హరేరామ హరేరామ రామరామహరేహరే
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణకృష్ణ హరే హరే
అన్ని దిశల నీవే యై
యన్న నికను మాకు భయము ఏలను కృష్ణా
కన్నా మనసే తెలిసియు
యన్నన్ స్వజన సుఖమొసగు యోగపు కృష్ణా... హ
వాయువు గగనము పుడమియు
మాయా జగతిన సమయము మానస కృష్ణా
చేయద లచినవి చేయుట
యూయల లూగింతువు కద యోగపు కృష్ణా. హ
కోపం అబ్బాయిలదే
తాపం అమ్మాయిలకళ తప్పదు కృష్ణా
శాపం గుణపాఠాలుగ
పాపం చేయక మనసున ప్రార్ధన కృష్ణా... హ
ఈ కాల నిర్ణయ కలలు అ
హంకారం మనచు కథలు హాయిగ కృష్ణా
ఓంకారం మన మానస
ఘీకారం మన లొ బుద్ధి వీనుల కృష్ణా..... హ
కళ్ళతొ కోరేది నరుడు
గుళ్లకు వెళ్ళియు సుపూజ గూర్చిత కృష్ణా
మళ్లక మనసును ఉంచే
నీళ్లగ దాహమును తీర్చు నిర్మల కృష్ణా.... హ
మీ భక్తుడు
మల్లాప్రగడ రామకృష్ణ శర్మ.....6
పుత్తడి మెరుపు పుడమిలో పురుడు పోయు
శ్రమకు జీవితం రానించు సమయమందు
సిగ్గు లొలుకు దేవికి తోడు శ్రీనివాస
దెబ్బలను తిన్న రాయియే దివ్య వెలుగు
అందమైన శిల్పమగుటే దాని విలువ
జీవితాన తాకెడి దెబ్బ జీవి విలువ
మనసు గెలిపించు జీవితం మరల మరల
గంధపు తరువు పరిమళం గగన తాకు
పాములే చుట్టిన వాసన మాయమవదు
మారిపోని మంచితనమే మనసు తాకు
మనసు శోభించు జీవితం మరలమరల
తిరిగిరాని గతముగూర్చి చింత ఏల
తలచి తలచి శోకమ్మేల తప్పు లేల
వచ్చును క్షణాలన్నియూ వేదానేల
మనసు మురిపించు జీవితం మరలమరల
ఏ తుఫానులు ఎదుర్కొంటు ఏల బ్రతుకు
గళము లేకయే నిలుస్తుంది గడ్డిపోచ
ధైర్యముగనులే ఎదిరించె ధైన్య శక్తి
మనసు పుట్టించు జీవితం మరలమరల
అలలు ఎగసి పడే గాలి ఆట ఇదియు
తీరమునుచేరు జలముయే తీరుమారు
పట్టుదలఏను గమ్యమ్ము పగలు రాత్రి
విశ్వమై నడిపించు మనసు వేంకటేశ
మీ భక్తుడు
మల్లాప్రగడ రామకృష్ణ శర్మ.....3




om
ReplyDelete