*భోజన ప్రియులకు మాత్రమే!*
సాంబారులో చందమామలు తెలుగువాడు మంచి భోజనప్రియుడని వేరే చెప్పవలసిన పనిలేదు.మన విస్తరిని ఉత్తరాది భోజనాలతో పోల్చి చూస్తే, ఎవరికైనా ఆ విషయం తెలిసిపోతుంది . అభిరుచుల్లో వైవిధ్యాన్ని గమనిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ‘ఆవకాయ రుచుల ఠీవి తానెరుగును, పూతరేకు తీపి కేతమెత్తు, ఉలవచారు త్రావ ఉత్సాహమును జూపు, పనసపొట్టు నొక్క పట్టుబట్టు!...’
వాడెవడని అడిగితే జవాబు కోసం తడుముకునే అవసరం రాదు. కనుకనే దేశదేశాల్లో తెలుగు రుచులు నేడు రాజ్యం ఏలుతున్నాయి. వైద్యులు కాదంటున్నా, ‘వరితో చేసిన వంటకంబు రుచియై వార్ధక్యముం బాపదే’ అంటూ మధుమేహులు వాదనకు దిగుతారు. భక్ష్య భోజ్య లేహ్య చోహ్య పానీయాలకు భోజనంలో భాగం కల్పించిన ఘనత తెలుగువాడిది. మామిడిపండుతోనో, మాగాయ టెంకతోనో ‘గడ్డపెరుగు నింత గారాబమును చేసి’ గర్రున తేన్చి, ఆ పూటకు భోజన పరాక్రమానికి స్వస్తి చెప్పడం వేరే వాళ్ళకు చేతకాదు.
‘కడుపే కైలాసం’ వంటి నానుడిని పుట్టించడం తెలుగువాడికి మాత్రమే సాధ్యం. కాబట్టే పరభాషల్లో అలాంటి పదబంధాలు కనపడవు. సరైన భోజన సదుపాయం దొరక్క ‘చల్లా న౦బలి త్రావితిన్ రుచులు దోసంబంచు పోనాడితిన్ తల్లీ! కన్నడ రాజ్యలక్ష్మీ! దయలేదా, నేను శ్రీనాథుడన్’ అని అదేదో ఘనకార్యంలా ఫిర్యాదు చేశాడంటే శ్రీనాథుడు తెలుగువాడు కాబట్టే!
కొరవి గోపరాజు ‘సింహాసన ద్వాత్రింశక’ను గాని, పాలవేకరి కదిరీపతి ‘శుకసప్తతి’ని గాని తిరగేస్తే తెలుగువారి భోజన పదార్థాల పట్టిక పట్టరాని విస్మయాన్ని కలిగిస్తుంది. చేపలను జలపుష్పాలుగాను, గోంగూరను శాకంబరీమాత ప్రసాదంగాను చమత్కరించడం తెలుగు నాలిక్కి మాత్రమే పట్టుబడే విద్య. ఏ గిరీశాన్నో నిలదీస్తే ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం’ అన్నవాడు ఆంధ్రుడే- అని ఠక్కున చెబుతాడు. ‘చల్ది వణ్ణం’ తినడానికి అభ్యంతరం లేదని బుచ్చెమ్మకు అందుకే గట్టిగా చెప్పగలిగాడు.
మహాభారతంపై మమకారాన్ని ప్రకటిస్తూ ‘వింటే భారతమే వినాలి’ అని వూరుకుంటే- తెలుగువాడు ఎందుకవుతాడు? ‘తింటే గారెలే తినాలి’ అంటూ తన జిహ్వచాపల్యాన్ని జోడించడం తెలుగువాడికే చెల్లింది. ‘గారెలు తిందు నేను వడగాచిన నేతిని ముంచుకొంచు’ అనడం ఒకరి అభిరుచి విశేషం. తేనె పానకంలో నానబెట్టి ‘పాకం గారెలు’గా తినడం మరొకరికి ఇష్టం. ‘ఆ సుధారసంబునందు వూరిన గారెలు ఇచ్చు పరితుష్టికి పుష్టికి సాటిలేదిలన్’ అనేది వీరి అభిప్రాయం.
ఈ వేళంటే కంగాళీ తిళ్ళు(ఫాస్ట్‌ఫుడ్స్) వచ్చిపడి తెలుగువాడి తిండిపుష్టి ఇలా ధ్వంసం అయిందిగాని, మన పెద్దల తిళ్ళు గుర్తుచేసుకుంటే మనం ఎంత అర్భకులమో తెలిసొస్తుంది. అలా పెట్టీ, తినీ ఆస్తులు కరగదీసిన జాతి మనది!
తరవాణీల బలం- కాఫీ, టీలకు రమ్మంటే ఎలా వస్తుంది? ‘అరుణ గభస్తి బింబము ఉదయాద్రి పయిం పొడతేర గిన్నెలో పెరుగును, వంటకంబు వడపిండియలతో’ చల్దులను పిల్లలకు ఎలా తినిపించేవారో కృష్ణదేవరాయలు ‘ఆముక్తమాల్యద’లో వర్ణించాడు.
‘మాటిమాటికి వ్రేలు మడిచి వూరించుచు వూరుగాయలను’ గోపబాలకులు ఎలా ఇష్టంగా ఆరగించారో భాగవతంలో పోతన వర్ణించాడు.
ఈ చద్దన్నాలకు, ఆ పానీయాలకు పోలికే లేదు. కాఫీ, టీల మూలంగా మంటపుట్టిందే తప్ప ‘కడుపులో చల్ల కదలకుండా’ హాయిగా తిని కూర్చోవడం మనకు వీలుకావడం లేదు.
ఆ రోజుల్లో వడ్డనలూ భారీగానే ఉండేవని కల్పవృక్షంలో విశ్వనాథ పేర్కొన్నారు.
దశరథుడి అశ్వమేధయాగ సంతర్పణలో ఎన్నో రకాల వంటకాలు సిద్ధంచేసి ‘హస్తములు అడ్డముంచినను ఆగక వడ్డన చేసిరన్నియున్’ అని వర్ణించారు.
విస్తరిపై వంగి వద్దు వద్దంటే కడుపులో ఇంకాస్త చోటున్నట్లట! బొజ్జ వంగక కళ్ళతోనే నిస్సహాయంగా సైగలు చేస్తే ఇక చాలు అని ఆగేవారట. తెలుగువాడి భోజనప్రీతిని వెల్లడించే ఉదాహరణలివన్నీ.
వూరుగాని వూరు పోతే ముందస్తుగా ‘మంచి భోజనమ్ము మర్యాదగా పెట్టు పూటకూళ్ళ యిళ్ళ వేట’లో నిమగ్నం కావడం గతంలో తెలుగువాడి ఆనవాయితీ.
వండటం వడ్డించడం తినడంలోనే కాదు- ఆరోగ్యం విషయంలోనూ తెలుగువాడి అభిరుచి ప్రత్యేకమైనదేనని మళ్ళీ కొత్తగా నిరూపణ అయింది.
ఇడ్లీ తెలుగువాడికి చాలా ఇష్టమైన పదార్థం. ‘ఇడ్డెనల్’ అనేది అటు కవుల ప్రయోగాల్లోను, ఇటు నిఘంటువుల్లోను కనిపించే అచ్చతెనుగు పదం. ‘చినచిన్న చందమామలు నునుమల్లెల మెత్తదనము నోటికి హితమౌ, జనప్రియములు రుచికరములు- ఇడ్డెనలకు ఎనయైన భక్ష్యమేది ధరిత్రిన్’ అని బులుసు వేంకటేశ్వర్లు కవి చెప్పినట్లు తెలుగువారు ‘తినుచున్న ఇడ్డెనలు తినుచుంద్రు నిత్యము’ అనిపిస్తుంది. పిండిని ఉడకబెట్టి ఆవిరిపై వండే పదార్థాన్ని ‘ఇడ్లి ’ అంటారు.
దాన్నే పనస ఆకుల మధ్య ఒబ్బిడిగా ఉడికిస్తే- అది పొట్టిక్కబుట్ట! ఆషాఢ మాసపు చివరి రోజుల్లో కడుపులో పెరిగే క్రిముల నివారణకు పనసాకులతో సహా ఉడికే పొట్టిక్కబుట్టలోని ఆహారం దివ్య ఔషధం! సాధారణ ఇడ్లీకి సాంబారు చక్కని జత. ‘సాంబారులో స్నానం చేస్తున్న ఇడ్లీ సుందరి’ ఓ సందర్భంలో శ్రీశ్రీ కవితలో మెరిసింది. ‘ఉదయంపూట ఆహారంగా తినే ఇడ్లీ ప్రపంచంలోని ఆహార పదార్థాలన్నింటికన్నా ఆరోగ్యకరమైనది’ అని ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. ఆ మేరకు యునెస్కో డైరెక్టర్ జనరల్ ఇరినా బొకోవా సంతకంతో జారీ అయిన యోగ్యతాపత్రం ఇటీవల సామాజిక మాధ్యమాల్లో ప్రాచుర్యం పొందింది. లక్షలమంది ఆ విశేషాన్ని ఒకరితో ఒకరు ‘పంచు’కుంటున్నారు. ఈ సంగతి తెలియగానే ‘ఇడ్డెనతో సాంబారును గడ్డపెరుగుతోడ ఆవకాయయు జతగా...’ హాయిగా లాగిస్తూ మన పూర్వీకులు ‘సొడ్డుసుమీ స్వర్గలోక సుఖముల కెల్లన్’ అనుకుంటూ ఆరోగ్యంగా జీవించారని కవులు కీర్తించడం మొదలెట్టారు. ఐక్యరాజ్య సమితి పుణ్యమా అని మన వంటకానికి అంతర్జాతీయ గుర్తింపు దక్కడం ఆంధ్రులకు గర్వకారణమని వారి ఆనందం!
( తెలుగు వెలుగు మాసపత్రిక సౌజన్యముతో)
.........
**♿14 లోకాలు ఏవి - వాటి వివరణ:*
*భూలోకంతో కలిపి భూలోకానికి పైన ఉండేవి ఊర్ధ్వలోకాలు*
*1) భూలోకం* - ఇచ్చట స్వేదం(చెమట నుండి ఉద్భవించు పేళ్ళు (పేనులు), నల్లులు మొ॥), ఉద్భిజాలు (గ్రుడ్డు నుండి ఉద్భవించు పక్షులు), జరాయుజాలు (స్త్రీ, పశువుల గర్భం నుండి ఉద్భవించు మానవులు పశువులు) అని నాలుగు విధాలైన జీవరాసులు.
*2) భువర్లోకము (భూలోకము పైన)* - ఇచ్చట సూర్య, చంద్ర, గ్రహ, నక్షత్రాదులు, అశ్విన్యాది నక్షత్ర సద్రుప్యాలైన గ్రహరాసులు, సూక్ష్మ శరీరులైన కిన్నెర, కింపురుష, విద్యాధరులు కలరు.
*3) సువఃలోకము లేక సువర్లోకము లేక స్వర్గలోకము (భువర్లోకము పైన)* - ఇక్కడ అధిష్ఠాన దేవతలు అగు ఇంద్రాదులు, దిక్పాలకులు, వర్ష-వాయువులు, ఐశ్వర్యాదులు కలరు. వీరితోపాటు సాధ్యులు, మహర్షులు, గంధర్వులు, అప్సరసలు కలరు. వీరు కామరూపులై భోగాలను అనుభవింతురు. వీరికి వ్రుద్ధ్యాం, శరీర దుర్గందాధులుండవు. వీరిని క్షుత్పిసలు బాధింపవు. వీరు అయోనిజులు కావున, మాత్రు-గర్భ వాసం లేదు.
*4) మహర్లోకము (సువర్లోకము పైన)* - ఇక్కడ దేవతలు తపస్సు చేస్తుంటారు. ఎలా స్వర్గలోకంలోని దేవతలు దివ్య సుఖాలను అనుభవిస్తున్నారో, అవిన్నీ ఇక్కడ తపస్సు ద్వారా పరిపూర్ణంగా అనుభవిస్తుంటారు.
*5) జనోలోకము (మహర్లోకము పైన)* - దీనిని కొందరు సత్యలోకం అని కూడా అంటారు. ఏ స్త్రీ భర్త మరణానంతరం సహగమనం చేస్తారో, ఆమె పవిత్ర శీలప్రభావంతో ఆమె పతికి అన్య జన్మ ఉన్నప్పిటికినీ, జన్మరాహిత్యం కలిగి, సతిపతులిరువు ఈ జనలోకంలో సుఖసాంతులతో వర్ధిల్లుదురు. ఇక్కడ అయోనిజ దేవతలు కూడా తపమాచరిస్తుంటారు.
*6) తపోలోకము (జనోలోకము పైన)* - ఇక్కడ అయోనిజ దేవతలు నివసిస్తారు. పంచభూతాలు, పంచేంద్రియాలు వీరి ఆధీనంలో ఉంటాయి. కైలాసం, వైకుంఠం, మణిద్వీపం, స్కంధలోకం ఇచ్చటనే కలవు. ఈ లోకం సర్వదా సుగంధ ద్రవ్యాల సువాసనలతో, శాంతియుతంగా, సాంద్రానందంతో కూడి ఉంటుంది. భూలోకంలో ఎవరెవరు, ఏయే దేవతాముర్తులను ఉపాసిస్తారో ఆయా మూర్తుల రూపాలతో ఇక్కడ తపం ఆచరిస్తున్నారు. ఈ రీతిగా వారు కల్పాంత-కాలం అక్కడనే ఉండి కర్మానుసారం భూలోకంలో తిరిగి జన్మించి, మరల పవిత్ర తపాలు ఆచరించి, ఎప్పుడు మహాప్రళయంలో సర్వం లయమగునో అప్పుడు వీరు కూడ జన్మరాహిత్యం పొందుదురు.
*7) సత్యలోకం (తపోలోకము పైన)* - ఇక్కడ సృష్టికర్త అయిన హిరణ్యగర్భుడు, బ్రహ్మ అను ఒక అధికారిక పురుషుడు ఆ పదవిని అనేకానేక కల్పానంతరం ఒక్కక్కరు పొంది తమ ఆయువు తీరినంతనే బ్రహ్మంలో లయమవుతారు. ప్రస్తుత బ్రహ్మకు మొదటి అర్థభాగం తీరినది. భావిబ్రహ్మ శ్రీ ఆంజనేయస్వామి. ఈ లోకంలో కూడ అనేక ఉపాసనలు చేసినవారు, వేదాంత విచారకులు, భూలోకంలో ఆత్మజ్ఞానం పొందినవారు, అసంఖ్యాకులగు మహర్షులు వేదాంతవిచారణలు గావిస్తుంటారు.
*భూలోకానికి కింద ఉండేవి అధలోకాలు (7):*
*1) అతల లోకం* - ఇందులో అసురులు నివసిస్తుంటారు. వీరు సూక్ష్మ శరీరులు. భౌతిక సుఖలాలసులు కావున అధిక మద సంపన్నులు.
*2) వితల లోకం (అతలలోకం కింద)* - ఇక్కడ పార్వతీ-పరమేశ్వరుల వీర్యం ‘ఆఢకం‘ అనే నది సువర్ణ జల ప్రవాహాంతో నిండి ఉండును. అనేక భౌతిక సుఖాలతో పాటు ఈ నదీ ప్రవాహంతో స్వర్ణాభరణాలు చేసుకొని ధరించెదరు.
*3) సుతల లోకము (వితల లోకం కింద)* - సప్త చిరంజీవులలో ఒకడైన మహాపురుషుడు బలి చక్రవర్తి ఇక్కడే ఉన్నాడు. అయన సర్వదా విష్ణుధ్యాన పరాయణుడై, శ్రీమహావిష్ణువు ద్వారపాలకుడై కాపలాకాస్తున్నాడు.
*4) తలాతల లోకం (సుతల లోకం కింద)* - ఈ లోకంలో పరమేశ్వరునితో సంహరించబడిన దానవేంద్రులయిన త్రిపురాసురులు, దానవ శిల్పి అయిన మయుడు, మాయావిద్యలో నేర్పరులైన అసురులు, రాక్షసులు నివసిస్తారు.
*5) మహాతలము (తలాతలలోకము కింద)* - ఇక్కడ క్రదుపుత్రులైన (వినత క్రదువలు) కాద్రవేయులు(సర్పాలు), సహస్రాది శిరస్సులతో కూడినవారై మహా బలవంతులై కామరూపధారులై తమ పత్నులతో కూడి ఉన్నారు.
*6) రసాతలము (మహాతలం కింద)* - ఇక్కడ అసుర రాక్షస శ్రేష్ఠులు, నివాత కావచులు, కాలకేయాదులు, సురారులైన అనేక రాక్షసులు కలరు.
*7) పాతాళము (రసాతలం కింద)* - ఇక్కడ నాగలోకాధిపతియైన వాసుకి మొదలు సర్ప సమూహములన్ని కామరూపధారులై సుఖసంతోషాలతో ఉన్నారు. మహా ప్రళయ కాలంలో ఈ చతుర్ధశ భువనాలు పరబ్రహ్మంలో లీనమగును.
***
*🏵️🏵️చీకటి వెలుగులు🏵️🏵️*
🍁చుట్టూ చీకటి పరచుకున్నప్పుడు నీడ కూడా తోడుండని. అంధకారంలో ఒంటరితనం భయపెడుతుంది. చీకటి తొలగిపోయి వెలుగురేకలు విచ్చుకోగానే మనసు ఉత్సాహభరితమవుతుంది.
చుట్టూ చీకటి పరచుకున్నప్పుడు నీడ కూడా తోడుండని అంధకారంలో ఒంటరితనం భయపెడుతుంది. చీకటి తొలగిపోయి వెలుగురేకలు విచ్చుకోగానే మనసు ఉత్సాహభరితమవుతుంది. సూర్యకాంతిలో చుట్టూ ఉన్న ప్రకృతి మనకు ఆకర్షణీయంగా కనిపిస్తుంది. చీకటి వెలుగుల విన్యాసమే కాలచక్ర పరిభ్రమణం.
🍁కష్టాలు, ఆపదలనే చీకట్లు మనిషికి దుఃఖాన్ని మిగులుస్తాయి. కష్టకాలంలో ఆదుకునేవారుండరు. బంధువులు, మిత్రులు తప్పించుకు తిరుగుతారు. ఉన్నత స్థితి, సంపదలతో మనిషి ప్రకాశించినప్పుడు మిత్రులు ఆత్మీయులవుతారు. కష్టకాలంలో దూరమైనవారు కాలం కలిసిరాగానే చేరువవుతారు. విమర్శించినవారే అభినందిస్తారు. త్యాగం, దయ, ధర్మం, సత్యం మనసులో నిత్యం ప్రకాశించే సద్గుణసంపన్నుడు అందరి గౌరవం పొందుతాడు.
🍁బాల్యంలో మనసు కల్మషరహితంగా ఉంటుంది. కౌమార, యౌవన దశల్లో భిన్న ప్రవృత్తుల స్నేహితులు తోడవుతారు. స్నేహితుల ప్రభావం జీవనగమనంలో మార్పు తెస్తుంది. సజ్జన సాంగత్యం అభ్యుదయ పథమనే ప్రకాశవంతమైన క్రాంతిమార్గంలో నడిపిస్తుంది. దుర్జన సాంగత్యం మనసులో దురలవాట్లను ప్రేరేపించి మనిషిని అంధకారంలోకి లాగుతుంది. మంచి చెడుల విచక్షణ తెలుసుకోకుండా స్నేహితులను అనుకరించడం ప్రమాదకరం.
🍁మనిషితనను తాను తెలుసుకోవాలి. తన
శక్తిసామర్ధ్యాలను అంచనా వేసుకోవాలి. తన బలహీనతలను గుర్తించి సరిదిద్దుకునే మార్గాలను అన్వేషించాలి. జీవనపథంలో ఎదురైన అవకాశాలను అందిపుచ్చుకోవాలి. అవరోధాలను అధిగమించాలి. ఇవన్నీ ఒక్కరోజులో సంభవించేవి కావు. ఏళ్లతరబడి కష్టపడి శ్రమిస్తేనే ప్రగతి రథం ఆహ్వానిస్తుంది. నిత్య శ్రామికుడు విజయపథంలో ప్రకాశిస్తూ తోటివారికి చేయూతనిస్తాడు.
🍁భగవంతుడు అనుగ్రహించిన జ్ఞానమనే కాంతితో అజ్ఞానమనే చీకటిని పారదోలాలి. విజ్ఞులు తమ మేధను ఉపయోగించి సద్బుద్ధితో, స్వయంకృషితో తేజోవంతులవుతారు. సానుకూల దృక్పథమే మనోబలం. మనోబలమే చీకటిలోనూ కాంతులీనుతుంది. వ్యతిరేక ధోరణులు తిరోగమన సూచికలు. ప్రగతి ప్రతిబంధకాలు. అవి మేధను | హరించి మనసును చీకటిమయం చేస్తాయి. సూర్యకిరణాలు పడకపోతే చీకటి తెరలు
విడిపోనట్లు, కేశవుడి కీర్తన లేకపోతే చుట్టుముట్టిన
ఆపదలు తొలగిపోవని భాగవతం చెబుతోంది.
🍁'మనిషి ఆయుర్దాయంలో సగభాగం కారుచీకట్లతో కూడిన రాత్రివల్ల వృథా అవుతుంది. మిగిలిన సమయంలో కామక్రోధాదులు బంధంలో చిక్కుకుని బయటకు రాలేక సతమతమవుతాడు. తాను వేరు, మిగిలిన వారు వేరు అనే భావంతో సంసారమనే చీకటి నూతిలో కష్టాలను అనుభవిస్తాడు. శ్రీహరి చరణ కమల స్మరణమనే అమృతరసం తాగి పరవశులు కాగలిగిన వారికి భగవంతుడి కృపవల్ల కోరకుండానే ధర్మ, అర్థ, కామాలతోపాటు మోక్షం 'సిద్ధిస్తుంది' అని ప్రహ్లాదుడు ఉద్బోధించాడు.
🍁భగవన్నామస్మరణతో మనసు నిండిపోయినప్పుడు కారుచీకటిలోనూ కమలాక్షుడు అభయ ప్రదానం చేసి ఆదుకుంటాడు.
🍁శీతోష్ణస్థితుల్లో మార్పును దేహం తట్టుకున్నట్టే సుఖదుఃఖాలను మనసు సమానంగా స్వీకరించగలగాలి.
🍁 అప్పుడే మనిషి జీవన గమనంపై చీకటివెలుగుల ప్రభావం ఉండదు.
🍁సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించగల స్థితప్రజ్ఞుడే తనకిష్టమైన భక్తుడని భగవంతుడి గీతోపదేశం,
****
*మార్పు మంచిదే..!*
శివపురం అనే ఊరిలో సూరయ్య అనే వ్యక్తి నివసించేవాడు. అతనిది మహా జాలి గుండె. పైకి ఎగరలేని పక్షులు, వయసు ఉడిగి పోవడంతో పాలివ్వలేని జంతువులను చేరదీసి అతని ఇంటి పెరట్లో వాటిని పెంచుతున్నాడు. పక్షులకు అవసరమైన తిండి గింజలు, జంతువులకు అవసరమైన గడ్డిని పట్నం నుంచి తెచ్చి మరీ వాటికి పెట్టేవాడు. ఆ పక్షులు, జంతువులు అవి తిని కడుపు నింపుకుంటుంటే సంతృప్తి చెందేవాడు.
ఒకసారి ఇరుగుపొరుగు వారు సూరయ్యతో ‘ఎందుకూ పనికి రాని పక్షులు, జంతువులను చేరదీయడం వల్ల నీకు లాభం ఏంటి? నష్టమే కదా!’ అన్నారు. అప్పుడు సూరయ్య నవ్వుతూ... ‘మనుషులు ముసలివాళ్లయితే వారి పిల్లలు చేరదీసి బాగోగులు చూసుకుంటారు. కానీ ఈ పక్షులు, జంతువులను ఎవరు పట్టించుకుంటారు. నోరు లేని మూగ జీవులను ఎవరు ఆదరిస్తారు. వాటికి మాత్రం ఆకలి వేయదా? మనకు ఉపయోగపడినప్పుడు పెంచుకోవడం కాదు. వీటికి ఓపిక లేనప్పుడు చేరదీయడం కూడా మన ధర్మం’ అన్నాడు. సూరయ్య మాటలు అక్షర సత్యాలు అని అనుకున్నారు ఇరుగుపొరుగు వారు.
ఒకరోజు సూరయ్య జంతువుల, పక్షుల తిండి గింజలు కొనడం కోసమని పట్నం వెళ్లాడు. తిరిగి వచ్చే దారిలో గంగులు అనే దొంగ సూరయ్యను వెంబడించసాగాడు. చుట్టూ ఎవరూ లేని సమయం చూసి సూరయ్య మెడ మీద కత్తి పెట్టాడు. ‘మర్యాదగా నీ దగ్గర ఉన్న డబ్బు మొత్తం నాకిచ్చెయ్.. లేకపోతే చంపేస్తాను’ అని బెదిరించాడు. అప్పుడు సూరయ్య ఏ మాత్రం భయపడకుండా.. ‘చూడు నాయనా! నా దగ్గరున్న డబ్బుతో జంతువులకు, పక్షులకు ఆహారం కొనేశాను. మా ఇంటికి వస్తే నీకు డబ్బిస్తాను’ అన్నాడు.
‘నిన్ను నమ్మడం ఎలా?’ అడిగాడు గంగులు. ‘నేను మాటిస్తే తప్పను. నాతో వస్తే నీకే తెలుస్తుంది!’ సూరయ్య బదులిచ్చాడు. ‘సరే!’ అంటూ గంగులు సూరయ్య ఇంటికి నడిచాడు. అప్పటికే జంతువులు, పక్షులు ఆహారం కోసం ఆవురావురుమంటూ ఎదురు చూస్తున్నాయి.
‘అయ్యయ్యో! పట్నం వెళ్లడం వల్ల కొంచెం ఆలస్యమైంది. ఇప్పుడే పెడతాను తినండి’ అంటూ పక్షులకు తిండి గింజలు, జంతువులకు గడ్డి వేశాడు. అవి తింటూ ఆకలి తీర్చుకోసాగాయి. గంగులు అదంతా చూసి ఆశ్చర్యపోయాడు. సూరయ్యతో ‘వీటిని ఎందుకు చేరదీశావు. భలే అమాయకంగా ఉన్నావే! నిన్ను చూస్తే నవ్వొస్తోంది. ఈ జంతువుల్లో నేను వదిలేసిన ఆవు కూడా ఉంది. నిన్న మొన్నటి వరకూ దాని పాలు అమ్ముకుంటూ బతికాను. ఇప్పుడు ఆవు లేకపోవడంతో కష్ట పడడం ఇష్టం లేక దొంగతనాలు మొదలు పెట్టాను. వీటిని వృథాగా పోషిస్తున్న నిన్ను చూస్తే జాలి కూడా కలుగుతోంది. నాకు డబ్బిచ్చెయ్. వెళ్లిపోతాను’ అని వెటకారంగా నవ్వుతూ అన్నాడు గంగులు.
అప్పుడు గంగులుతో సూరయ్య ఇలా అన్నాడు. ‘చూడు గంగులూ! నిన్న మొన్నటి వరకూ ఈ జంతువులు, పక్షులు అందరికీ ఉపయోగపడ్డాయి. ప్రకృతి సమతుల్యతను కాపాడాయి. ఓపిక ఉన్నంత వరకూ కష్టపడి పని చేశాయి. ఓపిక లేక ఇక్కడికొచ్చాయి. కానీ కళ్లు, కాళ్లు, చేతులూ చక్కగా ఉండి ఒంట్లో ఓపిక ఉండి పని చేసుకోకుండా దొంగతనాలు చేస్తూ బతికే నిన్ను చూస్తుంటే నవ్వొస్తోంది’ అన్నాడు. సూరయ్య మాటలకు గంగులులో పరివర్తన మొదలైంది.
‘పనికిరాని మూగ జీవుల కడుపు నింపడం కోసం మీరు కష్టపడుతున్నారు. ఓపిక ఉండి కూడా కష్ట పడకుండా దొంగతనాలు చేసుకుంటూ బతుకుతున్న నా మీద నాకే అసహ్యం వేస్తోంది. ఇక ఇప్పటి నుంచి కష్ట పడి పని చేసుకుంటూ బతుకుతాను. దొంగతనాలు చేయను’ అన్నాడు. ఆ మాటలు విన్న సూరయ్య సంతోషించాడు.
‘నీలో మార్పు వచ్చింది. ఈ డబ్బుతో ఏదైనా వ్యాపారం చేసుకుని బతుకు. ఇంతకు ముందు నా దగ్గర డబ్బు ఉన్నా లేదన్నాను. నీలో మార్పు రావడానికి అలా చెప్పి ఇంటికి రమ్మన్నాను. నా ప్రయత్నం ఫలించింది’ అంటూ గంగులు భుజం తట్టాడు. గంగులు సూరయ్యకు నమస్కరించి ముందుకు కదిలాడు.
*****
హరిఓం, అహంబ్రహ్మశ్మి
💞మనం ఎదుటి వారికి ఏమి ఇస్తే
అదే తిరిగి వస్తుంది అనే మాట చాలా సార్లు విని ఉన్నాము కదా.
చాలాసార్లు ఎవరో ఎవరికో డబ్బు సాయం చేశారని పేదలను ఆదుకున్నారని భగవంతునికి బంగారు కిరీటం సమర్పించారని లేదా ఇంకేదో అర్పించారని వినగానే మనకు ఉంటే ఇవ్వకపోదునా?...?
నా దగ్గర ఏమి ఉంది ఇవ్వటానికి అను కుంటాము కదా..
ఇలాగే ఆలోచించిన
ఒక పేదవ్యక్తి బుద్ధుని అడిగాడట.
నేను పేదవాడిగా ఎందుకు ఉన్నాను అని
అందుకు సమాధానంగా బుద్ధభగవానుడు...
నీ దగ్గర ఉదారత లేని కారణంగా నీ దగ్గర ఉన్నది
ఇచ్చే గుణం లేకపోవడం వల్ల అన్నాడట. ....
... నేనే పేద వాడిని నేను ఎవరికి ఏమి ఇవ్వగలను అన్నాడట ఆ పేదవాడు.
అప్పుడు బుద్ధుడు
నీ దగ్గర అయిదు {5}గొప్ప విషయాలు ఉన్నాయి కానీ నువ్వు అవి ఎవరికి పంచటం లేదు .... వాటిని పంచటం ద్వారా నీఉదారత్వం చూపించవచ్చు.
నా దగ్గర {5} విషయాలు ఉన్నాయా?
అది నాకు తెలియకుండా అంటూ అంతులేని ఆశ్చర్యానికి లోనయ్యాడు ఆ పేదవాడు.
*అందుకు బుద్ధుడు*
*మొదటిది నీ చిరునవ్వు.*
ఎదుటి వారిని చూడగానే అందమైన చిరునవ్వుని చిందించవచ్చు. కానీ అది నీవు చేయవు.
అలాగే రెండవది,నీవు ఈ లోకాన్ని చూసే కనులతో దయ, ప్రేమ, శ్రద్ద ఎదుటి వారికి అందించవచ్చు.
*కానీ అది నీవు చేయవు.*
మూడవది నీవు తినటానికి, మాట్లాడటానికి మాత్రమే అనుకునే నోటి తో నాలుగు మృదువైన మంచి మాటలు చెప్పవచ్చు.
*కానీ నువ్వు అది చేయవు.*
నాలుగవది నీ హృదయ మందిరం నుంచి మనస్ఫూర్తిగా ఎదుటి వారిని అభినందించవచ్చు. *కానీ నువ్వు అది చేయవు.*
ఇంకా ముఖ్యంగా ఐదవది నీ శరీరంలోని అవయవాలు అన్ని చక్కగా ఉన్నాయి.
నీ కాళ్ళని చేతుల్ని
ఉపయోగించి ఎంతయినా సేవ చెయ్య గలవు.
*కానీ నువ్వు అది చేయవు.*
*ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన విషయం ఏమిటంటే మనం ఎన్నో కలిగి ఉన్నాము...*
*దానం అంటే ఉదారత్వం*
అంటే ఎదుటి వారికి
డబ్బు లేదా వస్తువులు ఇవ్వటం మాత్రమే కాదు మనకి ఉన్నంతలో చేతనయినంతలో ఇతరులకి ఇవ్వటమే ఉదారత్వం అంటూ తెలియచేశాడు బుద్ధ భాగవానుడు.
*****
*🙏ఆఖరి మజిలీ. చివరికుమిగిలేది??✍️*
----------------------------------------------
*(THE DETACHMENT)*
*ఆమె వయస్సు 85 ఏళ్లు…* *ముంబై నుంచి పూణెకు వెళ్లిపోతోంది… పూణెలో ఓ సీనియర్ సిటిజెన్స్ హోమ్‌కు…* అనగా ఓ ప్రత్యేక వృద్ధాశ్రమానికి…
ఆమె భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడు…
ఆమె చదువుకున్నదే…
*ముగ్గురు పిల్లల పెళ్లిళ్లు చేసింది. వాళ్లందరూ అమెరికాపౌరులు. అందరికీ ఇద్దరేసి పిల్లలు…*
వాళ్లంతా హైస్కూల్, కాలేజీ చదువుల్లో ఉన్నారు… ఈమె *అమెరికాకు బోలెడుసార్లు వెళ్లింది… కాన్పులు చేసింది…*
*వెళ్లిన ప్రతిసారీ ఆరు నెలలపాటు ఉండేది…*
ఇక చాలు అనుకుంది…
ఇక తన అవసరం ఎవరికీ ఏమీ లేదు. అమెరికాకు వెళ్లాలని లేదు, రానని చెప్పేసింది… ఆరోగ్యంగా మిగిలిన జీవితం గడపాలి చాలు… అందుకే ఆమె సీనియర్ సిటిజెన్స్ హోంకు వెళ్లిపోతోంది… వాటినే రిటైర్‌మెంట్ హోమ్స్ అనండి… అమెరికాలో వాటినే నర్సింగ్ హోమ్స్ అంటారుట… ఆమె ఏమంటున్నదో చదువండి.
‘‘వెళ్తున్నాను… ఇక తిరిగి ఎక్కడికీ రాను… నా విశ్రాంత, చివరి కాలం గడపటానికి ఓ స్థలం వెతుక్కున్నాను… వెళ్లకతప్పదు… తమ పిల్లల బాగోగుల గురించి నా పిల్లలు బిజీ… ఎప్పుడో గానీ నేను వారి మాటల్లోకి రాను… నేనిప్పుడు ఎవరికీ ఏమీ కాను… ఎవరికీ అక్కరలేదు… ఆశ్రమం అంటే ఆశ్రమం ఏమీ కాదు… అది రిటైర్‌మెంట్ హోం… బాగానే ఉంది… ఒక్కొక్కరికీ ఒక సింగిల్ రూం… మరీ అవసరమైన ఎలక్ట్రికల్ పరికరాలు… టీవీ… అటాచ్డ్ బాత్రూం… బెడ్డు…
ఏసీ కూడా ఉంది… కిటికీ తెరిస్తే బయటి గాలి… ఫుడ్డు కూడా బాగుంది… సర్వీస్ బాగుంది… కానీ ఇవేమీ చవుక కాదు… ప్రియమైనవే… నాకొచ్చే పెన్షన్ బొటాబొటీగా ఈ అవసరాలకు సరిపోతుంది… సరిపోదంటే నాకున్న సొంత ఇంటిని అమ్మేయాల్సిందే… అమ్మేస్తే ఇక చివరి రోజులకు సరిపడా డబ్బుకు ఢోకాలేదు… నా తరువాత ఏమైనా మిగిలితే నా కొడుక్కి వెళ్లిపోతుంది… సో, ఆ చీకూచింత ఏమీ లేదు… ‘నీ ఇష్టం అమ్మా, నీ ఆస్తిని నీ అవసరాలకే వాడుకో…’’ అన్నాడు నా వారసుడు…
వెళ్లిపోవడానికి సిద్ధమైపోతున్నాను… ఓ ఇంటిని వదిలేయడం అంటే అంత సులభమా..? కాదుగా… బాక్సులు, బ్యాగులు, అల్మారాలు, ఫర్నీచర్, రోజువారీ మన జీవితంతో పెనవేసుకున్న బోలెడు పాత్రలు… అన్ని కాలాల్లోనూ మనల్ని కాపాడిన బట్టలు… సేకరణ అంటే నాకిష్టం… లెక్కలేనన్ని స్టాంపులు ఉన్నయ్… చాయ్ కప్పులున్నయ్… అత్యంత విలువైన పెండెంట్లు, బోలెడు పుస్తకాలు… అల్మారాల నిండా అవే…
డజన్లకొద్దీ విదేశీ మద్యం సీసాలున్నయ్… బోలెడంత వంట సామగ్రి ఉంది… అరుదైన మసాలాలు… ఇవే కాదు, అనేక ఫోటో అల్బమ్స్… ఇవన్నీ ఏం చేయాలి..? నేను ఉండబోయే ఆ ఇరుకైన గదిలో వాటికి చోటు లేదు… నా జ్ఞాపకాల్ని అది మోయలేదు… అది భద్రపరచదు కూడా… ఏముంది ఆ గదిలో…? మహా అయితే ఓ చిన్న కేబినెట్, ఓ టేబుల్, ఓ బెడ్, ఓ సోఫా ఓ చిన్న ఫ్రిజ్, ఓ చిన్న వాషింగ్ మెషిన్, ఓ టీవీ, ఓ ఇండక్షన్ కుక్కర్, ఓ మైక్రోవేవ్ ఓవెన్… అన్నీ అవసరాలే… కానీ నా జ్ఞాపకాల్ని కొనసాగించే సౌకర్యాలు కావు…
నేను నా విలువైన సంపద అనుకున్న ఏ సేకరణనూ నాతో ఉంచుకోలేను… అకస్మాత్తుగా అవన్నీ నిరుపయోగం అనీ, అవి నావి కావనీ అనిపిస్తోంది… అన్నీ నేను వాడుకున్నాను, అంతే… అవి ప్రపంచానికి సంబంధించినవి మాత్రమే… నావి ఎలా అవుతాయి..? నా తరువాత ఎవరివో… రాజులు తమ కోటల్ని, తమ నగరాల్ని, తమ రాజ్యాల్ని తమవే అనుకుంటారు… కానీ వాళ్ల తరువాత అవి ఎవరివో… నిజానికి ప్రపంచ సంపద కదా…
మనతోపాటు వచ్చేదేముంది..? వెళ్లిపోయేది ఒక్క దేహమే కదా… అందుకని నా ఇంట్లోని ప్రతిదీ దానం చేయాలని నిర్ణయించాను… కానీ అవన్నీ కొన్నవాళ్లు ఏం చేస్తారు..? నేను అపురూపంగా సేకరించుకున్న ప్రతి జ్ఞాపకం వేరేవాళ్లకు దేనికి..? వాటితో వాళ్లకు అనుబంధం ఉండదుగా… బుక్స్ అమ్మేస్తారు… నా గురుతులైన ఫోటోలను స్క్రాప్ చేసేస్తారు… ఫర్నీచర్ ఏదో ఓ ధరకు వదిలించుకుంటారు… బట్టలు, పరుపులు బయటికి విసిరేస్తారు… వాళ్లకేం పని..?
మరి నేనేం ఉంచుకోవాలి..? నా బట్టల గుట్ట నుంచి కొన్ని తీసుకున్నాను… అత్యవసర వంట సామగ్రి కొంత… తరచూ పలకరించే నాలుగైదు పుస్తకాలు… ఐడీ కార్డు, సీనియర్ సిటెజెన్ సర్టిఫికెట్, హెల్త్ ఇన్స్యూరెన్స్ కార్డ్, ఏటీఎం కార్డు, బ్యాంకు పాస్ బుక్కు… చాలు… అన్నీ వదిలేశాను… బంధం తెంచేసుకున్నాను… నా పొరుగువారికి వీడ్కోలు చెప్పాను… డోర్ వేసి, గడపకు మూడుసార్లు వంగి మొక్కుకున్నాను… ఈ ప్రపంచానికి అన్నీ వదిలేశాను…
ఎవరో చెప్పినట్టు… ఏముంది..? ఓ దశ దాటాక… కావల్సింది ఒక మంచం… ఓ గది… అత్యవసరాలు… మిగిలినవన్నీ గురుతులు మాత్రమే… ఇప్పుడు అర్థమవుతుంది మనకు… మనకు పెద్దగా ఏమీ అక్కర్లేదు… మనం ఇకపై సంతోషంగా ఉండేందుకు మనకు ఇక ఎటూ పనికిరానివాటిని సంకెళ్లుగా మిగుల్చుకోవద్దు… వదిలేయాలి… వదిలించుకోవడమే…
కీర్తి, సంపద, భవిష్యత్తు… అన్నీ ఓ ట్రాష్… లైఫ్ అంటే చివరికి ఓ పడకమంచం మాత్రమే… నిజంగా అంతే… అరవై ఏళ్లు పైబడ్డామంటే ఆలోచన మారాలి… ప్రపంచంతో అనుబంధం ఏమిటో తెలుసుకోవాలి… అంతిమ గమ్యం ఏమిటో, భవబంధాలేమిటో అర్థమవ్వాలి… మన ఫాంటసీలు, మన బ్యాగేజీతో పాటు మనం ఇక తినలేని, అనుభవించలేని, ఉపయోగించలేనివి వదిలేయక తప్పదు… అందుకే బంధం పెంచుకోవడమే వృథా… సో, ఆరోగ్యంగా ఉండండి… ఆనందంగా ఉండండి… ఏదీ మనది కాదు… ఎవరూ మనవాళ్లు కారు… మనిషి ఒంటరి… మహా ఒంటరి… వచ్చేటప్పుడు, పోయేటప్పుడు’’..!!
*:**
ప్రాంజలి ప్రభ
*ధర్మాత్ముడు:*
ఓరాజుకు నలుగురు కొడుకులు ఉండేవారు. "ఎవడైతే సర్వాధికుడైన ధర్మాత్ముణ్ణి వెతికి తీసుకువస్తాడో అతడికే రాజ్యాధికారం ఇస్తాను" అన్నాడు ఆ రాజు తన కొడుకులతో.
రాకుమారులు నలుగురూ తమ గుఱ్ఱాలు తీసుకుని నాలుగు దిక్కులకూ బయలుదేరారు.కొన్నాళ్ల తర్వాత పెద్ద కొడుకు తిరిగి వచ్చి తండ్రికి ఎదురుగా ఓవ్యాపారిని నిలబెట్టి, "ఈ శేఠ్ గారు వేలాది రూపాయలు దానం చేస్తుంటారు. ఎన్నో గుళ్లూ గోపురాలు కట్టించారు. చెరువులు తవ్వించారు. చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. తీర్థక్షేత్రాలలో ఎన్నో వ్రతాలు చేస్తుంటారు. నిత్యం పురాణ శ్రవణం చేస్తుంటారు. గోపూజలు చేస్తుంటారు. ప్రపంచంలో వీరిని మించిన గొప్ప ధర్మాత్ముడెవరూ ఉండరు." అన్నాడు.
’ఈయన నిశ్చయంగా ధర్మాత్ముడే!’అని పలికిన రాజు, ఆ వ్యాపారిని సత్కరించి పంపివేశాడు.
రెండవ కొడుకు ఓ బక్కచిక్కిన బ్రాహ్మణుడిని తీసుకువచ్చి "ప్రభూ! ఈ బ్రాహ్మణుడు నాలుగు ధామాలకు, సప్తపురాలకు కాలినడకన వెళ్లి యాత్రలు చేసివచ్చాడు. సదా వీరు చాంద్రాయణ ప్రతం చేస్తుంటారు. అసత్యానికి వీరు భయపడతారు. ఈయన కోపగించడం ఎవరూ, ఎన్నడూ చూడలేదు. నియమబద్దంగా మంత్ర జపాదులు పూర్తి చేసుకున్న తరువాతే జలపానం చేస్తారు. త్రికాలాల్లోనూ స్నానం చేసి సంధ్యావందనం చేస్తారు. ఈకాలంలో యీవిశ్వంలో వీరిని మించి సర్వశ్రేష్ట ధర్మాత్ములెవరూ లేరు." అన్నాడు.
రాజు బ్రాహ్మణ దేవతకు నమస్కరించి అధిక దక్షిణలిచ్చి, వీరు మంచి ధర్మాత్ములే అంటూ పంపివేశాడు.మూడవ కొడుకు కూడా ఒక బాబాజీని తీసుకొని వచ్చాడు. ఆబాబాజీ వస్తూనే ఆసనం వేసుకుని కళ్ళు మూసుకుని కూర్చుండి పోయారు. జీర్ణమైన బట్టలతో అస్థిపంజరంలా ఉన్న ఆకారంతో ఆయన కనిపిస్తున్నాడు. అందరూ ఆసీనులైన తరువాత మూడవ కొడుకూ "ప్రభూ! వీరు ఎంతగానో నేను ప్రార్థించగా ఇక్కడకు విచ్చేశారు. వీరు మహా తపస్వులు. వారానికి ఒక్కసారి మాత్రమే క్షీరపానం చేస్తారు. గ్రీష్మ ఋతువులో పంచాగ్ని మధ్యంలో ఉంటారు. శీతకాలంలో జలాలలో నిలబడుతారు. సదా భగవంతుని ధ్యానంలో వుండే వీరికి మించిన మహా ధర్మాత్ములు లభించడం దుర్లభమే..." అన్నాడు.
రాజు ఆమహాత్మునికి సాష్టాంగ ప్రణామం చేసి వారి ఆశీస్సులు అందుకుని వీడ్కోలు పలికాడు.. ఆపై వీరు ధర్మాత్ములే అన్నాడు.అందరి తరువాత చిన్నకొడుకు వచ్చాడు. అతనితో మాసిన బట్టలు కట్టుకున్న పల్లెలో నివసించే ఓ రైతు ఉన్నాడు. దూరం నుండియే రాజుకు దండాలు పెడుతూ భయపడుతూ ఆ రైతు వచ్చి నిలబడ్డాడు. అన్నలు ముగ్గురూ తమ్ముని మూర్ఖత్వానికి పకపక నవ్వారు. అప్పుడా చిన్నకొడుకు… " ప్రభూ! ఓకుక్కకు గాయం అయ్యింది. ఇతను అది చూసి దాని గాయం కడిగాడు. అందుకే నేనితణ్ణి తీసుకువచ్చాను. ఇతడు ధర్మాత్ముడవునో కాదో మీరే అడిగి తెలుసుకోండి" అన్నాడు.
రాజు "ఏమయ్యా! నువ్వు ఏంధర్మం చేస్తుంటావు?"
భయపడుతూనే రైతు పలికాడు… "ప్రభూ! నేను చదువుకున్నవాణ్ణి కాను. నాకు ధర్మం అంటే ఏం తెలుస్తుంది, ఎవరైనా జబ్బుపడితే సేవ చేస్తాను. ఎవరైనా యాచిస్తే గుప్పెడు మెతుకులు పెడతాను"అంతట రాజు, "ఇతడే అందరికన్నా గొప్ప ధర్మాత్ముడు" అన్నాడు.
అది విని కొడుకులందరూ అటూ ఇటూ చూడసాగారు. రాజు అప్పుడు, "దాన ధర్మాలు చేయడం, గోపూజ చేయడం, అసత్యమాడక పోవడం క్రోధంగా ఉండక పోవడం, తీర్థయాత్రలు, సంధ్యావందనం పూజాదులు కొనసాగించడం కూడా ధర్మమే. తపస్సు చేయడం ఆవశ్యకమైన ధర్మమే, కానీ సర్వాధిక ధర్మమేమంటే అర్థించక పోయినా అసహాయ స్థితిలో ఉన్న వారిని ఆదుకోవడం, రోగికి సేవ చేయడం, కష్టంలో ఉన్న వారికి చేయూతనీయడం సర్వాధికమైన ధర్మం. పరులకు సహకరించే వారికి తనంతతానుగా సహాయం అందుతుంది. త్రిలోక నాథుడైన పరమాత్మ అట్టి పరోపకార పరాయణునిపై ప్రసన్నుడై ఉంటాడు" అని అన్నాడు.
అందుకే పరోపకారం అన్నింటికన్నా మించిన ధర్మం. అది నిర్వర్తించే వాడే ధర్మాత్ముడు.
*****.
*****
ఏమి కావాలి నీకు
ఒక పేదవాడు సంతలో తిరుగుతున్నాడు. చాలా ఆకలిగా ఉంది. అతడి దగ్గర ఉన్నది ఒక్క రూపాయి మాత్రమే ! దానితో తన ఆకలి ఎలా తీర్చుకోవడం
సంత ఈ చివరి నుండి ఆ చివరికి తిరిగాడు. ఒక చోట కొట్లో ఒక ఇత్తడి దీపం కనిపించింది.
దాని క్రింద ఇలా వ్రాసి ఉంది, ఒక్క రూపాయి మాత్రమె అని.
షాపు వాడి దగ్గరకి వెళ్లి అడిగాడు. ఎందుకు ఇంత తక్కువ డబ్బుకు అమ్ముతున్నావు అని.
ఆ షాప్ వాడు " బాబూ ! ఇది ఒక అద్భుత దీపం. ఇందులో భూతం ఉంది. అది నువ్వు కోరుకున్న కోరికలు అనీ తీరుస్తుంది. అయితే ఈ భూతానికి ఒక లక్షణం ఉంది. అది ఎప్పుడూ చురుకుగా ఉంటుంది. ఎప్పుడూ దానికి ఏదో ఒక పని చెబుతూ ఉండాలి. లేదంటే తాను ఇచ్చిన బహుమతులు అన్నీ తీసుకుని వెళ్ళిపోతుంది. అదీ దిని కధ. "
పేదవాడు దానిని ఒక్క రూపాయకు కొనుక్కున్నాడు. ఇంటికి తీసుకు వెళ్ళాడు . దానిని బాగా రుద్దాడు భూతం ప్రత్యక్షం అయ్యింది."ఏమి కావాలి నీకు" అని అడిగింది.
తనకు ఆకలి వేస్తోంది కనుక భోజనం ఏర్పాటు చెయ్యమన్నాడు. క్షణాలలో పంచ భక్ష్య పరమాన్నాలతో భోజనం ప్రత్యక్షం అయ్యింది.
భోజనం కాగానే, ఏమి కావాలి నీకు అని " అడిగింది . పడుకోవడానికి మంచం అడిగాడు. వెంటనే హంసతూలికా తల్పం వచ్చేసింది.
నిద్రపోతూండగా ఏమి కావాలి నీకు అని అడిగింది.
ఒక మంచి ఇల్లు కావాలని అడిగాడు.
వెంటనే రాజభవనం లాంటి ఇల్లు వచ్చేసింది.
ఏమి కావాలి నీకు అని అడిగింది.
పేదవాడు ఇపుడు ధన వంతుడు అయ్యాడు. కోరికలు అడుగుతూనే ఉన్నాడు. అవి తీరుతూనే ఉన్నాయి. అతడికి విసుగు వచ్చేస్తోంది.
ఎన్నని అడగగలడు, అడగక పోతే ఈ భూతం వదిలి వెళ్ళిపోతుంది. భూతం తో పాటు సంపదలూ పోతాయి. ఎలా అని ఆలోచించిన పేదవాడికి తన గ్రామంలోనే ఉన్న ఒక వృద్ధ సన్యాసి గుర్తుకు వచ్చాడు, అతడేదైనా పరిష్కారం చూపుతాడేమో అని అతని దగ్గరకు వెళ్ళాడు. ఆయనకు తన సమస్యను చెప్పుకున్నాడు.
తిరిగి ఇంటికి వచ్చేసరికి భూతం వచ్చి ఏమి కావాలి నీకు అని అడిగింది.
భూమిలో ఒక పెద్ద గొయ్యి తియ్యమన్నాడు. వెంటనే చాలా లోతుగా పెద్ద గొయ్య తీసింది భూతం. అందులో ఒక పెద్ద స్థంభం పాత మన్నాడు. పాతేసి ఏమి కావాలి నీకు అని అడిగింది.
ఆ స్థంభం మీద ఎక్కి దిగుతూ ఉండు. నేను మళ్ళీ నీకు చెప్పే వరకూ నువ్వు చెయ్యవలసిన పని ఇదే అని చెప్పాడు పేద వాడు. భూతం ఎక్కడం దిగడం చేస్తూ ఉంది.
పేదవాడు తన ఇంటికి వెళ్లి తాను చెయ్యవలసిన పనులను చెయ్యడం మొదలు పెట్టాడు. తన పొరుగు వారికి తాను ఏమి చెయ్యగలడో ఆయా సహాయాలు చెయ్యడం మొదలు పెట్టాడు. తన సౌఖ్యం, తన ఇరుగు పొరుగు వారి సౌఖ్యమూ చూస్తూ సుఖంగా గడపడం మొదలు పెట్టాడు.
కొన్ని రోజుల తరువాత భూతం ఏమి చేస్తోంది చూడడానికి స్థంభం దగ్గరకి వెళ్ళాడు.భూతం అలసిపోయిస్థంభం ప్రక్కన నిద్రపోతోంది.
తన విజయ గాధను తనకు మార్గం చూపిన ఆ వృద్ధుడి దగ్గరకు వెళ్లి చెప్పాడు.
ఇక్కడితో కధ పూర్తి కాలేదు, అసలు కధ ఇప్పుడే మొదలవుతుంది.
ఈ కధ మనది.
ఈ కధ మనకు ఏమి నేర్పుతుందో చూద్దామా
మన మనసు ఆ భూతం. అది ఎప్పుడూ ఆక్టివ్ గా ఉంటూ విశ్రాంతి లేకుండా కోరికలు కోరుతూనే ఉంటుంది.ఎప్పుడూ అలసట లేకుండా అడుగుతూ ఉండడమే దానిపని .
ఆ వృద్ధ సన్యాసి (అంటే మన అనుభవం) చెప్పిన...ప్రకారం భూతం నాటిన స్థంభం "మంత్రం" (దైవ నామ స్మరణ) ఎక్కడం దిగడం మంత్రం జపం.జప సాధన ! (మనసు ను స్వాధీనపరచుకుని సాధన చేయటం) అనునిత్యం మంత్ర జప సాధన చెయ్యడం ద్వారా విశ్రాంతి లేని మనస్సు విశ్రాంతి స్థితిలోకి వెళ్ళడం సాధ్యపడుతుంది.
అపుడు అది ధ్యాన స్థితిలోకి వెళ్ళడం జరుగుతుంది. మనసు ధ్యాన స్థితిలోకి వెడితే మనం అత్మ మేలుకొంటుంది.
అంతరాత్మ ఈ ప్రపంచాన్ని ఆనందించడం మొదలుపెట్టి, మనం ఇతరుల గురించి ఆలోచించడం మొదలు పెడతాము. ఆత్మ ప్రబోధానుసారం ప్రవర్తించడం మొదలు పెడతాం! ఇతరుల సౌఖ్యం కోసం తగిన చర్యలు తీసుకుంటాం.
మన మనసు అద్వితీయమైన శక్తులుకలిగి దైవ మాయచే నిర్మించిబడిన మహ గొప్ప మాయాయంత్రం. అంతే కాక దైవ శక్తి నిక్షిప్తమై ఉన్నా
మహోజ్వల జ్యోతి రూపం. మనం అడిగినవి అని సమకూర్చే శక్తి స్వరూపం.
ఆలోచనలను అదుపు చేయగలిగితే ఆ దివ్య జ్యోతి వెలుగు కనిపించడం మొదలవుతుంది.
ఆ దివ్యమైన వెలుగు లో దైవ దర్శనం సాధ్యమౌవుతుంది.
ఓం నమో నారాయణాయ
*****
నిర్వీర్యమైన నారాయణాస్త్రం —
మల్లాప్రగడ రామకృష్ణ
కురుక్షేత్ర యుద్ధం భీకరంగా జరుగుతోంది. శిఖండిని ఎదురుగా నిలబెట్టి భీష్ముని పడగొట్టిన తరువాత కౌరవ సేనకు ద్రోణాచార్యుడు సర్వ సైన్యాధ్యక్షుడయ్యాడు. అపార ధనుర్విద్యా సంపద కలిగిన ద్రోణుడు పాండవ సైన్యాన్ని ముప్పతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు త్రాగించాడు.
కౌరవ సేనలో నూతనోత్సాహం, పాండవులలో నిస్తేజం ఆవరించడం చూసిన శ్రీకృష్ణుడు “ ద్రోణుడికి అతడి కుమారుడు అశ్వత్థామ అంటే పంచప్రాణాలు. అతడు చనిపోయాడన్న వార్త విన్నంతనే అస్త్ర సన్యాసం చేస్తాడు. అప్పుడు ఆయన్ని జయించడం సాధ్యమవుతుంది” అని సలహా ఇచ్చాడు.
కృష్ణుడు సలహా చెబుతున్నప్పుడే అశ్వత్థామ అనే ఏనుగుని సంహరించాడు భీముడు . ఆ ఉత్సాహంతో ద్రోణుడికి ఎదురుగా వెళ్లి అశ్వత్థామ మరణించాడని చెప్పాడు. భీముడి మాటల్ని విశ్వ సించలేదు ద్రోణాచార్యుడు.
అశ్వత్థామకు ఉన్న అస్త్ర సంపద గుర్తు తెచ్చికుని గుండె నిబ్బరం పెంచుకుని మళ్లీ పాండవ సైన్యంపై భయంకరమైన అస్త్రాలను ప్రయోగించాడు.
అది చూసిన శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ‘ఎప్పుడూ సత్యం పలికే నీ మాటలను మాత్రమే ద్రోణాచార్యుడు విశ్వసిస్తాడు. అలాకాని పక్షంలో పాండవ సేనలు దారుణమైన కష్టాలు అనుభవిస్తాయి” అని బోధ పరిచాడు.
తప్పనిసరి పరిస్థితుల్లో ధర్మరాజు ద్రోణుడి ఎదుటకు వెళ్లి “అశ్వత్థామ చనిపోయాడు” అని బిగ్గరగా పలికాడు. ‘ఆ పేరుతో ఉన్న ఏనుగు’ అని గొణిగినట్టు చెప్పాడు. ధర్మరాజు బిగ్గరగా పలికిన మాటలు విన్నంతనే ద్రోణుడు నిస్త్రాణ డయ్యాడు. ఆ విచారంతో అస్త్ర సన్యాసం చేసాడు. మరుక్షణం దుష్టద్యుమ్నుడు విజృంభించి ద్రోణాచార్యుని వధించాడు.
తన తండ్రి మరణం వెనుక పాండవాగ్రజుడి అసత్యపు పలుకులు ఉన్నాయని తెలియగానే అశ్వత్థామ ఉగ్రరూపం దాల్చాడు. పాండవ సైన్యాన్ని సమూలంగా నాశనం చెయ్యాలనే ఉద్దేశంతో నారాయణస్త్రాన్ని ప్రయోగించాడు. ఆ అస్త్రం ప్రభావంతో అనేక బాణాలు పుట్టుకొచ్చాయి . ఆ అస్త్రం దూసుకు వస్తుంటే సూర్యకిరణాలు మసకబారాయి . దిక్కులు భీతిల్లాయి. ఆకాశం ఒణికింది. పర్వత సమూహాలు కంపించాయి . సముద్రాలు చెలియని కట్టను దాటాయి . ఈ విధంగా భయం కల్పిస్తూ ఆవిర్భవించిన ఆ నారాయణ అస్త్రం ప్రసరించినంత మేరకు ఎందరైతే పాండవ సైన్యాలు ఉన్నాయో అవన్నీ బూడిదై పోయాయి . ఆ అస్త్ర ప్రభావాన్ని చూసి భయపడిపోయాడు ధర్మరాజు. అర్జునుడు కూడ చూస్తూ ఉండిపోయాడు.
ఆ గండం నుంచి గట్టెక్కించమని శ్రీకృష్ణుని ప్రార్ధించాడు ధర్మరాజు. అప్పుడు శ్రీకృష్ణుడు సైనికులందరినీ వారి వాహనాల నుండి నేల మీదకు దిగి నిలబడమని చెప్పాడు. అలా చేసినట్టయితే ఆ దివ్యస్త్రాన్ని గౌరవించినట్టవుతుందని, అలాంటి వారిని అది ఏమీ చేయదని , ఆ దివ్యస్త్రానికి అదే విరుగుడు అనే రహస్యం వివరించాడు. అది విన్న వారందరూ అలాగే చేసారు.
భీముడు ఆ మాటలకు అడ్డు వచ్చి “ మీరు వాహనాలపై నుండి దిగవద్దు. యుద్ధ ప్రయత్నం మానడం వీర ధర్మం కాదు. నేను ఆ దివ్యస్త్రాన్ని అణిచివేస్తాను“ అని శంఖాన్ని పూరించాడు. ఆ దివ్యాస్త్రాన్ని ప్రయోగించిన అశ్వత్థామ వైపు రథాన్ని నడిపించాడు.
అశ్వత్థామ ఆ అస్త్రాన్ని ఈసారి భీముడి వైపు మళ్ళించాడు. దాంతో భీముడి రథాన్ని మంటలు ఆవరించాయి. అది చూసిన సైనికులంతా ఆయుధాలు కింద పడేసి నేల మీద నిలబడ్డారు. ఆ దివ్యాస్త్రం సైనికుల్ని వదిలిపెట్టి బయలుదేరింది .
అర్జునుడు ఆ అస్త్రం పైన వారుణాస్త్రం ప్రయోగించాడు . వారుణాస్త్రం వల్ల మంటలు కొద్దిగా తగ్గాయి తప్ప మరే ప్రభావం చూపించలేకపోయింది. అది చూసిన అశ్వత్థామ ఆ నారాయణ అస్త్రాన్ని మరింత ఎక్కువ శక్తివంతం చేశాడు .
నారాయణ శక్తిని అశ్వత్థామ ఉదృతం చేయగానే, భీముడి రథాన్ని ఆవరించడానికి బయలుదేరింది. కృష్ణార్జునులు ఆయుధాలను కిందపడేసి కాలినడకన భీముడి రథాన్ని చేరుకున్నారు. ఎంత చెప్పినా భీముడు వినకపోవడంతో కృష్ణార్జునులు అతన్ని కిందకు లాగే ప్రయత్నం చేశారు. కానీ భీముడు ఆయుధాల్ని విడువనని మొండి పట్టు పట్టాడు .
శ్రీకృష్ణుడు “ నేలమీద నిలబడి ఆయుధాలను విడిచిపెట్టడం మాత్రమే ఈ నారాయణ అస్త్రాన్ని ఉపసంహరింప చేస్తుంది. అంతే తప్ప మరొక పరిష్కారం లేదు. మార్గాంతరం ఉంటే మేమే చేసేవాళ్ళం” అంటూ భీముడు చేతిలోని ఆయుధాలను లాగేసాడు. కృష్ణార్జునులు ఇద్దరూ కలసి భీముడిని కిందకు తోసేశారు.
ధర్మరాజు సహా పాండవ సైన్యం యుద్ధం చేయకుండా ఆయుధాలు క్రింద పడేయడం వలన నారాయణాస్త్రం నుండి పెను ప్రమాదం తప్పింది. కొంతసేపటికి ఆ దివ్యాస్త్రం శాంతించింది.
ఆ దివ్యాస్త్రం శాంతించడంతో మరల రెండు పక్షాలు యుద్ధానికి సిద్ధమయ్యాయి.
మరోసారి ఆ దివ్యస్త్రాన్ని ప్రయోగించమని అశ్వత్థామను కోరాడు దుర్యోధనుడు.
ఆ అస్త్రాన్ని ఒక్కసారి మాత్రమే ప్రయోగించాలని, రెండోసారి ప్రయోగిస్తే అది తన వాళ్ళనే తినేస్తుందని, ఈ అస్త్రాన్ని ఇచ్చినప్పుడే నారాయణ భగవానుడు తన తండ్రితో చెప్పాడని అశ్వత్థామ వివరించాడు.
“కృష్ణుడికి ఈ అస్త్రం నుండి బయటపడే విధానం తెలిసినందు వల్లనే ప్రాణనష్టం లేకుండా పాండవులు రక్షింపబడ్డారు. ఇంత పెద్ద అస్త్రం నిర్వీర్యం కావడం మన దురదృష్టం “ అని వాపోయాడు అశ్వత్థామ.
అలా ఎన్నో సందర్భాల్లో పాండవులను ఆపదలనుంచి గట్టెక్కించాడు శ్రీకృష్ణుడు.
****
సాధనా చతుష్టయాల గురించి తెలుసా?
సాధన చతుష్టయాలైన సంతోషం, శమం, విచారణ, సాధు సంగమం అనేవి సంసార సాగరం నుంచి తరింపజేసే ఉపాయాలట. దీనికి సంబంధించిన శ్లోకం, దాని వివరణ ఇలా ఉంది..
'సంతోషమే పరమ లాభం. సత్సంగమే పరమగతి. విచారమే పరమ జ్ఞానం. శమమే పరమ సుఖం'.
ఈ నాలుగు రకాలైన ఉపాయాలనూ అభ్యసించేవారే ఘనీభూతమై ఉన్న ఈ మోహజాలాన్ని జయిస్తారు. వీటిలో ఏ ఒక్క దాన్నైనా సర్వశక్తి యుక్తులతో అభ్యసిస్తే, మిగతా మూడూ కూడా లభిస్తాయి. స్వచ్ఛమైన శమం వల్ల హృదయం నిర్మలమైనప్పుడు అలాంటి వ్యక్తి వద్దకు మిగతా మూడూ వచ్చి చేరుతాయి. సంతోషం, విచారణ, సత్సంగం ఉన్నచోట 'జ్ఞానం' రూపు దిద్దుకుంటుంది, సుగుణాలన్నీ ఆశ్రయిస్తాయి, విజయలక్ష్మి వరిస్తుంది. "స్వప్రయత్నం" అనే పురుషకారం చేత మనస్సును జయించి, ఈ నాల్గింటిలో ఏ ఒక్కదానినైనా నిరంతరం ప్రయత్నపూర్వకంగా అవలంబించాలి. “శ్రద్ధతో, ఓర్పుతో, నేర్పుతో ఒక్కటైనా దైనందికమైన అలవాటుగా మార్చుకోవాలి. ఈ నాల్గింటినీ కాస్త కాస్త ఆశ్రయిస్తూ పోగా, కొంతకాలానికి అంతా సుసాధ్యమే అవుతుంది. మొదట్లో కొంత పట్టుదలతో ఆ తరువాత ప్రయత్నం వీడకుండా ఉంటే సాధ్యం కానిదంటూ ఏదీ ఉండదు. అసలు ప్రయత్నమనేదే చేయకుండా, "మానవ మాత్రులం! మా వల్ల ఏమవుతుంది?" అని నిరుత్సాహ పడి, తుచ్ఛ విషయాలకై పరుగులు పెడితే అది మూర్ఖత్వమే కదా! ఎందుకంటే మనుషుల్లోనే అత్యంత మహనీయులు, ఆత్మజ్ఞులు... అత్యంత మూర్ఖులు కూడా ఉన్నారు. అందువల్ల సాధన చెయ్యాలి. అసలు రహస్యమంతా సాధనలోనే ఉంది కానీ దైవంలో కాదు.
ఈ మనస్సును పురుషకారంతో జయించి, ఈ నాల్గింటిలో ఒక్కదానినైనా వశం చేసుకుంటేనే 'ఉత్తమగతి'. అలా కాకుండా మనసుకు నచ్చినట్టు ఉండటం. ఇంద్రియ విషయాలను మాత్రమే ఆశ్రయించడం, కల్పిత వ్యవహారాలనే నమ్ముకొని ఉండడం... అది శుభప్రదం అవుతుందా? ఈ నాల్గింటి కోసం కష్టపడి ప్రయత్నించాలి. చంచల మనస్సు గుణదోషాలనే ప్రీతిపూర్వకంగా ఆశ్రయిస్తోంది. ఆ గుణ దోషాలను మొట్టమొదట జాగ్రత్తగా గుర్తించాలి. అయితే ఈ గుణదోషాలు తొలగేదెలా? మంచి గుణాలను ఆశ్రయించడమే అందుకు ఉపాయం. ఏ మార్గం కావాలో బాల్యంలోనే నిర్ణయించుకోవాలి. చక్కగా ఆలోచించాలి, మార్గాన్ని అన్వేషించాలి. తరువాత దాన్ని అనుసరించాలి. . అంతేకానీ, బాధపడుతూ కూర్చుంటే ఎవరికీ ఏ లాభమూ ఉండదు.
సాధన చతుష్టయం
వేదాంత శాస్త్రమంతా ఆత్మతత్వ జ్ఞానాన్ని కలిగించి అధ్యాస తొలగడానికి ఉపకరిస్తుంది. అందుచేత బ్రహ్మచర్యం పూర్తిచేసుకొని గృహస్థ, వానప్రస్థాశ్రమాల తర్వాత కర్మలనాచరిస్తూ చిత్తశుద్ధిని సంపాదించుకొని బ్రహ్మజిజ్ఞాసకు పూనుకోవాలి. ధర్మాన్ని తెలిసికొని ఆచరించడం వల్ల కలగే ఫలితం విషయాది సుఖం. బ్రహ్మజిజ్ఞాసకు ఫలం మోక్షం.
సాధన చతుష్టయం సాధించాక శ్రవణ మననాదులు చెయ్యాలని అది శంకరులు చెబుతారు. నిజానికి వేదాధ్యనం గాని, యజ్ఞాది కర్మలను గాని చెయ్యకుండానే కొందరు మహాపురుషులు బ్రహ్మజ్ఞానులయ్యారు. అంచేత బ్రహ్మమును తెలుసుకోవాలనే జిజ్ఞాసకు వీటి ఆవశ్యకత లేదనే చెప్పవచ్చు. కాని అవిచేస్తే మంచిదే. ఇంద్రియ నిగ్రహము, వైరాగ్యము, చెప్పిన విషయాన్ని అర్ధం చేసుకొనే జ్ఞానము, సూక్ష్మబుద్ధీ ఉంటే సరిపోతుంది. బ్రహ్మమును తెలుసుకోడానికి కులభేదం గాని, లింగభేదం గాని లేకుండా సంసారమే బంధంగా ఉందనీ, దాన్నుంచి విముక్తి పొందాలనే తీవ్రమైన కోరిక కలిగితే చాలు. అలాంటి వ్యక్తి ఏమీ తెలియనివాడు కాని, అన్నీ బాగా తెలిసినవాడు కాని గాకూడదు.
వివేకజ్ఞానము, ఇహపరలోకాల్లో ఉండే భోగవిషయాలపై వైరాగ్యము, శమదమాది సాధనాసంపత్తి, మోక్షం పొందాలనే తీవ్రవాంఛ కలిగిన తర్వాత బ్రహ్మను తెలిసికో శక్యమవుతుంది. శమదమాది సాధనాసంపత్తి అంటే శమము, దమము, ఉపరతి, తితీక్ష, సమాధానం, శ్రద్ధ అనేవి సమకూరిన తర్వాత బ్రహ్మజిజ్ఞాస చెయ్యాలి.
బ్రహ్మ ప్రాప్తికి, శ్రవణాదులు చెయ్యడానికి తగిన యోగ్యతను సాధించే సాధనాలని సాధనచతుష్టయం అంటారు. అవి (1) నిత్యానిత్య వస్తువివేకము – భూత భవిష్యద్వర్తమాన కాలాలు మూడిట్లోను నాశనం లేకుండా ఉండేది నిత్యమైనది. కొంతకాలం ఉండి తర్వాత నశించే దాన్ని అనిత్యమైనదని అంటాం. ఈ రెండిటి జ్ఞానమే నిత్యానిత్య వివేకము అంటారు. మన కంటికి కనిపించే రూప సముదాయమంతా కొంతకాలం ఉండి నశించేదే. అలాగే ఇంద్రియాల ద్వారా తెలియబడే వ్యక్త ప్రపంచమంతా కొంత కాలం ఉండి నశించి పోయేనే భావన కలుగుతుంది. అప్పుడు నాశనం లేని పదార్ధం ఒకటి ఉండాలని తెలుస్తుంది. అదే ఆత్మ అని తెలిసి దాన్ని పొందాలనే నిశ్చయం కలుగుతుంది.
(2) ఇహాముత్రార్ధ ఫలఫలభోగ విరాగం ( వైరాగ్యం) – ఈలోకంలో గాని పరలోకంలో గాని లభించే అన్ని సౌఖ్యాలను తృణీకరించి నిరాదరణ కల్గి ఉండటాన్ని వైరాగ్యమంటారు.
(3) శమాదిషట్కము - ఇది ఆరు విధములు.
(అ) శమము - మనస్సు, బుద్ది, చిత్తము, అహంకారము అనే అంతరింద్రియములను వాటి వృత్తులకు పోనీయక బ్రహ్మమునందే నిరంతరము నిలపటడాన్ని శమము అంటారు. అంటే అంతరింద్రియ నిగ్రహము /మనోనిగ్రహం.
(ఆ) దమము - ఇంద్రియాలను బాహ్య విషయాలవైపు పోనీయకుండా మరలించి, అత్మయందే లగ్నం చెయ్యడం దమము. అంటే బాహ్య ఇంద్రియ నిగ్రహము. దీన్లో జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలను నిగ్రహించడం ముఖ్యమైనది. శమ దమాదులకు వైరాగ్యం అవుసరం.
(ఇ) ఉపరతి - విషయాలయందు దోష దృష్టిని విచారణ చేసి వాటిని తిరస్కరించటం. మళ్ళీ ఇంద్రియాలు వాటి స్వభావం ప్రకారం బయటి విషయాల జోలికి పోనీయకుండా నిలపడాన్ని ఉపరతి అంటారు.
(ఈ) తితీక్ష - అంటే ఓర్పు. శీతోష్ణములు సుఖదుఃఖములు మొదలైనవి వచ్చి పోతూ ఉంటాయి. అవి స్థిరంగా ఉండవు. అంచేత వీటిని సహనంతో ఓర్చుకోవడం అలవరచుకోవాలి. ఆ ఒర్పునే తితీక్ష అంటారు.
(ఉ) శ్రద్ధ - శాస్త్రాలయందు, గురువాక్యాల యందు విశ్వాసము కలిగి ఉండటాన్ని శ్రద్ధ అంటారు.
(ఊ) సమాధానము- తన బుద్ధిని అన్ని విధాలా బ్రహ్మమందే ఎపుడూ స్థిరపరచుకొని ఉండటాన్నే సమాధానం అని అంటారు. మరికొందరు శాస్త్రమందు చెప్పబడిన విషయాలు, గురువుచే ఉపదేశించబడిన వాక్యాలు ఒక్కటే అని శృతియుక్తి, అనుభవములచేత ఆత్మ నిశ్చయం పొంది, సంశయాలను నివృత్తి గావించు కోవడమే సమాధానమని అంటారు.
(4) ముముక్షుత్వము – సంసార బంధ నివృత్తి ఎప్పుడు ఏవిధంగా కలుగుతుందా అని ఆలోచిస్తూ, మోక్షమందే ఆపేక్ష కలిగి ఉండటాన్ని ముముక్షత్వం అంటారు.
ప్రపంచంలో ఆకర్షణలన్నీ అశాశ్వతాలే ననే విషయాన్ని గ్రహించడమే వివేకం. అప్పుడు వాటి మీద ఆసక్తి తొలగి పోతుంది. అదే వైరాగ్యమంటే. విజ్ఞానము లేక అపవిత్రమైన జీవనాన్ని గడిపేవాడు ఆ పరమపదాన్ని పొందలేడు. సంసారంలోనే చిక్కుకొని ఉంటాడు. మనోనిగ్రహం కలిగిన విజ్ఞానవంతుడు పవిత్ర జీవితాన్ని గడిపేవాడు ఆ పరమ పదాన్ని పొందుతాడు. అతనికి పునర్జన్మ ఉండదని కఠోపనిషత్తు జ్ఞానవైశిష్యాన్ని చెబుతోంది. ఈ విధంగా మనోనిగ్రహం ఉన్నవాడు ఇంద్రియాలను మనస్సులో లీనం చేసుకోవాలి. మనస్సును బుద్ధిలోను, బుద్ధిని మహత్తత్వంలోను విలీనం చేసి, దాన్నిప్రశాంతమైన ఆత్మలో విలీనం చేసుకోవాలనే సాధనను కఠోపనిషత్తు చెబుతోంది. ఇలా సాధన చతుష్టయాన్నిపొందినవాడు, ఆత్మను తన ఆత్మలోనే చూస్తాడు; సర్వమూ అత్మగానే చూస్తాడు. మోక్షం మీద తీవ్రమైన కోరిక ఉంటేనే బ్రహ్మజ్ఞానం కోసం ప్రయత్నిస్తాడు. సద్గురువును సేవించి సఫలయత్నుడవుతాడు.
****
స్మృతి మంజరీ కాఫీ తాగుతూండగా తల్లి చెప్పింది.
"స్మృతి , విజయ వచ్చింది. నిన్ను రాగానే కలవమంది."
"అవునా. సరే స్నానం చేసి వెళ్తానమ్మా. చిరాగ్గా ఉంది." అంటూ స్నానానికి వెళ్ళింది.
టిఫిన్ తిని స్నేహితురాలు విజయ దగ్గరకు వెళ్ళింది. ఇద్దరి కళ్ళూ చెమ్మగిల్లాయి.
"ఎలా ఉన్నావ్ విజయ . జాబ్ లో చేరావట. ఎక్కడుంటున్నావ్? అక్కడంతా బాగానే ఉందా." అడిగింది స్మృతి .
భర్త పొయ్యారని విన్నాను
"అలాగని నీ జీవితం మోడు చేసుకుంటావా. పెళ్ళైన ఏడాదికే భర్త చనిపోతే అతని తల్లిదండ్రుల కోసం నీ జీవితాన్ని బలి చేసుకుంటావా." కోపం, బాధ మేళవించిన స్వరంతో అడిగింది స్మృతి .
రమేశ్ తల్లిదండ్రులను
వాళ్ళని గాలి కొదిలేయమంటావా? రమేశ్ నేను ప్రేమించుకున్నామని తెలియగానే పెద్దమనసుతో వాళ్ళే వచ్చి మావాళ్ళని పిల్లనిమ్మని అడిగారు. వారిద్దరూ తమ కొడుకు కన్నా నన్నే ఎక్కువ ప్రేమగా చూసుకొనేవారు. ఇప్పటికీ వారి ప్రేమలో మార్పు లేదు.
నీవు చేసిన సహాయంతో నేను నర్సు ట్రైనింగ్ పూర్తిచేసాను. గత నెలరోజుల్నించి హోస్పటల్లో జాబ్ జేస్తున్నాను అది కూడా నీవే ఇప్పంచ్చావని తెలిసింది నీ ఋణం ఎలా తీసుకోవాలి అన్నాది విజయ.
జాబ్ రావడంతో ఊరట చెందింది. అత్తమామల్ని ఒంటరివాళ్ళని చేయలేక వారితోనే ఉంటున్నా . వారి ముందు తయారై తిరగలేక సాదాసీదాగా ఉంటోంది. ఎవరితోనూ కలవలేక అందరితోనూ దూరంగా ఉంటున్నా .
ఒకరోజు తను స్నానానికి వెళ్ళి వచ్చేసరికి అత్తగారు గదిలోనే ఉన్నారు
"ఏమన్నా చెప్పాలా అత్తయ్యా." అడిగింది విజయ .
"అవునమ్మా. ఎన్నాళ్ళ నుంచో నీకు చెప్పాలని మీ మామయ్యా, నేనూ అనుకుంటున్నాం. నువ్వు మామూలుగా ఉండు తల్లీ. ఈ దుఃఖం ఎన్నేళ్ళైనా తీరదు. నిన్ను ఇలా సాదాసీదాగా చూస్తుంటే మరీ బాధగా ఉంటోంది. మీ అమ్మ కూడా మొన్న మాట్లాడుతూ ఇదే బాధ పడ్డారు." అన్నారు బాధపడుతూ.
"నాకేమైందత్తయ్యా నేను బాగానే ఉన్నాను." ,అని ఏదో అనబోతుంటే ఆగమని చెప్పి "చూడమ్మా, వాడున్నప్పుడు ఎలా ఉండే దానివో అలాగే ఉండు. నీలో మేము కూతుర్ని చూసుకుంటున్నాం. మా పిల్ల ఇలా తిరుగుతుంటే మాకు ఏం ఆనందం ఉంటుంది. చెప్పమ్మా." అనునయంగా ఆంటూ చేతిలో ఒక కవర్ పెట్టారు. ఆవే వేసుకోమని సూచించి వెళ్ళి పోయారు.
అది తనకెంతో ఇష్టమైన కలర్ చూడీదార్. ఆ బట్టలు వేసుకొని బైటికి వచ్చి, వారి కాళ్ళకి నమస్కరించగానే ఎంతో పొంగి పోయి "నువ్విలాగే లక్షణంగా ఉండాలి తల్లీ" అంటూ దీవించారు.
అప్పుడే స్మృతి తెచ్చిన వస్త్రాలు ఇచ్చింది
ఆ డ్రెస్ లో చూసిన అందరూ ఆశ్చర్య పోయారు. తర్వాత విషయం తెలిసీ కొంచెం బాధ పడినా, ఇప్పటికైనా మామూలైనందుకు ఆనందించారు.
అప్పుడే మాటల్లో తనవిషయం చెప్పింది విజయ
"అయితే ఇప్పుడు విజయ గార్ని నాణేనికి రెండో వైపు నుంచీ చూస్తున్నామనమాట." అంటూ నవ్వాడు.. డాక్టర్ రాజు. అతని మాటలకి విజయ నవ్వడం తో అందరూ ఆనందంగా నవ్వేశారు.
అందరూ అన్నావు కదూ
అనినేను అన్నానా అన్నది నాలిక కొరుక్కొన్న విజయను జూసింది స్మృతి మంజరీ యిక ముందు అన్నీ మంచిరోజులు అని చెప్పి వెనక్కి వచ్చింది స్మృతి.
****
09:16, 31/07/2021] Mallapragada Sridevi: ఆమె…. డాక్టర్ బృంద ఐఏఎస్… కాంధమాల్ అనే జిల్లాకు కలెక్టర్ ఆమె…! కాస్తోకూస్తో జనం కోణంలో… ఏదైనా మంచి చేయాలనుకునే కలెక్టర్…! అదసలే ఒడిశా… బీమారు రాష్ట్రాల్లో ఒకటి… అంతులేని పేదరికం, జాడతెలియని అభివృద్ధి… అనేకానేక గ్రామాలకు రోడ్లుండవు, చదువు అసలే ఉండదు, వైద్యం అందదు… ఆమె ఓరోజు పత్రికలు చదువుతుంటే ఆమెను ఓ వార్త ఆకర్షించింది…
అది సంపూర్ణంగా చదివింది… వివరాలు తెప్పించుకున్నది… ఓ కలెక్టర్‌గా సిగ్గుపడింది… ఈ వ్యవస్థకు ఏమీ చేయలేకపోతున్నాను సుమా అని తలవంచుకున్నది… డ్రైవర్‌ను పిలిచింది, గుమ్సాహి అనే ఊరి దగ్గరకు తీసుకువెళ్లాలని చెప్పింది… డ్రైవర్ పరేషాన్… ఆమె బయల్దేరింది…
ఆ ఊరు చేరుకున్నది… ఇక్కడ జలంధర్ నాయక్ అంటే ఎవరు అని అడిగింది…. ఏమిటీ కథ నేపథ్యం..?ఆయన ఓ మట్టిమనిషి… వయసు 45… పుల్బనీ తాలూకాలోని గుమ్సాహి తన సొంతూరు… ఒంటిచేత్తో కొండను తొలిచి తమ ఊరికి రోడ్డు వేసిన బీహారీ దశరథ్ మాంఝీ కథ తెలుసు కదా… సేమ్, ఆయన ఒడిశా మాంఝీ… ఎందుకో తెలుసా..? తనూ అంతే… ఆ ఊరికి రోడ్డు లేదు, నిజం చెప్పాలా..? కరెంటు కూడా లేదు, మంచినీటి సరఫరా ఆశించేదే లేదు…
ఒక్కొక్కరే ఊరు విడిచి వెళ్లిపోయారు… ఆ స్థితిలో ఆ ఊరికి రోడ్డు తనే సొంతంగా వేయాలని నిర్ణయం తీసుకున్నాడు ఈ జలంధర్… ఎందుకు..? తన ఊరి నుంచి పుల్బనీలోని పాఠశాలకు పిల్లలు వెళ్లాలన్నా అవస్థలే… ఎవరిని ఎన్నేళ్లు వేడుకున్నా ఫలితం లేదాయె… లంచాలు తప్ప ఇంకేమీ తెలియని అధికారులకు అస్సలు పట్టదాయె… అసలు ఈ దేశానికి పట్టిన దరిద్రమే ఈ నాయకులు, ఈ అధికారులు అని అర్థమైంది… దాంతో ఓ ఆలోచనకు వచ్చాడు… కనీసం తన ఊరికి రోడ్డు వేసుకోలేనా…?భార్య సద్దిమూట కట్టి ఇచ్చింది… ఓ పలుగూ, ఓ పార పట్టుకుని బయల్దేరాడు… రోజూ పొద్దున మొదలు పెట్టి సాయంత్రం దాకా తనే రోడ్డు వేయడం మొదలు పెట్టాడు…
రాళ్లూరప్పల్ని తొలగిస్తూ, రోడ్డు వేసుకుంటే పోతున్నాడు… మొత్తం 15 కిలోమీటర్ల రోడ్డు తన టార్గెట్… ఒక్కడూ సహకరించినవాడు లేడు… అయితేనేం..? ఆ గడ్డపార ఆగలేదు, ఆ పార అలిసిపోలేదు… రెండేళ్లు… నమ్మండి… రెండేళ్లపాటు కష్టపడ్డాడు…
నా జీవిత లక్ష్యం అదే అని తీర్మానించుకుని అదే పనిలో మునిగిపోయాడు… 8 కిలోమీటర్ల రోడ్డు తనొక్కడే నిర్మించాడు… ఓరోజు ‘గుండెలో తడి’ ఇంకా మిగిలిన ఓ స్థానిక పత్రిక జర్నలిస్టు ఆ కథను రాశాడు… అదీ ఆ కలెక్టర్ దగ్గరకు చేరింది… ఆమె చదివింది… ఆమె కళ్లు చెమర్చాయి…
ఈ వ్యవస్థలో భాగమైన తను కూడా సిగ్గుపడాలి కదానే భావన ఆమెను తలవంచుకునేలా చేసింది… అందుకే ఆ ఊరికి బయల్దేరింది…అతన్ని కలిసింది… మాట్లాడింది… ‘ఏం లేదు మేడమ్… మూడేళ్లు ఆగండి, నేనా రోడ్డును పూర్తి చేస్తాను’ అన్నాడు జలంధర్… ఆమె మరింత సిగ్గుపడింది… ఓసారి రోడ్డు చూద్దామంటూ వెళ్లింది…
ఒక మనిషి శ్రమను, లక్ష్యాన్ని, నిబద్ధతను, కష్టాన్ని, సంకల్పాన్ని చూసింది… ఆమెలో కలెక్టర్ అనే పాత్ర నిద్రలేచింది… అయ్యా, మీ త్యాగం నిరుపమానం అని ఆయన చేతులు పట్టుకున్నది… మిగతా ఆ ఏడు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణం ఇక నాకు వదిలెయ్ అని చెప్పింది… తనకు అందుబాటులో ఉన్న ఏవో నిధులను అడ్జస్ట్ చేసింది… ఆ రోడ్డు పూర్తయ్యేదాకా దాని నిర్మాణ పర్యవేక్షణకూ తననే నియమించింది… అంతేకాదు, ఇప్పుడా ఊరికి కరెంటు పోల్స్, లైన్స్ పడుతున్నాయి… మంచినీటి సరఫరా ప్రణాళికా రూపుదిద్దుకున్నది…
మరో విషయం… ఈ రెండేళ్లపాటు తను చేసిన పనికి ఉపాధిహామీ కింద డబ్బులు ఇవ్వటానికి కూడా ఆమె అంగీకరించింది… వావ్… ఇవీ కదా సక్సెస్ స్టోరీలు… ఇవీ కదా పది మందికీ స్పూర్తినిచ్చే అసలు విజయగాథలు…!!
ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
వినండి వినమని చెప్పండి - మనస్సు ప్రశాంతముగా ఉంచుకోండి
సర్వేజనా సుఖోనోభవంతు
ఎందఱో మహానుభావులు అందరికి వందనములు, నేను (ఓం శ్రీ రాం ) తాత కధలు సేకరించి
స్వయంగా చదివి వినిపిస్తున్నాను , ప్రాంజలి ప్రభను ఆదరించే వారు ప్రపంచ తెలుగు ప్రజలందరూ విని మీ అభి ప్రాయాలు తెలుపగలరు
16. మాట మహత్యం
****
_𝕝𝕝 ॐ 𝕝𝕝 06/04/2024 - శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారి వర్ధంతి 𝕝𝕝 卐 𝕝𝕝_*
*꧁┉┅━❀ 🔯 ❀━┅┉꧂*
దుందుభి నామ సంవత్సర ఫాల్గుణ బహుళ ద్వాదశి 1503, పదకవితా పితామహుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులవారి వర్ధంతి. తెలుగు సాహిత్యంలో "పదకవితా పితామహుడి" గా ప్రసిద్ధికెక్కిన అన్నమయ్య నారాయణ సూరి, లక్కమాంబ దంపతులకు శ్రీ సర్వధారి నామ సంవత్సర వైశాఖ పౌర్ణమి (క్రీ.శ. 1408 మే 9) నాడు కడప జిల్లాలోని తాళ్ళపాక గ్రామంలో జన్మించాడు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్నట్లుగా పసితనం నుండే అన్నమయ్య తిరుమలేశుని భక్తుడు. 8 ఏళ్ళ వయసులోనే కొండ ఎక్కుతూ ఆశువుగా 'మంగాంబికా శతకం' పాడాడు. కొండపైకి చేరి స్వామినీ, ఇతర దేవీ దేవతలనూ దర్శిస్తూ 'వేంకటేశ శతకం' పాడాడు.
టంగుటూరుని ఏలుతున్న సాళువ నరసింగ రాయుడు అన్నమాచార్యుని గొప్పదనం, అతనికి గల ఆధ్యాత్మిక శక్తి గురించి తెలిసి, తన ఆస్థానంలో గురువుగా ఉండమని కోరాడు. అన్నమయ్య అందుకు అంగీకరించాడు. ఒకరోజు అన్నమాచార్య పాడిన మధుర భక్తికి సంబంధించిన పాట విన్న రాజుగారు తన్మయుడై అదేవిధమైన పాట ఒకటి తనను స్తుతిస్తూ పాడాల్సిందిగా కోరాడు. తాను భగవంతుడి వైభవాన్ని చాటే పాటలే తప్ప మానవ మాత్రులను పొగడను అనడంతో రాజు అహం దెబ్బతింది. పట్టరాని కోపం వచ్చింది. వెంటనే అన్నమయ్యను గొలుసులతో బంధించి కారాగారంలో పెట్టించాడు. శ్రీ వెంకటేశ్వర స్వామిని తలచుకుంటూ ఒక పాట పాడాడు. వెంటనే గొలుసులు తెగిపోయాయి. రాజు తనను క్షమించాల్సిందిగా అన్నమయ్యను వేడుకొన్నాడు. భక్తులను అవమానించడం తగని పని అని రాజుకు సలహా ఇచ్చి సంకీర్తనల ద్వారా భగవంతుడి మహిమలను చాటి చెప్పడానికి తిరుపతి వెళ్ళిపోయాడు అన్నమయ్య.
అన్నమయ్య తన జీవితకాలం (95ఏళ్ళు) లో 32,000 సంకీర్తనలు రచించి పాడగా, నేడు 14,000 సంకీర్తనలే లభ్యమవుతున్నాయి. అన్నమయ్య తాళపత్రాల మీద వ్రాసిన ఆ సంకీర్తనలను ఆయన కుమారుడు తిరుమలాచార్య రాగి రేకులపైన చెక్కించాడు.
*_𝕝𝕝 ॐ 𝕝𝕝 oఓo నమో వేంకటేశాయ 𝕝𝕝 卐 𝕝𝕝_*
****
🟥. *#మజ్జిగ* 🟥
*మజ్జిగకి సంస్కృతంలో మూడు పేర్లున్నాయి*
1. తక్రం
2. . మధితం
3. ఉదశ్విత్తు
🔸 *తక్రం*
*నాలుగోవంతు మాత్రం నీరుపోసి తయారు చేసేది తక్రం.*
🔸 *మధితం*
*అసలే నీరు పోయకుండా చిలికినది #మధితం ఇది రుచిగా ఉంటుంది, కానీ ఆరోగ్యానికి అంత ప్రశస్తం కాదు.*
🔸 *ఉదశ్విత్తు*
*సగం నీళ్లు పోసి తయారుచేసేది ఉదశ్విత్తు.*
🟥
*ఈ మూడింటిలోకి "" తక్రం "" ఆరోగ్యానికి చాలా ప్రశస్తం.*
🟥
🔸 *మజ్జిగ - మహా పానీయం*
*మజ్జిగ తాగేవాడికి ఏ వ్యాధులూ కలగవనీ, వచ్చిన వ్యాధులు తగ్గి, తిరిగి తలెత్తకుండా ఉంటాయనీ, విషదోషాలు, దుర్బలత్వం, చర్మరోగాలు, దీర్ఘకాలిక వ్యాధులు, కొవ్వు, అమిత వేడి తగ్గిపోతాయనీ, శరీరానికి మంచి వర్చస్సు కలుగుతుందనీ, యోగరత్నాకరం లో ఉన్నది.*
*దేవ లోకంలో దేవతల కోసం అమృతాన్నీ, ఇక్కడ మానవుల కోసం మజ్జిగనీ భగవంతుడు సృష్టించాడట..*
🟥
*వేసవి కాలంలో మనం మజ్జిగ ఎక్కువగా తీసుకోవాలి.*
🟥
*తోడుపెట్టినందు వలన పాలలో ఉండే పోషక విలువలన్నీ మజ్జిగలోనూ పదిలంగా ఉండటంతో పాటు, అదనంగా లాక్టో బాసిల్లై అనే మంచి బాక్టీరియా మనకు దొరుకుతుంది. పాలలో ఈ ఉపయోగకారక బాక్టీరియా ఉండదు.*
🟥
*ప్రిజ్జులో పెడితే మజ్జిగలోని ఈ బాక్టీరియా నిరర్థకం అవుతుంది, అందుకని అతి చల్లని మజ్జిగ తాగకూడదు.*
🟥
*చిలికినందువలన మజ్జిగకు తేలికగా అరిగే గుణం వస్తుంది అందుకని పెరుగుకన్నా మజ్జిగ మంచిది.*
🟥
*వయసు పెరుగు తున్నకొద్దీ మజ్జిగ ఎక్కువ తీసుకోవాలి.*
🟥
*వేసవి కోసం ప్రత్యేకం "" కూర్చిక పానీయం..""*
🟥
*ఒక గ్లాసు పాలు తీసుకొని, కాచి చల్లార్చి అందులో రెండుగ్లాసుల పుల్లని మజ్జిగ కలపండి ఈ పానీయాన్ని కూర్చిక అంటారు.*
*ఇందులో ♦️పంచదార, ఉప్పు ♦️బదులుగా ఈ క్రింది వాటిని కలపండి.*
🟥
*ధనియాలు, జీలకర్ర, శొంఠి ఈ మూడింటినీ 100 గ్రాముల చొప్పున దేని కదే మెత్తగా దంచి, మూడింటినీ కలిపి తగినంత ఉప్పు కూడా చేర్చి, దాన్ని ఒక సీసాలో భద్ర పరచుకోండి*
🟥
*కూర్చికను తాగినప్పుడల్లా, అందులో ఈ మిశ్రమాన్ని ఒక చెంచా మోతాదులో కలిపి తాగండి, వడదెబ్బ కొట్టదు, పేగులకు బలాన్నిస్తుంది, జీర్ణకోశ వ్యాధులన్నింటికీ ఇది మేలు చేస్తుంది, వేసవిలో కలిగే జలుబుని నివారిస్తుంది, వడదెబ్బ కొట్టని రసాల పానీయం ఇది.*
🟥
*ఇది దప్పికని పోగొట్టి వడదెబ్బ తగలకుండా చేస్తుంది కాబట్టి, ఎండలో తిరిగి తిరిగి ఇంటికి వచ్చిన వారికి ఇచ్చే పానీయం ఇది.*
🟥
*ఎండలోకి వెళ్లబోయే ముందు "" మజ్జిగను"" ఇలా కూడా తయారు చేసుకొని తాగండి.*
🟥
*చక్కగా చిలికిన మజ్జిగ ఒక గ్లాసునిండా తీసుకోండి. అందులో ఒక నిమ్మకాయ రసం, తగినంత ఉప్పు (సైంధవ లవణం), పంచదార, చిటికెడంత తినే సోడా ఉప్పు కలిపి తాగి అప్పుడు ఇంట్లోంచి బయటకు వెళ్లండి వడ దెబ్బ కొట్టకుండా ఉంటుంది.*
🟥
*మరీ ఎక్కువ ఎండ తగిలిందను - కొంటే తిరిగి వచ్చిన తరువాత ఇంకో సారి త్రాగండి.*
🟥
*ఎండలో ప్రయాణాలు చేయ వలసి వస్తే, ఒక సీసానిండా దీన్ని తయారు చేసుకొని వెంట తిసు- కెళ్లండి, మాటిమాటికీ తాగుతూ ఉంటే వడదెబ్బ కొట్టదు.*
🟥
🙏 *సర్వేజనా సుఖినో భవంతు* 🙏
****
'ప్రాంజలి ప్రభ కథలు
పంచ' దంపతులు!!
~~
ఈ లోకంలో కోట్లాది కోట్ల దంపతులున్నా ,
వాళ్ళంతా 5 విధాలుగానే ఉంటారు.
*మొదటిది లక్ష్మీనారాయణులు*
~~~~~
విష్ణుమూర్తికి లక్ష్మీదేవి వక్షస్థలం మీద ఉంటుంది, వక్షస్థలంలోని హృదయం ఆలోచనలకు కూడలి, అక్కడే లక్ష్మి ఉంటుంది. అంటే ఏభార్య భర్తల హృదయం ఒక్కటై. ఆలోచన కూడా ఆ ఇద్దరిదీ ఒకటై ఉంటుందో ఆ జంట లక్ష్మీనారాయణుల జంట.
*రెండవది గౌరీశంకరులు అర్థనారీశ్వరరూపం*
~~~~~
తలనుంచి కాలిబొటన వ్రేలివరకు నిట్టనిలువునా చెరిసగంగా ఉంటారు.
రెండు కలిసిన ఒకే రూపంతో ఉండటం వీరి ప్రత్యేకత. ఆలోచనలకు తల, కార్యనిర్వాహణానికి కాలూ సంకేతం, కాబట్టి భార్యను గొప్పగా చూసుకునే భర్త, బోలాబోలీగా ఉన్న భర్త ఆపదలో ఉంటే రక్షించే భార్య –ఇలా ఉన్నవారు గౌరీశంకరులజంట.
*మూడవది బ్రహ్మ సరస్వతుల జంట.*
~~~~
బ్రహ్మ నాలుక మీద సరస్వతి ఉంటుందంటారు, నాలుకనేది మాటలకు సంకేతం.
దాని అర్థం ఇద్దరి మాట ఒకటే అవుతుందని.
ఇలా ఏ మాట మాట్లాడినా, ఆ భార్య మాటే మాట్లాడే భర్త, ఆభర్త మాటే మాట్లాడే భార్య ఏ జంట ఇలా ఉంటారో వారు బ్రహ్మసరస్వతుల జంట.
*నాల్గవది ఛాయా సూర్యులు.*
~~~~
సూర్యుడు చండ ప్రచండంగా వెలుగు తుంటాడు. అతడి భార్య ఛాయాదేవి అతని తీక్షణతకు తట్టుకుంటూ సాగుతుంటుంది.
తనభర్త లోకోపకారం కోసం పాటుపడేవాడు, విపరీతమైన తీక్షణత కలవాడు. అయినా తాను నీడలా పరిస్థితికి అనుగుణంగా సర్ధుకుపోతూఉంటుంది ఛాయాదేవి.
ఏ ఇంట భర్త కఠినంగా, కోపంగా, పట్టుదలతో ఉంటాడో. ఏ ఇంట అతని భార్యమాత్రం నెమ్మదిగాను, శాంతంగాను, అణకువగాను ఉండి, సంసారాన్ని తీర్చిదిద్దుకొనే తత్వంతో ఉంటుందో అలాంటి జంట ఛాయా సూర్యుల జంట.
*ఐదవది రోహిణీ చంద్రులు.*
~~~
రోహిణీ కార్తెలో రోళ్ళు కూడా పగులుతాయనే సామెత ఉంది.
చంద్రుడు పరమ ఆహ్లాదాన్ని, ఆకర్షణను కలుగజేసేవాడు, మెత్తనివాడునూ,
ఏ జంట భర్త మెత్తగా ఉండి, లోకానికంతటికీ ఆకర్షణీయుడై ఉంటాడో, భార్య మాత్రం కఠినాతి కఠినంగాను కోపంతోను పట్టుదలతోను ఉంటుందో ఆ జంట రోహిణీ చంద్రులు.
****
ప్రాంజలి ప్రభ కథలు
అవధానాల్లో అప్రస్తుత ప్రసంగి వేసే కొంటె ప్రశ్నలకి అవధాని అంత కంటే కొంటెగా సమాధానం చెప్తే మంచి హాస్యం పుడుతుంది. అలాంటి కొన్ని ఉదాహరణలు ఎవరో నాకు పంపిస్తే మీతో పంచుకుంటున్నాను .
ప్రశ్న :- అవధానం చేసేవారికి చప్పట్లంటే చాలా ఇష్టమంట కదా! మరి మీకో ?
జవాబు :- నాకు చప్పట్లు ఇష్టం వుండవు. నాకు చప్ప అట్లుకంటే కారం అట్లంటేనే ఇష్టం .
ప్రశ్న :- భార్య తన భర్తకు వడ్డిస్తోంది. భర్త 'పశువ' అన్నాడు. భార్య నవ్వుతూ 'కోతి' అంది ఏమిటిది?
జవాబు :- పశువ అంటే పళ్లెంనిండా శుభ్రంగా వడ్డించమని. కోతి అంటే కోరినంత తిను అని అర్థం .
ప్రశ్న :- పద్యానికి, శ్లోకానికి తేడా ఏమిటి ?
జవాబు :-పద్యం వేగంగా వస్తుంది. శ్లోకం నెమ్మదిగా వస్తుంది. ఎందుకంటే స్లో... కమ్ కదా .
ప్రశ్న:- అమెరికాలో భర్తల సమాధులను భార్యలు విసనకర్రలతో విసురుతారట. చిత్రంగా లేదూ ?
జవాబు:- భర్త చనిపోతూ ‘నా సమాధి ఆరేవరకైనా నువ్వు మరోపెళ్లి చేసుకోవద్దు...' అంటూ ప్రమాణం చేయించుకుంటాడు. భర్త సమాధి తొందరగా ఆరాలని భార్యలు అలా విసురుతూ వుంటారు.
ప్రశ్న : పెళ్లి కాకముందు వధువు, పెళ్లి అయ్యాక భార్య ఎలా కనిపిస్తుంది.
జవాబు : – పెళ్లి కాకముందు 'అయస్కాంతంలా', 'పెళ్లి అయ్యాక సూర్యకాంతంలా...’
ప్రశ్న :- ఉగాది కవి సమ్మేళనానికి కవితలను తీసుకు రమ్మన్నారు
జవాబు :-ఇంతకీ ఏ కవి 'తలను' తీసికెళ్తున్నారు
ప్రశ్న :- పెళ్లికి వెళ్లుతూ పిల్లిని చంకన పెట్టుకొని వెళ్లటమంటే ఏమిటి ?
జవాబు :- అవధానానికి వెళ్లుతూ అప్రస్తుత ప్రసంగిని వెంట పెట్టుకొని వెళ్లటం .
ప్రశ్న :- అవధానాలను నిషేధించే పని మీకు అప్పజెప్పితే ఏం చేస్తారు?
జవాబు :- దశల వారిగా చేస్తాను. ముందు అప్రస్తుత ప్రసంగాన్ని నిషేధిస్తాను .
ప్రశ్న :- అవధానికి ఆశువులు ఎప్పుడొస్తాయి, ఆశ్రువులు ఎప్పుడొస్తాయి ?
జవాబు :- ప్రశ్నవేస్తే ఆశువులు వస్తాయి. అవధానం జరిగి సత్కారం ఎగరగొడితే ఆశ్రువులు వస్తాయి .
ప్రశ్న :- బోడిగుండుకు, మోకాలికి ముడిపెడతారెందుకు
జవాబు :- రెండింటి మీద అంతగా వెంట్రుకలు వుండవు కాబట్టి .
ప్రశ్న :- మీకు రంభనిస్తే ఏం చేస్తారు?
జవాబు :- ఆనందంగా ఇంటికి తీసికెళ్లి ఆకలి తీర్చుకుంటాను. రంభ అంటే అరటిపండు అని అర్థం .
ప్రశ్న :-నాకీ మధ్య శ్రీకృష్ణుడిపై భక్తి పెరిగిపోతోంది. ఆయనలాగే ప్రవర్తించమంటారా ?
జవాబు :- మీ ఆవిడకు ద్రౌపదిపై భక్తి పెరగకుండా చూసుకోండి.
ప్రశ్న :- మీ మైకులో బాంబు పెడితే ఏం చేస్తారు
జవాబు :- వెంటనే ఆ మైకు అప్రస్తుత ప్రసంగీకుడికి ఇచ్చి మాట్లాడమమటాను.
ప్రశ్న :- మీరెప్పుడైనా బూతు పనులు చేశారా జవాబు : -ప్రభుత్వ ఉద్యోగిని కదా ఎన్నికల్లో పోలింగ్ బూతు పనులు' తప్పవు .
ప్రశ్న :- అవధాని గారు మీది వర్ణాంతర వివాహమట నిజమా?
జవాబు :- నిజమే నేను నల్లగా వుంటాను, మా ఆవిడ తెల్లగా వుంటుంది .
ప్రశ్న :-పావురం అంటే మీకు ఇష్టమా ?
జవాబు :-పావు ‘రమ్’ ఎవరికి ఇష్టం వుండదు .
ప్రశ్న :-మీరు సారా త్రాగుతారా ?
జవాబు :- అవును అవధాన కవితామృతాన్ని మన 'సారా’ త్రాగుతాను .
ప్రశ్న :- సన్యాసికి, సన్నాసికి తేడా ఏమిటి?
జవాబు :- అందర్ని వదిలేసిన వాడు సన్యాసి, అందరూ వదిలేసిన వాడు సన్నాసి .
ప్రశ్న :- మీకు వాణిశ్రీ అంటే ఇష్టమా ?
జవాబు :- చాలా ఇష్టం. వాణి అంటే సరస్వతి -జ్ఞానం, శ్రీ అంటే సంపద.
ప్రశ్న: – రైలు పట్టాలకు, కాలి పట్టీలకు అనుబంధం ఏమిటి?
జవాబు:- రైలు, పట్టాల మీద వుంటుంది. పట్టీలు, కాలి మీద వుంటాయి .
ప్రశ్న:- సభలో ఎవరైనా ఆవులిస్తే మీరేమి చేస్తారు ?
జవాబు:- పాలిచ్చేవైతే యింటికి తోలుకెళ్తా .
ప్రశ్న:- పురుషులందు పుణ్యపురుషులు వేరయా! అన్నాడు వేమన. మరి మీరేమంటారు?
జవాబు:- పురుషులందు పుణ్యపురుషులు 'ఏరయా!’
ప్రశ్న:- అవధానిగారు ఇక్కడికి రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ వస్తే మీరేం చేస్తారు?
జవాబు:- మరో నలుగుర్ని పిలిచి 'అష్టావధానం' చేస్తాను.
ప్రశ్న:- పెళ్లయిన మగవారిని ఏమీ అనరు. కానీ పెళ్లయిన ఆడవాళ్లను 'శ్రీమతి' అంటారెందుకు?
జవాబు:- పెళ్లయిన తరువాత 'స్త్రీ మతి' స్థితిమతి.
మీదే పురుషులు ఆధారపడుతారు గనుక .
ప్రశ్న:- ప్రేమికుడికి, భర్తకు ఏమిటి తేడా గురువు గారు
జవాబు:- గొడవపడితే మాట్లడదేమోనని
భయపడేవాడు ప్రేమికుడ ... మాట్లాడితే గొడవ పడుతుందేమోనని భయపడేవాడు భర్త
ప్రశ్న:- అవధానిగారు కీర్తిశేషుల పెండ్లిపత్రిక వచ్చింది. పెళ్లికి వెళ్లమంటారా?
జవాబు:- తప్పకుండా వెళ్లు. కీర్తిశేషులంటే ' కీర్తి' అమ్మాయి పేరు, 'శేషు' అబ్బాయి పేరు .
ప్రశ్న:- గురువుగారు మా మొదటి అమ్మాయి పేరు దీపిక, రెండవ అమ్మాయి పేరి గోపిక. మరి మూడో అమ్మాయి పుడితే ఏ పేరు పెట్టాలి?
జవాబు: - ‘ఆపిక’ వెంటనే అవధాని సమాధానం
*****
ప్రాంజలి ప్రభ
కారణం ఏమిటంటే ఇది చాలా ఆలోచనాత్మకంగ ఆచరణ యోగ్యము గురువు పాఠము
మేము గత 10 నెలలుగా మీ పిల్లల సంరక్షణను ఆనందించాము. వారు పాఠశాలకు రావడాన్ని ఇష్టపడతారని మీరు గమనించాలి. తదుపరి రెండు నెలలు వారి సహజ రక్షకునితో అంటే మీతో గడుపుతారు. ఈ సమయం వారికి ఉపయోగకరంగా మరియు సంతోషంగా ఉండేలా మేము మీకు కొన్ని చిట్కాలను అందిస్తున్నాము.
- మీ పిల్లలతో కనీసం రెండు సార్లు భోజనం చేయండి. రైతుల ప్రాముఖ్యత, వారి కృషి గురించి చెప్పండి. మరియు వారి ఆహారాన్ని వృధా చేయవద్దని చెప్పండి.
- తిన్న తర్వాత వారి ప్లేట్లను వారి స్వంతంగా కడగనివ్వండి. ఇలాంటి పనుల ద్వారా పిల్లలకు శ్రమ విలువ అర్థమవుతుంది.
- వారు మీతో వంట చేయడంలో మీకు సహాయం చేయనివ్వండి. వారికి కూరగాయలు లేదా సలాడ్ సిద్ధం చేయనివ్వండి.
- ముగ్గురు పొరుగువారి ఇళ్లకు వెళ్లండి. వారి గురించి మరింత తెలుసుకోండి మరియు సన్నిహితంగా ఉండండి.
- తాతయ్యల ఇంటికి వెళ్లి పిల్లలతో కలిసిపోనివ్వండి. మీ పిల్లలకు వారి ప్రేమ మరియు భావోద్వేగ మద్దతు చాలా ముఖ్యం. వారితో చిత్రాలు తీయండి.
- వారిని మీ పని ప్రదేశానికి తీసుకెళ్లండి, తద్వారా మీరు కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నారో వారికి అర్థం అవుతుంది.
- ఏ స్థానిక పండుగ లేదా స్థానిక మార్కెట్‌ను మిస్ చేయవద్దు.
- కిచెన్ గార్డెన్‌ని రూపొందించడానికి విత్తనాలు విత్తడానికి మీ పిల్లలను ప్రేరేపించండి. మీ పిల్లల అభివృద్ధికి చెట్లు మరియు మొక్కల గురించి తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం.
- మీ బాల్యం మరియు మీ కుటుంబ చరిత్ర గురించి పిల్లలకు చెప్పండి.
- మీ పిల్లలను బయటకు వెళ్లి ఆడనివ్వండి, వారు గాయపడనివ్వండి, మురికిగా ఉండనివ్వండి. అప్పుడప్పుడు పడిపోవడం మరియు నొప్పిని భరించడం వారికి మంచిది. సోఫా కుషన్ల వంటి సౌకర్యవంతమైన జీవితం మీ పిల్లలను సోమరిగా చేస్తుంది.
- కుక్క, పిల్లి, పక్షి లేదా చేప వంటి ఏదైనా పెంపుడు జంతువును వాటిని ఉంచుకోనివ్వండి.
- వారికి కొన్ని జానపద పాటలను ప్లే చేయండి.
- మీ పిల్లల కోసం రంగురంగుల చిత్రాలతో కూడిన కొన్ని కథల పుస్తకాలను తీసుకురండి.
- మీ పిల్లలను టీవీ, మొబైల్ ఫోన్లు, కంప్యూటర్లు మరియు ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లకు దూరంగా ఉంచండి. వీటన్నింటికీ తన జీవితమంతా వెచ్చించాడు.
- వారికి చాక్లెట్లు, జెల్లీలు, క్రీమ్ కేకులు, చిప్స్, ఎరేటెడ్ డ్రింక్స్ మరియు పఫ్స్ వంటి బేకరీ ఉత్పత్తులు మరియు సమోసాల వంటి వేయించిన ఆహారాలు ఇవ్వడం మానుకోండి.
- మీ పిల్లల కళ్లలోకి చూడండి మరియు మీకు ఇంత అద్భుతమైన బహుమతిని ఇచ్చినందుకు దేవునికి ధన్యవాదాలు. రాబోయే కొద్ది సంవత్సరాలలో, వారు కొత్త ఎత్తులో ఉంటారు.
తల్లిదండ్రులుగా, మీరు మీ పిల్లలకు మీ సమయాన్ని కేటాయించడం చాలా ముఖ్యం.
మీరు తల్లితండ్రులైతే, ఇది చదివిన తర్వాత మీ కళ్ళు తడిగా మారాయి. మరియు మీ కళ్ళు తడిగా ఉంటే, మీ పిల్లలు నిజంగా ఈ విషయాలన్నింటికీ దూరంగా ఉన్నారని కారణం స్పష్టంగా తెలుస్తుంది. ఈ అసైన్‌మెంట్‌లో వ్రాసిన ప్రతి పదం మనం చిన్నతనంలో ఉన్నామని చెబుతుంది ఇవన్నీ మనం పెరిగిన మన జీవనశైలిలో ఒక భాగమే, కానీ నేడు మన పిల్లలు వీటన్నింటికీ దూరంగా ఉన్నారు, దానికి కారణం మనమే ... మార్పు చేద్దాం...హ్యాపీ హాలిడేస్...
****
ప్రాంజలి ప్రభ కథలు
ఓర్పు - విజయమార్గం.
మరాఠా యోధుడు, హిందూ చక్రవర్తులలో అగ్రగణ్యుడు అయిన శివాజీమహారాజ్ పేరు తెలియని వారు వుండరు కదా ! అంతటి మహావీరుడు కూడా ఒకప్పుడు పెద్దల నుండి స్ఫూర్తి పొందిన కథ, ఒకటి వున్నది. అది యేమిటో చూద్దాం.
ఒకానొకసారి, శివాజీ శత్రువుల కోటలను ముట్టడిస్తూ, ఒక కోటనుండి వేరొక కోటకు వెళ్తూ వుండగా, తాను తన సైన్యం నుండి విడివడి, ఒంటరివాడై దారితప్పి, పెద్ద కొండ శిఖరాగ్రానికి చేరాడు. చీకటి పడుతున్నది. జన సంచారము, జంతు సంచారము కానరావడం లేదు దగ్గరలో. తాను చేరుకోవాల్సిన ప్రదేశం యెక్కడ వున్నదో తెలియడం లేదు. అయితే, కొద్దిసేపటిలో దీపాల సమయం ఆసన్నమవగానే, దృష్టి సారించి చూడగా, చాలా దూరంగా, మినుకుమినుకు మంటూ, ఒక దీపం కనిపిచింది.
అక్కడ యెవరైనా వుంటారేమో అనే ఆశతో, శివాజీ, అటుగా తన అశ్వాన్ని పరుగెత్తించాడు. చాలా అలసిపోయి వున్నాడు. ' ఎవరైనా అక్కడ వుండి తనకింత ముద్ద పెడితే బాగుండు ' అనుకున్నాడు, అంతటి చక్రవర్తీ. ఆకలికీ, నిద్రకూ చక్రవర్తి అయినా, భిక్షగాడైనా భేదంలేదు కదా !
చివకు యెలాగైతేనేం, ఆ దీపం కనిపించిన చోటుకు చేరుకున్నాడు, శివాజీ. అది ఒక పూరి గుడిసె. అందులో ఒక పెద్ద ముత్తైదు స్త్రీ వున్నది. శివాజీని చూడగానే, ఆమె ప్రేమగా పిలిచి, అతడు శివాజీ సైన్యంలోని ఒక సైనికునిగా భావించి, ' నాయనా ! బాగా అలసినట్లున్నావు. ' అంటూ వాతావరణం చలిగా వుండడం వలన, అతనికి వేడి నీరు ముఖ ప్రక్షాళనకు యిచ్చి, విశ్రమించడానికి ఒక చాప కూడా యిచ్చింది. కొద్దిగా సేద తీరిన తరువాత, వేడి వేడి అన్నం ఆధరువులతో సహా, ఒక కంచంలో వడ్డించి తినడానికి యిచ్చింది.
అప్పటిదాకా యెలాగో ఓపికపట్టిన శివాజీ, ఇక క్షుద్భాధకు ఆగలేక, ఒక్కసారిగా, వేడి వేడి అన్నాన్ని కూరతో సహా, గుప్పిట పట్టి, నోటినిండా పెట్టుకుని, వేడి భరించలేక, ఆ ముద్దలోని అన్నమంతా, చెల్లాచెదురుగా భూమిమీద పడవేశాడు.
అది చూడగానే, ఆ పెద్దావిడ, ' అయ్యో ! ఏమి నాయనా ! నువ్వుకూడా, మీ యజమాని, ఈ దేశ మహారాజైన శివాజీ లాగా, అసహనం పాలు ఎక్కువగా వున్నవాడిలాగా వున్నావే ! ఏమిటి ఆ తినడం. అన్నం వేడిగా వున్నప్పుడు, దానిని భాగాలుగా చేసి తినాలి కదా ! ఇప్పుడు చూడు, నువ్వు చేతి వ్రేళ్ళు కాల్చుకున్నావు, అన్నమూ పోగొట్టుకున్నావు. ' అని ప్రేమగా కోప్పడింది.
ఆమె అన్నమాటలకు, వులిక్కిపడిన శివాజీకి, ఒక్కసారిగా వున్న ఆకలి అంతా ఆశ్చర్యం ముందు ఆవిరి అయిపోయింది. ' అమ్మా ! ఎందుకు అలాగా అన్నావు ? మా శివాజీ మహారాజ్ కి సహనం లేదంటావా ? ' అని అడిగాడు, కంచం పక్కన బెడుతూ.
' మరే నాయనా ! అందరూ అదే అనుకుంటున్నారు. చుట్టుప్రక్కల వున్న చిన్న కోటలను చేజిక్కించుకోకుండా, ఒకేసారి పెద్ద కోటల వెంట పరుగెడుతున్నాడట. ముందు దగ్గరలోని చిన్న శత్రువులను మిత్రులను చేసుకోవాలి గదా ! నీలాగానే, తన అసహనం వలన, యెందరో మంచి మంచి వీరులను, పెద్ద కోటలను దండెత్తడానికి వినియోగిస్తూ, వారిని పోగొట్టుకుంటున్నాడు, మనశ్శాంతి లేకుండా. ఇప్పుడు నువ్వు నీ చేతివ్రేళ్ళు కాల్చుకు౦టే నాకలాగే అనిపించింది. ' అన్నది.
ఆమె మాటలకు శివాజీకి కనువిప్పు అయింది. తాను చేస్తున్న పొరబాటు అర్ధమైంది. వెంటనే, ఆమెతో యింకా అనేక విషయాలు సంభాషిస్తూ, తృప్తిగా భోజనం చేసి, ఆమె పాదాలకు నమస్కరించి, కృత నిశ్చయంతో బయటకు వచ్చాడు. బయటకు వచ్చి, అలా గుర్రం యెక్కి వెనుదిరిగి చూస్తే, ఆదీపమూలేదు, గుడిసె లేదు, ఆ ముత్తైదువా లేదు. ఆహా ! ఇది భవానీ మాత వుపదేశమే అనుకుంటూ, ఆనందంగా అశ్వాన్ని దౌడు తీయించాడు.
ఇది ఆబాలగోపాలానికీ, అన్ని వేళలలో వర్తించే వుపదేశమే కదా ! మనకు వున్న కార్యక్రమాలలో, చిన్నవాటిని నిర్లక్ష్యం చేసి, పెద్ద లక్ష్యాల మీద దృష్టి పెట్టి వాటినీ సాధించలేక, చిన్న లక్ష్యాలు అలాగే వుండిపోయాయని వాపోతే, అసహనం యింకా పెరిగిపోదూ !
స్వస్తి.
****
_*👌మోక్షానికి అర్హులెవ్వరు👌*
*_గొప్పనీతి తప్పకచడవండి_*
త్రిలోకసంచారి అయిన నారదుడు ఒకసారి భూమి మీద ఉన్న భక్తులను పలకరించేందుకు బయల్దేరాడు. అక్కడ ముందుగా ఆయన నిత్యం హరినామస్మరణలో లీనమయ్యే ఓ ముని దగ్గరకు వెళ్లాడు.
‘అయ్యా! వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు. విష్ణుభగవానుడు ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? మీరు తరచూ వైకుంఠానికి వెళ్తూ ఉంటారా?’ అని ప్రశ్నలతో ముంచెత్తాడు ఆ ముని.
‘విష్ణుమూర్తుల వారు బాగానే ఉన్నారు. నేను వైకుంఠానికి తరచూ వెళ్తూనే ఉంటాను,’ అంటూ బదులిచ్చారు నారదులవారు. ‘అయితే స్వామీ! ఈసారి మీరు వైకుంఠానికి వెళ్లినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో దయచేసి స్వామివారిని అడగండి’ అని వేడుకున్నాడు ఆ ముని. సరేనంటూ నారదులవారు ముందుకు సాగిపోయారు.
ఈసారి ఆయనకు ఒక చెప్పులు కుట్టుకునేవాడు కనిపించాడు. ‘మిమ్మల్ని చూస్తే సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తినే చూసినట్లుంది. దయచేయండి స్వామీ! ఎలా ఉన్నారు? వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? స్వామి ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు?’ అంటూ చెప్పులు కుట్టుకునేవాడు కూడా ప్రశ్నలతో నారదుని ముంచెత్తాడు.
‘స్వామి బాగానే ఉన్నారు. నేను మళ్లీ అక్కడికే వెళ్తున్నాను. నీ గురించి ఏమన్నా అడగమంటావా!’ అన్నారు నారదులవారు. ‘అడగడానికి ఇంకేముంది తండ్రీ! ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో, నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో కనుక్కోండి చాలు’ అని వేడుకున్నాడు చెప్పులు కుట్టుకునేవాడు. అలాగేనంటూ నారదులవారు తిరిగి వైకుంఠానికి బయల్దేరారు.
వైకుంఠంలో నారదులవారు స్వామిని చూసిన వెంటనే, తాను భూలోకంలో కలిసి వచ్చిన భక్తుల గురించి చెప్పారు. వారి సందేహాలను కూడా స్వామి ముందు ఉంచారు. ‘నాలో ఐక్యమయ్యేందుకు ఆ ముని మరెన్నో జన్మలు వేచి ఉండాలి. కానీ ఆ చెప్పులు కుట్టుకునే అతనిది మాత్రం ఇదే చివరి జన్మ’ అన్నారు విష్ణుమూర్తి.
స్వామివారి మాటలు విన్న నారదులవారు అయోమయంలో పడిపోయారు. నిత్యం హరినామస్మరణ చేసే మునికి మరెన్నో జన్మలు ఉండటం ఏంటి? సాధారణ సంసారిగా జీవిస్తున్న ఆ చెప్పులు కుట్టుకునేవాడికి ఇదే ఆఖరు జన్మ కావడం ఏంటి? అన్న ఆలోచనలో మునిగిపోయాడు. నారదుని మనసులో ఉన్న సంశయాన్ని కనిపెట్టారు స్వామి. ‘నీ అనుమానం తీరే ఉపాయం ఉంది. నువ్వు ఈసారి వారిద్దరినీ కలిసినప్పుడు, ‘స్వామివారు ఏం చేస్తున్నారు?’ అని వాళ్లు అడుగుతారు కదా! అప్పుడు ‘ఆయన సూది బెజ్జంలోచి ఏనుగుని పంపిస్తున్నారు’ అని చెప్పు. వారి స్పందన చూశాక నీకే అర్థమవుతుంది. ఎవరు గొప్ప భక్తులో!’ అన్నారు స్వామి.
విష్ణుమూర్తి చెప్పినట్లుగానే నారదుడు తిరిగి భూలోకానికి బయల్దేరాడు. ముందుగా ఆయనకి ముని ఎదురుపడ్డాడు. ఎప్పటిలాగే నారదులవారిని కుశలప్రశ్నలు అడుగుతూ, పనిలో పనిగా ‘స్వామివారు ఏం చేస్తున్నారు?’ అని అడిగాడు ముని. ‘ఆ ఏముంది! వేలెడంత సూది బెజ్జంలోంచి కొండంత ఏనుగుని పంపిస్తున్నారు’ అన్నారు నారదులవారు. ‘భలేవారే! సూది బెజ్జంలోంచి ఏనుగుని పంపించడం ఎలా సాధ్యం. మీరు నాతో పరాచికాలు ఆడుతున్నట్లున్నారు, లేదా ఏదో భ్రాంతికి గురై ఉంటారు’ అన్నాడు ముని చిరునవ్వుతో. నారదులవారు అక్కడి నుంచి సాగిపోయారు.
మరికొంత దూరం వెళ్లాక ఆయనకి మునుపటి చెప్పులు కుట్టుకునే అతను కనిపించాడు.
‘అయ్యా! దయచేయండి! ఎక్కడి నుంచి రాక? ఈ మధ్య కాలంలో వైకుంఠానికి వెళ్లారా? స్వామివారు ఎలా ఉన్నారు?’ అని అడిగాడు ఆ చెప్పులు కుట్టుకునే అతను. ‘అంతా బాగానే ఉందయ్యా! నేను వైకుంఠానికి వెళ్లే సమయంలో స్వామివారు ఒక సూదిబెజ్జంలోంచి ఏనుగుని ఎక్కిస్తున్నారు’ అన్నారు నారదులవారు. ‘మంచిది మంచిది. స్వామివారు తల్చుకుంటే సాధ్యం కానిది ఏముంది!’ అన్నాడు భక్తుడు. ‘అదేంటీ! స్వామివారు ఎంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్యమైన కార్యాన్ని చేయగలరని నువ్వు నమ్ముతున్నావా!’ అని ఆశ్చర్యంగా అడిగాడు నారదుడు.
‘భలేవారే భగవంతునికి అసాధ్యం అంటూ ఏముంటుంది. ఇదిగో ఈ మర్రి పండుని చూడండి. ఈ మర్రి పండులో వేలాది గింజలు ఉన్నాయి కదా! ఆ గింజలన్నీ మళ్లీ మర్రి చెట్లుగా మారతాయి కదా! పోనీ అక్కడితో ఆగుతుందా… ఆ మర్రి చెట్టు ఊడలు కిందకి దిగి విశాలమైన వనంగా మారుతుంది. ఇంత చిన్న పండులో అన్ని మహావృక్షాలు ఇమిడి ఉన్నప్పుడు స్వామివారు చేసినదానిలో ఆశ్చర్యం ఏముంది. సృష్టిలో ఇలాంటి అద్భుతాలన్నీ ఆయనకి సాధ్యమే కదా!’ అన్నాడు చెప్పులు కుట్టుకునేవాడు. పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఆ భక్తుని మనసులో భగవంతుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలమైనదో నారదులవారికి అర్థమైంది. మోక్షం అతన్నే ఎందుకు వరించిందో తెలిసివచ్చింది.
భగవంతుడిని పొందాలి అంటే
కులంకాదు గుణముముఖ్యము🙏
****
sri raam - శ్రీ మాత్రేనమ:
దేవుడు అంటే నమ్మకమే ... కానీ విశ్వాసం లేదు... (చిన్న కధ )
ఎత్తు అయిన రెండు భవనాల మధ్య ఒక తాడు కట్టబడి ఉంది.
దాని మీద ఒక వ్యక్తి నడవసాగాడు.
వందల అడుగుల ఎత్తున అత్యంత జాగ్రత్తగా అతను నడవ సాగాడు.
చేతిలో పొడవయిన కర్ర ఉంది...
బుజాన అతని కొడుకు ఉన్నాడు,
అందరూ ఊపిరి బిగబట్టి చూస్తున్నారు....
అతను ఒక్కొక్క అడుగు వేసుకుంటూ రెండో భవనం వైపు వచ్చాడు,
అందరూ చప్పట్లు కొట్టారు.
కేరింతలలో ఆహ్వానం పలికారు...
చేతులు కలిపారు ఫోటో లు తీసుకున్నారు,
నేను ఈ తాడు మీద తిరిగి అవతలికి వెళ్లాలను కుంటున్నాను వెళ్లగలనా? అతను ప్రశ్నించాడు...
వెళ్లగలవు, వెళ్లగలవు జనం సమాదానం.
నా మీద నమ్మకం ఉందా?..
ఉంది,ఉంది. మేం పందానికి అయినా సిద్దం!
అయితే మిలొ ఎవరయినా నా భుజం మీద ఎక్కండి, అవతలకి తీసుకు పోతాను!
అక్కడంతా నిశబ్దం..
జనం మాటలు ఆగి పోయాయి...
ఎవరికి వాళ్ళు నిశ్శబ్దంగా ఉన్నారు,
ఉలుకు లేదు, పలుకు లేదు,
నమ్మకం వేరు, విశ్వాసం వేరు.
విశ్వాసానికి సర్వస్వ సమర్పణ భావం కావాలి.
ఈరోజుల్లో దైవభక్తిలో మనం కోల్పోతున్నది ఇదే....
దేవుడు అంటే నమ్మకమే ... కానీ విశ్వాసం లేదు...
--((***))--
*మన పండుగ ఉగాది*
ఏదైనా ఓపనిని కొత్తగా ప్రారంభించేందుకు మంచి రోజేనా? కాదా? అని ఆలోచించే ఓ విధానాన్ని మనకు ముందుగా నేర్పింది బ్రహ్మదేవుడే. ఎందుకంటే ఆయనే సృష్టిని ప్రారంభించడానికి ఏది మంచిరోజు? అని ఆలోచించి, ఒక మంచిరోజున సృష్టిని ప్రారంభించాడు. అదే *యుగ ఆది రోజు ఉగాది రోజు,* ఈ యుగాది రోజు అన్నివిధాలా మొదటిదై ఎలా మంచి రోజయిందో వివరంగా చూద్దాం!
'సృష్టి చేద్దా'మనుకోగానే చతుర్ముఖ బ్రహ్మకాలగణనం లోని 60 సంవత్సరాల్లో సంవత్సర ప్రారంభంలోనే సృష్టి చెయ్యాలనుకున్నాడు. కాలంలోని అరవై సంవత్సరాలలోనూ
*మొదటిదైన ప్రభవసంవత్సరంలో ఉత్తరాయణంలో వసంతఋతువులో చైత్రమాసంలో - శుద్ధ (శుక్ల) పక్షంలో పాడ్యమిలో బ్రాహ్మీముహూర్తంలో* సృష్టిని ప్రారంభించాడు.
కాబట్టి చైత్ర శుద్ధ పాడ్యమి అయిన ఈ రోజు ఈ విధంగా యుగ ఆది రోజు - ఉగాదిరోజు - సర్వప్రథమమైన రోజు ఔతోందన్నమాట.
ఈ రహస్యాన్ని మరచిపోకుండా చేసేందుకే మొట్టమొదటగా కోసిన మామిడి ముక్కలని, మొట్టమొదటిసారి తీసిన వేపపూతతోనూ, మొట్టమొదటగా వండిన బెల్లం తోనూ, మొట్టమొదటగా పిసికిన చింతపండుతోనూ, మొట్టమొదటగా తెచ్చిన ఒకటి రెండు మిరియపు గింజల పొడితోనూ, కలిపి తినే పచ్చడిగా చేసి, భగవంతునికి నివేదించి, ప్రసాదంగా స్వీకరించాలి.
ఈ యుగాదిని సృష్టించినవాడు బ్రహ్మ కాబట్టి, పంచభూతాలైన పృథివి-అప్-తేజస్-వాయు ఆకాశాల్లో మార్పును కూడ సృష్టించాడు. ఆయన. అందుకే పృధివి (భూమి)లోని ప్రతి వృక్షమూ కొత్త కొత్త చిగురుటాకుల్ని వేస్తూ, కొత్త చీరల్ని కట్టుకున్న ముత్తైదువల్లా గోచరిస్తాయి.
కృతయుగం వైశాఖ శుద్ధ తదియనాడూ. త్రేతాయుగం కార్తిక శుద్ధనవమినాడూ, ద్వాపరయుగం శ్రావణ శుద్ధ త్రయోదశినాడూ ప్రారంభంకాగా, కలియుగం మాత్రం చైత్ర శుద్ధ పాడ్యమినాడు. ప్రారంభమైంది.
*🌺ఇతిహాసపరంగా...🌺*
ఉగాది పండుగ వచ్చే వసంతకాలానికీ ఓ ప్రత్యేకత ఉంది. తెలుగు నెలల్లో మొదటి రెండూ అయిన చైత్రం, వైశాఖం కలిపి వసంతఋతువు లేదా వసంతకాలం అవుతోంది. అలాంటి ఈ వసంతకాలం ఎంత గొప్పదో ఇతిహాసమైన శ్రీమద్రామా యణం ప్రకారం చూద్దాం!
'చైత్ర శ్రీమా నయం మాసః పుణ్యః పుష్పిత కాసనః'- రాముని పట్టాభిషేకానికి ఈ వసంత కాలమే మంచిదని వశిష్ఠాదిమహర్షులు నిర్ణయించారు. మఱి పట్టాభిషేకం తప్పిపోయింది గదా!' అనుకోకూడదు. పట్టాభిషేకం చెడితే తప్ప రాముడు అరణ్యాలకుపోడు. అలా కాని పక్షంలో సీతాపహరణం లేదు. అది లేనివాడు రావణ వధ సాధ్యం కాదు. అలా కాని రోజున రామునిగా ఆయన అవతారమే వ్యర్థమౌ తుంది. ఇంతటి కష్టమైన పనికి దేవతలంతా ఏ కాలం మంచిది? అని ఆలోచించి అందరూ ఐకమత్యంతో నిర్ణయించిన కాలం వసంతం అందునా చైత్రమాసం!
సీతాపహరణం జరిగింది వసంతకాలంలోనే. రాముడు తనను చంపడానికి రాగలడనే విషయం రావణునికి తెలిసిందికూడా వసంతంలోనే! ఆంజనేయుడు మొదటిసారిగా రామచంద్రుణ్ణి చూచిందీ, అహంకారం పోయి తనకంటే రాముడెంతటి గొప్పవాడో ఆ విషయం సుగ్రీవునికి అర్థమైందీ- రామునిచేతిలో వాలికి మోక్షం లభించిందీ- సీతమ్మకు రాముని వార్తలు మొదటిసారిగా అందిందీ రావణవధ అయ్యాక అయోధ్యలో రామచంద్రుడు పట్టాభిషిక్తు డయిందీ అన్నీ కూడా వసంతకాలంలోనే!
అమ్మవారిక్కూడా ఇష్టమైంది. ఈ కాలమే కాబట్టి, ఈ వసంతకాలంలోనే వసంతనవరాత్రుల పేరిట దసరా ఉత్సవాల్లాగా చేస్తారు. బుద్ధిశక్తి బాగా పెరగడానికి 'చదువుల తల్లి సరస్వతిని బాగా పూజించవలసింది ఈ కాలంలోనే' అంటూ 'వత్సరారంభ సంపూజితా' అనే సరస్వతీ సహస్రనామాల్లోని ఒక నామం కూడా చెప్తుంది.
*🌺వైద్యపరంగా...🌺*
ఇక ఉగాది పచ్చడిలో షడ్రుచులూ ఉంటాయి. మధుర (తీపి), ఆమ్ల (పులుపు), కటు (కారం), కషాయ (ఒగరు), లవణ (ఉప్పదనం), తిక్త (చేదు) రుచులు ఆఱూ కలిసి ఉంటాయి. తీపిని కలిగించే కొత్తబెల్లం ఆకలిని కలి గిస్తుంది. పులుపునిచ్చే కొత్త చింతపండు కఫవాతాల్ని పోగొడుతుంది. కారాన్ని కలిగించే మిరియపు పొడి శరీరంలోని క్రిముల్ని నాశనం చేయడమేకాక శ్లేష్మ రోగాల్ని దగ్గరకి రానీయదు. వగరు పుట్టించే మామిడి ముక్క లాలాజలాన్ని ఊరించి జీర్ణక్రియకి తోడ్పడుతుంది. ఎముకలని బలపరుస్తుంది ఉప్పు, చేదు కలిగిన వేపపువ్వు చేసే లాభాల్ని ఎన్నింటిని చెప్పినా ఏదో ఒకటి మరిచినట్టే ఔతుందిట. అంత గొప్పది వేపపువ్వు.
వేపచెట్లగాలి. ఆరోగ్యప్రదం. వేపచిగుళ్లు కడుపులోని నులిపురుగుల్ని చంపేసి తిరిగి పుట్ట నీయవు. వందకు వందేళ్లూ జీవించే ఈ చెట్టునుంచి వచ్చిన కల్లు, కుష్ఠువ్యాధిని నివారిస్తుంది. దీని ఆకుల్ని బియ్యంలో గాని, పుస్తకాల మధ్యలో గాని పెడితే పురుగు దరిచేరనే చేరదు. వేపగింజలతో నూనె చేసి శరీరానికి రాసు కుంటూంటే కొంతకాలానికి బొల్లి కూడా నయమౌతుంది.
వేపాకును పసుపు నూనెతో కలిపి ముద్ద చేసి ఒంటికి ప్రతివారాంతంలో రాస్తే ఏ తీరు చర్మ వ్యాధైనా సమసిపోతుంది. వేపపూవుని కోసి, ఎండ బెట్టి పొడిచేసి, ఆ పొడిని, ఎండిపోయిన తులసి చెట్టును కాల్చిన భస్మంతో కలగలిపి తింటే యమ దర్శనం కానేకాదట!
*🌺ఉగాది రోజును ఎలా గడపాలి?🌺*
మనం తెల్లవారుజామునే లేచి కాలకృత్యాలు ముగించాక, ఇంట్లో ఉన్న పెద్ద ముత్తైదువ ఆయురారోగ్యా శ్వర్యాలతో ఉండవలసిందని దీవిస్తూ మన మీద అక్షతల్ని వేసి తలకు (మాడు మీద) నువ్వుల నూనెను పెట్టాలి.
ఆ మీదట మనం ఒంటరిగా నువ్వుల నూనెని రాసుకుని, ఒక గంటసేపు నూనెతో నానాక సున్నిపిండితో తలంటు పోసుకోవాలి. నూనెతో నానే సమయంలో వ్యాయామం గానీ, దైవస్తోత్రాలుగాని రెండూగానీ చేసు కోవచ్చు. అభ్యంగన స్నానమయ్యాక నిత్యం మనం చేసుకునే పూజ ముగించుకుని దైవమందిరంలో ఉన్న అక్షతల్ని ఇంట్లో ఉన్న పెద్దవారికిచ్చి, వాళ్లకు పాదాభివందనం చెయ్యాలి. పసుపుబొట్టు పెట్టిన కొత్తబట్టల్ని మనకిస్తూ ఆశీర్వ దించాలి- వాళ్లు. మనం కొత్త బట్టలు కట్టుకుని దేవుడికి అంతకు ముందే నైవేద్యం పెట్టిన వేపపూవు పచ్చడిని ఆరగించాలి.
*🌺పంచాంగ శ్రవణం🌺*
సరిగా ఈ సమయానికి గుళ్లోనో లేక మరో ప్రదేశంలోనే పంచాంగ పఠనం ప్రారంభమవుతుంది. సంవత్సరంలో 'మన జీవితం, మనల్ని పరిపాలించే పాలకుల రాజ్యం, మననందరినీ పరిపాలించే ఆ భగవానుని అభి ప్రాయం' ఎలా ఉందో ఆ విషయమంతా దీనిద్వారా తెలుసుకోగలుగుతాం.
మనం చేసిన పాప పుణ్యాల కనుగుణంగా మనకు రావాల్సిన లాభనష్టాల్ని గమ నించిన భగవంతుడు, లాభాల్ని కల్గించేందుకు శుభగ్రహాలనూ, నష్ట పెట్టేందుకు అశుభగ్రహాలనూ నాయ కులుగా నియమిస్తూ కొత్త సంవత్సరాన్ని నిర్మిస్తాడు.
*🌺శుభాకాంక్షలు🌺*
ఇంతకీ ఇలా అన్నిటికీ ప్రథమమైన ఉగాదినాడు శుభాకాంక్షలు ఇలా తెలపాలని మన పెద్దలు మనకు చెప్పారు. 'ప్రజలందరికీ సుఖం కలుగుగాక! పరిపాలకులు న్యాయ మార్గంలో పాలింతురు గాక! హోమాలు చేయడానికై పాలనిచ్చే గోవులవల్లా- భూమిని దున్ని పంటనిచ్చే ఎద్దుల వల్లా-ఆవులవల్ల వచ్చే పాలనూ, ఎద్దులవల్ల వచ్చిన ధాన్యాన్నీ యజ్ఞంలో వినియోగించే వేదవేత్త అయిన బ్రాహ్మ ణుని వల్లా దేవతలు తృప్తిపడి సమస్తలోకాలనీ చల్లగా చూతురుగాక! సకాలంలో వర్షాలు పడునుగాక! భూమినిండా అందరికీ సంతానమూ ఉండుగాక! సంపదలేనివారికి సంపదలు కలిగి, దేశమంతా శాంతిమంతమై ఉండుగాక! ఏ ఒక్కరూ దుఃఖాన్ని పొందకుండుదురుగాక! రాజులు నిర్భ యంగా తమ పరిపాలన చేయుదురుగాక!'- అనేవి మహర్షు లిచ్చిన శుభాకాంక్షలు.
పైగా శుభాకాంక్షలనగానే ఉగాది రోజున ఉదయాన్నే లేచి తల్లి దీవెన పొందుతూ మాడు (బ్రహ్మరంధ్రం) పైన నూనె పెట్టించుకుని తల్లికీ తండ్రికీ నమస్కరించి, తలంటుపోసుకుని కొత్త బట్టలు ధరించి దైవదర్శనం చేస్తే, తమ సంతానంమీద ఆ తల్లిదండ్రుల ఆశీస్సులు ఫలిస్తాయి. పిల్లలబుద్ధి వికసిస్తుంది. కూడా! - ఇది ఋషులు చెప్పిన నిజం అనుభవంలో ఉన్న సత్యం!
*ఓం నమః శివాయ*
*****
రెండు గంటల నిరీక్షణ
నాన్నగారికి ఆరోగ్యం సరిగ్గా లేదు. చాలా జ్వరంగా ఉంది. మా కుటుంబ వైద్యులు రామమూర్తి గారు కొన్ని మందులు రాసిచ్చి, “సంపూర్ణంగా విశ్రాంతి అవసరం. మంచం నుండి కదలడానికి వీల్లేదు” అని చెప్పి వెళ్ళిపోయారు.
ఆ సమయంలోనే శ్రీమఠం నుండి స్వామివారి ఆజ్ఞతో ఒకరు ఇంటికి వచ్చారు. “పరమాచార్య స్వామివారి దర్శనానికి హింది పంతుల్ని ( మానాన్న) రమ్మంటున్నారు” అని.
అవును అది పరమాచార్య స్వామివారి ఆదేశం. మనస్సు సిద్ధమయ్యింది కాని వెళ్ళడానికి శరీరం సహకరించడం లేదు. మా నాన్నగారి పరిస్థితి చూసి, అతను సానుభూతి తెలిపి వెళ్ళిపోయాడు. ఒక గంట తరువాత శ్రీమఠం నుండి గుర్రపు టాంగా వచ్చి మా ఇంటి ముందు నిలబడింది. బహుశా చాలా ముఖ్యమైన విషయం అయ్యుంటుంది. ఈ సమయంలో హింది పండితుడు ఉండాలి అని మహాస్వామి వారు అనుకుని ఉంటారు.
నాన్నగారు వెళ్ళాల్సిందే. నాలుగైదు రోజులుగా నాన్న అన్నంగంజి తప్ప ఏమి తీసుకోవడం లేదు. రసం అన్నం కూడా తినవద్దని డాక్టరు గారు ఖండితంగా చెప్పారు. అయిష్టంగానే కొంత గంజి తాగి శ్రీమఠం సేవకుని సహాయంతో టాంగా ఎక్కారు. మఠం చేరగానే చాలా కష్టంగా కిందకు దిగారు. అ సేవకుని సహాయంతో మహాస్వామివారి వద్దకు వెళ్ళారు.
నాన్నని కూచోమన్నట్టుగా స్వామివారు ఆదేశించారు. స్వామివారి దర్శనం కోసం చాలామంది భక్తులు వచ్చారు. ఎన్నో సూచనలు చేశారు, పత్రాలను చదివి పంపారు, ఆశీర్వాదాలు ఇస్తున్నారు;
అలా రెండుగంటలు గడిచిపోయింది. నాన్నకు ఆకలిగా అనిపించింది. తనలో తనే, “స్వామివారు ఒక్కమాట కూడా మాట్లాడలేదు. నాకు ఆరోగ్యం కూడా బాలేదు. ఇక్కడకు వచ్చి ప్రయోజనం ఏమిటి?” అనుకున్నారు. అక్కడే ఉన్న స్వామివారి అంతేవాసులను చూసి మౌనంగా తన బాధను చెప్పుకున్నారు.
వెంటనే అతను, “హింది పండితునికి ఆరోగ్యం బాగోలేదు. చాలాసేపటి నుండి ఇక్కడే కూర్చున్నారు” అని చెప్పాడు.
మరునిముషంలోనే స్వామివారు ప్రసాదం ఇచ్చారు. వెంటనే నాన్నగారు స్వామి ఇచ్చిన విభూతిని నుదుటన రాసుకున్నారు. స్వామివారికి ప్రణామాలు సమర్పించి బయలుదేరుతుండగా శ్రీమఠం సేవకులు సహాయం చెయ్యడానికి రాగా, ”అవసరం లేదు. నేను నడవగలను” అని ఎటువంటి ఇబ్బంది లేకుండా నడిచి వెళ్ళి టాంగా ఎక్కి కూర్చున్నారు.
ఇంటికి చేరగానే నాన్న గట్టిగా, “నాకు ఆకలేస్తోంది. చాలా ఆకలేస్తోంది. ఏమి చేశారు ఇంట్లో?” అని అడిగారు. “డాక్టరు మిమ్మల్ని కేవలం గంజి మాత్రమే తీసుకోమని చెప్పారు” అని అన్నాము.
“అతను చెప్పనీ. . . నాకు భోజనం పెట్టండి” అన్నారు. నాన్న ఆరోజు సుష్టుగా కమ్మని భోజనం చేశారు. సాయింత్రం నాన్నని పరీక్షీంచడానికి డాక్టర్ వచ్చారు. “అసలు జ్వరం లేదు. నేను ఇచ్చినది కాక ఇంకే ఔషధం తీసుకున్నారు?” అని అడిగారు.
“మీరు ఇచ్చినదే తీసుకున్నాను”
“లేదు.. లేదు.. మీరు ఏదో వేరే చేశారు”
అప్పుడు నాన్నగారు తను శ్రీమఠానికి వెళ్ళడం దాదాపు రెండుగంటలు స్వామివారి సన్నిధిలో ఊరికే కూర్చోవడం మొత్తం జరిగినదంతా డాక్టరుకు చెప్పారు. ఆయన ఆశ్చర్యపోతూ,
“అది సంగతి. నేను చెప్పలేదా మీరు ఇంకా ఏదో చేశారని.. నేను సరిగ్గానే ఊహించాను. రెండుగంటల పాటు స్వామివారి అనుగ్రహ వీక్షణం మీమీద పడి, మొత్తం మీ ఆనారోగ్యాన్ని పారద్రోలింది. పరమాచార్య స్వామివారు డాక్టర్లకే పెద్ద డాక్టర్. నా వైద్యం మీకు త్వరగా బాగుచేయదు కాబట్టి, వారి వైద్యాన్ని కృపాకటాక్ష వీక్షణాల ద్వారా మీమీద ప్రసరించడానికే మిమ్మల్ని మఠానికి రమ్మన్నారు” అని చెప్పారు.
ఏమి కరుణ!! ఎంతటి కరుణాసముద్రులు!!
మహాస్వామివారు ఉన్నవైపు తిరిగి మా కుటుంబ సభ్యులమందరమూ చెయ్యెత్తి వేవేల నమస్కారాలు చేశాము.
--- మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 7
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
****
*60 దాటిన అదృష్టవంతులు వీరే. జపనీస్ పుస్తకం ప్రకారం, జపాన్‌లో, డాక్టర్ వాడా 60 ఏళ్లు పైబడిన వారిని 'వృద్ధులు' అని కాకుండా 'అదృష్టవంతులు' అని పిలువడాన్ని సమర్థించారు.*
*డాక్టర్ వాడా 60 ఏళ్ల వారికి సలహా ఇచ్చారు...*
*"అదృష్టవంతుడు" అవ్వడం యొక్క రహస్యం"34 వాక్యాలలో" ఇలా వివరించబడింది:*
*1. కదులుతూ ఉండండి.*
*2. మీరు చిరాకుగా అనిపించినప్పుడు, లోతైన శ్వాస తీసుకోండి.*
*3. వ్యాయామం చేయండి, తద్వారా శరీరం దృఢంగా అనిపించదు.*
*4. వేసవిలో, ఎయిర్ కండీషనర్ ఆన్‌లో ఉన్నప్పుడు, ఎక్కువ నీరు త్రాగాలి.*
*5. మీరు నమలడం వల్ల మీ శరీరం మరియు మెదడు మరింత శక్తివంతంగా ఉంటాయి.*
*6. జ్ఞాపకశక్తి తగ్గుతుంది వయసు వల్ల కాదు, ఎక్కువ కాలం మెదడును ఉపయోగించకపోవడం వల్ల.*
*7. ఎక్కువ మందులు వేసుకోవాల్సిన అవసరం లేదు.*
*8. ఉద్దేశపూర్వకంగా రక్తపోటు మరియు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించాల్సిన అవసరం లేదు.*
*9. మీరు ఇష్టపడేది మాత్రమే చేయండి.*
*10. ఏం జరిగినా ఇంట్లో ఎప్పుడూ ఉండకూడదు. ప్రతి రోజూ ఇంటి నుంచి బయటకు రావడమే కాకుండా నడవండి.*
*11. మీకు కావలసినది తినండి, కానీ నియంత్రణలో ఉంచండి.*
*12. ప్రతిదీ జాగ్రత్తగా చేయండి.*
*13. మీకు నచ్చని వ్యక్తులతో అదే విధంగా ప్రవర్తించవద్దు.*
*14. మీ ప్రియమైన వారిని జాగ్రత్తగా చూసుకోండి.*
*15. వ్యాధితో చివరి వరకు పోరాడడం కంటే దానితో జీవించడం మంచిది.*
*16. కష్ట సమయాల్లో, ఇది ముందుకు సాగడానికి సహాయపడుతుంది.*
*18. మీరు నిద్రపోలేనప్పుడు, మిమ్మల్ని మీరు బలవంతం చేయకండి.*
*19. సంతోషకరమైన పనులు చేయడం అనేది మెదడును పెంచే ఉత్తమ చర్య.*
*20. మీ సన్నిహితులతో మాట్లాడుతూ ఉండండి.*
*21. మీకు సమీపంలో ఉన్న "ఫ్యామిలీ డాక్టర్"ని త్వరగా కనుగొనండి.*
*22. ఓపికగా ఉండండి, కానీ అతిగా ఉండకండి, లేదా మిమ్మల్ని మీరు ఎల్లవేళలా చక్కగా ఉండేలా బలవంతం చేయండి.*
*23. కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉండండి, లేకపోతే మీరు పాత అంటారు.*
*24. అత్యాశతో ఉండకు, ఇప్పుడు నీ దగ్గర ఉన్నదంతా మంచిది మరియు సరిపోతుంది.*
*25. మీరు మంచం మీద నుండి లేవవలసి వచ్చినప్పుడు, వెంటనే లేచి నిలబడకండి, 2-3 నిమిషాలు వేచి ఉండండి.*
*26. మరింత సమస్యాత్మకమైన విషయాలు, మరింత ఆసక్తికరంగా ఉంటాయి.*
*27. స్నానం చేసిన తర్వాత, బట్టలు ధరించేటప్పుడు గోడ నుండి మద్దతు తీసుకోండి.*
*28. మీకు మరియు ఇతరులకు ప్రయోజనకరమైనది మాత్రమే చేయండి.*
*29. ఈరోజు ప్రశాంతంగా జీవించండి.*
*30. కోరికలే దీర్ఘాయువుకు మూలం!*
*31. ఆశావాదిగా జీవించండి.*
*32. సంతోషకరమైన వ్యక్తి ప్రజాదరణ పొందుతాడు.*
*33. జీవితం మరియు జీవిత నియమాలు మీ స్వంత చేతుల్లో ఉన్నాయి.*
*34. ఈ వయస్సులో ప్రతిదీ ప్రశాంతంగా అంగీకరించండి!*
*60 ఏళ్లు దాటిన మిత్రులందరికీ అంకితం...*
*_💐 నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి, ఆరోగ్యంగా ఉండండి 🙂
*****
🌸☘️🌸☘️🌸☘️🌸
*మన కర్మలకు పద్దెనిమిది మందిసాక్షులు*
*చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత.*
*కానీ*....
*నేను ఒక్కడినే కదా ఉన్నాను.*
*నన్ను ఎవరూ గమనించడం లేదు అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు.*
*మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి.*
*అవి నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి .*
*వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు.*
*ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి.*
*ఇవి మన*లోకంలోని న్యాయస్థానాల్లో *సాక్ష్యం చెప్పపోవచ్చును *గాని*
*వీటి గమనిక నుండి*
*మనిషితప్పించుకోవడం*
*సాధ్యపడదు*
*దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమపడుతుంటాడు.*
*ఈ మహాపదార్థాలు రహస్యయంత్రాల వంటివి.*
*అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి.*
*ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి.* *అది వాటిని కర్మలుగా మలుస్తుంది.* *మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది.* *సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి.*
*అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు.*
*ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టిపరిణామక్రమం.*
*అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు.*
*అది మనం చేసే పని మంచిదా ? చెడ్డదా ? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది.*
*కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే.*
*ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం.*
*కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము.* *అందువల్ల అంతరాత్మ అనుభవ పూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పది హేడు కూడా నిజమేనని గ్రహించగలగటం వివేకం.*
*నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం.*
*అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తు న్నాయంటే, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం.*
*ఈ ఎరుక కలిగినప్పుడు*
*ఏ మనిషీ చెడ్డ పనులు చేయటానికి తెగించడు.*
*ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటి వారికి సాధ్యమయినంత సహాయం చేయాలనే సత్‌సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం* *ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచిపనులు చేయడానికి పయ్రత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు.*
🌹 *హరేకృష్ణ*🌹
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
దేవుడు ఎంత గొప్పవాడో…
నిరాశ వద్దు!
"ఛీ"!!! చచ్చిపోతే_బాగుండు ...
నాలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి ఉండవు....
అర్థంచేసుకొనేవారు కూడా ఎవరూ లేరు...
చనిపోవడం బెటర్ అని ఆలోచిస్తూ...
చాలా ఏళ్లగా తీవ్రమైన సమస్యలతో సతమతమౌతున్న ఒక యువకుడు విసిగి వేసారి, అన్నీ విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నాడు...!!!
అన్నీ అంటే...???
ఉద్యోగం...
తనని నమ్మిన కుటుంబాన్నే
కాక తాను నమ్మిన దైవాన్ని,
చివరికి దేవుడిచ్చిన జీవితాన్ని కూడా విడిచిపెట్టేయాలని నిర్ణయించు కున్నాడు.
చివరిగా ఒక్కసారి దేవునితో మాట్లాడాలని ఏకాంతంగా ఉన్న ఒక ప్రాంతంలో దేవునితో ఇలా మాట్లాడతాడు...
"దేవుడా!
నేను ఇవన్నీ విడిచి పెట్టకుండా ఉండడానికి కారణం ఒక్కటి చెప్పగలవా?"
అని అడుగుతాడు.
దానికి దేవుడు వాత్సల్యంగా.. "నాయనా!
ఒక్కసారి నీ చుట్టూ చూడు ఎత్తుగా అందంగా ఎదిగిన గడ్డి..,
వెదురు మొక్కలు కనిపిస్తున్నాయా?"
"అవును... కనిపిస్తున్నాయి."
"నేను... ఆ గడ్డి విత్తనాలు... వెదురు విత్తనాలు... నాటినప్పుడు అవి మొలకెత్తడానికి కావలసిన అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను...
గాలి, నీరు సూర్యరశ్మి ... అవసరమైనవి అన్నీ అందించాను."
”గడ్డి వెంటనే మొలకెత్తింది. భూమి పై పచ్చని తివాచి పరచినట్టుగా!
కానీ వెదురు మొలకెత్తనే లేదు. కానీ నేను వెదురును విడిచిపెట్టనూలేదు... విస్మరించనూలేదు...”
“ఒక సంవత్సరం గడిచింది,
గడ్డి మరింత ఎత్తుగా ఒత్తుగా పెరిగింది అందంగా ఆహ్లాదంగా...
కానీ వెదురు చిన్న మొలక కూడా మొలకెత్తలేదు రెండు, మూడు, నాలుగు సంవత్సరాలు గడిచాయి ...!”
”వెదురు మొలకెత్తలేదు
కానీ నేను అప్పటికి వెదురును విస్మరించలేదు...!”
”ఐదవ సంవత్సరం వెదురు చిన్న మొలక భూమిపై మొలకెత్తింది...!”
”గడ్డి కన్నా ఇది చాల చిన్నది!”
”కానీ ఒక్క ఆరు నెలలలో
అది వంద అడుగుల ఎత్తు ఎదిగింది ...
అందంగా బలంగా ...!”
”ఐదు సంవత్సరాలు అది తన వేళ్ళను భూమి లోపల పెంచుకుంది బలపరచుకుంది...!”
”పైకి ఎదిగిన వెదురును నిలబెట్టగల బలం వేళ్ళు ముందు సంపాదించాయి.
ఆ బలం వాటికి లేకపోతే వెదురుమనలేదు (నిలబడలేదు)”
”👉నా సృష్టిలో దేనికీ కూడా అది ఎదుర్కోలేని సమస్యను నేనివ్వను...!”
”ఇన్నాళ్లూ నువ్వు పడుతున్న కష్టాలన్నీ, ఎదుర్కుంటున్న సమస్యలన్నీ నీ వేళ్ళను(మానసిక స్థైర్యాన్ని) బలపరుస్తూ వచ్చాయి...!”
”వెదురు మొక్కను విస్మరించలేదు..!
నిన్నుకూడా విస్మరించను... ఒకటి, నిన్ను నువ్వు ఇతరులతో ఎన్నటికీ పోల్చుకోకు..!”
”రెండూ, అడవిని అందంగా మలచినప్పటికీ...
గడ్డి లక్ష్యం వేరు..
వెదురు లక్ష్యం వేరు...!”
”నీసమయం వచ్చ్చినప్పుడు నువ్వూ ఎదుగుతావు...!!!"
"దేవుడా...!
మరి నేను ఎంత ఎదుగుతాను??"
"వెదురు ఎంత ఎదిగింది?"
“అది ఎంత ఎదగగలదో అంత ఎదిగింది."
నువ్వు ఎంత ఎదగాలని నేను అనుకుంటానో అంత ఎదుగుతావు.
దేవుడు ఎప్పుడూ... ఎవరినీ ... విస్మరించడు... విడిచిపెట్టడు...!
మనం కూడా దేవునిపై విశ్వాసాన్ని, నమ్మకాన్ని మన ప్రయత్నాన్నీ ఎన్నటికీ విడిచిపెట్టకూడదు...!
ఆయన మన చేయి విడువక మంచి స్నేహితునిగా మనలను అర్థం చేసుకుంటాడు...!”
”ధైర్యంగా ఉండండి.. !
తప్పక దేవుని సహాయాన్ని అందుకుంటారు.”
🙏🙏🙏
_*నేపాల్ లో సీతారాముల కళ్యాణం*_
🚩 *మనం నవమి నాడు సీతారాముల కల్యాణం చేస్తాం కదా..!!*
*కానీ...*
🚩 *నేపాల్ వారి సంప్రదాయం ప్రకారం సీతారాముల కల్యాణం జరిగింది మాఘశుద్ధ పంచమి నాడు...!!! దానినే 'వివాహ పంచమి' అంటారు.*
🚩 *రాములవారు సీతమ్మ తల్లిని పెళ్లాడిన ప్రస్తుత నేపాల్లోని మిథిల (జనకపురి) లో ఇప్పటికీ వారి కల్యాణ వేడుకను రంగరంగ వైభవంగా జరుపుకుంటారు !!!*
🚩 *స్వాతంత్ర్యం రాకముందు అంటే 1947 వరకూ వారి కల్యాణానికి మన భారత్ అయోధ్య నుంచి బియ్యం-తలంబ్రాలతో జనకపురి వెళ్లేవారు.*
🚩 *బిహార్-నేపాల్ సరిహద్దుల్లో మన తరపున వెళ్లే వరుడు తరపు వాళ్లకు, నేపాల్ ప్రతినిధులు వధువు తరపు వాళ్లుగా ఘనస్వాగతం పలికేవారు...!!!*
🚩 *ఇంకా... ఆనాడు జనకుడు స్త్రీధనం కింద సీతమ్మ తల్లికి ఇచ్చిన నేలనుంచి ధాన్యం కూడా నేపాల్ ప్రభుత్వం ఊరేగింపుగా రథాల్లో పంపించేది.*
🚩 *బ్రిటీష్ పాలన వరకూ ఆ సంప్రదాయం కొనసాగింది.*
🚩 *స్వాతంత్ర్యం వచ్చాక, అప్పటి సెక్యులర్ ప్రధాని ఆ ఆనవాయితీని రద్దు చేశారు...!!! వాళ్లు పంపే ఐదారు ధాన్యపు బస్తాల వేడుక పేరుతో... డబ్బు, సమయం వృధా అవుతోందనే కుంటిసాకుతో ఆపేశారు...!!! నాటి నుంచి ప్రభుత్వ అధికారిక లాంఛన కార్యక్రమంగా కాకుండా, కొందరు వివాహ పంచమికి వెళ్లివస్తున్నారు.*
🚩 *అయితే... చాలాకాలం తరువాత వీ. హెచ్. పి. 2019 లో పెద్ద ఎత్తున ఊరేగింపుగా తలంబ్రాలు, పెళ్లికొడుకు రామయ్య తరపున వధూవరులకు పట్టు వస్త్రాలు తీసుకెళ్లారు.*
🚩 *ఇక్కడి నుంచి వెళ్లిన విశ్వహిందూపరిషత్ ముఖ్యులను నేపాల్ రాష్ట్రపతి, ప్రధాని సహా స్థానికులు సరిహద్దులో మనవాళ్లకు ఘన స్వాగతం పలికారు.*
🚩 *ఇలా మన సనాతన ధర్మం మరియు మన సంస్కృతీ సంప్రదాయాల గురించి మనకు తెలియని... తెలియనివ్వని... దాచిన... చరిత్ర ఎంతో ఉంది.*
🚩 జై శ్రీరామ్ 🚩
🙏🏻🙏🏻🙏🏻🔔🔔🔔🙏🏻🙏🏻🙏🏻
180424-7.
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*నాన్న వదిలేసి వెళ్ళిన ఆ చేతి ముద్రలు:*
➖➖➖✍️
*నాన్న వదిలేసి వెళ్ళిన ఆ చేతి ముద్రలు నన్ను వెంటాడుతూనే ఉన్నయ్…*
నాన్న వయస్సు పెరిగేకొద్దీ శరీరం కూడా బాగా బలహీనపడిపోయింది…
గదిలోనే అటూఇటూ నడవడానికి గోడ ఆసరా అవసరమవుతోంది…
తన చేతులు పడినచోట గోడ మీద ఆ ముద్రలు పడుతున్నాయి…
నా భార్యకు అది చిరాకు… తరచూ నాతో చెబుతోంది… గోడలు మురికిగా కనిపిస్తున్నాయనేది ఆమె కంప్లయింట్…
ఓరోజు ఆయనకు బాగా తలనొప్పి ఉండటంతో తలకు కొంత నూనె పట్టించి కాసేపు మసాజ్ చేసుకున్నాడు… అవే చేతులతో గోడను పట్టుకుని నడిచేసరికి ఆ ముద్రలు మరింత స్పష్టంగా పడ్డాయి గోడ మీద…
నా భార్య నామీద అరిచింది…
నేనూ సహనం కోల్పోయి నాన్న మీద అరిచాను… నడిచేటప్పుడు అలా గోడను పట్టుకోకు అని గట్టిగా కేకలేశాను…
గాయపడ్డట్టుగా తన కళ్లు…
నావైపు అదోలా చూశాడు…
నాకే సిగ్గనిపించింది… ఏం మాట్లాడాలో ఇక తెలియలేదు…
ఆ తరువాత గోడలను పట్టుకుని నడవగా చూడలేదు నేను…
ఓరోజు బ్యాలెన్స్ తప్పి పడిపోయాడు…
మంచం మీద పడిపోయాడు… తరువాత కొన్నాళ్లకే కన్నుమూశాడు…
నాలో అదే దోషభావన…
ఆరోజు తను నావైపు చూసిన చూపు నన్ను వెంటాడుతూనే ఉంది…
నన్ను నేను క్షమించుకోలేకపోతున్నా…
కొన్నాళ్లకు మా ఇంటికి రంగులు వేయించాలని నిర్ణయించుకున్నాం…
పెయింటర్స్ వచ్చారు…
తాతను బాగా ప్రేమించే నా కొడుకు నాన్న వదిలేసి వెళ్లిన ఆ గోడ మీద మాత్రం కొత్త పెయింట్ వేయకుండా అడ్డుకున్నాడు… అరిచాడు…
ఆ పెయింటర్స్ సీనియర్లు, క్రియేటివ్ కూడా…
“మీ తాత చేతిముద్రలు చెరిగిపోకుండా చూస్తాం, వాటి చుట్టూ సర్కిళ్లు గీసి, డిజైన్లు వేసి, ఓ ఫోటో ఫ్రేములా మార్చి ఇస్తాం”సరేనా అని సముదాయించారు…
అలాగే చేశారు…
ఇప్పుడు ఆ చేతి ముద్రలు మా ఇంట్లో ఓ భాగం…
ఆ డిజైన్ను మా ఇంటికొచ్చినవాళ్లు అభినందించేవాళ్లు…
వాళ్లకు అసలు కథ తెలియదు… తెలిస్తే నన్ను ఎంత అసహ్యించుకునేవాళ్లో…!
కాలం ఆగదు కదా, వేగంగా తిరుగుతూనే ఉంది…
నాకూ వయస్సు మీద పడింది… శరీరం నా అదుపులో ఉండటం లేదు కొన్నిసార్లు…
నాకిప్పుడు అదే గోడ ఆసరా కావల్సి వస్తోంది…
నాన్న పడిన బాధ ఏమిటో నాకిప్పుడు తెలిసొస్తోంది…
ఎందుకనిపించిందో తెలియదు, గోడ ఆసరా లేకుండానే నడవటానికి ప్రయత్నిస్తున్నాను…
ఓరోజు అది చూసి మా అబ్బాయి పరుగున వచ్చాడు, నా భుజాలు పట్టుకున్నాడు… “నాన్నా! గోడ ఆసరా లేకుండా అస్సలు నడవొద్దు, పడిపోతవ్” అని మందలించాడు…
మనవరాలు వచ్చింది, “నీ చేయి నా భుజాల మీద వేసి నడువు తాతా”అంది ప్రేమగా…
నాలో దుఖం పొంగుకొచ్చింది… అసలే తండ్రిని నేనే పోగొట్టుకున్నాననే ఫీలింగు, అలాంటి ధోరణి ఏమాత్రం చూపించని నా పిల్లలు…
నేను ఆ రోజు నాన్న మీద అరవకపోతే ఇంకొన్నాళ్లు బతికేవాడు కదా అనే బాధ…
నా మనవరాలు మెల్లిగా నన్ను నడిపించుకు వెళ్లి సోఫాలో కూర్చోబెట్టింది… తన డ్రాయింగ్ బుక్ తీసి చూపించింది…
గదిలోని గోడ మీద నాన్న చేతిముద్రలనే ఆమె డ్రాయింగ్ బుక్లో గీసింది…
టీచర్ బాగా అభినందించిందని చెప్పింది… ‘పిల్లలు పెద్దల్ని ఇలా గౌరవించడం మన సంస్కృతి’ అని రాసిందామె ఆ స్కెచ్ మీద…
నా గదిలోకి వచ్చి పడుకున్నాను… మౌనంగా రోదిస్తున్నాను… నన్ను వదిలి వెళ్లిపోయిన నాన్నను క్షమించమని పదే పదే ప్రార్థిస్తున్నాను…
తరువాత మెల్లగా నిద్ర పట్టేసింది… ఏమో… తరువాత ఏమైందో నాకు తెలియదు… నా ఆత్మ నాన్న వైపే వేగంగా పయనిస్తున్నట్టే ఉంది… ✍️
_(ఓ మిత్రుడు పంపించిన ఇంగ్లిష్ పోస్టుకు తెలుగు అనువాదం ఇది…)_
_A heart touching story _
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*
➖▪️➖
రా..మ.. అంటే కేవలం రెండు అక్షరాలు కాదు.. అదో మహాశక్తి మంత్రం. ధర్మానికి ప్రతిరూపమైన శ్రీరాముడిని కీర్తిస్తూ భక్తజనం పండుగ జరుపుకొంటున్న శుభ తరుణమిది. వాల్మీకి రామాయణం ప్రకారం, రాముడు ఛైత్ర మాసం శుక్ల పక్షంలో నవమి తిథి నాడు, అభిజిత్ ముహుర్తం, కర్కాటక రాశిలో జన్మించాడు. ఛైత్ర నవరాత్రుల్లో నవమి చివరి రోజు. ఈ పవిత్రమైన రోజున దేశవ్యాప్తంగా శ్రీరామ నవమి వేడుకలను ఘనంగా జరుపుకుంటారు. శ్రీ మహా విష్ణువు త్రేతాయుగంలో ధర్మస్థాపన కోసం శ్రీరాముడిగా అవతరించిన దినమే చైత్ర శుక్లపక్ష నవమి శ్రీరామ నవమి. ఈ రోజున ప్రధానంగా మూడు ఘట్టాలు నిర్వహిస్తారు. శ్రీరామ జననం, సీతారాముల కల్యాణం, శ్రీరామ పట్టాభిషేకం. మన సనాతన ధర్మం, పురాణాలు, జ్యోతిషశాస్త్రం ప్రకారం మహా విష్ణువు ప్రతి అవతారానికి ఒక్కో గ్రహం ప్రామాణికంగా ఉంటుంది. శ్రీరాముడు శ్రీ మహా విష్ణువు అవతారం. ఒకే బాణం, ఒకే భార్య అనేది శ్రీరాముడి సుగుణం. రామబాణానికి ఉన్న శక్తి అటువంటిది. ‘నవమి’ శ్రీరాముడి జీవితంలో ముఖ్య ఘట్టాలన్నీ నవమి రోజునే జరిగాయి. నవ అంటే తొమ్మిది. సాధారణంగా సామాన్యకలు నవమి అంటే భయపడతారు. కానీ శ్రీరాముడికి నవమితోనే ఆయన జీవితంలో ముఖ్యమైన ఘట్టాలు జరిగాయి.
ఉదాహరణకు.. నారసింహ అవతారం కుజగ్రహాన్ని సూచిస్తుంది. కృష్ణావతారం చంద్రగ్రహాన్ని సూచిస్తుంది. వామన అవతారం గురుగ్రహం; అలాగే, శ్రీరామ అవతారం నవగ్రహాలకు అధిపతి అయిన సూర్యభగవానుడిని సూచిస్తుంది. రామాయణం, జ్యోతిషశాస్త్రం ప్రకారం.. శ్రీరాముడు త్రేతాయుగంలోని గురువారం రోజున చైత్ర శుక్ల నవమినందు కర్కాటక లగ్నంలో జన్మించినట్టుగా పురాణాలు చెబుతున్నాయి.
శ్రీరాముని అవతారంలో రాముడు సూర్యవంశంలో జన్మించడం.. ఆయన జాతకంలో సూర్యుడు మేషంలో ఉచ్ఛక్షేత్రంలో ఉండటం.. ఇవన్నీ ధర్మస్థాపన కోసం రామావతారం ప్రాధాన్యతను తెలుపుతున్నాయి. మనిషి జీవితంలో ఎలా నడుచుకోవాలి? ఎలా ప్రవర్తించాలి? ఎలా ఉండాలనే అంశాలు రామాయణం ద్వారా తెలుసుకుంటారు.
ఈసారి శ్రీరామ నవమి రోజున ఆశ్లేష నక్షత్రం, రవి యోగం, సర్వార్ధ సిద్ధి యోగం ఏర్పడుతున్నాయి. ఈ శుభ యోగం ఉదయం 5:16 గంటల నుంచి ఉదయం 6:08 గంటల వరకు ఉంటుంది. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, రవి యోగం, సర్వార్ధ సిద్ధి యోగం చాలా పవిత్రమైన యోగాలు పరిగణించబడతాయి. ఈ నేపథ్యంలో ఈసారి ఏప్రిల్ 17న శ్రీరామ నవమి వచ్చింది. నవమి తిథి 16 ఏప్రిల్ 2024 మధ్యాహ్నం 1:23 గంటలకు ప్రారంభమై, మరుసటి రోజు అంటే బుధవారం 17 ఏప్రిల్ 2024 మధ్యాహ్నం 3:14 గంటలకు ముగుస్తుంది. ఈరోజున అభిజిత్ ముహుర్తం లేదు. విజయ ముహుర్తం 2:24 గంటల నుంచి మధ్యాహ్నం 3:24 గంటల వరకు ఉంటుంది.
శ్రీరామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలన, ఉత్తమ రాజు లక్షణం, ఉత్తమ సోదరుడి కర్తవ్యం.. ఇలా అనేక విషయాలన్నీ రామ అవతారంలో చూసి నేర్చుకోవాల్సిన గొప్ప సుగుణాలు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన శ్రీరాముడిని సనాతన ధర్మంలో పూజించడం వల్ల విజయాలు కలుగుతాయని పురాణాలు పేర్కొంటున్నాయి. మానవుడు ఎలా ఉండాలి, బంధాలను ఎలా గౌరవించాలి, కాపాడుకోవాలి అని ఆచరించి చూపించాడు శ్రీరామచంద్రుడు. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటం, ధర్మాన్ని పాటించడం.. ఏకపత్నీ వ్రతుడిగా ఉండటం, ఎల్లప్పుూ సత్యం మాట్లాడటం, మంచి ప్రవర్తన సద్గుణాలకు చిహ్నం రామయ్య అనేంతలా మారిపోయాడు రాముడు.
రామాయణంలో రామచంద్రమూర్తికి వశిష్ట మహర్షి పేరు పెట్టారు. రామాయణం ప్రకారం.. రామ రహస్యోపనిషత్తు ప్రకారం రామ నామానికి అనేక రకాలైన అర్థాలు ఉన్నాయి. అందులో రమంతే యోగినో యత్ర రామ అని ఒక అర్థం. అనగా.. యోగీశ్వరులు ఏ భగవంతుని యందు ఆస్వాదన చెందుతారో అతనే రాముడు అని అర్థం; రామ అనే దానికి అర్థం రాక్షస యేన మరణం యాంతి -రామ. అంటే ఎవరిచే రాక్షసులు మరణించెదురో అతడే రాముడు అని. శ్రీరామ నవమి రోజు రామనామస్మరణం చేయడం అనేక రెట్ల పుణ్యఫలం. రామ నామమును తారకమంత్రమని, తారకమంత్రమంటే తేలికగా దాటించేది అని అర్థం. ఏ మంత్రము చెప్పినా దానిముందు ఓం అని.. తర్వాత నమః అని కచ్చితంగా వాడాలి. కానీ రామ నామానికి రామ అనే మంత్రానికి ఇవి వాడాల్సిన అవసరం లేదు. శ్రీరామ, శ్రీరామ అనుకుంటూనే విష్ణులోకాన్ని పొందవచ్చని పురాణాలు తెలుపుతున్నాయి.
పూర్వం శివుడు పార్వతీదేవికి శ్రీరామ నామ గొప్పతానాన్ని తెలియజేస్తూ శ్రీరామ రామరామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే అనే శ్లోకాన్ని పార్వతీదేవికి తెలియజేశాడు. విష్ణు సహస్రనామం పారాయణం తర్వాత ఈ శ్లోకంతోనే దాన్ని ముగిస్తారు. శ్రీరామ.. శ్రీరామ.. శ్రీరామ అని మూడు సార్లు అంటే ఇందులోనే వెయ్యి నామాలు ఉన్నాయని.. సకలదేవతలూ ఇందులోనే ఉన్నారని శివుడు పార్వతికి తెలియజేసినట్టు పురాణాలు చెబుతున్నాయి. రామో విగ్రహవాన్ ధర్మః’ రాముడి వ్యక్తిత్వాన్ని గురించి రావణాసురుడికి చెబుతూ శత్రువైన మారీచుడు పలికిన మాటలివి. అంటే ధర్మానికి రూపం ఇస్తే అది రాముడన్నమాట. సూర్యుడు తీక్షణతకు, చంద్రుడు ఆహ్లాదానికి ప్రతీక. ఈ రెండు లక్షణాలనూ కలబోసుకుని సూర్యవంశంలో జన్మించిన రాముడు తన వ్యక్తిత్వంతో రామచంద్రుడయ్యాడు.
రమింపజేసేవాడు రాముడు. అంటే ఆనందాన్ని కలిగించేవాడు. తండ్రి మాట జవదాటడు, ఏకపత్నీవ్రతుడు అంటూ కీర్తిస్తాం. సకలగుణాభిరాముడిగా ఆరాధిస్తాం. అయితే చంద్రుడిలో మచ్చ ఉన్నట్లే శ్రీరామచంద్రుడి వ్యక్తిత్వంలోనూ కళంకాలున్నాయి- అనేవారున్నారు. నిజానికిది లోతైన విశ్లేషణ కాదు. పైపైన చూసి చేసిన విమర్శ. రాముణ్ణి శంకించేవారు చెప్పే ప్రధాన సంఘటనలు వాలివధ, సీత అగ్ని ప్రవేశం. వాలి విషయమై మనకు కొన్ని సందేహాలున్నాయి కదా! అంతకంటే ఎక్కువ వాలికున్నాయి. అతడు రాముణ్ణి ఉద్దేశించి ‘రామా! నేను నీతో యుద్ధం చేయడం లేదు. నీ ఎదురుగానైనా లేను. మనిద్దరి మధ్యా ఆస్తి తగాదాలు లేవు. నా చర్మమో, మాంసమో నీకు పనికిరాదు. మరెందుకు బాణం వేశావు? నువ్వు ధర్మాత్ముడిగా చలామణి అవుతున్నావు కానీ నిజానికి మహా అధర్మపరుడివి. అసలు రావణాసురుడి చెరలో ఉన్న సీతను తెచ్చేందుకు సుగ్రీవుడి బదులు నన్ను అడిగితే.. పది నిమిషాల్లో సీతను నీ ముందు ఉంచేవాణ్ణి కదా’ అంటూ ఉక్రోషాన్ని ప్రదర్శించాడు వాలి. వాలి ప్రశ్నలు విన్న రామచంద్రుడు ‘పెద్దన్నగా సుగ్రీవుడికి తండ్రి స్థానంలో ఉన్న నువ్వు అతని భార్యను చెరపట్టావు. దుందుభి అనే రాక్షసుడి విషయంలో సుగ్రీవుడిది పొరపాటే కానీ తప్పు అనిపించుకోదు. దానికతడు పశ్చాత్తాపం చెంది క్షమించమన్నాడు కూడా. అయినా సుగ్రీవుణ్ణి చంపాలని చూశావు. అతని భార్యతో అధర్మంగా ప్రవర్తించావు. భరతుడి రాజ్య ప్రతినిధిగా లోకంలో ధర్మాన్ని రక్షించాల్సిన బాధ్యత నాపై ఉంది కాబట్టి అధర్మంగా ప్రవర్తించిన నిన్ను బాణంతో కొట్టాను. నీ పాపానికి అనేక జన్మల వరకు నిష్కృతి లేదు. కానీ చేసిన నేరానికి రాజదండన అనుభవించి చనిపోతే నీకు స్వర్గప్రాప్తి కూడా కలుగుతుంది. ఇది నీకు మరణం ప్రసాదించిన వరం. ఇక చెట్టుచాటుగా కొట్టడం అనేది నీకు నేను విధించింది శిక్షే కానీ, అది యుద్ధం కాదు. రాజు శిక్ష విధించినప్పుడు నేరస్థుడికి ఆయుధం ఇచ్చి ఎదురుగా వచ్చి యుద్ధం చేయడు. నేను నరుణ్ణి, నువ్వు వానరుడివి. జంతువును ఉచ్చుబిగించి, వలపన్ని, చాటు నుంచి- ఎలాగైనా వేటాడవచ్చు. కనుకనే అలా చేశాను. పరకాంతను ఎత్తుకెళ్లిన రావణాసురుడి కంటే తమ్ముడి భార్యను చెరపట్టడమనే అతి పెద్ద తప్పు చేసిన అధర్మపరుడివి నువ్వు. నీ నుంచి సాయం ఎలా ఆశిస్తాను?’ అంటూ బదులిచ్చాడు. ఆ వివరణతో తన ప్రవర్తనకు పశ్చాతాపం చెంది, రాముడికి నమస్కరించాడు వాలి. రాముడి దోషం లేదని నమ్మాడు కాబట్టే.. వాలికి మామ అయిన సుషేణుడు యుద్ధంలో రాముడి పక్షంలో పోరాడాడు. రావణుడి శక్తి ఆయుధానికి బలైన లక్ష్మణుణ్ణి బతికించాడు. హనుమంతుడికి సంజీవ పర్వత ఆనవాళ్లు తెలియచేసి ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రం నుంచి సేనలను కాపాడాడు. అందువల్ల వాలి వధ విషయంలో వాలికి, అతని కుటుంబ సభ్యులకు లేని సందేహం మనకు ఉండాల్సిన అవసరం లేదు.
రామచంద్రుని వ్యక్తిత్వం మీద ఆరోపిస్తున్న మరో మచ్చ.. సీత అగ్నిపరీక్ష. అంతఃపురంలో హాయిగా కాలం గడపతగిన అవకాశాలున్నా రాముణ్ణి విడిచి ఉండలేక అరణ్యానికి వచ్చిన సాధ్వి ఆమె. రావణుడు సీతనెత్తుకుపోతే నీళ్లలోంచి బయటపడిన చేపలా విలవిలలాడాడు రాముడు. అదీ వారి అనుబంధం. ‘సీత రాముడి బహిఃప్రాణం. ఆమె పక్కన లేకుంటే ఇక సంహరించాల్సిన పనిలేదు. తనంత తానే శక్తిహీనుడవుతాడు’ అంటూ చెప్పిన అకంపనుడి మాటలు వారిద్దరి అనురాగాన్ని తెలియజేస్తాయి.
అనుమానించింది.. నిందించింది..పది నెలలు అరణ్యమంతా గాలించి, నానా యాతనా పడి, సముద్రానికి వారధి కట్టి, వానరసైన్యంతో లంకకు చేరి, ప్రాణాలకు తెగించి రావణుణ్ణి జయించాడు రాముడు. అయితే దుఃఖంతో, ప్రేమతో, ఆత్రుతతో వచ్చిన సీత శీలాన్ని శంకించాడు. నిజానికప్పుడు సీతమ్మతల్లితో ‘కంటి రోగంతో బాధపడుతున్న వాడికి దీపకాంతి సరిగా కనపడనట్లే.. నీ శీలం పట్ల ఇక్కడ కొందరికి సందేహం ఉంది. వారికి ప్రతినిధిగా నేను నిన్ను అనుమానిస్తున్నాను’ అన్నాడు రాముడు. దీపానికి మకిలి అంటదు, సమస్య చూపులోనే ఉంది. సీత పవిత్రమైందని తెలిసినా రాజైన రాముడు లోకమనే కంటితో చూస్తూ.. సీత అగ్నిప్రవేశం చేస్తున్నా ఊరుకున్నాడు. రేపు తను చక్రవర్తిగా సింహాసనాన్ని అధిష్టించినప్పుడు తన పక్కన కూర్చునే పట్టమహిషి పవిత్రమైందేనన్న భావన ప్రజలకు కలిగేందుకే ఈ అగ్నిపరీక్ష. పవిత్రమైందని తెలిసినా, అగ్నిపరీక్ష అనే అపనింద సీతమ్మవారికి అవమానకరమే కదా! నిజమే కానీ.. మారీచుడు ‘హా లక్ష్మణా! హా సీతా!’ అని అరిచినప్పుడు లక్ష్మణుడు పలకలేదు. సీత ఎంత చెప్పినా అతడు పర్ణశాల నుంచి కదల్లేదు. అప్పుడు సీత ‘అవసరమైతే అగ్నిలోనైనా దూకుతాను కానీ నీకు లొంగను’ అని బిడ్డలాంటి మరిదిని అనుమానించి, నిందించింది. ఆ కర్మఫలమే సీతమ్మకు అగ్నిలో దూకాల్సిన పరిస్థితులను కల్పించింది. ఒకవేళ సీత అగ్నిలో కాలిపోతే? ఉహూ.. కాలదు! అది సీత పట్ల రాముడికున్న గాఢ విశ్వాసం. హనుమంతుడి తోకకు నిప్పంటించినప్పుడు సీత అగ్నిదేవుణ్ణి ప్రార్థించింది. సీత ప్రార్థిస్తే హనుమ తోకను కాల్చకుండా రక్షించిన అగ్నిదేవుడు సీతను కాలుస్తాడా? ఇదీ సీత పట్ల రాముడి విశ్వాసం. అంత ధైర్యంగా సీత అగ్నిలో దూకటం తన పట్ల తనకున్న నమ్మకం. అంతగా పరస్పర విశ్వాసం కలిగిన ఆదర్శ దంపతులు సీతారాములు. సీత అగ్నిపరీక్ష గురించి తెలిసిన జనకమహారాజు- ‘రాముడు పరీక్ష పెడితే పెట్టాడు కానీ నా కూతురిని పరీక్షించడానికి అగ్నికున్న అర్హత ఏమిటి?’ అన్నాడు. అదీ తన బిడ్డపట్ల జనకుడికున్న విశ్వాసం.
aaవంకాయ వంటి కూరయు
పంకజముఖి సీత వంటి భార్యామణియున్
శంకరుని వంటి దైవము
లంకాధిపు వైరి వంటి రాజును కలడే!!! అంటూ చాటుపద్యం ఉంది. సీత వంటి భార్య లేదు (రాణి కాదు), రాముడి లాంటి రాజు లేడు (భర్త కాదు) అన్నాడు కవి. రాజధర్మానికి మచ్చుతునక శ్రీరామచంద్రుడు. అవతార పరిసమాప్తికి ముందు నియమోల్లంఘన చేసినందుకుగాను తనకు ఆరో ప్రాణమైనప్పటికీ.. లక్ష్మణుడికి మరణ దండన విధించిన రాజు రాముడు. రాజుగా వీసమెత్తు అటుగానీ, ఇటుగానీ మొగ్గని వ్యక్తిత్వం రాముడిది. అందుకే నేటికీ ఆదర్శ రాజ్యమంటే రామ రాజ్యమే, ఆదర్శ ప్రభువు ఎప్పటికీ ఆ శ్రీరామచంద్రుడే.
నవమి రోజున పానకం-వడపప్పు తయారు చేసి మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనుక ప్రాకృతిక పరమార్థమూ లేకపోలేదు. ఇది వేసవికాలం. కాబట్టి, వీటిని ప్రసాదరూపంలో సేవించడం వల్ల మనుషుల ఆరోగ్యం, ఆయుష్షు అభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద పండితుల అభిప్రాయం. మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా, ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. వడపప్పు - పానకం కూడా అంతే. శరదృతువు, వసంత రుతువులు యముడి కోరల్లాంటివని దేవీభాగవతం చెబుతోంది. ఈ రుతువులో వచ్చే గొంతు వ్యాధులకు పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని లౌకికంగా చెబుతారు.
పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైంది.పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును 'వడ'పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో 'వడ' కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది.
*****
👉 *చదవటం మిస్ అవకండి*
*అమృతం*
ఒరేయ్ నాయనా, నీకు సమయం ఆసన్నమైంది, ఇంకో కొద్ది క్షణాల్లో తిరిగి రాని లోకాలకు ప్రయాణం కావాలి, సిద్ధంకా! అంటూ సమవర్తి భటులు, నా పక్కకొచ్చి ప్రేష అంటే పిలుపునిచ్చారు.
మరీ ఇంత హఠాత్తుగా గానా? విస్తుపోయి అన్నాను.
తప్పదురా! వెళ్ళాలి. సెకనులో వెయ్యోవంతు కూడా లేటు కాకూడదు. క్రమశిక్షణలో మాకు మేమే సాటి. మమ్మల్ని నిలువరించే శక్తి ఎవరికీ లేదు. కాబట్టి వృధాగా మాట్లాడకుండా సిద్ధం కా అన్నారు.
సమయం చాలా కొద్ది గా ఉంది. ఏం చేయను? అప్పటివరకూ నాలో ఉన్న తాపత్రయాలు, బెంగలు, బాధలు పటాపంచలై పోయాయి.
నేనే శాశ్వతం కాదనుకున్నప్పుడు, ఏం బంధం నన్ను నిలువరించ లేదనుకున్నప్పుడు చివరి మజిలీలో ఏంచేస్తే బావుంటుందా అని ఆలోచించా. ఎంత ఆలోచించినా ఆలోచనలు ఒక కొలిక్కి రావటం లేదు.
ఆయన లేకపోతే నాజీవితం ఎట్లా వెడుతుందొదినా, పసుపు కుంకాలు లేని బ్రతుకెందుకు? అని భార్య రోదిస్తోంది. పసుపు కుంకాల రూపంలో నిత్యం ననుమోసే నా భార్య ఏడుపులో నా ఉనికి ఆవిడకెంత అవసరమో తెలుస్తోంది.
అప్పటివరకూ చాకిరీ చేసి అలసిన కొడుకు, డాక్టర్ ఆశ లేదనే విషయం చెప్పాక, నేను లేని జీవితం ఎలా గడపాలో ఆలోచిస్తున్నాడు. వాడికి నామీద ఉన్నప్రేమతో పాటు, రేపు అనేదానిమీద వాడికి కలుగుతున్న స్పృహ నాకు ఆనందాన్నిచ్చింది.
చివరి చూపుకొచ్చిన అల్లుడు, మిగతా కార్యక్రమం తొందరగా అయిపోతే తన దైనందిన జీవితంలో పడిపోవచ్చు, అసలే లీవు తక్కువ శాంక్షనయ్యిందని బాధపడుతున్నాడు.
అతని బాధలో వాస్తవం నాకు అర్థం అవుతోంది. అందుకే బాధ కలగటం లేదు.
ఇంకా బతుకుతాడనే నమ్మకం ఉంటే నిరీక్షించడం సబబుగా తోస్తుంది, రేపో,మాపో పోతాడని రూఢిగా తెలిస్తే రేపే కరెక్ట్ కదా.
ఇది ఎలాంటిదంటే బాగా ఇష్టమైన వ్యక్తి వేరే చోటుకు వెడుతూంటే బాధ కలుగుతుంది. వెళ్ళటం తప్పదని తెలిసినపుడు బస్టాండు వరకు వెళ్ళి బస్సు ఎక్కిస్తాం. బస్సు ఎక్కి సీటులో కూర్చున్నాక బస్సు ఎప్పుడు కదులుతుందా అని నిరీక్షిస్తాం. ఆ సమయంలో మాట్లాడేది, అక్కడే ఉండి కబుర్లు చెప్పుకునేది పెద్దగా ఉండదు. అందుకే బస్సు ముందు ఏవ్యాపకం లేకుండా అలా ఊరికే నిలబడే కన్నా బస్సు బయలుదేరితేనే మంచిదనిపించదూ!
అంటే దానర్థం వాళ్ళు వెళ్ళిపోవాలని కాదు, ఉండి ఏమీ చేయలేనప్పుడు, వెళ్ళటం మంచిదే కదా అని అనుకోవటం లాంటిది. ఇదీ అంతే అందుకే అల్లుడి ఆలోచనలో సబబుగా ఉందనిపించింది
ఈ గొడవలో పడి పిల్లల ఆలనా పాలనా మర్చిపోయానని తనను తాను నిందించుకుంటూ నా మనవలకు తిండి పెట్టే స్తోంది కోడలు.
ఆలస్యం చేస్తే పెద్దాయన గుటుక్కుమంటాడు, అపుడు హడావిడి మొదలవుతుంది. ఆ గొడవలో పిల్లలకు ఇబ్బంది కలగకూడదని ఆ తల్లి మనసు ఆరాటపడుతోంది. నాకు తప్పనిపించలేదు. పోయేవాళ్ళతో ఉన్నవాళ్ళు పోలేరు కదా కోడలూ కరెక్టే అనిపించింది.
అమ్మా! తాతకు ఏమయ్యిందీ? తల్లిపెట్టే గోరుముద్దలు తింటూ ఆలోచనగా అడిగాడు, నాపేరు పెట్టిన నా మనవడు.
తాతగారు ఇంకాసేపట్లో దేవుడి దగ్గరకు వెళతారు నాన్నా అంటోంది కోడలు.
మళ్ళీ ఎప్పుడు వస్తారు? అడుగుతున్నాడు.
ఇంక రారు.
మరి సెలవల్లో మనం తాతయ్యా వాళ్ళూరు రామా!
లేదు, మామ్మనే మన ఊరు తీసుకుని వెళ్ళిపోతాం.
వద్దమ్మా, తాతను మనతోనే ఉండమను, ప్రతీ సంవత్సరం మనం ఇక్కడికే వద్దాం.
ఈ మాట విన్న నా కూతురు పొగిలి, పొగిలి ఏడుస్తూ, ఇంక ఆ అదృష్టం మనకు లేదంటూ... బాధ పడుతోంది.
బయట గొలుసు వేసి కట్టేసిన నేను పెంచిన కుక్క ఎవరు ఏది పెట్టినా తినకుండా నా కోసం ఎదురు చూస్తోంది. నేను పెడితేనే తినటం దాని కలవాటు. గొలుసు తెంపుకుని నా దగ్గరకు రావాలని దాని ప్రయత్నం. ఏడుస్తూ గొలుసు విప్పమని గొడవచేసేస్తోంది.
ఒక మనిషి అస్థిత్వం చుట్టూ ఎన్ని అనుబంధాలు, అనుభూతులు ఉంటాయో కదా అనిపిస్తోంది.
నా ప్రాణం ఇంకా పోలేదు. మెల్లగా నన్ను కిందకు దించి, నేనెప్పుడూ సేదతీరే మా ఇంటి పెరటిలో ఉన్న వేపచెట్టుకింద పడుకో బెట్టారు.
ధనిష్టా పంచకం వస్తోంది. బయటకు తెండని ఎవరో అంటే, నన్ను చాపవేసి పడుకోబెడుతున్నారు. ముచ్చటపడి కట్టుకున్న ఇంటినుంచి చివరిసారిగా బయటకొస్తున్నట్టు తెలుస్తోంది. ఇంక దీనికి నాకు ఋణం తీరిందని తెలుస్తోంది.
చెట్టుకింద పుట్టల్లో ఉన్న చీమలు నామీద పాకుతున్నాయి. ప్రాణం ఇంకా పోలేదు కదా, అవి కుట్టినప్పుడు దేహం విలవిల లాడుతోంది. ఎవరైనా గుక్కెడు నీళ్ళు పోస్తే బావుండు ననిపిస్తోంది. మాట పెగలటం లేదు ఎవరి గొడవలో వాళ్ళున్నారు.
అపరకర్మలు చేసే ఆయనకోసం ఒకరు బయలుదేరారు. ఆయన కాస్ట్లీ రా, వేరొకరిని వెతకండి ఎవరో అంటున్నారు.
పోయాక ఏది జరిగినా తెలియదు, ఉన్నవాడికి రేపనేది ఉంటుంది కదా. వాడు బతకాలంటే డబ్బు కావాలి. ఆ సలహా మంచిదే అనిపించింది.
నా శరీరం సాగనంపడానికి చివరి సారిగా బేరసారాలు జరుగుతున్నాయి.
ఎవరో తులసి తీర్థం పోయమంటున్నారు. నేను రోజూ సంధ్యావార్చి, ఏ తులసిలో నీరు పోసేవాడినో ఆ తులసిచెట్టు ఆకులే చివరిసారిగా నా దాహార్తి తీర్చేందుకు సన్నద్ధమవుతున్నాయి.
రెండు గుక్కలు మింగాక, నా మనవడు ఒక్కసారి నా దగ్గరికొచ్చి ఆవకాయ తిన్న చిట్టి చేతులతో నా నోట్లో తనూ నీళ్ళు పోస్తానని పట్టు బట్టాడు.
వాడిని వద్దని సముదాయించడానికి అందరూ నానా తిప్పలు పడ్డాక, విధిలేక వాడితో తులసినీళ్ళు నా నోట్లో పోయించారు. వాడి చేతినీటితో ఆవకాయ రుచి నా నాలికకు తగిలి ప్రాణం లేచి వచ్చింది.
పోతుందనుకున్న ప్రాణం నాలో చేరేసరికి శరీరంలో చిన్న కదలిక మొదలయ్యింది.
నాకొడుకు వెంటనే స్పృహలోకి వచ్చి, నాన్న కదులుతున్నాడు అని ఆనందంతో అరిచాడు.
ఒక్కసారి అందరిలో ఆశ్చర్యం. పరుగున వచ్చి నాభార్య నా మనవడిని ముద్దు పెట్టుకుని, డాక్టర్ కి కబురు చేయమంది.
డాక్టర్ వచ్చాడు. చివరిసారిగా ప్రయత్నించాడు.
అప్పటివరకూ గొలుసుతెంపుకునేందుకు తాపత్రయపడ్డ నా కుక్కకి ఎవరో గొలుసు విప్పారు. అది పరుగున వచ్చి నా వంటిపై పాకుతున్న చీమలని కోపంగా చూసి, నాలుకతో నాకి నాకు ఉపశమనం కలిగించేందుకు సహకరిస్తోంది.
నాన్నని లోపలికి తీసుకొని వెడదామంటోంది నా కూతురు.
డాక్టర్ మందులిచ్చాడు. కాసేపటికి కళ్ళు తెరిచాను. సిలైన్ ఎక్కించాడు. కొద్దిగంటల్లో తిరిగి స్పృహలోకొచ్చా.
మృత్యుంజయుడురా మీ నాన్న అంటున్నారు. నా కొడుకు ఆనందానికి హద్దులు లేవు. కొద్దిరోజుల్లో మళ్ళీ మామూలు మనిషినయ్యా. మళ్ళీ బ్రతుకుతానన్న నమ్మకం కలిగాక అల్లుడితో సహా అందరూ మరికొన్ని రోజులు నాతో ఉన్నారు.
నాకోసం వచ్చిన యమభటులు ఎవో లెక్కలు సరిచూసుకుని, వీడు అమృతం తాగాడు, శాస్త్ర రీత్యా అది తాగిన వాడికి మృత్యువు రాకూడదు. అది శాస్త్ర విరుద్ధం అంటూ వెనుతిరిగారు.
చూస్తూండగానే తిరిగి వసంతం వచ్చింది. నా ఇల్లు పిల్లాపాపలతో కలకలలాడుతోంది.
నాకు పునర్జన్మనిచ్చిన అమృతాన్ని తిరిగి తయారుచేయటం మొదలు పెట్టాను. మామిడికాయలు ముక్కలు కొట్టి, వాటికి ఆవపిండి, గుంటూరు మిర్చి కి, బరంపురం మిర్చి కలిపి ఆడిన కారం, రాతి ఉప్పు, గానుగనూనె కలిపి ఒకజాడీలో ఆ అమృతాన్ని భద్రపరుస్తున్నా.
నిజం చెప్పొద్దూ బ్రతికి ఏం సాధిస్తాం అంటాం కానీ, బ్రతికినప్పుడే కదా ఆనందాన్ని ఆస్వాదించగలిగేది. వేతకాలేకానీ ఆనందం ప్రతీ దాంట్లో ఉంటుంది.
పెంపుడు జంతువుల సాంగత్యంలో,
పెంచే మొక్కల సాన్నిహిత్యం లో,
సంతానంతో కలిసి గడపటంలో,
రుచికరమైన వంటలో,
సుందరమైన ప్రకృతిలో,
ఆవకాయ అన్నంలో,
దోరగా కాలిన దొసెలో,
కరకరలాడే గారెలో.......
మక్కువగా ఆస్వాదిస్తే, అన్నింటిలోనూ ఆనందమే!
ఆనందంమైన అనుభవం, ఎన్నటికీ మృతంలేనిదే!
జీవితం అంచులకు చేరిన వాళ్ళకే తెలుస్తుంది, జీవితం విలువ. ఎందుకంటే జీవించడం అంటె తెలిసేది అప్పుడే.
అరవైలుదాటిన జీవితం, బోనస్ లాంటిది.
ఏభైల్లో ఉన్నజీవితం, అనుభవించడానికి ఇంకా సమయం ఉందని చెప్పేది.
నలభైల్లో జీవితం, ఆనందం గురించి అవగాహన కలిగించేది.
ముప్ఫైల్లో జీవితం, దొరికిన దానిలో ఆనందం వెతుక్కునేది,
ఇరవైల్లో జీవితం, మన జీవిన విధానమే ఆనందం, అనే భ్రమకలిగించేది,
ఇరవై లోపు జీవితం ఏది జరిగినా, అదే ఆనందం అని మురిసిపోయేది.
ఆనందం కోసమే జీవితం, దాన్ని మిస్సవ్వకండి. ఆనందంగా గడిపిన ప్రతీక్షణం అమృతమే అన్న సత్యాన్ని గుర్తించండి.
💥💥💥💥💥💥
*విమానం లో భోజనం* మనసు పెట్టి చదివే కథ, మనసు న్నోళ్ళ కథ,
.
విమానం లో నా సీట్ లో కూర్చున్నాను. ఢిల్లీ కు ఆరేడు గంటల ప్రయాణం . మంచి పుస్తకం చదువుకోవడం , ఒక గంట నిద్ర పోవడం --- ఇవీ నా ప్రయాణం లో నేను చేయ్యాలనుకున్నవి .
సరిగ్గా టేకాఫ్ కి ముందు నా చుట్టూ ఉన్న సీట్ల లో10 మంది సైనికులు వచ్చి కూర్చున్నారు . అన్నీ నిండి పోయాయి . కాలక్షేపంగా ఉంటుందని పక్కన కూర్చున్న సైనికుడిని అడిగాను . " ఎక్కడకి వెడుతున్నారు ?" అని
" ఆగ్రా సర్ ! అక్కడ రెండు వారాలు శిక్షణ. తర్వాత ఆపరేషన్ కి పంపిస్తారు " అన్నాడు అతను .
ఒక గంట గడిచింది . అనౌన్సమెంట్ వినబడింది . కావలసిన వారు డబ్బులు చెల్లించి లంచ్ చేయవచ్చు అని . సరే ఇంకా చాలా టైం గడపాలి కదా అని లంచ్ చేస్తే ఓ పని అయిపోతుందనిపించింది . నేను పర్సు తీసుకుని లంచ్ బుక్ చేద్దామనుకుంటూ అనుకుంటుండగా మాటలు వినిపించాయి
.
" మనం కూడా లంచ్ చేద్దామా ?" అడిగాడు ఆ సైనికులలో ఒకరు
" వద్దు ! వీళ్ళ లంచ్ ఖరీదు ఎక్కువ. విమానం దిగాక సాధారణ హోటల్ లో తిందాం లే !
" సరే ! "
నేను ఫ్లైట్ అటెండెంట్ దగ్గరకి వెళ్ళాను . ఆమెతో " వాళ్ళందరికీ కూడా లంచ్ ఇవ్వండి. " అని మొత్తం అందరి లంచ్ లకి డబ్బులు ఇచ్చాను .
" ఆమె కళ్ళల్లో నీరు " నా తమ్ముడు కార్గిల్ లో ఉన్నాడు సర్ ! వాడికి మీరు భోజనం పెట్టినట్టు అనిపిస్తోంది సర్ ! " అంటూ దణ్ణం పెట్టింది. నాకేదో గా అనిపించింది క్షణ కాలం...
నేను నా సీట్ లోకి వచ్చి కూర్చున్నాను .
అరగంటలో అందరికీ లంచ్ బాక్స్ లు వచ్చేసాయి...
నేను భోజనం ముగించి విమానం వెనక వున్న వాష్రూం కి వెళుతున్నాను .
వెనుక సీట్ లో నుండి ఒక ముసలాయన వచ్చాడు .
నేను అంతా గమనించాను . మీకు అభినందనలు .
ఆ మంచి పనిలో నాకూ భాగస్వామ్యం ఇవ్వండి అంటూ చేతిలో చేయి కలిపారు.
ఆ చేతిలో 500 రూపాయలు నోటు నా చేతికి తగిలింది...
మీ ఆనందం లో నా వంతు అన్నారాయన .
నేను వెనుకకు వచ్చేశాను. నా సీట్ లో కూర్చున్నాను. ఒక అరగంట గడిచింది. విమానం పైలట్ సీట్ నెంబర్లు వెతుక్కుంటూ నా దగ్గరకి వచ్చాడు. నా వైపు చూసి చిరునవ్వు నవ్వాడు.
" మీకు షేక్ హ్యాండ్ ఇద్దామనుకుంటున్నాను అన్నాడు ."
నేను సీట్ బెల్ట్ విప్పి లేచి నిలబడ్డాను .
అతడు షేక్ హేండ్ ఇస్తూ " నేను గతం లో యుధ్ధవిమాన ఫైలట్ గా పనిచేశాను . అపుడు ఎవరో ఒకాయన మీలాగే నాకు భోజనం కొని పెట్టారు .
అది మీలోని ప్రేమకు చిహ్నం . నేను దానిని మరువలేను " అన్నాడు
విమానం లోని పాసింజర్లు చప్పట్లు కొట్టారు . నాకు కొంచెం సిగ్గు గా అనిపించింది . నేను చేసింది ఒక మంచి పని అని చేశానంతే కానీ నేను పొగడ్తల కోసం చెయ్యలేదు.
నేను లేచి కొంచెం ముందు సీట్ల వైపు వెళ్లాను . ఒక 18 సంవత్సరాల కుర్రాడు నా ముందు షేక్ హేండ్ ఇస్తూ ఒక నోటు పెట్టాడు .
ప్రయాణం ముగిసింది .
నేను దిగడం కోసం డోర్ దగ్గర నిలబడ్డాను . ఒకాయన మాట్లాడకుండా నా జేబులో ఏదో పెట్టి వెళ్లి పోయాడు . ఇంకో నోటు
నేను దిగి బయటకు వెళ్లేలోగా నాతో పాటు దిగిన సైనికులు అందరూ ఒక చోట కలుసుకుంటున్నారు. నేను గబగబా వాళ్ళ దగ్గరకి వెళ్లి, నాకు విమానం లోపల తోటి పాసింజర్లు ఇచ్చిన నోట్లు జేబులో నుండి తీసి వాళ్ళకు ఇస్తూ " మీరు మీ ట్రైనింగ్ చోటుకి వెళ్ళే లోపులో ఈ డబ్బు మీకు ఏదన్నా తినడానికి పనికి వస్తాయి . మీరు మాకిచ్చే రక్షణ తో పోలిస్తే మేము ఏమి ఇచ్చినా తక్కువే ! మీరు ఈ దేశానికి చేస్తున్న పనికి మీకు ధన్య వాదాలు . భగవంతుడు మిమ్మల్ని , మీ కుటుంబాలను ప్రేమతో చూడాలి ! " అన్నాను . నా కళ్ళలో చిరు తడి .
.
ఆ పది మంది సైనికులు విమానం లోని అందరు ప్రయాణికుల ప్రేమను వాళ్ళతో తీసుకు వెలుతున్నారు . నేను నా కారు ఎక్కుతూ తమ జీవితాలను ఈ దేశం కోసం ఇచ్చేయ్యబోతున్న వారిని దీర్ఘాయువులుగా చూడు స్వామీ ! అని దేవుడిని మనస్పూర్తి గా కోరుకున్నాను.
ఒక సైనికుడు అంటే తన జీవితాన్ని ఇండియా కు చెల్లించబడే బ్లాంక్ చెక్కు లాంటి వాడు.
" బ్రతికినంత కాలమూ, జీవితాన్ని చెల్లించే ఖాళీ చెక్కు "
ఇంకా వారి గొప్పతనాన్ని తెలియని వారెందరో ఉన్నారు !
మీరు షేర్ చేసినా సరే , కాపీ పేస్ట్ చేసినా సరే ! మీ ఇష్టం !
ఎన్ని సార్లు చదివినా కంటతడి పెట్టించేదే ఈ విషయం చదవండి, ఇంకొకరికి పంపండి ఈ భరత మాత ముద్దు బిడ్డలను గౌరవించడమంటే మనల్ని మనం గౌరవించకోవటమే.
- జై హింద్ 🇮🇳🇮🇳🇮🇳
- *****
- 🌹🌹🌹🌹🌹🌹Sanka sriram 🌹🌹🌹🌹🌹🌹
శుభ సాయంత్రం 🙏
🙏🌴🪔💐🪔🌴🙏
*భగవంతుడు ఉన్నాడా...... లేడా.?*
రాజస్థాన్ లో రమేష్ చంద్ర అనే దయగల ఒక శ్రీకృష్ణుని భక్తుడు ఉండేవాడు. అతనికి ఒక మందుల దుకాణం ఉండేది. షాపులో ఒక మూలన శ్రీకృష్ణుడి చిన్న చిత్రం ఉంది. ప్రతిరోజూ దుకాణం తెరిచిన తర్వాత, తన చేతులు కడుక్కొని, ఆ దేవుని బొమ్మను శుభ్రం చేసి, దీపం, ధూపం మొదలైన వాటిని చాలా భక్తితో వెలిగించేవాడు.
అతనికి రాకేష్ అనే కొడుకు కూడా ఉన్నాడు, తన చదువు పూర్తి చేసి తండ్రితో పాటు దుకాణంలో కూర్చునేవాడు. తన తండ్రి రోజూ ఇదంతా చేయడం చూస్తూ ఉంటాడు. నవీన యుగంలో చదువుకున్న యువకుడు అవడంవల్ల తన తండ్రికి , దేవుడు అంటూ ఎవరూ లేరని, ఇదంతా మన మనస్సు యొక్క భ్రమ అని వివరించేవాడు.
సూర్యుడు తన రథంలో విశ్వం చుట్టూ తిరుగుతున్నాడని శాస్త్రాలు చెబుతున్నాయి, భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందని సైన్స్ రుజువు చేసిందని చెప్తూ.. ఇలా ప్రతి రోజూ సైన్స్ నుండి కొత్త ఉదాహరణలను ఇస్తూ, దేవుడు లేడని నిరూపించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు.
తండ్రి అతనిని ఆప్యాయంగా చూసి నవ్వేవాడు తప్ప ఈ అంశంపై వాదించడానికి లేదా చర్చించడానికి ఇష్టపడేవాడుకాదు.
కాలం గడిచేకొద్దీ తండ్రి వృద్ధుడయ్యాడు. ఇప్పుడు తన అంతం ఆసన్నమైందని బహుశా అతను తెలుసుకుని ఉంటాడు...
అలా ఒకరోజు తన కొడుకుతో ఇలా అన్నాడు," నాయనా, నువ్వు భగవంతుని నమ్మినా నమ్మకపోయినా, నువ్వు కష్టపడి పని చేస్తూ, దయతో, నిజాయితీగా ఉంటే చాలు. అయితే నేను చెప్పే ఈ ఒక్క మాట విని, పాటిస్తావా?"
కొడుకు,“అలాగే నాన్నా, తప్పకుండా పాటిస్తాను”, అని అన్నాడు.
తండ్రి ఇలా చెప్పాడు, "నాయనా, నా మరణానంతరం, ప్రతిరోజు దుకాణంలో ఉన్న దేవుని బొమ్మను శుభ్రం చెయ్యి; రెండవది, నువ్వు ఎప్పుడైనా ఏదైనా సమస్యలో ఇరుక్కుంటే, చేతులు జోడించి, శ్రీకృష్ణునికి నీ సమస్యను చెప్పుకో. నేను చెప్పినట్లు ఈ ఒక్క పని చెయ్యి చాలు." కొడుకు ఒప్పుకున్నాడు.
కొన్ని రోజుల తర్వాత తండ్రి చనిపోయాడు, కాలం అలా గడిచిపోతూ ఉంది...
ఒకరోజు జోరున వర్షం కురుస్తోంది. రాకేష్ రోజంతా షాపులో కూర్చునే ఉన్నాడు, కస్టమర్లు కూడా చాలా తక్కువగా ఉన్నారు. ఆపై కరెంటు కూడా ఇబ్బంది పెడుతోంది. అకస్మాత్తుగా వర్షంలో తడుస్తూ ఓ కుర్రాడు పరుగు పరుగున వచ్చి "అన్నా .. ఈ మందు కావాలి.. మా అమ్మకి చాలా జబ్బుగా ఉంది .. వెంటనే ఈ మందు నాలుగు చెంచాలు వేస్తేనే ... అమ్మ బతుకుతుందని డాక్టర్ చెప్పారు... నీ దగ్గర ఈ మందు ఉందా?" అని అడిగాడు.
రాకేష్ మందుచీటి చూసి వెంటనే “ఆ ... నా దగ్గర ఉంది” అని వెంటనే తీసి ఇచ్చాడు. బాలుడు చాలా సంతోషించి, వెంటనే మందుసీసాతో వెళ్ళిపోయాడు.
అయితే ఇది ఏమిటి!!
అబ్బాయి వెళ్లిన కొద్దిసేపటికే రాకేష్ కౌంటర్ వైపు చూడగానే చెమటలు పట్టాయి... కొద్దిసేపటి క్రితం ఓ కస్టమర్ ఎలుకల మందు సీసా తిరిగి ఇచ్చేసి వెళ్ళాడు. లైట్లు వెలగకపోవడంతో లైట్లు వచ్చింతర్వాత దానిని సరైన స్థలంలో పెడదామని భావించి రాకేష్ కౌంటర్ పై సీసాను అలాగే వదిలేశాడు. అయితే మందు కోసం వచ్చిన ఈ బాలుడు తన మందు సీసాకు బదులు ఎలుకల మందు సీసాను తీసుకెళ్ళాడు.. ఆ బాలుడు నిరక్షరాస్యుడు కూడా.
" ఓరి భగవంతుడా !!" అని రాకేష్ నోటి నుండి అసంకల్పితంగా ఆ మాటలు వెలువడ్డాయి, "ఏమిటి ఈ విపత్తు!!" అనుకుని, అప్పుడు తన తండ్రి మాటలు గుర్తుకొచ్చి, వెంటనే, ముకుళిత హస్తాలతో, బరువెక్కిన హృదయంతో శ్రీకృష్ణుని చిత్రపటం ముందు ప్రార్థించడం ప్రారంభించాడు. "ఓ ప్రభూ! మీరు ఉన్నారని తండ్రి ఎప్పుడూ చెబుతుండేవారు. మీరు నిజంగా ఉన్నట్లయితే, దయచేసి ఈ రోజు ఈ అవాంఛనీయ సంఘటన జరగనివ్వకండి. తన కొడుకు చేతిలో నుండి తల్లిని విషం త్రాగనివ్వకండి ... ప్రభూ ఆ విషాన్ని త్రాగనివ్వకండి!!!"
"అన్నా!" అని అప్పుడే వెనుక నుంచి ఒక గొంతు వినిపించింది... "అన్నా, నేను బురదలో జారిపోయాను, మందు సీసా కూడా పగిలిపోయింది! దయచేసి నాకు మరో సీసా ఇవ్వవా", అని అడిగాడు.
ప్రేమపూరితమైన చిరునవ్వుతో ఉన్న భగవంతుని చిత్రాన్ని చూస్తూండగా రాకేష్ ముఖంపై కన్నీళ్లు కారడం మొదలయ్యాయి!!!
ఆ రోజు, ఈ సమస్త విశ్వాన్ని నడిపేవారు ఎవరో ఉన్నారని అతనిలో ఒక విశ్వాసం మేల్కొంది...కొందరు ఆయన్ని భగవంతుడంటే, మరికొందరు సర్వోన్నతుడు అంటారు, కొందరు సర్వవ్యాపి అని, మరికొందరు దైవిక శక్తి అని అంటారు!
ప్రేమ, భక్తితో నిండిన హృదయంతో చేసిన ప్రార్థన ఎప్పుడూ ఆలకించబడుతుంది.
🙏🌴💐🪔💐🌴🙏
💦 *`నాన్న వదిలేసి వెళ్లిన ఆ చేతి ముద్రలు... నన్ను వెంటాడుతూనే ఉన్నయ్...`*
*నాన్న వయస్సు పెరిగేకొద్దీ శరీరం కూడా బాగా బలహీనపడిపోయింది… గదిలోనే అటూఇటూ నడవడానికి గోడ ఆసరా అవసరమవుతోంది… తన చేతులు పడినచోట గోడ మీద ఆ ముద్రలు పడుతున్నాయి…*
*నా భార్యకు అది చిరాకు… తరచూ నాతో చెబుతోంది… గోడలు మురికిగా కనిపిస్తున్నాయనేది ఆమె కంప్లయింట్… ఓరోజు ఆయనకు బాగా తలనొప్పి ఉండటంతో తలకు కొంత నూనె పట్టించి కాసేపు మసాజ్ చేసుకున్నాడు… అవే చేతులతో గోడను పట్టుకుని నడిచేసరికి ఆ ముద్రలు మరింత స్పష్టంగా పడ్డాయి గోడ మీద…*
*నా భార్య నామీద అరిచింది… నేనూ సహనం కోల్పోయి నాన్న మీద అరిచాను… నడిచేటప్పుడు అలా గోడను పట్టుకోకు అని గట్టిగా కేకలేశాను… గాయపడ్డట్టుగా తన కళ్లు… నావైపు అదోలా చూశాడు… నాకే సిగ్గనిపించింది… ఏం మాట్లాడాలో ఇక తెలియలేదు…*
*ఆ తరువాత గోడలను పట్టుకుని నడవగా చూడలేదు నేను… ఓరోజు బ్యాలెన్స్ తప్పి పడిపోయాడు… మంచం మీద పడిపోయాడు… తరువాత కొన్నాళ్లకే కన్నుమూశాడు… నాలో అదే దోషభావన… ఆరోజు తను నావైపు చూసిన చూపు నన్ను వెంటాడుతూనే ఉంది… నన్ను నేను క్షమించుకోలేకపోతున్నా…*
*కొన్నాళ్లకు మా ఇంటికి రంగులు వేయించాలని నిర్ణయించుకున్నాం… పెయింటర్స్ వచ్చారు… తాతను బాగా ప్రేమించే నా కొడుకు నాన్న వదిలేసి వెళ్లిన ఆ గోడ మీద మాత్రం కొత్త పెయింట్ వేయకుండా అడ్డుకున్నాడు… అరిచాడు…*
*ఆ పెయింటర్స్ సీనియర్లు, క్రియేటివ్ కూడా… మీ తాత చేతిముద్రలు చెరిగిపోకుండా చూస్తాం, వాటి చుట్టూ సర్కిళ్లు గీసి, డిజైన్లు వేసి, ఓ ఫోటో ఫ్రేములా మార్చి ఇస్తాం సరేనా అని సముదాయించారు…*
*అలాగే చేశారు… ఇప్పుడు ఆ చేతి ముద్రలు మా ఇంట్లో ఓ భాగం… ఆ డిజైన్ను మా ఇంటికొచ్చినవాళ్లు అభినందించేవాళ్లు… వాళ్లకు అసలు కథ తెలియదు… తెలిస్తే నన్ను ఎంత అసహ్యించుకునేవాళ్లో…*
*కాలం ఆగదు కదా, వేగంగా తిరుగుతూనే ఉంది… నాకూ వయస్సు మీద పడింది… శరీరం నా అదుపులో ఉండటం లేదు కొన్నిసార్లు… నాకిప్పుడు అదే గోడ ఆసరా కావల్సి వస్తోంది… నాన్న పడిన బాధ ఏమిటో నాకిప్పుడు తెలిసొస్తోంది…*
*ఎందుకనిపించిందో తెలియదు, గోడ ఆసరా లేకుండానే నడవటానికి ప్రయత్నిస్తున్నాను… ఓరోజు అది చూసి మా అబ్బాయి పరుగున వచ్చాడు, నా భుజాలు పట్టుకున్నాడు… గోడ ఆసరా లేకుండా అస్సలు నడవొద్దు, పడిపోతవ్ అని మందలించాడు…*
*మనవరాలు వచ్చింది, నీ చేయి నా భుజాల మీద వేసి నడువు తాతా అంది ప్రేమగా… నాలో దుఖం పొంగుకొచ్చింది… అసలే తండ్రిని నేనే పోగొట్టుకున్నాననే ఫీలింగు, అలాంటి ధోరణి ఏమాత్రం చూపించని నా పిల్లలు… నేను ఆ రోజు నాన్న మీద అరవకపోతే ఇంకొన్నాళ్లు బతికేవాడు కదా అనే బాధ…*
*నా మనవరాలు మెల్లిగా నన్ను నడిపించుకు వెళ్లి సోఫాలో కూర్చోబెట్టింది… తన డ్రాయింగ్ బుక్ తీసి చూపించింది… గదిలోని గోడ మీద నాన్న చేతిముద్రలనే ఆమె డ్రాయింగ్ బుక్లో గీసింది… టీచర్ బాగా అభినందించిందని చెప్పింది… ‘పిల్లలు పెద్దల్ని ఇలా గౌరవించడం మన సంస్కృతి’ అని రాసిందామె ఆ స్కెచ్ మీద…*
*నా గదిలోకి వచ్చి పడుకున్నాను… మౌనంగా రోదిస్తున్నాను… నన్ను వదిలి వెళ్లిపోయిన నాన్నను క్షమించమని పదే పదే ప్రార్థిస్తున్నాను… తరువాత మెల్లగా నిద్ర పట్టేసింది… ఏమో… తరువాత ఏమైందో నాకు తెలియదు… నా ఆత్మ నాన్న వైపే వేగంగా పయనిస్తున్నట్టే ఉంది… (ఓ మిత్రుడు పంపించిన ఇంగ్లిష్ పోస్టుకు తెలుగు అనువాదం ఇది…)*
*****
*ప్రాంజలి ప్రభ కథలు
శుక్లామ్బరధరం వర్సెస్ కాఫీ!*😇☕
కాంచి మహా పెరియవర్ శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి మంచి హాస్య ప్రియులు.
ఒకరోజు తన శిష్యుని పిలిచి,
*సంధ్యా వందనం అయిందా? శుక్లాం బరధరం అయిందా?* అనిఅడిగారు.
వెంటనే ఆ శిష్యుడు అయిందని తల ఆడించాడు.
దానికి మహా పెరియవర్ అతనితో ....
"శుక్లాం బరధరం చెప్పావా అని అడగలేదు. అయిందా అని అడిగాను" అన్నారు.
శిష్యుని కి ఏమీ అర్థం కాలేదు.😒
పెరియవర్ ఏమని అడిగారు? ఈ పదాలకు వున్న భేదాలేవీ బోధపడక పరితపించాడు. అతనికి సందేహంగాను వుంది.
కొన్ని నిమిషాలు మౌనంగా గడిచిన తరువాత,
మహా పెరియవర్ అతనితో "శుక్లాం బరధరం" చెప్పు చూద్దాం అన్నారు.
పెరియవర్ చెప్పమన్న వెంటనే,
"శుక్లాం బరధరం విష్ణుం శశి వర్ణం చతుర్బుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోప శాంతయే "....
అని శిష్యుడు చెప్పాడు.
శిష్యుడు చెప్పింది విన్న మహాపెరియవర్...
"దీనికి అర్థం తెలుసా?" అని అడిగారు.
"తెలుసు" అని బదులు చెప్పిన శిష్యుడు .....
తెల్లని మనసు, యేనుగులా నల్లని రంగు, నాలుగుచేతులు, ప్రకాశమయిన ముఖం, అందరూ తలచి చూసేలా చేయు ఆకారం వున్న వినాయకుని స్మరిస్తే ఏవిధమైన ఆటంకాలు, బాధలూ వుండవని చెప్పాడు.
అరే !
సరిగ్గా చెప్పావే,దానికి ఇంకో అర్థం వుంది, అది నీకు తెలుసా? అని చెప్పి,నవ్వారు.
శుక్లాం అంటే తెల్లనిది.
అంటే పాలు.
విష్ణుం అంటే నలుపు.
అది డికాషన్.
శశి వర్ణం అంటే నలుపు తెలుపు కలిసినది.
అంటే "కాఫీ".
చతుర్బుజం అంటే నాలుగు చేతులు.
అంటే, భార్యవి రెండు
చేతులు, కాఫీ ఇవ్వగానే అందుకునే భర్తవి రెండు చేతులు - కలిసి నాలుగు చేతులు.
"ధ్యాయేత్" అంటే తలిచే తలపులు.
అంటే అలాకాఫీ ఇవ్వడాన్ని మనసులో తలవగానే ....
"ప్రసన్న వదనం " ముఖం వికసిస్తుంది ఆసమయంలో.
"సర్వ విఘ్నోప శాంతయే" అంటే ....
అన్ని వేదనలూ పోగొట్టేది.
అనగా కాఫీ త్రాగితే వేదనలుతీరి, మనసు శాంతమవుతుందని అర్థం.
*శుక్లాం బరధరం అయిందా .... అన్న ప్రశ్నలో , కాఫీ త్రాగటం అయ్యిందా?* అన్న అర్ధం - దానిలో ఇమిడి వుంది.....
అని తెలుసుకున్న శిష్యులు మైమరచి నవ్వనారంభించారు.
కంచి పెరియవర్ చిరునవ్వులు చిలకరించారు. ☕🙏
*****
శరణాగతవత్సలులు
కాశీయాత్ర పూర్తిచేసి మఠానికి తిరిగి వచ్చిన శ్రీవారిని కుప్పు సహాయంకోసమై అర్థించాడు.
"నా వద్ద ఏముంది ? ధనమూ లేదు, మరేమీ లేదు. నేనేంచెయ్యగలను ?"
కుప్పు ప్రార్థన ఆపలేదు. శ్రీవారు తప్ప మరి దిక్కులేరన్నాడు. కుప్పు మంచి ప్రతిభాశాలి. చాలా భాషలునేర్చినవాడు. డిగ్రీ పట్టా ఉందతనికి. ఒక్క రాత్రిలో శుద్ధ సంస్కృతంలో మహామాఘం ప్రాధాన్యతగురించి పద్యకావ్యం వ్రాశాడు. తమిళ, ఆంగ్లభాషలూ బాగా వచ్చు. చివరికి శ్రీవారి సిఫారసుమీద ఒక బ్యాంకులో ఉద్యోగం దొరికిందతనికి. ఒక సంవత్సరం గడిచిందేమో.
శ్రీవారు తంజావూరులో విడిదిచేస్తుండగా ఒకనాడు ఒక వ్యక్తి, పూజకోసం వేయించిన మంటపానికి దాదాపు బయట, కూర్చుని కనిపించాడు. చొక్కా వేసుకుని ఉన్నాడు, ధూమపానం చేస్తూండగా కూడా ఎవరో చూశారు. శ్రీవారు ఆవ్యక్తిని తీసుకురమ్మన్నారు. ఆ మనిషి వచ్చేవాడిలాగా అనిపించలేదు, కానీ శ్రీవారి మాట జవదాటకూడదుగా. శ్రీవారి సహాయకులలో ఒకరు అతనిదగ్గరకువెళ్ళి శ్రీవారిని కలువవలసినదిగా కోరారు. అతడు వెంటనే వచ్చాడు.
"సరి అయిన దుస్తులు ధరించకపోవటం చేత రాలేదు", అన్నడతను సంజాయిషీ చెప్పుకుంటూ. శ్రీవారు అతనితో కాసేపు మాటలాడి, కుప్పు గురించి అడిగారు. అతడు జవాబివ్వటానికి సందేహించాడు. కొంతసేపు అడిగిన తరువాత కూడా సరైన సమాధానం ఇవ్వలేదు. "అదేంటంటే.... కుప్పు సెలవులో ఉన్నాడు". చివరికి, తడవ తడవలుగా, మాకు ఈ వ్యక్తిద్వారా తెలిసిందేమిటంటే - కుప్పుకి బ్యాంకులో కాషియర్‍గా పని ఇచ్చారనీ, డబ్బు దొంగతనం చేయడం వల్ల తాత్కాలికంగా తొలగించారనీను.
ఆ రోజు పూజ ముగిసిన తరువాత శ్రీవారు కుప్పువాళ్ళ గ్రామానికి వెడుతున్నానని ప్రకటించారు.
"అదోచిన్న కుగ్రామం, మనందరినీ వాళ్ళు భరించలేకపోవచ్చు. పైగా ఇప్పటికిప్పుడు పీఠాన్ని తరలించలేము" అంటూ అసమ్మతి తెలిపారు మఠ కార్యనిర్వహణాధికారి.
"పూజను తీసుకుని బయలుదేరుతున్నాను" అని ఆ గ్రామానికి బయలుదేరారు శ్రీవారు.
అవసరానికి అందరూ ఏకమవడం తంజావూరువాసుల ప్రత్యేకత. రాత్రికిరాత్రి వాళ్ళు సరంజామా కూర్చుకుని, మంటపాన్ని ఏర్పాటుచేశారు. పూజకూ ఇతర అవసరాలకూ సామగ్రి సిద్ధంచేశారు. ఆ కుగ్రామాన్ని తిరునాళ్ళలాగా మార్చేశారు.
శ్రీవారి సంగతంటారా, వారు తిన్నగా కుప్పువాళ్ళ ఎదురింటికి వెళ్ళి అక్కడ కూర్చున్నారు. కుప్పు వాళ్ళింట్లోనే అటకెక్కి దుప్పటి ముసుగుతన్ని పడుకున్నాడు. రెండురోజుల తరువాత మూడోరోజు మధ్యాహ్నం, కుప్పు ఏంజరుగుతోందో చూడటానికి జాగ్రత్తగా బయటకు వచ్చాడు. శ్రీవారు కుప్పును పసిగట్టి, తీసుకురమ్మన్నారు. కొంతమంది వీధి దాటి అవతలప్రక్కకు వెళ్ళి ఒకటో రెండో దెబ్బలువేసి కుప్పుని శ్రీవారివద్దకు తీసుకొచ్చారు. కుప్పు వెంటనే సాష్టాంగం చేస్తూ శ్రీవారి పాదాలమీద పడ్డాడు. పాదాలు పట్టేసుకున్నాడు.
శ్రీవారివలె శరణాగతిచేసినవారిని క్షమించి రక్షించేవారెవరూ లేరు. తమ పాదాలవద్ద ఆశ్రయంకోరినవారిని రక్షించు ప్రతిజ్ఞలో శ్రీవారు సాక్షాత్తూ శ్రీరాముడే. శరణాగతవత్సలులు.
కుప్పు సుమారు అయిదువేలరూపాయలు కాజేశారనుకుంటా. ఆ రోజుల్లో మఠంలో భిక్షావందనమునకు పదమూడురూపాయలు ఇవ్వవలసి ఉండేది. అయిదువేలరూపాయలు ఎంతపెద్దసొమ్మో మీరు ఊహించుకోవచ్చు. ఇది నలభైల్లో సంగతి. శ్రీవారు కుప్పుని తిట్టలేదు, ఒక్కమాట అడగలేదు. మఠ కార్యనిర్వహణాధికారిని పిలిపించి బ్యాంకుకు ఆ డబ్బును కట్టివెయ్యమన్నారు.
శ్రీవారు తరువాత తిరుచిరాపల్లిలో నేషనల్‍కాలేజీ స్థలంలో విడిది చేశారు. ఆరోజుల్లో ప్రతీ ఏటా చివరి ’రెండో శనివారం’ నాడు ఉపాధ్యాయుల పరిషత్తు సమావేశం జరిగేది. అవి తెల్లదొరతనం రోజులు. శ్రీవారు కళాశాల అధ్యక్షుడితో మాట్లాడారు. " ఈ కుర్రాడికి డిగ్రీ పట్టా ఉంది, చాలా భాషలు వచ్చు. మీరు మీ పాఠశాలలో ఉద్యోగం ఇవ్వగలరా ?".
"శ్రీవారి ఆదేశం. శ్రీవారు కోరుకుంటే పది ఉద్యోగాలు ఇవ్వగలను".
అలా కుప్పు జీవితంలో మళ్ళీ స్థిరపడ్డాడు. అప్పుడప్పుడూ దర్శనంకోసం వచ్చేవాడు. ఒక్కసారికూడా శ్రీవారు కుప్పుతో ఆ సంఘటన గురించి మాట్లాడలేదు. శ్రీవారు తమ భాషలోకానీ, ఇతరులతో తమ ప్రవర్తనలో కానీ ఎంతో ఉన్నతులు.
జీవితపు చివరిరోజుల్లో కుప్పుకు తన మలమూత్రవిసర్జనపై అదుపు ఉండేదికాదు. అలాంటి పరిస్థితిలో చనిపోయినవారికి మరుజన్మలేదంటారు. కుప్పు శ్రీవారినుండి ఒక్క చీవాటూ ఎరుగడు.
****
[22/04, 1:18 pm] Mallapragada Ramakrishna: ✍️ప్రాంజలి ప్రభ కథలు
_*పెళ్లి జరిగిపోయింది...*_
_*అప్పగింతలు జరుగుతున్నాయి...*_
*_అమ్మాయిని సాగనంపుతూ అందరూ మూడీగా ఉన్న సమయంలో..._*
*_పెళ్ళికూతురు... పెళ్ళికొడుకు చేయి విడిపించుకుని తండ్రి దగ్గరకు వచ్చి... కౌగలించుకుని... ప్రేమగా... ఒక ముద్దు పెట్టింది..._*
*_ఆ దృశ్యాన్ని చూసినా అక్కడున్న వారందరి హృదయాలూ... ఆర్తితో బరువెక్కాయి. కళ్లు చెమర్చాయి._*
*_ఏమిటీ... ఈ చిత్ర విచిత్ర భవభందాలూ అనుకునేంతలో..._*
_*పెళ్ళికూతురు... తండ్రి చేతిలో ఒక వస్తువు పెట్టి... కళ్ళు తుడుచుకుంటూ... " ఇక దీని భాద్యత నీదే డాడీ !! దీని అవసరం... నాకిక లేదు" అని చెపుతూ వెనుతిరిగింది.*_
*_చెమర్చిన కళ్ళతో... ఈ దృశ్యాన్ని చూస్తున్న బంధువులు... తండ్రికేమిచ్చిందా అని ఆసక్తిగా చూసారు..._*
*_తండ్రి కూడా కుతూహలంగా తన గుప్పెట చూసుకుని... మరుక్షణం ఎంతో సంతోషంగా..._*
*_తండ్రి అన్నాడు : "ఇది నా జీవితంలో ఆనందకరమైన రోజు... నా కూతురు... వెళ్ళిపోతూ నేను మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చింది... ఇరవై రెండేళ్లుగా నేను కనీసం కంటితో చూడలేకపోయిన నా వస్తువును, ఇక ఎన్నటికీ నాకు దక్కదు అనుకున్న దాన్ని... నాకు తిరిగిచ్చేసింది."_*
*_చాలా కుతూహలంగా, ఉత్సుకతతో వింటున్నారు... అందరూ._*
*_తండ్రి : " ఇంతకీ అదేంటో తెలుసా..! నా #క్రెడిట్_కార్డు ..!!"_*
*_అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు..._*
*_ఒక్క బిక్క మొహం పెళ్ళికొడుకు తప్ప..._*
*_Next credit card పెళ్లి కొడుకుది కాబట్టి_*
[****)
ప్రాంజలి ప్రభ కథలు
🍁కర్మవ్యాధి - గాయత్రి శక్తి🌸🌹🌸🙏🙏
(శ్రీపరమాచార్యులవారి అనుగ్రహ భాషణం)🌸🌸
🍁సుమారు ఐదారువందల సంవత్సరాల క్రితం తిరువనంతపురం పరిపాలిస్తున్న కేరళరాజుకు నివారణకాని రోగం యేర్పడింది. ఎన్ని వైద్యాలు చేసినప్పటికీ వ్యాధి నివారణకాలేదు. 'రాజ వైద్యం' అని అంటూవుంటాంగదా, ఆ విధంగా యెంతగానో చికిత్స చేసినప్పటికీ నయంకాక యెంతో బాధపడ్డాడు.🌸
🍁ఒకరోజు రాత్రి భగవానుడినే ప్రార్థించుకొంటూ అలాగే కొంతసేపు రెప్పవాల్చాడు. అప్పుడు ఒక స్వరూపం వచ్చింది. కలలో ఆకాశంనుండి భూమివరకు ఒక పెద్ద రూపం కనిపించి ఆయనతో, "రాజా! నీకు కలిగినది కర్మవ్యాధి. అంటే జన్మాంతరంలో నీవు చేసిన పాపంలో తీరిపోక మిగిలివున్న శేషమే రోగంగా మారింది. దానిని నీవు అనుభవించి మాత్రమే తీర్చుకోవాలి తప్ప ఔషధాలచే నయంచేయ సాధ్యంకాదు. కావాలంటే ఒక పని చేయవచ్చు. నీ ఆకృతితో నువ్వులతో ఒక ప్రతిమను చేసి దానిలోపల పూర్తిగా బంగారం నింపి, అందులో నీ కర్మను, పాపాన్ని, రోగాన్ని ఆవాహన చేసి శక్తివంతుడైన ఒక బ్రాహ్మణుడికి దానం యివ్వాలి. అప్పుడు కర్మ నిన్ను విడిచి వాడికంటుకొంటుంది. అతడు మంచి శక్తి కలిగినవాడైతే రోగాన్ని సంభాళించుకొనగలడు. అది యెలాగైనా అతడికి ఈ విధంగా రోగాన్ని కలిగిస్తుందన్నందుకు ప్రతిహారంగానే యింతటి స్వర్ణాన్నివ్వాలనడం" అని చెప్పింది.🌸
🍁లేవగానే రాజు ఆ విధంగానే నూవులతో బింబాన్ని చేసి, దానిలో కందిపప్పు వంటివైన స్వర్ణపూసలను పోసి నింపించాడు. దాన విషయాన్ని బ్రాహ్మణ మహాజనులకు దాచిపెట్టకుండా తెలియపరిచాడు.🌸
🍁దానం తీసుకోవడానికి యెవరూ ముందుకు రాలేదు. 'రాజు తన కర్మ అనుభవించు కొనవలసినదే. బంగారుకు ఆశపడి మన మంత్రశక్తిని పణంగా పెట్టడమా? మంత్రశక్తి చాలకుంటే మన ప్రాణాన్నే పణంగా పెడుతున్నట్టవుతుందిగదా?' అని అందరూ తప్పుకొన్నారు.🌸
🍁రాజు రోగబాధ తట్టుకోలేక పోతున్నాడు. బయట ఊళ్ళు, బయట రాజ్యాల నుండైనా యెవరైనా రాకపోతారా అని నాలుగు దిక్కులా దండోరా వేయడానికి మనుష్యులను పంపాడు.🌸
🍁ఇందుచేత కేరళరాజు సంగతి కర్ణాటక రాజ్యానికి కూడా తెలిసింది. మంచి మంత్రశక్తి, ధైర్యం కలిగిన ఒక కన్నడ బ్రహ్మచారి దానం తీసుకోవడానికి తిరువనంతపురానికి వచ్చాడు.🌸
🍁రాజుకు పట్టరాని సంతోషం. విధింపబడినట్టు అచ్చుపోసిన నువ్వులబొమ్మను బ్రహ్మచారికి దానం చేశాడు.🌸
🍁అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన ఘటన జరిగింది. బ్రహ్మచారి ప్రతిమను పరిశీలించి చూడగా, అది తన కుడిచేతిని పైకిలేపి బొటనవ్రేలిని, చిటికెన వ్రేలిని మడచుకొని మిగిలిన మూడువ్రేళ్ళను పైకి చాపి చూపింది.🌸
🍁రాజుయొక్క పూర్వకాల కర్మశేషం కాలపురుషుడనే మూర్తిగా ప్రతిమలో ప్రాణ ప్రతిష్ట చేయబడివుండింది. ఆ కారణంగా అచేతనమైన బింబం నిజంగానే ప్రాణం కలిగిన సచేతన జీవుడిగా మారింది.
అది ఈ విధంగా మూడు వ్రేళ్ళను పైకి చాపి చూపగానే బ్రహ్మచారి తల ఆడిస్తూ "అవన్నీ వీలుపడవు" అని అన్నాడు.
వెంటనే బింబం ఉంగరపు వ్రేలును మడచుకొని మిగిలిన రెండువ్రేళ్ళను మాత్రమే చాపినట్టు పెట్టుకొన్నది.
"అవి కూడా వీలపడవు" అని కన్నడ బ్రహ్మచారి తల వూపాడు.🌸
🍁బింబం మధ్య వ్రేలును కూడా మడచుకొని, చూపుడు వ్రేలునొక్కదానిని మాత్రమే చూపింది.🌸
"🍁పోతేపోనీ. నీ యిష్టప్రకారమే కానీ" అని అన్నాడు బ్రహ్మచారి. ఆ విధంగా అతడు నోరు మూసేలోపే బింబం పరమ సంతోషంతో అతడి కాళ్ళపై పడి సాష్టాంగ నమస్కారం చేసి నిలబడింది.🌸
🍁తరువాత బింబం వట్టి బింబంగా మాత్రమే నిలబడింది. కాలపురుషుడు దానిని విడచిపెట్టి వెళ్ళిపోయాడు.🌸
🍁ఇదేమిటన్నది అర్థంకాక, నివ్వెర పోతున్న రాజును, యితర పరివారాన్ని చూసి బ్రహ్మచారి ఇలా వివరించాడు.🌸
🍁బ్రహ్మచారి పరిశీలించి చూసినప్పుడు, "నీకు నా మంత్రజపంలో యెంతటి ఫలాన్నిస్తే నీవు నన్ను బాధించక వెళ్ళిపోతావు?" అంటూ మానసికంగా అడిగాడట.🌸
🍁అతడు రోజుకు మూడు వేళలా చేసే త్రికాల సంధ్యావందనాల ఫలాన్నిస్తే వెళ్ళిపోయేటట్టు, బింబం మూడు వ్రేళ్ళను చూపిందట. అంతటి పెద్ద ఫలితాన్ని యివ్వడం వీలుపడదని అతడు చెప్పినమీదట, అలాగయితే మూడు వేళల్లోని రెండిటి ఫలాన్నైనా యివ్వవలసినదని యాచిస్తూనే బింబం రెండు వ్రేళ్ళను చూపిందట. 🌸
🍁అది కూడా యెక్కువేనని అతడు బేరమాడాడు. అందుకే బింబం ఒకే ఒక వేళ సంధ్యావందన ఫలాన్ని అడిగిందట. దానినే పోతేపోనిమ్మని యితడు దత్తం చేయగా, భయంకరమైన కర్మశేషం, 'సమూలంగా పోతాను' అని యితడికి దండం పెట్టి పరుగెట్టి వెళ్ళిపోయింది.🌸
🍁పద్ధతిగా గాయత్రిని చేస్తే దానికి యెంతటి శక్తి వుంటుందని దీనినుండి తెలుసుకొన్న ప్రజలు ఆ శుద్ధమైన బ్రహ్మచారిని యెంతో ప్రస్తుతించారు. రాజుకు, పూర్వం బలి చక్రవర్తినుండి దానం తీసుకోవడానికి వచ్చిన వామన బ్రహ్మచారే నేడు ఈ విధంగా వచ్చి తన వ్యాధిని నివారణ చేసినవాడా అని అనిపించింది. వామనుడు - మహాబలి - వీరికి విశేషంగా ఓనం పండుగను జరుపుకోవడం కేరళలోనే గదా?🌸
వాస్తవంగానే, బ్రహ్మచారి ప్రతిమను దానం తీసుకోగానే రాజుకు వ్యాధి నయమయింది.🌸
🌹🌹🌹
ప్రాంజలి ప్రభ కథలు
*మా బాల్యం*
ఒకప్పుడు...పరీక్ష రిజల్ట్స్ వస్తున్నాయంటే చాలు..!
ముందు రోజు రాత్రి నిద్ర వుండేది కాదు.
నిద్రలోనూ భగవంతునికి మొక్కులే!
ఫస్టు క్లాసు అక్కర్లేదు కానీ పేపర్లో నెంబరు వుండేలా చూడమని దేవుడికి పదే పదే అర్జీలు.
ఉదయాన్నే లేచి.. పేపరు కోసం సెంటర్లోకి పరుగు
అప్పటికే కిల్లీ బడ్డీ దగ్గర అన్ సోల్డ్ పేపర్లు అన్నీ సోల్డ్ అయిపోతే..
వీధిలో ఎవరు పేపరు వేయించుకుంటారా అని వెదుకులాట.
ఎలాగోలా ఒక పేపరు సంపాధిస్తే.. పది మంది మిత్రులు పోటీ..!
కంగార్లో నెంబరు సరిగ్గా కనిపించకపోవడం..!
రెగ్యులర్ నెంబర్లు ఒకవైపు, కంపార్ట్ మెంట్ నెంబర్లు మరో వైపు
వాటిలో మళ్లీ, ఫస్టు, సెకండు, థర్డ్ క్లాస్ లు.
ఫస్టు క్లాసులు అయితే..రెండుమూడు వరసలే! సెకండ్ మరికొంచెం..థర్డ్ క్లాసయితే... సగం పేజీ.. మొదట ఫస్ట్ క్లాస్ కాలమ్ లో వెదుకులాట.-ఆశ ..!
నెంబర్ లేకపోయే సరికి మనకు అంత సీను లేదులే అనుకుని
సెకండ్ క్లాస్ ఆపై థర్డ్ క్లాస్ కాలమ్స్ లో నెంబరు వెదుకులాట..
హమ్మయ్య నెంబరు వుంది అనుకోగానే వేయి ఏనుగుల బలం.. కొండంత ఆనందం.. పాస్ అయిన హాల్ టిక్కెట్ నెంబరు వున్న పేపరు భద్రంగా దాచుకోవడం.
ఆ తర్వాత, నా ముందు నెంబరు, తర్వాత నెంబరు వుందో లేదో చూడటం.. అదో ఆనందం..
ఇక అక్కడ నుంచి ఎవరెవరు పాసయ్యారు.. ఏ క్లాసులో పాసయ్యారు..
గోల గోల.. రిజల్ట్ చూడటానికి రానివాళ్ల ఇంటికి అంతా గుంపుగా వెళ్లి ఆనందం పంచుకోవడం..
ఫెయిల్ అయిన వాళ్ల ఇళ్లకు ఓదార్పు యాత్ర.
ఇక అక్కడ నుంచి మాస్టార్ల ఇళ్లకు వెళ్లి రిజల్ట్స్ చెప్పుకోవడం.. వాళ్లతో ఆనందం పంచుకోవడం..
ఈలోగా ఇంటి దగ్గర అమ్మ నాన్న, అన్న తమ్ముడు అంతా వీధిలో మీటింగు మావోడు పాసయ్యాడు అంటే పాసయ్యాడని..
స్వీట్లు..అదే అమ్మచేసిన లడ్డూల పంపకం..
ఇక ఆ రోజంతా .. ఇంట్లో .. వీధిలో మనమే హీరో..!
కట్ చేస్తే..!
ఇప్పుడు..!
ఆ ఆనందం.. గర్వం.. సంతృప్తి.. ఏవీ..??
ఇప్పడు ....పరీక్ష పాసైన పిల్లల్లో అవేవీ కనిపించడం లేదు.. ప్రతి ఇంట్లోనూ పాసయినా... ఏడుపే!
అంతా నిర్లిప్తత..
పాసయ్యామా అని కాదు.. ఎన్ని మార్క్లులొచ్చాయ్.. ఇదీ ప్రశ్న
ఎన్ని మార్కులొచ్చినా.. ఇంకా వస్తే బావుండేది.. సంతృప్తి ఎక్కడా..?
ప్చ్..!
చిన్న చిన్న ఆనందాలకు పిల్లలు దూరం అవుతున్నారు..
కాదు మనం కూడా దూరం చేస్తున్నాం.
చదివే యంత్రాలవుతున్నారు..
ర్యాంకులను ఇచ్చే ప్రింటర్లు అవుతున్నారు..
విద్యార్థులు మాయం అవుతున్నారు..
మిషన్లులా మిగులుతున్నారు..
ఈనాటి పరిస్థితులు తప్పక మారాలి..!
ఒకసారి కాలం వెనక్కి వెళిపోతే ఎంత బాగుణ్ణు . చిన్న అత్యాశ
****
ప్రాంజలి ప్రభ కథలు
*నిన్ను నీవు మార్చుకో*
*నీకై నీవే సరిదిద్దుకో*
నేనెవరు?..
నా పరిస్థితి ఏమిటి...
నాకే ఎందుకు అందరితో వైరం ఏర్పడుతుంది.?......
నేనెందుకు అందరిని గమణిస్తున్నాను.?
నాకే ఎందుకు దోషాలు కనిపిస్తుంటాయి.....
అలా కనిపిస్తాయా లేక నాకే అనిపిస్తాయా?...
నేను ఏది మాట్లాడిన ఎదుటివారికి బాధేస్తుంది...
నిజమ్ మాట్లాడినందుకా లేక ఎదుటివారికి నచ్చనందుకా?...
లేక
వాళ్ళు తట్టుకోలేకనా?.. లేక నాదే కరెక్ట్ అనుకునే అనుకునే మనస్తత్వమా?..
లేక
ఒప్పించే ప్రయత్నమా.... మొండితనమా?...
లేక
అవతల వారిని తెలివితక్కువ వారిగా అనుకోవడమా?...
తెలియదు..
తెలిసి తెలియని మిడి మిడి జ్ఞానముతో మూర్ఖుడిగా వ్యవహరించడమా?..
లేక
అన్ని తెలుసునన్న అహంభావమా?...
లేక
ప్రతివారిని ప్రేమిస్తూ వారి అంతర్యాన్ని తెలుసుకోకుండా అందరిని మంచి వారని గుడ్డిగా నమ్మేయడమా?..
లేక
వాళ్ళు ఏ రకంగా మాట్లాడిన... దూషించిన..
నొప్పించిన.. మోసంచేసిన...
నష్టపరచిన...
నా వెనకాల నన్ను కించపరుస్తూ...
అవమానిస్తూ...
అవసరాలు తీరాక నటిస్తూ..
పరోక్షంగా అగౌరవ పరుస్తూ...
నన్ను ఉపయోగించుకునే వారి చర్యల్ని ఎత్తి చూపిస్తే....
నిష్టురంగా...
కఠినంగా...
వారికనిపిస్తే....
అది తప్పని నిందలేసే వారికి నేను క్షమించినా..
మనసు గాయపర్చుకున్నా ...
నాకు దూరమైపోయే వారి గురించి ఆలోచిస్తే నా దోషమా?..
వద్దని పారిపోతున్న వారి వెనుక నేనెందుకు పరుగెడుతున్నాను?...
నన్ను కాదని వెళ్తున్నారని కోపమా?....
లేక
వాళ్ళ మీద ప్రేమనా?...
నన్నెందుకు కాదంటరనే అహంకారమా?...
ఆత్మభిమానామా?..
లేక
నాలోని షాడిజమా?..
లేక నా టార్చరా?..
నిజంగా నేను వేదిస్తానా?..
నాకందరు దూరమై పోవడానికి నా వేధింపులే కారణమా?..
నేనెవరికి చెడు చేయలేదే....
నష్టం కలిగించలేదే..
ఎవ్వరిని చెయ్యి చాచాలేదే....
ఎవరికి ఏ విధంగా ముంచలేదే?..
అందరూ కలిసినట్లుగానే కనిపిస్తారే?..
వారికి ఇష్టమైనట్లు ప్రవర్తించాలంటే వారు కూడా అలాగే ఉండాలి కదా?..
ప్రతిసారి వారికి అనుగుణంగా ఉండేట్లు ఉండి తట్టుకున్నా....
ఒక్కసారి కూడా మనకి లేకపోతే?..
నిజానికి నేను సరిగ్గా ఉన్నానా?..
అందరిని...అన్ని విషయాల్లో తట్టుకోవడం నా తప్పేనా?...
వారి నైజాన్ని చూపించి..లోపాన్ని గ్రహించమనడం నేను చేస్తున్న నాలో వున్న లోపమా?..
ఏమో కావచ్చు..
చెడిపోతుంటే చూడలేకపోవడం నా బలహీనత?..
అందరూ బాగుండాలి అనుకోవడం పెద్ద బలహీనతా....
లేక
నాలో వున్న చెడు దృష్టే చెడుని గమణిస్తుందా?...
లేక
అందరికి చెప్పి నేను చెడిపోతున్నానా?..
లేక
చిన్నదాన్ని పెద్దగ చూస్తున్నానా?.
లేక
చెడు దృష్టి ఉన్నవారి మధ్య నేను తిరుగుతున్నానా?...
లేక
నేను మంచిని చూడలేక...గమనించ లేకపోతున్నానా?..
లేక
చెడుని మంచిదే అని ఒప్పించే ప్రయత్నంలో వుండే వారి సహావాసంతో వాటిని ఒప్పుకుంటానా?..
నా ఆలోచనలు తప్పా?..
లేక
నా మాట తీరు తప్పా?..
ఏమో కావచ్చేమోననిపిస్తుంది?..
నేను నిజమే మాట్లాడతాను...
నిష్టురంగా వున్నా దాచుకోను...
వారి తప్పు ఎత్తి చూపితే బాధ కల్గితే నా తప్పా?...
*నిజంగా ఇప్పుడనిపిస్తుంది...*
*అది తప్పెనని....*
*ఎవరి తప్పులను ఎత్తి చూపే అవసరం నాకెందుకు?..*
*ఎవరేట్లబోతే నిజంగా నాకెందుకు?..*
*ఎవరికి నచ్చినట్లు వారు తిరిగితే నాకేంటి?..*
*లెక్కగట్టే అర్హత నాకెక్కడిది?...*
*నేనేం గురువును కాదు...*
*దేశోద్ధారకుని కాదు...*
*అంతకుమించి దేవుణ్ణి గాదు......*
*అన్ని చూస్తున్నా ఆ దేవుడే గమ్మున్నుంటే నేనెందుకు ఆలోచిస్తున్నాను?...*
*నాకు అవసరమా?..*
*అందరి గురించి ఆలోచించే నువ్వు సరిగ్గా ఉన్నవా?.*
*నీ కర్తవ్యాన్ని నీవు చేస్తున్నావా?...*
*నీలో వున్న లోపాన్ని నువ్వు సరిదిద్దుకో?....*
*నీ పని ఏమిటో..*
*నీ ఆశయాలు ఏమిటో...వాటి మీద ఫోకస్ చేయి చాలు...*
*ఎవరు దూరంకారు...*
*ఏది గ్రహించే సమయం చాలదు......*
*ఈ చిన్ని జీవితానికి ఎందుకురా ప్రపంచజ్ఞానం?...*
*పనిలేని మేధావులు .....*
*పండిపోయిన అనుభజ్ఞులు ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెబుతారు....*
*ప్రతి మేధావి ఒక్కొక్కటి భోధిస్తాడు...*
*అందరూ కలసి ఒకటే భోధిస్తే ఆచరణకు వీలువుంటుంది*
*గాని...*
*అందరిని ఫాలో అయితే ఏటో తెలియక.......ఎదో తెలియక.....తిక మకలో ఇప్పటి జీవితంలా మారి పోతాయి....*
*ఇలాగే అందరి మధ్య ఈర్ష్యాద్వేషాలతో.....అనవసర చర్చలతో....... పనికిరాని మాటలతో కాలం గడిచిపోతుంది.......*
*నీవెవరో తెలిసేలోగా నీ ఆయుష్షు తీరిపోతుంది.....*
*మరి నీకేం మిగులుతుంది?......*
*కనీసం నిన్ను గుర్తుచేసుకోవడానికైనా నీ భార్య పిల్లలకు జ్ఞాపకాలు మిగలాలి కదా?...*
*మరి మిగలాలి అంటే ......*
*నువ్వు ఏదైనా సాధించాలి కదా?..*
*మరి సాధించాలంటే సంకల్పం ఉండాలి కదా?...*
*మరి ఆ సంకల్పానికి పట్టుదల...కృషి.. సాధన.....ఆచరణ.. అన్ని మొదలు కావాలి కదా.....*
*అందుకే క్షణం ఆలస్యం చెయ్యకుండా నీ మనసుకు నచ్చినది ఏదైనా నువ్వు చేస్తూపో....*
*ఈ వేదాలు...*
*వేదంతాలు..*
*సూక్తులు...*
*నీ కడుపు పూర్తిగా నింపవు..........*
*నీకూ ముక్తినివ్వదు...*
*దేశాన్ని ఉద్ధరించడానికి చాలా మందే ఉన్నారు...*
*కానీ నిన్ను ఉద్ధరించడానికి ఆ దేవుడైనా ప్రతీసారీ దిగిరాడు..*
*అందుకే నిన్ను నువ్వే మార్చుకో....నిన్ను నువ్వే సరిదిద్దుకో...*
*నీకూ నీవే గురువు....*
*నీకు నీవే శత్రువు.....*
*సర్వం నీవే.......*
*సకలం నీవే........*
*అహంబ్రహ్మాస్మి**
*****
"హనుమంతునికి మనం భోజనం పెట్టగలమా! 🙏🏻
*"హనుమ రోజూ సరిగ్గా తిండైనా తింటున్నాడో లేదో.. ఈ రోజు హనుమని భోజనానికి పిలుస్తున్నాను, నేనే స్వయంగా వంటచేసి దగ్గర కూర్చుని తినిపిస్తాను" అంది సీతమ్మతల్లి...*
*పిలువు పిలువు...*
*నీకే అర్థం అవుతుంది*
*అన్నాడు శ్రీరామచంద్రుడు నవ్వుతూ.*
*అన్నట్టుగానే సీతమ్మతల్లి స్వయంగా వంటచేసి...*
*హనుమను భోజనానికి పిలిచింది...*
*తానే పక్కన కూర్చుని స్వయంగా వడ్డిస్తూ...*
*"కడుపునిండా తిను నాయనా...,*
*మొహమాటపడకు"*
*అని చెప్పింది...*
*"సరేనమ్మా"*
*అని చెప్పి హనుమ*
*తలవంచుకుని భోజనం చేయసాగాడు...*
*సీతమ్మతల్లి కొసరి కొసరి వడ్డిస్తోంది...*
*హనుమ వద్దు అనకుండా...*
*వంచిన తల ఎత్తకుండా* *పెట్టినదంతా తింటున్నాడు.*
*కాసేపట్లో సీతమ్మతల్లి*
*స్వయంగాచేసిన వంటంతా*
*అయిపోయింది...*
*సీతమ్మతల్లి కంగారు పడి*
*అంఃతపురవాసుల కోసం*
*వండిన వంటంతా తెప్పించింది...*
*అదీ అయిపోయింది....*
*తలవంచుకునే*
*ఆహరం కోసం నిరీక్షిస్తూన్నాడు...*
*హనుమ*
*ఆవురావురమంటూ....*
*సీతమ్మతల్లికి*
*కంగారు పుట్టి....*
*"రోజూ ఏం తింటున్నావు నాయనా?"...*
*అని అడిగింది*
*హనుమ ఎంతో వినయంగా...*
*"శ్రీరామ నామం తల్లీ"...*
*వంచిన తలెత్తకుండా*
*జవాబిచ్చాడు హనుమ...*
*సీతమ్మతల్లి త్రుళ్లిపడింది...*
*నిరంతరం శ్రీరామనామం*
*భుజించేవాడు...,*
*భజించేవాడు...*
*పరమశివుడొక్కడే గదా!...*
*సీతమ్మతల్లి తేరిపార జూసింది...*
*అప్పుడు కనిపించాడు సీతమ్మతల్లికి....*
*హనుమలో శంకరుడు...*
*శ్రీ శంకరుడే హనుమంతుడు....*
*నిత్యం శ్రీరామనామం ఆహారంగా స్వీకరించే వాడికి...*
*ఇంక తాను ఏమి పెట్టగలదు!*
*బాగా ఆలోచించిన సీతమ్మతల్లి*
*ఒక అన్నపు ముద్దను పట్టుకుని...*
*_"శ్రీరామార్పణం"_*
*అని ప్రార్థించి వడ్డించింది...*
*ఆ ముద్దని భక్తితో*
*కళ్లకు అద్దుకొని స్వీకరించిన హనుమ....*
*_"అన్నదాతా సుఖీభవ!"_*
*అన్నాడు హనుమ తృప్తిగా ...*
*హనుమలోని పరమేశ్వరుడికి*
*భక్తితో నమస్కరించింది సీతమ్మతల్లి...*
జైశ్రీరామ
****
తలపై భారం - కంట్లో నీరు
పండానైనల్లూర్లోని శ్రీ పందాడు నాయకి పశుపతినాథ స్వామి దేవాలయంలోని శ్రీ విష్ణు దుర్గా అమ్మవారి కంటికొనలలో నుండి నీరు స్రవించడం భక్తులందరూ ప్రత్యక్షంగా చూశారు. ఇది 1986 ఫెబ్రవరి 19న జరిగింది. వారు పరిగెత్తుకొచ్చి నాకు ఆ విషయం చెప్పగా నేను కూడా వెళ్ళి చూశాను. అమ్మవారి కళ్ళల్లో నుండి నీరు కారుతోంది. అమ్మవారిని అలా చూస్తున్న మా బాధను వర్ణించడానికి మాటలు చాలవు.
ఒక కన్నెపిల్లను దుర్గా స్వరూపంగా భావించి ఆమెకు పూజ చేయడానికి సిద్ధం చేశాను. ఆ కన్నిక దుర్గకు మంగళద్రవ్యాలు సమర్పించి, నవాక్షరి మంత్రజపం చేశాను. “తల్లీ ఏమిటి మా దోషం?” అని అమ్మవారిని అడిగాను. దుర్గా స్వరూపంగా ఉన్న ఆ కన్నెపిల్ల మాతో, “నాకు పచ్చని పట్టు లంగా కట్టుకున్న ఒక అమ్మవారి స్వరూపం కనపడి ‘నా భారం తొలగించండి’ అని అన్నదని” మాతో చెప్పింది. తరువాత మేము ప్రత్యేక అభిషేకము ఆరాధనలు చెయ్యడంతో విష్ణు దుర్గా అమ్మవారి కళ్ళ వెంట నీరు కారడం ఆగిపోయింది.
ఈ విషయాన్ని పరమాచార్య స్వామివారికి తెలిపి వారినుండి వివరణ ఏమిటో తెలుసుకోవాలని మేము కంచి బయలుదేరాము. మహాస్వామివారు మాకు ఇరవైఅయిదు లీటర్ల గంగాజలం ఇచ్చి, లక్ష ఆవృత్తుల నవాక్షరి మంత్రజపంతో ఆ నీటిని బలోపేతం చేసి విష్ణు దుర్గకు అభిషేకం చేసి నా వద్దకు రండి అని చెప్పారు.
నాలుగునెలల తరువాత స్వామివారు చెప్పినట్టుగా చేసి కాంచీపురం దగ్గర్లోని ఒరిరుక్కైలో మకాం చేస్తున్న పరమాచార్య స్వామివారి దర్శనానికి వచ్చాము. అమ్మవారి కళ్ళల్ళో నుండి వస్తున్న నీరు ఆగిపోయిందని స్వామివారికి నివేదించాను. స్వామివారు కొద్దిసేపు ఆలోచించి, “అమ్మవారికి పైకప్పు తగులుతోందా?” అని నన్ను అడిగారు.
ప్రతిరోజూ పూజ చేస్తున్నా నేను ఆ విషయం అంతగా ఎప్పుడూ గమనించలేదు. అందుకే నేను స్వామివారితో, “నేను అంతగా గమనించలేదు. వెళ్ళి చూసివచ్చి చెబుతాను” అని చెప్పాను.
నేను తిరిగివెళ్ళి ఒక తాడుని అమ్మవారి తలకు పైకప్పుకు మధ్య ఉంచి చూడగా, స్వామివారు అనుమానపడ్డట్టు ఆ పైకప్పు అమ్మవారి తలను తాకుతోంది. కాస్త పరిశీలించగా గోడలో పడిన ఒక చీలిక వల్ల పైకప్పు కొద్దిగా వాలి అది అమ్మవారి తలను తాకుతోంది. మేము మరలా స్వామివారిని కలిసి ఈ విషయం చెప్పాము.
దుర్గా అమ్మవారి విగ్రహాన్ని బయటకు తీసి, పైకప్పును కాస్త లోతుగా చేసి, అమ్మవారిని పీఠంపై పునః ప్రతిష్టించి కుంబాభిషేకం నిర్వహించండని స్వామివారు ఆదేశించారు. స్వామివారి అదేశం ప్రకారం మార్పులుచేసి 1987లో తై మాసంలో కుంబాభిషేకం నిర్వహించాము. ప్రసాదం తీసుకొని స్వామివారి దర్శనానికి వచ్చాము. మహాస్వామివారు విశేషాలన్నిటిని తెలుసుకొని ప్రసాదాన్ని స్వీకరించారు. “మీ ఊరి ప్రజలు చాలా అదృష్టవంతులు. అమ్మవారు అలా కన్నీరు కార్చడం మీకందరకూ అనుగ్రహాన్ని ప్రసాదించడానికే” అని స్వామివారు మాతో అన్నారు.
మేము అలా స్వామివారితో మాట్లాడుతూ ఉండగా ఒక గుజరాతీ భక్తుడు స్వామివారి దర్శనానికి వచ్చాడు. స్వామివారు తనితో కాసేపు మాట్లాడారు. తరువాత మావైపు చూసి, “మీరు ఇక్కడికి రావడానికి మీకు ఎంత ఖర్చు అవుతుంది?” అని అడిగారు.
“దాదాపు మూడువందల రూపాయలు అవుతుంది”
స్వామివారు ఆ గుజరాతీ భక్తుణ్ణి మాకు మూడువందల రూపాయలు ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. అతను స్వామివారి ఆదేశాన్ని శిరసా వహించి పరమసంతోషంతో మాకు ఇచ్చాడు. భవంతుణ్ణి తాకి పూజించే శివాచార్యులంటే పరమాచార్య స్వామివారికి అపారమైన కరుణ. మా బాగోగుల కోసం వారు నిత్యమూ శ్రమించేవారు.
పరమాచార్య స్వామివారు కేవలం విష్ణు దుర్గ అమ్మవారి తలపైన ఉన్న భారాన్నే కాదు మా గుండెల్లో ఉన్న భారాన్ని కూడా తొలగించారు. కేవలం ఆ చంద్రశేఖరుడు తప్ప ఎంకెవ్వరు ఇలాంటి ఆదేశం ఇవ్వగలరు?
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
--- శివశ్రీ జగదీశ శివాచార్య, పండానైనల్లూర్. మహా పెరియవళ్ - దరిశన అనుభవంగళ్ 2
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
****
*ఒక చిన్నవాస్తు కథ👌*
🕉️🌞🌎🏵️🌼🚩
*హైదరాబాద్ కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, వారు హైదరాబాద్ శివారు పల్లెటూరులో కొంతభూమిని కొని, అక్కడ ఒక ఫామ్ హౌస్ ని కట్టుకున్నారు.*
*ఆ ఫామ్ హౌస్ వెనుక వైపు ఒక చక్కని స్విమ్మింగ్ పూల్, గార్డెన్ కూడా ఏర్పటుచేసుకున్నారు* .
*వాటితో పాటూ అక్కడ ఒక పెద్ద ఆహ్లాదపరిచే 50 ఏళ్ళ నాటి మామిడి చెట్టు కూడా ఉంది. నిజానికి ఆయన ఆ ఆస్తి కొన్నది కూడా ముఖ్యంగా ఆ పెద్ద మామిడిచెట్టును చూసి ముచ్చటపడే.*
*ఆ కొత్త ఇంటికి వాస్తు చూపించుకుని తగినమార్పులు చేయించుకోమని వారికి సన్నిహితులు గట్టిగా సలహా ఇచ్చారు.*
*వ్యాపారవేత్త వాస్తును పరిశీలించే శాస్త్రిగారిని తీసుకొని కారులో ఇద్దరూ బయలుదేరారు.*
*కొంతప్రయాణం తర్వాత వారు వెళ్తున్న దారిలో వ్యాపారవేత్త కారును కొద్దిగా పక్కకు* *పోనిచ్చి, వెనుకగా ఓవర్ టేక్ చేసి వస్తున్న కొన్ని కార్లకు దారి ఇవ్వడం చూసిన శాస్త్రి గారు చిరునవ్వుతో మీ డ్రైవింగ్ నిజంగా చాలా సురక్షితమైనది అన్నారు.*
*దానికి వ్యాపారవేత్త నవ్వుతూ అయ్యా! వారికి ఎదో అత్యవసరపని* *అయిఉండొచ్చు, అందుకే తొందరగా వెళ్తున్నారు. అలాంటి వారికి ముందుకు వెళ్ళడానికి మనం* *దారిఇవ్వడం మన ధర్మం కదండీ! అన్నారు.*
*అక్కడ నుండి కారు చిన్న పల్లెటూరు సమీపించింది.*
*అక్కడి వీధులు చిన్నగా ఇరుకుగా ఉండడంతో వ్యాపారవేత్త కారు వేగం తగ్గించి నెమ్మదిగా* *నడుపుతున్నారు. ఇంతలో హఠాత్తుగా ఒక కొంటె కుర్రాడు రోడ్డుకు అడ్డంగా ఒక్కసారిగా పరిగెత్తాడు. గమనించిన* *వ్యాపారవేత్త అతడిని తప్పించి తన కారును మరింత నెమ్మదిగా పోనిస్తున్నారు.*
*అది ఎవరికోసమో ఎదురు చూస్తున్నట్లుగా ఉంది.*
*ఇంతలో అదే దారిలో మరో* *కుర్రాడు కూడా అలాగే హఠాత్తుగా పరిగెత్తుతూ ముందుకు వెళ్ళిపోయాడు.*
*ఈసారి ఆశ్చర్యపోవడం శాస్త్రిగారి వంతైంది.*
*సార్! ఇలా ఇంకో పిల్లాడు మరలా వస్తాడని మీరెలా ఊహించారు అని ప్రశ్నించారు.* *దానికి వ్యాపారవేత్త నవ్వుతూ పిల్లలెప్పుడూ అంతేకదండి!* *ఒకడి వెంట మరొకడు వెంటపడుతూ ఆడుకుంటారు* . *వెనుక ఇంకొకడు లేకుండా ఒక్కడే ఎప్పుడూ అలా ఆడుకోరు కదా? అన్నారు.*
*కారు ఫామ్ హౌస్ కి చేరుకుంది.*
*కారులోంచి వారు క్రిందికి దిగుతుండగా, అక్కడ* *ఒక్కసారిగా కొన్ని పక్షులు రెక్కలు కొట్టుకుంటూ పైకి ఒక్కసారిగా ఎగిరాయి,*
*అది చూసిన వ్యాపారవేత్త శాస్త్రిగారిని ఆపి, సర్ మీరు ఏమీ అనుకోకపోతే, మనం* *కొద్ధిసేపు ఇక్కడే ఆగి వెళదాం..అక్కడ వెనక వైపు ఎవరో కొంతమంది పిల్లలు చెట్టెక్కి మామిడిపళ్ళు కోస్తున్నట్లు ఉంది, మనం కనుక* *హఠాత్తుగా వెళ్తే వాళ్ళు మనల్ని చూసి భయపడి చెట్టునుండి దూకితే క్రిందపడిపోతారు.*
*ఎందుకండీ అనవసరంగా*
*అంతలా వాళ్ళని భయపెట్టి సాధించేదేముంది అన్నారు.*
*శాస్త్రి గారు కొంతసేపు స్తబ్దుగా ఉండిపోయారు. ఆపై నెమ్మదిగా ఇలా అన్నారు. ఈ ఇంటికి ఎటువంటి వాస్తు మార్పులు చేర్పులు అవసరం లేదు !*
*ఈసారి ఆశ్చర్యపోవడం వ్యాపారవేత్త వంతైంది.*
*ఏమి?ఎందుకండి?*
*ఏ ప్రదేశం అయినా, మీలాంటి ఉత్తములు నివసిస్తూ ఉంటే, సహజంగానే అది ఉత్తమమైన వాస్తుగానే దానంతట అదే మార్పు చెందుతుంది, సందేహం లేదు.*
*ఎప్పుడైతే మన ఆలోచనలు, ఆకాంక్ష ఇతరుల శ్రేయస్సు, సంక్షేమం కోరుకుంటాయో, ఆ ఫలితం లబ్దిపొందే వారికే కాక, అది మనకి కూడా మంచి చేస్తుంది అయితే ప్రత్యేకించి ఎల్లప్పుడూ* *అన్ని
సమయాల్లోనూ ఇతరుల సంక్షేమం కాంక్షించే వ్యక్తి వారికి* *తెలియకుండానే* *మహోన్నతుడు,* *సత్పురుషుడుగా మారిపోతాడు.*
*నిజానికి సాధువు,* *సత్పురుషుడు అంటే ఎల్లప్పుడూ సమాజానికి మేలు చేసే వ్యక్తులే కదా!*
*ధర్మస్య విజయోస్తు*
*అధర్మస్య నాశోస్తు*
*ప్రాణిషు సద్భావనాస్తు*
*విశ్వస్య కళ్యాణమస్తు*
🎣 సేకరణ...
*****
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*పటిక బెల్లంలో మూడవవంతు*
➖➖➖✍️
*అరుణాచల ఆలయంలో యదార్థo*
*ఒకసారి అరుణాచల ఆలయ ప్రాంగణం లో ఇద్దరు పిల్లలు ఆడుకుంటుండగా వారి దృష్టి అరుణాచలుని సన్నిధి లోని హుండీపై పడింది.*
ఆ పిల్ల లిద్దరు హుండీ లోని పైసల్ని ఎవరూ లేనపుడు సన్నని రేకుతో లాగి తీయటం ప్రారంభించారు.
అందులో ఒకడు " ఒరేయ్ ఎవరన్నా చూస్తున్నారేమో - చూడరా అన్నాడు ఇంకొకడితో.
రెండవవాడు చుట్టూ చూసి.... అరుణాచలుడు ఇంతేసి గుడ్లు ఏసుకొని చూస్తున్నాడురా అన్నాడు.
ఇద్దరూ అరుణాచలుని కి ఎదురుగా నిలబడి మా దొంగతనం బయట పడకుండా చూచే బాధ్యత నీదే, అందుకు పటిక బెల్లం లో మూడవ వంతు నీకిస్తాము, ముగ్గురం సమానంగా తీసుకుందాం, ఇది మన ఒడంబడిక ( అగ్రిమెంట్ ) అన్నారు.
ఇలా ప్రతీ రోజు పటిక బెల్లం అరుణాచలునికి పెడుతున్నారు, ఆశ్చర్యంగా శివుని ముందు పెడుతున్న పటిక బెల్లం మాయమవుతోంది.
ఒకరోజు ఆలయ పూజారి ఇద్దరు దొంగల్ని పట్టుకొని ఆలయ అధికారి కి అప్పగించాడు, వీళ్లిద్దరు ఎనిమిదేళ్ల పసి కాయలు, వీళ్ళను ఎలా శిక్షించాలి అని, అరేయ్ పిల్లలూ మీరు ఇద్దరూ అంతరాలయం లో 108 ప్రదక్షిణలు చేయండి అని, ఇదే మీశిక్ష అన్నాడు.
పిల్లలు ఇద్దరూ ప్రదక్షిణాలు చేయడం ప్రారంభించారు, ఆలయ పూజారి, అధికారి దూరంగా కూర్చొని పిల్లల ప్రదక్షిణాలు చూస్తున్నారు వినోదంగా. ఇంతలో పూజారి , అధికారి ఒక్కసారిగా తృళ్ళి పడ్డారు, పరిశీలించి పిల్లల్ని మళ్ళొకసారి చూసారు, ఆ ఇద్దరి పిల్లతో పాటు, మూడవ పిల్లవాడు ప్రదక్షిణ చేయడం చూసారు, మూడవ పిల్లవాడు మెరిసిపోతున్నాడు మళ్ళీ మాయమవుతున్నాడు మాటిమాటికీ. ఇది గమనించి అధికారి మెల్లగా పిల్లల్ని సమీపించి మూడవ పిల్లవాడిని గట్టిగా వాటేసుకున్నాడు.
అద్భుతం!!
మూడవ పిల్లవాడు కాంతిరేఖ గా మారి, గర్బాలయం లోకి వెళ్లి మాయమై పోయాడు.
అరుణాచళేశ్వరుడు దొంగ పటిక బెల్లం మూడవ వంతు తిన్నాడు కదా, అందుకని పరమేశ్వరుడు వారితో ప్రదక్షిణ చేస్తున్నాడన్నమాట.
ఆ అధికారి పిల్లల్ని బుజ్జగిస్తూ " అసలేం జరిగింది " అని అడిగాడు. పిల్లలు అరుణాచళేశ్వరుని వాటా గురించి చెప్పారు. అది విని వారు ఆశ్చర్యం, ఆనందం లో మునిగిపోయారు.
సాక్షాత్తు అరుణాచళేశ్వరుడు కూడా వారితో వాటా పంచు కున్నందుకు శిక్ష అనుభవించాడన్నా మాట. ఆలయం లో సాక్షాత్తు అరుణాచళేశ్వరుడు ఉన్నాడు అనటానికి ఇంతకన్నా సాక్ష్యం ఏం కావాలి ??.
నిష్కల్మష ప్రేమకు, నిర్మల భక్తి కి అరుణాచళేశ్వరుడు ఎపుడూ బంధీయే !! అరుణా చలుడు కాంతి రూపం లో ఉంటాడని, అది అగ్ని లింగం అని శాస్త్రవచనం. ఆ పరిసర ప్రాంతాలలో మరియు కొండపైన అరుణాచలుడు కాంతి రూపం లో, కాంతి స్తంభం ( bheem of light ) రూపం లో భక్తులని అనుగ్రహించిన సంఘటనలు అనేకం .
🙏 *లోకా సమస్తా సుఖినోభవన్తు!*
*****
సుందరి :: భ గగ
అంకము నీదే --(గుర్తు)
అంకిలి వద్దే --(కలత )
అంగడి నీదే -- (వ్యాపారం)
అంగన సృష్టీ --( స్త్రీ )
అంగము పట్టూ -- (దేహభాగము )
అండము పుట్టే -- (గుడ్డు )
అంతట వ్యాప్తీ -- (మొత్తము)
అంధము కొంతే - ( చీకటి )
అంధిక పోటూ -- (జూదము )
ఆంధ్రము పట్టూ-- (తెలుగు)
అంబిక కోరూ -- (అమ్మవారు )
అంబువు పంచే -- (నీరు )
అంశము పెంచే -- (పాలు)
అంశువు పంచే -- (కాంతి )
అంహతి కల్గే -- (విడుపు )
అంజలి నీకే -- (దోసిలి )
ప్రాంజలి నీకే -- (సారధ్యము )
* రథ్యా చర్పట విరచిత కంథః పుణ్యాపుణ్య వివర్జిత పంథః|*
*యోగీ యోగనియోజిత చిత్తో రమతే బాలోన్మత్తవదేవ ||*
*కూడలిలో దొరికిన పీలిగుడ్డలను కట్టుకుని, పాపపుణ్యములంటని కర్మలను ఆచరించుచూ, యోగముచే చిత్తవృత్తులను నిరోధించు యోగి బాలునివలే ఉన్మత్తునివలే ఆనందించుచుండును.*
*- ఈ సర్వమును భస్మమే, పవిత్రమైన దానినిగా పావనముగా ఈ భస్మమును నమస్కరించుచున్నాను.*
*మార్గం, పదునైన కత్తి అంచులా నిశితమై, ఎన్నో అవరోధాలతో నిండి ఉంది అయినా నిస్పృహ చెందకండి. లేవండి, మేల్కొనండి, గమ్యాన్ని చేరే వరకు విశ్రమించకండి.*
*ప్రతిదినం క్రమక్రమంగా నేను భౌతిక సౌఖ్యాలలో తక్కువగాను, నా మనస్సులోనే అధికాధికంగానూ ఆనందాన్ని వెతుక్కుంటాను.*
*నీవెప్పుడైనా, ఏపనినైనా చేస్తానని వాగ్దానం చేస్తే, దానిని ఖచ్చితంగా నియమిత సమయానికే నిర్వర్తించాలి.*
*లోకా: స్సమస్తా: స్సుఖినో భవన్తు!*
*🧘♂️340) యోగవాసిష్ఠ రత్నాకరము🧘♀️*
1-94
స్వాత్మసత్తా పరాపూర్ణే జగత్యంశేన వర్తినా
కిం మే హేయం కిమాదేయమితి పశ్యన్సుదృఙ్నరః.
సమస్త పదార్థములందును వ్యవహరించుచున్నను ఎవడు ఆయా పదార్థములతోడ అనురక్తిని, సంగమును బొందక నిర్లేపముగను, ఆకాశమువలె నిర్వికార ఏకరూపకముగను వెలయుచు ఆత్మయందు స్థితి గలిగియుండునో, అట్టి మహాత్ముడు సాక్షాత్ పరమేశ్వరుడే యగును.
జ్ఞాని యొకపుడు సమస్త కార్యోన్ముఖుడై, ప్రాప్తించు ప్రస్తుత కార్యము లన్నింటిని నెరవేర్చును. అట్లు సమస్త క్రియల నాచరించు చున్నను ఏమియు నాచరింపనివాడే యగును.
1-95
క్షపితానఖిలాన్లోకాన్దుఃఖక్రకచదారితాన్
వల్లీవనస్థాన్నభసః పృష్ఠాదర్క ఇవేక్షతే.
ఆకాశమున నున్న సూర్యభగవానుడు క్రింద నున్నట్టి లతలతో గూడిన వనవృక్షాదులను జూచునట్లు, జ్ఞాని యగువాడు క్షయమును బొందినట్టియు, దుఃఖమను ఱంపముచే కోయబడినట్టియు లోకుల నందఱిని జూచును.
1-96
అశఙ్కితోపసంప్రాప్తా గ్రామయాత్రా యథాధ్వగైః
ప్రేక్షన్తే తద్వదేవ జ్ఞైర్వ్యవహారమయాః క్రియాః.
దారిలో అకస్మాత్తుగ తటస్థపడిన గ్రామముయొక్క వ్యవహారములను బాటసారులెట్లు రాగరహితులై చూచుదురో, అట్లే జ్ఞానులున్ను లోకవ్యవహార మయములగు క్రియలను రాగరహితులై వీక్షించుదురు.
🕉️🌞🌏🌙🌟🚩
*తాళ్లపాక పెదతిరుమలాచార్య సంకీర్తన*
🕉️🌞🌏🌙🌟🚩
రేకు: 0060-06
సంపుటము: 15-345
రేకు రాగము: మాళవిగౌళ
పాట రాగం : హంసానంది గానం:
కోసూరు శేషులత గారు.
॥పల్లవి॥ భావింప నీ వొక్కఁడవే బహురూపాల నుండుదువు
దేవదేవ నీ మహిమ దెలియఁగ వశమా!!
॥చ1॥ నిన్నుఁ దలఁచేవారిలో నిజరూపుతో నుండుదువు
అన్ని జంతువులలోన నంతరాత్మవై వుండుదువు
పన్ని పంచభూతములలోపల నాధారమై వుండుదువు
వున్న మూఢులలో మాయ నొనగూడి వుండుదువు
॥భావింప॥
॥చ2॥ సరుస తరువులలో చైతన్యమవై వుండుదువు
గరిమె రాక్షసులలోన కానరాక వుండుదువు
సురలందు యీశ్వరసూచనతో నుండుదువు
అరయ ముక్తులలోన ఆనందమవై వుండుదువు!!
॥భావింప॥
॥చ3॥ జగము లన్నిటిలోన సాక్షివై వుండుదువు
తగిలి వేదములలోన అర్ధమై వుండుదు
జిగి మించ సర్వదాను శ్రీవేంకటగిరి నుండుదు
సగుణమై దాసులకు సాకారమవై వుండుదువు!!
॥భావింప॥
🕉️🌞🌏🌙🌟🚩*🧘♂️47-కర్మ - జన్మ🧘♀️*
🕉️🌞🌏🌙🌟🚩
*"కర్మ ఫలం"* లో - ఇంకొన్ని వివరాలు తెలుసుకుందాం.
*ఆయుషు నిర్ణయం*
ఓ ఉయ్యాలలో ఓ పాపని పడుక్కోబెట్టి బలంగా ఊపితే ఆ ఊపు బలాన్ని బట్టి ఎన్ని సార్లు ఆ ఉయ్యాల ఊగాల్సి ఉందో అన్ని సార్లూ అది ఊగాల్సిందే. దాన్ని మధ్యలో ఆపగల శక్తి ఉయ్యాలలోని పసి పాపకి లేదు. ఉయ్యాల - జీవితం, ఉయ్యాలలోని పసిపాప - పుట్టిన మనిషి , ఊపు - ప్రారబ్ధ కర్మలు. ఓ సారి కొన్ని ప్రారబ్ధ కర్మలతో పుట్టాక వాటిని తొలగించే శక్తి వాటితో పుట్టిన ఎవరికీ ఉండదు అని ఈ పోలికతో చెప్పచ్చు. మనం చేసిన పాప, పుణ్య కర్మలకి ఆనుగుణంగా ఈ జన్మని ఎత్తాం. మన ప్రారబ్ధ కర్మలన్నీ అంతం అయేదాకా అంటే, ఉయ్యాల ఊగే బలం తగ్గేదాకా పాప ఊగినట్లుగా మనం వాటిని అనుభవిస్తూ జీవించాల్సిందే.
గడియారానికి కీ ఇస్తే, స్ప్రింగ్ చుట్టుకుని, మరలా ఆ కీ శక్తి అయిపోగానే గడియారం తిరగడం ఆగిపోయినట్లుగా, మనిషి ప్రారబ్ద కర్మలన్నీ అనుభవించి ఇంక కర్మలు మిగిలి లేనప్పుడు మనిషి ప్రాణాలు పోయి దేహం పడిపోతుంది.
*స్వకర్మ వశతః సర్వ జంతూనాం ప్రభవాప్యయౌః
* తమ తమ కర్మలని అనుసరించి సకల ప్రాణుల చావు పుట్టుకలు ఉంటాయి.
*కర్మ-మరణం*
నిరుక్తం అనే వేదనిఘంటువులో యాస్కుడు ప్రపంచంలోని సర్వ వస్తువులకు ఆరు స్థితులుంటాయని చెప్పాడు. అవి...
1. *జాయతే* =పుట్టడం (శిశువు)
2. *అస్తి* = అనుభవంలో వుండటం (కనిపించడం)
3. *వర్ధతే* = పెరగడం
4. *విపరిణమతే* = మార్పుని పొందడం (గడ్డం మీసాలు, ముడతలు)
5. *అపక్షీయతే* = క్షీణించడం (బట్టతల, చెముడు, దృష్టిదోషం)
6. *నశ్యతి* = నశించడం (కనిపించక పోవడం)
దీన్ని బట్టి మనిషితో సహా కనిపించకపోవడం లేదా మరణం లేని వస్తువు ఈ భూతలంలో లేనే లేదు అని తెలుస్తోంది.
*ధృవం హ్యకాలే మరణం న విద్యతేః* - కాలం తీరనిదే చావు రాదు.
ఇక్కడ కాలం అంటే ఆయుష్షు అని కాక ప్రారబ్ద కర్మలని భావం. కర్మ ఫలానికి, జీవి ఆయుష్షుకి దగ్గర సంబంధం ఉంది. ఆయువు అంటే ప్రారబ్దాన్ని అనుసరించి ఈ శరీరంతో సుఖ దుఃఖ కర్మ ఫలాలన్నిటిని అనుభవించడానికి సరిపడే కాలమే. కొందరు వృద్ధులుగా మరణిస్తే కొందరు బాల్యంలోనే మరణిస్తారు. కాని వారంతా సరైన వయసులోనే మరణించినట్లు.
కర్మ సిద్ధాంతం ప్రకారం అకాల మృత్యువు అన్నదే లేదు. ఈ జన్మలో తీర్చుకోవాల్సిన ప్రారబ్ద కర్మలు ఎక్కువ ఉన్నవారు వృద్ధాప్యంలో, తక్కువ ఉన్నవారు బాల్యంలో మరణిస్తారు. మరణించాక మళ్ళీ మిగిలిన కర్మలని అనుభవించడానికి తిరిగి పుడతారు.
*జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ*
*తస్మాదపరిహార్యేథ్రో న త్వం శోచితుమర్హసి*
- గీత 2-27
*భావం:-*
పుట్టినవానికి మరణం తప్పదు. మరణించిన వానికి పునర్జన్మ తప్పదు. కనుక అపరిహార్యాలైన ఈ విషయంలో నువ్వు శోకించ తగదు. ప్రతీ జీవి జీవితంలోని మృత్యువు ఆఖరి ప్రారబ్ద కర్మ అవుతుంది. ప్రారబ్ద కర్మలన్నీ తీరాకే, ఈ పాంచభౌతిక శరీరాన్నించి జీవాత్మని మృత్యువు విడదీస్తుంది.
మరణించాక యమ యాతనలు అనుభవించకుండా ఉండటానికి ఓ మహాత్ముడు ఇచ్చిన సలహా ఇది.
*కర్మణా మనసా వాచా సర్వ వనెను సర్వదా |*
*పరపీడాం న కుర్వంతి న తే యాంతి యమాలయం ||*
*భావం:-*
ఆలోచన ద్వారా, మాట ద్వారా, కర్మ (పని) ద్వారా ఎవరైతే ఎప్పుడూ పరప్రాణులకి కష్టాన్ని కలిగించరో, అట్టి వారు ఎప్పుడూ యమయాతనలు అనుభవించరు.
🕉️🌞🌏🌙🌟🚩