ఉత్పలమాల పద్యాలు 
001  కానవ మాత్రమే కధల కాలము చూపియు కష్ట పర్చుటే
మౌనవ నీతి మార్గముయు సౌమ్యము కర్మగ రక్తపాతమే
దానవ మార్గమే ధనము దాశ్యము దుష్టుల మర్మ నీతియే
ప్రాణము కక్ష సోదనలు ప్రాయము చూడక ఆశ పాశమే
002 ఉన్నదనేది యే విలువ ఉన్నను అర్ధము కాదు లే మనో
మన్నన చేయి జారకయు మాటల  మంత్రము మాయమే వినా
లన్నది జీవి శోధనయు లాహరి లీలలు లాస్యమే విధీ
యున్నతి సేవ సాధనలు యుజ్వల కామ్యము బ్రత్కు లవ్వుటన్
003 మంచము ముచ్చటే మగువ మానస మందిర మేను సేవగన్ 
కంచము భుక్తి తీర్చు విధి కాలము ఆకలి తీర్చి మెర్పుగన్
లంచము బుద్ధి మార్చుటయి లాస్యము పాలగు జీవితమ్మునన్
పంచము ఎప్పుడూ మనసు పాపపు భాధయు ఎవ్వరైనన్
004 మంచిని పంచు మానసము మందిర మాయెను ఎల్లరందునన్
ఎంచిన సేవ చేయుటయు ఎల్లరుమెప్పుద లే మనో మయమ్
పంచిన పద్య భావముయు పాలలొ నీలుగ కల్సిబత్కు టన్
యోచన విద్య విస్తరిగ యోగిగ జీవిత సత్య వాదిగన్
005 *ఉ..మాంసపు ముద్ద భోనముయె మంత్రము తంత్రము కాదు కాదులే
ధ్వంసము ధర్మమార్గమును ధార్మిక బుద్ధియు ఎలా వచ్చుటన్
హింసయు నోరువిప్పియును హీనుని చేష్టలు కామకోరికల్
హంసయుపాలునీరు గను యార్తిగ వేరుగ చేసిత్రాగుటన్
006 *ఉ..సర్వము కోరు కర్త గను సంభవ ధర్మము ఆచరించుటన్
సర్వము కోరు భర్తగను సృష్టి కి మూలము ప్రేమపంచుటన్
సర్వము కోరు భర్తలను సంగమ సౌఖ్యము ఇచ్చి పుచ్చుటన్
సర్వము కోరు దారిగను  సాధన శోధన సత్యవాదిగన్
0విధము మనో భవా మృతము విద్య సమర్ధత నిచ్చు రీతిగన్
ముదమున కాల నిర్ణయము మత్తుగ వర్ణన ముప్పు కల్గుతన్
వదనము చాపమై కళ సహాయ సమర్ధ ఒప్పు తీర్చుటన్ 
మదనపు రూపమే మనసుగా సమధీర సుమాబ్ది రంగమున్
చ:: గురువుని మించినారని పియూష గుణాల నుచూప మూర్ఖమై 
విరుపులు మోము వీధినను వీర విహారము ఏల ధర్మమై  
చిరుగులు వస్త్ర ధారియని బీద యనాదర భావ మేలనో
పరుగులు పెట్టు మూర్ఖుల ఉపాసనయే విధి భాధ జాద్జ్యమే
      
 అని మన రామకృష్ణుడు దయానిధి శ్రీగిరినాధుమీద జె
ప్పిన శివమంత్ర వర్ణనము చిత్తసముద్గత భక్తి యుక్తి వ్రా 
సిన గొనియాడినన్  వినిన జెల్వెసలార బఠించినన్ జగ
జ్జనుల పుణ్యసంపద లసంఖ్యములై సమకూరు నిమ్మహిన్        
సుముఖత చూపు సౌమ్యమగు సూత్ర మనో సుఖమ్మే సతీ పతిన్
విముఖత ఏల చూపులతొ విద్య స హాయమేలే సుఖాలయమ్
ప్రముఖ వినోద భావముయు పాఠముగాను యుక్తే నిదీ సమాజ
జమునకు శాంతి సౌఖ్యములు సత్వరమే సమా కూరగావలెన్
స్త్రీలపై  ఓదార్యం - సాహిత్యాకాశంలో సగం 
కుంకుమ నిత్య సత్యకళ సుంకము కాదును స్త్రీల హృద్యమున్ 
సంకుమ దమ్మనే పురుష సూత్రము తెల్పెడి సూత్ర ధారిగన్      
భంకర భస్మమై తెలుపు బంధన బ్రత్కుల గూర్చి తెల్పగన్ 
పంకము చేరినట్లు కధ ప్రాణము మానము స్త్రీల లక్ష్యమున్
నింకను తెల్పగా నిజము నీడల ఎల్లలు కాత్యాయని  
          
రీతులు కోపమై సతుల రిక్తపు హస్తమనో స్వ భావమున్
మూతులు వంకరేయగుట ముందుగ తాము సహాయమే యగున్
చేతులు వంటలో కదులు చేష్టలు తప్పితయే నిజమ్ముగన్
లోతుల చూపులన్ని కళ లోపము వల్లనె జర్గు చుండుటన్
పూతమెఱుంగులుండ పసరు పువ్వుల పండ్లుయు జూపునట్టివాఁ   
కైతలు నిగ్గు చూపుకళ గావలె గమ్మున నవ్వుపువ్వులై 
రాతిరియున్ బవల్ మరపు రాని హోయల్ మది ఇచ్చిపుచ్చుటన్
జేతికొలంది కౌగిటను జేర్చిన ఆ పరమార్ధమేనులే                
శా::  కాలమ్మే మనజీవితమ్కవుల ధా రామమార్గంబునన్
       కాలమ్మే గ్రహణమ్ మనో సమరమే గామ్య తీర్ధంబుగన్
       కాలమ్మే వికృతమ్ వినోద మయమై కామ్య సౌదంబుగన్     
       కాలమ్మే ను సుధా సుధర్మ సుఖదా సౌమ్య సంతోషమున్
శా.
ఆర్భాటంబున మాఘ పౌర్ణమిన శ్రేయంబంచుగా జేసిరే
గర్భాదానము; నాటినుండి వివరంగా బామ్మ లెక్కించి, సం
దర్భంగా గుణియించి చెప్పెనదియే తన్మాఘ పౌర్ణంబునే
గర్భాదానమునాడె కల్గిరి కవల్ గామాక్షికిన్ జూడగన్
ఉండీ ఉండని దై మనోభలముగా ఉచ్వాస నిశ్వాసగన్
వండీ వార్పులుగా సహాయమనుగా వాచ్చాయ వైనమ్ముగా
మోoడీ మార్గముగా సమోన్నతలు గా మొహమ్ము మోక్షమ్ముగా
తండ్రీ రమ్మని ప్రణనాధు బిలిచెం తానంత మొహాంధమై
గాలిపటం ఉద్యమము కాలము తెల్పగ కావ్యమాయుటన్        
కూలి ఇదే ప్రజల కళ కూటికి గుడ్డకు గొప్ప  గ్రంధము న్  
మేలిమి పత్రికారచయి తే హృదయమ్మును ధారపోసియు న్ 
అలికె సాహితీవనము ఆశ్రయ హక్కుల పోరు వక్తిగన్     
తాళి యు రాజకీయమగు తన్మయ మే కధ వట్టికోటయే    
ఉత్పలమాల 
లీలల లొల్లిలే లలన లాలన పాలన లాస్య మేళనన్
లాలల లే మనోచలన లాహిరి లోలక లంపటమ్ముగన్
కాలము లీల మోదమయి కవ్వపు కోర్కెల కావ్య మవ్వుటన్
హేళన కాదులే మనసు హారతి నిచ్చుట జీవసత్యమున్
ఏటికి మాకు కావలయు నేబదియారగు నక్షరమ్ములున్
మాటల తీరు తెన్నులను మార్చిన నేమగునంచు నీ
నాటికి తల్లినెంతగనొ నవ్వులపాలొనరించు చుండ తా
కాటుక కంటనీరొల్కగా తెలుగమ్మయె కుందిపోదొకో
 
No comments:
Post a Comment