ప్రాంజలి ప్రభ.. స్వర్ణరేఖలు(001)
(కథా – పద్య – గద్య – సంగీత చరిత్ర)
ప్రకృతి మాధుర్యంతో మానవ జీవన తత్వాన్ని స్పృశించే భావయాత్ర.
కథలుగా ప్రవహించే అనుభవాలు, పద్యాలుగా పలికే హృదయ స్వరాలు,
గద్యంగా ఆలోచింపజేసే జీవన సత్యాలు,
సంగీత మాధుర్యంతో మ్రోగే ఆత్మానుభూతి —
ఇవన్నీ కలిసిన ఒక చిన్న సాహిత్య ప్రయాణం.
సమయం దొరికినప్పుడు చదవండి…
నచ్చితే ఇతరులకు కూడా చదవమని చెప్పండి. 🙏✨
*శ్రీ మాత్రేనమః.. ఓం శ్రీ రామ*
ముందుమాట పద్యం
తరళము
ప్రకృతి ప్రాభవ బంధమున్ సుమభావమానవసౌఖ్యమున్
సుకృతి హృద్యము స్వర్ణ రేఖలుసూత్రమేనుజయంబుగన్
వికృతియాత్మలతృప్తిమాలికవిద్యలుమార్చటె ప్రాంజలిన్
ప్రకృతి మాధుర్య తత్వ జీవనపాఠ్యమేయిదిశోభగన్
సరళ భావం :
ప్రకృతి ప్రభావంతో మానవ జీవితం బంధాలతో, స్నేహంతో, సౌఖ్యంతో నిండుతుంది.
అలాంటి సత్సంకల్పాలు, సుకృతాలు కలిసి మన జీవితాన్ని స్వర్ణరేఖలుగా అల్లుతూ విజయానికి దారితీసే సూత్రంగా నిలుస్తాయి.
మనసులో ఏర్పడే వికృత భావాలను సత్పాఠాలు, విద్యలు, ఆత్మపరిశీలనతో మార్చి
సత్ప్రవృత్తి మార్గంలో నడిపించాలనే వినమ్ర ప్రాంజలి ఈ రచన.
ప్రకృతి మాధుర్యంతో నిండిన జీవన తత్వాన్ని బోధించే ఒక పాఠ్యంలా
ఈ రచన అందరికీ శోభనమైన మార్గదర్శకంగా నిలవాలని భావం.
సంక్షిప్తంగా:
ప్రకృతి – సుకృతి – సత్పాఠాలు కలిసిన జీవన తత్వమే
“స్వర్ణ రేఖలు” అనే జీవన మార్గదర్శకం అని ఈ పద్యం ద్వారా అందరికీ తెలియ సూచిస్తుంది. ✨
మ. కో.
స్వర్ణ రేఖలు గుండెవాకిట వాక్కు లేయగు తీరుగన్
స్వర్ణ మేయవకాససంఘము సఖ్యతాభవ మూలమున్
స్వర్ణ కాంతులు సూర్యచంద్రులు సంతసామయ జీవనమ్
స్వర్ణ లక్ష్యమసస్సుగావిధివాక్కు జీవిత గాధగన్
సరళ భావం :
మనసు గుండెవాకిట పలికే సత్యవాక్కులు మన జీవితానికి స్వర్ణరేఖల్లా మారుతాయి.
మనుషులు పరస్పర సఖ్యతతో కలిసి జీవించే సంఘజీవితం కూడా బంగారు అవకాశాల వేదికగా నిలుస్తుంది.
సూర్య చంద్రుల కాంతుల వలె వెలుగులు పంచే ఆనందమయమైన జీవనమే నిజమైన సంపద.
అలాంటి ఉన్నత లక్ష్యాలతో, విధి నిర్దేశించిన ధర్మమార్గంలో నడిచే మనిషి జీవితం ఒక గొప్ప గాథగా మారుతుంది.
సంక్షిప్తంగా:
మంచి మాట, సఖ్యత, ఆనంద జీవనం, ధర్మలక్ష్యం — ఇవే మనిషి జీవితాన్ని “స్వర్ణరేఖలతో అలంకరించే గాధ”
దేశభాషలందు తెలుగు లెస్స
ప్రాంజలి ప్రభ – స్వర్ణ రేఖలు (002)
మల్లాప్రగడ రామకృష్ణ
“రైలు వేగం మనసుకు రోగం… భయానికి మూలం అంటుపట్టని ఈ కాలం…”
అంటూ పేపర్ చదువుతున్నాడు రామమూర్తి.
విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న రైలు నెమ్మదిగా కదులుతోంది.
విండో పక్కన కూర్చున్న రామమూర్తిగారు పేపర్ చదువుతూ బయటకు చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయాడు. వయసు డెబ్బై దాటింది. పిల్లలు అమెరికాలో… గౌరవం ఉంది, సౌకర్యం ఉంది… కానీ ఏదో లోటు.
అప్పుడే ఎదురెదురుగా ఉన్న సీట్లో ఎవరో గట్టిగా చూశారు.
“రామూ… నువ్వేనా?”
రామమూర్తి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు.
“శేషు! నువ్వేనా రా?”
నలభై ఏళ్ల తర్వాత ఇద్దరు స్నేహితులు రైలులో ఎదురెదురుగా కూర్చున్నారు.
మొదట క్షణం మౌనం…
తర్వాత నవ్వులు… చేతులు పట్టుకోవడం… కళ్లలో తడి.
“ఎలా ఉన్నావు?”
“బాగానే ఉన్నా రా… కానీ…” అని రామమూర్తి ఆగిపోయాడు.
ఆ “కానీ”లో చాలా కథ ఉంది.
“తను ఇరవై ఏళ్ల క్రితమే వెళ్లిపోయింది రా…” అన్నాడు శేషు నిశ్శబ్దంగా.
“నాకూ పదేళ్లు అయ్యింది… వాడు అమెరికాకు వెళ్లిపోయాడు,” అన్నాడు రామమూర్తి నిట్టూర్చుతూ.
అప్పుడే ఇద్దరు గ్రుడ్డివారు రైలులో పాట పాడుతూ వచ్చారు.
“రైల్వే వాళ్లకు బుద్ధిలేదు. ఇటువంటి వారిని అరికట్టలేకపోతున్నారు,” అన్నాడు శేషు.
అప్పుడు రామమూర్తి కొంచెం కోపంగా అన్నాడు –
“ఏదైనా దానం చేయాలనిపిస్తే చేయి… లేకపోతే ఊరుకో. కానీ అటువంటి వారిని చులకనగా మాట్లాడకు.”
అని చెప్పి జేబులోంచి వంద రూపాయల నోటు తీసి వాళ్ల చేతిలో పెట్టాడు.
“మహాత్ములారా ధన్యవాదాలు… మమ్మల్ని పాటపాడమంటారా?” అని వినయంగా అడిగారు వారు.
“డబ్బులు తీసుకున్నారుగా… పాడండి,” అన్నాడు రామమూర్తి చిరునవ్వుతో.
వాళ్లు ఇద్దరికీ నమస్కారం చేసి చిరతలతో పాట మొదలుపెట్టారు.
పాట
సన్నుతి చేయవే మనసా
మరులుగోలిపే మనసా
ఇహభోగాలు దేనికి మనసా
బూడిద పూసిన శివమూర్తి
బోధించు తత్త్వమున్ వినుమనసా
జగమంత మాయగుడారమని
జాగరూకమై యుండుమనసా
ధర్మమార్గమే దివ్యదీపం
దానివెలుగులో నడువుమనసా
అహంకారము విడిచివేసి
అణుకువతో బ్రతుకుమనసా
మంచి మాటలు మంచినడత
మంచి చూపులు గుణములమనసా
మంచి తలంపులే మందులవని
మార్గమునందు జ్ఞాపకమనసా
ఆత్మసత్యమున్ అనుభవించి
ఆనందమందు నిలువుమనసా
శివనామస్మరణముచేసి
శాంతినొందుమనసా ॥
పాట ముగిసింది.
రామమూర్తి లోతైన ఆలోచనల్లో పడిపోయాడు.
కొంతసేపటి తర్వాత మెల్లగా అన్నాడు –
“శేషూ… ఆ బిచ్చగాళ్ల జీవితం, మన జీవితం రెండూ ఒక్కటే కాదా?
తేడా ఉంటే అది వయస్సే… పరిస్థితులే…”
శేషు నవ్వుతూ తల ఊపాడు.
“నీకు ఎప్పటిలాగే ఎక్కువ ఆలోచనలే రా… నీకంతా చాదస్తం!”
రామమూర్తి మాత్రం కిటికీ బయటకు చూస్తూనే ఉన్నాడు.
రైలు ముందుకు పరిగెడుతోంది…
అయితే అతని మనసు మాత్రం గతకాలపు జ్ఞాపకాల మధ్య ఎక్కడో నిలిచిపోయింది.
మిగతా కథ… (003)
****
ప్రాంజలి ప్రభ – స్వర్ణ రేఖలు (003)
మల్లాప్రగడ రామకృష్ణ
శేషు కొద్దిసేపు రామమూర్తిని చూసి అన్నాడు –
“రామూ… నీ ఆలోచనలు చాలా ఆవేశంగా ఉంటాయి. కొన్నిసార్లు అనాలోచనలా కూడా అనిపిస్తాయి. జీవితమనేది ఎగిరే గాలిపటం లాంటిది. దానికి ఆధారం దారం. ఆ దారం దేవుని సంకల్పం… అదే మన కుటుంబం. దారంతో సక్రమంగా గాలిపటాలు ఎగరేసినట్లుగా మన జీవితాలు కూడా సాగాలి. రైలు ప్రయాణం లాగానే ముందుకు సాగుతూ, ఆ దారాన్ని జాగ్రత్తగా పట్టుకుంటేనే గమ్యం సక్రమంగా చేరుతుంది.”
అని చెప్పి రామమూర్తి మెల్లగా ఒక పద్యం పలికాడు.
తరళము
కలతలన్నియు గాలి మాదిరిగాను కమ్మగా సాగగన్
వలపులన్నియు నీరుజారగ వాక్కు నెమ్మది మేలుగన్
తలపులన్నియు ధర్మరక్షణ తత్వ తన్మయ భక్తిగన్
తులసిమాతను పూజ చేయుట పూజ్య ముభావ గమ్యమున్ ॥
సరళ భావం :
జీవితంలో కలిగే కలతలు గాలి వలె వచ్చి వెళ్లిపోవాలి; మనసు స్థిరంగా ఉండాలి.
అనురాగాలు, మమకారాలు నీటిలా జారిపోవాలి; మాటలు మృదువుగా, శాంతంగా ఉండాలి.
మన ఆలోచనలు ధర్మసంరక్షణ వైపే దారి తీస్తూ, ఆ తత్త్వంలో లీనమవ్వాలి.
అలాంటి శుద్ధ భావంతో తులసిమాతను పూజించడం పరమార్థానికి దారి చూపే భక్తి మార్గమవుతుంది.
రామమూర్తి పద్యభావం చెప్పాక శేషు మెల్లగా నవ్వాడు.
“నిన్న రాత్రి 11:30కి నిద్ర పట్టలేదు. ఎవరికి మెసేజ్ చేయాలి అనిపించింది. అప్పుడు ఒక్కసారిగా అనిపించింది – మన వాళ్లంతా పోయారే!”
కొద్దిసేపు ఇద్దరూ మౌనంగా కూర్చున్నారు. రైలు చక్రాల శబ్దం మాత్రమే వినిపిస్తోంది.
“నా భార్య పోయిన రోజు మొదటిసారి నీ ముందు ఏడిచాను గుర్తుందా?” అన్నాడు శేషు.
రామమూర్తి మెల్లగా తల ఊపాడు.
“నువ్వు నన్ను ఓదార్చలేక నాతో పాటు ఏడ్చావు. అప్పుడు తెలిసింది – స్నేహం అంటే ఒంటరితనాన్ని జయించడం అని.”
రామమూర్తి గొంతు దద్దరిల్లింది.
“చావంటే భయం లేదు రా… కానీ ఒంటరిగా చావడం మాత్రం భయంగా ఉంది.”
శేషు వెంటనే అతని చేతిని గట్టిగా పట్టుకున్నాడు.
“నేనున్నా రా. ఇక నుంచి నెలకు ఒక్కసారి అయినా కలుద్దాం. డాక్టర్ దగ్గరికి వెళ్తే నేనూ వస్తా. నిద్ర పట్టకపోతే ఫోన్ చెయ్. ఇద్దరం మాట్లాడుకుందాం.”
ఆ మాటల్లో అపారమైన భరోసా ఉంది.
రైలు మాత్రం తన గమ్యానికి దూసుకుపోతోంది…
అయితే ఇద్దరి హృదయాల్లో పాత స్నేహం మళ్లీ కొత్త వెలుగులు నింపుతోంది.
మిగతా కథ… (004)
ప్రాంజలి ప్రభ – స్వర్ణ రేఖలు (004)
మల్లాప్రగడ రామకృష్ణ
రైలు నల్గొండ దాటి వేగంగా పరిగెడుతోంది. సాయంత్రపు వెలుతురు మెల్లగా కమ్ముకుంటోంది. కిటికీ బయట పొలాలు, చెట్లు వెనక్కి జారిపోతున్నాయి.
రామమూర్తి, శేషు ఇద్దరూ కొద్దిసేపు మౌనంగా కూర్చున్నారు. రైలు చక్రాల లయ మాత్రమే వినిపిస్తోంది.
అప్పుడే ఎదురెదురుగా ఉన్న బెర్త్ దగ్గర ఒక కలత మొదలైంది. ఒక యువతి తన బ్యాగ్ వెతుకుతూ ఆందోళనగా చుట్టూ చూస్తోంది.
“నా బ్యాగ్… నా బ్యాగ్ కనిపించట్లేదు!” అని గబగబా అంది.
ఆమెతో పాటు ఉన్న చిన్నపిల్ల భయంతో ఏడవడం మొదలుపెట్టింది.
కొద్దిసేపటికి ఆ యువతి కోపంతో గట్టిగా అంది —
“ఇది ఏమిటండి! ఈ మొగాళ్లంతా దొంగలేనా? కాసేపు చూసినా చాలు… ఆడవాళ్లను చూస్తూ వెర్రివేషాలు వేస్తారు. బ్యాగ్ కూడా పోయింది!”
ఆమె మాటలు విన్న ప్రయాణికులు ఒక్కసారి ఒకరినొకరు చూసుకున్నారు.
శేషు మెల్లగా రామమూర్తి వైపు చూసి నవ్వుతూ అన్నాడు —
“రామూ… కోపం వచ్చిందంటే మాటలు కూడా రైలేలా దూసుకుపోతాయి.”
రామమూర్తి లేచి దగ్గరకు వెళ్లాడు.
“అమ్మా, కొంచెం శాంతంగా ఉండండి. ఎవరో పొరపాటున తీసుకుని ఉండొచ్చు. మనం చూసుకుందాం,” అన్నాడు నెమ్మదిగా.
అప్పుడే పక్క బెర్త్ దగ్గర కూర్చున్న వృద్ధుడు పై షెల్ఫ్ నుండి ఒక బ్యాగ్ తీసి చూపించాడు.
“ఇది మీదేనా అమ్మా? రైలు కదిలేటప్పుడు పై నుంచి జారి పడింది. నేనే తీసి ఇక్కడ పెట్టాను.”
ఆ యువతి ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంది.
“అవును… ఇదే!” అని బ్యాగ్ తీసుకుని చూసింది.
కొద్దిసేపు మౌనంగా నిలబడి, తర్వాత సిగ్గుగా అంది —
“క్షమించండి… తొందరపడి ఎక్కువగా మాట్లాడేశాను.”
రామమూర్తి చిరునవ్వుతో అన్నాడు —
“పరవాలేదు అమ్మా… కోపం వచ్చినప్పుడు మాటలు ముందుకు వస్తాయి, ఆలోచనలు తర్వాత వస్తాయి.”
చిన్నపిల్ల నవ్వుతూ తల్లిని పట్టుకుంది.
శేషు మళ్లీ తన సీట్లో కూర్చున్నాడు.
అప్పుడు రామమూర్తి కిటికీ బయటకు చూస్తూ మెల్లగా ఒక పద్యం అన్నాడు —
పద్యం
ఇంతియాటల యర్ధమెవ్వరి యిచ్ఛ తీర్చ శుభంబుగన్
బంతిలాయెగ రామదీపలు భాష్య భావము తీరుగన్
సంతసంబు సమమ్ము యన్నది సాగు యెంతయు కష్టమున్
పంతమే గెలుపై సుఖంబున పాశబంధము తప్పదే ॥
అని నెమ్మదిగా పలికాడు.
శేషు ఆసక్తిగా అడిగాడు —
“ఏమిట్రా దాని భావం?”
రామమూర్తి మెల్లగా అన్నాడు —
“మనుషుల కోపాలు, అనుమానాలు, మాటలు — ఇవన్నీ ఎవరి కోరిక తీరాలనే ఆతురతలోనే వస్తాయి. అందరికీ సమానంగా సంతోషం పంచుకోవడం చాలా కష్టం. గెలవాలనే పంతం పెట్టుకుంటే బంధాలు కూడా పాశాల్లా మారిపోతాయి.”
శేషు తల ఊపాడు.
రైలు ముందుకు పరిగెడుతోంది.
బయట సాయంత్రం మరింత ముదురుతోంది.
దూరంలో నగర దీపాలు మెరుస్తున్నాయి.
మిగతా కథ… (005)
***
ప్రాంజలి ప్రభ – స్వర్ణ రేఖలు (005)
మల్లాప్రగడ రామకృష్ణ
రైలు మెల్లగా ముందుకు సాగుతోంది. కిటికీ బయట చీకటి కమ్ముకుంటోంది. స్టేషన్లు వచ్చి పోతున్నాయి.
శేషు ఒక్కసారిగా రామమూర్తిని చూసి అడిగాడు—
“రామూ… ఒక మాట అడుగుతాను.
నీకు నీ భార్యతో మధ్యలో ఎప్పుడైనా గొడవలు, స్పర్ధలు వచ్చాయా?”
రామమూర్తి కాసేపు నిశ్శబ్దంగా ఉన్నాడు.
శేషు మళ్లీ అన్నాడు—
“ఎందుకురా ముప్పై ఏళ్ల క్రితం కథ చెప్పమన్నావు? చెప్పాలనుకుంటే చెప్పు… లేకపోతే వదిలేద్దాం.”
రామమూర్తి లోతుగా ఊపిరి పీల్చుకున్నాడు.
“చెప్పకపోతే మనసు భారంగా ఉంటుంది రా…” అన్నాడు.
కొద్దిసేపు మౌనంగా కూర్చుని తన మాట మొదలుపెట్టాడు.
“ఏమండీ… మంచితనం ఉన్నా కష్టమే. జీవితం అనేది లోకాన్ని బట్టి మన ప్రవర్తన మారుతూ ఉండాలి,” అని ఆమె — రమేశ్వరి — తరచూ చెప్పేది.
“శ్యూరిటీ పెట్టద్దంటే పెట్టావు. చివరికి ఏమైంది? జీతంలో కట్ అవుతోంది. అది ఎవరికి మేలు చేసింది?” అని అనేది.
ఏదో స్నేహితుడని నమ్మి పెట్టిన నా చేత… ఆమె మనసు బాధపడేది.
“మీ నాన్నగారి ఆస్తిలో బాబాయ్ పెంచాడని వాళ్లకు భాగం ఇస్తే — మొత్తం నాదన్నారు. వాళ్లు కోర్టుకెళ్దామన్నా ఒప్పుకోలేదు.
మనకు పిల్లలు ఉన్నారు… వారి భవిష్యత్తు ఎలా?”
నేను మాత్రం మౌనమే.
“నేనేదో అడిగానని తాగుడే అవసరమా?”
“నేను ఉద్యోగం చేస్తానంటే వద్దన్నావు… అప్పులు ఎలా తీరుస్తావు?”
ఆనాడు నాకు చెప్పుకోలేని స్థితి.
రామమూర్తి గొంతు బరువైంది.
“అన్ని ప్రశ్నలకు నా దగ్గర అప్పటికి సమాధానం లేదు రా.”
ఒక రోజు కోపంతో ఆమె అంది—
“ఎవరి కర్మకు ఎవరు బాధ్యులు! నేను ధర్మం కోసం కోవెల్లను రూపాయి బిల్లుగా మారాను.”
కొద్దిసేపు ఆగి మెల్లగా అన్నాడు—
“బొమ్మను చూడలేని బొరుసుగా…
బొరుసును చూడలేని బొమ్మగా…
మిగిలిపోయాం రా ఇద్దరం.”
ప్రేమ యుద్ధం (పాట)
పల్లవి
పురుషుడు :
ప్రేమలో యుద్ధమేమి రామేశ్వరి చెప్పవే
బుద్ధి పోయి మనసు మాయలో తేలవే
స్త్రీ :
యుద్ధమే కాదు ఇది మనసుల. ఆటవే
తెలియని తపనలే తెగువైన ప్రేమవే॥
చరణం – 1
పురుషుడు :
ప్రేమగతి చెప్పలేని మాయలే ఎందుకో
చావు దాటుకొని సాగె తపనలే ఎందుకో
స్త్రీ :
వినాశమేనని తెలిసినా లోకమందునా
ఏమి చెప్పు రామా ఇదే గద ప్రేమనా॥
చరణం – 2
పురుషుడు :
ప్రాణమిచ్చే శక్తి లేని ప్రాణులమైనా
తీపి తపనలలో మునిగెదమేనైనా
స్త్రీ :
దురాగతమన్నా మనసు వినదురా
ముద్దు మాయలలో మునిగెదురా ప్రేమరా॥
చరణం – 3
పురుషుడు :
ఘర్షణల గాలిలో గూళ్లు కూలునయ్యా
కాపురాల బాటలు కలతలే అవునయ్యా
స్త్రీ :
సందడి సరదాగా నవ్వే ఈ మనసే
ఆశ పాశములతో ఆడే ప్రేమే॥
చరణం – 4
పురుషుడు :
రాజ్యముల గుండెలో పోరాటం చూడు
ప్రాణ సంపదలే ధ్వంసమౌతున్ చూడు
స్త్రీ :
ఆధిపత్య దాహమే బాధలే మిగుల్చున్
ప్రేమపక్షుల కలల పిచ్చి ఇదే రామా॥
అంటూ ఇంటిలో విషాదం తాండవించేది…
అలా ఎన్ని రోజులు గడిచాయో తెలియదు.
మిగతాది (06)
ప్రాంజలి ప్రభ – స్వర్ణ రేఖలు (006)
మల్లాప్రగడ రామకృష్ణ
“అప్పుడు ఏమైంది రా?” అన్నాడు శేషు.
రైలు కదులుతూనే ఉంది.
రామమూర్తి నెమ్మదిగా అన్నాడు—
“ఏం చెప్పేదిరా… నాలో ఆవేశం కట్టలు తెంచిన చెరువులా పొంగిపోయింది.
ఒక పెద్ద అరుపుగా మారింది… మా ఇద్దరి మధ్య ఆ కొంపలో.”
“ఆ కోపంలో ఏం చేసావురా?” అని శేషు అడిగాడు.
“నా శ్రీమతి… పుల్లలతో గడప దాటింది,” అన్నాడు రామమూర్తి నిస్సత్తువగా.
కొద్దిసేపు నిశ్శబ్దం.
శేషు నెమ్మదిగా చెప్పాడు—
“ఆవుకు గంగడోలులా పుట్టిన ప్రతి మనిషికీ
వివాహం – ప్రేమ ఘట్టం ఒక ముఖ్యమైన వేడుక రా.
జీవితానికి తోడు, ఒంటరితనాన్ని దూరం చేసే నేస్తం.
ప్రయాణం చేసే నావకి
తెరచాప ఎంత ముఖ్యమో,
జీవిత ప్రయాణం నడిపే భార్యాభర్తలు ఇద్దరూ నావికులే.
అందులో హెచ్చు తగ్గుల ప్రసక్తేంటి రా?”
కొంచెం ఆగి మళ్లీ అన్నాడు—
“ఆప్యాయతలు పంచుకుంటూ, లోటుపాట్లు ఎంచకుండా,
ఒకరికొకరు ఇష్టాయిష్టాలను గౌరవించుకుంటూ
సంసార నౌక నడపాలి.
ఎక్కడ లంగరు వేయాలి,
ఎక్కడ వేగం పెంచాలి,
ఎక్కడ తగ్గించాలి —
ఒడుదొడుకులు లేకుండా ఒడ్డుకు ఎలా చేర్చాలి —
అదే అసలు జీవితం.
పిల్లాపాపలతో నౌక భారమే.
తల పండినా తలపులెన్నో…
మనసు ఖేదపడ్డా గురుతులెన్నో…
కొసరికొసరి వడ్డించుకుని రంగరించుకునే జ్ఞాపకాలెన్నో!
ప్రతి మెచ్చుకోలు వెనుక
ఎంతో అనుభవ సారం ఉంటుంది రా.”
మరింత మృదువుగా అన్నాడు—
“ధైర్యం ఒకరినుంచి మరొకరు నేర్చుకుంటూ,
ఓర్పు – నేర్పుతో
మిగిలిన జీవితాన్ని పంచుకుంటూ గడపాలి.
అది ఈశ్వరుడు ఇచ్చిన శేష ప్రసాదం లాంటిది.
చివరికి ఎవరైనా ఒంటరిగానే ప్రయాణించాల్సిందేనేమో…
అప్పుడు తీపి జ్ఞాపకాలే ఇంధనం అవుతాయి.”
రామమూర్తి తలదించుకున్నాడు.
“అప్పుడు నీకు ఎలా ఉందో గాని…
ఇప్పుడు మాత్రం నాకు సళసళ కాగిన నీటిలో మునిగినట్లు ఉంది.
నీ మాటలు వినగానే బాధ తట్టుకోలేకపోతున్నా.”
శేషు నెమ్మదిగా అడిగాడు—
“భార్యను బ్రతిమాలి తెచ్చుకోలేదా?”
అప్పుడే రైలులో అరుపు వినిపించింది—
“టీ… టీ… టీ…”
శేషు నవ్వుతూ అన్నాడు—
“ముందు టీ త్రాగురా… కథ తరువాత చెప్పు.”
మిగిలినది – (07)
ప్రాంజలి ప్రభ.. స్వర్ణరేఖలు..(007)
మల్లాప్రగడ రామకృష్ణ
రామమూర్తి లోకం ఏతీరుగ మారునో ఎవరికెరుకా, ఒక వైపు నీకధలా సాగుతుంది మరోవైవు స్వార్ధపు యుద్ధరాజ్యం ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు చెప్పలేని గతి రా అంటున్నాడు శేషు
ఆనాడు నీభార్య చేసినది తప్పో ఒప్పో జెప్పలేక వెళ్లిందేమోరా అన్నాడు నెమ్మదిగా శేషు
అప్పుడే రేడియోలో పాట వినబడుతున్నది....
ఆరాట మనోవేదన తోడుండ గ మాయా
పోరాట మనో వేదన విడoగగ మాయా
ఆదేవుఁడు మాప్రార్థన లాలించఁగ రాఁడో
ఈదీనులకై కోర్కెల నీడేర్చఁగ రాఁడో
--
మాటే మనసే మాయగ చూడంగన రాడో
ఆటై విధిగా బాటయు లేనందున రాడో
ఆకాశము వెల్గీనెడు నస్త్రమ్ముల వీడే
కాకోలములో నుంటిమి కాపాడఁగ రాఁడో
--
ఆవేశము చల్లాబడు హృద్యమ్ములు వీడే
సేవళ్ళను చేయాలని శాంతంబులు వీడే
మాకన్నులలో నశ్రువు మాకాసర లేదే
చీకాకుల బాపంగను చేయూతగ రాఁడో
--
మా మాటలలో నశ్రువు బుద్ధ వ్వగ లేదే
మా చీకటి మార్చేందుకు శీఘ్రo బుగ రాడో
మామన్కియు చీఁకట్లుగ మారెంగద యయ్యో
ఈమారణ హోమమ్ముల నిప్డాపఁగ రాఁడో
--
మా తప్పులు తీర్చేందుకు ప్రేమ్మంబది యయ్యో
ఈ ప్రేమలు కల్పెందుకు నిష్ణాతుడు రాడో
వేఁటాడెడు శ్వానమ్ములు ప్రేమించవు గాదా
మాటాడెడు దైవమ్ముగ మాకాశగ రాఁడో
--
కోపంబులు తాపంబులు ప్రేమించవు గాదా
మమ్మాదుడు దైవంబగు వేగంబున రాడా
ఈప్రేమ యుద్ధము లాపంగను నీశాంతి కనంగా
రాయంచగ నామది రాగోషగ రాఁడో
ప్రేమంబగు ఈస్థితి తీరంబున రాడో
*
అలా అద్భుత రాగంలో వినబడుతున్నది చక్కటి గీతం ఆనాటి పరిస్థితి ఈ నాటి యుద్ధములా ఉందిరా...
ఈ పాట స్వర్ణరేఖలు సినిమా లోనిది
చాలా హృద్యంగా ఉంది.కదరా రాము
గీతం యొక్క ప్రధాన భావం
ఈ పాటలో నాలుగు ప్రధాన తత్త్వాలు కనిపిస్తున్నాయిరా అన్నాడు శేషు
1. ఆరాటం – పోరాటం
మనిషి అంతరంగంలోని కలత, బయట ప్రపంచంలోని యుద్ధం రెండూ ఒకటిగా కనిపిస్తున్నాయి.
2. దేవుని ఎదురు చూపు
“రాడో” అన్న పునరుక్తి ద్వారా
దైవం వచ్చి శాంతి ఇవ్వాలని ఆకాంక్ష వ్యక్తమవుతుంది.
3. మానవ దౌర్భాగ్యం
“మా కన్నులలో నశ్రువు…”
“చీకటి మార్చేందుకు…”
అంటూ ప్రజల బాధను చూపించారు.
4. ప్రేమే పరిష్కారం
చివరికి మీరు చెప్పిన తాత్పర్యం —
ప్రేమ యుద్ధాన్ని ఆపగలదు అన్న భావం.
సాహిత్యపరంగా గమనించదగినది
“రాడో” అనే పునరుక్తి అలంకారం పాటకు ఒక ప్రత్యేక రాగానుభూతి ఇస్తుంది.
ప్రశ్నల రూపంలో వాక్యాలు ఉండటం వల్ల వేదన గాఢంగా వ్యక్తమవుతుంది.
చివరి చరణం ప్రేమ యుద్ధం → శాంతి అనే భావసారాన్ని అందంగా చెబుతుంది.
ఆ మాటలకూ రాము నవ్వుతూ వున్నాడు.....
నా అర్ధం తప్పా....
అదికాదురా నా భార్య గుర్తుకిచ్చింది ఎదో తెలియని బాధ
ఇంతకీ నీ కధ కంచి కెళ్ళలేదుకదా అంటూ నవ్వుతూ అన్నాడు శేషు...
తరువాత నీ కధ ఏమిటిరా....
(008)
ప్రాంజలి ప్రభ.. స్వర్ణ రేఖలు (08)
మల్లాప్రగడ రామకృష్ణ
రామమూర్తి కాసేపు నిట్టూర్పు విడిచాడు. శేషు వైపు చూసి మెల్లగా మాట ప్రారంభించాడు.
“తర్వాత ఏమయ్యిందంటే శేషూ… నా శ్రీమతి ఇద్దరు పిల్లలతో ఇంటి బయటికి వచ్చింది. చేతిలో బ్యాగ్, అందులో కొంత డబ్బు. తండ్రికి ఫోన్ చేసి చెప్పాలని సెల్ తీసింది. కానీ ఆ క్షణంలోనే వెనుక నుంచి వచ్చిన బైక్ ఆమె చేతిని తాకింది. సెల్ ఫోన్ నేల మీద పడి పగిలిపోయింది. అన్నీ ఒక్క క్షణంలో జరిగిపోయాయి.
ఎందుకో అప్పుడే నామీద చరవాణి కూడా కోపంగా అనిపించింది…” అని నిట్టూర్చి oది
మెల్లగా పిల్లలను తీసుకుని బస్ స్టాప్ దగ్గరకు చేరింది. బస్సు ఎక్కాలని ఎదురుచూస్తూ పిల్లలను బెంచ్ మీద కూర్చోబెట్టింది. అంతలో అక్కడ కుక్కలు ఒకదానితో ఒకటి పొట్లాడుకుంటూ ఒక్కసారిగా ఆమె వైపుకు వచ్చాయి. భయంతో వాటిని తరిమింది.
ఆ కలవరం మధ్యలో ప్రక్కన పెట్టిన బ్యాగ్ ఎవరో తీసు కెళ్లారు. చుట్టూ ఉన్నవారిని అడిగితే
“మీ వాళ్లే తీసుకెళ్లారని అనుకున్నాం అండి…” అని సమాధానం.
చేతిలో డబ్బు లేదు. ఫోన్ లేదు. ఏం చేయాలో అర్థం కాలేదు.
“ఎందుకయ్యా భైరవా… మా మీద ఇంత కోపమా?” అని మరోసారి నిట్టూర్చింది.
అప్పుడే ఒక ఆటో అక్కడి నుంచి వెళ్తోంది. ఆమె చేయి ఊపి ఆపింది.
“బాబూ… నేను ఈ అడ్రస్సుకు వెళ్లాలి. డబ్బులు లేవు. ఈ ఉంగరం ఉంచుకో…” అని చూపించింది.
ఆటోడ్రైవర్ ఆమెను కాసేపు చూసి నవ్వాడు.
“వద్దమ్మా… ఉంగరం ఎందుకు? నేను సహాయం చేస్తాను. నా మాట నమ్మి పిల్లలతో ఎక్కండి.”
ఆమె ఆటో ఎక్కింది. ఆటో ముందు భాగంలో ‘వరాహం’ అని వ్రాసి ఉంది.
ఆమె మనసులో అనుకుంది –
“ఓ వరాహమా… మమ్మల్ని గమ్యం చేర్చు.”
ఆటో మెల్లగా కదిలింది.
కొంత దూరం వెళ్లగానే పోలీసులు ఆటో ఆపారు. డ్రైవర్ వారి స్వభావం గమనించి నిశ్శబ్దంగా అన్నాడు:
“అమ్మా… నేను ఇచ్చేదాన్ని ఇస్తాను. కానీ ఆ వీరభద్రుడికి కొంచెం ఇవ్వాలి. లేదంటే ‘స్టేషన్‌కు రండి’ అంటూ ప్రళయరుద్రుడవుతాడు…”
ఆమె గుండె లోపల భయం పెరిగింది.
మిగిలి (9)
ప్రాంజలి ప్రభ.. స్వర్ణ రేఖలు (09)
మల్లాప్రగడ రామకృష్ణ
పోలీసులు ఆటోను ఆపగానే ఆమె గుండెలో భయం పెరిగింది. డ్రైవర్ వారి స్వభావం తెలుసుకున్నట్టుగా మెల్లగా చెప్పాడు.
“అమ్మా… ఆ వీరభద్రుడికి కొంచెం ఇవ్వాలి. లేదంటే స్టేషన్ అంటాడు.”
ఆమె కాసేపు ఆలోచించింది. చేతిలో డబ్బు లేదు. చివరకు తన వేళ్లలో ఉన్న ఉంగరాన్ని తీసి ఇచ్చింది.
పోలీసు దాన్ని చూసి మౌనంగా జేబులో వేసుకున్నాడు. “సరే… పోండి,” అని పక్కకు తప్పుకున్నాడు.
ఆటో మళ్ళీ కదిలింది.
ఆమె గుండెలో బాధ ఉప్పొంగింది. నిట్టూర్చుకుంటూ అనుకుంది—
“అయ్యో… ఈ యమధర్మరాజుకూడా నన్ను మోసం చేసాడా!
ఏమి కర్మ ఇది…”
ఆటో కొంత దూరం వెళ్లింది. రోడ్డుపక్కన ఒక పెట్రోల్ బంక్ కనిపించింది.
డ్రైవర్ మెల్లగా అన్నాడు—
“అమ్మా… ప్రక్కన పెట్రోల్ బంక్ ఉంది. కొంచెం పెట్రోల్ పోయించుకొని వెళ్లాలి. తప్పదు. మనిషికైనా, యంత్రానికైనా ఇంధనం తప్పదు.”
ఆమె వెంటనే అన్నది—
“అయితే నేను దిగిపోవాలా బాబూ…”
డ్రైవర్ నవ్వుతూ తల ఊపాడు.
“వద్దమ్మా… మీరు దిగక్కర్లేదు. ఇది పెట్రోల్ బండి. మీలాంటి వాళ్లను గమ్యం చేర్చడమే మా పని.”
ఆ మాటలు విని ఆమె మనసులో ఒక చిన్న వెలుగు మెరిసింది.
పిల్లలు అలసటతో తల్లిని ఆనుకుని కూర్చున్నారు. ఆటో మళ్లీ ముందుకు కదిలింది.
ఆమె మెల్లగా ఆటో ముందు చూసింది. అక్కడ పెద్ద అక్షరాలతో వ్రాసి ఉంది—
“వరాహం”
ఆమె మనసులో అనుకుంది—
“భైరవుడు పరీక్ష పెట్టినా… వరాహుడు దారి చూపిస్తున్నాడేమో…”
ఆటో గమ్యం వైపు సాగింది.
సశేషం.. (10)
ప్రాంజలి ప్రభ.. స్వర్ణ రేఖలు (1o)
మల్లాప్రగడ రామకృష్ణ
పెట్రోల్ పోయించుకుని డ్రైవర్ ఆటో దగ్గరకు వచ్చాడు. చేతిలో ఒక చిన్న సంచి ఉంది. అందులో పండ్లు, బిస్కెట్ ప్యాకెట్లు ఉన్నాయి.
అతను పిల్లల వైపు చూస్తూ మెల్లగా ఇచ్చాడు.
“తీసుకోండి బాబూ… తినండి.”
ఆమె ఆశ్చర్యంగా చూసింది.
“ఎందుకు బాబు ఈ శ్రమ?” అని అడిగింది.
డ్రైవర్ నవ్వుతూ అన్నాడు—
“అమ్మా… మీరు పిల్లలు ఎప్పుడో తిన్నారో ఏమో.
రాముడికి ఉడత చేసిన సహాయం లాంటిదే ఇది.
ఈ సీతమ్మకు, పిల్లలకు ఈ హనుమంతుని సహాయం చేయనీయండి.”
అని చెప్పి ఆటో మళ్లీ కదిలించాడు.
ఆ మాటలు విన్న ఆమె కళ్ళలో నీరు తిరిగింది.
మనసులో అనుకుంది—
“ఈ లోకంలో ఇంకా మంచివాళ్లు ఉన్నారే… అన్ని మగవాళ్లు ఒకేలా ఉండరు.”
ఆటో కొంత దూరం వెళ్లగానే ముందున్న రోడ్డంతా జనంతో నిండిపోయింది. ఏనుగుపై ఒక రాజకీయ నాయకుడు “గెలిచాను” అని ఊరేగింపుతో వెళ్తున్నాడు. చుట్టూ రౌడీ మూక, డప్పుల శబ్దం, నినాదాలు.
పోలీసులు వాహనాలను ఆపేశారు.
“వెనక్కి పోండి… వెనక్కి పోండి…” అని అరుస్తున్నారు.
పోనివారి బండ్లకు గాలి తీసేస్తూ కొందరు గుండాలు బెదిరిస్తున్నారు.
ఆ పరిస్థితి గమనించిన డ్రైవర్ హనుమంతు ఆటోను నెమ్మదిగా వెనక్కి తిప్పాడు.
“అమ్మా… నేను చేయగలిగిన పని చేశాను. ముందుకు వెళ్లడం ఇప్పుడెందుకో కష్టమే.”
అని జేబులో నుంచి రెండు వందల రూపాయలు తీసి ఆమె చేతిలో పెట్టాడు.
“ఇది ఉంచండి అమ్మా. ఇంకో గంట ఎక్కడైనా ఆగండి. పరిస్థితి సర్దుకుంటే వెళ్లండి.
ఈ వరాహం ఇక ముందుకు వెళ్లదు.”
ఆ మాటలు విని ఆమె మనసు కదిలిపోయింది.
“వరాహమా… నీకు ధన్యవాదాలు.
నీ సహాయం… ఈ హనుమంతుని సహాయం… నేను ఎప్పటికీ మరువలేను.”
పిల్లలను దగ్గరగా కౌగిలించుకుంది.
మనసులో మరో ఆలోచన మెదిలింది—
“ఈ పుడమి తల్లి నన్ను ఏ విధంగా ఉద్ధరిస్తుందో…
లేక తనలో కలుపుకుంటుందో…”
అని ఆకాశం వైపు చూసింది.
సశేషం.. (11
ప్రాంజలి ప్రభ.. స్వర్ణ రేఖలు (11)
మల్లాప్రగడ రామకృష్ణ
చెట్టుక్రింద పిల్లలతో సీతమ్మ కూర్చుంది. పిల్లలు బిస్కెట్లు తింటూ అలసటతో ఆమెకు ఆనుకుని ఉన్నారు.
అంతలో కొంత దూరంలో ఆటోలు నిలబడ్డాయి. ఊరేగింపు వల్ల రోడ్డంతా మూసుకుపోయింది. కొంతమంది ఆటోడ్రైవర్లు అక్కడే చేరి మాట్లాడుకుంటున్నారు.
ఆ హనుమంతు కూడా వాళ్ల దగ్గరకు వెళ్లాడు. కాసేపటికి అతని గళం ఆవేశంగా వినిపించింది. తోటి ఆటోవాళ్లతో కలిసి పాట మొదలుపెట్టాడు.
మనకెవ్వరికీ ప్రశ్నించే హక్కే లేదా
మనకెవ్వరికీ తీర్పులు ఇచ్చే అధికారమూ లేదా?
మనమంతా కళ్లముందే
అన్యాయాలు అక్రమాలు జరుగుతుంటే
కళ్ళప్పగించి మౌనంగా చూసిన
కౌరవసభలోని భీష్ములం… భీరువులమా?
కళ్లున్న కబోదులమా?
ప్రశ్న ఎప్పుడు కనుమరుగైందో
మానవజాతి పతనం
అప్పుడే ప్రారంభమైంది కాదా?
ప్రాభవం మసకబారినప్పుడల్లా
వాడు యుద్ధం అంటాడు
వీడు లంచం అంటాడు
పెళ్లాం ప్రేమ అంటుంది
దేనికి పొంతన కుదరదా?
రక్తపు టేరుల్లో వాడు
చమురును వెతుక్కుంటాడు
నేడు డబ్బుల వేటలో
వయసును విద్యను అమ్ముకోవడంకాదా?
విధ్వంసపు నగరాల్లో
వాడు ఖనిజాన్ని కోరుకుంటాడు
కులాలు మతాలు కుమ్ములాటలు
ఖనిజాల కోసమే కాదా?
శవాల దిబ్బల్లో వికటహాసం చేసే
వికృత మనిషి మారుతున్నాడు
నోరు విప్పితే తప్పవుతుందా?
ముక్కుపచ్చలారని చిన్నారులను
మూకమ్మడిగా బలిగొన్న
మానవమృగాల మధ్య
ఇదే జీవితం కాదా?
ప్రపంచపు అసమర్థతే
వాడి తెంపరితనానికి ఆయువు కాదా?
ఎప్పుడు… ఏమో… ఎలా…
ప్రపంచానికి పీడలా దాపురించారు కొందరు!
ఇప్పుడైనా మారాలి
దేశ భవిష్యత్తుకు
మనమంతా సహకరించాలి!
అని ఆవేశంగా పాడాడు హనుమంతు.
ఆ పాటలోని ప్రతి మాట గాలిలో తేలుతూ చెట్టు క్రింద కూర్చున్న సీతమ్మ చెవుల్లో పడింది. ఆమె మెల్లగా తలెత్తి చూసింది.
మనసులో ఒక ఆలోచన మెదిలింది—
“ఈ లోకంలో బాధలు ఉన్నాయ్… అన్యాయాలు ఉన్నాయ్…
కానీ వాటిని చూసి ప్రశ్నించే మనుషులూ ఉన్నారే…”
ఆమె కళ్ళలో మళ్లీ నీళ్లు తిరిగాయి.
కానీ ఆ కన్నీళ్లలో ఇప్పుడు భయం కంటే కొంచెం ధైర్యం కూడా కలిసింది.
(12)
ప్రాంజలి ప్రభ.. స్వర్ణ రేఖలు (12)
చెట్టు కింద రమేశ్వరి పిల్లలతో నుంచొని ఉంది అందరిన ఒక వృద్ధుడు పోతు ఈమెను చూసి పాలకరింపుగా
పద్యం... తెలిపాడు
నిస్పృహ నిరాశ నీరస నిర్వీర్య నిస్తేజం నిర్ణయం నిక్కచ్చి నియంత నిరీక్ష నిర్వాహ నిర్భధ్య నిర్మలం నిశ్శత్తు నీకాళ్ళు నీకాళ్ళు నీవాక్కు నీ రూపుఁ నిశ్చయం నీన్యాయ నీధర్మ నీకర్మ నీశబ్ద నీశాంతి నీమర్మం
అర్ధం గాక నుంచోనే ఉంది :
ఈ విధంగా భావం:
మనిషి జీవితంలో నిస్పృహ, నిరాశ, నీరసం, నిస్తేజం వచ్చినప్పుడు
అవి మనలోని బలాన్ని నిర్వీర్యం చేస్తాయి.
అలాంటి సమయంలో తీసుకునే నిర్ణయం నిక్కచ్చిగా ఉండాలి,మనసుపై మనమే నియంత్రణ కలిగిన నియంతలా ఉండాలి.
నిరీక్షణతో, నిర్వాహంతో, నిర్భయంగామన జీవితం నిర్మలంగా ముందుకు సాగాలి.
మన అడుగులు మనవే,
మన మాట మనదే,
మన రూపం మన స్వరూపమే —
అది నిశ్చయంతో నిలబడిన స్వయంబలం.మన న్యాయం, మన ధర్మం, మన కర్మ
మన శబ్దం, మన శాంతి, మన మర్మం —ఇవన్నీ చివరికి మన ఆత్మసాక్షి ఎదుటే నిలుస్తాయి.
అర్ధం కాలేదు అనింది అవును మీకేం అర్ధం అవుతుంది ఆశలే అవేశంలో ఉన్నారు, అర్ధంకాని స్థితిలో ఉన్నారు సముద్రంపై ఎగిరే పక్షిలా, చిరునామా దొరకని సాక్షిలా, నిజం తెలుసుకొని మనిషిలా, గాలికు ఎగిరే కాగితనివి జాగర్తమ్మ లోకం మురికి కూపం
"చూడమ్మా సంకల్పమే జీవనాధారం".!!*
మన సంకల్పాలేమన జీవితాన్ని రూపొందిస్తాయి...
"యద్భావం తద్భవతి" మనం ఎలా ఆలోచిస్తామో అలానే తయారవుతాం, అంటే మన మనసు దేని గురించైతే ఆలోచిస్తుందో మనం దాన్నే పొందుకుంటాం
ఈ జీవితం సుఖదుఃఖాల, గెలుపు ఓటముల ఆట
మన మనసు ఏ విషయాన్ని పదే పదే ఆలోచిస్తుందో అదే మన దగ్గరకు వస్తుంది
అందుకే మన మనసులో సంకల్పం ఇలా చేయాలి..."నేను చాలా ఆనందంగా ఉన్నాను" "ఆరోగ్యంగా ఉన్నాను" "సురక్షితంగా ఉన్నాను" "సదా భగవంతుడు నా చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు" "భగవంతుని తోడు మరియు భగవంతుని వరదాన్ని హస్తం నా తలపై ఉంది" "నాకు ఎల్లప్పుడూ అన్ని చాలా మంచిగా జరుగుతూ ఉంటాయని, శుభ సంకల్పాలు చేస్తూ ఉంటే, ఒకవేళ చెడు జరిగేది ఉన్న, అది కూడా మంచిగా అయిపోతుంది"
"బలహీన సంకల్పాల negative thoughts" రచనయే మన జీవితాలను అధోగతి పాలు చేశాయి. మరల మన జీవితంలో సఫలత సాధించాలంటే అది మన "శుభ సంకల్పాల శక్తి⚡positive thoughts ⚡power" తోనే సాధ్యం, కనుక శుభ సంకల్పాలు చేయడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ నింపుట సాధ్యం
బాహ్యంగా మనం ఎంత ప్రాయాసపడినా ఆంతరికంగా మన సంకల్పాలు సరిలేకుంటే ప్రయోజనం శూన్యం కనుక మన ధ్యాస అంతా మన సంకల్పాల పరివర్తన పై పెడితే సహజంగానే మన జీవితంలో సానుకూల పరివర్తన positive improvement సాధ్యం అవుతుంది.
అంటూ నమః శివాయ, నమః శివాయ నమః శివాయ అంటూ కదిలాడు రెప్ప మూసే లోపు మాయమయ్యడు
ఆలోచలకు లోనైనది రామేశ్వరి.....
మిగిలినది (13)
---
ప్రాంజలి ప్రభ.. స్వర్ణ రేఖలు (13) —
మల్లాప్రగడ రామకృష్ణ
ఆ వృద్ధుడు “నమః శివాయ… నమః శివాయ…” అంటూ నడుచుకుంటూ పోయాడు.
రెప్ప మూసేలోపు కనిపించలేదు.
రమేశ్వరి కాసేపు స్థబ్దుగా నిలిచిపోయింది.
“ఇది నిజంగానే మనిషినా? లేక దేవుడి దూతనా?”
అని ఆమె మనసులో ప్రశ్న మెదిలింది.
చెట్టు ఆకుల మధ్య గాలి మెల్లగా ఊదింది.
పిల్లలు మాత్రం ఏమీ తెలియని అమాయకత్వంతో
బిస్కెట్లు తింటూ నవ్వుకుంటున్నారు.
రమేశ్వరి హృదయంలో మాత్రం
ఆ వృద్ధుడి మాటలు తరంగాల్లా మోగుతున్నాయి.
“సంకల్పమే జీవనాధారం…”
ఆ మాట ఒక్కటే ఆమె మనసులో
మళ్ళీ మళ్ళీ ప్రతిధ్వనించింది.
ఇంతవరకు జరిగిన కష్టాలు, అవమానాలు,
అన్యాయం—all ఒక్కసారిగా గుర్తుకు వచ్చాయి.
కానీ అదే సమయంలో
ఒక చిన్న దీపంలా ఆశ కూడా వెలిగింది.
“నేను బలహీనురాలిని కాదు…
నా పిల్లల కోసం అయినా నిలబడాలి…”
అని ఆమె తనలో తానే అనుకుంది.
పక్కనే ఉన్న పిల్లవాడు అడిగాడు—
“అమ్మా… ఆ తాతయ్య ఎవరు?”
రమేశ్వరి కాసేపు ఆకాశాన్ని చూసింది.
మెల్లగా నవ్వుతూ అంది—
“బిడ్డా… మనకు దారి చూపించే వారు
ఎప్పుడూ దేవుడే…
కొన్నిసార్లు మనుషుల రూపంలో వస్తాడు…”
అని పిల్లలను దగ్గరికి చేర్చుకుంది.
చెట్టు నీడ కాస్త పొడవైంది.
సూర్యుడు పడమర వైపు వాలుతున్నాడు.
ఆమె మనసులో మాత్రం
ఒక కొత్త సంకల్పం మొలకెత్తింది…
“ఇంకా ఓడిపోలేదు…
జీవితం ఇంకా ముందుంది.”
(మిగిలినది…(14)
ప్రాంజలి ప్రభ.. స్వర్ణ రేఖలు (14) —
మల్లాప్రగడ రామకృష్ణ
కారు నెమ్మదిగా గుడి వైపు పోతూ ఉంది.
దారిపక్కన పెద్ద చెట్టు నీడలో రమేశ్వరి పిల్లలతో కూర్చొని ఉండటం తల్లి కంటపడింది.
ఆ దృశ్యం ఆమె హృదయాన్ని ఒక్కసారిగా కదిలించింది.
పద్యం:
మహిళావిద్యల శాంతసత్వగుణమున్ మొక్షంబు సంసారమున్
మహిళాకాంక్ష రజోగుణంబు పలుకుల్ మాయల్లె వైభోగమున్
మహిళాకాంతి తమోగుణంబు తమకం మార్గంబు యోగంబుగన్
మహిళాదేవత పూజ్యతా గుణములున్ మేలౌను ఉద్దేశమున్
భావము
మొదటి పాదం:
విద్య, శాంతి, సత్త్వగుణాలతో కూడిన స్త్రీ కుటుంబ జీవితాన్ని సక్రమంగా నడిపి సంసారాన్ని మోక్ష మార్గానికి నడిపించగలదు.
రెండవ పాదం:
స్త్రీలోని రజోగుణం కోరికలు, మాటలు, అలంకారాలు, వైభోగాల రూపంలో వ్యక్తమవుతుంది. ఇది సంసారంలో ఆకర్షణ, చలనం కలిగిస్తుంది.
మూడవ పాదం:
స్త్రీలోని తమోగుణం కూడా ఉన్నదే; కానీ అది నియంత్రణలో ఉంటే యోగమార్గానికి దారి తీసే ఆత్మపరిశీలనకు మార్గమవుతుంది.
నాల్గవ పాదం:
ఈ మూడు గుణాల సమన్వయంతో స్త్రీ దేవతాస్వరూపిణి అవుతుంది. ఆమెను పూజ్యురాలిగా గౌరవించడం మానవ సమాజానికి శ్రేయస్కరం.
సమగ్రార్థం
సహజ గుణంగా.....
“ఆగండి… ఆపండి కారు,” అని తల్లి తడబడిన స్వరంతో చెప్పింది.
కారు ఆగింది.
ఆమె కిటికీ నుండి బయటకు చూసింది.
చెట్టు నీడలో రమేశ్వరి పిల్లలు ఆకలితో అలసిపోయినట్టుగా తల్లి ఒడిలో వాలి ఉన్నారు.
తల్లి కళ్లలో నీళ్లు మెదిలాయి.
“పాపం… మన కూతురు ఎంత కష్టంలో ఉందో!
పిల్లలు కూడా ఎంత బాధగా ఉన్నారు చూడండి.
వాళ్లను మన యింటికి తీసుకెళ్దామా?” అని మృదువుగా అడిగింది.
తండ్రి ముఖం ఒక్కసారిగా గట్టిగా మారింది.
“ఎక్కడకక్కరలేదు.
నాకైతే కూతురు లేనట్టే.
ఆ రోజు నుంచే నీళ్లు వదిలేశాను,” అన్నాడు గట్టిగా.
తల్లి మళ్లీ వేడుకుంది.
“కోపం మీకు ఉండొచ్చు…
కానీ ఆ పిల్లలు ఏమి తప్పు చేశారు?
కనీసం వాళ్లను చూసి మాట్లాడదాం.”
తండ్రి కోపంతో స్టీరింగ్ బిగించాడు.
“ఇంకో మాట మాట్లాడకు.
నాతో ఉండాలంటే ఆ విషయం మళ్లీ చెప్పకు.
ఆ అమ్మాయితో పోవాలంటే ఇప్పుడే కారునుంచి దిగిపో…
ఇక్కడే దించేస్తాను,” అన్నాడు కఠినంగా.
ఆ మాట విన్న తల్లి ఒక్కసారిగా మౌనమైంది.
మహిళల బ్రతుకుకు స్వేచ్చ లేదా అనుకున్నది
ఆమె కళ్లలో నీళ్లు నిండాయి.
కిటికీ బయట చెట్టు నీడలో కూర్చున్న రమేశ్వరిని చూస్తూ హృదయం కరిగిపోయింది.
కారులో
తల్లి:
“అయ్యో చూడండి… ఆ చెట్టు దగ్గర పిల్లలతో నిలబడి ఉన్నా మన రమేశ్వరిగా కనిపించట్లేదా?
ఎంత సన్నగిల్లిపోయిందో! కాలం ఎంత మార్పు తెచ్చిందో చూడండి.” మీరు మారటం దేనికి మన ఆస్తి ఎవరికి? మీ కష్టం ఎవరికి కేవలం కొడుకేనా మనకు కూతురుందికదా
నీవు ఎన్ని చెప్పు
తండ్రి:
“చూడకూడని ముఖం అది. మన మాట వినకుండా కులాంతర వివాహం చేసుకుని ఇంటి గౌరవం పోగొట్టింది.
ఇప్పుడు చూసి ఏమి ప్రయోజనం?”
తల్లి:
“అది నిజమే… కాని పాపం మన కూతురే కదా!
కోపం మనసులో ఉండొచ్చు కానీ రక్తసంబంధం ఎలా మర్చిపోతాం?”
తండ్రి:
“నీకు మమకారం ఎక్కువ.
రేపు వచ్చి ఆస్తిలో వాటా అడిగితే ఏమంటావు?
ఇప్పుడు దగ్గరవుతే తర్వాత ఇబ్బందులు మొదలవుతాయి.”
తల్లి:
“ఆస్తి అన్నది వస్తూ పోతుంది.
కానీ పిల్లల బంధం ఒకటే.
అంత కఠినంగా ఉండకండి… కనీసం అడిగి తెలుసుకుందాం ఆమె ఎలా ఉందో.”
తండ్రి:
“నేను మాత్రం వెళ్లను.
మన నిర్ణయాన్ని మనమే దెబ్బతీయకూడదు.
ఆమె తన దారిలో వెళ్లింది… మనం మన దారిలోనే ఉండాలి.”
తల్లి (నిశ్శబ్దంగా చూస్తూ):
“దారి వేరైనా… బంధం వేరవదు.
కాలమే మీ కోపాన్ని కరిగిస్తుంది చూడండి…”
అన్నది రామేశ్వరి కళ్ళనీళ్ళు తుడుచుకుంటూ..
(15)
ప్రాంజలి ప్రభ.. స్వర్ణ రేఖలు (15) —
మల్లాప్రగడ రామకృష్ణ
తల్లి తండ్రుల కారు కదిలింది…
ఆకాశం జల్లులు జార్చింది…
చెట్టు కింద నిలిచిన వృద్ధుడు తత్త్వ పరవశంతో చేతులు ఎగరేస్తూ శివతత్వ గీతం పాడుతున్నాడు…
పల్లవి
తోలుతిత్తురా ఈ దేహం తోడు నడిచే మాయరా
కాలగాలి వీచినపుడే కూలిపోవు నాటకరా
శంభునామ స్మరణతోనే శాంతి దొరుకునురా
మనసు నిలకడగా ఉంచి మార్గమున సాగురా॥
చరణం 1
నీవైనా నేనైనా ఆ దేవదేవుని నాటకమేరా
ధైర్యంతో ముందుకు పోవాలే తప్ప అధైర్యం దేనికిరా
జనకుల కామానికి బిడ్డలురా పుడమి తల్లికి భారమూ కాదురా
చూసినవన్నీ నిజముకాదు చూడనవన్నీ నిజమవ్వవురా॥
చరణం 2
నీ ధర్మం నీ సత్యం నిన్ను వెంటాడే కలిని తరమాలిరా
నీతి నిజాయితీ నీకు తోడు నీడలై కదలాలిరా
తప్పే వారిదని నాదికాదని వాదనలన్నా కాపురం నిలవదరా
నిలకడ జారక మానదు రగిలిన కోపం అరకమానదు ఆలోచించురా॥
చరణం 3
బూడిదైన భోగములన్నీ బొమ్మలాటలే రా
బంధమన్నది కాలచక్రమ్ బారినపడే మాయరా
నడకలోనే జీవగీతం నాదమవ్వ నేర్చురా
నటరాజుని నామస్మరణే నిజమయిన దారిరా॥
ముగింపు చరణం
పోయిన దుఃఖములన్నీ పోత గాలిలో కలిసురా
పుట్టిన ప్రాణమంతా పరమశివుని కృపరా
దారి తప్పిన జీవబాట ధైర్యముతో చేరురా
దయామయుని నామస్మరణే జీవనానికి దీపురా॥
పాట ముగిసింది.
జల్లులు కాస్త గట్టిగా కురిశాయి.
వృద్ధుడు ఆకాశాన్ని చూసి మెల్లగా అనుకున్నాడు—
భర్తకు భార్య లోకువా…
భార్యకు భర్త లోకువా…
తల్లికి బిడ్డ భారమా…
బిడ్డకు తల్లి భారమా…
దైవమా! నడక మార్చుమా…
ఈ కలి దేని నిమిత్తమా…
అర్థం కాని జీవాల మధ్య
యుద్ధమా…
యుద్ధమా…
యుద్ధమా…
అని పలుకుతుండగానే…
రమేశ్వరి ఆశ్చర్యంగా చూస్తుండగా
జల్లుల మబ్బులో వృద్ధుడు నెమ్మదిగా కనుమరుగయ్యాడు…
రమేశ్వరి గుండెల్లో ఏదో కదిలింది.
ఆ మాటలు ఇంకా చెవుల్లో మార్మోగుతూనే ఉన్నాయి…
సశేషం
****
ప్రాంజలి ప్రభ.. స్వర్ణ రేఖలు (16) —
మల్లాప్రగడ రామకృష్ణ
రమేశ్వరి ఆలోచనలు ఇంకా వృద్ధుని మాటల చుట్టూ తిరుగుతున్నాయి.
జల్లులు కాస్త గట్టిగా కురుస్తున్నాయి. పిల్లలు ఆమె చేతులు పట్టుకొని తడుస్తూ నిలబడ్డారు.
అప్పుడే ఒక్కసారిగా ఒక కారు వారి ముందు ఆగింది.
కారు తలుపు తెరుచుకుంది.
లోపల నుండి ఒక స్త్రీ ఆతురంగా పలికింది—
“రమేశ్వరి! ఇంకా ఎందుకు తడుస్తున్నావ్? లోపలికి రా… పిల్లలూ తడుస్తున్నారు.”
రమేశ్వరి ఒక్క క్షణం ఆశ్చర్యంగా చూసింది.
అది ఆమె పాత స్నేహితురాలు.
ఆమె కారు నుంచి దిగి,
“ముందు పిల్లలను ఎక్కించు… చలిగా వణుకుతున్నారు,” అని చెప్పి
పిల్లలను తన చేతులతోనే పట్టుకొని కారులో కూర్చోబెట్టింది.
రమేశ్వరి కాసేపు సంకోచించింది.
మనసులో ఎన్నో ఆలోచనలు.
“రా రమేశ్వరి… ఇప్పుడు మాటలకి టైం కాదు. ముందు తడవకుండా లోపలికి రా,”
అని స్నేహితురాలు ఆమె చేతిని పట్టుకుంది.
రమేశ్వరి నిశ్శబ్దంగా కారులోకి ఎక్కింది.
కారు నెమ్మదిగా కదలడం మొదలైంది.
జల్లులు ఇంకా పడుతూనే ఉన్నాయి…
చెట్టు కింద వృద్ధుడు కనిపించలేదు…
కానీ అతని పాట మాత్రం రమేశ్వరి హృదయంలో ఇంకా మార్మోగుతూనే ఉంది.
స్నేహితురాలు కాసేపు ఆమె వైపు చూసి మెల్లగా అడిగింది—
“రమేశ్వరి… నీ జీవితంలో ఏమైంది?”
రమేశ్వరి కిటికీ బయట చూస్తూ మౌనంగా ఉంది.
పిల్లలు మాత్రం కారులో తడి బట్టలతో దగ్గరగా కూర్చున్నారు.
ఆ రాత్రి…
ఆ కారు ప్రయాణం…
పిల్లలు వణుకుతూ రమేశ్వరి ఒడిలో దగ్గరగా చేరుకున్నారు.
కాసేపు మౌనం.
ఆమె స్నేహితురాలు మెల్లగా స్టీరింగ్ తిప్పుతూ రమేశ్వరి వైపు చూసింది.
“రమేశ్వరి… ఎంతకాలం అయ్యింది నిన్ను చూసి… ఏమైంది నీకు?” అంది.
రమేశ్వరి కిటికీ బయటకి చూస్తూనే ఉంది.
గుండెల్లో మాటలు ఉన్నా పెదవుల మీదకు రావడం లేదు.
కాసేపటికి స్నేహితురాలు స్వల్పంగా నవ్వింది.
“నా గురించి అనుకుంటున్నావా?” అంది.
రమేశ్వరి ఆశ్చర్యంగా ఆమె వైపు చూసింది.
ఆమె స్వయంగా చెప్పింది—
“అవును… నేను ఇప్పుడు సమాజం ‘వేశ్య’ అని పిలిచే జీవితం గడుపుతున్నాను.”
ఆ మాట విన్న రమేశ్వరి క్షణం నిశ్శబ్దంగా అయింది.
స్నేహితురాలు మళ్లీ చెప్పింది—
“అది నా కోరిక కాదు రమేశ్వరి…
జీవితం నన్ను ఆ దారిలోకి తోసింది.
కానీ… ఒకటి మాత్రం నిజం…”
కారు కాస్త నెమ్మదించింది.
“వేశ్య అని పిలిచినా…
నాలో ఉన్న మనసు మాత్రం చనిపోలేదు.”
ఆమె వెనుక సీట్లో కూర్చున్న పిల్లల వైపు చూసింది.
“ఈ పిల్లలు తడుస్తూ నిలబడితే చూడలేకపోయాను…
అందుకే కారును ఆపాను.”
రమేశ్వరి గుండెల్లో ఏదో కదిలింది.
వృద్ధుడు పాడిన మాటలు మళ్లీ గుర్తొచ్చాయి—
“తల్లికి బిడ్డ భారమా…
బిడ్డకు తల్లి భారమా…”
స్నేహితురాలు మెల్లగా అడిగింది—
“రమేశ్వరి…
మనుషుల్ని వారి పేర్లతో తీర్పు ఇవ్వాలా?
లేదా వారి హృదయంతో చూడాలా?”
రమేశ్వరి కళ్లలో నీళ్లు మెరుస్తున్నాయి.
ఆమె పిల్లలను గట్టిగా కౌగిలించుకుంది.
కారు ముందుకు సాగుతోంది…
ప్రాంజలి ప్రభ.. స్వర్ణ రేఖలు (17) —
మల్లాప్రగడ రామకృష్ణ
కారు జల్లుల మధ్య నెమ్మదిగా సాగుతోంది.
రోడ్డు మీద చినుకులు మెరుస్తున్నాయి.
పిల్లలు వెనుక సీట్లో దగ్గరగా కూర్చున్నారు.
రమేశ్వరి ఇంకా మౌనంగానే ఉంది.
ఆమె స్నేహితురాలు ఒక్కసారి నవ్వింది… ఆ నవ్వులో బాధ కూడా ఉంది.
“రమేశ్వరి… నన్ను చూసి భయపడుతున్నావా?” అంది.
రమేశ్వరి తల ఊపలేదు… మాట్లాడలేదు.
ఆమె స్వయంగా చెప్పడం మొదలుపెట్టింది—
“అవును… నేను వేశ్యనే.
కానీ ఒకటి తెలుసుకో… నేను ఆ శ్రీకృష్ణుని నమ్మిన అమ్మాయి.”
కొద్దిసేపు నిశ్శబ్దం.
“ప్రేమించాను… నమ్మాను…
చివరికి మోసపోయాను.
ఆ ప్రేమ పాపానికి పుట్టిన బిడ్డను
నేనే పెంచుకుంటూ బ్రతుకుతున్నాను.
జీవితం నన్ను నాట్యం చేసే దారిలోకి నెట్టింది.
ఇప్పుడు నాట్యమే నా బతుకు.”
ఆమె కళ్లలో ఒక్కసారిగా అగ్ని మెరుపు.
“మోసం చేసిన వాడు మాత్రం బయట ప్రపంచానికి
నిజాయితీ పరుడు… గొప్ప మనిషి.
అసలు మాత్రం…
పైకి చెప్పుకోలేని మూర్ఖుడు…
పెళ్లికి గిట్టని వాడు…
కామాంధుడు…”
కారు కాసేపు ఆగినట్టు నెమ్మదించింది.
ఆమె స్వరం గట్టిగా మారింది—
“ఒక రోజు…
నా మీద దాడి చేశాడు.
ఆత్మరక్షణ కోసం…
నరికేశా.”
మళ్లీ మౌనం.
“శిక్ష అనుభవించి…
ఇప్పుడే బయటికి వచ్చాను.”
ఆమె మెల్లగా నవ్వింది.
“ఇప్పుడు గుడికి వెళ్తున్నాను.
అక్కడ నాట్యం చేస్తాను.
దేవుడి ముందు నాట్యం చేయడం
నాకు పాపక్షాళనం లాంటిది.”
ఆమె రమేశ్వరి వైపు చూసింది.
“ఇదే నా క్లుప్త కథ.”
కారు దూరంలో కనిపిస్తున్న గుడి గోపురం వైపు తిరిగింది.
“గుడి వరకు రా.
తర్వాత నీ ఇష్టం.”
అని చెప్పి కాసేపు ఆగి నవ్వుతూ అంది—
“కానీ ఒకటి మాత్రం అనుకోకు…
నిన్నూ నీ పిల్లల్నీ నేను పోషిస్తానని.
అంత పెద్ద దాతను కాదు నేను.”
ఆ నవ్వులో వెక్కిరింపు లేదు…
నిజం మాత్రమే ఉంది.
రమేశ్వరి ఆమెను నిశ్శబ్దంగా చూస్తోంది.
గుడి గంటలు దూరంలో మోగుతున్నాయి…
సశేసం
ప్రాంజలి ప్రభ.. స్వర్ణ రేఖలు (18) —
మల్లాప్రగడ రామకృష్ణ
ప్రమాదం జరిగిన రాత్రి తర్వాత…
హాస్పిటల్ గది నిశ్శబ్దంగా ఉంది.
రమేశ్వరి మంచం మీద కూర్చొని చేతులు జోడించింది.
కళ్లలో నీళ్లు.
“వినాయకుడా…
మీరాను బ్రతికించు.
ఆమెకు ఇంకో అవకాశం ఇవ్వు,” అని ప్రార్థించింది.
అప్పుడే నర్స్ వచ్చి చెప్పింది—
“మీరా మీతో మాట్లాడాలని అంటోంది.”
రమేశ్వరి వెంటనే ఆమె గదికి వెళ్లింది.
మీరా శరీరం బలహీనంగా ఉంది.
శ్వాస మెల్లగా నడుస్తోంది.
కానీ కళ్లలో ఒక ప్రశాంతత.
ఆమె మెల్లగా అంది—
“రమేశ్వరి…
లాయరును పిలిపించాను.
మరో పని ఉంది.”
కొద్దిసేపటికి లాయర్ వచ్చాడు.
మీరా మళ్లీ అంది—
“నా బాబును తీసుకురండి…
చివరిసారి చూడాలి.”
కొద్దిసేపటికి చిన్న బాలుడిని తీసుకొచ్చారు.
మీరా అతన్ని ప్రేమగా చూసింది.
ఆ తర్వాత…
ఆ బాలుడిని రమేశ్వరి చేతిలో పెట్టింది.
“ఇక నుంచి ఈ బాబు…
నీ కొడుకుగా పెంచు.”
రమేశ్వరి ఒక్కసారిగా ఆశ్చర్యపోయింది.
మీరా మెల్లగా నవ్వింది.
“ఇదిగో… నా ఆస్తి.
లాయర్ ద్వారా వ్రాయించాను.
సగం నీకు…
సగం నా చిన్న కృష్ణకు.”
ఆమె కళ్ళు మెల్లగా మూసుకుపోతున్నాయి.
“నేను ఎక్కువ రోజులు బ్రతకను రమేశ్వరి…
ఆ కృష్ణ అన్నిధానమున
నాట్యము చేయటానికి
నేను పోవాలి…”
అని మెల్లగా పలికింది.
ఒక చివరి చూపు…
చిన్న కృష్ణ వైపు…
రమేశ్వరి వైపు…
ఆమె పెదవులపై ఒక స్వల్ప చిరునవ్వు.
అంతే…
మీరా కన్నులు తెలలేస్తున్నది
రమేశ్వరి కళ్లలో నీళ్లు ప్రవహించాయి.
ఆమె చేతుల్లో ఇప్పుడు ఇద్దరు పిల్లలు.
హాస్పిటల్ గదిలో నిశ్శబ్దం.
దూరంలో గుడి గంటలు మోగుతున్నాయి.
ఆ రాత్రి…
హాస్పటల్ ఛైర్మెన్ spl. Doctor. Nnu పిలిపించారు
ఆ వచ్చిన డాక్టర్ మీరా తమ్ముడు
ఒక్కసారి చూసి ఏడుపుతో నువ్వు చావవు నేనుబ్రతికిస్తా అంటూ ఏవో మందులు......
సశేషం
ప్రాంజలి ప్రభ.. స్వర్ణ రేఖలు (19) —
మల్లాప్రగడ రామకృష్ణ
అమెరికాలో ఉన్న మీరా తమ్ముడు వార్త విన్న వెంటనే విమానంలో వచ్చాడు. హాస్పటల్‌లో అక్కను చూసి కళ్లలో నీరు పెట్టుకున్నాడు.
“అక్కను నేను బ్రతికిస్తా… మీరు ఆందోళన పడకండి” అని డాక్టర్లతో కలిసి ప్రత్యేక మందులు వాడించాడు. కొద్దికొద్దిగా మీరా ప్రాణం నిలకడ పడింది.
ఆ నాలుగు రోజులు రమేశ్వరి తన ఇంటి వాళ్లలా సేవ చేసింది. మీరా పిల్లలను తమ్ముడు భార్య దగ్గర ఉంచి చూసుకున్నారు.
కొన్ని రోజులకి మీరా ఆరోగ్యం కొంత మెరుగైంది. అప్పుడు తమ్ముడు రమేశ్వరి దగ్గరకు వచ్చి చేతులు జోడించి అన్నాడు:
“మీరు చేసిన సహాయం మాకు ఎప్పటికీ మర్చిపోలేం. ఇప్పుడు అక్కను మెరుగైన చికిత్స కోసం అమెరికాకు తీసుకెళ్తున్నాను.”
అని నమస్కరించాడు.
రమేశ్వరి ఒక కవరును ఇచ్చింది.
“ఇదిగోండి… మీ ఆస్తి.”
తమ్ముడు ఆశ్చర్యంగా చూసాడు.
“నాకెందుకమ్మా ఈ ఆస్తి? ఇది అక్క తన బిడ్డ కోసం ఇచ్చింది. బాబును నేను తీసుకొని వెళ్తున్నాను… అదే మా సంపద.”
అని కళ్లలో తడి తో అన్నాడు.
ఆ మాట విన్న రమేశ్వరి హృదయం కదిలిపోయింది.
తే.గీ.
ప్రాణముండుటే ధనమని పలుక వేళ
ప్రేమమానవత్వ బంధము మూర్తియగును
దానధర్మముకన్న ను దయ గుణంబు
జీవితం స్వర్ణరేఖలై వెలసునయ్య
భావం
ప్రాణం నిలబడటం నిజమైన సంపద.
మనుషుల మధ్య ప్రేమబంధమే మానవత్వానికి రూపం.
దానం కంటే దయ గొప్పది.
అలాంటి హృదయంలోనే జీవితానికి “స్వర్ణరేఖ” కనిపిస్తుంది.
రామ్మూర్తి మీకధ మీరా ఆస్తి పొందిందా, మీ శ్రీమతి ఎన్నో మలుపులు ఎప్పుడు కలిసి కాపురం చేశారురా, అప్పుడే తొందరెందుకు నీకు చెప్పుతా ఏదోస్టేషన్ వచ్చింది కష్టవిశ్రాంతి తీసుకో తరువాత కధ తరువాత...
ప్రాంజలి ప్రభ.. స్వర్ణ రేఖలు (20) —
మల్లాప్రగడ రామకృష్ణ
మీరా ఆరోగ్యం కొంత మెరుగైన తర్వాత ఆమెను ప్రత్యేక విమానంలో అమెరికాకు తీసుకెళ్లడానికి ఏర్పాట్లు చేశారు. బయలుదేరే రోజు రమేశ్వరి కూడా విమానాశ్రయం వరకు వచ్చింది.
బాబు చేతిలో ఒక కవరును పెట్టింది.
మీరా తమ్ముడు ఆశ్చర్యంగా అడిగాడు:
“ఏమిటమ్మా ఈ కవరులో?”
రమేశ్వరి నెమ్మదిగా నవ్వింది.
“నేను చెప్పేది ఏముంది? స్నేహానికి ఇంతకన్నా ఏమి చేయలేను.”
అని అందరికీ నమస్కరించి వెనుదిరిగింది.
విమానము కదలడం ప్రారంభించింది. కొద్దిసేపటికి మీరా తమ్ముడు ఆ కవరును తెరిచి చూశాడు.
అందులో ఉన్నవి మీరా ఆస్తి పత్రాలు.
మీరా పేరుతో ఉన్న మొత్తం ఆస్తిని
తమ్ముడు పేరుతో మార్చి ఇచ్చిన పత్రాలు.
ఆ పత్రాలు చూసి అతని కళ్లలో నీరు నిండింది.
“ఇంత పెద్ద మనసు…!” అని నిశ్శబ్దంగా అనుకున్నాడు.
ఆకాశంలోకి ఎగిరిన విమానం కిటికీ బయట చూసుకుంటూ
మీరా మౌనంగా కన్నీరు తుడుచుకుంది.
ఆ రోజు వారి జీవితాల్లో
ఒక కొత్త స్వర్ణ రేఖ గీసిన రోజు.
తే.గీ.
స్నేహమొకటే సంపదగు నిస్వార్థ హృదయంబున్
దానమెల్లకన్న దయగుణంబు మిన్నగున్
మనసు మాధుర్యమే మానవత్వ దీపమై
జీవితంబున స్వర్ణరేఖ వెలసునయ్యా
భావం:
నిజమైన సంపద స్నేహం.
దానం కంటే దయ గొప్పది.
మనసులోని మాధుర్యమే మానవత్వానికి వెలుగు.
అలాంటి హృదయంలోనే జీవితానికి “స్వర్ణ రేఖ” ప్రత్యక్షమవుతుంది. 🌿
***

No comments:
Post a Comment