Monday, 18 April 2022

19-04-2022

****

 *కృష్ణం వందే జగద్గురుం * *అచ్యుతాష్టకం... తాత్పర్యముతో*


అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరిమ్ |

శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీనాయకం రామచంద్రం భజే || 1 ||


అచ్యుతం కేశవం సత్యభామాధవం మాధవం శ్రీధరం రాధికా రాధితమ్ |

ఇందిరామందిరం చేతసా సుందరం దేవకీనందనం నందజం సందధే || 2 ||


విష్ణవే జిష్ణవే శంఖినే చక్రిణే రుక్మిణీ రాహిణే జానకీ జానయే |

వల్లవీ వల్లభాయార్చితా యాత్మనే కంస విధ్వంసినే వంశినే తే నమః || 3 ||


కృష్ణ గోవింద హే రామ నారాయణ శ్రీపతే వాసుదేవాజిత శ్రీనిధే |

అచ్యుతానంత హే మాధవాధోక్షజ ద్వారకానాయక ద్రౌపదీరక్షక || 4 ||


రాక్షస క్షోభితః సీతయా శోభితో దండకారణ్యభూ పుణ్యతాకారణః |

లక్ష్మణోనాన్వితో వానరైః సేవితో అగస్త్య సంపూజితో రాఘవః పాతు మామ్ || 5 ||


ధేనుకారిష్టకా‌உనిష్టికృద్-ద్వేషిహా కేశిహా కంసహృద్-వంశికావాదకః |

పూతనాకోపకః సూరజాఖేలనో బాలహోపాలకః పాతు మాం సర్వదా || 6 ||


బిద్యుదుద్-యోతవత్-ప్రస్ఫురద్-వాససం ప్రావృడమ్-భోదవత్-ప్రోల్లసద్-విగ్రహమ్ |

వాన్యయా మాలయా శోభితోరః స్థలం లోహితాఙ్-ఘిద్వయం వారిజాక్షం భజే || 7 ||


కుంచితైః కుంతలై భ్రాజమానాననం రత్నమౌళిం లసత్-కుండలం గండయోః |

హారకేయూరకం కంకణ ప్రోజ్జ్వలం కింకిణీ మంజులం శ్యామలం తం భజే || 8 ||


అచ్యుతస్యాష్టకం యః పఠేదిష్టదం ప్రేమతః ప్రత్యహం పూరుషః సస్పృహమ్ |

వృత్తతః సుందరం కర్తృ విశ్వంభరః తస్య వశ్యో హరి ర్జాయతే సత్వరమ్ || 9 ||

***

*తాత్పర్యము:

నాశనము లేనివాడు, కేశవుడు, రాముడు, నారాయణుడు, దామోదరుడు, వాసుదేవుడు, హరియు, శ్రీధరుడు, మాధవుడు, గోపికావల్లభుడు జానకీనాయకుడైన రామచంద్రుని భజింతును.

శాశ్వతుడు, అందమైన ముంగురులు కలవాడు, సత్యభామాపతి, మాధవుడు, శ్రీధరుడు, రాధికకు ఆరాధ్యుడు, లక్ష్మీదేవికి నివాసమైనవాడు, వర్ణింపశక్యం కాని మనస్సుందరుడు, దేవకీదేవికి ఆనందము కలుగజేయు ఆశ్రీకృష్ణుని నేను ధ్యానింతును.

సర్వము వ్యాపించినవాడు, జయశీలుడు, శంఖము, చక్రము కలవాడు,రుక్మిణిని రామావతారమున సీతాదేవిని అలరించినవాడు, గోపికా వల్లభుడై వారిచే పూజలందుకొన్నవాడు, కంసుని సంహరించిన వాడు, మురళీనాదము చేయుచూ ఆత్మానంద స్వరూపుడై విరాజిల్లుతున్న ఓ స్వామి నీకు నా వందనములు.

హే కృష్ణా! గో, భూ రక్షణ చేసి గోవిందుడివైతివి, రాముడివైతివి, నారాయణుడివైతివి, లక్ష్మీపతివి, అన్నిటా వశింసువాడవు. అపజయము లేని వాడవు, నాశనము లేనివాడవు, ఆద్యంతములు లేనివాడవు,

మాధవుడవు, ఊర్థ్వరూపుడవు, ద్వారకా నాయకుడవు, ద్రౌపదిని రక్షించినవాడవు.

రాక్షసులను సంహరించినవాడు, సీతతో శోభించిన వాడు, దండకారణ్యం భూమిని పవిత్రం చేసినవాడు లక్ష్మణుడితో కలిసిన వాడు వానరులచే సేవింప బడినవాడు, ఆగస్త్య మహర్షి పూజించబడిన వాడు అగు రాముడు నన్ను రక్షించు గాక.

ధేనుకాసురుని సంహరించిన వాడు, ద్వేషించువారిని నాశనం చేయువాడు, కేశి అనే రాక్షసుని-కంసుని చంపినవాడు వేణుగానం చేయువాడు, పూతను అంతమొందించినవాడు కాళీయుని మర్దించి ఆనందింపచేసిన వాడు ఆ బాలగోపాలుడు నన్ను ఎల్లప్పుడూ రక్షించుగాక.

మెరుపువలె మెరయుచున్న వస్త్రములు ధరించిన వాడు, వర్షాకాలపు మేఘం వలె అందమైన శరీరం కలవాడు, తులసిమాలతో అలంకరింపబడిన వక్షస్థలం కలవాడు, ఎర్రని పాదములు కలవాడు, పద్మ నేత్రుడు అగు దేవుణ్ణి సేవించుచున్నాను

వంకరలు తిరిగిన జుట్టుతో అందమైన ముఖము కలవాడు, సుందరమైన శిరస్సు కలవాడు, చెంపలపై ప్రకాశించు కుండలములు కలవాడు, హారములు - కేయూరములు - కంకణములు - గజ్జెలు ధరించిన వాడు, నల్లనివాడు అగు దేవుణ్ణి సేవించుచున్నాను

ఇష్టములను తీర్చునది, మంచి వృత్తము నందు (స్రగ్విణీ) రచించబడినది, పరమాత్ముని తెలియజేయునది అగు ఈ "అచ్యుతాష్టకము"ను ఎవరైతే భక్తితో ప్రతిదినము పఠించునో వారికి వెంటనే హరి ప్రసన్నుడగును.

సేకరణ...Mallapragada ramakrishna, Pranjali Prabha  

***

*ఓం నమః శివాయ*: *శ్రీ ఆది శంకరుల విరచిత* *శ్రీ దక్షిణామూర్తి అష్టకం- తాత్పర్యము*


*1.విశ్వందర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం*

*పశ్యన్నాత్మని మాయయా* *బహిరివోద్భూతం* *యధానిద్రయా*

*యస్సాక్షాత్కురుతే* *ప్రభోధసమయే స్వాత్మానమే* *వాద్వయం*

*తస్మై శ్రీగురు మూర్తయే* *నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!*


*ఈ విశ్వము అద్దములో కనిపించే ప్రతిబింబము వంటిది. నిజమే బ్రహ్మము. బ్రహ్మమునకు రెండవది లేదు. మనస్సు, ఇంద్రియములు, బుద్ధి కేవలం ఆత్మ యొక్క ప్రతిబింబమును మాత్రమే గ్రహించ గలుగుతున్నవి. స్వయం ప్రకాశము (సాక్షాత్కారము) పొందిన పిమ్మటే ఆత్మ, బ్రహ్మ యొక్క గోచరమగును. ఈ సాక్షాత్కారమునకై శ్రీ గురు స్వరూపుడైన దక్షిణామూర్తికి నా నమస్కారములు.*


*2.బీజస్యాంతతి వాంకురో జగదితం ప్రాఙ్నర్వికల్పం పునః*

*మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్రచిత్రీకృతం*

*మాయావీవ విజృంభ త్యపి మయా* *యోగేవయః స్వేచ్ఛయా*

*తస్మై శ్రీగురు మూర్తయే* *నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!*


*వృక్షము మొలచుటకు ముందు బీజరూపమున నిక్షిప్తమై ఉన్నట్టు, ఈ విశ్వము కూడా తనయందు అటులనే కలిగిన ఆయనకు, తన మాయచే, యోగుల వంటి సంకల్పముచే విశ్వమును అనేక రూపములలో సృష్టించిన, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.*


*3.యస్యైవ స్ఫురణం సదాత్మకం అసత్కల్పా ర్థకం భాసతే*

*సాక్షాత్తత్వమసీతి వేదవచసాయో బోధయత్యాశ్రితాన్*

*యస్సాక్షాత్కరణాద్భవేన్నపురనావృత్తిర్భవాంభోనిధౌ*

*తస్మై శ్రీగురు మూర్తయే* *నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!*


*ఎవరి ప్రకాశముచే ఈ మాయా ప్రపంచము నిజముగా కనిపిస్తున్నదో, ఆయన, ఆత్మ జ్ఞానము పొంద గోరు వారికి వేదముల సారము (తత్త్వమసి) ద్వారా పరబ్రహ్మ తత్త్వమును బోధిస్తున్నాడు. ఈ సంసార సాగరాన్ని అంతము చేసే, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.*


*4.నానాచ్ఛిద్ర ఘటోదర స్థిత మహాదీప* *ప్రభాభాస్వరం*

*జ్ఞానం యస్యతు* *చక్షురాదికరణ* *ద్వారా బహిస్పందతే*

*జానామీతి తమేవ* *భాంతమనుభాత్యేతత్సమస్తంజగత్*

*తస్మై శ్రీ గురు మూర్తయే* *నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!*


*ఎవరి ప్రకాశము ఇంద్రియముల ద్వారా కుండలో ఉన్న వెలుగు దాని రంధ్రముల ద్వారా వెలువడినట్లు వెలువడునో, ఎవరి జ్ఞానము వల్లనే నేనే బ్రహ్మ అను జ్ఞానము కలుగునో, ఎవరి ప్రకాశము వలన విశ్వమంతా ప్రకాశించునో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.*


*5.దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించశూన్యం విదుః*

*స్త్రీ బాలాంధ జడోపమాస్త్వహ మితి భ్రాంతాభృశం వాదినః*

*మాయాశక్తి విలాస కల్పిత మహావ్యామోహ సంహారిణే*

*తస్మైశ్రీ గురుమూర్తయే* *నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!*


*కొంత మంది తత్త్వవేత్తలు శరీరము, ఇంద్రియములు, ప్రాణము, శ్వాస మరియు శూన్యమును ఆత్మగా వాదిస్తున్నారు. అది జ్ఞానము లేని స్త్రీలు, పిల్లలు, గుడ్డివారు, బలహీనుల వాదన కన్నా లోకువైనది. మాయ వలన కలిగే భ్రాంతిని తొలగించి సత్యమును తెలియచేసే, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.*


*6.రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్ఛాదనాత్*

*సన్మాత్రః కరణోప సంహరణతో యో భూత్సుషుప్తః పుమాన్*

*ప్రాగస్వాప్సమితి ప్రభోద సమయే యః ప్రత్యభిజ్ఞాయతే*

*తస్మై శ్రీగురుమూర్తయే* *నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!*


*రాహువు వలన గ్రహణ సమయమున కాంతి తగ్గినట్టు కనిపించినా, సూర్య తేజము ఎల్లప్పుడూ అంతే ప్రకాశముగా యుండును. అటులనే, బుద్ధి యొక్క పూర్ణ శక్తి తన శక్తిని కోల్పోకుండా, కేవలము నిద్రావస్థ యందు నిద్రాణమై యుండును. ఇదే విధముగా, ఆత్మ ప్రకాశము కేవలం మాయచే కప్పబడి యుండును. ఎలాగైతే నిద్రనుండి మేల్కొనిన వ్యక్తి తాను అంతకుముందు నిద్రలోయున్నాను, మరియు ఆ నిద్రలోని స్వప్నములు నిజము కావని గ్రహిస్తాడో, అలాగే, ఆత్మ ప్రకాశము పొందిన వ్యక్తి తన అంతకు మునుపటి అజ్ఞాన స్థితిని అసత్యముగా గ్రహిస్తాడు. ఎవరి అనుగ్రహము వలన ఈ ఆత్మ ప్రకాశము కలుగునో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.*


*7.బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తథాసర్వా స్వవస్థాస్వపి*

*వ్యావృత్తా స్వను వర్తమాన మహమి* *త్యంతస్స్ఫురంతం* *సదా స్వాత్మానం* *ప్రకటికరోతిభజతాం* *యోముద్రయా భద్రయా*

*తస్మైశ్రీగురుమూర్తయే* *నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!* 


*ఎవరి ఉనికి అయితే దేహము, బుద్ధి యొక్క వివిధ అవస్థల (దేహమునకు బాల్యం, యౌవనం, వృద్ధాప్యం; బుద్ధికి జాగ్రత్, చేతన, సుషుప్తా మొదలగునవి) వచ్చే మార్పులకు అతీతంగా ఉండునో, జ్ఞాన ముద్ర (అభయ హస్తమున బొటన వేలు, చూపుడు వేలు కలిపిన ముద్రను జ్ఞాన ముద్ర అంటారు) ద్వారా ఆత్మ జ్ఞానమును కలుగ జేసే, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.*


*8.విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామిసంబంధతః*

*శిష్యచార్యతయా తథైవ పిత్ర పుత్రాద్యాత్మనా భేదతాః*

*స్వస్నే జాగ్రతి వాయు ఏష పురుషో మయా పరిభ్రామితః*

*తస్మైశ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!* 


* ఎవరి మాయ వలన ఈ ప్రపంచమున చేతన, స్వప్నావస్థల యందు అనేక రూపముల అనుభూతి కలుగుతున్నదో (గురువు, శిష్యుడు, తండ్రి కొడుకు మొదలగునవి), శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.*


*9.భూరంభాం స్యనలోనిలోబర మహర్నాధోపిమాంశుః* *పుమాన్*

*నిత్యభాతి* *చరాచరాత్మక* *మిదం* *యస్మైచ మూర్త్యష్టకం*

*నాన్యత్కించ నవిద్యతే* *విమృశతాంయస్మాతత్పర స్వాదిభో*

*తస్మై గిరి మూర్తయే* *నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే!!* 


*ఎవరి సూక్ష్మ, అష్ట పరిణామములు (రూపాంతరములు) ఈ చరాచారమును సృష్టించుచున్నవో, ఎవరి అనుగ్రహము వలన ఈ సృష్టులు అన్ని అంతర్ధానమై ఆత్మయే బ్రహ్మము అను సత్యమును తెలుపబడుతున్నదో, శ్రీ గురు స్వరూపుడైన ఆ దక్షిణామూర్తికి నా నమస్కారములు.*


*10.సర్వాత్వమితి స్ఫుటీకృత మిదం యస్మాదముష్మిన్* 

*స్తవే తేనాస్వ* *శ్రవణాత్త దర్థ మననా ద్ధ్యానా చ్ఛ సంకీర్తనాత్*

*సర్వాత్మత్వ మహావిభూతి సహితం* *స్వాదీశ్వత్వం స్వతః*

*సిద్ధేత్తత్పురష్టధా* *పరిణతం చైశ్వర్య మవ్యాహతమ్!!*


*ఈ స్తోత్రము ఆత్మ యొక్క సర్వ వ్యాపకా తత్త్వమును తెలుపుచున్నది. దీని మననము, పఠనం, ధ్యానము వలన శిష్యుడు ఆత్మ సంయోగం చెంది, ఈ విశ్వము, ఆత్మ యొక్క ఏకత్వమును తెలుసుకొని ఎనిమిది పరిణామముల సారమగును. సంసార బంధములు, జనన మరణ ఋణములు తొలగించే, వట వృక్షము కింద ఆసీనుడై యోగులకు, మునులకు జ్ఞానోపదేశము చేసే వానిగా ధ్యానించ బడే, త్రిలోక వంద్యుడైన శ్రీ దక్షిణామూర్తికి నా నమస్కారములు.*

***





 *భౌతిక సంపదకు, నైతిక పురోగతికి మధ్య అభిలషణీయమైన సమతుల్యం ఉంటేనే వ్యక్తికి శాంతి, సమాజానికి అభ్యుదయం చేకూరుతుంది.*

*సంతోషమన్నది కొంతవరకు బాహ్య పరిస్తితుల మీద ఆధారపడుతుంది. కాని ఎక్కువగా ఆధారపడేది మానసిక వైఖరుల మీద. సంతోషంగా ఉండాలంటే మంచి ఆరోగ్యం, చక్కగా నిలకడయిన మనస్సు , వర్ధిల్లుతున్న జీవితం, సరయిన పని, కృతజ్ఞతాపూర్ణమైన హృదయం, ఆ తర్వాత---- అన్నిటి కంటే మిన్నగా -- వివేకం, అంటే ఈశ్వరుణ్ణి గురించిన జ్ఞానం ఉండాలి.*

*15) అంగం గలితం పలితం ముండం దశనవిహీనం జాతం తుండమ్|*

*వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచత్యాశాపిండమ్ ||*

*శరీరం క్షీణించినది , తలనెరసినది , దంతములు ఊడినవి, ముసలివాడై కర్రపట్టుకు నడుచుచున్నాడు. అయినా ఆశ వదులుటలేదు.*

...........

*🧘‍♂️334) యోగవాసిష్ఠ రత్నాకరము🧘‍♀️* 

....

యదాత్మని జగద్రామ తవేహ ప్రతిబిమ్బతి 

తదవస్త్వితి నిర్ణీయ మా తేనాగచ్ఛ రఞ్జనమ్‌.

ఓ రామచంద్రా! నీయంతఃకరణమున ఏయే జగత్పదార్థములు ప్రతిబింబించునో (స్ఫురించునో) ఆవియన్నియు మిథ్యయని నిశ్చయించి వానితోడ ఆసక్తి గలిగి యుండకుము.


చేతసి ప్రతిబిమ్బన్తి యే భావాస్తవ రాఘవ! రఞ్జయన్త్యన్యసక్తత్వాన్మా తే త్వాం స్ఫటికం యథా.

ఓ రాఘవా! నీ చిత్తమందు ఏయే పదార్థములు ప్రతిబింబించునో అవి నీకంటె వేఱైన ఉపాధియందు సంభవించుటవలన, ప్రతిబింబములు స్ఫటికశిలను రాగయుక్త మొనర్పజాలనట్లు నిన్నవి రాగయుక్తునిగ జేయకుండుగాక! 


జన్తోః కృతవిచారస్య విగలద్వృత్తిచేతసః

మననం త్యజతో జ్ఞాత్వా కించిత్పరిణతాత్మనః

.......

ఆత్మవిచారణ మొనర్చినవాడును, నశించిన చిత్తవృత్తి గలవాడును, బాహ్యాభ్యంతర జగత్తులను మిథ్యయని యెఱిఁగి వానిఁగూర్చిన మననమును 

త్యజించినవాడును, ఆత్మజ్ఞాన మెఱిఁగి ఆత్మ రూపమున పరిణామము జెందిన మనస్సు గలవాడునగు మనుజుని చిత్తము లెస్సగ శాంతినొందును.

.........

- దేవికి నమస్కారము. మహాదేవికి నమస్కారము. శివుడికి ఎల్లప్పుడును నమస్కారము.

లోకా: స్సమస్తా: స్సుఖినోభవన్తు!

........

*నైతిక వర్తనమే శ్రేష్ఠమార్గం. పుణ్యాత్ముడు చివరకు జయించి తీరుతాడు.

...........

*సత్యం, పవిత్రత, నిస్వార్థం; భూనభోంతరాల్లోని ఏ శక్తీ, ఈ సుగుణాలతో జాజ్వల్యమానంగా ప్ర

కాశించే వారి నీడనైనా తాకలేదు. విశ్వమంతా ఒక్కటై ఎదిరించినా, వారు ప్రతిఘటించగలరు.

...🧘‍♂️సంతోషం🧘‍♀️ 

అనంత పరమాత్ముని నవ్వు మీ చిరునవ్వు ద్వారా ప్రకంపించాలి. ఆయన ప్రేమ సమీరం మీ చిరునవ్వులను అందరి హృదయాలలో వ్యాపింపచేస్తుంది. వాటి ఉజ్జ్వలశక్తి ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది. 

16) అగ్రే వహ్నిః పృష్ఠేభానుః రాత్రౌ చుబుకసమర్పితజానుః|

కరతలభిక్షస్తరుతలవాసః తదపి న ముంచత్యాశాపాశః ||

-ముందు అగ్నిని వెనుక సూర్యుని ఉంచుకొని చలికాచుకొనుచూ, రాత్రులలో మోకాలుపై గడ్డమునుంచి , చేతులతో భిక్ష స్వీకరించుచూ , చెట్టుకింద నివసించువానిని కూడా ఆశాపాశం వదులుటలేదు.

**** 


భగవద్గీతా శ్లోకం:-

ఉద్ధరేదాత్మనాత్మానం

నాత్మానమవసాదయేత్

ఆత్మైవ హ్యాత్మనో 

బంధురాత్మైవ రిపురాత్మనః

(గీ. 06-05)

     విషయాలు దగులని చిత్తం చాతను, ఆత్మను ధరించెడి విపరీత చిత్తం చాతను ఆత్మ నాశనం చేసుకోవలదు, తన మనస్సే తనకు బంధువు, తన మనస్సే తనకు శత్రువు.

ఇదివరకు కొంత చదివాను. ఇంకా కొంత చదువుతాను. కాని ఏం ప్రయోజనం. నాలో ఉన్న నా శత్రువును గురించి తెలుసుకోలేకపోతున్నాను. 

01. ఇతరులను నిందించటం అలవాటయింది కాని, నా పాపపు కర్మలని (=దురిత కర్మలు) నిందించను. ఇతరులను చూసి నవ్వుకొంటుంటాను కాని, అనేక జన్మలనెత్తి, నరకాలలో పడి బాధలుపడే నా శరీరాన్ని చూసి నవ్వుకోను.

02. లోకులను చూసి కోపపడుతుంటాను గాని, నాలోపల ఉన్న కామము మొదలైన మాయగాళ్లయిన (=కాకరి) శత్రువుల మీద బాగా కోపం తెచ్చుకోను. విద్యా బోధన జరిగే - ఆ పవిత్ర ప్రదేశంలో (=ఆ-కడ) బుద్ధులు చెప్పి ఇతరులకు బోధిస్తుంటాను కాని, వివేకంతో (=తేకువ) నాలోపల ఉన్న హరిని తెలుసుకోలేను.

03. ఇతరుల దుర్గుణాలు ఎంచటానికి ఆసక్తి చూపించి అసహ్యించుకొంటాను కాని, మతిలో నా అసహ్యపు కోరికలు మానలేను. నా గతిగా శ్రీవేంకటేశుడిని చూసి బతికాను కాని, తరిగిపోతున్న నా కాలాన్ని (=తతిని) ఇన్నాళ్లదాక తలపోయలేదు.

........

నేటి హాస్యం 

ఒకమ్మాయి నాన్నతో వరండాలో  కూర్చుని వుండగా  ఆమ్మాయి బాయ్ ఫ్రెండ్ ఇంటికొచ్చాడు....

అమ్మాయి : "ఓహ్ ! యండమూరి వ్రాసిన 'ఇంట్లో నాన్నున్నాడు' అనే పుస్తకం తీసుకోడానికి వచ్చావా?

బాయ్ ఫ్రెండ్: "లేదు .... యుద్దనపూడి వ్రాసిన  'నీ కోసం.. నా నిరీక్షణ ఎక్కడ?' అనే బుక్ కోసం వచ్చాను?"

అమ్మాయి: " అలాగా !  ఆ బుక్ నాదగ్గరలేదు. గొల్లపూడివ్రాసిన "మామిడి చెట్టుక్రింద" వుంది. తీసుకెళ్లు"

బాయ్ ఫ్రెండ్: "సరే మధుబాబు వ్రాసిన 'అయిదు నిముషాల్లో ' బుక్ కాలేజ్ కి తేవటం మర్చిపోయాను" 

అమ్మాయి: "పరవాలేదు నేనుకాలేజ్కి మళ్లపూడి వ్రాసిన  'నీకోసం'బుక్ తప్పకుండా  తీసుకొస్తాను."

బాయ్ ఫ్రెండ్ వెళ్లిపోయాక... 

డాడ్: "అన్ని పుస్తకాలు చదవగలడా?"

అమ్మాయి: "చదవగలడు డాడీ అతను చాలా ఇంటెలిజెంట్"

డాడీ: "అలాగా మంచిది.. అయితే గంగాధర్ వ్రాసిన 'పెద్దోళ్లు వెధవలు కాదు' అనే పుస్తకాన్ని మాత్రం ఇవ్వటం మర్చిపోకు" ఎంత చెప్పిన తరగని ప్రేమ /కన్నా ప్రేమ 

**************************



🧘‍♂️335) యోగవాసిష్ఠ రత్నాకరము🧘‍♀️ 

1-78

దృశ్యం సంత్యజతో హేయముపాదేయ ముపేయుషః

ద్రష్టారం పశ్యతో దృశ్యమద్రష్టారమపశ్యతః.

తాజ్యమైనట్టి దృశ్యమును త్యజించివేయువాడును, గ్రాహ్యమగు ఆత్మను పరిగ్రహించువాడును, జీవుని (లేక మనస్సును) గూడ ఒక దృశ్యవస్తువుగ గాంచువాడును, ప్రకాశమగు చైతన్యమున కన్యముగ దేనిని గాంచనివాడునగు మనుజుని మనస్సు లెస్సగ శాంతి నొందును. 

1-79

జాగర్తవ్యే పరే తత్త్యే జాగరూకస్య జీవతః 

సుప్తస్య ఘనసంమోహమయే సంసారవర్త్మని.

మేలుకొని యుండదగిన ఆత్మతత్త్వ విషయమై మేలుకొనియుండువాడును మహాఅజ్ఞానమయమగు సంసారమార్గమున నిదురించువాడునగు మనుజుని చిత్తము మిగుల శాంతినొందును.

1-80

పర్యన్తాత్యన్త వైరాగ్యాత్సరసేష్వరసేష్వపి భోగేష్వాభోగరమ్యేషు విరక్తస్య నిరాశిషః.

సర్వదృశ్య సుఖములకును అవధియగు బ్రహ్మదేవుని సుఖము వఱకుగల సమస్త ప్రాపంచికసుఖములందును అత్యంత వైరాగ్యము గలిగియుండుటవలన, సరసములును అరసములునగు సమస్త పదార్థములందును భోగకాల పర్యంతమే రమ్యములుగ నుండు సమస్త భోగములందును విరక్తి గలవాడును, వానియం దేకోరిక లేనివాడునగు మనుజుని మనస్సు మిగుల శాంతి నొందును.

.....

- శర్వుడు సర్వ జగత్తునకు స్రష్ట, ధరించువాడు, హరించువాడును, విశ్వరూపత్వమును పొందుచున్నాడు.

లోకా స్సమస్తా స్సుఖినోభవన్తు!

..........

*ప్రతీ వ్యక్తి సొంత ఆదర్శాన్ని తీసుకుని, దానిని సాధించడానికి ప్రయత్నించాలి. తానెన్నటికీ సాధించే ఆశ లేని ఇతరుల ఆదర్శాలను ఆచరించడం కంటే, తను నమ్మిన ఆదర్శాన్ని సాధించే వరకు ప్రయత్నించడమే పురోగతికి ఖచ్చితమైన మార్గం.

*మీలో దాగి ఉన్న శక్తిలో మీకు తెలిసింది చాలా తక్కువ. అవధుల్లేని సముద్రంలా వ్యాపించి అనంతమైన శక్తి, దివ్యత్వాలు, మీకు ఆధారంగా ఉన్నాయి.

*మీకు హాని కలిగించుకోవడానికి కాని, లాభం కలిగించుకోడానికి కాని శక్తి మీలో ఉంది ..... మీరు సంతోషంగా ఉండదలుచుకోడానికి మీ కెవ్వరూ సంతోషం కలిగించలేరు. అందుకు దేవుణ్ణి నిందించకండి ! మీరు సంతోషంగా ఉండదలచుకుంటే మీ కెవ్వరూ దు:ఖమూ కలిగించలేరు... జీవితం ఎలా ఉన్నా దానికి కారకులము మనమే.


శ్రీ ఆదిశంకరాచార్య విరచితము భజగోవిందం

17) కురుతే గంగాసాగరగమనం వ్రతపరిపాలనమథవా దానమ్|

జ్ఞానవిహినః సర్వమతేన ముక్తిం న భజతి జన్మశతేన ||

గంగా - సముద్ర సంగమములలో స్నానంచేసినా , వ్రతములను ఆచరించినా , దానం చేసినాకూడా తత్త్వజ్ఞానం లేనివాడు వంద జన్మలైనా ముక్తి పొందడు.

......




*🧘‍♂️76-ఉపనిషత్ సూక్తి 🧘‍♀️*

*76. జీవన్నేవ సదాముక్తఃకృతార్ధో బ్రహ్మ విత్తమః||*

*(ఆత్మోపనిషత్)*

*- బ్రహ్మవిత్తముడు జీవించియున్నప్పుడే సర్వదా ముక్తుడు, కృతార్ధుడును అగుచున్నాడు.*

*లోకా స్సమస్తా స్సుఖినోభవన్తు!*

*మనం తలపెట్టిన ప్రతీ కార్యంలోను మెచ్చుకొనేవారు కొందరు, తప్పులెన్నేవారు కొందరు ఉంటారు.*

*బృహత్కార్యాలన్నీ బ్రహ్మాండమైన అవరోధాలను అధిగమించినప్పుడే సాధ్యమవుతా

*నీ ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం వర్తిస్తుంది. దేవుని శరణుజొచ్చి ఆయన పరిపూర్ణజ్ఞానంతో నీ చైతన్యాన్ని నింపుకో. ఆయన శక్తియందు ఉన్న భక్తి భావంలో నీ బలహీనతను కరిగిపోనియ్యి. దేవునికి విషయాలన్ని వివరించనక్కరలేదు, ఎందుకంటే నీవు మాట్లాడక ముందే నీకు ఏమి కావాలో ఆయనకి తెలుసు; నీవు అడగక ముందే ఇవ్వడానికి ఆయన సంసిధ్ధంగా ఉన్నాడు. ధ్యానంలో ఉన్నప్పుడు , ఆయన ఛాయాచ్ఛాదిత సాన్నిధ్యంలో ఉన్నానని, తల్లీన భావం తప్ప ఇంకే ఆలోచనా రానియ్యకు. ఈ విధంగా నీవు గ్రహణ శీలుడవై ఉంటే నీ శరీరం , మనస్సు, ఆత్మల్లోకి స్వస్థత ప్రవహిస్తుంది.*

*11) మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్కాలః సర్వమ్|*

*మాయామయమిదమఖిలం బుధ్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా ||*

*ధనము - జనము - యౌవనము చూచి గర్వపడకుము.వీటన్నిటినీ కాలము ఒక్కక్షణములో హరించును. మాయామయమయిన ఈ ప్రపంచమును విడిచి జ్ఞానివై బ్రహ్మపదము పొందుము.*

..........


     

No comments:

Post a Comment