Thursday, 25 May 2017
Wednesday, 24 May 2017
Tuesday, 23 May 2017
Monday, 22 May 2017
నేనే ప్రేయసి మనసులో - నేస్తమై ప్రాణమైనాలే
నేనే ప్రేమ పిలుపులలో - నేఁధర్మ దాహమైనాలే
నేనే ప్రేక్షక కళలలో - నే సత్య మోహమైనాలే
నేనే ప్రేమేము వయసులో - నేటి దేశ మైనాలే
*
దేవీ ప్రేమము మనసులో - దీపమై ప్రజ్వలించెన్గా
భావావేశము కవితగా - భాసురమ్మై వెలింగెన్గా
జీవానందము నిజముగా+ - చేతనమ్మై చలించెన్గా
నీవే నాకని తలువఁగా - నెమ్మి కన్నుల్ చెమర్చెన్గా
*
దారిద్ర్యమ్మున ధనముకై - తాను వెళ్లెన్ విదేశమ్ముల్
దూరమ్మందున నుడుపమా - త్రోవలోఁ గాంచినావేమో
దారిం జెప్పుము వలపుతో+ - చిక్కి ఖేదాత్మగా నుంటిన్
ఘోరమ్మీ విరహకథయున్ - గొంతులో వెల్గగా నయ్యెన్
*
కోపమ్మొందుచు వరుసముం - గొండపై నుండఁగాఁ జెప్పన్
శాపగ్రస్తుఁడు విరహియై - శాలినిం బాసి యక్షుండే
కూపమ్మందు జనకజ తా+ - కూర్మితోఁ జేసెనో స్నానం
బా పేర్వుం గృహముగఁ గొనెన్ - యక్షుఁ డావేళ రామాద్రిన్
*
విరహి - మ/న/స/ర/ర/గగ UUU IIIIIU - UIU UIU UU
*****
Sunday, 21 May 2017
చిన్న కథలు
*
*
*మంచి సావాసం.....*(97)
*ఒక రోజు సాయంత్రం చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి రద్దీగా ఉన్న ఒక బస్సు తన గమ్యస్థానానికి బయలుదేరింది. ఆ బస్సు ఒక అడవి గుండా ఘాట్ రోడ్డు పై ప్రయాణిస్తుండగా అకస్మత్తుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు, మెరుపులతో కూడిన కుండపోత వర్షం ప్రారంభమైంది. ప్రయాణికులందరు చూస్తుండగానే ఒక పిడుగుపాటు వల్ల బస్సుకు 50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును ఆపివేశాడు. ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయ వైపు విరిగిపడడం వల్ల వీరి మార్గానికి అడ్డు రాలేదు.*
*కొద్దిసేపటి తరువాత మళ్లి బస్సు బయలుదేరింది. ప్రయాణికులలో భయం ప్రారంభమైంది. ప్రయాణికులందరు ఊపిరి బిగపట్టుకుని కూర్చున్నారు. ఆ బస్సు రెండు కిలోమీటర్లు వెళ్లిందో లేదో మరో పిడుగు బస్సుకు 40 అడుగుల దూరంలోని చెట్టుకు కొట్టింది. డ్రైవర్ చాకచక్యంతో మళ్లి బస్సును ఆపివేశాడు.*
*ఇలా మూడు సార్లు జరిగింది. మూడోసారి పిడుగు 30అడుగుల దగ్గరలో పడింది. ప్రయాణికులలో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు, ఏడుపులు ప్రారంభమయ్యాయి.*
*అప్పుడు అందులోంచి ఒక పెద్దమనిషి లేచి ఇలా అన్నాడు... "చూడండీ... మనందరిలో ఈ రోజు ‘పిడుగు ద్వారా మరణం రాసిపెట్టి ఉన్న ఒక వ్యక్తి ఎవరో ఉన్నారు'. అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావవలసి వస్తుంది. నేను చేప్పేది జాగ్రత్తగా వినండి... ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందికి దిగి, అదిగో... ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకుని మళ్లి బస్సులోకి వచ్చి కూర్చోండి. మరణం రాసిపెట్టి ఉన్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు. మిగిలిన వాళ్లం క్షేమంగా వెళ్లవచ్చు. ఒక్కరి కోసం అందరు చస్తారో... అందరి కోసం ఒక్కరు చస్తారో... ఆలోచించుకోండీ...” అన్నాడు.*
*అప్పుడు ప్రయాణికులు అందరూ ఒక్కొక్కరుగా వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి మొదలుపెట్టారు. మొదట ఆ పెద్దమనిషే మనుసులో చాలా భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకున్నాడు. ఏమీ జరగలేదు. అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు. అలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్లి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు. చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు. ఇక మరణించేది అతడే... అని అందరూ అనుకున్నారు. చాలా మంది అతని వైపు అసహ్యంతో కోపంతో చూడసాగారు. కొందరు జాలి పడుతూ చూడసాగారు. అతను కూడా భయపడుతూ బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి నిరాకరించాడు.*
*కాని... బస్సులోని ప్రయాణికులందరు ”నీవల్ల మేమందరం మరణించాలా... వీల్లేదంటూ బస్సు నుంచి బలవంతంగా క్రిందికి నెట్టారు. చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్లి చెట్టును ముట్టుకున్నాడు. వెంటనే పెద్ద మెరుపులతో పిడుగు వచ్చింది, తరువాత భయంకరమైన శబ్దం వచ్చింది. కాని పిడుగు వచ్చి పడింది ఆ చివరి వ్యక్తిపై కాదు... బస్సుపైన. అవును... బస్సుపై పిడుగు పడి అందులోని వున్న ప్రయాణికులందరూ మరణించారు. నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండడం వల్లనే ఇంత వరకు ఆ బస్సుకు ప్రమాదం జరగలేదు. ఇతని పుణ్యఫలం, దీర్ఘాయుస్సు మిగిలిన వారి అందరిని కాపాడింది.*
*అందుకే... మన పూర్వీకులు చెప్పేవారు... ఎల్లప్పుడూ మంచివారి తోనే సావాసం చేయమని. మంచివారితో సావాసం చేయడం వల్ల వారి వారి చెడు కర్మ ఫలాల తీవ్రత తగ్గే అవకాశం ఉంటుంది అని...*
******
రెండు గంటల నిరీక్షణ* (98)
నాన్నగారికి ఆరోగ్యం సరిగ్గా లేదు. చాలా జ్వరంగా ఉంది. మా కుటుంబ వైద్యులు రామమూర్తి గారు కొన్ని మందులు రాసిచ్చి, “సంపూర్ణంగా విశ్రాంతి అవసరం. మంచం నుండి కదలడానికి వీల్లేదు” అని చెప్పి వెళ్ళిపోయారు.
ఆ సమయంలోనే శ్రీమఠం నుండి స్వామివారి ఆజ్ఞతో ఒకరు ఇంటికి వచ్చారు. “పరమాచార్య స్వామివారి దర్శనానికి హింది పంతుల్ని ( మానాన్న) రమ్మంటున్నారు” అని.
అవును అది పరమాచార్య స్వామివారి ఆదేశం. మనస్సు సిద్ధమయ్యింది కాని వెళ్ళడానికి శరీరం సహకరించడం లేదు. మా నాన్నగారి పరిస్థితి చూసి, అతను సానుభూతి తెలిపి వెళ్ళిపోయాడు. ఒక గంట తరువాత శ్రీమఠం నుండి గుర్రపు టాంగా వచ్చి మా ఇంటి ముందు నిలబడింది. బహుశా చాలా ముఖ్యమైన విషయం అయ్యుంటుంది. ఈ సమయంలో హింది పండితుడు ఉండాలి అని మహాస్వామి వారు అనుకుని ఉంటారు.
నాన్నగారు వెళ్ళాల్సిందే. నాలుగైదు రోజులుగా నాన్న అన్నంగంజి తప్ప ఏమి తీసుకోవడం లేదు. రసం అన్నం కూడా తినవద్దని డాక్టరు గారు ఖండితంగా చెప్పారు. అయిష్టంగానే కొంత గంజి తాగి శ్రీమఠం సేవకుని సహాయంతో టాంగా ఎక్కారు. మఠం చేరగానే చాలా కష్టంగా కిందకు దిగారు. అ సేవకుని సహాయంతో మహాస్వామివారి వద్దకు వెళ్ళారు.
నాన్నని కూచోమన్నట్టుగా స్వామివారు ఆదేశించారు. స్వామివారి దర్శనం కోసం చాలామంది భక్తులు వచ్చారు. ఎన్నో సూచనలు చేశారు, పత్రాలను చదివి పంపారు, ఆశీర్వాదాలు ఇస్తున్నారు;
అలా రెండుగంటలు గడిచిపోయింది. నాన్నకు ఆకలిగా అనిపించింది. తనలో తనే, “స్వామివారు ఒక్కమాట కూడా మాట్లాడలేదు. నాకు ఆరోగ్యం కూడా బాలేదు. ఇక్కడకు వచ్చి ప్రయోజనం ఏమిటి?” అనుకున్నారు. అక్కడే ఉన్న స్వామివారి అంతేవాసులను చూసి మౌనంగా తన బాధను చెప్పుకున్నారు.
వెంటనే అతను, “హింది పండితునికి ఆరోగ్యం బాగోలేదు. చాలాసేపటి నుండి ఇక్కడే కూర్చున్నారు” అని చెప్పాడు.
మరునిముషంలోనే స్వామివారు ప్రసాదం ఇచ్చారు. వెంటనే నాన్నగారు స్వామి ఇచ్చిన విభూతిని నుదుటన రాసుకున్నారు. స్వామివారికి ప్రణామాలు సమర్పించి బయలుదేరుతుండగా శ్రీమఠం సేవకులు సహాయం చెయ్యడానికి రాగా, ”అవసరం లేదు. నేను నడవగలను” అని ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిచి వెళ్ళి టాంగా ఎక్కి కూర్చున్నారు.
ఇంటికి చేరగానే నాన్న గట్టిగా, “నాకు ఆకలేస్తోంది. చాలా ఆకలేస్తోంది. ఏమి చేశారు ఇంట్లో?” అని అడిగారు. “డాక్టరు మిమ్మల్ని కేవలం గంజి మాత్రమే తీసుకోమని చెప్పారు” అని అన్నాము.
“అతను చెప్పనీ. . . నాకు భోజనం పెట్టండి” అన్నారు. నాన్న ఆరోజు సుష్టుగా కమ్మని భోజనం చేశారు. సాయింత్రం నాన్నని పరీక్షీంచడానికి డాక్టర్ వచ్చారు. “అసలు జ్వరం లేదు. నేను ఇచ్చినది కాక ఇంకే ఔషధం తీసుకున్నారు?” అని అడిగారు.
“మీరు ఇచ్చినదే తీసుకున్నాను”
“లేదు.. లేదు.. మీరు ఏదో వేరే చేశారు”
అప్పుడు నాన్నగారు తను శ్రీమఠానికి వెళ్ళడం దాదాపు రెండుగంటలు స్వామివారి సన్నిధిలో ఊరికే కూర్చోవడం మొత్తం జరిగినదంతా డాక్టరుకు చెప్పారు. ఆయన ఆశ్చర్యపోతూ,
“అది సంగతి. నేను చెప్పలేదా మీరు ఇంకా ఏదో చేశారని.. నేను సరిగ్గానే ఊహించాను. రెండుగంటల పాటు స్వామివారి అనుగ్రహ వీక్షణం మీమీద పడి, మొత్తం మీ ఆనారోగ్యాన్ని పారద్రోలింది. పరమాచార్య స్వామివారు డాక్టర్లకే పెద్ద డాక్టర్. నా వైద్యం మీకు త్వరగా బాగుచేయదు కాబట్టి, వారి వైద్యాన్ని కృపాకటాక్ష వీక్షణాల ద్వారా మీమీద ప్రసరించడానికే మిమ్మల్ని మఠానికి రమ్మన్నారు” అని చెప్పారు.
ఏమి కరుణ!! ఎంతటి కరుణాసముద్రులు!!
మహాస్వామివారు ఉన్నవైపు తిరిగి మా కుటుంబ సభ్యులమందరమూ చెయ్యెత్తి వేవేల నమస్కారాలు చేశాము.
--- మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 7
#కంచిపరమాచార్యవైభవం
********
నేటి...99
*ఆచార్య సద్బోధన*
సేవ, పూజ, శరణాగతి ఈ మూడూ ఆధ్యాత్మిక జీవనానికి పునాది రాళ్ళు.
మనం ఓపికతో శ్రద్ధతో జాగరూకతని కలిగి ఉంటూ మన వంతు వచ్చే వరకూ విసుగును ప్రదర్శించుకుండా నిరీక్షణ చేయగలిగితే దీర్ఘకాలంగా, భారంగా తోచే రాత్రింబవళ్ళు, ఋతువులు అన్నీ మనకు అనువుగా నూతన తేజాన్ని, ఆనందాన్ని కలిగించే విధంగా విస్మయ రీతిలో మలచబడతాయి.
ప్రకృతిలో ప్రతీది పునరావృతం అవుతూనే ఉంటుంది.
మనందరిలోనూ ఆధ్యాత్మిక బీజం దాగి ఉంది, అది మొలకెత్తే సమయం కొరకు చూస్తూ ఉన్నది. అయితే దానికి అనువైన పరిస్థితులను ఏర్పరచడం అనేది మన మీదే ఆధారపడి ఉన్నది. దానికి సరియైన పోషణ లభించకపోతే అది ఒడలిపోయే ప్రమాదం ఉంది.
అందువలన జాగరూకతతో దానిని కాపాడగలిగితే అది మహావృక్షమై అనంత ఫలాలను అందిస్తుంది0
*******
*రేపటి తరానికి బతుకు, భధ్రతల లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖
**చాణక్య నీతి:*(100)
*తల్లిదండ్రులు ఇలాంటి తప్పులు చేస్తే ..అవి పిల్లలకు శాపాలుగా మారతాయా..!!*
ఆచార్య చాణక్యుడు తన నీతీ ద్వారా మనిషి తన జీవితంలో ఏ విధంగా ఆనందంగా గడపాలో అనేటువంటి ముఖ్య విషయాలను తెలియజేశారు. మనిషి జీవితంలోని ప్రతి అంశానికి సంబంధించి చాణక్యుడు తన నీతి శాస్త్రంలో తెలియజేశారు
చాణక్యుడు ధర్మం, అధర్మం, కర్తవ్యం, పాపపుణ్యాలను, అలాగే అర్థశాస్త్ర రాజకీయాలతో పాటుగా అనేక విషయాలను నీతి శాస్త్రంలో రాశారు.
ఆయన తెలియజేసిన విధానాలు మానవ జీవితంలో శాంతి మరియు విజయాలను చేకూరుస్తాయి. మరి ఆచార్య చాణక్య నీతి లోని కొన్ని విషయాలను చెప్పారు.. వీటిని పిల్లల తల్లిదండ్రులు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాలి.. అవేంటో చూద్దాం..!!చాణక్య నీతి ప్రకారం గుణవంతులైన తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలకు చిన్నప్పటి నుంచే మంచి గుణాలతో పెంచుతూ సరైన విద్య అందించాలి.
మంచి గుణాలు కలిగిన వ్యక్తులు సమాజంలో గౌరవంతో బతుకుతారు. అలాంటి పిల్లలను చిన్నతనం నుంచే నేర్పితే మంచి ప్రవర్తనతో మెలుగుతారు. అయితే చాణక్యుడు నీతి శాస్త్రంలోని రెండవ అధ్యాయంలో 11వ శ్లోకంలో ఈ విషయాన్ని చెప్పారు. పిల్లల చదువు విషయంలో శ్రద్ధ చూపనీ తల్లిదండ్రులు వారికి శత్రువుల వంటి వారని అన్నారు.
*****
*భారతదేశాన్ని జంబూ ద్వీపం (Jambu Dvipa) (101)
అని పిలవడం పురాణాల నుంచి వచ్చిన పేరు.*
ఇది హిందూ, జైన, బౌద్ధ గ్రంథాల్లో కనిపించే భూగోళ సిద్ధాంతం ప్రకారం వచ్చిన పేరు.
1. జంబూ ద్వీపం అనే పదానికి అర్థం:
"జంబూ" అనగా "జంబు వృక్షం" నేరేడు చెట్టు.
"ద్వీపం" అంటే "ద్వీపం లేదా భూభాగం"
అంటే జంబూ వృక్షం సమృద్ధిగా ఉన్న భూభాగం అని అర్థం.
2. పురాణ ప్రస్తావన:
హిందూ పురాణాల్లో భూలోకం (పృథ్వీ లోకం) ను ఏడు ద్వీపాలుగా విభజించారు.
జంబూ ద్వీపం
ప్లక్ష ద్వీపం
శాల్మల ద్వీపం
కుశ ద్వీపం
క్రౌంచ ద్వీపం
శాక ద్వీపం
పుష్కర ద్వీపం
ఈ ఏడు ద్వీపాల్లో జంబూ ద్వీపం కేంద్ర భూభాగం, అందులో భారత ఖండం ఒక భాగం.
3. జంబూ ద్వీపం విశిష్టత
జంబూ వృక్షం (నేరేడు చెట్టు) ఇక్కడ విరివిగా ఉండేది అని పురాణాల ప్రస్తావన.
పవిత్ర నదులు, ధార్మిక కేంద్రములు, తీర్థస్థానాలు జంబూ ద్వీపంలో ఉన్నాయని చెబుతారు.
4. జైన, బౌద్ధ వేదాంతంలో:
జంబూ ద్వీపం భూగోళం (Earth) కు ప్రతీక.
జైన గ్రంథాలు కూడా జంబూ ద్వీపాన్ని మధ్యలో ఉంచి మేరూ పర్వతం చుట్టూ ఆకారాన్ని వర్ణిస్తాయి.
బౌద్ధ గ్రంథాల్లో కూడా జంబూ ద్వీపం ఒక మధ్య భూభాగం.
5. భారత దేశానికి జంబూ ద్వీపం అనే నామధేయం:
భారత దేశం సంస్కృతి, పండితులు, పవిత్రత కోసం ప్రసిద్ధి పొందింది.
హిమాలయ పర్వతాలు, సింధు నదీ పరివాహక ప్రాంతం, గంగానది వంటివి పురాణకాలం నుంచి పవిత్ర భూభాగంగా పేర్కొనబడ్డాయి.
ధార్మికత, వేదాంతం, యోగం, ఆధ్యాత్మికత ఈ భూభాగంలో పుట్టాయి.
జంబూ ద్వీపం అనేది పురాణ గాథలు, ఆధ్యాత్మికత, భారతదేశ ప్రాచీనతను ప్రతిబింబించే పేరు.
భారతదేశం కేంద్రంగా ఉన్న ఈ ద్వీపం, సంస్కృతి, ధర్మం, జ్ఞానం కలిగిన ప్రదేశంగా హిందూ, జైన, బౌద్ధ వాఙ్మయాల్లో ప్రాముఖ్యత పొందింది.
అందుకే భారతదేశాన్ని "జంబూ ద్వీపం" అని ప్రాచీన కాలం నుంచి పిలుస్తున్నారు.
మహా గణపతి స్వరూపముగా దర్శనమిస్తున్న " జంబూ ద్వీపం " నిజంగా ఒక అద్భుతమే🙏
*✍️... *నేటి చిట్టికథ* (102)
ఒక గ్రామంలోని ఒక రాజప్రాసాదం వంటి గృహంలో ఒక తల్లీ కొడుకు సుఖంగా జీవిస్తున్నారు.
తల్లి వృద్ధాప్యం వల్ల పెద్దదయి కానిదయిపోయినప్పుడు ఆమెపట్ల శ్రద్ధ తీసుకునేందుకు కొడుకు విసుగుదల చూపాడు.
ఒక రోజు కుమారుడు తల్లితో తాను ఆమెను వదలి వెళ్ళేందుకు నిర్ణయించుకుని, మరోచోట గృహం ఏర్పర్చుకున్నానని చెప్పాడు.
తాము విడిపోయేలోగా లెక్కలన్నీ తేల్చుకునే అభిలాషను కూడా తెలియచేశాడు.
విడిపోవటమనే ఆలోచనపట్ల తాను చింతించినా, తమ మధ్య లెక్కలు తేల్చుకోవటమేమిటో తనకు బోధపడలేదని తల్లి అతనితో స్పష్టంగా చెప్పింది.
ఖర్చులకు సంబంధించిన అనేక వ్యయ పట్టికల క్రింద తాము ఒకరికొకరు డబ్బు బాకీ పడ్డామని కొడుకు వివరించాడు.
తనను పెంచి పోషించినందుకు తాను ఆమెకు కొంత డబ్బు ఋణపడ్డానని అతడు చెప్పసాగాడు.
అలాగే ఆమెపట్ల తన భక్తి శ్రద్ధలకుగాను ఆమె తనకు కొంత ధనం ఋణపడ్డదని చెప్పాడు.
చాలా సేపు అతడు సమ్మతింపచేయటంతో ఆమె లెక్కలు తేల్చుకునేందుకు అంగీకరించింది.
అతనికి సబబు అని తోచినట్లుగా జమాఖర్చు లెక్కలను సిద్ధంచేయమని ఆమె కొడుకుకు సూచించింది.
జాబితాలో కొన్ని విడిచిపెట్టబడినవి ఉన్నట్లయితే, ఏవైనా మార్పులు చేయవలసి వచ్చినట్లైతే, వాటిని చివరలో తాను సూచిస్తానని, అతడు వాటిని అంగీకరించాలని ఆమె చెప్పింది.
ఈ సూచనలు కొడుకు చాలా సంతోషంతో అంగీకరించాడు.
ఆ పిచ్చి తల్లికి మనసు సరిలేదని కుడా అతడు తలంచాడు.
చివరికి తల్లే అతనికి చెప్పుకోదగినంత పెద్దమొత్తం బాకీ ఉన్నట్లుగా అతడు ఒక పట్టిక తయారు చేశాడు.
పట్టికలోని అంశాలు, దానికి సంబంధించిన మొత్తాలు విని అంగీకారం తెలుపుతూ వచ్చింది.
ఆఖరి అంకె వెల్లడికాగానే ఆమె కుమారునికి ఒక అంశం విడిచినట్లుందని ఎత్తిచూపింది.
అతడు ఇంకా మాతృగర్భంలో ఉన్నప్పుడు తన్నిన తన్నులకు ఆమె అనుభవించిన వేదనకు పరిహారం అతడు దానిలో చేర్చలేదు. అతడు ఈ అంశం కూడా పట్టికలో చేర్చేందుకు అంగీకరించి, దీనికి కావలసినంత కావలసిన డబ్బు ఎంతో చెప్పమని అడిగాడు. తాను అతనికి చెల్లించవలసిన మొత్తం ఎంతో, దానికి సమానమైన మొత్తాన్ని నస్టపరిహారంగా ఇవ్వమని ఆమె కోరింది.
కుమారుడు సంతృప్తిగా దీర్ఘవిశ్వాసం విడిచి, ఆ " మూర్ఖురాలు " ఇంకా ఎక్కువ డబ్బు కోరనందుకు సంతోషించాడు.
ఆ దిక్కుమాలిన స్త్రీకి వీడ్కోలు చెప్పేందుకు అతడు లేవబోతుండుగా ఆమె మరో అంశం జాబితాలో లోపించిందనీ, దాన్ని కుడా చేర్చాలనీ చేప్పింది. " ఆలస్యంగా వచ్చిన తెలివితేటలకు " ఆమెను డబ్బు గుంజాలనుకుంటున్నదని శపిస్తూ కుమారుడు దానికి అంగీకారం తెలిపాడు.
అప్పుడు తల్లి అతనితో ఇలా చెప్పింది:" కుమారా! ఇటుచూడు! చాలా సంవత్సరాల క్రితం, నీవు బోసినోటి పసిపాపగా ఉన్నరోజుల్లో, ఒకనాడు నీవు నా ముఖం వంక - ప్రకాశవంతమైన చిఱునవ్వులు వెదజల్లుతూ - చూసి " అమ్మా " అని పిలిచావు. ఆ క్షణంలో నేను అనుభవించిన పులకరింత నాకు ఉన్న యావత్తు ధనానికి మించి నీకి ఋణపడ్డాను.
ఇప్పుడు నా వద్ద ఉన్న సంపద అంతా నీవేతీసుకుని - దాని వల్ల సుఖం లభిస్తే - నీవు సుఖంగా జీవించు "
మాతృమూర్తి ప్రేమ, సౌజన్యం, వివేకం కంటే ఏదీ విలువైనదికాదని ఆ క్షణంలో అతడు గుర్తించగలిగాడు!
కళ్ళనిండా నీళ్లతో ఆమె పాదాల పై పడ్డాడు....😢
సేకరణ
*👍దానంతో,తపస్సుతో…స్వర్గానికి వెళ్ళవచ్చు!*(103)
*ఈ లోకంలో ఎన్నడూ స్థిరంగా ఉండనివి కొన్ని ఉన్నాయి. ఏనుగు చెవులు, రావి ఆకులు, సముద్రపు అలలూ... అలాంటివే!*
*వాటన్నింటినీ మించి అస్థిరమైనది- ధనం! డబ్బు అంతటి నిలకడ లేనిది మరొకటి లేదు. సంపదకు ప్రతీక ‘లక్ష్మి’. లక్ష్మీదేవికి ‘చంచల’ అని పేరు. అది ఎక్కడ దాచినా దాగదు. దొంగలపాలు కావచ్చు. అగ్నికి ఆహుతి కావచ్చు. తుదకు రాజే ప్రజోపయోగార్థం లాక్కోవచ్చు.*
*‘న్యాయార్జిత విత్తం’ కొబ్బరికాయలో నీరులా వచ్చి చేరుతుంది. అది ఆరోగ్యకరం, రుచికరం.*
*అధర్మ సంపాదన ఓటికుండలో నీరు వంటిది. అది ఏనాటికైనా నేలపాలు కాక తప్పదు.*
*వామనావతార ఘట్టంలో బలి చక్రవర్తి ఏం చెప్పాడు? ‘కారే రాజులు రాజ్యముల్ కలుగవే!... వాళ్లంతా సిరి మూటగట్టుకొని పోగలిగారా? ఈ భూమి మీద వాళ్ల పేరైనా మిగిలి ఉందా?*
*కానీ మహా త్యాగమూర్తులైన శిబి చక్రవర్తి వంటివారిని మాత్రం మరచిపోలేదు గదా’ అని గురువుకే హితోపదేశం గావించాడు.*
*‘నువ్వు తిన్నది నేలపాలు, ఇతరులకు పెట్టింది నీ పాలు’ అని లోకోక్తి.*
*‘లక్షాధికారైన లవణమన్నమె గాని, మెరుగు బంగారంబు మింగబోడు’ అంటారు. ఒకరికి ఇవ్వకుండా, తాను అనుభవించకుండా ఉంటే అది తుదకు దొంగలపాలే!*
*పాత్రతనెరిగి దానం చేయాలి. అపాత్రదానం అపాయకరం.*
*అసలు దానం పుచ్చుకోవడాన్నే తప్పుపడతాయి ధర్మశాస్త్రాలు. ‘అపరిగ్రహణం’ అనేది ఒక ఉత్తమ వ్రతం. ఎవరినీ యాచించి ధనం తీసుకోకపోవడమే ఈ వ్రత లక్షణం. ఒకవేళ తీసుకోవలసి వస్తే, ముందుగా దాత చేతిలో ఏదైనా పెట్టి, తరవాతే పుచ్చుకోవాలంటారు.*
*భార్యామణి బలవంతంపై, కుచేలుడు శ్రీకృష్ణుణ్ని అర్థించడానికి వెళ్ళాడు. తీరా అక్కడికి వెళ్ళిన తరవాత నోరు పెగలలేదు. తీసుకెళ్ళిన అటుకుల్ని ఇస్తే కృష్ణుడు ఆప్యాయంగా భుజించాడు. కుచేలుడు తానుగా యాచించలేదు. పరమాత్మ దయ ప్రసరిస్తే ఎవరికి ఏ సమయంలో ఏది లభించాలో అది లభించకుండా ఉంటుందా!*
*ఈ కాలంలో బతుకులు జీవన ప్రధానంగా సాగుతున్నాయి. ఏదో ఒక విధంగా అధికంగా సంపాదించడమే ఎక్కువమంది బుర్రల్లో సదా సాగే ఆలోచన. ప్రజలు జీవనానికి ఇస్తున్న ప్రాధాన్యం కర్తవ్యానికి ఇవ్వడంలేదు. మన సంప్రదాయంలో ఒక కథ ఉంది...*
*ప్రజాపతి తన సంతానానికి మూడుసార్లు ‘ద’ అని బోధించాడు. దేవతలకు ‘దమం’, మనుషులకు దత్త, అసురులకు దయ... ఇవీ ప్రజాపతి సందేశాలు. దమం అంటే ఇంద్రియ నిగ్రహం, దేవతలకు అవసరమైనది. అసురులు క్రూరంగా ఉంటారు. అందువల్ల వాళ్లకు ‘దయ’. ఇక ... మనుషులు సహజంగా లోభులు. వాళ్లకు ‘దత్త’ అని ప్రబోధించాడు ప్రజాపతి. దురాశతో అధికంగా కూడబెట్టడంవల్ల మానవాళి కష్టాల పాలవుతుంది. అందుకే ప్రజాపతి దత్త- ‘దానం చేయండి’ అని ప్రబోధించాడని చెబుతారు.*
*దానం అయిదు రకాలంటారు- ధర్మం, అర్థం, భయం, కామం, కారుణ్యం. వీటివల్ల దాతకు ఇహలోకంలో కీర్తి, పరలోకంలో ఉత్తమగతీ కలుగుతాయి.*
*అసూయ లేకుండా ఇస్తే అది ధర్మదానం. యాచకులు ప్రశంసిస్తూ ఉండగా ఇస్తే అర్థదానం. దానం ఇవ్వకపోతే ఏం చేస్తారో అనే భయంతో ఇచ్చేది భయదానం. ఇష్టమైన వ్యక్తికి ఇస్తే కామ దానం. పేదవాడికి జాలితో ఇచ్చేది కారుణ్య దానం. వీటిలో ఏ రకమైన దానమైనా అది పుణ్యాన్ని, కీర్తిని ప్రసాదించేదే!*
*‘దానంతో, తపస్సుతో స్వర్గానికి వెళ్ళవచ్చు గదా! ఈ రెండింటిలో ఏది ఉత్తమమైనది?’ అని ధర్మరాజు భీష్ముణ్ని ప్రశ్నించాడు.*
*దానికి భీష్ముడి జవాబు- ‘తపస్సు ప్రభావం వల్ల పవిత్ర హృదయులైన రాజులు ఉత్తమ గతులు పొందుతారు. ధర్మపరాయణులైన రాజులు దాన పుణ్యాసక్తులై నిస్సందేహంగా ఉత్తమ లోకాలకు వెళ్తారు. మార్గాలు వేరైనా ఫలితం ఒకటే! అయితే ఈ రెండో మార్గంలో వెళ్లాలంటే ధనం పుష్కలంగా ఉండాలి!’*
. *సర్వం శివార్పణమస్తు*
*****
శనైశ్చర జయంతి సందర్భంగా శని శింగణాపూర్ విశిష్టత!*(104)
*శని శింగణాపూర్*
*నవ గ్రహాలలో ఏడోవాడు, సూర్య భగవానుడికి ఛాయాదేవికి కలిగిన కుమారుడే శని దేవుడు అని శాస్త్రాలు చెప్తున్నాయి. నిజానికి భక్తులు శనీశ్వరుడుని భక్తితో, శ్రద్ధతో ఎవరికి అన్యాయం చెయ్యకుండా ధర్మపథాన నడుచుకుంటే కరుణించి చల్లగా చూస్తాడని ప్రతీతి... శనీశ్వరుడి కుడి చేతిలో దండం, ఎడమ చేతిలో కమండలం, ఖడ్గం ఉంటుంది... శనీశ్వరుడి వాహనం కాకి...*
*ఇక శని భార్య మందాదేవి మరియు లక్ష్మిదేవి సోదరి అయినా జేష్టాదేవి. ఈమెనే అంతా దారిద్ర దేవత అని పిలుచుకుంటున్నారు. శని భగవానుడు విషుణువుకి తోడల్లుడు, యమధర్మరాజుకి సోదరుడు. గ్రహాలకి యువరాజు. శని కుమారుల పేర్లు మంది, కులగున్. ఇక నలుడు, హరిచ్చంద్రుడు, పురూరవుడు, సగరుడు, కార్తవీర్యార్జునుడు ఇంకా అనేక మంది శని దేవుడి వలన కష్టాలు పొంది మరల మంచి ప్రవర్తనతో సుఖాలను పొందారు.*
*శని దేవుడి దూషణ సర్వ దేవతలను తిట్టడంతో సమానమని చెప్తారు. ఆయనని పూజిస్తే సకల దేవతలను పూజించినంత ఫలితం ఉంటుంది. త్రేతాయుగంలో లంకలో రావణుండై అధీనంలో ఉన్న ఆంజనేయుడుని శనీశ్వరడు విడిపించాడని ఒక కధనం. అందుకే హనుమత్ దీక్షలో ఉన్న వారిని, మందుడుకి ఇష్టమైన నల్లని దుస్తులు ధరించే అయ్యప్ప భక్తులను ఎప్పుడు బాధించడని చెప్తారు.*
*మహా రాష్ట్రలోని శని శింగణాపూర్ గ్రామంలో ఉన్న శని దేవుని ఆలయం ఒక అద్భుతమైన పుణ్య క్షేత్రం. ఇక్కడి దైవం స్వయంభువు అనగా భూమి నుంచి స్వయంగా ఉద్బవించిన నల్లని రాతి విగ్రహం. అనాది కలం నుంచి కొలువై ఉన్నాడని తెలుస్తుంది. కలియుగం ప్రారంభం నుంచి ఈ రాతి విగ్రహం వున్నదని పేర్కొంటారు. గొర్రెల కాపరి చెప్పిన చరిత్ర కధనం ప్రకారంగా*
*ఒక రోజు గొర్రెల కాపరి పదునైన చువ్వతో రాతిని ముట్టుకొనగా దాని నుంచి రక్తం కారడం ప్రారంభించింది. ఈ ఘటనతో గొర్రెల కాపరి దిగ్బ్రాంతి చెందగా వెంటనే ఊరు మొత్తాన్ని పిలుచుకు వచ్చాడు. ఆ అద్భుతాన్ని గ్రామ ప్రజల అందరు చూసారు... ఆ రాత్రి గొర్రెల కాపరి కలలో శనీశ్వరుడు కనిపించి తాను శనీశ్వరుడుని అని... రాతి విగ్రహంలో వెలిసానని చెప్తాడు. నల్ల రాతి విగ్రహానికి దేవాలయం కట్టించాలి అని శనిని అడిగినప్పుడు ఆకాశం తన నీడ అని... తనకి ఎలాంటి నీడ అవసరం లేదని ప్రతి రోజు తనకి తైలాభిషేకం చెయ్యాలని ఆ గొర్రెల కాపరికి ఆదేశం ఇస్తాడు... అంతే కాకుండా తన వలన ఈ గ్రామానికి ఎలాంటి దొంగల భయం ఉండదని చెప్పాడు అప్పటినుంచి ఈ గ్రామానికి దొంగల భయం లేదు… కన్నాలు వేసి సొమ్ము వేసి దొంగిలించడం అంటూ జరగదు.*
*శని దేవుడు ఆ రకంగా తనకి పూజలు జరగాలని ఆదేశించాడు కాబట్టే ఈ రోజు వరకు కూడా ఎలాంటి కప్పు గాని, దేవాలయం గోపురం గాని ఈ శని దేవుడికి ఉండదు… ఆరు బయట ప్రదేశంలోనే చుట్టూ కొన్ని రాళ్ళని ప్రహారిగా పెట్టి నువ్వుల నూనెతో, నువ్వులతో… దేవుడికి అభిషేకం చేస్తూ పూజిస్తారు. ఇక దొంగల భయం అసలు లేని ఊరే శని శింగణాపూర్*
*ఇక ఈ క్షేత్రంకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది అదేమిటి అంటే… ప్రతి మనిషికి జీవితంలో మూడు దస్సల్లో యేలినాటి శని వస్తుంది... ఏడు సంవత్సరాలు ఉండే ఈ శని బాధల్ని, తప్పించుకోవాలి అంటే ఇక్కడ ప్రతి శనివారం తైలాభిషేకం చేస్తే శని గ్రహ బాధల్ని తొలగించుకోవచ్చు అని నమ్ముతారు.*
*యేలిననాటి శని వున్న వారు హనుమంతుడిని పూజిస్తే శని వలన కలిగే ఈతి బాధలను తగ్గించుకోవచ్చని నమ్ముతారు... త్రేతాయుగంలో రావణుడి బారి నుండి తనను కాపాడాడు కాబట్టి కృతజ్ఞతగా హనుమంతుని ఎవరైతే పూజిస్తారో, మరి ముఖ్యంగా శనివారంలో పూజిస్తే వారికి ఎలాంటి బాధలు ఉండవని వరం అందిస్తాడు… శని దేవుడు… మొత్తం కాకున్నా చాలావరకు బాధలను తగ్గించగలను అని మాట ఇస్తాడు… అప్పటినుంచి హనుమంతుడిని పూజిస్తారు అలాగే శని దశ నడుస్తున్నవారు శివుడిని పూజిస్తే కూడా ఫలితం ఉంటుంది అని విశ్వసిస్తారు.*
*శనైశ్చర జయంతి సందర్భంగా శని దేవుడి కృప మీ పై ఉండుగాక.!!*
******
*
*"సంకల్పమే🌊 జీవనాధారం"💦.!!*(104)
*మన సంకల్పాలే🫧మన జీవితాన్ని🌊 రూపొందిస్తాయి...*
*"యద్భావం తద్భవతి" మనం ఎలా ఆలోచిస్తామో అలానే తయారవుతాం, అంటే మన మనసు దేని గురించైతే ఆలోచిస్తుందో మనం దాన్నే పొందుకుంటాం*
*ఈ జీవితం సుఖదుఃఖాల, గెలుపు ఓటముల ఆట*
*మన మనసు ఏ విషయాన్ని పదే పదే ఆలోచిస్తుందో అదే మన దగ్గరకు వస్తుంది*
*అందుకే మన మనసులో సంకల్పం ఇలా చేయాలి..."నేను చాలా ఆనందంగా ఉన్నాను" "ఆరోగ్యంగా ఉన్నాను" "సురక్షితంగా ఉన్నాను" "సదా భగవంతుడు నా చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు" "భగవంతుని తోడు మరియు భగవంతుని వరదాన్ని హస్తం నా తలపై ఉంది" "నాకు ఎల్లప్పుడూ అన్ని చాలా మంచిగా జరుగుతూ ఉంటాయని, శుభ సంకల్పాలు చేస్తూ ఉంటే, ఒకవేళ చెడు జరిగేది ఉన్న, అది కూడా మంచిగా అయిపోతుంది"*
*"బలహీన సంకల్పాల negative thoughts" రచనయే మన జీవితాలను అధోగతి పాలు చేశాయి. మరల మన జీవితంలో సఫలత సాధించాలంటే అది మన "శుభ సంకల్పాల శక్తి⚡positive thoughts ⚡power" తోనే సాధ్యం, కనుక శుభ సంకల్పాలు చేయడం ద్వారా పాజిటివ్ ఎనర్జీ నింపుట సాధ్యం*
*బాహ్యంగా మనం ఎంత ప్రాయాసపడినా ఆంతరికంగా మన సంకల్పాలు సరిలేకుంటే ప్రయోజనం శూన్యం కనుక మన ధ్యాస అంతా మన సంకల్పాల పరివర్తన పై పెడితే సహజంగానే మన జీవితంలో సానుకూల పరివర్తన positive improvement సాధ్యం అవుతుంది.*
******
🔔 *సత్సంగం*( 105)
*_మూసిన కన్ను తెరవకపోయినా, తెరిచిన కన్ను మూయకపోయినా, శ్వాస తీసుకుని వదలకపోయినా, వదిలిన శ్వాస తీయకపోయినా, ఈ లోకంలో ఈ జన్మకు అదే చివరి చూపు!_*
*_ఫెయిర్ అండ్ లవ్‌లీలు, సున్నిపిండితో నున్నగా తీర్చిదిద్దిన ఈ దేహాన్ని నిప్పుల కొలిమిలో కాల్చక తప్పదు! మనం ఎవ్వరం అయినా సరే మనల్ని ఈ ప్రపంచం నిర్థాక్ష్యిణ్యంగా మరచి పోయేలా చేస్తుంది కాలం!_*
*_విరోధులైనా, స్నేహితులైనా, పశ్చాతాపపడినా, మనసు మార్చుకున్నా మరల కనిపించం. ఈ క్షణం మాత్రమే నీది, మరుక్షణం ఏవరిదో? ఏమవుతుందో ఎవరికి తెలుసు? ఈ ప్రపంచాన్ని భస్మీ పటలం చేసే అణ్వాయుథాలు నీవద్ద ఉన్నా నీ ఊపిరి ఎప్పుడు ఆగుతుందో ఎవరికి తెలియదు!_*
*_ఈ ప్రపంచాన్ని శాసించేంత గొప్పవారైనా, సంపన్నులైనా బలవంతులైనా అవయవక్షీణం-ఆయుఃక్షీణంను తప్పించుకోజాలరు. ఈ సృష్టిలో మనమే మొదలు కాదు, చివర కాదు._*
*_ఈ దేహంలో మనం అద్దెకు ఉండటానికి వచ్చాము. అద్దె ఇంటిని విడిచివెళ్లేటప్పుడు మన సామాన్లు మనం తీసుకెళ్లినట్టు మనం చేసిన కర్మలను మనతో మోసుకువెళ్లక తప్పదు.!_*
*_చెట్టుకి, పుట్టకి, రాయికి, రప్పకి ఉన్న ఆయుర్థాయం కూడా మనకి లేదు. ఈ భూమ్మీద కాలమనే వాహనంలో ఒక చోట ఎక్కి మరో చోట దిగిపోతాం. మనం సహప్రయాణికులం మాత్రమే. కుటుంబం, స్నేహాలు, శత్రుత్వాలు అన్నీ భ్రమ, మాయ._*
*_కావున నిరంతరం ధ్యానంతో ఉంటూ సత్యమైన మార్గం ద్వారా ధనాన్ని ఆర్జించి, తోటి వారికి ఎంతో కొంతపంచుతూ ఉన్నతంగా జీవించండి._*
******
🌹హనుమాన్ సర్వస్వం🌹*(106)
*పరాశర సంహిత నుంచి సేకరించిన సమాచారం ప్రశ్నలు జవాబులు.*
🚩1) శ్రీ హనుమంతుని తల్లి పేరు?
జవాబు : అంజనా దేవి !
🚩2) హనుమంతుని తండ్రి పేరు?
జవాబు : కేసరి !
🚩3) కేసరి పూర్వ జన్మలో ఎవరు?
జవాబు : కశ్యపుడు !
🚩4) అంజన పూర్వ జన్మలో ఎవరు?
జవాబు : సాధ్య !
🚩5) హనుమంతుని జన్మ తిథి ఏది?
జవాబు : వైశాఖ బహుళ దశమి!
🚩 6) హనుమంతుని జన్మ స్థలం ఏది?
జవాబు : తిరుమల - అంజనాద్రి.
🚩7) హనుమంతుని నక్షత్రము ?
జవాబు : పూర్వాభాద్ర నక్షత్రము.
🚩8) హనుమంతుని జనన లగ్నం ?
జవాబు : కర్కాటక.
🚩9) హనుమంతుడు ఏ యోగం లో పుట్టాడు ?
జవాబు : వైదృవీయోగం లో
🚩10) హనుమంతుడు ఏ అంశతో పుట్టాడు ?
జవాబు : ఈశ్వరాంశ
🚩11) ఎవరి వరం వలన హనుమంతుడు పుట్టాడు ?
జవాబు : వాయుదేవుని వరం వలన.
🚩12)హనుమ జనన కారకులు ?
జవాబు : శివ,పార్వతులు, అగ్ని,వాయువులు.
🚩13) హనుమంతుని గురువు ?
జవాబు : సూర్య భగవానుడు.
🚩14) హనుమంతుని శపించిన వారు ?
జవాబు : భృగుశిష్యులు.
🚩15) హనుమంతునికి గల శాపం ?
జవాబు : తన శక్తి తనకు తెలియకుండా ఉండడం.
🚩16) హనుమంతుని శాప పరిహారం ?
జవాబు : స్తుతించినా,
నిందించినా తన శక్తి తను గ్రహించుట.
🚩17) హనుమంతుని బార్య ?
జవాబు : సువర్చలా దేవి.
🚩18) సువర్చాలా దేవి మాతామహుడు ?
జవాబు : విశ్వకర్మ.
🚩19) హనుమంతుని మాతామహుడు ?
జవాబు : కుంజరుడు.
🚩20)సువర్చల తల్లి పేరు ?
జవాబు : సంజాదేవి, ఛాయాదేవి.
🚩21) హనుమంతుని బావమరుదులు ?
జ : అశ్వనీ దేవతలు, శని,యముడు.
🚩22) హనుమంతుని వివాహ తేదీ ?
జ : జేష్ఠ శుద్ధ దశమి.
🚩23) హనుమంతుని తాత, అమ్మమ్మ ?
జ : గౌతముడు , అహల్య.
🚩24) హనుమంతుని మేన మామలు ?
జ : శతానందుడు, వాలి, సుగ్రీవులు.
🚩25)హనుమంతుడు నిర్వహించిన పదవి ఏది ?
జ : సుగ్రీవుని మంత్రి.
🚩26) హనుమంతుడు నిర్వహించిన పదవి స్థానం ఏది ?
జ : ఋష్యమూక పర్వతం.
🚩27) శ్రీరాముని కలియుటకు హనుమంతుడు ఏ రూపం ధరించాడు ?
జ : భిక్షుక రూపం.
🚩28) హనుమంతుడు శ్రీరాముని తొలుత చూసిన స్థలం ఏది ?
జ : పంపానదీ తీరం .
🚩29)హనుమంతుని వాక్ నైపుణ్యాన్ని తొలుత మెచ్చింది ఎవరు ?
జ : శ్రీరాముడు.
🚩30)హనుమంతుడు అగ్ని సాక్షిగా ఎవరికి మైత్రి గూర్చాడు ?
జ : శ్రీరామ సుగ్రీవులకు.
🚩31)హనుమంతుడు వాలిని సంహరింపని కారణం?
జ : తల్లి అజ్ఞ.
🚩32)హనుమంతుడు లక్ష్మణుని కి ఆసనంగా వేసినది ?
జ : చందన వృక్ష శాఖ.
🚩33)హనుమంతుని సంపూర్ణ చరిత్ర కలిగిన మహత్ గ్రంథం ?
జ : శ్రీ పరాశర సంహిత.
🚩34)హనుమంతుని మేన మామలు వాలి సుగ్రీవుల భార్యలు ?
జ : తార, రమ.
🚩35) చైత్ర మాసంలో హనుమత్ పర్వదినం ?
జ : పుష్యమి నక్షత్రం గల రోజు.
🚩36) సీతా దేవి నీ వెతుకుటకు హనుమంతుడు నీ ఏదిక్కుకు పంపారు.?
జ : దక్షిణ దిక్కు.
🚩37)వైశాఖ మాసంలో హనుమత్ పర్వదినం ఏ నక్షత్రం కలది ?
జ : ఆశ్లేష నక్షత్రం.
🚩38) హనుమంతుడి ఆదేశం తో వానరులు ప్రవేశించిన గుహ ఎవరిది ?
జ : స్వయంప్రభది.
🚩39) ప్రాయోప ప్రవేశ యత్నం లో ఉన్న అంగదాదులను భక్షించిన పక్షి ?
జ : సంపాతి.
🚩40) సముద్ర లంఘనం కోసం హనుమంతుడు ఎక్కిన పర్వతం ?
జ : మహేంద్ర పర్వతం.
🚩41)హనుమంతుడు దాటిన సముద్ర విస్తీర్ణము ?
జ : 100 యోజనాలు.
🚩42)హనుమంతునికి అడ్డు వచ్చిన పర్వతం ?
జ : మైనాకుడు.
🚩43)హనుమంతునికి ఆతిథ్యం ఇవ్వాలని తలచింది ఎవరు ?
జ : సముద్రుడు.
🚩44) మైనాకుని హనుమంతుడు ఎం చేశాడు?
జ : రొమ్ము తో తాకాడు.
🚩45) మైనాకుడు హనుమంతుడిని ఎల అనుగ్రహించాడు.?
జ : చేతితో స్పృశించి.
🚩46)హనుమంతుని కి ఏర్పడిన 2 వ విఘ్నం ?
జ : సురస.
🚩47) సురస ఏ జాతి స్త్రీ ?
జ : నాగజాతి.
🚩48) సురస నుండి హనుమంతుడు ఏలా తప్పించుకున్నాడు.?
జ : ఉపాయంతో.
🚩49) సురసను పంపిన దెవరు ?
జ : దేవతలు.
🚩50) సురసను దేవతలు ఎందుకు పంపారు ?
జ : హనుమంతుని శక్తి సామర్థ్యాలు పరీక్షించుటకు .
🚩51) హనుమంతునికి ఏర్పడిన 3 వ విఘ్నం ?
జ : సింహిక.
🚩52) సింహిక హనుమంతుని ఎం చేసింది ?
జ : నీడ పట్టి లాగింది.
🚩53) సింహిక వృత్తి ఎమిటి ?
జ : లంకను కాపాడడం.
🚩54) హనుమంతుని చరిత్ర ఎవరితో చెప్పబడింది ?
జ : శ్రీ పరాశర మహర్షి చే.
🚩55) హనుమంతుడు లంక లో ఏ ప్రాంతంలో వాలాడు.?
జ : సువేల పర్వత ప్రాంతం లో.
🚩56) హనుమ వెళ్లిన పర్వతం మొత్తానికి గల పేరు ?
జ : త్రికూటాచలం.
🚩57) సువేల పై హనుమంతుడు ఎందుకు అగాడు ?
జ : సూర్యాస్తమయం కోసం.
🚩58) లంకలోకి హనుమంతుడు ఎంత రూపంలో వెళ్ళాడు?
జ : పిల్లి పిల్ల అంత వాడు అయ్యి.
🚩59) లంకా ప్రవేశ ద్వారం వద్ద హనుమను అడ్డగించింది ఎవరు ?
జ :లంకిణి
🚩60) లంకిణిని హనుమంతుడు ఎల కొట్టాడు ?
జ : ఎడమ చేతి పిడికిలి తో.
🚩61) లంకలో హనుమంతుడు ఎలా ప్రవేశించాడు ?
జ : ప్రాకారం దూకి.
🚩62) శతృపుర ప్రవేశంలో హనుమంతుడు పాటించిన శాస్త్ర నియమం ఎమిటి ?
జ : ఎడమ కాలు ముందు పెట్టీ పోవడం.
🚩63) ఎవరిని చూసి హనుమంతుడు సీతగా బ్రమించాడు ?
జ : మండోదరిని.
🚩64)హనుమంతుడు ప్రవేశించిన వనం ?
జ : అశోక వనం.
🚩65) అశోక వనం ఏ పర్వతం పైన ఉన్నది ?
జ : సుందర పర్వతం.
🚩66)లంకా నగరం ఏ పర్వతం పై ఉన్నది ?
జ : నీల పర్వతం.
🚩67)శ్రీ హనుమత్ చరిత్ర అంతా పరాశర మహర్షి చే ఎవరికి చెప్పబడింది ?
జ : మైత్రేయ మహర్షి కి.
🚩68)హనుమంతుడు అందించిన అద్భుత సందేశం ?
జ : జీవనృద్రాణిపశ్యతి. -(బ్రతికి ఉండిన శుభములు బడయవచ్చు)
🚩69) సీతను హనుమంతుడు ఏ చెట్టు కింద చూచాడు ?
జ : శింశుపా వృక్షము.
🚩70) సీతకు హనుమంతుడు ఆనవాలుగా ఏమిచ్చాడు ?
జ : రాముడి ఉంగరం.
🚩71) హనుమంతునికి తన ఆనవాలుగా సీత ఎమి ఇచ్చింది ?
జ : చూడామణీ.
🚩72)హనుమంతుడు అశోక వనం ద్వంసం అనంతరం ఏ రాక్షస వీరుని చంపారు ?
జ : జంబుమాలిని.
🚩73) హనుమంతుని చేతిలో మరణించిన రావణ సుతుడు ఎవరు ?
జ : అక్షయ కుమారుడు.
🚩74)హనుమంతుడు ఎవరికి బందీ అయ్యాడు ?
జ : ఇంద్రజిత్తు నకు.
🚩75) హనుమంతుని రావణ దర్భారు లో ఎవరు ప్రశ్నించారు. ?
జ : ప్రహస్తుడు .
🚩76) సముద్రం తిరిగి దాటడానికి ఆధారం చేసుకున్న పర్వతం ?
జ : అరిష్ట పర్వతం.
🚩77) సముద్రం మొదట దాటడానికి ఎంత సమయం పట్టింది ?
జ : 30 ఘడియలు.
*ఆరు గజాలు - తొమ్మిది గజాలు*..(107)
ఒకరోజు కంచి శ్రీమఠానికి ఒకామె ఆరు గజాల చీర కట్టుకుని వచ్చింది. బహుశా ఆమె మొదటి సారి అక్కడకు రావటం ఏమో. మఠానికి వచ్చే ఆడవారు తిమ్మిది గజాల మడిచీర కట్టుకుని రావాలనే విషయం ఆమెకు తెలియదేమో.
పరమాచార్య స్వామికి పెద్ద భక్తురాలను అని భావించే మరొకామె ఈ ఆరు గజాల చీరావీడను చూసింది. వెంటనే ఏదో జరిగిపోయినట్టుగా ఆమె కోపంతో ఊగిపోతోంది.
“మడిచీర కట్టులో చీర కట్టుకోకుండా నువ్వు పరమాచార్య స్వామివారి దర్శనం చేసుకోవడానికి వీలు లేదు” అని ఆమెపై విరుచుకుపడింది.
ఆ భక్తురాలి దుర్దదృష్టం వల్ల మహాస్వామివారు అటువైపు రానే వచ్చారు. అక్కడ ఎందుకు అంత పెద్దగా అరుపులు వినపడుతున్నాయి అని అడిగారు. జరిగినదంతా స్వామివారికి చెప్పారు.
ఊగిపోతున్న ఆ మడిచీర భక్తురాలిని స్వామివారు పిలిచారు. “ఆమె చాలా బీదరాలు. ఆమెవద్ద తొమ్మిది గజాల చీర లేదు. కొనగలిగే శక్తి ఆమెకు లేదు. నువ్వు వేంటనే బట్టల దుకాణానికి వెళ్ళి తొమ్మిది గజాల చీర ఒకటి, రెండు రవిక బట్టలు తీసుకుని వచ్చి ఆవిడకు ఇవ్వు” అని స్వామివారు ఆదేశించారు.
వెంటనే ఆమె స్వామివారి ఆదేశాన్ని అమ😄లుపరిచింది. వెళ్ళి తొమ్మిది గజాల చీర కొనుక్కుని వచ్చి, దాన్ని మడిచీర పద్ధతిలో ఆమెకు కట్టి పరమాచార్య స్వామి వద్దకు తీసుకుని వెళ్ళింది.
స్వామివారు చూసి, ”చాలా మంచిది, కాని నువ్వు చేసిన పని తప్పు కనుక ఆమె వద్ద క్షమాపణలు అడుగు” అని అన్నారు.
మహాస్వామివారు సాంప్రదాయానికి పెద్దపీట వేసినా, ఎక్కడెక్కడ మినహాయింపులివ్వాలో వారికి బాగా తెలుసు.
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం ।।
# #కంచిపరమాచార్యవైభవం
*****
Saturday, 20 May 2017
Subscribe to:
Comments (Atom)