ఆకలి యుడుగని కడుపును
వేకటి యగు లంజపడుపు విడువని బ్రతుకున్
బ్రాఁకొన్న నూతి యుదకము
మేకల పాడియును రోత మేదిని సుమతీ !
ఓ సుమతీ.! ఆకలి తీరని తిండి , వెలయాలు కడుపుతో ఉన్నా కూడ దానితో సంబంధాన్ని వదులుకోలేని బ్రతుకు , పాచిపట్టిన బావిలోని నీరు , మేకల యొక్క పాడి ఈ నాలుగు అనుభవించడానికే కాదు చూట్టాని కి, చెప్పుకోవడానికి కూడ అసహ్యంగా ఉంటాయి .
ఇచ్చునదె విద్య , రణమున
జొచ్చునదె మగతనంబు , సుకవీశ్వరులన్
మెచ్చునదె నేర్పు , వాదుకు
వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతీ !
ఓ సుమతీ ! ఈ లోకం లో ఎదుటి వారికి ఇచ్చిన కొద్ది పెరిగేది విద్య ఒక్కటే . విద్య ను ఇవ్వడం వలన మనకు ధనం కూడ లభించవచ్చు .కాన దానం చేస్తే పెరిగేది విద్య . ఎదుటి వారికిస్తే తరిగిపోయేదే ధనం. మగతనమంటే పోరాటానికి ముందుండాలి. కత్తి దూసి రణ రంగంలోకి దూకగలిగేది పౌరుషం . సత్కవులు కూడ మెచ్చేటట్లు కవిత్వం చెప్పగలగటమే నేర్పరితనం. అనవసరం గా నోరుజారి మాట్లాడితేనే కీడు కలుగుతుంది.
ఇమ్ముగఁ జదువని నోరును
అమ్మా యని పిలిచి యన్న మడుగని నోరున్
దమ్ములఁ బిలువని నోరును
గుమ్మరి మను ద్రవ్వినట్టి గుంటర సుమతీ !
ఓ సుమతీ !. చక్కగా, స్పష్టంగా సద్గ్రంథాలను , ఉపనిషత్పాఠాలను చదువని నోరు , నోరార మాతృమూర్తి ని “అమ్మా” అని ప్రేమగా , పిలిచి “ అన్నం పెట్టమ్మా” అని ఆర్తి గా అడగని నోరు , తోడబుట్టిన వారిని “ చెల్లెలా” అని “, తమ్ముడా “ యని ముద్దుగా పిలువని నోరు గనుక ఉంటే అది నోరు కాదు కుమ్మరి కుండలు చేసుకోవడానికి కావలసిన మట్టి కోసం త్రవ్విన గుంట తో సమానము. .
అంటే అమ్మ ని , తోడబుట్టిన అన్నదమ్ములను ఆత్మీయంగా నోరార పిలవడం మన భారతీయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లో లభించే ఒక మధురమైన అనుభూతి . దాన్ని దూరం చేసుకోవద్దని పరోక్షం గా కవి హెచ్చరిస్తున్నాడు.
ఉడు ముండదె నూఱేండ్లును
పడియుండదె పేర్మి బాము పది నూఱేండ్లున్
మడువునఁ గొక్కెర యుండదె
కడు నిల బురుషార్థ పరుడు కావలె సుమతీ !
ఓ సుమతీ !. ఈ భూమి మీద ఎవ్వరికీ ఉపయోగపడకుండా వందల సంవత్సరాలు బ్రతకడం వ్యర్థం. బ్రతికినంత కాలం పరులకు సహాయం చేస్తూ జీవించాలి . “పరోపకార : పుణ్యాయ ….. “ అని కదా ఆగమోక్తి . ఇతరులకు సేవచేయడం వలన పుణ్యమొస్తుంది . ఇతరులను బాధించడం వలన పాపం ప్రాప్తిస్తుంది. అందువలన ఈ భూమి మీద జీవించే మానవుడు పరోపకారియై , చతుర్విధ పురుషార్ధాలను సాధించే దిశగా కృషి చేయాలి కాని..
ఉడుము అనే జంతువు వలే వంద సంవత్సరాలో , పాము లాగ పది వందల సంవత్సరాలో , చెఱువు లో కొంగ లాగ కలకాలము బ్రతికామనిపించుకోకూడదు . మానవ జీవితానికి ఒక సాఫల్యత ఉండాలి.
***
నేటి పద్య ప్రభ - ఓమ్!
"ఘనగణపతినిఁగొలువగను
మనమునసతతముజపమును మరువకసలుపన్
గుణగణములనిడునుకదయ
ఘనధిషణముకవనబలిఁమి గరిమను నొసఁగున్!!!!"
ఓమ్!
"హరిహర సుతునిమనమునను
తిరముగమననమునొనరుచు తెగువసలుపకన్..
దరహసితవదనునిఁగనిన
చిరవరకనకధనములును చిరముగఁగలుగున్!!!!"
ఓమ్!
"ప్రకృతియిడినమకరందము
వికృతియుకానిదియకృత్రిమవిరుచియునదియున్
స్వకృతపునీతఫలముగా
ప్రకృతియొసఁగెనుది భ్రమరమ్మునకున్!!!!"
కం.. మాఏల హనుమ గణపతి
కాయో పండుయు గరికయు కాల నిజముయే
చేయాలి నీకు నిత్యము
గాయము నున్నను సహనపు గాత్రపు పూజే
--((***))--
No comments:
Post a Comment