1*. శ్లో|| మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదరః|
అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు అందుచే ఓ మానవుడా సావధానుడవై ఉండుము.
2. శ్లో|| జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయా దుఃఖం పునః పునః|
సంసార సాగరం దుఃఖం తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా:- ఈ జన్మము, వృద్ధాప్యము, భార్య, ఈ సంసారము ఇవన్నియు దుఃఖ భరితములు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.
3. శ్లో|| కామశ్చ, క్రోధశ్చ, లోభశ్చ దేహే తిష్ఠతి తస్కరాః|
జ్ఞాన రత్నాపహారాయ తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా :- కామము, క్రోధము, లోభము మొదలైన అరిషడ్వర్గములు మనలోని జ్ఞానమనెడు విలువైన రత్నములను దొంగిలించుటకై మన దేహమునందు దాగియున్నదొంగలు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.
4. శ్లో|| ఆశయా బధ్యతే జంతుః కర్మణా బహు చింతయా|
ఆయుక్షీణం న జానాతి తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా:- ఈ మనుష్యులు ఎల్లప్పుడూ ఎదియో చేయవలెనను ఆశతోనే జీవింతురు. కానీ తరిగిపోవుచున్న జీవిత కాలమును గుర్తింపరు.
కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.
5. శ్లో|| సంపదః స్వప్రసంకాశాః యౌవనం కుసుమోపమ్|
విధుఛ్చచంచల ఆయుషం తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా:- మన సంపదలన్నియు ఒక కలవంటివి, యౌవనము ఒక పూవు వలె మనజీవితములో స్వల్ప కాలము మాత్రమే ఉండునది. ఈ జీవితమూ మెరుపు వలె క్షణభంగురము. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.
6. శ్లో|| క్షణం విత్తం, క్షణం చిత్తం, క్షణం జీవితమావయోః|
యమస్య కరుణా నాస్తి తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా:- ధనము, బుద్ధి, జీవితము ఇవన్నియు క్షణభంగురములు. మన ప్రాణములను హరించుటకై వేచియున్న యముడు ఏ మాత్రము దయ జూపడు. కావున ఓ మానవుడా సావధానుడవై ఉండుము.
7. శ్లో|| యావత్ కాలం భవేత్ కర్మ తావత్ తిష్ఠతి జంతవః|
తస్మిన్ క్షీణే వినశ్యంతి తత్ర కా పరివేదన||
తా:- మనుషులకు వారి కర్మానుసారము జీవితకాలము ఉండును. అది తీరిన తరువాత వారును నశింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?
8. శ్లో|| ఋణానుబంధ రూపేణ పశుపత్నిసుతాలయః|
ఋణక్షయే క్షయం యాంతి తత్ర కా పరివేదన||
తా:- గత జన్మ ఋణానుబంధముచే పశు, పత్ని పుత్ర గృహ లాభము గల్గును. ఆ ఋణము తీరగనే వారును పోవుదురు. దానికై దుఃఖించుట ఎందులకు?
9. శ్లో|| పక్కాని తరుపర్ణాని పతంతి క్రమశో యథా|
తథైవ జంతవః కాలే తత్ర కా పరివేదన||
తా:- చెట్ల యొక్క పండిన ఆకులు ఏ విధముగా రాలిపోవునో అదే విధముగా ఆయువు తీరిన వారు మరణింతురు. దానికై దుఃఖించుట ఎందులకు?
10. శ్లో|| ఏక వృక్ష సమారూఢ నానాజాతి విహంగమాః|
ప్రభతే క్రమశో యాంతి తత్ర కా పరివేదన||
తా:- రాత్రి చెట్లపై వివిధ జాతుల పక్షులు చేరును. మరల సూర్యోదయము కాగానే ఒక్కటోక్కటిగా ఎగిరిపోవును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు?
11. శ్లో|| ఇదం కాష్టం ఇదం కాష్టం నధ్యం వహతి సంగతః|
సంయోగాశ్చ వియోగాశ్చ కా తత్ర పరివేదన||
తా - ప్రవహించుచున్ననది లో కళేబరములు తేలుచు, ఒకప్పుడు కలియుచు ఒకప్పుడు విడిపోవుచుండును. ఇదే విధముగా మానవ జీవితములందును సంయోగ వియోగములు సంభవించును. దానికై దుఃఖించుట ఎందులకు?
83-ఉపనిషత్ సూక్తి
108 ఉపనిషత్తులలో గల 108 మహా వాక్యములు
83. స ఏవ జగతస్సాక్షీసర్వాత్మా విమలాకృతిః||
(కఠరుద్రోపనిషత్)
- అతడే జగత్తునకు సాక్షి, సర్వాత్మ విమలాకారము కలవాడు.
లోకా స్సమస్తా స్సుఖినోభవన్తు!
.........
*మన కష్టాలకు కారణం భయమే. నిర్ణయత్వం క్షణాల్లో స్వర్గప్రాప్తిని కలిగిస్తుంది.
*.విధేయతను అలవరచుకోవడమే ప్రధమ ధర్మం.
........
🧘♂️సంతోషం🧘♀️
సంతోషంగా ఉండాలన్న దృఢమైన నిశ్చయం మీకు సాయపడుతుంది. ఇబ్బంది అంతా మీ పరిస్థితులలోనే ఉందన్న తప్పుడు ఆలోచనలు పెట్టుకొని అవి మారడం కోసం నిరీక్షిస్తూ ఉండకండి.
విచారాన్ని చిరకాలపు అలవాటుగా చేసుకోకండి; దానివల్ల మీరు, మీ తోటి వాళ్ళు బాధపడవలసి వచ్చేలా చేయకండి. మీరు సంతోషంగా ఉంటే అది మీకు, ఇతరులకు కూడా మేలు.
మీకు సంతోషం ఉంటే అన్ని ఉంటాయి; సంతోషంగా ఉండడమంటే ఈశ్వరుడితో ఏకీభావంతో ఉండడం. సంతోషంగా ఉండడానికి కావలసిన శక్తి ధ్యానం ద్వారా లభిస్తుంది.
శ్రీ పరమహంస యోగానంద / సఫలతా నియమం
.......
శ్లోకం .. సుర మందిర తరు మూల నివాసః శయ్యా భూతల మజినం వాసః|
సర్వ పరిగ్రహ భోగ త్యాగః కస్య సుఖం న కరోతి విరాగః ||
గుడిలో చెట్టుకింద నివాసము , నేలపై నిద్ర, తోలును వస్త్రంగా ధరించుట, దేనినీ స్వీకరించకపోవుట, భోగమును అనుభవించకపోవుట అను వైరాగ్యము ఎవడికి సుఖమివ్వదు?
శ్లోకం ..నారీ స్తనభర నాభీదేశం *దృష్ట్వా మా గా మోహావేశమ్
ఏతన్మాంస వసాది వికారం మనసి విచింతయా వారం వారమ్ ||3||
భావం : స్త్రీల వక్షోజ సౌందర్యాన్ని చూచి మోహావేశం చెందవద్దు. అవి నిజంగా మాంసం, కొవ్వు మొదలైన అసహ్యకర పదార్థములతో కూడినవని నీ మనస్సులో మళ్ళీ మళ్ళీ విచారణ చేస్తూ ఉండు.
స్త్రీల వక్షోజ సౌందర్య స్త్రీల పట్టు
కొవ్వు మాంసము అయినను కొత్త గుండు
మళ్ళి చూడబుద్ధి మనసు మౌన బుద్ది
పురుషులకు వికార మవని పూర్తి మేను
శ్లోకం ..ఉత్పల సార విందస్య మత్స్యస్య కుముదస్య చ ౹
ఏకాయో ని ప్రసూతానాం తేషాం రూపః పృథక్ పృథక్ ౹౹
నీల తామర పువ్వు,కమలము,చేప,తెల్ల తామర ఇవి ఒకే నీటిలో పుట్టినా రూపాలు మాత్రం వేరే వేరేగానే ఉంటాయి.
శ్లోకం ..ఆచార్యం చ ప్రవక్తారం పితరం మాతరం గురుం ౹
న హింసాత్సజ్జనాన్ గాశ్చ సర్వాం తశ్చయైవ తపస్వినః ౹౹🌺
పాఠం నేర్పినవారిని,ఉపదేశం ఇచ్చినవారిని,తల్లిదండ్రులను,గురువులను,పెద్దవారిని,సజ్జలను,గోవుల్ని మరియు ఏ తపస్వీయులను హింసించరాదు.
శ్లో𝕝𝕝 దానోపభోగవన్ద్యా యా సుహృద్భార్యా న భుజ్యతే।
పుంసాం సమీహతా లక్ష్మీః అలక్ష్మీః క్రమశో భవేత్॥
తా𝕝𝕝 ఏ పురుషుడిని ఆశ్రయించి ఉన్న ఏ ధనమైతే దానధర్మాదులకు వినియోగించబడదో, భార్యాబిడ్డలచే, మరియు మిత్రులచే అనుభవించబడదో అట్టి ధనము క్రమంగా ఆ పురుషుడిని వీడిపోవును.
శ్లోకం ..యో యత్ర కుశలః కార్యే తం తత్ర వినియోజయేత్ ౹
కర్మస్వధృష్ట కర్మా యచ్ఛాస్త్రజ్ఞోపి విముహ్యతి ౹౹
ఏ పనిలో ఎవరికి నైపుణ్యం ఉంటుందో అటువంటి వ్యక్తిని ఆయా పనులకు నియమించాలి.అన్నీ నాకు తెలుసు,నేనే శాస్త్రజ్ఞుడని పనులలో చాకచక్యం లేకుండా వెళ్ళితే దారి తప్పినట్టే.
శ్లో === అనిత్యాని శరీరాణి విభావో నైవ శాశ్వతః
శ్లోకం .. రసోహమప్సు కౌన్తేయ ప్రభాస్మి శశిసూర్యయో: |
ప్రణవ: సర్వవేదేషు శబ్ద: ఖే పౌరుషం నృషు ||
ఓ కుంతీపుత్రా! నీటి యందు రుచిని, సూర్యచంద్రుల యందు కాంతిని, వేదమంత్రములందు ఓంకారమును, ఆకాశము నందు శబ్దమును, నరుని యందు సామర్థ్యమును నేనే అయి యున్నాను.
శ్లోకం .. కర్మజైర్వ్యాధిభిర్‍బాహ్యైరాన్తరైర్నైవపీడ్యతే ।
ఇతి విద్వద్భిరీశానః సోఽనామయ ఇతీర్యతే ॥
ఈతని కీర్తిని, యశమును, మహిమను కీర్తించుట వలన జీవులకు పుణ్యము సంప్రాప్తించును. ఈతనిది పుణ్యకరమగు కీర్తి కనుక ఆ విష్ణుదేవుడు పుణ్యకీర్తి అనబడును.
శ్లోకం ..వచనైరసతాం మహీయసో న ఖలు వ్యేతి గురుత్వముద్దతైః ౹
కిమపైతి రజోభిరౌర్వరైః అవకీర్ణస్య మణేర్మహార్ఘతా౹౹
దుష్టులు చెప్పే గర్వమైన మాటలతో పెద్దవారి పెద్దతనము ఏదీ ఏ కారణమునకు తక్కువ అవ్వదు.మన్నుతో మూసినా అమూల్యమైన రత్నం వెల ఏమి తక్కువ అవ్వదు.
..కల్పాంతమున జలధి సర్వము తానే ఐనట్లు
నిర్వికార నిరాకార నిర్విశేషమిట్లు
ఈ విధి బ్రహ్మము తానొకటై నిండు
బేధమది కనబడగ తానెటుల ఉండు
(మాత్రా గణనం - అంత్య ప్రాస)
(సౌజన్యము - శంకర విరచిత వివేక చూడామణి)
(402/581)
(తెలుగు కూర్పు : ఇట్టె రమేష్)
(శుభోదయం)
$$ " హితోక్తి " $$
==============
" అంతరంగమందు నద్వైతమే యుండు
బాహ్య మందు ద్వైత భావముండు
యట్లు కాక తత్త్వ మలవడ నేరదు
విశ్వధాభి రామ వినుర వేమ "
( అంతరంగమది చైతన్యము/ప్రాణము/పరమాత్మ/
బ్రహ్మము, బాహ్యము నశించే భౌతిక దేహం, ఈ
భౌతిక దేహము తనకు భిన్నమైన దేవుడిని ద్వైత
భావనగ కల్పన చేసుకొనును, ఈ కల్పనలు
జ్ఞానార్జనగ సమసిన నాడు అంతరంగపు
అద్వైతం తానుగ వెలుగును)
శ్లోకం ..మితాహరం వినా యస్తు యోగారంభంతు కారయేత్|
నానారోగ భవేత్తస్యకించిత్ యోగో న సిధ్యతే||
ఆహర నియమం లేకుండా యోగాన్ని సాధన చేసే వాడు ఫలితం ఏమీ పొందకపోగా అనేక రకాల జబ్బుల పాలు అవుతాడు.
శ్లోకం ..వయసి గతే కః కామవికారః శుష్కే నీరే కః కాసారః |
క్షీణే విత్తే కః పరివారో జ్ఞాతే తత్త్వే కః సంసారః ||
వయసు మళ్ళిన వానికి కామ వికార మెక్కడిది? నీరు ఎండిపోతే అది చెరువు ఎలా అవుతుంది? అట్లే, ధనము లేనప్పుడు పరివార మెట్లుంటుంది? తత్వము అనుభూతమైన తర్వాత సంసార బంధము ఏముండును?
తనువులో శక్తి నశించిన వికారాలు తగ్గుట పటుత్వము కోల్పోయి కామ క్రీడలునశించుట నీరంతా ఎండిపోయిన చెరువనేది ఎచ్చోట ప్రాయాన మనో వికారములను అదుపు చేయుట పరమాత్మునిపై లగ్నము చేసినవాడే గొప్పవాడు కందూర్ 🌺వార్తా చ కౌతుకవతీ విమలా చ విద్యా
శ్లోకం .. లోకొత్తరః పరిమలశ్చ కురంగనాభే: ౹
తైలస్య బిందురివ వారిణి దుర్నివారం
ఏతత్త్రయం ప్రసరతి స్వయమేవ భూమౌ ౹౹🌺
కుతూహలాన్ని పెంచే వార్త ,ఉత్తమమైన విద్య,కస్తూరి మృగ విశేషమున్న సువాసన ఈ మూడు నీటిలోపల ఉన్న నూనె బిందువులా లోకంలో తమకు తాముగా ప్రసరిస్థాయి.
336) యోగవాసిష్ఠ రత్నాకరము
......
1-81
సంసారవాసనాజాలే ఖగజాల ఇవాఖునా
త్రోటితే హృదయగ్రన్థౌ శ్లథే వైరాగ్యరంహసా
ఎలుకచే పక్షుల వల కొఱికివేయబడునట్లు, (వివేకముచే) సంసార వాసనా సమూహము విచ్ఛిన్నమై పోవ, వైరాగ్యవేగముచే అజ్ఞాన హృదయగ్రంథులు శిథిలమైపోవ, జీవుని మనస్సు పరమశాంతి నొందును.
1-82
కాతకం ఫలమాసాద్య యథా వారి ప్రసీదతి
తథా విజ్ఞానవశతః స్వభావః సంప్రసీదతి.
చిల్లగింజచే నీరు నిర్మలమగునట్లు, విజ్ఞానముచే జీవుని మనస్సున్ను మహాప్రసన్నత్వమును, శాంతిని బొందును.
1-83
నీరాగం నిరుపాసఙ్గం నిర్ద్వన్ద్వం నిరుపాశ్రయమ్ వినిర్యాతి మనో మోహాద్విహగః పఞ్జరాదివ.
కామము లేనిదియు, విషయగుణానుసంధానవర్జితమైనదియు, సుఖదుఃఖాది ద్వంద్వరహిత మైనదియు, భోగాదుల నాశ్రయింపనిదియునగు మనస్సు పంజరమునుండి పక్షివలె అజ్ఞానమునుండి లెస్సగ బయల్వెడలిపోవును.
.....
శ్రీ అన్నమాచార్య సంకీర్తన
పాడిన వారు: హరిణి
రాగము: సౌరాష్ట్రం
స్వరకర్త: శ్రీ సాయి మధుకర్
రేకు: 1975-1
సంపుటము: 29-385.
॥పల్లవి॥ ఎట్టున్నదో నీ చిత్తము యెఱఁగమయ్యా
చుట్టపు వరుసలివి చూచుకొనేవయ్యా!!
॥చ1॥ చెలిచే నప్పుడు నీవు చెప్పి పంపిన సుద్దులు
వెలఁది వేడుకతోడ వినెనయ్యా
వలపులు లేకలపై వాఁతలఁ జదువుకొని
నలిరేఁగి పకపక నవ్వెనయ్యా!!
॥చ2॥ అచ్చలాన నీ వుంగర మానవాలు చూచుకొని
ముచ్చటతోఁ జేతులెత్తి మొక్కెనయ్యా
మచ్చిక నీవు మన్నించే మన్నన దలఁచుకొని
కచ్చు పెట్టి సంతోసానఁ గడుఁ బొగడేనయ్యా!!
॥చ3॥ కడు బత్తి సేసి నీవు కాఁగిలించుకొన్నందుకు
కడఁకతోడ మనసు గరఁగెనయ్యా
యెడయక శ్రీవేంకటేశ నీ గుణ మెరిఁగి
బడివాయనని నీతో బతిమి వట్టెనయ్యా!!
........
శ్లోకం ..కోఽహం కథమిదం చేతి యావన్న ప్రవిచారితమ్
సంసారాడమ్బరం తావదన్ధకారోపమం స్థితమ్
“నేనెవడను, ఈ జగత్తెట్లు ఉద్భవించినది”అను ఈ ప్రకారముగ బాగుగ విచారింపబడనంతవఱకును - అంధకారమువంటి ఈ సంసార ఆడంబరము ఉండుచునే యుండును.
శ్లోకం ..మిథ్యా భ్రమభరోద్భూతం శరీరం పదమాపదామ్
ఆత్మభావనయా వేదం యః పశ్యతి స పశ్యతి.
మిథ్యాభ్రమ సమూహమువలన ఉద్భూతమైనదియు, ఆపదలకు నిలయమునగు ఈ శరీరము (ఉపాధి) లేదని (మిథ్యయని) ఆత్మ భావనవలన ఎవడెఱుఁగునో, అతడే యథార్థజ్ఞానము కలవాడు.
శ్లోకం ..దేశకాలవశోత్థాని న మమేతి గతభ్రమమ్
శరీరే సుఖదుఃఖాని యః పశ్యతి స పశ్యతి.
“దేశ,కాలవశముగ గలుగు ఈ సుఖదుఃఖములన్నియు, ఉపాధికేకాని పూర్ణానందాత్మ స్వరూపుడనగు నాకు గాదు” అని భ్రమరహితుడై యెవడు తెలిసికొనునో, ఆతడే నిజముగ తెలిసికొనినవాడు.
......
84-ఉపనిషత్ సూక్తి 🧘♀️*
*108 ఉపనిషత్తులలో గల 108 మహా వాక్యములు*
*84. స్వ వ్యతిరిక్త వస్తుసంగరహిత స్మరణం విభూషణమ్||*
*(భావనోపనిషత్)*
*- తనకంటే వేరుగానున్న వస్తువులతో సంగబుద్ధి పెట్టుకొనకుండ ఉండటయే విభూషణము.*
*లోకా స్సమస్తా స్సుఖినోభవన్తు!*
......
*భవిష్యత్తులో ఏం జరుగుతుందోనని ఎప్పుడూ లెక్కలు పెట్టేవాడు దేన్నీ సాధించలేడు. సత్యమని, మంచిదని, నీవు అర్ధం చేసుకున్న దాన్ని తక్షణమే ఆచరించు.*
...........
*హనుమంతుణ్ణి, జగజ్జననినీ స్మరించండి.మరుక్షణం మీలోని దౌర్బల్యం, పిరికితనాలు మటుమాయమవుతాయి.*
.......
*🧘♂️సంతోషం🧘♀️*
*ఎల్లప్పుడూ వ్యక్తిగత సంతోషం కోసం పాటుపడే బదులు ఇతరులను సంతోషపెట్టే ప్రయత్నం చెయ్యండి. ఆధ్యాత్మికంగా , మానసికంగా , భౌతికంగా ఇతరులకు సేవచెయ్యడం వల్ల మీ అవసరాలు కూడా నెరవేరుతున్నట్లు గ్రహిస్తారు. ఇతరుల సేవలో మీ స్వార్ధాన్ని మరచిపోయినప్పుడు, మీరు కోరకుండానే మీ ఆనందకలశం నిండుతుందని మీరు తెలుసుకుంటారు.*
*శ్రీ పరమహంస యోగానంద / యోగదా సత్సంగ పాఠాలు.*
.....
* శ్లోకం .. యోగరతో వా భోగరతోవా సంగరతో వా సంగవీహినః|*
*యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవ||*
*యోగమును ఆచరించువాడుకానీ - సుఖములను అనుభవించువాడుకానీ, బంధములు పెంచుకొనువాడుకానీ - తెంచుకొనువాడుకానీ, ఎవడి మనస్సు పరబ్రహ్మ యందు లగ్నమగునో వాడు ఆనందించుచునే ఉండును.*
.........
*శ్రీ అన్నమయ్య సంకీర్తన*
ఏ నోరువెట్టుక నిన్ను నేమని కావుమందును
నే నిన్నుఁ దలఁచినది నిమిషమూ లేదు!!
॥పల్లవి॥
పాయమెల్ల సఁసారముపాలే పడితిఁ గాని
చేయార నీసేవ నేఁ జేసుట లేదు
కాయమెల్ల కాంతలకే కడుశేషమాయఁగాని
నీ యవసరములందు నే నొదుగలేదు!!
॥ఏనో॥
చిత్తము ఆసల పాలే సేసి బదికితిఁ గాని
హత్తి నిన్ను ధ్యానము సేయఁగలేదు
సత్తెపు నా నాలుకెల్ల చవుల కమ్మితిఁ గాని
మత్తిలి నీ కీర్తనము మరపుటా లేదు!!
॥ఏనో॥
పుట్టుగెల్లా నజ్ఞానముపొంతనే వుంటిఁ గాని
వొట్టి నీవిజ్ఞానము నొల్లనైతిని
యెట్టు నన్ను మన్నించితి విందుకే పో వెరగయ్యీ
నెట్టన శ్రీవేంకటేశ నిన్నడుగా లేదు!!
॥ఏనో॥
..........
శ్లోకం ..అపారపర్యన్తనభో దిక్కాలాదిక్రియాన్వితమ్
అహమేవేతి సర్వత్ర యః పశ్యతి స పశ్యతి.
“అపారదిక్కాల ఆకాశాది సహితమై, ఉత్పత్తి చలనా క్రియాన్వితమైనట్టి ఈ ప్రపంచమున సర్వత్ర నేనే యున్నాను” అని యిట్లెఱుఁగువాడే నిజముగ ఎఱుఁగు వాడగును.
శ్లోకం ..అత్మానమితరచ్చైవ దృష్ట్యా నిత్యావిభిన్నయా
సర్వం చిజ్జ్యోతిరేవేతి యః పశ్యతి స పశ్యతి.
“జీవుడు, జగత్తు ఈ సమస్తము చిదాత్మజ్యోతియే” అని ఇట్లు నిత్యము ఆత్మాభిన్న దృష్టితో జగదాదుల నెవడు వీక్షించునో అతడే నిజముగ వీక్షించువాడగును.
శ్లోకం ..ఆధివ్యాధిభయోద్విగ్నో జరామరణజన్మవాన్
దేహోఽహ మితి యః ప్రాజ్ఞో న పశ్యతి స పశ్యతి.
“శారీరక, మానసిక వ్యాధులచేతను, భయముచేతను పీడింపబడునదియు, జన్మ మరణ వార్ధక్యములతో గూడినదియునగు ఈ దేహము నేను కాను” అని యిట్లు ఏ ప్రాజ్ఞుడు తెలిసికొనునో అతడే నిజముగ తెలిసికొనినవా డగును.
.........
: *🧘♂️85-ఉపనిషత్ సూక్తి 🧘♀️*
*108 ఉపనిషత్తులలో గల 108 మహా వాక్యములు*
*85. సర్వ దేవాత్మాకోరుద్రఃసర్వదేవాః శివాత్మకాః||*
*(రుద్రహృదయోపనిషత్)*
*- సర్వ దేవాత్మకుడు రుద్రుడు. దేవతలందరును శివాత్మకులు.*
*లోకా: స్సమస్తా: స్సుఖినోభవన్తు!*
....
.........
*🧘♂️సంతోషం🧘♀️*
*మౌనంలో కలిగిన కొద్ది ఆనందం చాలు అనుకోకండి. దివ్యానందం దాని కంటే చాలా అధికమైనది. ఉదా: విశ్రాంతి కోసం చాలా తపించి పోతున్నప్పుడు, మీరు నిద్రపోవడానికి వీలు లేదని శిక్ష విధించారనుకోకండి. అదే సమయంలో ఎవరైనా వచ్చి," సరే, ఇంక మీరు నిద్రపోవచ్చు" అంటే నిద్రపోయే ముందు మీ కెంత ఆనందం కలుగుతుందో ఊహించుకోండి. దానిని లక్ష చేత గుణించండి. అయినప్పటికి ఆ ఆనందం దైవసంసర్గంలో పొందే ఆనందానికి సరితూగదు.*
*శ్రీ పరమహంస యోగానంద / యోగదా సతంగ పాఠాలు*
.
*ॐ卐సుభాషితమ్ॐ
*శ్రీ ఆదిశంకరాచార్య విరచితము భజగోవిందం*
*20) భగవద్ గీతా కించిదధీతా గంగా జలలవ కణికాపీతా|*
*సకృదపి యేన మురారి సమర్చా క్రియతే తస్య యమేన న చర్చా ||*
*కొంచమైనా భగవద్గీత చదివి, ఒక కణమైనా గంగా జలం త్రాగి, ఒక్కసారైనా విష్ణువును పూజించిన వానిని యముడేమి చేయగలడు?*
*🧘♂️45-కర్మ - జన్మ🧘♀️*
🕉️🌞🌏🌙🌟🚩
*"కర్మ ఫలం"* లో - ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాం.
*మనిషికి జంతు జన్మ వస్తుందా?*
ప్రారబ్ద కర్మలో భాగంగా మనిషికి జంతు, పక్షి, జలచరాల జన్మలు వస్తాయనడానికి మహా భారతంలోని శాంతి పర్వంలో చెప్పిన ప్రమాణం ఇది.
*యథా కాకాశ్చ గృథ్రాశ్చ తథైవోపధి జీవినః*
*ఊర్థ్వం దేహవిమోక్షాత్ తే భవన్త్యేతాసు యోనిషు*
మ
*భావం:-*
*కపటంతో జీవించేవారు కాకులు, గద్దల వలె ఉంటారు. వారు మరణించిన తర్వాత అలాంటి నీచ జన్మలనే పొందుతారు.*
ఎప్పుడైతే మన కర్మల ఖాతా దుష్కర్మలతో సగం కంటే ఎక్కువగా నిండుతుందో అప్పుడు మనిషి జంతు జన్మలలోకి వెళ్ళి ఆ దుష్కర్మలని ఆ జన్మానుభవంతో వదిలించుకుంటే కాని తిరిగి మనిషి జన్మ లభించదు అని ఛత్రపతి శివాజి గురువు, సమర్ధ రామదాసు 'దాస బోధ' లో చెప్పాడు.
ఎక్కడ వివేకం, అంటే, మంచి-చెడు అనే విచక్షణ వుంటుందో బంధ హేతువైన కర్మ అక్కడ జరుగుతుంది. అలాంటి జన్మ ఒక్క మనిషి జన్మే. జంతువులకి స్వతంత్రంగా ఆలోచించి కర్మ చేసే వివేకం ఉండదు. కాబట్టి జంతు జన్మల్లో చేసే ఏ కర్మా బంధం కాదు.
జంతు జన్మల్లో జరిగే కర్మలన్నీ కేవలం ఫలితం అనుభవించే, అంటే భోగించే కర్మలే తప్ప బంధించే నిర్మాణ కర్మలు జరగవు. ప్రపంచంలో ఏ కాలంలోనైనా ఏ దేశంలోనైనా పులి చేసే కర్మలన్నీ ఒకేలా ఉంటాయి.
పక్షి చేసేవి ఒకేలా ఉంటాయి. ఒకదానికి ఒకటి విరుద్ధంగా ఉండవు. కాని ఇద్దరు మనుషుల జీవితాలు పరిశీలిస్తే.. వారు చేసే కర్మలు చాలా విరుద్ధంగా ఉంటాయి. కారణం వారికి ఉన్న వివేకాన్ని లేదా స్వేచ్ఛా చిత్రాన్ని ఉపయోగించడమే.
అధికంగా పేరుకున్న చెడు కర్మలని వదిలించడానికే పరమాత్మ జీవులకి జంతు జన్మలని ఇస్తాడు. లేకపోతే మనిషిగానే పుట్టిస్తూ పోతే చెడు కర్మల నిధిని అతను మరింతగా పెంచుకుపోయే అవకాశం ఉంటుంది. దుష్ట కర్మల ఫలమైన జంతు జన్మ ఎందుకు బాధాకరమో చూద్దాం.
ఓ పిల్లికి ఆకలేస్తే దానికి ఏ తోటి పిల్లీ ఆహారం తెచ్చివ్వదు. ఏ జంతువు ఆహారం అదే జీవితాంతం ఏ రోజుకా రోజు సంపాదించుకుని తీరాల్సిందే. లేదా ఆకలితో మాడాలి. మనిషి విషయంలో అలా కాదు.
నెల రోజులు పక్క మీద ఉన్నా ఆహారం ఇచ్చేవారు ఉంటారు. ఓ పులికి జబ్బు చేస్తే ఏ సాటి పులి దానికి వైద్యం చేయకపోగా, స్వాంతనని కూడా ఇవ్వలేదు. మనిషికి అలా కాదు.
ప్రాణాంతకం కాని దాదాపు ప్రతీ రోగానికి, చికిత్స చేసి, బాధా నివారణని చేసే మందుని పక్క మీదకి తెచ్చిచ్చే సాయం ఉంటుంది. కాలు పోయిన కుక్క కుంటుతూనే నడవాలి. దానికి జైపూర్ కాలుని అమర్చేవారే ఉండరు. వర్షాన్ని, ఎండని, చలిని, అది అనుభవించి తీరాల్సిందే.
మనిషి జన్మ అన్నిటికన్నా ఎందుకు ఉత్కృష్టమైన జన్మంటే, మనిషికి తోటి మనిషి సహకారం ఉంటుంది. అతను తన సంతోషాన్ని ఇతరులతో పంచుకుంటే కాని చక్కగా అనుభవించలేడు. కాబట్టి అతని అనందంలో చాలామంది పాలు పంచుకుంటారు.
అలాగే అతనికి కష్టం వస్తే తోటివారు దాన్ని తీర్చడానికి సహాయం చేస్తారు. కాబట్టి మనిషి జన్మ ఎప్పుడూ సౌకర్యవంతమైనదే. అందుకని సుకర్మలు అధికంగా, దుష్కర్మలు తక్కువగా చేస్తే మంచి మానవ జన్మ వస్తుంది. పుణ్య రాశి తగ్గి, పాప రాశి పెరిగే కొద్దీ, అనారోగ్య, పేద, తక్కువ స్థాయి మనిషి జన్మలు వస్తాయి.
మాతా అమృతానందమయి తన శిష్యులతో ఓ సారి తిరువణ్ణామలైకి వెళ్ళినప్పుడు అరుణాచలానికి ప్రదక్షిణ చేయడం పూర్తయింది. రోడ్డు పక్కన ఓ పాములని ఆడించేవాడు నాగస్వరాన్ని ఊదుతున్నాడు.
అమ్మ వెళ్ళి అతని ముందు కూర్చుని ఆ నాదానికి అనుగుణంగా పాము ఆడడం చాలా ఆసక్తిగా చూసింది. తన శిష్యులని అమ్మ అడిగింది, “పిల్లల్లారా, పాములకి ఎందుకు కాళ్ళు చేతులూ ఉండవు?” ఆమె అమాయకపు ప్రశ్న వారందరికీ నవ్వు తెప్పించింది.
అప్పుడు అమ్మే సమాధానం చెప్తూ, “పూర్వ జన్మలో వారు కాళ్ళూ, చేతులూ సరిగ్గా ఉపయోగించి ఉండరు. పిల్లల్లారా, గుర్తుంచుకోండి. దేవుడు ఇచ్చిన అవయవాలని ఉపయోగించకపోయినా లేదా తప్పుగా ఉపయోగించినా ఇలాంటి జన్మ ఎవరికైనా రావచ్చు."
పూర్వం చీరాలలో ఉండే ఓ అవధూత ఓ ప్రభుత్వాఫీసు బయట కూర్చుని, ఆఫీసులో పనిచేసే కొందర్ని చూసి వారు తర్వాతి జన్మలో తేళ్ళల్లా పుడతారు అనేవాడు.
కారణం ఈ జన్మలో వారు ఇతరులని అకారణంగా బాధించేవారు. మనం ఈ జన్మలో ఏవిధంగా ప్రవర్తిస్తే ఆ మనస్థత్వానికి అణుగుణమైన జన్మే మనకి వస్తుంది. అధిక పాపం చేసినవారు క్రిమి కీటకాదులు, పక్షులు, జంతువులు, జలచరాలుగా, ఆఖరికి ముళ్ళచెట్లుగా కూడా పుట్టక తప్పదు.
మనిషి జంతువుగా పుట్టిన సందర్భాలు అనేకం వివిధ మహాత్ముల జీవిత చరిత్రల్లో వస్తాయి. అలాంటివి కొన్ని పరిశీలిద్దాం.
మనిషి నికృష్టపు పనులు చేస్తే జంతు జన్మకి వెళ్ళడం గురించి శ్రీసాయి సత్ చరిత్రలో వస్తుంది. శివుని ధనాన్ని కాజేసి, ఒకరి మీద మరొకరు విరోధాన్ని పెంచుకున్న వీర బసవప్ప, చెన్న బసవప్పలు ఒకరినొకరు నరుక్కుని మరణించాక, కప్ప, పాముగా జన్మించారు. పాము కప్పని మింగుతూండగా బాబా ఆ కప్పని రక్షించాడు.
తర్వాత బాబా తన దగ్గరున్న భక్తులకి వీర బసవప్ప, చెన్న బసవప్పల వృత్తాంతాన్ని చెప్పారు. మోసం, ద్రోహం, అసూయల్లాంటి నీచ సంస్కారాలు నీచ జన్మలకి దారి తీయిస్తాయనడానికి వీరి కథ ఓ మంచి ఉదాహరణ. మరో ఉదాహరణ కూడా ఆ పుస్తకంలోనే ఉంది.
ఓ రోజు బాబా రెండు మేకలని ముప్ఫై రెండు రూపాయలకి కొని, నాలుగు శేర్ల శనగపప్పుని కొని వాటికి పెట్టించాడు. ఈ బేరంలో బాబా మోసపోయారని తాత్యా కోతే, శ్యామా అన్నారు. బాబా ఆ మేకలని వాటి యజమానికి ఇచ్చేసి చెప్పారు.
“ఇందులో నేను మోసపోయింది ఏమీ లేదు. గత జన్మలో వారు అన్నదమ్ములు. నా మిత్రులు. చిన్నవాడు బాగా చురుగ్గా డబ్బు సంపాదించాడు. పెద్దవాడు సోమరి. అన్న తమ్ముడ్ని చంపి డబ్బు దొంగిలించాలని అనుకోవడంతో ఇద్దరూ శతృవులు అయ్యారు. అన్న ఓ రోజు తమ్ముడ్ని బడితెతో కొడితే, తమ్ముడు అన్నని గొడ్డలితో నరికాడు. ఇద్దరూ మరణించారు. ఆ కర్మ ఫలంతో మేకలుగా పుట్టారు. నేను వీళ్ళని గుర్తుపట్టి తిండి పెట్టి ఓదార్చాను.”
మానవ జన్మ రావడానికి ఈశావాసోపనిషత్తులో ఇచ్చే సలహ ఇది.
*కుర్వన్నేవేహ కర్మాణి జిజీవి షేచ్చతగ్ం సమాః*
*ఏవం త్వయి నాన్యథేతోస్తిన కర్మ లిప్యతే నరే*
*భావం:-*
*శాస్త్ర విహితాలైన కర్మలని చేస్తూ మాత్రమే మానవుడు నూరు సంవత్సరాలు జీవించాలని కోరాలి. మానవ జీవితం మీద ప్రీతి ఉన్నంతవరకూ దుష్కర్మ కాలుష్యాన్ని దూరం చేసుకోడానికి ఇది తప్ప వేరే మార్గం లేదు. దుష్కర్మలు చేస్తే మనిషి జన్మ రాదని తాత్పర్యం.*
*తథాప్రతీనస్తు మాసి మూఢ యోనిషు జాయతీ |*
*భావం:-*
తమోగుణం కలిగి చెడు ప్రవర్తనతో వ్యవహరించే మనిషి, మృతి చెందాక పశు, పక్షి, కీటకాది యోనులలో జన్మిస్తాడు.
*క్షిపామ్యజ ఘ్రమశుభాన్ అసురీ ష్యేవ యోనిషు ||*
*భావం:-*
వారు మరణించినప్పుడల్లా అసురీ యోనుల్లోనే పడిపోతారు.
(అసురీ యోనులంటే, సింహం, పిల్లి, సర్పం, తేలు, కుక్క, పంది, గద్ద లాంటివి. పశు, పక్షి, కీటకాలన్నీ అసురీ యోనులకి సంబంధించినవే. జంతువులంటే, ఆవు, మేక, కుందేలు, గేదె లాంటి శాకాహార జంతువుల యోనులందు పుట్టేవి).
ఐతే కొందరు - జీవికి పురోగమనమే తప్ప తిరోగమనం ఉండదని, అందువల్ల మనిషికి ఇక జంతు జన్మ రాదని భావిస్తారు.
అవతార్ మెహర్ బాబా, రామకృష్ణ పరమహంస శిష్యులలో ఒకరైన అభేదానంద, అరవిందులు, సర్వేపల్లి రాధాకృష్ణ తదితరులు అలాంటి అభిప్రాయం వ్యక్తం చేసిన వారిలో కొందరు.
అదే నిజమైతే మనిషి అంతులేని దుష్కర్మలని ప్రతీ జన్మలో చేసుకుంటూ వెళ్తూంటే పాప రాశి భయంకరంగా పెరిగిపోతూంటుంది. దాన్ని తగ్గించే మార్గం ఏది?
కాబట్టి తార్కికంగా ఆలోచిస్తే వీరి అభిప్రాయంలో లోపం ఉన్నట్లుగా అనిపిస్తోంది. అదీకాక పురోగమనం పొందిన మనుష్యులు కొందరు జంతువుల కన్నా హీనంగా ప్రవర్తించడం మనం చూస్తూంటాం. అదే సమయంలో కొన్ని జంతువులు మనుషుల కన్నా ఉన్నతంగా ప్రవర్తిస్తుంటాయి.
రచయితకి (మల్లాది) తెలిసిన ఒకరు తమ పెంపుడు కుక్క గురించి ఇలా చెప్పారు. అది నిత్యం స్నానం చేసి కాని అన్నం తినదు. మాంసాహారం ముట్టదు. నైవేద్యం పెట్టాక గంట కొట్టాకే తింటుంది. ఓ వరాహం ఓ గుడికి ప్రదక్షిణలు చేయడం మనం 2008లో టివిలో చూసాం. వాళ్ళు చెప్పింది బహుశ నిజంగా పురోగమనం సాధించిన మనషుల గురించై ఉంటుంది.
(తరువాతి భాగంలో - *అంగ వైకల్యానికి కారణం* *"రోగం కర్మఫలం" )*
తిర్యగూర్ధ్యమధస్తాచ్చ వ్యాపకో మహిమా మమ ద్వితీయో న మమాస్తీతి యః పశ్యతి స పశ్యతి.
ఈ ఒకింత త్రైలోక్య మేది కలదో, అది సముద్రమందు తరంగమువలె నా యొక్క అవయవమై యున్నది" అని తన యంతఃకరణమున ఎవడెఱుఁగునో, అతడే నిజముగ జ్ఞానము కలవాడు.
ఆత్మతాపరతే త్వత్తామత్తే యస్య మహాత్మనః భవాదుపరతే నూనం
స పశ్యతి సులోచనః
“నాది, నీది, ఇతరులది ఇట్టి భావములు సాంసారిక దేహాదుల యెడల ఏ మహాత్మునకు నశించిపోయినవో, అతడే నిక్కముగ సత్యమును జూచువాడు. మఱియు అతడే ఉత్తమ నేత్రములు (జ్ఞానము) కలవాడు.”
చేత్యానుపాతరహితం
చిద్భైరవమయం వపుః. ఆపూరితజగజ్జాలం
యః పశ్యతి స పశ్యతి.
తన ఆత్మను దృశ్యబంధరహితముగను, జగత్సమూహము లన్నింటియందును
వ్యాపించి పరిపూర్ణమై యున్న చిత్-భైరవాకార శరీరముగను ఎవడు వీక్షించునో అతడే నిజముగ
వీక్షించువాడగును.
*పవిత్ర ప్రేమ, ప్రతిఘటించని హృదయం - ఇవే సౌశీల్య నిర్మాణంలో దోహదపడేవి.
*మార్గం, పదునైన కత్తి అంచులా నిశితమై, ఎన్నో అవరోధాలతో నిండి ఉంది అయినా నిస్పృహ చెందకండి. లేవండి, మేల్కొనండి, గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకండి.*
శ్రీ అన్నమాచార్య సంకీర్తన
......
రేకు: 154-2
సంపుటము: 2-253
రేకు రాగము: శంకరాభరణం.
ఏకాత్మవాదులాల యిందు కేది వుత్తరము
మీకు లోకవిరోధ మేమిటఁ బాసీ నయ్యలాల!!
॥పల్లవి॥
పాప మొక్కడు సేసితే పాపులే యిందరుఁ గావలదా
యేపున వొకరిపుణ్య మిందరికి రావలదా
కోపంచి యొక్కఁ డసురైతే కోరి యిందరుఁ గావలదా
చూప దేవుఁడొక్కఁడైతే సురలిందరుఁ గావలదా!!
॥ఏకా॥
వొకఁ డపవిత్రుఁ డైతే నొగి నిందరుఁ గావలదా
వొకఁడు శుచై వుండితే వోడ కిందరుఁ గావలదా
వొకని రతిసుఖమంటి యిందరును వొనరఁ బొందవలదా
వొకని దుఃఖ మందరు వూరఁ బంచుకోవలదా!!
॥ఏకా॥
ఆకడ నొకఁడు ముక్తుఁడయితే నందరునుఁ గావలదా
దీకొని యొకఁడు బంధుఁడయితే యిందరుఁ గావలదా
చేకొని శ్రీవేంకటేశుఁ జేరి దాసులయి యుండేటి-
లోకపు మునులనుఁ దెలుసుకోవలదా!!
॥ఏకా॥
....
భావం :-
ఓ నాయనలారా ఒకే ఆలోచనా విధానం ఉన్నవారందరికీ లోకంలో దూరముగా శత్రువు ఏమిటి దీనికి ఏది జవాబు . ఒకడు పాపం చేసితే అందరూ పాపులు కావాలా. గర్వముగా ఒకరి పుణ్యము అందరికీ రావాలా. కోపగించి ఒకడు రాక్షసుడు అయితే కోరి అందరూ కావాలా.
చూడటానికి దేవుడొక్కడైతే ఇందరు దేవతలు కావాలా. ఒకడు అపవిత్రుడైతే శ్రమపడి ఇందరు కావాలా. ఒకడు శుభ్రంగా ఉంటే అతనికి ఇందరు కావాలా. ఒకడి రతిసుఖమునకు ఇందరు ఒప్పుకొని గుంపు కావాలా. ఒకడి దుఃఖమును మనమందరం పంచుకోవాలి.
అక్కడ ఒక్కడు ముక్తి పొందితే అందరికీ కావాలా. ఎదురుకొని ఒకడు బంధువైతే ఇందరు కావాలా. ఆదరించి శ్రీవేంకటేశుని చేరి సేవకులై ఉండేటి లోకమున మనలని తెలుసుకోవలసి ఉంటుంది అంటు అన్నమయ్య ప్రశ్నించారు.
........
*🧘♂️46-కర్మ - జన్మ🧘♀️*
*"కర్మ ఫలం"* లో - ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాం.
*అంగవైకల్యానికి కారణం*
ఇంద్రియాలు చేసే మంచి కర్మ గాని, చెడు కర్మ గాని వాటి యొక్క ఫలాలని ఆయా ఇంద్రియాలే అనుభవించాల్సి ఉంటుంది. కామంతో స్త్రీని చూస్తే గుడ్డివాడిగా పుట్టచ్చు.
చెడు వినడంలో ఉత్సాహం ఉంటే, లేదా అధికారిగా ఉండి ప్రజల ఫిర్యాదులని విని కూడా పట్టించుకోకపోతే చెవిటివాడిగా పుట్టచ్చు.
తిరుగుబోతు లేదా స్త్రీలని తార్చేవాడు నపుంసకుడి జన్మని పొందచ్చు. ఎదుటి వాడి ఓ అవయవానికి నష్టం కలిగిస్తే ఈ జన్మలో ఆ అవయవ నష్టంతో పుట్టచ్చు. ఇవి అవకరానికి కొన్ని కారణాలు మాత్రమే. ఇంకా అనేక ఇతర కారణాల వల్ల కూడా అవకరం రావచ్చు.
****
*రోగం కర్మ ఫలం*
మనం చేసే దుష్కృతాల ఫలాలని శారీరకంగా కాని, మానసికంగా కాని అనుభవిస్తాం అని చెప్పుకున్నాం. ఈ జన్మలో మనకి వచ్చే రోగాలన్నీ పూర్వ జన్మార్జిత కర్మ ఫలాలే. అనేక రోగాల నివారణకి, రుగ్మతలు తగ్గడానికి రోగులు వైద్యశాలలకి వెళ్తున్నారు. వేలకి వేలు ఖర్చుచేస్తున్నారు.
'అసలు నాకే ఈ రోగం ఎందుకు వచ్చింది?” అని వాపోతున్నారు. 'ఇంత దరిద్రమైన రోగం ఇంకోటి ఉండదు' అనుకుంటున్నారు. రోగం ఎందుకు వస్తుందో, ఎలా పోతాయో ఆయుర్వేద శాస్త్రంలో ఇలా చెప్పారు.
*పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే*
*తచ్చాంతి రౌషధై ర్ధానై ర్జవ హోమ సురార్చనైః*
*భావం:-*
*పూర్వ జన్మల్లో చేసిన పాపాలు ఈ జన్మలో రోగాలుగా పట్టి పీడిస్తాయి. ఔషధులు, దానాలు, నవగ్రహ జపాలు, హోమాలు, దేవతా పూజ వాటిని ఉపశమింపచేస్తాయి.*
పూర్వ జన్మ కర్మ ఫలితాలని రోగాల రూపంలో అనుభవించడం మీద మహాత్ములు చెప్పిన అనేక విషయాలు వారి జీవిత చరిత్రల్లో వస్తాయి.
గొలగమూడి వెంకయ్య స్వామి దగ్గరకి వచ్చిన ఓ సన్న్యాసి పక్షిలా గిరగిరా తిరుగుతూ పడిపోయేవాడు. మళ్ళీ కొద్దిసేపటికి లేచి తిరిగి అలా పడిపోయేవాడు. అతని గురించి చెప్తూ స్వామి ఇలా అన్నారు.
“పూర్వం ఇతను పక్షులని వేటాడుతూండేవాడు. ఆ పాపం ఊరికే పోతుందా? అనుభవించవద్దా?”
మరో సందర్భంలో ఓ ఉపాధ్యాయుడు తన కొడుకుని స్వామి దగ్గరకి తీసుకువచ్చాడు. ఆ అబ్బాయికి కాళ్ళు, చేతులు పటుత్వం కోల్పోయి అతని స్వాధీనంలో లేవవి. అతన్ని చూసి స్వామి ఇలా అన్నారు.
“మనమేం చేయగలం? ఇతను పూర్వ జన్మలో గుర్రాలు తోలేవాడు. గుర్రాలని కొట్టిన పాపం ఇప్పుడు అనుభవించాలి కదా.”
మరోసారి నాగులవెల్లటూరు అనే ఊరికి చెందిన ఓ అబ్బాయికి రెండు బొటన వేళ్ళ స్పర్శ తెలీకపోవడం గురించి స్వామి దగ్గరకి వచ్చాడతను. స్వామి ఇలా చెప్పారు.
"అయ్యా! ఇతను తమాషాకి క్రితం జన్మలో పిట్టలని కొడుతూండేవాడు. ఇది అనుభవించక తప్పదు."
*కర్మని బట్టి రోగం*
*దేవానా మసురాణాంచ అమరత్వా తపమోబలాత్!*
*ఏకేనైవ శరీరేణ భుజ్యతే కర్మణాం ఫలమ్!!*
*భావం:-*
మనం గతంలో చేసుకున్నది నేడు పొందుతున్నాం. నేడు చేస్తున్నది రేపు పొందుతాం.
కర్మని బట్టి కొన్ని విచిత్రమైన రోగాలు కూడా వస్తుంటాయి. పుట్టిన ఏడాదికి మొదలై, పదేళ్ళకే బాలుడుకి ఎనభై ఏళ్ళ వాళ్ళకి వచ్చే శారీరక మార్పులు కలిగి, ముసలివాడై మరణించే కొందరు వింత రోగులని అమెరికన్ డాక్టర్లు కనుగొన్నారు.
చిన్నతనంలోనే వచ్చే ఓ వ్యాధి వల్ల పిల్లల్లో ఎముకల దృఢత్వం తగ్గి, వాళ్ళని గట్టిగా ఎత్తుకుంటేనే ఎముకలు విరిగే ప్రమాదం గల వ్యాధిగ్రస్థులు కూడా అమెరికాలో ఉన్నారు. చిరునవ్వు నవ్వడానికి ఉపయోగించే కండరాలు పనిచేయక నవ్వని రోగం గలవారి గురించి అమెరికన్ పత్రికల్లో వచ్చింది.
హైద్రాబాద్ సమీపంలో మెదక్ జిల్లా, తొగుట మండలంలోని రామాపురంలో గల గురు మదనానంద సరస్వతి ఆశ్రమానికి చెందిన శ్రీ కృష్ణానంద స్వామి అనే సన్న్యాసి మరణానికి కొద్ది రోజుల ముందు ఎక్కిళ్ళు ఆగకుండా వచ్చాయి.
గిడుతూరి సూర్యం అనే ఓ సినిమా దర్శకుడి సమీప బంధువుకి కనురెప్పలకి పక్షవాతం వచ్చి, అవి సదా తెరచుకునే ఉండటంతో ఆమె నిద్రకి మొహం వాచి బాధపడేది. పసితనం నించే జుట్టు మొలవక బట్ట తల వచ్చే మరో వింత జబ్బు కూడా అలోపేషియా అమెరికాలో విస్తారంగా ఉంది.
(ఇలాంటి వారికి జుట్టుని దానం చేస్తే దాంతో విగ్స్ ని తయారు చేసి అందించే 'లాక్స్ ఆఫ్ లవ్' అనే ధార్మిక సంస్థ ఒకటి ఫ్లోరిడాలో పని చేస్తోంది) జీడిపప్పు, బాదం పప్పు, వేరుశెనగ పప్పులు తింటే ఎలర్జీతో బాధపడేవారు అమెరికాలో చాలా మంది ఉన్నారు. ఇంకా ఇలాంటి అనేక వింత రోగాలు ఆమెరికన్ మెడికల్ జర్నల్స్ లో చదవచ్చు. ఇవన్నీ దుష్కర్మలకి కాసిన ఫలాలే.
ఏ దుష్కర్మకి ఏ రకం వ్యాధి వస్తుందో ఋషికేశ్ కి చెందిన శ్రీ శివానంద స్వామి తయారుచేసారు.
(తరువాతి భాగంలో - *'ఆయుష్షు నిర్ణయం', *'కర్మ-మరణం'*
***
[29/04, 10:18] +91 92915 82862: *🧘♂️86-ఉపనిషత్ సూక్తి 🧘♀️*
*108 ఉపనిషత్తులలో గల 108 మహా వాక్యములు*
*86. సో2హమస్మీతి నిశ్చిత్య యస్యదావర్తతే పుమాన్||*
*(యోగకుండల్యుపనిషత్)*
*- ఆ పరమాత్మయే నేను అని సర్వదా నిశ్చయభావమును కలిగియుండుము.*
*లోకా: స్సమస్తా: స్సుఖినో భవన్తు!*
***
*🧘♂️సంతోషం🧘♀️*
*యుక్తమైన బుధ్ధితో చెడుకు బదులు మంచినే సర్వదా, సర్వత్రా మనస్ఫూర్తిగా ఎన్నుకొన్నప్పుడే మీకు నిజమైన సంతోషం కలుగుతుంది. అప్పుడే మీకు నిజమైన స్వేచ్చ లభిస్తుంది.*
*శ్రీ పరమహంస యోగానంద / యోగదా సత్సంగ పాఠాలు*
***
*ఆదర్శాన్ని అంటిపెట్టుకునే ఉండండి. ముందుకుసాగండి. చిన్న చిన్న పొరపాట్లను పట్టించుకోకండి. కార్యరణరంగంలో దోషాలనే దుమ్ము రేగవలసిందే. దాన్ని భరించలేని సున్నిత మనస్కులను అస్త్రసన్యాసం చేయనీయండి.*
*ఆధ్యాత్మిక దానం చేసేవాడే లోకంలో నిరతిశయోపకారి.*
*21) పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనమ్|*
*ఇహ సంసారే బహుదుస్తారే కృపయాఽపారే పాహి మురారే ||*
*మరల పుట్టుక మరల మరణము మరల తల్లిగర్భంలో నివాసము అను దాటలేని అపారమైన సముద్రం నుండి ఓ కృష్ణా! దయతో రక్షించుము.*
*THVAMEVAAHAM త్వమేవాహమ్*
కన్నతల్లి కడుపులోంచి బయటపడి......
తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణం నుంచి......
పుడమితల్లి కడుపులోకి చేరుకునేందుకు.......
ఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టడం దాకా
సాగే ప్రస్థానం.......
పేరే......
*నేను =I*
*ఈ "నేను"* ప్రాణశక్తి అయిన "ఊపిరి"కి మారుపేరు!
*ఊపిరి ఉన్నంతదాకా "నేను"* అనే భావన కొనసాగుతూనే ఉంటుంది....
*జననమరణాల మధ్యకాలంలో* సాగే జీవనస్రవంతిలో ...ఈ
*"నేను"* ఎన్నెన్నో పోకడలు పోతుంది. మరెన్నో విన్యాసాలూ చేస్తుంది...
*ఈ "నేను"* లోంచే
*నాది* అనే భావన పుడుతుంది!
*ఈ *నాది* లోంచే....
1.నా వాళ్ళు, 2.నా భార్య, 3.నా పిల్లలు, 4.నా కుటుంబం, 5.నా ఆస్తి,
6.నా ప్రతిభ, 7.నా ప్రజ్ఞ, 8.నా గొప్ప...
అనేవి పుట్టుకొచ్చి....
చివరికి ఈ *"నేను"* అనే భావన భూమండలాన్ని కూడా మించిపోయి,
ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి, నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి *అహం* గా ప్రజ్వరిల్లుతుంది. *EGO అహం*
అనే మాయ పొర కమ్మేసిన స్థితిలో ఈ *”నేను"*, *”నేనే సర్వాంతర్యామిని* అని విర్రవీగుతుంది.
*నాకు ఎదురే లేదని ప్రగల్భాలూ పలుకుతుంది.*
1. పంతాలతో 2. పట్టింపులతో, 3. పగలతో, 4. ప్రతీకారాలతో......
తన ప్రత్యర్థిని సర్వనాశనం చేయడానికీ సిద్ధపడుతుంది.
1 .బాల్య, 2.కౌమార, 3.యౌవన, 4.వార్ధక్య,
దశలదాకా....విస్ఫులింగ తేజంతో విజేతగా నిలిచిన ఈ
*నేను* అనే ప్రభ ఏదో ఒకనాడు మృత్యుస్పర్శతో కుప్పకూలిపోతుంది.
*వందిమాగధులు కైవారం చేసిన శరీరం కట్టెలా మిగులుతుంది.*
*సుందరీమణులతో మదనోత్సవాలు జరుపుకొన్న దేహం నిస్తేజంగా పడి ఉంటుంది.*
*సుఖభోగాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగిన ఈ నేను* చుట్టూ చేరిన బంధుమిత్ర సపరివారపు జాలి చూపులకు కేంద్ర బిందువుగా మారుతుంది.
*కడసారి చూపులకోసం, కొన్ని ఘడియలపాటు ఆపి ఉంచిన విగతజీవికి అంతిమయాత్ర మొదలవుతుంది.*
*మరుభూమిలో చితిమంటల మధ్యే సర్వబంధనాల నుంచీ విముక్తి కలుగుతుంది.*
*మొలకుచుట్టిన ఖరీదైన కౌపీనంతో సహా, మొత్తంగా కాలి బూడిద అవుతుంది.*
*1.నేనే* శాసన కర్తను,
*2.నేనే* ఈ సమస్త భూమండలానికి అధిపతిని,
*3.నేనే* జగజ్జేతను...
అని మహోన్నతంగా భావించిన ఈ *నేను* లేకుండానే మళ్ళీ తెల్లవారుతుంది. - ఎప్పటిలా
రోజు మారుతుంది.
*ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన ఈ ‘నేను’* కథ అలా సమాప్తమవుతుంది.
*అందుకే ఊపిరి ఆగకముందే ఈ “నేను”*
గురించి తెలుసుకో అంటుంది “శ్రీమద్భగవద్గీత”
*చితిమంటలను చూస్తున్నప్పుడు కలిగేది *శ్మశానవైరాగ్యం* మాత్రమే!
*అది శాశ్వతం కానే కాదు*
ఈ *నేను* గురించిన సంపూర్ణమైన అవగాహనతో ఉన్నప్పుడే, పరిపూర్ణమైన
*”వైరాగ్యస్థితి”* అభిలాషికి సాధ్యమవుతుంది.
*వైరాగ్యం* అంటే అన్నీ వదిలేసుకోవడం కానేకాదు.
*దేనిమీదా మోహాన్ని కలిగి ఉండకపోవడం.తామరాకుమీద నీటి బొట్టులా జీవించ గలగడం*.
*స్వర్గ-నరకాలు ఎక్కడో లేవు. మనలోనే ఉన్నాయి.*
*మనిషి ఆత్మదృష్టి నశించి బాహ్యదృష్టితో జీవించడమే-నరకం*
*అంతర్ముఖుడై నిత్యసత్యమైన ఆత్మదృష్టిని పొందగలగడం-స్వర్గం.*
*ఈ జీవన సత్యాన్ని తెలియచేసేదే-వేదాంతం*.
1. నిజాయితీగా, 2. నిస్వార్థంగా, 3.సద్ప్రవర్తనతో, 4. సచ్ఛీలతతో, 5.భగవత్ ధ్యానం
తో జీవించమనేదే
*వేదాంతసారం*.
*అహం బ్రహ్మాస్మి* అంటే *అన్నీ నేనే* అనే స్థితి నుంచి *త్వమేవాహమ్* అంటే *నువ్వేనేను* అని భగవంతుడి పట్ల చిత్తాన్ని నిలుపుకోగల తాదాత్మ్య స్థితిని చేరుకోగలిగితేనే *మానవ జన్మకు సార్థకత* .
: *జీవన విధానంలో - ధర్మం ఎందుకు ఆచరించాలి?*
*ఈ దేహం ఒకటి ఉంది కాబట్టి దాని అవసరాలు తీర్చక తప్పదు. భోజనం, నీరు, వస్త్రాలు వంటి ప్రాథమిక అవసరాలు విధిగా సమకూర్చి తీరాల్సిందే.*
*ఆకలి తీరితే శరీరం శాంతిస్తుంది, కానీ రుచులుకోరే మనసు మాత్రం శాంతించదు. ఆకలి శరీర అవసరమైతే, రుచి మనసుకు కలిగే కోరిక.*
*ప్రకృతి ధర్మాలైన శరీర అవసరాలను తీర్చటం సముచితమైనా మితము లేని మానసిక కోర్కెలను తీర్చాలనుకోవటం శాంతిని దూరం చేసే విషయం.*
*ఎంతటి జ్ఞానికైనా అన్నం తింటేనే కడుపు నిండుతుంది. కనుక శరీర పోషణ, రక్షణలు మనకు అత్యావశ్యకం.*
*అశాంతి కారకాలైన కోరికల ఉధృతి తగ్గాలంటే మనసుకి సహనం చాలా అవసరం.*
*సుఖ సంతోషాల ద్వారా మనం పొందాలని వెంపర్లాడుతున్న శాంతి మనలోదేనన్న సత్యం తెలిస్తే వెతుకులాటలేని పవిత్ర జీవనం ఏర్పడుతుంది.*
*అలాగే పవిత్రమైన జీవన విధానం అలవర్చుకుంటే మనసు సత్యాన్ని గ్రహించి ఆత్మానందాన్ని పొంద గలుగుతుంది.*
ఈ పవిత్ర జీవనం కోసమే మన పెద్దలు ధర్మం ఆచరించమన్నారు.
*బ్రతుకంటే బ్రతుకే*
*ఒక యువకుడు గురువు గారి దగ్గరకి వచ్చాడు."నాకు చిన్న ఉద్యోగం ఇవ్వండి. కాసింత కూడు పెట్టండి. ఏదో దేవుడిని తలచుకుంటూ, మీ సేవ చేసుకుంటూ బతుకుతాను." అని అడిగాడు."నీకేం వచ్చోయ్?" అని ప్రశ్నించారు గురువుగారు."నాకేమీ రాదండీ. చదువుకోలేదు. ఏ విద్యా నేర్చుకోలేదు. కప్పులు కడగడం, ఇల్లు ఊడ్వడం వంటి పనులు వచ్చు. అంతే నండీ" అన్నాడు యువకుడు."ఇంకే పనీ రాదా?" "అంటే ... చదరంగం కొద్దిగా వచ్చు."*
*అప్పటికప్పుడు చదరంగాన్ని తెప్పించారు గురువుగారు. "ఆటాడుదాం. ఒకటే పందెం. ఇదిగో ఈ కత్తిని చూశావా? ఓడిన వాడి ముక్కు తెగ కోయాలి. ఒప్పుకుంటావా?" యువకుడికి ఉద్యోగం కావాలి. ఇంకో మార్గం లేదు. ఒప్పుకున్నాడు. ఆట మొదలైంది. యువకుడు మొదట్లో కొన్ని తప్పులు చేశాడు. ఆటలో వెనకబడ్డాడు. అతని దృష్టి పొడవాటి కత్తిపై పడింది. చేత్తో ముక్కును తడుముకున్నాడు. మొత్తం దృష్టినంతా కేంద్రీకరించాడు. ఏకాగ్రతతో పావులు కదిపాడు. యువకుడిదే పైచేయి అయింది. ఇంకో రెండు మూడు ఎత్తులతో గురువుగారిని చిత్తు చేసే స్థితికి వచ్చాడు. ఆ సమయంలో అతను మళ్లీ కత్తి వైపు చూశాడు. గురువుగారి ముక్కు వైపు చూశాడు. ఏమనుకున్నాడో ఏమో కావాలనే ఒక తప్పుడు ఎత్తుగడ వేశాడు. గురువు గారు ఒక్క ఉదుటున లేచి కత్తితో చదరంగం పై పావులను తోసేశారు. "ఆట అయిపోయింది. నువ్వు ఆశ్రమంలో ఉద్యోగానికి ఎంపికయ్యావు." అన్నారాయన.*
*యువకుడికి ఏమీ అర్ధం కాలేదు. మంచి పనివాడికైనా, మంచి సాధకుడికైనా రెండు గుణాలుండాలి. మొదటిది "మహాప్రజ్ఞ" అంతులేని ఏకాగ్రతతో దృష్టిని చేస్తున్న పని మీదే పెట్టగలగాలి. రెండవది అన్నీ ఉన్నా అతనికి తప్పనిసరిగా "మహాకరుణ" ఉండాలి. నువ్వు గెలిచే ఆటని నేను ఓడకుండా ఉండేందుకు వదులుకున్నావు. నా ముక్కు తెగే కన్నా నీ ముక్కు తెగడమే మంచిదనుకున్నావు. ఇదే మహాకరుణ. ఈ రెండు గుణాలూ నీకున్నాయి. అందుకే నువ్వు మాతోటే ఉండు." అన్నారు గురువుగారు.*
*నిజం... బ్రతుకు గెలుపు కాదు... ఓటమి కాదు. బ్రతుకంటే బ్రతుకే!!*
****
*మిఠాయి సత్యం*:
మా ఊర్లో సత్యంగారనే షావుకారు (కోమటి) ఉండేవారు.ఉదయం పదిగంటల నుంచి జంతికలు,చెగోడీలు,బజ్జీలు,బెల్లం మిఠాయి ఉండలు చేసి అమ్మేవాడు. ఎవరింట్లోఏ శుభకార్యాలయినా బూంది లడ్డు, మైసూరు పాక్, ఇలాంటివి చేయించుకొనే వారు.దానాదీనా ఆయనకి మిఠాయి సత్యం గారు అనేపేరు స్థిరపడిపోయింది. ఎందుకు ఆయన గురించి చెపుతున్నా అంటే ఆయన చదువుకోకపోయినా మంచి ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాడు.తరచుగా ఆథ్యాత్మిక ఉపన్యాసాలు,హరికథలు వినేవాడు.
ఓ రోజు ఓ స్వాములవారు భగవతత్వం గురించి చెబుతూ,అనేక రూపాల్లో ఉన్నా భగవంతుడు ఒక్కడే అని చెప్పి ఏమోయ్ సత్యం అర్థమైందా అని అడిగారు. ఈ సత్యం గారు హరికథ కులకు, స్వామీజీ లకు, పౌరాణికులకు సపర్యలు చేస్తూ ఉండేవాడు. అయ్! అర్థమయింది. ఎలాగంటే నా బాషలో నే సెబుతా యినండి ఎలా అంటే: సెనగపిండి (మూలమనుకోండి)
1.సన్న గొట్టంలో సుడితే కారప్పూసండి.
2.లావుగొట్టంలో సుడితే జంతికలు
3.అదేసెనగపిండిని సట్రంలో కొట్టి,యేరు సెనగ,పుట్నాలు,అటుకులు ,కర్వేపాకు యేపి కలిపితే కారంబూంది అవుద్ది.
4.అదే సెనగపిండి సట్రంలో బూంది కొట్టి పంచదార పాకంలో వేసి ఉండకడితే లడ్డు ఔతుంది.
5.అదే సెనగపిండి వేయించి, పంచదార, నెయ్యి వేసి ఓ పాత్రలో పాకం పడితే మైసూరు పాక్ అవుతుంది.
6.అదే సెనగపిండి పల్చగా కలిపి, మిరపకాయ ముంచివేయిస్తే మిరపకాయ బజ్జీలు, అరటికాయ ముక్కలు ముంచివేస్తే అరటికాయ బజ్జీలు.
7.అదే సెనగపిండి లో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు,అల్లం,కలిపివేయిస్తే పకోడీయండి.
ఒకే సెనగపిండికే ఇన్ని రూపాలున్నట్టే, మూలం శక్తి అయిన భగవంతుడు,మనకి శివుడుగాయిష్ణువుగా,ఆంజనేయుడుగా,గణపతిగా ఎన్నో రూపాలు గా కనపడతాడండి ఆయ్. మనం ఎలా కొలిచినా,పిలిచినా పలికేశక్తి ఒహటేనండి.ఆయ్! నాకరదమయినకాడికి సెప్పేనండి అన్నాడు సత్యంగారు.
ఆనాటి స్వామీజీ లు కనుక ఆయన తనకు అంతకు ముందే సభానిర్వాహకులు కప్పిన శాలువసత్యంగారికి కప్పి నిగర్వంగా ఓ మాటన్నారు. ఇన్ని శాస్త్రాలుచదివిన నేను కూడా భగవత్ తత్వాన్ని నువు చెప్పినంత సులువు గా చెప్పలేను. నీకు పరమేశ్వర కటాక్షం దొరికింది అన్నారు.
సభంతా చప్పట్లు మోత.
***
*I love you*
పెళ్ళయి పదేళ్ళు పైబడిన ఆడవాళ్ళ మీటింగ్ జరుగు తోంది. మీటింగ్ కండక్ట్ చేస్తున్న ఆమె ప్రశ్నించిందిలా.
మీరు మీ మీ భర్తలకు *I love you* అఖని చివర సారి ఎప్పుడు చెప్పారు?
పొద్దునే చెప్పాను అన్నారొకరు.
రెండురోజులయింది నేను చెప్పి అన్నారింకొకరు. నేను చెప్పి వారం రోజులైంది అన్నారు మరొకరు.
అదంతా కాదుగాని, ఇప్పుడు మీ ఫోన్ తీసుకుని, మీ మీ భర్తలకు *I Love you* అని మెసేజ్ పెట్టండి. ఎవరికైతే ఊహించని జవాబు వస్తుందో వారికి ఓ మాంచి గిఫ్ట్ ఇస్తాను అన్నది మీటింగ్ కండక్ట్ చేస్తున్నామె
సరేనన్నారంతా. వారి వారి భర్తలకు | love you అని మెసేజ్ పెట్టారు. కాస్సేపటికి భర్తల దగ్గరనుంచి జవాబులు ఇలా వచ్చాయి.
1. స్వీటీ నీ కండిషన్ ఓకే కదా?
2. ఏంటే ఈ రోజు కూడా వంట చెయ్యలేదా?
3. ఏఁవైంది డార్లింగ్? ఇంటి ఖర్చులకిచ్చిన డబ్బు చాల్లేదా?
4. ఏమైందే! ఏంటి పిచ్చి మెసేజ్లు?
5. ఏమైంది? ఏదైనా కలగన్నావా? లేకపోతే నేను కలగంటున్నానా?
6. కొంపదీసి అక్కడి ఫంక్షన్లో ఎవరిదైనా జ్యుయెలరీ నచ్చిందా?
7. ఆఫీస్లో చాలా టెన్షన్గా ఉన్నాను, ఇప్పుడీ మెసేజ్లంటి? పిచ్చెక్కిందా?
8. ఎన్నిసార్లు చెప్పాను, ఆ ఏడుపుగొట్టు సీరియల్స్ చూడొద్దని.
9. ఏఁవైందే! మళ్ళీ యాక్సిడెంట్ చేశావా?
10. పిల్లల్ని ఈ రోజు కూడా నేనే స్కూలునుంచి తీసుకురావాలా?
చివరకి ఎవరైతే గిఫ్ట్ గెలుచుకున్నారో వారికి వచ్చిన మెసేజ్ ఏమిటంటే...
ఈవిడెవరో నాకు తెలియదు ,రాంగ్ నెంబర్ కు మెసేజ్ పెట్టినట్టు న్నారు
ఇదే నండి మోగవారి పగటి పూట ప్రేమ ?
***
*29.4.2022 ప్రాతః కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*చతుర్థస్కంధము - పదునైదవ అధ్యాయము*
*పృథుమహారాజు జననము - రాజ్యాభిషేకము*
*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*15.14 (పదునాలుగవ శ్లోకము)*
*తస్మైజహార ధనదో హైమం వీర వరాసనమ్|*
*వరుణః సలిలస్రావమాతపత్రం శశిప్రభమ్॥3228॥*
*15.15 (పదునైదవ శ్లోకము)*
*వాయుశ్చ వాలవ్యజనే ధర్మః కీర్తిమయం స్రజమ్|*
*ఇంద్రః కిరీటముత్కృష్టం దండం సంయమనం యమః॥3229॥*
పట్టాభిషేక మహోత్సవ సమయమున పృథుమహారాజునకు కుబేరుడు బంగారు సింహాసనమును కానుకగా ఇచ్చెను. వరుణుడు చంద్రునివలె స్వచ్ఛమైన కాంతితో విరాజిల్లుచు జలబిందువులను స్రవింపజేయునట్టి ఛత్రమును సమర్పించెను. వాయుదేవుడు రెండు వింజామరలను,ధర్మదేవత ఫ్రసిద్ధమైన హారమును, ఇంద్రుడు మేలైన కిరీటమును, యముడు శక్తిమంతమైన దండమును ఇచ్చిరి.
*15.16 (పదునారవ శ్లోకము)*
*బ్రహ్మా బ్రహ్మమయం వర్మ భారతీ హారముత్తమమ్|*
*హరిః సుదర్శనం చక్రం తత్పత్న్యవ్యాహతం శ్రియమ్॥3230॥*
*15.17 (పదునేడవ శ్లోకము)*
*దశచంద్రమసిం రుద్రః శతచంద్రం తథాంబికా|*
*సోమోఽమృతమయానశ్వాంస్త్వష్టా రూపాశ్రయం రథమ్॥3231॥*
బ్రహ్మదేవుడు వేదమయమైన కవచమును, సరస్వతీదేవి ఉత్తమమైన హారమును, శ్రీహరి సుదర్శన చక్రమును, ఆయన ప్రియపత్నియైన లక్ష్మీదేవి అచంచలమైన సంపదలను, పరమశివుడు చంద్రాకారములో పది బొడిపెలతో ఒప్పెడి *ఒర* తో గూడిన ఖడ్గమును, పార్వతీదేవి చంద్రుని ఆకారములో నూరు బొడిపెలుగల డాలును, చంద్రుడు మిగుల తేజోమయములైన అశ్వములను, విశ్వకర్మ సుందరమైన రథమును సమర్పించిరి.
*15.18 (పదునెనిమిదవ శ్లోకము)*
*అగ్నిరాజగవం చాపం సూర్యో రశ్మిమయానిషూన్|*
*భూః పాదుకే యోగమయ్యౌ ద్యౌః పుష్పావళిమన్వహమ్॥3232॥*
*15.19 (పందొమ్మిదవ శ్లోకము)*
*నాట్యం సుగీతం వాదిత్రమంతర్ధానం చ ఖేచరాః|*
*ఋషయశ్చాశిషః సత్యాః సముద్రః శంఖమాత్మజమ్॥3233॥*
అగ్నిదేవుడు *ఆజగవము* అను పేరుగల దృఢమైన ధనుస్సును, సూర్యుడు తన కిరణములవంటి కాంతులుగల బాణములను, భూదేవి అభీష్టప్రదేశములకు క్షణములో చేర్చగల పాదుకలను, ఆకాశాభిమానదేవత నిత్య నూతనముగా తేజరిల్లుచు పూజార్హములైన పుష్పములను బహూకరించిరి. ఆకాశమున సంచరించు చుండెడి సిద్ధ, చారణ, గంధర్వాదులు నృత్యము చేయుటకు, సంగీతమును ఆలపించుటకు, వాద్యములను మ్రోగించుటకు, అదృశ్యమగుటకు ఉపయుక్తములగు శక్తులను, ఋషీశ్వరులు అమోఘములైన ఆశీర్వచనములను, సముద్రుడు తనలో ఉత్పన్నమైన శంఖమును ప్రసాదించిరి.
*15.20 (ఇరువదియవ శ్లోకము)*
*సింధవః పర్వతా నద్యో రథవీథీర్మహాత్మనః|*
*సూతోఽథ మాగధో వందీ తం స్తోతుముపతస్థిరే॥3234॥*
సముద్రములు, పర్వతముల,నదుల అధిదేవతలు పృథుమహారాజునకు రథములు నిరాటంకముగా తిరుగుటకు అనువుగా వీధులను సిద్ధపఱచిరి. సూతుడు, వందిమాగధులు ఆ మహాత్ముని స్తుతింపసాగిరి.
*15.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*
*స్తావకాంస్తానభిప్రేత్య పృథుర్వైన్యః ప్రతాపవాన్|*
*మేఘనిర్హ్రాదయా వాచా ప్రహసన్నిదమబ్రవీత్॥3235॥*
ప్రతాపశాలియైన అమహారాజు ఆ స్తుతిపాఠకులను ఉద్దేశించి, దరహాసమొనర్చుచు మేఘగంభీర స్వరముతో ఇట్లు పలికెను-
*పృథురువాచ*
*15.22 (ఇరువది రెండవ శ్లోకము)*
*భోః సూత హే మాగధ సౌమ్య వందిన్ లోకేఽధువా స్పష్టగుణస్య మే స్యాత్|*
*కిమాశ్రయా మే స్తవ ఏష యోజ్యతాం మా మయ్యభూవన్ వితథా గిరో వః॥3236॥*
*పృథువు ఇట్లు పలికెను*- సహృదయులైన సూత, వంది, మాగధులారా! నేను ఇప్పుడే సింహాసనమును అధిష్ఠించితిని. నేను ఇంతవరకును చేసిన ఘనకార్యములు ఎవ్వియును లేవు. వెల్లడికాని నా గుణములను గూడ మీరు నన్ను ఇట్లు స్తుతించుటకు ఆధారము ఏమున్నది? మీరు చేసిన స్తుతులు వ్యర్థములు కారాదుగదా!
*15.23 (ఇరువది మూడవ శ్లోకము)*
*తస్మాత్సరోక్షేఽస్మదుపష్టుతాన్యలం కరిష్యథ స్తోత్రమపీచ్యవాచః|*
*సత్యుత్తమశ్లోకగుణానువాదే జుగుప్సితం న స్తవయంతి సభ్యాః॥3237॥*
మిత్రులారా! మధురభాషణమునందు మీరు మిగుల నేర్పరులు. కాని, మున్ముందు నేను మహత్కార్యములను చేసిన పిమ్మట, అవి లోకమున ప్రకటితములైనప్ఫుడు, మీరు ఇట్లు స్తుతించుట ఎంతయు సముచితము. జగద్విఖ్యాతుడైన శ్రీమన్నారాయణునియొక్క దివ్యగుణములు ఎంతయు స్తుతింపదగినవి. అంతేగాని, శిష్టులు సామాన్యమానవునిగూర్చి స్తుతింపరు.
*15.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*
*మహద్గుణానాత్మని కర్తుమీశః కః స్తావకైః స్తావయతేఽసతోఽపి|*
*తేఽస్యాభవిష్యన్నితి విప్రలబ్ధో జనావహాసం కుమతిర్న వేద॥3238॥*
మహాత్ములయొక్క ఉన్నతగుణములను సాధించుటకు (అంతటివాడు అగుటకు) సామర్థ్యము ఉన్నను, ప్రస్తుతము అతనిలో లేని గొప్ప గుణములను పొగిడించుకొనుటకు ఏ బుద్ధిమంతుడు ఇష్టపడును? కనుక, భవిష్యత్తులో అట్టి గుణములు తనలో ప్రకటము కాగలవని భావించి అట్లు పొగిడించుకొనుట జనులను వంచించుటయే యగును. అట్టివానిని జనులు అపహసింతురని ఆ బుద్ధిహీనుడు ఎరుగడు.
*15.25 (ఇరువది ఐదవ శ్లోకము)*
*ప్రభవో హ్యాత్మనః స్తోత్రం జుగుప్సంత్యపి విశ్రుతాః|*
*హ్రీమంతః పరమోదారాః పౌరుషం వా విగర్హితమ్॥3239॥*
సౌమ్యులు, ఉదారహృదయులు అగు వ్యక్తులు తమద్వారా జరిగిన నింద్యమగు ఏదేని కార్యమును గూర్చి వినుటకు ఇష్టపడరు. పైగా ఏవగింతురు. అటులే లోకవిఖ్యాతులు, సర్వసమర్థులు అగు వ్యక్తులు తమ ప్రశంసను గూర్చి వినుటకు ఇష్టపడరు. పైగా లజ్జపడుదురు.
*15.26 (ఇరువది ఆరవ శ్లోకము)*
*వయం త్వవిదితా లోకే సూతాద్యాపి వరీమభిః|*
*కర్మభిః కథమాత్మానం గాపయిష్యామ బాలవత్॥3240॥*
సూత, వందిమాగధులారా! మేము ఇంతవరకును లోకవిఖ్యాతములైన ఎట్టి గొప్పకార్యములను చేసియుండలేదు. లోకమున మాకు అట్టి ప్రసిద్ధియు లేదు. కావున, బాలునివలె చేయని ఘనకార్యములను గూర్చి ఎట్లు పొగడించుకొనగలము?
*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం చతుర్థస్కంధే పంచదశోఽధ్యాయః (15)*
ఇది శ్రీమద్భాగవత మహాపురాణమునందలి చతుర్థ స్కంధమునందు పదునైదవ అధ్యాయము (15)
*మైత్రేయ ఉవాచ*
*16.1 (ప్రథమ శ్లోకము)*
*ఇతి బ్రువాణం నృపతిం గాయకా మునిచోదితాః|*
*తుష్టువుస్తుష్టమనసస్తద్వాగమృతసేవయా॥3241॥*
*మైత్రేయుడు వచించెను*- విదురా! పృథుమహారాజు సందర్భోచితముగా పలికిన అమృత తుల్యములగు వచనములకు వందిమాగధులు ఎంతయు సంతసించిరి. పిదప వారు మునీశ్వరుల ప్రేరణతో ఆ ప్రభువును ఇట్లుకొనియాడసాగిరి-
*16.2 (రెండవ శ్లోకము)*
*నాలం వయం తే మహిమానువర్ణనే యో దేవవర్యోఽవతతార మాయయా||*
*వేనాంగజాతస్య చ పౌరుషాణి తే వాచస్పతీనామపి బభ్రముర్ధియః॥3242॥*
మహారాజా! నీవు సాక్షాత్తు దేవాధిదేవుడైన శ్రీమన్నారాయణుడవే. నీ సంకల్ప ప్రభావమున వేనమహారాజు యొక్క అంగములనుండి అవతరించితివి. నిరుపమానములైన నీ బలపరాక్రమములను సంపూర్ణముగా వర్ణించుటకు బ్రహ్మాది దేవతల బుద్ధులుగూడ భ్రమకు లోనగుచుండును. అట్టి నీ వైభవములను వర్ణించుటకు సామాన్యులమైన మాకు ఎట్లు సాధ్యము?
*16.3 (మూడవ శ్లోకము)*
*అథాప్యుదారశ్రవసః పృథోర్హరేః కళావతారస్య కదామృతాదృతాః|*
*యథోపదేశం మునిభిః ప్రచోదితాః శ్లాఘ్యాని కర్మాణి వయం వితన్మహి॥3243॥*
ఐనప్పటికిని, ప్రభూ! నీ కథామృతమును ఆస్వాదించుటయందు మునీశ్వరులకు గల ఆదరాభిమానములు అపారములు. వారి వలన మేము మిగుల ప్రేరణ పొందితిమి. శ్రీహరియొక్క అంశావతారమైన నీ కీర్తి అత్యంత మహిమాన్వితము. అద్భుతములైన నీ లీలలను గూర్చి మహర్షుల ఉపదేశములను అనుసరించి, వాటి మహత్త్వమును విశదీకరింతుము.
*16.4 (నాలుగవ శ్లోకము)*
*ఏష ధర్మభృతాం శ్రేష్ఠో లోకం ధర్మేఽనువర్తయన్|*
*గోప్తా చ ధర్మసేతూనాం శాస్తా తత్పరిపంథినామ్॥3244॥*
మునులు మాకు ఇట్లు ఉపదేశించిరి - *ఈ పృథుమహారాజు ధర్మాత్ములలో అగ్రగణ్యుడు. ఈ ప్రభువు ఈ లోకమున ధర్మమును ప్రవర్తిల్లజేయును. వర్ణాశ్రమాది ధర్మములకు ఆటంకములను కలిగించువారిని శిక్షించును. ఆచరణ పూర్వకముగా ధర్మమర్యాదలను పరిరక్షించును.*
*16.5 (ఐదవ శ్లోకము)*
*ఏష వై లోకపాలానాం బిభర్త్యేకస్తనౌ తనూః|*
*కాలే కాలే యథాభాగం లోకయోరుభయోర్హితమ్॥3245॥*
*ఈ మహారాజు తనలో లోకపాలురనందరిని తాను ఒక్కడే నిశ్చయముగా ధరించును. ఇట్లు ఆమహారాజు ఒక్కడే ఆయా ఋతువులలో ప్రజల యొక్క అభ్యుదయమునకు తగినట్లుగా పాటుపడును. యజ్ఞయాగాదులను, తాను స్వయముగా ఆచరించుచు, ప్రజలచే ఆచరింపజేయుచు వారికి స్వర్గలోకప్రాప్తికి దోహదమొనర్చును. అట్లే ఈ లోకమునందు వర్షవ్యవస్థ చక్కబరచి, రాజ్యమును సస్యశ్యామలముగా తీర్చిదిద్ది రాజ్యమును పాలించుచు ప్రజల సుఖశాంతులను వర్ధిల్లజేయును*.
*16.6 (ఆరవ శ్లోకము)*
*వసు కాల ఉపాదత్తే కాలే చాయం విముంచతి|*
*సమస్సర్వేషు భూతేషు ప్రతపన్ సూర్యవద్విభుః॥3246॥*
*సూర్యుడు ఎనిమిది మాసముల కాలము సముద్రజలములను తనకిరణములద్వారా ఆకర్షించి, వర్షాకాలమున వానలతో భూమిని పాడిపంటలతో వర్ధిల్లజేయును. అట్లే ఈ మహారాజు ప్రజల నుండి పన్నుల రూపంలో ధనమును సేకరించి, దానిని ప్రజల అభ్యుదయము కొరకే వినియోగించును. ఆ విధముగా ఈ ప్రభువు సకలప్రాణులయెడ సమదృష్టి కలిగియుండును*.
*16.7 (ఏడవ శ్లోకము)*
*తితిక్షత్యక్రమం వైన్యః ఉపర్యాక్రమతామపి|*
*భూతానాం కరుణః శశ్వదార్తానాం క్షితి వృత్తిమాన్॥3247॥*
*ఈ పృథుమహారాజు మిగుల దయాళువు. ఆ మహారాజు తనయెడల అపరాధమొనర్చిన వారిని కూడా, సకలప్రాణుల పాదఘట్టనములను భూమి సహించునట్లు, క్షమాపణబుద్ధితో వహించును*
*16.8 (ఎనిమిదవ శ్లోకము)*
*దేవేఽవర్షత్యసౌ దేవో నరదేవవపుర్హరిః|*
*కృచ్ఛ్రప్రాణాః ప్రజా హ్యేషః రక్షిప్యత్యజ్ఞసేంద్రవత్॥3248॥*
*ఎప్పుడైనను వర్షాభావము ఏర్పడి ప్రజలు ఇక్కట్లుపాలైనప్పుడు, లోకపాలుర లక్షణములతో ఒప్పెడి ఈ మహారాజు శ్రీహరియంశ సంభూతుడు. గనుక పర్జన్యునివలె (ఇంద్రునివలె) జల వ్యవస్థను చక్కబరచి, ప్రజాసంక్షేమమునకు అండగా నిలుచును.*
*16.9 (తొమ్మిదవ శ్లోకము)*
*ఆప్యాయయత్యసౌ లోకం వదనామృత మూర్తినా|*
*సానురాగావలోకేన విశదస్మితచారుణా॥3249॥*
*ఇతడు నిరంతరము అమృతకిరణుని (చంద్రుని) వలె తన వదనమున ప్రసన్నతను ప్రసరింపజేయుచు ప్రజలకు ఆహ్లాదమును కలిగించుచుండును. అనురాగమును క్రుమ్మరించుచుండును. దరహాసముతో ఆత్మీయతను పంచియిచ్చుచుండును. ఆ విధముగా ఈ మహాత్ముడు ప్రజలకు పరమాప్తుడగును*.
*16.10 (పదియవ శ్లోకము)*
*అవ్యక్తవర్త్మైష నిగూఢకార్యో గంభీరవేధా ఉపగుప్తవిత్తః|*
*అనంతమహాత్మ్యగుణైకధామా పృథుః ప్రచేతా ఇవ సంవృతాత్మా॥3250॥*
ఈ పృథుమహారాజు వరుణదేవునివలె మహిమాన్వితుడు. ఇతని సంకల్పములు ఎవరికిని తెలియవు. ఈయన కార్యములు పూర్తియగువరకు ఎవ్వరికిని బోధపడవు. ఆ కార్యవిధానములు గూడ గంభీరములు. రాజ్యసంపదలు గుప్తములు. అవి చెక్కుచెదరనివి. ఈయన మహాత్మ్యములు అనంతములు. ఇతడు సకలసద్గుణములకు నెలవు. వరుణునివలె ఈయన సకల ఐశ్వర్యములు మిక్కిలి గోప్యముగ ఉండును (ఈ ఉత్తమ లక్షణములు అన్నియును వరుణునకును ఈయనకును సమానములు).
*16.11 (పదకొండవ శ్లోకము)*
*దురాసదో దుర్విషహ ఆసన్నోఽపి విదూరవత్|*
*నైవాభిభవితుం శక్యో వేనారణ్యుత్థితోఽనలః॥3251॥*
పృథుమహారాజు భావగంభీరుడు. ఎంత ఆలోచించినను ఊహకందనివాడు.అతడు ఒక అచ్చమైన రాజనీతిజ్ఞుడు. అనగా అతనికి ఎంత సన్నిహితముగ ఉన్నవారైనప్పటికిని అతని లోతులు అంతుపట్టక సతమతమగుచుండును. వేనరూపి అరణ్యమునుండి పుట్టిన అగ్నివలె ఈతడు గొప్పనైన తేజశ్శాలి. శత్రువులు ఎంతటివారైనను ఇతడు జయింప శక్యము గానివాడు.
*16.12 (పండ్రెండవ శ్లోకము)*
*అంతర్బహిశ్చ భూతానాం పశ్యన్ కర్మాణి చారణైః|*
*ఉదాసీన ఇవాధ్యక్షో వాయురాత్మేన దేహినామ్॥3252॥*
సకల ప్రాణులలోపల ప్రాణరూపమగు సూత్రాత్మ శరీరముయొక్క బాహ్యముగ, అంతర్గతముగ జరుగుచుండు సమస్త చేష్టలను నిర్వికారముగా కేవలము సాక్షియై చూచుచుండును. ఇదేవిధముగ ఈ మహారాజు ప్రజలు ప్రత్యక్షముగా, పరోక్షముగా చేయు పనులను గూఢచారులద్వారా గమనించుచుండును. ఈ సందర్భములో ప్రజలు తనను నిందించినట్లు, స్తుతించినట్లు తెలిసిననూ అందుకు తాను కేవలము సాక్షిగా ఉంటూ, రాచకార్యములను నిర్వహించును.
*16.13 (పదమూడవ శ్లోకము)*
*నాదండ్యం దండయత్యేషః సుతమాత్మద్విషామపి|*
*దండయత్యాత్మజమపి దండ్యం ధర్మపథే స్థితః॥3253॥*
పృథుమహారాజు పూర్తిగా ధర్మనిరతుడు. అపరాధమొనర్చినవాడు తన కొడుకేయైనను దండించితీరును. నేరము చేయనివాడు (దండనార్హుడు కానినాడు) తన శత్రుకుమారుడైనను దండింపడు.
(చతుర్థ స్కంధము లోని పదునారవ అధ్యాయము ఇంకను కొనసాగుతుంది)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తు🙏🙏
[29/04, 10:18] +91 92915 82862: *శ్రీ అన్నమయ్య సంకీర్తన*
🕉🌞🌎🌙🌟🚩
రేకు: 193-2
సంపుటము: 2-475
రాగము: లలిత.
॥పల్లవి॥
అంతర్యామీ అలసితి సొలసితి
ఇంతట నీ శరణిదే చొచ్చితిని!!
॥చ1॥
కోరిన కోర్కులు కోయని కట్లు
తీరవు నీవవి తెంచకా
భారపుఁ బగ్గాలు పాపపుణ్యములు
నేరుపులఁ బోవు నీవు వద్దనకా
॥అంత॥
॥చ2॥
జనుల సంగములఁ జక్కరోగములు
విను విడువవు నీవు విడిపించకా
వినయపు దైన్యము విడువని కర్మము
చనదిది నీవిటు సంతపరచకా!!
॥అంత॥
॥చ3॥
మదిలో చింతలు మయిలలు మణుఁగులు
వదలవు నీవని వద్దనకా
యెదుటనేఁ శ్రీవేంకటేశ్వర నీవదె
అదనఁ గాచితివి అట్టిట్టనకా!!
🕉🌞🌎🌙🌟🚩
[29/04, 10:18] +91 92915 82862: *🧘♂️340) యోగవాసిష్ఠ రత్నాకరము🧘♀️*
🕉️🌞🌏🌙🌟🚩
1-94
స్వాత్మసత్తా పరాపూర్ణే జగత్యంశేన వర్తినా
కిం మే హేయం కిమాదేయమితి
పశ్యన్సుదృఙ్నరః.
సమస్త పదార్థములందును వ్యవహరించుచున్నను ఎవడు ఆయా పదార్థములతోడ అనురక్తిని, సంగమును బొందక నిర్లేపముగను, ఆకాశమువలె నిర్వికార ఏకరూపకముగను వెలయుచు ఆత్మయందు స్థితి గలిగియుండునో, అట్టి మహాత్ముడు సాక్షాత్ పరమేశ్వరుడే యగును.
జ్ఞాని యొకపుడు సమస్త కార్యోన్ముఖుడై, ప్రాప్తించు ప్రస్తుత కార్యము లన్నింటిని నెరవేర్చును. అట్లు సమస్త క్రియల నాచరించు చున్నను ఏమియు నాచరింపనివాడే యగును.
1-95
క్షపితానఖిలాన్లోకాన్దుఃఖక్రకచదారితాన్
వల్లీవనస్థాన్నభసః పృష్ఠాదర్క ఇవేక్షతే.
ఆకాశమున నున్న సూర్యభగవానుడు క్రింద నున్నట్టి లతలతో గూడిన వనవృక్షాదులను జూచునట్లు, జ్ఞాని యగువాడు క్షయమును బొందినట్టియు, దుఃఖమను ఱంపముచే కోయబడినట్టియు లోకుల నందఱిని జూచును.
1-96
అశఙ్కితోపసంప్రాప్తా గ్రామయాత్రా యథాధ్వగైః
ప్రేక్షన్తే తద్వదేవ జ్ఞైర్వ్యవహారమయాః క్రియాః.
దారిలో అకస్మాత్తుగ తటస్థపడిన గ్రామముయొక్క వ్యవహారములను బాటసారులెట్లు రాగరహితులై చూచుదురో, అట్లే జ్ఞానులున్ను లోకవ్యవహార మయములగు క్రియలను రాగరహితులై వీక్షించుదురు.
🕉️🌞🌏🌙🌟🚩