Monday, 16 February 2026

 

(001 )

కులినై: సహ సంపర్కం పండితై : సహమిత్రతాం |

జ్ఞాతిభిశ్చ సమం మేలం కుర్వాణో నవినశ్యతి ||

        మంచి వ్యక్తులతో సంబంధం, పండితులతో స్నేహితులు, బంధువులు సంబంధం ఉన్న అతను ఎప్పటికీ నాశనం అవ్వడు.

కం.. మంచివ్యక్తులతోనూ :: మంచిస్నేహితులతోను మనసుపెట్టికదలు

మంచిగ నున్నటి బంధము:: మంచిగా బ్రతుకగలిగెను మానస మేలూన్  

(002 )      

పుష్పేషు చంపా నగరీషు లంకా నదీషు గంగా నృపతేషు రామః |

రామాసు రంభా పురుషేషు విష్ణుః కావ్యేషు మాఘః కవికాలిదాసః ||🌺

       పువ్వుల్లో సంపెంగ శ్రేష్ఠమైనది. నగరాలలో లంక ఉన్నతమైనది. చక్రవర్తులలో రామ శ్రేష్టుడు. సౌందర్యంలో రంభ శ్రేష్టురాలు. పురుషులలో విష్ణు శ్రేష్టుడు.అలాగే కావ్యాలలో మేఘదూత శ్రేష్టం.కవులలో కాళిదాసు శ్రేష్టుడు.

ఆ.వె: సరయు పువ్వు గాను సంపెంగ  శ్రేష్టము ::ఉన్నతంబుగాను ఉన్నతే లంకయు  

చక్రవరి రామ చెలిమి విష్ణు ::శ్రేష్ఠ కాళిదాసు సౌందర్యంబగురంభ  

(౦౦౩)

అనిఅచ్చంపి వినయం విద్యాభ్యాసేనబాలకాః |

భేషజేనేవ నైరుజ్యం ప్రాపణీయా: ప్రయత్నతః ||

మందు ఇచ్చి రోగాన్ని తగ్గించినట్టుగానే,పిల్లలు ఇష్టపడక పోయినా వాళ్లకు విద్యాభ్యాసం చెప్పించి నయ వినయాలు నేర్పాలి.

ఆ.వె:: వెతలుదీర్చ మందు వేగిరగుట :: జాగృతమొనరించు శైల విధము 

తల్లి సేవ ఫలము తగునునేర్పు తెలివి :: చేతి నందు విద్య జేకొన బిడ్డకు 

(004 )

క్షమాతుల్యం తపో నాస్తిన సంతోషాత్పరం సుఖం |

నా తృష్ణయ పరో వ్యాధిర్న చ ధర్మో దయాపరః ||

     క్షమకు సరి సమానమైన తపస్సు ఏదీలేదు.సంతోషం కన్నా పెద్ద సుఖం ఏదిలేదు.ఆశలను మించిన రోగం ఇంకొకటి ఏదిలేదు. దయకన్నా మించిన ధర్మం ఏది లేదు.

ఆ.వె.: క్షమ సమానమైన కాలతపస్సేది :: సంతస సుఖము తీరు శాంతి తెలుపు

యాస యన్న దేను యసలు రోగి :: దయయు కరుణ చెలిమి ధర్మ మేను          

(005 )

న కించదపి కుర్వాణః సౌఖ్యేర్దు: ఖాన్య పోహతి |

తత్తస్య కిమపి ద్రవ్యం యో హియస్య ప్రియో జనః ||🌺

     ఎవరికి ఎవరు ప్రేమగా అనిపిస్తారో వాళ్ళు ఏ పని చెయ్యక పోయినా దగ్గరగా ఉండి దుఃఖం పోగొట్టవచ్చు.అదే ప్రేమలో ఉన్న ఒక గొప్ప విశేషమైన గుణము.

ఆ.వె. ఎవరికెవరు చెప్ప ఎరుకగా నుం0డరు:: సుఖము దుఃఖముకల సూత్రమగుట 

ప్రేమవిల్వ వెలుగు ప్రీతిణి గొలుపుటే ::నమ్మకంబు గొప్ప న్యాయ గుణము  

(006 )

అశ్వస్య లక్షణం వేగో మదో మాతంగలక్షణం ౹

చాతుర్యం లక్షణం నార్యా ఉద్యోగో పురుష లక్షణం ౹౹

          గుఱ్ఱానికి వేగం ఎక్కువ. మాతంగ అంటే ఏనుగుకు మదమే లక్షణం. చాతుర్య నారీల లక్షణం. అలాగే ఉద్యోగం పురుష లక్షణం.

తే.గీ.తురగ వేగాపరుగులుగా తృప్తి గమన :: ఏనుగు మదమేలక్షణ ఎరుక పరచు 

నారి చతురత మూలము నమ్మ తీరు :: పురుష ఉద్యోగలక్షణం పుడమి తృప్తి 

 (007)

శ్లో𝕝𝕝  పాపోత్సప విమోచనాయ రుచిరైశ్వర్యాయ మృత్యుంజయ

        స్తోత్ర ధ్యాననతి ప్రదక్షిణ సపర్యాలోకనాకర్ణనే జిహ్వాచిత్త

        శిరోఽఘిహస్తనయన శ్రోత్రైరహం ప్రార్ధితో మమాజ్ఞాన

        యాతన్నిరూపయా ముహుర్మామెవనూమేవచః

తా𝕝𝕝 ఓ సర్వేశ్వరా! నేను పాపమును పోగొట్టుకోవడానికి మోక్షం సంపాదించుకోవడానికి, నీ స్తుతియందు జిహ్వను, ధ్యానమున మానసమును ప్రణమిల్లుట యందు శిరస్సును. ప్రదక్షిణమున చరణాలను, అర్చనయందు హస్తములను, చూచుట యందు నేత్రములను, వినడమున కర్ణములను ఉండేలా ఆజ్ఞాపించమని కోరుతున్నాను. నీ ఆజ్ఞను పాటించేలా నన్ను ఉత్సాహపరచుము.               

008)

ఏక ఏవ పదార్థస్తు త్రిధా భవతి వీక్షితః!

 కుణపం కామినీ మాంసం యోగిభిః కామిభిః శ్వభిః* ||

--- చాణక్య నీతి ---

తా𝕝𝕝 మానవ శరీరాన్ని... కనుక పరికించి చూస్తే యోగికి తోలుతిత్తిలా, కాముకుడికి కోరిక తీర్చేదిగా, క్రూర మృగానికి మాంసపు ముద్దగా ఎలా కనిపిస్తుందో, అదే విధముగా పదార్థము ఒక్కటే అయినా, వారి చూపును / భావనము బట్టి పలురకాలుగా కనిపిస్తుంది / అనిపిస్తుంది .... 

అనగా అంతా మన చూపులోనే /భావనలోనే ఉంది అని భావము....!

తే. గీ. దేహమేతోలు తిత్తిగా దీక్ష యోగి :: దేహమేమాన కోర్కెల తీరు మనసు 

దేహమేమృగముకుమాంస దీక్ష తిండి :: దేహమే భావ వరమగు దీక్ష విలువ

(009)

శ్లో𝕝𝕝 ఉభాభ్యామేవ పక్షాభ్యాం యథా ఖే పక్షిణాం గతిఃl

తథైవ జ్ఞానకర్మాభ్యాం జాయతే పరమం పదమ్ll

తా𝕝𝕝 "పక్షి ఆకాశమార్గమున రెండు రెక్కలచేత మాత్రమే ఎగురగలిగినట్లు మానవుడు జ్ఞానము-కర్మ అను రెండింటివల్ల పరమపదమును చేరగలుగుచున్నాడు".    

తే. గీ.రెక్కల బలము పక్షికి రెప్ప లకళ ::మనిషికి బలము జ్ఞానము మానస కళ 

పరమపదము చెందెడికర్మ ఫలము కలలు ::సకల మోక్షపు బ్రతుకగు సమయ తృప్తి

010)

పుణ్యస్య ఫలమిచ్చింతి పుణ్య నేచ్చంతిమానవా : |

 న పాపఫలమిచ్చంతి పాపం కుర్వంతియత్నతః || 

       పుణ్య ఫలమును ఆశించే మానవుడు పుణ్యం వచ్చేంత పనులు చెయ్యడు. పాపం చేసిన పనులు ఫలం ఇష్టం పడకపోయినా పాప కార్యాలు వాళ్లే చేస్తూ ఉంటారు.

తే. గీ ::పుడమి నందుమంచిపలుకు పుణ్య మార్గ::మనిషి దానకర్మలఫల మాశ పడడు 

పాప పనుల సుఖము నివ్వ పలుకు తీరు ::పాపమేపెరిగియు కళ్ళు పలుకు ముదర

011 శ్లో𝕝𝕝  విత్తం బంధుర్వయఃకర్మ విద్యా భవతి పంచమీ |

            ఏతాని మాన్యస్ధానాని  గరీయో యద్యదుత్తరమ్ ||  *--- మనుస్మృతి -

తా𝕝𝕝 న్యాయార్జిత ధనం, బంధుత్వం, వయస్సు, వంశాచారములనాచరించుట, విద్య అను ఈ ఐదు ఒకదాని కంటే మరోకటి మిక్కిలి గౌరవాన్ని కలిగిస్తాయి.

తే.గీ:: న్యాయమను ధనం ప్రకృతిగా నమ్మకంబు:: జయమగు వయస్సు బంధుత్వ జ్ఞాన బిక్ష 

బ్రతుకు వంశవిద్య తలపు భాగ్య మివ్వ :: గౌరవము పెంచు జీవితం గమ్య గీత

012  

*పరోపకారాయ వహన్తి నద్యః* పరోపకారాయ దుహన్తి గావః*
*పరోపకారాయ ఫలన్తి వృక్షాః**పరోపకారార్థమిదం శరీరమ్.*

“ఇతరులకు ఉపకారం చేయడం కోసమే నదులు ప్రవహిస్తున్నాయి, ఆవులు పాలు ఇస్తున్నాయి, వృక్షాలు ఫలాలను ఇస్తున్నాయి, ఈ శరీరం ఉన్నది ఇతరులకు ఉపకారం చేయడం కోసమే!”అని చెబుతోంది  సుభాషితం.... 
నదుల నీరు కళకళలు నమ్మ రుచులు ;;ఆవు పాలు బలము నివ్వ ఆకలి గను
వృక్ష ఫలములు పోషకము శ్రుతులు కళలు ;;ఉప పరోపకారమునిత్య ఉండ దేహ       


No comments:

Post a Comment