Friday, 22 April 2022

aaaataveladi


బ్రతుకున ఆశ చూపు 

మనిషిని మనిషిగా తీర్చి మనుగడగుట 

జన్మ సాఫల్య మును పొందు జగతి నందు 

ప్రకృతిలోని శక్తులకేమి భయము వలదు 

ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత 


మస్తకాలు రెండు కలసి మనుగడ గది 

అనుకరణలు ఆరు కలసి ఆశల వల  

తప్పులు పదిహేను కలపి తినగలుగుట 

ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత    

 


గాడిద కాళ్ళను పట్టక పోయిన కదలవు బ్రతుకుల కళ కళల్    

గాడిద చాకిరి చేసియు కొందరి కరములను  నరుకుటయె శుభమున్  

గాడిద గుడ్డను లోకము నీతియు కధలు విలువలు కలలగుటయున్      

గాడిద మాటల అర్ధము కాదియు గమన సహన అరుపు కదలుగన్   



" నర్తకీ -- భ భ భ భ న న న న గ..( శ్రీమదజ్జాడాధిభట్లనారాయణదాససృజితము ) ..25/13...

--

దేవకిపట్టినిఁగోరెనుప్రేమఁగ తిరమగుబగితిఁగలుఁగుమతినిన్

బ్రోవఁగరమ్మనివిష్ణుసుపుత్రిక పుడమినివెలసినసిరిపతినిన్

పావనధానుషమాసఁపుపూజలవరదగురునిదివిజగణవరున్

పూవులమాలలతోడను సేవ్యునిఁబుడమిసురలహితవచనములన్ !!! "

--


రాముని నామము నిత్యము ప్రేమఁగ రకరకములు కృషిపలుకులుగన్    

సోముని కాంతులు సత్యము ప్రేమఁగ సమయ కరుణ సెగలుతెలుపుటన్   

కాముని లీలలు పత్యము ప్రేమగ కళలు కనికరము సహనముగన్     

భీముని చేష్టలు పైత్యము ప్రేమగ భజన గురుని కధలు తెలుపుటన్   




సరిగమలను పలుక సమరమ్ము రూపిణీ

నీదు దయయె గాద నిక్కముగను 

గాత్రమిత్తువీవె కారుణ్య స్ఫూర్తిగా  

సహన ప్రాంజలి కళ  శారదాంబ


ప్రతిభ కెపుడు నీవె ప్రాధాన్యత కలిగే 

నువ్వు గాచకున్న ఉన్నతమగుఁ 

గణన పొందుటకును గరుణించ మనసుగా 

సహన ప్రాంజలి కళ  శారదాంబ


ఫలము లేవియైన ఫలితము నీ కృప

సకల ఫలములకును సామరస్య 

నీదు రూపములకు నిదియొక మనసుయే 

సహన ప్రాంజలి కళ   శారదాంబ !!


అతివ లేక జగతి యంద విహీనమే 

శీల రహితయైన సిగ్గు చేటె

నిన్ను గొల్వ నెపుడు నిజశీల మనసుతో 

సహన ప్రాంజలి కళ   శారదాంబ !!


అరయ, నాడు నీవె యాజ్ఞవల్క్యునకును

మనన శక్తి నీవ మమత జూపి ?

మనన సేయకున్న మతిని చేరదు విద్య

సహన ప్రాంజలి కళ   శారదాంబ 


ముని వరేణ్యు తాత ముని సుతు కోసమే

జ్ఞాన మరిగి నిన్నె, జ్ఞాని విధియు 

కాంతుడైన నీకె కావలెగా నులే 

సహన ప్రాంజలి కళ   శారదాంబ 

 

అవని కోర తననె ఆశయముంచియు 

వేడి పొంది బ్రహ్మ విద్య తెలుప 

పుడమికిచ్చెనన్న పుణ్యగాథే మది 

సహన ప్రాంజలి కళ   శారదాంబ 

 

దల్మి కొరకు శూలి తత్త్వ తెలుప గోరి

నిన్నె వేడినాడు నిక్కముగను

వామ దేవునికిని వందితవైతివి

సహన ప్రాంజలి కళ   శారదాంబ 


[భావము : దల్మి అంటే ఇంద్రుడే. శివుని అనగా శూలిని ఓ గాథ.]


దేవ గురువు నిన్నె తీరుగా గొలిచెను

శబ్ద శాస్త్రమునకె సమయ మందు 

అదియు గూడ నరయ యారాధ్య వైనము 

సహన ప్రాంజలి కళ   శారదాంబ 


హస్త భూషణమన ఆశ పుస్తకమేను 

నీవె పట్టి చూపి నీడ వలెను 

విద్య లేనివాడు వింత పశువు గాన

సహన ప్రాంజలి కళ   శారదాంబ 


చేత వీణ బట్టి చెల్వు మీరగ నేర్పు

గళములుండవలెను గచ్ఛపి వలె  

స్వరమె బాగయున్న సకలము బాగుగా

సహన ప్రాంజలి కళ   శారదాంబ 


పద్మ వక్త్ర యన్న పలువిధంబుల యొప్పు

వదనమైన నేమి వచన మైన

గళము నందు నెపుడు కరుణయే వర్షించు

సహన  ప్రాంజలి కళ  శారదాంబ


జ్ఞాన ముద్ర గలిగి జ్ఞానుల గామార్చు 

అమ్మ మాకు నేర్పు మక్షరములు

నిండు మనసుతోటి నిన్నె  గొల్చెదముగా

సహన  ప్రాంజలి కళ  శారదాంబ


చేరదీసి వాని చిత్తమె మార్చవా ?

కాలనిర్ణయమ్ము కానిదేల ?

కలసి మెలసి బ్రతుకు కష్టాలు తీర్చవా 

సహన  ప్రాంజలి కళ  శారదాంబ


పాతకములన్ని పరిహరించగలవు 

పావనచరితమది పాఠ మదియు 

పాపి నైన మార్చ పావనివగు  

సహన  ప్రాంజలి కళ  శారదాంబ


అవని కోర తననె ఆ యనంతుడు నిన్నె

వేడి పొంది బ్రహ్మ విద్య యపుడు

పుడమికిచ్చెనన్న పుణ్యగాథే యది

సహన ప్రాంజలి కళ శారదాంబ 


దేవ గురువు నిన్నె తీరుగా గొలిచెను

శబ్ద శాస్త్రమునకె సమయ మందు 

అదియు గూడ నరయ యా వేల్పురేనికే

సహన ప్రాంజలి కళ శారదాంబ 

రూపు పెద్దదైన రూపసివే నీవు

భారి కాయమైన భయమదేల ?

హాయి గొల్పుదువు మహాకారమైననూ

సహన ప్రాంజలి కళ శారదాంబ 


సాధువులకు నీవె చల్లని తల్లివి

కర్కశత్వమునకు కారవమ్మ!

దుర్గుణములనట్లు తొలగ జేయుచు నీవె

సహన ప్రాంజలి కళ శారదాంబ 


బుద్ధి బలమునకును భుజ బలమ్మును జేర

చేయవచ్చు నన్ని చేవ యున్న 

నీదు నామ మందు నిజమదె యర్థమూ

సహన ప్రాంజలి కళ శారదాంబ 


వందనములు నీకు వారాహివే నీవు

తత్త్వ మరయ జూడ దైత్యునొకని

సంహరించినట్టి శౌరికి బత్నివే

సహన ప్రాంజలి కళ శారదాంబ 


వేదములకు నీవు వెలుగు నిత్తువు గాదె

వింతదేమి లేదు వేదములును

ఇమిడి యుండు జూడ నెపుడు నీలోననే

సహన ప్రాంజలి కళ శారదాంబ 


పద్మ నయన నీవు పద్మ సంభవు సతీ

పంక్తి నెపుడు జూచు పదిలముగను !

నీదు వీక్షతోనె నిజమైన పులకింత

సహన ప్రాంజలి కళ శారదాంబ 


సాధు పట్ల నీది సత్త్వ గుణమె గాని

రాచబాట తప్ప రాజసంబె

నీతి తప్పినపుడు నీకు తామసముగా

సహన ప్రాంజలి కళ శారదాంబ 


 కామ రూపి నీవు కనగ యంతట నీవె

విశ్వమంత నిండి విబుధ జనుల

గాచుచుందు వీవు గారుణ్య శక్తి వై

సహన ప్రాంజలి కళ శారదాంబ 


నరులు బొగడ చుండ నిత్యమైబాసిల్లు 

సత్య లోక మిదియు సమరమేల 

పుడమి నందు నిత్య పూజలందుకొనిడి 

సహన  ప్రాంజలి కళ  శారదాంబ


అమ్మ ! నీవె చూడు మదియు మా భాగ్యమే

అమ్మ కన్న వారు కరుణ జూపు 

అమ్మ ఆది నుంచి మాఇలవేల్పువి  

సహన  ప్రాంజలి కళ  శారదాంబ


భోగ భాగ్యములనె భూరిగా నిత్తువు

భయము తొలచి వేసి బంధమవ్వు 

బాధ లన్ని తీర్చి బంధముగానుండు  

సహన  ప్రాంజలి కళ  శారదాంబ


మాసమంత వెలుగు మహిని పరతు వీవు

వేషభాషలన్ని  వేకువగుట 

మాయ మర్మ మన్న మాకు తెలియదమ్మ 

సహన  ప్రాంజలి కళ  శారదాంబ


తాప జపము వళ్ళ తరుణ మార్గము ప్రాప్తి

తప్పులన్ని మరచి తోడు కోరె

ఒప్పు కొనియు తెల్ప ఓర్పుతో కర్మలే 

సహన  ప్రాంజలి కళ  శారదాంబ


రాము డైన మరియు రాక్షసి యైనను
నిన్ను గొలిచి గాద నిష్ఠ తోడ
జ్ఞానులైరి నీవె జ్ఞానంబు బంచగా
సహన ప్రాంజలి కళ శారదాంబ

కాంత కనక సుఖము కాలము నేర్పుటే
క్షమయు కరుణ మనసు క్షామ మేల
లేత వయసు పరుగు లే ఇవియనె
సహన ప్రాంజలి కళ శారదాంబ

జ్ఞాపకములు లేని జ్ఞాని వలన నేమి
కలగబోదు చూడు ఫలము సుంత !
స్మృతియు నీదు భిక్షె స్మృతి రూపిణివి నీవె
సహన ప్రాంజలి కళ శారదాంబ

విద్య యున్న గాదు, వినయమే ముఖ్యము
చిత్తి లేని యెడల సీత్కృతియెగ !
బుద్ధిమంతులనెగ పుణ్య శీలుర జేతు
సహన ప్రాంజలి కళ శారదాంబ

వాక్కు పంచు మహిమ వాగ్దేవియే నీవు
గీత దాటకుండ కృపయె చూపు
మాట మీరనీక మన్నన చూపుమా
సహన ప్రాంజలి కళ శారదాంబ

హంస వాహనంబు నది నేర్పు మాకెంతొ
మసలు కొనగ వలయు మంచిగాను
చెడుగు చెరగ నేర్పి చేర్చవా తీరము
సహన ప్రాంజలి కళ శారదాంబ

కోడి కూసె జాము కోలుకొని కదులు
తోడు వచ్చు చందు రోడు కదులు
లక్షణాల మనిషి లాస్యమేను కదులు
సహన ప్రాంజలి కళ శారదాంబ

గెలుపు విటమి అయిన గెలవాలి మనసుయే
ముందు కెల్లఁటమని మూల్యమగుట
సామ దాన భేద సమయంబు నీదయా
సహన ప్రాంజలి కళ శారదాంబ

చిక్కు చక్క దనము చేరువ చెలిమియే
దక్కు హృదయవాంఛ ధరణి యందు
మొక్కు కున్న ముడుపుకట్ట మోక్షమిచ్చు
సహన ప్రాంజలి కళ శారదాంబ

ఒక్క పలుకుగా విజయమై ఓర్పు నిచ్చు
విషయ వాంఛ లన్ని వేగ మలుపు
సమయ తృప్తి నిచ్చు శాంతి మాత
సహన ప్రాంజలి కళ శారదాంబ

అచల తత్వ మనగ ననుభావ గమ్యమ్ము
చూసి చెప్ప లేము సూక్ష్మ మదియు
మదికి దోచు గాని మర్మమెన్నగ రాదు
సహన ప్రాంజలి కళ శారదాంబ

చిత్త ముంచి పనులు చేయ దలచి నాను
మత్తు వదల దలచి మార్గ మెంచె
చిత్తశుద్ధి కలిగి చిన్మయా రాధన
సహన ప్రాంజలి కళ శారదాంబ

జ్వాల కలిగి చేరి జన్యువై పరమాణు
దిక్కులన్ని కలిగి దివ్వె వెలుగు
సర్వ జనుల కృషికి సమయ తృప్తి పరచు
సహన ప్రాంజలి కళ శారదాంబ


దైవమిచ్చు తనువు దైవతృపీతి కొరకు  

కల్ల మాట లేని కరుణ కొరకు  

కానివారమణకు కామ్యము కొరకునే 

సహన  ప్రాంజలి కళ  శారదాంబ

   

పక్కనున్న వారి పరిచయమును కోరు

పలుకరించు యెపుడు పలుకు తోడ

పలుకు తెలుపు మదిని పరహాస మెందుకు

సహన  ప్రాంజలి కళ  శారదాంబ


పలుకు తెలుపు మదిని పరహాస మవ్వదు

పదుగురన్నమాట పలుకు చుంటి  

మనసు పలుకు లన్ని మాకుతెలియచేయు  

సహన  ప్రాంజలి కళ  శారదాంబ


నరులకొరకు నీవు నాటకములు ఎలా 

లోక హితము కోరు లేత మనసు 

నెర వేర్చు తనువు నిత్యకృత్యములని 

సహన  ప్రాంజలి కళ  శారదాంబ


అతల వితల సుతల ఆరాధ్య మాతయే
ప్రకృతి ప్రతిభగాను ప్రభల వెలుగు
సత్య లోక ధర్మ సమయ నీతి తెలుపు
సహన ప్రాంజలి కళ శారదాంబ


తీర్చి దిద్ద గలవు తీరుగా నిను వేడ

మార్చ గవలె తీర్చు మానసమ్ము  

తీర్చ గలుగు తీరు తీపిగా నుండుటే 

సహన ప్రాంజలి కళ శారదాంబ


వాడు వీడు అనే అహము వ్యాధి పుట్టె 

మంచి చెడు కానని గుణము మాయ పుట్టె

ధనమనే వ్యాధి జనులకు ధరణి యందు

సహన ప్రాంజలి కళ శారదాంబ 


పాపములను కడుగు పావన గంగవే

దుష్ట యోచనలను దూరముంచి

నడచు నటుల యెపుడు నలియైన బాటలో

సహన ప్రాంజలి కళ శారదాంబ 


నిఖిల లోకములకు నీశ్వరివే నీవు

మాట మాదె యైన నాట నీదె

శివుని యాజ్ఞె యన్న శ్రీ మాట నీ యాన

సహన ప్రాంజలి కళ శారదాంబ 


శ్రీ ప్రదాంబ నీవు సిరులొసంగ గలవు

విద్య కన్న గొప్ప విత్తమేది ?!

అక్షరంబులున్న నక్షయ సంపదే

సహన ప్రాంజలి కళ శారదాంబ 


లక్ష్య శుద్ధి కలిగి లక్షణముగ గొల్తు

లక్షణంబుయగుట లయలు గొల్తు   

అక్షరమగు మాల యాత్మలోఁ నిలుచుటే 

సహన ప్రాంజలి కళ శారదాంబ 


మూర్తి భేదమున్న మూలము నీవెగా

కీర్తి కోరుయున్న కీలకమగు  

స్ఫూర్తి నించి యున్న సూత్ర ధారిగనీవు 

సహన ప్రాంజలి కళ శారదాంబ 

  

జగతి నందు మేమె యగణితు లగునట్లు 

విగతి జీవు లైన వినయ ముంచు   

ప్రగతి నెంచి మధుర భావనలు మరల 

సహన ప్రాంజలి కళ శారదాంబ 



తల్లి నిన్ను తలచి తలపెట్టినానుగా

శతక మొకటి వ్రాయ సాహసముతొ

తప్పు దొర్లవచ్చు దండించకే తల్లి

సహన ప్రాంజలి కళ శారదాంబ 


మనిషి మంచి చెడులు మనసు ఆయుధములే

జీవి నరక సుఖము జగతి ఇచ్ఛ

స్వేచ్ఛ చిక్కు ముడిగ సీతకోక చిలకే

సహన ప్రాంజలి కళ శారదాంబ


వ్యక్తి చదవు విలువ వాక్కు తెలుపుటయే

భంగ కరము కాని బంధ మగుట

బుద్ధి సూక్ష్మతయి భుక్తి ముక్తి కొరకే

సహన ప్రాంజలి కళ శారదాంబ


వ్యక్తి స్థితిని చూసి వ్యక్తపరచుటేల

మట్టిలోన ఉన్న మాణిక్యమే యగు

రక్ష శక్తి తోడు రాయి రత్న మగుటే

సహన ప్రాంజలి కళ శారదాంబ


బ్రహ్మ రుద్ర వరము భయముగా బ్రహ్మ౦డ 

ధర్మ మందు నీదు దయయు లేక 

వట్టి దుష్ట బుద్ది మట్టిలో గలసిరీ

సహన ప్రాంజలి కళ శారదాంబ


సవతి తొడ నీవె జగదమాడక యుండి 

సర్దు కొనుచు నీవు సంగ మించి

నీదు పాఠమేను నేర్వదలచి నాము 

సహన ప్రాంజలి కళ శారదాంబ


నీదు గృపయె యున్న నిజమైన జ్ఞానమే

దక్కు శాంతి పలుకు దఖలు పడుట  

జదువఁ పాఠమివ్వ జగతినేలగలుగు  

సహన ప్రాంజలి కళ శారదాంబ


ఆది శక్తి గాను ఆనంద దాయిణీ

ఒకటి కాదు ఏన్నొ యొప్ప దలయొ 

ఆస్రి తులతొ చెలిమి ఆదర్శప్రాయమే

సహన ప్రాంజలి కళ శారదాంబ


వందనములు ఇవియు వాగ్దేవి రూపిణీ

భాష్య మేది రాదు బలము యున్న 

నీదు కృపయె మాకు నిక్కముగను

సహన ప్రాంజలి కళ శారదాంబ


ధవళ వస్త్రధారి దయగల తల్లివే

తెలుపు తలపు శాంతి తెలుపు రంగు    

శ్వేత వర్ణ మెపుడు చేకూర్చు అంబరం 

సహన ప్రాంజలి కళ శారదాంబ


ఎంత చదివితేమి యెన్ని నేర్చిన నేమి

నిన్ను గొల్వకున్న నిష్ఫలంబె ! 

మాకు నేర్పు విద్య మనసునీదు జననీ   

సహన ప్రాంజలి కళ శారదాంబ


గణన పొందుటకును గరుణించవలె నీవె

గమ్య మైన ప్రగతి కాల మిదియు 

సాకు మమ్మ మమ్మె సానుకూలత మది  

సహన ప్రాంజలి కళ శారదాంబ


నీదు రూపములకు నిదియొక భావము

ఫలము ఇచ్చు తల్లి పగలు రాత్రి 

సకల ఫలములకును స్థానమీవె 

సహన ప్రాంజలి కళ శారదాంబ 


తోడు నిలచినావు వీడక నెప్పుడూ

తోడు నీడ కాల నిర్ణయమ్ము 

ధాత నిన్ను తలచి తనకు సైదోడుగా

సహన ప్రాంజలి కళ శారదాంబ 


ఆది శక్తివైన యా వేల్పుకై నీవె

చదువులమ్మ గాగ మది తలంచి

ప్రియము చేయు మనసు ప్రేమనందించుటే

సహన ప్రాంజలి కళ శారదాంబ 

  

తరచ నింకనొక్క తన్మయం చేసేటి

గాథ నీదు మాకు గామితంబె

నిన్నె ధాత కిచ్చె నేమి మా భాగ్యంబొ

సహన ప్రాంజలి కళ శారదాంబ 


కాలకల్మషమది కళల ప్రభావము

కర్మ,ధర్మ,యోగ,  కామ్య భోగ

త్యాగసాధన లని తత్త్వబోధనలేల

సహన ప్రాంజలి కళ శారదాంబ   


ఎల్లవేళ లందు ఏల పరాచకమ్ 

కాల గమన మదియు కళలు అనకు

జ్ఞాన సంపదయని జ్ఞప్తి తెచ్చు కొనుట

సహన ప్రాంజిలికళ శారదాంబ


వ్యర్ధ  పలుకు లేల వ్యసన భాషణలేల

ఖర్చు చేయు టేల కాని దేల

లోన మందుగుండు లోకమందు  తిరుగు

సహన ప్రాంజలి కళ శారదాంబ


పాల పాత్ర వంటి ప్రాణ మిదియునులే

మీరు దాన్ని నిత్య ధ్యాన పరుచు

శాంతితోను నింపి సహజ అవ సరాలు

సహన ప్రాంజలి కళ శారదాంబ


నేను పాపి ననుట నాటక మగుటయే

దుఖితుడనెడి శక్తి దూర మగుట

అదియు చేయలేను ఆదుర్ద పడుటయే

సహన ప్రాంజలి కళ శారదాంబ


కర్మ బంధ నగుట  కాల నిర్ణయముయే

ఇంద్ర జాల మిదియు ఇష్ట మగుట 

గొలుసు వలెను మీరు  కొక్కాన్ని చిక్కుటే

సహన ప్రాంజలి కళ శారదాంబ 


కలత లేని వాడు కలిమిచే వెలయును

కలిమిలేనివాని కలలు దిగును

కలలు  కన్న భువిని కలిమి ఎక్కువ

సహన ప్రాంజలి కళ శారదాంబ


జప తపాదులన్నిచే తీర్థ యాత్రలై  

భగవత్ప్రాప్తి పొంద భయము వలదు

దేహ కష్ట పెట్ట సేవ లగుట

సహన ప్రాంజలి కళ శారదాంబ


అణు మాత్రమగుట నామ స్మరణ భక్తి . 

దేవ లోక శివుడు  దేవుడనుచు 

సర్వకాలమందు సరయమే తృప్తిగా 

సహన ప్రాంజలి కళ శారదాంబ


నేను దుఃఖితుడగు నైతెచ్చి పెట్టితి

నేను తలచుకొన్న నీదు సుఖము 

ధీరయువత శక్తి దేవతా గమ్యము 

సహన ప్రంజలి కళ శారదాంబ


చెదిరె సూర్య కిరణ  కేంద్రీకరించు టే

దీప్తి స్తాయి మనసు ఏకగ్రత

జ్ఞాన సాధనమ్ము కాల నిర్ణయముగా

సహన ప్రాంజలి కళ శారదాంబ


ఉపకరమగు జ్ఞాన ఉన్నత భావము

చిత్తము వలన కళ చేరు వగుట

తట్ట లోని ప్రకృతి తెలియగా జ్ఞానమే 

సహన ప్రాంజలి కళ శారదాంబ


మానవునిలొ మహిమ దివ్యమైనది శక్తి

యుగయుగాల నుండి యోగ మగుట

జీవి తాలు మార్చు జీవ సర్వ స్వాన్ని

సహన ప్రాంజలి కళ శారదాంబ


పరమ హంస గారి బోధన లన్నియు

ఆత్మ శక్తు లగుట  అంద రందు 

ప్రతి ఫలాన్ని  అనక ప్రగతినే కోరుట 

సహన ప్రాంజలి కళ శారదాంబ


క్రియల అవసరమ్ము కీలకమ్ము యగుట

క్రియ యోగమగుట కీర్తియేను 

గురువు ప్రధమ విద్య  గుర్తుగా జీవితం 

సహన ప్రాంజలి కళ శారదాంబ


మనిషి మాటలన్ని  మాయచే కూర్చుటా

స్వార్ధ బుద్ధి కలిగి సాకు చుండు

స్థాన బలిమి గాని సాధన కాదయా

సహన ప్రాంజలి కళ శారదాంబ


“ఈ శరీరమేను ఈశ్వర శక్తిగా 

రూపమగుట రాత్రి ఋణము పగలు

సర్వవ్యాపకమగు సమయ తృప్తి

ప్రాంజలి కళ గీత శారదాంబ


స్వయము గనెడి లెస్స సహజ సంతృప్తియే

ఆత్మ వెలుగు లీల ఆశ్రయ మగు 

ఆశ లేని తనము ఆరాధ్య దైవము

ప్రాంజలి కళ గీత శారదాంబ


ప్రకృతిగా సమత్వ ప్రతిభ యే  జ్ఞానము

నిష్క్రియత్వముగను నీడ యగుట

నిర్భయత్వముగను నిత్యసత్యము గాను

ప్రాంజలి కళ గీత శారదాంబ


సర్వ భూత దయయు సంతుష్టి మృధు భాష

నైదు గుణము లున్న వైపరీత్య

ప్రజ్ఞ మైత్రి బుద్ధి ప్రతిభ ఫలత్వము

ప్రాంజలి కళ గీత శారదాంబ


వర్జితుడను కళలు వాసనా రహితుఁడు

త్యాజ్య గ్రాహ్యభావనామదిగను 

మృధు మధుర మృధుత్వ ముత్యమై గుణము గా 

ప్రాంజలి కళ గీత శారదాంబ


 సతుల దృష్టి పతులు సంసారపు గతులి 

 తెలివి లేని వారు తిప్పల బడు 

 కాదనగలిగేటి కార్యము లేదులె

ప్రాంజలి కళ గీత శారదాంబ


ధైర్య వంతులేన ధర్మము తప్పినా

 పట్టి ఊగెదరులె పలుకు బట్టి 

 నిలుచు పతులు సతులు నిత్యమొకటి పోరు

ప్రాంజలి కళ గీత శారదాంబ


ప్రాణము మనసు విధి ప్రాధాన్యత చదువు

కాల నిర్ణయమ్ము కల్పితమగు 

అహము తోడు నీడ అజ్ఞాన దేహమై

ప్రాంజలి కళ గీత శారదాంబ


అచట నిచట జూడ నమరదు గురుభక్తి 

ప్రచురముగను నాత్మ బయలజేసి 

రుచిరముగను జూడ నచలమై తోచులే 

ప్రాంజలి కళ గీత శారదాంబ


చెప్ప చేయ కుండ చేష్టలే అల్పుడు

సమయ వ్యర్థ పరచ సంఘ జీవి

సజ్జన మది చేసి సంతృప్తి పర్చు టే

ప్రాంజలి కళ గీత శారదాంబ


జీవన సఫలతయె జీవి సంతసమగు

విధిగ వాంచ్ఛ తీర్చ విద్య తోడు

విశ్వ గురువు గాన విజయమే సుఖమగు

ప్రాంజలి కళ గీత శారదాంబ


ఘటము కలశమవదు ఘనకీర్తి నిలవదు

మరియు సూది కత్తి గాను మవదు

ఎదుగు చున్న వయసు ఎవ్వరాపనులేరు

ప్రాంజలి కళ గీత శారదాంబ 


అంబరమను విధి అంతుచిక్కని మది 

నిత్యమను ఉపాది నియమ దీక్ష 

 సోకని పరమాత్మ  శోభ లందించుటే 

ప్రాంజలి కళ గీత శారదాంబ


ఠీవి లేదటంచు డెందంబు లోనెంచి 

జ్ఞాని నెఱుగ లేని మానవుండు 

డాంబికునకు లొంగి డయ్యురా కడపట 

 ప్రాంజలి కళ గీత శారదాంబ


ఏనిముషము నీది ఏల చెప్పగ నేల

ఏది చదువు చావు ఏల చెప్ప

ఎరుక నెంచ గలుగు యదసృష్టి బ్రహ్మయే

సహన ప్రాంజలి కళ శారదాంబ


మనిషి చేయు చెడుయు మంచియూ బ్రతుకుకే

కర్మ చేయు శక్తి కాల మదియు

ఎదను తట్టు ఫలము ఎరుకపర్చెడి కళ

సహన ప్రాంజలి కళ శారదాంబ


ప్రేమ పూరిత మగు పేగు బంధమగుతే

తలపు లెన్ని నున్న తాను మార్చు

జనని బ్రతుకు నిచ్చి జగతి మాయలనుండి

సహన ప్రాంజలి కళ శారదాంబ 


మనకు ముక్తి నిచ్చు మనసుకళ్యాణమే

గడిచె గతము శాంతి గణిత గమన

పతి సతి గతి మతులు పండుగ కథలులే

సహన ప్రాంజిలికళ శారదాంబ 


పెళ్లి ముందు కళలు పెనవేయు కథలుగా

తరుణ సుఖము చేరి తపన బ్రతుకు 

నిత్య నూతనమ్ము నియమాలు మధ్యనే

సహన ప్రాంజలి కళ శారదాంబ


గుండె గుచ్చి గుచ్చి కూనలా అరుపే ల

ఆరటి పండు తొక్క ఆశ ఏల

ధనము దోచి కరుణ దాన మేల

సహన ప్రాంజలి కళ శార దాంబ


తాళిని ఎగతాళి బ్రతుకు తపనే ల

వేయు తాళము కోరిక వేగ మేల

తాను అలవాటు మురిపము దాన మేల

సహన ప్రాంజలి కళ శారదాంబ


గుట్టు రట్టు ఏను గుమ్మము దాటితే

ఆరు చెవుల మాట ఆట మొదలు

నాల్గు నలిగి పోయి నవ్వు ఏడ్పు

సహన ప్రాంజలి కళ శారదాంబ


సార మేది లేని సంసార మేలనో

చెడుగు డాడు టేల జగము నందు

నరక యాతననియు నమ్మ బలుకులేల 

సహన ప్రాంజలి కళ శారదాంబ


కాంత కనక సుఖము కాలము నేర్పుటే

క్షమయు కరుణ మనసు క్షామ మేల

లేత వయసు పరుగు లే ఇవియనె

సహన ప్రాంజలి కళ శారదాంబనేటి 


ఉషోదయ ఆటవెలది పద్యాలు

రచయత మల్లాప్రగడ రామకృష్ణ 


అడగ కుండ పలుకు అర్ధ అనర్ధమే

ఆశ చూప రాదు అహము యున్న

విద్య ఉన్న మౌన వినయమ్ము లోకంలొ

సహన ప్రాంజలి కళ శారదాంబ


గొప్ప కాదు అర్ధ గోప్యము మేలులే

లిఖిత హృదయ వాంచ్ఛ లేఖ కళయె

వ్రాయటమనె గుణము వాక్యమే అనుకోకు

సహన ప్రాంజలి కళ శారదాంబ


మాయ బంధ అవసరాలతో మెలికగా

కర్మ దేహ మార్పు కోరె సృష్టి

మాయమల విముక్తి మనసు స్థిరత్వము

సహన ప్రాంజలి కళ శారదాంబ


ఆది పరిణితియగు ఆటంక అబద్రత

స్వేచ్ఛ పరిధి లోన సత్య పలుకు

క్షణము కొత్తదనము క్షమ గుణమగుటయే

సహన ప్రాంజలి కళ శారదాంబ


వేప చెట్టు నరికి వేదన తోడుగా

చేదు అనుభవాలు చెలిమి నీడ

తీపి పలుకు కరువు తేరుకోని మనిషి

సహన ప్రాంజలి కళ శారదాంబ




 



( నిలువెల్ల డాంబికము, దర్పములతో ఉండే గురువును 

  గొప్ప స్వామిగ పరిగణించే పామర జనులు సాదా సీదా 

  జ్ఞానిని గుర్తించరు కదా ! ఈ రీతి స్వాముల డాంబికము 

  లో పడి అజ్ఞానులు నశించి పోవుచున్నారని భావం)


తల్లి నిన్ను తలచి తలపెట్టినానుగా

శతక మొకటి వ్రాయ సాహసముతొ

తప్పు దొర్లవచ్చు దండించకే తల్లి

సహన ప్రాంజలి కళ శారదాంబ 


మనిషి మంచి చెడులు మనసు ఆయుధములే

జీవి నరక సుఖము జగతి ఇచ్ఛ

స్వేచ్ఛ చిక్కు ముడిగ సీతకోక చిలకే

సహన ప్రాంజలి కళ శారదాంబ


వ్యక్తి చదవు విలువ వాక్కు తెలుపుటయే

భంగ కరము కాని బంధ మగుట

బుద్ధి సూక్ష్మతయి భుక్తి ముక్తి కొరకే

సహన ప్రాంజలి కళ శారదాంబ


వ్యక్తి స్థితిని చూసి వ్యక్తపరచుటేల

మట్టిలోన ఉన్న మాణిక్యమే యగు

రక్ష శక్తి తోడు రాయి రత్న మగుటే

సహన ప్రాంజలి కళ శారదాంబ


బ్రహ్మ రుద్ర వరము భయముగా బ్రహ్మ౦డ 

ధర్మ మందు నీదు దయయు లేక 

వట్టి దుష్ట బుద్ది మట్టిలో గలసిరీ

సహన ప్రాంజలి కళ శారదాంబ


సవతి తొడ నీవె జగదమాడక యుండి 

సర్దు కొనుచు నీవు సంగ మించి

నీదు పాఠమేను నేర్వదలచి నాము 

సహన ప్రాంజలి కళ శారదాంబ


నీదు గృపయె యున్న నిజమైన జ్ఞానమే

దక్కు శాంతి పలుకు దఖలు పడుట  

జదువఁ పాఠమివ్వ జగతినేలగలుగు  

సహన ప్రాంజలి కళ శారదాంబ


ఆది శక్తి గాను ఆనంద దాయిణీ

ఒకటి కాదు ఏన్నొ యొప్ప దలయొ 

ఆస్రి తులతొ చెలిమి ఆదర్శప్రాయమే

సహన ప్రాంజలి కళ శారదాంబ


వందనములు ఇవియు వాగ్దేవి రూపిణీ

భాష్య మేది రాదు బలము యున్న 

నీదు కృపయె మాకు నిక్కముగను

సహన ప్రాంజలి కళ శారదాంబ


ధవళ వస్త్రధారి దయగల తల్లివే

తెలుపు తలపు శాంతి తెలుపు రంగు    

శ్వేత వర్ణ మెపుడు చేకూర్చు అంబరం 

సహన ప్రాంజలి కళ శారదాంబ


ఎంత చదివితేమి యెన్ని నేర్చిన నేమి

నిన్ను గొల్వకున్న నిష్ఫలంబె ! 

మాకు నేర్పు విద్య మనసునీదు జననీ   

సహన ప్రాంజలి కళ శారదాంబ


గణన పొందుటకును గరుణించవలె నీవె

గమ్య మైన ప్రగతి కాల మిదియు 

సాకు మమ్మ మమ్మె సానుకూలత మది  

సహన ప్రాంజలి కళ శారదాంబ

కాచుకొనవ నిద్ర గాచుటకై మమ్ము

కాచుకొనగ మాకె కలుగు తెలివి

వలయు బోధ తోడ వదిలించి మా నిద్ర

సహన ప్రాంజలి కళ  శారదాంబ 


మాకు జ్ఞానమొసగు మంగళదాయినీ

విద్య నేర్చినపుడె వెలగ వెలుగు 

తగిన విద్య నేర్పితరుణము జూపుమా 

సహన ప్రాంజలి కళ  శారదాంబ


కళలు వేటికైన  కనగ యాధారమే 

నీవె యనగ వలయు నిక్కమెపుడుతల్లి 

ఆధరువులె లేక ఏది రాణించదె 

సహన ప్రాంజలి కళ  శారదాంబ


అరుణ వస్త్ర మనగ ఆనంద రూపమే 

అసుర సంహరణకు నదియె యొప్పు

రంగులేవియైన రంజిల్లు మా హృది

సహన ప్రాంజలి కళ  శారదాంబ


నీలి భుజములన్న నీడలా కళలగు 

వింత లేదు గాదె వేడ్క నీది 

ఆదరింతువీవు నన్నికాలములలో 

సహన ప్రాంజలి కళ  శారదాంబ


నీలి జంఘములన నీకది సాజము

రక్కసులను ద్రొక్క రంగు మార్చు 

వర్ణమేదియైన వదల నీ పాదమే 

సహన ప్రాంజలి కళ  శారదాంబ


నీదు పరిమళంబు నీవుమాకునురక్ష 

పుష్పములకు తోడు పూజ సమయ 

లేపనంబె జేర లెస్సయా గంధము

సహన ప్రాంజలి కళ  శారదాంబ


సౌమ్య మూర్తివీవె సౌకర్య మిచ్చితి 

పాపములను సేయు భక్తు లగుట 

పాదములను తాక పాపల మేమేము 

సహన ప్రాంజలి కళ  శారదాంబ


కనగ జగతి నెపుడు కనులు విశ్వమగుటే 

కాశి నందు నున్న గాంచ గలుగు 

అమ్మ పీఠమందు నందరికీ తృప్తి సాకు 

సహన ప్రాంజలి కళ  శారదాంబ


ధూమ్ర లోచనుడిని దునుమాడితివి తల్లి 

దుర్గుణములనట్లు ద్రుంచ గలవు

దూతలైన నేమి ధూర్తుల శిక్షించ

సహన ప్రాంజలి కళ  శారదాంబ


రక్తబీజు నడచి రక్షింప బుడమిని

నాలికంత జాచి   కాళికవలె

రుధిరమంత బీల్చి రూపుమాపితితల్లి 

సహన ప్రాంజలి కళ  శారదాంబ


అతివ యైన నేమి యబలనుకోరాదు

సమయమందు సమయ సమరమేను 

అసుర సోదరులనె యణచి చాటితి తల్లి 

సహన ప్రాంజలి కళ  శారదాంబ



నీదు రూపములకు నిదియొక భావము

ఫలము ఇచ్చు తల్లి పగలు రాత్రి 

సకల ఫలములకును స్థానమీవె 

సహన ప్రాంజలి కళ శారదాంబ 


తోడు నిలచినావు వీడక నెప్పుడూ

తోడు నీడ కాల నిర్ణయమ్ము 

ధాత నిన్ను తలచి తనకు సైదోడుగా

సహన ప్రాంజలి కళ శారదాంబ 


ఆది శక్తివైన యా వేల్పుకై నీవె

చదువులమ్మ గాగ మది తలంచి

ప్రియము చేయు మనసు ప్రేమనందించుటే

సహన ప్రాంజలి కళ శారదాంబ 


తరచ నింకనొక్క తన్మయం చేసేటి

గాథ నీదు మాకు గామితంబె

నిన్నె ధాత కిచ్చె నేమి మా భాగ్యంబొ

సహన ప్రాంజలి కళ శారదాంబ 


కాలకల్మషమది కళల ప్రభావము

కర్మ,ధర్మ,యోగ,  కామ్య భోగ

త్యాగసాధన లని తత్త్వబోధనలేల

సహన ప్రాంజలి కళ శారదాంబ   


ఎల్లవేళ లందు ఏల పరాచకమ్ 

కాల గమన మదియు కళలు అనకు

జ్ఞాన సంపదయని జ్ఞప్తి తెచ్చు కొనుట

సహన ప్రాంజిలికళ శారదాంబ


వ్యర్ధ  పలుకు లేల వ్యసన భాషణలేల

ఖర్చు చేయు టేల కాని దేల

లోన మందుగుండు లోకమందు  తిరుగు

సహన ప్రాంజలి కళ శారదాంబ


పాల పాత్ర వంటి ప్రాణ మిదియునులే

మీరు దాన్ని నిత్య ధ్యాన పరుచు

శాంతితోను నింపి సహజ అవ సరాలు

సహన ప్రాంజలి కళ శారదాంబ


నేను పాపి ననుట నాటక మగుటయే

దుఖితుడనెడి శక్తి దూర మగుట

అదియు చేయలేను ఆదుర్ద పడుటయే

సహన ప్రాంజలి కళ శారదాంబ


కర్మ బంధ నగుట  కాల నిర్ణయముయే

ఇంద్ర జాల మిదియు ఇష్ట మగుట 

గొలుసు వలెను మీరు  కొక్కాన్ని చిక్కుటే

సహన ప్రాంజలి కళ శారదాంబ 


కలత లేని వాడు కలిమిచే వెలయును

కలిమిలేనివాని కలలు దిగును

కలలు  కన్న భువిని కలిమి ఎక్కువ

సహన ప్రాంజలి కళ శారదాంబ


జప తపాదులన్నిచే తీర్థ యాత్రలై  

భగవత్ప్రాప్తి పొంద భయము వలదు

దేహ కష్ట పెట్ట సేవ లగుట

సహన ప్రాంజలి కళ శారదాంబ


అణు మాత్రమగుట నామ స్మరణ భక్తి . 

దేవ లోక శివుడు  దేవుడనుచు 

సర్వకాలమందు సరయమే తృప్తిగా 

సహన ప్రాంజలి కళ శారదాంబ


నేను దుఃఖితుడగు నైతెచ్చి పెట్టితి

నేను తలచుకొన్న నీదు సుఖము 

ధీరయువత శక్తి దేవతా గమ్యము 

సహన ప్రంజలి కళ శారదాంబ


చెదిరె సూర్య కిరణ  కేంద్రీకరించు టే

దీప్తి స్తాయి మనసు ఏకగ్రత

జ్ఞాన సాధనమ్ము కాల నిర్ణయముగా

సహన ప్రాంజలి కళ శారదాంబ


ఉపకరమగు జ్ఞాన ఉన్నత భావము

చిత్తము వలన కళ చేరు వగుట

తట్ట లోని ప్రకృతి తెలియగా జ్ఞానమే 

సహన ప్రాంజలి కళ శారదాంబ


మానవునిలొ మహిమ దివ్యమైనది శక్తి

యుగయుగాల నుండి యోగ మగుట

జీవి తాలు మార్చు జీవ సర్వ స్వాన్ని

సహన ప్రాంజలి కళ శారదాంబ


పరమ హంస గారి బోధన లన్నియు

ఆత్మ శక్తు లగుట  అంద రందు 

ప్రతి ఫలాన్ని  అనక ప్రగతినే కోరుట 

సహన ప్రాంజలి కళ శారదాంబ


క్రియల అవసరమ్ము కీలకమ్ము యగుట

క్రియ యోగమగుట కీర్తియేను 

గురువు ప్రధమ విద్య  గుర్తుగా జీవితం 

సహన ప్రాంజలి కళ శారదాంబ


మనిషి మాటలన్ని  మాయచే కూర్చుటా

స్వార్ధ బుద్ధి కలిగి సాకు చుండు

స్థాన బలిమి గాని సాధన కాదయా

సహన ప్రాంజలి కళ శారదాంబ


“ఈ శరీరమేను ఈశ్వర శక్తిగా 

రూపమగుట రాత్రి ఋణము పగలు

సర్వవ్యాపకమగు సమయ తృప్తి

ప్రాంజలి కళ గీత శారదాంబ


స్వయము గనెడి లెస్స సహజ సంతృప్తియే

ఆత్మ వెలుగు లీల ఆశ్రయ మగు 

ఆశ లేని తనము ఆరాధ్య దైవము

ప్రాంజలి కళ గీత శారదాంబ


ప్రకృతిగా సమత్వ ప్రతిభ యే  జ్ఞానము

నిష్క్రియత్వముగను నీడ యగుట

నిర్భయత్వముగను నిత్యసత్యము గాను

ప్రాంజలి కళ గీత శారదాంబ


సర్వ భూత దయయు సంతుష్టి మృధు భాష

నైదు గుణము లున్న వైపరీత్య

ప్రజ్ఞ మైత్రి బుద్ధి ప్రతిభ ఫలత్వము

ప్రాంజలి కళ గీత శారదాంబ


వర్జితుడను కళలు వాసనా రహితుఁడు

త్యాజ్య గ్రాహ్యభావనామదిగను 

మృధు మధుర మృధుత్వ ముత్యమై గుణము గా 

ప్రాంజలి కళ గీత శారదాంబ


 సతుల దృష్టి పతులు సంసారపు గతులి 

 తెలివి లేని వారు తిప్పల బడు 

 కాదనగలిగేటి కార్యము లేదులె

ప్రాంజలి కళ గీత శారదాంబ


ధైర్య వంతులేన ధర్మము తప్పినా

 పట్టి ఊగెదరులె పలుకు బట్టి 

 నిలుచు పతులు సతులు నిత్యమొకటి పోరు

ప్రాంజలి కళ గీత శారదాంబ


ప్రాణము మనసు విధి ప్రాధాన్యత చదువు

కాల నిర్ణయమ్ము కల్పితమగు 

అహము తోడు నీడ అజ్ఞాన దేహమై

ప్రాంజలి కళ గీత శారదాంబ


అచట నిచట జూడ నమరదు గురుభక్తి 

ప్రచురముగను నాత్మ బయలజేసి 

రుచిరముగను జూడ నచలమై తోచులే 

ప్రాంజలి కళ గీత శారదాంబ


చెప్ప చేయ కుండ చేష్టలే అల్పుడు

సమయ వ్యర్థ పరచ సంఘ జీవి

సజ్జన మది చేసి సంతృప్తి పర్చు టే

ప్రాంజలి కళ గీత శారదాంబ


జీవన సఫలతయె జీవి సంతసమగు

విధిగ వాంచ్ఛ తీర్చ విద్య తోడు

విశ్వ గురువు గాన విజయమే సుఖమగు

ప్రాంజలి కళ గీత శారదాంబ


ఘటము కలశమవదు ఘనకీర్తి నిలవదు

మరియు సూది కత్తి గాను మవదు

ఎదుగు చున్న వయసు ఎవ్వరాపనులేరు

ప్రాంజలి కళ గీత శారదాంబ 


అంబరమను విధి అంతుచిక్కని మది 

నిత్యమను ఉపాది నియమ దీక్ష 

 సోకని పరమాత్మ  శోభ లందించుటే 

ప్రాంజలి కళ గీత శారదాంబ


ఠీవి లేదటంచు డెందంబు లోనెంచి 

జ్ఞాని నెఱుగ లేని మానవుండు 

డాంబికునకు లొంగి డయ్యురా కడపట 

 ప్రాంజలి కళ గీత శారదాంబ


ఏనిముషము నీది ఏల చెప్పగ నేల

ఏది చదువు చావు ఏల చెప్ప

ఎరుక నెంచ గలుగు యదసృష్టి బ్రహ్మయే

సహన ప్రాంజలి కళ శారదాంబ


మనిషి చేయు చెడుయు మంచియూ బ్రతుకుకే

కర్మ చేయు శక్తి కాల మదియు

ఎదను తట్టు ఫలము ఎరుకపర్చెడి కళ

సహన ప్రాంజలి కళ శారదాంబ


ప్రేమ పూరిత మగు పేగు బంధమగుతే

తలపు లెన్ని నున్న తాను మార్చు

జనని బ్రతుకు నిచ్చి జగతి మాయలనుండి

సహన ప్రాంజలి కళ శారదాంబ 


మనకు ముక్తి నిచ్చు మనసుకళ్యాణమే

గడిచె గతము శాంతి గణిత గమన

పతి సతి గతి మతులు పండుగ కథలులే

సహన ప్రాంజిలికళ శారదాంబ 


పెళ్లి ముందు కళలు పెనవేయు కథలుగా

తరుణ సుఖము చేరి తపన బ్రతుకు 

నిత్య నూతనమ్ము నియమాలు మధ్యనే

సహన ప్రాంజలి కళ శారదాంబ


గుండె గుచ్చి గుచ్చి కూనలా అరుపే ల

ఆరటి పండు తొక్క ఆశ ఏల

ధనము దోచి కరుణ దాన మేల

సహన ప్రాంజలి కళ శార దాంబ


తాళిని ఎగతాళి బ్రతుకు తపనే ల

వేయు తాళము కోరిక వేగ మేల

తాను అలవాటు మురిపము దాన మేల

సహన ప్రాంజలి కళ శారదాంబ


గుట్టు రట్టు ఏను గుమ్మము దాటితే

ఆరు చెవుల మాట ఆట మొదలు

నాల్గు నలిగి పోయి నవ్వు ఏడ్పు

సహన ప్రాంజలి కళ శారదాంబ


సార మేది లేని సంసార మేలనో

చెడుగు డాడు టేల జగము నందు

నరక యాతననియు నమ్మ బలుకులేల 

సహన ప్రాంజలి కళ శారదాంబ

స్మృతియు నీదు భిక్షె స్మృతి రూపిణివి నీవె

జ్ఞాపకముల గతియు జ్ఞాని నీవె 

చూడు ఫలము సుంత చూపుకలుపు దేవి 


మనన సేయకున్న మతిని చేరదు విద్య

మనసు లేక ఉన్న మమత లేదు

కనుల శక్తి నీవు కామ్యతా భావమే  


కాంతుడైన నీకె కావలెగా చట్టు

కాని వారు లేరు కరుణ నీది

కావ్య చరిత నీది కరుణజ్ఞానివినీవు   


వ్యాసుడైన మరియు వాల్మీకి యైనను

నిన్ను గొలిచి గాద నిష్ఠ తోడ

జ్ఞానులైరి నీవె జ్ఞానంబు బంచగా


*🧘‍♂️79-ఉపనిషత్ సూక్తి 🧘‍♀️*

*108 ఉపనిషత్తులలో గల 108 మహా వాక్యములు*

*79. నకర్మణా నప్రజయా ధనేనత్యాగే నైకే అమృతత్వమానశుః||*

*(అవధూతోపనిషత్)* 

*- అమృతత్వమును కర్మచే పొందరు; సంతానముచేపొందరు;ధనముచే పొందరు. త్యాగముతో 


మాత్రమే అమృతత్వమును పొందుచున్నారు.*

*లోకా స్సమస్తా స్సుఖినోభవన్తు!*

........

*_Swami Vivekananda's Wisdom for Daily Inspiration - Apr 22._*

*_స్వామి వివేకానంద స్ఫూర్తి... రోజుకో సూక్తి - ఏప్రిల్ 22._*

The easiest way to make ourselves happy is to see that others are happy.*

*మనం సుఖంగా ఉండడానికి అత్యంత సులభమైన మార్గం ఇతరులు సుఖంగా జీవించేలా చేయడమే!*

........

*_THE AWAKENING_*

*Inspirational Quotes of Swami Vivekananda*

*All power is within you, do not believe that you are weak. You can do anything and everything.*

_*జాగృతి*_

*స్వామివివేకానంద స్ఫూర్తి వచనాలు*

*సమస్త శక్తి మీలోనే ఉంది. అసమర్ధులమని భావించకండి. మీరు ఏమైనా చేయగలరు. అన్నింటినీ సాధించగలరు

.......

*🧘‍♂️సంతోషం🧘‍♀️* 

*గుర్తుంచుకోండి-- మీరు విచారగ్రస్తులుగా ఉన్నారంటే , సాధారణంగా దానికి కారణం మీరు జీవితంలో సాధించదలుచుకున్న గొప్ప కార్యాలను దృఢంగా చిత్రీకరించుకోక పోవడం వల్లా, మీ సంకల్ప శక్తిన్, సృజనాత్మక సామర్ధ్యాన్ని , ఓర్పునూ మీ కలలు నిజమయే వరకూ పట్టుదలతో ఉపయోగించక పోవడం వల్లనేనని.*

*శ్రీ పరమహంస యోగానంద/యోగదా సత్సంగ పాఠాలు.*

........

*ॐ卐సుభాషితమ్ॐ*

*శ్రీ ఆదిశంకరాచార్య విరచితము భజగోవిందం*

*14) జటిలో ముండీ లుంఛితకేశః కాషాయాంబరబహుకృతవేషః|*

*పశ్యన్నపి చ న పశ్యతి మూఢః ఉదరనిమిత్తం బహుకృతవేషః ||*

*-జడలు ధరించినవాడై - గుండు కొట్టించుకున్నవాడై - జుట్టు కత్తిరించుకున్నవాడై - కాషాయవస్త్రములు ధరించినవాడై పొట్టనింపుకొనుటకు వివిధ వేషములు ధరించు మూర్ఖుడు చూస్తూ కూడ చూడనట్లుండును.*

..........


No comments:

Post a Comment