Tuesday, 25 August 2015

Pranjali Prabha - Health Science

Om Sri Ram     Om Sri ram    Om ri Ram  
Pranjali Prabha 
Sarvejnaasukhinobhavanthu

బీరకాయ - ఆరోగ్య ప్రయోజనాలు
1) బీరకాయలో సి విటమిన్, ఐరన్ రిబోఫ్లేవిన్, మెగ్నీషియం, థయామిన్‌తో పాటు అనేక రకాల ఖనిజ లవణాలుంటాయి. బీరకాయలో కొవ్వు, కొలెస్ట్రాల్, కేలరీలు తక్కువ. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి మంచి ఆహారం.
2) సెల్యులోజ్, నీటిశాతం ఎక్కువ కాబట్టి మలబద్ధకం, పైల్స్ సమస్యతో బాధపడేవారికి బీరకాయ తినడం చక్కటి పరిష్కారం.
3) రక్తంలో , మూత్రంలో చక్కెర స్తాయిలను అదుపులో ఉంచుతుంది.కాబట్టి మధుమేహం ఉన్నవారికి ఇది మంచిది.
4) బీటాకెరోటిన్ సమృద్ధిగా ఉంటుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది.
5) బీరకాయ రక్తాన్ని శుద్ధి చేస్తుంది. చర్మాన్ని మెరుగుపరుస్తుంది. మొటిమలు, యాక్నె సమస్యలు తొలగిపోతాయి. దేహం నుంచి ఆల్కహాల్ కారక వ్యర్థాలను తొలగించి కాలేయం, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
6) కామెర్ల వ్యాధి సహజంగా తగ్గాలంటే రోజూ ఒక గ్లాసు బీరకాయ రసం తాగితే చాలు. ఇది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది.
— with Sri Hari Babu.



                            మొక్కజొన్న - ఆరోగ్య ప్రయోజనాలు



మొక్కజొన్న మనకు మక్కా దేశం నుంచీ వచ్చిందని.. మాక్కా జొన్నే మొక్క జొన్న గా మారిందని బాషా శాస్త్రవేత్తల అభిప్రాయం. ఈ విషయంలో ఇంకా కూలంకషంగా పరిశీలించాల్సి ఉంది. మొక్కజొన్న అమెరికా ఖండం నుంచి చైనా ఐరోపాలకు చేరి, పోర్చుగీసుల ద్వారా మనదేశంలోకి అడుగుపెట్టిందని 1939లో R.G. Reeves “The Origin of Indian Corn” అనే గ్రంథంలో వ్రాశారు. Turkish Corn అనే రూపం 17-వ శతాబ్దిలో దక్కను పీఠభూమి లోనికి ప్రవేశించినట్లుంది.

ఆ విషయం అలా ఉంచితే...ఈ జూలై...ఆగస్ట్ నెలల్లో మొక్కజొన్నలు బాగా వస్తాయి..మొక్కజొన్న కండెలలోని ఆరోగ్య ప్రయోజనాలు:1.జీర్ణక్రియను పెంపొందిస్తుంది. మొక్కజొన్నలో పీచు పుష్కలంగా వుంటుంది. అది జీర్ణక్రియకు బాగా పనిచేస్తుంది.ఆహారంలో పీచు వుంటే అది మలబద్దకం, మొలలు వంటి వ్యాధులు రాకుండా కాపాడుతుంది. పేగు కేన్సర్‌ అరికడుతుంది.2.మొక్కజొన్నలో కావలసినన్ని లవణాలు లేదా మినరల్స్‌ వుంటాయి. పసుపురంగులో వుండే ఈ చిన్న గింజలలో మినరల్స్‌ అధికం. మెగ్నీషియం, ఐరన్‌, కాపర్‌, ఫాస్పరస్‌ వంటివి కూడా వీటిలో వుండి ఎముకలు గట్టిపడేలా చేస్తాయి. మీ ఎముకల విరుగుట అరికట్టటమేకాక, మీరు పెద్దవారయ్యే కొద్ది కిడ్నీలను కూడా ఆరోగ్యంగా వుంచుతాయి.3.చర్మ సంరక్షణ-మొక్కజొన్నలో యాంటీ ఆక్సిడెంట్లు వుంటాయి. ఇవి చర్మాన్ని కాంతివంతంగా వుంచి ఎప్పటికి చిన్నవారుగా కనపడేలా చేస్తాయి. మొక్కజొన్న గింజలు తినటమే కాక, ఈ విత్తనాల నూనె కనుక చర్మానికి రాస్తే, దీనిలో వుండే లినోలె యాసిడ్‌ చర్మమంటలను, లేదా ర్యాష్‌లను కూడా తగ్గిస్తుంది.4. రక్తహీనతను అరికడతాయి. రక్తహీనత అంటే మీలోని ఎర్ర రక్తకణాల సంఖ్య ఐరన్‌ లేకపోవటం వలన గణనీయంగా పడిపోతుంది. మరి మీరు తినే స్వీట్‌ మొక్కజొన్న విటమిన్‌ మరియు ఫోలిక్‌ యాసిడ్‌లు కలిగి మీలో రక్తహీనత లేకుండా చేస్తుంది.5.కొల్లెస్టరాల్‌ నివారణ చేస్తాయి. శరీరంలో లివర్‌ కొలెస్టరాల్‌ను తయారు చేస్తుంది. రెండు రకాల కొలెస్టరాల్‌ తయారవుతుంది. అవి హెడ్‌డిఎల్‌ మరియు చెడు కొలెస్టరాల్‌ అయిన ఎల్‌డిఎల్‌. నేటి రోజులలో కొవ్వు అధికంగా ఉండే ఆహారాలు చెడు కొలెస్టరాల్‌ని పెంచి గుండెను బలహీనం చేసి గుండె సంబంధిత వ్యాధులు కలిగిస్తున్నాయి. తీపి మొక్కజొన్నలో వుండే విటమిన్‌ సి, కేరోటియాయిడ్లు మరియు మయో ప్లేవినాయిడ్లు మీ గుండెను చెడు కొలెస్టరాల్‌ నుండి కాపాడుతాయి. శరీరంలో రక్తప్రసరణ అధికం చేస్తాయి.6.గర్భవతులకు ఈ ఆహారం ప్రధానం-గర్భవతి మహిళలు తమ ఆహారంలో మొక్కజొన్న తప్పక కలిగి ఉండాలి. దీనిలో వుండే ఫోలిక్‌ యాసిడ్‌ గర్భవతి మహిళలకు మంచి ప్రయోజనం చేకూరుస్తుంది. కాళ్ళు చేతులు, వారికి వాపురాకుండా చేస్తాయి. ఫోలిక్‌ యాసిడ్‌ తగ్గితే అది బేబీ బరువును తక్కువ చేస్తుంది. కనుక మొక్కజొన్న తింటే, తల్లికి, బిడ్డకు కూడా ప్రయోజనమే.కనుక మీ ఆహారంలో తగినంత మొక్కజొన్న ఆహారం చేర్చి తినండి. దానివలన వచ్చే వివిధ ఆరోగ్య ప్రయోజనాలను పొందండి. వివిధ రోగాలను తగ్గించుకోండి. ఆరోగ్యంగా ఉండండి.



తేనె
ఒక కప్పు వేడి పాలలో, చెంచా తేనె కలిపి పిల్లలతో తాగిస్తే అలసట దూరమై పుష్టిగా తయార వుతారు. కడుపులో క్రిములను, పుండ్లను తగ్గించడానికి, రక్తలేమిని నివారించడానికి ఇది చక్కని ఔషదం. రాత్రి పడుకునే ముందు తీసుకుంటే హాయిగా నిద్ర పడుతుంది.

తేనె టీ : పొద్దున్నే కాఫీ, టీలకు పదులుగా తేనె టీ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది.పరగడుపు న కప్పు వేణ్నీళ్లలో చెంచా తేనె కలిపి మెల్లగా చప్పరిస్తూ తాగాలి.అజీర్తి సమస్యలకు ఇది చక్కని ఔషధం. రోజుకు రెండు మూడు సార్లు తాగినా మంచి ఫలితం ఉంటుంది

పసుపు
మన దేశంలో పసుపును శుభప్రదంగా భావిస్తాం. పూజా సంబంధిత కార్యాల్లోనే కాకుండా వంటకాల్లో కూడా పసుపును విరివిగా ఉపయోగిస్తాం. ఇందుకు ముఖ్యకారణం పసుపులో ఔషధ గుణాలు మెండుగా ఉండడమే. పసుపులో యాంటీ బయోటిక్ లక్షణాలు పుష్కలంగా ఉన్నట్లు వివిధ దేశాల్లో జరిపిన పరిశోధనల్లో ఇప్పటికే తేలింది.

అమెరికాలోని ఎండీ అండర్సన్ కేన్సర్ సెంటర్ శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా అధ్యయనంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. పసుపు తాత్కాలిక ఆరోగ్య సమస్యల నుంచే కాకుండా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి కూడా ఉపశమనం ఇస్తుందని తేలింది. కేన్సర్‌ను నిరోధించడంలో కూడా పసుపు మంచి ఫలితాన్ని ఇస్తున్నట్టు పరిశోధకులు చెబుతున్నారు.

అదేవిధంగా అల్జిమర్స్, గుండె జబ్బులు, నాడీ సంబంధిత వ్యాధులు, జీవక్రియలకు సంబంధించిన వ్యాధులపై కూడా పసుపు అద్భుత ఫలితాలను ఇస్తుందని ఆ అధ్యయనం ద్వారా తేలింది

తమలపాకులు
తమలపాకులు, వక్కలు, సున్నం కలిపిన తీసుకోవడాన్ని తాంబూలం అంటారు. భారత సాంప్రదాయ పద్ధతులలో ఒకటైన తాంబూల సేవన అజీర్ణానికి బాగా ఉపకరిస్తుంది.తమల పాకుల్లో కొంచెం తీపి, కొంచెం వగరు కలిగి ఉంటుంది. ఇది కఫాన్ని హరిస్తుంది. అయితే పిత్తాన్ని మాత్రం ఎక్కువ చేస్తుంది.

తాంబూలంలో వక్కలతో పాటు ఏలకలు, లవంగ ముక్కలను కూడా చేర్చుకోవచ్చు. అవి నోటి దుర్వాసనను పారద్రోలడంతోపాటు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. తాంబూలంలో ఉదయాన వక్క ఎక్కువగానూ, రాత్రి సున్నము ఎక్కువగా ఉండేలా తయారు చేసుకోవాలి.

తాంబూలము నమిలేటప్పుడు మొట్టమొదట వచ్చే రసం విషపూరితంగా ఉంటుందని చెపుతారు. రెండవసారి నమిలినపుడు వచ్చే రసము - అజీర్ణమునకు కారణమవుతుందని అంటారు. మూడవసారి జనించే రసము అమృతంతో సమానం అంటారు.


  1. www.facebook.com/healthupdates4all
Health Updates
It's Health and Beauty Tips Website




1. http://healthupdates.in/healthy-eating-2/



2. http://healthupdates.in/weight-loss-diet-tips-sources-of-p…/



On a vegetarian diet and worried about not getting enough protein? We have just the answers you were looking for. Did you know protein is an important...
healthupdates.in

3.http://healthupdates.in/get-rid-of-pimples/




1.



Home Remedies for Toothache Pain
healthupdates.in

If you find your toothache still pains you after trying either Ibuprofen, Aleve, Codeine, Tylenol, A...

2.

Simple Yet Effective Home Remedies for Dry Cough!
healthupdates.in

Here are top 15 natural and home remedies for a dry cough: 1. Cider vinegar – Take cider vinegar and...

3. 
Remedies For Stiff Neck & Shoulder Pain
healthupdates.in

Treatments for neck pain can range from simply stretching or yoga to things like dietary supplements...


4.


How to Prevent Heatstroke
healthupdates.in

1. Avoid Peak Sun Hours Stay out of the sun during the hottest part of the day, between 10 a.m. and ...
 5.

Brain Foods Your Kids Need
healthupdates.in

Subscribe For years, athletes have eaten to win. Is it possible for kids to eat to learn? You bet, a...

6.
Reasons You Should Eat Eggs for Breakfast
healthupdates.in

1. Egg keep you feeling full much longer than cereal or toast. The protein and fat in eggs helps sus...



 7.

Foods to Eat to Fat Quickly?
healthupdates.in

Gaining weight requires you to consume more calories more than you expend. Knowing which foods are h..




Tips to Help You Quit Smoking
healthupdates.in

So, you’ve decided to quit smoking. That’s awesome, and you’ll undoubtedly notice that your health a...






No comments:

Post a Comment