******
*వయసు పెరిగితే మనకేమీ కొత్తగా కొమ్ములు పొడుచుకుని రావు. చాలా విషయాలను మనం వదిలేయాలి.
”చలం” (గుడిపాటి వెంకటాచలం), గాయని వాణీ జయరామ్, ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గార్లను ఆదర్శంగా పెట్టుకోవాలి.
చలంగారు తానూ, తన స్నేహితుడూ ముచ్చటించుకుంటూ ఉండగా పిల్లలు వాళ్ళ ఇంట్లోని వంటపాత్రలతో ఆడుకుంటూ ధ్వనులు చేస్తుండగా స్నేహితుడా పిల్లలను వారించాడు.
అప్పడు చలం… “మనకు మన ముచ్చట్లు ఎంత ముఖ్యమో, ఆ పిల్లలకు వాళ్ల ఆటా అంతే ముఖ్యం. వయసులో పెద్దవాళ్లమైనంత మాత్రాన వాళ్ల ఆటలను ఆపెయ్యమనడానికి మనకు హక్కెక్కడిదీ?” అన్నారు. ఇలాంటి ఉన్నతాలోచనా పథాన్ని అలవరచుకునే ప్రయత్నంలో కొంత విజయం సాధించాలి.
వాణీ జయరామ్ గారు చిన్న పిల్లలను సైతం “మీరు” అనే సంబోధిస్తారు. ప్రయత్నించినా ఆ తత్త్వం మనకు అబ్బడంలేదు.
ఎస్పీ బాలు గారు శబరిమలకు డోలీలో వెళ్ళిన సందర్భంలో డోలీ మోసినవాళ్ళ కాళ్ళకు మోకరిల్లారు. అది వాళ్ళ వృత్తికావచ్చుగాక. వాళ్ళు ఆ పనిచేసినందుకు డబ్బులిస్తుండ వచ్చు గాక. వాళ్ళే లేకపోతే మనవద్ద డబ్బులుండీ లాభమేమిటి ?
మనమెలాగూ ఎస్పీలాగా పాదాభివందనం చేసేంత గొప్పవాళ్లం కాలేం. కనీసం “థాంక్స్” చెప్పొచ్చు కదా.
కాగా ఒక సందర్భంలో “మన శరీరంలో తగినంత శక్తి ఉండగా ఇతరులకు డబ్బులిచ్చే అయినా బ్యాగులు మోయించొద్దు” అనీ “ఎవరిచేతనైతే నీ లగేజీని మోయిస్తావో వాళ్ళ పదింతల లగేజీని వచ్చే జన్మలో నీవు మోయకతప్పదు” అన్నారు…. శ్రీకంచి కామకోటి పీఠాధిపతి స్వామి గారు. చాలామటుకు దీనికీ కట్టుబడి ఉండే ప్రయత్నము చేయాలి.
మనం చాలా విషయాలను పట్టుకోవటం కష్టం కానీ వదిలేయడంలో బాధ ఏమిటీ.
ఏం వదిలివేయాలో చూద్దాం.
”అమ్మాయీ గ్యాసు కట్టేసావా....
గీజర్ ఆఫ్ చేసావా...
ఏ.సి ఆన్ లో ఉన్నట్లుంది..
పాలు ఫ్రిజ్ లో పెట్టావా....
...లాంటి ఎంక్వయిరీలు వదిలేద్దాం.
”మా కొడుకూ, కోడలూ పట్టించుకోరు" అంటూ తామేదో పర్వతాలను మోస్తున్నట్లు బిల్డప్ ఇస్తూ తమ పరువు తామే తీసుకుంటున్న తలిదండ్రులున్నారు
వాళ్ళ హయాంలో వాళ్ళిష్టం..
కష్టనష్టాలు కూడా వాళ్ళవే.
ఎవరితో ఏపనీ చేయించుకోకుండా ప్రతీపనీ మన పనే అనుకుంటే ఎంత ప్రశాంతంగా, ఆరోగ్యంగా ఉండగలమో కదా..
నా అభిప్రాయం ఏమిటంటే… అని అనటం తగ్గించి.. నీ ఇష్టం నువ్వు చెప్పు అని వాళ్ళ ఇష్టాయిష్టాలతో వాళ్ళని బ్రతకనిస్తే గృహమే ఔతుంది కదా స్వర్గసీమ.
నాకూ తెలుసు తో పాటు. నాకు మాత్రమే తెలుసు అనే ఆలోచనను తగ్గించుకుని, వాళ్ళకి చాలా విషయాలు, టెక్నాలజీ నాకంటే ఎక్కువ తెలుసు కదా అనే నిజాన్ని ఒప్పేసుకుంటే చాలు.
మన పిల్లలకోసం వచ్చేవారితో మనం మితంగా మాట్లాడాలి. వాళ్ళు మనకోసం రాలేదు అని గుర్తుంచుకుని కాసేపు కర్టెసీకి మాట్లాడి లేచి మన గదిలోకి మనం వెళ్ళిపోగలగాలి.
పెద్దవారిని పలకరించే మర్యాదతో ఎవరైనా సహజంగా అడుగుతారు. ఆరోగ్యం బాగుంది కదా అని దయచేసి వెంటనే అతిగా స్పందించవద్దు. మన బి.పి, షుగర్ కీళ్ళనొప్పులు, నిద్ర పట్టకపోవటం. నీరసం అంత రసవత్తరమైన విషయాలుకావు కదా. బాబోయ్.. ఎందుకు అడిగామా అనే పశ్చాత్తాపం వారికి కలిగించవద్దు.
కాలం మారింది, మారుతున్నది శరవేగంగా.. టెక్నాలజీ అన్నింటా చోటు చేసుకుంటున్నది. విమానంలో ప్రయాణించే వారికి ఎర్రబస్సులో సీటెలా పట్టుకోవాలో మనం చెబితే ఏం ప్రయోజనం.
పెద్దతనంలో మన పరువును కాపాడుకోవటం పూర్తిగా... పూర్తిగా మన చేతుల్లోనే ఉందని ఘంటాపథంగా చెప్పగలను.
అనవసరవిషయాల్లో జోక్యం చేసుకోకుండా మితభాషిగావుంటూ మన ఆర్థిక స్వాతంత్య్రం కోల్పోకుండా... ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ...జిహ్వచాపల్యం తగ్గించుకుని.అన్నింటికంటే ముఖ్యమైన విషయం నన్ను ఎవరూ గౌరవించటంలేదు అనే ఆత్మన్యూనతాభావం దరికి చేరకుండా జాగ్రత్తపడాలి...
భావం, బంధాలు, అంత తేలికగా తగ్గించుకోలేము. కనీసం కొన్ని విషయాలను వదిలివేద్దాం.
ప్రతీ విషయాన్నీ పాజిటివ్ గా చూడాలి. ఉద్యోగానికి పరిగెత్తాలనే హడావిడి లేదు. మొత్తం సంసారాన్ని లాగే బాధ్యతా లేదు. పిల్లలకి సహకరిస్తున్నామనే తృప్తి ఉండనే ఉంది.
హాయిగా పూజలు చేసుకోవచ్చు. భగవద్గీత, భాగవతం చదువుకోవచ్చు. పుణ్యమూ, పురుషార్థమూ కూడా సిధ్ధిస్తాయి.
రోజూ అనుకుందాం ఇలా...
I love my self.I respect my self.
మన ఆత్మవిశ్వాసాన్ని పెంచే మంత్రాలివి. చివరగా… మనం దిగవలసిన స్టేషన్ దగ్గరౌతూనే వుంది. సమయం దగ్గర పడుతూనే ఉంది.
మన బోగీలో ఉన్న మన తోటి ప్రయాణీకులతో తగువులు, మనస్పర్థలు, ఎత్తిపొడుపు మాటలు అవసరమా...
మనం దిగుతుంటే వారి ముఖాల్లో హమ్మయ్య. అనే భావం కనిపించాలో...లేక అయ్యో అప్పుడే వీళ్ల స్టేషన్ వచ్చేసిందా.. అనే భావం కనిపించాలో నిర్ణయం మన చేతిలోనే ఉంది.
*****
*అమ్మ" ఓపికకు మారు పేరు.
మనం ఎంత పెద్ద అయినా, అమ్మ మనకి ఎంత తెలిసినా ఇంకా ఇంకా అమ్మ మనల్ని ఆశ్చర్య పరుస్తూనే ఉంటుంది.
మనం ఎప్పటికి అమ్మలా ఆలోచించ గలుగుతాం అని నాకు అనిపించే క్షణాలు ఎన్నో!
నేను నా పిల్లలతో వున్న ప్రతి సారీ మా అమ్మ మాతో ఉన్నట్టు నా పిల్లలతో ఉన్నానా? అమ్మలా అన్ని చేస్తున్నానా? అని ఒకటికి పదిసార్లు ప్రశ్నించు కుంటాను.
ఒక్కసారీ తృప్తిగా నేను మా అమ్మ మాకు చేసినట్టు నా పిల్లలకి చేస్తున్నాను అని అనిపించదు. అమ్మ తో సరిసమానం కావటం కష్టం అని పోల్చి చూసుకోవటం మానేసాను.
చిన్నప్పుడు రాత్రి అందరి భోజనాలు అయ్యి మేము మంచాలు ఎక్కి రేడియో లో పాటలు వింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అమ్మ వంటింటిని మర్నాటి కోసం సిద్ధం చేసే పనిలో ఉండేది. స్టవ్ కడగటం, వంటిల్లు కడగటం, మంచినీళ్ల బిందెలు తోమటం ఇలా..అమ్మ పని చేస్తుంటే వెళ్లి సాయం చేయాలి అని తోచక పోగా అమ్మా త్వరగా రా, ఎంతసేపు పని చేస్తావ్ అని పిలిచేదాన్ని.
అమ్మ వస్తూనే నిద్ర పోయేది. అమ్మా నీకు నీరసం రాదా? రోజంతా పని చేస్తావు? అని అడిగితే అమ్మ స్టాండర్డ్ డైలాగ్ ఒకటి ఉండేది , "అమ్మని కదమ్మా ! నీరసం ఉండదు" అని.
అది విని చిన్నప్పుడు ఓహో అమ్మలకి నీరసం రాదేమో అనుకునేదాన్ని.
ఎక్కడకి అన్నా వెళ్లి వచ్చాకా కాళ్ళు నొప్పులు అని మేమంతా కూర్చుంటే అమ్మ చకచకా పనులు చేసేసేది. మళ్ళి నాది సేమ్ క్వశ్చన్, అమ్మ సేమ్ ఆన్సర్. ఇంక నేను ఫిక్స్ అయిపోయా 'అమ్మలకి నీరసం, కాళ్ళు నొప్పులు, విసుగు లాంటివి వుండవు అని.
అందుకే రాత్రి అందరం పడుకున్నాకా అమ్మ వీధి గుమ్మం తుడిచి నీళ్లు జల్లి ముగ్గులు పెడుతున్నా, బట్టలు ఉతికి ఎర్రటి ఎండలో మోకాళ్ళ నొప్పులతో మేడ ఎక్కి ఆరేసినా నాకు చీమ కుట్టినట్టు కూడా ఉండేది కాదు.
అమ్మ కి బోలెడు ఓపిక , అంత పిల్లలకి ఉండదు, కాబట్టి మనం ఎంత ఓపిక ఉంటే అంతే పని చేయాలి, ఓపిక లేక పోతే రెస్ట్ తీసుకోవచ్చు అనుకునేదాన్ని.
ఇప్పుడు 73 ఏళ్ల వయసులో కూడా మేడం చకచకా పనులు చేయటానికి ముందుకు ఉరుకు తుంది. అలసట ఉండదా అంటే 'అమ్మని కదమ్మా , పిల్లల కోసం చేస్తుంటే అలసట గా ఉండదు' అంటుంది.
మా అందరికి ఇష్టం అయినవి అడగాలే కానీ వంటింటిలోకి ప్రవేశించి ఎన్ని గంటలు అయినా విసుగు లేకుండా వండేస్తుంది. పైగా మేము చేస్తాం అంటే ' వద్దమ్మా , అలసి పోతారు అంటుంది.' ఇన్నేళ్లు వచ్చినా మేము పిల్లలమే అమ్మ కి.
పెళ్లి అయ్యి ఇన్నేళ్లు అవుతోంది , ఇప్పటికీ పచ్చళ్ళు, ఆవకాయలు, కారప్పొడులు, మెంతి పొడులు, చారు పొడి ఏవీ చేసుకోవాల్సిన అవసరం రాలేదు. నాకు రాదు అని అమ్మ గట్టిగా నమ్మి అన్నీ చేసి పంపిస్తుంటుంది.
అల్లం పచ్చడితో సహా అమ్మ చేయటం , నాన్న జాగ్రత్త గా ప్యాక్ చేసి పంపించటం. మేము వాటిని అందుకుని తిని అమ్మా సూపర్ అంటే ఆవిడ తృప్తి చూడాలి. పొరపాటున ఎప్పుడన్నా నేను చేసుకుంటాను, నువ్వు ఎందుకు కష్టపడటం అంటే, 'నీ మొహం నీకు రాదు, అయినా నీకు ఖాళీ ఎక్కడ ? అలసి పోతావ్ , అలాంటి పనులు పెట్టుకోకు ' అంటుంది.
అమ్మ కి అలసట ఉండదు ఇది ఇప్పటికీ అమ్మ చెప్పే సూత్రం.
ఆ సూత్రం అర్ధం ఏంటో నేను అమ్మ అయ్యాకా తెలిసింది. అమ్మ ని చూస్తే ఎక్కడ లేని నీరసం వచ్చి , కూర్చుని అమ్మతో పనులు చేయించుకుంటానా?’
మా పిల్లలిద్దరూ ఏమడిగినా ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది. వాళ్ళు అడిగింది చేసి పెట్టేదాకా నీరసం గుర్తు రాదు. ఇప్పుడు మా పిల్లలు అడుగుతారు 'అమ్మా నీకు నీరసంగా ఉండదా? అని.' నేను మా అమ్మ నాకు చెప్పిన డైలాగ్ వాళ్ళకి చెబుతాను. రేపు వాళ్ళు అమ్మలు అయ్యాకా దాని అర్ధం తెలుస్తుంది వాళ్ళకి.
తరం తరం నిరంతరం అమ్మకి నీరసం ఉండదు.
****
భారత దేశం లో మరెక్కడా లేని విధంగా అరుణాచలం లో మాత్రమే శివుడు నిండుగ నగలు ధరించి, పట్టు వస్త్రాలు ధరించి, కిరీటం పెట్టుకొని ఉంటాడు.. దానికి ఒక కారణం ఉంది.
#పార్వతి దేవి ఒకరోజున స్వామి వారు పక్కన కూర్చున్నపుడు స్వామి నుండి పునుగు వాసన వచ్చింది.. ఆ వాసన కి అమ్మవారు చాలా ప్రీతి చెందారు.
#అప్పుడు అమ్మవారు అడిగారు "మీ నుండి ఇంత సువాసన వస్తుంది మీకు పునుగు ఎక్కడ నుండి వచ్చింది" అని.. దానికి పరమేశ్వరుడు ఇలా చెప్పాడు.
#పార్వతి.. పునుగు పిల్లి యొక్క వాసన వల్ల ఋషుల భార్యలు పునుగు పిల్లి వెంట పడడం జరుగుతుంది అని ఋషులు ఏదో ఒకటి చేసి వాళ్ళ భార్యలని ఆ పునుగు పిల్లి నుండి రక్షించమని నను అడిగారు.. నేను సరే అన్నాను.
#ఇప్పుడు నేను పునిగు పిల్లి దగరకి వెళ్లి ఇలా అన్నాను "పులగా.. నీ నుండే వచ్చే ఆ సువాసన వల్ల రిషి పత్నులు ని వెంట పడడం జరుగుతుంది.. నువు వెంటనే ని ప్రాణాలని వదిలేయ్" అని అన్నాడు.
#దానికి అది సరే అని ఒక చిన్న కోరిక కోరుతుంది.. నా నుండి మరియు నా వంశం నుండి వచ్చేవి అన్నీ పునుగు పిల్లిలే.. వాటి నుండి వచ్చే సువాసనను నువు స్వీకరించాలి అని అడుగుతుంది.. అందుకు ఆయన అంగీకరిస్తాడు.
#అప్పటినుండి ఆయన తన వంటికి పులుగు అడ్డుకోవడంతో ఆ సువాసన కి అమ్మ వారు పరవశించి ఉండేది.
#అప్పుడు అమ్మవారు ఇలా అన్నారు.
#నువు ప్రతి చోట ఉన్నట్లు ఇక్కడ ఈ అరుణాచలం లో ఉండకూడదు.. ఒంటి నిండా నగలు వేసుకోవాలి.. పాములు ఏమి ఉండకూడదు.. నెత్తిన కిరీటం పెట్టుకోవాలి.. పట్టు పీతాంబరాలు చుట్టుకోవాలి.. ఒక్క మాటలో చెప్పాలి అంటే మన పెళ్ళి రోజున ఎలా ఉన్నావో అల ఉండాలి.. అంతే కాదు.. భక్తులు ఎవరైనా నిను కోరిక కోరితే అది వెంటనే నెరవేరి పోవాలి.
అని ఇలా ఈశ్వరుణ్ణి అడగడం జరిగింది.. అందుకే మనకి అరుణాచలం లో స్వామి వారు నిండుగ దర్శనం ఇస్తారు.🙏
🙏ఓం అరుణాచలా శివా 🙏
🙏 ఓం నమశ్శివాయ 🙏
******
* మీరు సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించాలంటే మీ జీవితంలోని వివిధ కోణాలని సరి చేసుకోవాలి అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలుపుతున్నది.
వివిధ కోణాలు అంటే శారీరకపరమైన కోణం, మానసికపరమైన కోణం,ఆర్థికపరమైన కోణం కుటుంబపరమైనటువంటి కోణం, సామాజికపరమైనటువంటి కోణం మరియు ఆధ్యాత్మికపరమైనటువంటి కోణం
ఈ కోణాలలో మీ జీవన శైలిని, మీ ఆలోచన విధానాన్ని Thought process మార్చుకున్నప్పుడు చాలా తక్కువ మందులతో చాలా తక్కువ ఖర్చుతో అనారోగ్యాలను శాశ్వతంగా జయించగలము అనేది సంపూర్ణ ఆరోగ్యం అనే పదానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అందిస్తున్నటువంటి నిర్వచనం.
ప్రస్తుతం మనం తీసుకుంటున్నటువంటి ట్రీట్మెంట్స్ ద్వారా శారీరక కోణం మాత్రమే సరి చేయబడుతున్నది. మిగతా కోణాలను అంతగా పరిగణలోకి తీసుకోవడం లేదు ప్రస్తుత డాక్టర్లు. అందువలన చిన్న చిన్న సమస్యలు కూడా దీర్ఘకాలం పాటు నిలబడి పోతున్నాయి అందులో ఒకటి ఒత్తిడి Stress.
అన్నీ కోణాలని పరిగణలోనికి తీసుకుంటూ అన్నీ కోణాలలో జీవనశైలిని మార్చుకుంటూ, ఆలోచన విధానాన్ని Thought process మార్చుకుంటూ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంటే ఎంతటి దీర్ఘకాలిక అనారోగ్యమైన శాశ్వతంగా తగ్గుతుంది.
దీని కొరకు మీకు సరిగ్గా సలహాలను అందించేటువంటి, సులువైనటువంటి ఆచరణ మార్గాన్ని నిర్దేశించే ఒక కోచ్/Mentor మీకు అవసరం.
మనకి స్కూళ్లు కాలేజీల్లో ఎలాగైతే టీచర్స్ ఉన్నారో ఎలాగైతే విద్యార్థులకు రకరకాల అంశాలను బోధిస్తూ చిన్న చిన్న లక్ష్యాలను ఏర్పాటు చేస్తూ క్రమక్రమంగా పెద్ద లక్ష్యాలను సాధించేలాగా ఎలాగైతే టీచర్స్ మనకి సహకరిస్తున్నారో అలానే మన ఆరోగ్య విషయంలో కూడా మనకి చిన్న చిన్న లక్ష్యాలను Small goals
ఏర్పాటు చేస్తూ పెద్ద లక్ష్యాన్ని సాధించే దిశగా నిరంతరం సపోర్ట్ అందిస్తూ ఉండేటువంటి ఒక ప్రొఫెషనల్ పర్సన్ హెల్త్ కోచ్.
ఇదంతా కూడా చాలా పెద్ద ప్రాసెస్ లా అనిపిస్తుంది కదూ…?
అయితే నేను మీకు ఇలా చెప్తే ఎలా ఉంటుంది. మీరు కన్సిస్టెంట్ Consistent గా మీ జీవన శైలిని, ఆలోచన విధానాన్ని మార్చుకుంటూ అతి తక్కువ సమయంలో సంపూర్ణ ఆరోగ్యం Holistic Wellness ను పొందేటువంటి దిశగా ఎటువంటి డివియేషన్స్ లేకుండా 90 నిమిషాలలోనే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోగలిగితే ఎలా ఉంటుంది అది కూడా అనుభవం కలిగినటువంటి హెల్త్ కోచ్ ద్వారా నేర్చుకోవటం అనేది.
90 నిమిషాలలో మీ Migraine (దీర్ఘకాల తలనొప్పి),overthinking,anxiety,depression,Stress ని తగ్గించు కోవచ్చు అది కూడా ఎటువంటి శ్రమ లేకుండా, మెడిటేషన్ లేకుండా, ఆహార నియమాలు లేకుండా ,మెడిసిన్స్ లేకుండా
సరైన అవగాహన ద్వారాఆలోచన విధానాన్ని జీవితంలో రకరకాల కోణాలలో మార్చుకోవటం ద్వారా దీర్ఘకాలిక లేకుండా 90 నిమిషాలలోనే ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోగలిగితే ఎలా ఉంటుంది అది కూడా అనుభవం కలిగినటువంటి హెల్త్ కోచ్ ద్వారా నేర్చుకోవటం అనేది.
90 నిమిషాలలో మీ overthinking,anxiety,depression,Stress ని తగ్గించు కోవచ్చు అది కూడా ఎటువంటి శ్రమ లేకుండా, మెడిటేషన్ లేకుండా, ఆహార నియమాలు లేకుండా ,మెడిసిన్స్ లేకుండా
సరైన అవగాహన ద్వారాఆలోచన విధానాన్ని జీవితంలో రకరకాల కోణాలలో మార్చుకోవటం ద్వారా దీర్ఘకాలిక అనారోగ్యాలను శాశ్వతంగా మనం జయించవచ్చు.
[6:28 am, 7/1/2025] Mallapragada Sridevi:
*****
*హనుమంతుని సింధూర లేపనం
శ్రీ రామ పాద సేవా దురంధరుడు, రామ భక్తీ సామ్రాజ్యాధిపతి అయిన శ్రీ హనుమంతుడు అయోధ్యలో శ్రీ రామ పట్టాభిషేకాన్ని పరమ వైభవంగా జరి పించాడు. రామ ప్రభువు సీతామాతను ప్రేమించినంతగా తనను ప్రేమించటం లేదని తనను దూరంగా ఉంచుతున్నాడని మనసులో భావించాడు. రాత్రి వేళల్లో తనను అసలు రాముని వద్ద ఉండనివ్వటం లేదు. తనను ఎందుకు ఉపేక్ష చేస్తున్నారో అర్ధంకావటం లేదు. తన కంటే సీతామాతలో అధికంగా ఏముంది? ఆమెనే అంత ఆత్మీయంగా దగ్గరే ఉంచుకోవటానికి కారణమేమిటో ఆ ఆజన్మబ్రహ్మచారికి ఏమీ తెలియక తల్లడిల్లుతున్నాడు. జానకీ దేవి పాపిడిలో యెర్రని సిందూరపు బొట్టు కనిపిస్తోంది. ఆ యెర్రబొట్టుకు రాముడు ఆకర్షితుడయ్యాడేమోనని అనుమానం వచ్చింది. ఆ సింధూరమే తన కొంపముంచి శ్రీరాముడిని సీతాదేవికి అతి సమీపంగా ఉంచుతోందని భ్రమపడ్డాడు. శ్రీ రామ విరహాన్ని ఒక క్షణం కూడా సహించలేని దుర్భర వేదనకు గురి అయ్యాడు. దీని సంగతేమిటో తేల్చుకోవాలని శ్రీ రాముడి దగ్గరకే, వెళ్లి చేతులు జోడించి "రామయ్య తండ్రీ! మా తల్లి సీతా మాత శిరస్సు మీద ఉన్న పాపిట లో సింధూరం ఉంది. దానికి కారణం ఏమిటో వివరించండి'' అని ప్రార్ధించాడు .
�శ్రీ రామప్రభువు చిరునవ్వు నవ్వి, భక్త హనుమాన్ ను సమీపానికి రమ్మని "భక్తా ఆంజనేయా! సీతా దేవి నుదుట సింధూర బొట్టు పెట్టుకోవటానికి కారణం ఉంది. శివ ధనుర్భంగం చేసి, జానకిని వివాహ మాడిన శుభ సమయంలో ఆమె పాపిట మీద సింధూరాన్ని నేను ఉంచాను. అప్పటి నుండి ఆమె సింధూరాన్ని పాపిటలో ధరిస్తోంది. దాని వల్ల నేను సీతకు వశుడను అయ్యాను. మా ఇద్దరి మధ్య ఉన్న అన్యోన్యతకు సింధూరమే కారణం'' అని వివరించి చెప్పాడు .�ఆంజనేయుడు శ్రీ రాముడు చెప్పిన మాటలన్నీ శ్రద్ధగా విన్నాడు. ఇక ఆలస్యం చెయ్య లేదు. వెంటనే వర్తకుడి దగ్గరకు వెళ్లి గంధ సింధూరాన్ని తీసుకొని, నువ్వుల నూనెతో కలిపి, తన ఒళ్లంతా పూసేసుకొన్నాడు. ఇలా చేస్తే ఆ సింధూరం ప్రభావం వల్ల తన రాముడు మళ్ళీ తన వశం అవుతాడని భావించాడు. వెంటనే హుటాహుటిన శ్రీ రామ దర్శనం చేసి నమస్కరించి "ప్రభూసీతారామా! చిటికెడు సింధూరానికే సీతామాతకు వశమైపోయావు. మరి ఇప్పుడు నేను ఒళ్లంతా సింధూరం పూసుకొన్నాను. మరి నాకు మీరు ఎప్పుడూ వశులై ఉంటారు కదా?''అని అమాయకంగా అయినా మనసులోని మాటను ధైర్యంగానే చెప్పాడు. సీతా రాముడు నవ్వి ఆనందం తో ''హనుమా! ఈ రోజు మంగళ వారం. నాకు ప్రీతీ కలిగించాలని శరీరం అంతా సింధూరాన్ని ధరించావు కనుక, నీకు మంగళవారం భక్తీతో గంధ, సింధూరంతో పూజ చేసి, దాన్ని నుదుట ధరించిన భక్తులకు అన్ని శుభాలను నీవు అందజేస్తావు. ఈ వరాన్ని నేను నీకు అనుగ్రహించిన వరంగా గ్రహించు.'' అని హనుమకు మనశ్శాంతిని చేకూర్చాడు. అప్పటి నుండి శ్రీ హనుమంతునికి మంగళవారం నాడు గంధ, సింధూరంతో పూజ చేసి దానిని నువ్వుల నూనెతో కలిపి నుదుట బొట్టు పెట్టుకొనే ఆచారం లోకంలో ప్రారంభమైంది. ఆంజనేయ విగ్రహానికి నువ్వుల నూనెతో కలిపిన లేపనాన్ని శరీరం అంతా పూసి ఉంచటం మొదలైంది. అభిషేకం చేసిన తర్వాతా ఈ లేపనాన్ని పూస్తారు. సిందూర పూజ హనుమకు అత్యంత ప్రీతీకరం. అందులోను మంగళవారం రోజున మరీ ఇష్టం. ఇదీ సింధూరం కధా విశేషం.
శ్రీరామ జయరామ జయ జయ రామ
*******
*గాలి బుడగ జీవితం అంటే ఇదే!
శ్వాస రూపంలో మనం తీసుకున్న వాయువు నాసికా రంధ్రాల గుండా ప్రవేశించగానే ఐదు భాగాలుగా విడిపోయి.
1. ప్రాణము 2. అపానము 3. వ్యానము 4. ఉదానము 5. సమానము అను ఐదు ప్రాణములుగా మారిపోతుంది.
1.ప్రాణము:- అనంతాకాశంలో నుంచి ఎవరి శక్తి మేరకు వారు లోనికి తీసుకొని వాయువు.
2. అపాన వాయువు:- బయటికి వస్తున్న వాయువును అపాన వాయువు అని అంటారు. ఈ వాయు సహాయంతోనే మల మూత్ర విసర్జనలే కాక శరీరంలోని సమస్త మాలిన్యాలను బయటకు నెట్టబడుతున్నాయి.
3. వ్యాన వాయువు:- మన శరీరానికి మానవాకృతి నివ్వడానికి సహకరించే వాయువు. ఈ వాయువు యొక్క దోషం వల్ల అంగవైకల్యం, మానసిక ఎదుగుదల లోపం, శారీరక ఎదుగుదల లోపం (మరుగుజ్జుతనం) ప్రాప్తించును.
4. ఉదాన వాయువు:- దీని సహాయంతో మనం మాట్లాడగలుగుతున్నాము. దీని లోపం వల్ల నత్తి, నంగి, ముద్ద మాటలు, బొంగురు గొంతు సమస్యలు కలుగును.
5. సమాన వాయువు:- దీని సహాయంతోనే మనం తీసుకున్న ఆహారం శక్తిగా మారి ఏ ఏ భాగానికి ఎంతెంత శక్తి పంపిణీ చేయాలో అంతంత పంపి సమతుల్యాన్ని కలుగజేస్తుంది. దీని లోపం వల్ల శరీరం తూలి పడటం సంభవించును.
శ్వాస - చక్రాలు:-
ఈ శ్వాస ప్రతిరోజు ఉదయము సరిగ్గా 6 గంటలకు మొదలై
➡️ మూలాధార చక్రము నందు - 600 సార్లు
➡️ స్వాధిష్ఠాన చక్రము నందు - 6000 సార్లు
➡️ మణిపూరక చక్రము నందు - 6000సార్లు
➡️ అనాహత చక్రము నందు - 6000 సార్లు
➡️ విశుద్ధి చక్రము నందు - 1000 సార్లు
➡️ ఆజ్ఞా చక్రము నందు - 1000 సార్లు
➡️ సహస్రారము నందు - 1000 సార్లు
అనగా, రోజుకు 21600 సార్లు పయనిస్తోంది.
శ్వాస - అంగుళాలు:-
సాధారణంగా శ్వాసను సాధకుడు 12 అంగుళాలు వదులుతాడు. శ్వాసను ఎవరైతే లోతుగా - నిదానంగా - దీర్ఘంగా తీసుకొని దానిపై దృష్టి ఉంచి విడవటం చేస్తుంటే శ్వాస యొక్క అంగుళాలు తగ్గును.
➡️ శ్వాసను 11 అంగుళాలకు కుదిస్తే - ప్రాణం స్థిరమవుతుంది.
➡️ శ్వాసను 10 అంగుళాలకు కుదిస్తే - మహాకవి అవుతాడు.
➡️ శ్వాసను 9 అంగుళాలకు కుదిస్తే - బ్రహ్మానందం కలుగుతుంది.
➡️ శ్వాసను 8 అంగుళాలకు కుదిస్తే - దూరదృష్టి కలుగును.
➡️ శ్వాసను 6 అంగుళాలకు కుదిస్తే - ఆకాశగమనం చేయగలుగుతాడు.
➡️ శ్వాసను 4 అంగుళాలకు కుదిస్తే - సర్వ సిద్ధులు ప్రాప్తిస్తాయి.
➡️ శ్వాసను 2 అంగుళాలకు కుదిస్తే - కావలసిన రూపం ధరించిగలుగుతాడు.
➡️ శ్వాసను 1 అంగుళానికి కుదిస్తే - అదృశ్యం అవ్వగలరు.
మరింత సాధన చేయగా శ్వాస అవసరమే వారికి ఉండదు. అలాంటి వారు అమరులు అవుతారు.
శ్వాస - సాధన:-
సుఖంగా ఉండే పద్ధతిలో కూర్చొని, మృదువుగా కళ్లుమూసుకుని, మన నాశికా రంధ్రాల ద్వారా లోపలికి ప్రవేశించిన శ్వాస తిరిగి అదే నాశికా రంధ్రాల ద్వారా బయటకు వెళ్లడాన్ని గమనిస్తుండాలి. ఇలా చేయగా, చేయగా మనస్సు యొక్క పరుగు క్రమేపీ తగ్గి క్రమక్రమంగా ఆగిపోతుంది. అప్పుడు బ్రహ్మరంధ్రం ద్వారా అనంతమైన విశ్వమయప్రాణశక్తి లభ్యమౌతుంది.
మరి ఇంతటి శక్తివంతమైన శ్వాసకు సంబంధించిన సాధన చేసుకునేందుకు మనము ఏ హిమాలయాలకు, ఏ అరణ్యాలకు వెళ్ళి పోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉంటూ, ఎలా ఉన్న వాళ్ళు అలాగే ఉంటూ, మనం చేసే పనులు ఏవి మానుకోకుండానే, ఖాళీగా ఉన్న సమయంలో ఈ అద్భుత సాధన సులువుగా చేసుకోవచ్చు. దీనిని చిన్న పిల్లల (5 సం"ల) నుండి ముసలి వారి దాకా ఎవరైనా చేయవచ్చును.
84 లక్షల జన్మల తరువాత లభ్యమైన ఈ మానవ జీవితమును వృధా చేయకుండా, వివేకవంతులముగా దీనిని సద్వినియోగపరచుకోగలరు.💐
శ్వాస - సృష్టి వయస్సు:-
మనము రోజుకు తీసుకునే శ్వాసలను (21600) రెట్టింపు చేసి ఒక సున్నను చేర్చిన
➡️ కలియుగం - 4,32,000 సంవత్సరాలు.
➡️ రెట్టింపు చేసిన ద్వాపర యుగం - 8,64,000 సంవత్సరాలు.
➡️ మూడు రెట్లు చేసిన త్రేతా యుగము- 12,96,000 సంవత్సరాలు.
➡️ నాలుగు రెట్లు చేసిన కృత యుగము - 17,28,000 సంవత్సరాలు.
➡️ పది రెట్లు చేసిన చతుర్ యుగము ( కలి+ద్వాపర+త్రేతా+ కృతయుగములు) - 43,20,000 సంవత్సరాలు.
*****
* బ్రహ్మ దేవుడు పంచభూతాలను పిలిచి ఒక్కో వరం కోరుకోమన్నాడు.
వరం కోసం తొందర పడిన ఆకాశం అందరికంటే పైన ఉండాలని కోరింది.
ఎవరికీ అందనంత ఎత్తులో నిలిపాడు బ్రహ్మ. ఆకాశం మీద కూర్చునే వరాన్ని సూర్యుడు కోరడంతో నేటికీ ఆకాశం మీద విహరిస్తున్నాడు.
వారిద్దరి మీద ఆధిపత్యం చేసే వరమడిగిన జలం మేఘాల రూపంలో మారి ఆకాశం మీద పెత్తనం చలాయిస్తూనే కొన్నిసార్లు సూర్యుడుని కప్పేస్తుంది.
పై ముగ్గురినీ జయించే శక్తిని వాయువు కోరడంతో పెనుగాలులు వీచినప్పుడు రేగే దుమ్ము ధూళికి మేఘాలు పటాపంచలవడం, సూర్యుడు, ఆకాశం కనుమరుగవడం జరుగుతాయి.
చివరివరకు సహనంగా వేచి చూసింది భూదేవి. పై నలుగురూ నాకు సేవ చేయాలని కోరడంతో బ్రహ్మ అనుగ్రహించాడు.
అప్పటినుండి ఆకాశం భూదేవికి గొడుగు పడుతోంది. వేడి, వెలుగు ఇస్తున్నాడు సూర్యుడు. వర్షం కురిపించి చల్లబరుస్తోంది జలం. సమస్త జీవకోటికీ ప్రాణవాయువు అందిస్తున్నాడు వాయువు.
సహనంతో మెలిగి వరం కోరిన భూదేవికి మిగతా భూతాలు సేవకులయ్యాయి.
సహనవంతులు అద్భుత ఫలితాలు పొందగలరని నిరూపించడానికి ఈ కథ చాలు. సహనానికి ప్రతిరూపం స్త్రీ. అందుకే భూదేవిని ఓర్పు, సహనాలకు ప్రతిరూపంగా చెప్పారు పెద్దలు.
సహనం అంటే నిగ్రహం పాటించడం. కష్టాల్లో ఉన్నప్పుడు ఉద్వేగాన్ని దాటవేయడం లేదా వాయిదా వేయడం. బాధను అధిగమించడమే సహనం. సహనంగా ఆలోచించే వారికి సమస్యలు దూరమవుతాయి.
కొన్ని సార్లు ఏదైనా పెద్ద సమస్య ఎదురైతే చావు వైపు నడిచే బదులు సహనంగా ఆలోచిస్తే పరిష్కారం కనిపిస్తుంది.
సరైన ఆలోచన కలగనప్పుడు అనుభవజ్ఞుల్ని ఆశ్రయిస్తే పరిష్కారం దొరుకుతుంది..
ఎవరన్నా పాడి
******
*మంగళవారం మంచిదేనా..??
వెనుకటి కాలంలో ఓ గురుకులంలో తన శిష్యులు ఏవో కొంటె పనులు చేస్తుంటే.. పనికిమాలిన ఏ పనులు చెయ్యకండర్రా వెధవల్లారా మంగళవారం నాడు.. ఆ గురువుకి తరచుగా ఏ వారం ఐతే ఆ వారం పేరు అంటుండటం ఓ అలవాటు.
👉 ఆ నలుగురు శిష్యులకి.. ఏ పనులు.. అనగానే మంచి పనులు కూడా మంగళవారం చెయ్యరాదని అర్ధం అయ్యింది. ఇది కాస్తా పదిమందికీ తెలియడంతో మంగళవారం మంచి పనులు చేయకూడదన్న ఓ తప్పుడు భావన అందరి జనాల్లో స్థిరపడిపోయింది.
👉 హనుమంతుడి ఆరాధన వలన కార్యసిద్ధి కలుగుతుందనీ, అనారోగ్యాలు దూరమవుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. హిందూ మతంలో హనుమాన్ చాలీసాకి ప్రత్యేక స్థానం ఉంది.
👉 హనుమాన్ చాలీసా పఠనం వల్ల, హనుమంతుడ్ని మెప్పించి ఆయన దీవెనలు పొందవచ్చని అంటారు. హనుమాన్ చాలీసా చదవటం వల్ల శనిప్రభావం కూడా పోతుంది.
👉 శాస్త్రం ప్రకారం.. మంగళవారం చాలా మంచి రోజు.. శుభప్రదమైన మంగళప్రదమైన వారం. ఆంజనేయ స్వామికి, అమ్మవారు దేవతలకి అత్యంత ప్రీతికరమైన వారం ఈ మంగళవారం. అందుకే ఆలయాలలో మంగళవారం నాడు భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
👉 మంగళవారం మారు కోరుతుంది.. మారు జరుగుతుంది అంటారు. సౌభాగ్యానికి ప్రతీకగా నిలిచిన ఏదైనా కొంటే.. చీరలు, నగలు, అలంకరణ సామగ్రి వంటివి.. ఆ తరువాత కూడా మరోమారు ప్రాప్తిస్తాయి అని విశ్వసిస్తారు కొందరు. మంగళవారం మారు కోరుతుంది కాబట్టి మంగళవారం రోజు అప్పులు తీసుకోకూడదు అని చెబుతుంటారు.
👉 మంచి మనసుతో మంచి పని ఎప్పుడైనా ఏ వారం నాడైనా చేయవచ్చు. మంగళవారం మంచిదికాదని ఏ గురువు చెప్పలేదు.. ఏ పురాణం లోనూ లేదు. కొన్ని విదేశాల్లో ముఖ్యమైన పనులు మంగళవారమే మొదలుపెడతారు.
మంగళవారం మంగళప్రదం శుభప్రదం జయప్రదం.🙏
*
******
*ప్రపంచంలో అత్యంత సుందరమైన...శ్రీనివాసుడి విగ్రహం...!!
🌿 విగ్రహాలలో ఒకటైన 11 అడుగుల మూలవిరాట్టు మహారాష్ట్ర లోని మెహకర్ లో ఉంది .
🌸 1888 లో బ్రిటిష్ వారు దీనిని ఎలాగైనా ఇంగ్లాండ్ తీసుకుని పోదామని శతవిధాలా ప్రయత్నించారు .
🌿అడ్డుకున్న 60 మంది గ్రామస్థులను జైలులో వేసి చిత్రహింసలు పెట్టారు . ఆ రోజుల్లో హిందువులు ధర్మ పరిరక్షణ కోసం పోరాడేవారు .
🌸చివరికి గ్రామస్థుల ఆందోళనలకు తలొగ్గి ఆ దేవాలయం జోలికి పోకుండా ఊరుకున్నారు . ఈ విగ్రహం కిరీటం లో మరో విష్ణు మూర్తి విగ్రహం చెక్కడం విశేషం .
ఈ ఫోటో ని ఓపెన్ చేసి చూడండి పూర్తి విగ్రహం కనబడుతుంది
ప్రపంచంలో అత్యంత సుందరమైన శ్రీనివాసుడి విగ్రహాలలో
ఒకటైన 11 అడుగుల మూలవిరాట్టు మహారాష్ట్ర లోని మెహకర్ లో ఉంది .
🌸 1888 లో బ్రిటిష్ వారు దీనిని ఎలాగైనా ఇంగ్లాండ్ తీసుకుని పోదామని శతవిధాలా ప్రయత్నించారు .
🌹అడ్డుకున్న 60 మంది గ్రామస్థులను జైలులో వేసి చిత్రహింసలు పెట్టారు . ఆ రోజుల్లో హిందువులు ధర్మ పరిరక్షణ కోసం పోరాడేవారు . చివరికి గ్రామస్థుల ఆందోళనలకు తలొగ్గి ఆ దేవాలయం జోలికి పోకుండా ఊరుకున్నారు .
🌿ఈ విగ్రహం కిరీటం లో
మరో విష్ణు మూర్తి విగ్రహం చెక్కడం విశేషం .ఈ ఫోటో ని ఓపెన్ చేసి చూడండి పూర్తి విగ్రహం కనబడుతుంది...🌞🙏🌹🎻
******
అంతర్యామి 🔱
*# పూలను ప్రేమించు!*సృష్టిలో అత్యంత విలువైనవి పువ్వులు. పరిమళాలతో స్వాగతం పలికే స్వభావం వాటి సొంతం. మనసులకు, పూలకు అవినాభావ సంబంధం ఉంది. పూల నైజం ఎలాంటిదో మనసుల తత్వమూ అలాంటిదే అని భావుకులు నమ్ముతారు. పూలంటే కవులకు ఎనలేని ప్రేమ. దీనికి కారణం పూలకు, కవుల మనసులకు సామ్యమే. పూలలాగే కవుల భావాలు మృదువుగా ఉంటాయి. వారు చెప్పే తీరులో ఆకర్షణ ఉంటుoది. పారిజాతాపహరణం, ఆముక్తమాల్యద వంటి రమణీయ కావ్యాలు పూల సొగసులను వేనోళ్ల కొనియాడాయి. ప్రియసఖి కోరిక తీర్చడానికి కృష్ణుడు స్వర్గలోకానికి వెళ్లి పారిజాత పుష్పాన్ని తెచ్చాడు. పూలను ప్రేమించడం వల్ల వాటి సౌకుమార్యం మనకు అలవడుతుంది. మనుషులు ఎలాంటివారిని ఇష్టపడతారో అలాంటివారి గుణాలే సంక్రమిస్తాయి. సహవాసం వల్ల కలిగే పర్యవసానం ఇది. పరుల కోసమే జీవితాన్ని అర్పించే త్యాగగుణాన్ని సొంతం చేసుకున్న పూలను భగవంతుడు ఇష్టపడతాడు. ఆపాదమస్తకం దేవతలను పూలమాలలతో అలంకరించి, పూజించడం భక్తులకు ఆనందం.
🍁మల్లిక, మాలతి, చేమంతి, జాజి, మందారం, పారిజాతం, కుందం, ఉత్పలం, చంపకం, కరవీరం, గులాబీ మొదలైన ఎన్నోరకాల పూలున్నాయి. కొన్ని అందంగా కనబడినా, వాసన లేకపోవడం వల్ల వాటిని ఎవరూ అంతగా ఇష్టపడరు. అలాంటి పూలలో కర్ణికారం(కొండగోగు) ఒకటి. కాళిదాసు కుమారసంభవ కావ్యంలో వసంతంలో పూసిన పూలను వర్ణిస్తాడు. ఆ సందర్భంలో కొండగోగు పువ్వు గురించి- 'మంచి రంగుతో ఆకర్షిస్తున్నప్పటికి' దీన్ని స్త్రీలు ధరించరు. ఎంత అందంగా ఉన్నా పరిమళాలు లేకపోతే పూలకు విలువలేదు.
🍁బ్రహ్మదేవుడు ఈ కొండగోగు పువ్వును సృష్టించే సమయంలో ఏకాగ్రతను కోల్పోయినట్లున్నాడు. అందుకే పువ్వును అందంగా మలిచినా, దానికి పరిమళాలు అద్దడం మరిచిపోయాడు' అని ఎంతో చమత్కారంగా అంటాడు. కొండగోగు పువ్వు మరొక సందేశం కూడా ఇస్తోంది- 'మనుషులు ఎంతందంగా ఉన్నా, మంచిగుణాలనే సుగంధాలు లేకపోతే వారికి విలువ ఉండదు' అని! స్త్రీలకు, పూలకు ఆన్యోన్య సంబంధం ఉంది. భవభూతి మహాకవి తన ఉత్తర రామచరిత నాటకంలో 'స్త్రీల మనసులు సుమాలవలే సుకుమారాలు' అని వర్ణించాడు. వారిని పూజ్యభావంతో చూడాలని పెద్దల ఉపదేశం. స్త్రీలను బాధ పెడితే దేవతలకు కోపం వస్తుందని, అలాంటి కఠిన హృదయులను దేవుడు క్షమించడని, వారి ఇళ్లలో లక్ష్మీదేవి నిలువలేదనీ స్మృతులు చెబుతున్నాయి.
🍁పదకవితా పితామహుడి నుంచి ఆధునిక మహాకవి వరకు అక్షర హాలికులెందరో అందమైన కవన పుష్పాల సాగు చేశారు. 'తిరువేంకటాద్రిపై దిరమై నిలిచినట్టి తుమ్మెదరో/ పరమయోగుల పూలబరిమళములుగొన్న తుమ్మెదరో' అన్న అన్నమయ్య భావన ఉదాత్తమైనది. 'దేశమనియెడి దొడ్డ వృక్షం/ ప్రేమలను పూలెత్తవలెనోయి' అన్న గురజాడ వాక్కు సదా స్మరణీయమైనది... ఆచరణీయమైనది. పూలను ప్రేమించి, పూలతో ఇష్టదైవాలను పూజించి, అలంకరణలుగా ధరించేవారికి అష్టశ్వర్యాలు ఇంట్లోనే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.🙏
******
*ఋణానుబంధ రూపేణా…!
పూర్వము ఒక గ్రామములో దంపతులు నివసించుచుండిరి. వారు ఎంతో అన్యోన్యముగా జీవనము సాగించుచుండిరి.
ఎందువల్లో గాని ఆ దంపతులకు చాలాకాలము వరకు సంతానము కలుగలేదు. కన్న బిడ్డలు నట్టింట తిరుగుచుండగ తమ గృహము కళకళలాడవలెనని వారు ఆశించుచుండిరి.
సంతాన ప్రాప్తికై వారు ఎన్నియో పూజలు, నోములు నిర్వహించిరి. పూజా ఫల విశేషముగా కొంతకాలమునకు గృహస్థు భార్య గర్భవతి అయ్యెను. నెలలు నిండగనే ఆమెకు పండంటి మగ కవలపిల్లలు జన్మించిరి.అందులకు దంపతులు ఎంతగానో ఆనందించసాగిరి.
జంతువుల మనోభావములను, పసి పిల్లల భావములను తెల్సుకొనగల జ్ఞానమును భర్త కలిగియుండెను.
ఆ కవలపిల్లలు ఊయలలో పరుండియుండగా వారి మనోభావములను తెలుసుకొనదలంచి తండ్రి వారికి సమీపముగ వచ్చి కూర్చుని వారిని తదేకదృష్టితో వీక్షించసాగెను.
అందులో మొదటి పిల్లవాడు మనస్సులో ఈ విధముగా అనుకొనుచుండెను - "పూర్వజన్మమున నాకు ఈ ఇంటి యజమాని రెండు రూపాయలు బాకీ తీర్చవలసియున్నది. ఆ ఋణము తీరినవెంటనే నాకు ఇక్కడినుండి విముక్తి లభించును."
రెండవ పిల్లవాడు ఈ ప్రకారముగా మనస్సు నందు భావించుచుండెను… "నేను పూర్వజన్మమున ఈ గృహ యజమానురాలికి వందరూపాయలు బాకీపడియుంటిని. ఈ జన్మలో దానిని తీర్చిన తదుపరి నాకు వీరితో గల సంబంధము విడిపోవును."
వారిరువురి మనోభావములను గ్రహించిన తండ్రి - 'ఆహా! ఋణానుబంధము వలననే భార్యాసుతులు ఏర్పడుచుందురు గదా! లేకలేక మాకు జన్మించిన వీరు ఇక ఎంతకాలము మా ఇంట ఉందురో' అని తలంచుకొని చింతించసాగెను. అయినను ఈ విషయము భార్యకు తెలుపకుండ రహస్యముగ ఉంచదలచెను.
పిదప అతడు "నీవు నేరుగా మన పిల్లలకు పైకము ఇవ్వకు. మరియు వారి వద్దనుండి నేరుగా తీసుకొనకు" అని భార్యను హెచ్చరించెను.
భర్త మాటలయొక్క అంతరార్థమేమియు బోధపడకున్నను భార్య 'సరే' అనెను.
తదుపరి ఆ ఇద్దరి పసిబిడ్డలకు ఆముదము పెట్టుటకు రెండు, రెండు రూపాయలతో రెండు వేర్వేరు సీసాలలో ఆముదము తెప్పించిరి. కొన్ని రోజులకు ఆ సీసాలలోని ఆముదము పూర్తిగా పిల్లలకు వినియోగింపబడినది.
మొదటి పిల్లవాని రెండు రూపాయలు బాకీ తీరగానే అతడు మృతినొందెను. అది గాంచి తల్లి హృదయ విదారకముగా ఏడ్వసాగెను.
మరణించిన పిల్లవానిని చూచి తండ్రి, 'ఆహా! విధి ఎంత బలీయమైనది కదా!' అని అనుకొని, జీవించియున్న రెండవ పిల్లవానిని చూచియైనను ఊరడిల్లు మని భార్యను ఓదార్చెను.
రెండవవాడు సద్గుణములు అలవరచుకొని విద్యాబుద్ధులు నేర్చుకొని తల్లిదండ్రులకు అత్యంత ఇష్టుడయ్యెను. పెరిగి పెద్దవాడైన అతడు గోవులను మేపుచు సంపాదించినదానిలో రోజూ కొంత పైకమును ఒక డబ్బాలో నిలువచేయసాగెను.
ఒకనాటి సాయంకాలము వారు ఉన్న పెంకు టిల్లు తగలబడిపోవుచుండెను. అది చూచిన ఆ పిల్లవాడు పరుగిడుచు పోయి తాను పైకమును - దాచిన డబ్బాను కొనివచ్చి ద్వారము వెలుపలగల తల్లికి ఒసంగెను. మరుక్షణమే సగముకాలిపోయిన దూలము విరిగి సరిగ్గా ఆ బాలుని పై పడెను. వెంటనే అతడు మరణించెను.
ఆ దుర్ఘటనను చూచి తల్లిదండ్రులు నిర్ఘాంతపోయిరి. ఉన్న ఒక్క కుమారుడుకూడ దూరమై పోయినందులకు తల్లి యొక్క బాధ చెప్పనలవి కాకుండెను. బాలునియొక్క ఋణవిషయము తండ్రికి స్మృతికి వచ్చెను.
ఆ డబ్బాలోని పైకము లెక్కచూడగా ఖచ్చిత ముగ అందు రు.100/-లు ఉండెను.
ఆనాడు తాను గ్రహించిన సంగతులను భార్యకు తెలియజేసి, "ఋణానుబంధము వలననే బంధువులు, మిత్రులు, పుత్రులు మొదలగు వారితో కలయిక ఏర్పడును. మరియు ఆ ఋణములు తీరగనే ఎవరిదారి వారు వెడలెదరు" అని చెప్పి భర్త ఆమెను సము దాయించెను.
కల్సియున్న కొద్ది రోజులలో వారిపై మమకారము పెంచుకొనుట అవివేకమగును. ఋణానుబంధము తీరిపోయిన పిమ్మట లోకములో ఏదియై నను మనచెంత నుండదు. కనుక మన ధర్మమును మనము సక్రమముగా నెరవేర్చుచు దైవేచ్ఛపై ఆధారపడియుండవలెనని ఆ దంపతులు గ్రహించిరి. శేషజీవితమును ధర్మాచరణ యందు, దైవకార్య నిర్వహణము నందు గడపి వారు తమజన్మలను సార్థకం చేసుకొనిరి.
నీతి:
ఋణానుబంధము వలన, కర్మబంధము వలన లోకములో మనుజునకు, భార్యాపుత్రబంధుమిత్రాదులు ఏర్పడుచుందురు. సమయము ఆసన్నమైనపుడు ఎవరి మార్గమున వారు వెడలిపోవుదురు. కనుక జనులు, బంధ్వాదులపై అనురాగమమకారాలను పెంచుకొనరాదు.
శరీరము శాశ్వతముకాదని అది ఏనాటికైనను నశించిపోవును అను సత్యమును గుర్తెఱిగి మనుజుడు ధర్మప్రవర్తన కలవాడై, భగవంతుని యెడల అకుంఠిత విశ్వాసము, భక్తిని పెంపొందించుకొని కృతకృత్యుడు కావలెను.✍️
*****
ఒక ఊర్లో మంచి పేరు ప్రతిష్టలు కలిగిన పండితుడు ఒకాయన ఉండేవాడు. చాలా చక్కని వాక్పటిమ గలవాడు. ఆయన ఆలయం ఆవరణలో కూర్చొని ప్రవచనం చెబుతూ వుంటే వేలమంది జనం అలా కదలకుండా బొమ్మల్లా వింటూ ఉండిపోయేవాళ్ళు. ఆయన ప్రఖ్యాతి చుట్టుపక్కల చాలా గ్రామాల్లో వ్యాపించింది.
ఒకసారి ఆయన ప్రవచనం నిమిత్తం పొరుగూరు వెళ్ళవలసి వచ్చింది. ఆ ఊరు వెళ్ళే బస్సు ఎక్కి టికెట్ తీసుకున్నాడు. అయితే పొరపాటున బస్సు కండక్టర్ పది రూపాయలు ఎక్కువ ఇచ్చాడు. పండితుడు అది గమనించి తిరిగి ఇవ్వాలని యోచించాడు. కానీ బస్సు నిండా జనం కిక్కిరిసి ఉండటంతో, దిగేటప్పుడు ఇద్దాంలే అనుకుని కూర్చున్నాడు.
కొద్ది సేపు తరువాత అతని మనసులొ ఆలోచనలు మారాయి. 'ఆ కండక్టరు కూడా ఎంతమంది దగ్గర చిల్లర కొట్టేయడం లేదు... ఈ బస్సు కూడా ఒక సంస్థదే కదా... ఎంత మంది తినటంలేదు... నా పది రూపాయలకే నష్టపోతుందా ఏమిటి.. ఈ పది రూపాయలు ఏదైనా దైవ కార్యనికి ఉపయోగిస్తా...' అని అనుకుని మౌనంగా కూర్చున్నాడు.
అంతలో వూరు వచ్చింది... బస్సు ఆగింది... కానీ ఆయన దిగేటప్పుడు బస్సు కండక్టర్ దగ్గరికి రాగానే తన ప్రమేయం ఏమాత్రం లేకుండా అసంకల్పితంగా కండక్టరుకు ఇవ్వవలిసిన పది రూపాయలు ఇచ్చి... "మీరు నాకు టికెట్ ఇచ్చేటప్పుడు ఈ పది రూపాయలు ఎక్కువగా ఇచ్చారు" అన్నాడు.
దానికి ఆ కండక్టర్ "అయ్యా..! నేను మీ ప్రవచనాలు ఎంతో శ్రద్ధగా వింటాను. మీరు చెప్పడంతోటే సరిపెట్టుకుంటారా లేక పాటిస్తారా అని చిన్న పరీక్ష చేశాను" అని అన్నాడు.
పండితుడు చల్లటి చిరు చెమటలతో బస్సు దిగి.. 'పది రూపాయల కోసం తుచ్ఛమైన ఆశతో నా విలువలకే తిలోదకాలు ఇవ్వబోయాను... నా అదృష్టం బాగుంది. నా మనస్సాక్షి సరైన సమయంలో సరియైన నిర్ణయం తీసుకొని నా విలువలను కాపాడింది' అనుకున్నాడు.
*జీవిత కాలం పాటు సంపాదించుకున్న మంచితనం కూడా సర్వనాశనం కావడానికి క్షణం చాలు...
*🔱 అంతర్యామి 🔱*
*# ప్రాణస్నేహితులు*
సృష్టి ఆరంభంలో స్నేహం ఉందో లేదో తెలియదు కానీ, ఇతిహాస కాలం నుంచి మాత్రం మైత్రీబంధం ఉంది. కర్ణ దుర్యోధనులు. కృష్ణ కుచేలుర కథలు మనకు తెలిసినవే. భర్తృహరి సుభాషిత త్రిశతిలో మంచి మిత్రుడి లక్షణాలను చెప్పాడు. చెడ్డవారి స్నేహం ప్రాతఃకాలపు నీడలా మొదట విస్తారంగా ఉండి, క్రమంగా క్షీణించిపోతుంది. మంచివారి స్నేహం సాయంకాలపు నీడలా మొదట చిన్నదిగా ఉండి క్రమంగా వృద్ధి చెందుతుంది.
🍁స్నేహం బాల్యం నుంచి అలవడే ఓ అందమైన అనుబంధం. స్నేహం ఓ అద్భుతమైన భావప్రకటన. స్నేహం అంటే నమ్మకం, భరోసా, కంటికి కనిపించని అవగాహన. దూరంగా ఉన్నా, మానసికంగా దగ్గర చేసే మధురభావన. తల్లిదండ్రులతో, తోబుట్టువులతో పంచుకోలేని ఎన్నో విషయాలను స్నేహితులతో పంచుకుంటాం. మనలోని మంచి, చెడులను నిష్పాక్షికంగా తెలియజేస్తూ, అవసర సమయాల్లో అండగా నిలబడగలిగి, విభేదాలు వచ్చినా మన రహస్యాలను ఇతరుల ముందు బహిర్గతం చేయనివాడే నిజమైన స్నేహితుడు.
🍁స్నేహం అంటే రెండు శరీరాల్లో ఉండే ఏకాత్మ. ఇద్దరి మధ్య వ్యక్తిత్వం, నిబద్ధత, నిజాయతీ, నిస్వార్థం అనే నాలుగు స్తంభాలే స్నేహసౌదానికి పునాదులు. ఒకే అభిప్రాయం, భావాలుగల వ్యక్తులు మిత్రులు కావడం సాధారణమే. కానీ దాన్ని జీవితకాలం కొనసాగించేవారే ప్రాణ స్నేహితులు అవుతారు. పాలు, నీళ్లలా కలిసిపోయే నైజం కలవారి మధ్య స్నేహం అంకురిస్తే, అది వటవృక్షమై ఎంతోమందికి ఆశ్రయం ఇస్తుంది. కొన్నిసార్లు మన భావాలకు, అభిప్రాయాలకు పొంతన లేని వ్యక్తుల తప్పనిసరి స్నేహం చెయ్యాల్సి వస్తుంది. ప్రయోజనం ఆశించి చేసే అలాంటి స్నేహాల్ని వదిలించుకోవడం మంచిది.
# " నీకు నేనున్నాను. నీ కోసం ఏమైనా చేస్తాను' అనే భరోసా స్నేహానికి సేంద్రియ ఎరువులాంటిది. స్థాయీభేదాలు, అరమరికలు లేనివాళ్లే స్నేహితులు కాగలరు. 'స్నేహితుడి కోసం ప్రాణం ఇచ్చేవాడికన్నా, ప్రాణమిచ్చే స్నేహితుణ్ని పొందినవాడు అదృష్టవంతుడు' అన్నాడు జాన్ రస్కిన్.
🍁నేటి యువత చదువు, ఉద్యోగం, సామాజిక జీవితంలోని ఒత్తిళ్లకు లోనవుతూ, స్నేహం ముసుగులో వ్యసనాలకు బానిసలవుతున్నారు.
మంచి, చెడుల విచక్షణ తెలిపే స్నేహితుడు ఉన్నప్పుడు మనలోని దుర్గుణాలు వాటంతటవే తొలగిపోతాయి. ధనం స్నేహితుల్ని చుట్టూ చేరిస్తే, దరిద్రం నిజమైన స్నేహితుల్ని మిగులుస్తుంది. కంటికి రెప్పలా, కాలికి చెప్పులా మారడానికి సిద్ధపడేవాడే నిజమైన స్నేహితుడు.
🍁తప్పు జరిగినప్పుడు 'ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు?' అనే రంధ్రాన్వేషణకూడదు. దానికి బదులు తప్పు ఎక్కడ జరిగిందో తెలుసుకుని సరిదిద్దుకోగలిగినవాళ్ల మధ్య స్నేహం సజీవంగా నిలుస్తుంది. ఒక్కసారి స్నేహితుడిగా అంగీకరించాక వాళ్లలో ఉన్న మంచిని, ప్రతిభను పదుగురితో పంచుకోవాలి. చెడు అయితే మనలోనే దాచుకోవాలి. మిత్రుడిలో ఉన్న మలినాలను సైతం ప్రక్షాళన చేయగలిగేవాళ్లే ఉత్తమ స్నేహితులుగా శాశ్వత ఖ్యాతికి అర్హులవుతారు.🙏
*******
🙏🙏🙏🌹🌹🌹
మహాకుంభమేళా 2025 లో జరిగే తేదీలు.. ప్రాంతాలు ఇవే.....
దేశంలో 12 ఏళ్లకు ఒకసారి జరిగే మహాకుంభమేళా ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది. ఈ మేళాలో కోట్లాది మంది భక్తులు పాల్గొంటారు.
మహాకుంభమేళాలో పుణ్యస్నానాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. 2025 జనవరిలో నిర్వహించే బోయే మహాకుంభమేళాకు ఘనంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహా కుంభమేళా ఏఏ ప్రాంతాల్లో ఏఏ తేదీల్లో జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 2025 జనవరి 13న పౌష్య పూర్ణిమ నుంచి కుంభమేళా ప్రారంభం కానుంది. ఇది 2025, ఫిబ్రవరి 26న శివరాత్రితో ముగియనుంది. అంతకుముందు 2013లో ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా నిర్వహించారు.
పుణ్యస్నానాలు- తేదీలు
మొదటి పుణ్యస్నానం జనవరి 13న పౌష్య పూర్ణిమ రోజున జరగనుంది.
జనవరి 14న మకర సంక్రాంతి శుభ సందర్భంగా భక్తులు పుణ్యస్నానాలు చేయనున్నారు.
జనవరి 29న మౌని అమావాస్య నాడు పుణ్యస్నానాలు ఆచరించనున్నారు.
ఫిబ్రవరి 3న వసంత పంచమి శుభ సందర్భంగా పుణ్యస్నానాలు చేయనున్నారు.
ఫిబ్రవరి 12న మాఘ పూర్ణిమ రోజున పుణ్యస్నానాలు చేయున్నారు.
ఫిబ్రవరి 26న మహాశివరాత్రి రోజున కుంభమేళాలో చివరి పుణ్యస్నానాలు చేయనున్నారు.
మహాకుంభమేళాలో పుణ్యస్నానాలను అత్యంత పవిత్రమైనవిగా భావిస్తారు. ఈ ప్రత్యేకమైన రోజున సాధువులు, నాగా సాధువులు, ఇతర శాఖల మహంత్‌లు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. వారు స్నానం చేసిన తరువాత సామాన్య భక్తులకు పుణ్యస్నానాలు చేసే అవకాశం లభిస్తుంది. మనదేశం నుంచే కాకుండా విదేశాల నుండి కూడా కోట్లాది మంది హిందువులు పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఇక్కడకు తరలి వస్తుంటారు. మహాకుంభమేళా జరిగే సమయంలో త్రివేణిసంగమంలోని నీరు అమృతంలా మారుతుందని చెబుతుంటారు. మహాకుంభమేళా సమయంలో పుణ్య స్నానాలు చేయడం వల్ల పాపాలు నశించి, మోక్షం లభిస్తుందని హిందువులు నమ్ముతారు.
పుణ్యస్నానాలు- ప్రాంతాలు
ప్రయాగ్‌రాజ్....
యూపీలోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళాకు కేంద్రంగా నిలుస్తుంది. ఇక్కడి త్రివేణి సంగమంలో భక్తులు పూజలు, పుణ్యస్నానాలు చేస్తారు. గంగా, యమున, సరస్వతి నదుల సంగమం ఇది. ఇక్కడ సరస్వతి నది అదృశ్యంగా ఉంటుందని అంటారు.
హరిద్వార్....
కుంభమేళా సమయంలో లక్షలాది మంది భక్తులు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో పుణ్యస్నానాలు చేస్తారు. గంగానది.. పర్వతాలను వీడి ఇక్కడి నుంచే మైదానాలలోకి ప్రవేశిస్తుంది. హరిద్వార్.. హిమాలయ పర్వత శ్రేణిలోని శివాలిక్ పర్వతాల దిగువన ఉంది. హరిద్వార్‌ను తపోవన్, మాయాపురి, గంగాద్వార్, మోక్ష ద్వార్ అని కూడా పిలుస్తుంటారు.
నాసిక్....
నాసిక్‌లో జరిగే కుంభమేళాను నాసిక్ త్రయంబక్ కుంభమేళా అని కూడా అంటారు. దేశంలోని 12 జ్యోతిర్లింగాలలో త్రయంబకేశ్వరం ఒకటి. త్రయంబకేశ్వరంలో 12 ఏళ్లకు ఒకసారి సింహస్థ కుంభమేళా జరుగుతుంది. కుంభమేళా సందర్భంగా, వేలాది మంది భక్తులు గోదావరి పవిత్ర జలాల్లో స్నానాలు చేస్తారు. ఇక్కడ శివరాత్రిని ఎంతో వైభవంగా నిర్వహిస్తారు.
ఉజ్జయిని...
ఉజ్జయినిలో క్షిప్రా నది ఒడ్డున పుణ్యస్నానాలు చేస్తారు. ఈ సందర్భంగా భక్తులు మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శిస్తారు. ఉజ్జయిని నగరం మధ్యప్రదేశ్‌కు పశ్చిమాన ఉంది.
🌹🌹🌹🙏🙏🙏
*అపరిచితుని గ్లోబల్ వాక్*
లోకానికి అతడు ఒక అపరిచితుడు. లోకోపవాదాలకు అతీతుడు. వంచినది
తలే, అభిమానాన్ని కాదు. ఆలోచనల
బరువుతో అతని చూపు అవని వైపే,
దృష్టి మాత్రం సుదూరాలకు. జీవితం
పరుగు పెట్టమన్నా, వినక తన నడకపై
మెండైన ఆత్మవిశ్వాసం. చలికి చేతులు
జేబులో దూర్చినా, బిగిసిన పిడికెళ్ళలో
మాత్రం లక్ష్యాన్ని పట్టు సడలనివ్వని
వేళ్ళమధ్య పట్టుదల.. పొగ మంచులా!
వర్తమానం, భవిత, అస్పష్టం అయినా
అడుగులు ముందుకే వేయించే
గుండె దిటవు. మందితో హాస పరిహాసాలకు అపరిచితుడు కాడు.. కానీ అవసరమైతే
ఏకాకిగా జీవన నౌకపై అనంత దూర
తీరాలకు పయనం ఆపడు. తాను
ముందుకు కదులుతుంటే వెనుకకు
తరలిపోయే తరువుల్లా జీవన
మాధుర్యాలు గతోన్ముఖమైనా,
జీవిత సంఘర్షణలో వెనకడుగు లేదు.
పరిచితాపరిచిత లోకంలో క్షణ క్షణం
మారిపోయే రూప గుణ శబ్ద స్పర్శ రస
గంధాదులు తాత్కాలిక అతిధులు.
అనంత శాశ్వతత్వం చిరునామా
వెతికేవాడికి ఐకాంతిక పయనం
ఇసుమంతైనా అసౌకర్యం అనిపించదు. ఉషోదయం.. మబ్బులు కమ్మినా,
స్వచ్ఛ నిర్మలంగా మెరిసినా సంధ్యా
స్వర్ణిమ కాంతులు, ఆపై చిరు చీకట్లు
పెను చీకట్లు.. వేటికవే వాటి స్థానాలలో చిరంతనంగా! క్షణభంగుర అస్తిత్వం
భౌతికంగానే. అనంతమైన యాత్ర
ఎప్పటికప్పుడు పునరావృతం అవుతూ..
అనంత పథికుడితో అపరిచిత బాటలే
తమని పరిచయం చేసుకుంటూ
అపరిచితుడితో పాద'చాలనాలు చేసి
వెనుకకు తొలగిపోతుంటాయి.
మల్లేశ్వర రావు ఆకుల
నేటి లోకం తీరు
జీవితంలో శాంతి సౌఖ్యము సమంగా ఉండాలి అంటే ఏది ఎక్కువ తెలుసుకోకూడదు ఎవరిని ఎక్కువగా చదవకూడదు, నా సొంతం అనే భావన రాకూడదు.
చిరునవ్వు లాగా స్నేహం కలుపుతూ, చిదానంద స్వామిల నిత్యం నవ్వుతూ నవ్విస్తూ, డబ్బుతో దేనినైనా కొనగలం కానీ కొన్ని కొనలేని ఉన్నాయని మాత్రం గమనించు అవి ఏమిటంటే మానవత్వం, నిజాయితీ, సంస్కారం, విధేయత, గౌరవం.
మన చుట్టూ ఉన్న సమాజం నీవు గెలిస్తే అసూయ పడుతుంది, నీవు ఓడిపోతే అవమానిస్తుంది. వదిలేస్తే జారిపోయేవి కొన్నే అయితే, పట్టుకుంటే మనతో ఉండి పోయేవి ఇంకా ఎక్కువే.
ప్రపంచంలో ఉన్న ఒక దేశం భారతదేశం ఇందులో ఆరోగ్యం, ఆత్మీయత, ఆనందం ఆధ్యాత్మికత, వివిధ మతాలు, కులాలు ఒక్కత్రాటిపై యిచ్చిపుచ్చుకునే విధంగా సహాయ సహకారాలు అందించుకుంటూ జీవన విధానాలు విద్యా, శ్రామిక కర్షక విధానాలతో,పారిశ్రామిక సంపదలతో, సహజ సంపదలతో, విజ్ఞాన సామాన్య సాంఘిక శాస్త్రాలతో పాడిపంటలతో నిలయమైన ఉండే దేశం. పాలకపక్షం, ప్రతిపక్షం అంతా అయోమయం ఎవరికి వారు అందుకున్నంత అందుకోవడమే ఆర్థిక సంపద అనుకుంటూ వారిని ప్రశ్నించే హక్కులు వ్యవస్థలలో నాయస్థానాలలో లేని పరిస్థితి అంతా ప్రజలు భవచించిన నాయకులు ప్రజలు హింసిస్తున్నారే తప్ప ఆదుకునే వాళ్లే రాజ్యాంగం భారతదేశం. కనీసం అర్హతలు లేని రాజకీయ నాయకులు వారి జీతాలు మాత్రం లక్షల మీద లక్షలు. సరైన విద్యాసంస్థలు లేవు, ఆదరణ లేదు, మాతృభాషలో చదువులేదు, చదువుకున్నవాడికి ఉద్యోగం లేదు, ప్రజలు నిజం తెలిపితే ఎన్కౌంటర్ చేసే ప్రభుత్వం . ఎన్నాళ్లే మనకి కష్టాలు శక్తి సేణ లుగా సాధిద్దాం మన దేశానికి ఉన్న మేధావిజ్ఞాన సంపత్ని ఏ దేశానికి లేదు లోపం కేవలం రాజకీయం. న్యాయస్థానాలు కూడా నాయక వ్యవస్థకు తో డు నీడగా ఉండటం, ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్సి కూడా నాయకులకు వత్తాసు నేటి దుర్భర పరిస్థితి.
ఎప్పుడు మారుతుంది ఈ రాజకీయ ప్రచారం.
భవ భవితా సహాయముయు భాద్యత ధర్మము నిత్య ధ్యేయమే
వివరణ లక్ష్య సాధనలు విద్య వినమ్ర విధేయతన్ శుభమ్
సవరణ నిత్య జీవితము సాక్షిగ తల్లి సమమ్ము పోషణన్
కవి కవితా మహత్వమును గాయకు గానము గవ్వ సేయునే
చింతకు జేరిపంతమగు చేష్టబలమ్ముయులేక బంధమున్
శాంతిమనస్సులేనిగతి సామ్యసుఖంబుయులేని వైనమున్
బ్రాంతి ప్రభావమేతపము బంధ ప్రభోదము ప్రశ్న లేయగున్
"ఇంతకు గన్నులుండి తెరువే కననైతిని మందభాగ్యుడన్"
*****
జనకసభ
పూర్వం విదేహరాజ్యాన్ని పరిపాలించే రాజులకు ‘జనకుడు’ అనే నామాంతరం ఉండేది. వారిలో ఒకానొక జనక మహారాజు ఒకసారి బహుదక్షిణం అనే పేరు కలిగిన గొప్ప యజ్ఞం చేశాడు. ఆ యజ్ఞానికి నానా ప్రాంతాల నుండి అనేకమంది వేదపండితులు శాస్త్రపండితులు విచ్చేశారు. వారిని, వారి అపరిమేయమైన వైదుష్యాన్ని గమనించిన జనకమహారాజు హృదయం ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఆ సమయంలోనే అతడికి ఒక జిజ్ఞాస కూడా కలిగింది. “కో ను ఖలు అత్ర బ్రహ్మిష్ఠః?” (వీరందరిలోనూ అతి గొప్ప బ్రహ్మజ్ఞానము కలిగిన వారు ఎవరు?) అని. కాని, ఆ మాటను నేరుగా ఆ విద్వత్పరిషత్తులోనే అడగటం మర్యాద కాదు. అందువలన జనకమహారాజు ఒక ఉపాయం చేశాడు.
తన గోశాలనుండి వేయి మంచి ఆవులను తెప్పించాడు. ప్రతి ఆవుకు రెండు కొమ్ములు ఉంటాయి కదా. ఒక్కొక్క కొమ్ముకు ఐదేసి పాదముల బంగారాన్ని కట్టించాడు. తరువాత అక్కడ చేరిన విద్వత్పరిషత్తును ఉద్దేశించి, “మహాత్ములారా! యో వో యుష్మాకం బ్రహ్మిష్ఠః సః ఏతాః గాః ఉదజతామ్” (మీ అందరిలోనూ అతిశయించిన బ్రహ్మజ్ఞానం ఎవరికి కలదో, వారు ఈ ఆవులను తమ ఇంటికి తోలుకుపోవచ్చును.) అని ప్రకటించాడు.
అప్పుడు అక్కడున్న వారు ఎవరూ నేనే అందరికంటే గొప్ప బ్రహ్మిష్టుడను అని చెప్పలేక మౌనంగా ఉండి పోయారు.
అప్పుడు అక్కడున్న యాజ్ఞవల్క్యమహర్షి తన శిష్యుడిని పిలిచి, “ఏతాః సౌమ్య ఉదజ సామశ్రవా3” (సామశ్రవా, ఈ ఆవులను మన ఇంటికి తోలుకుపో నాయనా) అని చెప్పాడు.
ఆ మాట విన్న పండితులందరికీ చాల కోపం వచ్చింది. వారిలో అశ్వలుడు ఒకడు. ఆయన జనక మహారాజు గారి యాజ్ఞికులలో హోత. “త్వం ను ఖలు నో యాజ్ఞవల్క్య బ్రహ్మిష్ఠోఽసి?” (ఓ యాజ్ఞవల్క్యా, మన అందరిలోనూ నువ్వేనా అతి గొప్ప బ్రహ్మవేత్తవు?) అని తీవ్రంగా అడిగాడు.
“మనలో ఎవరైతే అతి గొప్ప బ్రహ్మిష్ఠుడో అతడికి నా నమస్కారం. నాకు ఆవుల అవసరం చాలా ఉన్నది. అందుకనే నేను తోలుకుపోదామని అనుకున్నాను” అని యాజ్ఞవల్క్యుడు మందహాసం చేశాడు.
“నీకు ఎంత అవసరం ఉన్నప్పటికీ, ఈ ఆవులు అతి గొప్ప బ్రహ్మవేత్త కోసం ఉద్దేశింపబడ్డాయి. కాబట్టి మా ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పి నీవు ఆవులను తీసుకొని పోవచ్చును” అని అశ్వలుడు సవాలు చేశాడు.
యాజ్ఞవల్క్యుడు చిరునవ్వు నవ్వి, “సరే ప్రశ్నించండి” అని అడిగాడు.
అశ్వలుడు యజ్ఞానికి, యజ్ఞము చేయించే విధానానికి, యజ్ఞం చేయించేవారికి సంబంధించిన అతి కఠినమైన ప్రశ్నలను వేశాడు. యాజ్ఞవల్క్యుడు వాటికి అతి సులువుగా సమాధానం చెప్పాడు. అశ్వలుడు యాజ్ఞవల్క్యుని సమాధానాలను ఆమోదించి, ఇక అడుగవలసిన ప్రశ్నలు తన వద్ద లేవని విరమించుకున్నాడు.
అప్పుడు జరత్కారువంశీయుడైన కృతభాగుని పుత్రుడైన ఆర్తభాగుడు అనే మహర్షి ప్రశ్నించేందుకు పూనుకున్నాడు. అతడు గ్రహములను గూర్చి అతిగ్రహములను గూర్చి అడిగిన ప్రశ్నలకు యాజ్ఞవల్క్యుడు చక్కగా సమాధానం చెప్పాడు. (ఇక్కడ గ్రహములు అంటే planets కావు. గ్రహించే వాటిని గ్రహములు అంటారు.). మరణించిన వ్యక్తి ఏమవుతాడు అనే ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాడు. అప్పుడు యాజ్ఞవల్క్యుడు అజేయుడు అని గ్రహించిన ఆర్తభాగుడు మౌనం వహించాడు.
అప్పుడు లహ్యుని కుమారుడైన భుజ్యుడు ప్రశ్నించడం మొదలుపెట్టాడు. పారిక్షితుల స్థానాన్ని గూర్చి అతడు అడిగాడు. (పారిక్షితులు అంటే అశ్వమేధయాగాన్ని చేసిన మహాత్ములు). యాజ్ఞవల్క్యుడు దానికి కూడా సరైన సమాధానం చెప్పాడు. దాంతో భుజ్యుడు కూడా మౌనం వహించాడు.
అప్పుడు చక్రుని కుమారుడైన ఉషస్తి ప్రశ్నించేందుకు ముందుకు వచ్చాడు. ఆత్మకు సంబంధించిన అతని ప్రశ్నకు కూడా యాజ్ఞవల్క్యుడు సులువుగా సమాధానం చెప్పాడు. దాంతో ఉషస్తి కూడా తన ప్రయత్నాలను విరమించుకున్నాడు.
అప్పుడు కుషీతకుని పుత్రుడైన కహోలుడు తన ప్రశ్నలను ప్రారంభించాడు. అతడు కూడా ఆత్మను గురించి విభిన్నంగా ప్రశ్నించాడు. యాజ్ఞవల్క్యునినుండి తనకు సరైన సమాధానం లభించడంతో మౌనం వహించాడు.
అప్పుడు వచక్నుని కుమార్తె అయిన గార్గి తన ప్రశ్నలను ప్రారంభించింది. వారి మధ్య ఈ విధంగా సంభాషణ జరిగింది -
గార్గి
“ఒక వస్త్రం దారాలలో ఓత ప్రోతంగా ఎలా వ్యాపించి ఉన్నది కదా, ఆ విధంగా నీరు దేనిలో వ్యాపించి ఉన్నది?”
యాజ్ఞవల్క్యుడు
“వాయువులో”
గార్గి
“వాయువు దేనిలో వ్యాపించి ఉన్నది?”
యాజ్ఞవల్క్యుడు
“అంతరిక్షలోకాలలో”
గార్గి
“అంతరిక్షలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”
యాజ్ఞవల్క్యుడు
“గంధర్వలోకాలలో”
గార్గి
“గంధర్వలోకాలు దేనిలో వ్యాపించి ఉన్నాయి”
యాజ్ఞవల్క్యుడు
“ఆదిత్యలోకాలలో”
గార్గి
“ఆదిత్యలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”
యాజ్ఞవల్క్యుడు
“చంద్రలోకాలలో”
గార్గి
“చంద్రలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”
యాజ్ఞవల్క్యుడు
“నక్షత్రలోకాలలో”
గార్గి
“నక్షత్రలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”
యాజ్ఞవల్క్యుడు
“దేవలోకాలలో”
గార్గి
“దేవలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”
యాజ్ఞవల్క్యుడు
“ఇంద్ర లోకాలలో”
గార్గి
“ఇంద్రలోకాలు దేనిలో వ్యాపించి ఉన్నాయి?”
యాజ్ఞవల్క్యుడు
“ప్రజాపతిలోకాలలో”
గార్గి
“ప్రజాపతిలోకాలు ఎందులో వ్యాపించి ఉన్నాయి?”
యాజ్ఞవల్క్యుడు
“బ్రహ్మలోకాలలో”
గార్గి
“బ్రహ్మలోకాలు దేనిలో వ్యాపించి ఉన్నాయి?”
గార్గి ఆ ప్రశ్నను వేసేసరికి యాజ్ఞవల్క్యుడు ఆమెను కనికరం నిండిన దృష్టులతో చూశాడు. “ఓ గార్గీ, అతిప్రశ్నలను వేయకు. నీ తల ఊడి పడుతుంది” అని హెచ్చరించాడు.
(బ్రహ్మలోకం అనిర్వచనీయమని, అతీంద్రియమని, అవాఙ్మానసగోచరమని శాస్త్రం చెబుతుంది. ఆ విధంగా కన్నులకు గాని, మనసుకు గాని ఇతర-ఇంద్రియాలకు గాని అందని విషయాన్ని గురించి ప్రశ్నించడాన్ని అతిప్రశ్న అంటారు. ఎందుకంటే ఇంద్రియాలకు మనసుకు అందని దానిని ఎవరికి వారు స్వీయానుభవంతో తెలుసుకోవాలి. బ్రహ్మలోకాలను గూర్చి తెలుసుకునేందుకు ఆ విధంగా ప్రయత్నించకుండా అవి ఎలా ఉంటాయి అవి ఎందులో ఉంటాయి అని ప్రశ్నించడమే ఈ సందర్భంలో అతి ప్రశ్న. అంతేకాక, వేదవాక్కును మించిన ప్రమాణం లేదు. దానిని పక్కకు త్రోసి అనుమానప్రమాణాన్ని ఆశ్రయించి అది వేదం కంటె గొప్పదనటం కూడా అతి. ఆ విధంగా వేదాన్ని అతిక్రమించి అనుమానప్రమాణానికి అధికప్రాధాన్యం ఇచ్చే విధంగా ప్రశ్నిస్తే అప్పుడు కూడా అది అతి ప్రశ్న అవుతుంది.)
యాజ్ఞవల్క్యుడు అలా చెప్పేసరికి తన పొరపాటున గ్రహించిన గార్గి కూడా మౌనం వహించింది.
అప్పుడు అరుణపుత్రుడైన ఉద్దాలకుడు ప్రశ్నించడం ప్రారంభించాడు. “ఓ యాజ్ఞవల్క్యా! నాకు సూత్రాత్మగా ఉన్న అంతర్యామిని గూర్చి తెలుసును. నీకు కూడా ఆ అంతర్యామి తెలిసినట్లయితే సరే. కాని, అంతర్యామిని గూర్చి ఏమీ తెలియకుండా నీవు ఆవులను తీసుకువెళ్లదలిస్తే నీ తల ఊడి పడుతుంది” అని హెచ్చరించాడు. యాజ్ఞవల్క్యుడు అంతర్యామిని గురించి చక్కగా వివరించాడు. సరైన సమాధానం లభించేసరికి ఉద్దాలకుడు మౌనం వహించాడు.
అప్పుడు గార్గి మరలా నిలబడింది. యాజ్ఞవల్క్యుని మరొకసారి ప్రశ్నించేందుకు పండితసభ అనుమతిని కోరింది. “ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్నకు యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్పగలిగితే ఇక ఈ సభలో ఎవరూ యాజ్ఞవల్క్యుని ఓడించలేరు. అటువంటి ప్రశ్న వేసేందుకు మీ అనుమతిని కోరుతున్నాను” అని వినయంగా అడిగింది. సభ అందుకు అనుమతినిచ్చింది. అప్పుడు గార్గి ఈ విధంగా సవాలు చేసింది.
“ఓ యాజ్ఞవల్క్యా, నేను వేయబోయే ప్రశ్న ధనుస్సును ఎక్కు పెట్టి సంధింపబడి విడుదలకాబోతున్న పదునైన బాణం వంటి ప్రశ్న. నీ దగ్గర సమాధానం ఉందా?” అని అడిగింది.
యాజ్ఞవల్క్యుడు మందహాసం చేసి "వెంటనే ప్రయోగించవమ్మా నీ బాణాన్ని" అన్నాడు.
“ద్యు లోకానికి పైన, పృథ్వీలోకానికి క్రిందన, ఏది వ్యాపించి ఉన్నదో, ఈ ధ్యావాపృథ్వీలోకాలకు నడుమ ఏది ఉన్నదో, దేనికి భూతము భవము భవిష్యత్తు (Past, Present, Future) అనేవి ఉండవో, అయ్యది దేనిలో ఓతప్రోతంగా వ్యాపించి ఉన్నది?”
ఈ విధంగా గార్గి అడిగిన ప్రశ్నను విని అందరూ దిగ్భ్రాంతి చెందారు. అసలు ఆ ప్రశ్నలోని విషయం కూడా ఊహకు అందదు. ఇక దానికి సమాధానం ఎవరు చెప్పగలరు అనుకున్నారు. మునుపు గార్గి వేసిన ప్రశ్న మాటలకు అందనిదైనందున అతి ప్రశ్న అని యాజ్ఞవల్క్యుడు చెప్పాడు. కాని, ఇప్పుడు గార్గి తన మాటలతో వర్ణించినందువలన అది అతి ప్రశ్న కాజాలదు. యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్పి తీరాల్సిన అవసరం వచ్చింది.
అయితే ఆ విద్వత్పరిషత్తులోని మిగిలిన విద్వాంసులందరూ వేరు, యాజ్ఞవల్క్యుడు వేరు. అతడికి గార్గి వేసిన ప్రశ్న కరతలామలకంలా అనిపించింది.
“ఓ గార్గీ, అది ఆకాశంలో వ్యాపించి ఉన్నది” అని యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్పాడు.
సభ నిశ్చేష్టమై నిశ్శబ్దంగా మారిపోయింది. గార్గి మ్రాన్పడిపోయింది. తన ప్రశ్నకు యాజ్ఞవల్క్యుడు అంత సులువుగా సమాధానం చెబుతాడని ఆమె ఊహించనేలేదు. నిజానికి ఆమె అడిగినది ఊహాతీతమైన పరబ్రహ్మ గురించి. పరబ్రహ్మ వర్ణింప వీలుకానిది. కాబట్టి, యాజ్ఞవల్క్యుడు మౌనం వహించాలి. గార్గి అడిగినది అతిప్రశ్న కాకపోయినప్పటికీ, సమాధానం చెప్పలేక మౌనం వహిస్తే, ఆమె ప్రశ్నకు సమాధానం నావద్ద లేదని యాజ్ఞవల్క్యుడు తన పరాజయాన్ని అంగీకరించినట్లే. అందువల్ల గార్గి చాల తెలివిగా యాజ్ఞవల్క్యుని ఇరుకున పెడదామని ఆ విధంగా ప్రశ్నించింది. కాని, ఆమె తన ప్రశ్నలో ఒక పొరపాటు చేసింది. ద్యావాపృథ్వీలోకాలు అని ఆమె ఉచ్చరించడంతో అవి కేవలం భౌతిక పదార్థాలు మాత్రమే అయినాయి. అందువల్ల అవి ఆకాశంలో ఉంటాయని యాజ్ఞవల్క్యుడు సమాధానం చెప్పాడు. ఆ సమాధానం లౌకికంగానూ శాస్త్రీయంగాను కూడా సత్యమే. మొదటి సారి నీవు అడిగినది అతిప్రశ్న అయితే రెండవసారి నీవు అడిగిన ప్రశ్న అతి సాధారణమైన ప్రశ్న అన్నట్లుగా యాజ్ఞవల్క్యుడు తేల్చేశాడు. అంతే కాదు, ఈ ఆకాశం కంటె కూడా నీవడగదలుచుకున్న పరబ్రహ్మ మరింత గొప్పది అని పరోక్షంగా తగిన సమాధానం కూడా సూచించాడు. (తస్మాద్వా ఏతస్మాదాత్మనః ఆకాశః సంభూతః అని తైత్తిరీయవాక్కు.)
తెల్లబోయిన గార్గి కాసేపటికి తేరుకుని, “ఆ ఆకాశం దేనిలో వ్యాపించి ఉన్నది?” అని అడిగింది. “దానిని అక్షరం అంటారు” (అక్షరం = క్షరము కానిది = నాశనం లేనిది) అని యాజ్ఞవల్క్యుడు చెప్పి, దాని స్వరూపం వర్ణింప వీలులేనిది కాబట్టి, నేతి (న+ఇతి) వాదం ప్రకారం సమాధానం చెప్పాడు. (ఆ అక్షరస్వరూపం ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇలా ఉండదు అంటూ వర్ణించాడు.). అటువంటి అక్షరంలో ఈ ఆకాశం వ్యాపించి ఉన్నది అని చెప్పాడు. గార్గికి తగిన సమాధానం లభించింది. ఆమె పన్నిన ఉచ్చులో యాజ్ఞవల్క్యుడు ఇరుకున పడలేదు. తామరతూడు ఏనుగును బంధించలేదు కదా.
ఆ సమాధానం విన్న గార్గి వినమ్రురాలయింది. యాజ్ఞవల్క్యునికి సవినయం నమస్కారం చేసింది. వినీతులు ఎంతటి జిగీషులైనప్పటికీ, మహాత్ముల చెంత వారి సహజస్వభావం పెల్లుబుకుతూనే ఉంటుంది కదా. “అయ్యా పండితులారా! మీరు కూడా ఈయనకు నమస్కారం చేసి, ఈయన మనలో అతి గొప్ప బ్రహ్మవేత్త అని అంగీకరించండి. సత్యాన్ని అంగీకరిస్తే అది మనకు విజయమే కాని పరాజయం కాదు. మీరెవరు ఈయనను జయింపలేరు” అని సభలోని విద్వాంసులతో హితవు పలికింది.
అయితే గార్గి మాటలను శాకల్యుడు సహించలేకపోయాడు. తాను కూడా ప్రశ్నించి యాజ్ఞవల్క్యుని పరీక్షిద్దామని ముందుకు వచ్చాడు.
శాకల్యుడు
“వైశ్వదేవంలో దేవతల సంఖ్య ఎంత?”
యాజ్ఞవల్క్యుడు
“3306 మంది”
శాకల్యుడు
“సరే, ఎంతమంది దేవతలు?”
యాజ్ఞవల్క్యుడు
“33 మంది”
శాకల్యుడు
“సరే, ఎంతమంది దేవతలు?”
యాజ్ఞవల్క్యుడు
“ఆరుగురు”
శాకల్యుడు
“సరే, ఎంతమంది దేవతలు?”
యాజ్ఞవల్క్యుడు
“ముగ్గురు”
శాకల్యుడు
“సరే, ఎంతమంది దేవతలు?”
యాజ్ఞవల్క్యుడు
“ఇద్దరు”
శాకల్యుడు
“సరే, ఎంత మంది దేవతలు?”
యాజ్ఞవల్క్యుడు
“ఒకటిన్నర మంది”
శాకల్యుడు
“సరే, ఎంతమంది దేవతలు?”
యాజ్ఞవల్క్యుడు
“ఒక్కరు”
ఆ తరువాత యాజ్ఞవల్క్యుడు తాను చెప్పిన ఆయా దేవతల సంఖ్యలను గురించి కూడా చక్కగా వివరించాడు.
అయినప్పటికీ శాకల్యుడు శాంతించలేదు. ఏ విధంగానైనా యాజ్ఞవల్క్యుడిని జయించాలనే కోరికతో ప్రశ్న మీద ప్రశ్నలను అడుగుతూ పోయాడు. (సత్యాన్ని తెలుసుకోవాలని కోరికతో కాకుండా, తనకు సంబంధించిన ఒక సిద్ధాంతాన్ని ఎంతమాత్రం ప్రతిపాదించకుండా, కేవలం తన ప్రత్యర్థి మాటలను నిరాధారంగా నిష్కారణంగా అసూయతో ఖండిస్తూ వాదించడాన్ని వితండవాదం అంటారు.).
చివరకు శాకల్యుని దురాగ్రహాన్ని గమనించిన యాజ్ఞవల్క్యుడు, ఠఓ శాకల్యా, నీకు సమాధానం తెలియని ప్రశ్నను నన్ను అడుగవద్దు. సమాధానం తెలియకుండా నన్ను ప్రశ్నించినట్లయితే నీ తల తెగిపడుతుంది” అని హెచ్చరించాడు. అయినప్పటికీ, శాకల్యుడు తనకు సమాధానం తెలియని ప్రశ్నను అడిగేశాడు. దాంతో శాకల్యుని తల అందరి సమక్షంలోను తెగి క్రింద పడింది.
అప్పుడు యాజ్ఞవల్క్యుడు, సభను ఉద్దేశించి, “అయ్యా, మీలో ఇంకా ఎవరెవరు ఏమేమి ప్రశ్నలను అడగదలుచుకున్నారో విడివిడిగా అడగవచ్చు. లేదా అందరూ కలిసి ఒకే ప్రశ్నను వేయవచ్చు. నేను మీ ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు సంసిద్ధంగా ఉన్నాను” అని పలికాడు.
అప్పుడు ఏ ఒక్కరూ ముందుకు రాలేదు.
అప్పుడు యాజ్ఞవల్క్యుడే స్వయంగా పండితపరిషత్తును ఉద్దేశించి ప్రశ్నించాడు. ఆత్మ అనే పురుషుని వృక్షంతో పోల్చి చెప్పి, చెట్టును వేళ్లతో సహా విత్తనంతో సహా నాశనం చేస్తే ఆ చెట్టు మరల మొలకెత్తదు. కాని, మన ముందే మరణించి, శరీరం కాల్చివేయబడినప్పటికీ, ఆ వ్యక్తి మరలా జన్మిస్తాడు. (ధ్రువం జన్మ మృతస్య అని శాస్త్రం) “కో న్వేయం జనయేత్ పునః? (మరణించిన వ్యక్తిని మరలా పుట్టేట్లుగా చేస్తున్న ఆ శక్తి ఏమిటి?) అని అడిగాడు.
ఎవరూ సమాధానం చెప్పలేకపోయారు. యాజ్ఞవల్క్యుడు సభకు నమస్కరించి, ఆవులను తోలుకొని పోయాడు.
“విజ్ఞానమానందం బ్రహ్మ రాతిర్దాతుః పరాయణం తిష్ఠమానస్య తద్విద ఇతి” – అని బృహదారణ్యకోపనిషత్తు ఆ శక్తిని గూర్చి చెబుతుంది. ఆ శక్తి పేరు విజ్ఞానం. ఆ శక్తి పేరు ఆనందం. ఆ శక్తి పేరు బ్రహ్మ. అదే పరమగతి.
*****
అనగనగా రామాపురమనే గ్రామం. ఆ గ్రామంలో సాంబయ్యనే రైతు ఉన్నాడు. తనకున్న కొద్దిపాటి పొలంలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. ఐతే గత కొన్ని సంవత్సరాల నుండి కరవు కారణంగా పంటలు పండలేదు.
సాంబయ్య రకరకాల పనులు చేసినా కలిసిరాలేదు. కుటుంబ పోషణ భారమైపోయింది. కుటుంబాన్ని పోషించుకోలేక ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నాడు. తన పొలంలో ఉన్న నూతిలో దూకి, ఆత్మహత్య చేసుకోబోతుండగా..
'ఆగు మిత్రమా' అన్న మాటలు వినిపించాయి. చుట్టూ చూడగా చెట్టు మీద ఒక రామచిలుక కనిపించింది. రామచిలుక మాట్లాడం చూసి అశ్చర్యపోయాడు. 'నేనూ, నా కుటుంబం నీ పొలంలో పండిన జామపళ్ళు తిని ఇంతకాలం బతికాం. మేము నీకు ఋణపడి ఉంటాం. ఆ ఋణం తీర్చుకునేందుకు నీకు సహాయం చేస్తాను. ఆత్మహత్య మహా పాపం. బతకటానికే ప్రయత్నం చేయాలి. నేను నీతో వస్తాను. నన్ను ఓ పంజరంలో ఉంచి, చిలుక జోస్యం అంటూ డబ్బులు సంపాదించు. కుటుంబాన్ని పోషించు' అన్నది చిలుక. సాంబయ్యకు చిలుక చెప్పింది నచ్చి, చిలుక చెప్పినట్టు చేయడానికి ఒప్పుకున్నాడు.
సాంబయ్య ఊర్లన్నీ తిరుగుతూ మధ్యాహ్నం వరకూ చిలుక జోస్యం చెబుతుండేవాడు. మధ్యాహ్నం ఒక చెట్టు కింద సేద తీరేవాడు. ఈ ఖాళీ సమయంలో చిలుక ఇండ్లపై ఎగిరి.. ఆ ఇండ్ల వివరాలు తెలుసుకుని, సాంబయ్యకు చేరవేసేది. ఆ వివరాలనే చిలుక జోస్యం పేరిట జనాలకి చెప్పేవాడు. తక్కువ కాలంలోనే సాంబయ్య మంచిపేరు సంపాదించాడు. అది సాంబయ్య శత్రువులకు నచ్చలేదు. చిలుక జోస్యమంటూ ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నాడని రాజుకు ఫిర్యాదు చేశారు.
రాజు సాంబయ్యను పిలిపించాడు. 'నేను ఎన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినా రాజ్యంలో పేదవారు తగ్గకపోవడానికి కారణం ఏమిటో? వారం రోజుల్లో జోస్యం చెప్పాలి. సరిగ్గా చెపితే మంచి కొలువు ఇస్తాను.. లేదంటే శిక్షిస్తాను' అన్నాడు రాజు. 'అలాగే ప్రభు' అంటూ సెలవు తీసుకుని, ఇంటికి వెళ్ళాడు సాంబయ్య. చిలుక సాయంతో ఆ రాజ్యంలో పేదరికం తగ్గకపోవటానికి అవినీతి అధికారులు, వేగులు ఒకటైపోవడమని ఆ జాబితా రాజుకు అందించాడు.
రాజు సాంబయ్య చెప్పిన అవినీతి అధికారులు, వేగులను కొలువు నుంచి తప్పించి, కొత్తవారిని నియమించగా రాజ్యంలో పేదరికం తగ్గింది. రాజు సాంబయ్యను మెచ్చుకుని, తన ఆస్థానంలో మంచి కొలువు ఇచ్చాడు. ఆ విధంగా చిలుక చేసిన సాయంతో సాంబయ్య కష్టాల నుంచి బయటపడ్డాడు.
******
🔱 *నటరాజు నర్తించిన దివ్యధాత్రి.. జటాజూట విన్యాస క్షేత్రస్థలి* 🔱
*పరమేశ్వరుడు భక్తదయాళువు. భక్తులు అడగడమే ఆలస్యం అలవోకగా వరాల వర్షం కురిపిస్తాడు. ఆయన శివతాండవం భక్తకోటికి ఆనందదాయకం. ఎర్రటి శిరోజాలతో హిమపర్వతాలపై ఆయన తాండవం చేసినట్టు పురాణగ్రంథాలు పేర్కొంటున్నాయి. స్వామివారు తన హస్తాల్లో డమరుకం, అగ్ని, అభయముద్రతో పాటు ఒక చేయిని తన చరణాల దిశగా చూపిస్తుంటాడు. ఆయన పాదాలను నిర్మలమైన మనసుతో ప్రార్థిస్తే చాలని దీనర్థము.*
*నటరాజు నాట్యము.*
*నటరాజ అంటే నాట్యముతో ప్రకాశించువాడు.ఆ త్రినేత్రుడు స్వయంగా భూమిపై ఐదుసార్లు నాట్యము చేసినట్టు ప్రాచీన వాజ్మయము ద్వారా తెలుస్తోంది.*
*ఆ ఐదు క్షేత్రాలు తమిళనాడులో ఉన్నాయి.ఆ పంచక్షేత్రాలివే..*
*🔱 చెన్నై సమీపంలోని తిరువళన్‌గడులోని వాద ఆరణ్యేశ్వర్ ఆలయంలోని కాళితాండవము.*
*🔱 చిదంబరంలోని నటరాజ ఆలయంలో ఆనందతాండవము.*
*🔱 మదురైలోని మీనాక్షి అమ్మవారి ఆలయంలో సంధ్యాతాండవము.*
*🔱 తిరునల్వేలిలోని నెల్లైఅప్పార్ ఆలయంలో ముని తాండవము.*
*🔱 కుట్రాళంలోని కుట్రాళనాథర్ ఆలయంలో త్రిపుర తాండవము.*
*జయ జయ జయ జయ జయ శ్రీ శివా!*
*******
*🏢🏫 అమ్మ నాన్నల ఇల్లు*
*(తల్లిదండ్రులు ఉండే ఇల్లు) 🏨🏛️*
👨👩👧👦👩👩👧👧👨👨👧👦👨👩👧👦👩👩👧👧👨👨👧👧👨👩👧👦👩👩👧👧👨👩👧👦
*🌎ప్రపంచములో.... ఆహ్వానం లేకుండా.... మనం... ఎన్నిసార్లు అయిన వెళ్ళగలిగే ఇల్లు "అమ్మ నాన్నలు" ఉండే ఇల్లు 🏘️*
*🏖️ఈ ఒకే ఇల్లు ఒక్కటే... స్వతంత్రముగా.... మనమే తాళం తీసికొని.... నేరుగా ఇంటిలోకి ప్రవేశించవచ్చు.🏪*
*💝ఈ ఇల్లు.... ఒక్కటే.... ప్రేమతో నిండిన కళ్లతో...., మీరు కనిపించే వరకు.... మీ కోసం.... తలుపు వైపు చూడటానికి సిద్ధంగా ఉంటుంది.💖*
*💪మీ చిన్ననాటి ప్రేమ, అప్యాయత, అనురాగము, అనందం మరియు స్థిరత్వం.... మరచి పోకుండా... గుర్తు చేసే ఇల్లు.🤝*
*🙏ఈ ఇంట్లో మాత్రమే.... మీరు తల్లి, తండ్రుల ముఖాలను చూస్తూ.... ఉండటం.... ఒక పూజ అనుకుంటే మరియు వారితో మీరు మాట్లాడటం... వెంటనే లభించే పూజ ఫలితం.🙏*
*❣️మీరు ఆ ఇంటికి వెళ్లకపోతే.... ఆ ఇంటి యజమానుల (అమ్మ నాన్నలు ) మనస్సులు.... కృశించి.... గుండెలు.... గూడలుగా మారతాయి. మీరు నొప్పించినా.... వాళ్లు బాధపడతారు.💘*
*⚜️ఈ ఇల్లు.... ప్రపంచాన్ని చూడటానికి...., ఉన్నతముగా జీవించడానికి మరియు మీ జీవితాన్ని ఆనందంతో నింపడానికి... దీపాలు వెలిగించి నిత్యం దైవాన్ని ప్రార్థించిన ఇల్లు.📛*
*🍇🍍ఈ ఇంటిలో తినే భోజనం మీకు ఎంతో స్వచ్ఛమైనది... మరియు ప్రపంచములో ఉన్న కపట వికారాలకు.... స్థలమే లేనిది.🍑🍎🍈*
*🫢ఇక్కడ మాత్రమే... మీరు భోజన సమయానికి తినకపోతే.... ఆ ఇంటి యజమానుల గుండెలు విరగిపోతాయి మరియు బాధపడతాయి. 😪*
*🥰ఈ ఇంట్లోనే.... మీకు అన్ని పరిపూర్ణమైన నవ్వులు మరియు సంపూర్ణ ఆనందాలు దొరుకుతాయి.😍*
*🧭కారణాలు ఏవయినా కావొచ్చు.... ఈ ఇళ్లకు దూరమవుతున్నా.... పిల్లలారా.... ఈ అమ్మ నాన్నల ఇల్లు విలువ తెలుసుకోండి.... ఆలస్యం కాకముందే....⏰*
*💕తల్లిదండ్రులతో గడుపుతూ.... మరియు తరచూ ఆ దేవాలయం లాంటి ఆ ఇంటికి ఎప్పుడూ... అందుబాటులో ఉండే
ఆవకాశం ఉన్నవారు అదృష్టవంతులు... ధన్యులు. 🙏💐🙏💐🙏💐🙏💐
🙏ఆంజనేయ వైభవం ప్రవచనం:🙏
హనుమంతుని తోకలో ఉండే గంట వెనుక ఉన్న ఆసక్తికరమైన పురాణ కథ !
యుద్ధం తప్ప వేరే మార్గం లేదని నిర్ణయించిన రాముడు కపిసైన్యాన్ని, భల్లూక పటాలంతో జతకూర్చాడు. ఇద్దరు మానవుల కోసం యుద్ధానికి సిద్ధపడ్డాయి కోతులు, ఎలుగుబంట్ల రణానికి తరలివెళుతున్న తమవాళ్ళను కడసారిగా కన్నుల నిండుగా చూసుకుంటున్నాయి వానర కుటుంబాలు. ఒకవైపు స్వామికార్యం, మరొకవైపు పేగుబంధం – ఈ రెండిటికి నడుమ జరుగుతున్న ఘర్షణలో స్వామికార్యానికే పూనుకున్నారు వానర వీరులు. కన్నీళ్ళు కారుతున్నా 'విజయోస్తు…దిగ్విజయోస్తు' అని అంటున్నారు కుటుంబ సభ్యులు.
ఈ దృశ్యాన్ని చూసిన రాముడు కదలిపోయాడు. కరిగిపోయాడు. తన కన్నులలోని చెమ్మను కనిపించనీయకుండా జాగ్రత్తపడ్డాడు. తుది వీడ్కోళ్ళు ముగిసాయి. సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది. అప్పుడు లేచాడు రాముడు –
'ఓ వానరులారా! ప్రాణాస్పదులైన మీ బిడ్డలను, భర్తలను, సోదరులను, బంధువులను నా కోసం, నా స్వార్థం కోసం జరగబోయే యుద్ధానికి పంపిస్తున్నారు. మీ నిస్వార్థతకు నా నమోవాకాలు. నేను అఋణిని. ఎవరీ ఋణాన్ని ఉంచుకోకూడదన్న వ్రతం కలిగినవాణ్ణి. కనుక, ఇదే నా వాగ్దానం. యుద్ధానికి ఎంతమందిని తీసుకువెళ్తున్నానో, అంతమందితోనే వెనక్కు తిరిగి వస్తాను.' అని అన్నాడు.
జనన-మరణాల చక్రాన్ని ఛేదించగలిగే ఏకైక శక్తి చక్రధారి. ఆ చక్రధారే నేడు కోదండధారియై వాగ్దానం చేసాడు. రామన్న అన్న మాట ఎన్నటికీ పొల్లుపోదు. తమవారు తప్పక తిరిగివస్తారన్న ఆనందంతో జయఘోషను చేసింది వానర జాతి……………..
రామ సేవ కోసం కదలిన కపిసైన్యంలో సుగ్రీవుడు, ఆంజనేయుడు, అంగదుడు వంటి మహోన్నత కాయులతో బాటు 'సింగిలీకలు' అని పిలువబడే పొట్టి పొట్టి…మరుగుజ్జు కోతులు కూడా ఉన్నాయి. ఈ సింగిలీక కోతులు కేవలం ఒక్క అడుగు ఎత్తు మాత్రమే ఉంటాయి. వాటికి ఎలాంటి ఆయుధాలు ఉండవు. పదునైన పళ్ళు, వాడియైన గోళ్ళు – ఇవే వాటి ఆయుధాలు. కొన్ని వందల సింగిలీకలు గుంపుగా కలిసి ఒక శత్రువుపై దాడి చేస్తాయి. పళ్ళతో కొరికి, గోళ్ళతో రక్కి చంపుతాయి. ఇదే వాటి యుద్ధతంత్రం.
రామ-రావణ యుద్ధం ఘోరంగా సాగుతోంది. రామలక్ష్మణుల బాణధాటికి, కపివీరుల ప్రతాపానికి ఎందరో రాక్షస వీరులు రాలిపోయారు. రావణాసురుని కుమారులు కూడ ఎందరో ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇక మిగిలింది ఇద్దరే. రావణుడు – కుంభకర్ణుడు. హాయిగా నిద్రపోతున్న కుంభకర్ణుడు అన్న కోసం యుద్ధరంగానికి వచ్చాడు. కుంభకర్ణుడు మహాకాయుడు. నేలపై నిలబడితే, తల ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. అంతటి భారీ దేహం వాడిది. విశాలమైన, ఎత్తైన మహారథంలో కూర్చుని యుద్ధానికి వచ్చాడు. ఆ రథం పైభాగంలో ఉన్న గొడుగుకు చిన్ని చిన్ని గంటలు కట్టివున్నాయి. అవి గలగలా శబ్దం చేస్తుండగా, వికటాట్టహాసంతో వానరులప విరుచుకుపడ్డాడు కుంభకర్ణుడు. ఘోరమైన పోరు తర్వాత రామబాణం దెబ్బకు నేలకూలాడు.రథం నుండి కిందకు పడుతున్న సమయంలో కుంభకర్ణుడి చెయ్యి తగిలి ఒక గంట క్రింద పడింది.
అదే సమయంలో క్రింద యుద్ధరంగంలో వెయ్యిమంది సింగిలీక కోతులు గుంపుగా వెళుతున్నాయి. కుంభకర్ణుని రథం నుండి తెగిన గంట వేగంగా వచ్చి, నేరుగా ఈ కోతుల పైన పడింది. గంటదేమో భారీ ఆకారం. కోతులేమో మరుగుజ్జులు. ఇంకేముంది…ఆ వెయ్యి కోతులూ గంట కింద ఇరుక్కుపోయాయి. ఉన్నట్టుండి చీకటి కమ్ముకుంది.
ఏ చప్పుడూ వినబడకుండా పోయింది. అంతే, ఆ బుల్లి కోతులకు భయం పట్టుకుంది. అలా కొద్దిసేపు గడిచాక, ఎవరూ తమ కోసం రాకపోవడంతో ఒక్కొక్క కోతి ఒక్కొక్క విధంగా మాట్లాడ సాగింది. “మనల్ని కాపాడ్డానికి ఎవరూ రాలేదు. అప్పుడు ఒక ముసలి కోతి సహనంతో ఉందాం. రామ నామ స్మరణ చేద్దాం.' అంది. ఆ పెద్ద కోతి కళ్ళు మూసుకుని రామ తారక మంత్రాన్ని జపించడం మొదలుపెట్టింది. అలసిపోయిన కొన్ని కోతులు ఆ పెద్ద కోతితో చేరి రామ నామాన్ని చేయసాగాయి. అలా అలా కొద్ది కాలంలోనే, అన్ని కోతులు రామ నామ సంకీర్తనలో మునిగిపోయాయి.
ఈలోపు, గంట బైట ఏం జరిగిందో చూద్దాం! రాముడు రావణున్ని సంహరించాడు. సీతమ్మను చేపట్టాడు. విభీషణుడికి పట్టాభిషేకం చేసాడు. ఇక అయోధ్యకు బయల్దేరాలి. అప్పుడు సుగ్రీవుణ్ణి పిలిచి, తన వాగ్దానాన్ని గుర్తు చేసాడు. కపిసైన్యాన్ని లెక్కించి రమ్మన్నాడు. లెక్కలు వేసిన సుగ్రీవుడు రాముడి దగ్గరకు వచ్చి 'ఒక వెయ్యి కోతులు తక్కువగా ఉన్నా' యని చెప్పాడు. మళ్ళీ లెక్కవేయమన్నాడు రాముడు. మళ్ళీ వెయ్యి తక్కువగా ఉందన్నాడు సుగ్రీవుడు. అప్పుడు సాక్షాత్తు రామచంద్రుడే బయల్దేరాడు.
ముందు హనుమ దారి చేస్తుండగా, యుద్ధరంగంలోకి వచ్చాడు రాముడు. ఎటు చూసిన రాక్షసుల శవాలు, విరిగిన రథాలు, కత్తులు, పగిలిన డాళ్ళు. వాటన్నింటి మధ్యా ఎక్కడైనా వానరులు పడివున్నారేమో స్వయంగా వెదుకుతున్నాడు రాముడు. అంతలో, స్వామి దృష్టి ఒక గంటపై పడింది.'హనుమా…' అన్నాడు. పవనసుతునికి తన స్వామి అంతరంగం ఇట్టే అర్థమయింది. వెంటనే తోకను పెంచి…గంటను పైకి లేపాడు.అక్కడ….ఆ గంట క్రింద….పెదవులపై రామనామం తాండవిస్తుండగా, మూసిన కళ్ళతో, రామభక్తితో వికసించిన మనసులతో కూర్చునివున్న కోతులు. సుగ్రీవుడు చకచకా లెక్కవేసాడు. వెయ్యి సింగిలీక కోతులు. లెక్కసరిపోయింది. చుట్టూవున్న వానర సైన్యం ఒకపెట్టున 'జయ జయ రామ….జయ జయ రఘురామా” అంటూ జయఘోషను చేసింది.
అప్పటి వరకూ చీమ చిటుకుమన్న శబ్దం కూడ వినని మరుగుజ్జు కోతులు అపార పారావార ఘనఘోర తరంగ ఘోషలా వినబడిన జయజయ ధ్వానాలకు ఉలిక్కిపడ్డాయి. చటుక్కున కళ్ళు తెరిచాయి. చీకటికే అలవాటు పడినపోయిన కళ్ళతో ధగధగా మెరుస్తున్న సూర్యకాంతిని చూడలేక, కళ్ళకు చేతుల్ని అడ్డుపెట్టుకుని, నెమ్మదిగా చూడసాగాయి.అదిగో…ఎదురుగా….ఆజానుబాహుడు…అరవిందదళాయతాక్షుడు …నిశాచరవినాశకరుడు, భక్తకోటికి శీతకరుడు అయిన రాముడు నిలబడివున్నాడు.
అంతే….సింగిలీక కోతులకు దిగ్భ్రమ కలిగింది. దిక్కులు తోచలేదు. ఏం చెయ్యాలన్న ఆలోచన రాలేదు. వానరసైన్యం మరొక్కమారు జయఘోషను చేసింది. 'జై శ్రీరామ…జై శ్రీరామా”అప్పుడు తెలిసింది ఏం చేయాలో…వెంటనే రామపాదారవిందాలపై పడ్డాయి ఆ బుల్లి కోతులు. 'రాముడు మోసగాడు' అన్న ఈ కోతిని, 'హనుమంతుడు బుద్ధిహీనుడు' అన్న ఆ కోతిని తాకాయి రామస్వామి మృదు హస్తాలు. ఎవరి వీక్షణం భవసాగరాన్ని తారణం చేయిస్తుందో అటువంటి రామ వీక్షణం 'తారక మంత్రమే త్రోవ' అన్న పండుకోతిపై ప్రసరించాయి. అలా సింగిలీక కోతుల జన్మలు ధన్యమయ్యాయి. ఇప్పుడు రాముని దృష్టి హనుమ వైపుకు మళ్ళింది.
'సుందరే సుందరం కపిః' – ముద్దైన కోతి తోకకు ముచ్చటైన గంట. మురిపెంగా చూసాడు ముగ్ధమోహనుడైన రాముడు. 'హనుమా! రాముడు మాట తప్పడు అనడానికి ఉదాహరణగా నిలిచే ఈ సింగిలీక కోతుల కథకు గుర్తుగా, తోకతో గంటను కలిగిన నీ రూపాన్ని ఎవరు చేతులారా అర్చిస్తారో, మనసారా ప్రార్థిస్తారో – వారికి నా అనుగ్రహం రెండింతలుగా లభిస్తుంద'ని వరమిచ్చాడు శ్రీరాముడు. వాలంలో ఘంటను కలిగిన వానరశ్రేష్టుణ్ణి దర్శించేప్పుడు, పూజించేప్పుడు ఈ సింగిలీక కథను గుర్తుచేసుకోండి.
🚩🚩 సర్వేజనా సుఖినోభవంతు 🚩🚩
చిన్న కథ చెప్తా చదవండి
🙏పూర్వం ఒక ఊరిలో చాలామంది కోటీశ్వరులుండేవారు.
వారికి ఎన్ని కోట్లు ధనముంటే అన్ని జెండాలను వారి మేడలపై ఎగురవేస్తుండేవారు. అటువంటి ఊళ్లో ఒకనాడు ఒక సాధుపుంగవుడు ప్రవేశించాడు. ఆయన ఆ జెండాల గురించి తెలుసుకొని అన్నింటిలోకి ఎక్కువ జెండాలున్న ఇంటిలోనికి ప్రవేశించాడు. ఆ ఇంటి యజమాని అరుగుమీదే కూర్చుని ఈ సన్యాసిని చూశాడు. "ఓహో ఏదో ఒక వంక పెట్టి నా దగ్గర డబ్బులు కాజేయడానికి కాబోలు వచ్చాడు ఈ దొంగ సన్యాసి" అని తలచి, స్వామి! ఈ ఇంటి యజమాని వూళ్లో లేడు. మీరింక వెళ్లవచ్చును అన్నాడు సన్యాసితో. ఆయనకు వెంటనే విషయం తెలిసిపోయింది.
-
'అలాగా! పాపం నేనాయనకు ఒక గొప్ప ఉపకారం చేద్దామని వచ్చానే! ప్రాప్తం లేదన్నమాట! అంటూ వెనుదిరిగాడు. అపుడతను పరుగున వెళ్లి సన్యాసితో 'స్వామి! నేనే ఈ ఇంటి యజమానిని. నన్ను క్షమించండి. లోపలికి వచ్చి నన్ను అనుగ్రహించండి' అని ప్రార్థించాడు. లోపలికి తీసుకొని వెళ్లాక ఆ సన్యాసి అతనికి ధర్మసూక్ష్మాలు తెలియజేయడం ప్రారంభించాడు. చాలాసేపు విన్నాక యజమాని 'స్వామి! నా సమయం చాలా విలువైనది. నేనిలా వ్యర్థప్రసంగాలు వింటూ కూర్చుంటే నాకు కొన్ని లక్షలు నష్టం వస్తుంది. త్వరగా మీరు చేద్దామనుకున్న ఉపకారం ఏమిటో అనుగ్రహించండి అని తొందర పెట్టాడు.
-
అపుడా సన్యాసి యజమానితో ఇలా అన్నాడు. 'నీ ఆయుర్దాయం ఇక ఆరు సంవత్సరాలే ఉంది' ఇదేనా ఆ గొప్ప ఉపకారం? అన్నాడు ధనికుడు అసహనంగా. సన్యాసి అతనికొక సూది ఇచ్చి 'ఇది చాలా మహిమగల సూది. దీనిని నీ దగ్గర భద్రంగా దాచి, నువ్వు చనిపోయిన తర్వాత జాగ్రత్తగా నాకు చేర్చు అన్నాడు.
-
ధనికునికి కోపం తారాస్ధాయినంటింది. 'నీకు మతి చలించిందా? నేను చచ్చాక ఆ సూదిని నాతో తీసుకొని పోతానా? నీకెలా అందజేస్తాను' అని అరిచాడు. ఆ సాధుపుంగవుడు శాంతంగా 'నాయనా! మరణించాక ఈ సూదినే తీసుకొని పోలేనివాడివి ఈ లక్షలు, కోట్లు తీసుకొని పోగలవా? అని ప్రశ్నించాడు. ఆ వాక్యం ధనికుణ్ణి ఆలోచింపజేసింది. తద్వారా ధనికునికి జ్ఞానోదయమైంది. ఆసన్యాసి కాళ్లపై బడి 'స్వామీ! ఇప్పటి వరకూ అజ్ఞానంలో పడి కొట్టుకుంటూ ఎంత జీవితాన్ని వృధా చేసాను! ఇప్పటి నుండి దానధర్మాలు చేసి కొంత పుణ్యాన్నైనా సంపాదిస్తాను' అన్నాడు. ధనికుడు ఆ మరునాడు చాటింపు వేయించాడు. బంగారు నాణాలు పంచుతానని, అవసరమైన వారంతా వచ్చి తీసికొనండొహో!! అని. ఇంకేం? బోలెడంతమంది వచ్చి లైను కట్టారు. ధనికుడు గుమ్మం వద్ద తన గుమాస్తానొకడిని కూర్చోబెట్టాడు. నాణాలు పట్టికెళ్లినవారు ఏమంటున్నారో వ్రాయి అని అతడికి చెప్పాడు. ఆరోజు ఉదయం నుండి సాయంకాలం దాకా ధనికుడు వచ్చిన వారందరికీ ఇరవయ్యేసి బంగారు నాణాలు పంచాడు. సాయంకాలం పిలిచి ప్రజల అభిప్రాయాలు ఏమని వ్రాసావో చదవమన్నాడు.
గుమాస్తా చదవడం ప్రారంభించాడు.
-
1వ వాడు: ఇంకో 20 నాణాలిస్తే వీడిసొమ్మేం పోయింది? పిసినారి పీనుగ!
2వ వాడు: ఇంకో పదినాణాలు వేస్తే గానీ ఈ పూటకి తాగడానికి సరిపడా మద్యంరాదు. ఆ పదీ కూడా ఇవ్వచ్చు కదా. 3వవాడు: అయ్యో! దీనికి మరో ఎనభై నాణాలు కలిపి ఇవ్వకూడదూ? నా కూతురికి ఓ నగ కొందును కదా?అంతట ధనికుడు చెవులు మూసుకున్నాడు. చాలు చాలు చదవకు.. అని సాధు పుంగవుని వద్దకు పరుగెత్తాడు. స్వామీ, నేను ఈవిధంగా దానమిస్తే అందరూ ఏదో ఒక రకంగా అసంతృప్తే వ్యక్తపరచారు. ఎవరైనా సంతృప్తి పడితే నాకు పుణ్యం వస్తుంది కానీ అసంతృప్తి చెందితే నాకు పుణ్యం ఎలా వస్తుంది.. అంటూ వాపోయారు.
సాధువతనిని ఓదార్చి 'బాధపడకు నాయనా! ఈసారి షడ్రసోపేతంగా వండించి అందరికీ మంచి భోజనాలు పెట్టించు' అని బోధించాడు. ధనికుడు తన ఇంట్లో భోజనానికి రమ్మని మళ్లీ ఊరంతా చాటింపు వేయించాడు. మళ్లీ తన గుమాస్తా ప్రజల అభిప్రాయాలను వ్రాయమన్నాడు. మరునాడు రకరకాల పిండివంటలతో ఊరందరికీ కమ్మని భోజనం పెట్టాడు. ఆ సాయంత్రం తిరిగి గుమాస్తాను పిల్చి ప్రజాభిప్రాయాలు చదవమన్నాడు.
.
1వ వాడు: అన్నదాతా సుఖీభవ!
2వ వాడు: ఇంత కమ్మని భోజనం చేసి ఎన్నాళ్లయింది? బాబుగారు చల్లగా ఉండాలి.
3వ వాడు: అమ్మయ్య ! ఆకలి చల్లారింది. అయ్యగారు ఆరి బిడ్డలు, అందర్నీ దేవుడు చల్లగా చూడాలి.
.
దాదాపు అందరూ ఇటువంటి అభిప్రాయాలే వ్యక్తపరచారు. ధనికుడు వింటూ ఆనందంతో పొంగిపోయాడు.
కోట్లు సంపాదించినపుడు అతడికి లభించని సంతృప్తి ఆనాడు లభించింది. అన్నదాన మహిమ ఎంతటిదో అతడు గుర్తించాడు.
ఆరోజు నుండి నిత్యం అన్నదానం చేస్తూ అనేక అన్నదాన సత్రాలు కట్టించి , పేదవారి క్షుద్భాధను తీరుస్తూ అతడు తరించాడు.🙏
చేతనైనంత వరకు అన్నదానం చేద్దాం
ఆ పరమాత్మ ప్రేమను పొందుధాం 🙏
శివయ్య అందరిని చల్లగా చూడు తండ్రి 🙏
......
*వాణిజ్య సందర*
మంచు కొండల మనోహరం పచ్చని చెట్ల కోలాహలం పసందైన *ప్రకృతి* ఓ వరం
చల్లని వాతావరణ పర్యావరణ ప్రామాణికం నిత్య వాన శోభిత మయం *సుందర దృశ్య* మనో కావ్యం
పోలీసు కానరాని **కూడలి వ్యవస్థ రూపం* * నిశ్శబ్ద నిరంతర వాహన చోదక *కాలుష్య రహిత* గమన గమ్య రాగం కాల వేగ ఘమనంలో *ఏకాకులు* వారాంతపు కలయికలో *ప్రాంతీయ వాదులు* శుభ్రతకు పరిశుభ్రతకు మార్గదర్శకులు నిర్దేశకులు
పాదచారులను గౌరవించే_ *వివేకవంతులు* ఉన్నంతలో విజ్ఞానవంతులు వివేకవంతులు
శారీరక కష్టానికి నోచుకోని జీవులు దూర ధారాల బాధ తప్పితే గగన శోభిత సుందర ప్రదేశం అతి మనోహరం ఆనందకరం ఆరోగ్యకరం సంపాదించే వారికి ఐశ్వర్య వకరం పోర్టు ల్యాండ్.. వెరసి ఒక *వాణిజ్య సందర* *మనోహహర నగరం* *ప్రశాంతతకు* నిలయం
*******