Wednesday, 24 April 2024

 🙏


*దేవుడంటే ఏంటి? పూజ చేయకపోతే ఏమవుతుందో తెలుసుకుందాం.*

 చిన్నపిల్లలే కాదు… నేడు చదువుకున్న పెద్దవాళ్ళు కూడా అడిగే ప్రశ్న ఇది.*GB

*మనవాళ్లు వెంటనే చెప్పే సమాధానం… "అలా మాట్లాడితే కళ్లుపోతాయి" అని*.

*మనకు భవవంతుని గురించి అవగాహనలేనప్పుడు, చెప్పడం చేతగానప్పుడు, మనం వాడే మాట అదే!*.

*కళ్లు పోగొట్టడానికి దేవుడేం శాడిస్ట్‌ కాదు గదా!*

మనం చెప్పాల్సిన సమాధానం అది కాదు.

తెలియని వారికి అలా చెప్పడం వల్ల వారికి దేవునిపై మనసు విరిగే ప్రమాదం ఉందని గ్రహించాలి.

*పూజ అనేది కూడా ఒక యోగ ప్రక్రియ… మనసుతో చేసే వ్యాయామం*…

*మన తెలివితేటలు, జ్ఞానం పెరగడానికి మన మెదడుని మనమే ట్యూన్‌ చేసుకునే ప్రక్రియ…*

*"దీప ప్రజ్వలనం" అనేది "త్రాటకం" అనే యోగ ప్రక్రియ.*

*రోజూ ఓ మూడు నిమిషాలు నూనె దీపాన్ని తదేకంగా చూస్తే కంటి జబ్బులను అరికట్టవచ్చు అని పెద్దలు చెప్పిన మాట.*

*ఏదైనా కష్టమైన మంత్రాన్ని ఓ 11 సార్లు జపిస్తే నాలిక మొద్దుబారదు. అది నాలికకు ఎక్సర్‌సైజ్‌.* అందువల్ల ఎటువంటి కష్టమైన పదాలనైనా పలకగలిగే శక్తి వస్తుంది,

*ధారణ శక్తి పెరుగుతుంది*. భాష మీద పట్టు పెరిగితే స్టేజ్‌ ఫియర్ కూడా‌ పోతుంది.

పూజ అంటే చాదస్తం కాదు. మన ఆరోగ్యం, మన జ్ఞానానికి సంబంధించిన విషయమని చెప్పండి.

*మన హిందూ ధర్మాన్ని ప్రోత్సహించండి.*

అదే సమయంలొ మూడ విశ్వాసాలకు దూరంగా ఉండే విధంగా పిల్లలను తయారు చేయాల్సిన భాద్యత కూడా పెద్దవారిపై ఉంది…

*1. మూలవిరాట్* 🚩

భూమిలో ఎక్కడైయితే Electronic & Magnetic తరంగాలు కలుస్తాయో అక్కడ "మూల విరాట్" ఉంటుంది. ప్రతిష్ఠించే ముందు రాగి రేకులను కాల్చి ఉంచుతారు. అవి ఈ తరంగాలకు Catalyst గా పని చేస్తాయి.

*2. ప్రదక్షిణ* 🚩

మనం గుడి చుట్టు Clockwise Directionలో తిరిగినపుడు ఆ తరంగాల శక్తి మన దేహానికి వస్తుంది. గుడిలోనే దేవుడు వుంటాడా అనేది ఒక వాదన… ఎక్కడైన వుంటాడు కాని ఈ దేవాలయ దర్శనం అందుకు పెట్టారు? పుణ్యక్షేత్రాలు Vedic Architecture మీద ఆధారపడి వుంటాయి. యివి మన శరీరంలోని "షఠ్ చక్రాలను" ప్రభావితం చేస్తాయి.

 *3. ఆభరణాలతో దర్శనం* 🚩

ఆడవారిని మగవారిని నగలు వేసుకుని గుడికి వెళ్ళమనేది మన సంపదను చూపించడానికి కాదు… బంగారం వంటివి ఈ తరంగాలను బాగా గ్రహిస్తాయని.

 *4. కొబ్బరి కాయ* 🚩

ఇది "స్వచ్ఛత"కు గుర్తు. పై 'టెంక మన 'అహంకారాన్ని'… దాన్ని పగలగొడితే వచ్చే 'కొబ్బరి' మన 'కల్మషం లేని మనసును'… అవతలి వారి ప్రేమ కొబ్బరినీళ్ళు అంత తియ్యగా ఉంటాయి అనడానికి సంకేతం.

 *5.మంత్రాలు* 🚩

ఉదాహరణకు మనం ఒక ఫోన్ నెంబర్ గుర్తుంచుకోవాలి అంటే 96.. 26.. అలా ఒక పధ్ధతిలో అమరుస్తాం.. అంటే మనకి తెలియకుండానే Neuronsని ఆక్టివేట్ చేసి డేటాని దాస్తున్నాం… అదే విధంగా మంత్రోచ్ఛారణలు అక్షర నియమంతో ఒక లయను కల్గి Neuronలను ఉత్తేజపరువస్తాయి.

*6. గర్భగుడి* 🚩

గర్భగుడి ద్వారం ఒక వైపుకు ఉండటం వల్ల ఆ శక్తిని మన శరీరం గ్రహిస్తుంది. అందుకే మరీ ఎదురుగా కాక ఒక వైపుకు ఉండమంటారు.

*7. అభిషేకం* 🚩

విగ్రహాలు పంచ లోహాలతో ఉంటాయి… వాటికి పాలు, తేనె వంటి వాటితో అభిషేకించినపుడు కింద ఉన్న తరంగాల శక్తితో ఔషధ గుణాన్ని సంతరించుకుంటాయి. అంతేగాని సినీ కటౌట్ లకు పాలాభిషేకాలు మూర్ఖత్వం.

*8. హారతి* 🚩

పచ్చ కర్పూరానికి ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి …హారతి తీసుకునేటపుడు ఆ వెచ్చదనాన్ని మన కంటికి తగిలేలా చేయాలి… దీనికి ఆయుర్వేద పరిభాషలో స్వేదకర్మ అని పేరు. ఊరికే గాల్లో హారతి తీసుకుంటే చాలదు.

*9. తీర్థం* 🚩

ఇందులో పచ్చకర్పూరం, తులసి, లవంగాలు ఇలా ఎన్నో పంచామృతంతో అభిషేకం చేసినవి తీర్థంగా ఇస్తారు.

*10. మడి* 🚩

తడిబట్టలకి ఆక్సిజన్ ని ఎక్కుiవగా తీసుకునే గుణం ఉంటుంది. అందుకే మడి.!

*ఇవన్నీ మూఢనమ్మకాలు చాదస్తాలు అనుకుంటున్నాం  కానీ పెద్దలు చెప్పే మాటల్లో ఎన్ని సత్యాలు ఉన్నాయో!🙋‍♂️*

మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ శర్మ......101

*****

*రొటీన్ జీవితం బోర్ కొడుతుందా ?😒అవలోకించండి .మన తెలుగు భాష కే చెందిన అవధానంలో .... అప్రస్తుత ప్రసంగాలు - సరదాగా* 😉


*ప్రశ్నికుడు*:- 

1 . రైలు పట్టాలకూ,

     కాలి పట్టాలకూ 

     అనుబంధం ఏమిటి?


*అవధాని:-*

  రైలు పట్టాల మీద వుంటుంది,

   కాలి మీద పట్టాలుంటాయి.


*ప్రశ్నికుడు*

2 . కనలేని స్త్రీమూర్తి ఎవరు?


*అవధాని:-*

    న్యాయస్థానములో వున్న

     న్యాయదేవత. 

     కళ్ళకు *గంతలు* కట్టి    

     వుంటారు కదా!


*ప్రశ్నికుడు*

3 . సోమవారాన్ని 'మండే'       అనెందుకంటారు?


*అవధాని*

ఆదివారం హాయిగా భోంచేసి పడుకుంటాము కదా సోమవారం పొద్దున్నే

పనికెళ్లాలంటే ఒళ్ళు మండుతుంది కదా! 

అందుకని 'మండే' అంటారు.


*ప్రశ్నికుడు*

4 . ఒక పిల్లవాడు ఇంటినుండి పారిపోతే కనిపించుటలేదు అని ప్రకటిస్తారు కదా! దానికి పిల్లాడి స్పందన ఏమిటి?


*అవధాని*

      *కని-పెంచుట* లేదు .


*ప్రశ్నికుడు*

5 . ఈ రోజుల్లో పిల్లలు 

     తల్లిని Head Cook గా

     చూస్తున్నారు . 

     మరి తండ్రిని

     ఎలాచూస్తున్నారు?


*అవధాని*

   *ATM* లాగా చూస్తున్నారు.


*ప్రశ్నికుడు*

6 . సభలో ఎవరైనా 

      ఆవులిస్తే మీరేమి చేస్తారు?


*అవధాని*

       పాలిచ్చేవైతే , అవధానం

        అయ్యాక యింటికి    

        తోలుకెళ్తా .


*ప్రశ్నికుడు*

7 . మనిషికి 

      ఆనందాన్నిచ్చే సిటీ ఏది?


*అవధాని* 

       పబ్లిసిటీ


*ప్రశ్నికుడు*

8 . తుద+ తుద = తుట్టతుద,

      కడ  + కడ = కట్టకడ

      అవుతుంది కదా! 

      అరటి + అరటి 

      ఏమవుతువుంది?


*అవధాని*.

      అర టీ + అర టీ 

     *ఫుల్ టీ* అవుతుంది.


*ప్రశ్నికుడు*

9 . క్రికెట్ ప్లేయరుకీ, 

     అవధానికీ 

     సామ్యం ఉందా?


*అవధాని*.

      వాళ్ళు  *world play* కి    

       వెళ్తారు , 

       మేము  *words play* కి    

        వెళ్తాము.


*ప్రశ్నికుడు*

10 . 'పురుషులందు పుణ్యపురుషులు వేరయా' అన్నాడు వేమన, ఇప్పుడు మీరేమంటారు? 


*అవధాని*.

     "పురుషులందు

       పుణ్యపురుషులు 

      *ఏరయా?* అంటాను.


*ప్రశ్నికుడు-*

11 . దేవుని గుడికి 

        తాళం వెయ్యాలా?


*అవధాని*

        భజన జరిగే చోట 

        *తాళం* తప్పనిసరి.


*ప్రశ్నికుడు*

12 . అద్దం ముందున్న

        ఆడువారికీ,

        మైకు ముందున్న

        అమాత్యులకీ 

        తేడా ఏమిటి?


*అవధాని*

      ఇద్దరికీ *సమయం*     

      తెలియదు!


 చదివి ఆనందించండి.

పద ప్రయోగ వినోదాన్ని పదిమందికీ పంచండి.


స్వచ్ఛమైన...నవ్వు నవ్వండి.

 మన భాషను అందులోని గాంభీర్యాన్ని సోయగాన్ని, శ్లేషను, చతురతను తెలుసుకోండి.


తెలుగు భాషకు మాత్రమే ఇది స్వంతము 🌹🚩

ప్రాంజలి ప్రభ కథలు

వృద్ధాప్యంలో ఏమిటీ గందరగోళం?

"నాల్గవ సంవత్సరం మెడిసిన్ విద్యార్థులకు నేను క్లినికల్ మెడిసిన్ నేర్పించినప్పుడల్లా, నేను ఈ క్రింది ప్రశ్న అడుగుతాను:

"వృద్ధులలో మానసిక గందరగోళానికి కారణాలు ఏమిటి?"

కొందరి సమాధానం: "తలలో కణితులు".

నేను: కాదు!

ఇతరులు: "అల్జీమర్స్ యొక్క ప్రారంభ లక్షణాలు".

నేను: కాదు!
 
సమాధానాల తిరస్కరణతో, వారి నుంచి స్పందన ఆగిపోయింది

అప్పుడు నేను చెప్పిన సమాధానం విని వాళ్లంతా నోరు తెరిచేసారు:

- నిర్జలీకరణం


 
ఇది ఒక జోక్ లాగా ఉండవచ్చు; కానీ అది నిజం

60 ఏళ్లు పైబడిన వ్యక్తులలో సాధారణంగా దాహం అనుభూతి ఆగిపోతుంది. తత్ఫలితంగా, ద్రవాలు తాగడం మానేస్తారు.
ఫ్లూయిడ్స్ తాగమని గుర్తు చేయడానికి ఎవరూ లేనప్పుడు, వారు త్వరగా డీహైడ్రేట్ అవుతారు.

నిర్జలీకరణం తీవ్రమైనది మరియు మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది ఆకస్మిక మానసిక గందరగోళం, రక్తపోటు తగ్గడం, గుండె దడ పెరగడం, ఆంజినా (ఛాతీ నొప్పి), కోమా మరియు మరణానికి కూడా కారణం కావచ్చు.
 
ద్రవాలు తాగడం మరచిపోయే ఈ అలవాటు 60 ఏళ్ల వయస్సులో ప్రారంభమవుతుంది, మన శరీరంలో కేవలం 50% కంటే ఎక్కువ నీరు ఉంటే, 60 ఏళ్లు పైబడిన వారికి తక్కువ నీటి నిల్వ ఉంటుంది. ఇది సహజ వృద్ధాప్య ప్రక్రియలో భాగం.
 
ఇక్కడ మరొక ఇబ్బంది ఉంది. అదేమిటంటే వారు నిర్జలీకరణానికి గురైనప్పటికీ, వారు నీరు త్రాగాలని భావించరు, ఎందుకంటే వారి అంతర్గత సమతుల్య విధానాలు సరిగా పనిచేయకపోవడం వలన.

ముగింపు:
 
60 ఏళ్లు పైబడిన వ్యక్తులు సులభంగా డీహైడ్రేట్ అవుతారు, వారికి తక్కువ నీటి సరఫరా ఉన్నందున మాత్రమే కాదు; వారు శరీరంలో నీటి కొరతను అనుభూతి చెందరు కాబట్టి.

60 ఏళ్లు పైబడిన వ్యక్తులు ఆరోగ్యంగా కనిపించినప్పటికీ, ప్రతిచర్యలు మరియు రసాయన విధుల పనితీరు వారి మొత్తం శరీరాన్ని దెబ్బతీస్తుంది.
 
అందువల్ల  రెండు విషయాలు బాగా గుర్తు పెట్టుకోండి

1) నీరు & ద్రవాలు తాగడం అలవాటు చేసుకోండి. ద్రవాలలో నీరు, రసాలు, గ్రీన్ టీలు, కొబ్బరి నీరు, సూప్‌లు మరియు పుచ్చకాయ, పుచ్చకాయ, పీచెస్ మరియు పైనాపిల్ వంటి నీరు అధికంగా ఉండే పండ్లు ఉన్నాయి; ఆరెంజ్ మరియు టాన్జేరిన్ కూడా పని చేస్తాయి.
 
ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రతి రెండు గంటలకు, తప్పనిసరిగా కొంత ద్రవాన్ని త్రాగాలి.

ఇది బాగా గుర్తుంచుకోండి:

2) కుటుంబ సభ్యులకు హెచ్చరిక: 60 ఏళ్లు పైబడిన వారికి నిరంతరం ద్రవాలను అందించండి. అదే సమయంలో, వారిని గమనించండి.
 
వారు ద్రవాలను తిరస్కరిస్తున్నారని మరియు ఒక రోజు నుండి మరొక రోజు వరకు వారు చికాకుగా, ఊపిరి పీల్చుకోకుండా లేదా శ్రద్ధ లేకపోవడాన్ని ప్రదర్శిస్తున్నారని మీరు గ్రహించినట్లయితే, ఇవి దాదాపుగా నిర్జలీకరణం యొక్క పునరావృత లక్షణాలు అని గ్రహించండి
****


🤝మన కర్మలకు పద్దెనిమిది మందిసాక్షులు🙏

🤝చుట్టూ ఎవరూ లేనప్పుడు తప్పుడు పనులకు తెగించడం మానవ బలహీనత...కానీ...
🤝‘నేను ఒక్కడినే కదా ఉన్నాను,
నన్ను ఎవరూ గమనించడం లేదు’
అని మనిషి అనుకోవటం చాలా పొరపాటు .
🤝మనిషి ఏ పని చేస్తున్నా నిశితంగా గమనించేవి మూగసాక్షులు పద్దెనిమిది ఉన్నాయి . అవి
నాలుగు వేదాలు, పంచభూతాలు, అంతరాత్మ, ధర్మం, యముడు, ఉభయ సంధ్యలు, సూర్య చంద్రులు, పగలు, రాత్రి .
🤝వీటినే అష్టాదశ మహా పదార్థాలు అంటారు . ఈ మూగసాక్షులు మనిషిని అనుక్షణం నీడలా పర్యవేక్షిస్తుంటాయి .
🤝ఇవి మనలోకంలోని న్యాయస్థానాల్లో సాక్ష్యం చెప్పపోవచ్చును గాని,
🤝వీటి గమనిక నుండి మనిషి తప్పించుకోవడం సాధ్యపడదు .
🤝దీన్ని గుర్తించలేని కారణంగానే ఇవన్నీ జడ పదార్థాలేనని, సాక్ష్యం చెప్పడానికి నోరులేనివని మానవుడు భ్రమపడుతుంటాడు .
🤝ఈ మహాపదార్థాలు రహస్యయంత్రాల వంటివి .
🤝అవి మనిషి ప్రతి చర్యనూ నమోదు చేస్తాయి .
🤝ఆ నివేదికల్ని విధికి చేరవేస్తాయి . అది వాటిని కర్మలుగా మలుస్తుంది . మనిషి చేసే పనులు మంచి అయితే సత్కర్మలుగా, చెడ్డవి అయితే దుష్కర్మలుగా విధి నిర్ణయిస్తుంది . సత్కర్మలకు సత్కారాలు, దుష్కర్మలకు జరిమానాలు అమలవుతాయి .
🤝అవి ఏవో మరుజన్మకో ఆ తరువాతో ఫలిస్తాయని అనుకోకూడదు, ఈ జన్మలోనే అమలు చేయబడవచ్చు .
🤝ఇది నిరంతరాయంగా సాగిపోయే సృష్టిపరిణామక్రమం .
🤝అంతరాత్మ అనేది ఒకటుందని ప్రతి మనిషికీ తెలుసు .
🤝అది మనం చేసే పని మంచిదా ? చెడ్డదా ? అనే విషయాన్ని ఎప్పటికప్పుడే చెప్పేస్తుంది .
🤝 కానీ ఆవేశం, కోపంతో విచక్షణ కోల్పోయిన వ్యక్తి అంతరాత్మ సలహాను కాలరాస్తాడు అది అనర్థాలకు దారితీయటం మనందరికి అనుభవమే .
🤝 ఒక్కోసారి అంతరాత్మ నిలదీస్తున్నప్పుడు పశ్చాత్తాపంతో సిగ్గుతో తలదించుకుంటాం .
కానీ దీన్ని మనమెవరితోనూ పంచుకోము . అందువల్ల అంతరాత్మ అనుభవపూర్వకంగా నిజమైనప్పుడు మిగతా పది హేడు కూడా నిజమేనని గ్రహించగలగటం వివేకం .
🤝నలుగురికీ తెలిసేలా దానధర్మాలు, క్రతువులు, పూజలు నిర్వహించాలన్న కుతూహలం అవివేకం .
🤝అష్టాదశ సాక్షులు ఎల్లవేళలా గమనిస్తున్నాయంటే, ఎవరు చూడాలో వాళ్ళు చూస్తున్నట్లేగా అర్థం .
🤝ఈ ఎరుక కలిగినప్పుడు ఏ మనిషీ చెడ్డ పనులు చేయటానికి తెగించడు .
🤝ఎవరు చూసినా చూడకపోయినా మంచితనంతో, తోటి వారికి సాధ్యమయినంత సహాయం చేయాలనే సత్‌సంకల్పంతో జీవితాన్ని గడపడం ఉత్తమం . ఈ జ్ఞానం వల్ల మనిషి సాధ్యమైనన్ని మంచిపనులు చేయడానికి పయ్రత్నిస్తూ సుఖశాంతులకు నోచుకుంటాడు 👋.
🚩🙏🙏🙏🚩
*🙏🏻🌹శుభోదయం*🌹🙏🏻

_*💫అన్నం..*_
              _*పరబ్రహ్మ...*_
                   _*స్వరూపం !! 🎊*_
➖➖➖➖➖➖➖✍️

*_మంత్రి పదవి లభిస్తే కొండ మీది హనుమను దర్శించు కుంటానని మొక్కు కున్నాడు రాయుడు. రాయుడికి మంత్రి పదవి లభించింది. కొండమీది హనుమంతుడిని దర్శించుకొని కొండకింద వున్న తిక్కశంకరయ్య హోటల్ లో భోజనం చేద్దామని సిబ్బందితో సహా వెళ్ళాడు._*

*_అక్కడి హోటల్ని చూసి విస్తుపోయాడు. రెండు అంతస్తులతో వైభవోపేతంగా వుంది, చాలా కార్లు నిలిచి వున్నాయి. అక్కడ జనం కూడా చాలా మందే వున్నారు._*

*_30 ఏళ్ళ క్రితం అక్కడ చిన్న పెంకుటింట్లో వుండేది ఆ హోటల్. ఆ హోటల్ని శంకరయ్య అనే ఒక విశ్రాంత ఉపాధ్యాయుడు నడిపేవాడు. అరటి ఆకుల్లో భోజనం పెట్టేవాడు. రెండుకూరలు, రెండు పచ్చళ్ళు, పప్పు పులుసు అన్నీ ఉండేవి మంచి ఘుమ ఘుమ లాడే నెయ్యి కూడా వేసేవాడు. గడ్డ పెరుగు కూడా వేసేవాడు. ‘హాయిగా తినండి. నిదానంగా తినండి తొందరేమీ లేదు’ అని అంటూ అన్ని బల్లల దగ్గరికీ బెత్తం పట్టుకొని తిరిగేవాడు._*

*_'ఎంత కావాలో అంతే పెట్టించుకోండి ఆహారాన్ని వృధా చెయ్యకండి !’ అని హెచ్చరిస్తూ తిరిగేవాడు. ఎవరైనా పారేస్తే చెయ్యి చాపమని బెత్తంతో కొట్టేవాడు. ఎంత పెద్దవాళ్ళయినా, చిన్నవాళ్ళయినా పారేస్తే దెబ్బలు తినాల్సిందే._*

*_బళ్ళో పిల్లలు తప్పు చేస్తే ఎలా కొట్టే వాడో ఇక్కడా అంతే. అక్కడ వేరే మంచి హోటల్ లేకపోవడంతో అక్కడ పదార్థాలు చాలా రుచిగా వుండడంతో  అందరూ అక్కడికే వచ్చేవాళ్ళు. అందరూ అతన్ని తిక్కశంకరయ్య అని పిలిచేవారు._*

*_రాయుడు అప్పట్లో రాజకీయాల్లోకి రాలేదు. పెద్ద వ్యాపారవేత్తగా డబ్బు బాగానే గడించాడు. అప్పట్లో తనకు వ్యాపారంలో ఎక్కువ లాభాలు వస్తే కొండ మీది హనుమను దర్శించుకుంటానని మొక్కుకొని లాభాలు బాగా రాగానే కొండమీది స్వామిని దర్శించుకొని ఆ హోటల్ లో భోజనం చేద్దామని వచ్చాడు._*

*_శంకరయ్య ఎంత చెప్తున్నా వినకుండా అది వెయ్యండి యిది వెయ్యండి. అని అన్నీ వేయించుకొని తిన్నంత తిని సగం పారవేసి చెయ్యి కడుక్కున్నాడు. అది చూసి శంకరయ్యకు కోపం నసాళానికి అంటింది._*
*_బెత్తం పట్టుకొని రాయుడి దగ్గరకు వచ్చి చేయి చాచమన్నాడు._*

*_చుట్టూ వున్నవాళ్ళు ‘అతను ఎవరనుకున్నావు ? పెద్ద జమీందారు ! అయినా డబ్బు చెల్లిస్తున్నాం మా యిష్ట మొచ్చినంత  తింటాం పారేస్తాం నీకేమిటి ?’ అన్నారు అతని వెంట వచ్చినవాళ్ళు._*

*_”మీరు డబ్బు చెల్లించినా సరే పారెయ్యడానికి మీకు హక్కు లేదు. ఎన్ని కోట్లు డబ్బు వున్నా ఆకలేస్తే డబ్బు తింటారా ? మీకందరికీ కూడా సామాజిక బాధ్యత వుండాలి, బరువూ బాధ్యత తెలుసుకొని నడుచుకోవాలి, అన్నాన్ని పారేస్తే మీకు ఎప్పుడయినా ఆకలి వేసినప్పుడు అన్నం దొరకదు. ‘అన్నం పరబ్రహ్మ స్వరూపం !’  దాన్ని వృధా చెయ్యకూడదు. ఇలా వ్యర్థం చేస్తే మీ తరువాతి తరాలవారికి తినడానికి తిండి దొరకదు అన్నాడు._*

*_రాయుడు నవ్వుతూ చెయ్యి జాచాడు. శంకరయ్య బెత్తంతో గట్టిగా కొట్టాడు._*

*_అప్పటి సంగతి రాయుడికి జ్ఞాపకం వచ్చింది. తర్వాత ఎమ్.ఎల్.ఏ గా నిలబడి గెలిచాడు. ఇప్పుడు మంత్రి పదవి లభించింది. ఇన్ని  సంవత్సరాలకు మళ్ళీ ఆ హోటల్ లో ప్రవేశించాడు తన అనుచరులతో పాటు._*

*_శంకరయ్యగారు చనిపోయినట్టున్నాడు, అతని ఫోటో అక్కడ బల్ల మీద పెట్టివుంది పూలమాల వేసి. ఆ ఫోటో వెనక అతని బెత్తం కూడా వుంది బూజు పట్టి.    మంత్రిగారు వచ్చారని అక్కడి యజమాని శంకరయ్య కొడుకు విఘ్నేశ్వరయ్య పరిగెత్తుకుంటూ వచ్చి తెగ హడావుడి చేసి తన మనుషులతో చెప్పి రకరకాల పదార్థాలను వద్దంటున్నా వినకుండా వేయించాడు. అందరూ తినలేక చాలా పారవేశారు._*

*_అది చూసి రాయుడికి చాలా బాధ కలిగింది. తట్టుకోలేక పోయాడు. శంకరయ్య ఫోటో వెనక వున్న బెత్తం చేతిలోకి తీసుకున్నాడు. కోపంగా విఘ్నేశ్వరయ్య దగ్గరికి వెళ్లి “యింత అతి మర్యాద చేసే అవసరం లేదు. ముందు నీ బాధ్యత తెలుసుకో ! ఎంత భోజనం వృధా అయింది చూడు !” అని అతన్ని చెయ్యి చాచమని చితక బాదాడు._*

*_ఆ బూజు పట్టిన బెత్తాన్నిముద్దు పెట్టుకొని ఆ బెత్తాన్ని ఫోటో వెనకాల పెట్టి బయటకు నడిచాడు._*

*_ఈ కాలంలో అటువంటి నేతలు వున్నారా ? వుంటే వారికి పాద నమస్కారం చెయ్యాల్సిందే._*

*_మనమంతా కూడా ఎక్కడయినా సరే తినే పదార్థాలను వృధా చెయ్యకూడదు. ఇప్పటికీ మా యింట్లో మా పిల్లలతో సహా దీన్ని పాటిస్తాము. మరి మీరు..?_*

*_(నవ్య వార పత్రిక సౌజన్యంతో)_*

*_’అన్నం పరబ్రహ్మ స్వరూపం !’ దాన్ని పారవేస్తే మరుజన్మలో మనకు "అన్నమో రామచంద్రా" అని ఏడ్చే గతి పడుతుందని పెద్దలు చెప్తారు !_*

*_రేపటి తరానికి బతుకు, భద్రతలతోపాటు భారతీయత కూడా నేర్పండి ప్లీజ్..._*

🙏🇮🇳😷💉🎊🪴🦚🐍
దేవుడి వైపు కు నడుద్దాం అనే చిన్న కధ

   ఒక ఊర్లో వున్న గుడి లో జరగబోయే ప్రవచనానికి , పురాణ శ్రవణానికి  రావాల్సిందిగా ఆ దేవాలయ అర్చకుడు , ఒక ధనవంతుడిని ఆహ్వానిస్తే అందుకు ఆ ధనవంతుడు ఇలా అన్నాడట : '' వచ్చి ఏమి సాధించేది వుంది ? గత ముప్పై ఏళ్ళుగా ప్రవచనం , పురాణ శ్రవణాలు వింటూనేవున్నాను. ఒక్కటైనా  గుర్తుందా ? అందుకే దేవస్థానానికి  రావడం వల్ల సమయం వృథా అవుతుందే తప్ప ఒరిగేదేమీ లేదు. '' అందుకు ఆ అర్చకుడు చిరునవ్వు నవ్వి ఇలా అన్నాడట : '' నాకు పెళ్ళి అయ్యి ముప్పై ఏళ్ళు అయ్యింది. నా భార్య ఇప్పటిదాకా కనీసం ముప్పై రెండు వేల సార్లు భోజనం వండి వడ్డించివుంటుంది. నేను తిన్న ఆ భోజన పదార్థాలలో నాకు ఒక్కటైనా గుర్తుందా ? కాని నాకు ఒక్కటి మాత్రం బాగా తెలుసు. అదేమంటే  ఆమె వండిన భోజనం నుండి నేను శక్తి ని పొందగలిగాను. ఆమె గనక నాకు ఆ పదార్థాలు వండిపెట్టక పోయివుంటే  నాకు ఆ శక్తి ఎక్కడిది ? ఈ పాటికి చనిపోయివుండేవాడిని. '' 

   అందుకే , శరీరానికి భోజనం [ ఆహారం ] ఎలాగో . మనసుకు  దైవ ధ్యానం , దైవ నామ స్మరణ అలాగా.  నిరంతరం చేస్తూనే వుండాలి. మనిషి జన్మ కు ఒకే ఒక లక్ష్యం  దైవ సాక్షాత్కారం   అంటుంది భగవద్గీత. అందుకే దైవం వైపు నడుద్దాం.🙏
****


కాళిదాసుకు అక్షర లక్షలు


భోజరాజు రాజ్యంలోని ఓ నలుగురు బ్రాహ్మణులు చాలా బీదవారు.మంచి కవిత్వం చెబితే రాజు ధనాన్ని ఇస్తాడన్న ఆశతో ఓ మంటపంలో కూర్చుని శ్లోకం రాయటం ప్రారంభిస్తారు. ఒక వ్యక్తి ‘భోజనం దేహి రాజేంద్ర’ అని,. రెండో వ్యక్తి ‘ఘృతసూప సమన్వితమ్‌’ అని రెండు పాదాలు రాశారు.  ఓ రాజా! పప్పు, నెయ్యిలతో కూడిన భోజనాన్ని మాకు అనుగ్రహించు అని ఈ రెండు పాదాలకు అర్థం. మిగిలిన రెండు పాదాలను పూర్తిచెయ్యలేక వారు నానా తంటాలు పడుతుంటారు. 

ఇంతలో అటుగా వచ్చిన కాళిదాసు ‘మాహిషంచ శరచ్చంద్ర చంద్రికా ధవళం దధీ’ అని మూడు, నాలుగు పాదాలు పూర్తిచేస్తాడు. శరత్కాలంలో వెలిగే చంద్రుడి వంటి పరిమాణంలో ఉన్న గారెలు, ఆ శరత్కాలపు చంద్రుడు కురిపించే వెన్నెల వర్ణంతో సమానమైన స్వచ్ఛమైన పెరుగుతో కలిసిన భోజనం కావాలి ఆ బ్రాహ్మణులు రాజాస్థానానికి వెళ్లి శ్లోకం వినిపిస్తారు. భోజరాజు ఆ బ్రాహ్మణుల జీవితానికి సరిపడినంత ధనం ఇవ్వమని మంత్రిని ఆదేశించి, మూడు నాలుగు పాదాలు రాసిన కవికి అక్షరలక్షల ముత్యాలు ఇవ్వమంటాడు. శరత్కాల చంద్రుడిని ఇంత అందంగా వర్ణించగల కవి కాళిదాసు తప్ప మరొకరు లేరంటాడు భోజరాజు.

16 కళల వెనక కథ ఇదీ...

చంద్రుడికి ఈ కళలు రావటం వెనుక పురాణగాథ ఉంది. దక్షప్రజాపతి అశ్వని, భరణి మొదలైన తన 27 మంది కుమార్తెలను చంద్రుడికిచ్చి వివాహం చేస్తాడు. అందరినీ అనురాగంగా చూసుకుంటున్నప్పటికీ రోహిణి అంటే చంద్రుడికి ఎక్కువ ఇష్టం ఉండేది. ఆమెపై ఎక్కువ అనురాగం, ఆప్యాయత కనబరచేవాడు. ఇది సహించలేని మిగిలిన అక్కాచెల్లెళ్లు తండ్రితో విషయాన్ని చెబుతారు. అతడు చంద్రుడిని పిలిచి కుమార్తెలందరినీ సమానంగా చూసుకోవాలని హితవు చెబుతాడు. అయినా, చంద్రుడు తన పద్ధతి మార్చుకోకపోవటంతో ఆగ్రహించిన  దక్షుడు అల్లుడనే ఆలోచన లేకుండా చంద్రుడికి క్షయవ్యాధి కలగాలని శపిస్తాడు. శాపం కారణంగా చంద్రుడు నానాటికీ క్షీణించసాగాడు. దీంతో అతని నుంచే వచ్చే వెన్నెల ఆగిపోయింది. లతలు, వృక్షాలు వాడిపోయాయి. కలువలు వికసించలేదు. ఓషధుల్లో గుణం నశించింది. 

 లోకానికి కలిగిన ఈ అకారణ దుఃఖాన్ని గమనించిన ఇంద్రాది దేవతలు చంద్రుడితో సహా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి, చంద్రుడికి శాపవిముక్తి కలిగించమని ప్రార్థిస్తారు. ప్రభాస క్షేత్రంలో శివుడిని గురించి తపస్సు చెయ్యమని బ్రహ్మదేవుడు చెబుతాడు. ఆవిధంగా తపస్సు చేసిన చంద్రుడికి  శివుడు ప్రత్యక్షమై రోజుకు ఒక కళ నశించేలా, తిరిగి 15 రోజుల తర్వాత రోజుకు ఒక కళ పెరుగుతూ పూర్ణచంద్రుడిగా పూర్ణిమ రోజున ప్రకాశించేలా అనుగ్రహిస్తాడు. ఇలా చంద్రుడి కళల్లో తగ్గుదల, పెరుగుదల కారణంగా ఏర్పడినవే శుక్ల, కృష్ణ పక్షాలు. ఈ విధంగా చంద్రుడికి పదహారు కళలు ఏర్పడ్డాయి. శరత్కాలంలో వచ్చే తొలి పూర్ణిమ ఆశ్వయుజ పూర్ణిమ. ఈ రోజుకు అనేక పేర్లు,  ఈ రోజున ‘కౌముద్యుత్సవం’, ‘కోజాగరీ’ వ్రతాలు చేస్తారు. వాలఖిల్య మహర్షి ద్వారా కోజాగరీ వ్రతం వ్యాప్తిలోకి వచ్చింది. ఆశ్వయుజ పూర్ణిమను ‘కౌమార పౌర్ణమాసి’ పేరుతో కొన్ని చోట్ల పాటిస్తారు. మరికొందరు ఈ రోజున లక్ష్మీంద్ర కుబేర పూజ చేస్తారు. ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాల్లో ఆశ్వయుజ పూర్ణిమ రోజున ‘గొంతెమ్మ పండుగ’ జరుపుకుంటారు. గొంతెమ్మ అంటే ‘కుంతి’ అని అర్థం. పార్వతీదేవికి ఉన్న పేర్లలో ‘కుంతిపరమేశ్వరి’ ఒకటి. అందువల్ల గొంతెమ్మ పండుగ పార్వతీదేవికి సంబంధించిందిగా తెలుస్తోంది. . శరత్పూర్ణిమ రోజున ఆరుబయట వెన్నెలో పరమాన్నం వండి, దాని మీద చంద్రకిరణాలు పడేలా ఉంచి, ఆ ప్రసాదాన్ని స్వీకరించే ఆచారం కొన్నిప్రాంతాల్లో ఉంది.

ఎన్నో నోములు …మరెన్నో పూజలు

శరత్పూర్ణిమ వ్రతాన్ని కొన్ని ప్రాంతాల్లో ఆచరిస్తారు. ఇందుకు సంబంధించిన కథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వకాలంలో ఒక సంపన్నకుటుంబానికి చెందిన దంపతులకు కలిగిన బిడ్డ ఏమాత్రం అంగసౌష్టవం లేకుండా ఉండేది. ఓ సిద్ధ పురుషుడి సూచనతో ఆ దంపతులు అప్పటికే కన్యగా ఎదిగిన తమ బిడ్డతో ‘శరత్పూర్ణిమ’ నోము నోయించారు.. శరత్కాలం ప్రారంభమైన తొలిరోజున ఆరుబయట చంద్రకాంతిలో ఉండేలా వెండితో చేసిన అమ్మవారి ప్రతిమను అర్చించి, వెండితో చేసిన చంద్రుడి ప్రతిమను దానం చేయిస్తారు. ఇలా చంద్రుడిలో ఉండే పదహారు కళలకు ప్రతీకగా శుక్లపక్షమంతా చేయిస్తారు. తిరిగి కార్తికమాసం శుక్ల పక్షంలో కూడా ఈ విధానంలో అర్చనలు చేయిస్తారు. ఇలా మూడేళ్లు చేయగానే ఆ కన్య  సుందరిగా ప్రకాశించింది.

ఖగోళ విజ్ఞానపరంగా చూస్తే ఆశ్వయుజ మాస ప్రారంభంలో ఆకాశంలో అగస్త్య నక్షత్రం కనిపిస్తుంది. ఇది శరత్కాలానికి ప్రారంభ సూచిక. ఈ నక్షత్రం కనిపించగానే రాజులు దండయాత్రలకు బయల్దేరటానికి సిద్ధపడేవారని కాళిదాస మహాకవి రఘువంశ కావ్యంలో రాశాడు.మనస్సును ఆహ్లాద పరిచే సౌందర్యం శరచ్చంద్రుడిలో ఉంది. ముఖచంద్రుడు అనడంలో అంతరార్థం ఇదే. తాను ప్రశాంతంగా ఉంటూ తన తోటి వారిని కూడా ప్రశాంతంగా ఉంచే వారే నిజమైన ఆధ్యాత్మిక సాధకులు అవుతారు.  మనవల్ల సమాజం ఉద్వేగం పొందని స్థితిలో ఉన్నా, సమాజం వల్ల మనం ఉద్వేగానికి లోనుకాని స్థితిలో ఉన్నా.. మానవ జీవనం ఆత్మజీవనం అవుతుంది.కార్తీక పూర్ణిమ రోజున ఆచరించే వ్రతాల్లో భక్తేశ్వర వ్రతం స్త్రీలకు సౌభాగ్యం కలిగించే వ్రతంగా చేసుకునే ఆచారం ఉంది.

చంద్రుడు పదహారు కళలతో ఉంటాడని శాస్త్రాలు చెబుతున్నాయి.

ఆ కళలు1.అమృత 2.మానద 3.పూష 4.తుష్టి 5.సృష్టి 6.రతి 7.ధృతి 8.శశిని 9.చంద్రిక 10.కాంతి 11.జ్యోత్స్న 12.శ్రీ

13.ప్రీతి 14.అంగద 15.పూర్ణ 16.పూర్ణామృత

*****

ముగ్గురు రాకుమారులు -- చందమామ కథలు

రత్నగిరి రాజు రాజభూషణుడు ధర్మప్రభువుగా పేరుగాంచాడు. ఆయన పాలనలో ప్రజలు ఏ కొరతా లేకుండా సుఖశాంతులతో జీవించేవారు. ఆయనకు ముగ్గురు కుమారులు. ముగ్గురూ యుక్త వయస్కులయ్యారు. వారిలో ఒకరిని త్వరలో రాజ్యాభిషిక్తుణ్ణి చేయవలసి వుంది. అందువల్ల రాజు వారిని ఒకనాడు చేర బిలిచి, ‘‘మీరు ముగ్గురూ దేశాటన చేసి ప్రజల స్థితిగతులను, ప్రత్యక్షంగా చూసి తెలుసుకోవాలి. రేపు తెల్లవారగానే ముగ్గురూ మూడు దిశలకేసి వెళ్ళి, సాయంకాలానికల్లా తిరిగివచ్చి మీరు చూసినదానిని గురించి నాకు చెప్పండి,'' అన్నాడు. మరునాడు తెల్లవారగానే, ముగ్గురు రాకుమారులూ బయలుదేరారు. పెద్ద కుమారుడు రాజకీర్తి తూరుపు దిక్కుకేసీ, రెండవ రాకుమారుడు రాజమూర్తి ఉత్తరం దిక్కుకేసీ, మూడవ రాకుమారుడు రాజస్నేహి దక్షిణం దిక్కుకేసీ పయనమయ్యారు. సూర్యాస్తమయం అయ్యేసరికి వెనుదిరిగి భవనం చేరుకోవాలని నిర్ణయించుకున్నారు.

రాజకీర్తి చాలా దూరం నడిచి ఒక అడవిని చేరుకున్నాడు. ఒక కొలను గట్టున పచ్చిక మేస్తున్న మూడు చక్కని గుర్రాలు ఆయన దృష్టిని ఆకర్షించాయి. దాపులనే వున్న పొడవైన చెట్టు కింద ఆశీసునుడైన ఒక యోగి ఆ గుర్రాల కేసి తదేకంగా చూస్తున్నాడు. రాకుమారుడు యోగిని సమీపించి సాష్టాంగ నమస్కారం చేశాడు. యోగి మందహాసం చేస్తూ, ‘‘నువ్వు ఎవరివి నాయనా? ఈ అడవిలోకి ఎందుకు వచ్చావు?'' అని అడిగాడు. రాజకీర్తి తాను ఎవరైనదీ చెప్పి, తాను వెళుతూన్న కార్యం గురించి వివరించి, ‘‘మహాత్మా! తమరు అనుమతించినట్టయితే, మీ గుర్రాలలో ఒకదాని మీద వెళ్ళి, మరిన్ని ప్రదేశాలనూ, మరింత ఎక్కువమందినీ చూసి వస్తాను,'' అన్నాడు. ‘‘అలాగే, నీకు కావలసిన గుర్రాన్ని తీసుకు వెళ్ళు. అయితే, సూర్యాస్తమయం అయ్యేలోగా గుర్రాన్ని తెచ్చి నాకు అప్పగించాలి. నువ్వు చూసిన విశేషాలను గురించి తెలియజేయాలి,'' అన్నాడు యోగి. రాజకీర్తి ఒక గుర్రాన్ని అధిరోహించి అక్కడి నుంచి బయలుదేరాడు.

చాలా దూరం ప్రయాణం చేశాక ఆయనకు ఒక తోట కనిపించింది. తోటమాలి కోసం చుట్టుపక్కల కలయచూశాడు. తోటమాలి కనిపించలేదు గాని, తోట చుట్టూ బలమైన కంచె వేసి ఉండడం చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. అంతకన్నా ఆశ్చర్యకరమైన విషయం మరొకటి జరిగింది. ఆయన చూస్తూండగానే కంచె కోసం కట్టిన దృఢమైన పుల్లలు ఉన్నట్టుండి కొడవళ్ళుగా మారి తోటలోని పళ్ళనూ, కాయగూరలనూ తెగనరకడం ప్రారంభించాయి. యువరాజు రాజకీర్తి తన కళ్ళను తనే నమ్మలేక అమితాశ్చర్యంతో వెనుదిరిగాడు. అరణ్యానికి చేరుకుని యోగికి గుర్రాన్ని అప్పగించబోయాడు. అప్పుడు యోగి, ‘‘దాచుకోలేని ఆశ్చర్యంతో సతమతమవుతున్నట్టున్నావు. ఏమిటి విశేషం?'' అని అడిగాడు. రాజకీర్తి తను చూసిన విచిత్రమైన తోట గురించి వివరించాడు. అంతా విన్న యోగి, ‘‘ఆ దృశ్యం ద్వారా నువ్వు గ్రహించిందేమిటి?'' అని అడిగాడు. ‘‘అంతా విచిత్రంగా వుంది. ఎందుకలా జరిగిందో చెప్పలేకపోతున్నాను మహాత్మా,'' అన్నాడు రాజకీర్తి. ‘‘ఇలాంటి సామాన్యమైన విషయాలను కూడా అర్థం చేసుకోలేనివాడివి, రేపు రాజ్య పాలన ఎలా చేయగలవు? రాజ్యం, మూర్ఖుడైన రాజును భరించలేదు. నిన్నిప్పుడే రాతిస్తంభంగా మార్చేస్తున్నాను,'' అని యోగి రాజకీర్తిని శపించాడు. రాత్రి చాలా పొద్దుపోయినా రాజకీర్తి తిరిగి రాకపోవడంతో రాజభవనం చేరుకున్న ఆయన తమ్ములూ, తండ్రీ ఆందోళన చెందారు.

మరునాడు తెల్లవారగానే, రెండవ కుమారుడు రాజమూర్తి, అన్నను వెతుక్కుంటూ వెళ్ళాలని నిర్ణయించారు. తెల్లవారగానే రాజమూర్తి, తన అన్న వెళ్ళిన మార్గంలో వెళ్ళి అడవిని చేరుకున్నాడు. కొలను గట్టున మేస్తూన్న గుర్రాలను చూశాడు. యోగికి నమస్కరించి, ‘‘ఇలాంటి చక్కటి గుర్రాలను ఇంతకు ముందెన్నడూ చూడలేదు. ఒక గుర్రాన్ని ఇస్తారా?'' అని అడిగాడు. ‘‘నిరభ్యంతరంగా తీసుకువెళ్ళు. అయితే సూర్యాస్తమయంలోపల తిరిగి వచ్చి గుర్రాన్ని అప్పగించి, నీ అనుభవాలను చెప్పాలి,'' అన్నాడు యోగి మందహాసం చేస్తూ. గుర్రాన్ని అధిరోహించే ఉత్సాహంలో రాజమూర్తి పక్కనే శిలగా మారివున్న తన అన్న ముఖం కేసి కూడా చూడలేదు. ఇరువైపులా అన్న కేసి పరిశీలనగా చూస్తూ ఆయన చాలా దూరం ముందుకు వెళ్ళాడు. ఎంత దూరం వెళ్ళినా అన్న జాడ కనిపించలేదు. కాని, వీపు మీద కట్టెల మోపు మోస్తూ వంగిపోయిన ఒక పండు ముసలివాడు కనిపించాడు. రాజమూర్తికి అతనిపై జాలి కలిగింది. అతడు గుర్రాన్ని ఆపి, ‘‘తాతయ్యా, కట్టెలమోపు నేను మోసుకురానా?'' అని అడిగాడు. ముసలివాడు తలపైకెత్తి చూడలేదు. కనీసం సమాధానం కూడా చెప్పకుండా ఇంకా ఎండు పుల్లలు ఏరడంలో నిమగ్నుడై కనిపించాడు. రాజమూర్తికి చాలా వింతగా తోచింది. సూర్యుడు పడమటి దిశకు చేరడంతో ఆయన వెనుదిరిగి వచ్చి, గుర్రాన్ని యోగికి అప్పగించి నమస్కరించాడు. ‘‘దారిలో నీకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి ఏమిటి?'' అని అడిగాడు యోగి చిన్నగా నవ్వుతూ. రాజకీర్తి తాను చూసిన ముసలివాణ్ణి గురించి చెప్పాడు. ‘‘నువ్వు అందిస్తానన్న సాయాన్ని ఆ ముసలివాడు ఎందుకు వద్దన్నాడో తెలుసా?'' అని అడిగాడు యోగి. ‘‘తెలియదు మహాత్మా. అతడొక మాట కూడా మాట్లాడలేదు,'' అన్నాడు రాజమూర్తి. ‘‘ఇలాంటి స్వల్ప విషయాలు కూడా తెలియని నువ్వు, మునుముందు రాజువైతే కష్టతరమైన ప్రజాపాలనను ఎలా సమర్థవంతంగా నిర్వహించగలవు? నువ్వు మూర్ఖుడివి. రాకుమారుడిగా వుండతగవు. నిన్నిప్పుడే శిలగా మార్చేస్తున్నాను,'' అన్నాడు యోగి.

రాజమూర్తి కూడా రాకపోయేసరికి రాజు విచారానికి గురయ్యాడు. మూడవ కుమారుడు రాజస్నేహి తండ్రిని ఓదార్చి అన్నలను వెతుక్కుంటూ వెళతానన్నాడు. తెల్లవారగానే అన్నలు వెళ్ళిన మార్గంలో బయలుదేరి రాజస్నేహి అడవిని చేరుకుని, కొలను దగ్గర మేస్తున్న గుర్రాలనూ, యోగినీ చూశాడు.

పక్కనే వున్న రెండు రాతిస్తంభాలనూ, వాటిలో స్పష్టంగా కనిపించిన తన అన్నల ముఖపోలికలనూ చూసి ఆశ్చర్యపోయాడు. యోగిని సమీపించి నమస్కరించి తన అన్నల గురించి అడిగాడు. ‘‘అవును. వాళ్ళు ఇక్కడికి వచ్చారు,'' అంటూ మందహాసం చేసిన యోగి, ‘‘నా గుర్రాలను తీసుకుని వెళ్ళి సాయంకాలానికి తిరిగివచ్చారు. వాళ్ళు చూసిన దృశ్యాల అంతరార్థాన్ని గురించి అడిగితే చెప్పలేకపోయారు. నేనే వారిని శిలా స్తంభాలుగా మార్చేశాను,'' అన్నాడు. ‘‘వాళ్ళు పునర్జీవితులయ్యే మార్గం సెలవివ్వండి, మహాత్మా,'' అన్నాడు రాజస్నేహి. ‘‘ఆ గుర్రాలలో ఒకదానిని అధిరోహించి ముందుకు వెళ్ళు. ఏదైనా వింత దృశ్యం కనిపిస్తే వచ్చి నాతోచెప్పు. దానిని గురించి చక్కని వివరణతో నా ప్రశ్నకు సరైన సమాధానం ఇచ్చావంటే మీ ముగ్గురన్నదమ్ములు మూడు గుర్రాల మీద హాయిగా రాజధానిని చేరుకోవచ్చు,'' అన్నాడు యోగి. రాజస్నేహి కొంతసేపు తీవ్రంగా ఆలోచించాడు. తన అన్నలను కాపాడుకోవడానికి తన అదృష్టాన్ని పరీక్షించాలన్న నిర్ణయంతో, యోగికి నమస్కరించి, ఆయన చూపిన దిశగా గుర్రం మీద బయలుదేరాడు. అతడు ఎంతదూరం వెళ్ళినా ఎలాంటి విచిత్ర దృశ్యం గానీ, వింత వ్యక్తి గానీ తారసపడలేదు. చాలా దూరం వెళ్ళడం వల్ల అతడికి దాహం వేసింది. గుర్రానికి కూడా కాస్సేపు విశ్రాంతినిద్దాం అన్న ఉద్దేశంతో ఒక కొలను గట్టున గుర్రం దిగాడు. గుర్రాన్ని పచ్చిక మేయడానికి వదిలి తను దాహం తీర్చుకోవడానికి కొలను దగ్గరికి వెళ్ళాడు. నీళ్ళ దగ్గరికి వెళ్ళి, వంగి దోసిలితో నీళ్ళు అందుకోబోయాడు. నీళ్ళు చేతులకు అందకుండా కుంచించుకుపోవడం గమనించి ఉలిక్కిపడ్డాడు. నీళ్ళలో దిగి మరికొంత ముందుకు వెళదామని రెండడుగులు వేశాడు. నీళ్ళు రెండడుగులు వెనక్కువెళ్ళాయి. అతడు లోపలికి వెళ్ళే కొద్దీ నీళ్ళు ఇంకా లోపలికి వెళ్ళసాగాయి. అతడు కొలను మధ్యకు చేరుకునే సరికి చుట్టూ ఇసుక తప్ప, బొట్టు నీళ్ళు కంటబడలేదు! అమితాశ్చర్యంతో వెనుదిరిగిన రాజస్నేహి యోగి వద్దకు వచ్చాడు. తనకు ఎదురైన అనుభవాన్ని చెప్పాడు. అంతావిన్న యోగి, ‘‘ఈ విచిత్ర అనుభవం ద్వారా నువ్వు గ్రహించిందేమిటి?'' అని అడిగాడు. రాజస్నేహి ఎంత ఆలోచించినా సరైన సమాధానం స్ఫురించలేదు. యోగికి ఆమోదయోగ్యమైన సమాధానం చెప్పలేక పోయాడు. ‘‘రాకుమారా, నువ్వు కూడా మీ అన్నలకన్నా తెలివైన వాడివేం కాదు. నీకూ, నీ అన్నల గతి తప్పదు,'' అన్నాడు యోగి. మరుక్షణమే రాజస్నేహి కూడా శిలాస్తంభంగా మారిపోయాడు. అన్నలను వెతుక్కుంటూ వెళ్ళిన రాజస్నేహి కూడా ఎంతకూ రాకపోయేసరికి రాజభవనంలోని రాజు తీవ్రమైన ఆందోళనకు లోనయ్యాడు. తనే చేజేతులా వారిని దేశాటనకని పంపి ఈ దుస్థితికి కారణమైనట్టు భావించి విలవిలలాడి పోయాడు. వాళ్ళకేమయిందో ఎవరికీ తెలియదు. రాకుమారులను వెతకడానికి సైన్యాన్ని వినియోగించాలని మంత్రి సలహా ఇచ్చాడు. అయినా రాజు వినలేదు. తన కుమారులను వెతుక్కుంటూ తనే స్వయంగా వెళ్ళాలనుకున్నాడు. మరునాడు వేకువజామున తన కుమారులు వెళ్ళిన మార్గం గుండా వెళ్ళి, అడవిని చేరి, మేస్తూన్న గుర్రాలకేసి ప్రశాంతంగా చూస్తున్న యోగి సమక్షానికి చేరుకున్నాడు. ఆయనకున్న యోగ శక్తుల ద్వారా, యోగి తన కుమారుల ఆచూకీని తెలియజేయగలడని రాజు ఆశించాడు. రాజు యోగిని సమీపించి నమస్కరించి, ‘‘మహాత్మా, నా ముగ్గురు కుమారులు దేశ సంచారం చేస్తూ ఇటుకేసి తప్పక వచ్చి ఉంటారనుకుంటాను... అంటూ ఇంకా ఏదో చెప్పబోయేంతలో యోగి అడ్డుపడి, ‘‘అవును మహారాజా, వచ్చారు. వారిని నేను మూడు ప్రశ్నలు అడిగాను. చాలా సులభ మైనవి. కాని సమాధానం చెప్పలేక పోయారు అలాంటి మూఢులకు మునుముందు రాజ్య పాలన చేసే అర్హత లేదు. అందుకే వారిని శిలా స్తంభాలుగా మార్చివేశాను. అదిగో చూడు!'' అన్నాడు. రాజు మూడు రాతిస్తంభాలనూ, వాటి పైభాగంలో తన కుమారుల ముఖజాడలూ చూసి దిగ్భ్రాంతి చెందాడు. కొంతసేపు మౌనం వహించి, ఆ తరవాత, ‘‘ఆ ప్రశ్నలేవో చెప్పండి. నా బిడ్డల తరఫున నేను సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను,'' అన్నాడు. ‘‘నీ జ్యేష్ఠ కుమారుడు రాజకీర్తి తోటమాలి లేని ఒక తోటను చూశాడు. కంచెగా వున్న పుల్లలు ఉన్నట్టుండి కొడవళ్ళుగామారి, తోటలోని పళ్ళను, కాయలను తెగనరకడం ప్రారంభించాయి దీని అంతరార్థం ఏమిటి?'' అని అడిగాడు యోగి. ‘‘తోటలోని చెట్టు చేమలను కాపాడడానికే కంచె ఏర్పాటు చేయబడింది. తన యజమాని ఆస్తిని నాశపరిచే సేవకుడిలాంటిది ఆ కంచె,'' అన్నాడు రాజు. యోగి మందహాసం చేసి, రెండవ రాకుమారుడు చూసిన దృశ్యం గురించి చెప్పి, ‘‘రాజా! ఆ ముసలివాడు మోస్తూన్న బరువైన కట్టెల మోపు చాలదని ఇంకా ఎండు కట్టెలు ఏరుతూనే ఉన్నాడు. దీని భావం ఏమిటో చెప్పగలవా?'' అని అడిగాడు. ‘‘ఆ ముసలివాడు తన దగ్గర ఉన్న దానితో తృప్తి చెందలేదు. పర్యవసానాలను గురించి పట్టించుకోకుండా ఇంకా ఇంకా కావాలని ప్రాకులాడే పేరాశాపరుల దురవస్థకు చిహ్నం ఆ దృశ్యం!'' అన్నాడు రాజు. ‘‘బాగా చెప్పావు,'' అని మరొక్కసారి మందహాసం చేసిన యోగి, ‘‘నీ చిన్న కుమారుడు దాహం తీర్చుకోవడానికి వెళితే కొలనులోని నీళ్ళు దూర దూరంగా వెళ్ళిపోయాయి. మరి దీని వివరణ ఏమిటి రాజా?'' అని అడిగాడు.


 ‘‘సంపదలు ఉన్నప్పుడు దుబారాగా ఖర్చు చేసి, పనికిమాలిన వాటికోసం వృధా చేసే వారికి చివరికి ఏదీ మిగలదు!'' అన్నాడు రాజు. మరుక్షణమే రాకుమారులు ముగ్గురూ నవ్వుతూ కనిపించారు. రాతిస్తంభాల జాడలేదు. ‘‘నా కుమారులకు మళ్ళీ ప్రాణదానం చేసిన తమకు నేను జీవితాంతం రుణపడి ఉన్నాను. తమ ఆశీస్సులతో వారిని రాజధానికి తీసుకువెళతాను. తమరు కరుణతో రాజధానికి విచ్చేసి, నా కుమారులకు విద్యాబుద్ధులు నేర్పి వారిని వివేకవంతులుగా తీర్చిదిద్దాలని ప్రార్థిస్తున్నాను,'' అన్నాడు రాజు యోగికి చేతులెత్తి నమస్కరిస్తూ. రాజు ప్రార్థనకు యోగి అంగీకరించాడు. ‘‘మీరు ముగ్గురూ మూడు గుర్రాల మీద మీ తండ్రితో రాజధానికి బయలుదేరండి, నేను త్వరలో వస్తాను,'' అని రాకుమారులను ఆశీర్వదించాడు. రాజూ, రాకుమారులూ సంతోషంగా రాజధానికి బయలుదేరారు. మరి కొన్నాళ్ళకు రాజధానికి వచ్చిన యోగికి, భక్తి ప్రపత్తులతో మేళ తాళాలతో స్వాగతం పలికారు. యోగి రాకుమారులను వివేకవంతులుగా, ఆదర్శపాలకులుగా తీర్చిదిద్దాడు.

****



వరాలైన శాపాలు -- చందమామ కథలు
ఒక గ్రామంలో నారాయణ అనే పేద వ్యవసాయదారు ఉండేవాడు. అతడు చాలా తెలివైనవాడే కాని, అతనికంటూ సొంతంగా కుంటెడు పొలం కూడా లేదు. అందువల్ల ఇతరుల పొలాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసి జీవించేవాడు. అతనికి రెండు తీరని కోరికలుండేవి. ఒకటి దేశాటన చెయ్యటం; రెండోది రుచికరమైన రాజభోజనం తినాలని. అయితే అవి అతని వంటి పేదరైతుకు తీరే కోరికలు కావు. కనీసం రాజధానిలో జరిగే వసంతోత్సవాలైనా చూడాలని నారాయణ ఒక సంవత్సరం, తన స్నేహితుడైన మాధవుడితో కలిసి, రాజధానికి బయలుదేరాడు. వాళ్ళు పగలల్లా ప్రయాణం చేసి, చీకటి పడే సమయానికి అరణ్యం మధ్యలో చిక్కుకుపోయారు. ఆ రాత్రి తలదాచుకోవటానికి ఒక గుడి కనిపించింది. నారాయణ ఉత్సాహంతో, ఆ రాత్రి ఆ గుడిలో గడుపుదామన్నాడు. మాధవుడు తల అడ్డంగా ఊపుతూ, ‘‘ఇది చండముఖి అనే దేవత గుడి.
ఆ దేవత మహా ముక్కోపి. ఆమె పగలల్లా ఎక్కడెక్కడో సంచారం చేసి, ఝాముపొద్దుపోయేసరికి గుడికి తిరిగి వస్తుంది. ఆ సమయానికి గుడిలో ఎవడైనా కనిపిస్తే ఆగ్రహంతో వాణ్ణి శపిస్తుంది. అందుచేత రాత్రివేళ ఎవరూ గుడిలోకి అడుగు పెట్టరు,'' అన్నాడు. ‘‘దేవత ఆగ్రహిస్తే ఆగ్రహించనీ, నే నింక ఒక్క అడుగైనా ముందుకు రాలేను,'' అంటూ నారాయణ ఆవులించి, గుడిలోకి వెళ్ళాడు. మాధవుడు మరేం మాట్లాడకుండా ముందుకు సాగి పోయాడు. గుడిలో నడుమువాల్చిన మరుక్షణం నారాయణకు నిద్ర పట్టేసింది. కొంత రాత్రి గడిచినాక ఎవరో కొరడాతో కొట్టినట్టు తోచి, నారాయణ ఉలిక్కిపడి నిద్ర మేలుకున్నాడు. ఎదురుగా ఒక దేవత, ఎరట్రి కళ్ళతో, చేతిలో కొరడా పట్టుకుని నిలబడి ఉంది, ‘‘ఎవడ్రా నువ్వు? నా అనుమతి లేకుండా నా గుడిలో పడుకోవటానికి నీకెంత ధైర్యం!'' అన్నది పట్టరాని కోపంతో. నారాయణ ఆమెకు చేతులెత్తి భక్తితో నమస్కరించి, ‘‘తల్లీ, నే నొక పేద రైతును. వసంతోత్సవాలు చూడడానికి రాజధానికి పోతూ, అలసిపోయి, చీకటి పడేసరికి, ఇక్కడ విశ్రమించాను. నా వల్ల తప్పు జరిగితే క్షమించు,'' అన్నాడు. ‘‘నిన్ను క్షమించానంటే ఆ సంగతి తెలిసి జనం ఈ గుడిని చిటికెలో సత్రంగా మార్చేస్తారు. ఆ తరవాత నాకు శాంతి అన్నది కరువై పోతుంది. నిన్ను శపించి తీరాలి. అప్పుడే మానవులకు నేనంటే భయభక్తులు ఉంటాయి. నువ్వు రైతునంటున్నావు గనక, ఒక సంవత్సరంపాటు నీ చేతి నీరు తగిలిన ప్రతి మొక్కా చచ్చిపోవాలి! ఇకనైనా ఒళ్ళు దగ్గరపెట్టుకు బుద్ధికలిగి ఉండు," అని దేవత అదృశ్యమైపోయింది. వ్యవసాయం చేసుకుని బతికే తన బోటి వాడు సంవత్సరంపాటు వ్యవసాయం చెయ్యకుండా ఎలా బతకాలా అని విచారిస్తూ నారాయణ రాజధాని చేరాడు. ఆ యేడు వసంతోత్సవాలు బ్రహ్మాండంగా జరిగాయి. నారాయణ వాటిని తనివి తీరాచూసి ఆనందించాడు. దేశం అన్ని మూలల నుంచీ ఉత్సవాలకు వచ్చిన వ్యవసాయదార్లు రాజుగారితో తమ కష్ట సుఖాలు చెప్పుకున్నారు. అందరికీ దాపరించిన సమస్య ఒక చిత్రమైన కలుపుమొక్క. దాన్ని ఎన్నిసార్లు పీకినా నిర్మూలం కాక, పైరులన్నిటినీ పాడుచేస్తున్నది. ఈ సంగతి విని నారాయణ రాజుగారికి నమస్కరించి, ‘‘నాకు అవకాశం ఇస్తే ఒక్క ఏడాదిలో ఈ కలుపు మొక్కలను నామరూపాలు లేకుండా సమూలంగా నిర్మూలించగలను,'' అన్నాడు. రాజు మొదట అతడి కేసి అనుమానంగా చూశాడు. అయితే, ఆ తరవాత, అతని శక్తిని పరీక్షించి, అతనికి అలాటి శక్తి ఉన్నట్టు రూఢి చేసుకుని, అతనికి కావలసిన పరివారాన్ని ఇచ్చి, అతను కోరిన ఏర్పాట్లన్నీ చేశాడు. నారాయణ తన పరివారంతో అన్ని గ్రామాలకూ వెళ్ళి, పైరు నాటేముందుగా పొలాలన్నిటికీ తన చేతిమీదుగా నీరు పెట్టాడు. దాంతో చేలో ఉన్న కలుపు మొక్కలన్నీ పూర్తిగా నశించిపోయాయి. ఈ విధంగా దేశాటన చేయాలి; రాజభోజనం తినాలి అన్న నారాయణ కోరికలు నెరవేరాయి. అతను ఒక్క ఏడాదిలో దేశమంతా పర్యటించి, గొప్ప సత్కారాలు పొందాడు. రాజుగారు అతనికి నూరు ఎకరాల భూమి ఇనాముగా ఇచ్చాడు. మరుసటి సంవత్సరం కూడా నారాయణ వసంతోత్సవాలకు రాజధానికి పోతూ, చండముఖి ఆలయం దగ్గిరికి వచ్చేసరికి చీకటి పడటం చేత, ఆ ఆలయంలోనే విశ్రమించాడు. ఒక రాత్రివేళ దేవత ప్రత్యక్షమయింది. నారాయణ ఆమెకు నమస్కరించి, ‘‘తల్లీ, నీ శాపం వల్ల ఎంతో లోకోపకారం జరగటమేకాక, నా కోరికలన్నీ తీరాయి. దేశాటన చేసి, రాజభోజనం తిన్నాను,'' అన్నాడు. చండముఖి కళ్ళ నిప్పులు రాల్చుతూ, ‘‘మూర్ఖుడా, మళ్ళీ నన్ను కవ్వించటానికి వచ్చావా? ఈ సంవత్సరం నువ్వు నడిచిన మేర నిలువులోతు గొయ్యి పడుతుంది. నీకు ఎవరైనా పెట్టితేతప్ప తిండి ఉండదు. ఇదే నా శాపం,'' అని అంతర్థానమయింది. తాను కదలటానికి లేదని గ్రహించి, నారాయణ తెల్లవారినదాకా ఆ గుడిలోనే కూర్చుని, ఒక ఉపాయం ఆలోచించాడు. తెల్లవారగానే, ఆ దారినపోయే మనిషితో రాజుగారికి కబురుచేసి, ఒక పల్లకీ తెప్పించుకుని, అందులో వెళ్ళి రాజుగారి దర్శనం చేసుకుని, తన శాపం గురించి వివరంగా చెప్పి, దానివల్ల లాభం పొందే ఒక పథకాన్ని రాజుగారికి సూచించాడు. అదేమంటే, రాజ్యంలో తవ్వవలసిన పంటకాలవలన్నీ ముగ్గులతో గుర్తుపెడితే, నారాయణ వాటి వెంట నడుచుకుంటూ పోతాడు. అతని వెనకనే నిలువులోతు కాలవలు వాటంతట అవే ఏర్పడతాయి. ఈ పథకం అమలుజరిగింది. నారాయణ కాలువల కోసం నడవనప్పుడు పల్లకీలో ప్రయాణం చేశాడు. అతను ఎక్కడ ఉన్నా రాజభోజనం బంగారు పాత్రలలో అతను ఉన్నచోటికి వచ్చింది. ఈ విధంగా నారాయణకు దేవత ఇచ్చిన రెండోశాపం వల్ల దేశానికి మరింత మేలు జరిగింది. ప్రయాస లేకుండా, అతి స్వల్పఖర్చుతో దేశమంతటా పంటకాలువలు ఏర్పడి, ఎంతో కొత్తభూమి సాగులోకి వచ్చింది. మూడోసంవత్సరం కూడా నారాయణ వసంతోత్సవాలకు బయలుదేరి వెళుతూ, మళ్ళీ చండముఖి ఆలయంలోనే చీకటిపడే వేళకు చేరాడు. ఒక ఝాముపొద్దు పోయేసరికి దేవత వచ్చింది. నారాయణ చేతులు జోడించి ఆమెతో, ‘‘తల్లీ, నీ శాపాలు అమోఘం! నీ శాపంవల్ల మరొకసారి నాకు దేశాటనా, రాజభోజనమూ, లోకోపకారం చేసిన పుణ్యమూ లభించాయి. నువ్వు దయ ఉంచి ఇక మీదటనైనా శాపాలియ్యటం మానితే, ఇటుగా వెళుతూ రాత్రివేళ ఈ అడవిలో చిక్కుకుపోయిన మనుషులు ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు. నీకు నిత్యమూ పూజలు జరిగేటట్టు ఏర్పాటు చేస్తాను,'' అన్నాడు. చండముఖి పట్టరాని కోపంతో, ‘‘మూర్ఖుడా, ఇప్పటికి రెండుసార్లు నా ఆజ్ఞ ధిక్కరించి నా గుడిలో ప్రవేశించావు. నా శాపాలను అవహేళన చేశావు. ఈసారి నీ దేశాటనా, లోకోపకారమూ ఎలా సాగుతాయో నేను చూస్తాను. నీ దృష్టిలో పడిన ఏ వస్తువైనా మరుక్షణమే భగ్గున మండి మసి అయిపోతుంది. నువ్వు బతికున్నన్నాళ్ళూ కళ్ళకు గంతలు కట్టుకుని, గుడ్డివాడిలా జీవించవలసిందే!'' అని శపించింది. నారాయణ చప్పున పై పంచ తీసి కళ్ళకు అడ్డంగా తలపాగా చుట్టుకుని, ఆ రాత్రంతా ఆలోచించి, తెల్లవారినాక తడుముకుంటూ గుడి బయటికి వచ్చి, తలపాగా విప్పి, ఒకసారి గుడికేసి చూశాడు. మరుక్షణం గుడి భగ్గున మండి బూడిదకుప్ప అయిపోయింది. దానితోనే నారాయణ శాపంకూడా పోయింది. తరవాత నారాయణ అక్కడ ఒక సత్రం కట్టించాడు. అది ప్రయాణీకులకు ఎంతో ఉపయోగపడుతూ వచ్చింది.

సేకరణ.. ప్రాంజలి ప్రభ
*****
ప్రాంజలి ప్రాభ కథలు

*మాగాయ ఆవకాయ మధ్య గల భేదము ఏమిటని అడిగారు*. ఇలా చెప్పా రు*

మాగాయ:-

భార్యా బిడ్డలు భవబంధాలు అన్నీ త్యజించిన విరాగిలా లోపలి టెంకను, బయటి తొక్కనూ "తొక్కలే" అని వదిలించుకుని....

అరణ్యాలకో హిమాలయాలకో పోయిన సాధకుని లాగా ఆరుబయటకో డాబా మీదకో పోయి...

పంచాగ్నుల మధ్య తపస్సును చేసిన మునిలా సూర్యాగ్నిలో ఎండి...

సిద్ధిని పొందిన ఋషిలా  ముక్కలు  ఎండి స్థిరత్వాన్ని పొందాక...

బయటకు నిర్లేపుడు, నిర్మోహుడులా కనిపించినా అంతరాంతరాలలో మాత్రం 
నరుల పట్ల  కరుణను కలిగిన నవనీత హృదయుడైన అవధూతలా...
బయటకు ఎండిపోయి రంగుమారి గట్టిగా ఒరుగై పోయినా లోపల మాత్రం మామిడికాయ రుచినంతా దాచుకుని...

అరిషడ్వర్గాలతో అల్లాడుతున్న మానవుల ఉద్ధరణ కోసం తను వదిలిపెట్టిన సమాజంలోకి మళ్ళీ తానే ప్రవేశించిన యతిలా,  తను విడిచి వెళ్లిన ఊటలోకి మళ్ళీ తానే దూకి,

మఠం పెట్టిన స్వామీజీ శిష్య గణాన్ని, భక్త జనులనూ కలుపుకున్నట్లు
ఉప్పూ కారం మెంతిపిండీ, ఆవపిండి తదితరాలను కలుపుకుని...

ఆ స్వామీజీ ప్రవచనాలు, మంత్రోపదేశాలూ, శక్తిపాతాలూ లాంటి   విశేషాలతో విరాజిల్లినట్లుగానే...
నూనె, ఇంగువ, కరివేపాకు వంటి తిరగమోత విశేషాలతో తానూ గుబాళిస్తూ...

'మానవసేవే మాధవసేవ' అని మనుషుల్లో కలిసిన మహర్షి లాంటిది మాగాయ!

*****************************************************
ఆవకాయ:-

"సాధన చేయటానికి ఆలుబిడ్డలను త్యజించక్కరలేదు, వారితో కలిసే సాధన మార్గంలో పయనిస్తా" అనుకునే వివాహితునిలా...తొక్క  టెంకె ఏవీ త్యజించకుండా.. పైగా వాటినీ తనతో పాటు పచ్చడి మార్గంలో ప్రవేశపెట్టి,

"సిద్ధిని పొందటానికి ఎక్కడెక్కడికో పోనక్కర్లేదు" అనుకుని పూజా మందిరంలోనే ధ్యానం చేసుకునే గృహస్థులా...
ఇంట్లో నీడ పట్టునే ఉండి, ఉన్న బేసిన్లోనే ఉప్పూ కారం, నూనె, ఆవపిండి , మెంతిపిండి కలుపుకుని,

బంధు మిత్ర పరివార గణాన్ని కలుపుకుపోతూ వారి సహకారం తాను అందుకుంటూ, వారికీ తన సద్గుణాలు  నేర్పిస్తూ సన్మార్గంలో ముందుకు పోయే సద్వ్యక్తిలా...
తనతోపాటు  శనగలు, వెల్లుల్లి వంటి వాటినీ కలుపుకుని, వాటికి తన రుచినీ తనకు వాటి రుచినీ ఆపాదించుకుంటూ ...

"నేను నేనుగానే ఉండి,   ఉన్నచోట నుండే సాధన చేసి మానవసేవా, మాధవసేవ రెండూ చేయగలను"  అని....
చతుర్విధ పురుషార్థాలనూ గృహస్థాశ్రమం ద్వారానే సాధించి చూపించే సంసారి లాంటిది ఆవకాయ.
*****
*ప్రాంజలి ప్రభ కథలు

రాత్రి భోజనాల తర్వాత ఒక టీచర్ ఆమె విద్యార్థులు రాసిన వ్యాసరచన పేపర్లను దిద్దడం ప్రారంభించింది.* 
ఆమె పిల్లలు పడుకున్నారు. భర్త కుర్చీలో కూర్చొని తన స్మార్ట్ ఫోన్లో 'క్యాండీ క్రష్'లో లీనమైయున్నాడు. చివరి పేపర్ దిద్దాడానికి తీసి చదివిన ఆ టీచర్ నిశ్శబ్దంగా ఏడుస్తూ ఉంది. ఆ ఏడుపు వెక్కిళ్ళ శబ్దానికి భర్త తలతిప్పి చూసి ఆశ్చర్యపోయాడు.
"ఏమైంది?
ఎందుకు ఏడుస్తున్నావు?
ఏం జరిగింది?" అడిగాడతను టెన్షన్తో.
నిన్న నా సెకండ్ క్లాస్ విద్యార్థులకు హోంవర్క్ ఇచ్చాను. "మీరు ఏం కావాలనుకుంటున్నారు" అనే అంశంపై ఏదైనా రాసుకుని రమ్మని.
"అయితే?"
"ఇదిగో! ఈ చివరి పేపర్ దిద్దుదామని చదువుతుంటే ఏడుపును ఆపుకోవడం నా తరం కావడంలేదు."
భర్త ఆసక్తిగా "అంత ఏడిపించే విధంగా ఏం రాశాడు?"
హెడ్డింగ్ ఇలా పెట్టాడు
*నేనుస్మార్ట్ ఫోన్ అవ్వాలని నా కోరిక.*
అమ్మానాన్నలు స్మార్ట్ ఫోన్ ను చాలా ప్రేమిస్తారు. వాళ్ళు స్మార్ట్ ఫోనును చాలా కేర్ గా, శ్రద్ధగా, ఇష్టంగా చూసుకుంటారు. నాకన్నా ఎక్కువగా. నాన్న ఆఫీసు నుండి అలసటతో వచ్చినప్పుడు, అతనికి స్మార్ట్ ఫోన్ రిలాక్స్ ను ఇస్తుంది. నాన్నకి స్మార్ట్ ఫోన్ కోసం సమయముంది. కానీ, నా కోసం లేదు. ఎందుకంటే నాతో ఆడుకోవడం మా నాన్నకు రిలాక్స్ ను ఇవ్వడంలేదు.
అమ్మానాన్నలు ముఖ్యమైన పనుల్లో ఉన్నప్పుడు కూడా స్మార్ట్ ఫోన్ రింగౌతుంటే ఒకటి రెండు రింగులు వచ్చేలోపే వాళ్ళు ఫోన్ చేతిలోకి తీసుకుని జవాబిస్తారు. కానీ నేను ఎన్నిసార్లు పిలిచినా దానికిచ్చే ప్రిఫరెన్స్ నాకివ్వరు. నేను ఏడుస్తూ వుంటే కూడా వాళ్ళు నాతో కాకుండా స్మార్ట్ ఫోన్లతో గడుపుతుంటారు. వాళ్ళు నాతో కన్నా స్మార్ట్ ఫోన్లతో ఆడుకోవడానికే ఎక్కువ ఇష్టపడుతారు. వాళ్ళు తమ స్మార్ట్ ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు నేనేం చెప్పినా వినిపించుకోరు. అది నాకు ముఖ్యమైన విషయమైనా సరే, అదే ఒకవేళ నాతో  మాట్లాడుతున్నప్పుడు రింగ్ వస్తే మాత్రం వెంటనే ఫోన్ కి జవాబిస్తారు. అమ్మానాన్నలు
స్మార్ట్ ఫోన్ని కేర్ గా చూసుకుంటారు. ఎప్పుడూ తనతోనే ఉంచుకుంటారు. దానికి చాలా ప్రాధాన్యతనిస్తారు. దాన్ని చాలా ఇష్టపడుతారు. దానితో రిలాక్స్ అవుతుంటారు. దానికి తమ ఖాళీ సమయాన్ని కేటాయిస్తారు. దానిని ఎపుడు పనివాళ్ళకి అప్పగించరు. నేను ఒకరోజు మాట్లాడకపోయినా బాధపడరు కానీ స్మార్ట్ ఫోన్ ఒక్కగంట పనిచేయకపోతే చాలా కంగారుపడతారు. హడావిడి చేస్తారు. రాత్రి పడుకున్నప్పుడు కూడా ప్రక్కనే ఉంచుకుంటారు. ఉదయం లేవగానే దాన్నే  చేతిలోకి తీసుకుంటారు. కాబట్టి! నా కోరిక ఏమిటంటే నేను అమ్మా నాన్న  చేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ కావాలనుకుంటున్నాను.
భార్య చదువుతుంటే విన్న  భర్తకు మనసంతా పిండేసినట్లైంది. అతని కళ్ళలో కూడా కొంచెం తడి వస్తుండగా
"ఎవరు రాశారది? " అడిగాడు భార్యని.
*"మన కొడుకు"* అంది భార్య కన్నీరు కారుతుండగా.
వస్తువులను ఉపయోగించుకోవాలి.
బంధాలను ప్రేమించాలి.
అన్ని బంధాలకన్నా ఎక్కువగా వస్తువులపై బంధాన్ని ఏర్పరచుకుని ప్రేమించడం మొదలుపెడుతూవుంటే క్రమంగా అసలైన బంధాలు వెనక్కి నెట్టివేయబడతాయి.
*****
ప్రాంజలి ప్రభ కథలు

శ్రీరామునిలో ఉన్న 16 గుణాలు.. మీకు తెలుసా?

దశరథ రాముడు.. కోదండ రాముడు.. జానకీ రాముడు.. ప్రజలందరికీ ఆదర్శప్రాయుడు శ్రీరాముడు. మానవ జీవితంలో విడదీయరాని బంధాన్ని ఏర్పరుచుకున్న మహాకావ్యం 'శ్రీరామాయణం'. ఎన్నిసార్లు చదివినా, ఎన్నిసార్లు విన్నా కొత్తగా అనిపిస్తుంది.

మానవుల జీవితానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన అవతారం శ్రీరామావతారం. రాముడు పరిపూర్ణమైన మానవుడిగా ప్రవర్తించాడు. ఈ ప్రపంచంలో మంచి గుణములు కలిగిన మానవుడు ఎవరు? అని నారద మహర్షిని వాల్మీకి మహర్షి ప్రశ్న వేసినప్పుడు 'పదహారు గుణములు కలిగిన పరిపూర్ణమైన మానవుడు రామచంద్రమూర్తి' అని నిర్ధారించాడు. మనుష్య జీవితంతో శ్రీరాముడి జీవితం మమేకమైపోయింది. ఆయన మానవుడిగా పుట్టాడు.. మానవుడిగా పెరిగాడు.. మానవుడు
పడిన కష్టాలను పడ్డాడు. మానవుడిగానే అవతారం పరిసమాప్తి చేశాడు. ఆయన సత్యముతో లోకాలను, ధర్మంతో సమస్తాన్ని, శుశ్రూషలతో గురువులను, దాన గుణముతో దీనులను గెలిచాడు. అలాగే, తన పౌరుష పరాక్రమములతో శత్రువులను గెలిచాడు. పరిపూర్ణమైన మానవ అవతారమే రామావతారం.

కోన్ అస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ |

ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః ॥

చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః | విద్వాన్ కః కః సమర్థశ్చ కః ఏక ప్రియదర్శనః ॥

ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కోనసూయకః | కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ॥

ధర్మము తప్పకుండా మనిషి అనేవాడు ఇలా జీవించాలి అని చూపించినవాడు శ్రీరాముడు. 16 గుణములు పుష్కలంగా కలిగి ఉన్నవాడు రాముడు. అవే.. 1. గుణవంతుడు, 2. వీర్యవంతుడు, 3. ధర్మాత్ముడు, 4. కృతజ్ఞతాభావం కలిగినవాడు, 5. సత్యం పలికేవాడు, 6. దృఢమైన సంకల్పం కలిగినవాడు, 7. చారిత్రము కలిగినవాడు, 8. అన్ని ప్రాణుల మంచి కోరేవాడు, 9. విద్యావంతుడు, 10. సమర్థుడు, 11. ఎన్నిసార్లు చూసినా ఇంకా చూడాలనిపించేంతటి సౌందర్యము కలిగినవాడు, 12. ధైర్యవంతుడు, 13. క్రోధాన్ని జయించినవాడు, 14. తేజస్సు కలిగినవాడు, 15. ఎదుటివారిలో మంచిని చూసేవాడు. 16. అవసరమైనప్పుడు కోపాన్ని తెచ్చుకోగలిగినవాడు.
*****

No comments:

Post a Comment