.
201..రాత్రి కురిసింది చిరు జల్లు రాచ బాట
ధాత్రి తడిసింది మరుమల్లె కాల బాట
మైత్రి కలిపింది జలబిందు మౌన ఆట
అత్రి విరిసింది మదిపొంగు ఆశ వాట
.....
202..దుమ్ము దులిపింది గిరికాంతి ఉరకు ఆట
సొమ్ము చెదిరింది విరజాజి సోకు బాట
చిమ్ము కొననుంది వరికంకు చేష్ట ఆట
నమ్ము కొనిఉంది మదిహంగు నమ్ము మాట
....
203..వచ్చె నిదురంది వలవాంతి వాన ఆట
నచ్చె తలపంది కలజాజి నటన బాట
విచ్చె వలపంది అలగెంతు వేగు ఆట
స్వేచ్ఛ సొగసంది మదిలోన సమయ మాట
...
204..దివ్యె వెలిగింది ఒకరవ్వ గీత మాట
భవ్య సడలింది ఒకపువ్వు భక్తి బాట
నవ్య నడిచింది ఒకనవ్వు నటన ఆట
సవ్య పలికింది మనసుగా సరయు మాట
.....
205..స్వాతి చినుకంది ఘనముత్య సాగు ఆట
ఖ్యాతి పెరిగింది నవసత్య ఖర్చు బాట
జ్యోతి పెరిగింది భవబంధ పోరు ఆట
శృతియు అనిగింది మదితత్వ శక్తి మాట
206..సకాల సామరశ్యమే.. సనాతనా మనోహరా
వికాస సామ్యవాదమే..వివాదమేను మాధవా
సకామ బుద్ధి గమ్యమే..సనాతనమ్ము మోహనా
అకాల మృత్య పాశమే..గాంచి మేలు రెక్మిణీ పతీ
......
207..నమామి నందనందనా.. సనాతనామనోహరా!
సమాన మేదినీకు సా ..మి సారసాక్ష మాధవా
ఉమామహేశు నిన్నుగొల్వ నూయలూగె విశ్వమే
రమాసమేత నిన్ను గాంచ రాధ వచ్చె రామయా
......
208..అకాల బుద్ధి మాధ్యమై.. తపమ్ము ఏల రక్తిగా
వికార మేల మోహమై..వినాశ కాల బుద్దిగా
చెకోర పక్షి దాహమై.. వినమ్ర మూర్ఖ శక్తిగా
సకామ లక్ష్య మాన్యమై..సదా సమర్ధ యుక్తిగా
......
209..విలాపమే సలాపమై.. వినోదమే వివాదమై
కళాపమే విధానమై.. కధా మదీ నిదాణమై
ప్రలాపమే ప్రమాదమై.. ప్రభావమే ప్రధానమై
మలామమే సరాగమే .. మనోమయా సమానమే
(పాఠము ... 121 21212.. 121 21212)
ఉదయ శాంతి పాఠము.. "శివోహం "
మల్లాప్రగడ రామకృష్ణ, సహజకవి
210..చూచు వారులేకున్నను చూపు శాంతి
పువ్వు సుగుణ పరిమళము పుడమి శాంతి
పనులు నిశ్శబ్ద లక్షణం పగలు శాంతి
ఇష్టమున్న లేకున్నాను యిచ్ఛ శాంతి
211..ఒకరు ఎదుగుతుంటే స్వేచ్ఛ ఓర్పు శాంతి
అతడు పదిమందికీ ధర్మం అవధి శాంతి
ఒకరు పడిపోయి సహనము ఓడు శాంతి
అతడు చేయు సహాయమే ఆత్మ శాంతి
212..గీత పలుకులు నేస్తమా నీతి శాంతి
కర్తవై కర్మలన్నయు కార్య శాంతి
గాన రమ్యత గమ్యము పాట శాంతి
లోక జీవుడు లోలక లౌక్య శాంతి
213..మంచితనమనే ముసుగులో మాయ శాంతి
గొప్పతనమనే ధనములో పోరు శాంతి
నిత్య నిర్లక్ష్య నడకలో నియమ శాంతి
చేతకానితనముగాను చలము శాంతి
214..మరవగలుగు కృతఘ్నతా మనిషి శాంతి
మనిషి అశ్రద్ధ తత్వమే మనసు శాంతి
తప్పు ఒప్పులుగా కాలతపము శాంతి
బ్రతుకు సుఖదుఃఖమయ్యేను బాధ శాంతి
215..నిను వినా నేనెవరి కొలిచేను శాంతి
తలచ నాదైవమగు రామ తత్వ శాంతి
మోము తో కనరావేమి మోక్ష శాంతి
చెరగనిది ఐశ్వర్యముగను చెలిమి శాంతి
216..కనుల రెప్పల చప్పుడు కాన శాంతి
కవితలయ్యేను యిప్పుడు కాల శాంతి
నవ్వులన్ని గుప్పెట పట్ట నడక శాంతి
వింత నీవు నాకెప్పుడూ వినయ శాంతి
217..అల్లుకున్న మంచువనమే మనసు శాంతి
చేరమంది చైత్రరథమే చేష్ట శాంతి
ముసురు తున్న చలిపవనం ముఖ్య శాంతి
మేనిలోన సుఖ లిఖితం మోక్ష శాంతి
218..నిత్య మూ స్వప్న కథలుగా మిధ్య శాంతి
మల్లె తోటలో స్వర్ణాల మాయ శాంతి
కోటలో సౌధములు కళ కోరు శాంతి
హాయి పాటల స్వర్గాలు హాస్య శాంతి
219..స్త్రీ చరణకమలాలునే శీఘ్ర శాంతి
పురుష పుంగవుకు మనసు పూజ్య శాంతి
ఇరువురి కలలు పండుట యిచ్చ శాంతి
యిద్దరై ముగ్గు రగుటేను ఇంతి శాంతి
220..జాలి దయలేని బతుకు లా జాగు శాంతి
సాటి జీవుల ప్రేమతో సాగు శాంతి
తీర్చ గొప్పమనసుగాను తీర్పు శాంతి
సర్వ జీవ సర్వేశ్వర శాంతి శాంతి
221..వినదగు పని తల్ప వేగముగా సమా
ధనము కలిగి తెల్ప ధర్మముగా మనో
వినయ చరిత తెల్ప విశ్వము గూర్చి స
త్య నయన కల తెల్ప తత్త్వవిదీ సుధా
......
222..ఆణువణువు కధా పరమ్మగుటే సహా
యనటనలు విదీ యశస్సు గనే అకా
ల ననువిన ననే మనస్సు కళా సకా
ల నయనములు గాతపస్సు సమానమే
......
223..మనసు తపన చేరు మాయవలే సదా
మనము ఒకటి అయ్యె మార్గముగా మదీ
తనువు కలసి కొట్ట తత్త్వముగా సుఖా
గుణ గణములు తెల్ప గుర్తులుగా సుధీ
.....
224..కలలు తెలప నిత్య కాలమునే విదీ
తలపులు కళ వల్ల తాపమునే మదీ
కులుకుల కళ వల్ల సూత్రముగా నిదీ
మలుపుల వల కళ్ళ మాయలుగా సుధీ
......
225..కరుణ కథలు ధర్మ కావ్య ముగా ను స
ర్వ ఋణము కథ విద్య రక్తి గనే న స
స్వ రస రమణ రమ్య సౌఖ్యముయేణు ని
మ్మరస సుఖము సర్వ మర్మము తెలిపే సుధీ
.......
226..వలదువలదు,ఓట్ల పండుగ కెప్డు డ
బ్బులు,గొనవలదోయి, ముప్పగు సుమ్మికన్
వల విసరుచు డబ్బుబంచెరు గొప్పగా
బలియగుదువు పంచవర్షము లున్ సుధీ!! 53
....
(వృత్తము న న ర స లగ...9 యతి.)
227..ఒంటిమీదమచ్చలగుర్తు ఓడి గెలుపు
కంటి కింపుయన్నది తెల్ప కాల గెలుపు
మనిషి గాగుర్తు మంచియే మమత గెలుపు
మచ్చలేని వ్యక్తిత్వము మనసు గెలుపు
228..తే. గీ.నమ్ముకున్న నేతలు వంచనమది తలపు
వెంట తిరగరాదని విశ్వసించగలవు
నిలుచు నాయకుండనువాడు నీతి
మంతు
డైన చేయి విడవరాదు దైవ తీర్పు
229..వినయమున్నవాడువినతి విలువ నెంచి
మదము పెరిగిపోక మనిషి మనసు పంచి
మాన్యతగల మంచి పలుకు మార్గ మెంచి
సిరులు పంచ చెలిమితోడు సీఘ్ర మెంచె
230..అలక ఆరని ఇల్లాలు యీశ్వ రూహ
ఏలుబడి యెరుకగుటయే యెల్ల లన్ని
నిత్య ఐశ్వర్యమే వోర్పు నిజము నీడ
ఔను కాదనేది వశిని వాక్కు హృదయి
చంద్రఖండవర్ణణ మాలజయము నిచ్చు
231..జీవాత్మకు:-
👉 జయం అన్నది ఉత్సాహాన్ని అందిస్తే,
👉 అపజయం అన్నది సహనాన్ని పెంచుతుంది
అందుకే జీవుని ఆత్మ పురోగతికి రెండు సరిసమానమైన కీలక అంశాలే.
*----*
232..మానవుని జీవితం మూడు దశలు అనుకుంటే--
➡️ మొదటి దశ - గాడిదలా చాకిరి చేస్తారు.
➡️ రెండవ దశ - కుక్కలాగ కాపలా కాస్తారు.
➡️ చివరి దశ - గుడ్లగూబలా చూస్తూ ఉంటారు.
ఇది మనం ధ్యాన జీవితానికి అనుకరిస్తే --
➡️ మొదటి దశ - ఏ మారుమూల గ్రామానికైనా వెళ్లి ధ్యాన, జ్ఞాన ప్రచారం చేస్తారు.
➡️ రెండో దశ - తన దగ్గరికి వచ్చిన వారికి జ్ఞాన ప్రబోధాన్ని అందిస్తారు.
➡️ చివరి దశలో - సాక్షి తత్వంతో ఆత్మయుతంగా జీవిస్తారు.
-----
233..👉 'పత్తి, దారం, వస్త్రం' లో రూపభేదం ఉన్నా.,
అంతర్గత పదార్థంలో భేదం లేనట్లే;
👉 'మనస్సు, బుద్ధి, చిత్తం, అహం' వ్యక్తీకరణలో తేడా ఉన్న.,
అన్నీ ఆత్మ పదార్థాలే.
*****
234..నోట్లో శని అంటే?
➡️ తినకూడనివి తినడమే నోట్లో శని అంటే
➡️ మాట్లాడకూడనివి మాట్లాడితే నోట్లో శని అంటే
ధ్యాన, స్వాధ్యాయ, సజ్జనసాంగత్యాల ద్వారా 'శని దేవుడు' మటుమాయం అవుతాడు.
*****
235..➡️ అజ్ఞాని దేహం - ఇవతల తీరంలో కదలక ఉన్న పడవ.
➡️ సాధకుని దేహం - ప్రయాణించే పడవ.
➡️ జ్ఞాని దేహం - అవతలి తీరం చేరి కదలక ఉన్న పడవ.
అజ్ఞాని కదలకపోవడం, జ్ఞాని కదలకపోవడం చూడ్డానికి రెండు ఒకేలా కనిపిస్తాయి. కానీ మొదటిది జడం, రెండోది చైతన్యం.
కాబట్టి జ్ఞానికి దేహం ఉన్నా కూడా, దానితో బంధం లేకుండా ఉంటాడు.
****
236..👉 రోజులో ఆఖరి మజిలీ నిద్ర
👉 జీవితంలో ఆఖరి మజిలీ మరణం
👉 జన్మపరంపరలో ఆఖరి మజిలీ మోక్షం
****
➡️ మనం ఆత్మ అనుభవాలను పొందడానికి వచ్చిన "మానవులం" కాదు.
➡️ మానవ జీవిత అనుభవాలను పొందడానికి వచ్చిన "ఆత్మలం".
****
237..నేను అనేది మేనులో ఉన్నప్పుడు - శివం
నేను అనేది మేను నుండి తొలగినప్పుడు - శవం
****
238..మొలక మొలిచిందంటే విత్తనం లోపల ఉందనే అర్థం.
ఆధ్యాత్మిక అన్వేషణ ఉందంటేనే మీలో ఆధ్యాత్మిక శక్తి ఉందనే అర్థం.
****
239..నిన్నెవరు పట్టించుకోకపోవడం - ఒంటరితనం.
నీవు ఎవరిని పట్టించుకోకపోవడం - ఏకాంతం.
***
240..ఒకరు:- అన్ని పరిస్థితుల్లోనూ ఒకే స్థితిలో ఉండలేకపోతున్నాను.
సద్గురు:- ఎప్పుడు 'ఒకటి'గా ఉండాలంటే దాని అర్థం -- ఎప్పుడు, ఏ సమయంలో ఎలా ఉండవలసి వస్తే అప్పుడు అలా ఉండలాని. (సమయానుగుణంగా ఉండాలని)
****
241..తే. గీ. శిశువుగా శక్తి నిచ్చిన సిరుల తల్లి
గొప్ప బలమునిచ్చి ఎదుగులోన తల్లి
నేరుగా వెలుగును పంచె నీడ తల్లి
నడచు వేళ తోడును పంచి నమ్ము తల్లి
242..తే. గీ.అవసరాలాన్ని తీర్చేటి ఆది తల్లి
జీవితమనంగ తెలిపెడి జీవి తల్లి
దర్శనం వల్ల సకలమ్ము దారి తల్లి
దీవెనల దీప వెలుగుగా దీక్ష తల్లి
243..తే. గీ.కొంటె గాడైన యధికారి కోపు డైన
గూట సాక్ష్యము పలకులు గూళ యైన
పాప కారి దుర్మార్గుడు పాపి యైన
నాల్గు డబ్బు లున్ననుచాలు నరుడు గొప్ప
244..తే. గీ. పౌరుడొకనిమాట చెడిన పరువు పోవు
బాధ పడుచుండి తెలిపేద బంధు జనులు
పాలకుండు చెడిన జన ప్రగతి మారు
నమ్మెద నెవరు యేలను నటన జనులు
245..సీ.. అరిషడ్వ ర్గాలలో యడుసు తొక్క వలదు
కరకుగా మెలగక కళలు ణమ్ము
ద్వేషభావముతోడ దీపమ్మవక నుండు
దోషములేంచక కోప మొద్దు
విజయంబు వస్తుంది వినయంబు గానుండు
దుష్టగమన మొద్దు దూర్తు డవకు
సుజనాత్ముండుగా శుభము చే కూర్చుము
శాంతి సత్యంబులు సాధ్య మగును
తే. గీ.. నిత్యదాంతుడవైసాగు నిర్మలమ్ము
ఊహ తెరలు కమ్మగలవు ఉలుకు వలదు
గెలుపు నీదే నిజముణమ్ము గెలవ పలుకు
ప్రాంజలి ఘటించి తెలిపేద ప్రభల గీత
*****
246..సీ..జనుల మన్ననగాను జాతర తలపులై
క్షమయు దయయు యుంచి క్షేమ మెంచు
సాధుమతి మమత సాధన సంపదై
కీర్తితో మనవోయి కీడు వలదు
విలువలన్నియు తెల్పి విద్య సలుపు
ప్రేమను పంచియు ప్రేమ పొందు
బాధలు తొలగించి బంధువై మరిపించు
సేవతో తరియించు స్వేచ్ఛ నీది
తే. గీ. తరతరము వినిపించెడి తప్పు వలదు
మనసుతో స్థిర మైనది మనుగడగుట
ధరణిలో నీదు పేరుగా ధర్మ చరిత
ప్రాంజలి ఘటించి తెలిపేద ప్రబల గీత
***
247..శా..కన్నీరౌ బడబాగ్ని దాహమగుటే గంభీర దావాళన
మ్మున్నీరై కలిగేను ముత్యముగనే ముఖ్యమ్ము చూపేనురా
పన్నీరై పలుకే బయమ్ము ముదిరే భద్రంగ యేలౌనురా
తే నీరే బతుకై నవీన సుఖమే తీవ్రమ్ము విశ్వేశ్వరా
****
248.. మటుమాయేస్థితిసంఘనీతిగను మార్తాండేశ్వరాలీలగన్
నటులయ్యేకళ నానుడేయగుట నాణ్యత్వమ్ము లేకుండగన్
అటులైనా సహనమ్ము మంచిగను ఆశ్చర్యమ్ము గా జీవమున్
ఎటునుండైనను పొందికేయగుట యైశ్వర్యమ్ము గానే సుధీ
*****
249..ఉ..కూతురు కన్నవారి కళ గుర్తుగ సేవలు పుట్టి నింటనన్
మాతను గుర్తుచేయుకళ మానస నేస్తము కన్న వారిగన్
కూతురు కోడలవ్వగనె భుక్తికి రక్తికి మెట్టి నింటనన్
చేతలు రాతలవ్వుటయు చింతలు మాపెడి వేంకటేశ్వరా
***
250..దండము దారిచూపగల ధర్మ మనోజ్ఞత సర్వ వేళలన్
మెండిగ యేది సాగదని మోసము చేయక నుండు నిత్యమున్
ఖండిత వాక్కులే మనకు గర్వము తెచ్చుట యెల్ల రెందురన్
మెండగు సేవలే మనకు మేలుమనస్సగు నాదు పల్కులున్
****
*డెత్ సర్టిఫికెట్:*
ఉన్నతోద్యోగం చేసి పదవీ విరమణ చేసిన ఒక వ్యక్తి అప్పటివరకు తాను నివసించిన అధికారిక నివాసం నుంచి ఒక కాలనీ లోని తన స్వంత ఇంటిలోకి మారాడు. తాను పెద్ద ఉద్యోగస్టుడినని అహంభావం మెండుగా ఉన్నవాడు. ప్రతిరోజూ ఆ కాలనీ లో ఉన్న పార్క్ లో సాయంత్రపు నడకకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఎవరితోనూ మాట్లాడేవాడు కాదు కనీసం వారివంక చూసేవాడు కూడా కాదు. వారంతా తన స్థాయికి తగినవారు కాదనే భావన అతడికి మెండుగా ఉంది.
ఒకరోజు అతడు పార్క్ లోని బెంచ్ పై కూర్చుని ఉండగా మరో వృద్ధుడు వ్యక్తి వచ్చి పక్కన కూర్చుని సంభాషణ ప్రారంభించాడు. ఈ వ్యక్తి మాత్రం ఎదుటివ్యక్తి చెప్పే మాటలను ఏమాత్రం విలువ ఇవ్వకుండా తాను నిర్వర్తించిన ఉద్యోగం, హోదా గురించి, తన గొప్పతనం మాత్రమే చెప్పేవాడు. తన వంటి ఉన్నత స్థాయి వ్యక్తి గతిలేక స్వంత ఇల్లు ఉన్నందుకు ఈ కాలనీ ఉంటున్నట్లు చెప్పుకున్నాడు. కొన్ని రోజుల పాటు ఇలా కొనసాగింది. ఆ ముసలాయన మాత్రం ఓపిగ్గా వినేవాడు. ఒక రోజు ఆ వృద్ధుడు నోరు విప్పాడు.
“చూడు నాయనా! విద్యుత్ బల్బు లు వెలుగుతున్నంత వరకే వాటికి విలువ, అవి మాడిపోయిన తరువాత అన్నీ ఒకటే. వాటి రూపం, అవి అందించిన వెలుగులు అన్నీ మరుగున పడిపోతాయి. నేను ఈ కాలనీలో ఐదు సంవత్సరాల నుండి నివస్తున్నాను, నేను రెండు పర్యాయాలు పార్లమెంటు సభ్యుడిగా సేవలు అందించానని ఎవ్వరికీ చెప్పలేదు ఇప్పటిదాకా.
అంతే .. ఆ అహంభావి మొహంలో రంగులు మారాయి.
ఆ పెద్ద మనిషి కొనసాగించాడు. "నీకు కుడి పక్కన దూరంగా కూర్చుని ఉన్న ఆ వర్మ గారు భారత రైల్వే లో జనరల్ మేనేజర్ గా ఉద్యోగం చేసి రిటైర్ అయ్యారు. ఎదురుగా నిలబడి నవ్వుతూ మాట్లాడుతున్న రావు గారు ఆర్మీలో లెఫ్నె౦ట్ జనరల్ గా ఉద్యోగ విరమణ చేశారు. ఆ మూలగా తెల్లటి బట్టల్లో ఉన్న శివ గారు ఇస్రో ఛైర్మన్ గా సేవలు అందించారు. ఈ విషయం ఆయన ఎవరితోనూ చెప్పుకోలేదు. నాకు తెలిసిన విషయం నీకు చెబుతున్నాను"
"మాడిపోయిన బల్బ్ లు అన్నీ ఒకే కోవకు చెందినవని ముందే చెప్పాను కదా. జీరో, 10, 20, 40, 60,100 వాట్ల ఏ బల్బ్ అయినా అవి వెలుగుతున్నంత వరకే వాటి విలువ. ఫ్యూజ్ పోయి మాడిపోయిన తరువాత వాటి కి చెందిన వాట్, అవి విరజిమ్మిన వెలుగులకు విలువ ఉండదు. అవి మామూలు బల్బ్, ట్యూబు లైట్, లెడ్, సి. ఎఫ్. ఎల్., హలోజెన్, డెకోరేటివ్ బల్బ్.. ఏది అయినా ఒకటే.
అందుకే నీతో సహా మనమందరము మాడిపోయిన బల్బ్ లమే.
ఉదయిస్తున్న సూర్యుడు, అస్తమిస్తున్న సూర్యుడు ఒకేలా అందంగా ఉంటారు. అయితే ఉదయిస్తున్న సూర్యుడికి అందరూ నమస్కారం చేస్తారు, పూజలు చేస్తారు. అస్తమిస్తున్న సూర్యుడికి చేయరు కదా! ఈ వాస్తవాన్ని మనం గుర్తించాలి.
మనం చేస్తున్న, ఉద్యోగం, హోదా శాశ్వతం కాదని తెలుసుకోవాలి. వాటి కి విలువ ఇచ్చి అవే జీవితం అనుకుంటే.. ఏదో ఒక రోజు అవి మనలను వదలి పోతాయనే వాస్తవాన్ని గుర్తించాలి.
చదరంగం ఆటలో రాజు, మంత్రి.. వాటి విలువలు ఆ బోర్డు పై ఉన్నంత వరకే.. ఆట ముగిసిన తరువాత అన్నింటినీ ఒకే డబ్బా లో వేసి మూత పెడతాము.
ఈ రోజు నేను సంతోషంగా ఉన్నానని భావించు, ముందు ముందు కూడా సంతోషంగా ఉండాలని ఆశించు..
మన జీవితంలో ఎన్ని సర్టిఫికట్లు పొందినా.. చివరికి అందరూ సాధించే సర్టిఫికెట్ ఒకటే..
అదే డెత్ సర్టిఫికేట్.
*గౌ.శ్రీ.మల్లాప్రగడ రామకృష్ణ
Rtd. Accounts officer, D T A, AP.
Pranjali prabha, Hyd.97
***
251..*మానవజన్మకు సార్థకత*
****
కన్నతల్లి కడుపులోంచి బయటపడి, తొలిసారి ఊపిరిని పీల్చిన క్షణం నుంచి, పుడమితల్లి కడుపులోకి చేరుకునేందుకు ఆఖరిసారి ఊపిరిని విడిచిపెట్టడం దాకా
సాగే ప్రస్థానం పేరే *నేను*
ఈ *నేను* ప్రాణశక్తి అయిన
"ఊపిరి"కి మారుపేరు. ఊపిరి ఉన్నంతదాకా *నేను*’ అనే భావన కొనసాగుతూనే ఉంటుంది. జననమరణాల మధ్యకాలంలో సాగే జీవనస్రవంతిలో ఈ *నేను* ఎన్నెన్నో పోకడలు పోతుంది. మరెన్నో విన్యాసాలూ చేస్తుంది.ఈ *నేను* లోంచే *నాది* అనే భావన పుడుతుంది! ఈ *నాది* లోంచి నావాళ్ళు, నాభార్య, నాపిల్లలు, నాకుటుంబం, నాఆస్తి, నాప్రతిభ, నాప్రజ్ఞ, నాగొప్ప...
అనేవీ పుట్టుకొచ్చి చివరికి ఈ *నేను* అనే భావన భూమండలాన్ని కూడా మించిపోయి, ఆకాశపు సరిహద్దును కూడా దాటిపోయి, నిలువెత్తు విశ్వరూపాన్ని దాల్చి *అహం* గా ప్రజ్వరిల్లుతుంది.*అహం* అనే మాయ పొర కమ్మేసిన స్థితిలో ఈ *నేను* *నేనే సర్వాంతర్యామిని* అని విర్రవీగుతుంది. నాకు ఎదురే లేదని ప్రగల్భాలూ పలుకుతుంది.
పంతాలతో, పట్టింపులతో, పగలతో, ప్రతీకారాలతో తన ప్రత్యర్థిని సర్వనాశనం చేయడానికీ సిద్ధపడుతుంది. బాల్య,కౌమార,యౌవన, వార్ధక్య దశలదాకా విస్ఫులింగ తేజంతో విజేతగా నిలిచిన *నేను* అనే ప్రభ ఏదో ఒకనాడు మృత్యుస్పర్శతో కుప్పకూలిపోతుంది.
వందిమాగధులు కైవారం చేసిన శరీరం కట్టెలా మిగులుతుంది. మదనోత్సవాలు జరుపుకొన్న దేహం నిస్తేజంగా పడి ఉంటుంది.సుఖభోగాలతో, అష్టైశ్వర్యాలతో తులతూగిన *నేను* చుట్టూ చేరిన బంధుమిత్ర సపరివారపు జాలి చూపులకు కేంద్ర బిందువుగా మారుతుంది.
కడసారి చూపులకోసం, కొన్ని ఘడియలపాటు ఆపి ఉంచిన విగతజీవికి అంతిమయాత్ర మొదలవుతుంది.మరుభూమిలో చితిమంటల మధ్యే సర్వబంధనాల నుంచీ విముక్తి కలుగుతుంది.మొలకుచుట్టిన ఖరీదైన కౌపీనంతో సహా, మొత్తంగా కాలి బూడిద అవుతుంది.*నేనే* శాసన కర్తను, *నేనే* ఈ భూమండలానికి అధిపతిని, *నేనే* జగజ్జేతను అని మహోన్నతంగా భావించిన *నేను* లేకుండానే మళ్ళీ తెల్లవారుతుంది.రోజు మారుతుంది. ఊపిరితో మొదలై ఊపిరితో ఆగిన *నేను* కథ అలా సమాప్తమవుతుంది.
అందుకే ఊపిరి ఆగకముందే *నేను* గురించి తెలుసుకో అంటుంది భగవద్గీత.చితిమంటలను చూస్తున్నప్పుడు కలిగేది *శ్మశానవైరాగ్యం* మాత్రమే.అది శాశ్వతం కానే కాదు. *నేను* గురించిన సంపూర్ణమైన అవగాహనతో ఉన్నప్పుడే, పరిపూర్ణమైన వైరాగ్యస్థితి సాధ్యమవుతుంది. *వైరాగ్యం* అంటే అన్నీ వదిలేసుకోవడం కానేకాదు. దేనిమీదా మోహాన్ని కలిగి ఉండకపోవడం. తామరాకుమీద నీటి బొట్టులా జీవించగలగడం. స్వర్గనరకాలు ఎక్కడో లేవు. మనలోనే ఉన్నాయి. మనిషికి, ఆత్మదృష్టి నశించి బాహ్యదృష్టితో జీవించడమే నరకం అంతర్ముఖుడై నిత్యసత్యమైన ఆత్మదృష్టిని పొందగలగడమ్ స్వర్గం. ఈ జీవన సత్యాన్ని తెలియచేసేదే వేదాంతం. నిజాయతీగా, నిస్వార్థంగా, సద్వర్తనతో, సచ్ఛీలతతో
భగవత్ ధ్యానంతో జీవించమనేదే వేదాంతసారం. అహం బ్రహ్మాస్మి అంటే *అన్నీ నేనే* అనే స్థితి నుంచి *త్వమేవాహమ్* అంటే, *నువ్వేనేను* అని భగవంతుడి పట్ల చిత్తాన్ని నిలుపుకోగల తాదాత్మ్యస్థితిని చేరుకోగలిగితేనే * మానవజన్మకు సార్థకత*
*****
సేకరణ
శుభోదయం
252..*ఎగురుతాయి కానీ అవి పాదముద్రలు వేయవు. మేల్కొన్న మనిషి పాదముద్రలు వేయని విధంగా జీవిస్తాడని బుద్ధుడు చెప్పేది అదే*
***
253..*మనిషి ఎప్పుడూ ముందుకు చూడడు, వెనక్కి తిరిగి చూడడు, కేవలం ప్రస్తుత క్షణంలో జీవిస్తాడు.'*
254..తే. గీ.పాటెరుగని పతికొలువు పలుకులేల
కెరుక పడని కోమలి రతి కినుకు యేల
చెడును జేయు చెలిమివల్ల చింత యేల
నేటికి నెది రీదు మనిషి లెన్న యేల
255..తే. గీ. పరిమళమ్ములే పూలకు పగలు రాత్రి
చదువు వల్ల సంస్కారము జయము నందు
పడతి వల్ల పడక సుఖం పగలు రాత్రి
ధైర్య మారోగ్య సంపద ధరణి యందు
256..తే. గీ. మేకవన్నె పులుల గోల మరువలేవు
మచ్చ తెచ్చుమాటలగోల మాయ లవియు
మురిసిపోకు మాటలగోల ముఖ్య మేల
రాజనీతి యదియు గోల రాజ్య మిదియు
257..తే. గీ.బుద్ధిలేకున్నగాని డబ్బున్న చాలు
పూజ్యడవనివాడు సతముపూజ లేలు
చదవు యోగ్యత లేకున్న పదవి చాలు
గౌరవ రహితుడును పొందు పౌర లేలు
258..ఓటు నమ్మ బ్రతుకుచూడు ఓటు వేసి
చేటు చెప్పలేనితనము చింత వలదు
నోటుపొంది వొటునువేయు వోపి కొద్దు
వేటు పడిన నిజాయితీ వేదనొద్దు
259..విద్య విలువను పెంచియు విజయ మిచ్చు
వినయ విద్యనొనరగుట విశ్వ మందు
విద్య సద్యోగు బుద్ధియు వింత యేల
విద్య యేస్వాగతమునెంచ నిత్యశోభ
****
260..సీ..ఏమి చెప్పెద బిడ్డ యెరుక మెచ్చిన కన్య
యనవలదే ప్రేమ యత్త మామ
బంధుమిత్రులు యెల్లబాధపెట్టుట రీతి
కోడళ్ళు యత్తలు కోర్కె తీర్చు
బ్రతుకుచక్రముయిది భార్యభర్తల లీల
ఏమియనక నున్న యేలు మేలు
ఒకరొక్కరి పలుకు ఓటమిగెలుపు లౌను
సంసార సుఖముయే సంబరమ్ము
తే..వలచి నీదురూపముతల్చి వలపు పంచి
నిలిచి కలలోన కలలాయె నీడ పంచి
మధుర మమతాను రాగాలు మనసు పంచి
ప్రాంజలి ఘటించి తెలిపేద ప్రభల గీత
****
261..తే. గీ. పటిమయెవరిసొత్తునుకాదు పలుకునేర్పు
అద్భుతమనుటేయేలను ఆశలేదు
దైవ నిర్ణయం వ్రాతలు ధరణి నందు
రచనలన్నీ మనసు బట్టి రంగు మార్చు
****
262..తే. గీ.డబ్బుతో బుద్ధివక్రీకరణము చెందు
చదువు డబ్బుతోరాదులే చలవ యేల
శుంఠకైనపదవి పొంద సుఖము డబ్బు
చింత మూలం సుఖము డబ్బు చేష్ట బట్టి
***
263.. *దైవానుగ్రహమునకు దూరమైన ఈ దురదృష్టవంతులు పూర్వజన్మ సుకృత ఫలముగా మానవజన్మ లభించినను, భగవత్కథామృతమును గ్రోలుటమాని సూకరాదులు అశుద్ధమును భుజించునట్లు, హేయమైన సాంసారిక విషయములనే అమితాసక్తితో ఆలకించు చుందురు.*
264.. *ఓ మునీశ్వరా! ఒక క్షణంలో ఆపదలు కలుతున్నాయి. మరొక క్షణంలో సంపదలు కలసివస్తున్నాయి. ఒక క్షణంలో పుట్టుక, ఒక క్షణంలో చావు. ఈ ప్రపంచంలో క్షణికమైనది కానిదేదో తెలుపండి*.
265..* సాంసారిక విషయముల యందు ఆసక్తి గల వారు కర్మాచరణము నందే శ్రద్ధ వహింతురు. వారు వేదవిహితములైన కామ్యకర్మలను మరియు నిత్యకర్మలను సాంగోపాంగముగా ఆచరింతురు.*
266..*మానవ శరీరమును కనుక మనం పరికించిచూస్తే.. యోగికి తోలు తిత్తిలా, కాముకుడికి కోరిక తీర్చేదిగా, క్రూర మృగానికి మాంసం ముద్దలా కనిపిస్తుంది. పదార్థం ఒక్కటే అయినా వారి చూపును, భావమును బట్టి పలు రకాలుగా కనిపిస్తుంది. కనుక వ్యత్యాసం మన చూపులోనే ఉంది*.
267..* తన స్వంత అనుభవం నుండి, ప్రవీణుడైన యోగి తన కరణ శక్తిని లేదా ఇష్టానుసారంగా వాస్తవికతను కలిగించే, సృష్టించే లేదా వ్యక్తీకరించే శక్తిని గుర్తిస్తాడు*.
268..తే. గీ. సాగ వలయు కవితలన్ని చవుల కింపు
స్నానమాడ గల సరసి సాగు యగుచు
పరగ నందు పద్యమెరుపు పడచు యగుచు
సరస మానవుండు మనసు పరవశించ
269..*కం..కక్కేకాకికి కాకా
కోకకు కోకాక కిక్కు కేకై కేకై
కక్కీ కాకా కెక్కే
కొక్కొక్క కాకి కకకక కోకకు కోకై
అర్ధం.. కక్కే.. నాయకులు వాగ్దానాలు
కాకికి... జనులందరికి
కాకా.... బాకా ఊదాడు
కోకకు...వస్త్రాలు
కోకాక... గొప్పకు మాటలు
కిక్కు... అదోతృప్తి
కేకై. కేకై.. అరుపులే అరుపులు..
కక్కీ... ఓట్లు పొంది
కాకా... పదవి
క్కేక్కే... పొందే
కొక్కొక్క కాకి కకకక కోకకు కోకై
ఎవరికీవారు కక్కుల్లా అరుస్తూ కొకలెత్తి ఎగురుటయే
270..కలి అంటే అంధకారం అనగా అజ్ఞానం.
కలియుగాంతం అనగా అజ్ఞానం నశించడం.
మరి దీనికి మార్గం - ధ్యానం.
మందారం.. శంకరా
271 నిన్న రూపమొకటి మొన్నొక వేషమ్మే శంకరా
కన్ను గప్పు పాత్ర లెన్ని నాళ్ళు భక్తియు శంకరా
పన్నుగడ నటనము లెన్నైన మూన్నాళ్ళె శంకరా
సున్న తుట్టతుదకు భక్తితొ నీకడకే శంకరా
272..విభూతి నీ పవిత్రత మాకు పొగడ తరమ శంకరా
నీ శక్తియె సృష్టిలో నిలుచుటే సతము శంకరా
నీవు నాలో నుండి నన్నూ నడిపించు శంకరా
నిన్ను ప్రార్ధిస్తూ చరితుడనగుదునే శంకరా
273..నన్ను జూడయ్య నా మనస్సు నీది శంకరా
మిన్ను నున్నా నె మన్ను మిమ్ము కోరె శంకరా
కన్ను లన్నీ కలౌను కాల తీర్పు శంకరా
పన్ను పోటే విదీ సుపాద్య మేను శంకరా
274..నేనుచేసేది భక్తి నీ దయేను శంకరా
మాను కోలేను యుక్తి మాసమస్య శంకరా
మాను లాగే సహాయమేను మాయ శంకరా
కానుకే నీదయా స్వకార్య సేవ శంకరా
275..మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరుచిరునవ్వులు
కురిసే తలపులు కులుకే వలపులు కళకళ నవ్వులు
ఉరిమే ఉరుములు సరిసరి నటనల సిరిసిరిమువ్వలు
తరిమే తపనలు తకధిమ సరిగమ లుకలుక గువ్వలు
276..పరవశాన శిరసూగంగా ధరకు జారిన శివగంగా
కరువు తీర మనసూగంగా కళలు తీర్చెను మనగంగా
ఆనంద వృష్టి లో మునగంగా అందరి తృప్తి శంకరా
ఆనంద దృష్టి లో కరగంగా అందరి తోడు శంకరా
277..అసూయకు ఆనందమే దూరం కదా శంకరా
అహానికి అనుబంధమే దూరం కదా శంకరా
ఆత్మీయతకు త్యాగమే దూరం కదా శంకరా
ప్రేమకు ప్రేమే కోర్కెల దూరం కదా శంకరా
278..కనిపించునది యంత కాల గర్భముయే శంకరా
గర్వమ్ము నాశంబు నొందునూ మనసా శంకరా
నాశమేమియు లేని బ్రహ్మమే నీవని శంకరా
త్వరితముగ తెలిసికొంటి మనసా "ప్రార్ధన శంకరా
279..ధనమజనముయవ్వనమువీటితొ గర్వముశంకరా
కనులు తెరిచి చూసే లోపు సర్వ మాయ శంకరా
చుట్టూ మాయల లోకం వివేక మేది శంకరా
బ్రహ్మ పదానికి మూల తూకం శోకం శంకరా
280..నశ్వరము తనువు, సిరులు నశ్వరాలు గా శంకరా
కాచుకొనియుండు సతతము కాలుడకటయె శంకరా
కాన, త్వరగ చేయ ధర్మకార్యములను శంకరా
మనసుతొ వినుమయ్య మల్లా ప్రగడ పలుకు శంకరా
281..జ్ఞానంలో ఏడు స్థితులు ఉన్నాయి. వీటిని "సప్త జ్ఞాన భూమికలు" అంటారు.
1. శుభేచ్ఛ:- నాకు బ్రహ్మజ్ఞానం కావాలి అన్న ఇచ్ఛ. (తీవ్ర ఆకాంక్ష)
2. విచారణ:- బ్రహ్మ జ్ఞానం ఏ విధంగా పొందాలి? అన్న మీమాంస. బ్రహ్మ జ్ఞాన ప్రాప్తి విధానమే - ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అని తెలుసుకుంటారు.
3. తనుమానసం:- తత్ సాధనలో నిమగ్నులై ఉండడమే తనుమానసం.
4. సత్త్వాపత్తి:- శుద్ధ సాత్వికం సాధించడమే సత్త్వాపత్తి. యోగి అయిన స్థితి.
5. అసంసక్తి:- భౌతికతపై అనాసక్తి పొందిన స్థితి. తామరాకుపై నీటిబొట్టు వలె వ్యవహరిస్తారు.
6. పదార్థ భావని:- ఆత్మజ్ఞానాన్ని పొందుతారు. సవికల్ప సమాధి స్థితి. దివ్యచక్షువును ఉత్తేజింప చేసుకుంటారు.
7. తురీయం:- జాగ్రత్, స్వప్న, సుషుప్త స్థితులను దాటినవాడు. నిర్వికల్ప సమాధి స్థితి. అందరినీ యోగులుగా, ఆత్మ జ్ఞానులుగా మలచడానికి కంకణం కట్టుకుంటారు.
282..తే. గీ.యేది మార్పు చెప్పగలరు ఎప్పుడైన
కాదు సలహాలు అనుకరణాచ రణయు
వాక్కులొద్దు సంపదకు సహాయ మెంచి
మనసు యభివృద్ధి సంభవ మార్గ మెంచు
283..దశరధ రామ జానకి పదాలచెబట్టిన రామ నాది పు
ర్ష శరణమేను నామము చరిత్ర జయమ్ము జపమ్ము మూల పు
ర్ష సమయ రామ బ్రోచుము నిరంత రమౌను లె సౌమ్య రామ నీ
వశమగు మేము నిత్య విధి వాక్కుల శాంతిగ నీవె దిక్కుగన్
284..*నృత్యకారుని జీవితం తప్పటడుగు తోనే మొదలవుతుంది.
ప్రతి గాయకుని జీవితం అపస్వరం తోనే మొదలవుతుంది .
కాని ప్రతి ఆధ్యాత్మిక సాధకుని జీవితం మాత్రం 'పూర్ణత్వం' తోనే మొదలవుతుంద*.
285..*జ్ఞానం కలిగాక అవగాహన దృక్పథంలో మార్పు కలుగుతుంది మరియు అంతకుముందున్న 'పరుగు' ఉండదు.
286..*జగత్తులో నాస్తికుడు ఉండడం కాదు, జగత్తే నాస్తి... అసలు జగత్తే లేదు.*
జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితిని దైవ ప్రసాదంగా స్వీకరించు.ఆధ్యాత్మికం అంటే ఇదే.
287..*రమణుడు తన 16 వ ఏటనే తన దేహభావన నుంచి బయటపడ్డారు.
కానీ రమణుణ్ణి ఆ దేహం వరకే పరిమితం చేసి ఆరాధిస్తున్నాము.
తలచేవాడే దేవుడు. తలంపబడేవాడు కాదు.
కరిబృంహితము - భ/న/భ/న/భ/న/ర
21 ప్రకృతి
==
UI IIII UI IIII UI IIII UIU.. యతి.13
288..మత్తు వలననె బాధ కలుగుట మందమగుటయు దాహమై
ఎత్తు లగుటయు యేడ్పు లగుటయు యెల్ల కళలలొ భారమై
చిత్తు బ్రతుకున శాంతి మరచియు చీమ బ్రతకగు లక్ష్యమై
పొత్తు బలిమియు సేవ చెలిమియు పోరు కలిమియు విశ్వమై
289..*నిన్ను గనఁగను నాదు మనసిట - నేఁడు ప్రియతమ వేచెనే
వెన్న మనసున ప్రేమ వ్యధలకు - భేషజమునకుఁ గాఁచెనే
కన్నుగవ కది కష్టతరముర - కాలమది మెల సాఁగెనే
మిన్ను మినమిన లాడె నుడువుల - మించు తళుకుల రాశులై
==
290..నింగి కలుషితమైన నుడుపము - నేత్రముల కగుపించునా
రంగు లెగసెడు వేయి విరులిఁక - రాజిలునె మన నేలపై
పొంగి పొరలెడు నీరుగల నది - పూర్ణముగఁ గృశియించునే
శృంగములు పెను నిప్పు శిలలగు - శీగ్రముగ భరతావనిన్
==
UII III UII III UII III UIU.. యతి 13..
291..*కాలము మనది కర్తలు మనము గాధలు మనవి నేస్తమై
జ్వాలలు వలదు సేవలు జరుపు జాప్యము వలదు దాహమై
మాలల వలన దేహము బరువు మాయలు జరుగు మోహమై
వేళల మనసు వెచ్చని కళలు వేకువ పరము ధర్మమై
292..*మానిని పిలిచె మాధవ కనుము - మానస మదియు నూఁగుఁగా
నీనగు మొగము నెమ్మది మదికి - నిర్మల మగుచు సాఁగుఁగా
వానగఁ గరుణ మెల్లఁగఁ గురియ - వంతలు ముగియుఁ జల్లఁగా
ప్రాణము నొసఁగఁ బల్లవి పాడుము - భావియు నగును వెచ్చఁగా
విధేయుడు -
శుభోదయం
293.. దేవుడే జీవుని వేషం వేయడం.
➡️ వేషం వేసిన సంగతి మరచి దేవుడిని వెతకడం.
➡️ గురువు ద్వారా ఆ గుట్టు తెలుసుకోవడం.
అనాదిగా సాగుతున్న ఆట ఇదే.
294.. 'నేను' అని ఆపితే - దేవుడు
నేనును సాగదీస్తే - జీవుడు
తనలోని విషయాలతో పాటు తనను కూడా 'చెత్త'గా భావించేవాడే నిజంగా అవధూత.
295: మరణానికి ఆవల నీవెవరో నీవిప్పుడు కూడా అదే.. అని తెలుసుకుంటే అదే జీవన్ముక్తి.
నాకు ఇది కావాలి అని దేవుడిని అడగడం - అర్ధన.
అడగకపోవడం - ప్రార్థన.
అడిగితే మన స్థోమతకు తగ్గట్టు ఇస్తాడు.
అడగకపోతే ఆయన స్థోమతకు తగ్గట్టు ఇస్తాడు.
296..'సృష్టి' దేవుని క్రీడ అని నీవు కనుగొన్న వెంటనే ఆ దేవుడు నీవే అవుతావు. ఆ క్రీడ నీదే అవుతుంది. అప్పటి వరకు విధి (స్క్రిప్ట్) చేతిలో నీవొక కీలుబొమ్మవు అంతే.
297.. సుషుప్తిలో తాను 'ఏకంగా' ఉంటాడు.
➡️ స్వప్న, జాగ్రత్తుల్లో తాను 'అనేకంగా' ఉంటాడు.
👉 సుషుప్తిలో ఉన్న తనకు 'దేవుడు' అని పేరు.
👉 స్వప్న, జాగ్రత్తుల్లో ఉన్న తనకు 'జీవుడు' అని పేరు.
298.. సదా 'ఆత్మగా ఉండు' అని అనడం కంటే గొప్ప ఉపదేశం ఆధ్యాత్మిక వాఙ్గయంలోనే లేదు.
'మోక్షం'లోనే ఉన్న దేవుడే..
299..మానవుడిగా దిగివచ్చి ఇక్కడ పాపపు పనులు చేసి, మళ్లీ మోక్షం కోసం ఏడవడం ఎంతటి అజ్ఞానం.
300..నల్లా నల్లని వాడు కృష్ణుడుదయా సాకార ధర్మాత్ముడే
చల్లా చల్లని చూపుతో మనసునే చేదించు విశ్వాత్ముడే
పిల్లా పాపల తోను యాడు కరుణా ప్రేమస్వ భావాత్ముడే
కల్లాలే యనకా జయమ్ము తలపే కార్యార్థి కృష్ణుండు యే
301..ఉ..పద్యము యూహగా పలుకు పాఠముయేమది సర్వమై యగున్
గద్యకధా సమమ్ముగను గాధలు తెల్పుట కావ్యమే యగున్
హృద్యభవమ్ముగా కదలు హాయిగ సాగెడి జీవమే యగున్
మద్యవయస్సుగాసకల మార్గము నెంచుట ధర్మమే యగున్
302..తే. గీ.ప్రేమలో బంధ మనసుగా ప్రీతి గలుగు
ప్రేమలో దేవుడే బంధ ప్రీతి గలుగు
బయట ప్రేమమయంగాను బాధ్యతయగు
లోపల నిరామయంగాను నీడ గలుగు
303..కాలదేశములకతీతమైన దాని గురించి., దేనికీ
తెలియని విషయానికి తలలు పట్టుకొనుట... దేనికీ
కాలదేశములలో మాట్లాడుకుంటున్నాము.
సమస్య తెగదు...దేనికీ
నిజము, నిజాయితీ, నిబద్దత లేని వాక్కు సమస్య తెగదు... దేనికీ
304..తే. గీ.లోకమందు యాకలిగాను లొల్లి బాధ
ఏమి లేని జనుల పోరు కెప్పు బాధ
అవని యందు చూడమనిషి యాశ బాధ
అన్ని యున్న ప్రజకు తృప్తి లేని బాధ
305..బతికి యుండగా కాల్చేది బ్రతుకు చింత
స్థితిగతి చితి మంటలుగాను సిరుల చింత
పరయనుకరణ మనసుయే పాప చింత
పరమగతికి చేర్చేదియే ప్రాణచింత
306..నీరు వేరు, అల వేరు అన్న నానాత్వ బుద్ధియే - అజ్ఞానం.
భార్య వేరు, భర్త వేరు అన్న నానత్వ బుద్ధియే - అజ్ఞానం.
'నీరే అల' అన్న ఏకత్వ బుద్ధియే - జ్ఞానం.
భార్య భర్త అన్న ఏకత్వ బుద్ధియే- జ్ఞానం.
307..ఏమనిచెప్పలేను మనసేవిధిమార్గముమారిపోవుటే
ప్రేమనుపంచగల్గుటసుపాఠ్యమునిత్యముభక్తిగల్గుటే
మామదిసత్యపల్కగుసమానసహాయముయుక్తియవ్వుటే
క్షేమముకోరిసేవలగు కామ్యముకర్తగ సవ్యముహరీ
308..గురువు ఐశ్వర్యం (జ్ఞానము) బిడ్డలకు వెళ్లదు, శిష్యులకు వెళ్ళిపోతుంది.
బిడ్డ అయినా సరే, శిష్యుడిగా ఉంటేనే జ్ఞాన ఐశ్వర్యం పొందగలరు.
309..: ప్రశ్న:- ఏది బంధం? ఏది మోక్షం?
సద్గురు:- ఉన్నది అంతా భగవద్రూపమే అని ఎరుగుట మోక్షం., మరచుట బంధం.
310....: పిచ్చివాడు, అవధూత ఒకలాగే కనిపిస్తారు.
➡ పిచ్చివాడు - ఆలోచన చేయలేనివాడు
➡ అవధూత - ఆలోచనతో పని లేని వాడు
311..ఓర్పు అనేది దాహం
దాహం అనేది దేహం
దేహం అనేది మోహం
మోహం అనేది అహం
312..ధ్యానం అనేది కొద్దిగా తపస్సు.
తపస్సు అనేది మోక్షానికి ఉషస్సు
ఉషస్సు యనేది హృదయ వయస్సు
వయస్సు తపస్సు అనేది పూర్తిగా ధ్యానం.
313..చేరేది - నిర్మల జ్ఞానం
మారేది - లోకజ్ఞానం
కూరేది - విషయజ్ఞానం
ఊరేది - ఆత్మజ్ఞానం
314..నీకు నీవు ఒక బారెడు దూరంలో ఉండడం అలవాటు చేసుకో..,
ఆత్మ, పరమాత్మ అర్థాలు వాటికవే తెలుస్తాయి.
315.. చిలికినపుడు
మజ్జిగనుంచి వెన్న వచ్చినట్లు,
వెన్న కాచగా నేయి వచ్చినట్లు
నిజంచెప్పేందుకు కోపం వచ్చినట్లు
కోపంలో కూడా మంచి మాటలున్నట్లు
316.కోర్కెల మధ్య జరిగేది మానవ జీవితం
రుణవిముక్తిని చేయమని అడగటం లోకధర్మం
ఈ భవనం ఎందుకు కట్టావు? అని చీమ మనల్ని ప్రశ్నించడం
ఈ సృష్టి ఎందుకు చేశావు? అని మనం దేవుణ్ణి ప్రశ్నించడం రెండూ ఒకటే.
*పరమాత్ముని బుద్ధిని మన బుద్ధితో గ్రహించలేం.*
317..కర్త, కర్మ, క్రియ మూడు ఈశ్వరుడే అని ఉన్నప్పుడు ఇక అయోమయానికి తావుండదు. ఏ ఆటుపోట్లు లేక జీవిత ప్రయాణం సాఫీగా హాయిగా సాగిపోతుంది.
318..కర్ణుని జన్మ రహస్యం -

తెలియనంత వరకు సూత పుత్రుడు.

తెలిసాక కుంతీపుత్రుడు.
319.. జగత్ స్వరూప రహస్యం -

తెలియనంత వరకు మిథ్య నేను.(కెరటం/ఆభరణం)

తెలిసాక అసలు నేను (సముద్రం/బంగారం)
320..ప్రతి అనుభవము., మన జీవితాన్ని మనకు ఒకానొక ప్రత్యేక కోణంలో చూపిస్తుంది.
ఎన్ని రకాల అనుభవాలు సంపాదిస్తే... అంతటి "సుసంపన్న ఆత్మ" అవుతుంది.
***
321..సుఖంలో కళ్ళు మూసుకుపోతాయి.
దుఃఖంలో కళ్ళు తెరుచుకుంటాయి.
***
322..తలుపులు మూసిన గది భద్రం.
తలపులు ఆగిన మది బ్రహ్మం.
***
323..సీ..మండుటెండన రాణి మంచులా కరగించె
మర్యాద చూపులే మన్ననయగు
వ్యాధిగా ప్రేమయే వైరాగ్య సమయాన
మంచెపైన మనసు మడత పేచి
అలసిన వేళలో అనురాగ ఆత్మీయ
మల్లె పందిరి గాదె మమత లొసగె
మన్నన పొందిన మార్గ పంచాయతీ
ఇచ్చి పుచ్చెది ప్రేమ యిష్ట మార్గ
గాలి సవ్వడి చేర్చెడి కాల మాయ
పిలిచి కూర్చుండ బెట్టును ప్రేమ గాను
చుట్టుపక్కమనసుయేల చూడ రాగ
మంచి మాట నొసగి సాగె మాయ ప్రేమ
**-**
324.. సీ..నిన్ను పరిచయమ్ము నీలమేఘము లీల
విశ్వానికిపరిధి విద్య వర్ష
నిత్యధిశావిధి నిర్దేశిత కళగా
మేఘ వాక్కు మెరుపు మిధ్య వర్ష
మార్గాన్ని సుగమమ్ము మనసును శుద్ధిగా
ప్రతి పనిలోననే ప్రగతి వర్ష
వెలకట్టలేనిది వినయ మేఘపువాన
మోనాన్ని ఛేదించు మోక్ష వర్ష
మేఘ సందేశమాయిది మేలు జేయ
తొలకరి పులకరింపుగా తోడు జేర్చు
చల్లదనముతో జతజేర్చ చలవ జేయ
అంకురాలుయెదగ జూపు ఆశ వర్ష
****
325..సంద్ర జలముల యడుగునా సహజ రత్న
జీవ యాత్ర సంగమముగా గీత రత్న
అలలు కదులుతూవడ్డున ఆట రత్న
బ్రతుకు మానవత్వము నెంచి బంధ రత్న
****
326..*మౌనం*
మౌనం.. ...నిన్ను నీకు పరిచయం చేస్తుంది...
మౌనం... ఈ విశ్వానికి నిన్ను పరిచయం చేస్తుంది...
మౌనం... దిశా నిర్దేశాన్ని గుర్తిస్తుంది...
మౌనం... వాక్కు సరి చేస్తుంది....
మౌనం... మార్గాన్ని సుగమం చేస్తుంది...
మౌనం.. ప్రతి పనిలోనూ విజయాన్నందిస్తుంది...
మౌనం... మన మనస్సును శుద్ధి చేస్తుంది...
మౌనం... వెలకట్టలేని ఆస్తి. మౌనం...ప్రతి ప్రశ్న కు ..
మౌనం లోనే సమాధానం లభిస్తుంది...
మౌనం... మౌన ధ్యానం ఈ సృష్టిలో ఉన్న సమస్త లోకాలకు నిన్ను తీసుకెళ్తుంది....
మౌనం.. మౌనం విలువ తెలియక మానవుడు శారీరకంగా, మానసికంగా ఎన్నో కష్టాలు గురవుతున్నారు....
మౌనం విలువ తెలిసిన వాడికి ఏ చింత లేదు...
ఒక్క రోజు మౌనం నెల రోజుల జీవితాన్ని సరిచేస్తుంది....
మౌనం... ఒక సంవత్సర మౌనం ప్రస్తుత జన్మని సరిచేస్తుంది...
మౌనం... ప్రస్తుత జన్మ మౌనం గత వందల జన్మల పాపాలను
కడిగేస్తుంది.
మౌనం..ఆత్మకు మోక్షాన్నందిస్తుంది.మనస్సు ఆత్మను పట్టుకోవాలన్నా ..
ఆత్మ స్వస్థితి లోకి రావాలన్నా గొప్ప ఆయుధం మౌనం...
327..స్థూల దేహము కన్నా జ్ఞానేంద్రియములు అధికము.
జ్ఞానేంద్రియముల కన్నా మనస్సు అధికము.
మనస్సు కంటే బుద్ధి బలశాలి అధికము.
బుద్ధి కన్నా ఆత్మ అధికము.
కావున ఇంద్రియములను మనస్సు చేత నిగ్రహించి, అట్టి మనస్సును బుద్ధిచే నియమించి,
ఆ బుద్ధిని ఆయుధముగా ఉపయోగించి ఆత్మను చేరవలెను.
328..ఈశ్వరుడే జీవ జగత్తుయినాడు.
పాలు పెరుగు అయినట్టు కాదు., బంగారం నగ అయినట్టు. మూల వస్తువు సదా భంగం లేనిదే.
329..తొలి దశలో:- కల కలగా, మెలకువ మెలకువగా అనుభవంలో ఉంటుంది.
చివరి దశలో:- కల మెలకువలు రెండు మెలకువగా అనుభవంలో ఉంటుంది.
****
330..1. : మైండ్ (mind) లేదా మనోశక్తి (mind power)కి మెదడు (brain) కి మధ్య తేడాలేంటి ? ఇవి నిర్వహించే పనులు ఏంటి?
A. 1) brain (మెదడు) అనేది దేహంలో ఒక అవయవం.
గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, ప్రేగులు, కళ్ళు ఎలాగో మెదడు కూడా ఒక అవయవం. శాస్త్రవేత్తలు మెదడును ముక్కలుగా చేసి పరిశోధన చేశారు. చిన్నమెదడు, పెద్దమెదడు, మెడుల్లాఅబ్లాంగేట, ఎడమ మెదడు, కుడి మెదడు, అని అనేక పేర్లు పెట్టారు.
2)
మైండ్ లేదా మనోశక్తి ఆత్మశక్తికి అంతర్ ప్రపంచానికి సంబంధించింది. మైండ్ చర్మచక్షువుకు కనిపించదు. శాస్త్ర పరికరాలకు అంతు చిక్కదు.
3) మెదడు దేహంలోని అన్ని భాగాలను నియంత్రిస్తుంది, మరియు దేహంలోని నాడులన్నింటికి అనుసంధానింపబడి ఉంటుంది.
4) మైండ్ గుండె కొట్టుకోవడం, ఊపిరితిత్తులు పనిచేయడం, జీర్ణవ్యవస్థ లాంటి ఎన్నో ప్రక్రియలను నడిపిస్తుంది. ఈ ప్రక్రియలను నడిపించడానికి మైండ్ మెదడు అనే సాధనాన్ని ఉపయోగించు కుంటుంది.
5) ఆలోచనా తరంగాలు (thought waves) మైండ్ లో ఉత్పత్తి అయి మెదడు ద్వారా బయటకు వస్తాయి. ఒక డాక్టర్ బ్రెయిన్ ని కణవిభజన చేయగలడు కాని , ఆ మెదడులోకి ఆలోచనలు ఎక్కడి నుండి వచ్చాయో అనే విషయం చెప్పలేడు.
6) దేహం ఏర్పడక ముందే ఆత్మ మరియు మైండ్ రెండు ఉన్నాయి. దేహం నశించిన తర్వాత కూడా ఆత్మ మరియు మైండ్ రెండూ ఉంటాయి.
7) మైండ్ యొక్క ఊహాశక్తి నుండి జనించిందే ఈ దేహం, ఈ దేహం ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది, కానీ మైండ్ జన్మపరంపరలుగా, మనతోనే ఉంది.జన్మ పరంపరల నుండి జ్ఞానాన్ని, అనుభవాల్ని, చైతన్యశక్తిని, మైండ్ మోసుకొస్తూ ఉంది.

గత కోటానుకోట్ల జన్మల తాలూకూ జ్ఞానాన్ని కూడా మైండ్ లో నిక్షిప్తం అయి ఉంది. మరణించిన తర్వాత దేహాన్ని వదిలేస్తాము. కానీ జ్ఞానం, అనుభవాలు, చైతన్య శక్తి సంస్కారాలు, అన్ని నిక్షిప్తం అయి ఉంటాయి. అవి తర్వాత కూడా continue అవుతాయి.
9) ప్రతి జన్మకు మైండ్ వ్యాకోచం చెందుతూ ఉంటుంది. ఈ భూమి మీద జన్మపరంపర పరిసమాప్తి అయిన తర్వాత ఆత్మ మరో లోకంలో జన్మ తీసుకుంటుంది. అక్కడ కూడా మైండ్ అక్కడి జ్ఞానాన్ని, అనుభవాల్ని, పొందుతూ వ్యాకోచం చెందుతుంది.
10) ఈ విశ్వంలో ప్రతి ఆత్మశకలానికి మైండ్ ఉంది. అణువు, పరమాణువు, ఎలెక్ట్రాన్, ప్రతీది చైతన్యశక్తి మరియు మైండ్ ని కలిగి ఉన్నాయి. అన్నింటి మైండ్స్ అనుసంధానింపబడి ఉన్నాయి.
11)మనిషికి ఆత్మ, మైండ్ ఎలాగైతే ఉంటుందో, అలాగే భూమికి, భూమిపై ఉన్న సకల జీవరాశులకు ఆత్మ, మైండ్ ఉంటాయి. మూలకాలు, ఏకకణ జీవులకు కూడా ఆత్మ, మైండ్ ఉంటాయి.
12) సీతాకోకచిలుక, సాలెపురుగు, ఇవి వాటి మనోశక్తి ద్వారానే అందమైన దేహాన్ని, గూటిని నిర్మించుకుంటున్నాయి. పక్షులు వేల మైళ్ళు వెళ్లి ఆహారాన్ని సంపాదిస్తున్నాయి. జంతువులు జీవజాతులన్ని, ప్రకృతి వైపరిత్యాలని ముందుగానే పసిగడుతున్నాయి. ఇవన్నీ మనోశక్తి ద్వారానే సాధ్యం.
13) సంకల్పం, ఊహాశక్తి, ఇంటలిజెన్స్, తర్కం, విశ్లేషణ, స్వప్నాలు, ఆలోచనాశక్తి, clairvoyance, telepathy, సహజావబోధన, జ్ఞాపకశక్తి, ఈ ప్రక్రియలన్ని మైండ్ ద్వారానే జరుగుతున్నాయి.
14) మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, అనేవి మైండ్ కి సంబంధించినవి. కామం, క్రోధం, రాగం, ద్వేషం, లాంటివన్ని మైండ్ నుండి పడుతున్నాయి.
జీవరాసులన్నీ కలిస్తేనే ప్రకృతి. ప్రకృతి అనే మహాసముద్రం లో మనిషి ఒకానొక అల మాత్రమే.
331..జీవన్ముక్తులు -
దేహధర్మము అనగా వ్యవహారాధులు, జీవన్ముక్తునకు వర్తింపవు. ముక్త చిత్తము మరల ఎన్నటికి బంధింపబడదు.
తొడిమనుండి పడిన ఫలము,మరల ప్రయత్నము చేసినను, ఎవని చేతను ఆ తొడిమ బంధింపబడజాలదు. కాబట్టి అట్టి వారు ఇతరులచే జీవన్ముక్తుని తెలియబడజాలరు.
ధారణాదులచే గూడిన యోగులు, ఇతరులచే నెఱుగబడుదురు కాన మోక్షము ధారణాదులవలె ఇతరులచే నెఱుగబడినది కాదు. అది మధుర పదార్ధముల ఆస్వాద సౌఖ్యమువలె స్వాద్వైక వేద్యమే యైయున్నది.
అభ్యంతరమున శీతలత్వముతో గూడిన(శాంతి) చిత్తమే ముక్తియని, సంతప్త చిత్తమే బంధమని చెప్పబడుచున్నది. కావున బంధమోక్షములు చిత్తాదీనములే గాని, దేహాదీనములు కావు. దేహమునందు బంధమోక్షములు లేవు.
శరీరము ముక్కలు ముక్కలుగ కోయబడినను, ఏడ్చుచున్నను, నవ్వుచున్నను, జీవన్ముక్తునకు అంతఃకరణమున దేహసంబంధ దుఃఖము, సుఖము కొంచెమైననుండదు.
నిత్యమై అశరీరమైన ఆత్మస్వభావము పొందియుండుటచే జీవన్ముక్తులకు దేహాదిభావన నెపుడును నుండనేరదు. దేహము మరణించినను, జీవన్ముక్తుడు మరణింపకయే యుండును.
ఏడ్చుచున్నప్పటికి వాస్తవముగ ఏడ్వనివాడే అగును. నవ్వు, క్రోధము, రాగము ఉన్నను అవి లేనివారేయగును. మోహములచే చుట్టబడినను, మోహరహితుడేయగును.
త్యజించుటకు సమర్ధుడైనను, పవిత్రాంతఃకరణ యుక్తుడగు శివుడు రాగమును త్యజించుటలేదు. ఆ శివునికి ఈ ప్రపంచమున, నేదేని కార్యము చేయుటచే కాని, చేయకుండుటచే కాని ప్రయోజనమేదియు లేదు.
ఈ ప్రపంచమున నేది ఎట్లున్నదో అది అట్లే అగుగాకయని తలచి విష్ణుభగవానుడు ఆయా కార్యమును చేయుచున్నప్పటికి, వాసనారహితుడై ఏ కోర్కె లేక శుద్ధ చిన్మాత్ర రూపుడై పడియున్నాడు. సూర్యభగవానుడు, నిరంతరము తన్ను పరిభ్రమింపజేసికొనుచున్నాడు.
జీవన్ముక్తులైనను గురువులగు శుక్రాచార్య, బృహస్పతులిరువురు లోకమున పరస్పరము జయించుకొనుటగూర్చి అనేక అభిలాషలతో గూడియున్నారు.
జీవన్ముక్తుడైనను జనక మహారాజు, యుద్ధములందు పాల్గొనుచు రాజ్యపాలన చేయుచున్నాడు. వ్యవహారమందు జ్ఞాని అజ్ఞానియు సమముగనే వర్తించుదురు. కేవలము వాసనలు, వాసనారాహిత్యములే బంధమోక్షములకు కారణమైయున్నవి.
ఆకాశమున ఇంద్రధనస్సు, వివిధ వర్ణములు భాసించినను, వాస్తవముగ శూన్యరూపములే యైయున్నవి. అటులనే ఈ బ్రహ్మాండములును, పరమాణువులును శూన్యరూపములే యైయున్నవి.
సర్వకల్పనావర్జితమై, సర్వత్రా ఏకరసమై, కేవల చిదాకాశ రూపమై, నిద్రారహితమైనట్టి సమాధి కాలమందలి ఏ స్థితి కలదో, అద్దానిచే ఈ జగత్తు వెలయుచున్నదని ఎరుగవలెను.
ఓ రామచంద్రా| ఘనశిలవలె ప్రశాంతముగ, మౌనముగ నున్నట్టి బ్రహ్మరూపమే యగు ఈ దృశ్య సమూహమేదికలదో దానికి స్వాత్మయే జగత్తను పేరు విధించి, స్వ మాయచే మోహితమైన దానివలె నున్నది.
ఆహా| మాయ ఎంత ప్రభలమైనది.
శ్రీరాముడు- ఓ మునీంద్రా| ద్వీప,సముద్ర,వన, పర్వతాదులతో గూడిన ఈ దిగంతములందు ఆ విపశ్చిత్తు ఇపుడేమిచేయుచుండిరి.
ఆ విపశ్చిత్తులందొకరిని, క్రౌంఛద్వీపమందలి ప్రసిద్ధమగు వర్ష సీమపర్వతముయొక్క పశ్చిమభాగమునగల ఒకానొకశిలపై నొక గజము తన గండస్ధలముచే, కమలములవలె చూర్ణమొనర్చెను.
రెండవ విపశ్చిత్తును, ఒకరాక్షసుడు యుద్ధమున భగ్నశరీరుని గావించి, ఆకాశమునకు గొనిపోయి అటనుండి సముద్రమునందలి బడబాగ్ని మధ్యమున బడవేయ అచ్ఛట అతడు భస్మీభూతుడయ్యెను.
మూడవ విపశ్చితుని, ఒక విధ్యాధరుడు స్వర్గమున ఇంద్ర సభకు కొనిపోవ అచ్చట, నమస్కారము గావింపనందున, ఇంద్రుడు కుపితుడై శపించి యాతనిని భస్మయొనర్చెను.
నాల్గవ విపశ్చితుని, పుష్యద్వీపమందలి, ఒకానొక పర్వతము యొక్క సమీపమున గల నదీ తటమున ఒక ముసలి ఎనిమిది తునకలు గావించి చంపివేసెను. ఈ ప్రకారముగ వ్యాకులచిత్తులగు ఆ నల్గురు విపశ్చిద్రాదులు మృతినొందిరి.
మరణానంతరము వారి సంవిత్తు ఆకాశరూపము పొంది, అచట పూర్వసంస్కారములచే, భూమండలమును వీక్షించెను. ఆ నల్గురు విపశ్చిత్తుల సంవిత్తు తన దేహములను, పూర్వమువలె గాంచిరి. వారు తమ సూక్ష్మ స్ధూల శరీరములను తమ ఎదుట గాంచిరి.
ఆత్మ జ్ఞానము లేనియూ అవిద్య ఎంత పరిమాణము గల్గియుండునను విషయము నవలోకించుటకై వారు తమ పూర్వకాలిక సంస్కారములచే ప్రవృత్తులైరి.
332..ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక - ఏకాగ్రత (8 )
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
దేవుని కోసం వెతుకులాడే వాడే దేవుడు., .దైవం అన్నది సర్వత్రా వ్యాపించి ఉన్న అనంత విభూతి అని తెలుసుకోవాలి. మన:శాంతి కోసం నిత్యా సత్యాన్వే షణ మానవులకు తప్పదు.
సృష్టిలో నిర్జీవమైంది ఏది లేదు., సజీవమైన దానిని గుర్తించుకోలేని పరిస్థితి ఇది మానవుల ఆలోచన అర్ధ కానీ స్థితిగా మారుతున్నది.
రాయిలో కూడా నిరంతరం పరమాణువులు, పరమాణువులలో ఎలక్ట్రాన్సు , ప్రోటోన్స్ మరియు సూక్ష్మ కణాలకు కూడా చైతన్యశక్తి ఉంది . రాయి కూడా చైతన్య స్థాయిలో పరిణామం చెందుతూ ఉంటుంది. - రాయి , చైతన్యపరిణామం చెందాక స్పటికం, తరువాత, బంగారం ఈ విధంగా సృష్టిలో ప్రతి ఒక్కటీ చైతన్య పరిణామం చెందుతూ ఉంటుంది.
మనిషిలో మార్పు ఉన్నా, పురోగతి ఉన్నా, స్వార్ధపు ఆలోచనలు కొందరివి, ఈర్ష్య , ద్వేషము పెరుగుతూ మనిషికి మనిషి పొంతనలేని బతుకు.
స్థిరమైన వస్తువులాగా ఆలోచనలను అతేంద్రియాలతో చూడవచ్చు.
మనలో మార్పులు కదలిక ఉంటుంది, నీటి ప్రవాహం,వాయు ప్రవాహం, విద్యుత్ ప్రవాహం లాగా ఆలోచనల కి కదలిక, రంగు ఉంటాయి, మన ఆలోచనలు మారే కొద్దీ రంగులు మారుతాయి.
కొందరు :- చిన్న చిన్న కారణాలకే సన్యాసులుగా మారతారు. మారికొందరు - మరణ ఆసన్న సమయంలో స్వర్గంలో స్థానం పొందాలన్న ఆశతో తీసుకునే సన్యాసం.. మరికొందరు :- సత్యాన్ని తెలుసుకోవాలన్న ఆకాంక్ష, జ్ఞానతృష్ణతో తమకున్న ప్రతిదానినీ త్యజించి తీసుకునే సన్యాసం.
:- అజ్ఞానాన్ని వదులుతారు తప్ప, సంసారాన్ని కాదు. అనవసరమైన వాటిని వదిలిపెట్టి, అవసరమైన వాటికి మాత్రమే పరిమితమౌతారు. ఇదే అసలైన సన్యాసం. ఇదే అత్యున్నత స్థాయి గలది, ఆచరించదగినది.
మానవుల్లో ఆలోచనలు మారి బతకలేక కొందరు బతుకుట మరికొందరు సన్యాసము తీసుకొనుట
ఏకాగ్రత లోపం వల్ల ఇవి జారుతున్నాయని అనుకోవచ్చు.
మాన్:శాంతి ఉన్నప్పుడు ఏకాగ్రత ఉండుట సహజం
--(())--
333..జీవితానికి అన్నీ ఉపయోగమే, ఉపయోగము లేదంటే ని మనసు మనసులో లేదని మాట
భార్యనైనా భర్త సమయోచితముగా ఉపయోగించుకోవటం, భర్తనైనా భార్య సుఖలాలసుగా గుర్తించటం కూడా ఒక ఉపయోగమే.
జీవితంలోంచి దువ్వెన అనే వస్తువు చిన్నదని ఉపయోగించటం మానవనుకో, నువ్వు జడలు కట్టిన జుట్టుతో భయంకరంగా ఉంటావు. .
జీవితంలోంచి అద్దం అనే వస్తువును తొలగించా వనుకో , నిన్ను నువ్వే చూసుకో లేనంత అసహ్యం గా ఉంటావు..
జీవితంలోంచి చీపురు అనే వస్తువును తొలగించా వనుకో, నిన్ను నువ్వే చూసుకో లేనంత చెత్త నీచుట్టూ చేరి దుర్వాసన పిల్చా సి బతకాల్సి వస్తుంది. .
ఒక్కరోజు కాఫీ కానీ, టీ కానీ, పాలు కానీ, తాగద్దను కున్నావనుకో, ఆ రుచి మరవ లేక ఆత్మారాముని బాధపెట్టలేక, నిద్రలేక మనసు చింతకు చేరుట అవసరమా ..
నీ జీవితాన్నే అందంగా, సౌఖ్యం గా చేస్తూన్న ఇలాంటి చిన్న చిన్న వస్తువులకు నువ్వెప్పుడైనా
ధన్యవాదములు తెల్పి మెచ్చుకున్నావా
అన్నీ పూటలా నీకు సకాలంలో తిండి ఏర్పాటు చేస్తున్న నీ తల్లికో లేక నీ భార్యకో....ఒక్క రోజైనాధన్యవాదములు తెల్పి మెచ్చుకున్నావా ..
చెట్టు యొక్క దయా దాక్షిణ్యాలపై బతుకుతున్న నీవు ఒక్క రోజైనా చెట్టును ప్రేమగా స్పర్శిస్తూ ధన్యవాదములు తెల్పి మెచ్చుకున్నావా ....
ఎండకూ, వానకూ, అమ్మకూ ,నాన్నకూ....నిన్ను ఆనందంగా ఉంచుతున్న ఈ ప్రకృతికీ.....గురువుకు....నువ్వు ధన్యవాదములు తెల్పి మెచ్చుకున్నావా .
నిజానికి పై న వ్రాసిన కొన్ని వస్తువులేవీ...నీ దగ్గరనుండీ ఏమీ ఆశించకుండా... నిస్వార్థంగా....ఎన్నో యుగాలుగా సేవ చేస్తున్నాయి. వాటికి ధన్యవాదములు తెల్పి మెచ్చుకున్నావా
సృష్టిలో ప్రతి వస్తుకనీసం రోజుకొక్కసారి అయినా వు ఉపయోగం ఉన్నది, దాన్ని ఉపయోగించుకొనే శక్తి భగవంతుడు మానవులకిచ్చాడు ధన్యవాదములు తెల్పి మెచ్చుకున్నావా
ప్రతిఒక్కరు ధన్యవాదములు తెల్పి మెచ్చు కుంటే మనస్సు తేలికపడి ఏకాగ్రత పెరుగుతుంది ఇది అక్షరాలా నిజం.
--(())--
34..నేటి కవిత్వం -
దేశ రక్షణే మా ధ్యేయం
వేష భాషలే మా లక్ష్యం
మంచి చేయుటే మా గమ్యం
నిత్య పుణ్యమే మా నైజం
కాలము నీ వెంట పడేను లే
ఎందుకొ నీ ప్రేమ మనస్సు లో
వేదన పెర్గేనులె, కాంతి యే
లేకయు ఉండెనులె, ఇప్పుడే
కాదులె నావెంట నె నీవు వు
న్నావుగ బాధంత ని కోసమే
నీ దరి చేరేందుకు శోకమే
అందుకె దేహాన్ని ని కోసమే
భక్తికి యోగానికి కాలమే
శక్తికి కారుణ్యత భాధ్యతే
యుక్తికి ధర్మానికి మార్గమే
ముక్తికి మోక్షానికి వేదమే
కోపము తో చెప్పుట ఎందుకే
తాపము తో పల్కులు మానుకో
లోపము తో వెద్కుట ఎందుకే
పాపము తో పంచుట మానుకో
ఏమని చెప్పేది ని మాయకే
చిక్కితి తప్పించుట లేకయే
ప్రేమను పంచాను మనస్సునే
పంచుట ఆనందము యే కదా
కర్తకు కాపాడుట శక్తియే
కర్మకి కోపానికి ఓర్పుయే
శాంతికి మోనానికి దారియే
కాంతికి చీకట్లను ఛేదనే
UII UUII UIU
--(())--
335..మారని మమతాను రాగ మదీయ వేద మే
తీరని కరుణా కటాక్ష విక్షణా సహాయమే
కోరిన మనువాడు శక్తి పుంజమే విశాల భా
వామృత సహజాను సేవ తత్పరాను రాగమే
ఆరని అనురాగ శాంతి సొమ్ముయే సుధా మదీ
యా రమ సమ పోషణా లయాన్వితా సుహాసినీ
ఆరదము కళాన్వి తాను రాగమే సుఖాన్వితా
ప్రేరణ వినయాన్వితా సమర్ధ సేవ సంతసం
సా రిగమను పల్కుటే ఉషోదయాన్ని పిల్చుటే
భీరు తనుము తొల్చుటే మనో జయాన్ని పోల్చుటే
నీరు తనము చూచుటే నిజాన్ని తెల్పి బత్కుటే
మారు పలుకు పల్కకే మదీయ భావ మిచ్చుటే
మారుతము మనల్ని జీవ సేవ చేయు నిచ్చునే
ప్రేరితము మనల్ని బత్కి బత్కు నేర్ప టానికే
పారునదులు చేరు భూమితత్వమున్ను కోరిటే
దారుణ మను నన్నదీ ఏదియూ లేదు కృష్ణుడా
మదనదర్ప - UII IIU IUI UIU IUI U
--(())--
III UIU IUI U
336..నేటి కవిత్వం - మనోరమ - యతి -
ఒకటి చెప్పగా మరోకటే
తెలిపె రెండుగా మనస్సు నే
అనియు తెల్పుటే నిజాలులే
పటిమ చూపుట వయస్సులో
కలసి వచ్చుటే సరాగ రా
గేములు పల్కుటే విశాల వా
హినిగ బత్కుటే నిజాలుగా
కలువ మార్పులే సువాసనే
సుమధురం మనోమయం త రిం
చుటకు ఆశ సౌధమే సదా
మమతా చూపుటే సుఖాలయం
చెలిమి శాంతి కోసమే కదా
కలలు తెల్పుతూ విశాల హృ
ధ్యమును పంచుటే సకాల మూ
కలసి ఉండుటే సుఖాలయం
యువత కొరికే నిరంతరం
కళలు పెంచుట వికాస సా
హసము పెర్గుటే శుభోదయం
చెలిమి సేవలే సుఖాలయం
337..అమ్మ ఒడిని మించి..ప్రేమనగరి ఉందెక్కడ..!
నాన్న కలిమి మించి ... స్నేహానగరి ఉందెక్కడ
అన్న చెలిమి మించి .....శాంతి నగరి ఉందెక్కడ
కన్న బలిమి మించి ..... కాంతి నగరి ఉందెక్కడ
.
మనసు లోతు లెక్కగట్టు..... సూత్రమొకటి ఉందెక్కడ..!
సొగసు మోజు కానిదంటు .... మాత్రమొకటి ఉందెక్కడ ..
వయసు పోరు లేని దంటు .... ఆత్రమొకటి ఉందెక్కడ
తనువు ఆశ లేని దంటు ........ గాత్రమోకటి ఉందెక్కడ
అమ్మ భుజం పైన గాక... . మధురాపురి ఉందెక్కడ..!
నాన్న మౌనం పైన గాక .... సమయాపురి ఉందెక్కడ
కన్న ప్రేమమ్ పైన గాక ..... తపమాపురి ఉందెక్కడ
అన్న మాటే పైన గాక ...... వినయాపురి ఉందెక్కడ
నాన్న శ్రమకు అభినందన..చందనమది ఉందెక్కడ..!
అమ్మ ప్రేమకు అభినందన ... పొంతనమది ఉందెక్కడ
కన్నవారికి అభినందన ..... శాంతిగ మది ఉందెక్కడ
ఉన్న చోటనె అభినందన .... కాంతి గ మది ఉందెక్కడ
ప్రేమలేఖ అందుకున్న..అందెలసడి ఉందెక్కడ..!
ప్రేమభాష చెప్పుకున్న .... మద్దెలసడి ఉందెక్కడ
ప్రేమశక్తి పొంచియున్న .... ఊహలసడి ఉందెక్కడ
ప్రేమభక్తి కొంచమున్న ...... దేహము సడి ఉందెక్కడ
నీ మెఱుపుల ఆ తోటకు..కంచెన్నది ఉందెక్కడ..
నీ అరుపుల ఆ మాటకు .... పొత్తన్నది ఉందెక్కడ
నీ పెదవుల ఆ పాటకు ''''''' ముద్దన్నది ఉందెక్కడ
నీ తలపులు ఆ రాత్రికి ..... పొందన్నది ఉందెక్కడ
*338.._𝕝𝕝 ॐ 𝕝𝕝 10/05/2024 - అక్షయ తృతీయ / తదియ 𝕝𝕝 卐 𝕝𝕝_*
*≈≈❀┉┅━❀ 🕉️ ❀┉┅━❀≈≈*
*అక్షయ తృతీయ విశిష్టత*
వైశాఖ శుద్ద తదియ నాడు ఈ పండుగను ఆచరిస్తారు. వైశాఖ శుక్లపక్ష తదియ కృతయుగానికి ప్రారంభమని విష్ణు పురాణాలు తెలియజేస్తున్నాయి. ఈ అక్షయ తదియ నాడు రోహిణి నక్షత్రముంటే మరింత పుణ్యప్రదమని చెబుతారు. ఈరోజు చేసేటటువంటి హోమం, దానం, పితృదేవతలకు చేసే పూజ అక్షయమవుతుంది గనుక ఇది "అక్షయ తదియ" అనబడింది. శ్రీ కృష్ణుడు ధర్మరాజుకు చెప్పాడు. ఎంతో పవిత్రమైన ఈ రోజున ఏ కార్యాన్నైనా మొదలు పెడితే అది అక్షయంగా ఉంటూ వృద్ది చెందుతుంది. ఈ అక్షయ తదియ బుధవారం లేదా సోమవారం నాడు వస్తే మరీ విశేషం గా చెప్పబడింది.
కొన్ని ప్రాంతాలలో గౌరీదేవీకి డోలోత్సవం, కృష్ణునికి డోలోత్సవం చేస్తారు. ముత్తైదువులు, కన్యలు ఈ పూజలో పాల్గొంటారు. పూజ అయ్యాక పండ్లు, తీపి పదార్దాలు నాన వేసిన సెనగలను వాయనమిస్తారు. ఈ రోజు అక్షయ తదియ వ్రతాన్ని చేసుకొనే వారు ఉప్పును మానేసి చక్కర కలిపిన పేలపిండిని భుజిస్తారు. బదరీనారాయణ మందిర ద్వారము ఈ రోజే తెరుస్తారు. ఇంతవరకు అక్కడ మంచు పేరుకుని ఉంటుంది. పరశురాముని జయంతి కూడా ఈరోజు జరుపుకొంటారు. ధనానికి మూలంగా చెప్పే కుబేరుడికి ధనాధిపతిగా శివుని యొక్క అనుగ్రహం వరం లభించిన రోజు. శివుడు అన్నపూర్ణ దేవి దగ్గర గుప్త రూపం లో బిక్ష స్వీకరించిన రోజు కూడా ఈ రోజే అని చెప్పబడింది.
ఈరోజు చేసే మంచి పనులు కోట్ల రెట్ల ఫలితం ఉంటుందని పురాణాల ద్వారా తెలుస్తుంది. వ్యాస మహర్షి మహాభారతాన్ని ఈ రోజే వ్రాయడం మొదలు పెట్టాడు, దీనివలన అక్షయమైన పురాణ జ్ఞానాన్ని ఈరోజుకీ పొందగలుగుతున్నాం. శ్రీ కృష్ణుడు ద్రౌపదికి ఈరోజే అక్షయ పాత్రని అనుగ్రహించిన రోజు. కుచేలుడు శ్రీ కృష్ణునికి అటుకులు సమర్పించి అంతులేని సంపదను పొందగలిగాడు.
బంగారు వెండి ని కొనాలాని ఎక్కడ కుడా శాస్త్రవచనం లేదు. ఈరోజు చేయవలసిన మంచిపనులు దానాలు గురించే ప్రస్తావించబడింది. భగవంతున్ని ఆశ్రయించి మంచి పనులు చేసేవారికి, అలాగే వారికున్నదానిలో నలుగురి మంచి కోరి ఒకరికి సహాయం చేసే వారికి బీదవారికి తమ చేతనైన సహాయం చేసేవారికి భగవంతుని కృపతో అంతకి కోటి రెట్ల రూపంలో మనకి చేరుతుందని తెలుస్తుంది.
కృతయుగానికి ఆది అయిన ఈ రోజు ఉదయాన్నే స్నానాదులు ఆచరించాలి. సూర్యోదయం ముందు నదీ స్నానం చేసిన వారికి అత్యంత పుణ్య ఫలం లభిస్తుంది. ఆ తర్వాత ఉదక ఘటమును అనగా నీటికుండను వేసవిలో పండే పంటలు, యవలు, గోధుమలు, సెనగలు మొదలైనవి మరియు పెరుగు అన్నం దానం చేయాలి. అలా చేస్తే శివ సాయుజ్యం లభిస్తుందని భవిష్య పురాణం, దేవీపురాణం తెలియజేస్తున్నాయి. శ్రీ మహావిష్ణువికి చందనం లేపనం చేయడం వల్ల ,నారాయణ మందిర వాసం లభిస్తుందని చెబుతారు. సింహాచల క్షేత్రం లో స్వామి వారికి సంవత్సరానికి ఒకసారి చందనం పూత పూసి అలంకరిస్తారు. మళ్ళీ వచ్చే అక్షయ తృతీయ నాడు మటుకే చందనం తీసి మళ్ళీ అలంకరిస్తారు. ఈ రోజు పితరులకు పిండరహితమైన శ్రాద్ధమును చేయాలి. ఈ వైశాఖ శుక్లతదియ రోజున గొడుగు, పాదరక్షలు, గోవ, భూమి, బంగారం, వస్త్రములు, నీటితో నిండిన కుండను దానమివ్వడం మహా పుణ్యమని భవిష్యోత్తర పురాణంలో చెప్పబడింది.
ఈ రోజు సూర్య చంద్రులిద్దరు తేజోవంతంగా ఉంటారు కావున దానాలుకు చాలా మంచి సమయమని చెప్పవచ్చు అలాగే ఈ రోజు ప్రతి ఘడియ కుడా ఎంతో విశేషమైనదిగా చెప్పబడింది. ఈరోజు కొన్ని ప్రత్యేకమైన దానాలు చేయడం వలన అనంత ఫలం పొందగలం.
తులసి ఆకులతో విష్ణుసహస్రనామ పారాయణ చేయడం అనంత పుణ్య ఫలం లభిస్తుంది.
గోధుమలు దానం చేస్తే ఇంద్రుడు యొక్క అనుకూలత తో వర్షాలు చక్కగా కురిసి అన్నాదులకు లోటు కలగదు.
పానకం వడపప్పు మామిడి పళ్ళు శ్రీ మహా విష్ణువుకి నివేదించడం మంచిది. మామిడి పళ్ళు విసనకర్ర బ్రాహ్మణుడికి దక్షిణతో సహా దానం చేస్తే పుణ్యం లభిస్తుంది.
గోధుమలు, నెయ్యి, ఉప్పు, పండ్లు, కూరగాయలు, చింతపండు కూడా దానం చేసినట్లైతే వారికి అన్ని విధాల మంచి ఫలితాలు కలుగుతాయి.
కంచు గిన్నెలో నీటిని పచ్చ కర్పూరం, కుంకుమ పువ్వు, తులసి, వక్క, దక్షిణతో సహా దానమిస్తే గయాలో శ్రాద్ధ చేసిన ఫలితం కలుగుతుంది. ముఖ్యంగా పెళ్లి కావాలనుకొనే వారు, పితృ శాపాలు ఉన్న వారు చేస్తేమంచి ఫలితం లభిస్తుంది.
ముఖ్యంగా ఈరోజు చెట్లని నాటడం అనంత ఫలాన్నిస్తుంది, ఎప్పటికి తరిగిపోని పచ్చదనం భూమిపై పెరుగుతుంది. ప్రకృతిని పూజించి ఔషద మొక్కలను ఈ రోజు నాటి నట్లైతే అవి ఎప్పటికీ కూడా తరిగిపోకుండా అందుబాటులో ఉంటాయని ప్రతీతి.
*అక్షయ తృతీయ. దాని ప్రాముఖ్యత*
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
1. పరశురాముని జన్మదినం
2. పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం
3. త్రేతాయుగం మొదలైన దినం
4. శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుని కలుసుకొన్న దినం
5. వ్యాస మహర్షి “మహా భారతము”ను, వినాయకుని సహాయముతో, వ్రాయడం మొదలుపెట్టిన దినం
6. సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో వున్న పాండవులకు “అక్షయ పాత్ర” ఇచ్చిన దినం
7. శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన దినం
8. ఆదిశంకరులు “కనకధారాస్తవం” ను చెప్పిన దినం
9. అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన దినం
10. ద్రౌపదిని శ్రీకృష్ణుడు దుశ్శాసనుని బారినుండి కాపాడిన దినం.
కేవలం దాన ధర్మాలకు, ఆధ్యాతిక చింతనకు, సేవా దృక్పథానికి ప్రత్యేకత కలిగినదే అక్షయ తృతీయ. రోగులకు సేవ, పేదలకు అన్నదానం, గోవులు, పశు పక్ష్యాదులకు దాణా, తాగడానికి నీటిని ఏర్పాటు చేయాలి. బాటసారుల దాహార్తిని తీర్చడానికి చలి వేంద్రాలు ఏర్పాటుచేయడం ఎంతో పుణ్యఫలం. దైవ పూజ - వ్రతం, మంత్ర సాధన చేస్తూ భగవద్గీత పారాయణం, ఆధ్యాత్మిక సందేశాలు వినడం ఉత్తమం. ఓ రెండు ముద్దలు పక్షులకు పెడితే పితరులకు, యముడు, శని, కాలభైరవునికి పెట్టినట్టే. ఈ పుణ్యకార్యాల వల్ల భవిష్యత్తు బంగారంగా మారుతుంది. అక్షయ తృతీయనాడు జ్ఞానాన్ని సంపాదించడం, దానాలను చేయడం వల్ల, మామూలు దినములకన్నా, అనేకరెట్లు ఫలితాలను పొందగలరని వేదాలు చెప్పాయి.
అంతేగాని…
*బంగారం కొనమని ఎక్కడా చెప్పబడలేదు.* అవన్నీ వ్యాపారస్తులు సృష్టించిన పన్నాగం. అమాయక జనాలచేత బంగారం కొనిపించి వారు అత్యంత ధనవంతులయ్యే దానికి వాళ్ళు అల్లిన కృత్రిమ ప్రచారం.
339..*జీవన్నేవ సదాముక్తఃకృతార్ధో బ్రహ్మ విత్తమః||*
*(ఆత్మోపనిషత్)*
*- బ్రహ్మవిత్తముడు జీవించియున్నప్పుడే సర్వదా ముక్తుడు, కృతార్ధుడును అగుచున్నాడు.*
*లోకా స్సమస్తా స్సుఖినోభవన్తు!*
340..*మనం తలపెట్టిన ప్రతీ కార్యంలోను మెచ్చుకొనేవారు కొందరు, తప్పులెన్నేవారు కొందరు ఉంటారు.*
*బృహత్కార్యాలన్నీ బ్రహ్మాండమైన అవరోధాలను అధిగమించినప్పుడే సాధ్యమవుతా
341..*నీ ప్రశ్నలన్నింటికీ ఒకే సమాధానం వర్తిస్తుంది. దేవుని శరణుజొచ్చి ఆయన పరిపూర్ణజ్ఞానంతో నీ చైతన్యాన్ని నింపుకో. ఆయన శక్తియందు ఉన్న భక్తి భావంలో నీ బలహీనతను కరిగిపోనియ్యి. దేవునికి విషయాలన్ని వివరించనక్కరలేదు, ఎందుకంటే నీవు మాట్లాడక ముందే నీకు ఏమి కావాలో ఆయనకి తెలుసు; నీవు అడగక ముందే ఇవ్వడానికి ఆయన సంసిధ్ధంగా ఉన్నాడు.
ధ్యానంలో ఉన్నప్పుడు , ఆయన ఛాయాచ్ఛాదిత సాన్నిధ్యంలో ఉన్నానని, తల్లీన భావం తప్ప ఇంకే ఆలోచనా రానియ్యకు. ఈ విధంగా నీవు గ్రహణ శీలుడవై ఉంటే నీ శరీరం , మనస్సు, ఆత్మల్లోకి స్వస్థత ప్రవహిస్తుంది.*
342..*శ్రీ ఆదిశంకరాచార్య విరచితము భజగోవిందం*
* మా కురు ధన జన యౌవన గర్వం హరతి నిమేషాత్కాలః సర్వమ్|*
*మాయామయమిదమఖిలం బుధ్వా బ్రహ్మపదం త్వం ప్రవిశ విదిత్వా ||*
*ధనము - జనము - యౌవనము చూచి గర్వపడకుము.వీటన్నిటినీ కాలము ఒక్కక్షణములో హరించును. మాయామయమయిన ఈ ప్రపంచమును విడిచి జ్ఞానివై బ్రహ్మపదము పొందుము.*
..........
343..ఎవ్వరికి యవ్వరేమి చెప్పనేరమేమి
కాలము నాతడే శివ నెరిగినవాడు
భావబంధాలు ఎరుగక యున్ననేమి
ప్రాణము నాతడే శవ మెరిగిన వాడు
తరుణము తృప్తి పర్చేడి వాడు వాడే
పరసేవ కోర తత్పరుడు వాడు వాడే
చిరుహాస భూతదయానిధి యగు వాడే
పరులు తానేయని భావించువాడు వాడే
ధర్మతత్పర బుద్ధి తగిలినవాడు వాడే
మర్మమై శివ భక్తి మఱవని వాడు వాడే
నిర్మలుడై ఆత్మనియతి కలుగువాడే
కర్మమార్గములు తడవని వాడు వాడే
పగలేక మతిలోన బ్రదికినవాడు వాడే
జగతిపై హితముగా చరియించు వాడే
తెగి సకలము నాత్మ తెలిసిన వాడు వాడే
సర్వుల హృదయమందు ఉన్న వాడు వాడే
***-
344..జీవితంలో* ఏది ఎప్పుడు రావాలో *అప్పుడే* మనకు తప్పకుండా వస్తుంది .
*ఏది ఎంత కాలం* మనతో ఉండాలో *అంత కాలం* మాత్రమే ఉంటుంది.
*ఏది ఎప్పుడు* వదిలి పోవాలో అప్పుడే *పోతుంది.*
ఇందులో దేన్ని మనం *ఆపలేము* మన చేతిలో ఉన్నది ఒక్కటే *ఉన్నంత* వరకు మనతో ఉన్న వాటి *విలువ* తెలుసుకుని *జీవించడమే.*
విలువలు తెలిసిన వారు *వ్యక్తిత్వం* ఉన్న వారు *స్నేహితులుగా* దొరికినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి.
*ఆయుధం* పట్టకున్నా విలువలు . *వ్యక్తిత్వం* ఉన్న శ్రీకృష్ణుడు పాండవుల *పక్షాన* నిలిచాడు కాబట్టి *యుద్ధం* గెలిచారు..!!
అవసరం *బద్ధ* శత్రువులనైన కలుపుతుంది.
అపార్ధం *ప్రాణ* మిత్రులనయిన విడదీస్తుంది ,
మనం *అలిసే* వరకు ఆడితే అది *ఆట*
గెలిచే వరకు చేస్తే అది *యుద్ధం*
చచ్చే వరకు బ్రతికితే అది *జీవితం*
చచ్చాక కూడా *బ్రతికితే* అది మంచితనం .
జీవితం ఒక *ఆటలాంటిది*
ఒకసారి *గెలుపు* మరోసారి *ఓటమి* తప్పదు
అవతలి *పోటీదారుణ్ణి* తక్కువగా అంచనావేయలేం
అలాగని *విధినీ* ఎదిరించినిలవలేం
*విజయం* సాధించినవారు
*ఆనందంతో* ఎగిరి గంతేస్తారు
*పరాజయం* పొందినవారు
*తీవ్రవేదనకు* గురై *కన్నీళ్ళ*
పర్యంతమవుతారు కానీ
ఈ రెండూ *శాశ్వతంకాదని* తెలిసినవారు *నిత్యం* సుఖసంతోషాలతో
*జీవించగలుగుతారు
****
345..భౌతిక సంపదకు, నైతిక పురోగతికి మధ్య అభిలషణీయమైన సమతుల్యం ఉంటేనే వ్యక్తికి శాంతి, సమాజానికి అభ్యుదయం చేకూరుతుంది.*
*సంతోషమన్నది కొంతవరకు బాహ్య పరిస్తితుల మీద ఆధారపడుతుంది. కాని ఎక్కువగా ఆధారపడేది మానసిక వైఖరుల మీద. సంతోషంగా ఉండాలంటే మంచి ఆరోగ్యం, చక్కగా నిలకడయిన మనస్సు , వర్ధిల్లుతున్న జీవితం, సరయిన పని, కృతజ్ఞతాపూర్ణమైన హృదయం, ఆ తర్వాత---- అన్నిటి కంటే మిన్నగా -- వివేకం, అంటే ఈశ్వరుణ్ణి గురించిన జ్ఞానం ఉండాలి.*
*346) అంగం గలితం పలితం ముండం దశనవిహీనం జాతం తుండమ్|*
*వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచత్యాశాపిండమ్ ||*
*శరీరం క్షీణించినది , తలనెరసినది , దంతములు ఊడినవి, ముసలివాడై కర్రపట్టుకు నడుచుచున్నాడు. అయినా ఆశ వదులుటలేదు.*
...........
*ద్వాపరయుగం ఇంకా కొద్ది రోజులలో ముగిసి పోయి కలియుగం రాబోతుందనగా ఒకరోజు...
శ్రీ కృష్ణుడు బలరాముడితో “అవతార పరిసమాప్తి జరిగిపోతుంది. యదుకుల నాశనం అయిపోతుంది. మీరు తొందరగా ద్వారకా నగరమునువిడిచి పెట్టెయ్యండి” అని చెప్పడాన్ని ఉద్ధవుడు విన్నాడు.
ఇతడు
శ్రీకృష్ణ భగవానుడికి అత్యంత ముఖ్య సఖుడు మరియు పరమ ఆంతరంగిక విశేష భక్తుడు.
ఆయన కృష్ణుడి దగ్గరకు వెళ్లి “కృష్ణా! మేము నీతో కలిసి ఆడుకున్నాము, పాడు కున్నాము, అన్నం తిన్నాము, సంతోషంగా గడిపాము. ఇలాంటి కృష్ణావతారం ముగిసి పోతుంది అంటే విని నేను తట్టుకోలేక పోతున్నాను. నిన్ను విడిచి నేను ఉండలేను. కాబట్టి నా మనసు శాంతించేటట్లు నిరంతరమూ నీతో ఉండేటట్లు నాకేదయినా ఉపదేశం చెయ్యి” అన్నాడు.
అప్పుడు కృష్ణ పరమాత్మ కొన్ని అద్భుత మయిన విషయములను ఉద్ధవుడితో ప్రస్తావన చేసాడు.
ఇది మనం అందరం కూడా తెలుసుకుని జీవితంలో పాటించవలసిన శ్రీకృష్ణ పరమాత్మ చిట్టచివరి ప్రసంగం.
దీని తర్వాత యింక కృష్ణుడు లోకోపకారం కోసం ఏమీ మాట్లాడలేదు. ఇది లోకమును ఉద్ధరించ డానికి ఉద్ధవుడిని అడ్డుపెట్టి చెప్పాడు.
“ఉద్ధవా! నేటికి ఏడవరాత్రి కలియుగ ప్రవేశం జరుగుతుంది. ఏడవరాత్రి లోపల ద్వారకా పట్టణమును సముద్రం ముంచెత్తుతుంది. సముద్ర గర్భంలోకి ద్వారక వెళ్ళిపోతుంది. ద్వారకలో ఉన్న వారందరూ మరణిస్తారు. తదనంతరం కలియుగం ప్రవేశిస్తుంది.
కలియుగం ప్రవేశించగానే మనుష్యుల యందు రెండు లక్షణములు బయలు దేరతాయి. ఒకటి అపారమయిన కోర్కెలు. రెండు విపరీతమైన కోపం.
ఎవ్వరూ కూడా తన తప్పు తాను తెలుసుకునే ప్రయత్నం కలియుగంలో చెయ్యరు.
కోర్కెలచేత అపారమయిన కోపముచేత తమ ఆయుర్దాయమును తాము తగ్గించు కుంటారు. కోపము చేతను, అపారమయిన కోర్కెల చేతను తిరగడం వలన వ్యాధులు వస్తాయి. వీళ్ళకు వ్యాధులు పొటమరించి ఆయుర్దాయమును తగ్గించి వేస్తాయి.
కలియుగంలో ఉండే మనుష్యులకు రాను రాను వేదము ప్రమాణము కాదు. కోట్ల జన్మల అదృష్టము చేత వేదము ప్రమాణమని అంగీకరించగల స్థితిలో పుట్టిన వాళ్ళు కూడా వేదమును వదిలిపెట్టేసి తమంత తాముగా పాషండ మతములను కౌగలించుకుని అభ్యున్నతిని విడిచిపెట్టి వేరు మార్గములలో వెళ్ళిపోతారు.
అల్పాయుర్దాయంతో జీవిస్తారు. రాజ యోగం చేయడం మరచి పోతారు.తద్వారా బ్రహ్మ యోగం అనబడే క్రియా యోగం లేదా నేనున్నా స్థితికి చేర్చే లయ యోగం ఒకటి ఉందనేది తెలుసుకోరే ప్రయత్నం చేయరు.ఆడంబరాలకు ప్రాధాన్యత నిస్తారు. ఉపవాసములు తమ మనసును సంస్కరించు కోవడానికి, ఆచారమును తమంత తాము పాటించడానికి వచ్చాయి. రానురాను కలియుగంలో ఏమవుతుందంటే ఆచారములను విడిచి పెట్టేయడానికి ప్రజలు ఇష్టపడతారు.
ఆచారం అక్కర్లేదనే పూజలు ఏమి ఉంటాయో వాటియందు మక్కువ చూపిస్తారు. వాటి వలన ప్రమాదము కొని తెచ్చుకుంటున్నామని తెలుసుకోరు. అంతశ్శుద్ధి ఉండదు. చిత్తశుద్ధి ఏర్పడదు.
మంచి ఆచారములు మనస్సును సంస్కరిస్తాయి అని తెలుసుకోవడం మానివేసి ఏ పూజచేస్తే, ఏ రూపమును ఆశ్రయిస్తే ఆచారం అక్కర్లేదని ప్రచారం ఉంటుందో అటువైపుకే తొందరగా అడుగువేస్తారు. కానీ దానివలన తాము పొందవలసిన స్థితిని పొందలేము అని తెలుసు కోలేకపోతారు.
ఇంద్రియములకు వశులు అయిపోతారు. రాజులే ప్రజల సొమ్ము దోచుకుంటారు. ప్రజలు రాజుల మీద తిరగబడతారు.
ఎవడికీ పాండిత్యమును బట్టి, యోగ్యతను బట్టి గౌరవం ఉండదు.
కలియుగంలో ఏ రకంగా ఆర్జించా డన్నది ప్రధానం అవదు. ఎంత ఆర్జించా డన్నది ప్రధానం అవుతుంది.
ఎవడికి ఐశ్వర్యం ఉన్నదో వాడే పండితుడు. భగవంతుని పాదములను గట్టిగా పట్టుకుని తరించిన మహాపురుషులు ఎందరో ఉంటారు. అటువంటి మహా పురుషులు తిరుగాడిన ఆశ్రమములు ఎన్నో ఉంటాయి.
కలియుగంలో ప్రజలు అందరూ గుళ్ళ చుట్టూ తిరిగే వాళ్ళే కానీ, అటువంటి మహాపురుషులు తిరుగాడిన ఆశ్రమాల సందర్శనం చేయడానికి అంత ఉత్సాహమును చూపరు. అటువంటి ఆశ్రమములలో కాలు పెట్టాలి. అటువంటి మహా పురుషుల మూర్తులను సేవించాలి.
కానీ అక్కడకు వెళ్ళకుండా హీనమయిన భక్తితో ఎవరిని పట్టుకుంటే తమ కోర్కెలు సులువుగా తీరగలవు అని ఆలోచన చేస్తారు. ఈశ్వరుని యందు భేదమును చూస్తారు.
కాబట్టి నీకు ఒకమాట చెపుతాను. ఈ వాక్యమును నీవు బాగా జ్ఞాపకం పెట్టుకో. ‘యింద్రియముల చేత ఏది సుఖమును యిస్తున్నదో అది అంతా డొల్ల. అది నీ మనుష్య జన్మను పాడు చేయడానికి వచ్చినదని గుర్తు పెట్టుకో. దీనినుంచి దాటాలని నీవు అనుకున్నట్లయితే ఇక్కడి నుండి బదరికాశ్రమమునకు? వెళ్ళిపో’
కలియుగంలో గాని ఏ యుగంలోగాని నీ శ్వాసను గట్టిగా పట్టుకోవడం నేర్చుకో.ధ్యానం చేయడం విడిచిపెట్టకు. నీదారి శ్వాస దారి కావాలి.శ్వాస దారియే నా దగ్గరికి నిన్ను చేరుస్తుంది. నువ్వు చేసే ప్రతి శ్వాస క్రియ లోనూ నేను వున్నాను. వుంటాను. ఇది విశ్వసించు ఉద్ధవా.ప్రయత్నపూర్వకంగా కొంతసేపు మౌనంగా ఉండడానికి ప్రయత్నించు. మౌనము ధ్యానం, యింద్రియ నిగ్రహము, చేయుట, నోటిలోని మౌనం మనసులోని మౌనంతో ధ్యానంలో కూర్చొనుట, ఈశ్వరుని సేవించుట మొదలగు పనులను ఎవరు పాటించడం మొదలు పెట్టారో వారు మెట్లెక్కడం మొదలుపెడతారు.
ఇది శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవుడికి ఇచ్చిన చివ్వరి సందేశం...
ఈ సందేశం ఉద్ధవుడికే అనుకుంటే పొరపాటు. ఇది మనందరికోసం పరమాత్మ చెప్పిన సత్యం.(సేకరణ)
348..విసుగు చెందని ప్రేమగా విలువ వెంట
భర్తకు పసిడి రాసులు భార్య వెంట
కోపమే లేని కష్టము కోర్కె వెంట
ఇంతి నగలెల్ల మొగుడికి యిష్ట మెంట
అణకువ యమరిన సహనం ఆలి వెంట
పెనిమిటి కోరిక పసిడిగా పిలుపు వెంట
ప్రేమ యనురాగము పంచ ప్రీతి వెంట
మగని పసిడిగా యిల్లాలి మనసు వెంట
మొగుడికి యపరంజి పడచు మోహ మెంట
వినమ్ర సౌశీల్య సంస్కార విజయ వెంట
సత్ప్రవర్తన సద్భుద్ధి సకల మెంట
గృహిణి కిసువర్ణ భాగ్యము గురువు వెంట
అతివ కెమ్మోవి అరుణ బింబఫల మెంట
సఖియ నెమ్మోము చంధ్రుడై సరళ వెంట
భామ నీ మెయి నోముగా బలము వెంట
సర్వ మంగళ బలమౌను సహన మెంట
బబల నీ చూపు సోమాఖ్య బలము వెంట
కొమ్మ నీ చను దోయిగా కోర్కెవెంట
గురు బలం బల బంధమ్ము గుర్తు వెంట
బొమ్మ పల్కు కావ్య బలము పోరు వెంట
కలికి మురిపెంపు గతులుగా కలల వెంట
మంద ముదిత నీ వేణిగా మనసు వెంట
కళలు కాలమెంటకదిలే కావ్య వెంట
ప్రాంజలి ఘటించి తెలిపేద ప్రభల వెంట
అతను కేతు బలంబుగా ఆశ వెంట
రమణి నఖ పాళి తారల రమ్య తౌట
లలన మంచి లగ్న బలము లాస్వ వెంట
యున్న దె శుభము లోకము యందు వెంట
349..శతమానం భవతి.: కృష్ణ ప్రార్ధన 🙏🏿🙏🏿
కం!!
మామా మోమౌ మామా
మామా! మిమ్మోమ్మో మామ మామా మేమా,
మేమో మ్మము మిమైమే
మేమే మమ్మోము మోము మిమ్మా మామా!!
ప్రతిపదార్ధము :-
మా =చంద్రుని
మా =శోభ
మోమౌ =ముఖము గల
మా మా =మా యొక్క
మా =మేధ
మిమ్ము +ఒమ్ము =అనుకూ లించు
మా మా =మామకు మామా
ఆము =గర్వమును
ఏమి +ఒమ్మ ము =ఏమి ఒప్పుకోము
మి మై = మీ శరీరము
మేము ఏమే == మేము మేమే
మమ్ము = మమ్మల్ని
ఓముము +ఓముము =కాపాడుము కాపాడుము (పాహిమామ్, పాహిమామ్ )
ఇమ్ము +ఔము =అనుకూల మగుమా!!
భావము :- చంద్రుని వంటి ముఖము గల దేవా!మా బుద్ది మీకు అనుకూ లించును. గర్వ పడక నిన్ను మేము అంగీకరింతు ము. స శరీరి వై మాకు అనుకూ లము గా ఉండి మమ్ము కాపాడు ము.
350..కం!!
లీలా లోలా లోలా!
లాలాలా లీలలా! ల -లా! లీలాలా
లోలా లీలా! లీలా!
లాలా లోలా లలాల లీలా లాలీ!!!
ప్రతి పదార్ధం ::-
లీలా లోలా లోలా =స్వ భక్తులను ఆదరించు వాడా!
లలా =విలాసంగా
లాలాలా లీలలా = శత్రువుల మీదకు చక్రమును ప్రయోగించు వాడా
అలోలా =అచంచల మైన
లీల లాల లీల =లక్ష్మీ రతు డా
లీలా =క్రీడా స్వ భావుడా!
అలోల (కృష్ణ స్వభావుడా )కృపా స్వ భావుడా!
లలాల =లాలన గ్రహుడా!
లీలా =శృంగా ర స్వ రూపుడా
లాలీ =లాలింప వా!!
భావం ::--(సులభ గ్రాహ్యం )
***
351..కం.. భావన యేదైనా మది
సేవా భావము పలుకుట సీఘ్రము దయగన్
నవవిధ నటనే కళలగు
వివరాల మనసు మీవెంట విజయమ్మగుటన్
352..తే. గీ.యభ్య సనము వలన విద్య యమృత మగుట
నిత్య ధర్మ నడవడిక నియమ ధనము
సద్గుణయుత పలుకు గాను సహజ మనము
గృహమును సతత కోర్కెలు గనగ జూడ
353..తే. గీ. కొల్లగొట్టు నేత జనుల లెల్ల ధనము
కల్లలెన్నొ చెప్పి బతుకు గద్దె ధనము
వెళ్ళగొట్టు జనుల విషపు వింత ధనము
చెల్లకుండ చేసెడి మూర్ఖ చింత ధనము
354..తే. గీ.వక్తల యుత్సుకత కలిగే వరద పొంగు
పేక్షకులు కొరత పలుకు పేరు పొంగు
సభలు డబ్బుతో ముడిపడు సగము పొంగు
న్యాయపలుకు విన జనులు నటన పొంగు
355..సీ..ఎక్కడుంది యటుల యేల చెప్ప తరము
ఆధునిక కళలు ఆశ జూడు
నాలినిద్రగనుండు నటనడబ్బుతొ నుండు
నరక పట్టెక్కడ నటన జూడు
నరునాటు యంత్రము నారు కోయు యంత్రము
బిడ్డలు పరదేశ బెడద జూడు
ఉచితసొమ్ముయుచేరు ఉడత భక్తి యగుట
కర్షక కష్టము కనులు జూడు
తే.. వెన్నెముకగాను రైతుకు విలువ యేది
వసుధ కన్నీరు పంటయే వరుస యేది
యన్నదాత యాహారమే యందరికియగు
ప్రాంజలి ఘటించి తెలుపేద ప్రభల గీత
356..తే. గీ. చేరి గొలువంగ మనసున చింత తొలగు
వేడి మ్రొక్కంగ భవితవ్య వీడు భయము
పాడి యాడంగ మన యయ్య పరవ శించు
ఫలము లొసగుచు జీవితం పలుక రించు !
357..తే.గీ.మంచి శబ్ద ప్రవాహము మనసు నెంచ
శాస్త్ర పాండిత్యమమగుట కౌశ లము నెంచి
భుక్తికే అనర్గళ వాక్కు బుద్ధి బట్టి
ముక్తికి ఉపయుక్తము కాదు ముందు మాట
358.కం..రారాజు పదవి దక్కుట
కారా మిరియాలు జల్ల కళ రాజ్యముగన్
పేరాశప్రజల సొమ్మగు
వీర్రాజైయతడుచేయ విజయమ్మగుటన్
359.సీ..వేసవి వాకిట వెలుగుల వేడుక
వాస ప్రయాణము వరద లగుట
కడలి తీ రములందు కళకళ పెరిగేలె
మనము యేకముయగు మనసు గలుగు
విధి సమైక్యతగాను వీనుల విందుగా
చల్లనౌ విడిదిలో చక్కగాను
సొగసుతో విలసిల్లు శోభలు తిలకించ
సేదతీ రగ మన చింత తొలగు
తే. గీ. కథలు కలియుట జన్మగు కాల మదియు
నీడ పట్టు కోరుట వీలు నిర్మలమగు
స్వేచ్ఛ కోరు జనముచేరు సీతలమ్ము
ప్రాంజలి ఘటించి తెలిపేద ప్రభల గీత
360.ఉ..వెన్నెల దక్షతే గలిగి వెల్గుల రూపము వెంబడించియే
వెన్నును జూపు భామకళ వేడుక యేనని ముచ్చటింపుయే
మన్నన చాలుచాలని సమస్యలు రావులె సత్యభామవే
దన్నిన ధిక్కరింప సభ దాపము జెందక నవ్వగాదగున్
361.ఉ..నిన్నటి మాటలేపరుగు నీడల మర్మము నాటలాడుచున్
మొన్నటి వేదనే మనసు మోపుట యేలను పిల్ల చేష్టలున్
తన్నిన ధిక్కరింప సభ దాపము జెందక నవ్వాగాదగున్
మన్నన ముద్దులే యగును మానస వేదిక చూచువారికిన్
362.ఉ..మొన్నొక పెళ్లిభోజనము మోక్షము నిచ్చెడి వంటవార్పులున్
తిన్నగ గారెబూరెలు గతే విధిమా కగు భోజనమ్మగున్
తన్నుకు చచ్చుటే బ్రతుకు తాడన యేలను భుక్తి కోరి చి
త్రాన్నము లేని భోజనము నప్పుడు పెట్టిరి పెండ్లి విందులో
363..సీస పద్య మాల
జగమున కాంతులు జపముల ఫలములు
భక్తి ప్రపంచ ప్రభాకరుడవు
ప్రాణి కోటి మనసు ప్రాభవమును పెంచ
ధారణ దివ్య ఆధారుడవులె
రోగాలనే తీర్చ బోధ దినకరుడు
ఆదిత్యభవుడు సహాయ పరుడు
వెచ్చని కిరణాల వేకువ జనులకు
మేల్కొలుపుల సూర్య మేలు జేయ
బతుకు పోరుకుసేవ బంధము నిత్యము
భాగ్య పిలుపునిచ్చు భాస్కరుడువు
వెండి వెలుగులతో వినువీథిన పరుగు
ప్రత్యక్ష దైవమ్ము బరమాత్మ రూపమ్ము
సూర్య దేవుడతడు శుభకరుండు
జగతికి వెలుగిచ్చు జగదేక చక్షువు
శ్వేతపద్మ ధరుడు చిత్ర రథుడు
కళలతో శోభిల్లు కశ్యపుడవు
చైతన్య మూర్తివి తేజో ప్రకాశంతొ
దివ్య మంగళకర దీన బంధు
అంబర మణివెల్గు ఆశ్రిత కళలగు
సప్తాశ్వ రథరూడచక్ర ధరడు
నఘములు బాపెడి నాదిత్య కిరణమ్ము
జీవ జగతికెల్ల జీవశక్తి
త్రైలోక్య పూజ్యుడౌ ద్వాదశాదిత్యుని
ననుదినము ప్రణమిల్ల నఘముబాపు
మార్తాండ శుభకర మాసఖ్యత శఖుడే
మమ్ము చల్లంగను మహిమజూప
కాలమర్పుల కళ కామ్యపరులశోభ
తిమిర సంహార రవి ప్రకాశ
నిత్య సత్య వెలుగే నియమాల కళలుగా
సర్వబంధము జేర్చు సకల మందు
రధ సప్తమిదినమ్ము రక్షగా ప్రార్ధన
శుభమును కోరితి సూర్య దేవ
ఆ..శుభ మదిగను కోర సూర్యని ప్ర్రార్ధన
సప్తమితిధి పూజ సూర్య దేవ
నీదు దర్శనమ్ము నిత్యచేతన్యము
నాది దేవ మమ్ము నాదుకొనుడు
***
364..ఓటరూ!మేలుకో!... మందారం
ఓటరూ!మేలుకో!ఓటునే వేయుమా!ఎన్నుకొనుము
దీటుగా నిలుచుండి దిశలనే మార్చుమా!ఎన్నుకొనుము
నీతి తప్పినయట్టి నేటి నాయకత్వము యనవద్దే
జాతికే ప్రమాదము జనులకు హానికరము యనవద్దే
ధనము జల్లుచు నుండి దయలేని నాయకులు యనవద్దే
వినయ మించుక లేక వీడినారు విలువలె యనవద్దే
నీ చెంత నుందిలే నిప్పులా నీ 'యోటు 'యనవద్దే
నీ చింత మానుమా!నీ కెందుకీ 'నోటు?'యనవద్దే
ఐదేళ్ల కొకసారి యవకాశ మొచ్చింది యనవద్దే
బాధలను తెగటార్చి బాధ్యతను తెలిపింది యనవద్దే
పదవోయి!ముందుకే!పదిలమౌ జీవితము యనవద్దే
వదలకోయి!యోటును భవిష్యత్తు సఫలము యనవద్దే
సామ్రాజ్య వాదమును సహియించబోకుమా! యనవద్దే
సమైక్యత సీమలో సాధించి గ ల్గునా ! యనవద్దే //
నడిపించు వారికే నాయకత్వము నీయి! ఎన్నుకొనుము
కడగండ్లు తొలగించు ఘనులదే గెలుపోయి!ఎన్నుకొనుము
****
365..తే. గీ.మాన దాన సుగుణహస్త మాభరణము
కనగ కంఠము నకు సత్య మాభరణము
వినగ చెవికి శాస్త్రముగను నిజభరణము
కనుక కాంచనాభరణము కలలు తీరు
366..తే.గీ.విజయ పథమున బుద్దియే విజ్ఞతగను
కార్యమైనా కనులకాంతి కళ మహాత్మ
సాక్షిగా నున్న కిరణ సౌర ధీర
నింగిలో నిల్చి చలించు నిర్జ రాయ
367..తే.గీ..ఓటు వెయ్యరా పొందురా ఓర్పు నోటు
నోటు మభ్యత సహజమే నొచ్చు చేటు
చేటు చేయును ఖచ్చిత చిత్త కాటు
కాటు బ్రతుకునా తప్పదు కాల నీతి
368..తే. గీ.కలియుగం కలుషాలకు కలల నిలయ
కనుల చూపునమ్మకమేది కథల చరిత
ఎవరు చెప్పినా యవసరం ఎదను మార్చు
బ్రతుకు బండి కదలు సులభమ్ము ప్రకృతి
369..తే. గీ.భజన కలవాటు పడితివి బంధ మనియు
సృజన సన్నగిల్లుట సమ శాంతి కొరకు
సకల సుఖమిచ్చు సమయము సత్య మగుట
ధన్య చరితము తధ్యము ధరణి యందు
370..తే. గీ.ఎదుట చూపుల చిలకనుకిచ్చగించి
బంధ ఫలము వదలి వేటు భార మనుచు
రాజనీతి పలుకు నెంచి రంగు మార్చ
ప్రాంజలి ఘటించి తెలిపేద ప్రభల గీత
371..తే. గీ.ఎరకు ఓట్ల చేపలుపడు యెరుక గాను
జాలరి కళ రాజ్యమగుట జపము గాను
దళపతులగమనమ్ముగా ధరణి గాను
చెప్పు మాట కోటలుగాను చేష్ట గాను
372..ఉ..బాహ్యమనస్సు రాజరిక భావపు బంధు సమర్ధ నాయకన్
నేహ్యము గానినాయకుని నేకపు మాటలు నమ్మశఖ్యమున్
సహ్యము నెంచి బీదకళ సాధన నీతులు తెల్ప గల్గుటన్
గ్రాహ్యము పొంది జీవితపు గమ్యము ధర్మ మార్గమున్
ళ సౌ లసౌ.. భ జ భ జ ర ర.. యతి..7
373..కాలముననీతి కర్గియు నిజమ్ము దాగియే కోపమై
జ్వాలలగు జాధ్య జాగృతి భయమ్ము పెర్గియే తాపమై
పాలన జలమ్ము పాఠము సమర్ధ చూపుకే వేదమై
గాలము మనస్సు గమ్యము సహాయ మార్గమున్ దీపమై
374..మంచిగనె చెప్ప మానసము మార్చ బుద్దిసిద్ధీ గతీ
సంచిత భవమ్ము సామరస మేను శక్తి యుక్తిన్ స్థితీ
ఎంచిన సమమ్ము యేరుగను సాగు సర్వ లక్ష్యo మదీ
కాంచన మనస్సు కాలమును బట్టి మార నేర్పున్ సుధీ
375..నిత్యమూ మనసు వాసనలను పరిత్యజించు గృహలక్ష్మీ
మోక్షమును గూర్చిన కోరికను కూడ త్యజించు గృహలక్ష్మీ
మైత్రీ, కరుణాదుల భావ నిర్మలవాసను పరిగ్రహింపు
ఆత్మ జ్ఞానాన్ని అందించిన గురువు బ్రహ్మ గృహ లక్ష్మీ
376..తే. గీ.భజన కలవాటు పడితిమి బంధ మనియు
సృజన సన్నగిల్లుట సమ శాంతి కొరకు
సకల సుఖమిచ్చు సమయము సత్య మగుట
ధన్య చరితము తధ్యము ధరణి యందు
377..తే. గీ.మోసము మొదట నెరుగదు మోహ మొకటి
దొంగ నటన నేర్చ మనసు దొడ్డ బుద్ధి
కాల దోషము మరిగియు కామ్య సిద్ధి
చివరి కేడ్చు మనసు లేక చిత్రమగుట
378..* ఆయుర్ధాయం*ఆశీర్వచనం🧘♀*
శతమానం భవతి శతాయుః పురుష శ్శతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిధిష్ఠతి!!
శతమానమ్ :
శుక్లయజుర్వేదాంతర్గతమైన వాజసనేయసంహిత(19–93)లో “ఇంద్రస్య రూపం శతమానం—” అని వర్ణన ఉంది.
ఈ శ్లోకం కృష్ణ యజుర్వేదం నుండి వచ్చిన ఒక వేద ఆశీర్వచనం. దీని అర్థం "నీకు 100 సంవత్సరాల
ఆయుష్షు, ఆరోగ్యం
మరియు సంపదలు
కలగాలని
కోరుకుంటున్నాను. నీ శరీరంలోని అన్ని
అవయవాలు
ఆరోగ్యంగా ఉండాలని
మనలను నిండా నూరేళ్లు బ్రతకమని వేదం ఆశీర్వదిస్తుంది. ' వేద పండితులకు నమస్కరించి వారిచే ఈ ఆశీర్వచనం పొందుతూ
ఉంటాం.
“శతానాం ఏకేషాం ప్రాణినాం ‘మానం’,
పూజా యస్మిన్ తత్ –జగత్ పూజ్యం ఇతి అర్థః“|
అంటే వందల కొద్దీ ఉన్నవారిలో (దేవతలలో) ప్రత్యేక గౌరవనీయుడు లేక పూజ్యుడు ఇంద్రుడు అన్నమాట. అంటే సజాతీయులలో ప్రత్యేక పూజ్యత లేక గౌరవనీయత కలిగి ఉండడాన్ని వైదికపరిభాషలో “శతమానం” అంటారన్నమాట!
శతేంద్రియః : ఇంద్రస్య ఆత్మనః లింగం అనుమాపకం అని ఇంద్రియ శబ్ద వ్యుత్పత్తి. ఇంద్రియశబ్దం జీవుడికి చిహ్నం లేక గుర్తు. అయితే ఈ ప్రధానార్థం ఉన్నా ఇక్కడ ఇంద్రియానికి అవయవము , శరీరభాగము, బహిరంతర జ్ఞాన, కర్మ, సూక్ష్మ ఇంద్రియాలు
ఇంద్రియాల అవయవాలు, అంతర్భాగానికి నాలుగు రెట్లు సూక్ష్మ సాధనాలు అనే అర్థాలు గ్రహించాలి. అంటే బాహ్యాభ్యంతర అనేక
అవయవాలన్నమాట!
శతేంద్రియః శతాయుః పురుషః
శతమానం భవతి| (ఏతత్ తస్య)
ఆయుషి ఏవ ఇంద్రియే ప్రతి తిష్ఠతి,
ప్రతి తిష్ఠతి|
భావం:-
అనేక బాహ్యాభ్యంతర అవయవాలుకలిగి, శతసంవత్సర జీవితం కలిగిన పురుషుడు అనేక జనులలో ఒక ప్రత్యేక వ్యక్తిగా మన్నన పొందుతున్నాడు. అటువంటి యజమాని ఆత్మస్థైర్యాన్ని పొంది ఇహపరాలు రెండూ సాధిస్తున్నాడు. (ప్రతి తిష్ఠతి అని రెండు మారులు అనడానికి ఇది కారణం).
మీరు ఆనందంతో, మనోహరంగా, సద్గుణవంతులుగా మరియు ఉన్నతంగా ఉండనివ్వండి. వందల శ్రేష్ఠమైన గుణాలను కొనసాగించడానికి మరియు అభివృద్ధి చేయడానికి పూర్తిగా పనిచేసే ఇంద్రియాలతో (శరీరం మరియు మనస్సు) మీకు వంద సంవత్సరాల ఆయుష్షు లభించేలా చేయండి.
🪷🙌🪷🙌🪷
“శతమానం భవతి శతాయుః పురుషశ్శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్ఠతి” అనేది వేద పురుష ఆశీర్వచనం. మనలను నిండా నూరేళ్లు బ్రతకమని వేదం ఆశీర్వదిస్తోంది.
వేద మంత్రానికి ఉన్న శక్తి గొప్పది కాబట్టి వేదజ్ఞులైన పెద్దలకు నమస్కరించి వారిచే ఈ ఆశీర్వచనం పొందుతూ ఉంటాం.
అలాగే నిత్యం చేసుకొనే సూర్యోపస్థానంలో “పశ్యేమ శరదశ్శతం, జీవేమ శరదశ్శతం, నందామ శరదశ్శతం, మోదామ శరదశ్శతం” అని చెప్పబడించి. “నిండు నూరేళ్లు ఆ సూర్యుని చూడగలగాలి. నిండా నూరేళ్ళు జీవించాలి. ఆది కూడ ఆనందంగా జీవించాలి” అని ఆకాంక్షిస్తాం.
ఇలా ఆకాంక్షించటంలో ఎంతో విలువ ఉంది. “గుడ్ మార్నింగ్” అని చెప్పడం, “గుడ్ నైట్” చెప్పటంలోనూ లౌకికంగా కూడ అట్టి ఆకాంక్షలు ఆధునిక కాలంలోనూ అనుసరిస్తూనే ఉన్నాం. మంచి మనస్సు నుండి వచ్చే శుభాశీస్సులకు, శుభాకాంక్షాలకు కూడ శక్తి ఉంది. దాని వలన మేలూ జరుగుతుంది.
ఇది పూర్వకాలపు విషయమే కాదు, నేటి విషయం కూడా అని అర్థం చేసుకొనగలం.
“బ్రతికి యుండిన శుభములు బడయవచ్చు” కాబట్టి బ్రతికి ఉండటం అంటే ఆయుర్దాయం మొదట కోరదగినది. అందుకే ఏ పూజ చేసినా సంకల్పంలో ఆయురారోగ్య భోగభాగ్యాలు కాంక్షిస్తాం. అందులో ముందు కోరేది ఆయుర్దాయాన్నే. కోట్ల సంపద లభించినా అయుర్దాయం లేక మరుసటి రోజే మరణించే వానికి ఈ కోట్ల సంపద వలన ప్రయోజనమేమిటి? అందువలనే మొదట కోరదగినది ఆయుర్దాయం. నిజమే.
ఆయుర్దాయమనేది కోరుకొంటే వచ్చేదా? అనేది ప్రశ్న. “దీర్ఘాయుష్మాన్ భవ” అని దీవించటం వల్ల ఆయుర్దాయం పెరుగుతుందా? ఆని సందేహం.
ఆయుః కర్మ చ విత్తం చ విద్యా నిధన మేవ చ|
పంచైతా న్యపి సృజ్యంతే గర్భస్థస్తైవ దేహినః||
అని చెప్పబడింది. అంటే “ఆయుష్షు, వృత్తి, ధనం, విద్య, చావు అనేవి ఐదూ జీవి గర్భంలో ఉండగానే నిర్ణయింపబడుతూ ఉంటా”యని దాని అర్థం.
ఆయుర్దాయం, మరణం అనేవి ముందే నిర్ణయింపబడితే ఇంకా ఈ ఆశీస్సుల వల్ల కాని, మరే జాగ్రత్తల వల్ల కాని ప్రయోజనమేమిటని ప్రశ్న.
“లలాట లిఖితా రేఖా పరిమార్ట్షుం న శక్యతే” నుదుట వ్రాసిపెట్టినది ఎవరూ తుడవలేరని, మార్చలేరని, జరిగి తీరుతుందని మరికొందరి మాట. “ఏది నిజం” మనేది సామాన్యునకు వచ్చే ప్రశ్న.
ఆయుష్షుకు వృద్ధి, క్షీణతలు ఉంటాయా? ఉంటేనే దాని విషయంలో జాగ్రత్తలు తీసుకొనటం అవసరం తప్ప అదేమీ లేనప్పుడా యత్నమే వ్యర్థం కదా! ఆయుర్వేదం అనే వైద్య విధానం పేరులోనే ఆయువు ఉన్నది.
ఆయుర్వేదమనేది ఊసుపోక చెప్పిన సామాన్యపు మాట కాదు. వేదాలలో మొదటిదైన ఋగ్వేదానికి సంబంధించిన ఉపవేదమే ఆయుర్వేదం. అంటే ఆయువును గూర్చి తెలిసికొనదగిన విజ్ఞానం అది. అందువల్ల ఆయువునకు సంబంధించి వృద్ధి క్షయాలు కూడ పరిగణింపదగినవే అని తెలుస్తుంది.
లలాట లిఖితమైన ఆయుర్దాయాన్ని ఎవ్వరూ మార్చలేరనేది యదార్థమైనా మార్కండేయుడు, శంకరాచార్యుల వారు మొదలైన వారు దైవానుగ్రహం వలన ఆయుర్దాయాన్ని పెంచుకొనటం చూస్తాం. అంతే కాదు హనుమంతుడు, విభీషణుడు మొదలగు వారు చిరంజీవులుగా పరమందటమూ చూస్తాం.
ఇంకా విశేషం ద్వాపర యుగంలో చనిపోయిన సాందీపని గురువు యొక్క పుత్రుని శ్రీకృష్ణుడు బ్రతికించినట్లు, త్రేతాయుగంలో చనిపోయిన వానర వీరుడు గంధమాదనుని హనుమంతుడు బ్రతికించి తెచ్చినట్లు కూడ ఇతిహాసాల ద్వారా తెలిసికొన్నాం.
కాబట్టి దైవానుగ్రహం వలన కాని, అమోఘవచనులైన ఋష్యాదుల ఆశీర్వచనాల వల్ల కాని ఆయుర్దాయం పెంచుకొనటం సాధ్యమే అని తెలుస్తుంది. కాబట్టే మన పూర్వజులు “ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం” అని సంకల్పంలో చెప్పుకొనటంలో అనౌచిత్యం లేదని, “శతమానం భవతి” అంటూ మహనీయుల ఆశీస్సులు పొందటం శ్రేయస్కరమే అని తెలుస్తుంది.
అందుకే అట్టి ఆశీర్వచనాల కోసం పెద్దల యెడ వినయ విధేయతలతో ఉండాలి.
****
ఈ రోజు పెళ్లిరోజు, పుట్టిన రోజు జరుపుకున్న ప్రతిఒక్కరుకూ శుభాకాంక్షలు.
379.
ప్రాంజలి ప్రభ గ్రూపులో మరియు ప్రపంచలో ఉన్న మాతృమూర్తులందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు
నింగి ఉడు మార్గ దీపాలు నిత్య వెలుగు
ఈ ఉదీచి కిరణమ్ములు యీశ్వ రేశ్చ
మనసు ఆశ్చర్య జనకాలు మాన రక్ష
బ్రతుకు ఆకాశ రవణాలు భాద్యతగుట
ఉదీచి = ఉత్తరదిక్కు.
ఉడు = తార.
ఉడుమార్గము = నక్షత్రమార్గం
రవణము = నగ.
380..మంచిని నిర్వహించడము మాటల పందిరి హృద్యమేయగున్
వంచనలేనిజీవితము వాకిట పంటకు రక్షగాయగున్
సంచిత మొక్క పెంచగల సాధన ప్రక్రియ లాగయవ్వగన్
నెంచితి మాతృమూర్తిని సనేత్రమనోమది ధర్మ రక్షగన్
ఓం పశ్యంత్యేనమః
381..పశ్యంతీ ననగాను చూచు నదియే ప్రాధాన్య వాక్చల్యమే
పశ్యంతీ సమకార్య రూప మగుటే ప్రేరత్వ సంకల్పమే
పశ్యంతీ స్థితి మాతృకాబలమై ప్రాబల్య వాగ్రూపమే
పశ్యంతీ గ పరాన వాక్కు పిలుపే ప్రోస్చాహ జ్ఞానమ్ముగన్
382..తే. గీ.అమ్మ యైమనసున విశ్వనాధ తలపు
నీదు కరుణయే నిజమిది నింగి మలుపు
ఎప్పుడెయ్యది వలయునో నప్పు డలుపు
శాంతి సమరమే యగుటయే సమత మెరుపు
383..శా..అమ్మాయన్న పదమ్ము గాను గురువై ఆనంద పర్చేనుగా
అమ్మా సంతసమే జగానికియనం తార్ధమ్ము పంచేదిగా
అమ్మా తీర్పుగనే మనస్సు కదిలే ఆదర్శ భావమ్ముగా
అమ్మా రక్షణగా నిరంతరము నిస్వార్ధమ్ము ప్రేమమ్ముగా
384..ఉ..అమ్మయె వెన్నగా కరిగి ఆశ్రిత మూలము సామ దానమున్
నమ్ముట సర్వవేళల సనాతన ధర్మము తెల్ప గల్గుటన్
అమ్మ యనేటి యక్షరము ఆనంద పర్చెడి బీజమేయగున్
అమ్మయె సర్వశక్తిగను సాధన యుక్తిగ తెల్పు సత్యమున్
385...శా.. కన్నుల్లో కరుణారసమ్ము కళలై కామాక్షి గుర్తింపుగా
వెన్నెల్లో విహరించె సంపదగనే వేనోళ్ల విశ్వాసిగా
పన్నీరే మనకౌను కష్టములుగా పాఠమ్ము కన్నీరుగా
ఎన్నన్నా యెదనంతపంచియెరుకై యేనాడు వాగ్దేవిగా
386..ఉ.మాతృదినోత్సవమ్ముయిది మానస బుద్ధిని పంచె మాతగా
మాతృ మనస్సునే గలిగి మానవ మార్పుకు ఓర్పు దేవతే
మాతృ యుషస్సుశాంతి కళ మాకును పంచెడి తీర్పు దేవిగన్
మాతృ సహాయ సంతతి సమానము తృప్తి పరాత్పరీయగున్
387..శా.ప్రత్యూషమ్మతిగాను బంధచరితం ప్రాబల్య గ్రంధసారమే
ప్రత్యూషమ్మె గతీ విదీభవితం ప్రాధాన్యతా లక్ష్యమున్
ప్రత్యూషే విధిమార్చు విద్య కళగా ప్రోత్సాహ గంధమ్ముగా
ప్రత్యూషాకళలేజపమ్ము ప్రావీణ్యమయ్యేసుధీ
388..ఉ.అమ్మఋణమ్ముగా మనసు ఆశలు తీర్చియు ఆశ్రితమ్ముగన్
అమ్మయె యక్షరమ్మగుట ఆలన పాలన నిత్యసత్యమున్
అమ్మయు నాన్నయే భవిత అక్షయమేయగు సర్వవేళలన్
అమ్మమనస్సుపిల్లలగు ఆకలి తీర్చెది మంచి చేయుగన్
389..శా.అమ్మాగర్భము మోసి నిరంత రముగా బంధమ్ము బంధుత్వమున్
అమ్మా బాధ్యతగా సుఖమ్ము విదితం ఆశ్చర్య సౌఖ్యమ్ము గన్
అమ్మా సభ్యతగాను కాలగమనమ్మే నిత్య సంతోషమున్
అమ్మేలోకముగా యమూల్య మనసై ఆరాధ్య వాగ్దేవి గన్
390.చం.వలపుల యూహ మాధవుని , వాదనజేయగజూచి నిత్యమై
తలపులమాతలాగుమది, దగ్గరజేరుచు సర్వ నీడగన్
మలుపులుతల్లి ప్రేమకథ,మాధవునందున రాగభావముల్
నిలుపగనమ్మమానికను, నివ్వెరగందగరమ్యపర్చుటన్
391.."శృతి స్మృతి పురాణానం ఆలయం కరుణాలయం
నమామి భగవత్పాద శంకరం లోక శంకరం "
అందరకు లోక గురువులు శ్రీ శంకర భగవత్పాదులవారి జన్మదిన శుభాకాంక్షలు. 🙏🏻
ఆ..స్మృతి శృతి పురాణ సామ్మోహ నమ్ముగా
గురుపు తెలుపు పలుకు గుర్తు గాను
జన్మదినశుభమగు జాతి సం రక్షణ
శంకరభగవాను శాంతి దయయు
* శంకరభగవత్పాదులు *
392..తే. గీ.జ్ఞాన విజ్ఞాన సంపద జ్ఞప్తి తనము
దాచుకొన్నశక్తి సుతుడు ధరణి యందు
శారదాంబకరుణతోడ శాంతి జెర్చ
నిత్య ధర్మన్ని సత్యాన్ని నిలిపె శివుడు
393..తే. గీ.భారతావని నలుదిక్కులా భాగ్య జీవి
నాల్గు దిక్కులా పీఠాలు నెలకొల్ప
అపర శంకర రూపుడు ఆత్మ తత్వ
వేక్త హిందువులను రక్ష వినయ శివుడు
394..తే. గీ మూఢ మతుల యహమ్మును ముఖ్య మార్పు
హిందు మతయుద్ధరణగాను హితము జూపె
ఉద్ధరించిన కారణ మున్న జన్మ
కరుణ కనకధార కురిపించగల శివుడు
395..తే. గీ ప్రాయమున రచనలు చేసి పాఠ్య మగుట
భక్తి వేదాంత గ్రంథాల ప్రజల కిచ్చి
అద్వైతాచార్యుల కళలు ఆదరించ
వేల సంవత్సరాలుగా విద్య శివుడు
అందరికీ ధర్మాన్ని రక్షించిన జగద్గురువు
శంకర జయంతి శుభాకాంక్షలు.
396..ఆ..సతి పతి మతి పాఠమె మనసుగా
కాలయాపనవక కాల మందు
దుష్ట శిక్షణయగు ధూర్థుల ను తరమా
తల్లి తండ్రి తనయ తీర్పు పలుకు
397..ఆ..సంసయమ్ము వదలి సన్మార్గ విద్యగా
ఆది విశ్వ మయము అమ్మ గాను
నిపుణ లైన మనసు నిత్యార్ధ మహిమౌను
కన్నబిడ్డల కళ కనికరమగు
398..ఆ..పవిత్రత విషయాన భారత దేశమై
మాట ఒక్క టౌను మనసు వెన్న
దొంగనవ్వులనకు దోపిడీ కాదులే
చిత్ర హింస లేదు చిత్త మందు