Sunday, 26 May 2024


 


..నేటి ప్రాంజలి ప్రభ లో అమృత ఘడియలో వ్రాసిన కొన్ని పద్యాలు 

రచన.. మల్లాప్రగఢ రామకృష్ణ, Rtd. Accounts officer, హేద్రాబాద్ 


శా..వాణీ భారతి నీలవేణి లలితా వాగ్దేవి విద్యా సదన్ 

మాణిక్యమ్ముగనేస్వరూప సమయా మౌఖ్యంబు దేవీ కృపన్ 

రాణీ తల్లుల కౌను తల్లి జయసంరక్షా స్వరూపిణిగన్ 

ధ్యాణమ్మే నిరతమ్ముగాను శరణం కాపాడు లక్ష్యమ్ముగన్


శా..రక్తం పంచుకు పుట్టినాతనయులు రాజ్యాధికారమ్ముగన్ 

యుక్తంబే కథ యన్నదమ్ముల సహాయుమ్మోను సామర్ధ్యమున్ 

రక్తంయేరులుగానులె యుద్ధముగనే రారాజు కావాలనే 

ముక్తంబేను సహాయ శాంతి సహనం మౌయిష్ట పల్కేనులే


కరుణించేకథ కావ్యమై కదిలె కారుణ్యమ్ము సేవామదీ 

ధరణి తేజమ్ముగనే సహాయమగు దాత్రుత్వమ్ము చూపే విదీ 

తరుణీ తత్త్వము చెప్పలేరగుట తత్భావమ్ము తెల్పా నిధీ 

తరుణమ్మే సహనమ్ముచూపగల ధర్మార్ధమ్ము తెల్పే సుధీ


మనసుంటేనిధి పొందవచ్చును మమేకంమౌను సామర్ధ్యమున్ 

క్షణసౌఖ్యమ్ము గనేవిదీ మనకు క్షేమంమౌను కాలమ్ముగన్ 

తృణమే కష్టముగా సుధీ వినయ తీర్పౌ ధాత మార్గమ్ముగన్ 

మనమేప్రేమ మయమ్మగా కదల మాధుర్యమ్ము కామ్యమ్ముగన్


ధనముకు ధర్మమే గతియు,దారుణ చేష్టల నొర్వనేలరా?

మనమున కాంతి శూన్యమయి, మాటలు రేపును జీవితమ్ములో

కనమిటునేమి పాపమను,కాయము కర్మము చెప్ప రానిచో

ఘనమగు సేవ మార్గమది గాడిని దప్పును వేంకటేశ్వరా!!!


మగువలమాయ పువ్వగుట మానసచోరుడు కాదనలేరు ఎవ్వరుణ్ 

తెగువ బలమ్ము కాయమగు తీర్ధముకోరుటకాదనలేరు నిత్యమున్ 

నగవుల రాణి నాయకుని యాటను పట్టుట కాదనలేరు సత్యమున్ 

మొగలి లతల్ని ఇచ్చినను మోహము పెంచి కాదనలేరు 

భార్యగన్


ఉ.సుబ్బులు పిల్చెనే కళల సూత్రము తెల్పెద రమ్మురాయనన్

సబ్బులు దేనికీ నిపుడు సౌఖ్యము జూడగ నేనుగాగదా

దిబ్బలు పొందకమ్మ నిట తేరగ నాశలు తీర్చి వెళ్ళవే

యబ్బుర మేలనీకుమరి యాకలి తీర్చుట సత్యమౌగదా


దత్తపది.. సుబ్బు,సుబ్బు,దిబ్బ,అబ్బ అనుకొని వ్రాసా


ఉ//..ఈజన వాక్కులౌనుసిరి యి చ్ఛత కల్గియు కర్కసమ్ము గా 

ఈ జన వాహినీ దలపు యీశ్వర లీలను చూ మనస్సుయే 

ఈజన మోహతాపములు యింతి మహత్యము మేలుకొల్పుగా 

ఈ జన తేజమే కడలి దీప్తి రగిల్చగ జీవితమ్ముగన్


సమస్య. పూరణ


"" తండ్రీ! యంచని ప్రాణనాథు పిలిచెన్ తన్వంగి మోహాంధయై "

తండ్రీ నామదిలో వికాస విభవం తప్పేలె యీదృష్టిగా 

తండ్రీ నేనుగనే విధాన విజయం దాహమ్ము ఏమౌనులే

తండ్రీ స్వేచ్ఛ గతీ మతీ వినయమై తన్మాయ మంచీ చెడే


ఉద్ధ ,శ్రద్ధ ,ముద్ద , బద్ధ" ( దత్తపది )--ఈ పదాలను ఉపయోగించి బుద్ధపూర్ణిమ పర్వాన్ని  వర్ణించాలి.


ఉద్ధరణే విధీ జనుల యున్నత లక్ష్యము చేర్చగల్గుటన్

శ్రద్ధ మనోమయమ్ముగు విశాలసహాయము చేయగల్గుటన్

ముద్దర జీవభావమును ముందర యోచన తెల్పగల్గుటన్       

బద్దవి వాదమే మలుపు బానిస మార్పుకు సంఘ నీతిగన్


 కం.ఉద్దరణే విధి విద్యయె 

శ్రద్ధ పలుకు వినయపు బోధ శ్రమనే మార్చే 

ముద్దర బతుకే యేలను 

బద్ధకమే తరిమి సేవ బంధము శోభల్


 తే..శ్రద్ధ పరమాత్మ సేవలే చేయ గలిగి 

ఉద్దరణ జన ఘోషను యుక్తి గాను 

బద్ధకములేని మనసునే పంచ దలచి 

ముద్దర బడి సహాయము ముఖ్య మగును


కం.మనసు గులాబీ చుట్టూ 

తణువే తపనైనముళ్ళు తకధిమి యనగా 

కణమే కదలెడి  కథలగు 

క్షణము గులాబీ తొలిచిది క్షమయే సుఖమౌ

552..కం. అనురాగం మమకారము 

అనుకరణం సహచరణముయానందమదీ 

అనుభవపాఠము తెలపా

తనువు తహతహ ఒకరొకరు తరుణము కథయే 


ఉ.ఆలికి యన్నమాట నిజ మార్గ సహాయముగాను కర్తగన్ 

ఏలిన వాని మాట మదియే నని యెల్లరుగాను నేస్తమున్ 

మాలిని కాదు మాన సమాజము రక్షగ నున్న మూలమున్ 

రాలిన పువ్వు కాయ యన రాటుగ బంధమనేటి దేశమున్


ఉ.పౌర్ణమి నాడు నమ్మకమగు పౌరుల భక్తియు యీశ్వరేశ్చయే 

పౌర్ణమి దర్శనం ఫలిత పావన భావము యీశ్వరీకళే 

పౌర్ణమి నొక్కటే ఫలిత మౌనన శ్రద్దగిరీశ్వరా కళే 

పౌర్ణమి భక్తి శ్రద్దలప్రభావము మోక్షము నమ్మకమ్ముయే


కలికి నవ్వు కనుల బాస కాల తీర్పుయే నమశ్శివాయ 

పలకరింపు పరవశమ్ము పలుకు లోననే నమశ్శివాయ

వలపు చిలక వాలె మమత వాక్కు శుభముగా నమశ్శివాయ

కలలు కలిపె కాల పరుగు కామ్య మగుటయే నమశ్శివాయ

551

553..చైతన్య హృదయాల తత్వం.. 

                  ----


"ఋషి " హృదయ ధర్మం - పరమ తత్వం 

మానవ "రుచి" ధర్మం - ఆరోగ్య తత్వం 

ప్రకృతి "ఋతు" ధర్మం సమయ తత్వం 

పంచభూతాల నిలయ బ్రతుకు తత్త్వం 


ఈ నాలుగు ధర్మాలను ముప్పొద్దులా పాటించడమే 

భారతీయ మూల తత్వం


మనసుకు -ముఖ్య తత్వం.

మనుగడకు -సూక్ష్మ తత్వం 

అనూచానంగా  కాపాడు తత్త్వం 

అనాదిగా మన లోని ఆనంద తత్వం 


అందులోనే ఉంది ప్రాపంచిక మానవ తత్వం 

మహోన్నత ,హిమోన్నత సమ తత్వం 

కష్ట సుఖ బ్రతుకులో దాంపత్య తత్వం

మంచి చెడ్డ సమస్త జీవ - భావి తత్వం -


కుటుంబంలో వార సత్వం-

మాతృభూమి దేశ పౌర సత్వం 

-సమస్తం ఏకం చేసె ప్రేమతత్వం 

ఎప్పటి కప్పుడు ,ఎవరికి వారు మూగ తత్త్వం 


కూలంకషంగా భేరీజు వేయని అమాయకత్వం 

సరి జేసు కోవాలి తమలోని తత్వం 

అందరినీ కలిపిది దైవ తత్త్వం 


బ్రతికి బ్రతికించు చెలిమి తత్త్వం 

మానవత్వం కలిపే శృంగార తత్త్వం 

సర్వ జనుల సంస్కార తత్త్వం 

తెలుగు భాష దారికి పటుత్వం 


కాల మార్పు లో అమాయకత్వం 

దాహం తీర్చుటలో జల తత్త్వం 

నిత్యము ఉడికించు అగ్ని తత్త్వం 

మాయలో జీవించే నాయకత్వం 


అదే మనకు నిత్య నూతన చైతన్య తత్వం

554..రాధమ్మా ... కృష్ణుడేడమ్మా (2016  లో నేను వ్రాసినది  ) 


కను రెప్పల మాటున దాచావు    

పెదవంచున నవ్వును నిల్పావు

బ్రమరమ్ముగ కృష్ణను మార్చావు   

విహరించియు మక్కువ చూపవు      


తలచి వలపుల్లో బంధించావు 

మనసు మలుపుల్లో ఇర్కించావు

తనువు తలపుల్లో తర్కించావు    

పగలు జపముల్తో నమ్మించావు 


మనస్సును మైకంలో ముంచేసావు   

వయస్సును మౌనంలో దాచేసావు  

ఉషస్సును రూపంలో చూపేసావు 

యశస్సును గోప్యంతో పంచేసావు 


నవ్వుల చూపులకు దక్కినావు

పువ్వుల వాసనకు  చిక్కినావు 

రివ్వున ఆశలతొ నిల్చినావు

జివ్వున ఊహలతొ మల్చినావు    


ఆరాధన హారతి అందించావు  

మంత్రంమెదొ నేర్పుగ వేసేసావు 

మాటల్తోను నేర్పుగ దాచేసావు 

ప్రేమల్తోను ప్రార్ధన చేసేసావు   


    కోరుకున్న దాన్ని దరి చూడక

ఆ కోకలు ఎత్తు తావెందుకు

చాటుకున్న దాన్ని ముద్దు చేయక

పెదాలు తిప్పు తావెందుకు


వయసు ఉడుకు అందుకోక

చల్లగా జారుకుంటా వెందుకు

అందుబాటులో నిది జుర్రుకోక

సమయం ఇది కాదంటావెందుకు


నాపై బాణాన్ని సంధించక

ఏదో కావాలని వెతుకుటెందుకు

వథులు సందేహింపక

సవ్యసాచి మరిచావెందుకు


ప్రారంభంలో సంధి చేయక

నీలోని ధైర్యాన్ని మరువకు

ఈరోజు పుష్పం కాదనమాక

గుబురు గుబాలింపు మరువకు


పుష్పమని వెనకాడక

అందుకోవటం మరువకు

గురిచూసి వదలక

ఆలస్యం చేయుటెందుకు

---((**))--

No comments:

Post a Comment