డం! డడ!! డండమ్!!! అని డమరుకోదితముతో శివునికి నాదనివేదనం.
విస్తరభీతి వల్ల నిఘంటువులను చూపలేదు. ఈ అర్థాలన్నీ సప్రమాణాలే.
రావె నాసఖీ - నేటి ఛందస్సు గీతం (001)
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ
అతడు
రావె నాసఖీ - మనసు దోచవే
రావె నాప్రియా - మమత పంచవే
చూపు లన్నియూ - నవ వ సంతమై
నన్ను దోచవే - కళలు తీర్చవే
==
ఆమె
వచ్చె నాప్రియా ..మనసు దోచుకో
రార నా ధనా... మమత నందుకో
చూపులన్నియు .. చురుకు తెచ్చెరా
నన్ను దోచురా...కళలు దీర్చరా
అతడు
మందహాసమా - మధుర గానమా
సుందరాంగివే - సుధను కోరితీ
ఎందు నీవెగా - హృదయ రంజితీ
పొందు కోరితీ - దృఢత ధీమతీ
ఆమె
పంతమేలరా - మధన వీరుడా
సొంతమేనులే - కధలు వద్దులే
ముందు రమ్మురా - మధన ధీరుడా
తెల్పు చుంటిరా - నవకవిత్వమే
అతడు
పూలమాలలే - పులకరింపుగా
గోల ఆటలే - సలపరింపుగా
ఈల పాటలే - యెపుడు హాయిగా
తెల్పు చుంటినే - తపన నీడనే
ఆమె
తాళ వృత్తమై - తనరు చిత్తమే
జ్వాల చెంతనే - జపము జేసితీ
నీల దాహమై - నెనరు చిత్తమే
తెల్పు చుంటినే - తపన తోణులే
అతడు
చుక్క చుక్కగా - సుమదళమ్ములై
ఒక్క మాటగా - కళ సమమ్ములై
యక్కజమ్ముగా - నవని సొమ్ములై
మక్కువంతయూ - మధుర మత్తులై
ఆమె
దిక్కుదిక్కులే - దెలి హిమమ్ములే
యెక్కడుంటివో - యిచట నిమ్ములే
కాల మంతయూ - కధల చింతనే
దేహమంతయూ - హృదయ పొంతనే
అతడు..
రావె నాసఖీ - మనసు దోచవే
రావె నాప్రియా - మమత పంచవే
చూపు లన్నియూ - నవ వ సంతమై
నన్ను దోచవే - కళలు తీర్చవే
ఆమె
వచ్చె నాప్రియా ..మనసు దోచుకో
రార నా ధనా... మమత నందుకో
చూపులన్నియు .. చురుకు తెచ్చెరా
నన్ను దోచురా...కళలు దీర్చరా
రంజితా - ర/జ/స/లగ UIUIU - IIIUIU
.........
*జీవితంలో* ఏది ఎప్పుడు రావాలో *అప్పుడే* మనకు తప్పకుండా వస్తుంది .
*ఏది ఎంత కాలం* మనతో ఉండాలో *అంత కాలం* మాత్రమే ఉంటుంది.
*ఏది ఎప్పుడు* వదిలి పోవాలో అప్పుడే *పోతుంది.*
ఇందులో దేన్ని మనం *ఆపలేము* మన చేతిలో ఉన్నది ఒక్కటే *ఉన్నంత* వరకు మనతో ఉన్న వాటి *విలువ* తెలుసుకుని *జీవించడమే.*
విలువలు తెలిసిన వారు *వ్యక్తిత్వం* ఉన్న వారు *స్నేహితులుగా* దొరికినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి.
*ఆయుధం* పట్టకున్నా విలువలు . *వ్యక్తిత్వం* ఉన్న శ్రీకృష్ణుడు పాండవుల *పక్షాన* నిలిచాడు కాబట్టి *యుద్ధం* గెలిచారు..!!
అవసరం *బద్ధ* శత్రువులనైన కలుపుతుంది.
అపార్ధం *ప్రాణ* మిత్రులనయిన విడదీస్తుంది ,
మనం *అలిసే* వరకు ఆడితే అది *ఆట*
గెలిచే వరకు చేస్తే అది *యుద్ధం*
చచ్చే వరకు బ్రతికితే అది *జీవితం*
చచ్చాక కూడా *బ్రతికితే* అది మంచితనం .
జీవితం ఒక *ఆటలాంటిది*
ఒకసారి *గెలుపు* మరోసారి *ఓటమి* తప్పదు
అవతలి *పోటీదారుణ్ణి* తక్కువగా అంచనావేయలేం
అలాగని *విధినీ* ఎదిరించినిలవలేం
*విజయం* సాధించినవారు
*ఆనందంతో* ఎగిరి గంతేస్తారు
*పరాజయం* పొందినవారు
*తీవ్రవేదనకు* గురై *కన్నీళ్ళ*
పర్యంతమవుతారు కానీ
ఈ రెండూ *శాశ్వతంకాదని* తెలిసినవారు *నిత్యం* సుఖసంతోషాలతో
*జీవించగలుగుతారు
మధ్యాక్కర: ఇం/ఇం/సూ - ఇం/ఇం/సూ
==
సూత్రము: తనతాన తనతాన తాన - తనతాన తనతాన తాన
పాదములో ప్రాసయతి, రెండు పాదములకు అక్షరసామ్యయతి।
ఇందులో ఒత్తులు గాని, అనుస్వారములు గాని లేవు।
==
వగ రాల వలపాయ నీవు - నగ రాన కలగాను నీవు
తగ రాల మెరుపాయె నీవు - తగు వీధి చిరునామ నీవు
చిగు రాకు సొగసాయె నీవు - సిగ పాట నవగీతిఁ నీవు
మగ ధీర హృదయాన నీవు - మగ వీర విరితావి నీవు
మను వాడ వయసాయె నీకు.. కను చూపు జవరాల వైతి
చను వాయ తరుణాన నీకు..చిను కాయ జవరాల గాను
కను చూపు మరుగేల నీకు....ధన మాయ ఇకనైన వేగ
కణ మైన సుఖలీల నీకు...కను సాకు విరతావి నాకు
మన మాట ఒకటేగ మారు ...మన ఆట మదిమౌన మేను
మన సైన హృదయాన నీవు ...అను రాగ నవగీత నీవు
మన సేను కళలాయె నీవు --- మన కాల కధలాయె నీవు
మన భాష మన నాడి చేరు --- మన బాధ మన నావ చేరు
విధేయుడు - మల్లాప్రగడ రామకృష్ణ
సరసాల జవరాల నీకు - మురిపాలఁ జిఱు మాల వేతు
చరణాల కమలాలు చాలు - విరిబాల యది నీదు పేరు
తెరచాటు మఱుగేల నీకు - దరిఁ జేరు మిఁకనైన వేగ
తిరుకాఁపు నెఱసౌరుతోడ - వరరాగ నవగీతిఁ బాడు
..........
చెరువైన హృదయాన నీవు - చిఱుచేఁపవలె నీఁదవేల
సిరి నీవె సిరిదేవి నాకు - చిరమైన సిరి వేఱు లేదు
మఱుమాట లవి యేల దేవి - సురసాల విరితావి నీవు
మరుకాలవలె నాడఁ జూతు - హరుసాన మది మోదమౌను
==
వర్ణచ్ఛందములు - 22 - మధ్యాక్కర పాదము
==
**036 సారంగ - త/త/త/త UUI UUI - UUI UUI
వేషమ్ము వేసేసి - కాలమ్ము మింగేసి
మోసమ్ము చేసేసి - మౌనమ్ము మార్చేసి
దేహమ్ము కామమ్ము - శాపమ్ము కా దులే లేదు
ప్రాణమ్ములో నుండు - ప్రాణమ్ము నీవందు
గానమ్ములో నిండు - గానమ్ము నీవందు
ధ్యానమ్ములోఁ జిందు - ధ్వానమ్ము నీవందు
నేనాటి బంధమ్మొ - యీనాఁడు నీవిందు - (1)
లీలల్ వినోదమ్ము - లీలల్ ప్రమోదమ్ము
చాలించు మాయాట - జాలమ్ము లీపూఁట
నీలాలు నీవంటి - నేలన్ వెతన్ గంటి
నాలించు మోనాథ - యాలించు మీగాథ - (2)
**036 నేటి కవిత : " దేవత యే స్త్రీ "
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
0001 గాలిలో గాలినై, గాయానికి మందునై ,
చేతిలో చేతినై, చేయూతగ ఉండునై
కేళిలో కేళినై, కామ్యాతగ మంచునై
పాలలో నీటినై, ప్రాముఖ్యత భార్యనై
0002 రాగమై సాగెనే రాజ్యానికి రాణివై
భోగమై సేవలే భోజ్యానికి భూమివై
యోగమై హాయిగా యోగ్యముగ యోగివై
మూగవై మొహమై ముఖ్యాతివి మార్గవై
0003 మానసమ్మేనులే మాణిక్యము అవ్వుటే
దానమానమ్ములే దాస్యమ్ముగ తెల్పుటే
గానమాధుర్యమే గమ్యమ్మగు సల్పుటే
వానవళ్ళే మనో వాకిళ్లుగ గెల్చుటే
ఆధారం ( UIUU IU UUIIUIU)
***
**నేటి కవిత : " దేవత యే స్త్రీ "
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
004 గారాబానికి నీడనై, గాలంగా పనికొచ్చే దాన్ని
ఆశాపాశము వేదనై, ఆనందాలను పంచేదాన్ని
ప్రేమాబావము కాలమై, ప్రేమానందము ఇచ్చేదాన్ని
సేవాలక్ష్యము దాహమై, స్వేత్సాదేహము నిచ్చేదాన్ని
005 ఆకాశానికి నీడనై, శబ్దంగా కదిలొచ్చే దాన్ని
సాకారమ్ముయు సాక్షినై సందర్భం మదిపంచేదాన్ని
సామర్ఢ్యమ్ముయు దీక్షనై సంధేహం మది తీర్చేదాన్ని
పాధాన్యమ్ముయు శిక్షనై ప్రాముఖ్యం మాదిఆహారాన్ని
006 సందేహానికి తీర్పునై, దేహంగా ఉదయించే దాన్ని
ప్రోత్సాహాన్ని విధీతిధీ, ప్రోద్బల్యం కలపంచే దాన్ని
ఆత్మీయానికి విద్యగా, ఆదర్శా సహనమ్ము దాన్ని
సాదృష్టమ్మును సాగుటే సామర్ధ్యం తలపించే దాన్ని
007 సంకల్పానికి తోడునై, సద్భావం బదులిచ్చే దాన్ని
కైంకర్యానికి నీడనై, కైవల్యాణము తలపించేదాన్ని
ప్రాచుర్యానికి దీపమై, ప్రావిణ్యం సహనము పంచేదాన్ని
విశ్వాసమ్ముయు ప్రేమయే, విన్యాసం విజయము నిచ్చేదాన్ని
UUU II UIU - UUU IIUU UI
***
నేటి కవిత : " దేవత యే స్త్రీ "
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
008 మదిలో ప్రేమగా, మౌనవత్వానికి మందుగా,
ఒదిగా సేవగా, విశ్వసత్యానికి విందుగా,
గదిలో ప్రేమగా, గమ్యమైసాధన పొందుగా
విధియే ధర్మమై, నిత్యసామర్ధ్యము నిండుగా
009 కలలో దీపిగా, సోమతత్వానికి ముందుగా
వలలో తోడుగా, ఆశతత్వానికి ముందుగా
పలుకే నీతిగా, ప్రేమతత్వానికి ముందుగా
అలకే లేనిదై, ఆటలేచూపక ముందుగా
010 కధలో వెల్గుగా, కామతత్వానికి ముందుగా
యదలో తోడుగా, పాశమయ్యేవిధి ముందుగా
వడిగా వేడిగా, మానసమ్మై నిధి ముందుగా
బడిలో బంధమై, బంధబాహాటయు ముందుగా
***
నేటి కవిత : " దేవత యే స్త్రీ "
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
011 మచ్చికలో చెలిగా, మన్నన కోసం ఉండేదాన్ని
ఐచ్చికగా మెదిలే, మానస మేలే సంతోషాన్ని
స్వేచ్చనులే సహనం, సాధన మేలే సంబరాన్ని
విచ్ఛికతో మదిగా, విందుగ దేహం పంచేదాన్ని
012 రమ్యతతో రమగా, రంజిత రాగం పాడేదాన్ని
కామ్యతతో కధగా, హృద్యత దాహం తీర్చేదాన్ని
సౌమ్యతతో కలగా, సాధన దేహం చూపేదాన్ని
భౌమ్య మనో మయమై, శోధన మొహం పంచేదాన్ని
013 రెపరెప లాడుతున్నా, రేయింబగలు ఆడుతున్నా,
ధగధగ మెర్యుతున్నా, సేవాశహన చూపుతున్నా
విలవిల లాడుతున్నా, వేదనలకు పాడుతున్నా
తళతళ టాడుతున్నా, తాపంసెగలు పంచుతున్నా
014 కళకళ లాడుతున్నా, కోపంవెతలు పొందుతున్నా
మళమళ మాడుతున్నా, మానంసెగలు చూపుచున్నా
రెపరెప లాడుతున్నా, కాలం తలపు చెప్పుచున్నా
రేపనేది లేకుండా ఉన్నా, రెప్పలా మాటువేసి ఉండేదాన్ని
015 కోపమేది రాకుండా ఉన్నా, తెప్పలా దాటు చుండి దాటే దాన్ని
కోర్క యేది తేకుండా ఉన్నా, కప్పలా దాటి ఆశ తీర్చె దాన్ని
పట్టుగాను దారంతా ఉన్నా, ఒప్పులా ఓర్పు శక్తి పంచు దాన్ని
మెట్టు మెట్టు ఎక్కాలే ఉన్నా, మెప్పులా మార్పు తీర్పు పంచుదాన్ని
****
0
034 ప్రాంజలి ప్రభ (ఛందస్సు)
తత్వ భోద -
పాఠాలు నేర్పించు పంతులమ్మా
భేదాలు నే ర్పేది ఎందుకమ్మా
వాదాలు పెంచేట్లు వద్దులెమ్మా
శాపాలు దోషాలు చేయధమ్మా
మాటాడ దీనంగ మాన్యమమ్మా
వేదాలు చద్వాలి నిశ్చమమ్మా
శాస్త్రాల పాఠాలు నేర్పుమమ్మా
భోగాలు శోకాలు వద్దులెమ్మా
కాఠిన్యమున్ జూప గానిదమ్మా
పంత మ్మూ వద్దు ఎందుకమ్మా
శాంతంమ్మూ జూపి ఉండువమ్మా
భాగ్యంమ్మూ పంచు కోవలమ్మా
అటాడ కష్టమౌ నజినికొమ్మా
పోరాట ఇష్టమో నజినికొమ్మా
పేరాశ శాపమో నజినికొమ్మా
వేషాలు కోపమౌ నజినికొమ్మా
నామాట లెప్పుడున్ నాణ్యమౌనే
నాశక్తి ఎప్పుడున్ భాగ్యమౌనే
నాదైవమ్ హృదయం లోనమౌనే
నాప్రాణం ప్రేమంత భద్రమౌనే
నీ మీద నిరతమ్ము నెయ్యమేనే
నీ రూపు పదిలమ్ము హృద్యమేనే
నీ మాట మనసమ్ము వుండెనేనే
నీ నవ్వు ఎపుడూను పొందునేనే
ఎన్నెన్నొ నేవింటి నీరీతిగా
చెయ్యాలి సేవాలు నీరీతిగా
పొందాలి సంతోష మీరీతిగా
భాగ్యము వచ్చేలె ఈరీతిగా
--((*))--
033 *మనసు నీతి (ఛందస్సు )
సంతోషం సగము బలమే - జీవ సత్యమ్మే గా
ఉల్లాసం వలపు తలపే - ప్రేమ సంతృప్తే గా
మాధుర్యం మదన మరుపే - మార్గ సంవళ్ళే గా
సాహిత్యం మెదడు మెరుపే -మాన సోల్లాసం గా
సంసారం సహాయ నటనే -ఒక్క టేమార్పే గా
సంగీతం వయసు మరుపే -ప్రాయ, మే తత్వం గా
సద్భావం, సమత మమతే -ప్రేమ మాధుర్యం గా
శృంగారం, మగువ మగాడే -తృప్తి సంతృప్తే గా
ప్రోత్సాహం మరులు గొలిపే -కాంత ప్రేమ శోభే
శ్రేయస్సే పలుకు తల్లియే - వాణి దీపం వెల్గే
రాద్ధాంతం రణము తలపే - స్త్రీల వళ్లే కాదే
ప్రాధాన్యం పరుల కొరకే - - గీతా భాష్యం భోదే
--((*))--
032 *లక్షణమే (ఛందస్సు )
మార్పు నేర్పు ఓర్పు చూపేది జీవితమే
మంచి చెడ్డ కక్ష తెల్పేది లక్షణమే
ఎండ వాన మంచు పంచేది ఆకాశమే
రాత్రి వెల్గు తృప్తి ఇచ్చడి సంతసమే
తల్లి బిడ్డ ప్రేమ గుర్తింపు నమ్మకమే
పాలు నీళ్లు పొంగు కల్పన ప్రణయమే
స్వచ్ఛ స్వేచ్ఛ ఇఛ్ఛ ప్రకృతి దైవతమే
కళ్ళ నీళ్లు నమ్మి నిర్ణయ తప్పిదమే
శక్తి యుక్తి ముక్తి బోధించు అమ్మతమే
నవ్వు ఏడ్పు డబ్బు మార్గమ్ము తండ్రితమే
జ్యోతి ఖ్యాతి నీతి తెల్పేది ధర్మతమే
నన్ను నిన్ను మన్ను బంధుత్వ పృథ్వితమే
-((*))--
031 కొద్దీ (ఛందస్సు )
తోమె కొద్దీ గిన్నె మెరుపు
రుద్దె కొద్దీ సబ్బు నురగ
పిండె కొద్దీ పండు నలుగు
కొట్టె కొద్దీ కొండ కరుగు
తవ్వె కొద్దీ నీరు పడుట
మెచ్చె కొద్దీ ఆశ పెరుగు
నచ్చె కొద్దీ భాధ మిగులు
నవ్వె కొద్దీ కళ్ళు మెరియు
ఉతికె కొద్దీ బట్ట చిరుగు
తురుమె కొద్దీ చిప్ప మిగులు
ముదిరె కొద్దీ బెండ తినరు
చితిపె కొద్దీ చీము కురియు
రాపిడి కొద్దీ వేడి కలుగు
సాధన కొద్దీ విద్య పెరుగు
సోధన కొద్దీ కొంత తెలియు
ఇష్టము కొద్దీ కాని దవును
--((*))--
030 *దైవమే చూపించే (ఛందస్సు)
మాటయే మనకు తీర్పు -ప్రపంచం అంతయూ ఇంతే
ప్రతిభే జగతి మార్పు - -లోకంలో శాంతియూ కొంతే
దేహమే మనసు కూర్పు - -జీవంలో ప్రేరణే వల్లే
ప్రేమయే బతుకు ఓర్పు - -మౌనంలో మాటలే వల్లే
మార్పులే జగతి కొంతా - -భాష్యమే లాలనే కొంతా
ఏడ్పులే బతుకు కొంతా - -సద్భావం లేకయే కొంతా
శాంతులే కళలు కొంతా - -ఉల్లాసం ఊయలే కొంతా
గాయాలే మనసు కొంతా - -శృంగారం వేదనే కొంతా
శ్రీమతి మనసు చూసే - -సంద్రంలో అన్వేషి లాగా
శ్రీపతి గుణము చూసే - -స్థిరంగా సంతసం లాగా
ప్రేయసీ ధనము చూసే - -భంధంతో అర్పణ మాయే
ప్రేమలే మదిని చూసే - - దైవమే చూపించే దారే
--((*))--
029 తాన తన తనన (😎..తాన తానతన తానే
UIIIIII - UIIIIII (4)-UIUIIUU
వైద్య దిన మిదియు...వ్యాధి తొలగు కళ
విద్య విలువని యు..విశ్వ విదిత కళ
దేశ వసుధ ఇది... దేహ ప్రతిభ కళ
దేశ విజయ మిది... దేశ ప్రగతి కళ
జ్ణాణసాగరుడు వాడే--
చూడ వన వెలుగు.. చూపులు కలయుటె
ఆడ మని తిరుగు... ఆకలి కలియుటె
వాని దయ కలుగు..వాకిలి కలియుటె
ప్రాణ మొక పరుగు..పాదము కలియుటె
జ్ణాణసాగరుడు వాడే
మానసపు మహిమ.. మాధవుని కళలు
మానధన ఫలము... మాధవుని కలలు
మానవిధి గళము.... మాధవుని వలలు
మాననిధి వరము....మాధవుని శిలలు
జ్ణాణసాగరుడు వాడే
ప్రేమ చిరు నగువు... సోము దళుకులగు
ప్రీతి గల కొలువు.....ప్రేమ కథ వెలుగు
ప్రేమ కళ తరువు.... ప్రీతి జల కలుగు
ప్రీతి గల బరువు... ప్రేమ బల పెరుగు
జ్ణాణసాగరుడు వాడే
ప్రేమలొ మలుపులె... ప్రేయసి వలపులె
ఏమని తలుపు లె...ఏవని వలపులె
మాటల పిలుపులె... మాధురి మలుపులె
వర్ణము లు కలిసె.... వర్ణము లు కలిపె
జ్ణానసాగరుడు వాడే
---((()))---
****
028 సుధాధరా ...వాగ్వల్లభ.ర జ త ర ల గ
UIU IUI U -- UI UIUIU
కారణమ్ము నీవు లే...కానిదంటు లేదు లే
ప్రేరణమ్ము నీవు లే... ప్రాణమంత నీది లే
మార్గమంత నీది లే.మానసమ్ము నీవు లే
ధారుణమ్ము యల్ల లే...ధ్యాసయంత మారె లే
చల్లనేన మాట లే.... సాటి నీవు పొందు లే
మెల్లగా ను పల్కు లే...మోహ గీత విందు లే
ఉల్లమంత జల్లు లే...ఊసు పోయె మాట లే
కల్ల లాయె బుద్ధు లే.. కాని దంటు లేదు లే
ఉన్న దంత నీకె లే...ఊపి రాడు చుండె లే
కన్న వారి ప్రేమ లే..కాల మంత నుండె లే
చిన్న చిన్న యాశ లే...చిత్త మందు రేగు లే
వన్నె చిన్న గాను లే... వారు వీరు వేరు లే
అప్పు చేయ కుండు లే...ఆశ చూప కుండు లే
తప్ప ఒప్పు కాదు లే..త్రాడు పాము కాదు లే
ఒప్పు కోక నుండు లే.. ఓర్పు తోను ఉండు లే
ముప్పు పొంచి ఉండు లే...మూడు కాళ్లు వచ్చు లే
తృష్ణ యూర కుండు లే... దృష్టి నన్ను లాగు లే
కృష్ణ మాయ ఉంది లే...హృత్పిపాస మెండు లే
దృష్ణి పొందు టేను లే...ధర్మ నీతి సాగు లే
పృష్ణి కల్గి ఉండు లే... ప్రేమ యాత్ర సాగు లే
జీవ ధార మౌను లే... జైత్ర యాత్ర మేలు లే
వేద మంత్ర నీడ లే... వీధి దీప వెల్గు లే
సామ దాన వీరు లే... సామ భేధ శూరు లే
కాల మాయ వేల్పు లే...కాన రాని వేళ లే
పాలరంగు పేద లే.. పాటధారి చూపు లే
గాలి వాన నీడ లే.. గాళ మేయు పాట లే
ఊలు చేయు హాయి లే...ఊరు మేలు ఆట లే
కాల మంత పాట లే... గాన మాయె బత్కు లే
******
027 తాన తన తంద (3) తనతానా
UIII UI - UIII UI - UIII UI - IIUU
కాల మొక వంపు ।।లీల గను జంపు
మేల మిది యింపు ।।।గద నీకే
వాల మిది వంపు।।। వీల విని జంపు
వేల మది యింపు।। గద నీకే
కాన గను జింత।।। వాన రపు వింత
జాన తన మోత।।।కత యేనా
మాన మను చింత।।।। గాన మను వింత
వీణ మను మోత।।। కత యేనా
ఆశ యిది జూడు।।స్వాస యిది యీడు
ప్రొస యిది పాడు।।।మదిమాటే
రోష మది యీడు।।। జ్యోష మది కూడు
వేష మది జూడు।।। మది మాటే
ధ్యానము లు ఖంగు।।।దానముల పొంగు
మానముల మింగు।।మది యాత్రే
స్వానములు జంగు।।।రాణిమయ హంగు
ప్రాణమది పొంగు।।।మదియాత్రే
మానసము నందు।।। జాన తన మందు
వాణి మది నందు।।కదలాడే
మానవుని కిందు।।మానసము నందు
మాటలతొ మందు కదలాడే
వర్ణములు చిందు।।చూర్ణములు పొందు
కర్ణములు కొందు।।। వరమాయే
అక్షరము రాత।।।అక్షయము దాత
సాక్షి గను మోత।।।వరమాయే
పడకందు లేదులే।।నడకందు లేదులే
కడురోగి బాధలే।।।దవఖానా
కథనాల పెర్గెలే।।।ప్రభు కోరు వారులే
ధననాద లేదులే।।దవఖానా
కర్మలను చేసి।।। ధర్మమును చేసి
మర్మమును జూసి।।।జయమాయే
శ్వీకృతము తెల్పి।। జాగృతము గుండి
ఆకృతి నుంచి కల్సి।।।జయమాయే
___((()))___
026 ఊహల డోల - భ/ర/స/జ/జ/భ
UII UI UII UI - UII UI UII విఱుపుతో -
సుందరి నాకు డెందము మ్రోఁగెఁ - జూడఁగ నిన్ను సత్యము
ముందర వచ్చి నవ్వుము లెస్సఁ - బూలను నిత్తు నిత్యము
సందియ మేల సందెల వేళ - చల్లని గాలి వీచెను
మందముగాను మల్లెల తావి - మత్తును జల్లి లేచెను
నల్లని నేల యెఱ్ఱని నింగి - నల్దెసలందు నాదము
మెల్లగ వెల్గు మేదిని వీడె - మెండుగ నింక మోదము
ఉల్లమునందు నూహల డోల - యూర్వశి సేయు నృత్తము
వల్లకి మీటి రాగము పాడఁ - బల్లవి పూచు నగత్యము
****
025 లోక సూక్తులు (ఛందస్సు)
UUII - UIUI - UIIU - IIUU
విజ్ఞానము వింత శోభ అర్ధముచే కనుగోటం
అజ్ఞానము తన్ను తాను అల్పుడనే అనుకోటం
సామర్ధ్యము నాది నాకె తెల్సుననే దియుగర్వం
వాచాలత తోడు నీడ గా కలవా లని సత్యం
సంకల్పము ఉంటె ఎంతొ దివ్య బలం మనవెంటే
ఆకర్ష ణ ఉంటె ఏం తొ కర్మ బలం మనసంతా
సంఘర్షణ ఉంటె కళ్లె మాయలుగా మనచుట్టూ
విశ్వాసము ఉండి శాంతి కల్గిటయే భ్రమ సృష్టే
దివ్యత్వము సామ దాన భేదములే నవజీవం
సాకారము సర్వ శక్తి కామములే నవరూపం
ప్రామాణిక సేవ భావ తత్వములే నవదీపం
జ్ఞానం మన లక్ష్య తత్వ నిర్మలమే నవదీక్ష
సందేహము ఎప్పుడూ మ నస్సు తతంగము కాదా
ఆనందము ఎప్పుడూ మనస్సు సుఖాంతము కాదా
దేవాలయ మెప్పుడూ మనస్సుకే వేదము కాదా
సాహిత్యము ప్రాణ భాష కల్గుటయే కధ కాదా
--((*))--
024 వసంత తిలక వృత్తము
త భ జ జ గ గ 14 /8 ( UUU UII IUI IUI UU )
దేవానాం సేవలు మనోమయమౌను సర్వా
ర్ధంవేదం పాఠము సరాగమయమౌను విశ్వా
సంవైనం జీవితము సాగరము మల్లె సమ్మూ
హం వ్యాఖ్యే ప్రేమలకు హాయిగను చూపు లక్ష్యం
కర్తవ్యం నేత పలుకుల్లె సమస్య తెచ్చే
ప్రారబ్ధం నేరములు మల్లె వయస్సు మెచ్చే
కారుణ్యం లేకయును కల ఉషస్సు వచ్చే
ఆరాటం తృపి పరచు టే మనస్సు విచ్చే
023 స్థూలా - త/స/గ UU III UU 7 ఉష్ణిక్కు 29
ప్రేమా అనుట మాటే - భామా వినుట పల్కే
సేవా తలపు జాతే - చూడూ మనుట చూపే
భావం మనది పాటే - బంధం వలన బంధీ
స్నేహం అనుట శేషం - కాలం కదులు కామం
++
రామా భువికి రావా - శ్యామా శుభము నీవా
స్వామీ మనికి నీదే - యీమా యునికి నీకే
రామాయణము సీతా - ప్రేమాయణము గాదా
రామాలయములో నా - భూమీతనయయేగా
++
భావమ్మనఁగ వాఁడే - జీవమ్మునకు తోడే
స్వార్థమ్ము గను సారే - భాగ్యమ్ముగను భావం
సేవించుటకు ఱేఁడే - పూవై విరిసె నేఁడే
ప్రేమించుటకు పెళ్లే - నవ్వైవిరిసె నాడే
022 . మ భ న న భ భ గ - శుభిక -12
UUU UII III III UII UIIU
ఎమన్నా అవ్వును లె నగవులసె ఆశల చూపులుగా
కాదన్నా తోడుగ కలియు మెలికే కావ్యము తెల్పునుగా
సేవన్నా నమ్మియు మనసు ఎగసె కాలము కాదనగా
ఆరన్నా నూరని తడిపోడులసె దారిని చుపెనుగా
మందారం హాయిని గొలుపు వలపె తాకుట ధర్మముయే
శృంగారం సల్పుట మనకు వయసె కాదను టా వలదే
బంగారం పొందియు కులికి నలుబె హాయని యే సలుపే
యవ్వారం వద్దులె తనువు గలయ తాపము యే ఇకనే
ఏమన్నా కాదనులె మన మనసె ఒక్కటిగా చరితా
ర్థం,మౌనాన్నే అనుకరణ సమర పోషణ, ఎందుకులే
సమ్మోహం ఉన్నదియు, వినయ యశమే మన బత్కులలో
ప్రేమించే శక్తియు మనకు, కలలు తీర్చుకొనే వయసే
చామంతీ నీ పలుకు కులుకు రుచి వద్దనినా ఇక పొ
మ్మూ మానంతో చెడుగుడు తమకము ఎందుకు వద్దనులే
మామ్మానందా సరిగమల తపము చూపియు సేవలుగా
చుమ్మా చుమ్మా అనియు మది తొలచి ఆకలి తీర్చుటయే
కామమ్మే ఈ వయసుకు బలము కదా ఇక ఏకముయే
ప్రేమమ్మే ఈ మనసుకు సుఖము పదారు కళే ఇదియే
తన్మాయే ఈ సొగసుకు నువులతి చేయకు శీఘ్రముగా
చుమ్మా చుమ్మా టలతొ ఇక తరచు ఆశలు తీర్చుటయే
--(())--
021 UII UI UII - UI - UII UI UII విఱుపుతో -
తొమ్మిదవ అక్షరముతో యతి, 11వ అక్షరముతో ప్రాసయతి (2, 12 అక్షరాలు ప్రాసాక్షరాలు)
నల్లని రాత్రి తారక - నాకు - నుల్లమునందు కోరిక
మెల్లఁగ వచ్చు వాఁడిఁక - మేను - జల్లన నంటు వీడక
చల్లని గాలి వీచకు - స్వామి - యొళ్లను దాఁకి రాచకు
నల్లని వాఁడు రాయఁడు - నన్ను - మళ్లి నిజమ్ము పాయఁడు
పాడఁగ లేనె యిప్పుడు - వాఁడు - తోడుగ లేని యప్పుడు
మేడల వద్దు సెజ్జయు - మేను - వీడు సుఖాల పజ్జయు
నీడలు హెచ్చు రాత్రిని - నేను - మాడుచునుండు యాత్రిని
గోడలపైన ఛాయలు - గుండె - తోడను నాడు మాయలు
020 తోటకము - (స)4 IIU IIU IIU IIU
12 జగతి 1756
==
తనతానన తానననా తననా
==
కళకాదులె కాచితివా కమలా
వలపాయెనె వాలితివా వరదా
జలమాయనె జారితివా జలజా
వల లోనికి వాలితివా వనజా
మనసేలకో మాయలలోఁ బడునా
కనరానివి కైతలలో మనునా
నిను జూచుట నేరముగా నగునా
చిన యాశలు చేలములో జలమా
==
తనతందన తందతనా తననా
==
కలపొందితి కాంతిగనే కలువా
చిలకైనది చింతగనే చిలకా
పిలుపైనది పొందగనే పొదుపా
బలుపైనది బంధమునే బలిగా
అరవిందపు టందములోఁ గలవా
విరి గందపు విందులలోఁ గలవా
చిఱు భృంగపు చెంగులలోఁ గలవా
కరుణంగను కన్గవలోఁ గలవా
==
019 తనతత్తన తత్తతనా తననా
==
కధతెల్పెద కొత్తదిగా కనవా
మదిమల్చెద మెత్తదిగా మదనా
రధయాత్రలు రమ్యముగా రమణా
చెదిరేణులె చెమ్మలుగా చెలియా
నిను మెచ్చితి నిక్కముగాఁ జెలియా
మనసిచ్చితి మక్కువతో మగువా
దిన మిచ్చటఁ దృప్తిగ నీతలఁపే
కను మిచ్చటఁ గచ్చితమై సకియా
==
తనతన్నన తన్నతనా తననా
==
వలపన్నితి వద్దనినా వలపా
చెలివున్నది సద్దనినా చెలియా
గిలియున్నది గిన్నెయిదీ గినియా
గాలియన్నది గ్రద్దనినా గలియా
నిను గన్నవి కన్నులుగా నిజమై
స్వనమన్నది సన్నని నీనుడియే
తిననున్నది తిన్నఁగ నీదయయే
ప్రణయమ్మొక బమ్మెరలో తళుకే
==
018 UUIUIUIUU -- UUIUIUIUI U
పాదం లొ ముళ్లు గుచ్చు కున్నా
ప్రాణం తొ బత్కు వెళ్ళ బుచ్చుతూ
దాహం తొ కళ్ళు తిర్గు తున్నా
స్నేహం తొ సేవ చేస్తు తిర్గుతా
కాలం తొ వెళ్ల బుచ్చు తున్నా
ప్రేమమ్ తొ ధైర్య మిచ్చి సాగుతా
పాదం లొ ఎన్ని కుట్లు పడ్డా
క్షేమం తొ కాల మెల్ల బుచ్చుతా
సూన్యం లొ మాయ నెల్ల చీల్చీ
దారం తొ మాయనే కట్టి వేస్తా
దూరం తొ నాకు లెక్క లేదే
ధర్మం తొ బత్కు బండి లాగుతా
మాటల్ తొ ప్రాణ మిచ్చి ఉంటా
పెళ్లాం తొ ప్రమ పంచి చేరుతా
మౌనం తొ న్యాయ తీర్పు ఇస్తా
ఆట తొ మూర్ఖత్వాన్ని మాపుతా
కాలం తొ కల్సి వెల్గు తుంటా
తాళం ల తల్పు రక్ష చేయుటే
మేళం తొ మేలు చేసి యుంటా
గాళం ల పట్టు ఉండి గెంతుతా
--(()) - -
017 1)పుష్పమాలికః- న,ర,న,జ,భ,స-11-యతి
2)వేణునాదముః- ర,న,జ,భ,న,స- 10-యతి
3)పంచబాణముః- న,న,న,న,ర,న,లగ-13-యతి
1)పుష్పమాలికః- న,ర,న,జ,భ,స-11-యతి
కడుపు కోతయే ముడుచుకు నుండి భాద్యత తెలిపే
చిరు చిరు నగవుల మగువ శుచీ సుహాసినివి కదా
తరుణము కదిలియు తమకము తాపమంతయును కదా
కరుణ మధు భరితము కొరకు కోప మంతయును కదా
పరువము లొ పదనిసల గను పొందుటే వయసు కదా
మనసు కదలికలు మగువకు మక్కువే అగుట కదా
చినుకులు చిలుకు తపనలకు తత్వమే అగుట కదా
తనువులలొ తపనలు జరపు తాపమే అగుట కదా
అణువు అణువు అధరము తలపే అవ్వుటయు కదా
వెదుకు జనులు కనులు తెరచు వేళ వేకువయుకదా
మొదలు మలువులు కలయికలు మోక్షమే అగుట కదా
కదులు జగతిఁ కలత లసుఖమేమరో తలపు కదా
బదులు తెలుపు భవ భవములు భాగ్యమే యగుట కదా
3)పంచబాణముః- న,న,న,న,ర,న,లగ-13-యతి
__((()))__
ఊహల డోల - భ/ర/స/జ/జ/భ
18 ధృతి 219863
016 UII UI UII UI - UII UI UII విఱుపుతో -
సుందరి నాకు డెందము మ్రోఁగెఁ - జూడఁగ నిన్ను సత్యము
ముందర వచ్చి నవ్వుము లెస్సఁ - బూలను నిత్తు నిత్యము
సందియ మేల సందెల వేళ - చల్లని గాలి వీచెను
మందముగాను మల్లెల తావి - మత్తును జల్లి లేచెను
నల్లని నేల యెఱ్ఱని నింగి - నల్దెసలందు నాదము
మెల్లగ వెల్గు మేదిని వీడె - మెండుగ నింక మోదము
ఉల్లమునందు నూహల డోల - యూర్వశి సేయు నృత్తము
వల్లకి మీటి రాగము పాడఁ - బల్లవి పూచు నగత్యము
***
015 UII UI UII - UI - UII UI UII విఱుపుతో -
తొమ్మిదవ అక్షరముతో యతి, 11వ అక్షరముతో ప్రాసయతి (2, 12 అక్షరాలు ప్రాసాక్షరాలు)
నల్లని రాత్రి తారక - నాకు - నుల్లమునందు కోరిక
మెల్లఁగ వచ్చు వాఁడిఁక - మేను - జల్లన నంటు వీడక
చల్లని గాలి వీచకు - స్వామి - యొళ్లను దాఁకి రాచకు
నల్లని వాఁడు రాయఁడు - నన్ను - మళ్లి నిజమ్ము పాయఁడు
పాడఁగ లేనె యిప్పుడు - వాఁడు - తోడుగ లేని యప్పుడు
మేడల వద్దు సెజ్జయు - మేను - వీడు సుఖాల పజ్జయు
నీడలు హెచ్చు రాత్రిని - నేను - మాడుచునుండు యాత్రిని
గోడలపైన ఛాయలు - గుండె - తోడను నాడు మాయలు
____((()))___
014 . మ భ న న భ భ గ - శుభిక -12
UUU UII III III UII UIIU
ఎమన్నా అవ్వును లె నగవులసె ఆశల చూపులుగా
కాదన్నా తోడుగ కలియు మెలికే కావ్యము తెల్పునుగా
సేవన్నా నమ్మియు మనసు ఎగసె కాలము కాదనగా
ఆరన్నా నూరని తడిపోడులసె దారిని చుపెనుగా
మందారం హాయిని గొలుపు వలపె తాకుట ధర్మముయే
శృంగారం సల్పుట మనకు వయసె కాదను టా వలదే
బంగారం పొందియు కులికి నలుబె హాయని యే సలుపే
యవ్వారం వద్దులె తనువు గలయ తాపము యే ఇకనే
ఏమన్నా కాదనులె మన మనసె ఒక్కటిగా చరితా
ర్థం,మౌనాన్నే అనుకరణ సమర పోషణ, ఎందుకులే
సమ్మోహం ఉన్నదియు, వినయ యశమే మన బత్కులలో
ప్రేమించే శక్తియు మనకు, కలలు తీర్చుకొనే వయసే
చామంతీ నీ పలుకు కులుకు రుచి వద్దనినా ఇక పొ
మ్మూ మానంతో చెడుగుడు తమకము ఎందుకు వద్దనులే
మామ్మానందా సరిగమల తపము చూపియు సేవలుగా
చుమ్మా చుమ్మా అనియు మది తొలచి ఆకలి తీర్చుటయే
కామమ్మే ఈ వయసుకు బలము కదా ఇక ఏకముయే
ప్రేమమ్మే ఈ మనసుకు సుఖము పదారు కళే ఇదియే
తన్మాయే ఈ సొగసుకు నువులతి చేయకు శీఘ్రముగా
చుమ్మా చుమ్మా టలతొ ఇక తరచు ఆశలు తీర్చుటయే
గాలికి నాదు భద్ధకము గమ్ముగ నుండక విర్రవీగుటే
జాలిగ వాన తో డగుట జాతికి కష్టము నష్టమవ్వుటే
ఏలిన వారు సామ్యముగ ఏర్పరిచే ను సహాయమ్ము యే
నాలుక మల్లె ఉండుటయె నమ్మకమేయగు జీవితమ్ముగన్
***
013 ... UIIU -UI -UI- UI- UI- UIU
ఛందస్సు శోభ (కొత్త వృత్తము )
కాలము నీదేను మాట నీదె పొందు నీదెలే
ప్రాణము నీదేను కాల మాయ పొందు నీదెలే
సేద్యము నీదేను భోజ్య మంత పొందు నీదెలే
ప్రేమము నీదేను దేహ మంత పొందు నీదెలే
మాటల మంత్రమ్ము మానసమ్ము చేర్చి నీడలై
పాటల యంతమ్ము వల్లె నుండి బోధ సల్పుటే
తోటల మొక్కల్లొ ఏదొ మార్పు వచ్చి చేరినా
ఆటల ఆత్రమ్ము తొంద రంత దేని కోరకో
పొందిన సాహిత్య సంప దంత పేదవారికే
అందిన సౌభాగ్య మంత దాన ధర్మమే ననే
పొందిక వెంటాడి ఉన్న అంత సేవ ధర్మమై
చెందిన వారికే అందు నన్న లాభ మెందుకో
--(())_-
012 . లోక సూక్తులు (ఛందస్సు -1
U I U U I U - I U U U I I I I U
సవ్య సాహిత్య సంతసం సంతృప్తి కలుగుటయే
దివ్వె వెల్గమ్ తయూ సుదూరంగా కదులుటయే
గమ్యమంతా సుధామయం సౌందర్య పరమగుటే
నిత్య సంతోషమే సమం చేసేందు సమమగుటే
నిత్య పారాయణం - మనో లోకానికి పయణం
సత్య వాదాయణం - ఊర్ధ్వ లోకాలికి పయణం
విద్య భోదాయణం - శాంతి లొకాలికి పయణం
మిధ్య ప్రేమాయణం - అంధ లోకానికి పయణం
ధర్మ సత్యాలులే - సమాజంలో బతుకుటఏ
విద్య సమాయుధం - సకాలంలో సరిగమలే
కర్మ విధానమే - గళంయేంతో విదితములే
దమ్ము చూపేందుకే - శుగంధంతో విజయములే
--((***))--
011.. న/న/జ/స/స/స/జ/గ IIII IIIU III - UII UII UIUIU
* స్త్రీ తత్త్వం హల్లకమాలిక -
సమరమును సమభావమునె - నామదిలో మమతాను రాగమే
కమలములు వికసించుటనె - హాయి నొసంగుచు నూపుచుండగా
కరములును కమనీయముగఁ - అల్లుకొనీ శశి తార ఆశగా
నయనములు కలిపే మనసు- ప్రేమయు పంచెను సంతసమ్మునా
అమృతము రజనిలోఁ గురిసె - నా శశితారలు వెల్గఁగా, ముదం
బమితము హృదయమం దొదవి - హాయి నొసంగుచు నూఁపుచుండగా,
నమలుని గళమునన్ విరియు - హల్లకమాలిక వేసెదన్, సదా
విమలము నిజముగాఁ దనరు - ప్రేమయు నీమహి నాకు వానికిన్!
బేధ బావము లేనట్టి ప్రేమ తెలిపి శాంత మార్గము ఉన్నట్టి ప్రేమ కలిపి
వేద సారము నందించు ప్రేమ చిలికి దేవ భావము పంచేటి ప్రేమ కలుపు
కోరి మనసు పంచ్చేంత శక్తి లెదును పోయి వలపు ఇచ్చేంత ముక్తి లెదును
మండి బరువు దించ్చేంత యుక్తి లెదును ఉండి తనువు అర్పించె భక్తి లెదును
--((*))--

No comments:
Post a Comment