ఏరి కోరి పట్టు కొనెడి ఏమి చుట్టు    
రట్టు కాక చూసుకొనెడి రంగు గుట్టు   
ఎక్కు ఒక్కొక్క టేమెట్టు ఎదను తట్టు  
తగులు కొను ఉదాసీన మే తట్టి పట్టు 
 వదల చచ్చినా బంధము వ్యాధియగుట    
 స్వర్గ పరిమళించేమేని సహజ గంధ
 ఒకరి కొకరుగా కుదిరి తే ఓర్పు అంద 
 మురిసె డెందము ఏమందు ముఖ్య మగుట   
సవతి పోరులో మగనిగా సమయ కద్దు 
శక్తి తనకున్న లేనిదై సరయు ఎద్దు 
సతుల మధ్య తాను తెలివి లేని మొద్దు 
ఒకరికి ఒకరై  కలియుటే ఒక్క ముద్దు 
 
త::తనువు ఒకటి రాత్రి వెలిగి తప్పు జరిగి ధు:ఖమే 
     దివ్వె అనియు కీర్తి ఇదియు దినము సుఖము దివ్యమే   
     ఏళ్ళుగాను మండుతున్న ఎన్నొ బంధ ప్రేమమై  
     నన్నె గుర్తిస్తున్న మనిషి నయన విందు కల్పితం    
త:కడపు నిండ తిండి ఉన్న కనుల నిండు సౌఖ్యమే  
    ఉండ బట్ట లేక గూడు యుండ ముళ్ళు కష్టమే 
    నింతకంటె మించి యున్న యింక కష్ట బంధమే 
    ధనము మీద గాంక్ష తోను దండగయ్య జీవితం  
 
త::నేడు మంట వళ్ళ బ్రతుకు నీడ వెలిగి పోవుటే  
     ఆమె జ్ఞాపకాలు యన్ని కాల్చు కొనుట వైనమే   
    ప్రజలు చుట్టు గుమ్మి కూడ ప్రభలు కొన్ని కాంతులై 
    చలికి వేడి చేసుకునె చపల బుద్ది కాదులే 
 ప్రాంజలి ప్రభ....అంతర్మధనం.. పద్యాల రధము 
రచయిత.. మల్లప్రగడ శ్రీ దేవి రామకృష్ణ 
001 వ్యక్తి తప్పడడుగు వేసి వికట వేష
ధారి మహిళల నేహింస దారి చూప
స్త్రీలు అబలకాదు సబల తీర్పు తెలిపి
సంఘ దృష్టి కుటుంబము సమయ తృప్తి
002 సంస్కృతి విభ వములు తెల్పు సమయ మగుటె
నిత్య కళ్యాణ దీప్య మాన జయ మగుటె
సుమధుర పలుకే పురుషుని సూత్ర మగుటె
అందరి హృదయ సంతృప్తి అక్కరగుటె
003 మల్లె మిరపకాయ జడగ మొగుడి కొరకు
ఝళ్ళు మనునట్లు ఉత్సుక ఝమ్మని కథ
ఘాటు ప్రేమయు తెలిపేటి ఘనత మహిళ
అంద మొచ్చెను కొప్పుకే ఆశ తీర్చె
004 ఎదుటి  వ్యక్తి  గొప్పదనము ఎంచ గలిగి
ఎదుటివారి  ఆనందమే తనతనువుయె
నిత్య అత్యంత  సంతోష నియమ మైన
నిత్య సంతృప్తిగా  జీవి నెంచ బ్రతుకు
005 ఊహలు గుసగుసలసెగ ఊ కళకళ
చెలిమి సరిగమలతొ సెగ చేరునుకళ
కావ్య పదనిసలలె సెగ కనికరకళ
ధ్వని తరంగాల తోసెగ ధరణి కళలు
006 పలుకుమా తర మైనది పెదవి చిలుకు
చిలిపి తరమనకే మది చేష్ట లనకు
సృష్టి కళతాత శోభలా సమయ సుఖము
సర్వ దుహితము సుఖమయ సమర మేను
007 ఊహలు గుసగుసలసెగ ఊ కళకళ
చెలిమి సరిగమలతొ సెగ చేరునుకళ
కావ్య పదనిసలలె సెగ కనికరకళ
ధ్వని తరంగాల తోసెగ ధరణి కళలు
008 మదిలోన చింతలే జారిపోవుటయేను
నిలకడా నియమాలు నియమమై నీడలు
తలపుల వెళ్లువే తరతమ సుఖములు
లౌకిక తలపులై లౌక్యము నిలుపును
009 మీలోను మాలోను  దివ్యత్వ భావమై 
మీరుగ మేముగా మీతొ మాకుయు కాంతి
మీ మనస్సునమేము మీగడ 😊మనసుగా
నిరంతరం గమనించు నియమాల జీవితం
ఉపయోగ పడుచున్న ఉపకరణ వయసు
010 క్షణమోక యుగమగు క్షనిక ఆ వేసమా
అనురాగపు మధువు ఆవిరి యగుటమా
ఆవిరైన చెలిమి అవకాశ మేసుమా
ఒక్క అపార్ధము ఓర్పు గా దుఃఖమా
011 ఊసరి వెల్లిలా ఊ రంగు మార్చుమా
ఊహలలో తేల్చి ఊపిరి నిల్పుమా
ఉగిస లాట యనక ఉష్ణము పంచుమా
ఉయ్యాల వలెఉండి ఊగు మది చూడుమా
012 గతమైన పుణ్యము నాలోన ఉంచుమా
చెమరంచు కళ్ళలో చెదరక నుంచుమా
గుండెలో ధైర్యము గుర్తుగా ఉంచుమా
ఓదార్పు తనమున ఓర్పును పంచుమా
013 అందరి సుఖము జననియే ఆలనయగు
మనసు హృదయ వాంఛ గుణము మనుగడవ్వు
గౌరవం అభిమానము గుర్తుచేయు
ప్రేమ పలుకులన్ని బ్రతుకు ప్రియము కొరకు
014 మదిప్రయాణము ఎటువైపు మాయ బ్రతుకు
తన్మ యత్వాన భ్రమలన్ని తపన చేర్చు
తేనె జుర్రేటి బృంగమై తీపి చేయు
సౌరభము ప్రేమ మయము సౌష్ట మగుట
015 మృత్యు కడలి అనారోగ్య ముప్పు యనుచు
సప్త వర్ణ దాతువు లన్ని సమయ మనుట
నిర్వి కల్ప సంగీతమే నిజము తెలప
నిఖిల లోక అంచున నాకు నీతి తెలిప
016 ఏమి టా పప్పు పులుసుయు ఏల వంట
నీరు లాగ చారుణు చేసి నీతి అనకు
ఇదియు చెట్ని సాంబారగు ఇష్ట మవదు
పెరుగు పుల్లని వాసన ప్రియము ఏల
017 నీ అవి నీతికి నీకు నాకునుశిక్ష
నీది యప్రస్తుత నీతి లేని పలుకు
నీ ప్రతభకనలే నిజము నీడలగుటే
నిత్య బ్రతుకు చేదు నిష్ఠ లేని గుణము
018 కాని బంధ భాంధవ్యాల కాలమౌను
కనుల రెప్ప మాదిరి కళ కావ్య మౌను
మమత వాకిళ్ల పందిరి  మధుర మౌను
నిలిచి పోయేటి కలలన్ని నిర్మలమ్ము
019 స్వేశ్చ కోసం నడకసాగు స్థితిని బట్టి
వెనకడుగు వేయక సకల విధి కళలకు
ధైర్యమే ఆయుధము మాకు ధరణి యందు
ఆత్మ విశ్వాస మే మమ్ము నడప గలుగు
020 ఋతువులు కదులు ప్రకృతిగా ఋషుల వాక్కు
ఉదయ భాను కళలు వల్ల ఊహలకధ
పవన మంత్రజీవన నాడి పగలు రాత్రి
వేడి నిచ్చి చల్ల బరుచు విధిగ ప్రకృతి
021 కన్నీటి కథలన్ని కావ్యమై వ్రాయుమా
అనుభూతి ఆర్తియు అద్దంగ నుంచుమా
అర్ధమ్ము ఆర్ద్రత ఆధ్యమ్ము చూపుమా
ఓవాణి హృదయమ్ము ఓకాంతి నిల్పుమా
022 కష్టనష్టము తెల్పి కావడి కదలిక
సుఖదుఃఖములు పంచి సుగుణముల గుళిక
మనసుపోకడలకు మాయచేరికయగు
కాయము ధర్మమై కావుము శంకరా
023 కపటాల తననుండి కాపాడు దైవమా
భక్తి శ్రద్ధలు మది భుక్తియు నుంచుమా
వ్యక్తిత్వమన్నది వ్యసనము అనకుమా
కాల నిర్ణయము గా కళలన్ని తీర్చుమా
024 గతమైన పుణ్యము నాలోన ఉంచుమా
చెమరంచు కళ్ళలో చెదరక నుంచుమా
గుండెలో ధైర్యము గుర్తుగా ఉంచుమా
ఓదార్పు తనమున ఓర్పును పంచుమా
025 ఊసరి వెల్లిలా ఊ రంగు మార్చుమా
ఊహలలో తేల్చి ఊపిరి నిల్పుమా
ఉగిస లాట యనక ఉష్ణము పంచుమా
ఉయ్యాల వలెఉండి ఊగు మది చూడుమా
026 మరువ లేనిది మృత్యవు మనసు చేరి
భ్రమలు కావు నిజమనుటే భయము చేరి
మాయ మహిమ తిరిగి రారు మంచి చేరి 
హృదయ మందు కళలు నేర్పు హృదయ భాను
027 పాలకొల్లు ప్రసాదు యే ప్రగతికోరి
నిలగిరిచేరి శంకర నిర్మలమ్ము
కాల జగతిలో పరమాత్మ కరుణ చూపు
శీల బ్రతుకుకు నిత్యము సాయపడుట
028 శ్రీ నిధి మది చదువది యే శ్రీపరమ్ము
రంగ బహుతరంగా విధి రంగ వల్లి
గమన మేరాత్రిపగలుగా గతియు సత్య
ముగను నిష్టా గరిష్ట మే ముఖ్య మౌను
029 బాల్య హృదయమ్ము అమ్మకు బంధ మవ్వు
యవ్వనము విద్య ఉద్యోగయతిగ మారు
మధ్య మన్మధ ప్రేమయు మనుగడ కులె
వృద్దుల బ్రతకు బందమై వృద్ధి యగుట
030 అక్కరకు వచ్చు వారును ఆది మనసు
అన్నముయు పెట్టి ఆదరణగుట పాశ
మైన బంధ మైనను అవ్వ మాటలు విని
అమ్మ పలుకులు అమృతము అందరికిని
031 అగ్నిసాక్షిగా నాతోడు ఆట చిలక
ప్రతి యుగాన చెలిమి నీవు పలుకు చిలక
పలుకులు మనసుకే హాయి ప్రతి దినముయు
ఎదుగుదల మన మధ్యన ఎ పుడు నాతొ
032 చినుకు చినుకులో జీవము చెలిమి చుట్టు
పలుకు పలుకులో పరమాత్మ పదును పట్టు
కలసి జరుపు ఉత్సవములో కళలు ఒట్టు
బ్రతికి బ్రతికించు అభిమాన భాగ్య తట్టు
033 ఉన్న ఊరిలో నీపేరు ఉత్చవమ్ము
కాని ఊరిలో దుస్తులు కలలు తీర్చు
ఆచరణలోన కొత్తగా ఆశ మొదలు
జ్ఞాపకం అవకాశమే జ్ఞప్తి నెలవు
034 అందము అతిశయము తోడు ఆదరణయు
సొగసు కడిగిన కరిగియు సోకు మారు
తరుగు అందాల చూపులు తారు మారు
ముఖమున మెరుగు వల్లనే ముడత పడుట
035 సుస్వర విశిష్ట సేవ ప్రశస్తి వల్ల
బాధ్యత మరీ పెరిగి నిత్య బంధ మగుట
తెలుగు  గౌరవ కృషి జరిపి తేట పర్చు
విజయ మార్గమే విశ్రాంతి వినయ తీర్పు
036 దండము తెలిపి ధైర్యము దరిన జేరి
మొండిగా కదిలెను శక్తి మౌన మార్గ
అండగా నుండె బ్రతుకుయే ఆత్రు డగుట
ముండ రమ్మని బిలవగ భూపతి కథ
037 కటకటాల్లోను కర్కోట కళలు సాగు
కక్ష కసిగాను శిక్షలు కరుణ గాను
బుద్ది కల్తీ యగుట నిజ భుక్తి యగుట
అదియు కాలనిర్ణయమని ఆకలనుట
038 కామ రాహిత్య సంపద కలలు తీర్చి
స్థితిని మొదట స్థిరపరచి సీగ్ర సుఖము
మంచి చెడులతోనూ మొట్ట మొదట సాగు
లోపలా వెలుపల కర్మ లోహ శక్తి
039 తెలిసి కున్నది గోరంత తెలప లేక
సలప రింతలు కొండంత సమయ మందు
చిలక పలుకుల మోసము చేష్ట లగుట
తలపు సేవ యను స్వార్ధ తత్త్వమేను
040 అధిగమించు మృధువు వల్ల కఠినమైన
ఇది సజీవ పూల వలెను ఇచ్ఛ తీర్చు
శక్తి వంత నపుంసక శిలలు చూడు
నీరులా ఉండి మృధువుగా నిజము తెలుపు
040 అమ్మ అస్తిత్వమును బట్టి ఆట మొదలు
అసరులవలె నరులగుటే ఆశ కదులు
సత్యము మరచి పూజలు సమయ బ్రతుకు
సర్వ దేవ నమస్కార సమరమేను
041 సుమతి మాట వినకశోభ సుఖము వదలి 
స్వార్ధ పైత్యమే మనిషిగా సాగనీక
గతము తవ్వేగుణము మతి గమ్య మౌను
తంత్ర మంత్ర మనుచు బొంకు తరుణ మందు
042 మనసుకు స్వేచ్ఛ ఇవ్వక మనుగడగను
నిత్య భావాన్ని కనిపెట్టి నీదు బుద్ది
అసలు ఆలోచనలు రాక అప్పుడపుడు
తనను తానుమరచి రక్తి తాప వశము
043 మనిషి ఆలోచన తుపాను మక్కువైన
వేయి కళ్ళతో కనిపెట్టి చేదు తీపి
చెలిమి పలుకు లాలనయగు చేరువగుట
పలురకాల ప్రయాణము ప్రతిభ నిలుపు
044 మొగ్గలోనే భ్రమను తుంచి మోక్ష మార్గ
మనసు ఆధ్యాత్మికతతోను మాయ తరిమి
సాథ్య కళ యుద్ధ అవకాశ సాహసమగు
అంతరంగప్రయాణము అద్భుతమ్ము
045 కావ్య రచన తత్పరతయే కాల మధుర
మైన భావ మే అత్యంత మైకమిచ్చు
తెలుగు నాటసంపద ఇదీ తేటనీరు
తీర్చ గలుగు దాహమ్మునే తృప్తి పరచ
అంతర్మధన పద్యాలు 
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
 0101 మిత్ర రాష్ట్ర దుర్గంమ్ముయు మేలు కోరు 
 వక్రుతులని పేరు విధిగాను వెల్లువిరియు 
 సైన్య మేరాజ్యపాలన సమయ మగుట
 నిత్యము అమాత్య లధనమే నిజము తెలుపు  
0102 పెద్దల సహవాసం చేసి పేరు పొందె     
వినయ విజ్ఞాన సంపద విశ్వ మందు   
తానుచక్క బరుచు వాడు తనువు  ఓర్పు   
ఆత్మ సంపాదనం సృష్టి అందరిగను  
0103 గురువు తెల్పు విద్యల వలన ఉన్నత మగు 
సేవ వల్లనే విజయము సేతు వగుట 
ధర్మ మార్గము వినయము ధరణి యందు 
 వినయ వాక్కులు మనసున వినుట బ్రతుకు 
0104 విలువ లేని దుమ్ము, భయము, విధిగ చేరు
కళ్ళ లోపడి విలవిల లాడ గలుగు 
విలువ లేనిపలుకులన్ని వదలివేయు
ఉత్తముల లక్షణం దూది ఉప్పు యనుట 
0105 భయమనేది మనిషి లోన భారమవదు  
ఒక్కసారి భయము తీర్చ ఓర్పు ఉంచి 
పారి పొయ్యేల భయముమే పాప బుద్ధి   
కుప్పకూలిపో యు భయము కూర్మి వలన 
0106 ఏది ఏమైన పరిణామ జీవ మగుట 
నిత్య తార్కాణ అవతార నియమ మగుట 
బ్రహ్మ చారులకు ముదురు భావ మేల  
బెదిరి పోయి వాడికెవరు పిల్ల ముదురు  
0107 బయటి విషయములుగ ఇంద్రి యమ్ము జూపు  
అహము సంసర్గ సంపర్క అంత మగుట
బ్రహ్మ నిష్టగల వివేక బంధ మగట    
పురుష శక్తి సౌజన్యము పురులు విప్పు 
0108  తాత తల్లి తండ్రి గురువు తర్లి పోవ  
జాతి కులములనె చపల తేల మగుట   
దాను దానయైన మనసు దలప యుండ 
తత్త్వ  వైరాగ్య ప్రాణియే తరము తెల్పు 
0109  కల్పనాశక్తి కలియుగ కాల మాయ
నిత్యమూ అభూత కళలు నిన్ను చేరు
ముక్తియు విముక్తి కోరుట ముఖ్య మగుట
ధ్యాన మన్నదీ ప్రకృతియే ధ్యాస పెంచు
0110  నీతి అవినీతి మధ్యన నీడ తలుపు
మంచి చెడుల మధ్య మనిషి మనసు మాయ
అవసర అనవసర మైన ఆశ మెరుపు
పనులకొరకు ఓర్పుయు లేని ప్రగతి జీవి
0111  గుక్క గుక్కకు తిక్కగా చుక్క నక్కి
పక్క ఎక్కక మెక్కుచు పీక్కు పిక్క
తొక్క తొక్కిమక్కువ కక్కి తోలు చెక్కి
కుక్క నక్కలా బొక్కెది కూడు గుక్క
0112  ఎదుటివారి బలము తెల్సి ఎరుక పరచి
సులభ మవదు గెలుపులన్ని సూత్ర మౌను 
గుణము గోప్యము మనసుకే గుర్తు చేసి
కష్టమైన గుణము వల్ల కార్య ఫలము
0113  వైద్యులు మనసు రోగము పైరు పెరుగు
అర్ధమవని రోగి యగుట ఆకృతి గను
వ్రాత లేవైన సృష్టికి వరుస క్రమము
బ్రహ్మ వైద్యులు సామాన్య బంధ మగుట
0114  పలక రింపులే రసరమ్య పాలు యగుట
చురక లవ్వు అల్లే తీగ చుముక మిచ్చి
తల్ల డిల్ల సవ్వడి వల్ల తరుణి తపన
పెదవులు పలుక రించియు పిలుపు లాయె
0115  ముందు సంసారిగా మారి మునిగి తేలి
చపల బుద్దియు చూపక చరిత తెల్పి
కొంత తత్త్వము తెలిపియు కోర్క తీర్చి
చేర దూర జార బ్రతుకు చింత వలదు
0116  ఆలికి విధేయత బ్రతుకు అలక అనక
పలుకు జవదాటని వినమ్ర భక్తి చూపు
సతుల సుఖానికి పతుల సమయ తృప్తి
స్పష్ట అప్రమత్తత ఆలి సహన మేను
0117  ఆట లో గెల్చి ఓడుట నందరి కళ
హస్త గతము అగుటయును వాస్తవమ్ము
బ్రతుకు బదిమంది సుఖముగా బంధమౌను
సంభ వించు సహజ శక్తి సర్వ మాయ
0118 ఎవరి లోకము వారిదే ఏమి చెప్ప
ఎవరి శోకము వారిదే ఏల చెప్ప 
ఎవరి కామము వారిదే ఏల తీరు 
ఎవరి రోగము వారిదే ఏల తగ్గు
 
0119 అంద రందరి మధ్యన ఆశ చూపు
నలుగురి కలయికల యందు నటన మాట
ఒంటరి మది ఆలోచన నేర్పు అనక 
నిత్య మేధావి పలుకులే నీతి బ్రతుకు
0120 కోటి పూజల ఫలమోక గొప్ప స్తోత్ర
మగుట, ఫలమేను జపమగు మంత్ర మేను,
కోటి జప ఫల మేనులే గొప్ప ధ్యాన 
మేను, ధ్యానమ్ము  తపఫల మేను లయము
0121 బలుపు ఎపుడు బలి యగుటె బడుగుజీవి
బలిపశువు కాక బ్రతుకునా బలము చూపు
బంధ బలహీనతకు బండ బారకుండు
బడిని గుడిని చేరిచదువు బాధ పడకు
0122 పలకరింపు ప్రభాకర ప్రభలు కలయు
మలుపు లేని ప్రగతి కోరి మనసు తెలిపి
జ్వాల సమరము బ్రతుకుగా జగతి నందు
జలము హారతి కర్పూర జగడ మవదు
0123 చంటి పాప వలెను చల్లగా చూసెడి 
కంటి నీరు యన్న కార్చ కుండ
పంటి బిగువు నుంచి పలుకు ప్రకటితయు
ఇంటి కెల్ల రోత యింతి గాదె
0124 ఒకరికి ఒకరు తెలిపిన ఓర్పు ఆట
చెకు ముఖి కలయకేను లే చింత ఏల
నఖ శిఖము కొత్త యగుట యే నటన ఏల
ఆకు వక్క సున్నము ఘాటు అలక కాదు
0125 కడలి ఆశయాల అలలు కలత బడక
కదులు తీరము వైపుకే కలలు తీర
అరుణ సింధూర అలికిడి ఆట పట్టు
ప్రణతి ఆదిత్య కళలన్ని ప్రగతి ప్రభలు
0126 బెండేగ మెదడుకు బిడియము మది మేత
బెంగే గ మనసుకు బిగువుగా మది వాత
బంధువై స్నేహాన్ని భాద్యత మది  గీత
బాధేగ మనిషిగా బంధ సుభద్రత
0127 రమ్యశ్రీ బలమే శ రీరానికి కొలత
భుక్తేగ బ్రతుకు కు భూమినయె నెలత
నిత్య భంగిమగాను నిజనాట్యముకి లత
కళ భయమేగను కయ్యానికియు జత
0128 భూమేగ మదిన సమూహాలలొ భద్రత
ప్రభలతొ భజనేగ పలుకుల విముఖత
హిమము బాగోగులే హితమది సుముఖత
నయనాల బాటలే నడక దారుల చింత
0129 భూరివిరాళమే భుజప్రాణమ లతీత
భవహరుడై మది పార్వతియె సమేత
భక్తితో కొలిచిన ప్రత్యక్ష దేవత
బాధలన్నీ రూపుమాపేదియు ఘనత
0130 భువనము భాండవ భుక్తి బెండ కొలత
బారుతోటలవల్ల భాగ్య మేసుమలత
బెండ ముదిరినను బ్రహ్మచారె ముదిత 
అండ పిండాండము ఆది కళలు మతి
0131  స్త్రీల వక్షోజ సౌందర్య స్త్రీల పట్టు   
కొవ్వు మాంసము అయినను కొత్త గుండు 
మళ్ళి చూడబుద్ధి మనసు మౌన బుద్ది 
పురుషులకు వికార మవని పూర్తి మేను
0132 ముదిత సోయగం రాజసం ముఖ్య మేను 
తొణికె స్తన్య అనన్య మే తోడు నీడ  
తామస తలపున మెదిలే తాప బుద్ది   
నింపును మోహ కామ వికార నియమ దృష్టి 
0133 ఎంత వరకు ఈ సొగసులు ఏల యనక      
యెంచగను మాంస కొవ్వుల యేమి ఫలము   
మనన మనసిజ జననం మధుర మేను  
తలచినది కొద్ది తలపుల తపన తాళ
0134 ప్రియ కృతాంబర చౌర్య కేళీ విలంబ
చెలిమి సంయుక్త సద్భావ చెరిత గలిగి
ధర్మ నిష్ఠ గరిష్టగా ధరణి యందు
దాన వీర సూర్యుడు కర్ణ దాత కథయు
0135 అంద మేక గంధము చందమామ తలపు 
నిత్య ఆహార్య ముత్యమై నీడ వెలుగు 
పోత పోతలో పుత్తడి బొమ్మ మెరుపు 
అవని లోసాగే స్త్రీ గను ఆమణి కళ 
0136 ముద్ద చామంతి కళ్ళ తో ముక్కెర గల
చెక్కిల పగడా లవలేను చెలియదాల్చె 
అధర అరుణమ్ము ఎర్రగా తాననయును 
ఆకు పచ్చ హారమధి ఆహార్య మగుట 
0137 తర్జని తమక తక్కెట తాప గుణము 
నిత్య కాటుక కన్నుల నియమ కళలు 
స్త్రీల సిగ్గేనవ్వుల తీరు శీల మగుట 
పరువమే సకాలమ్ముగా పద నిసలులె
0138 కలసి తెలుగును బ్రతికించ కాల మిదియు
కడలిలో పడవ తెలుగు కనుమరుగువ
కుండ తెడ్డులమై నెట్టు కుంటు ఒడ్డు
చేర్చు శక్తి ఈశ్వరసృష్టి చింత వలదు
0139 బ్రతకు బ్రతకించుట తెలుగు బలుపు కాదు
బాధ్యత తెలుగు దేశాంది బాధ వలదు
ఆధునిక విద్య తోడుగా ఆత్రమిది యు
కర్మ చేద్దాము ఫలుమును కాల తీర్పు
0140 గుండె తలుపులే శబ్దమై గుర్తుచేయు
సూర్య కిరణాలకు కదలే సూత్ర మదియు
గమక ఉచ్వా స నిశ్వాస గమ్య మగుట
తలపు మలుపులే బందీగ తారు మారు
0141 మోసపోతున్నాము మౌనపు ఆశలు 
 సంకెళ్ళు వేస్తూనే సంధి వాక్యాలుగా 
మాటలకళ్ళెమే మానవతా కళ 
మనసు మరోపని మనిషిగా నిలుపుటే
0142 చేతకాదనుకున్న చెలిమియే ప్రేమయు 
తోచిన అర్ధాన్ని తోడుగా నే చెప్పి
కదలక మెదలక కధగా నిలబెడుతూ
అలవోకగా వచ్చె తలపులకలలేను
0143 లేదనుకుంటూనె లేతమనసు చిందె 
అంతంత మాత్రంగా ఆలోచనలుతోను 
అందని బ్రతుకుయే ఆధార మవు టయు 
నాలుగుకాలాల నవ్వుల మధ్యనే
0144  తెలియక మనసుయే తేజో మయముగాను 
ఎక్కడికి అనియు ఏదియూ తెలియని
రహదారి వెంటన రసరాజ పయనమే 
గమ్యాన్ని మరచియే గతముయే తోడుగా 
0145 కదలిపోతున్నదీ కాలమే జీవితం 
సాగుతూ మేఘమై సాధన వర్షము 
కదులుతూ పట్టించు కోకుండ జరుగుటే 
ఇది కఠోర గమన ఇచ్ఛసాధన యగు
0146 వెరవక ఒక్కనీ వెతలు మార్చ గలుగు
జీవితం సాఫల్య జీవన మార్గమే 
 ప్రేమ పిలుపుల కే ప్రియసి ఆనందము 
 నిర్వీర్యుణ్ణిగ చేసె నియమాలు మానను
0147 మనసు నిగ్రహ సాఫల్య మనిషి పనియె
నిత్య నైపుణ్య ఫలముయే నిజము తెలుపు
చాక చక్యము అనుభవం చరిత బట్టి
కళలు దైవమే చూపేను కాని దేది
0148 స్వరము సంగీత భాష్యము సమయ తృప్తి
విశ్వ వాహిని వినిపించె వినయ ప్రభలు
జోశ్యుల కళలు నిత్యమూ గోప్య మగుట
సర్వుల సుఖము వాంఛయే సరళ గీత
0149 విధియె విస్మరంచిన యుక్తి వెతలు యగుట
విధియు నిన్ను నన్ను నడుపు వివరమేల
నీవు విధిగాప్రవర్తన నిజము తెలియు
కర్మ నిర్వర్తించుటయేను కాల 🌹విధియు
0150 సంపదకు మూల మైనది స్వస్థత యగుట
సుఖమునకు మూల ప్రేమయే శుభమగుటయు
నమ్మకం జీవితం కళ నగర మందు
పరుగుల కలల ఆరోగ్య ప్రమిద వెలుగు
0151 పెద్ద లర్ధ సంభోధన ప్రియము గుండి
సహజ సందర్బ పాఠము సరయుచుండు
మనసు మర్మము పదములై మనము చూసి
తప్పు ఒప్పులనక ఆధ్ర తయును చదువు
0152 లేదు మాటకు నిలకడ లయలు మారు
రాదు విసుగన్నది ఎపుడు రాత్రి పగలు
పోదు మక్కువ ఎప్పుడూ పోరు నందు
చేదు వేప తినగ తీపి చేష్ట లుడికి 
0153 రంగు వెలితియు కొకరు పూరించవలెను
 రకము తప్పులెన్ని విధి సారించవలెను 
 లిపిన ప్రేమ సామ్రాజ్య పాలించవలెను 
 వినయ ఒడిని ఊయలచేఫ లించవలెను    
0154 ముదిరినది మోము ముక్కెర ముసుగు చూడు
ముందరి కనుల చూపులే ముప్పు తెచ్చు
సహజ సౌందర్య మగువలో సహన మేను
సమయ తృప్తిగా సమరము సంఘ మందు
0155 చంద్ర కాంతి కోమలి వచ్చి చేరి మెరుపు
ముత్య మైచిక్కె చేమంతి మువ్వలాగ
పరువపు పగడుపు వెలుగు పొన్నె యగుట
కులుకు కోమలి కనకాంబ గుర్తు చేయు
0156 కనులు తెరిపించు పలుకుగా  కాలమగుట
రెప్ప పాటు కదలికయే రెక్క లగుట
జీవి తమ్ముయే పనులుగా జీత మగుట
ఆశల అనుభంధాలు గా ఆట యగుట
0157 ప్రజల హృదయ వాంచ్ఛలు తీర్చి ప్రకృతి  బట్టి
ధైర్య మును పెంచు పాఠము దెలిపి సుఖము
స్వేచ్ఛ ఆరోగ్య సంపద సమయ తృప్తి
హృదయ మందు కళ మనసహాయ మేను 
0158 ఆలి సొగసుల గుంధం ఎ ఆదరణయు
ప్రేయసి కళ అందం మది ప్రేమ కరుణ
ఆలు మగల బంధం సేవ ఆత్ర మగుట
విషయ డెందం వినయమేను విధివివరణ
0159 అవసరాన్ని మౌనముగాను ఆకలనుట
అతిగ మౌనాన్ని వెర్రోళ్ల ఆట అనుట
ఈ సమాజం నిను ప్రశ్న ఈదు లాట
మనిషి బట్టె మౌనము చూపు మధురమగుట
0160 ఉండదు లె పెళ్లి ముందున్న పుట్టినిల్లు
పండదు ఇదిఒరక ప్రేమ పడచు ఒళ్ళు
మండదు పనుల ఘర్షణ మెరుపు కళ్ళు
నిండదు లె కోరు సుఖముయే నియమ నీడ
0
0161 చూపు ఒకటిగా కన్నులై భూమి ఓర్పు
కర్ణము లొకటి వినికిడి కాల మగుట
నాలిక ఒకటై మాటవినాలి తలపు 
హృదయ మొకటిగా సుఖమిచ్చు హారతగుట
0162 నీతి దాంపత్య లక్ష్యము నిజము యగుట
ధర్మ అర్ధ కామ సమము ధరణి యందు
బ్రతికి బ్రతికించు గమ్యమే బంధ మగుట
అర్ధ నారిశ్వరుని పరమార్ధ మగుట
0163 మంచివని ఇతి హాసమ్ము మనసు చేరు
శాస్త్ర విజ్ఞాన మని చెప్ప శాత మెప్పు
నీదు ధర్మ మార్గ చదువు నీకు శోభ
బుద్ధి జత చేరినాకళ బుద్ధుడుగుటె
0164 ఎవరి మీద నున్న మనసు ఏల నీకు
నిన్ను నిన్నుగా చూచేది నిన్ను చేరు
నీదు నిజమైన ప్రేమయు నిన్ను మార్చు
అర్ధ నారిశ్వరుని తత్వ అర్ధ మవదు
0165 మిక్కిలికి కల వారులే మీగడ వలె
మక్కువను అర్ధ పరమార్ధ మనసు చెరచు
చుక్కలన్ని అర్ధార్దులే చూపు కలలు
కలియుగాన నిత్యము ఆట కళల బ్రతుకు
0166 ఉండదు లె పెళ్లి ముందున్న పుట్టినిల్లు
పండదు ఒక రక ప్రేమ పడచు ఒళ్ళు
మండదు పనుల ఘర్షణ మెరుపు కళ్ళు
నిండదు లె కోరు సుఖముయే నియమ నీడ
0167 తనము సహనము సంతృప్తి తాప సమయ
శోభ శుభముగా శుభ్రతా శోక మవదు
ఉత్త మంయన్న ఉత్తేజ మున్న సుఖము
ప్రేమ చుట్టూ కదులె కళ ప్రియము యగట
0168 ఎవరి కెవరు ఈ లోకంలొ ఎవరి కెరుక
ఈ సుఖము ఇక్కడ నె నుండు ఈ విధము గను
ఏరు పొంగి నీరు కదలి యదను తట్టు
ప్రాణులన్నీ ను బ్రతుకులు పదము లగుట 
0169 విశ్వమయము ప్రాణ శక్తిగ అధికము
జన్మ జన్మల చెడు కర్మలు చెడును మార్చు
 పుణ్య కర్మలు ద్వారానె పుడమి భక్తి
 జీవితాన్ని అనుభవించె జీవి యగుట
0170 దుఃఖ రహిత జీవితముగా దురిత యగుట
నిత్య అనుభవము సమాజ నీడ యగుట 
మనన జీవితానికి వచ్చు మానసమ్ము
విజయ,ఆనంద మొందుట వినయ మగుట
0171 బ్రతకు తెరువు కోరి పడతి తనువు పంచి
మమత ఒక్కరగుటయేను మనసు కృష్ణ
ప్రేమ కున్న గొప్పతనము ప్రియము గుణము
చిన్న చూపు ఏల బ్రతుకు చేష్ట లందు
       
0172  తనువు తాకినా సరసపు తాప సమ్ము
రాధ మాధవ కేళియు రస మయముయె
వేణుగాన మాధుర్య మే విద్య కుదుపు
రాధ మాధవీయమ్ముగా రమ్య మేను 
0173  వ్యక్తి జీవన సన్నిధి హితము గుండు
స్పందనలు ప్రకృతినిబట్టి సమయ తృప్తి
భయము చేరకుండా మది బంధ మగుట
గాలి వాన ఎండా చలి గాయ మవదు
0174 పచ్చ దనపరిమళమేను ప్రగతి చేర్చు
వెచ్చ దనముయేను భరంచు విశ్వ మయము
మచ్చ రానీక బ్రతుకుకు మాయ గాలి
స్వేచ్ఛ ప్రకృతి పలకరింపు సేతు మల్లె
0175  మానసికప్రక్రియలు మూడు మనుగడ కుయె 
మొదటి పని నేర్చుకో వడం మోహ మాయ 
రెండవది విశ్లేశించుట రెప్ప కదులు 
మూడవది అనుభవంచుట ముఖ్య మగుట
0176  వార్త మనసు కుతూహల వ్యాధి చేర్చు
ఉత్తమము విద్య వినయమ్ము ఉంచి మార్చు
మృగ కస్తూరి వాసన హృద్యమాయ తీర్చు
జలము పై నూనె బిందువు జపము తీర్పు
0177 బాహ్య కర్మాచ రణ వల్ల బంధ మౌను
భగవధిచ్చయే సర్వుల బ్రతుకు మార్గ
నాదు కర్మల ప్రారబ్ద నీతి యనుచు
భగవ దాజ్ఞాన సారమే బడయు జీవి
0178  సంపుటాల సాహిత్యము సమయ తృప్తి
దారిలో నుంచు పాఠము దరిన చేర్చు
జాలి పడిన హృదయయము జెప్పు నీతి
తృప్తి పరిచేటి సాహిత్య తృనము ఇదియు
0179  చూపు తాకియు దరహాస జారివెళ్ళి 
తెమ్మెరగతాకివెళ్ళిన అలక నీడ 
 గాయమొకటిగా చెలరేగి గడప దాటు
చిందులేసి ఆడించుతే చేష్టలుగను
0180  అశ్రువులను అలికి వెళ్ళి ఆశ నింపు 
మౌనమే నా ప్రియతమగా మాన మగుట
హత్తుకుంటు మురిశి నేను హారతగుట 
మనసు మమకార భావాలు మాయ జేయు
0181 మౌన మై వాణి  కావ్యమై మౌఖ్య మగుట 
చెక్కిలిచిరునవ్వేనులే వేగి అలిగి 
అందమైంది నిశ్శబ్దమే ఆగి కదులు 
మధురమైన భాష్యాలను పలుకు చుండు 
0182  స్మ్రతులె పోగేసె బాల్యము సహజమౌను
ఙ్ఞాపకంగ మనసుతాకి జ్ఞప్తి చేయు
తప్పనిసరి కష్టాలకు తలను వంచ
అనుభవాన్ని చేర్చియు వెళ్ళి ఆట జూపు 
0183 చీకటెంత భారమగుట చింత వలదు
గాయమైన బ్రతుకు  ఓర్చి గళము విప్పె 
వెలుగుదిశకు దారిని చూపి విజయమయ్యి
తరలి వెళ్ళి పోయిందనె బాధ మనకు
0184  విదము ఎరగని మనిషియే వింత పలుకు
ముదము నిరతము చింతన ముఖ్య మగుట
స్వస్వ రూపము ఆకర్ష సమర సృష్టి
చాపమై నిలబడు తాను యోగి యనకు
0185  చూపు తాకియు దరహాస జారివెళ్ళి 
తెమ్మెరగతాకివెళ్ళిన అలక నీడ 
 గాయమొకటిగా చెలరేగి గడప దాటు
చిందులేసి ఆడించుతే చేష్టలుగను
0186 అశ్రువులను అలికి వెళ్ళి ఆశ నింపు 
మౌనమే నా ప్రియతమగా మాన మగుట
హత్తుకుంటు మురిశి నేను హారతగుట 
మనసు మమకార భావాలు మాయ జేయు
0187 మౌన మై వాణి  కావ్యమై మౌఖ్య మగుట 
చెక్కిలిచిరునవ్వేనులే వేగి అలిగి 
అందమైంది నిశ్శబ్దమే ఆగి కదులు 
మధురమైన భాష్యాలను పలుకు చుండు 
0188 స్మ్రతులె పోగేసె బాల్యము సహజమౌను
ఙ్ఞాపకంగ మనసుతాకి జ్ఞప్తి చేయు
తప్పనిసరి కష్టాలకు తలను వంచ
అనుభవాన్ని చేర్చియు వెళ్ళి ఆట జూపు 
0189 చీకటెంత భారమగుట చింత వలదు
గాయమైన బ్రతుకు  ఓర్చి గళము విప్పె 
వెలుగుదిశకు దారిని చూపి విజయమయ్యి
తరలి వెళ్ళి పోయిందనె బాధ మనకు
0190 ఇసుక  రేణువు రవ్వలా ఇమడ లేక 
వగచె కన్నీటి కొరకునే మెరిపు జూపె
ముక్క మూతితో సిగమార ముడిచి వనికె 
వచ్చి వడ్రంగి పిట్టలు వలచి పొడిచె 
0191 మొగ్గ మలుపు పువ్వు ఎగుటే మోకుపలుపు
వనికె ముక్కు మూతి మురిపం వయసు దుడుకు 
 గంట గణ గణలే సడి గణపతి కళ
 కీలు కిఱ్ఱు కిఱ్ఱని తొణికేనుగాను
0192 కంఠ దాహార్తి సరిచేసి కాల మదియు
చుట్టు ముట్టె తుఫానులా చురక జూపి 
సాహసాల పోటీ యది సమరమాయె
వేడి సెగలు చమటపట్ట వలదు యన్న
0193 కాల రాత్రి చల్లదనము కరచి పోయి
వికట జీవిగా ఇసుక యె విలవిలగను
ఎక్కి తొక్కేడి వారుయే ఏల బ్రతుకు
చెప్పనోరులేనిది మూగ జీవి యగుటె
0194 నాకు కనబడ కుండాను నాది పోదు
స్వంత దార్లకు ఆశగా చక్క జూపి
ఇదియు ఏమాట కామాట ఇల్లు యగుట
తుమ్మ జిగురులా కలసియే తూర్పు దిక్కు
0195 నిలకడ యను బుద్ధి మగని నీడ చూడు
సతి సొగసు మధనుని కళ సరయు మోడు
కల నిజమిదియే కధకాదు  కనుల రేడు
కాల మేదైన మనసు కురూపి కాడు
0196 ఆలిచేతి వంట అమోఘ ఆ అనవలె
రుచిని మాటాడకయు బాగనే తినవలె
మెచ్చుకోలు చూపు సతిని నే కనవలె
బదులు చెప్పక సతి పల్కు మనమినవలె
0197 గడ్డ పెరుగు చిలకగాను కరిగి పోవు
తెడ్డు వేసి పడవ నడిపేను మనసు
ఒడ్డు నుండి చెరువు లోతు ఓర్పు తెలిపె
పడ్డ నీళ్లను పైకెత్త బ్రహ్మ వశమె
0198 నిర్వి కల్పుడు సర్వత్ర విరచిత విధి
నిర్వి కల్పో నిరాకార నిజము తెలుపు
సర్వ ముక్తిని పంచెడి సమయ బ్రహ్మ
పడ్డ నీళ్లను పైకెత్త బ్రహ్మ వశమె
0199 మనిషి మసక బారు వెలుగు మాదిరగుటె
నిప్పుకే వెన్న కరగుటా నియమ నిద్ర
జీవి దృష్టి కోణము మారు జీత మల్లె
ఎన్ని చెప్పిన క్రమశిక్ష నేది ఇపుడు
0200 నిన్ను నిన్ను గా చూడు కనికరమగుట
నీదు పోషణా శక్తిబట్టియు కలుగుటె
నీ సతీయు నీకును రక్ష నీడ వలెను
నేను తోడుగా ప్రేమగా నీదు శక్తి
0201 ఎవడి మటుకు వాడు ఏదో ఒకటి చెప్పు
దివ్య మైన వెలుగు దీక్ష నిచ్చు
కాక పోతె విషయ కాంక్ష పెరుగుటేను
కరుణ జన్మ మిదియు కాని దేల
0202 రూపె గుండెల్లొ దాచేసె రూక లేక 
నవ్వు చితిపైన వదిలేసె నటన లేక 
కలలొ  విడిరాక తప్పదులె కధలు లేక 
బరువు మదినిండ నింపేసె బేల లేక 
0203 నాదు ఎడబాటు కాలాన్ని నమ్మ లేక 
మనసు తరగల్ని ముడివేసి ముక్క లేక 
జీవి దుఃఖము తప్పదులె ఈద లేక 
పయన ఙ్ఞాపకం కవనంలొ పంచ లేక 
0204 ఆశ అరుదెంచు వాస్తవం ఆదుకోక 
అలక ఆకాంక్ష చెరిపేసె ఆఖరవక 
రచన చరిత్రలొ నిలచేటి రమ్య మవక 
అనుభవమ్ముగా ఒంపేసె ఉండ లేక 
0205 కధలు కన్నుల్లొ దాగాయి కదల లేక 
నిశిధ దిశవుంది చెప్పేసె నవ్వ లేక 
 మిణుకు ప్రేమగా రమ్మంటు మింగ లేక
మనసు ముళ్ళున్న దాటేసి మాన లేక 
0206 వత్తి కరుగుతూ వెలుగెంత పొంద లేక
ప్రమిద చమురునే నింపేసె ప్రతిభ లేక 
కటిక వెన్నెల పోరాడు కక్క లేక 
పగలు రేయుంది నిలదీసి ప్రగతి లేక 
0207 పువ్వు వడలుతూ పరిమళం పుడక లేక 
నేను దేవుని దండేసి నీడ లేక 
వాణి కావ్యంలొ కలిపేసి వాగ లేక 
జీవ చిత్రంగ నిలిపేసి వీగ లేక
0208 ఉదయభాను కిరణ మొచ్చి శుభము తెలుపు
తనువు తాకి తెలివి పెంచు తపన తలపు
నిదుర లేపి మనసు చేర్చి నేటి మలుపు
ప్రేమను తెలిపి నిత్యమూ పలకరించు
0209 మరులు విరిసి విద్యల వీణ మనసు తాకి
మౌన రాగ మంచు తెరలు మౌఖ్య మేగి
మురిసినంత సుఖము పొంది ముఖ్య రేగి
చెలి సఖుని సెగలు చెంత చింత మరిగి
0210 సోకులన్ని చీరనుచుట్టి సొమ్ము పంచి
తనివి తీర అందము పంచి తృప్తి పరచి
వయసు చేయు అల్లరి ఆది వలపు పెంచి
సిగ్గు పూలసవ్వడి గను స్వేచ్ఛ నిచ్చె 
0211 ఏడు అవయవాల దేహము ఏల యనకు
స్వర్గ మన్నా తలమెదడు శాంతి నిచ్చు
కళ్ళు వెలుగు పొంది బ్రతుకు కామ్య మలుపు
ఊపిరి మనిషి ప్రాణ మే ఊయల గుట
0212 మన శరీరము అంబరం మనుగడ యగు
యోని మూత్ర జలము ఏను యోగి బ్రతుకు
భూమి విధిగా భరించుటే భుక్తి కొరకు
నేను నాది ధనమ నేది నేటి మనిషి
0213 ఆయుధం లేక చంపేది పాశమేను
బతికి ఉన్న శిలగ మార్చు బంధ మేను
సమర తెలివి బ్రతక నేర్చు స్వార్ధ మేను
నాలుక పలుకు నమ్మకం నటన ఏను
0214 అక్షరము శిక్షణా యుక్తి ఆశ్రయమ్ము
రక్షణయె జీవితం సాక్షిగా రమ్యపర్చు
అక్షయ మగు పాఠము మహిమ ఆత్మతృప్తి
విక్షణము విజయం కోరి మనవి యగుట
    
మ ::పట్టు విడుపుల మనసు పరిశీలనలగు
      విజ్ఞత వినయమేను విజయము నిచ్చు   
      విషయం వాంఛలు వదలి వేగిర చెందు   
      విమలచరితమునకులె వీనుల విందు 
  
సమస్యాపూరణ 
నలిగెను వింతపోకడగ వానన గాలిన ఏగి సంతసం 
అలిగెను ఆశతీరకయు ఆటలు సాగక మేళ మాయనే 
పిలిచెను మేళవించియును ప్రేమను చూపియుసేవ భక్తితో        
చలిగడు సంతసం బిడెను చానకు వేసవి మండుటెండలో
చలిగడు సంతసం బిడెను చానకు వేసవి మండుటెండలో
చం.
తలచిన వాడు జేర కడు తన్మయమొందెను శీతకాలమై
చలిగడు సంతసంబిడెను చానకు; వేసవి మండు టెండలో
కలవరమాయె, తా ప్రియుని కౌగిట జేరగ నుక్కపోతలో
వలచిన వాడు గోర తలవంచక తప్పదు కోర్కెదీర్చగన్
క మలము లౌ పదములు సక
లము భూపాలనమునందు లాలననీవే!
గమనము కా నలము దమున
రమణీయా చలము లేడు రాణులిరువురున్!!
No comments:
Post a Comment