.
*****
*న పరః పాపమాదత్తే పరేష షాo పాపకర్మాణాం ౹
సమయో రక్షితవ్యస్తు సంతశ్చారిత్రభూషణా : ౹
ప్రజ్ఞావంతుడైనవాడు తనకు అపకారం చేసినవాడికి మళ్ళీ అపకారం చేయడు.ఎప్పుడూ మంచి ఆచారాన్ని పాలించాలి.సజ్జనులకు మంచి నడతాలే భూషణం.
******
*శ్రీ అన్నమాచార్య సంకీర్తన*
......
రేకు రాగము: గుజ్జరి.
ఇటువంటి దుర్గుణి నన్నెట్టు గాచితివో గాని
సటలాడేవానికి సత్య మెందు లేదు!!
॥పల్లవి॥
మదనాతురునికిని మరి వివేకము లేదు
కదిసి అలసునికి కర్మము లేదు
పొదిగి యా శకునిఁకే పుణ్యపాపము లేదు
మొదలనె మూర్ఖునకు మొగ మోఁట లేదు!! 
॥ఇటు॥
కొంచెపు నాస్తికునికి గురుఁడు దైవము లేఁడు
పొంచిన లోభివానికి భోగమే లేదు
యించుకంత దరిద్రున కియ్యా గొన శక్తి లేదు
చంచల చిత్తునికి నిశ్చయ మెందు లేదు!! 
॥ఇటు॥
మత్తుఁడైనవానికి మరి పనులే లేవు
హత్తి వేంటకానికి దయలు లేవు
సత్తుగ శ్రీ వేంకటేశ శరణాగతుఁడ నీకు
యిత్తలఁ దాల్లిటి చీంత లిఁక నేమి లేవు!!
॥ఇటు॥
......
దేవా మాయమాటలు మాట్లాడువాడు సత్యము మీద నమ్మకముంటుందా అన్నీ దుర్గుణాలే వున్న నన్ను నీవు యెట్లా రక్షించావో నాకే ఆశ్చర్యంగా వుంది.
మన్మధ జ్వరపీడితునకు వివేకముంటుందా లేనే లేదు. అలసత్వముగల వానికి సత్కర్మలపై కోరికే లేదు. చుట్టుకొని ఆశాపీడితునకు పుణ్యమనేదే లేదు.
 మొదటి నుంచి మూర్ఖుడైన వానికి మొగమాటమనేదే వుండదు కదా. సంకుచిత భావాలు గల నాస్తికునికి గురువుపై దైవముపై నమ్మకము వుంటుందా. లోభియైనవాడు తాను సుఖపడడు పరులను సుఖపెట్టడు.
 దరిద్రపీడితునకు అంగీకరించే శక్తి వుండదు. చంచల స్వభావుడు యే నిశ్చయానకీ రాలేడు కదా. ఎప్పుడు మత్తులో వుండేవాడు యేపనీ చేయలేడు. వేటగానికి దయ అనేదేది వుండనే వుండదు.
 సత్యప్రమాణముగా ఓ శ్రీవేంకటేశ్వరా నేను నీ శరణాగతుడను నాకు పూర్వకర్మలుగాని ఆలోచనలుగాని లేనేలేవు. చింత అనేదే లేదు అంటూ కీర్తించాడు.
..........
శ్రీ అన్నమాచార్య సంకీర్తన
గానం. శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు
రాగం. మిశ్ర మోహన.
కడలుడిపి నీరాడగా తలచువారలకు | 
కడలేని మనసుకు కడమ ఎక్కడిది ||
దాహమణగిన వెనక తత్త్వమెరిగెదనన్న |
దాహమేలణగు తా తత్త్వమేమెరుగు |
దేహంబుగల అన్ని దినములకు పదార్థ |
మోహమేలణుగు తా ముదమేల కలుగు ||
ముందరెరిగిన వెనుక మొదలు మరచెదనన్న |
ముందరేమెరుగు తా మొదలేల మరచు ||
అందముగ తిరువేంకటాద్రీశు మన్ననల | 
కందువెరిగిన మేలు కలనైన లేదు ||
🕉🌞🌏🌙🌟🚩
     ఒకాయన సముద్ర స్నానం చేద్దామని వెళ్లాడు. అలలు భయంకరంగా ఎగసి పడుతున్నాయి. అలలు తగ్గిన తర్వాత స్నానం చేద్దామనుకొన్నాడు. అతడి కోరిక ఎప్పటికి తీరదు. ఎందుకంటే అలలు ఎప్పుడు సముద్రంలో ఎగసి పడుతూనే ఉంటాయి.
 అలాగే అంతుపొంతు లేని కోరికలతో ఉండే మనస్సుకు 'అక్కడితో సరి' అని ఒక హద్దు పొద్దు ఎక్కడిది? (అలలు లేని సముద్ర స్నానం ఎలా అసాధ్యమో, కోరికలతో నిండిన మనస్సుతో మోక్షం అసాధ్యమని భావం).
1. తత్త్వం గురించి వివరంగా చెబుతాను వినమని ఒక గురువుగారు శిష్యునితో అన్నాడు. కోరికల మీద పూర్తిగా ఆశ తగ్గిన తర్వాత తత్త్వం నేర్చుకొంటానన్నాడు శిష్యుడు. వాడికి జన్మలో కోరికలు తీరలేదు. తత్వం తెలుసుకోలేదు. దాహం తీరాలంటే నీళ్లు తాగాలి. కాని నేయి తాగితే దాహం తీరకపోగా పెరుగుతుంటుంది.
 కోరికలు తీరటానికి చేసే ప్రయత్నం కూడా ఇటువంటిదే. అందువల్ల దాహం తీరిన తర్వాత తత్వం తెలుసుకోవాలనుకోవటం వ్యర్ధమైన పని. అతడికి దాహం తీరదు. తత్త్వం ఒంటపట్టదు, దేహమనే పదానికి అన్నరసాదులచే వృద్ధి పొందింపబడేది అని అర్ధం.
 అందువల్ల ఈ దేహం ఉన్నవాళ్లు భక్ష్యాలు (విరిచి నమిలి తినే పదార్థాలు), భోజ్యాలు (ఉండలుగా చేసికొని తినే పదార్థాలు), లేహ్యాలు (నాకి తినే పదార్థాలు) చోష్యాలు (జుర్రుకొని తినే పదార్థాలు) అనే పదార్ధముల మీద మోహం పెరుగుతుంది కాని తగ్గదు. పరార్థ (ఆధ్యాత్మిక) విషయాలలో సంతోషం కలుగదు.
2. నా ముందర ఏమి జరుగబోతోంది.. ఆ జ్ఞానం నాకు కావాలి. అంతేకాని ఈ జన్మకు సంబంధించి నన్ను మొదటినుంచి వెంబడించి వస్తున్న కర్మ వాసనల విషయం నాకు వద్దు. వాటిని మరిచి పోతానంటే - అది మామూలుగా కుదరని పని.
ఇలా అనుకొనేవాడు జ్ఞానాన్ని ఏమి తెలుసుకొంటాడు? కర్మలనుంచి ఎలా విముక్తుడవుతాడు? అయితే ఒక చక్కటి ఉపాయం చెబుతాను. మన సమీపంలో అందమైన శ్రీవేంకటేశ్వరుడు ఉన్నాడు.
 శరణుకోరి ఆయన అనుగ్రహాల చమత్కారం (=కందువ) తెలుసుకో చాలు. అన్ని కర్మలనుంచి విముక్తి అవుతావ్! జ్ఞానవంతుడివి అవుతావ్. కలలో కూడా ఇటువంటి అనుకోని లాభాలు లభిస్తాయని నువ్వు ఏనాడు ఊహించి ఉండవు. అందుకే ఆయనని శరణు వేడటం మానకు.
🕉🌞🌏🌙🌟🚩
     చేపట్టిన పనిని ఎన్ని కష్టాలెదురయినా భయపడక పూర్తిచేయ్! ఏది ఎప్పుడు చేయాలో విచక్షణా జ్ఞానంతో చేయ్! సముద్రంలో స్నానం చేయాలంటే అలలనే కష్టాలు చూసి భయపడకు. జీవితం, సముద్రం ఒకటే.
     అలలున్నాయని భయపడుతుంటే నువ్వు సముద్ర స్నానం ఏనాటికి చేయలేవ్! కష్టాలకి భయపడితే ఈ భవసాగరంలో నువ్వు ఈదలేవ్! ఆధునిక తరంలో నిరాశలో కూరుకుపోతున్న యువకులనే అర్జునులకు అన్నమయ్య అనే గీతాచార్యుడు చేసిన ఈ గీతంలో చేసిన ప్రబోధమది.
     అనేక దిక్కులనుంచి పొంగి ప్రవహిస్తూ వచ్చే నీళ్లు, సముద్రాన్ని చలింపచేయలేవు. అట్లే సమస్త భోగాలు స్థిత ప్రజ్ఞునిలో వికారాలు పెంచవు. అతడు పరమ శాంతంగా ఉంటారు.
 భోగాలలో కోరిక ఉన్నవాడు ఏనాటికి శాంతిని పొందలేదు. (గీత.02-70) అని సముద్రాన్ని - భగవద్గీత - సాంఖ్యయోగంలో అందమైన పోలికతో అవిష్కరించింది. అన్నమయ్య ఇదే సముద్రాన్ని అలల ముఖంతో దర్శించి మన మనస్సులలో సంతోష భావ తరంగాలను ఉప్పొంగేటట్లు చేసాడు.
'దేహో నాఽహం; కోహం సోఽహం' (నేను దేహాన్ని కాను; నువ్వెవరివి? ఆదేవుడే నేను) అని సంస్కృతంలో అందమైన ప్రయోగం. దేహము మీద చింత ఉన్నంతకాలం, అది తినే పదార్థాలు - లేదా - బయట కనిపించే పదార్థాలు - వీటి మీద వాంఛ పెరిగిపోతూనే ఉంటుంది.
దేహం లోపల ఉన్న వాడి మీద చింత పెరుగుతున్నకొద్దీ వాంఛ తరుగుతూ ఆనందం పెరుగుతుంటుంది. దేహంబుగల యన్నిదినములకును పదార్థమోహమేలుడుగు దాముదమేల కలుగు అని అన్నమయ్య మాటలలోని ఆంతర్యం ఇది.
     ఈ అన్నమయ్య వాక్యాలకు ఇంకొక వివరణ కూడ చెప్పుకోవచ్చు. వేదాంత శాస్త్రంలో అన్నమయ (దేహం), మనోమయ (మనస్సు), ప్రాణమయ (ప్రాణం), విజ్ఞానమయ (ఆత్మ), ఆనందకోశాలుంటాయని (పరమాత్మ) చెబుతారు.
ముఖ్యంగా గాఢ నిద్ర పోయేటప్పుడు ఆత్మ పరమాత్మకి దగ్గరగా చేరుతుంది. అప్పుడప్పుడు నిద్రలో ఉన్న వాళ్లు ఒక్కోసారి అపరిమితమైన ఆనందంతో నవ్వుతుంటారు. దీనికి కారణం అదే అని పెద్దలు చెబుతారు.
     అయితే దేహాదుల భ్రాంతులవల్ల ఆత్మ పరమాత్మలో లీనం కాలేదు. అంటే శాశ్వతమైన ఆనందాన్ని పొందలేదు. అందుకోసమే పదార్థాల మీద - అంటే విషయాల మీద వాంఛ తగ్గించుకోవటానికి ప్రయత్నిస్తే ఆనందం కలుగుతుందని భావం.
ఇందుకోసం సంయతేంద్రియః (ఇంద్రియాలను జయించాలి) అని గీతలో చెప్పిన మాటను 'కడలేని మనసునకు గడమ యెక్కడిది' అని అన్నమయ్య తనదైన శైలిలో చెప్పాడు.
 కోరికలకి ప్రయత్న పూర్వకంగా విరామచిహ్నం (ఫుల్ స్టాప్) పెట్టకపోతే - జీవితం మనకు తెలియకుండానే విరామ చిహ్నాన్ని పెట్టేసుకుంటుంది. తస్మాత్ జాగ్రత జాగ్రత.
🕉🌞🌏🌙🌟🚩
 
No comments:
Post a Comment