***
620..సృష్టిలోని ప్రతి చలనానికి మహా ద్రష్ట అయిన శివుడు అచలుడు. తనువులోని ప్రతి చలనానికి ద్రష్ట అయిన జీవుడు కూడా అచలుడే. శివుడికి, జీవుడికి చిరునామా ఒక్కటే.
ఇహము, పరము అనే రెండు కలలను కనేవాడివి నీవు. నీవు లేక ఇహము లేదు, పరము లేదు.
బహిరంగ యుద్ధంలో ... ఆయుధం ఎంత ముఖ్యమో;
అంతరంగ యుద్ధంలో ... ఆలోచన అంత ముఖ్యం.
ఆ యుద్ధంలో - ఆత్మరక్షణ;ఈ యుద్ధంలో- ఆత్మ శిక్షణ.
వ్యవహారంలో నామ రూపములు ఉండి, స్వానుభవంలో నామ రూపముల స్పృహ లేని వాడే జ్ఞాని. అంతటా చైతన్యం ఉన్నది, చైతన్యములోనే అంతా ఉన్నది.
అందులో కొన్ని చలనంలో ఉంటాయి. మరి కొన్ని నిశ్చలంగా ఉంటాయి. కొసరి పెట్టినదేదొ రుచిలేని దైనను నోరు మూసుక తిని తీరవలయు విసిరి కొట్టినదేదొ వీపుకు తగిలినా చూసి చూడనియట్టు చూడవలయు అరిచి తిట్టినదేదొ అస్సలు చెవులకు వినపడనట్టుగా వెడలవలయు పై మూడు సూత్రాల పాటించి మగవారు దీటుగా లాక్డౌను దాటవలయు
ఆశ వీడకుండ నారాటపడకుండ మూడు సూత్రములను వాడు వాడు హాయిగా తరించు నాపద నొoదడు
***
621..కలియుగమున కష్ట జీవనులకు కావలసినది ఏకాగ్రత, అది భగవంతునికి సంబంధించినది. దీనిని కొంత కులము ద్వారా, భక్తి ద్వారా, దేశ శక్తి ద్వారా జ్ఞానమనే చెట్టుద్వారా వచ్చును . విజ్ఞాన మెక్కువగా ఉన్న గ్రంథములు చదివినపుడు కలియుగ మానవుల మనస్సు ఏకాగ్రత గా మారును, విజ్ఞాన శాఖల మీదికి ఎగబాకును. వినయ మనే వృక్షమ్మును చేరి మనస్సును యుక్తముగా మార్చి సందర్భోచితముగా ప్రతి వక్కరి మనస్సు లో ఉన్న సమస్యలను ప్రక్షాలను చేయగల శక్తే ఏకాగ్రత . .
పాండిత్యమను వలలో చిక్కి, గుణదోష విమర్శ అను సంకెళ్ళలో బంధింప బడుట ఎందుకు ?. మరియు పొట్ట పోసికొనుటకు డబ్బు సంపాదించుటయే ప్రధాన లక్ష్యములుగా బ్రతుకు సాగించు టెందుకు? కలియుగ మానవులు తమ కర్తవ్యములను, వృత్తి విధులను, ధర్మమును తప్పక తమ కోరికలు తీర్చుకొనుటకు ఏకాగ్రత అవసరము . కర్తవ్యపాలనము, ధర్మా చరణమునకై సమన్వ యింప చేసిన ఆనందము ఆరోగ్యము ఆద్యాత్మికం మీవెంటే ఉండు .
కొందరు ధర్మము కన్నా ధనము, అధికారము, కీర్తి, ఐహికముగా పైకి వచ్చుట వీటికే ప్రాధాన్యమొసగి మందబుద్ధులయి, జడులై అల్పాయుష్కులగుట యే వారుచేసిన కర్మయే, దానికి తోడు అనుకరణ కర్మకూడా ఏకాగ్రత లేకుండా చేస్తుంది ఇది అవసరమా ? .
సుఖ శాంతులను కలిగించునది దైవానుభూతి ఒక్కటే. ఇట్టి అనుభూతికి సులభము, తీయనైన బోధ యుండ వలయును. వేదాంత గ్రంధములకు ఇట్టి సమర్థత లేదనుకోవటం మూర్ఖత్వం ఏది ఏమైనా ఓర్పు ఓదార్పు నేర్పు తీర్పు నిన్ను ఏకాగ్రతగా మారుటకు ప్రయత్నించినా ఖచ్చితముగా నీవు మారగలవు . .
ఇంద్రియముల ఆకర్షణకు లోనై జీవించు వారిని గొప్పదయిన, మధురమయిన ఆకర్షణ వైపు లాగును అందులో వయసుకు తగ్గ విధముగా అనుకరించి అనుభూతి ని పొందుటకు ఏకాగ్రత అవసరము.
మనో వాక్కు ఫలం సిద్హించు - ప్రమోదమ్ము జ్ఞానం సృష్టించు
***
622..ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక - ఏకాగ్రత (4 )
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
లక్షణాలను అర్ధం చేసుకొనే శక్తి మనమేధస్సు కు అర్ధం కావటంలేదు, గౌరవం అగౌరవాల మ ధ్య నలిగి పోతున్నది. అందుకే విలువ లేని చోట మాట్లాడకు, గౌరవంలేని చోట నిలబడకు, ప్రేమ లేని చోట ఆశ పడకు. అయినా నీ నిజాయితిని మరచి ప్రవర్తించకు.
లక్ష్యం అలక్ష్యం మనుషులవెంట కొన్ని విషయాలలో ఉండటం సహజం మంచిచేడు గమనించి బతకటమే లక్ష్యం అందుకే నీకు నచ్చని, ఇష్టంలేని విషయాలకి క్షమాపణ చెప్పకు, నువ్వు మెచ్చని వాటికి సంజాయిషీలు ఇవ్వకు, నిర్లక్ష్యంవున్న చోట ఎదురు చూడకు, అలక్ష్యం వున్న చోట వ్యక్త పరచకు.
వ్యక్తిత్వాన్ని వ్యర్ధంగా ప్రవర్తించకు, అగోరమైనదని అదేపనిగా అనుకున్నా ఫలితముండదు, అందులో ఉన్న నీవుచేసిన తప్పును గమనించు అందుకే వ్యక్తిత్వం తాకట్టు పెట్టి ప్రాకులాడకు, ఆత్మగౌరవం పణంగా పెట్టి ప్రేమించకు, చులకనగా చూసే చోట చొరవ చూపకు, జాలి పడి ఇచ్చే పలకరింపులకి, ప్రేమకి జోలె పట్టకు.
భారం అని దూరం వెళ్ళకు, ఆత్మాభిమానం వదలి ప్రవర్తించుట ఎందుకు అందుకే భారం అనుకునే చోట భావాలు పంచుకోకు, దూరం నెట్టేసే చోట దగ్గరవ్వాలని ప్రయత్నించకు, ఆత్మాభిమానాన్ని మించిన ధనం ఈ ప్రపంచంలో మరొకటి వుంటుందని భ్రమ పడకు.
ఏ విషయంలో తొందరపడకు, అంతా నేను చేస్తున్నానని అనుకోకు, నావెనుక దేవుడనే వాడు ఉన్నాడని మరువకు అహం వదలి ప్రేమ పంచి బతుకు అందుకే ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకు, నిజాయతీని గుర్తించని చోట నిముషం కూడా వృధా చేయకు. నీది కాని దేని మీదా నిన్ను తినేసేంత ప్రేమ, అభిమానం ఏదీ పెంచుకోకు.
.
అందుకే కన్న తల్లితండ్రులు, గురువుల మాటను అనుకరించి జీవితము సాగించు అప్పుడే ఏకాగ్రత పెరుగుతుంది.
***
623..ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక - ఏకాగ్రత
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఏకాగ్రత కోసం అమృతఘడియల్లో - .. ఆత్మబలం
మన : శాంతి కోసం వ్రాస్తున్నాను ఒక్కసారి ఆలోచించండి
బంధం ఉంటే అద్దంలా ఉండాలి లేదంటే నీడలా ఉండాలి ఎందుకంటే అద్దం అబద్దం చెప్పదు నీడ మనల్ని వదిలివెళ్ళదు
(అద్ధం కుడిని ఎడమగా చూపిస్తుంది., కానీ రూపం మారదు, చీకట్లో నీడ కనుమరుగు అవుతుంది, చీకట్లో మనమే నడవలేము దేనికైనా కావాలి, వెలుతురు ...
బంధం లేకపోవడమే మోక్షం...నిష్కామ కర్మతో బంధం నుండి బయటపడాలి.
మన ఊపిరి ఆగిన మరుక్షణమే బంధాలు అనుబంధాలు మాయమైపోతాయి.
బంధం ఒక మనసు మాయ...ఎదుటి వ్యక్తి నీపై నేరుగా "నెగ్గే దమ్ము " లేనపుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు
గెలవడం / ఓడడం అనేవి మనసు మాయ గెలుపోటములని సమద్రుష్టితో చూడడం అలవాటు చేసుకోవాలి.
"వ్యక్తిత్వం" మనిషి అస్ధిత్వం కాని "పరిణతి" వ్యక్తిత్యం పరిష్కరించలేని సమస్యలను
చాలాసార్లు పరిష్కరిస్తుంది
. .వ్యక్తిత్వం మనసుకి పరిణతి బుద్ధికి చెందినవి ఉన్నది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళని వదిలేస్తాం" లేనిది ఉన్నట్లుగా చెప్పే వాళ్ళని *నమ్మేస్తాం నిజా నిజాలు తెలుసుకొనే లోపలే నిజంగా అభిమానించే వారిని కోల్పోతాం
"నిజం" అంటే ఒక సంఘటన పట్ల ఒకరి (ప్రత్యక్షసాక్షి కావచ్చు) వివరణ మాత్రమే
"వాస్తవం'' అనేది నిజంకంటే ఎంతో లోతైనది
నాకు సృజనాత్మకత లేదు, ఊహించడం, కలలు కనడం కూడా రాదు.
వయస్సు పెరిగే కొద్ది దేహం యొక్క శక్తి క్షీణించి,శ రీరం అనారోగ్యాలుపాలు అవుతుంది.
కాని అడ్డం మాత్రం మారదు, నీడ నిన్ను వెడలి పోదు
--(())--
***
624.. నిస్పృహ చెందవలసిన పనిలేదు శక్తిని పెంచుకోండి
అంతర్గత శక్తిని గ్రహించి ధైర్యముతో పైకి లేవండి
సంకల్పానికి నడుంకట్టి సాధించడానికి సంకల్పిమ్చండి
భాద్యత మొత్తాన్ని సృష్టి కర్తవల్ల జరిగిందని మరువకండి
వ్యక్తిత్వ వికాసం ప్రతిఒక్కరు పెంచుకోండి
లైమ్గిక కోరిక మనసు లోకి రానీయకండి
భయం వదలి నిర్భయముగా బ్రతకండి
అహంకారం అణువంతకుడా రానీయకండి
బుద్ధిని వికసిమ్ప చేసే విద్య నభ్య సిమ్చండి
మానసిక శక్తిని పెంచే యోగాసనాలు చేయండి
భవిషత్ గురించి ఎటువంటి ఆశలు పెట్టుకోకండి
జగతిలో మిమ్మల్ని గుర్తించే వారిగా ఎదగండి
.
యువకులార గురువు వద్ద విద్యలు నేర్చు కొండి
మీ భుజ బలంతో పాటు భుద్ది బలం కూడ పెంచు కోండి
వేదాంత సారాన్ని అర్ధం చేసు కోవ టానికి ప్రయత్నించండి
దినచర్యలో పెద్దలను,గురువులను గౌరవించటం మరువకండి
వల్లమాలిన మంచితనం ప్రవర్తిమ్చ్ కండి
ఎప్పుడూ కష్టాలను ధైర్య ముగా ఎదుర్కొండి
ప్రతి పనిని నమ్మకంతో చేయగలనని చెప్పండి
రాజవంశానికి చెందిన ఆచారాలను మరువకండి
మచ్చలేని పవిత్రమైన రాజ్యముగా పాలించండి
అజ్ఞానులకు వెలుగును చూపి జ్ఞానులుగా మార్చండి
అసమర్ధత, సోమరితనం నిజమైన పిరికితనమండి
ప్రజల అవసరాలు తెలుసుకొని సహకరించండి
బ్రహ్మ చర్యమును నిర్లక్షము చేయ కండి
. ప్రేమ, కారుణ్యం,శాంతి, సంతోషములు పంచండి
. ప్రజలకు నిజాఇతి చిత్త సుద్ధి కల్పిం చండి
. ఆత్మ విశ్వాసంతో ధర్మ పరిపాలన చేయండి
. విశ్వామిత్రుడు అయోధ్యకు వచ్చె యాగ రక్షణకు
యాగ రక్షణకు శ్రీ రాముని కోరి దశరధుడు పంపెను వర్తమానం
మహ తెజో వంతుడు విశ్వామిత్రుడు అయోధ్యకు ఆగమనం
పరమ ఉదార స్వభావుడు దశరధుడు విశ్వామిత్రునకు సన్మానం
. రాజర్షులు మమ్ము అనుగ్రహించండి, తెలపండి మీ మనోరధం
నా మనస్సు వెధిస్తూ ఉన్నది కోరిక తీరుస్తారా లేదా అని సంశయం
మహారాజ నేను సిద్ధినికోరి ప్రారంభించాను మహాయజ్ఞం
రాక్షసులు యజ్ఞమునకు కలిగిస్తున్నారు ఆటంకం
వారిని ఎదుర్కొని కోప తాపలతో చేసే యజ్ఞం వ్యర్ధం
. వారిని చంపే తపశక్తి ఉన్న చేయను వారితో యుద్ధం
రాజ యాగ రక్షణకు శ్రీ రామూడ్ని పంపి చేయండి సహాయం
విశ్వామిత్ర కోరిక విన్న దశరధ మహారాజు చెందే విస్మయం
యాగ రక్షణకు నేనే స్వయముగా వస్తానని విన్నపం
దశరధ మాటలయందు తొనికిసలాడుతుంది పుత్రవాత్సల్యం
విశ్వామిత్రుడు కోపముతో రఘు వంశీయులకు తగదు ప్రతిజ్ఞాభంగం
వసిష్ఠ మహర్షి దశరధుని పిలిచి శాంతింప చేయండి విశ్వామిత్ర కోపం
ధైర్యవంతులు కుమారుని విశ్వామిత్రుడుతో పంపుట అనేది మీ ధర్మం
భార్యలను పిల్లలను సంప్రదించి విశ్వామిత్ర కోరిక తీర్చుట శ్రేయస్కరం
.
సర్వసాస్త్రములు తెలిసిన వారితో కుమారుని పంపుట కెందుకు భయం
గురువర్య వయస్సులో చిన్నవాడు రాముడ్నిపంపటమా అనేదే సందేహం
విశ్వామిత్రుని శక్తి నాకు తెలుసు రాజగురువుగా చేస్తున్నాను హితోపదేశం
శ్రీ రామునితో లక్ష్మణుని కుడా పంపుటకు దశరధుడు అంగీ కారం
తల్లి తండ్రుల మాటప్రకారం రాజర్శితో వెళ్ళుట సిద్ధం
రామ లక్ష్మనులు గురువులకు పెద్దలకు చేసే వందనం
తల్లులకు ప్రజలకు తెలిపే చేయగలం కార్యస్సఫలం
మీ అందరి దీవెనలు కావాలి మాకు ఈ సమయం
గోభ్రాహ్మణుల హితము కొరకు మేము సిద్ధం
దేశ రక్షణకు ఎంతటి త్యాగాన కైన వెనుకాడం
మహాత్ముల ఆదేశం పాటిమ్చటమెమా కర్తవ్యం
గురువర్యులు చెప్పిన విదముగా నడుచుకుంటాం
ప్రభాత సమయమున రామ లక్ష్మణులు ప్రయాణం
ప్రయాణంలో భోధించే రాజకుమారులకు ఆత్మప్రభోధం
రామ నీ జన్మ వళ్ళ అజ్ఞానులకు కలుగును జ్ఞానోదయం
. సర్వులకు ఆదర్సప్రాయులుగా జీవిమ్చుటే మానవధర్మం
***
626..విశ్రాంతి
నారదా శీతల ప్రాంతమునకు వెళ్లి కాస్త విశ్రాంతి తీసుకుంటే బాగుంటుందనిపిస్తుంది, ప్రకృతి చల్లని వాతా వరణములో అలా అలా సంచారము చేస్తే మనసుకు ఏంతో ఉల్లాసముగా, ఉస్చాహంగా ఉంటుంది కదా నారదా అన్న విఘ్నేశ్వరుని మాటలకు అవునవును అని నిద్రనుండి లేచినట్లు పలికాడు నారదుడు.
.
నారదా నీవు ఈలోకంలో ఉన్నట్లు లేవు ఎక్కడో విహరిస్తున్నావు, ఏమిటి విశేషము అని అన్నాడు విఘ్నేశ్వరుడు.
నేను కొన్ని ప్రశ్నలకు మీనుండి సమాదానుములు తెలుసుకోవాలని అనుకుంటున్నాను మీరు చెపితే సంతృప్తి పడగలను
అడుగు నారదా నాకు తెలిసినవి చెప్పగలను , తెలియనివి తల్లి తండ్రులనడిగి చెపుతాను, మరి అడగటమే ఆలస్యము, కాస్త ఈ లడ్డులు తినవచ్చా మీ ప్రశ్నల కేమన్న అడ్డమా.
నారదుడు: మహాప్రభు ఎంతమాట, మీరు తినేటప్పుడు వచ్చానని అనుకోకండి
విఘ్నేశ్వరుడు : అడుగుమరి ఆలస్యమెందుకు
నారదుడు :(1) ఆనందం అంటే ఏమిటి ?
విఘ్నేశ్వరుడు : కామానికి మించిన వ్యాధి లేదు ,మొహానికి మించిన
శత్రువు లేదు, క్రోదానికి మించిన అగ్ని లేదు, ఆత్మజ్ఞాన్నానికి
మించిన సుఖం లేదు, ఆద్యాత్మికతకు మించిన ఆనందం లేదు.
ప్రవహించిన నది సముద్రములో కలసినట్లు, సంసారం కష్ట
సుఖాలు పోవటానికి నవ్వుతూ బ్రతకటమే నిజమైన ఆనందం.
నారదుడు: (2) భార్య భర్త లమధ్య ఉండాల్సినదేది ?.
విఘ్నేశ్వరుడు: నవ్వు, ఏడుపు మరియు తృప్తి
నారదుడు : (3) నిరాశవాదులు ఎవరు ?
విఘ్నేశ్వరుడు : చాలామంది ఆశావాదులకు అప్పులిచ్చి తాము నిరాశా
వాదులవుతారు. అటువంటి వారే
నారదుడు : (4) తల్లితండ్రుల వ్యత్యాసం ఏమిటి ?
విఘ్నేశ్వరుడు : తల్లి జీవితాంతము తల్లిగా ఉంటుంది, కాని తండ్రి కొత్త
భార్యను తెచ్చుకొనే వరకు తండ్రిగా ఉంటాడు.
నారదుడు :(5) సారధ్యం, ప్రేరణ, దృక్పధం గురించి వివరిస్తారా?
విఘ్నేశ్వరుడు : నీవు ఏమి చేయ గలవో చెప్పేది సామర్ద్యం
నీవు ఏమి చేయాలో నిర్ణయించేది ప్రేరణ
నీవు ఎంత నైపుణ్యంతో ఆపని చేయగలవో నిర్ణయించేది
దృక్పదం.
నారదుడు :(6) ప్రామానికియా గ్రంధం అంటే ఏమిటి ?
విఘ్నేశ్వరుడు: ప్రామాణిక గ్రంధం అంటే ప్రజలు కొనియడేది, కాని
చదవనిది
నారదుడు: (7) పిల్లలలో ఎ భావం ఉంటుంది ?
విఘ్నేశ్వరుడు: ప్రేమభావము, మధురభావము, హాస్య భావము
మరియు కఠోరభావము.
నారదుడు:(😎 వివాహ కలయిక అంటే ఏమిటి ?
విఘ్నేశ్వరుడు : సంతోష దాయక మైన వివాహము, క్షమ (ఓర్పు )
గుణమున్న ఇద్దరి కలయక.
నారదుడు :(9) పిల్లలు ఎవరి మాట వింటారు ?
విఘ్నేశ్వరుడు : పిల్లలు తల్లి, తండ్రి, గురువు మరియు ధనం మాట
వింటారు
నారదుడు : (10) టి.వి చూస్తె లాభమా, నష్టమా ?
విఘ్నేశ్వరుడు : లాభం మెదడుకు మించిన మేత, నష్టం:కళ్ళ జోడుకు
ఖర్చు
***
627..నేటి భగవద్గీత
:
"నీవు గాని, ఈ రాజులు గాని వీరందరూ కూడా ఎప్పుడూ లేనివారు కాదు. అంతేకాదు భవిష్యత్తులో కూడా ఈ దేహాలు నశించినా మనందరం ఎప్పుడూ ఉండేవారమే" అని స్పష్టం చేశాడు భగవానుడు. వేరువేరు దేహాలలోని ఆత్మ ఎప్పుడూ ఉండేదే. దేహాలు నశించినా, నశించకుండా ఎప్పుడూ ఉండే తత్త్వం ఒకటి ఉన్నది. అదే ఆత్మ. అది త్రికాలలోనూ ఉంటుంది. త్రికాలాతీతంగాను ఉంటుంది. అదే జీవుని యదార్థ తత్త్వం. దానికి చావు పుట్టుకలు లేవు. ఏమార్పులూ లేవు.
కనుక ఓ అర్జునా! ఆత్మ నిత్యమైనది. నీవు ఆత్మవే కాని దేహానివి కాదు. నీవే కాదు, ఈ సమస్త ప్రాణికోటి ఆత్మస్వరూపమే. అందరమూ ఆత్మస్వరూపమే. అన్ని కుండలలోనూ ఒకే మట్టి ఉన్నట్లు, అన్ని ఆభరణములలోనూ ఒకే బంగారం ఉన్నట్లు, అన్ని దేహాలలోను ఒకే ఆత్మ ఉన్నది. ఇక్కడే చాలామందికి సందేహం. అన్ని దేహాలలోను ఒకే ఆత్మ ఉంటే అందరూ ఒక్క విధంగానే ప్రవర్తించరెందుకు? కొందరు ధర్మాత్ములుగా, కొందరు అధర్మపరులుగా; కొందరు పుణ్యాత్ములుగా, కొందరు పాపాత్ములుగా, కొందరు మంచివారుగా; కొందరు చెడ్డవారుగా; కొందరు అందంగా; కొందరు అనాకారంగా ఎందుకుంటున్నారు? ఇలా తప్పుగా చెబితే వేదాంతాన్ని ఎవరు నమ్ముతారు? అని ప్రశ్నిస్తారు. మరి ట్యూబ్ లైటులోను, ఫ్యాన్ లోను, ఫ్రిజ్ లోను, హీటరులోను ఒకే కరెంటు ఉన్నదా? వేరువేరు రకాల కరెంటు ఉన్నదా? అన్నింటిలోనూ ఒకే కరెంటు. ఒకే తీగ ద్వారా ఇంటిలోనికి వచ్చింది. మరి లైటు వెలుగుతున్నది, ఫ్యాను తిరుగుతున్నది, ఫ్రిజ్ చల్లబరుస్తున్నది, హీటరు వేడిచేస్తున్నదేం? ఇది కరెంటులోని తేడా కాదు, ఆయా పరికరాలలో తేడా. అదేవిధంగా అందరిలో ఒకే ఆత్మ ఉన్నప్పటికీ, వారి వారి దేహమనోబుద్ధులనే పరికరాలలో తేడాల వల్ల వేరువేరుగా కనిపిస్తున్నారు. వ్యవహరిస్తున్నారు. కనుక అన్ని దేహాలలోను ఒకే ఆత్మ ఉన్నది. ఆ ఆత్మయే నేను, నీవు, ఈ రాజులు, అందరూ కూడా. ఆత్మజ్ఞాని ఎంతగా చెప్పినా 'దేహమే నేను' - అనే అజ్ఞానంలో ఉన్న సామాన్యుడు తికమకపడుతూనే ఉంటాడు. అర్జునుడు కూడా తికమకలో ఉన్నట్లు గుర్తించాడు శ్రీకృష్ణుడు. అందుకే -
శ్రీకృష్ణుడు: అర్జునా! నీవిప్పుడున్నావా?
అర్జునుడు: ఆ! లేకేం ఉన్నాను. నీ ఎదురుగానే ఉన్నాను.
శ్రీకృష్ణుడు: శరీరంతో ఉన్నావా? శరీరం లేకుండా ఉన్నావా?
అర్జునుడు: శరీరంతోనే ఉన్నాను. ఇందులో సందేహం ఏముంది?
శ్రీకృష్ణుడు: సరే, ఈ శరీరం ఏం చేస్తే నీకు వచ్చింది?
అర్జునుడు: వెనుకటి జన్మలలో నేను చేసిన పుణ్యపాప కర్మల ఫలితంగా వచ్చింది.
శ్రీకృష్ణుడు: అంటే వెనుకటి జన్మలలో నీవు పుణ్య పాపకర్మలను చేశావా?
అర్జునుడు: అవును, చేశాను, చేయబట్టేగా ఈ జన్మ వచ్చింది.
శ్రీకృష్ణుడు: అయితే అప్పుడు నీవు ఉండే చేశావా? లేకుండానే చేశావా?
అర్జునుడు: నేను లేకుండా కర్మలెలా చేస్తాను? ఉండే చేశాను.
శ్రీకృష్ణుడు: ఉంటే - అప్పుడు ఈ దేహంతోనే ఉన్నావా? లేక మరొక దేహంతోనా?
అర్జునుడు: ఏ దేహమో తెలియదు గాని, మొత్తం మీద ఏదో ఒక దేహంతో ఉన్నాను.
శ్రీకృష్ణుడు: అంటే అప్పుడు నీవున్నావు, ఏదో ఒక దేహం ఉంది, ఆ దేహం ఎలా వచ్చింది?
అర్జునుడు: అంతకుముందు జన్మలలో చేసిన కర్మలను బట్టి.
శ్రీకృష్ణుడు: కనుక ఓ అర్జునా! అనేక జన్మల నుండి నీవున్నావు. దేహం మాత్రం మారిపోతున్నది. అంటే దేహాలు అనిత్యం. నీవు మాత్రం నిత్యం. నీవే కాదు - ఇక్కడ - ఈ లోకంలో అందరూ నిత్యులే. అట్టి నిత్యులైన వారికోసం ఏడుపెందుకు?
జీవుడి యొక్క అసలు తత్త్వం ఆత్మయని, ఆత్మ నిత్యమని -
--(())__
628 ..*అద్భుతమైన వరం.. బ్రహ్మముహూర్తం*..!
పూర్వం కాలాన్ని ఘడియలలో లెక్కించేవారు. ఒక ఘడియకు మన ప్రస్తుత కాలమాన ప్రకారంగా 24 నిమిషాలు. ఒక ముహూర్తం అనగా 2 ఘడియల కాలం అని అర్థం. అంటే 48 నిమిషాలను ఒక ముహూర్తం అంటారు. ఒక పగలు, ఒక రాత్రినీ కలిపిన మొత్తాన్ని అహోరాత్రం అంటారు. ఒక అహోరాత్రంకు ఇలాంటివి 30 ముహూర్తాలు ఉంటాయి. అంటే... ఒక రోజులో 30 ముహూర్తాలు జరుగుతాయి. సూర్యోదయమునకు ముందు వచ్చే ముహూర్తాలలో మొదటిది. దీనినే 'బ్రహ్మముహూర్తం' అంటారు. అంటే రోజు మొత్తంలో 29వది బ్రహ్మ ముహూర్తం. ఈ ముహూర్తానికి అధిదేవత బ్రహ్మ. కాబట్టి దీనికి బ్రహ్మ ముహూర్తం అనే పేరు వచ్చింది. సూర్యోదయం అవడానికి, 98-48 నిమిషాల మధ్యకాలం ఇది.
నిజానికి తెల్లవారుజామును 2 భాగాలుగా విభజించారు. సూర్యోదయమునకు 2 ఘడియల ముందు కాలాన్ని అనగా 48 నిమిషముల ముందు కాలాన్ని ఆసురీ ముహూర్తం అని ఆసురీ ముహుర్తానికి ముందు 48 నిమిషముల ముందు కాలాన్ని బ్రహ్మముహూర్తం అని అంటారు. ప్రతిరోజు బ్రహ్మముహుర్తమున లేచి భగవంతుని ధ్యానించి పనులు ప్రారంభించాలని అంటారు. బ్రహ్మమూహూర్తానికి ఉన్న అత్యధిక ప్రాధాన్యత దృష్ట్యా అనేక మంది నూతన గృహప్రవేశానికి ఈ సమయాన్ని ఎన్నుకుంటారు. ఈ సమయంలోనే మానవుని మేథాశక్తికి భగవంతుని శక్తి తోడవుతుంది.
పురాణగాథ
బ్రహ్మముహూర్తం అనే పేరు ఎలా వచ్చిందనే విషయంపై పురాణగాథలు ఉన్నాయి. కశ్యప బ్రహ్మకు, వినతకు జన్మించిన వాడు అనూరుడు. ఈయన గరుత్మంతునికి సోదరుడు. ఇంకా అనూరుడు సూర్యునికి రథసారథి. ఒక సమయంలో తల్లి వినత పుత్రుడిని చూసుకోవాలని కుతూహలంతో అండం పగలగొట్టింది. అప్పుడు సగం శరీరంతో అనూరుడు జన్మించాడు. బ్రహ్మ అతన్ని సూర్యునికి సారథిగా నియమించి, నీవు భూలోకాన మొదటగా కనిపించిన కాలమునే బ్రహ్మముహూర్త కాలమంటారు. ఆ సమయమున ఏ నక్షత్రాలు, గ్రహలుగాని చెడు చేయలేవు అని అనూరునికి వరమిచ్చాడు. అందుకే బ్రహ్మముహూర్త కాలం అన్ని శుభ కార్యాలకు ఉన్నతమైందని శాస్త్రం చెబుతోంది. ఈ బ్రహ్మ ముహూర్తకాలమున చదివే చదువు.. చేసే శుభకార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని చెప్పవచ్చు.
ఏం చేయాలి..?
ఉదయం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉండే సమయం బ్రహ్మముహూర్తం. ఆధ్యాత్మిక చింతన చేసేవారికి, విద్యార్ధులకు, ధ్యానం, జపతపాదులు చేయువారికి చాలా విలువైన సమయం. ఆ సమయంలో మనసు ప్రశాంతంగా ఉండి స్వచ్ఛంగా ఉంటుంది. సాత్వికమైన వాతావరణం కూడా గోచరిస్తుంటుంది. మనసు స్వచ్ఛంగా తెల్లకాగితంలా దైనందిన జీవితంలో ఉండే గజిబిజి ఏమీ లేకుండా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి రాగ ద్వేషాలు, ఇష్టాయిష్టాలు లేని సమయం.
ఈ సమయంలో మన మనసు ఎలా కావాలంటే అటు తేలికగా మారుతుంది. ఆధ్యాత్మిక ఆనందాన్ని చాలా సులువుగా పొందవచ్చు. అందుకే ఆ సమయంలో యోగులు, పరమహంసలు, సన్యాసులు, ఋషులు... హిమాలయాలలో ధ్యానంలో ఉంటూ వారి వారి తపఃశక్తి తరంగాలను ప్రపంచమంతా ప్రసరింపచేస్తారు. అందువలన ఆ సమయంలో చేసే ధ్యానం మనకు ఆధ్యాత్మికంగా సిద్ధిస్తుంది. అయితే చాలామంది ఆ సమయంలో నిద్రతో సమయాన్ని వృధా చేస్తూ ఆధ్యాత్మిక తరంగాలని నష్టపోతుంటారు. ఎలాంటి పూజలు, ధ్యానాలు, సాధనలు లేకపోయినా కనీసం మేలుకొని ఉండమంటారు మన పెద్దవాళ్లు.
చల్లని నీటితో తలస్నానం చాలా మంచిది. దీంతో మెదడు, కళ్లు చల్లగా ఉంటాయి. బ్రహ్మముహూర్తంలో ధ్యానం, జపం, ప్రాణాయామం, ఆసనాలు, కీర్తనలు, స్తోత్రాలు సాధన చేయటం చాలా మంచిది.
బ్రహ్మముహూర్తం చాలా విలువైన కాలం. ఈ సమయాన్ని వృధా చేయకూడదు. పూజలకు, యోగాకు, ప్రాణాయామానికి ఉపయోగించుకోవాలి. పద్మాసనంలో గానీ, సుఖాసనంలో గానీ కూర్చుని చేసే ధ్యానానికి అ సమయంలో మనోశక్తి లభిస్తుంది. మొదలుపెట్టే ముందు 12 సార్లు ఓంకారం, 5 నిముషాలు ఏదైన కీర్తన పాడటం వలన మనసు త్వరగా భగవధ్యానంలో ఏకాగ్రతను కుదుర్చుకుంటుంది.
బ్రహ్మముహుర్తంలో చేసిన ఓంకార ధ్వని వలన సుషుమ్న నాడి తెరుచుకుంటుంది. అందుకే ఋషులు, యోగులు, ఈ సమయంలో బిగ్గరగా ఓంకారం జపిస్తారు. ఎపుడైతే మన నాసిక రంధ్రాలలోకి శ్వాస ప్రవహిస్తూ ఉంటుందో వెంటనే సుషుమ్న నాడి పని చేయడం మొదలుపెడుతుంది. అప్పుడే ధ్యానం బాగా కుదురుతుంది.
--)(--
629 .. *పిరికితనాన్ని మించిన మహాపాతకం మరొకటి లేదు. పిరికిపందలు రక్షించబడరు. అది నిశ్చయం.
*పాశ్చాత్య ప్రపంచంలో జీవితం పైకి నవ్వులమయంగా ఉంటుంది. కానీ లోలోపలంతా విషాదం, చివరికి అది వేదనగా పరిణమిస్తుంది. భారతీయ సమాజం నరాశా నిస్పృహలు ఆవరించినట్లు కనిపిస్తుంది. కానీ లోలోపలంతా ఉదాసీనత, ఉల్లాసాలతో నిండి ఉంటుంది.
*పగిలిపోయిన మైక్రోఫోన్ ద్వారా మీరేదీ ప్రసారం చెయ్యలేనట్లే. అశాంతి వల్ల అస్థవ్యస్తమయిన మానసిక మయిన మైక్రోఫోను ద్వారా మీరు ప్రార్ధనను నివేదించుకోలేదు. మీ మనస్సనే మైక్రోఫోనును గాఢమయిన ప్రశాంతతతో మీరు మరమ్మత్తు చేసి మీ సహజావబోధానికున్న గ్రాహకశక్తిని పెంచండి. ఆ విధంగా మీరు భగవంతుడికి పటిష్టంగా ప్రసారం చెయ్యగలుగుతారు ; ఆయన దగ్గర నించి సమాధానాలు పొందగలుగుతారు.
*3) నారీస్తనభర నాభీదేశం దృష్ట్వా మా గా మోహావేశమ్|
ఏతన్మాంసవసాదివికారం మనసి విచింతయ వారం వారమ్ ||
యువతుల స్తనములను,నాభిని చూచి మోహావేశం పొందకుము.అవన్నీ మాంసపు ముద్దలే అని మరల మరల మనసులో తలచుము.
***
630..*ప్రాంజలి ప్రభ కథలు*
తమిళభాషలో కవిరాజుగా ప్రసిద్ధి చెందిన కన్నదాసన్ గారు చెప్పిన మాటలు అక్షర సత్యాలు
అర్థవంతమైన హిందూ మతము. నేను హిందువుగా ఉండడానికి ఇష్టపడుటకు కారణాలు
1. భగవంతుడు లేడని చెప్పినా, మత ద్రోహిగా పరిగణించని ధర్మం,* *హిందూధర్మం.
2. రోజుకు ఇన్ని సార్లు, వారానికి ఇన్ని సార్లు, నెలకు ఇన్ని సార్లు తప్పనిసరిగా గుడికి వెళ్ళి తీరాలనే నిబంధనలు పెట్టని ధర్మం* , *హిందూధర్మం.
3. జీవిత కాలంలో కాశికో లేక రామేశ్వరానికో తప్పని సరిగా ఒక్కసారి వెళ్ళే తీరాలనే నిబంధనలు పెట్టని ధర్మం,* *హిందూధర్మం.
4. హిందూ మత గ్రంథాల ప్రకారమే జీవనాన్ని కొనసాగించాలనే నిబంధనలు పెట్టని ధర్మం,* *హిందూధర్మం.*
5. హిందూ మతానికి ప్రత్యేకమైన మతపెద్ద అంటూ ఎవరూ ఉండరు.
6. సన్యాసులు, స్వామీజీలు, మఠాధిపతులు తప్పులు చేసినా, నిలదీసి, ప్రశ్నించే ధర్మం,* *హిందూధర్మం.
7. హిందువులు ఈ క్రింది వాటిని కూడా* *భగవత్స్వరూపాలుగానే ఆరాధిస్తారు.*
వృక్షాలు దైవ స్వరూపాలే.
రాళ్ళూ - రప్పలూ కూడా దైవస్వరూపాలే.
నీరు (గంగ) కూడా దైవ సవరూపమే.
గాలి కూడా దైవ స్వరూపమే.
వానరాలు (కోతులు) కూడా దైవ స్వరూపాలే.
కుక్కలు (భైరవుడు) కూడా దైవ స్వరూపాలే.
పందులు (వరాహం) కూడా దైవ స్వరూపాలే.
8. నువ్వూ దైవ స్వరూపమే.
*నేనూ దైవ స్వరూపమే* .
*చక్షు గోచరమైనవన్నీ*
*(కంటికి కనిపించేవన్నీ)*
*దైవ స్వరూపాలే.*
9. చతుర్వేదాలు, నాలుగు ఉపవేదాలు, రెండు ఇతిహాసాలు, పద్దెనిమిది పురాణాలు, పద్దెనిమిది ఉపపురాణాలు, ఆరు శాస్త్రాలు, పద్దెనిమిది స్మృతులతో పాటు 1200 వందలకు పైగా ధార్మిక గ్రంథాలు గల సువిశాల ధర్మం, *హిందూధర్మం.*
10. మన ధార్మిక గ్రంధాలు మనకు బోధించే విశిష్ట ధర్మాలు.
కర్మల గురించి తెలియాలంటే వేదాలు చదవాలి.
సమస్త జ్ఞానం పొందాలంటే .. ఉపనిషత్తులు చదవాలి
పర స్త్రీ వ్యామోహం పోవాలంటే ...... రామాయణం చదవాలి.
రాజ్యకాంక్ష, పదవీ వ్యామోహం పోవాలంటే ...... మహాభారతం చదవాలి.
భగవంతుని తత్త్వం తెలియాలంటే ...... భాగవతం చదవాలి.
చక్కటి పరిపాలన అందించాలంటే ..... కౌటిల్యుని "అర్థశాస్త్రం" చదవాలి.
అన్యోన్య దాంపత్యానికి ...... వాత్స్యాయన కామశాస్త్రం చదవాలి.
చక్కటి ఆరోగ్యానికి ...... ఆయుర్వేదం చదవాలి.
మేథస్సుకు ..... వేద గణితం చదవాలి.
శారీరక ఆరోగ్యానికి మరియు శారీరక సౌష్ఠవానికి పతంజలి యోగశాస్త్రం చదవాలి.
భవన నిర్మాణాలకు ..... వాస్తుశాస్త్రం చదవాలి.
గ్రహ, నక్షత్రాలను గురించి తెలుసుకోవడానికి 🌎ఖగోళ శాస్త్రాన్ని చదవాలి
11. ఎవ్వరినీ బలవంతంగా మతం మార్పించే ప్రయత్నం చేయని ధర్మం,* *హిందూధర్మం.*
12. ఆహార అలవాట్లలో కూడా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు ఉండవచ్చు. (ప్రపంచంలో శాఖాహారం, మాంసాహారం ఈ రెంటిలో ఎవరికి నచ్చిన ఆహార పద్ధతులను వారు పాటించవచ్చు)
13. *హిందూధర్మం,* *అన్ని మతాలను, అన్ని ధర్మాలను సమానంగానే పరిగణిస్తుంది.
14. మోక్షానికి దారి చూపించే ధర్మం, హిందూధర్మం
15. అన్ని మతాలను గౌరవించే ధర్మం, హిందూధర్మం.
16. పరమత దూషణ చెయ్యని ధర్మం, హిందూధర్మం
హిందువుగా జన్మించాం. హిందువుగా జీవిద్దాం. హిందువుగా మరణిద్దాం.
*****
631.. చదువుల మీద అన్నమయ్య రకరకాల పద్ధతులలో తన గీతాలలో వ్యాఖ్యానాలు చేసాడు.
'ఇదివరకు కొంత చదివాను. ఇంకా కొంత చదువుతాను, కాని ఏం ప్రయోజనం. నాలో ఉన్న నా శత్రువును గురించి తెలుసుకోలేకపోతున్నాను. ఈ పల్లవిలో శత్రువులను ఎదిరించే పద్ధతిని దృఢంగా చదువులు నేర్పలేకపోతున్నాయని ఒక ఆవేదనతో కూడిన విసురు ఉంది. 'తన మనస్సే తనకు బంధువు. తన మనస్సే తనకు శత్రువు.' అనే భగవద్గీతా పాఠాన్ని వివరంగా హృదయానికి హత్తుకొనేటట్లుగా చదువులు నేర్పటంలేదు. అందువల్ల ప్రతి వ్యక్తి తనలో ఉన్న శత్రువును తెలుసుకోలేక పోతున్నాడని, అందువల్ల తనని తాను ఉద్ధరించుకోలేకపోతున్నాడని బాధ పడుతూ, చదువుద్వారా మనిషికి రావలిసిన సిసలైన వ్యక్తిత్వాన్ని చరణాలలో వివరిస్తున్నాడు.
పుణ్య, పాప, మిశ్రమ కర్మలు, విధి, నిషేధ, ప్రాయశ్చిత్త కర్మలు, సంచిత కర్మలు (అనేక జన్మలలో చేయబడి ఇంతవరకు అనుభవింపబడకుండ సంస్కార రూపంలో నిలిచి ఉండేవి) ఆగామి కర్మలు (ముందు జన్మలలో ఫలితం కలిగించేవి) ప్రారబ్ధ కర్మలు (ఈ శరీరంలో సుఖ దుఃఖాలను కలిగించేవి), కేవల ఐహిక కర్మలు, కేవల ఆముష్మిక కర్మలు, ఐహికాముష్మిక కర్మలు - ఇలా ఎన్నెన్నో కర్మలు. వీటిలో తెలిసి చేసినా తెలియక చేసినా - పాపాన్ని కలిగించే కర్మలు చాలా ఉ న్నాయి. 'నాకు సంబంధించిన కర్మలను ఏనాడు నిందించను, స్వామిని శరణు వేడి వాటిని పోగొట్టుకోవటానికి ప్రయత్నించను కాని ఇతరులను తిట్టడానికి మాత్రం చాలా ఉత్సాహపడతాను' అని అన్నమయ్య ఘాటుగా నిందాపరుల జీవనాన్ని విమర్శించారు. పర నిందలను మానుకొమ్మని, తన జీవితాన్ని నిందా రహితంగా ఉద్ధరించుకొమ్మని ఒక గొప్ప సందేశం ఇందులో ఉంది.
ఈ గీతంలో "నేను" అనేదానిని అన్నమయ్యకి మాత్రమే అన్వయించుకోకూడదు. ప్రతి జీవుడు ఈ "నేను" లో కనబడతాడు. కనబడాలి. అన్నమయ్య జీవితంలో దిగజారిపోయిన వ్యక్తికి ఈ లక్షణాలు ఉంటాయన్నాడు.
1. ఇతరులను దూషించటం, 2. ఇతరులను ఎగతాళి చేస్తూ వెక్కిరించటం, 3. ఊరికే ఇతరుల మీద కోప్పడటం, 4. తాను ఆచరించకపోయినా ఇతరులకు నీతి పాఠాలు చెప్పటం, 5. ఇతరుల గోరంత తప్పులను కొండంతలుగా చేసి ప్రచారం చేయటం, 6. కాలం విలువను తెలుసుకోలేకపోవటం ఆరు లోపాలకు ఆ - 'గీతాచార్యుడు' ఇలా నివారణోపాయాలు చెప్పాడు.
1. జన్మ జన్మలనుండి వస్తున్న కర్మలను నిందించుకో, 2. నువ్వు ఎత్తుతున్న జన్మ కష్టాలను చూసి నవ్వుకో, 3. కోరిక మొదలైన శత్రువులు మీద కోప్పడు, 4. నీలో ఉన్న వారిని ప్రతి నిమిషం తలుచుకొని నీతిగా బతుకు, 5. ఛండాలమైన ఆశలను తగ్గించుకో, 6. కాలం విలువను తెలుసుకొంటూ హరిని ధ్యానించు మానవుడు కర్మాధీనుడని చెబుతూ (18-60) దాని తర్వాత శ్లోకంలో తనను శరణు వేడమని (18-62) అందువల్ల కర్మల బంధాన్నుంచి, మాయల బంధాన్నుంచి మానవుడు విముక్తుడవుతాడని భగవద్గీతలో స్వామి చెప్పాడు.
భగవద్గీతలోని అటువంటి భావాల ఆధారంగా రాసిన ఇటువంటి చదువు కీర్తనలలో ఆధునిక జీవితానికి పనికివచ్చే వ్యక్తిత్వ పాఠాలు చాలా ఉన్నాయి. అన్నమయ్య కీర్తన వేంకటేశ్వరుని చిరునవ్వు మాత్రమేకాదు, గీత అనే కాంతితో వ్యక్తిత్వాన్ని ఉన్నతంగా ఆవిష్కరించే పతాక.
.......