Friday, 24 April 2026


#తెలుగు-అక్షరాలు.


తెలుగు భాషకు అక్షరములుు 60 . వీటిని అచ్చులు, హల్లులు, ఉభయాక్షరములుగా విభజించారు.ఇరవై ఒకటవ శతాబ్దంలో బాగా వాడుకలో ఉన్నవి 56 .16 అచ్చులు, 41 హల్లులు, (్) పొల్లు , సున్న, అఱసున్న, విసర్గ 60 అక్షరములు. అఱసున్న, విసర్గ వాడకం చాలవరకూ తగ్గిపోయింది. తెలుగు వర్ణ సముదాయమును మూడు విధాలుగా విభజించవచ్చును.

♦#అచ్చులు

అచ్చులు 16 అక్షరాలు. స్వతంత్రమైన ఉచ్చారణ కలిగియుండుట వలన వీటిని ప్రాణములనీ, స్వరములనీ కూడా అంటారు. అచ్చులు మూడు రకములు. అవి:

♦#హ్రస్వములు - కేవలము ఒక మాత్ర అనగా రెప్పపాటు కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను హ్రస్వములు అంటారు. ఇవి ఏడు అక్షరములు: అ, ఇ, ఉ, ఋ, ఌ, ఎ, ఒ.

♦#దీర్ఘములు - రెండు మాత్రల కాలములో ఉచ్ఛరింపబడు అచ్చులను దీర్ఘములు అంటారు. ఇవి ఏడు అక్షరములు: ఆ, ఈ, ఊ, ౠ, ౡ, ఏ, ఓ.

♦#ప్లుతములు - ఇవి ఉచ్ఛరించడానికి మూడు మాత్రల కాలం పట్టును. ఇవి రెండు అక్షరములు: ఐ, ఔ.

♦#హల్లులు

హల్లులు 41 అక్షరములు. క నుండి ఱ వరకు గల అక్షరములను హల్లులు అంటారు. ఈ హల్లులు అచ్చుల సహాయము లేనిదే పలుకబడవు. ఉదాహరణ: క అనాలంటే క్ + అ కలిస్తేనే క అవుతుంది. వీటిని ప్రాణులనీ, వ్యంజనములనీ పేర్లు ఉన్నాయి.

♦#సరళములు - హల్లులలో సులభముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - .గ, జ, డ, ద, బ.

♦#పరుషములు - హల్లులలో కఠినముగా ఉచ్చరించబడేవి 5 అక్షరములు. ఇవి - క, చ, ట, త, ప

♦#స్థిరములు - పరుషములు, సరళములు కాక మిగిలిన హల్లులన్నియు స్థిరములు. ఇవి - ఖ, ఘ, ఙ, ఛ, ఝ, ఞ, ఠ, ఢ, ణ, థ, ధ, న, ఫ, భ, మ, య, ర, ఱ, ల, ళ, వ, శ, ష, స, హ, క్ష.

♦#స్పర్శములు - ఇవి క నుండి మ వరకు గల అక్షరములు. ఇవి ఐదు వర్గములుగా విభజింపబడినవి.

క వర్గము - క, ఖ, గ, ఘ, ఙ

చ వర్గము - చ, ౘ, ఛ, జ, ౙ, ఝ, ఞ

ట వర్గము - ట, ఠ, డ, ఢ, ణ

త వర్గము - త, థ, ద, ధ, న

ప వర్గము - ప, ఫ, బ, భ, మ

♦#ఉభయాక్షరములు

ఉభయాక్షరములు 3 అక్షరములు. సున్న, అరసున్న, విసర్గలు.


♦#సున్న - దీనిని పూర్ణబిందువు, నిండు సున్న, పూర్ణానుస్వారము అని పేర్లు ఉన్నాయి. అనుస్వారము అనగా మరియొక అక్షరముతో చేరి ఉచ్చరించబడుట. పంక్తికి మొదట, పదానికి చివర సున్నను వ్రాయుట తప్పు. అదే విధంగా సున్న తరువాత అనునాసికమును గాని, ద్విత్వాక్షరమును గాని వ్రాయరాదు. ఇవి రెండు రకములు.

♦#సిద్ధానుస్వారము - శబ్దముతో సహజముగా ఉన్న అనుస్వారము. ఉదాహరణ: అంగము, రంగు.

♦#సాధ్యానుస్వారము - వ్యాకరణ నియమముచే సాధించబడిన అనుస్వారము. ఉదాహరణ: పూచెను+కలువలు = పూచెంగలువలు.

♦#అరసున్న - దీనిని అర్ధబిందువు, అర్ధానుస్వారము, ఖండబిందువు అని పేర్లు ఉన్నాయి. ప్రస్తుతము ఇది తెలుగు వ్యావహారిక భాషలో వాడుకలో లేదు.

కానీ ఛందోబద్ధమైన కవిత్వంలో కవులు దీనిని వాడుతారు.

♦#విసర్గ - ఇది సంస్కృత పదములలో వినియోగింపబడుతూ ఉంటుంది. ఉదాహరణ: అంతఃపురము, దుఃఖము.

****

అంగన.. ఆడుది ,  అంగిక.. చొక్కా,, అంగజ... కూతురు, అంగము.. అందము 

అండజ.. పక్షి, పాము , అండము.. గ్రుడ్డు, అండియు.. శృంగము, అండెము.... పార్సపు భారం 

అంధము... వీణ , అంధిక..... జూదము, అంధువు.. నుయ్యి , అంధుడు.. గ్రుడ్డివాడు 

అంబరు.. సుఘంద ద్రవ్యము , అంబిక... పార్వతి, అంబువు.. ఉదకము, అంబలి... పిండి తో చేయు 

అకట...అచ్చట , అకము... పాపము, అకరు...తిట్టు, అఖిల...మొత్తం 

అగవ...  అలక , అగము.. కొండ చెట్టు, అగలు.. భేదిల్లు, అగవు.. కార్యము

అగురు.. వీరణము , అగులు.. ఊడు, అగిని..... అగ్ని, అగిసె.... అగునట్టి 

అడుగు... యాచించు , అడుపు... కొట్టు , అడుసు.. బురద, అడుకు... దొంతి 

అతివ... స్త్రీ, అతిధి.. చుట్టము, అతడు.. నామవాచకo, అతసి .. ఆమె 

అదక... పాతచెప్పు, అదను... సమయము, అదుపు... భయము, అదరు.. చలనము 

అరితి... ప్రేమము, అరిణ... దోనే, అరిమి... గొంతు వ్యాధి, అరుచి.. రుచిలేమి 

అరుణ... కపిల వర్ణం, అరులు... వత్సల్యం, అరువు.. ఋణము, అరుసు... ఆజ్ఞ 

అలము... ఆక్రమించు, అలయు... శ్రమపడు, అలరు.. వికసించు, అలవి.... కొలది 

అసరు... ఆకుపసరు, అసలు..మూలధనం, అసుర... రాత్రి, అసిమి... ఎద్దు మీద వేయు సంచి

రెక్క..మొక్క...చుక్క...లెక్క"* 

మ. కో.


రెక్క..లేగతి పక్షిగాస్థితి రిక్కరొక్కము పక్కగా 

మొక్క..లేగతి మేకతిండికి మొక్కులేయగు నెక్కుగా 

చుక్క..లేస్థితి రాత్రినందున చూపు లవ్వుట చక్కగా 

లెక్క"నాకగు తప్పకుండగ లిక్కరౌస్థితి దక్కగా 


సరళ భావము— పక్షికి రెక్కలుంటేనే అది ఎగరగలదు; స్వేచ్ఛ దాని స్వభావం.— మొక్క పెరిగితే మేకకు ఆహారం అవుతుంది; జీవజాల పరస్పరాధారత.— రాత్రిలో చుక్కలు మెరవడం దారి చూపినట్టు ఉంటుంది.— మనిషి తన జీవితానికి సరైన లెక్క తెలుసుకుంటే తప్పులు తగ్గుతాయి; స్థిరత్వం లభిస్తుంది.

****

ఉ. రెక్కలె పక్షిగాస్థితిని రీక్షణ బిడ్డల ప్రేమ తోడుగాన్ 

మొక్కలె పువ్వు కాయలగు మేలు యహారము నిత్య కాలమున్ 

చుక్కలె రాత్రులందున స చూపుల కాంతులు చక్కగాయగున్ 

లెక్కలె నాదుజీవనము లీల సువిద్యల దక్కగ కాల వైభవమ్ 

భావం:

రెక్కలు పక్షికి ఆధారమైతే, పిల్లలకు ప్రేమ ఆధారం.

మొక్కలు పువ్వులు, కాయలు ఇచ్చి జీవనానికి ఆహారమవుతాయి.

చుక్కలు రాత్రికి కాంతినిస్తాయి.

అలాగే లెక్కలు (జ్ఞానం/గణితం/వ్యవస్థ) జీవనాన్ని సక్రమంగా నడిపించే విద్యావైభవం.

*****

శి. శివుని సౌమ్య లీలతత్త్వము జీవదీపిక సాధ్యమై

శి. శివుని లక్ష్యము చిత్తశుద్ధిగ శీఘ్రమార్గము దర్శిగన్

ర. రవపు మాన్యులు ప్రేమగా సహరమ్యతాభవ ధర్మమున్

ము. మువ సుధామృత మానవత్వము సూత్రమేయగు మేలుగన్॥

భావం:

శివుని సౌమ్యలీలలు జీవనానికి దీపికలవంటివి.

చిత్తశుద్ధి శివసాధనకు శీఘ్రమార్గం.

ప్రేమతో కూడిన సత్సంబంధాలే ధర్మసౌందర్యం.

మానవత్వమే అమృతసూత్రంగా మనుగడకు మేలును అందిస్తుంది

*****

🙏 పాదాది న్యస్తాక్షరి : శి – శి – ర – ము తరళము 

శివుని సన్నిధి చింతనాసుఖ శిక్ష శాంతిగ మేలుగన్

శివుని చిత్తము కోరికేయగు శీ ఘ్ర శుభ్ర మనస్సుగన్ రవిగుణారమణీయమార్గమురాగ కాలపు దోషమున్ 

మువగ మౌనపునందమే సహముక్తిగాను సుధామృతమ్ ॥


సరళ భావము

శివుని సన్నిధిని చింతించడం ఒకఆనందవిద్య;అది మనసుకు శాంతిని ప్రసాదిస్తుంది.శివచిత్తం అంటే — కోరికలను విడిచిన శుభ్రమైన మనస్సు.సూర్యుని గుణంలా ప్రకాశించే సద్గుణ మార్గంలో నడిచితే

రాగద్వేషాల కాలదోషాలు తొలగిపోతాయి.అలా మౌనానందంలో మునిగితే

అదే సహజముక్తి —అమృత స్వరూపమైన అనుభూతి. 

****