గద్య పద్య కీర్తి గెలుపు మలుపు
ప్రాంజలి ప్రభ *****
శరీరం కర్మలు చేసే ఒక పరికరం
పునర్విత్తం పునర్మిత్రం
పునర్భార్య పునర్మహి
ఏతత్సర్వంపునర్లభ్యం
న శరీరం పునఃపునః।।
పోయిన ధనం మళ్లీ చేరుతుంది।
దూరమైన మిత్రుడు మళ్లీ చేరువఅవుతాడు।
భూసంపద మళ్లీ ప్రాప్తిస్తుంది।
\పోయినవన్నీ మళ్లీ తిరిగి రాబట్టుకోవచ్చు!
కాని మానవ శరీరం మాత్రం మళ్లీ మళ్లీ తిరిగి రాదు।
అందుకే శరీరం ఖలు ధర్మసాధనం అన్నారు।
కేవలం శరీరం ఉంటేనే ధార్మిక పనులు చేయవచ్చు।
శరీరం ఉంటేనే నాలుగు మంచి పనులు చేసే అవకాశం వస్తుంది।
శరీరం ఉంటేనే హితవాక్యాలు చెప్పవచ్చు।
ఏ పని చేయడానికైనా శరీరం కావాలి।
కనుక శరీరము ను రక్షించుకోవాల్సింది మానవ జన్మ ఎత్తినవాళ్లే।
జంతువులకు శరీరం ఉంటుంది కాని వాటికి ఆలోచన ఉండదు।
పైగా కొద్దోగొప్పో ఆలోచన కలిగినా దాన్ని అమలు చేయడానికి శరీరం సహకరించదు।
బుద్ధి, ఆలోచన, మాట్లాడే శక్తి, కావలసినది సంపాదించుకొనే జ్ఞానం *తగిన అవయవ నిర్మాణం
ఉండేది ఒక్క మనుష్యులకే।
వాటిని అమలు చేసే నైపుణ్యమూ మనుష్యులకే ఉంటుంది।
కనుక మనమందరం శరీరాన్ని కాపాడుకోవాలి।
అతిగా తిన్నా,
అతిగా ఆలోచించినా,
అతిగా సుఖించినా,
అతిగా దుఃఖించినా,
ఏదైనా అతిగా చేస్తే ఈ "శరీరం" కాస్తా పుటుక్కుమంటుంది।
ఇక శరీరం చేజారిపోయాక చేసేది ఏమీ ఉండదు।
కనుక ముందు శరీరము ను జాగ్రత్తగా చూసుకోవాలి।
దీనికి
సత్యం,
ధర్మం,
శాంతి,
ప్రేమ,
అహింసలను
పాటించడమే "మహా ఔషధంగా" భావించాలి।
విస్తరాకు
విస్తరి ఆకుని ఎంతో శుబ్రoగా ఉంచుకొని నీటితో కడిగి నమస్కారం చేసుకుని భోజనానికి కూర్చుంటారు।
బోజనము తినే వరకు ఆకుకు మట్టి అంటకుండా జాగ్రత్త వహిస్తాము,
తినిన మరుక్షణం ఆ విస్తరాకును మడిచి, దూరంగా మురికి పెంటపై పడేసి వస్తాము। తర్వాత ఆ ఎంగిలి ఆకును ముట్టుకోము కూడా।
మనిషి జీవితం కూడ అంతే
*'ఊపిరి" పోగానే ఊరి�।।।
।
ప్రాంజలి ప్రభ ***శుభ శుభోదయం-- కధ 22-10-2022
నిన్ను నువ్వు ఇష్టపడు. నీ దృష్టిలో నువ్వే ప్రపంచం. అందంగా తయారవ్వు.. బాగా అర్ధం చేసుకో... హుందాగా మాట్లాడు... ధైర్యంగా మాట్లాడు.. ఏకాగ్రతగా ఉండు.. నిన్ను నువ్వు ఓ ప్రత్యేకమైన వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకో .. నిన్ను విమర్శించాటానికి, కష్టాలు నష్టాలు చెయ్యడానికి కూడా ఎవరూ సాహసించరు!!
ఈ జగతి లో సగం సమస్యలు మనకు మనం నచ్చకపోవడం వల్లనే వస్తాయి, నాకెందుకులే అనుకోవడంవల్ల వస్తాయి . వాళ్లు తక్కువగా చూశారనీ, వీళ్లు ఎక్కువగా చూశారనీ... లేదా జీవితం లో ఏదీ సాధించలేకపోతున్నామనీ రకరకాల ఆలోచనలు చేస్తూ మనల్ని మనమే దిగులుకు గురి చేసుకుంటూ ఉండడం అతి పెద్ద తప్పు. నువ్వు ఎవ్వడికీ సంజాయిషీలు చెప్పుకోవాల్సిన పనిలేదు. నీ జీవితం నీది. అలాగే నువ్వు ఎవరికీ నచ్చాల్సిన పనిలేదు. ఏం చేస్తే నీ మీద నీకు శాంతి కలిగించు సుఖము వస్తుందో కాస్త శ్రద్ధపెట్టు.
ఒక్కసారి నీకు నువ్వు నచ్చడం మొదలుపెడితే నీ ఆలోచనల్లో, నీ మాటల్లో, నీ చూపుల్లో ఓ ప్రత్యేకమైన శక్తి వస్తుంది. దాన్ని నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ అనుభూతి చెందుతారు. నిన్ను చులకనగా చూడాలంటే భయపడతారు, ముడుచుకుపోతారు.. నిన్ను గౌరవిస్తారు. నువ్వనుకుంటున్న నీ చుట్టూ ఉన్న పదిమంది నీ దగ్గర తోక జాడించడానికి భయపడతారు.
మ: నిన్నునీవుగనుండు నీడలగుండు
నమ్మకమ్ము బ్రతుకు నటనలు వద్దు
నయనాల విందుగా సమయము పంచు
ఆశయసాధన ఆరాధ నయగు
ఆత్మతృప్తిని పొంది ఆదర్శమగుట
ధైర్యమిచ్చు హనుమ ధ్యానమే దిక్కు
ఎప్పుడూ నీ జీవితం ఇంకోడికి బానిసగా మార్చకు . నువ్వు ఇంకోడిని చూసి ఆశపడకు, అవుతున్నావంటే నీ జీవితంనీకు బాధను పంచు. అవతలి వాడి కోపాన్నీ, అవతలి వాడు నీ పట్ల చూపించే ద్వేషాన్నీ తేలికగా తీస్కొని నీ పని నువ్వు బుద్ధిగా చేసుకో. ఇలాంటోళ్లు వందలమంది పుట్టుకొస్తారు. ప్రతోడీ దగ్గరా బాధపడుతూ ఎదగడం ఆపేస్తావా?
జీవితమే వసంతం - జీవనమార్గమే సంతోషం
___((())___
"ఇంటింటా భారతం!”
వ్రృద్ధుల రామాయణం
( సీనియర్ సిటిజన్స్ డే సందర్భంగా )
➖➖➖✍️
వృద్ధాప్యంలో ఎక్కువగా బాధ పెట్టేది కుటుంబంలో తన వారి సూటి పోటి మాటలు..
శరీర పటుత్వం లేదు కనుక , పరాధీనత వలన ఎదురించి ఏమీ అనలేరు.., సహించుతూ ఉండలేరు.
బాధతో కుములుతూ, ఎవరికీ చెప్పలేక అనుభవించలేక, మలిదశ లో ఉండాల్సిన శాంతి, తృప్తి, ఆనందాన్ని కోల్పోతూ, నిరాశ నిస్పృహలతో బ్రతుకు ఈడుస్తూ ఉంటారు.
మహాభారతంలో భీష్ముని పట్ల జరిగిన అన్యాయం అదే..!
అతని మాట వినరు.. సలహా అడగరు..! మహా పరాక్రమశాలి..! పెద్దవాడు, విజ్ఞుడు, ధర్మం తెలిసినవాడు అన్న గౌరవం ఇవ్వడు ఆ దుర్యోధనుడు..
గ్రుడ్డి రాజు..!
అధర్మం అని తెలిసి కూడా వారికి దూరం ఉండలేడు., కూడదు అని చెప్పలేడు, చెప్పినా ఆ మూర్ఖులు దుర్మార్గులు వినరు కదా..!
వినాశ కాలే విపరీత బుద్ధిః..!
ఈ రోజుల్లో పెద్దవారు పడే ఇబ్బంది, ఆనాడు భీష్మాచార్యుడు కూడా నరక యాతన పడుతూ మనోవేదన అనుభవించాడు..
కుఱు సింహాసనం రక్షిస్తూ ఉంటానన్న ఒకే ఒక మాట కోసం తీరని ఘోర అవమానాలను భరించాడు ఆయన.. పాపం....
కళ్ళ ముందు ద్రౌపది కాంత కు జరిగిన పరాభవాన్ని చూస్తూ కళ్ళ నీరు పెట్టాడే కానీ., అదేమిటని నిలదీయలేని నిస్సహాయ దుస్తితిలో పడిపోయాడు.. యుద్ధరంగంలో కూడా దుర్యోధనుడు ఆయనను గద్దించి, అవహేళన చేస్తూ ఉన్నా, నోరు మెదపలేని నిస్సహాయ స్థితి పగవాడికి కూడా రావద్దు..
పదిరోజుల యుద్ధంలో పాండవులలో ఒక్కడిని కూడా చంపలేక పోయావు..! ఎందుకు నీ పరాక్రమం..? చిల్లర సైన్యాన్ని మేము చంపలేమా..? నీకు పాండవులపై అంతగా ప్రేమ ఉంటే వెళ్లి వారితో చేరు..! ఈ నాటకం ఎందుకు.? తప్పుకో ప్రక్కకు, మా కర్ణుడు చూసుకుంటాడు వారి సంగతి..!’ అంటూ ఎద్దేవా చేశాడు దుర్యోధనుడు..
ఎంత బాధ పడ్డాడో కుఱు పితామహుడు.
”ధర్మరాజా ఇక నేను జీవించి లాభం లేదు నాయనా..! దయ ఉంచి ఆ శిఖండిని అడ్డం పెట్టుకొని నన్ను పడగొట్టమని మీ తమ్ముడు అర్జునుడితో చెప్పు .!” అంటూ దీనంగా తన చావు కోసం తానే దారి చెప్పుకోవాల్సి వచ్చింది.
భీష్ముడి మరణం కోసం ఇదొక కారణం అయితే మరి కొన్ని కూడా చెప్పుకోవచ్చు..
అష్ట వసువులలో ఒకడు భీష్ముడు.. శాపవశాత్తూ మానవ శరీరం ధరించాల్సి వచ్చింది భీష్ముడు.
ఏడుగురు వసువులు దిగి వచ్చి భీష్మునితో… ”నీవు వచ్చిన పని పూర్తి అయింది., శాప విముక్తి సమయం వచ్చింది., ఇక జీవితం చాలించు..!”అంటూ కోరారు.
అతడికి తండ్రి చేత ఇవ్వబడిన ‘స్వచ్ఛంద మరణం’ అనే వరం అతడి పాలిట శాపం అయ్యింది. ‘నీవు చావవు., పాండవులను చంపవు నీ ఆసరా చూసుకొని యుద్దం తలపెట్టాను, మోసం చేస్తున్నావు నన్ను.!’ అన్న సూటిపోటి మాటలతో విషాదం నెలకొంది ఆయనలో..
శిఖండి తనను హతమార్చడానికే జన్మించాడని అతనికి తెలుసు..! చావును ఆహ్వానించడం తప్ప అతడికి మరో దారి లేకుండ పోయింది.!
శ్రీకృష్ణుడు వారి చెంత ఉండగా పాండవులకు చావు లేదు అని తెలుసు.. కానీ, దుర్యోధనుడు వారిని చంపాలి అని అడిగాడు.. అది తన చేతిలో లేదు..!
కారణాలు ఎన్ని ఉన్నా , కుఱు పితామహుడు అన్న గౌరవ మర్యాదలు కౌరవులు, దృతరాష్ట్రుడు ఇవ్వలేదు_!
అంతటి మహానుభావుడు ఎవరికి తాను కాపలాదారుగా ఉంటూ సంరక్షణ బాధ్యత వహించాలి అనుకొని శ్రమించాడో వారంతా హతం కావడం చూస్తూ ఆయన పడిన బాధను మనం ఊహించలేము..!
ఇలాంటి భారతం ఇప్పుడు ఇంటింటా వెలిసింది..!
శక్తి ,ఆస్తి , ఉన్నంత వరకు ఇచ్చిన గౌరవం వృద్దులయ్యాక ఇవ్వడం లేదు కదా..!
స్వార్థ ప్రయోజనాల కోసం, పెద్దవారి పట్ల కనీస ప్రేమానురాగాలు మరచి నిర్లక్ష్యం చేస్తూ ఉండడం అపరాధం మాత్రమే కాదు., మహా పాపం కూడా..! పెద్దవారి సంరక్షణ చూడటం వారి పిల్లల బాధ్యత, ధర్మం..! అత్యావశ్యకం.
మలి వయసులో వారికి కూడా గౌరవ మర్యాదలు దక్కాలనుకుంటే విధిగా ఇపుడు తమ వృద్ధులైన తల్లి తండ్రులను మనఃపూర్వకంగా శ్రద్దా భక్తులతో సేవించు కోవాలి..!
మనిషి ప్రకృతిలో ఒక భాగం కదా..
కోపమైనా, ద్వేషమైనా, ప్రేమ, ఆదరణ లైనా ప్రకృతికి లేదా ఇతరులకు ఏది ఎంత గొప్పగా ఇస్తుంటామో అదే తిరిగి మనం పొందుతూ ఉంటాం కదా...!✍️
సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.. 🌷🙏🌷
🙏 లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
హరికిం బట్టపుదేవి, పున్నెముల ప్రో వర్థంపు బెన్నిక్క, చం
దురు తోబుట్టువు, భారతీ గిరిసుతుల్ తో నాడు పూబోడి, తా
మరలం దుండెడి ముద్దరాలు, జగముల్ మన్నించు నిల్లాలు, భా
సురతన్ లేములు వాపు తల్లి, సిరి యిచ్చున్ నిత్యకళ్యాణముల్.
- శ్రీ పోతన మహా భాగవతము
తా !! : హరికి బట్టపుదేవి, పున్నెముల రాశి, సంపదలకు పెన్నిధి, చంద్రునకు గారాబు చెల్లెలు, భారతీదేవితోనూ ఉమాదేవితోనూ కలిసి ఆడుకునే పూబోణి, తామరలయందుండే ముద్దరాలు, లోకములన్నీ పూజించే ఇల్లాలు, లేమి అనేది లేకుండా చేసే తల్లి.... అయిన ఆ లక్ష్మీదేవి నిత్యకళ్యాణాన్ని ఇచ్చుగాక.
[2:49 pm, 01/10/2022] Malapragadasridevi: నవ్వండి సరదాగా... ఒకే వాక్యాన్ని రెండు అర్ధాలలో.....
😃😀😃😀😝😍😁😄
1. మీ సంగతి ఏమిటి?
మీసం గతి ఏమిటి?
2. గురూజీ వనం బాగుందా?
గురూ జీవనం బాగుందా?
3. ఆమే కమలమును తొక్కింది.
ఆ మేక మలమును తొక్కింది.
4. మాట మాట పెరిగింది.
మా టమాట పెరిగింది.
5. ఆహారం చూడ ఎంత బాగుందో!
ఆ హారం చూడ ఎంత బాగుందో!
6. మాతా తమరు నిమిషంలో చేరారు.
మా తాత మరునిమిషంలో చేరారు.
7. నావ లతలపై పడింది.
నా వల తలపై పడింది.
8. ఆమె కవితలతో జీవనం చేయును.
ఆమె కవి తలతో జీవనం చేయును.
9. మాతా మరను పట్టుకో.
మా తామరను పట్టుకో.
*ఇదే మన తెలుగు భాష లోనే సాధ్యం.
[2:50 pm, 01/10/2022] Malapragadasridevi: రాజుగారు అంటే మనిషి.
ఆయనకు ఏడుగురు కొడుకులు అంటే మనిషిలోని సప్తధాతువులు.
కొడుకులు వేటకు వెళ్ళడమూ అంటే మనిషి జీవితాన్ని కొనసాగించడం.
*జీవితమే ఒక వేట. వేటే ఒక జీవితం. *
రాజ కుమారులు వేటాడిన ఏడు చేపలు అంటే
మనిషికి ఉండే అరిషడ్ వర్గాలు ( అనగా 6 )
1.కామ 2.క్రోధ 3.లోభ 4.మోహ 5.మద 6.మాత్సర్యాలు
వీటన్నిం టిని మనిషి సాధన చేసి ఎండగట్టవచ్చు.
అంటే పూర్తిగా నియంత్రించవచ్చు.
అందుకే కథలో ఆరు చేపలను ఎండగట్టినట్టు చెప్పారు.
రాజుగారి కొడుకులు ఎండబెట్టిన ఏడు చేపల్లో ఒక చేప ఎండలేదు.
ఏమిటా చేప. అది మనస్సు
దీన్ని జయించడం చాలా కష్టం.
ఎంత ప్రయత్నించినా అది ఎండదు.
మనస్సు అంటే ఏమిటి❓
మనస్సు అంటే సంకల్ప వికల్పాలు
ఒకటి తీరుతుంటే మరొకటి మొలుచుకొస్తుంది.
మొలిచే కోరికలను తీర్చుకుంటూ పోతుంటే జీవితకాలం చాలదు.
కోరికలన్నింటిని జయించేసి మోక్షానికి వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు.
మోక్షానికి వెళ్ళాలనుకోవడం కూడా ఒక కోరికే.
ఆ కోరికను ఎండగడితే తప్ప మోక్షం రాదు.
*ఈ చేప ఎండకుండా అడ్డు తగులుతున్నది ఏది❓
గడ్డిమేటు.*
గడ్డిమేటు అంటే ఏమిటి❓
కుప్పపోసిన అజ్ఞానం.
గడ్డిమేటులా పేరుకుపోయిన అజ్ఞానాన్ని తొలగించా లంటే ఎలా❓
మామూలు గడ్డికుప్ప అయితే గడ్డిపరకలను పట్టి లాగీ, పీకి ఒకనాటికి ఖాళీ చేయవచ్చు.
కానీ అజ్ఞానం అలాంటిది కాదు. జ్ఞానాదాయ కమైన మాటలు ఎంత చెప్పినా, ఎన్ని చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా మనం చేత్తో గడ్డిపరకలను లాగినట్టే‼️
ఆ కుప్ప తరిగేది కాదు, తగ్గేది కాదు.
దాన్ని ఎంత ప్రయత్నించినా తగ్గించడం కష్టం.
మరి అది పోవాలంటే ఏం చేయాలి❓
ఆవు వచ్చి మేయాలి.
ఆవు ఎక్కడి నుంచి రావాలి. అసలు ఆవు అంటే ఏమిటి❓
ఆవు అంటే జ్ఞానం.
జ్ఞానం అనే ఆవు దొడ్లో ఎగబడి మేస్తే అజ్ఞానం అనే గడ్డికుప్ప ఒకనాటికి అంతరించి పోతుంది.
లేదూ… జ్ఞానాన్ని అగ్నికణంగా మార్చి గడ్డిమేటు మీద వేస్తే కాలి బూడిదవుతుంది.
అందుకే భగవద్గీతలో మన కర్మలు, వాటి ఫలితాలు జ్ఞానాగ్నిలో దగ్ధమైపోవాలని చెబుతాడు కృష్ణుడు
(జ్ఞానాగ్నిదగ్ధకర్మాణాం)
జ్ఞానాన్ని అగ్నిగా మలుచుకోగలిగిన వాడు సిద్ధపురుషుడు, యోగ పురుషుడు మాత్రమే.
ఈ గోవును ఎవ్వరు మేపాలి.
గొల్లడాడు మేపాలి. గొల్లవాడు అంటే ఎవరు❓
సమర్ధ సద్గురువు..
జగద్గురుడు.
జ్ఞానరూపమైన భగవద్గీతను లోకానికి ప్రసాదించిన కృష్ణుడు గొల్లవాడే కదా‼️
అర్జునుడు అనే దూడను అడ్డు పెట్టుకుని వేదం అనే ఆవు పాలు పిండి జ్ఞానరూపంగా మనందరికి ధారపోశాడు.
ఇంత గొప్పపని చేయవలసిన ఈ గొల్లవాడు ఆ పని చేయలేదు.
ఏమిరా నాయనా‼️ఆవును ఎందుకు మేపలేదు అని అడిగితే అమ్మ అన్నం పెట్టలేదు అన్నాడు.
ఇంతకీ ఆ గొల్లవాడికి అన్నం పెట్టాల్సిన అమ్మ ఎవరు❓
అమ్మల గన్న అమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ. ఆమెనే లోకం జగన్మాత అని కీర్తిస్తుంది.
ఈ జగన్మాత అన్నం పెట్టక పోవడం వల్ల గొల్లవాడి ఆకలి తీరలేదు.
ఓ జగన్మాతా ఈ గొల్లవాడికి ఎందుకు అన్నం పెట్టలేదమ్మా అంటే ఆవిడ పిల్లవాడు ఏడ్చాడు అంది.
ఇంతకి ఆ పిల్లవాడు ఎవరు❓ఆర్తితో దైవానుగ్రహం కోసం అలమటించేవాడు.
ఈ పిల్లవాడు ఎందుకు ఏడుస్తున్నాడు❓
వాడికి చీమ కుట్టింది. ఎక్కడిది చీమా❓దానికి ఇంకోపేరే సంసారం.
సంసారం అనే చీమ కుట్టినందుకు ఆ పిల్లవాడు ఏడుస్తున్నాడు.
ఆవులను మేపడానికి వచ్చే గొల్లవాడికన్నా ఆర్తితో దైవానుగ్రహం కోసం ఏడ్చే పిల్లవాడే ముఖ్యం కనుక ఆ పిల్ల వాడినే చూసుకుంది.
మరి గొల్లవాడు అమ్మ అన్నం పెట్టక పోవడం వలన తన విధిని నిలిపి వేసాడా? లేదు.
అమ్మ ద్వారా తన పనిలో భాగమైన శిష్ట రక్షణను చేసుకున్నాడు.
చీమకుట్టినందుకు కథలో పిల్లవాడు ఏడ్చినట్టే సంసార బాధలు, ప్రపంచ బాధలు భరించలేక మనం కూడా ఏడుస్తున్నాం,
మనల్ని ఈ బాధలే చీమలై కుడుతున్నాయి.
చీమలు పుట్టలోనే ఉంటాయి. ఏమిటీ ఈ పుట్ట❓
మనిషికి ఉండే సంసారం ఒక పుట్ట.
ఈ పరమార్థాన్ని చెప్పడం కోసమే జీవితంలోకి అడుగు పెట్టే ముందే ఈ గొప్ప విషయం తెలియాలనే సదుద్దేశంతోనే మన పెద్దలు ఈ కథను ప్రతి పిల్లవాడికి నూరిపోశేవారు.
బ్రాహ్మణ భోజన ప్రియః
బ్రాహ్మణులకు భోజనo పెడితే సకల దేవతలు సంతృప్తి చెందుతారట. దీన్నే అందరూ 'బ్రాహ్మణ భోజన ప్రియః' అని అపహాస్యం చేస్తారు. నిజానికి 'బ్రాహ్మణ'బహుజన ప్రియ' అని చాలా మంది ఎరుగరు. అసలు శ్లోకం ఏమిటంటే:
" అలంకార ప్రియో విష్ణు
అభిషేక ప్రియః శివ
నమస్కార ప్రియః భాను
బ్రాహ్మణ భోజన ప్రియః"
సాక్షాత్తూ పార్వతి దేవి చెప్పిన శ్లోకమిది. దీని అర్థము ఏమిటంటే "విష్ణువుకు అలంకారమంటే
ఇష్టం, మరేమో శివునికి అభిషేకమంటే ఇష్టము. సూర్యనారాయణుడికి నమస్కారం ప్రీతి. బ్రాహ్మణునికి భోజనం ఇష్టమని కాదు ఇక్కడ కొశ్చెను, బ్రాహ్మణుడు తృప్తి చెందితే సమస్త దేవతలు సంతుష్టులౌతారట! మరేమో బ్రాహ్మణుడికి నాలుగు రుచికరమైన వంటకాలు వడ్డిస్తే ఆరగించి తృప్తిగా ' అన్నదాతా సుఖీ భవ' అని దీవిస్తాడు. భక్తులు శంకరుడిని కొలిస్తే, శంకరుడు నారాయణుడిని ధ్యానిస్తాడట. నారాయణుడు శివారాధన చేస్తాడట. హరిహరాదులు ఇరువురూ కలిసి 'బ్రాహ్మణుడిని'పూజిస్తారట! ఎందుకంటే బ్రాహ్మణులు గాయత్రి దేవి సత్పాత్ర బిడ్డలని, ముప్పూటలా వెయ్యి గాయత్రి జపం చేసి ఆ గాయత్రి మాతకు పరమాప్తులౌతారని"
కాబట్టి బ్రాహ్మణులకు భోజనం పెడితే హరి హరాదులు సంతుష్టులై సకల కార్యాలు నెరవేరుతాయన్న మాట. అంతే కాని బ్రాహ్మణులు కడుపునిండా తినికూర్చుని 'బ్రేవ్' మని త్రేలుస్తారని కాదు.
1. బ్రాహ్మణుడు పేదోడైతే 'కుచేలుడై' శ్రీ కృష్ణ సేవలను అందుకొంటాడు.
2. బ్రాహ్మణుడు అవమానింపబడితే ' చాణక్యుడై' పగ సాధిస్తాడు.
3. బ్రాహ్మణుడు కోపగిస్తే 'పరశురాముడై' గొడ్డలి పట్టి దుష్టులను నరికిపారేస్తాడు.
4. బ్రాహ్మణుడు విద్య నేర్చితే 'ఆర్య భట్టుడై'ప్రపంచానికి 'సున్న'నిస్తాడు.
5. బ్రాహ్మణుడు వేదనాశనం చూస్తే 'శంకరుడై' వైదిక ధర్మ సంస్థాపన చేస్తాడు.
6. బ్రాహ్మణుడు రోగులను చూస్తే ' చరకుడై' లోకానికి ఆయుర్వేదాన్నిస్తాడు.
బ్రాహ్మణుడు తన జ్ఞానముతో విశ్వానికే పౌరోహితుడౌతాడు .
౧. బ్రాహ్మణ ధర్మం 'వేదము'
౨ .బ్రాహ్మణ కర్మ 'గాయత్రి'
౩ . బ్రాహ్మణ జీవనం 'త్యాగం'
౪ .బ్రాహ్మణ మిత్ర 'సుధాముడు'
౫.బ్రాహ్మణ క్రోధం 'పరశురాముడు'
౬ . బ్రాహ్మణ త్యాగం 'దధీచి'ఋషి
౭ . బ్రాహ్మణ రాజు 'బాజీరావ్ పేష్వే మయూర వర్మ'
౮ . బ్రాహ్మణ ప్రతిజ్ఞ 'చాణక్య శపథం'
౯ . బ్రాహ్మణ బలిదానం 'మంగళ్ పాండే, చంద్ర శేఖర్ ఆజాద్'
౧౦ .బ్రాహ్మణ భక్తి 'రావణుడు'
౧౧ .బ్రాహ్మణ జ్ఞానం 'శంకర రామానుజ మధ్వ' ఆచార్య త్రయం.
౧౨ . బ్రాహ్మణ సమాజ సంస్కర్త 'మహర్షి దయానంద
౧౩ . బ్రాహ్మణ రాజనీతి 'కౌటిల్యుడు'
౧౪ . బ్రాహ్మణ విజ్ఞానం 'ఆర్య భట్ట'
౧౫ . బ్రాహ్మణ గణితం' రామానుజo'
౧౬ . బ్రాహ్మణ క్రీడాకారులు 'జి ఆర్ విశ్వనాథ్, చంద్రశేఖర్, గవాస్కర్.
ఇదంతా ఎలా సాధ్యమైంది?
కర్మ, భక్తి, జ్ఞాన విజ్ఞానం, ధర్మ,శక్తి, యుక్తి, మూల్య విలువలు, బుద్ధి, కౌశలం, సంస్కార బలంతో,
1. బ్రాహ్మణ జన్మ 'విష్ణాంశ'
2. బ్రాహ్మణ బుద్ధి సకల సమస్యా పరిష్కారం.
3. బ్రాహ్మణ వాణి 'వేద విజ్ఞానం'
4. బ్రాహ్మణ దృష్టి 'సమతా మనోభావం'
5. బ్రాహ్మణ జాతి 'సంకట హరణo'
6. బ్రాహ్మణ కృప 'భవసాగరమును ఈదు సాధనం'
7. బ్రాహ్మణ కర్మ 'సర్వజనహితం'
8. బ్రాహ్మణ వాసం 'దేవాలయం'
9. బ్రాహ్మణ దర్శనం 'సర్వ మంగళ కరం'
10. బ్రాహ్మణ ఆశీర్వాదం 'సమస్త సుఖ వైభవ ప్రాప్తి'
11. బ్రాహ్మణ వరదానం 'మోక్ష ప్రాప్తి'
12. బ్రాహ్మణ అస్త్రం 'శాపం'
13. బ్రాహ్మణ శస్త్రం 'లేఖని'
14. బ్రాహ్మణ దానం 'సమస్త పాప విముక్తి'
15. బ్రాహ్మణ దక్షిణ'సప్త జన్మ పాప విమోచనం'
16. బ్రాహ్మణ ఘర్జన 'సర్వ భూత సంహారం'
17. బ్రాహ్మణ కోపం 'సర్వ నాశనo'
18. బ్రాహ్మణ ఐక్యత ?(అదే డౌటు)'సర్వ శక్తి వంతం!
జయ మహాకాల, జయ పరశురామ, జయగురుదత్త.
దయచేసి నిత్య కర్మానుష్టానము చేసే బ్రాహ్మణులందరూ ఈ సందేశాన్ని పంచుకోండి.
ప్రాంజలి ప్రభ
మల్లాప్రగడ
మధ్యాక్కర షట్పది - నవరాత్రి special - 4
---
1,2,4,5 పాదములు - మధ్యాక్కర అర్ధ పాదము (ఇం/ఇం/సూ)
3,6 పాదములు - మధ్యాక్కర అర్ధ పాదము (ఇం/ఇం/సూ) + ఇం/సూ (మొదటి ఇంద్రగణపు లోపము)
---
మధ్యాక్కర షట్పది - ఇం/ఇం/సూ // ఇం/ఇం/సూ // ఇం/ఇం/సూ - ఇం/సూ
---
ముల్లోకముల దివ్వె యమ్మ
ఫుల్లమ్ముగను నవ్వు నమ్మ
చల్లంగఁ దను జూచు నమ్మ - సరసాల బొమ్మ
మల్లె మాలల తావి యమ్మ
మల్లారి చెలి పూల రెమ్మ
తెల్ల హంసగ వచ్చు నమ్మ - తృష దీర్చు నమ్మ
---
వెన్నపూసయె మానసమ్ము
వెన్నెలల్ హసనోత్సవమ్ము
కన్నులందునఁ గారుణమ్ము - కామకల్పమ్ము
చెన్నుగాఁ మది చేతనమ్ము
చిన్న మువ్వల ఘోషణమ్ము
వన్నెచిన్నెల యాననమ్ము - వారిజాతమ్ము
---
ఎన్ని పేరులొ నీకు తల్లి
ఎన్ని పేరులొ నీకు తల్లి
ఎన్ని పూవులొ కల్పవల్లి - యింటి జాబిల్లి
వన్నె తారల పాలవెల్లి
వెన్న దొంగ కనుంగు చెల్లి
నన్ను జూడుము కన్న తల్లి - నవ్వు రాజిల్లి
---
విధేయుడు - మోహన
2 comments
మధ్యాక్కర షట్పది - ఇం/ఇం/సూ // ఇం/ఇం/సూ // ఇం/ఇం/సూ - ఇం/సూ
రవ్వ ల వెలుగులే శక్తి
మువ్వల శబ్దమే శక్తి
అవ్వ బువ్వ తినుట శక్తి - ఆత్మ జాబిల్లి
దివ్యమైనది ఆత్మశక్తి
భవ్యమైనది బంధ శక్తి
సవ్యమైనది సర్వ శక్తి - స్వర్ణ జాబిల్లి
నవ్య మైనది నమ్మ శక్తి
కవ్వ మైనది కావ్య శక్తి
తత్వ మైనది తాప శక్తి - ధర్మ జాబిల్లి
ముల్లోకముల దివ్వె శక్తి
ఫుల్లమ్ముగను నవ్వు శక్తి
చల్లంగఁ దను జూచు శక్తి - సరసాల శక్తి
మల్లె మాలల తావి శక్తి
మల్లారి చెలి పూల శక్తి
తెల్ల హంసగ వచ్చు శక్తి - తృష దీర్చు శక్తి
నవరాత్రి special - 6 - అశ్వగతి షట్పది
---
అశ్వగతి - (భ)5/స UIIU IIUII UIIU IIIIU
18 ధృతి 126391
---
పాదములు 1+2, 4+5 - అశ్వగతి
పాదములు 3, 6 - UIIU IIUII UIIU IIU
---
భావములో భవమందున
రావములో స్వరములలో
జీవములోఁ జెలువందున - శ్రీకరమై నవమై
నీవె గదా దినమందున
నీవె సదా తిమిరములో
నీవె హృదంబరమందున - నిత్యముగా ధ్రువమై
---
కోవెల యీహృదయమ్మగుఁ
బూవులు నా పదములలో
తావియు నాస్మృతి వాసన - తథ్యమిదే యగుఁగా
నీవరమే యిల సేయును
జీవితమే సఫలముగాఁ
గావఁగ రా కరుణామయి - కాంతుల దీపముగా
---
బొమ్మవుగా జగదీశుని
కొమ్మవుగా జగమునకే
యమ్మవుగా జనులందఱి - కమ్మవె యేకముగా
ఇమ్ము గదా యెదయందలి
సొమ్ము గదా యవిరతమౌ
చెమ్మ గదా యపురూపపు - చెల్వము నాకముగా
---
సమ్మతమే నిను గొల్చుట
సమ్ముదమే దలఁచుటలో
సమ్ముఖమై కనుటెప్పుడు - చారుముఖాంబుజమై
వమ్మగునా యని కుందితి
నమ్మకమే బ్రతుకున నిన్
నమ్మితినే నను వీడకు - నాదమయీ నిజమై
---
విధేయుడు - మోహన
ప్రాంజలి ప్రభ - దాన ధర్మాలు ఎలా చేయాలి?
16-10-2022
ఒకానొక కోటీశ్వరుడు ప్రతి సంవత్సరం వ్యాపారం లో తనకొచ్చిన లాభాలలో నాలుగో వంతన్నా దాన ధర్మాలకు ఖర్చు చేసేవాడు. అందరూ తనను దాన కర్ణుడు అని ప్రశంసిస్తూ ఉంటే ఆయనకు అదొక తృప్తి గా ఉండేది. చనిపోయిన తరవాత కోటీశ్వరుడు స్వర్గం చేరాడు. కానీ అక్కడ కొద్ది కాలం మాత్రం గడిపిన తర వాత, యమదూతలు తనని నరకానికి తీసుకు వెళ్లటం అతడికి బాధతో పాటు ఆశ్చర్యాన్ని కలిగింది. నరకా నికి వెళుతూనే, చిత్రగుప్తుడితో వాదం పెట్టు కొన్నాడు. ‘అయ్యా! ఇన్ని దానధర్మాలు చేసిన నన్ను నరకానికి పంపడ మేమిటి మీ లెక్కలో ఏదో పొరపాటు జరిగింది. దాన్ని సరిచేయించండి’ అని.
చిత్రగుప్తుడు కోటీశ్వరుడికి పరిస్థితి వివరించాడు: ‘నాయ నా, పొరపాటేమీ లేదు. నీకు నీ దానధర్మాల వల్ల చాలా పుణ్యం రావలసిన మాట నిజ మే. కానీ, నువ్వు దానం కోసం నీ దగ్గరకు వచ్చిన వాళ్ల ను చులకనగా చూసి, ఒకటికి పదిసార్లు నీ చుట్టూ తిప్పించుకొన్న తరవాతే నువ్వు చేసే దానమేదో చేసేవా డివి. ఆ కారణంగా, నీకు రావలసిన పుణ్యంలో నాలు గోవంతు చేతులారా నువ్వే పోగొట్టుకొన్నావు! ఆ తర వాత, ‘నేను అంత దానం చేశానూ, ఇంత దానం చేశానూ’ అని పదే పదే ప్రతిచోటా సందర్భం ఉన్నా లేకపోయినా ఆత్మస్తుతి చేసుకొని మరో నాలుగో వం తు పుణ్యం పోగొట్టుకున్నావు!’
‘అయినా, కనీసం ఆ మిగతా సగం పుణ్యమన్నా నాకు దక్కాలి గదా’ అన్నాడు కోటీశ్వరుడు. ‘దక్కేదే, కానీ దాన గ్రహీతల చేత నువ్వు చేయించుకొన్న సత్కా రాలూ, సన్మానాలు, స్తుతులు, స్తోత్రాలూ వగైరాలకూ నీ పేరు ఉండాలని బలవంతం చేసి, నువ్వు సంపాదిం చిన పుణ్యంలో మిగిలిన భాగం కూడా అప్పుడే ఖర్చు చేసేసుకొన్నావు! కనక నీకు రావలసిన పుణ్యంలో స్వల్పమైన భాగమే నీ ఖాతాలో చేరింది’ అన్నాడు చిత్ర గుప్తుడు. ‘అదేమిటి, నా డబ్బుతో కట్టించిన ఆశ్రమా లకు నా పేరు పెట్టమంటే తప్పా, నా సొమ్ము దానం చేసినప్పుడు నేను దానం చేశానని చెప్పుకొంటే పాపమా’ ఆక్రోశంతో ప్రశ్నించాడు కోటీశ్వరుడు.
‘అక్కడే చాలా మందిలా నువ్వూ పొరబడుతున్నా వు నాయనా! భూమి మీద నువ్వు జన్మ ఎత్తినప్పుడు నీ దగ్గర నువ్వు తెచ్చుకొన్న ద్రవ్యమంటూ ఒక్కపైసా లేదు. నీ జీవిత కాలంలో కొన్ని కోట్ల రూపాయలు నీ చేతికి వచ్చాయి. కానీ ఆ జీవిత కాలం ముగిసిన తర్వా త సంక్రమించినదాన్లో ఒక పైసా కూడా మళ్లీ నీతో తెచ్చుకోలేకపోయావు. ఇక అది నీ సొమ్ము ఎలాగ యింది చెప్పు? సృష్టిలో ఉన్న ఐశ్వర్యాలూ, వనరులూ అన్నీ భగవంతుడివే. నీ కర్మ ఫలం వల్ల, ఆయన తన మహదైశ్వర్యంలో కొద్దిపాటి భాగం కొంతసేపు నీ చేతి లో ఉంచాడు. ఆ ధనంలో కొంత భాగం నువ్వు ఆయ న మెచ్చే దానధర్మాల కోసం వాడిన మాట నిజమే! ఆ మాత్రానికే నీకు ఎంతో పుణ్యం రావలసింది. కానీ ఆ పుణ్యమేదో అప్పటికప్పుడే పేరు కోసం, కీర్తి కోసం, అహం కోసం ఖర్చు పెట్టేసుకొన్నావు. మిగిలిన అతి స్వల్ప భాగం నువ్వు చేసిన కొద్ది కాలపు స్వర్గవాసంతో చెల్లు అయిపోయింది’ అని చిత్రగుప్తుడు చెప్పేసరికి కోటీశ్వరుడు కొయ్యబారి పోయాడు.
సర్వేజనాసుఖినోభవంతు.
ధర్మమేనీకు దారి ధరణియందాయె
దానమే నీకు నిత్య ధన్యతకలిగె
దైవమే నీకు తోడు దైన్యమే సేవ
ధ్యాసయే నీకు చదువు ధ్యానమే దారి
___((()))___
1
నేటి నాపాట పాట సంఖ్య :-412.
***********
రచన:- మహేష్ వూటుకూరి ✍️
9640713717.
దోర్నాల.
02/10/2022.
******
పాట సందర్భంపై నా విశ్లేషణ.
**********
బిడియం లేనపుడు మనసు మనసులోని భావాలను
చదివేయగలదు భావానికి తగిన భావాలను తెలిపే
ప్రేమను పంచగలదు ఇక్కడ ఆ ప్రేమికుడి తన ప్రేయసి మనసును పసిగట్టి తదనుగుణంగా ప్రేమలోని
మధురిమల మధురానుభూతిని ఒక్కొక్కటిగా
పరిచయం చేస్తు ప్రేమలోక జగతిలోని ఆనందాలను
ఆవిష్కరించు సుందరమైన రసానుభూతిలో
ఓలలాడుతు తన్మయమై పాడుతున్న ప్రేమికుల ప్రేమ గీతం....
****************
పల్లవి:-
***
నీ మనసులోని భావం
పసిగట్టానులే ప్రియా
నీ సొగసుతోటి రాగం
కలిసి పాడుతానులే సఖీ
ఆ వంకతో నేను నెలవంకనై
నీ శిగలో పువ్వునై పూసానులే
ఈ చుక్కతో ఎంచక్కా
ప్రేమ పూజలే చేసుకుంటానులే..
కన్న కలలన్ని నిజమయ్యేందుకు
కలిసి నడుద్దాము రావే
స్వర్గతీరం చేరేసి
స్వప్నాలన్ని నిజం చేసుకుందాములే
నీ మనసులోని భావం
పసిగట్టానులే ప్రియా
చరణం:-
***
ఏ రోజు కారోజు సరికొత్త అందాలతో
రోజా పవ్వు లా నీవు వికసిస్తుంటే
కోరికల కొలిమినేనై
నిను కోరుకోవడం తప్పేలేదుగా.
తప్పించుకునే నీ మాటల చాతుర్యం
ఒప్పించుకునే నీ చేతల నైపుణ్యం
నాకు తెలుసులే నవమన్మధా
నటరాజువై రక్తకట్టించే రాగయుక్త తాళం
నీవేలే సుందరుడా
నడి రేయినే ఓడిపోయేలా చేసే
సరసాల లోకం సృష్టించావురా ప్రియుడా....
పల్లవి:-
****
నీ మనసు లోని భావం
పసిగట్టానులే ప్రియా
చరణం:-
***
నీ చూపు గుచ్చే తీయదనానికి
నా ఊహా తేన జల్లులై కురిసిందిలే
నీ ఊపు మెచ్చి సయ్యంటిగా నీ కౌగిళ్ళలో
ఆహాహ ఆహా ఏం సెలవిచ్చెనావే దేవి
ఆహ్లాదమే ఇంద్రధనస్సు గా వచ్చి
నీ పల్లకీని మోసే ప్రియ సఖీ...
చలించినాక జ్వలించక తప్పదుగా
చలి కాచుకునేందుకు తోడుగా వచ్చేసావుగా
తొలి సంగమానికి తొలకరి నీవైతే
చిగురించే వికాసమేనైనవుతా
చిలకాగోరింకలమై వసంతగీతం పాడేద్దాం
బ్రతికున్నంత కాలం
అలకానంద నదిలా ఆనంద సంగమంతో
జన్మధన్యమయ్యేలా
తన్మయమై తరించుదామురారా
కౌగిళ్ళ బంధాలలో
పల్లవి:-
***
నీ మనసులోని భావం
పసిగట్టానులే ప్రియా
నీ సొగసు తోటి రాగం
నే కలిసి పాడుతానులే సఖీ..
**********
అన్నీ..అకారణంగానే ఎందుకు!?
సృష్టి..
లో వుంటుంది. అదే మళ్ళీ
నియమాతీతంగానూ. సృష్టి తానుగా
విస్తారమౌతుంది. అదే మళ్ళీ తనని
తానై చేరుకుంటూనూ. అలాంటి
సృష్టి.. మహా పయనంలో మనమూ
భాగమైవున్నామేమో..అదే సృష్టి
తత్వం కావచ్చునేమో !?...
గురువుగారు తప్పులుతెలపగలరు
 
No comments:
Post a Comment