స్వర్ణ రేఖలు..(41)
మనిషి ఎలా జీవించాలి గురువుగారు
కర్మణుసారం బుద్ది, జ్ఞానాను సారం కదలిక, గుణానుసారం జీవనమ్ అంతా మట్టి కుండ బ్రతుకు అన్నాడు రామమూర్తి
కారు నడుపుతున్న చిరoజీవితో
.వివరించండి గురువుగారు..
ఇప్పటికే నిండిన కుండ నిబ్బరంగా, స్థిరంగా ఉంటుంది. ఇంకా నిండుతున్న కుండ తన శబ్దం, కదలికల ద్వారా తన స్థితిని తెలియజేస్తుంది. కానీ ఖాళీగా ఉన్న కుండ చివరికి ఆకాశం వైపు తిరిగి, ఒక చినుకైనా పడాలని ఎదురు చూస్తుంది.
నిజమైన జ్ఞానంతో నిండిన మనిషి కూడా అలాంటి నిండిన కుండలాగానే ప్రశాంతంగా, వినయంగా, స్థిరంగా ఉంటాడు; అతడు ఆడంబరాన్ని ప్రదర్శించడు. ఇంకా నేర్చుకుంటున్న వ్యక్తి తన అపూర్ణతను ప్రదర్శనల ద్వారా లేదా అస్థిర ప్రవర్తన ద్వారా తెలియజేస్తాడు. జ్ఞానం లేని మనిషి మాత్రం ఎప్పుడూ మరింత నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటాడు — ఇదే మానవ స్వభావం.
అలాగే స్త్రీలు కూడానా ప్రేమ మనసుగా నిండినకుండా....
ఖాళీగా నుండక సహాయ సహకారం చేస్తూ దాహం తీరుస్తూ కదలిక కుండలా ఉంటుంది..
స్త్రీలు త్యాగానికి, నిస్వార్థ సమర్పణకు నిజమైన ధర్మనిధులు. వారు ఉదారహృదయాన్ని కలిగి ఈ లోకంలో శాంతితో జీవించడానికి ప్రయత్నిస్తారు. అయితే స్త్రీలు స్వయంగా దృఢసంకల్పంతో కార్యానికి దిగినప్పుడు, వారు కాళీమాతవలె శక్తివంతులై అత్యంత కఠినమైన కార్యాలనుకూడా సాధించగలరు.
స్త్రీలు త్యాగం, సహనం, కరుణ, సౌమ్యతలకు ప్రతిరూపాలు. కానీ పరిస్థితి కోరినప్పుడు అదే స్త్రీలు అపారమైన శక్తి, దృఢనిశ్చయాన్ని ప్రదర్శించగలుగుతారు.
చూడు బాబు స్త్రీ పురుషుల యేకము సర్వజగతికి మూలం
“స్వర్ణ రేఖలు”(42)
కారులో పోతున్నప్పుడు చిరంజీవికి ఒక ప్రశ్న అడగాలని ఆలోచన తో
గురువుగారు.– తప్పు, శిక్ష, రాజధర్మం గురించి బివారిస్తారా
1. తప్పు చేయడం మానవ సహజం –
తప్పును అంగీకరించడం మహత్తు.
మనిషి తప్పు చేయకుండా ఉండలేడు. కానీ
తప్పు చేశానని ఒప్పుకోవడం, దానిని సరిచేయాలనే మనసు కలగడం నిజమైన జ్ఞానం.
2. శిక్ష యొక్క ఉద్దేశ్యం ప్రతీకారం కాదు – సరిదిద్దడం.
రాజధర్మంలో శిక్ష అనేది కోపంతో ఇచ్చే దండన కాదు.
దోషిని మారుస్తూ ధర్మాన్ని నిలబెట్టే సాధనం.
3. సమయోచిత తెలివి జీవనరక్షకము.
కష్టకాలంలో ధైర్యం, ఆలోచన కలిసివస్తే
మరణం కూడా మార్గం విడిచిపెడుతుంది.
4. సేవాభావం హృదయాలను గెలుస్తుంది.
క్రూరమైన పులులు కూడా ప్రేమతో చేసిన సేవను గుర్తించాయి.
అయితే మనుషులు గుర్తించకపోవడం తగదు.
5. వినయం – సత్యం కలిసి ఉంటే కఠిన హృదయమూ కరుగుతుంది.
అహంకారంతో కాదు, వినయంతో చెప్పిన మాట
రాజుని హృదయాన్ని కదిలించింది.
6. రాజధర్మం – న్యాయం తోడు కరుణ.
రాజు కఠినంగా ఉండాలి, కానీ కఠినత్వమే ధర్మం కాదు.
తప్పు చేసిన వాడిలో మార్పు కనిపిస్తే క్షమించడం కూడా ధర్మమే.
7. పునరావకాశం జీవన సత్యం.
నిజాయితీ, సేవ, తెలివి ఉన్నవారికి
జీవితం మరో అవకాశం తప్పకుండా ఇస్తుంది.
స్వర్ణ రేఖ
“తప్పును అంగీకరించిన వినయం,
శిక్షను జ్ఞానంగా మార్చిన తెలివి, యోగం
రాజధర్మాన్ని కరుణతో నిలబెట్టిన న్యాయం –
పద్య భావం :
మనిషి చేసిన తప్పును వినయంతో అంగీకరించినప్పుడు అతని గొప్పతనం తెలుస్తుంది. శిక్షను భయంగా కాకుండా జ్ఞానంగా స్వీకరించి దాని ద్వారా తనను తాను మార్చుకునే తెలివి కలవాడే నిజమైన యోగి. అలాగే రాజధర్మం అనేది కఠిన న్యాయంతో పాటు కరుణను కలిపి ఉండాలి. ఈ మూడు — వినయం, జ్ఞానంగా మారిన శిక్ష, కరుణతో కూడిన న్యాయం — కలిసి మనిషి జీవితాన్ని రక్షించే మార్గదర్శక సూత్రాలుగా నిలుస్తాయి. ఇవే నిజమైన “స్వర్ణ రేఖలు.”
తే. గీ.
తప్పు ఒప్పిన వినయంబు తేజమగును
శిక్షయనునది జ్ఞానము చిత్తశుద్ధి
న్యాయ కరుణ ధర్మము జీవమార్గమగును
జీవన స్వర్ణరేఖల జీవయాత్ర.
భావం
తప్పు చేసినప్పుడు దాన్ని అంగీకరించే వినయం మనిషికి తేజస్సును ఇస్తుంది. శిక్ష అనేది శత్రుత్వం కాదు; అది మనిషిని జ్ఞానవంతునిగా మార్చి మనస్సును శుద్ధి చేసే సాధనం. న్యాయం, కరుణ కలిసిన ధర్మమే జీవన మార్గం. ఈ సూత్రాలే మనిషి జీవిత యాత్రను సురక్షితంగా నడిపించే స్వర్ణరేఖలు
స్వర్ణరేఖలు...(43)
రామమూర్తి కారు వేగంగా వెళ్తోంది. మధ్యలో చెక్‌పోస్ట్ వచ్చింది.
పోలీసు ఆపి అడిగాడు —
“బాబు, కారు కొత్తగా ఉంది. అన్నీ కాగితాలు ఉన్నాయా?”
రామమూర్తి నవ్వుతూ చెప్పాడు —
“అన్నీ ఉన్నాయి సార్. కారు పేపర్లు, లైసెన్స్ అన్నీ సక్రమంగా ఉన్నాయి.”
అంతలో ఒక పోలీసు,
“ఇవ్వాళ్టి టీవీలో చూసాం కదా, మీరు పంతులుగారే కదా?” అని అడిగాడు.
రామమూర్తి చెప్పబోతుండగా వారు మళ్లీ అన్నారు —
“మీ నిజాయితీ మాకు తెలుసు. అయినా విధి ప్రకారం చూడాలి.”
అన్నీ పరిశీలించారు. ఎలాంటి తప్పూ లేకపోవడంతో వారిని పంపేశారు.
కారు మళ్లీ బయలుదేరింది.
అప్పుడే గురువుగారు నవ్వుతూ అడిగారు —
“కొత్త కారుకి, కొత్త పెళ్లానికి తేడా ఏమిటో తెలుసా?”
చిరంజీవి అర్థం కాక నిశ్శబ్దంగా ఉన్నాడు.
అంతలో కారు ఒక్కసారిగా ఆగిపోయింది.
ఎందుకు ఆగిందో ఎవరికీ అర్థం కాలేదు. చిరంజీవికి కొంచెం భయం వేసింది.
అప్పుడే గురువుగారు అన్నారు —
“నా ప్రశ్నకు సమాధానం ఇదే.”
“కొత్త కారు అయితే ఎలా నడపాలో, దానికి ఏమి అవసరమో తెలుసుకొని జాగ్రత్తగా నడపాలి.
అలాగే కొత్త పెళ్లాం అయితే ఆమెకు స్వేచ్ఛ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి, అర్థం చేసుకోవాలి.”
రామమూర్తి చిరంజీవిని అడిగాడు —
“నీకు పెళ్లి అయిందా?”
“లేదు” అన్నాడు.
“సరే. కారు ఎలా పనిచేస్తుందో మెకానిక్‌లా తెలుసా?”
“రాదు.”
“అయితే తోస్తే కదులుతుందా?”
“తోసేవారు ఎవరుంటారు?” అన్నాడు చిరంజీవి.
గురువుగారు నవ్వుతూ —
“నేనున్నాను కదా! నువ్వు స్టీరింగ్ దగ్గర కూర్చో. రోడ్డు కొంచెం పల్లం ఉంది, కదులుతుంది.”
“మీ వల్ల కాదు” అన్నాడు చిరంజీవి.
గురువుగారు నవ్వి చెప్పారు —
“కావడి మోసిన చేతులు ఇవి. మల్లయుద్ధం చేసిన దేహం ఇది. ప్రయత్నం చేస్తే దారి దొరుకుతుంది.
అడగకపోతే అమ్మైనా అన్నం పెట్టదు కదా!”
చిరంజీవి స్టీరింగ్ దగ్గర కూర్చున్నాడు.
గురువుగారు తోశారు.
అంతే —
చైతన్య రథం మళ్లీ కదిలింది.
సూక్తి:
కొత్తది ఏదైనా — కారు అయినా, సంబంధం అయినా —
అర్థం చేసుకొని నడిపితేనే ప్రయాణం సాఫీగా సాగుతుంది.
తే. గీ.
కొత్త బండి నడిపె విద్య కోరుమనసు
కొత్త బంధము గౌరవం గొప్ప భవము
అర్థముగ జీవితమదియె మార్గమగును
స్వర్ణరేఖ యెల్లల జీవి సాగు గీత
సరళ భావం:
కొత్త కారు నడపడం నేర్చుకోవాలనే మనసు కావాలి.
కొత్త బంధానికి గౌరవం అనే గొప్ప భావం ఉండాలి.
అర్థం చేసుకుంటే జీవితం సరైన మార్గంలో నడుస్తుంది.
అదే ప్రతి జీవి ప్రయాణానికి స్వర్ణరేఖ.
స్వర్ణ రేఖలు…(44)
కారు నెమ్మదిగా ముందుకు సాగుతోంది.
ఎఫ్.ఎం రేడియోలో ఒక కవిగారు రచించిన పాట మెల్లగా వినిపిస్తోంది.
“నిజమేదియో కలయేదియో నిను జూడఁగా నెఱుగన్గదా…”
పాట నెమ్మదిగా కారంతా నింపుతోంది.
శేషు విని నవ్వాడు.
“ఎంత చక్కగా ఉంది సాహిత్యం… నాకు బాగానే ఉంది కానీ అర్థం కావడం లేదు,” అన్నాడు.
రామ్మూర్తి కొంచెం ఆవేశంగా అన్నాడు —
“అవును, ఎలా అర్థమవుతుంది నాయనా! ఆంగ్లపిచ్చిలో పడి అమ్మభాషను మరిచారు. మన దేశంలోనే బ్రతుకుతూ దేశసేవ చేస్తే ఎంత ఆనందం! ఇతర దేశాలకు వెళ్లి దినదిన గండంగా జీవిస్తూ కోట్లు సంపాదించడం దేనికి? అక్కడి వారికి ఊడిగం చేయటమే కదా! తక్కువ జీతమయినా తల్లితండ్రుల సేవలో ఉండే సుఖం అక్కడ దొరుకుతుందా?”
శేషు నిశ్శబ్దంగా విన్నాడు.
కొద్దిసేపటి తరువాత రామ్మూర్తి స్వరం నిదానమైంది.
“సరే… ఈ పాట భావం చెబుతాను విను,” అన్నాడు.
“మనకు ఎంతో ప్రీతిపాత్రమైన వారిని చూసినప్పుడు — ఇది నిజమా? లేక కలలా అనిపిస్తుంది.
మనసు ఆనందంతో నిండినప్పుడు అది నిజమా లేక అనుమానమా అన్నది కూడా తెలియదు.
ఎప్పుడో కనిపించిన ఆ మధురమైన నవ్వు ఎక్కడో మాయమైపోతుంది.
ఆ చిరునవ్వులో ప్రేమ ఉందో, చిన్న కోపముందో కూడా వెంటనే అర్థం కాదు.
సముద్ర అలపై కనిపించే తెల్లని నురుగు ఎంత అందంగా ఉంటుందో — అలాగే మనకు ప్రియమైన వారి సౌందర్యం మెరిసిపోతుంది.
అది ధృవతారలా ప్రత్యేకంగా కనిపిస్తుంది.
మన హృదయం ఎప్పుడో ఆనందంతో వికసిస్తుంది… ఎప్పుడో బాధతో విరిగిపోతుంది.
అది అంతా విధి వ్రాసినదా అనిపిస్తుంది.
మన కళ్లలో కనిపించే కథ తీపిగా ఉందో, కఠినంగా ఉందో కూడా తెలియదు.
పర్వతాలపై ప్రతిధ్వనించే గీతంలా ఆ భావం మనసులో మార్మోగుతుంది.
శరదృతువులో చంద్రకాంతి ఎంత మధురంగా ఉంటుందో, అలాగే మన ఆశలు మెరిసిపోతాయి.
కానీ చివరకు జీవితం ఒక యాత్ర మాత్రమే. మరణం కూడా ఆ యాత్రలో భాగమే.
అందుకే కవి అన్నాడు — ఇది అంతా మాయలాంటిదే.”
రామ్మూర్తి చిరునవ్వుతో అన్నాడు —
“ఇది ఒక మనసులో కలిగే అనుభూతి నాయనా…”
కారు నిశ్శబ్దంగా ముందుకు సాగుతోంది.
స్వర్ణ రేఖలు..(45)
జన్మజన్మల బంధం నిజమా అని అడిగాడు చిరంజీవి
విను చిరంజీవి విధాత సృష్టి ఎవ్వరికీ అర్ధంకాదు
*ప్రతిజీవికిఈ6విషయాలు జన్మకు ముందే నిర్ణయించబడతాయి*కర్మ ఫలము.
*భూమ్మీద జన్మించే ప్రతి మనిషి తలరాతనేది అతడు పూర్వ జన్మలో చేసినకర్మలనుఅనుసరించి ముందే లెక్కించబడి ఉంటుంది. ఒక వ్యక్తి గర్భంలోకి ప్రవేశించడం దగ్గర నుంచి అతడు మరణించే వరకు ప్రతి దానివెనుకకర్మఫలంఅనేదికచ్చితంగాఉంటుంది.
గత జన్మలో చేసిన పాపం పుణ్యాల ఫలాన్ని అదేజన్మలోఅనుభవించగా మిగిలిన కర్మ ఫలాన్ని ఆ జీవుడు మరో జన్మలో అనుభవించాల్సిఉంటుంది.అదిపాపమైనాకావచ్చు.. పుణ్యమైనా కావచ్చు..
ఆకర్మఫలంఆధారంగానేవిధిరాతఅనేదివ్రాయబడి ఉంటుంది. మనిషి జన్మించక ముందే ఈ ఆరు విషయాలు ముందే నిర్మించబడతాయి. వీటిని భూమి మీదకు వచ్చాక మార్చుకోవడం అనేది కుదరని పని మరి ఆ ఆరు విషయాలుఏంటోఇప్పుడు తెలుసుకుందాం.
1.పుట్టుక 2.జ్ఞానం 3.వివాహం 4.ఐశ్వర్యం 5.సంతానం 6.మరణం
1.పుట్టుక:-
మానవుని జన్మ ఎక్కడ ఏ విధంగా జరగాలి. ఎవరి కడుపున ఎలా పుట్టాలిఅనేదిగర్భంలోనికి ప్రవేశించకముందేనిర్ణయించబడి ఉంటుంది.
*అతడు గత జన్మలో చేసిన పాపపుణ్యాల ఆధారంగా ఈ జన్మలో ఎక్కడ ఎవరికి ఏ ఇంట్లో పుట్టాలి అనేది విధాత నిర్ణయిస్తారు. దీనిని ఎవరు మార్చలేరు.
*కొంచెం జాగ్రత్తగా గమనిస్తే కొంతమంది ధనవంతుల ఇంట్లో వారి పిల్లలుబుద్ధివిహీనంతోనూ అంగవైకల్యంతోనో పుడుతూ ఉంటారు. ఇంట్లో సకల సౌకర్యాలు ఉన్నఏదివారుఅనుభవించలేరు వారు గత జన్మలో చేసిన పాపపు కర్మలకు ఫలితంగా వారు ఈ జన్మలోఇలాజన్మించవలసి వచ్చింది. అది కర్మఫలం అంటే దీనిని ఎవరు మార్చలేరు.
2.జ్ఞానం:-
*ఇక రెండవది అతడు ఎంత బుద్ధిమంతుడు జ్ఞానంతో ఉండాలి అనేది ముందుగానే లిఖించబడి ఉంటుంది. ఒక గురువు తన శిష్యులు అందరికీ ఒకే విధంగానే జ్ఞానాన్ని పంచుతాడు. వారిలో ఒకరుమంచిగాచదువుకొని పెద్ద ఉద్యోగ సంపాదిస్తే మరొకరుమాత్రంమందమతి గానే ఉంటూ చెడు సహవాసాలకు అలవాటు పడిఅందరిచేతచీదరించుకుంటూ ఉంటాడు. ఒక వ్యక్తిత్వం జ్ఞానం అనేది అతడు గత జన్మలోచేసిన కర్మలఆధారంగానేనిర్ణయించబడి ఉంటాయి.
3.వివాహం:-
*ఇక మూడవది మన వివాహం ఎప్పుడు ఎలా ఎవరితో జరగాలి. అనేది ఆవిధాతముందేనిర్ణయిస్తాడు.
*అతని తలరాత ఆధారంగానే ఎటువంటి జీవిత భాగస్వామి అతని జీవితంలోకిరావాలి.ముందుగానే ఫిక్స్చేసిఉంటుంది దీనినిఎవరుతప్పించలేరు
4.ఐశ్వర్యం:-
*నాలుగవది అతని వద్ద ఎంత ధనం ఉండాలి ఆ వ్యక్తి ధనవంతుడిగా ఉండాలా లేకపేదవాడిగా ఉండాలని అతడు పూర్వజన్మలో చేసిన కర్మలఆధారంగానేనిర్ణయించబడిఉంటుంది.
కొంతమందికి ఎంత కష్టపడినా ఎన్ని వ్యాపారాలు చేసినా కలిసి రాదు .కొంతమంది పుట్టుకతోనేఐశ్వర్యవంతులుగా ఉంటారు. ఏ పని చేసినా బాగా కలిసి వస్తూ ఉంటుంది.ఇదంతా కర్మఫలం అనుసరించే జరుగుతూ ఉంటుంది.
5.సంతానం:-
*ఇక ఐదవది సంతానం ఒక వ్యక్తికి ఎంతమంది సంతానం కలగాలి. ఆ సంతానం ఎటువంటి వారై ఉండాలి. అనేది వాళ్లపాపపుణ్యాలనుబట్టి నిర్ణయింపబడిఉంటుంది.
6.మరణం:-
*ఇకఆరవదిమానవుడు మరణం అనేది ఎప్పుడూ ఎలాఏవిధంగాసంభవిస్తుంది అనే విషయం ముందుగానేనిర్ణయించబడి ఉంటుంది. అతడు రోగాలబారినపడిబాధపడుతూ మరణించాల లేక హాయిగా సహజ మరణం పొందాల.. లేక ప్రమాదం బారిన పడి మృతిఒడిలోకి చేరాలా అనేది ఆ వ్యక్తి గతజన్మలోచేసినకర్మలను బట్టినిర్ణయించబడిఉంటుంది.
స్వర్ణ రేఖలు (46)
చిరంజీవి కారు నడుపుతుండగా గురువుగారిని అడిగాడు.
చిరంజీవి:
“గురువుగారు… హితులు, సన్నిహితులు అంటే ఏమిటి? వివరించగలరా?”
గురువుగారు:
“నెమ్మదిగా కారు నడుపు బాబూ… ముందే చూడాలి.
ఇప్పుడు మన స్నేహితులను ఒక్కసారి గుర్తు చేసుకుందాం.”
కొద్దిసేపు ఆగి గురువుగారు గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు.
గురువుగారు:
“మన ఒక మంచి స్నేహితుడు ఇరవై సంవత్సరాల క్రితమే పోయాడు.
మరొకడు పదేళ్ల క్రితం.
ఇలా ఒక్కొక్కరు వెళ్లిపోయారు.”
చిరంజీవి:
“అది చాలా బాధగా ఉంటుంది గురువుగారు.”
గురువుగారు:
“అవును బాబూ.
ఒక్కొక్క స్నేహితుడు పోయినప్పుడు ఒక్కొక్క గాయం.
ఆ గాయాలన్నీ కలిసి వృద్ధాప్యంలో ఒక పెద్ద శూన్యతగా మారుతాయి.
డెబ్బై, డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో అది సహజం.”
చిరంజీవి:
“పిల్లలు ఉంటారు కదా గురువుగారు?”
గురువుగారు:
“పిల్లలు బాగానే ఉంటారు. గౌరవం కూడా ఉంటుంది.
కానీ వాళ్ళకు వాళ్ళ పనులు, వ్యాపకాలు ఉంటాయి.
స్నేహితుడితో ఉండే ఆ సరదా క్షణాలు వేరే.”
చిరంజీవి:
“అది నిజమే గురువుగారు.”
గురువుగారు:
“ఉదయం కాఫీ తాగేటప్పుడు
‘ఏరా బాగున్నావా?’ అని అడిగే స్నేహితుడు ఉండాలి.
ఒక పని వచ్చినప్పుడు
‘ఇది ఎలా చేయాలి?’ అని నమ్మకంగా అడగగలిగే మిత్రుడు ఉండాలి.
మంచి డాక్టర్ ఎవరని చెప్పగలిగే స్నేహితుడు ఉండాలి.”
కొద్దిసేపు నిశ్శబ్దం.
గురువుగారు:
“ఒక స్నేహితుడు ఒకసారి అన్నాడు –
‘నా భార్య చనిపోయిన తర్వాత నేను మొదటిసారి నీ ముందే ఏడ్చాను.
నువ్వు నన్ను ఓదార్చలేక… నాతో పాటు ఏడ్చావు.’
ఆ రోజు నాకు తెలిసింది –
స్నేహం అంటే ఒంటరితనాన్ని జయించడం అని.”
చిరంజీవి:
“చాలా గొప్ప మాట గురువుగారు.”
గురువుగారు:
“మరో స్నేహితుడు ఇలా అన్నాడు –
‘నా సమస్య ఎవరికి చెప్పలేదు.
కానీ నువ్వు వస్తే చెప్పగలనని అనిపించింది.
చావు భయం కాదు… ఒంటరిగా చావడం భయంగా ఉంది’ అన్నాడు.”
చిరంజీవి:
“అలాంటి మిత్రుడు ఉంటేనే ధైర్యం.”
గురువుగారు:
“అవును బాబూ.
డాక్టర్ దగ్గరకు వెళ్తుంటే
‘నేను కూడా వస్తా’ అని చెప్పే మిత్రుడు ఉండాలి.
ఒంటరితనం అనిపిస్తే
‘రా… ఇద్దరం కూర్చుని మాట్లాడుకుందాం’ అనేవాడు ఉండాలి.
‘ఏరా గుర్తొచ్చావు… ఎలా ఉన్నావు?’
అని అడిగే స్నేహితుడు ఉండాలి.”
చిరంజీవి:
“అది నిజమైన బంధం గురువుగారు.”
గురువుగారు:
“రాత్రి పదకొండు గంటలకు కూడా
‘నిద్ర పట్టడం లేదు రా… మాట్లాడాలి’ అని చెప్పగలిగే మిత్రుడు ఉంటే
అదే గొప్ప సంపద.
‘నేనున్నా రా… భయపడకు’ అనే మాటలో ఎంత ధైర్యం ఉందో తెలుసా?”
చిరంజీవి:
“అలాంటి స్నేహం వృద్ధాప్యంలో పెద్ద ఆధారం.”
గురువుగారు:
“అవును.
మన చివరి రోజుల్లో మనకు నిజమైన ఆసరా స్నేహమే.
కానీ చిన్న చిన్న మాటలతో,
ఇగోతో,
అనవసరమైన అహంతో
మంచి స్నేహాలను పాడుచేసుకుంటారు.”
చిరంజీవి:
“అది నిజంగా పెద్ద నష్టం.”
గురువుగారు:
“కొంతమందితో కలవకపోవచ్చు.
దానితో పెద్ద నష్టం లేదు.
కాని మంచి స్నేహితులను చిన్న కారణాలతో వదులుకుంటే
చివరికి ఎవరూ మిగలరు.”
చిరంజీవి:
“అది గుర్తుంచుకోవాలి గురువుగారు.”
గురువుగారు:
“అందుకే బాబూ…
మంచి స్నేహాన్ని చిన్న కారణాలతో పాడుచేసుకోకండి.
అది జీవితంలో అమూల్యమైన బంధం.”
స్వర్ణ రేఖలు.. (47)
చిరంజీవి కారు నడుపుతూనే అడిగాడు –
“గురువుగారు… వయసు అంటే ఏమిటి? వలపు అంటే ఏమిటి?
వాటిని ఆపలేమా?”
రామమూర్తి కొద్దిసేపు మౌనంగా ఉన్నాడు.
చెప్తే తప్పు… చెప్పకపోతే ఒప్పుకాదు అనిపించింది.
ఆ తర్వాత నెమ్మదిగా పలికాడు.
“బాబూ… వయసు అనేది కాలం వేసే గీత.
వలపు అనేది మనసు వేసే పూలదారి.
కాలం ఆగదు… వలపు ఆరదు.”
చిరంజీవి నవ్వుతూ అడిగాడు –
“అంటే ప్రేమకు వయసు అడ్డుకాదా గురువుగారు?”
గురువుగారు చిరునవ్వు నవ్వాడు.
“ప్రేమకు వయసు ఎక్కడుంది బాబూ!
మనసు కలిసిన చోటే అది పుడుతుంది.”
కొద్దిసేపటికి గురువుగారు సరదాగా అన్నాడు –
“సరదాగా వస్తావా… జ్ఞాపకాలు ఇస్తాను.
సరసంగా ఉంటావా… అనుభవాలు చెబుతాను.
మనసు తెరుస్తావా… ప్రేమ రహస్యాలు నేర్పుతాను.”
చిరంజీవి ఆసక్తిగా అడిగాడు –
“అది ఎలా గురువుగారు?”
గురువుగారు కిటికీ బయటకి చూస్తూ చెప్పాడు –
“మూడు ముళ్లు పడిన రాత్రి నుంచి
ఇద్దరి జీవితాలు ఒక్క దారిలో నడుస్తాయి.
దూరాలు దగ్గరవుతాయి.
మనసు తలుపులు నెమ్మదిగా తెరుచుకుంటాయి.
ఆమె నవ్వు ఉదయరాగంలా ఉంటుంది.
ఆమె చూపు వసంతగాలిలా తాకుతుంది.
మాటలు మెల్లగా సంగీతమవుతాయి.
ఆప్యాయత పెరిగితే
కౌగిలి ఒక భరోసా అవుతుంది.
ముద్దు ఒక మౌన భాష అవుతుంది.
రాత్రి పగలుతో కలిసినట్టుగా
ఇద్దరి జీవితం ఒక్కటవుతుంది.
చీకటిలో కూడా వెలుగు కనిపిస్తుంది.
ఆశలు దుప్పటిలా చుట్టుకొని
ఇద్దరూ ఒకరికి ఒకరు ఆసరా అవుతారు.
కోరికలు యజ్ఞాగ్నిలా వెలుగుతాయి.
ఆమె జుట్టు పరిమళం గాలిలా తాకుతుంది.
ఆమె అడుగులు సంగీతంలా వినిపిస్తాయి.
ఆమె కౌగిలిలో మనసు విశ్రాంతి పొందుతుంది.
అప్పుడు ప్రేమ
ఒక పాఠశాల అవుతుంది.
ఆమె ఒడిలోనే
జీవిత రహస్యాలు నేర్చుకుంటాడు మనిషి.”
చిరంజీవి నిశ్శబ్దంగా విన్నాడు.
చివరగా గురువుగారు అన్నాడు –
“బాబూ…
వయసు శరీరానికి వస్తుంది.
వలపు మాత్రం మనసులో పుడుతుంది.
శరీరం వృద్ధమవుతుంది…
ప్రేమ మాత్రం ఎప్పుడూ యౌవనమే.”
బాబు కారు ఆపు.. ఆపు. అన్నాడు రామ్మూర్తి..
ఏమన్నా చుట్ట, సిగరెట్టు త్రాగాల, నీవు తాగుతావా ఏంటి?
ఏదో కొ ద్దిగా అలవాటైనది దమ్ము పీల్చక పోతే...
ఆ పొతే ఆరోగ్యం బాగుపడుతుందా చెడి పోతుందా
నా కర్ధం కాలేదు చెప్పు అన్నాడు రామ్మూర్తి తో
పోనీ ఈరోజు ఈదినం దుమపానరహిత రోజు తెలుసా..తాతగారికి దగ్గు ఆపండి చుట్ట ఆపండి అంటూ కారు అపాడు చిరంజీవి
సశేషం
స్వర్ణ రేఖలు… (48)
“బాబు… కారు ఆపు… కాస్త ఆపు,” అన్నాడు రామమూర్తి.
చిరంజీవి కారు పక్కకు ఆపాడు.
చిరంజీవి:
“ఏమైంది గురువుగారు?”
రామమూర్తి చిరునవ్వు నవ్వాడు.
“ఏమీలేదు బాబూ… ఒక చిన్న అలవాటు.
కాస్త దమ్ము పీల్చాలి అనిపిస్తోంది.”
చిరంజీవి ఆశ్చర్యంగా చూశాడు.
చిరంజీవి:
“అంటే… మీరు కూడా సిగరెట్ తాగుతారా గురువుగారు?”
రామమూర్తి:
“అలవాటు అంటే అలవాటే బాబూ.
కొద్దిగా దమ్ము పీల్చకపోతే ఏదో లోపం ఉన్నట్టుగా అనిపిస్తుంది.
కానీ ఒక సందేహం మాత్రం ఉంది.”
చిరంజీవి:
“ఏమిటది గురువుగారు?”
రామమూర్తి:
“ఇది తాగితే ఆరోగ్యం బాగుపడుతుందా?
లేదా చెడిపోతుందా?
నాకు కూడా స్పష్టంగా తెలియదు.
కానీ వినేది మాత్రం చెడిపోతుందనే.”
చిరంజీవి నవ్వుతూ అన్నాడు.
చిరంజీవి:
“గురువుగారు… ఈ రోజు ఏ రోజు తెలుసా?”
రామమూర్తి:
“ఏ రోజు బాబూ?”
చిరంజీవి:
“ఈ రోజు ధూమపాన రహిత దినం అని ప్రచారం చేస్తున్నారు.”
రామమూర్తి కాసేపు ఆలోచించాడు.
రామమూర్తి:
“అలానా! అయితే ఒక ప్రశ్న బాబూ…
ఈ ధూమపానం ఎక్కడి నుంచి వచ్చింది?
ఎప్పటి నుంచి మొదలైంది?
మనుషులకు ఈ అలవాటు ఎవరు నేర్పారు?”
చిరంజీవి కొద్దిగా వివరించడం ప్రారంభించాడు.
చిరంజీవి:
“గురువుగారు… పొగాకు మొక్కలు మొదటగా
అమెరికా ఖండంలోని స్థానిక ప్రజలు ఉపయోగించేవారు.
అక్కడి గిరిజనులు పొగను ఒక ఆచారంగా,
కొన్ని వైద్య విధానాల్లో కూడా వాడేవారు.
తర్వాత పదహారో శతాబ్దంలో
యూరప్ దేశాలకు ఇది చేరింది.
అక్కడి నుంచి వ్యాపారంతో ప్రపంచమంతా పాకింది.
మన దేశానికి కూడా అదే కాలంలో వచ్చింది.
మొదట రాజసభల్లో, తర్వాత సామాన్యుల్లో అలవాటైంది.
కాలక్రమంలో సిగరెట్, బీడి వంటి రూపాల్లో విస్తరించింది.”
రామమూర్తి తల ఊపాడు.
రామమూర్తి:
“అంటే ఒకప్పుడు ఆచారం…
తర్వాత అలవాటు…
ఇప్పుడు వ్యసనం అయిందన్నమాట.”
చిరంజీవి:
“అదే గురువుగారు.
ఇప్పుడైతే వైద్యులు చెబుతున్నారు –
ధూమపానం శరీరానికి హానికరం అని.”
రామమూర్తి చేతిలో ఉన్న సిగరెట్ వైపు చూసి చిరునవ్వు నవ్వాడు.
రామమూర్తి:
“బాబూ…
మనిషి కొన్నిసార్లు
తెలుసుకున్నా అలవాటు వదలలేడు.
కానీ తెలిసిన తర్వాత వదిలితే
అదే నిజమైన విజయం.”
అని చెప్పి సిగరెట్‌ను మెల్లగా పక్కన పెట్టాడు.
రామమూర్తి:
“పోనీలే బాబూ…
ఇవాళ ధూమపాన రహిత దినమని చెప్పావుగా.11/3
ఈరోజైనా దీనికి సెలవు ఇచ్చేద్దాం.”
చిరంజీవి చిరునవ్వుతో కారు స్టార్ట్ చేశాడు.
కారు ముందుకు సాగింది…
మాటల్లో మరో స్వర్ణ రేఖ మెరిసింది. ✍️
.f. M..గీతం
దేవుడే దిక్కు! – ధూమపాన రహిత గీతం
పల్లవి :
పొగ పీల్చుట హానికరం – జీవనానికి ముప్పురా
సిగరెట్ బీడి దూరమైతే – సిరి సుఖాలు నిల్చురా
ఆరోగ్యమే ఆభరణం – ఆలోచించు మనసారా
విడువరా ఈ చెడు అలవాటు – వెలుగొందు బ్రతుకారా!
చరణం 1 :
సరదాగా మొదలైనది – అలవాటై పెరుగునురా
మెల్లగా మన జీవితం – మంటల్లో దహించునురా
వదలుటకు కష్టమైనా – ధైర్యంతో విడువరా
చావు దరి చేరకముందే – చైతన్యంతో మేల్కొరా!
చరణం 2 :
ఊపిరితిత్తులు క్షీణించి – ఊపిరే కష్టమవునురా
లోపల దాగిన రోగాలు – ఒక్కొక్కటి బయలుదేరునురా
వైద్యులు చెప్పు మాటలు – వినరా ఓ మనుష్యులారా
ఆరోగ్యమే జీవనసారం – ఆలోచించు సోదరులారా!
చరణం 3 :
ఎన్నో హెచ్చరికలైన – చెవిలో పడనివారికీ
చెడలవాటు విడువనివారికీ – దేవుడే దిక్కురా
నేడు నుంచే ప్రమాణం – పొగచుట్టు దూరమురా
నూరేళ్లు బ్రతకాలని – నిశ్చయమే మార్గమురా!
*****
స్వర్ణ రేఖలు.. (49)
“గురువుగారు! గద్ద (గ్రద్ద) గురించి ఐదు సూత్రాలు మనుషులకు కూడా వర్తిస్తాయని విన్నాను. వాటి అర్థం చెప్పగలరా?” అని వినయంగా అడిగాడు చిరంజీవి.
గురువుగారు చిరునవ్వుతో చెప్పారు: “అవును బాబూ! ప్రకృతిలోని ప్రతి జీవి మనకు ఏదో ఒక పాఠం చెబుతుంది. గద్ద జీవితం మనుషులకు ఐదు మంచి సూత్రాలు నేర్పుతుంది” అని వివరించడం ప్రారంభించారు.
మొదటిది – దూరదృష్టి.
గద్ద ఆకాశంలో చాలా ఎత్తులో ఎగురుతూ దూరంగా ఉన్న ఆహారాన్ని కూడా గమనిస్తుంది. దాదాపు ఐదు కిలోమీటర్ల దూరం వరకూ చూసే శక్తి దానికి ఉంటుంది. అలాగే మనిషి కూడా చిన్న విషయాలకే పరిమితం కాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పెద్ద లక్ష్యాలు పెట్టుకోవాలి.
రెండవది – ఒంటరిగా నిలబడే శక్తి.
గద్దలు ఎక్కువగా ఒంటరిగా ఎగురుతాయి. అవి గుంపులపై ఆధారపడవు. సరైన సమయం కోసం ఓపికగా వేచి చూసి ఒక్కసారిగా దూకి వేటను పట్టుకుంటాయి. అలాగే జీవితంలో లేదా వ్యాపారంలో మనిషి తన శక్తిపై నమ్మకం ఉంచుకుని సరైన అవకాశాన్ని గుర్తించాలి.
మూడవది – సవాళ్లను స్వీకరించడం.
తుఫాను వచ్చినప్పుడు చాలా పక్షులు దాక్కుంటాయి. కానీ గద్ద మాత్రం భయపడదు. ఆ గాలిని ఉపయోగించుకుని ఇంకా ఎత్తుకు ఎగురుతుంది. ఇదే మనకు పాఠం — సమస్యలు వచ్చినప్పుడు భయపడకుండా వాటిని అవకాశంగా మార్చుకోవాలి.
నాలుగవది – ప్రతికూలతను సహనంతో ఎదుర్కోవడం.
వయసు పెరిగే కొద్దీ గద్ద పాత ఈకలు రాలిపోతాయి. కొత్తవి రావడానికి కొంతకాలం బాధ పడుతుంది. అయినా ఓపికగా ఎదురు చూస్తుంది. అలాగే మన జీవితంలో కష్టాలు వచ్చినప్పుడు సహనంతో ఎదుర్కొంటే కొత్త అవకాశాలు వస్తాయి.
ఐదవది – నాణ్యతను ఎంచుకోవడం.
గద్ద చనిపోయిన జంతువులను తినదు. అది బలమైన వేటగాడు. తనకు తగిన మంచి వేటనే ఎంచుకుంటుంది. అలాగే మనిషి కూడా చిన్న చిన్న లాభాల కోసం కాకుండా మంచి లక్ష్యాలు, మంచి మార్గాలు ఎంచుకోవాలి.
చివరగా గురువుగారు చెప్పారు:
“బాబూ! గద్ద మనకు నేర్పేది ఇదే — దూరదృష్టి కలిగి ఉండాలి, ఒంటరిగా నిలబడగల ధైర్యం ఉండాలి, సవాళ్లను స్వీకరించాలి, కష్టాలను ఓపికగా భరించాలి, మంచి లక్ష్యాలను ఎంచుకోవాలి. ఈ ఐదు గుణాలు ఉంటే మనిషి జీవితంలోనూ, వ్యాపారంలోనూ గొప్పగా ఎదుగుతాడు.”
గురువుగారి మాటలు విని చిరంజీవి ఆనందంగా తల ఊపాడు. కారు నడుపు తున్నాడు
.
“
స్వర్ణ రేఖలు (50)
రామ్మూర్తిగారు అష్టపది గూర్చి తెలపగలరు
ఇది ఒక కవిత్వం వినసొంపుగా అర్ధసత్యంగా ఉంటుంది
నాకు గుర్తున్నా పక్తులు తెలిపేదా
అటులనే అన్నాడు చిరoజీవి...
తెలిపేదా...
పంచుకో బాధను, పెంచుకో బoధము, తుంచుకో దుష్టజన సాంగత్యాన్ని వెంటనే.
బలిమి లేకున్నా, తెలివి లేకున్నా, కలిమి లేకున్నా, చెలిమి వెంటనే
పోషకాహారాన్ని భుజిస్తూ, దోషరహితంగా జీవిస్తూ,
ద్వేషయసూయ తొలగిస్తూ, మార్పు జీవిగా వెంటనే
ప్రాంతం యేదైనా, పంతం యేదైనా, శాంతం యేదైనా, సొంతం గమ్యం వెంటనే
డబ్బు పోయినా, గబ్బు మిగిల్చినా, జబ్బు లొచ్చినా, గబ్బిలంలా మారకు వెంటనే
ఇక్కడ నేనున్నా, అక్కడ నీవున్నా, ఇక్కట్లు వెంటున్నా మక్కువ మార్చకు వెంటనే
సూర్యశక్తి గమనించు, సౌర్యయుక్తి శోధించు,
ఆర్యసూక్తి బేధించు, కార్యనారి అనుకరించు వెంటనే
జోరుగా పరుగులు, తీరుగా ఆటలు, ధీరత మెరుపులు, భారత భాగ్యత వెంటనే
లేదు అనేముందు, కాదు అనేముందు,
రాదు అనే ముందు జన్మసార్ధక్య మిదేనని వెంటనే
అద్భుతంగా జెప్పారు నేను జెప్పనా
జెప్పు చిరంజీవి
కాటువేసే కాలనాగులు, మాటువేసే గుంటనక్కలు, పోటువేసే తెలివిదున్నలు, ఆటుపోటుగా కుక్కలు వెంటనే
సీస పద్యం
ఏ భాష పలికేది యే తీరు తెలిపేది
ఏ బావ మొలిచేది యేది యేది
ఏ సౌఖ్య ఫలమేది యే వాక్య గతి యేది
ఏ కావ్య పదమేది యేది యేది
ఏ నవ్వు విధమేది యే పువ్వు కళ యేది
ఏ రవ్వ వెలుగేది యేది యేది
ఏ దేహ తపమేది యే దాహ విలువేది
ఏ మోహ నిజమేది యేది యేది
తే. గీ.
ఏది మనసు కవిత గాన మేది మేది
ఏది వయసు యేమగుతీరు యేది యేది
ఏది జయము యేదపజయ యేది యేది
ఏది నిత్య సత్య పలుకు యేది యేది
చెప్పట్లతో అభినందనలు
ఏది.. ఏది. ఏది అద్భుతం
***
స్వర్ణ రేఖలు.. (51)
గురువుగారు యుద్ధంఒకవైపు జనకుల ఘోష మరోవైపు
ఇది స్వార్ధ పోరాటమా, అవకాశ ఉబలటమా, మూర్ఖంగా యుద్దమా జనాన్ని పట్టించు కోని వైనమా....
ద్వేషం ఉన్న చోట దయ్యాలు సంచరిస్తాయి; దయా ప్రేమలు ఉన్న చోట దేవుడు నివసిస్తాడు. మనిషి హృదయంలోని మమత మంచిని పెంచినప్పుడు జీవితం శాంతిమయంగా మారి అన్ని చింతలు క్రమంగా తొలగిపోతాయి; ఎందుకంటే ప్రేమ, కరుణలు దైవత్వాన్ని ఆహ్వానిస్తాయి, ద్వేషం మాత్రం అంధకారాన్నీ అశాంతినీ తీసుకొస్తుంది.
మనము ప్రేమతో పెంచిన పిల్లలు మనల్ని వదిలి విదేశ దేశాలకు వలస వెళ్తున్నారు; అదే సమయంలో మన వృద్ధ తల్లిదండ్రులు తమ చివరి దశను వృద్ధాశ్రమాలలో గడపవలసిన పరిస్థితికి చేరుతున్నారు. ఇది ఆధునిక జీవితంలోని ఒక బాధాకరమైన విరోధాభాసాన్ని వెల్లడిస్తుంది. తల్లిదండ్రులు తమ పిల్లలను పెంచుటకు జీవితమంతా త్యాగాలు చేసినప్పటికీ, కాలక్రమేణా కుటుంబ బంధాలు క్రమంగా సడలిపోతూ తరతరాల మధ్య భావోద్వేగ దూరాన్ని సృష్టిస్తున్న ఒక విషాద చక్రాన్ని ఇది ప్రతిబింబిస్తుంది.
కాని ఇప్పుడు వలసి పోతున్నారు ప్రతుకు తెరువుకోసం కాదా...
నేటి యుద్ధ పరిణామం.. ఆవేదన.. అలాపన..
*
కన్నీళ్లు నీకేల కష్టమ్ము తల్లీ
మున్నీరు మాయేను ముఖ్యమ్ము తల్లీ
యే న్నీరు యేమిధ్య యేదిక్కు తల్లీ
కన్నీరు కళ్ళేను కాలంబు తల్లీ
చిన్నారి కోల్పోయె జీవమ్ము తల్లీ
ఉన్నాది వీడేను ఉవ్వేట్టు తల్లీ
అన్నాది ఆశ్రంబు లేకేను తల్లీ
ఎన్నాళ్ళు యీఖర్మ యేమాయ తల్లీ
ఆకాశమందుండి యస్త్రాలు నీపై
అకారమేదందు యాదండు నీపై
ప్రాకార మేమందు ప్రాణంబు నీపై
స్వీకార మేయుద్ధ శీఘ్రoబు నీపై
లోకమ్ములో యుద్ధ రోగమ్ము తల్లీ
ఏకమ్ము లో యుద్ధ యోగమ్ము తల్లీ
చిక్కాము యీయుద్ధ చిత్తమ్ము తల్లీ
కక్కాము యీయుద్ధ కర్మయ్యె తల్లీ
నీయన్న నీభర్త నేఁడిందు లేరే
నీకన్న నీవన్న నీమున్న లేరే
ఈయుద్ధ మామృత్యు నృత్యమ్ము తల్లీ
యీయుద్ధ ప్రేమమ్ము నీడల్లె తల్లీ
స్త్రీగా జనించంగ దేవుండు రాఁడో
క్రీఁగంటిలో వాని క్లేశమ్ము తల్లీ
ప్రేమమ్ మనోనేత్ర పీయూష తల్లీ
జ్ఞానం మహా మాయ జ్ఞప్తేది తల్లీ
రోజాలలో ముండ్లు రోజంత గ్రుచ్చన్
కాజాలలో తీపి కాలంబు గ్రుచ్చున్
కూజాలలో నీరు కూలంగ గ్రుచ్చున్
పిజాలలో ప్రేమ పీకల్లె గ్రుచ్చున్
రాజిల్లు డెందమ్ము రక్తమ్ము తల్లీ
భాజిల్లు భాగ్యమ్ము బంధమ్ము తల్లీ
రోజిల్లు లోగిల్లు రోగమ్ము తల్లీ
రాజిల్లు ఖర్మేమి రాబందు తల్లీ
నీయేడ్పులో నవ్వు నిర్మోహనమ్మే
మోయంగ నీకౌనె మోదమ్ము తల్లీ
మాయేడ్పు లోనువ్వు మర్మోహనమ్మే
ధ్యేయంబు లేదేమి దేహమ్ము తల్లీ
*
విధేయుడు - మల్లాప్రగడ రామకృష్ణ
స్వర్ణ రేఖలు.. (52)
కారును ఎవరో అపారు ఎందుకో తెలియదు కొందరు మీరెవరో మాకుతెలియదు మాతృభాష లో విద్య బోధించాలి పరభాష మనకొద్దు అంటూ కొందరు నినాదం జెస్తున్నారు.
గురువుగారు మీరు మా ఆహ్వానం మన్నించి మీ అభిప్రాయాలు తెలపండి మా సభ్యులకు కోరారు
చిరంజీవి ఒక్క నిముషం మాట్లాడి వెల్దామా...
మన మాతృభాష మన జీవితాన్ని దారితీస్తూ, మన వ్యక్తిత్వాన్ని మరియు సంస్కృతిని పోషిస్తుంది. అది పిల్లల హృదయాలలో ప్రేమ, మమకారాల మాధుర్యాన్ని నింపుతుంది. అందువల్ల ప్రతి మనిషి తన మాతృభాషను మాట్లాడటం, గౌరవించడం, పరిరక్షించడం అనే దృఢ సంకల్పం చేయాలి; తద్వారా దాని ఉష్ణత, వారసత్వం రాబోయే తరాలకు సజీవంగా కొనసాగుతుంది.
మనిషి నడత తరచుగా మారుతూ ఉంటుంది; ఎందుకంటే మనసు స్వభావతః స్థిరంగా ఉండక, సులభంగా ప్రభావితమయ్యేది. మనసు జ్ఞానం, మంచి ఉపదేశం, ధర్మమార్గం వంటి సత్సూచనలను వినకుండా తిరస్కరించినప్పుడు, అది మనిషిని కీడు మరియు దుర్భాగ్యాల వైపుకు నడిపిస్తుంది. అందువల్ల, నిజమైన మానవ మహత్తు తన మనసును జయించి నియంత్రించగలగడంలోనే ఉంటుంది. తన మనసును నియమశీలంగా, సద్మార్గంలో ఉంచగల వ్యక్తి నిజంగా గొప్పవాడు, గౌరవనీయుడు, మహనీయుడు అవుతాడు.
పద్యం :
కాలాభవామృత కామ్యం కదంబ గుణవా దీప వాకిలిగనే
స్థూలావిశాలత సూత్రం కు చోన్నత ఫలంబున్ సమంబు విపునే
కోలాహలక్షమత మూల్యం మరాల విరజాజుల్ సుఖాల గణనే
బాలావిధానతగ బాల్యం సహాయ సమపోషన్ విశాల ఫలకే
భావం :
కాలగమనంలో మనిషి జీవితం అనేక గుణాల సమాహారంగా వికసిస్తుంది. మంచి గుణాలు మన జీవనద్వారానికి దీపంలా మారి దారి చూపిస్తాయి. విశాల దృష్టి, స్థిరమైన ఆలోచనలు మనిషికి ఉన్నతమైన ఫలితాలను ఇస్తాయి. ప్రపంచంలోని కోలాహలాన్ని సహనంతో ఎదుర్కొనగలిగితే జీవితం సుఖమయమవుతుంది. బాల్యంలో పొందిన మంచి విధానం, సంస్కారం మరియు సహకారం భవిష్యత్తు జీవితానికి బలమైన పునాది అవుతుంది.
అంటూ ముగించాడు..
చిరంజీవి మాట్లాడుతూ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
శ్రీ గురుభ్యో నమః 🙏
సలహా – నమ్మకం – స్నేహం – బంధం అనే విలువలు
పద్యం :
మాటగ పవిత్ర నమ్మకం మానసంబు
చెలిమి గ పటిష్టం కళ చిత్త మార్గ
బంధ మన్నది శాశ్వతం బలుపు కాదు
జీవి అనుభవాచరణమే జేతు జయము
భావం :
మనిషి మాట పవిత్రంగా ఉండాలి; అది నమ్మకాన్ని కలిగించాలి. అలాంటి నమ్మకం ఉన్నప్పుడు స్నేహం బలపడుతుంది మరియు మనసుకు సరైన మార్గాన్ని చూపుతుంది. బంధం అనేది కేవలం మాటల బలం వల్ల కాదు; అది నిజమైన అనుభవం, ఆచరణతోనే శాశ్వతంగా నిలుస్తుంది. అటువంటి జీవనాచరణే నిజమైన విజయాన్ని అందిస్తుంది.
అది కేవలం మాతృభాష వలనే జరుగుతుంది మనం మనం ఏకమై మాతృభాష లో చదువుదాం, వ్రాద్దాం, మాట్లాడుదాం
సర్వేజనాసుఖినోభవంతు అంటూ ముగించాడు
స్వర్ణ రేఖలు.(.53..54,)
విలువైన సలహాలు (విదేశీ జానపద హాస్య కథ) గురించి తెలియపరుస్తా విను అను రామ్మూర్తి గారు 😁నెమ్మదిగా తెలిపారు కారు నడుపు తున్నప్పుడు
ఒక ఊరిలో ఒక పేద రైతు ఉండేవాడు. ఉండడానికి ఒక చిన్న ఇల్లు గానీ, పండించుకోడానికి కొంచెం పొలం గానీ లేదు. పొద్దున లేచినప్పటి నుంచీ రాత్రి పండుకునేదాకా ఎంత పనిచేసినా కమ్మగా కడుపునిండా తినిన రోజూ లేదు. కంటినిండా కలలుగంటూ నిద్రపోయిన రాత్రీ లేదు. పెళ్లయితే తలరాత మారుతుంది అనుకున్నాడు కానీ ఇద్దరూ కలసి ఒళ్ళొంచి ఎంత కష్టపడినా ఏ మార్పు రాలేదు. ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టుంది పరిస్థితి. దానికితోడు ఒక కొడుకు కూడా భూమి మీదికి వచ్చినాడు. చూస్తుండగానే పిల్లోనికి పదేళ్ల వయసొచ్చింది.
"కట్టుకున్న పెళ్ళానికి, కడుపున పుట్టిన కొడుకుకి కడుపునిండా తిండి కూడా పెట్టలేని బతుకూ ఒక బతుకేనా..." అనుకుంటూ ఒక రోజు పెళ్ళాంతో "నేను ఇక్కడే ఇలాగే ఉంటే మన బతుకు ఒక ఇంచు కూడా ముందుకు పోదు. ధైర్యం చేసి ముళ్ళదారిలో ముందడుగు వేస్తేనే బతుకుదారి బాగుపడేది. నువ్వు సంపాదించే దానితో పిల్లోన్ని చూసుకో. నేను ఏదైనా నగరానికి పోయి హాయిగా బతకడానికి కావలసినంత డబ్బు సంపాదించుకొని వస్తా" అంటూ వంద జాగ్రత్తలు చెప్పి బయలుదేరాడు.
నాలుగు వారాలు నడిచీ నడిచీ చివరికి ఒక నగరానికి చేరుకున్నాడు. తీరా చూస్తే అక్కడ ఎక్కడ చూసినా అందరూ తనలాంటి పేదవాళ్లే పనుల కోసం వెతుకుతా కనపడ్డారు. వారం రోజులు వీధుల్లో పడుకుంటా, చెరువుల్లో స్నానం చేస్తా పనుల కోసం వెతికాడు. ఏ ఇంటి తలుపు కొట్టినా పొమ్మనేటోళ్లే తప్ప రమ్మనేటోళ్లు కనపడలేదు.
చివరికి ఒక పెద్ద మనిషి కనబడ్డాడు. అతను బాగా చదువుకున్నవాడు. తెలివైనవాడు. నగరంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా సలహాలు ఇచ్చి ఆదుకుంటూ ఉండేవాడు. అతని దగ్గరికి పోయి "అయ్యా తినడానికి తెచ్చుకున్న డబ్బులు అన్నీ నిన్నటికే అయిపోయాయి. పొద్దున్నుంచీ ఉత్త నీళ్లు తప్ప కడుపుకింత తిండి లేదు. ఏదైనా పని ఉంటే చెప్పండి. ఇంటి ముందు కుక్కలా నమ్మకంగా ఉంటా... ఒంటికి కవచంలా కాపాడుతూ ఉంటా..." అన్నాడు.
ఆ పెద్దమనిషి "నీ మాటల్లోనే నీ మంచితనం, నిజాయితీ అర్థం అవుతా వున్నాయి. ఉండడానికి గది ఇస్తా. తినడానికి తిండి పెడతా. జీతం మాత్రం నువ్వు తిరిగి ఎప్పుడు వెళతావో అప్పుడు ఒకేసారి ఇస్తా. ఆశకు పోకుండా ఎంత ఇస్తే అంత తీసుకో" అన్నాడు. ఆ మాత్రం ఆసరా దొరకడం కూడా అదృష్టమే అనుకుంటూ మారు మాట్లాడకుండా ఒప్పేసుకున్నాడు.
నెమ్మదిగా కాలం దొర్లుతావుంది. చూస్తుండగానే పది సంవత్సరాలు పూర్తయిపోయాయి. పెళ్ళాం పిల్లలు పదే పదే కళ్ళముందు మెదులుతా ఉన్నారు. కళ్ళల్లో నీళ్లు కారుతా ఉన్నాయి. గుండె బరువెక్కుతా ఉంది. ఇక లాభం లేదనుకొని యజమాని దగ్గరికి పోయి "అయ్యా... అడుగుపెట్టి పదేళ్లు అవుతావుంది. కళ్ళు మూసినా తెరిచినా ఇళ్ళూ ఇల్లాలే కనపడతా ఉన్నాయి. ఇక ఇక్కడ కాలు నిలవడం కష్టం. మీరు అనుమతించి నా జీతం గనుక ఇస్తే ఇంటికి పోతా" అన్నాడు.
దానికి యజమాని "ఈ లోకంలో ఎవరు ఎంత కష్టపడినా పెళ్ళాం బిడ్డల పెదాలపై చిరునవ్వు చూడడానికే కదా... నమ్మకంగా నా మనసు తెలుసుకొని పనిచేశావు. నీలాంటివాడు మరలా దొరకడు. నువ్వు వెళతానంటే బాధగానే వుంది" అంటూ భుజంతట్టి వాని చేతిలో జీతం కింద మూడు బంగారు నాణాలు పెట్టాడు.
ఆ పేదరైతు సంబరంగా ఆ నాణాలను కళ్ళకు అద్దుకొని పోతావుంటే ఆ పెద్దమనిషి "చూడు... నీవు గనక నాకు ఒక బంగారు నాణెం తిరిగి ఇస్తే నీకు జీవితంలో ఉపయోగపడే ఒక మంచి సలహా ఇస్తా. లేదంటే నీ ఇష్టం. ఇంత తక్కువ ధరకు నేనింతవరకూ ఎవరికీ ఏ సలహాను ఇవ్వలేదు" అన్నాడు.
రైతు ఆలోచనలో పడ్డాడు. "తన యజమాని ఎంత తెలివైనవాడో అతనికి బాగా తెలుసు. ఎక్కడెక్కడి దేశాలవాళ్ళు అతని కోసం వచ్చి అడిగినంత ధనమిచ్చి సలహాలు తీసుకుంటూ ఉంటారు. మూడు నాణాలలో ఒక్కటి ఇద్దాం. ఇంకా రెండు ఉంటాయి కదా" అనుకుని అతని చేతిలో ఒక బంగారు నాణెం పెట్టాడు.
యజమాని చిరునవ్వు నవ్వి "బాగా గుర్తు పెట్టుకో. నీకు సంబంధం లేని విషయాలలో పొరపాటున కూడా జోక్యం చేసుకోవద్దు" అని చెప్పాడు.
రైతు వినయంగా అలాగేనంటూ తిరిగి పోతావుంటే ఆ పెద్దమనిషి "చూడు... ఇంకో బంగారు నాణెం ఇస్తే ఇంకో సలహా ఇస్తా" అన్నాడు. రైతు ఆలోచనలో పడ్డాడు. చేతిలో ఉన్నవి రెండే. కానీ అతను ఇచ్చే సలహాలు ఆ బంగారు నాణాల కంటే ఎంతో విలువైనవి. డబ్బు కోసం చూసుకుంటే బంగారం కన్నా విలువైన సలహా పోగొట్టుకోవచ్చు" అనుకొని రెండవ వరహా అతని చేతిలో పెట్టాడు.
ఆ పెద్దమనిషి చిరునవ్వుతో "బాగా గుర్తు పెట్టుకో... నీకు తెలియని కొత్త ప్రదేశాలలో విశ్రాంతి తీసుకోకు" అని చెప్పాడు.
అలాగేనంటూ ఆ రైతు వెనక్కి తిరగగానే ఆ పెద్దమనిషి చిరునవ్వుతో "చూడు... నాకు ఇంకో వరహా ఇస్తే ఇంకో సలహా చెప్తా" అన్నాడు. పేద రైతు ఆలోచనలో పడ్డాడు. "చేతిలో ఒకే ఒక్క వరహా ఉంది. ఇది ఉంటే ఏమి లేకుంటే ఏమి. సలహా మాత్రం వదులుకోకూడదు" అనుకుంటూ దానిని కూడా అతని చేతిలో పెట్టేశాడు.
ఆ పెద్దమనిషి చిరునవ్వుతో "బాగా గుర్తుపెట్టుకో. తొలి కోపం మంచిది కాదు. ఆవేశం తగ్గిన తర్వాత ఆలోచించి అడుగు వెయ్యి" అన్నాడు.
మూడు వరహాలకు మూడు సలహాలు అందుకొని ఆ రైతు ఇంటిదారి పట్టాడు. అలా ఒక వారం రోజులు నడిచాక ఒక అడవిలో ఒక వింత దృశ్యం కనపడింది. ఒక గంధర్వుడు ఒక చెట్టు మీద కూర్చుని ఆకులకు బంగారు నాణాలు అంటిస్తూ ఉన్నాడు. అది చూస్తూనే అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. 'అలా ఎందుకు అంటిస్తా ఉన్నాడో కనుక్కోవాలి' అనుకున్నాడు. అంతలో ఆ రైతుకు తన యజమాని చెప్పిన "నీకు సంబంధం లేని విషయాలలో జోక్యం చేసుకోకు" అనే సలహా గుర్తుకు వచ్చింది. దాంతో 'మనకెందుకులే అనవసరంగా' అనుకుంటూ అక్కడినుంచి ముందుకు నడిచాడు.
అలా నాలుగు అడుగులు వేశాడో లేదో ఆ గంధర్వుడు అతన్ని పిలిచి "మిత్రమా... నూరు సంవత్సరాలుగా ఈ చెట్టు ఆకులకు వరహాలు అంటిస్తూ ఉన్నాను. ఇన్ని సంవత్సరాలలో ఎందుకిలా అంటిస్తా ఉన్నావు అని ఒక్క మాట కూడా అడగకుండా వెళ్ళిపోతావున్నది నీవు ఒక్కనివి మాత్రమే" అన్నాడు.
దానికి ఆ రైతు "అయ్యా... మీరెవరో నాకు తెలియదు, నేనెవరో మీకు తెలియదు. నాకు సంబంధం లేని విషయాలతో నాకెందుకు" అన్నాడు. అది విని గంధర్వుడు సంతోషంగా "అదీ మాటంటే. ప్రతి ఒక్కడూ పనున్నా లేకున్నా పక్కవాళ్ళ జీవితాల్లోకి తొంగి చూడడమే తప్ప, తన పని తాను చేసుకోడు. మొదటిసారి ఇలాంటి కమ్మని మాట వినడం. నీకు బహుమతి ఖచ్చితంగా ఇవ్వవలసిందే" అంటూ ఆ చెట్టు కొమ్మలను పట్టుకొని అటూ ఇటూ బలంగా ఊపాడు. అంతే గలగలగల బంగారు నాణాలు కొన్ని పైనుంచి కిందపడ్డాయి. "ఇవన్నీ నీకోసమే. తీసుకో" అన్నాడు గంధర్వుడు. రైతు సంబరంగా వాటిని ఒక సంచి నిండా నింపుకొని తనకు అంత మంచి సలహా ఇచ్చిన యజమానికి మనసులోనే దండం పెట్టుకుంటూ అక్కడినుంచి బైలుదేరాడు.
అలా ఒక వారం రోజులు ఆ అడవిలో నడుస్తూ పోతూవుంటే అతనికి ఒకచోట గాడిదల మీద సరుకులు వేసుకొని పోతూవున్న ఒక వ్యాపారి కనబడ్డాడు. అతన్ని చూసి ఆ రైతు "అయ్యా... నడిచీ నడిచీ కాళ్ళు పీకుతా ఉన్నాయి. ఒక గాడిద మీద నన్ను కూర్చొనిస్తే ఒక బంగారు వరహా యిస్తా" అన్నాడు. ఆ వ్యాపారస్తుడు సంబరంగా 'సరే' అన్నాడు.
వాళ్లు అలా కొంతదూరం పోయేసరికి ఒకచోట ఒక పూటకూళ్ల ఇల్లు కనపడింది. ఆ వ్యాపారస్తుడు "మిత్రమా... నాకు చాలా ఆకలిగా ఉంది. కడుపునిండా తిని కమ్మగా కాసేపు విశ్రాంతి తీసుకుందాం" అన్నాడు. అంతలో ఆ రైతుకు "కొత్త ప్రదేశాలలో విశ్రాంతి తీసుకోకు" అని తన యజమాని చెప్పిన రెండవ సలహా గుర్తుకు వచ్చింది. దాంతో "అయ్యా... మీరు వెళ్లి తిని రండి. నేను ఇక్కడే ఈ గాడిదలకు కాపలాగా ఉంటాను. నాకు ఆకలిగా లేదు" అన్నాడు.
దాంతో వ్యాపారస్తుడు సరేనని ఆ పెంకుటిల్లు లోపలికి పోయాడు. అలా పోయిన కాసేపటికి అక్కడ పెద్ద ఎత్తున భూమి కనిపించింది. దాంతో కళ్ళముందే ఆ పెంకుటిల్లు ధన ధన ధన కూలిపోయి పాపం లోపలున్న వాళ్లంతా అందులోనే సమాధి అయిపోయారు. దాన్ని చూడగానే రైతు భయంతో వణికిపోయాడు. యజమాని సలహా పట్టించుకోకుండా తాను కూడా లోపలికి పోయివుంటే ఇప్పటికల్లా ఏమైపోయేవాడినో కదా అనుకుంటూ తన యజమానికి మనసులోనే దండం పెట్టుకొని ఆ గాడిదలను తోలుకొని అక్కడినుండి బైలుదేరాడు.
అలా రెండు వారాలు ప్రయాణించి చివరికి తన ఇంటికి చేరుకున్నాడు. ఇంటి తలుపు కొట్టాడు. ఇల్లు వదిలి పది సంవత్సరాలు దాటింది. జుట్టు పెరిగి, గడ్డం పెరిగి, వయసు పెరిగి మొత్తం రూపం అంతా మారిపోయి ఉన్నాడు. అదిగాక అప్పటికే మసక మసక చీకటి పడతా ఉంది. దాంతో తలుపు తెరిచిన రైతుపెళ్ళాం తన మొగున్ని గుర్తుపట్టలేకపోయింది.
"ఎవరు మీరు. ఏం కావాలి" అంది.
అతను కూడా వెంటనే విషయం చెప్పకుండా సరదాగా పెళ్ళాన్ని ఆటపట్టించాలని "అమ్మా... చాలా దూరం నుంచి వస్తున్నాను. ఈరోజు రాత్రికి ఇక్కడ ఎక్కడైనా ఉండవచ్చా. పొద్దున్నే వెళ్ళిపోతా" అన్నాడు. దాంతో ఆమె జాలిపడి "ఇంటి లోపలికి ఎవరినీ రానివ్వలేను. కాకపోతే బయట ఉన్న గుడిసెలో విశ్రాంతి తీసుకోవచ్చు" అంది.
రైతు చిరునవ్వుతో "పొద్దున్నే నా పెళ్ళాం నన్ను గుర్తుపట్టి తాను చేసిన పనికి ఎంత సిగ్గుపడుతుందో ఏమో" అని నవ్వుకుంటూ 'అలాగేనమ్మా' అని గాడిదలను తీసుకొనిపోయి ఆ గుడిసెలో కట్టేసి విశ్రాంతి తీసుకోసాగాడు.
ఒక గంట గడిచేసరికి బాగా చీకటి పడింది. ఆ చీకటిలో ఒక యువకుడు వచ్చి ఆ ఇంటి తలుపు కొట్టాడు. తలుపు తెరవగానే నవ్వుకుంటూ లోపలికి పోయి తలుపు మూసేశాడు. అది చూడగానే రైతు అదిరిపోయాడు. "అరెరే... నా పెళ్ళాం నేను ఇల్లు వదిలి వెళ్ళిపోగానే చూసి చూసి ఇంక రానేమో అనుకొని వేరేవాన్ని పెళ్లి చేసుకున్నట్టుంది. ఈ పెళ్ళాం బిడ్డల కోసమే కదా ఇన్ని రోజులూ ఇంత కష్టపడి సంపాదించింది. వీళ్ళు లేనప్పుడు ఇక బ్రతికి ఏం లాభం. వీళ్లను చంపి నేను చస్తా" అని కోపంతో ఊగిపోతూ కత్తి అందుకున్నాడు. అంతలో అతనికి "తొలి కోపం మంచిది కాదు. ఆవేశం తగ్గిన తర్వాత ఆలోచించి అడుగు వెయ్యి" అని తన యజమాని చెప్పిన సలహా గుర్తుకు వచ్చింది.
దాంతో ఆ రాత్రంతా ఆలోచిస్తా ఉన్నాడు. కోపం కొంచెం కొంచెం తగ్గుతా ఉంది. అంతలో తొలికోడి కూసింది. ఇంట్లో దీపం వెలిగించిన వెలుతురు, పనులు చేస్తున్న చప్పుళ్ళు వినబడతావున్నాయి. కాసేపటికి తలుపు తెరుచుకుంది. రాత్రి తాను చూసిన యువకుడు బయటికి వచ్చాడు.
"అమ్మా... నేను పనికి పోయి వస్తా. రాత్రి తిరిగి వచ్చేటప్పుడు ఇంటికి కావలసిన సరుకులు అన్నీ తీసుకొని వస్తా" అన్నాడు. ఆమె లోపలినుంచి "అలాగే నాయనా... జాగ్రత్తగా వెళ్లి రా" అంది.
ఆ మాటలు వినేసరికి ఆ రైతు మొహంలో నెత్తురు చుక్క లేదు. "అయ్యో... నా పెళ్ళాం నన్ను గుర్తుపట్టనట్లే, నేను నా కొడుకుని గుర్తుపట్టలేకపోయా. ఆవేశంతో తొందరపడి ఏదైనా చేసివుంటే జీవితాంతం బాధపడవలసి వచ్చేది. తొలికోపం ఎవరికైనా మంచిది కాదు" అనుకుంటూ వాళ్ల ముందుకు వచ్చి, తాను ఎవరో చెప్పి కొడుకుని మనసారా కౌగిలించుకున్నాడు.
ఆ తరువాత తన వద్ద ఉన్న బంగారు నాణాలతో వాళ్లు మంచి పొలం కొనుక్కొని, పెద్ద మిద్దె కట్టుకొని జీవితాంతం హాయిగా కలసిమెలసి జీవించారు.
****
శ్రీమహాభారతం లోని "ధర్మవ్యాధుని" కథ!!
విలువ : ధర్మము
అంతర్గత విలువ : సత్ప్రవర్తన
పూర్వం ఒకానొక ఊరిలో కౌశికుడనే బ్రాహ్మణ బ్రహ్మచారి ఉండేవాడు. ఒకనాడు అతడు చెట్టునీడన కూర్చుని వేదం వల్లె వేస్తుంన్నాడు. అతడలా వల్లెవేయుచుండగా చెట్టు మీదనున్న ఓ కొంగ అతనిపై రెట్ట వేసింది. అతడు వేదం చదువుతున్నా అందు చెప్పబడిన “మిత్రస్య చక్షుష సమీక్షామహే” అన్న సూక్తిని మరచినాడు. వేదం ప్రపంచాన్నంతటినీ స్నేహభావంతో చూడమన్నది. అది మరచి ఒక్కసారి కోపదృష్టితో ఆ కొంగను చూచాడు. అతడు తపోశక్తి కలవాడగుటచే ఆ కొంగ క్రిందపడి అసువులుబాసింది.
ఆ తరువాత ఆ బ్రహ్మచారి ఎప్పటిలాగానే గ్రామంలోనికి భిక్షాటనకై వెళ్ళాడు. ఓ ఇంటి ముందు నిలబడి “భవతీ భిక్షాం దేహి” అని అడిగినాడు. ఇంట్లో పనిలో ఉన్నదేమో అని అనుకొని కొంతసేపు నిరీక్షించాడు. ఇంతలో దూరాన్నించి వచ్చిన ఆమె మగడు “ఆకలి ఆకలి” అంటూ ఇంటిలోనికి వెళ్ళాడు. ఆ ఇల్లాలు పరమసాధ్వి పతివ్రత. పతికి కాళ్ళుకడుగుకోవటానికి నీళ్ళిచ్చింది. ఆ తరువాత ఎంతో ఆప్యాయంగా భర్తకు భోజనం వడ్డించింది. అతని భోజనం అయ్యాక భిక్ష తీసుకొని బయటకు వచ్చింది. “స్వామీ! మిమ్మల్ని చాలా సేపు నిలబెట్టినాను. నన్ను క్షమించండి” అన్నది. కౌశికుడు మండిపడ్డాడు. తన పతిసేవ చేసి వచ్చేసరికి జాప్యమైందని చెప్పింది. ఐననూ “ఇది క్షమించరాని నేరం” అన్నాడు కౌశికుడు కోపంగా.
అప్పుడామె అన్నది “స్వామీ! అనవసరంగా కోపంతెచ్చు కోకండి. తపోధనులకు కోపం తగదు. ఒక పతివ్రతకు పతిసేవాధర్మాన్ని మించిన ధర్మంలేదు. నేను కొంగను కాను మీ తీక్ష్ణ దృష్టికి క్రిందపడటానికి”. ఎక్కడో అడవిలో ఏకాంతలో జరగిన వృత్తాంతం ఈమె కెలా తెలిసిందా అని కౌశికుడు దిగ్భ్రాంతిని చెందినాడు. పతివ్రతా శక్తిని చూచి నివ్వెఱ పోయాడు. అప్పుడా సాధ్వి “మహాత్మా! కోపానికి మించిన శత్రువు లేదు. మీరు మిథిలా నగరానికి వెళ్ళి ధర్మవ్యాధుని కలుసుకోండి. అతడు మీకు తత్త్వబోధ చేస్తాడు” అని హితవు చెప్పింది.
కౌశికుడు వెంటనే మిథిలకు ప్రయాణమైనాడు. ధర్మవ్యాధుని ఇల్లు కునుక్కొని అక్కడికి చేరాడు. అతడొక కసాయి అని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. కౌశికుని చూచి ధర్మవ్యాధుడు “అయ్యా! దయచేయండి. తమని నా వద్దకు పంపిన సాధ్వీమణి కుశలమేకదా”? అని ప్రశ్నించాడు. ఆ పతివ్రత విషయం ఈ వ్యాధునికెలా తెలిసిందో అని కౌశికుడు ఆశ్చర్య పోయాడు. అతిథికి అర్ఘ్య పాద్యాదులిచ్చి తన తల్లిదండ్రుల సేవకై వెళ్ళాడు ధర్మవ్యాధుడు. వారి సేవ చేశాక కౌశికుని వద్దకు వచ్చాడు. కౌశికుడికి ఇలా ధర్మబోధ చేశాడు “ఆర్యా! ఏ పనినైనా నిక్ష్కామ హృదయంతో ధర్మం తప్పకుడా చేస్తే అది మాధవ సేవే అవుతుంది. ప్రతి మనిషి తన స్వధర్మాన్ని కులవృత్తిని నిర్వహిస్తే ఈ సమాజం బాగా పురోగమిస్తుంది లేకుంటే కొన్ని రంగాలలోనే పురోగతివుంటుంది.
మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సేవించటం మనకనీస కర్తవ్యం. అట్లుచేయని వాడు కృతఘ్నుడౌతాడు. కృతఘ్నతకు మించిన మహాపాపం మరొకటి లేదు. మాతాపితసేవ ఒక్కటే చాలు మనల్ని మోక్షమార్గంలో నడిపించడానికి”.
ఈ హితబొధ విన్న కౌశికుడు ధర్మవ్యాధుని వద్ద సెలవుతీసుకుని వెంటనే తను విస్మరించిన మాతాపితరుల కడకేగినాడు. వారికి భక్తితో అనన్య సేవ చేసి తరించాడు. వేదాంత తత్త్వజ్ఞానంతో అధ్యయనంతో తపస్సుతో పరిశ్రమతో పొందే జ్ఞానాన్ని మోక్షాన్ని మాతాపిత సేవతో పొందవచ్చని గ్రహించాడు.
నీతి :
“తన కోపమే తన శత్రువు. తన శాంతమే తనకు రక్ష” అన్న సూక్తి మనకు ఈ కథలో తెలిసింది. కౌశికుడు వృధాగా కొంగమీద సాధ్విమీద కోపగించుకొని తన తపశ్శక్తిని కోల్పోయాడు.
పతివ్రత యొక్క శక్తి అమోఘం. కథలోని సాధ్వి కేవలం పతిసేవ చేసి ఎంతో కఠిన తపస్సుతోకానీ పొందలేని జ్ఞానాన్ని సంపాదించింది. కౌశికుడుకి హితబోధ చేసింది.
స్వధర్మ పాలన యొక్క శక్తి మనకు ధర్మవ్యాధుని వలన తెలిసింది. ఈతడు కసాయి వాడైనా స్వధర్మాన్ని నిర్వర్తించాడు కాబట్టి కౌశికుడికి హితబోధ చేయగలిగాడు.
మాతాపితరుల సేవ యొక్క ఔన్నత్యం ప్రాముఖ్యత ధర్మవ్యాధుడు మనకు స్పష్టంగా చూపినాడు. జన్మనిచ్చినవారికి కృతజ్ఞత చూపింటం భారతీయుల ప్రథమ కర్తవ్యం అని చెప్పాడు.🙏
" లోకా సమస్తా🚩 సుఖినో భవంతు..!! "
విలువ : ధర్మము
అంతర్గత విలువ : సత్ప్రవర్తన
పూర్వం ఒకానొక ఊరిలో కౌశికుడనే బ్రాహ్మణ బ్రహ్మచారి ఉండేవాడు. ఒకనాడు అతడు చెట్టునీడన కూర్చుని వేదం వల్లె వేస్తుంన్నాడు. అతడలా వల్లెవేయుచుండగా చెట్టు మీదనున్న ఓ కొంగ అతనిపై రెట్ట వేసింది. అతడు వేదం చదువుతున్నా అందు చెప్పబడిన “మిత్రస్య చక్షుష సమీక్షామహే” అన్న సూక్తిని మరచినాడు. వేదం ప్రపంచాన్నంతటినీ స్నేహభావంతో చూడమన్నది. అది మరచి ఒక్కసారి కోపదృష్టితో ఆ కొంగను చూచాడు. అతడు తపోశక్తి కలవాడగుటచే ఆ కొంగ క్రిందపడి అసువులుబాసింది.
ఆ తరువాత ఆ బ్రహ్మచారి ఎప్పటిలాగానే గ్రామంలోనికి భిక్షాటనకై వెళ్ళాడు. ఓ ఇంటి ముందు నిలబడి “భవతీ భిక్షాం దేహి” అని అడిగినాడు. ఇంట్లో పనిలో ఉన్నదేమో అని అనుకొని కొంతసేపు నిరీక్షించాడు. ఇంతలో దూరాన్నించి వచ్చిన ఆమె మగడు “ఆకలి ఆకలి” అంటూ ఇంటిలోనికి వెళ్ళాడు. ఆ ఇల్లాలు పరమసాధ్వి పతివ్రత. పతికి కాళ్ళుకడుగుకోవటానికి నీళ్ళిచ్చింది. ఆ తరువాత ఎంతో ఆప్యాయంగా భర్తకు భోజనం వడ్డించింది. అతని భోజనం అయ్యాక భిక్ష తీసుకొని బయటకు వచ్చింది. “స్వామీ! మిమ్మల్ని చాలా సేపు నిలబెట్టినాను. నన్ను క్షమించండి” అన్నది. కౌశికుడు మండిపడ్డాడు. తన పతిసేవ చేసి వచ్చేసరికి జాప్యమైందని చెప్పింది. ఐననూ “ఇది క్షమించరాని నేరం” అన్నాడు కౌశికుడు కోపంగా.
అప్పుడామె అన్నది “స్వామీ! అనవసరంగా కోపంతెచ్చు కోకండి. తపోధనులకు కోపం తగదు. ఒక పతివ్రతకు పతిసేవాధర్మాన్ని మించిన ధర్మంలేదు. నేను కొంగను కాను మీ తీక్ష్ణ దృష్టికి క్రిందపడటానికి”. ఎక్కడో అడవిలో ఏకాంతలో జరగిన వృత్తాంతం ఈమె కెలా తెలిసిందా అని కౌశికుడు దిగ్భ్రాంతిని చెందినాడు. పతివ్రతా శక్తిని చూచి నివ్వెఱ పోయాడు. అప్పుడా సాధ్వి “మహాత్మా! కోపానికి మించిన శత్రువు లేదు. మీరు మిథిలా నగరానికి వెళ్ళి ధర్మవ్యాధుని కలుసుకోండి. అతడు మీకు తత్త్వబోధ చేస్తాడు” అని హితవు చెప్పింది.
కౌశికుడు వెంటనే మిథిలకు ప్రయాణమైనాడు. ధర్మవ్యాధుని ఇల్లు కునుక్కొని అక్కడికి చేరాడు. అతడొక కసాయి అని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. కౌశికుని చూచి ధర్మవ్యాధుడు “అయ్యా! దయచేయండి. తమని నా వద్దకు పంపిన సాధ్వీమణి కుశలమేకదా”? అని ప్రశ్నించాడు. ఆ పతివ్రత విషయం ఈ వ్యాధునికెలా తెలిసిందో అని కౌశికుడు ఆశ్చర్య పోయాడు. అతిథికి అర్ఘ్య పాద్యాదులిచ్చి తన తల్లిదండ్రుల సేవకై వెళ్ళాడు ధర్మవ్యాధుడు. వారి సేవ చేశాక కౌశికుని వద్దకు వచ్చాడు. కౌశికుడికి ఇలా ధర్మబోధ చేశాడు “ఆర్యా! ఏ పనినైనా నిక్ష్కామ హృదయంతో ధర్మం తప్పకుడా చేస్తే అది మాధవ సేవే అవుతుంది. ప్రతి మనిషి తన స్వధర్మాన్ని కులవృత్తిని నిర్వహిస్తే ఈ సమాజం బాగా పురోగమిస్తుంది లేకుంటే కొన్ని రంగాలలోనే పురోగతివుంటుంది.
మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను సేవించటం మనకనీస కర్తవ్యం. అట్లుచేయని వాడు కృతఘ్నుడౌతాడు. కృతఘ్నతకు మించిన మహాపాపం మరొకటి లేదు. మాతాపితసేవ ఒక్కటే చాలు మనల్ని మోక్షమార్గంలో నడిపించడానికి”.
ఈ హితబొధ విన్న కౌశికుడు ధర్మవ్యాధుని వద్ద సెలవుతీసుకుని వెంటనే తను విస్మరించిన మాతాపితరుల కడకేగినాడు. వారికి భక్తితో అనన్య సేవ చేసి తరించాడు. వేదాంత తత్త్వజ్ఞానంతో అధ్యయనంతో తపస్సుతో పరిశ్రమతో పొందే జ్ఞానాన్ని మోక్షాన్ని మాతాపిత సేవతో పొందవచ్చని గ్రహించాడు.
నీతి :
“తన కోపమే తన శత్రువు. తన శాంతమే తనకు రక్ష” అన్న సూక్తి మనకు ఈ కథలో తెలిసింది. కౌశికుడు వృధాగా కొంగమీద సాధ్విమీద కోపగించుకొని తన తపశ్శక్తిని కోల్పోయాడు.
పతివ్రత యొక్క శక్తి అమోఘం. కథలోని సాధ్వి కేవలం పతిసేవ చేసి ఎంతో కఠిన తపస్సుతోకానీ పొందలేని జ్ఞానాన్ని సంపాదించింది. కౌశికుడుకి హితబోధ చేసింది.
స్వధర్మ పాలన యొక్క శక్తి మనకు ధర్మవ్యాధుని వలన తెలిసింది. ఈతడు కసాయి వాడైనా స్వధర్మాన్ని నిర్వర్తించాడు కాబట్టి కౌశికుడికి హితబోధ చేయగలిగాడు.
మాతాపితరుల సేవ యొక్క ఔన్నత్యం ప్రాముఖ్యత ధర్మవ్యాధుడు మనకు స్పష్టంగా చూపినాడు. జన్మనిచ్చినవారికి కృతజ్ఞత చూపింటం భారతీయుల ప్రథమ కర్తవ్యం అని చెప్పాడు.🙏
" లోకా సమస్తా🚩 సుఖినో భవంతు..!! "
*అనగనగా...*ప్రాంజలి*
పెళ్లయిన_తర్వాత తొలిసారిగా తన తల్లి ఇంటికి వచ్చిన కుమార్తె రిసెప్షన్ వారం రోజుల పాటు సాగింది.
కూతురికి నచ్చినదంతా వారం రోజులుగా చేసారు. అత్తగారి ఇంటికి తిరిగి వెళుతుండగా, తండ్రి ఆమెకు చాలా సువాసన గల అగరబత్తిని ఇచ్చి, “అమ్మా, మీ అత్తమామల ఇంట్లో పూజ చేసేటప్పుడు, ఈ ధూపం వేయాలి....” అన్నాడు.
అందుకు ఆమె తల్లి మెల్లిగా
“కూతురు మొదటిసారి అత్తమామల ఇంటికి వెళుతోంది ఈసమయంలో ఎవరైనా అమ్మాయికి అగరుబత్తీలు ఇస్తారా?” అంది.
అది విన్న ఆయన వెంటనే జేబులో చేయి వేసి జేబులో ఉన్న డబ్బు అంతా కూతురికి ఇచ్చాడు.
అత్తమామల ఇంటికి చేరుకోగానే అత్తగారు కోడలు బాగ్ అందుకొని “మీ పేరెంట్స్ నీకు ఏం ఇచ్చారు?” అని అడిగితే విశేషమేమీ కనిపించక అగరబత్తీల కట్ట వైపు చూసింది. కోపంతో అత్తగారు మొహం చాటేసి “రేపు పూజలో ఈ అగరబత్తిని పెట్టమని కోడలికి చెప్పింది...”
ఉదయాన్నే కూతురు పూజకు కూర్చునేసరికి అగరబత్తుల మూట విప్పగా అందులోంచి ఓ ఉత్తరం బయటపడింది.
అందులో ఇలా రాసి ఉంది...
“అమ్మా! ఈ అగరబత్తి ఆటోమేటిక్‌గా కాలిపోతుంది, కానీ ఇది ఇంటిని సువాసనగా మారుస్తుంది. అంతే కాదు, ఇది మీ చుట్టూ ఉన్న వాతావరణాన్ని తన సువాసనతో ఉల్లాసంగా చేస్తుంది...!!
కొన్నిసార్లు నువ్వు నీ భర్తపై కోపం తెచ్చుకునే అవకాశం ఉంది లేదా కొన్నిసార్లు మీ అత్తగారితో మరియు మామగారిపై కోపం తెచ్చుకునే అవకాశం ఉంది. అప్పుడు నువ్వు ఎవరి మాట వినవలసి ఉంటుంది తెలుసా??
నీ హృదయం ఆలోచన, ప్రవర్తన మారినట్లైతే నువ్వు ఆ బహుమతిని గుర్తుంచుకోవాలి -
అగరుబత్తీలను కావాలని కాల్చినా, పూజలో కాల్చినా, పడకగదిలో కాల్చినా అది సువాసననే ఇస్తుంది అలాగే నువ్వు స్వయంచాలకంగా తట్టుకుని, నీ ప్రవర్తన మరియు చర్యల ద్వారా అందరినీ సువాసన భరితంగా, ఉల్లాసంగా ఉంచాలి తప్ప గొడవలు పడకూడదు. “
అని తండ్రి చేతి వ్రాతతో ఉంది ఆ లెటర్ లో.
ఈ ఉత్తరం చదివిన కూతురు ఏడవడం మొదలుపెట్టింది, అత్తగారు పరుగున వచ్చారు, కోడలు ఏడుస్తున్న పూజగదికి భర్త, మామ కూడా చేరుకున్నారు.
"అరే, చెయ్యి పగిలిందా?” - అడిగాడు భర్త
"ఏం జరిగిందో చెప్”పు - అన్నాడు మామగారు.
చుట్టుపక్కల వస్తువులు ఏమైనా ఉన్నాయా అని అత్తగారు తనిఖీ చేయడం ప్రారంభించారు.
తన తండ్రి అందమైన అక్షరాలతో రాసిన ఉత్తరాన్ని చూసి, ఆ ఉత్తరం చదవగానే, కోడలును కౌగిలించుకుని, ఆ ఉత్తరాన్ని మామగారికి ఇచ్చింది.
కళ్లద్దాలు పెట్టుకోకపోవడం వల్ల కొడుకుకు లెటర్ ఇచ్చి చదవమని...చెప్పాడు.
విషయం మొత్తం అర్థమయ్యేలోపే ఇల్లంతా ఉలిక్కిపడ్డట్టు అయ్యింది.
అత్తగారు బిగ్గరగా చెప్పారు, “ఈ ఉత్తరం ఫ్రేమ్ చేయబడాలి, ఇది నా కోడలు అందుకున్న అత్యంత విలువైన బహుమతి, ఇది పూజా మందిరం వైపు ఫ్రేమ్ చేయబడి ఉండాలి..” అని...
ఆపై ఎప్పుడూ ఆ ఫ్రేమ్ తన ముత్యాల్లాంటి రాసిన మాటలతో ఇంటిని, చుట్టుపక్కల వాతావరణాన్ని దాని అర్థంతో పరిమళింపజేస్తూనే వుంది.
“మన కుమార్తెలు రెండు వంశాలను పరిమళింపజేయాలి, పుట్టినింటికి, అత్తగారింటికి పేరు తేవాలి .... అలా పేరు తెచ్చే స్త్రీ మూర్తులకు వందనం..
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
🌟 *బ్రేకింగ్ న్యూస్:*
*పిల్లలు చివరకు ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ఉద్యోగాన్ని కనుగొన్నారు... తాతగా ఉండటం!*😁🌹🎉
*పాఠశాలలో ఒక చిన్న పిల్లవాడిని దీనిపై వ్యాసం రాయమని అడిగారు:*
*“నా ఆకాంక్షలు”*
*అతను రాశాడు —*
*నేను రాష్ట్రపతిని కావాలని కోరుకోవడం లేదు,*
*నేను డాక్టర్‌ని కావాలని కోరుకోవడం లేదు,*
*నేను శాస్త్రవేత్తని కావాలని కోరుకోవడం లేదు,*
*ఇవేవీ కాదు!*
*నా భవిష్యత్ ఆశయం* *తాతగా మారడం!*
*ఎందుకంటే తాతగా ఉండటం నిజంగా గొప్ప విషయం! ❤️*
*ఎందుకంటే నా తాత —*
*🌞 ఉదయం ఆలస్యంగా మేల్కొనగలడు,*
*😴 మధ్యాహ్నం నిద్రపోగలడు,*
*📺 సాయంత్రం టీవీ చూడగలడు మరియు త్వరగా నిద్రపోగలడు.*
*📚 హోంవర్క్ లేదు,*
*🎒 వేసవి అసైన్‌మెంట్‌లు లేవు,*
*📘 ట్యూషన్ కూడా లేదు.*
*☘️ ఏమీ చేయలేకపోతే, అతను చెట్టు కింద కూర్చుని గాలిని ఆస్వాదించవచ్చు,*
*♟️ లేదా పార్కుకు వెళ్లి ఎవరితోనైనా చెస్ ఆడవచ్చు.*
*🎮 అతను కోరుకున్నంత కాలం వీడియో గేమ్‌లు ఆడగలడు - ఎవరూ ఫిర్యాదు చేయరు!*
*☕ ఉదయం కాఫీ,*
*🍵 మధ్యాహ్నం టీ,*
*🍷 రాత్రి వైన్ - రాజులా సంతోషంగా జీవించడం.*
*🚌 బస్సుల్లో ఉచిత ప్రయాణం,*
*💺 మరియు అదృష్టవంతులైతే, ఎవరైనా సీటు కూడా అందిస్తారు.*
*🚄 హై-స్పీడ్ రైళ్లు మరియు సినిమాలు - సగం ధరకే!*
*🍱 అతను తనకు నచ్చినది తినవచ్చు —*
*ఉల్లిపాయ పకోడీలు, రైస్ కేకులు, టెంపురా, సూప్, టోఫు, గ్రిల్డ్ సాసేజ్, ముల్లంగి కేక్ మరియు మరిన్ని వంటి వేడి ఆహారాలు.*
*టోఫు పుడ్డింగ్, షేవ్డ్ ఐస్, బొప్పాయి పాలు, ఐస్ క్రీం, జెల్లీ, పుడ్డింగ్, ముంగ్ బీన్ జెల్లీ, చీజ్ వంటి చల్లని విందులు —*
*మరియు ఎవరూ అతన్ని ఆపలేరు (అతను ఎక్కువగా తిననంత వరకు 😉).*
*🎨 అతను తనకు నచ్చినది చేయగలడు —*
*పాడవచ్చు, నృత్యం చేయవచ్చు, పెయింట్ చేయవచ్చు, పియానో లేదా ట్రంపెట్ వాయించవచ్చు, పర్వతారోహణ చేయవచ్చు లేదా ట్రెక్కింగ్ చేయవచ్చు!*
*💰 మరియు అతని జేబులో డబ్బు ఉంటే, అతను ప్రపంచాన్ని చుట్టి రాగలడు!*
*✨ తాతగా ఉండటం నిజంగా అద్భుతమైనది!*
*🌼 ప్రేరణ:*
*తాతలు తాము నిజంగా ఎంత సంతోషంగా ఉన్నారో కూడా గ్రహించకపోవచ్చు! 😄*
*🌹👍 ఈ గుంపులోని అన్ని తాతలు మరియు అమ్మమ్మలకు హృదయపూర్వక శుభాకాంక్షలు! 💖*
— *తాతగా ఉండటం అనేది అంతిమ కలల ఉద్యోగం*!”
😁😁 😁 😁 😁
*ఆచార్య సద్బోధన:*
➖➖➖
```
*మనుషులందరూ పసితనాన్ని ఇష్టపడటానికి కారణం కల్లాకపటం తెలియని స్వచ్ఛమైన మనసులు, వారి లేత ముఖాల్లో ప్రతిఫలించే చిరునవ్వులు.
*ఇవే నవ్వులు జీవిత కాల అనుభవసారాన్ని గ్రహించి తలపండినవారి ముఖాల్లోనూ కని పిస్తాయి.
*ముఖాన చిరునవ్వును ధరించడానికి మనమేం శ్రమించనక్కర్లేదు. డబ్బు ఖర్చు చేయనక్కర్లేదు. విరిసీ విరియని పూరేకుల్లా పెదాలను కాస్త విప్పారిస్తే సరి.
*మన చిరునవ్వే బలమైన ఆయుధమై ప్రత్యర్థిని బలహీనుణ్ని చేస్తుంది.
*మనిషి జీవితంలో సుఖం దుఃఖం పడుగుపేకల్లాంటివి. ఏ ఒక్కటీ మనలను ఎల్లకాలం అంటి పెట్టుకుని ఉండదు.
*సమస్యల కారుమబ్బు వీడినా, కొంతమంది విషాద ఛాయలను మనసు నుంచి తొలగించుకోలేరు. కనిపించిన వారికల్లా తమ గోడు వినిపిస్తుంటారు. అనుక్షణం అదే ఆలోచనతో వర్తమానంలో దక్కిన ఆనందాన్ని అనుభూతించలేరు.
*మరికొంతమంది ఎంత తీవ్రమైన కష్టాల్లో ఉన్నా ముఖాన చిరునవ్వు చెదరనివ్వరు. వారి గురించి మనకు మరొకరు చెప్పినా, లేదా కొంతకాలానికి మనకై మనం గ్రహించినా వారి చిరునవ్వు వెనకాల గూడు కట్టుకుని ఉన్న బాధ ఆశ్చర్యం కలిగిస్తుంది. వాళ్ల ఆత్మ స్థైర్యం, గుండెబలం నివ్వెరపరుస్తాయి.
*శాంతికి పర్యాయపదంగా నిలిచేవి ధవళవర్ణ కపోతం(తెల్ల పావురం), బుద్ధుడి చిరునవ్వు.
*చిరునవ్వుతో కూడిన రాయబారి సంధి ప్రయత్నాలు ఎంతటి యుద్ధాలనైనా నివారించగలవు.
*రాఖీ కట్టిన చెల్లి, కట్టించుకున్న అన్న ముఖాల్లోని ఆనందం మహార్ణవం. చూడటానికి రెండు కళ్లు చాలవు.```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏

No comments:
Post a Comment