ఆ:: విత్తు నాటి కాల చిత్తము చూడుటే
మొక్క పెరుగు వరకు మోద మగుట
గాలి నీరు వెలుగు గాయమవని మొక్క
సహన ప్రాంజలి కళ శారదాంబ
ఆ:: కాలితోన తన్న కాలము బుద్దిగా
నమ్మ లేని మనిషి నటన అదియు
ఎవరు చెప్ప లేని ఏల బ్రతుకదియే
సహన ప్రాంజలి కళ శారదాంబ
ఆ:: ఘనచరితను కలిగి గౌరవ ముయె తగ్గి
నేడు దయకరుణలు నీడ కరువు
విద్య బోధ గమ్య వేదనగుటయేను
సహన ప్రాంజలి కళ శారదాంబ
ఆ:: గంగ పారు నెపుడు కదలని గతితోడ
మురికి వాగు పారు మ్రాత తోడ
కడలి కెరట మేను పొంగి పొర్లుట కళ
పెద్ద చిన్న బేధ పెరుగులో వెన్నయే
ఆ::మంచు గడ్డ వలెను మనసు కరుగుటయే
మౌన నీతి బ్రతుకు మౌఖ్య మగుట
మనసు సాక్షిగా ను మనుగడ నుండుటే
సహన ప్రాంజలి కళ శారదాంబ
ఆ:: కనక బుద్ధి ఇదియు కానుకలా కళ
కనక తెలియ జేయు కాల కథలు
కనక అక్షరాలు కనకాభి షేకమే
సహన ప్రాంజలి కథ శారదాంబ
ఆ:: కోడి కూసె జాము కోలుకొని కదులు
తోడు వచ్చు చందు రోడు కదులు
లక్షణాల మనిషి లాస్యమేను కదులు
సహన ప్రాంజలి కళ శారదాంబ
No comments:
Post a Comment