Sunday, 18 December 2022

 శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ-- శ్రీదేవి,  భూదేవి నీ ఎట్లా భరించవయ్యా 

ఒక్కరినే భరించటం మాకు కష్టము గా ఉన్నది  -- శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ


ఓ మేఘ మురిమింది, ఓ రూపు లేక యే

ఓర్పుతో ఉరిమియు, వనుకు వనుకు

పుడమి పై కురిసి యు,  పువ్వులా విరిసింది

పుడమితల్లి పురిని,  పువ్వులా నవ్వింది -- శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ


పురుడు పోసెను బీజము పూద్రమందు  

అమ్మమదియు చెమ్మయదియు యంత చూపు

గుండె శబ్దము గానులే  గుర్తు చేయు   

గుండె చప్పుడు లన్నియు గురక మాయ -- శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ


పద్మ రాగ మణుల పలుకు జల్లు కురియు 

మోము మరి పించె  మోక్ష  వెలుగు

దొండ పండు వలెను దోర ఎర్ర మెరుపు

కొత్త వైన పగడ కృపయు కూర్చు -- శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ


కోమల కనుల కళ , కువలయాక్షి పిలుపు

కలువ రేకుల విప్పి, కునుకు చూపె

అబ్బాఎదనుదోచి, ఏడిపించుటవద్దు

ఎరుకగాను ఉంటి , ఎదల సాక్షి -- శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ


పూజ్య భావ మిదియు  పూజకు వచ్చితి

పుడమిలో పదనిస, పద్దు నీకు

ఆయుధాలవసర, ఆరాట మెందుకు

అనుకవగను చూపె, మనసు చాలు -- శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ


మోముమనసు మేలి ముసుగు, మోజు పెంచు

బుగ్గల మెరుపు మతియును, మాయ చేయు

పెదవుల పిలుపు మచ్చిక చేయు చుండె

నాభి కింక తిరుగులేదు యాక్షి కువల  -- శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ

    

మీ భక్తుడు 

మల్లాప్రగడ రామకృష్ణ శర్మ --8

***

హనుమంతుడే కలియుగ జీవన గమనాన్ని చూసి రామునితో తెల్పిన మత్తకోకిల
శ్రీరామ జయరామ, జయ జయ రామ, జానకీరామ,
పట్టాభిరామ, కారుణ్యరామ
మమ్మేలు గుణాభిరామ, దుష్టసంహార రామ, సర్వలోకరక్షణ రామ
చాలు నంటిని లీల ఏలను చింత లేలను ఎప్పుడూ
మేలుచేయుము నిన్ను కోరితి మీదు భక్తితొ ఎప్పుడూ
తేల కుంటిన భాద్యతేయగు తీవ్రజాప్యము ఎప్పుడూ
కాలమే ఇది చూసి చెప్పవు కన్న ప్రేమయు ఎప్పుడూ
వల్ల దన్నను ను మాటమీరను విద్య నామము ఎప్పుడూ
చల్ల నైనను వెచ్చ నైనను చింత లేదును ఎప్పుడూ
కుల్లు లోకము ఏమి చెప్పెద కూడుకష్టము ఎప్పుడూ
జల్లు ఏకము ముంచివేసెను జాతి యందును ఎప్పుడూ
గొంతు విప్పిన మోనముండిన గొప్పతగ్గదు ఎప్పుడూ
కాంతు లొచ్చిన నష్ట మోచ్చిన కాపు రమ్ముయు ఎప్పుడూ
శాంతులన్నియు గోప్ప వారికి స్పష్ట కీర్తియు ఎప్పుడూ
వంత మాటలు చెడ్డమాటలు వాల కమ్ముయు ఎప్పుడూ
వేదశాస్త్రము సృష్టి ధర్మము విద్య మార్గము ఎప్పుడూ
మంద బుద్ధియు జ్ఞాన దాతయు మచ్చ వెల్లువ ఎప్పుడూ
పొందు సాధన మోహ బంధము పోరు వైనము ఎప్పుడూ
బుద్ధి నందున భక్తి యుండిన భుక్తి ఉండును ఇప్పుడూ
శ్రీరామ జయరామ, జయ జయ రామ, జానకీరామ,
పట్టాభిరామ, కారుణ్యరామ
మమ్మేలు గుణాభిరామ, దుష్టసంహార రామ, సర్వలోకరక్షణ రామ
No photo description available.

గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా
బీడులాయె బ్రతుకు బిగుతు వాత
జలపాత శబ్దాలై మదిలోన భావ గీత .. గోవిందా
నీరు బోసెడు కళ నియతి వ్రాత
వినసొంపు విన్యాసం విధి వేద లక్ష్యాల గీత .. గోవిందా
కడకు వేచెను మది కలత మోత
తరుణాన తద్భావం మది మోహ మార్గ దాత .. గోవిందా
ఆకు మొగ్గ పూలు యలసి రాత
సహనమ్ము సంతోష విధి నాద గమ్యాల వాత ... గోవిందా
ఎండు కొమ్మ రాలు యెదురు కోత
మనసంత మాధుర్యం చెలికాడు పిల్చె గీత .... .. గోవిందా
కారుమబ్బు లుడికి కమ్మె బ్రాత
వయసెంత వయ్యారం వలపుళ్లు కూర్చె గీత .... గోవిందా
ప్రళయ గర్జనలతొ పరయు జాత
చిగురంత చిందేసే చిరునవ్వు పంచే గీత ... ... గోవిందా
ప్రమధ మెరుపులన్ని ప్రభలు కలత
సొగసంత సింగారం తనువుల్లొ కల్సే వ్రాత .... గోవిందా
పరవ శించెను కళ పల్ల వజత
విషవాంఛ విడ్డ్యూరమ్ సమయమ్ము నందే గీత.. గోవిందా
వేరు నిండె నులక వెలుగు మడత
మరుమల్లె వాసంతం మనసాయ వీచే గీత .... గోవిందా
మనిషి బ్రతుకు దేలు మదన భీత
మదివాంఛ సౌభాగ్యమ్ వినయమ్ము చూపే గీత ... గోవిందా
కొలువుమదిన దినము కోరు హరిత
మదిశాంతి సౌందర్యం చనువాఎ మెచ్చే గీత ..... గోవిందా
మాధవుండు చూడు మాతను పిత నిత్యమూ ... గోవిందా
సేద తీరగ కథ ఒట్టు శాంతి మాకు నిత్యమూ ... గోవిందా
గోవిందా గోవిందా గోవిందా గోవిందా గోవిందా
***
మీ భక్తుడు
మల్లాప్రగడ రామకృష్ణ శర్మ
May be an image of standing and outdoors


2 comments


ఎలా అన్న ఆడదాన్ని ఒప్పించ లేక భర్త ఆలాపన వేంకటేశా
ఎలా ఎలా ఎలా ఎదలో మర్మ తెలిపేదెలా
ఎలా ఎలా మాయ మర్మం చేధించే దెలా
మగువ మనసు అర్ధం అయ్యేది ఎలా
కాల గతిన బ్రతుకులో భాద పొయ్యే దెలా
కాల మార్పిడి కరుణ ఇదేనా వేంకటేశ
సమయ పోషణే సహజమ్ము అంటె ఎలా
వినయ సంపదే కనకమ్ము అంటె ఎలా
మనిషి భావనే చరితమ్ము అంటె ఎలా
పొగరు గిత్తకు సుఖమేను అంటె ఎలా
కాల మార్పిడి కరుణ ఇదేనా వేంకటేశ
తలచి పిల్చితే - తపనే అంటె ఎలా
వగచి కొల్చితే - వయసే అంటె ఎలా
చిగురు చిమ్మితే - చమటే అంటె ఎలా
తడిసి తుమ్మితే - పిలుపే అంటె ఎలా
కాల మార్పిడి కరుణ ఇదేనా వేంకటేశ
కనులలోన నే - కలలోన అంటె ఎలా
మనసులోన నే - మధువోలి అంటె ఎలా
పిలుపులోన నే - పెదవీను అంటె ఎలా
అడుగులోన నే - అడిగాను అంటె ఎలా
కాల మార్పిడి కరుణ ఇదేనా వేంకటేశ
కధలలోన నే - తెలిపాను అంటె ఎలా
బతుకులోన నే - బతకాలి అంటె ఎలా
మమతలోన నే - మదియేను అంటె ఎలా
జగతిలోన నే - జతయేను అంటె ఎలా
కాల మార్పిడి కరుణ ఇదేనా వేంకటేశ
ఎలా ఎలా ఎలా ఎదలో మర్మ తెలిపేదెలా
ఎలా ఎలా మాయ మర్మం చేధించేదెలా
మగువ మనసు అర్ధం అయ్యేది ఎలా
కాల గతిన బ్రతుకులో భాద పొయ్యేదెలా
కాల మార్పిడి కరుణ ఇదేనా వేంకటేశ
కాల మార్పిడి కరుణ ఇదేనా వేంకటేశ
కాల మార్పిడి కరుణ ఇదేనా వేంకటేశ
మీ భక్తుడు
మల్లాప్రగడ రామకృష్ణ శర్మ
***
May be an image of 2 people

0 comment

సీస పద్యము
హేమాంబరమ్ముయు హేతు వగుట యేను
తురగ వేగ మగుట తూర్పు గాను
వావి వరుస లేక వాదన లేకయే…
See more
No photo description available.

3

******జయ జయ జననీ శివకామినీ *******
జయ జయ జననీ,సకలప్రజ శుభకరణి
మా బ్రతుకులను నడిపించు మానస వతి
వేడెదము నిను కోరేద వేకువగను
చల్లని కృపగా నీ నీడ చిలుకు జనని
జీవనము పని పాటలే జగతి నందు
పనుల కోసమేను పంచెడి ప్రకృతి నీవు
మాకు పనులును కల్పించ మా బ్రతుకగు
ఫలితమే లేక కష్టాలు పగలు రాత్రి
మణలు మాణ్యాలు కోరము మేము ఎపుడు
కనికరముతోను కావుము కరుణ తల్లి
కపటమే ఎరుగని వాళ్ళ కథలు వినుము
ఎల్లర కడుపులను నింపె యదను తల్లి
No photo description available.


సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతుమే సదా !!
ఓం శ్రీ వాగ్దేవ్యైచ విద్మహే సర్వసిధ్ధైచ ధీమహి
తన్నో వాణి ప్రచోదయాత్ !!
యా కుందేదు తుషార హార ధవళా యా శుభ్ర వస్త్రాన్వితా
యా వీణా వరదండ మండిత కరా యా శ్వేత పద్మాసనా
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభి దేవైః సదా పూజితా
సామాంపాతు సరస్వతి భగవతీ నిశ్శేష జాడ్యాపహా !!
ఓం శ్రీ సరస్వతీ దేవ్యై నమోనమః
May be an image of text that says "I Shri Rajashyamala ။I"

9

సీస పద్యము
గురుమూర్తి విధిగాను గుప్తమై జ్ఞానము
ఆచార్య ఆద్యంత ఆత్మ తృప్తి
నిత్య దయానిది నిర్మల భాష్యము
శ్రీ కృపా వీక్షణ శ్రీ కరమగు
అమలాయ ఆదర్శ ఆనంత రూపాయ
జ్ఞాన మే పరమాత్మ జ్ఞాతి యగుట
విధిసదా చారాయ వినయమ్ము వెలుగుగా
అభయంకరాయుడు అందరోడు
తేటగీతి
పొంగి పోర్లడం జలము గా గొప్ప ప్రక్రియ
జ్ఞాన సంపూర్ణ ఆనంద జ్ఞప్తి ప్రక్రియ
మోక్ష మార్గముసహాయ మోను ప్రక్రియ
కృష్ణ నిర్మల మగునట్టి కరుణ ప్రక్రియ
*****
గొడుగుగా పట్టె గోవర్ధనగిరి ఇంద్ర
మదము మనచెను మక్కువ గాను కావ
రమ్మున గల కంస హతమార్చియు సకలమ్ము
ప్రేమతో మధురాపురం ప్రియము నెంచి
దేవ కీ వసుదేవుని దివ్య తనయ
No photo description available.

జ్ఞాపకాల వేదన కృష్ణ జ్ఞాన ప్రేమ
ప్రేమ ఊసులునిండెను ప్రియసి మదియు
చేసినది మర్చిపోలేక చెరిత ఒట్టు
జీవితం సుస్వరాలుగా గీత పల్కె
నువ్వు లేక నిద్ర పిలిచే నిజము తెలిప
కనులు పిలిచేను మత్తుగా కథలు తెలుప
నీదు అనురాగ బంధమై నీడ వలపు
కాచుకున్నాను నీకోస కాల మంత
బొగడపూల పానుపు పైన బోసి నవ్వు
తలకు ఒక ఆసర కలిగి తపము కలయె
వెచ్చదనముకే కావాలి వేదనొద్దు
దుప్పటి పొదానురాగము పుడమి నందు
చలికి నీవు లేక నిదుర చలన మేను
కృష్ణ వేధించకే రామ్ము కృపను పంచు
ముందు యమునతీరమునకు యదను పంచు
ప్రభల వెలుగు లే అందరి ప్రతిభ ❤️కృష్ణ
May be an image of 1 person


*బ్రతుకు..హరిత (కవిత )
*కొమ్మ రెమ్మ ఆకు కోరు పూత సందడి చేసేలే
వీచు గాలి వల్ల విరియు మోత విర్రవీగేనులే
కుసుమ శోభ బట్టి కునుకు గీత కబలించితానులే
చేర్చు ఫలము లన్నిచెట్టు మమత దైవకృపేనులే
చెలువ పక్షులు కళ చేరి ఘనత కధలు చెప్పుటేనులే
తాప మవ్వ గనులె తపన తీత విధివిధమ్ముగనులే
మండుటెండనైన మనుజు ఖాత పొందు కధకదిలే
చేరి చెంత కళలు చెరిత మోత దైవకృపేనులే
కాసు లడగ వలదు కనక కూత జీవిత మలుపులే
చెలిమి పంచ గలగు సేద దూత చరితమగుకలలే
కాల ధర్మమిదియు కడకు నవత ఉద్యమ మెరుపులే
శోభ యంత మవదు సొబగు సీత మేలుకొలుపు కళే
కాంతులన్ని కలసి కరిగి పోత కావడిలా కళే
ఆకు శోభలన్ని యంత వింత చిరునగవు కలలే
కొమ్మ లన్ని పెరిగి కోరి తొలత వీగిపోవుతలలే
No photo description available.

ప్రేమతో శ్రీదేవి, భూదేవి, శ్రీశ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వరుని అందాన్ని వర్ణించడంలో మాటల్లో మధురిమలు ప్రవహించి ఆ సమయం మనసులో హరివిల్లులా నవ వసంతం
పాటలో ఒకరినొకరు ఒక్కరిగా
పల్లవి:-
***
నాలో ఏముందో , నీకే తెలియాలిలే ప్రేయసి
అది నా లోకంలో వున్న, నీవే చెప్పాలిలే ఓ చెలి
మీలో ఏముందో నాకే తెలుసు, పల్లవిగా పలకరించి రావా
నా లోకమైన మీ మనసు హృదయమై పలకరించ రారా
నన్నే చెప్పమన్నారే, ముద్దు ముద్దు గుమ్మలిద్దరూ
మీరు చెప్పే కబురే నాలో ప్రాణం నిలుపులే
నాలో ఆనంద కెరటమై నా హృదినే తాకేనులే
మా ఈ నవ్వుకు నీవే సంకేతమై, చూపులే
నన్నో పువ్వులా మార్చావులే మీ కైపు కౌగిలే
ముద్దుల సంతకమే చేసావులే, మా మనసు లో
దోచావులే, సర్వలోక, సుందరాంగుడవు నీవే
మాకు మాత్రమూ నీవు హృదయ మన్మధుడవే
నన్ను మీ ప్రేమలో ముంచేసారులే,
నన్ను మీ ప్రేమలో ముంచేసారులే,
మైమరిపించారులే మత్తుగా గమ్మత్తుగా,
అణువణువున తట్టి వేణుగానము చేసారులే
మీలో ఏముందో నాకే తెలుసు, పల్లవిగా పలకరించి రావా
నా లోకమైన మీ మనసు హృదయమై పలకరించి రావా
నన్నే చెప్పమన్నారే ముద్దు గుమ్మలిద్దరూ
చరణం:-
జలపాతం సవ్వడులై మీ చిరునవ్వుల వసంతం
నాలో సమకూర్చారులే సుమ ఘంధాలు లే
కళకళ లాడే, మీ కవ్వింతలతో, మెరుపులా, వసంతం
హరివిల్లుగా, నా హృదయాన్ని విరబూసేలా, చేసారుగా
ప్రణయ సంగంలో ప్రేమ నాదమై బృందా వన లహరి లే
నిన్నటి రోజును నేను మరిచిపోయేలా
మావి చిగురులే నాలో పూయించారులే
రాసక్రీడలతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేసారులే
కోయిలగా కోటి స్వరాల వీణనుచేసి మీ టారులే
వసంతమై నవరాగం పలికించారులే
రాస క్రీడలతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేసారులే
తనువంతా మీరై తకదిమల తాళం వేసారుగా
తన్మయంలో స్నానం చేయించారుగా
హృదయ వాంఛను తీర్చారు గా ఇద్ద రై
ఆనందపు డోలికల్లో ఊగి ఆనంద పరిచారులే
పల్లవి:-
***
మీలో ఏముందో నాకే తెలుసు, పల్లవిగా పలకరించి రావా
నా లోకమైన మీ మనసు హృదయమై పలకరించి రావా
నన్నే చెప్పమన్నారే ముద్దు గుమ్మలిద్దరూచరణం:-
***
నాకు దన్నుగా నిలిచారు లే,
నేనే కావాలంటు నాతోఉన్నారులే
కాలానికే ఎదురు నిలిచారు లే
నన్ను గెలిచారులే లహరి లాహిరిలో
ఊరు ఊరంతా మీ వెంట, మీ మంచితనంతో
లోకాన్ని ఏలే మీ సుందర రూపానికి అందరు దాసోహం
మేము మీకు సహాయ లతలమే
ద్వేషాన్ని సైతం ప్రేమించే మీ తత్వానికి
దాసోహం మా హృదయం
అందుకే మీ వెంటే మాకు ఇష్టం, ఆ ఇష్టమే ఈ నవ్వుల తోరణం
మీకు స్వాగతం సు స్వాగతం
పల్లవి:-
**
నాలో ఏముందో , నీకే తెలియాలిలే ప్రేయసి
అది నా లోకంలో వున్న నీవే చెప్పాలిలే ఓ చెలి
మీలో ఏముందో నాకే తెలుసు, పల్లవిగా పలకరించి రావా
నా లోకమైన మీ మనసు హృదయమై పలకరించి రావా
నన్నే చెప్పమన్నారే ముద్దు గుమ్మలిద్దరూ
***************
No photo description available.


0

ధరమము విచారణ సేయు ధరణి యందు
కమలజుగన్నావు కాముని గన్నావు
అమరులగన్నావు ఆదిమహా లక్ష్మి
నీవు పరమాత్మ సన్నిధి నియమ లక్ష్మి
విమలపు పతికి నిత్యమూ విన్నపముయె
జేసి మమ్ము నెమకి ఏలి తీదయగను
కామధేనుతొబుట్టు కల్పకం తొ బుట్టు
దోమటి చల్లిన తోడు చంద్రుడు బుట్టు
నిత్య నిజసిరులిచ్చితీ నిర్మలమ్ము
నేమపు వితరణము నీకె నీడ లగుట
పాలజలధి కన్యవు పద్మసినివి నీవు
పాలపండే శ్రీవేంకటపతితొ దేవి
ఏలిన యతని పెన్నిధి యదన నుండె
యిహపరాలిచ్చె మాపాల ఇష్ట లక్ష్మి
గలిగితివి సంతసము మేలు కామ్య లక్ష్మి
హరికి పట్టపురాణివి రాజ్య లక్ష్మి
ధ్యాన గానము చేసినా జ్ఞాన మిచ్చు
జీవిత మనుగమ్యము వైపు చేర నిచ్చు
సృష్టి సంకల్పము గనులే సమయ మిచ్చు
సర్వుల హృదయాన వెలసియే శిద్ది లక్ష్మి
No photo description available.


కనులు కాయలుగాయగా కమ్ము చుండ
వేచి వేసారితిని శక్తి విపుల నీడ
చూడ గోరేమనసు నాది సూత్రమ గుట
విడిచి వెళ్ళలేకయు మేటి వినయ భక్తి
వినయమిదియు కాపాడుము వేంకటేశ
హేమ హారములేవులే హీన బ్రతుకు
మట్టి గాజులు గాంచితి మనవు బ్రతుకు
కష్టమంతయు చూడమా కాని బ్రతుకు
నాకు దుఃఖమ్ము గానులే నేటి బ్రతుకు
వినయమిదియు కాపాడుము వేంకటేశ
దూర మైన నేర్పుగ తోడు ఊరు వాడ
ఓర్పు కార్య మంతయుతోను ఓడి నాడ
నన్ను మన్నింపరాగము నీడ జాడ
నిన్ను వేడేను ఇప్పుడే నేటి నీడ
వినయ మిదియు కాపాడుము వేంకటేశ
వల్ల మాలిన ప్రేమతో వేడు చున్న
తట్టు కోవగ లేనులే తనము నున్న
లబ్ధయోచన సంతృప్తి లేక యున్న
నీవు ఇంటికేతెంచుర నిజము ఉన్న
వినయ మిదియు కాపాడము వేంకటేశ
మేడ మిద్దెలువద్దులే మీదు భక్తి
భోగ భాగ్యములొద్దులే కోరు భక్తి
నీడ నిచ్చినచాలులే నిజము భక్తి
తోడు ఉండుటే మాకునూ తృప్తి భక్తి
వినయ మిదియు కాపాడుము వేంకటేశ
మీ భక్తుడు
మల్లాప్రగడ రామకృష్ణ శర్మ
No photo description available.
పాటలో ఒకరినొకరు ఒక్కరిగా   
పల్లవి:-
***    
నాలో ఏముందో , నీకే తెలియాలిలే ప్రేయసి 
అది నా లోకంలో వున్న, నీవే చెప్పాలిలే ఓ చెలి 

మీలో ఏముందో నాకే తెలుసు, పల్లవిగా పలకరించి రావా 
నా లోకమైన మీ  మనసు హృదయమై పలకరించ రారా  
నన్నే చెప్పమన్నారే, ముద్దు ముద్దు గుమ్మలిద్దరూ 

మీరు చెప్పే కబురే నాలో ప్రాణం నిలుపులే 
నాలో ఆనంద కెరటమై నా హృదినే తాకేనులే
మా ఈ నవ్వుకు నీవే సంకేతమై, చూపులే
 
నన్నో పువ్వులా మార్చావులే  మీ కైపు కౌగిలే  
ముద్దుల సంతకమే చేసావులే, మా మనసు లో  
దోచావులే, సర్వలోక, సుందరాంగుడవు నీవే 
మాకు మాత్రమూ నీవు హృదయ మన్మధుడవే 

నన్ను మీ  ప్రేమలో ముంచేసారులే,  
నన్ను మీ  ప్రేమలో ముంచేసారులే,
మైమరిపించారులే మత్తుగా గమ్మత్తుగా,
అణువణువున తట్టి వేణుగానము చేసారులే

మీలో ఏముందో నాకే తెలుసు, పల్లవిగా పలకరించి రావా 
నా లోకమైన మీ  మనసు హృదయమై పలకరించి రావా 
నన్నే చెప్పమన్నారే ముద్దు గుమ్మలిద్దరూ 

చరణం:-
జలపాతం సవ్వడులై  మీ చిరునవ్వుల వసంతం 
నాలో సమకూర్చారులే సుమ ఘంధాలు లే 
కళకళ లాడే, మీ కవ్వింతలతో, మెరుపులా, వసంతం  
హరివిల్లుగా,  నా హృదయాన్ని విరబూసేలా, చేసారుగా
ప్రణయ సంగంలో  ప్రేమ నాదమై బృందా వన లహరి లే  

నిన్నటి రోజును నేను  మరిచిపోయేలా 
మావి చిగురులే  నాలో పూయించారులే 
రాసక్రీడలతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేసారులే 
  
కోయిలగా కోటి స్వరాల వీణనుచేసి మీ టారులే 
వసంతమై నవరాగం పలికించారులే 
రాస క్రీడలతో నన్ను ఉక్కిరి బిక్కిరి చేసారులే 
 
తనువంతా మీరై తకదిమల తాళం వేసారుగా 
తన్మయంలో స్నానం చేయించారుగా
హృదయ వాంఛను తీర్చారు గా ఇద్ద రై 
ఆనందపు డోలికల్లో ఊగి ఆనంద పరిచారులే 
 
 పల్లవి:-
***
మీలో ఏముందో నాకే తెలుసు, పల్లవిగా పలకరించి రావా 
నా లోకమైన మీ  మనసు హృదయమై పలకరించి రావా 
నన్నే చెప్పమన్నారే ముద్దు గుమ్మలిద్దరూచరణం:-
***
నాకు దన్నుగా నిలిచారు లే, 
నేనే కావాలంటు నాతోఉన్నారులే 
కాలానికే ఎదురు నిలిచారు లే
నన్ను గెలిచారులే లహరి లాహిరిలో   

ఊరు ఊరంతా మీ వెంట, మీ  మంచితనంతో  
లోకాన్ని ఏలే మీ సుందర రూపానికి అందరు దాసోహం     
మేము మీకు సహాయ లతలమే 
 ద్వేషాన్ని సైతం ప్రేమించే మీ తత్వానికి
 దాసోహం  మా హృదయం 
 అందుకే   మీ వెంటే మాకు ఇష్టం,  ఆ  ఇష్టమే  ఈ నవ్వుల తోరణం
 మీకు స్వాగతం సు స్వాగతం  
 పల్లవి:-
**
నాలో ఏముందో , నీకే తెలియాలిలే ప్రేయసి 
అది నా లోకంలో వున్న నీవే చెప్పాలిలే ఓ చెలి 

మీలో ఏముందో నాకే తెలుసు, పల్లవిగా పలకరించి రావా 
నా లోకమైన మీ  మనసు హృదయమై పలకరించి రావా 
నన్నే చెప్పమన్నారే ముద్దు గుమ్మలిద్దరూ 
***************




ఎవ్వరన్నా వదల నిన్ను ఎల్ల వేళ
ఎంత కష్టమున్నా మది ఏల ఏల 
ఏమి జరిగిన నిన్ను నమ్మేను దేవ
శ్రీని వాసమనసు నీవవె చింత మాది

ఎవ్వరి గుణము నిర్మిత ఎదను తాకు 
ఎవ్వనీ కళ చేరటం ఎల్ల లేవి 
ఎవ్వరూ కానరాకయే ప్రేమ ఇదియె
శరణ కోరి వేడుక ఇది శ్రీనివాస 

ఎవ్వరి భ్రమ వేతలు ఎరుక పరచి 
ఎవ్వరి శరీర నలిగిన ఎదను మార్చి 
ఎవ్వరూ తీర్చలేకయే ఏమి అనక 
శ్రేష్ఠ మన్నది నీ మది శ్రీనివాస 

వైఖరీఇది ఆవలి వైన తీయ 
సాక్షిగా నిలుచున్నది సావ దాన 
శోక కరిగించమంటున్న శోభ ఇదియు 
సుఖదుఃఖమన్నది కళ సూత్ర దేవ 

కాంతినే కోరుతున్నది కాల నీడ 
వెలుగుతున్న వీరులు వల్ల విజయ మేడ 
పెరిగిన తెలివి తెచ్చిన ప్రియము తోడ 
ఆత్మ విశ్వాసమున్నదే వేంకటేశ

కాల గతిలోన ఎలుగెత్తు కళలు తీరు 
మాయలో లీనమై బోగ మనసు తీరు
నిన్నటి వరకు నా మది నీడ తీరు 
నాటకం అర్థ మవకయే నటన తీరు

గుండెలో మాయని గాయము గుర్తు తెచ్చె 
కడలి అలల చలనముగా గాయ పర్చు 
శిథిలమైన జీవితమిది శీగ్ర గతియు 
పదిలమై జ్ఞాపకాలాన్ని పగలురేయి 

చలన కాలఫలించని జీవితమ్ము 
ఉదయమే విచ్చు హృదయమై విద్య ఇదియు 
అందరాని వెలుగు పూలె ఆశ యగుట 
చిక్కు కుంటిని తలరాత చేష్ట ఇదియు 

కనులు మూసిన రేయికి కాల మైంది 
నిస్పృహల నిషీధిగనులె నిజమ నైంది 
కూర్చె ఆనంద ఒత్తిళ్ళు కూడి కైంది 
చెమటచుక్కలురాల్చిన చేష్ట లైంది

ఎవ్వరన్నా వదల నిన్ను ఎల్ల వేళ
ఎంత కష్టమున్నా మది ఏల ననను
ఏమి జరిగిన నిన్ను నమ్మేను దేవ
శ్రీని వాసమనసు నీవె చింత మాది






ఒక పల్లెటూరి అందాల జంట తిరపతి శ్రీ వేంకటేశ్వరుని చూసి వారి సరసంలో సుందర సంభాషణ చోటు చేసుకుంది. మీరు చదవండి పల్లవి:- **** ఏమే ఏమే ఏమందమే ఈ కొండల రాయుడి మందిరం ఏమే ఏమేమే ఏమందమే ఈ వేంకటేశ్వరుని కోయిల అబ్బబ్బా ఏమేమందమే మనసు ఉల్లాస ఉత్త్సా హముగా ఉండిపోవాలని ఉంది ఇక్కడే ఇక్కడే ఇక్కడే ఇక్కడే సన్న జాజులే, మల్లె మాలలు, గులాబీలు అలంకారం నిలువ నీయలేదు అందాన్ని చూడలేక పొయ్యాను సన్నాయి మేళం ఒక వైపు, కోలాటాలు మరోవైపు సిన్న పాపాయి, పెద్దలు సైతం భక్తిగా భజనలే స్వాగతమే పలికినాదంట వారు శ్రీ వేంకటేశ్వరునికి అలివేలుమంగమ్మకు నిత్యకల్యాణం ఇక్కడే ఏమే ఏమే ఏమందమే ఈ కొండల రాయుడి మందిరం ఏమే ఏమేమే ఏమందమే ఈ వేంకటేశ్వరుని కోయిల చరణం:-1 **** ఓ వయ్యారి ఓ వగలమారి సుందరాంగులు ఊరేగింపు అయ్యవారు అమ్మవారు స్వర్గం నుంచి దిగివచ్ఛారే అన్నట్లున్నారు లోకమంతా దాసోహమంటున్నారు, ప్రతి ఒక్కరు లేకుంటే ఇన్ని అందాలు గంధాలై సుఘందాల ఎలా పూసుకుంటాయి. ఇలా సాగిల బడతాయి ఓదేవుడా ఎంతైనా ఏదేదో విషయముందిలే ఇక్కడా ఏ కొంతైనా నాకు చెప్పరాదా మహిమ ఇక్కడా అహ చెప్పేస్తే, ఆహాహ చెప్పేస్తే ఓదేవుడా ఏమి కిక్కు వుంటాదిరో ఇక్కడ ఓదేవుడా నువ్వే ఆహాహా కనుక్కోరా సక్కనోడా ఓదేవుడా నీ వళ్ళంతా ముద్దులతో ముంచేస్తా ఓదేవుడా నా ఒళ్ళోకి నిన్ను ఆహ్వానిస్తా ఓదేవుడా నన్ను కానుకగా తీసుకోరో ఓదేవుడా పల్లవి:- **** ఏమే ఏమే ఏమందమే ఈ కొండలరాయుడి మందిరం ఏమే ఏమేమే ఏమందమే ఈ వేంకటేశ్వరుని కోయిల ********** చరణం:- **** ఎండిన పూల తోట పూసినట్టు ఈ కోలాహాలం చీకటంతా పారిపోయి వెన్నెలంతా వాలినట్టు జనమయం సిత్రాలెన్నో రాత్రికి రాత్రే జరిగిపోయినట్టు విజయం ఎంత మారి పోయావే ఓ దేవుడా మాయ యేదో చేసినావే ఓదేవుడా నన్ను నీ మైకమేదో కమ్మినాదే ఓదేవుడా మాయ ఏమి లేదోయి కాలమట్లా కలిసొచ్చినాది నాకోయి ఓదేవుడా తియ్య తియ్యని పండు రుచి చూసుకో ఓదేవుడా మధురమైన ముద్దులందుకో ఓదేవుడా పల్లవి:- **** ఏమే ఏమే ఏమందమే ఓదేవుడా ఏమేమే ఏమందమే ఓదేవుడా మతిపోయేలా మత్తెక్కించేస్తున్నావే ఓదేవుడా శృతి చేసి పాడిస్తానే.ఓదేవుడా ఓహొహో ఓహోహో ఒహొహో ఓహోహో.. ************** మీ భక్తుడు మల్లాప్రగడ రామకృష్ణ శర్మ




మత్తులో మునిగిన యువతి యువకులను చూడవయ్యా శ్రీ శ్రీ శ్రీ వెంకటేశా వారి బుద్దులు మార్చవయ్యా శ్రీ శ్రీ శ్రీ వెంకటేశా, అమ్మా అలివేలుమంగమ్మా చూడమ్మా
మల్లె పూల నగవది మత్తునే జల్లులే !
కల్లలేని మనసది కరుణనే జూపులే !
చల్ల నైన వినయము విజయమై యూపులే !
వల్ల కాని వయసున వరదలై చూపులే!
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా
నల్ల కలువ కనుగవ నటనలే జేయులే !
విల్లు వంటి నడుమది విస్తులే గొల్పులే !
చిల్లు బడ్డ జలముల కథలకే వేల్పులే!
ఘల్లు ఘల్లుమని కదలికలుగా నిప్పులే!
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా
పిల్ల పలుకదొలకును ప్రేమభరిత సుధలూ !
వెల్లు వెత్తియురుకును విరిసేటి మమతలూ !
తల్లు లైన మనసున మరిపించు శోభలూ!
ఒళ్ళు తెలియని ప్రక్రియలు వాళ్ళ భాదలూ!
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా
చిన్న దాని నడకా చిలుకు హృదిని , పగలే !
వన్నె లాడి విరుపూ వలపు లొలుక ,సెగలే !
కన్న వారి ప్రేమలు మరచి చిలుకు వగలే !
నాన్న మాట మేలును వగచి బ్రతుకు పగలే!
శ్రీ శ్రీ శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశా
మీ భక్తుడు
మల్లాప్రగడ రామకృష శర్మ --13
--((**))--
No photo description available.

9


శ్రీ వెంకటేశ్వర సన్నిధికి ప్రయాణాలలో భక్తులు పాడే మనసు పాట
తగువు లెందుకే మన మధ్య ఒక్కటేగ
కలసి మెలసి బ్రతుకుదాం
ఒక్క టొక్కటి గాచేయు తప్పు లేగ
ఇద్దరమే కలసి తీర్చుదాం
మక్కువ తొ చేయు తప్పులు ఒప్పు కేగఁ
అందరి మెప్పు కోరి చేద్దాం
ఒప్పు అంటూ నె వంటిలొ మార్పు రాగ
ఓం శ్రీ శ్రీ శ్రీ వెంకటేశాయనమ: అంటూ శ్రీకారం
పదవె పోదాము కలలను తీర్చు టేగ
ఆ వేంకటేశ్వరుని కొలిచే సంస్కారం
ఆగు ఆగరా మగడైన తొంద రేగ
చూడాలి మనుష్యుల్లో ఉండే మమకారంj
గుబులు గాఉంది మాటతో వేస పాగ
భగవంతునికి ముందుగ చెప్పాలి నమస్కారం
మాట లేమియు చెప్పిన ఆగు డేగ
కళల నిజాలన్నియు చేయాలి శ్రీకారం
ఇన్ని న్నాళ్ళు కథలను చెప్పి ఏగ
జ్ఞానవృద్ధులు చూపారు సంస్కారం
కన్ను మిన్ను కానక మనసంత యేగ
పెద్దల మాటల లోను చూడాలి మమకారం
దోచి దోబూచు లాడుట దేని కోగ
గురువులకు పెట్టాలి నిత్యము నమస్కారం
విధిని మార్చక ప్రేమను పొందు టేగ
కులాల బంధాలు వదలి పొందు శ్రీ కారం
నాయ కగఉన్న నిన్నునే కోరు టేగ
తప:సంపన్నుల నుండి పొందు సంస్కారం
తపన ఆపక తాపత్ర యములు కాగ
కలసిన మనసులలోన పుట్టు మమకారం
హాస్య మాడుచు మరులను తెల్పు టేగ
పలకరించుటలోను మమతతో నమస్కారం
అబ్బ ఉండవే మధురిమా కలలు ఏగ
పద పద పోదాము వెంకటేశ్వర సన్నిధికి
మాటల ధర్మాలగా శ్రీకారం శ్రీ శ్రీ వెంకటేశా
వయోవృద్ధులు చూపుల సంస్కారం శ్రీ శ్రీ వెంకటేశా
ఇచ్చి పుచ్చుకోవట మాది మమకారం శ్రీ శ్రీ వెంకటేశా
పురోభివృద్కి చూపవయ్యా నమస్కారం తో శ్రీ శ్రీ వెంకటేశా
మీ భక్తుడు
మల్లాప్రగడ రామకృష్ణ శర్మ ---12
--(())--
No photo description available.
ద్విపద - వేంకటేశ్వరుని లీలలు - 11 -- ఆలాపన
రమణీ లలా మవు రమ్యత రాశి
కమనీయ కనులతో కామ్య త రాశి
శ్రీదేవి రాసలీలలు వేళ ఇదియె
వేధన మాపేటి వెలుగు గా ఇదియె
వేణు గోపాలుని వేషము లీల
అణువణువు తపించు యానంద లీల
చిన్న వాడివి యైన చిలిపిగా చేష్ట
వెన్న ముద్దలు ఆరగించావు చేష్ట
మోమున మంద హాసము తోడ పిలుపు
కాముని మరిపించె కధలుగా పిలుపు
నువ్వుల రేడువై నటనలే నేడు
పువ్వుల మధ్యనే పురివిప్పె నేడు
పుత్తడి బమ్మైన పుడమియే దేవి
చిత్తము తెల్పును చన్మయ దేవి
చోరుడై శోభను పొందిన ఘనుడు
వీరుడై విజయము నిచ్చిన ఘనుడు
వేణు గో పాల వే డుకొనగ దేవి
అణు వణు వెరిగిన యానంద దేవి
చిన్న కృ ష్ణానీవు చిరునవ్వునవ్వ
వెన్నదొంగా నాకువెలుగులే నివ్వ
యమునా తటమునయదునంద గావ
మోమున మదుహాస మొలికింపదేవ
పువ్వులా శ్రీదేవి పుత్తడీ బొమ్మ
నవ్వులా ఱేడుకు నచ్చినా వమ్మ
శొభగులా చెలికాడు సోకు లే దోచు
శోభ నే యిచ్చిన చోరుడై దాచు
కాచిన పాలనూ కడుపార గ్రోవి
దోచిన వన్నెలను దొరుకునే తావి
మంతనములు చేయు మధుర కిట్టయ్య
చెంత నే చేరినా చెలిమి కిట్టయ్య
కోపమొచ్చినయమ్మ రోటినే గట్టి
పాపమనుచు మళ్ళ పరుగులే పెట్టి
రేపల్లెలో వెల్గు నంద గోపాల
మాపల్లె సుకుమార మధుర గోపాల
గోవుతఱువులతో గోకులా నంద
కావు యడవినమమ్ముకమలనంద
మీ భక్తుడు
మల్లాప్రగడ రామకృష్ణ శర్మ --11
***
No photo description available.

0 co


ద్విపద - ప్రార్ధనలుగా - శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వర - ఆలాపన
మౌనాలు మదిలోకి ముత్యమై పిలిచె
ప్రాణాలు విధిగాను ప్రగతిగా మరిచె
గుండెల్లొ శబ్దాలు గురుతుల్ని తడిమె
గండాలు తవ్వెడి గళముగా ఇదియె
బాధలే నావెంట బంధమై నడిచె
బేధాల లక్ష్యము భాదగా గడిచె
చిరునవ్వు దీవెన చెలిమిగా మరిచె
మరుమల్లె పువ్వుయే మనసునే విరిచె .. శ్రీ వేంకటేశా
ఆశలే అలలుగా ఆకులై కళలె
నిశలన్ని కాలమై నా వెంట తరలె
తపనతో మనసుగా తరలేది బ్రతుకు
చలచిత్తపు కధలు చైతన్య బ్రతుకు
రాలాయి కన్నీళ్ళు రవ్వలా వెలిగె
పేలాయి బాంబులు ప్రేమలా వెలిగె
చినుకులే నావెంట చెలిమిగా నడిచె
తనువుయె కలలుగా తాపత్ర మొగచె .. శ్రీ వెంకటేశా
నవ్వులే వర్షంలొ నటనలై చెలియె
పువ్వులై పరిమళం పూజ్యమై చెలియె
జల్లుల్లొ తడిసియు జపముగా కలిసె
తల్లుల ప్రేమయు తపముగా కలిసె
దూరంగ రమ్మంటు పూర్తిగా పిలిచె
ఘోరంగ జరిగేటి గొప్పగా పిలిచె
మెచ్చిన చోటంత మెరుపుల్నిపరిచె
విచ్చిన దారంత మిణుకుల్ని పరిచె ... శ్రీ వెంకటేశా
చినుకుగా శబ్దము చీల్చింది చెలియె
వణుకుగా దేహము భంధమై చెలియె
కన్నీటి తరగల కలలగు చెలియె
పన్నీరు చల్లము పగలుగా చెలియె
ఓప్రేమ తెమ్మెర ఓర్పుయై చెలియె
ఓ ప్రేమ మత్తుగా ఓటమి చెలియె
ఓప్రేమ దైవమా ఒనమాలు చెలియె
ఓ ప్రేమ దేవతా ఒడుపుగా చెలియె ...... శ్రీ వెంకటేశా
మీ భక్తుడు
మల్లాప్రగడ రామకృష్ణ శర్మ ---- 10
***
May be an image of text that says "నమో వెంకటేశా నమో తిరుమలేశా మకర కుండలం --కిరీటం చక్ర- -శంకు వైజయంతి హారం కొస్తుభం- వరద హస్తం -- నాగ ఆభరణం దశఅవతారం హారం సూర్య కటారి కటి హస్తం యజ్ఞోపవీతం తులసి మాల good morning సువర్ణ దపీఠం శుభోదయం కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆశీస్సులు పై ఎల్లపుడు వుండాలని మనసారా కోరుకుంటూ.."

శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ-- శ్రీదేవి, భూదేవి నీ ఎట్లా భరించవయ్యా
ఒక్కరినే భరించటం మాకు కష్టము గా ఉన్నది -- శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ
ఓ మేఘ మురిమింది, ఓ రూపు లేక యే
ఓర్పుతో ఉరిమియు, వనుకు వనుకు
పుడమి పై కురిసి యు, పువ్వులా విరిసింది
పుడమితల్లి పురిని, పువ్వులా నవ్వింది -- శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ
పురుడు పోసెను బీజము పూద్రమందు
అమ్మమదియు చెమ్మయదియు యంత చూపు
గుండె శబ్దము గానులే గుర్తు చేయు
గుండె చప్పుడు లన్నియు గురక మాయ -- శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ
పద్మ రాగ మణుల పలుకు జల్లు కురియు
మోము మరి పించె మోక్ష వెలుగు
దొండ పండు వలెను దోర ఎర్ర మెరుపు
కొత్త వైన పగడ కృపయు కూర్చు -- శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ
కోమల కనుల కళ , కువలయాక్షి పిలుపు
కలువ రేకుల విప్పి, కునుకు చూపె
అబ్బాఎదనుదోచి, ఏడిపించుటవద్దు
ఎరుకగాను ఉంటి , ఎదల సాక్షి -- శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ
పూజ్య భావ మిదియు పూజకు వచ్చితి
పుడమిలో పదనిస, పద్దు నీకు
ఆయుధాలవసర, ఆరాట మెందుకు
అనుకవగను చూపె, మనసు చాలు -- శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ
మోముమనసు మేలి ముసుగు, మోజు పెంచు
బుగ్గల మెరుపు మతియును, మాయ చేయు
పెదవుల పిలుపు మచ్చిక చేయు చుండె
నాభి కింక తిరుగులేదు యాక్షి కువల -- శ్రీ శ్రీ శ్రీ వేంకటేశ
మీ భక్తుడు
మల్లాప్రగడ రామకృష్ణ శర్మ --8
**
*
No photo description available.



కరుణించవయ్య ఈ కథ అందరి

కరుణించవయ్య ఈ కథ అందరి
కార్యక్రమంగాను కను విందు పరమై
సర్వ హృదయ కళ సమయమ్ము నీపైన
మూగ పోయిన జీవి తాలను మార్చవా శ్రీశ్రీశ్రీ వేంకటేశ్వరా
వాడి పోయిన ఈ దేహ వాంచ వల్ల
వీగి పోయిన ఈక్షణ వేడి వల్ల
రగిలి పోయె ఈ వయసు రంగు వల్ల
అలసి పోయిన జీవితం ఆశ వల్ల శ్రీశ్రీశ్రీ వేంకటేశ్వరా
అసలు నకిలీను తెలియని ఆట వల్ల
అంధ కారము కమ్మియు ఆత్రమొల్ల
అధర మందించ లేనివాడగుట వల్ల
అందరిలొ చుక్కనయ్యాను అందు వల్ల శ్రీశ్రీశ్రీ వేంకటేశ్వరా
ఎన్నినాళ్ళు ఈ బ్రతుకుయే ఎందువల్ల
వెండి బంగారు జ్ఞాపకం వేదనొళ్ల
తొలకరి కలలు తీర్చణి తొత్తు వల్ల
పరవ శించ వేణు గణము పద్దు లెల్ల శ్రీశ్రీశ్రీ వేంకటేశ్వరా
మనసు మాటఆ రాటము మాయ వల్ల
కలయిక తొలి చూపు లగుట కథల వల్ల
స్వర మధుర పలుకుల తేన సరయు వల్ల
నిశిని నుసి చేయు శశి యైన నీడ వల్ల శ్రీశ్రీశ్రీ వేంకటేశ్వరా
ఒంటరి పలుకు వేదన ఓర్పు వల్ల
నీడగా నిను చేరుటే సేవ వల్ల
ఆశల మనసు ఆరాధ్య అదును వల్ల
ప్రాణ శిలలుగా వలయాలు ప్రీతివల్ల
నిన్నె వేడు కుంటున్నాను శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వరా
మీ భక్తుడు
మల్లాప్రగడ రామకృష్ణ శర్మ....9
No photo description available.