*అక్బర్ - బీర్బల్ కధలు -1*
🎭
రచన : యర్నాగుల సుధాకరరావు
*పార్ట్ - 1*
*ముందుమాట :*
ప్రియమైన పాఠకులకు నమస్కరించి వ్రాయునది. వాస్తవానికి బీర్బల్ చరిత్రను లోతుగా పరిశీలించాకనే ఆ చరిత్రను నేపథ్యంలో వాడుకుంటూనే పలు కథల రూపంలో చెప్పటం జరిగింది. ఇందులో అక్బ ర్ గురించి అనేక విశేషాలు చాలామందికి తెలియనివి పొందుపరిచాను.
బీర్బల్ కూడా తెనాలిరామలింగ కవిలా యధార్థవాది. అందుకే పలుమారులు అక్బర్ పాదుషావారి ఆ గ్రహానికి గురయి మరణదండన వరకు తెచ్చుకునేవాడు. ఏదో విధంగా చివరిలో తప్పించుకునే వాడు. బీర్బల్ ప్రతి కదలికలో హాస్యం ఉండేది. అతడో హాస్య బ్రహ్మ. ఆ హాస్యాన్ని భారత ప్రజలు పెక్కు కథల రూపంలో నాటి నుంచి నేటి వరకు చెప్పుకుని ఆనందిస్తునే ఉన్నారు. అంతటి మహోన్నత చరిత్రను కలిగిన బీర్బల్ మహశయుని గురించి కొన్ని ఏళ్లు పాటు అనేక చరిత్ర గ్రంథాలు శోధించి రాయాలని పట్టుదలతో నా వంతు కృషి చేసి మీ ముందుంచాను.
బీర్బల్ కథలు తెలుగు పాఠకులు ఇదివరలో చదివారు. ఆ కథలు జోలికి పోకుండా నాకు లభించిన ఆధారాలతో బీర్బల్ కథలు కొత్తవి తయారు చేసి బీర్బల్ జననం నుంచి మరణం వరకు మీ ముందుంచాను. హాస్యం పండించే బీర్బల్ లో వీరుడున్నాడు. తన చావును ముందే గ్రహించి తన పై ఒక కవిత రాసి నాటి మహా గాయకుడు తాన్ సేన్ కు ఇచ్చాడు.
ఈ సరికొత్త కధలు పాఠకులను తప్పక అలరిస్తాయని నమ్ముతున్నాను.
రచయిత
*బీర్బల్ జననం :*
క్రీ.శ. 1538 ఫిబ్రవరి 18వ తేది.
యమునానదీ తీరాన ఓ నిండు గర్భిణి పురిటి నొ ప్పులు పడుతుండగా, అక్కడ నదికి వచ్చిన స్త్రీలు ఆమె వద్దకు చేరి తమ వంతు సేవలు అందించారు. కొన్ని చీరలు ఆమె చుట్టూ కట్టారు. ఆమెకు ధైర్యం చెప్పారు. ప్రసవం అయ్యేందుకు సహకరించారు. నొప్పులు ఒక వైపు శరీరాన్ని పచ్చిపుండును చేస్తుం డగా, చండ్రనిప్పులను తలపింపచేసే ఎండలకు ఆ మాతృమూర్తి పూర్తిగా శోషలేకుండా పడిపోయింది.
ఆమె భర్త చందనదాస్ కు చేతులు కాళ్లు ఆడని ప రిస్థితిలో ఒక చెట్టు కింద నీళ్లు నములుతూ కూర్చున్నాడు. మిట్ట మధ్యాహ్నం పసి కూత విన్పించింది. అంతే అతడిలో ఉత్సాహం కట్టలు త్రెంచుకుంది. ఆశగా చూసాడు. పండంటి కుమారుడు జన్మించాడు అని ఒక స్త్రీ మూర్తి చెప్పగా ఆనందంతో కన్నీటి భాష్పాలు రాల్చాడు. చెట్టుకు కట్టిన సంచి లోంచి ఖర్జూరాన్ని తీసి అక్కడ వారందరికి పంచాడు. మరి కొద్దిసేపటికి అక్కడ సేవలు అందించిన ఆడువారు ఖర్జూరాన్ని తీసుకుని ఇంటి ముఖాలుపట్టారు.
చెట్టు నీడలో ఉన్న భార్యను బిడ్డను చూసి..
"సాయంత్రానికి ఈ మహానగరంలో చలి బారిన పడకుండా మంచిచోటు ఏదైనా చూసుకుందాం. చాలా చలిగా ఉంది. అసలే పురిటి బిడ్డ తట్టుకోలేదు. నా వద్ద వారం రోజులకు సరిపడా ధనం ఉంది. ఢిల్లీలో నాకు నా చిన్ననాటి స్నేహితుడు కొత్వాలుగా ఉన్నా డు. వాడిని వెతుక్కుంటూ వెళ్లివస్తాను. మన దీన గాథ విని ఆశ్రయం ఇస్తాడని ఆశతో ఉన్నాను. లేకుంటే ఏ సత్రంలోనైనా ఈపూటకి గది చూసుకుందాం. ఏ పూటకూళ్లవ్వ అయినా ఇంత చోటు ఇవ్వకపోదు." అ ని ఆమెకు పరిపరి విధాలుగా ధైర్యం చెప్పాడు. ఆమె అతడి వైపు జాలిగా చూసింది.
“నా గురించి పుట్టిన బిడ్డ కోసం ఎంతగా పరితపించారో నాకు తెలుసు. ఆ దేవుడు చల్లగా చూసాడు. నాకు కొంత బాగానే ఉంది. మీరు ఒకసారి మీ స్నేహితుని గురించి వాకాబు చేసుకుని త్వరగా
వచ్చేయండి.” అని చెప్పింది. అంతలోనే అక్కడికి ఊళ్లో అమ్మలక్కలు చాలామంది వచ్చి చేరారు.
"మీరు బ్రాహ్మలు అని తెలిసి వచ్చాం. మా ఇంటికి రండి. అసలే చలి రోజులు పురిటి బిడ్డతో ఇలా నది ఒడ్డున ఉండడం ఎంత మాత్రం మంచిది కాదు.” అని చెప్పి అంతా కలిసి అక్కడ నుంచి తీసుకుపోయారు. వారి వెంట నడిచాడు చందనదాస్.
బ్రాహ్మణుల ఇంట వారం రోజులు హాయిగా గడిచిపోయాయి. అక్కడ ఓ జ్యోతిష్యుడు బిడ్డ జాతకం చూసి మహర్జాతకుడు అని చెప్పాడు. చందనదాస్ దంపతులు చాలా ఆనందించారు. కానీ, అదే నోటితో మరో శూలంలాంటి మాటను చెప్పాడు. ఈ బిడ్డ డు రాజయోగంతో ఉన్నా ఆ దశలను తల్లితండ్రులు చూడలేరు. పసితనం నుంచి అనాధగా బ్రతుకగలడు. అలాగే మాంచి వాక్సుద్ధితో కీర్తి కిరీటం ధరించగలడు. ఈతని చరిత్ర వాసికెక్కగలదు.".
🎭
*సశేషం*
꧁☆•┉
**అక్బర్ - బీర్బల్ కధలు -2*
🎭
రచన : యర్నాగుల సుధాకరరావు
తల్లితండ్రులు చాలా బాధపడ్డారు. చివరికి బిడ్డను అనాధను చేసి తనువు చాలించిన చో బిడ్డ పరిస్థితి ఏమిటి అని తమ తమ బంధువులకు చెప్పి బిడ్డను సాకమని కోరేవారు. అసలే ఆర్ధిక ఇబ్బందులతో ఉన్న కుటుంబంలో తల్లితండ్రులు లేకుండా బిడ్డ ఎలా బతుకుతాడని బెంగతో ఆ తల్లి తండ్రులు చిక్కి శల్యం అయిపోయారు.
ఇలా ఏడు సంవత్సరాలలో తొలుత తల్లి ఆ తరువాత తండ్రి చనిపోగా బిడ్డ మహేష్ దాస్ అనాధగా మిగిలాడు. తల్లి వైపు వారు తండ్రి వైపు వారు ఎవరూ సాకలేదు. మహేష్ దాస్ ను కొందరు ముస్లింలు చేరదీసి పెంచారు. బ్రాహ్మణులు ఆ పసి వాడిని వెలివేసారు. ముస్లింలు మహేష్ దాస్ ను బీర్బల్ అని పిలుచుకునేవారు. తుర్కీ, పారశీక, అరబ్బీ భాషలు చరిత్ర, భూగోళం, గణితం నేర్పించారు. కత్తి యుద్ధం సాము గరిడీల యందు ప్రావీణ్యం సంపాదించాడు బీర్బల్.
పన్నెండు ఏళ్ల ప్రాయం వచ్చేసరికి అతడి పరిస్థితి మారిపోయింది. ముస్లింలు, హిందూవులతో ఏదో విషయంలో గొడవ వచ్చినందున బీర్బల్ ను వదిలేసారు. అక్కణ్నించి మళ్లీ అనాధగా నాలుగు రోడ్ల కూడలిలో నిలబడ్డాడు. అంతవరకు చేర దీసిన ముస్లిం పెద్ద అబ్దుల్ నాదర్ ఆ బిడ్డను వెన్నుతట్టి ధైర్యం చెప్పాడు.
“బేటా ఇపుడు నీవు లోకజ్ఞానం తెలిసిన వాడవు. నీ తల్లితండ్రులు ఎందరి పాదాలో పట్టుకున్నారు. తాము అకాల మరణానికి గురయితే మా బిడ్డను సాకండి అని కోరారు. నిన్ను వెలివేసిన హిందువులు ఎవరూ విన్పించుకోలేదు. అయితే నన్ను మాత్రం నీ తల్లితండ్రులు అడగలేదు. ఒక ముస్లిం వద్ద బ్రాహ్మణుడు పెరిగితే వేదాలు, విద్య, హిందూ సాంప్రదాయాలు లాంటి విద్యలు రావు అని వారి ఆలోచన. విధివశాత్తు పాపం ఆ పుణ్యదంపతులు నీ చిన్నతనంలో చనిపోయారు. అప్పుడు నీవు అనాధగా మిగిలావు. కనీసం నీకు ఇంతముద్ద పెట్టాలి అనే ఆలోచన నీ బంధువులకు, పెద్దలకు లేదు. కనీసం కన్నెత్తి చూడలేదు.”
"నా బేగం నిన్ను పట్టుకుని భోరున విలపించింది. మనమే సాకుదాం, బిడ్డకు లోకజ్ఞానం ఏమీలేదు. ఆకలికి అలమ టించి చచ్చిపోతాడని నన్ను కోరింది. నేను అప్పటికే నిన్ను పెంచాలని నిర్ణయించుకు న్నాను. అలా నీవు మా వద్ద పెరిగావు. నిన్ను ఏదో బతకడానికి అన్నట్లుగా కాకుండా విద్యాబుద్ధులు చెప్పించాలను కుని ముందు హిందువులనే అడిగాను. ముస్లిం ఇంట తినరానివి తిన్నవాడికి వేదం అబ్బదు. సాంప్రదాయం అంతకంటే వంట బట్టదు అని ఛీపొమ్మన్నారు. వారేదో అన్నారని నేను ఎందుకు నిన్ను విద్య లేకుండా చేయడం అని నాకు తెలిసిన ముస్లిం బోధకుల వద్ద నిన్ను చేర్పించాను. నీవు లోకజ్ఞానం సంపాదించావు.
నీ గురించి ఈ మధ్య ఒక ఫకీరు చెప్పాడు గుర్తుందా, నీవు చరిత్రలో గొప్పవాడివిగా మిగిలిపోతావు అని, నీవు రాజులు, గొప్ప
చక్రవర్తుల మెప్పుపొందుతావని చెప్పాడు. ఇంతకాలంగా నేను నీ రక్షకుడిని అయ్యాను. నేను మక్కా యాత్రకు పోవాలనుకుంటున్నాను. మంచి దారిలో నడిచి కీర్తి సంపాదించి కన్నవారికి, పెంచిన వారికి పేరు ప్ర ఖ్యాతులు తెచ్చిపెట్టగలవని ఆశిస్తున్నాను.” అని దీవించాడు.
పన్నెండు ఏళ్ల బీర్బల్ ఉన్న ఊరు వదిలేసి బయలుదేరాడు. పెంచిన తండ్రి కొండంత ధైర్యం నూరిపోసి బతుకు అని పంపాడు. బతుకుదారి కోసం వెతుక్కుంటూ బయలుదేరాడు.
చిన్న చిన్న రాజుల వద్దకు వెళ్లి తన పాండిత్యం ప్రదర్శించి కొలువులో ఉద్యోగం సంపాదించాలని చూసాడు బీర్బల్. కానీ, ఒక హిందువు ముస్లిం వేషభాషలతో రావడం చూసి హిందూ రాజులు పొమ్మన్నా రు. ఎక్కడ చూసినా మొండి చెయ్యి ఎదురు కావడంతో జీవితంపై విరక్తి కలిగింది. తను పేదరికంలో పుట్టాడు. తల్లితండ్రుల ప్రాణగండం తన చేతిలో
వక్ర రాతలుగా మారాయి. చేరదీసి బతుకుదారి చూపని హిందువులు పసితనం నుంచి నేటి వరకు కక్ష కట్టడంపై వేదాంతిలా నవ్వుకున్నాడు. చాలా దేశాలు తిరిగాడు. దక్షిణ ప్రాంతంలో అనేక మంది రాజులను దర్శించాడు. ఎవరూ కొలువులో స్థానం కల్పించలేదు. చివరికి దేశదిమ్మరిలా తిరిగాడు. అనుభవం వచ్చింది. కానీ బతుకుదారి కన్పించలేదు.
పొట్టపోసుకోవడానికి నానాయాతనలు పడ్డాడు. తనకు వచ్చిన భాషలు దక్షిణ ప్రాంతంలోకంటే ఉత్తరాదిలో రాణిస్తాయి అనే ఆశతో చివరికి ఉత్తరాది వైపు
సాగిపోయాడు...
📖
*అక్బర్ జననం* :
క్రీ.శ. 1542 నవంబర్ 23వ తేదీ గురువారం రాత్రి అమర్ కోట రాజు రాణాప్రతాప్ అంతఃపురంలో అతిథిగా చేరిన రాజ్యభ్రష్టుడు హుమాయూన్, రాణీ హమీదాబేగంకు అక్బర్ జన్మించాడు. జ్యోతీషం పై అపార నమ్మకంతో నలుగురు జ్యోతిష్యులను హుమాయూన్ సంప్రదించాడు. వారు అంతా ఒకేలా
చెప్పారు. ఈ బాలుడు చక్రవర్తిగా రాణించ గలడు. నేల ఉన్నంత వరకు కీర్తిప్రతిష్టలతో తులతూగగల డు. అవతార పురుషుడని ప్రజలచే కొనియాడబడతాడని చెప్పారు.
ఈ వార్త విని హుమాయూన్ చాలా ఆనందించాడు. అంతటి కీర్తిప్రతిష్టల్ని ఆర్జించే సుపుత్రుని గురించి భవిష్యత్ కలలుకన్నాడు. అప్పటికి అతని వద్ద పైకం అంతంత మాత్రంగా ఉన్నందున ఉన్నంత లో పరిసరాలను తన సువాసనలతో ప్రభావితం చేసే అత్యంత విలువైన కస్తూరిని కొనుగోలు చేసి తన పరివారంలో పంచాడు. ఆ కస్తూరీలా తనయుడి కీర్తి ఈ విశాలమైన నేల అంతటా వ్యాపించాలి అని కోరుకున్నాడు.
ఇట్టి పుత్రుడ్ని కంటుందని జాతకరీత్యా నిరుపేద హమీదాను పెళ్లి చేసుకున్నాడు. ఇదే విషయం ఆమెకి ఎన్నోసార్లుచెప్పాడు. చాంద్రమానం ప్రకారం వారాల పేర్లు మార్చి నటువంటి హు మాయూన్ మాటలను విని పొంగిపోయింది హమీదా.
తనకు, తన భార్యకు ఆశ్రయం ఇచ్చిన రాణాప్రతాప్ నుంచి సెలవు తీసుకుని హుమాయూన్ కాందహార్ మీద నుంచి పర్షియా చేరుకున్నాడు. అక్కడ తహమాన్ ఆతిధ్యం ఏడాది పాటు స్వీకరించాడు. హుమాయూన్ జీవితం ఎప్పుడూ సుఖంగా సాగలేదు. ఏవో కష్టాలు అతన్ని ముసురుతూనే ఉండేవి. అతడికున్న జాతకాల పిచ్చి అతన్ని ఒక విధంగా మనిషిగా తీర్చిదిద్దాయి. ఎన్ని కష్టాలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కొనే సాహస వంతుడు, యుద్ధతంత్రాలు తెలిసినవాడు అని అతని చరిత్ర చెప్తుంది.
పురిటి బిడ్డను ఇలా ఎడారుల్లో, అడవుల్లో తిప్పడం అంత మంచిదికాదని హుమా యూన్ వెన్నంటి ఉండే రాజ వైద్యులు చెవుల్లో ఇల్లు కట్టుకుని మరీనూరిపోసారు. అతిసామాన్య కుటుంబం నుంచి వచ్చిన హమీదాబేగంకి కొడుకును వదిలి ఉండాల నిపించలేదు. తనతో తన పుత్రుడుంటాడు అని గట్టిగా వాదించింది. నీకు తెలియదు చక్రవర్తి కావల్సినవాడు ఇలా దేశాలు పట్టి తిరిగితే విద్యాబుద్ధులు ఎప్పుడు, ఎక్కడ నేర్చుకుంటాడు. వీడికోసమే నిన్ను జాతక రీత్యా నేను వివాహం చేసుకున్నాను. సకలశాస్త్ర పారంగతుడు కావాలి ఇదే నా ఆశ. చక్రవర్తిగా ఈ దేశాన్ని పాలించాలి. నాలాగా గతి తప్పి వీడు రాజ్యభ్రష్టత్వం పొందకూడదు. కనుక మనం పిచ్చి ప్రేమ తో బిడ్డ ఎదుగుదలకు నిరోధకులు కాకూడదు అని ఆమెకు హితవు చెప్పాడు. చివరికి ఆమె ఒప్పుకోక తప్పలేదు.
అక్బర్ పెంపుడు తల్లులు అయిన జీజీ, మహంలకు అప్పగించబడ్డాడు. హుమా యూన్ తమ్ముళ్ళు అయిన అస్కరీ, కమ్రాన్ ఆదరణలో మూడేళ్ల వరకు పెరిగాడు. అక్బర్ తప్పటడుగులు వేసే వయస్సులో జరిగే ఉత్సవాన్ని అస్కరీ వైభవంగా జరిపాడు. ఆ తరువాత క్రీ .శ. 1547లో హుమాయూన్ నవంబర్ 30వ తేదిన అక్బర్కి విద్యాభ్యాసానికి ఏర్పాట్లు చేసాడు. గురువులుగా ముల్లాజాదా అస ముద్దీన్ అబ్రహీం, మౌలానా జియాద్దీన్, మౌలా అబ్దుల్నాదర్ లంటి గొప్ప గొప్ప పండితులు నియమితులైయ్యారు. పావురాలను ఎగురవేయడం, వేట, కత్తిసాము అన్నీ నేర్పబడినాయి. కానీ అక్బరుకు చదువు మాత్రం అబ్బలేదు. ఎలాగైనా విద్యాబోధన చేయాలని గురువులు ఎంతగానో ప్రయత్నించి విఫలులయ్యా రు. అట్కానాన్ అనే యుద్ధ వీరుని శిక్షణలో యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు. అతిచిన్న వయస్సులో తండ్రితో యుద్ధభూమికి పోయి రాత్రిపూట శిబిరాల్లో గస్తీ తిరిగేవాడు. ఆ బాలుడు చూపిన చొరవకు హామాయూన్ పంజాబ్ గవర్నర్, హిస్సార్ ఫిరోజాబాద్ జిల్లాలకు జాగీర్దారుగా నియమించాడు.
హుమాయూన్ కు అత్యంత ఆత్మీయుడు ఐన పర్షియాదేశస్థుడు షియాశాఖీయుడు, సేనాధిపతి అయిన భైరంఖాన్ అక్బర్ సంరక్షకునిగా నియమితుడైయ్యాడు.
🎭
*సశేషం*
꧁☆•┉
*అక్బర్ - బీర్బల్ కధలు -3*
🎭
రచన : యర్నాగుల సుధాకరరావు
అక్బర్ ప్రతి కదలిక భైరంఖాన్ పర్యవేక్షణ లో జరగాల్సిందే అన్నట్టుగా ఆ సేనాని సంరక్షణ ఉండేది. ఒక విధంగా అక్బర్ కు ఆ సంరక్షణ బందిఖానాలా ఉండేది. అక్బర్ వయస్సు చిన్నదైనా యుద్ధాలలో తన శక్తి చూపాలన్న ఆసక్తిని పదేపదే తండ్రి ముందు ప్రదర్శించినందున ఈ బందిఖానా లాంటి ఏర్పాట్లు చేసాడు హుమాయూన్. భైరంఖాన్ కు విద్య, వినయం ఎక్కువ. హాస్య ప్రియత్వం కూడా ఉండేది.
హుమాయూన్ ఈ భైరంఖాన్ కు అత్యంత సన్నిహితం ఎలా కుదిరింది అంటే హుమాయూన్ సాహిత్య సంగీతాల్లో మంచి అభిరుచి కనపరిచేవాడు. పలు వురు విద్వాంసులను రప్పించి వారితో రోజుల తరబడి కూర్చునేవాడు. వారికి దండిగా బహుమతులిచ్చి పంపేవాడు. తనకు వచ్చిన తుర్కీ, పర్ఫియన్, అరబిక్ భాషల ప్రావీణ్యతతో అందరిని విస్మయ
పరిచేవాడు. ఖగోళశాస్త్ర పరిజ్ఞానంతో ఆ శాస్త్రపరి శోధనల కోసం ఏకంగా పెద్ద భవనం నిర్మాణం కావించాడు. వీటి వెనుక అంటిపెట్టుకుని ఉండేవాడు. ప్రభుభక్తి చూపే నమ్మకస్థుడుగా భైరంఖాన్ గుర్తింపు పొందాడు.
హుమాయూన్ పేరుకే అదృష్టవంతుడు నిజానికి అతడు సగం దురదృష్టవంతుడు, సగం అదృష్టవంతుడు అని చెప్పక తప్పదు. తండ్రి నుంచి సంక్రమించిన రాజ్యం నిలబెట్టుకోవడానికి ఎన్నో
యుద్ధాలు చేసాడు. చరిత్రశోధకులు నిర్ణయించినట్టు 25 సంవత్సారాలు రాజ్య లక్ష్మి చేపట్టినా కేవలం 11 సంవత్సరాలే పాలనలో ఉన్నాడు. ఆ వివరాలు క్రీ . శ. 1530 నుంచి 1540 క్రీ.శ. 1555 నుంచి 1556 వరకు పాలించాడు. తన జీవితంలో ఎక్కువ భాగం యుద్ధాలకే పరిమితం అయ్యాడు. రాజపుత్రులతో, అఫ్ఘన్లతో, గుజరాత్, బీహార్, బెంగాళ్, పంజాబ్,
తిరుగుబాటుదారులు, మరోవైపు రక్తం పంచుకు పుట్టిన సవతి సోదరులతో సమీప బంధువులతో ఎడతెరిపిలేకుండా 30 వరకు యుద్ధాలు చేసాడు.
రాజ్యభ్రష్టత్వం పొందాక ఎడారులు పట్టి పోయాడు. తనతో తీసుకువెళ్లిన వందలాది గుర్రాలు నీళ్లులేక ఆ ఎడారిలో చనిపోగా కాలినడకనే తన పరివారంతో ప్రయాణం సాగించాడు. నిత్యం ఎక్కడో ఒక చోట యుద్ధం చేస్తూనే ఉండేవాడు. తరిచి చూస్తే యుద్ధ పిపాసకుడు అనిపిస్తాడు కానీ యుద్ధమంటే ఏహ్య భావం ఉన్నవాడు. తప్పని పరిస్థితిలో చేయక తప్పలేదు. లేకుంటే సాహిత్యాభి లాషతో హాయిగా గడపాలనుకునేవాడు. యుద్ధమన్నచో ప్రాణ నష్టమని బాధపడే ఆలోచనాపరుడు.
షేర్షా అనే ఒక పరాక్రమవంతుడు చౌసా, కనోజ్ యుద్ధాలలో హుమాయూన్ని ఓడించి ఢిల్లీ ఆగ్రాలను ఆక్రమించుకుని కేవలం ఐదేళ్లు జనరంజకంగాపాలించాడు. చివరికి క్రీ.శ. 1545 లో కలింజర్ దుర్గం ముట్టడించి ఎలాగైనా దాన్ని వశపరుచు కోవాలని శత్రుదుర్భేద్యమైన పథక రచన చేసాడు. చివరికి ఆ కోట ఎంతకీ వశం కానందున ఏకంగా మర ఫిరంగులను కోట గోడలపైకి ప్రేల్చేందుకు పోటీ గోడలను నిర్మించి ఫిరంగులు పేల్చాడు. కలింజర్ అయితే వశం అయ్యింది కానీ, ఒక ఫిరంగి గుండు ఎదురుగా పోకుండా గతి తప్పి వెనుక్కు వచ్చి షేర్షా ఉంటున్న శిబిరం పై పడింది. అక్కడ ఉన్న మందుగుండు తోడైంది. ఆ పెద్ద ప్రేలుడులో షేర్షా తీవ్రంగా గాయపడి కొద్దిరోజుల్లో ప్రాణాలు వదిలాడు. తర్వాత ఇస్లాంషా ఏలుబడిలో కొంతకాలం సజావుగా సాగింది. ఆ తర్వాత ఢిల్లీ రాజకీయాలు వంశపారంపర్య పోరాటానికి వేదిక అయ్యింది. ఇదే అదను అనుకుని హుమాయూన్ 1555లో ఆగమేఘాలపై ఢిల్లీ వచ్చి సూర్ వంశస్థుల్ని పారద్రోలి తిరిగి తన రాజ్యాన్ని కైవసం చేసుకున్నాడు. అంతటితో సూర్ వంశం చరిత్ర సమాప్తి అయ్యింది.
ఏడాది అయినా కాలేదు హుమాయూన్ కి దురదృష్టం వెంట తరిమినట్టు 1556లో తన అత్యంత ప్రియమైన గ్రంథాలయంలో మెట్లు దిగుతుండగా కాలుజారి పడి వెన్ను విరిగి కొన్నాళ్లు మంచానపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం గురుదాస్
పూర్ ఫిర్కాలోగల కలగౌర వద్ద ఉన్న అక్బర్ కు తెలిసింది. వెంటనే అప్పటికప్పు డు ఇటుకలతో నిర్మిం చిన వేదికపై అక్బర్ కు పట్టాభిషేకం చేసాడు భైరంఖాన్. అక్బర్ ఆ మరుక్షణం అతన్ని ప్రధాన మంత్రిగా నియమించాడు. అప్పటికి అక్బర్ వయస్సు కేవలం 14 సంవత్సరాలే.
📖
బెంగాలు రాజైన మహమ్మద్ ఆదిల్షా వద్ద మంత్రిగా ఉన్న హేమరాజ్ అనే అతను గౌర్ ప్రాంతపు బ్రాహ్మణుడు. చూడ్డానికి పీలగా ఉన్నా మహాయుద్ధ నిపుణుడు. కత్తిపడితే ఎంతటివారినైనా మట్టికరిపించ గలిగిన యోధాన యోధుడు. అతడిలో తెగింపును చూసి ఇస్లాంషా కొలువులో ఓ చిన్నపాటి బతుకుతెరువు ఉద్యోగం ఇచ్చాడు. ఆ తరువాత ఆదిల్షా రాజు వద్ద ఏకంగా మంత్రిగా నియమితుడై 24
యుద్ధాలు చేసి అందులో 22 యుద్ధాల్లో మేటి అనిపించుకుని విజయదుందుబి మ్రోగించాడు.
📖
హుమాయూన్ తిరిగి ఢిల్లీని ఆక్రమించుకు న్నందున ఆదిల్షా చునార్ కి పోయి అక్కడ తన ఏలుబడి సాగించాడు. ఈలోగా హుమాయూన్ చనిపోయిన వార్త విని ఆదిల్షా హేమరాజును ఢిల్లీ పైకి పంపాడు. అతడు ఢిల్లీ ఆగ్రాలను ఆక్రమించేసి మొగల్ సేనను తరిమికొట్టి సునాయాసం గా గ్వాలియర్ నుంచి సట్లేజ్ నది వరకు 1-10-1556 నాటికి ఆక్రమించుకున్నాడు. విక్రమార్క పేరుతో తనే ఢిల్లీశ్వరుడయ్యా డు. అతడు ఆదిల్షా పేరే తలవకుండా తనే సర్వ స్వతంత్రుడయ్యాడు. అంత వరకు మొగల్ ఖజానాలో ఉన్న ధనరాసులను తన కోసం ప్రాణాలు తెగించి పోరాడిన సేనానులకు పంచి ఇచ్చేసాడు ఆ వెంటనే మొగలులను భారతదేశంలో లేకుండా తరి మికొట్టాలని నిర్ణయించుకున్నాడు. ఐతే ఇందుకు తగిన పథక రచనలో ముమ్మరం కాసాగాడు. యుద్ధ తంత్రాలకు పెట్టింది పేరు హేమరాజ్.
ఢిల్లీకి రక్షకుడిగా కత్తి యుద్ధం నేర్పే టార్డీ బేగ్ ని నియమించి అక్బర్, భైరంఖాన్లు పంజాబ్ కు వెళ్లారు. హేమరాజ్ అతడి సైన్యంతో ఢిల్లీకి రాకుండానే బయటే తగిన బుద్ధి చెప్పుదామని టార్డీబేగ్ ఎదురుగా వెళ్లాడు. గుండెకాయలాంటి ఢిల్లీని మరో దారిలో ప్రవేశించి హేమరాజ్ స్వాధీనం చేసుకున్నాడు.
రాజధాని అన్యాక్రాంతం కావడం అక్బర్, బైరంఖాన్లు తట్టుకోలేకపోయారు. వారు వెంటనే తమ సైన్యాలతో పానిపట్టు గ్రామం వద్ద మోహరించారు. ఇక్కడ 1556 లో రెండవ పానిపట్టు యుద్ధంకు నాంది అయ్యింది. హేమరాజ్ కు ఢిల్లీ సునాయా సంగా చిక్కిపోయింది. అందుకు అంతా బాధపడినా టార్డీ బేగ్ ను మందలించి ఈసారి అంతా కలిసి హేమరాజ్ పని పట్టాలి అని పానిపట్టు వద్ద కాచుకుని సిద్ధం అయ్యారు.
📖
*బీర్బల్ రంగప్రవేశం*:
భైరంఖాన్ కి అతీతశక్తులన్నా,హాస్యమన్నా పిచ్చి సరదా! ఒకవైపు పానిపట్టు వద్ద సైన్యం మోహరించి ఉంది. యుద్ధమన్నాక ప్రత్యర్ధులను ఎలా మట్టికరి పించాలని ఎన్నో పథకాలు వేస్తుంటారు. ఒక విధంగా తలబొప్పిగడుతుంది. అంతగా ఆలోచనల తో వేడిక్కిపోతుంది. భైరంఖాన్ పెద్దగా ఆవులించి లేచి ఒక గుర్రం ఎక్కాడు. అక్బర్ ఎదురు వచ్చి “ఖాన్ బాబా ఎటు వెళ్తున్నారు. నేను ఒంటరిగా ఈ గుడారం లో ఉండాలి అంటే అదోలా ఉంది. మీరు చెప్పే హాస్య కధలు భలేగుంటాయి. ఏమైనా చెప్పరాదు. మీకు తెలుసుకదా నాకు కథలు అంటే చాలా ఇష్టం అని" అని అడిగాడు.
"పాదుషా మీ కోరిక ప్రకారం నా వద్ద గల అనేక కథలు ఇదివరకే చెప్పాను. నా తల లో ఏమీలేదు. ఎక్కడైనా దొరుకుతాయో మోనని బయలుదేరాను. తప్పక మీకు మంచి కథను చెప్తాను. ఓపిక పట్టండి. ఈ గ్రామం పరిసరాలు, అడవిలో కొంత దూరం వెళ్లి వస్తాను. ఏదో కథ దొరక్కపోదు. నా స్పురణకు రాకపోదు.” అని చెప్పి గుర్రంపై దూసుకుపోయాడు.
ఒక సన్నని బాటలో సాగుతుండగా ఆ వైపుకు పోవద్దని అక్కడివారు చెప్పారు. ఏం ఎందుకని అని ఎదురు ప్రశ్నిస్తే వివరాల డొంక కదిలింది.
పానిపట్టు గ్రామానికి ఉత్తర దిశలో ఒక తోట ఉంది. అందులో విరివిగా కాచే పండ్ల ను ఆ గ్రామస్థులు తీయరు, తినరు. కారణం ఆ తోట మధ్యలో ఒక పాడుపడిన బావి ఉంది. లోగడ జీవితం మీద విరక్తి కలిగినవారు వెతుక్కుంటూ వచ్చి ఆ బావిలో పడి చనిపోయారు. చచ్చిన వారు ఆత్మలు, దయ్యాలు, భూతాలు అయి ఆ తోటలో తిరుగుతున్నారని అక్కడ చుట్టు ప్రక్కల గ్రామీణుల పిచ్చి నమ్మకం.
ఆ కథనం విన్న భైరంఖాన్ గుర్రాన్ని అటు తిప్పి తోటలోకి వెళ్లాడు. నిర్మానుష్యంగా ఉంది ఆ తోట. తీవ్రమైన ఎండలో కాకులు దాహంతో అరుస్తున్నాయి. మెల్లగా గుర్రం నడవసాగింది. నిజంగా దయ్యాలు ఉన్నా యంటే తను నమ్మడు. ఎందుకోదయ్యాల్ని మానవుడే సృష్టించాడు అని గట్టిగా నమ్ముతాడు. అక్కడ ఆత్మల బావి కోసం వెతికాడు. తోటలో మామిడిపండ్లు విరగ కాసిన ఒకే ఒక చెట్టును చూసాడు.. దానికి ఆరముగ్గిన పండ్లు వేలాడుతున్నాయి. వాటి వాసన ముక్కుపుటల్ని తాకుతోంది. ఆ పక్కనే బావి ఉంది. అక్కడకు వెళ్లాడు. దానిలో చాలా కంకాళాలున్నాయి. ఆత్మ హత్యలకు నెలవుగా మారింది ఆ బావి అని అనుకుని వెనుదిరగబోతుంటే అక్కడ ఒక కూనిరాగం విన్పించింది.
🎭
*సశేషం*
꧁☆•┉┅━
*అక్బర్ - బీర్బల్ కధలు -4*
🎭
రచన : యర్నాగుల సుధాకరరావు
ఒక్కసారిగా గతుక్కుమన్నాడు భైరంఖాన్. చుట్టూ పరికించి చూసాడు ఎవరూ లేరు.. కొంపదీసి గ్రామీణులు చెప్పినట్టు దయ్యం నిజంగా తన్ని ఆటపట్టిస్తోందా?ఒకరకమైన కంపరం వెన్నులోంచి తన్నుకు రాసాగింది. నాలుక తడారింది. మరింత కన్నులు సాగదీసుకుని చూసాడు. ఎప్పుడు నమ్మని దయ్యాన్ని తలచుకుని తను భయపడ్తు న్నందుకు నవ్వు వచ్చింది.
ఆ వెంటనే పకపకమని నవ్వు విన్పించింది. అది ఖచ్చితంగా మనిషి నవ్వే అనుకుని ఆత్రంగా నలుదిశలా పరికించి చూసాడు. బావికి కొంత దూరంలో ఒక యువకుడు కనిపించాడు. అతడు చేతిలో రెండు మామిడి పండ్లున్నాయి. భైరంఖాన్ కు ఒక్కసారి కోపం తారాస్థాయికి వచ్చింది. తననే పరిహసించే సాహసం చేసినది ఈ కుర్రకుంకా? అని సర్రున అటువైపుకి దూసుకుపోయాడు.
"ఏయ్ ఎవర్నువ్? ఏమిటి నీ సాహసం నేను ఎవరినో తెలుసా? నన్ను చూసి నవ్వుతావా? నేను యుద్ధవీరుడిని. నా చేతుల మీదుగా కొన్ని వందలమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. చూస్తుంటే నీవు హిందువులా ఉన్నావు. నీలో ఇంత తెగింపు ఉండడం చాలా వింతగా ఉంది. నీవు చేసిన పరిహాసానికి నీకు శిక్ష ఏమిటో తెలుసా?" భైరంఖాన్ కోపంతో ఊగిపోతూ హెచ్చరించాడు.
ఆ యువకుడు అది విని సన్నగా నవ్వి ఊరుకున్నాడు.
సర్రున మొలలో వేలాడుతున్న కత్తిని బైటికి తీసాడు భైరంఖాన్.
"రేయ్ కుర్రకుంకా, ఎంత కండకావరం, నా మాటలు నీకు ఏమీ కావా? బుద్ధిహీనుడా! ఇందుకు తగిన బహుమానం నా కత్తికి నీ కుత్తుక ఎర అవుతుంది." కత్తి ఎత్తి పట్టుకున్నాడు.
"ఓ సాహస వీరుడా నీవు చంపాల్సింది నన్ను కాదు. నీ దేశ రక్షణ కోసం పగవాడిని బలితీసుకో! నా వంటి అభాగ్యుడ్ని చంపిన చో నీకు మిగిలేది బ్రాహ్మణ హత్యాపాతకం. ఆ పాతకం నిన్ను ఏడు జన్మలకు సరిపడా వెంటపడి తరుముతుంది. నీవు చంపక పోయినా నేను మాత్రం చావడానికి సిద్ధ పడే ఇక్కడికి వచ్చాను. నా చావు తిప్పలు నేను పడతాను. నేను చావాలని బావిలో దూకుదామంటే నీళ్లు లేవు. పైగా కంకాళా లున్నాయి. నిన్ను నేను ఏమీ కించపరచ లేదే ! నేను ఏమీలేనివాడిని. నిరుపేదరికం తో అలమటిస్తూ ఈ బతుకుపై విరక్తి కలిగి చావాలనుకుంటున్నాను. మరి నీవు! రాజాలా దర్జాగా ఉన్నావు. నీకు చావాలని పించి ఈ తోటను వెతుక్కుంటూ ఇటువైపు వచ్చావా? చచ్చే చావు నీకెందుకు? తిన్నది అరక్కనా అని నవ్వుకున్నాను.” అని తెరలుతెరలుగా నవ్వాడు.
ఒక దశలో నేల మీద పొర్లాడి మరీ నవ్వాడు. ఆ నవ్వు చూస్తుంటే మరింత అసహనంకి లోనయ్యాడు భైరంఖాన్.
"రేయ్ నీవు బుద్ధిహీనుడవు. అందుకే నా చేతిలో చావును ఖాయం చేసుకున్నావు. నిన్ను చంపిగాని పోను. నన్ను చూసి పడిపడి నవ్వుతావా? ఈరోజు ఢిల్లీని ఏలుతున్నవాడిని. నన్ను కనీసం గుర్తించ కుండా భయపడకుండా నీ ఇష్టంవచ్చినట్టు ప్రేలుతావా? నిన్ను చంపితే నాకు ఏడు జన్మల వరకు పాతకం చుట్టుకునివెంటాడు తుందా? ఇదేనా నీకు తెలిసిన ధర్మశాస్త్ర పరిజ్ఞానం. నీవంటివాడు జీవించడం దండుగ. యుద్ధభూమిలో కొన్ని వందల మందిని జాతులు మతాలు వారి శక్తి యుక్తులను చూసి మరీ చంపుతామా? కత్తికి చిక్కినవాడి తలను నేలపైకి తోసి పొర్లాడించాల్సిందే. అదే కదా యుద్ధధర్మం. వీరునికి ఉండాల్సింది పగవాడి తల నేల కూలడమే కదా! మతాలు కులాలు మంటకలవడం కాదు. ఈ సత్యం నీవు ఎరుగవా? నీవన్నట్లే మతాలకు ఏడు జన్మల వరకు పీడించే శక్తి ఉంటే యుద్ధాల లో మత బహిష్కరణ ఉండేది.” అని వీర తేజంతో చెప్పాడు.
"ఓ ఏలికా ఇదే నీకు తెలిసిన ధర్మశాస్త్రం. నిన్ను చూస్తుంటే జాలివేయుచున్నది. తెలియక చేసిన హత్యాకాండలో ఎవరైనా చావచ్చు. కానీ తెలిసి చేసినచో అది పాతకమే. తెలియక చేసినవాడిని ఆ
సర్వేశ్వరుడు క్షమించగలడు. తెలిసి చేసిన వాడిని ఎవరూ క్షమించరు. చూడు నేను చావాలని వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక నేను చదివిన శాస్త్రం నన్ను భయపెట్టింది. ఆత్మహత్య మహా పాతకం. అది తెలిసి చేయడం మరీ పాతకం. నన్ను చంపేవాడిని వెతుక్కుంటూనే ఉన్నాను. నీవు నాలాంటివాడివే అనుకున్నాను. కానీ, నీవు ఏలికనంటున్నావు. క్షుద్రశక్తుల ను నమ్మనివాడిలా ధైర్యంగా వచ్చి తోటలో ఏమీలేదు, అంతా మానవుల పిచ్చి నమ్మిక అని నిరూపించేట్టు కలియతిరుగుతున్నా వు. పైగా నీకున్న అహంకారంతో గుండె కాయలాంటి ఢిల్లీని ఓ బాపనికి బంగారు పళ్లెంలో పెట్టి అప్పగించి తీరుబాటుగా ఈ పానిపట్టు వద్ద యుద్ధానికి సిద్ధపడ్తున్నావు. పాతకం అని తెలిసి బాపనితో యుద్ధం చేస్తున్నావు. చేయాల్సిన యుద్ధ రచన చేయకుండా నాలాంటివాడిని చంపుతాను నరుకుతాను అని వెంటపడున్నావు." వేదాంతిలా నవ్వాడు ఆ యువకుడు.
భైరంఖాన్ ఆలోచనలోపడ్డాడు. ఎత్తిన కత్తితో పక్కనే ఉన్న ఒక చెట్టుకొమ్మను నరికాడు. ఆ వెంటనే కత్తిని ఒరలోకి నెట్టాడు.
“మంచి తేజస్సుతో అలరారుచున్నావు. నీ వాచకం బావుంది. నా చేతిలో ఎత్తిన కత్తిని చూసి కూడా ఏ మాత్రం భయపడకుండా నీ ధోరణిలో నీవు మాట్లాడగలుగుతున్నా వు. ఎవరు నీవు. నీవెందుకు చావాలని ఈ తోటను ఆశ్రయించావు.” తన కోపాన్ని దిగమింగి అడిగాడు భైరంఖాన్.
ఆ యువకుడు ఒళ్లు విరుచుకుని..
"ఓ సాహసవీరుడా భైరంఖాన్ నీవు జెగజ్జెట్టివి. నిన్ను నమ్మి నీ చేతిలో రాజ్యాన్ని, తన పుత్రుడ్ని పెట్టి తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు ఢిల్లీశ్వరుడు హుమాయూన్. నీవు ఈ అదనపు బాధ్యతల్ని మోస్తూ ఒకింత గర్విష్టివి అయ్యావు. కనుకనే కొన్ని పొరపాటులు జరిగాయి. అక్బరు బాదుషాకు కత్తి
యుద్ధం నేర్పే సాముగరిడీల గురువు ముదుసలి అయిన టార్డీబేగ్ భుజాల మీద ఢిల్లీని వదిలి నీవు పంజాబ్ లో కూర్చుంటే ఢిల్లీ చేజారిపోకుండా ఎలా ఉంటుంది. సరే నా విషయం నేను ఓ బీద బ్రాహ్మణుని కుమారుడను. చిన్నతనం నుంచి పొట్ట నింపు కోవడానికి ఎన్నో పనులను చేసాను. కానీ, నాకున్న యధార్ధవాదం చతుర సంభాషణ నాకు ఎక్కడ ఏ కొలువులోనూ ఉండనీయలేదు. ఎంతచేసినా నాకు మిగి లేది ఆ పూటకు రెండు రొట్టెలు. ఈ దానికి నేను ఎందుకు బ్రతకాలి. చస్తే పోలా అని ఎక్కడ చద్దామా అని ఆలోచించాను. ఈ పానిపట్టు గ్రామంలో చావుల తోట ఉందని తెలిసి వచ్చాను. తీరా వచ్చాక, ఈ బావి చావుకు సరైనదిగా లేదు.” అని ఇంకా చెప్పబోతుంటే మధ్యలో భైరంఖాన్ అందుకున్నాడు.
“నీవు చావడానికి వీలులేదు. నేను నీకు కావల్సిన సాయం చేయగలను. నీవు బ్రతకాలి. నావెంట వచ్చేయ్, నీ మాటలలో రాజకీయపు టెత్తులున్నాయి. ముందుగా ఆలోచించమని చెప్పే హెచ్చరికలున్నాయి. నా ముందు ఇంత వరకు ఎవరు ఇది నీవు చేస్తున్నది తప్పు అని చెప్పలేదు. నీవు ఏమాత్రం భయపడకుండా చెప్పగలిగావు. తెలిసి చేసిన తప్పును ఆ దేవుడు క్షమించడు అని చెప్తున్నావు. ఈ రోజు
మేము తలపడేది బ్రాహ్మణుడ్ని, అతడు అపర చాణక్యుడు. అరివీరభయంకరుడు. అతన్ని వధించక తప్పదు, అతన్ని చంపిగాని నిద్రపోను.”
"ఆ వధించేది నీవు కాకూడదు. వేరేవ్వరి చేతనో చేయించు”
"నీ పేరు? నీవే విద్యలు నేర్చుకున్నావు. నాకు చెప్పు”
“నా పేరు బీర్బల్. నేను కొలువులో ఉండి చేసే ఉద్యోగాలు నేను ఆశించను. నాకు కావల్సింది నేను నవ్వుకుని పదిమందిని నవ్వించడమే. నవ్వు నాలుగు విధాల ఆరోగ్యం, ఇదే నా కోరిక. ఆ తరహ ఏదైనా కొలువున్నచో ఇప్పించు"
“అందుకే నీకు ఎక్కడా కొలువు లభించ లేదు. భృతి సాగలేదు. ఎవరు నిన్ను పక్కలో పెట్టుకుని ఖరాఖండి మాటలు వింటారు. నీకు పనిపాటయే మంచిది. ఛస్తానంటున్నావు కనుక జాలిపడి నీకు తగిన భృతిని చూపిస్తాను చేసుకో! ఢిల్లీలో వ్యాపార కూడలిలో నీవు జమా లెఖలు రాసుకునేందుకు సరిపోతావు. మంచి ఆదాయం వస్తుంది. ఎక్కడైనా ఒక పిల్లను చూసుకుని చేసుకో! ఇంటివాడవవుతావు. పిల్లాజెల్లా పుడితే నీకు ఒక కుటుంబం ఉంటుంది. ఆ తరువాత ఇలా చావడానికి బయలుదేరవు.”
"ఛస్తాను, కానీ అలాంటి జమా లెఖల పని చేయను. పెళ్లి అంతకంటే చేసుకోను. ఒళ్లు ఒంచి పనిచేయడం, దొంగలెఖలురాయడం నాకు చేతకాదు. నీవు వెళ్లు. నా చావు నేను ఛస్తాను. అయినా నాకు నీవు ఇచ్చునది ఢిల్లీ బజారులో కొలువా? ఇదే ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు ఢిల్లీ బజారు అన్నట్టుంది. నీవు ఆ బాపడి వద్ద ఢిల్లీ గెలవాలి. తీరా గెలిచాక నీకు నేను గుర్తుండాలి. అదీ అక్బర్ అనే పిల్లచేష్టల కుర్రకుంకకు చెప్పి నీవు ఒప్పించాలి.
అప్పుడు నాకు ఆ కొలువు దక్కాలి. ఇదంతా జరిగేపనేనా?”
భైరంఖాన్ కు ఆ మాటలతో మనస్సు చివుక్కుమనిపించింది.
“మేము కత్తి పట్టామంటే గెలుపే. మాకు అపజయం లేదు. ఆక్రమితుడైన హేమ రాజును బతకనీయం. ఈ పానిపట్టు యుద్ధంతో వాడి చరిత్రకు తెరపడనుంది. నీవు నీ మూర్ఖత్వంతో నేను కల్పించే
బంగారు జీవితాన్ని పాడుచేసుకోకు.”
అంతలోనే అంతరంగిక సైనికులు భైరంఖాన్ ను వెతుక్కుంటూ వచ్చారు. “లోకరక్షక్ భైరంఖానీ! ఇది అసలే ఆత్మలు తిరిగాడే చోటు అని విన్నాం. ఇక్కడ పిశాచాలు తిరుగుతాయని గ్రామంలో అనుకుంటున్నారు. మీకు తెలియక వచ్చి ఉంటారని వచ్చాం. పదండి పోదాం." సైనికులు భయంతో దిక్కులు చూ స్తూ చెప్పారు.
“ఏయ్ సైనికులు, నేను ఆత్మనే, చచ్చి చాలా కాలం అయ్యింది. ఆత్మలు తిరిగే చోటులో మనుష్యులు తిరగకూడదు? నా దగ్గరగా రండి. మనం ఆత్మల కోసం, దయ్యాల తీరుతెన్నులు కోసం ఎంచక్కా మాట్లాడుకుందాం.". అని వెకిలిగా నవ్వుతూ వారిని పిలిచాడు బీర్బల్.
🎭
*సశేషం*
꧁☆•┉┅━•
*అక్బర్ - బీర్బల్ కధలు -5*
🎭
రచన : యర్నాగుల సుధాకరరావు
ఆ వచ్చిన సైనికులు బీర్బల్ ను చూసారు. అతడు పీక్కుపోయిన ముఖంతో నిజంగానే దయ్యంలా ఉన్నాడు. కెవ్వున అరిచి అక్కడ నిలవకుండా పరుగులు తీసారు. క్షణాల్లో తోటలో కనపడకుండా మాయమైపోయారు. వారిని చూసి భైరంఖాన్ ఎంత ఆపుకుందామనుకున్నా నవ్వాగలేదు. తెరలు తెరలుగా నవ్వాడు.
“చూసావా నీ సైనికులు లేని ఆత్మలను, దయ్యాలను నమ్మి ఎలా పరుగులు తీస్తున్నారో చిత్రంగా లేదు. ఆ సైనికులు కనీసం పదిహేనుమంది ఆయుధదారులై ఉన్నారు. నేను సన్నగా పీలగా శుష్కించి ఉన్నాను. నేను ఆత్మని అనగానే మిమ్మల్ని వదిలి పత్తాలేకుండా పారిపోయారు. ఇది మానవ నైజం, వాళ్లు నీకు ఆంతరంగిక రక్షకులు కాబోలు. నిజంగా నిన్న ఏ దయ్యానికో అప్పగించి ఇలానే పారిపోతా రు కాబోలు.” చెప్పి పకపకమని నవ్వాడు.
"శెహబాష్ బీర్బల్. నీవు చాలా చతురత గలవాడివే. నీలాంటి వాడినిమృత్యుదేవత కి చూస్తూ అప్పగించలేను. పదా నా వద్దనే నీవు తోచిన రీతిగా ఉండవచ్చు. నీ నుంచి నేను చక్కని హాస్యం, నీకు తెలిసిన రాజకీయపుటెత్తులు విని ఆనందించాలను కుంటున్నాను. నాతో బయలుదేరు.”
అన్నాడు.
"జీతభత్యాలు గురించి ఇద్దరం ఒకసారి అనుకుంటే సరిపోతుంది.” బీర్బల్ ఖరాఖండిగా అడిగాడు.
“నీకు ముఖమాటం కూడా లేనట్టుంది. నీ ముచ్చట ఎందుకు కాదనాలి. ఇదిగో నా మెడ లోని విలువైన వజ్రాలహారం నీకు ఇస్తున్నాను. దీన్ని అమ్ముకుని నీవు
విలాసంగా పదేళ్లు జీవించగలవు. అంతటి విలువైన హారం ఇది. అలాగే ఓ మంచి జీవనానికి సరిపడా నీకు నెలసరి జీత భత్యాలు ఇవ్వగలను.”
బీర్బల్ ఆ హారాన్ని మెడలో వేసుకుని దిక్కులు చూసాడు. అతడిలో ఏదో తెలియని అనుభూతి కలిగింది. ఒక్కసారి భైరంఖాన్ పాదాలపై పడి..
"సర్కార్, ఆ అల్లా నాకు ప్రాణభిక్ష పెట్టాడు. మీ ద్వారా కలిగించాడు. చావాలనుకుని వచ్చాను. అప్పుడు ఒంటరిగా ఉన్న నాకు ఈ తోటలో ఏ కొంచెం భయంలేదు. ఎంత వేగిరం ఛస్తానా అని ఆశపడ్డాను. కానీ, నాకు తమరిచ్చే కొత్త జీవితాన్ని తలచుకు ని ఎంతో కాలం బతకాలని ఇప్పుడు ఆశపడ్తున్నాను. ఈ తోటలోంచి నన్ను క్షేమంగా తీసుకువెళ్లండి. ఇక్కడ ఆత్మలు తిరుగాడుతుంటాయట, నాకు భయంగా ఉంది. నన్ను కాపాడే దైవం తమరే”
వణుకుతునే పాదాలను చుట్టేసాడు.
భైరంఖాన్ అంతులేని ఆశ్చర్యానికి గురయ్యాడు. బీర్బల్ ని లేవనెత్తి “ఎంత విచిత్రం! కొద్దిసేపటిక్రితం నీవు ఎలా తెగించి మాట్లాడావు. నన్ను ఏకవచనంతో సంబోధించావు. ఇప్పుడు సర్కార్ అంటున్నావు. దైవ స్వరూపుడిని చేసావు. ఇంతకుముందు కనబరిచిన ధైర్యం ఏమయ్యింది. ఆత్మలు లేవు అని నీకు తెలుసు. నీవు వాటిని నమ్ముతున్నావా?”
"ఆ దిక్కుమాలిన ఆత్మలు దయ్యాలు ఉన్నాయో లేదో నాకనవసరం. మున్ముందు నా జీవితం నాకు కావాలి. నేను బతకాలి. నాకు తమరు కల్పించిన సువర్ణావకాశం నేను సద్వినియోగం చేసుకోవాలనుకుం టున్నాను. ఆత్మలతో కలిసి మృత్యువు నర్తించే ఈ తోటలోంచి నన్ను అవతలికి తీసుకుపొండి" అని గట్టిగా కన్నులు మూసుకున్నాడు.
"ఏయ్ బీర్బల్! ఏమిటి నీ తీరు ఇలా ఏడ్చింది. ఎందుకింత భయపడ్తున్నావు. ఒంటరిగా ఎంత దర్జాగా ఈ తోటలో రాజాలా గడిపావు. ఎవరూ తినని ఈ తోటమామిడి పండ్లను చేత్తో పట్టుకుని నీ ధైర్యాన్ని కనబరిచావు. ఇప్పుడు తోటలో కన్నులు మూసుకుని నన్ను ఇక్కడ్నించి తీసుకుపొమ్మని బతిమాలుతున్నావు.”
"సర్కార్ చచ్చేవాడికున్న ధైర్యం నాకు ఉండేది. ఇప్పుడు బతకాలనుకుంటున్నా ను కదా ! ముందు నన్ను ఈ తోటలోంచి అవతలకి విసిరేయండి. అవతల కూర్చుని తీరిగ్గా మాట్లాడుకుందాం. నాకు మీరు సమకూర్చిన విలాస జీవితఫలం నోటికి అందకముందే ఈ తోటలోని క్షుద్రశక్తులు నన్ను చంపివేయగలవు. దరిద్రుడ్ని బాగు చేయాలన్న మీ ఆలోచన నా చావుతో సమాధి కాగలదు.” చెప్తూనే మరింత వణికిపోయాడు. అతని భయం క్షణక్షణం ఎక్కువకాసాగింది.
భైరంఖాన్ ఆలస్యం చేయకుండా తన గుర్రం పైకి బీర్బల్ ను ఎక్కించుకుని తోట లోంచి బయటికి దూసుకుపోయాడు. బీర్బల్ తోట నుంచి బయటపడే వరకు కన్నులు మూసుకునే ఉన్నాడు.
“సర్కార్ తోట వదిలేసినట్టున్నాం. హమ్మయ్య ఆ దిక్కుమాలిన దయ్యాల పీడవదిలింది.” ఆనందంగా అడిగి కన్నులు తెరిచాడు.
భైరంఖాన్ పగలబడి నవ్వాడు. “భలేవాడివయ్యా ఈరోజు మా చిన్ని పాదుషా (అక్బర్) నాకు ఏదైనా హాస్య కథ చెప్పమన్నాడు. ఏం చెబుదామా అని అనుకుంటుండగా నీవు తగిలావు. ఇప్పుడు మన మధ్య జరిగింది చెప్తాను. ఆ పాదుషాకు ఇలాంటి కథలు భలేగా నచ్చుతాయి. పదేపదే చెప్పించుకుని రకరకాలుగా ప్రశ్నించి మరీ అడుగుతాడు. విన్న కథనే మళ్లీ మళ్లీ వింటుంటాడు.”
బీర్బల్ కు ప్రత్యేక గుడారం ఇవ్వబడింది. నలుగురు సిపాయిలు కాపలాకు అతడి సేవలకు నియమింపబడ్డారు. అతడెవరో అక్కడెవరికి చెప్పకుండా భైరంఖాన్ ఎందుకో జాగ్రత్తపడ్డాడు. కొత్త దుస్తులు, మంచి భోజనం, మెత్తని పడక, తల దగ్గర ద్రాక్ష సారాయి లోటాతో కన్పించింది. తొలిసారి దాని రుచి చూసాడు. అ తర్వాత హాయిగా మత్తుగా నిద్రపోయాడు.
బీర్బల్ అంతటి సుఖ నిద్ర ఏనాడు పొందలేదు. ఒళ్లు తెలియని నిద్రలో మునిగితేలాడు. తెలవారుతుండగా ఎవరో తట్టిలేపినట్టు అయ్యింది. కళ్లు విప్పి చూసాడు. పక్క గుడారంలో భైరంఖాన్ తనపై కథనం చెప్తుంటే చిన్ని పాదుషా వింటూ పగలబడి నవ్వుతున్నాడు. వారు నవ్వుతుంటే తను నవ్వాడు. ఏమైనా తను ఢిల్లీశ్వరుల కనుసన్నల్లో మెలిగే అవకాశం వచ్చినందుకు సంతోషించాడు. తన తల్లి తండ్రులను పెంచిన తండ్రి అబ్దుల్ నాదర్ ను తలచుకున్నాడు.
📖
*కోతి విలువ నిలువెత్తు ధనం* :
పానిపట్టు గ్రామం వద్ద అక్బర్ సైన్యాలు మోహారించాయి. ఢిల్లీని ఆక్రమించుకున్న హేమరాజ్ (హేము) సైన్యం కూడా కదం తొక్కుకుని రంగంలోకి దిగింది. వారిలో విపరీతమైన ఆత్మవిశ్వాసం కనబడ సాగింది. అందుకు కారణం ఢిల్లీని ఆక్రమించుకున్న ఉత్తర క్షణంలో ఢిల్లీలో నిలువ ఉన్న ధనరాసుల్ని తన కోసం ప్రాణాలొడ్డిన వీరులందరికి పేరు పేరున పంచేసాడు హేమరాజ్. అందుకే సైన్యంలో నూతనోత్సాహం కన్పిస్తోంది. ఏ క్షణమైనా దాడి చేసి భైరంఖాన్ ను అక్బర్ సేనల్ని చీల్చిచెండాడాలని ఉవ్విళ్లూరసాగారు.
భైరంఖాన్ తన గుడారంలో కూర్చుని ఒక హెచ్చరిక లేఖను రాసాడు. అందులో హేమరాజ్ ని తీవ్ర పదజాలంతో దుయ్య బట్టాడు. ఆ లేఖను చదివిన బీర్బల్ ఇలా రాయండి అని తను రాసిచ్చాడు. ఆ లేఖ తిరిగి ఇలా రాయబడింది.
"ఓ హేమూ !
ఇదే నిన్ను హెచ్చరిస్తున్నాను. నీవు ఎట్టి పరిస్థితిల్లో గెలవలేవు. నీ వెనుక ఉన్న వారంతా నీవు పంచే ధనంకు దేబురించే వాళ్లు. నీవు కత్తిపట్టి కధనంలో చెలరేగే జాతిలో పుట్టలేదు. పూజ్యనీయమైన బ్రాహ్మణజాతిలో పుడితివి. రేవారి ప్రాంతం లో ప్రముఖంగా కన్పించే భార్గవ అనే పేరు గల బ్రాహ్మణుడవు. పొట్ట చేతబట్టుకుని పురవీధుల్లో ఉప్పు అమ్ముకుని బతికేనీవు, ఇస్లాంషా రాజు వద్ద చేరి పాకశాల అధికా రిగా చేరి అమ్మలక్కలతో కలిసి వంటలు చేసే నీవు కధనానికి అర్హుడవుకావు. కనుక కధనం మానుకుని తోకముడిచి ఢిల్లీని వదిలిఫో! నీకు పరువు పోయే సమస్య లేదు.. రాజలోకంలో నిన్ను గుర్తించేవారు బహుతక్కువగా ఉన్నారు. ఈలేఖ సారాంశం గ్రహించి నీ బతుకు నీవు బతుకు లేకుంటే ఆయువు చెల్లిపోతుంది. బ్రాహ్మణుని చంపిన మహాపాతకం మాకు అంటకుండుగాక !
నేను ఎన్నో యుద్ధాలు చేసాను కానీ నీవంటి పుణ్య పురుషులతో తలపడలేదు. యుద్ధం తప్పని పరిస్థితి అయితే నేనే నా చేతుల్ని పవిత్ర యుమునా నది జలలాల తో కడుగుకుని మరీ నీతో తలపడగలను. తెలిసి బ్రాహ్మణునితో యుద్ధం ఎవరు చేయరు.
*ఇట్లు*
*అక్బర్ పాదుషా*
ఈ లేఖలో ప్రతి అక్షరం రాసింది బీర్బల్. అంతకు ముందు రాసింది భైరంఖాన్. తన గురించి గొప్పలు రాసుకున్నాడు. తన విజయాలను ముచ్చటించాడు. ఆ లేఖను కాదని బీర్బల్ దగ్గరుండి రాయించాడు. భైరంఖాన్ కు అందులో ఏదో విశేషం ఉంది అనిపించింది. కానీ, అడిగే సమయం లేనందున రాసిన వెంటనే ఇద్దరు సైనిక వీరుల్ని దూతలుగా శత్రువుల శిబిరానికి పంపాడు.
ఆ లేఖ హేమరాజ్ తన వారందరితో కలసి చదివించుకున్నాడు. అదే అతడు చేసిన తప్పు. ఆ లేఖ సారాంశం సైన్యంలోని ఎక్కువమంది అర్ధం చేసుకున్నారు. ఆ లేఖలో రాతలు శతశాతం నిజమే, తాము మిక్కిలి పూజ్యనీయమైన కుటుంబంలో
జన్మించిన హేమరాజ్ వెనుక యుద్ధానికి బయలుదేరడం తప్పే. బ్రాహ్మణుడా యుద్ధం చేయునది. అని ఎవరికివారే ముందున్న ఉత్సాహం నీరుగారిపోయి మిగిలారు. వారు పీలగా ఉండే హేమరాజ్ ని అయోమయంగా చూసారు. పోరు భూమికి ఈతనితో వెళ్లడం సరికాదు. ఈతడు గెలిచినా ఒరిగేది లేదు. కానీ చచ్చినచో బ్రహ్మహత్యాపాతకం తప్పదు అని నిర్ణయించుకున్నారు. హేమరాజ్ అప్పటికే ఆ లేఖ పట్టుకుని నిప్పులు చెణుగుతున్నాడు. ఒక్కసారి అక్కడ వాతావరణం అంతా ఉద్రిక్తతగా
మారిపోయింది.
హేమరాజ్ ఆ లేఖ విసిరికొట్టాడు.
"పట్టుమని పదిహేనేళ్లు లేని పసివాడైన అక్బర్ రాతలను తీవ్రంగా ఆక్షేపించాడు. వెంటనే కోపంతో అక్కడ పొట్టపోసుకు నేందుకు రెండు కోతుల్ని ఆడిస్తున్న వాడి వద్ద ఒక కుంటి కోతిని కొనుగోలు చేసి తన దూతల ద్వారా లేఖ రాసి పంపాడు. ఆ లేఖ సారాంశం ఇలా ఉంది.
*పిల్లకాకి బుద్ధి చూపిన అక్బర్* :
నీవు పట్టాభిషేకం జరుపుకున్నా నీకు ఇంకా పిల్లకాకి బుద్ధులు నీ నుంచి పోలేదు. నీకు యుద్ధమెందుకు ? నీవు నేను పంపిన కుంటి కోతితో హాయిగా ఆడుకుని ఏ పంజాబ్ లోనో బతికేయ్. నీ వంటి పిల్ల కాకులకు ఢిల్లీ బొత్తిగా పనికిరాదు. యుద్ధం అనివార్యం. ఎలాగూ యుద్ధంలో ఓటమి చవిచూడనున్న నిన్ను దయతో వదిలేయా లనుకున్నాను. కానీ నీ లేఖ నిన్ను అసలు వదలొద్దు అని నాకు చెప్తోంది. నీవు బందీ అయ్యాక ఈ హేము అంటే ఏమిటో నీకు తెలుస్తుంది. నిన్ను పసివాడని కూడా చూడకుండా నలిపేస్తాను. పొట్టకూటి కోసం చేరిన భైరంఖాన్ వంటి క్షుద్రుని పెంప కంలో నీకు ఇంతకంటే మంచి ఆలోచన ఎలా వస్తుంది. ముందు ఏదైనా గురుకులం లో చేరి నాలుగు ముక్కలు చదవనూ రాయనూ నేర్చుకో!
*హేమరాజ్*
*ఢిల్లీశ్వరుడు*
కోతిని పంపినందుకు అక్కడ భైరంఖాన్ మరికొంతమంది రాజపుత్రులుఅగ్నికణాల్లా అయిపోయారు. ఒక దశలో కోతిని తీసుకు వచ్చిన దూతల్ని చంపేయాలనుకున్నారు. కానీ మళ్లీ ఎవరికి వారే దూత వధ తగదు అని అనుకుని కోపాలను దిగమింగుకున్నా రు. కుంటి కోతిని శిబిరాల మధ్య కట్టి పడేసారు. పాపమా జీవి బితుకుబితుకు మనసాగింది. అక్కడికి చేరిన బీర్బల్ ఆ కోతిని చూసి జాలిపడి అక్కడ సైనికుల్ని అడిగాడు.
“ఆ కోతిని ఏంచేస్తారు. దాన్ని అలా కట్టి పడేసారు. పాపం ఎండకు ఎలా కమిలి పోయిందో దాహంతో దాని నోరు ఎలా ఆర్చుకుపోతోందో!”
"అది శత్రువు పంపిన హేళన కానుక, కనుక ఈ కోతి మరి బతకదు. మా పాదుషా వారిని హీనపరిచి కుంటి కోతిని కానుకగా ఇచ్చి ఆడుకోమన్నాడు. అందుకే ఈ కోతిలో మేమంతా శత్రువునే చూస్తాం.” లోగొంతుతో చెప్పాడు ఒక సైనికుడు.
బీర్బల్ ఆ కోతిని సమీపించాడు. అక్కడే ఉన్న అక్బర్ ఆసక్తిగా కోతినే చూస్తున్నాడు. ఆ పక్కనే బైరంఖాన్ రాజపుత్ర వీరులు ఆసీనులై ఉన్నారు. అంతా ఒక్కసారి బీర్బల్ వైపు ఆసక్తిగా చూసారు.
🎭
*సశేషం*
꧁☆•┉┅━
**అక్బర్ - బీర్బల్ కధలు -6*
🎭
రచన : యర్నాగుల సుధాకరరావు
బీర్బల్ ఆ కోతిని సమీపించాడు. అక్కడే ఉన్న అక్బర్ ఆసక్తిగా కోతినే చూస్తున్నాడు. ఆ పక్కనే బైరంఖాన్ రాజపుత్ర వీరులు ఆసీనులై ఉన్నారు. అంతా ఒక్కసారి బీర్బల్ వైపు ఆసక్తిగా చూసారు.
బీర్బల్ పాదుషా వారికి చేతులు జోడించి నమస్క రించి..
"అయ్యా ఈ కోతిని నాకు ఇప్పించండి. దీన్ని నేను పెంచుకుంటాను. పాపం ఎండకు కమిలిపోయి దాహంతో అల్లాడిపోతోంది. అది చావకూడదు, ప్రాణి హింస కూడదు.” అని అందంగా చెప్పి కొబ్బరి చిప్పలో నీటిని ఆ కోతి ముందుంచాడు.
భైరంఖాన్ కోపంగా బీర్బల్ వైపు చూసాడు. 'ఇక్కడెందుకు తగలడ్డావు' అన్నట్లున్నాయి అతని చూపులు.
అక్కడ ఒక్కసారి ఉద్రిక్తత ఏర్పడింది. అందరి ముఖాలు వివర్ణమయ్యాయి. బీర్బల్ ను తినేసేట్టు చూసారు.
“ఏయ్ ఎవర్నువ్, నీకు ఏమైనా పిచ్చి పట్టిందా? అ ది మా శత్రువు హేమరాజ్ పంపిన హీనమైన కానుక. ఆ కోతితో బాటు ఇక్కడ నిలబడున్న ఇద్దరు శత్రు దూతలని చంపేయాలనుకుంటున్నాం. నీవు వచ్చి ఇలా నోటికి వచ్చినట్లు పేలుతున్నావు. ఫో అవతలికి లేకుంటే నీ ప్రాణం పోతుంది.” ఒక రాజపుత్రుడు తీవ్రమైన హెచ్చరికను చేసాడు.
శత్రు దూతలు నవ్వారు. “మా ఏలిక హేమరాజ్ మంచి ఆలోచన చేసి పంపాడు. మీ పాదుషా వారికే కాదు, ఇక్కడ ప్రజలకు కూడా చిన్నపిల్లల బుద్ధులు వీడలేదన్న మాట. ఆ యువకుడు (బీర్బల్) కోతితో ఆడుకుంటానని ముచ్చటపడ్తున్నాడు. పాపం అక్బర్ పాదుషావారు తన ఆట ఎక్కడ భగ్నం అవుతుందోనని ఇవ్వలేక పోతున్నట్టుంది" అని నవ్వారు.
ఆ మాటలు అక్కడ మరింత ఉద్రిక్త పరిస్థితిని కల్పించాయి. రాజపుత్రులు కత్తులు దూసారు. బీర్బల్ మరల వారందరికి నమస్కరించి "అయ్యా
ఇందులో కలుగజేసుకుంటున్నందుకు మన్నించండి. ఈ దూతలు తెగించి వచ్చారు. వారు నోటికి వచ్చినట్టు ఏవో మాట్లాడుతున్నారు. వారిని వదిలేయండి. దూతను దండించరాదు కదా! అలా అని వారి వాగుడును నిరోధించాల్సి ఉంది. వారు వెటకారపు కానుకగా తీసుకుని వచ్చిన కుంటి కోతి హిందువులకు పూజ్యనీయమైంది. అటువంటి దాన్ని హిందువు అయిన హేమరాజ్ పంపడం బుద్ధిహీనతకు పరాకాష్ట. దాన్ని తిప్పికొట్ట డానికి నాకు అనుజ్ఞ ఇవ్వండి. మీరు హేమరాజ్ ను అవమానించదలిస్తే మొగలాయిల ఏలుబడిలో జీవించే ప్రజలందరిని అవమానించినట్టే. అందుకు చొరవగా మీ సముఖమునకు రాగలిగాను. అన్యధా భావించవద్దని నా మనవి. ”
“సరే ఒక పౌరుడిగా నీవేం చేస్తావు. మేం చేయాలనుకున్నదే కదా! ఆ కోతిని నీవుగా చంపి ఈ దూతలకు ప్రాణభిక్ష పెట్టి తిరిగి పంపిస్తావా? ఇదా నీ నిర్వాకం.” అడిగాడు ఒక రాజపుత్ర రాజు.
“మన్నించండి నేను అలాంటి పనికి సిద్ధపడి రాలేదు. నాకున్న ఆస్థులను ఈ కోతి కోసం ధారపోయాలనుకుని వచ్చాను. ఈ కోతిని ఆ హేమరాజ్ వీధుల్లో తిప్పి ఆడించుకునే ఒక సాయిబు వద్ద బలవం తంగా అతితక్కువ ధరకు కొనుగోలు చేసి కదా కానుకగా పంపాడు. మహా అయితే రెండుశేర్ల ఉప్పు ధర పలికి ఉంటుంది." అని చెప్తుండగా మధ్యలో శత్రు దూతలు గొంతులు విప్పారు.
“భలేగా చెప్పావు. నీవు తెలివైనవాడివే. కుంటికోతి ధర ఒక శేరు ఉప్పుకు సరిపోతుంది."అని పగలబడి నవ్వారు.
"ఓ దూతల్లారా విలువలేని ఆ కోతిని హేమరాజ్ ఎవరికి కానుకగా ఇచ్చాడు అక్బర్ పాదుషా వారికి, అంటే ఇప్పుడు ఆ కోతి పాదుషా వారిది అయినందున విలువ పెంచుకుంది. అది విపణిలో పెట్టి అమ్మితే వెలకట్టలేని ధరకు విక్రయింపబడ్తుంది. కొనే సాహసం ఎవరికుంటుంది. ఈ కోతి ఇప్పుడు సామాన్య మైనదికాదు. అందుకే నేను నా ఆస్థులను ఖర్చు చేసి కొనుగోలు చేయడానికి సిద్ధపడ్తున్నాను." ఖంగుమనే గొంతుతో నిశ్శబ్దంగా మారిపోయిన యుద్ధ శిబిరాల మధ్య చెప్పాడు. అంతానోళ్ళు జాపి చూడసాగారు.
“ఇదేదో బావుంది. నీవన్నట్టు కుంటి కోతి పాదుషా వారిది అయినందున మంచి ధర పలుకుతుంది. సరే, కోతికి వెలలేని ధర కట్టావు. మరి వాగుడుకాయల్లాంటి ఈ శత్రుదూతల మాటేమిటి? వారిని ఏంచే స్తావు " అని మరో రాజపుత్రుడు వ్యాఖ్యానించాడు.
"ఏముంది ఆ ఇద్దరు దూతల్లో ఒకడే నోటికి వచ్చినట్టు ప్రేలుచున్నాడు. వాడికి ఏదో తెలియని శారీరక రుగ్మత వెంటాడుతుందే మో చావు కోసం ఎదురు చూసినవాడిలా పదే పదే శత్రు శిబిరంలో ప్రాణం మీదకు తెచ్చుకునే ప్రయత్నంలో వ్యాఖ్యానాలు
చేస్తూ దూత విధులకు చాలా దూరంగా ఉన్నాడు. కనుక వాడిని తిరిగి పంపండి. ఆ రెండోవాడిని ఇక్కడ బందీగా ఉంచండి. నేను ఈ కోతిని కొనేందుకు నాకున్న ఆస్థి ఈ వజ్రాల నగను వెచ్చించగలను. వాస్తవానికి ఈ నగ అమ్ముకుని నేను పదేళ్లు హాయిగా జీవించగలను కానీ నా దేశం కోసం హారాన్ని వదులుకుంటున్నా ను. నా వంటి సామాన్యుని నుంచి అక్బరు పాదుషా వారు నగను ఆశించరు కనుక ఆ నగను కోతిని పంపే హేమరాజుకే వాగుడు కాయ దూత ద్వారా పంపండి." మిక్కిలి వినయంగా చెప్పి మెడలోంచి విలువైన హారాన్ని తీసి పాదుషా ముందు పెట్టాడు బీర్బల్.
అక్బర్ నవ్వాడు "ఎవరయ్యా నీవు? పిలవని పేరంటానికి వచ్చినట్టు వచ్చి మంచి మార్గం చూపావు. నీ మాటలు చాలా పసందుగా ఉన్నాయి. ఎంత
చక్కగా ముడి విప్పావు." అని చప్పట్లు చరిచి ఆనందాన్ని వ్యక్తం చేసాడు. అంతలోనే ఒక రాజపుత్ర రాజు నగను చూసి “ఇంత విలువైన హారం నీకెక్కడిది? నీవు ఎక్కడ్నించి తీసుకువచ్చావు.” అని అడిగాడు.
"ఇప్పుడు మన అక్బర్ పాదుషావారు ఏమన్నారు. నీ మాటలు భలేపసందుగా ఉన్నాయి అని మెచ్చుకున్నారు అలాగే నాకు ఒక రాజు కాని రాజు బహుమతిగా ఇచ్చాడు. దాంతో మీ నుంచి ఆ అమాయ క జీవిని రక్షించగలిగాను. ఆ హేమరాజ్ కు బుద్ధి వచ్చేట్టు చేయగలిగాను. ఈ పేలుడు కాయ దూత గుట్టును విప్పాను." అక్కడి వారి ముఖాలలో ఆనందం వెల్లివిరుస్తుంటే చెప్పాడు.
అక్బర్ పగలబడి నవ్వాడు. అక్కడి వారందరూ న వ్వారు. సైనికులు దూతల్ని సాగదీసి నిలిపారు.
“ఈతడు చెప్పినది నిజమేనా? మీ ఇద్దరి లో ఒకడు మాత్రమే మాకు మానసికంగా బాధించేట్టు నోటికి ఏమోస్తే అదే వాగుతున్నాడు. కారణం ఏమిటి ? మీలో ఎవరికి రుగ్మత ఉంది " అక్బర్ అడిగాడు.
"అతడు (బీర్బల్) చెప్పింది నిజమే నేను తీవ్రమైన కడుపునొప్పితోబాధపడ్తున్నాను. నాకు భరించే శ క్తిలేదు. చావు రాకుంటే నాకుగా నేను ఆత్మహత్య చేసుకోవల్సిందే. ఎలాగూ ఏదో రోజు బలిమిని చావాలి. అందుకే నేను మీ అందరి మనస్సులు బాధించే విధంగా ప్రేలుచున్నాను. నాతో వచ్చిన ఈతడు నా తమ్ముడు. వాడు బతకాలని ఆశపడ్తున్నందున దూతలా వ్యవహరించసాగాడు. మీరు నన్ను చంపి తే హేమరాజ్ నా కుటుంబానికి చాలా ధనం ఇస్తాడని ఆశపడి ఈ విధంగా తెగించాను.” ఏదీ దాచకుండా ఒప్పుకున్నాడు.
“ఈ రోగిష్టివాడిని హేమరాజ్ వద్దకు పంపండి. ఒక శేరు ఉప్పు ధర చేయని కుంటికోతిని అక్బర్ పాదుషాకు హేళనగా బహుకరిస్తే ఆ కోతిని పాదుషా స్వీకరించి నందున దాని ధర ఈ హారం అని చెప్పి
ఇప్పించండి. ఖరీదైన హారం పాదుషావారు ఉంచుకోకుండా మీకు పంపడానికి కారణం యజ్ఞాలు, క్రతువులు చేసే నీవంటి బ్రాహ్మణుని సొత్తు ఎవరూ దానంగా లేదా బహుమతిగా పుచ్చుకోరాదు. కనుక మంచి ధరకు అమ్మి పంపాను అని లేఖ రాయించి పంపండి " అని బీర్బల్ దగ్గరుండి లేఖ రాయించాడు.
హారాన్ని తీసుకుని దూత వెళ్లగానే బీర్బల్ అక్కడి వారందరికి చెప్పాడు. “ఈ ఇద్దరినీ కలిపి పంపితే హారం వీరిద్దరూ కాజేయ వచ్చు. తమ్ముడ్ని ఉంచి రోగిష్ఠి అన్నను పంపాం. వాడు ఏదో జవాబు తీసుకుని వస్తే కదా ఇక్కడ ఉన్న తమ్ముడు దూతను మనం వదిలేది. అసలు విషయం ఇప్పుడు వెళ్లిన రోగిష్ఠి దూత మోసుకెళ్లిన వార్తను విని క్షణికోద్రేకి హేమరాజ్ ఆ దూతను వదలడు నరికి చంపేస్తాడు. పాపం చావాలనుకున్న దూత కోరిక ఈ విధంగా తీరిపోతుంది. ఇక ఇక్కడ బందీగా ఉన్న దూతను రెండవ పానిపట్టు యుద్ధం అనంతరం విడిచిపెట్టేయండి. ఈతడు దూతగా నిరపరాధి.”
బీర్బల్ రాటకు కట్టిన కోతిని విప్పి దానికి కొంచెం నీళ్లు పట్టి రెండుపండ్లును తినిపించి తోట వైపు దారి చూపించి వదిలేసాడు. అది ఆ ప్రజల మధ్య నుంచి బతుకుజీవుడా అనుకుని కుంటినడకతో గెంతుకుంటూ పారిపోయింది.
🎭
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*
*అక్బర్ - బీర్బల్ కధలు -7*
🎭
రచన : యర్నాగుల సుధాకరరావు
"ప్రభూ, నాకు శెలవిప్పించండి. నేను నా దారిని నేను వెళ్లిపోతాను." అని చేతులు జోడించాడు బీర్బల్.
"ఓయీ నీ చతుర సంభాషణ, నాకు చాలా ఆనందం కలిగించింది. నీవు నా వద్ద ఉండిపోరాదు” అని అక్బర్ అడిగాడు.
“మన్నించండి నేను ఒకరి వద్ద పనికి నిన్ననే కుదిరాను. అతడు నన్ను మరణం నుంచి కాపాడాడు. అతడు వలదు పొమ్మన్నంతవరకు అతడి వద్దనే
ఉండగలను”
“నీకు పని ఇచ్చేవాడు పాదుషా కంటే గొప్పవాడా?” ఒక రాజపుత్రరాజు ప్రశ్నించాడు.
“పాదుషా కంటే గొప్పవాడు కాడు. కానీ నాకు దైవం. నా ప్రాణాల్ని కాపాడినవాడు. అతడు నా ఒక్కడికే పాదుషా" అని చెప్పి వెనుదిరిగి వెళ్లిపోయాడు బీర్బల్.
ఆ మాటలకు భైరంఖాన్ పులకించిపోయాడు.
సాయింత్రం శత్రు శిబిరంలో రోగిష్టి దూతను హేమరాజు తన కత్తికి ఎరవేసినట్టు వేగుల ద్వారా తెలిసి అక్బర్ అంతులేని ఆశ్చర్యంకు లోనయ్యాడు.
"ఖాన్ బాబా అపరిచితుడు (బీర్బల్) ఎలా చెప్పగలిగాడు." అక్కడే ఉన్న బైరంఖాన్ను అడిగాడు.
“అదే నాకు అంతుబట్టకుంది. అతడు మాట్లాడే విధానమే గొప్పగా ఉంది. భలేగా జోస్యం చెప్పాడు.”
“ఖాన్ బాబా అతడ్ని వెతికించి నా ముందు నిలబెట్టలేవా? అటువంటివాడు మనకు ఎంతో అవసరం. ఏమంటావు ?"
“నిజమే మంచి రాజకీయపుటెత్తులున్న వాడు. వెతికిస్తాను. మనం ఇక్కడ యుద్ధం ముగించి వెనుదిరిగేలోపు ఆ పనిని చేయగలుగుతాను. తప్పక మీ కోరిక తీర్చగలుగుతాను.
“ఖాన్ బాబా..అతడు మెరుపులా వచ్చి మెరుపులా అదృశ్యం అయ్యాడు, ఎంత మరిచిపోదామన్నా మరుపునకు రావడంలేదు.”
భైరంఖాన్ నవ్వాడు. మేధావులు అలానే ఉంటారు. అని చెప్పి యుద్ధం గురించిన విశేషాలు ముచ్చటించాడు.
మొత్తం సైన్యం మూడు భాగాలుగా విభజించాడు. 20,000 సైన్యం, అదనపు దళాలను అక్బర్ వద్ద ఉంచాడు. 1500 ఏనుగులను, ఒక లక్ష కాల్బలమును (నడిచే సైన్యం) తనతో పెట్టుకున్నాడు.
కార్నాల్ వద్ద 30,000 మంది రాజపుత్రుల ను సిద్ధం చేసి ఏ క్షణమైనా హేమరాజుతో యుద్ధానికి సిద్ధపడ్డాడు. అదనపు బలగాలు కావాలంటే సమకూర్చుకోవచ్చు అందుకు కొంతమంది పొరుగు రాజులు
చేయి అందిస్తారు అని చెప్పాడు. అక్బర్ ఉత్సాహంగా విన్నాడు..
ఆ రాత్రి పలుదఫాలు అక్బర్ బీర్బల్ గురించి అడిగాడు. దాంతో భైరంఖాన్ తన శిబిరంలోకి వెళ్లాక బీర్బల్ ని కలుసుకుని "నీవు స్వతంత్ర పక్షిలా ఉన్నావు. ఉన్నట్టుండి ఉదయం ఆ కోతి వద్ద ప్రత్యక్షమయ్యావు. నీ మాటలు నిత్యం వినాలి అని కుతూహలపడ్తున్నాడు ఆ చిన్ని పాదుషా. ఏంచేయను చూస్తూ నిన్ను నేను అప్పగించలేను. యుద్ధాలతో అలసి పోయిన నాకు నీ మాటలతో సేదతీరాలని ఆశ పడ్తున్నాను. అందుకే ఈ రాత్రి నిన్ను ఇక్కడ్నించి తరలించాలనుకుంటున్నాను.” అని చెప్పి అర్ధరాత్రి పదిమంది సైనికులను తోడిచ్చి పానిపట్టు నుంచి గురుదాస్ పూరు వెళ్లిపోమన్నాడు.
"సర్కార్ నన్నెందుకు మీరు పంపాలను కుంటున్నారో చెప్పాలా? ఇక్కడ యుద్ధంలో జయాపజయాల పై మీకు సరైన నమ్మకం లేదు. ఒకవేళ యుద్ధంలో మీరుఅపజయం పాలయితే నన్ను శత్రువులు చంపిపారే యోచ్చు ఈ భయం మీకు ఉంది. నా చావు వెనుక వేరే కారణం ఉంది” అని బీర్బల్ నవ్వుతూ చెప్పాడు.
“నిన్ను పదే పదే అక్బర్ కోరుతున్నాడు అని చెప్పానుగా మరి ఇంకా ఇతరత్రా ఏముంటుంది. నీవు వేరే ఆలోచిస్తున్నావు. అయినా నీతో ఇలా ముచ్చట్లు చెప్పు కుంటూ పోతే నిద్రచాలదు. ఎంత త్వరగా పడుకుంటే అంతమేలు.” అసహనం ప్రదర్శించాడు భైరంఖాన్.
“సర్కార్, బ్రాహ్మణ హత్య జరగకుండా జాగ్రత్త పడ్తున్నావు”.
ఆ మాటలకు బైరంఖాన్ అదిరిపడ్డాడు. నుదుటి మీద స్వేదాన్ని తుడుచుకుంటూ పెదవి విరిచి బీర్బలును తీక్షణంగా చూసాడు. “నువ్వు తెలివైనవాడవు. ఆవులిస్తే ప్రేవులు లెఖపెడతావు.”
“అర్ధంచేసుకోండి మీ మనస్సులో మాట చెప్పాను." బీర్బల్ నవ్వాడు.
📖
*పందిరి మంచం కోసం*
బీర్బల్ అతనితోబాటు మరి పదిమంది సైనికులు గుర్రాలపై సాగిపోతున్నారు. పండు వెన్నెలలో సన్ననిబాటలో పడి ఆ గుర్రాలు వెళ్తున్నాయి. అర్ధరాత్రి అని కూడా వారికి లేదు. గుర్రాలు కనీసం పానిపట్టుకు నూరు యోజనాలు దాటుకుని పోవల్సిందే నని పట్టుదలగా ఆ రాత్రి అడవి మార్గాన ఎలాంటి భయం లేకుండా వెళ్లిపోసాగారు. ఇది భైరంఖాన్ ఆజ్ఞ. అందుకే అలా సాగిపోతున్నారు.
"ఏమయ్యా ఎక్కడో కూర్చుని ఆదేశాలు జారి చేస్తే సరిపోదు. ఈ రాత్రి మన ప్రయాణం అంత మంచిది కాదు. ఆ కన్పిస్తున్న పల్లెలో మనం ఈ రాత్రి గడిపి వేకువనే గ్రామంలో ఎవరు లేవకుండానే లేచి మన గమ్యం వైపు వెళ్లిపోవచ్చు." గుర్రాన్ని ఆపి తన వెనుక వస్తున్న గుర్రాలపై ఉన్నవారికి తన ఆలోచన చెప్పాడు షిక్ దార్ (ఓ చిన్న సైనిక దళానికి పెద్ద శాంతి భద్రతలను కాపాడాల్సినవాడు)
“నీవు చెప్పకుండా మేము చెప్పడం కూడదని ప్రయాణం చేస్తున్నాం. ఎలాగూ నీవే బయటపడ్డావు. ఆ పల్లె మనకు చిరపరిచయం ఉన్నదే. నేను ఇక్కడ అమీన్ గా పనిచేసాను. వారి భూమిని కొలిచి శిస్తు నిర్ణయించడం నా పని. నాకు తెలియని రైతు లేడు. మనకు అక్కడ బ్రహ్మరధం పడతారు." చెప్పాడు అమీన్.
శృతి కలిపాడు ఫోతేదార్ (ధాన్యగారాల ను, పరగణాల్లో ధనగారాలనురక్షించడం ఇతని విధి) నలుగురుకానుంగోఉద్యోగులు (అత్యాచారాలను జరగకుండా కాపాడాల్సి న బాధ్యతగలవారు) మరి ముగ్గురు కార్ కూన్లు (తగదాలు తీర్చేవారు) అంతా కల్సి షిక్ దార్ మాటను గౌరవించారు. గుర్రాలు ఆపి వాటిని నడిపించుకుంటూ గ్రామం వైపు బైలుదేరారు. అర్ధరాత్రి కావడం వలన గ్రామం అంతా నిర్మానుష్యంగా ఉంది. ఒకటి రెండు గుర్రాలు పెద్దగాసకిలించాయి. దాంతో కుక్కలు వచ్చి అరవసాగాయి. గుడిశెల లోంచి సాయుధులై బయటికి వచ్చారు గ్రామీణులు.
కొంతసేపటికి చాలామంది ఎదురు వచ్చారు. దగ్గరగా వచ్చాక "ఈ మధ్య కొత్త చక్రవర్తి హేమరాజ్ సిబ్బంది రోజులో ఏదో ఒక సమయంలో వచ్చి రకరకాలుగా ఆరా తీస్తున్నారు. అక్బర్ పాదుషావారి
సానుభూతిపరులు ఎవరైనా ఉంటే వారిని నిర్ధాక్షిణ్యంగా హింసిస్తున్నారు. నిత్యం వారి తాకిడి ఎక్కువగా ఉంది. పల్లె రక్షణ బాధ్యత ఇక్కడ యువకులకి అప్పగించా రు. మీరు ఇక్కడ ఉండడం చాలా
ప్రమాదం కనుక వెళ్లిపోండి.” అని వారు పాతపరిచయాలను దృష్టిలో పెట్టుకుని భయంగా చెప్పారు.
వారికి ధైర్యం చెప్పి భయాలకు పోవద్దు తెల్లారేసరికి మేము ఈ గ్రామం వదిలి పోతాం, మీరు ధైర్యంగా ఉండండి. అని వారిని ఒప్పించి అక్కడ ఉన్న రాజ విడిదికి వెళ్లారు. అదో ఎత్తయిన భవనం, జమాబం దీల కోసం నిర్మితమైనది. అక్కడే ధాన్య సేకరణకు, ఇతరత్రా శిస్తువసూలుకు ఒక్కోసారి రాజు తప్పితే చిన్న ఉద్యోగులో వస్తుంటారు. ప్రత్యేకంగా కొన్ని ఫిర్కాల్లో ఇలాంటి భవనాలు సూర్ వంశస్థుడు షేర్షా చక్రవర్తి నిర్మించాడు. వాటిని రాజోద్యోగు లకు విడిదిగా కూడా వాడేవారు. అతడు నిర్మించిన నిర్మాణాలు, కొత్తగా ఏర్పాటు చేసిన ఉద్యోగాలు మొగలాయిలు కూడా తమ పాలనలో స్వల్పమార్పులతో వాటినే కొనసాగించారు. ఇప్పటికి కొన్నిఉద్యోగాలు అలానే కొనసాగుతున్నాయి.
విడిది భవనం ముందు గుర్రాలు నిలిపారు. భవనం కాపలాదారు "అయ్యా మీకు ఈ విడిది ఏర్పాటు చేయడం నా మెడ మీద కత్తిని నేను పెట్టుకున్నట్టే. కొత్త చక్రవర్తి హేమరాజ్ కు తెలిస్తే నన్ను బతకనీయడు. ఈ రాత్రి ఎలాగో గడిపి తూర్పు తెల్లవారక ముందే విడిది వదిలిపోవాలి..” పూర్వ పరిచయాలు మీతో నాకు ఉన్నందున కాదనలేకపోతున్నాను. ఏది ఏమయినా చాలా ప్రమాదంలో ఇరుక్కున్నాను. ఈ రాత్రి నాకు నిద్రపట్టి చావదు.”
పదిమంది ఒకరి ముఖాలు ఒకరు చూసు కున్నారు. “సరే నీకు మాట రానీయం. తొలికోడి కూయగానే సాగిపోతాం. మాకు నిద్రపోవడానికి తగిన ఏర్పాట్లు త్వరగా చెయ్యి. ప్రయాణంలో చాలా అలసిపోతి మి" షిక్ దార్ ఒళ్లువిరుచుకుని చెప్పాడు.
నిద్రపోవడానికి ఏర్పాట్లు చేయబడ్డాయి. బీర్బల్ వారినందరిని వదిలి వరండాలో కంబలి కప్పుకుని నిద్రపోయాడు. కొత్త చోటు పైగా, అలసట వలన నిద్రపట్టేసినా ఆ వెంటనే తెలివి వచ్చేయసాగింది. చాలా సేపు తరువాత బీర్బల్ కంబలి ముసుగు తొలగించి చూస్తే తనతో వచ్చినవారు ఎవరు నిద్రలో లేరు. వారి మధ్య ఓ ప్రధాన సమస్య కొట్టుమిట్టాడుతోంది. వారిలో నేను గొప్పంటే నేను గొప్ప అనేది చోటు
చేసుకుంది. బీర్బల్ వారిని చూసి నవ్వుకు న్నాడు. కొంతసేపు నిద్రపోయినందున తేలిక అయ్యాడు. లేచి కూర్చుని “అయ్యో మీరెవరు నిద్రపోలేదేం?” అని అడిగాడు.
అంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఏం చెప్పాలా అని వారిలో ఒకరకమైన సిగ్గు కన్పించింది. ఎవరూ బయటపడడం లేదు. అలా అని నిద్రపోవడం లేదు. వారి మధ్య ఒక పందిరి మంచం ఖాళీగా ఉంది. దాని చుట్టూ పీనుగు తినబోతున్న రాబందుల్లా ఒకరి వంక ఒకరు క్రూరంగా చూసుకుని మరీ మౌనంగా నిద్రపోకుండా కళ్లు సాగదీసుకుని కూర్చున్నారు. వారిని చూసిన బీర్బల్ మాట్లాడకుండా ఉండలేకపోయాడు.
🎭
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల
*అక్బర్ - బీర్బల్ కధలు 8*
🎭
రచన : యర్నాగుల సుధాకరరావు
"అయ్యా, అందరూ బాగా అలిసి ఉన్నాం. పైగా ప్రయాణపు బడలిక మనల్ని నిద్ర పట్టనీయకపోవచ్చు. కానీ, మీరు ఆ సమస్యలో లేరు. నేను నీకంటే ఎక్కువ అనే గొప్ప మీలో చోటు చేసుకుంది. ఒకరిని ఒకరు హీనంగా చూసుకుంటున్నారు. నా మాట విని నిద్రకు ఉపక్రమించండి. రేపు మనం చాలా దూరం వెళ్లాల్సి ఉంది. లేదా ఏ క్షణమైనా మీకు అక్బర్ పాదుషా వారి నుంచి పిలుపు రావచ్చు. యుద్ధం చేయ మని కోరవచ్చు. అప్పుడు ఈ నిద్రలేమి మీ పాలిటి నరకం సృష్టిస్తుంది. చెప్పడం నా విధి చెప్పాను. ఆ పైన మీ ఇష్టం" చెప్పి ముసుగు తన్ని నిద్రపోయాడు బీర్బల్.
“మన అతిధి బీర్బల్ చెప్పినట్లు మనలో బయటపెట్టుకోలేని ఆధిక్యత చోటు చేసుకుంది. నేను మీ అందరికంటే పెద్ద ఉద్యోగిగా ఢిల్లీలో చేసాను. మీకు తెలుసు షిక్ దార్ అంటే ఆషామాషీ కాదు. పరగణా కు పెద్దను, చిన్న సైన్యం నా చేతిలో ఉంటుంది. శాంతిభద్రతల్ని కాపాడేవాడిని. నేనే ఆ పందిరి మంచం పై నిద్రపోవడానికి అర్హుడను కానీ మీరు దాన్ని మీ వశం చేసుకోవాలనుకుంటున్నారు. అందుకే నేను చాలా బాధపడ్తూ నిద్రపోకుండా మీ మధ్య ఏమీ పాలుపోక ఉన్నాను.” అని తన పదవి గురించి మరల గొప్పగా చెప్పాడు.
"అలా నీవు చెపితే కుదరదు. నేను అమీన్ ను. నేను ఈ పల్లెలకు భూమి కొలతల పని మీద నిత్యం రావడం వలన ఇక్కడ నన్ను చూడగానే విడిది కాపలాదారు ఈ పడక ఏర్పాట్లు చేసాడు. నాకే ఆ పందిరి మంచం పై నిద్రపోయే హక్కుంది.”
"మరి నేను అల్లాటప్పయ్యనా ఫోతేదార్ అంటే కోశాధికారిని నేను ఈ పల్లెల్లో ధనధాన్యాలను శిస్తు రూపంలో వసూల్ కోసం వస్తుంటాను. నన్ను చూడగానే నాకు విడిది ఏర్పాటు చేసాడు.”
“బావుంది కానుంగోలు మీ దృష్టిలో ఏమీ కానట్టుంది. పాలనా యంత్రాంగంపై పట్టు న్నవాళ్లం. మేము లేని చోటు అంటూ ఉండదు. అత్యాచారాలు జరగకుండా కాపాడేవాళ్లం. పాలనాదక్షతకి నిదర్శకులం ఇక్కడ ఒక్కరు ఇద్దరు లేము నలుగురున్నాం.”
“ఉద్యోగాలు చిన్నవైనా కార్ కానులం మేము నలుగురం ఇక్కడ ఉన్నాం. రెండు భాషల్లో పారశీకం, హిందీలో జమాబందీలు రాస్తాం. తగవులు తీరుస్తాం. దొంగల్ని దోపిడీదారులను పట్టుకుంటాం. మేము వేలుపెట్టని చోటులేదు. సరే విషయానికి వద్దాం. ఇప్పుడు మన చక్రవర్తి అక్బరుకు ఢిల్లీయే లేనప్పుడు, మనం ఇలా ఊళ్లు పట్టుకుని తిరుగుతున్నాం. ఎవరికీ సరైన ఉద్యోగాలే లేవు. ఇంకా నీవు గొప్ప నేను
గొప్ప అని ఒకరిని ఒకరు గుర్రుగా చూసుకోవడం అనవసరం. మనకెవరికి వద్దు. మన అతిధికి ఈ పందిరి మంచం ఇచ్చి మనం నేల మీద నిద్రపోదాం.” ఏక కంఠంతో చెప్పారు.
షిక్ దార్ తలపంకించి "చిన్న ఉద్యోగాలు చేస్తున్నా మీరు చెప్పింది నిజమే. మన అతిధికి పందిరి మంచంపై నిద్రపోయేందు కు అందరూ ఒప్పుకుందాం. ఏమంటారు?" అడిగాడు. అంతా తలలూపారు. వెంటనే నిద్రపోతున్న బీర్బల్ ను లేపారు.
వారి మాటల్ని విన్న బీర్బల్ నవ్వుతూ “చివరికి ఇలా తేల్చారన్న మాట. బాగుంది మీ అతిథి గౌర వం” అని వారినిమెచ్చుకుని మంచంపై మేను వాల్చాడు. దాని మెత్తద నానికి భలే ఒళ్లు తెలియని నిద్ర ముంచుకు వచ్చింది. మిగిలినవారు ఆ మంచంచుట్టూ నిద్రపోయారు. అంతా నిద్రాదేవి ఒడిలో
ఒళ్లు తెలియనట్లున్నారు.
తొలి కోడి కూసేటపుడు ఎవరికి తెలివి రాలేదు. కాపలాదారు నిద్రలేపడానికి రానే లేదు. చివరికి భళ్లున తెల్లారేసరికి కొత్తగా ఢిల్లీలో ఉద్యోగాలు వెలగబెడుతున్న నగర రక్షకులు ఏదో పని పడి ఇరవైమంది వరకు రానేవచ్చారు. అంతా కలిసి విడిదికి వచ్చి చూసారు. వారి కంటికి ఈ నిద్రపోతున్న వారు కన్పించారు. కాపలాదారునుతీవ్రంగా దుయ్యబట్టారు. నీవు శత్రువులకుఆశ్రయం ఇస్తావా? వారు వచ్చింది ఏ గూఢచర్యం చేయడానికో తెలుసుకోవాలి. ఒక వైపు యుద్ధం మరోవైపు ఇలాంటి గూఢచారుల తాకిడి" అని కోపంతో పెట్రేగిపోయారు.
పందిరి మంచం పై నిద్రపోతున్న బీర్బల్ ను కత్తి మొనతో పొడిచి లేపారు.
"ఎవరు నీవు? ఇక్కడ నీకేంపని? నీవు మొగలాయులకు గూఢచారివా? ఇక్కడ ఏం శోధించి చేరవేయడానికి వచ్చావు.” అడిగాడు ఒకడు.
"అయ్యా తమరెవరు? నేను గూఢచారిని కాను. కేవలం పొట్టపోసుకోవడానికి అనేక కొలువులకు వె ళ్తుంటాను. ప్రస్థుతం నేను వీరికి అతిధిని.. వీరు లోగడ పాదుషాల వద్ద పెద్ద పెద్ద పదవులు వెలగబెట్టారు. ఈ మంచం మీద పడుకోడానికి తెల్లార్లు తగవులాడుకున్నారు. చివరికి కుదరక నాకు కట్టబెట్టారు.”
ఆశ్చర్యంగా విన్నారు.
“నీవు ఆ మంచంపై నిదురించమంటే తగుదునమ్మా అని పడుకోవచ్చా ? ఈ విడిది ఉండేది విక్రమాదిత్య బిరుదాంకితు డు అయిన హేమరాజ్ వారి సేవకుల కోసం. కానీ మీలాంటి వారి కోసం కాదు. ఇందుకుగాను నీకు వంద కొరడా దెబ్బలు విధిస్తున్నాను.” చెప్పాడు ఇరవైమందిలో ఒకడు.
"అయ్యా నాకు ఎవరెవరు మిత్రులో, శత్రువులో తెలియదు. నేను వీరికిఅతిధిని. వారు నాకు ముళ్లపానుపు ఇచ్చినా భరించాలి. దైవసంకల్పం వలన పూల పానుపు లభించింది. నాకు విధించిన కొరడా దెబ్బలు శిక్ష వారిని అడిగి అమలు చేయండి.” అర్ధించాడు బీర్బల్.
అంతలోనే పడుకున్నవారు లేచారు. వారు కన్నులు నులుముకుంటూ వారి ఎదుట నిలబడిన హేమరాజ్ మనుష్యులను చూసి భయభ్రాంతులైయ్యారు. తామెవరో తెలిస్తే వదలరు ఏంచేద్దామా అని ఎవరికి వారే ముఖాలు చాటేసుకునే పరిస్థితిలో ఉన్నారు.
"ఏయ్ ఎవరు మీరు? రాత్రంతా మీరు ఈ మంచం కోసం తగవులాడుకున్నారట. మీలో పాదుషా కొలువులో ఉన్నవారు ఎవరు?”
నేల మీద కూర్చుని ఉన్నారే తప్ప బదులు పలుకలేదు.
“వాళ్లేం చెబుతారు. నేను చెబుతాను. అదిగో తల గోక్కున్నట్టు తన అద్భుతమైన నటనతో ముఖం దాచేస్తున్నవాడు నిన్నటి వరకు ఢిల్లీలో షిక్ దార్ ఉద్యోగం వెలగబెట్టాడు” చెప్పాడు బీర్బల్.
ఆ మాట విన్నవారు అదిరిపడ్డారు. వారి చేతులు మొలల్లో వేలాడుతున్న కత్తులపై బిగుసుకున్నాయి. నేల మీద పిచ్చి చూపులు చూస్తూ కూర్చున్న షిక్ దార్ ను లేవనెత్తి..
"రహస్యంగా ఈ పల్లెలో ఏం తెలుసుకున్నా వు. చెప్పు లేకుంటే నిన్ను ప్రాణాలతో వదలం" అని గట్టిగా గుంజారు.
“ఆగండి పూర్తిగా చెప్పనీయండి. అప్పుడే అయిపోలేదు కదా! మీ అధీనంలోనే ఉన్నారంతా, ఎక్కడికి పోలేరు. మరి మీరెందుకు ఆ ఒక్కడి పైనే తొందర పాటు ప్రదర్శిస్తున్నారు.” బీర్బల్ ఇంకా మంచం దిగకుండానే విలాసంగా కూర్చుని మరీ వారిని నిలదీసాడు.
"ఈ మిగిలిన వారి గురించి కూడా మొత్తం చెప్తామంటున్నాడు. సాంతం విందాం. ఆ తరువాత ఏం చేయాలో నిర్ణయిద్దాం.” ఇరవై మందిలో ఒకడు చెప్పాడు. అంతా తలలూపి షిక్ దార్ శరీరంపై బిగుసుకున్న చేతుల్ని సడలించారు.
“ఏయ్ నీకు పిచ్చిపట్టిందా మా గురించి చెప్తే నిన్ను వీళ్లు వదిలేస్తారని ఆశపడ్తున్నా వా? వీళ్లు నిన్ను మాకంటే ముందే చంపి పాతరేస్తారు.” షిక్ దార్ కోపంగా బీర్బల్ ని హెచ్చరించాడు.
“నన్ను వదిలేయక తప్పదు. అదీ చూద్దువుగాని”
ఆ మాటలకు అక్కడున్న ఇరవైమంది అయోమయంగా చూసారు. “ఏయ్ నిన్ను ఎందుకు వదిలేస్తామని అనుకుంటున్నా వు. నీవు వీరి గురించి చెప్పకపోయినా వీరితో చెప్పించగలం. ఇక నిన్ను వదిలే యడం జరగదు. అలాంటి పిచ్చి కలలు కనవద్దు" ఒకడు తీవ్రస్వరంతో హెచ్చరించాడు.
బీర్బల్ పకపకమని నవ్వి “నన్ను వదలక తప్పదు. అయినా నాకు మీరు విధించిన శిక్ష వంద కొరడా దెబ్బలు కూడా అమలు చేయలేరు. ఇక విషయానికి వద్దాం. ఆ పక్కన తన గుట్టు బయటపడ్తుంది అని భయపడ్తున్నాడే అతడు ఫోతేదార్, ఆ పక్కన నక్కి దాక్కున్నవాడు అమీన్, ఆ ముగ్గురు కానుంగోలు, మిగిలిన నలుగురు కార్ కూన్ లు. వీరు నిన్నటి వరకు ఢిల్లీలో మంచి ఉద్యోగాలు చేసి దివ్యంగా
వెలిగారు.”
ఇరవైమంది మూతులు కొరుక్కుని "ఇక్కడ చాలా పెద్ద కుట్రకు శ్రీకారం చుట్టబడింది. వీరు చాలా విషయాలు సేకరించారు. వీరిని రచ్చబండ వద్దకు ఈడ్చుకుపొండి. అక్కడే వీరిని నరికిపోగులుపెట్టి వెళ్లిపోదాం"
"అలా చేస్తేగానీ ఈ పల్లెలో అనామకులను పాత శత్రువులను ఈ గ్రామీణులు రానివ్వరు, నిలువ నీడ ఇవ్వరు. ఇక్కడ కాపలాదారును కూడా తల నరికి గాని పోవద్దు." వారిలో ఒకడు తన దృఢ నిర్ణయం తెలియజేసాడు.
అందర్ని రచ్చబండ వద్దకి తీసుకెళ్ళారు. పల్లెవాసులందరూ ఊపిరి బిగబట్టి చూడసాగారు. వారిలో భయం చోటు చేసుకుంది. ఎందుకు అనవసరంగా పాత కాపులకు నిద్రపోవడానికి చోటిచ్చాం, తీరా వారు తొలి కోడి కూయగానే వెళ్ళిపోకుండా ఎండ నడినెత్తి మీదకు వచ్చే వరకు శత్రువు గూటిలో నిద్రపోయారు. దొరికిపోయి పీకల మీదకు తెచ్చుకున్నారు అని ఎవరికి వారే బాధపడ్డారు.
అందరిని రచ్చబండ వద్ద కట్టివేసారు. బీర్బల్ కదిపితేచాలు నిజాలు గుమ్మరి స్తూనే ఉన్నాడు. అందుకే అతడిని కట్టి వేయకుండా మధ్యలో నిలిపారు. తాళ్లతో బంధింపబడిన వారంతా బీర్బల్ వైపు
గుర్రుగా చూడసాగారు. వారిలో బీర్బల్ ని చంపేటంత కోపం చోటుచేసుకుంది.
“ఇప్పుడు చెప్పండి మీరు ఏమేమి మా రహస్యాలు సేకరించారు. మీరు నిజం చెప్పండి. లేకుంటే శిక్ష తీవ్రంగా అమలు పరుస్తాం. బతికుండగానే శరీరంలో ఒక్కో అవయవం నరికి పోగులుపెడతాం. ఊరకు క్కలకు విందుచేస్తాం.” అని ఒకడు హెచ్చరించాడు. అప్పుడే ఆకాశంలో రాబందులు చక్కర్లు కొట్టసాగాయి.
అంతా తలలు దించి నిలబడ్డారు.
“ఇలా మౌనంగా ఉంటే సహనంగా ఉండలేం. మీలో ఒకడ్ని చంపి పాతరేస్తాం. చెప్పండి ఈ చుట్టుప్రక్కల సేకరించిన విశేషాలు ఏమిటి? వాటిని ఏ మేరకు
అక్బర్ పాదుషాకు పంపారు. అలాగే ఈ చుట్టుప్రక్కల పల్లెల్లో చెరువులు నదీ పాయల్లో విషం కలిపే పనులు చేసారా? ఎవరినైనా ఈసరికే ఎత్తుకెళ్లి చంపి
చేతులు దులుపుకున్నారా.. ఏదీ దాచకుండా చెప్పండి.” పరిసరాలు మారు మ్రోగినట్టుగా అరిచాడు ఒకడు..
పదిమందిలో ఒక్కడూ బదులివ్వలేదు. గ్రామీణులు భయభ్రాంతులైపోయారు. తాము చూస్తుండగా పదకొండు హత్యలు జరుగుతాయని గుడ్లప్పగించి చూడసాగారు.
ఆ ఇరవై మంది గుసగుసలాడుకుని బీర్బల్ వైపు చూసారు.
🎭
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
*కథల ప్రపంచం*
https://chat.whatsapp.com/IWSgPdEjJqNHgK1WdzQkJe
*తెలుగు భాషా రక్షతి రక్షితః*
*1 YEAR* *SUBSCRIPTION 120/-*
*phone pe & Gpay to 9849656434*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
అక్బర్ - బీర్బల్ కధలు - 9*
🎭
రచన : యర్నాగుల సుధాకరరావు
*అక్బర్ - బీర్బల్ కధలు - 16*
ఆ ఇరవై మంది గుసగుసలాడుకుని బీర్బల్ వైపు చూసారు.
“ఇంత వరకు వసపిట్టలా చాలా విషయాలు చెప్పావు. ఇప్పుడు నీవు మౌనంగా ఉన్నావు. కారణం నీ బండారం బయలుపడుతుందని భయపడ్తున్నావా?” అడిగాడు ఒకడు.
బీర్బల్ పకపకమని నవ్వాడు.
“భలేగుంది మీ వరస. వాళ్లేం చేసారు. ఎలాంటి గూఢచర్యం చేసారనేది తేలలేదు. ఇక నాకో బండారం ఉండి ఏడ్చిందా? దాన్ని మీరు ఛేదిస్తారా? మీరు ఎంత అమాయకులు..!”
“విషయానికి వద్దాం. నేను నవ్వుతూ పది మందిని నవ్వించి ముచ్చటపడేవాడిని. కొన్ని చోట్ల నా నవ్వులు పువ్వులు అయ్యాయి. నాకు పొట్టగడిచేది. మరికొన్ని చోట్ల ఎదురు తిరిగేది. ఇలా నా జీవితం
ఎగుడుదిగుడులతో సరిపోయింది. నాకు ఒక్కోసారి జీవితం మీద విరక్తితో ఆత్మహత్య చేసుకోవాలనుకునేవాడిని”.
“ఈమధ్య పానిపట్టు గ్రామంలో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. అక్కడభైరంఖాన్ నన్ను రక్షించి అతనివద్ద నన్ను చతుర సంభాషణ చెప్పేందుకు నియమించుకున్నా డు. ఈలోగా యుద్ధ శిబిరంలో ఉన్న అక్బర్ నామాటలు విని తన వద్దకు వచ్చేయ
మన్నాడు. నేను రాలేను నా ప్రాణదాత, నాకు దేవుడు భైరంఖాన్ అని చెప్పి తప్పించుకున్నాను. ఎలాగూ నన్ను ఆ యుద్ధ శిబిరాల్లో దాచడం కుదరదని ఇదిగో ఢిల్లీ చేజారిన తరువాత ఉద్యోగాలు కోల్పోయిన ఈ పదిమంది యుద్ధం చేయడానికి బొత్తిగా పనికిరారు అని భైరంఖాన్ భావించి నాకు తోడుగా గురు దాస్ పూర్ కి అర్ధరాత్రి వేళ పంపాడు" అని చెప్తుండగా మధ్యలో ఒకడు అందుకున్నాడు.
"మాకు ఇదంతా ఎందుకు? మీరు ఏమేమి ఇక్కడ సేకరించారో తెలుపండి" అని బీర్బల్ ప్రసంగానికి అడ్డుతగిలాడు.
"దయచేసి శాంతంగా వినండి. మీరు వీరందరినీ చెట్లకు కట్టి ఎంత తప్పు చేసారో మీకు తెలుస్తుంది. ఇక వాస్తవంలోకి వద్దాం. ఈ పదిమంది ఎందుకు కొరగానివాళ్లు అని భైరంఖాన్ కు తెలుసు కనుక నాకు తోడిచ్చి పంపాడు. తీరా వీళ్లేం చేసారు అంటే
విడిది కాపలాదారు నా ముఖం చూసి ఇచ్చాడు అంటే కాదు నన్ను చూసిచ్చాడు. లేదు నాకు అతనికి చాలాకాలంగా మంచి స్నేహం ఉందని ఇలా రాత్రంతా వాదించు కున్నారు. ఇక ఇక్కడ ఉన్న ఒకే ఒక పందిరి మంచం పై పడుకోవడానికి అర్హతగలవాణ్ణి నేనే అంటే నేనే అని వాదులాడి చివరికి నాకు కట్టబెట్టారు. వీరిని అనుమానించడం మీరు చేసిన ప్రధమ తప్పు. చెప్పుకోడానికి ఒక రహస్యం అయినా వీరు సేకరిస్తే కదా మీ ముందు నోరు విప్పడానికి. వీరెంతటి వీరులు కాకపోతే యుద్ధభూమి నుంచి వీరిని వెనక్కు పంపించారు అంటే ఈపాటి కి మీకు అర్ధం అయి ఉంటుంది. ఇలాంటి వీరినా మీరు శిక్షించదలిచింది. మీ విడిది లో పందిరి మంచంపై నిద్ర పోయినందుకు నాకు విధించిన శిక్ష మాత్రం అమలు చేయండి. నాకు వంద కొరడాదెబ్బలు శిక్షగా వేయాలనుకున్నారు. అందులో నేను నిరపరాధిని. వీరే తగువులాడుకుని నన్ను పడుకోబెట్టారు. ఉద్యోగాలు పోయినా వీరు లోగడ వెలగబెట్టిన పదవిహోదాని మరువ లేదు. దాని కోసం చాలా గొడవపడ్డారు. కనుక వీరి పదవి హోదాలను గుర్తించి నాకు వేసిన శిక్షలో వంద దెబ్బలను వీరి హోదాల ప్రకారం వీరికి సర్ది అమలు చేయవల్సిందిగా కోరుతున్నాను. ఈ కోరిక ఎందుకు కోరానంటే దీనికి కారణం ఉంది.”
అని బీర్బల్ తన ప్రసంగం ఆపాడు.
వింటున్న హేమరాజ్ సైనికోద్యోగులు నవ్వ సాగారు. అంతవరకు కోపంతో జేవురించే వారి ముఖాలు పూర్తిగా నవ్వులతో నిండిపోయాయి. అక్కడ గుమిగూడిన
గ్రామీణులు కూడా నవ్వులు పువ్వులయ్యారు.
ఆ వెంటనే బీర్బల్ తిరిగి ఇలా అన్నాడు.
“షిఖ్ దార్ కు 25, ఫోతేదార్ కు 20, అమీన్ కు 15, ముగ్గురు కానుంగోలకు తలా 10 చొప్పున 30 సర్దితే మిగిలిన పది ఉన్నాయి. వాటిని రాత్రి అతిధికి పందిరి మంచం ఇమ్మని కోరిన చిన్న ఉద్యోగులైన కార్ కాన్లు నలుగురుకు సర్దివేసి మీరు అ నుకున్నట్టు 100 కొరడాదెబ్బలను అమలు చేయండి. కాపలాదారు నిరపరాధి. నేను అతిధిని. నాకు ఎలాంటి రాజకీయాలు అక్కర్లేదు. నాకు ఒక గుర్రం ఇచ్చి విడుదల చేయాల్సిందిగా కోరుతున్నాను. ఈ పది మందిని ఢిల్లీలో కారాగారానికి తరలించి వేయండి. ఈ యుద్ధంలో విజయం హేమరాజ్ చక్రవర్తికి వరిస్తే వెంటనే ఈ పది మందిని దయతలచి వదిలేయండి. వీరిని చంపినా ఊర కుక్కలను చంపినా ఒక్కటే. అసమర్థులు. ఊడిపోయిన పదవి గొప్పల కిపోయి శత్రుస్థావరంలో గల విడిదిలో గుట్టుచప్పుడు కాకుండా గడిపి పారిపోవా ల్సి ఉండగా ఆధిక్యత ప్రదర్శించుకున్నారు. గొడవ పెద్దది చేసుకుని పీకల మీదకు తెచ్చుకున్నారంటే వీరిని ఏమనాలి? వీరి మాటలు విని మీ గూఢచారులు వేగు అందిస్తే కదా మీరు వేకువనే రాగలిగారు. లేకుంటే మీరు ఈ చలిలో వచ్చేవారుకాదు. వీరు ఎంతటి అవివేకులో అర్ధం అయి ఉంటుంది ఈపాటికి ” అన్నాడు.
విన్నవారంతా నవ్వారు. అక్కడ అంతకు ముందున్న ఉత్కంఠ నీరుగారిపోయింది.
“వీళ్లు ఎలాంటి విషయ సేకరణ చేయలేదు అంటున్నావు. నీ మాట నమ్మాలనిపిస్తోంది మాకు విడిది నుంచి వీరి మాటలను విన్న మా గూఢచారి నీవన్నట్లే మాకు వేగు అందించాడు." అని చెప్పి ఆ పదిమందిని ఢిల్లీకి తరలించాల్సిందిగా ఆదేశాలు
ఇచ్చాడు వారిలో ఒకడు.
అప్పుడు బందీ అయిన షిఖ్ దార్, బీర్బల్ పై కోపంతో పెట్రేగిపోయాడు. “నీవు ద్రోహివి మమ్ము శత్రువుకు అప్పగించి నీవు తప్పిం చుకునిపోతున్నావు. నీకు గట్టిగా బుద్ధి చెప్పే రోజు వస్తుంది. నీవు ఇంతకు రెండింతలు అనుభవిస్తావు” అని అరిచాడు.
మిగిలినవారు కూడా బీర్బల్ ని లేనిపోని శాపనార్ధాలు పెట్టారు. తక్షణమే వారి నోళ్లు మూయించారు నగర రక్షకులు. "బీర్బల్ ను పల్లెత్తు మాట ఆడడానికి లేదు, అతడు ఉన్నంతలో చ క్కగా చెప్పాడు" అని వారిని అదుపుచేసారు.
“ఓ బీర్బల్ నీవు కొత్త ప్రభువు హేమరాజ్ వద్దకు వచ్చేయరాదు. మేము చెప్తాం. నీవు బుద్ధి కుశలతగలవాడవు. నీపై మేము కత్తులు దూసినపుడే నీవు ఏ మాత్రం భయపడకుండా ఏమీ చేయలేరు అని చెప్పగలిగావు. నీవంటివాడు చక్రవర్తి వద్ద ఉంటే నీకు ఎంతో మేలు జరుగుతుంది.” ఆ ఇరవైమందిలో ఒకడు అడిగాడు.
“నేను నా ప్రాణదాత భైరంఖాన్ ను వదిలి ఇప్పటిలో రాలేను మన్నించండి.” అని చెప్పి వెనుదిరగబోతుండగా ఏదో గుర్తుకు వచ్చినవాడిలా ఆగి"అయ్యా నాకు ఈ పది మందితో ఒకసారి మాట్లాడేందుకు చిన్న అవకాశం ఇప్పించండి. వీరికి అతిధిగా కొంత సమయం ఉన్నాను" అని కోరాడు.
సరేనన్నారు. వెంటనే ఆ పదిమందిని కలిసి "మీ ప్రాణాలు కాపాడడానికి ఇంతకంటే వేరే మార్గం కనిపించలేదు నాకు. లేకుంటే మీరెవరో ఇక్కడ గ్రామీణులు, కాపలాదారు చెప్పేవారు. వారికంటే ముందు తెలివిగా గళం విప్పాను మన్నించండి. ఎలాగూ హేమరాజ్ పరాజితుడవుతాడు. అప్పుడు చెరసాలలో ఉ న్న మీరు దేశం కోసం ప్రాణాలు పణంగాపెట్టారని మీకు అక్బర్ చక్రవర్తి గుర్తింపు లభిస్తుంది. మీ పదవులు మీకు మరల లభిస్తాయి. వాస్తవానికి ఒకసారి చేజారిన రాజధానిలో పాతవారికి అవకాశం ఉండదు. అర్ధాంతరంగా మీరు ఇక్కడ ప్రాణాలు కోల్పోవల్సినవాళ్లు బతికారు. తరువాత మళ్ళీ ఉద్యోగాలు వెలగబెడతారు. ఎలా ఉంది నా పథకం.” లోగొంతుతో చెప్పాడు. విషయం విన్నాక, వారి ముఖాలు వెలిగిపోయాయి.
బీర్బల్ కు ఒక గుర్రం ఇవ్వబడింది. అతడు అక్కణ్నించి వెళ్లిపోతున్నపుడు అందరికి చెప్పి చేతులూపి ముందుకు దూసుకు పోయాడు. పదిమంది బందీలు బీర్బల్ ని అయోమయంగా చూస్తూ నిలబడ్డారు. వారిని నెట్టుకుంటూ పోయారు కొత్త నగర రక్షకులు. వారిలో ఒకడు నవ్వుతూ “ఈ మాటకారివాడు మనమిచ్చిన ముసలి గుర్రంతో నానాయాతనలు పడతాడు. అసలే అడవిలో ప్రయాణం.. ఎలా అడవి దాటుకుంటూ గురుదాస్ పూర్ కి వెళ్తాడో బాగా తెలిసివస్తుంది. మా చక్రవర్తి హేమరాజ్ సన్నిధికి వచ్చేయ్ అంటే రానని చెప్తాడా? బుద్ధిరావాలని కావాలని వయస్సుడిగిన గుర్రం ఇచ్చాం.” అని పకపకనవ్వాడు.
విన్న పదిమంది అయ్యో పాపం అని నొచ్చుకున్నారు.
📖
*గుర్రం పోయే ఏనుగు వచ్చే ఢాం ఢాం......*
బీర్బల్ అడవి మార్గాన పడిసాగిపోతుండ గా, కనీసం తాను స్నానసంధ్యాదులు చేయని విషయం, తన ప్రాణంతో బాటు మిగిలిన పదిమందిని రక్షించుకోవడానికి తను పడే బాధ గుర్తుకువచ్చింది. ఒక చోట గుర్రాన్ని ఆపి దానికి పచ్చిక చూపి సన్నగా పారుతున్న నదిపాయలో స్నానం చేసి సంధ్యావందనం చేసుకుని తడిపిఆరవేసిన బట్టల్ని కట్టుకుని గుర్రం కోసం వెతికాడు. అది నీడలో సేద తీరుతోంది. దానికి నీళ్లు బాగా తాగించాడు.
ప్రయాణానికి సిద్ధమవుతుండగా డప్పు కొట్టుకుంటూ ఎదురొచ్చిన ఒక బోయవాడు కన్పించాడు. వాడిని ఆశ్చర్యంగా చూసి “అదేమిటోయ్ వేట వృత్తితో బతికేవాడివి. ఇలా డప్పుకొట్టుకుంటూ బయలుదేరావు. మరి నీకు ఎలా వేట దొరుకుతుంది. నీ డప్పు నాలుగు అడవులకు విన్పించేలా ఉంది. నీ ఎదురుగా ఏ జంతువు వచ్చి నిలబడదు. నీ దరిదాపుల్లో ఉండదు".
అన్నాడు.
"అయ్యా ఏం చెప్పమంటారు. నేను మీరన్నట్టుగానే వేట వృత్తి మీద బతుకు బండి ఈడ్చుచున్నాను. కానీ, ఈ అడవిలో అదేం రోగం వచ్చిపడిందో తెలియదు. పులులు మనిసిని సూస్తేసాలు మీద పడి సంపేస్తున్నాయి. వాటికి ఏదో పిచ్చి పట్టింద ట. ఈ విషయం సెక్రవర్తికి సెపుదామంటే అక్కడ సెక్రవర్తులు మారిపోతున్నారు. మా గోడు వినేనాధుడు లేడు. ఆ పులులు మా సేతుల్లో చాలా సచ్చాయి. వాటి పంజాలకు మేము చాలామంది చచ్చాం. ఇక వేట ఈ అడవిలో సాగదని వలసలుపోతున్నాం. నేను అదిగో ఆ కొండ దాటాక ఈ డప్పు కొట్టడం ఆపి వెళ్లిపోతాను." అని తన గోడు విన్పించాడు.
🎭
*సశేషం*
꧁☆•┉┅━•••
*అక్బర్ - బీర్బల్ కధలు -10*
🎭
రచన : యర్నాగుల సుధాకరరావు
“నేను ఈ అడవి మార్గాన చాలా దూరం పోవాల్సి ఉంది. పులులతో ప్రాణ ప్రమాదం అంతగా ఉందా? ఎలా ఈ ముసలి గుర్రంతో అడవి దాటేది. నేను ఢిల్లీశ్వరుని పని మీద ఈ అడవి మీదుగా పొరుగు
రాజ్యానికి పోవల్సి ఉంది. తీరా వస్తే ఇలా నా మీద పులులు దాడి చేసే పరిస్థితి ఉందని నీవు చెప్తున్నావు.” భయంగా అడిగాడు బీర్బల్.
ఆ మాటలు విని బోయవాడు చేతులు కట్టుకున్నాడు.
"డప్పుకొడితే ఏ జంతువూ తనకి ఎదురు పడకుండా పారిపోతుంది. బోయవాడివి నీకు ఇలాంటివి తెలుస్తాయి. మరి నా వద్ద డప్పులేదే”.
"మాకు జంతువుల గుణగణాలు బాగా తెలుసు. శబ్ధం వినేందుకు అవి ఇష్టపడవు. వాటి చెవులకు భరించే శక్తి ఉండదు.”
"సరే నేను ఈ అడవి దాటాలి. నీకు ఎంతో కొంత ముట్టచెప్పుతాను. నాకా డప్పు ఇస్తే నేను ప్రమాదం అనిపించినపుడు డప్పు కొట్టుకుంటూ సాగిపోతాను. ఇక్కడ పరిస్థితి చక్రవర్తికి చెప్పి పిచ్చి పట్టిన పులుల సంగతి తేలుస్తాను ఏమంటావు?”
"నేనేమి అనను, డప్పు మాత్రం ఇవ్వను. ఇప్పుడు నీవు నీ సెక్రవర్తి ఏం చేసినా మా వేటగాళ్లు ఈ అడవిలో ఉండేది లేదు. అంతా ఎప్పుడో వదిలేసి పక్క అడవులు పట్టిపోయాం. ఇక్కడ పులులు ఏమయితే ఎవరికి కావాలి. నేను ఈ డప్పు తయారు చేయాలంటే చాలా కష్టపడాల్సి ఉంటుంది. నేను ఇవ్వను. ఈ డప్పు ఇన్నాళ్లు నా ప్రాణాన్ని రక్షించింది. మరీ కావాలంటే నీ ఒంటి మీద ఉన్న నగనట్రా ఇచ్చేయ్. మెడలో హారాలున్నాయి.. పచ్చలపిడితో బాకుంది. ఖరీదైన తలపాగ ఉంది. ఇవన్నీ ఇస్తే ఇచ్చేస్తాను. ఎవరికైనా ప్రాణంకంటే ఏదీ ఎక్కువ కాదు" అని చెప్పి బోయవాడు డప్పును ముద్దాడుకున్నాడు.
బీర్బల్ కు నవ్వు వచ్చింది.
“నాయనా ఇదే ఖర్మమంటే. జంతు చర్మంతో తయారయిన డప్పును నేను తాకను, కానీ నా ప్రాణాలు నిలుపుకోవాలి కనుక దీన్ని పెద్ద ధరకు నీ వద్ద కొనుగోలు చేయాలి. సరే ఇవ్వు మొత్తం నిలువు దోపిడి చేసి ఉన్న హారాలు పిడిబాకు, తీసుకుంటున్నావు నీవు, వేటకంటే వర్తకానికి అన్ని విధాలా పనికివస్తావు."
అతడు కోరినవన్నీ ఇచ్చేసి డప్పు తీసుకున్నాడు. ఒకసారి దానిపై దరువు వేసాడు. ఆ శబ్దంకి పక్క పొదల్లో ఉన్న నక్క ఒకటి వికృతంగా కీచుగా అరిచి పారిపోయింది.
“చూసావా దొరా ఆ నక్క ఎలా పరుగు తీసిందో, మేము చెడామడా బాదుతాం. ఆ శబ్దం జంతువులకి గూబలు పేలిపోయి నట్టు విన్పిస్తాయి. మరి నీవు హాయిగా వినేట్టు చిన్నగా చేత్తో తడుతున్నావు.
వినడానికి బాగుంది. తర్వాత గట్టిగా కొట్టు”.
“దీన్ని సంగీతం అంటారు. సరే నీదారిని నీవు వెళ్లు. నా దారి నాది. ఎప్పుడైనా నన్ను కలువు. నా పేరు బీర్బల్ అంటారు. బహుశా ఢిల్లీ చక్రవర్తి వద్ద మున్ముందు ఉంటాను. నీకు ఏదైనా సాయం చేయగ లుగుతాను.”
"మీకాడ ఉన్నదంతా దోచినందుకు మీకు భలే కోపం వచ్చినట్టుంది. అసలే రాజుల కాడ బతుకుతున్న మీరు నన్ను అక్కడ సూడగానే ఉరి తీయిస్తారని భయంగా ఉంది. ఎలా కలవను?”
“నీవు పొట్టగడవడానికి నా హారాలు తీసుకుని నీ డప్పు ఇచ్చావు. నీ తప్పేమీ లేదు. అయినా నేను అవివేకిని కాను. ఈ డప్పును నీకంటే ఎక్కువ ధరకు అమ్ముకో గలను. నా ప్రజ్ఞ మీద నాకు కొండంత
నమ్మకం. భయపడకుండా ఎప్పుడైనా నా వద్దకు రా! సాయపడగలను. నీవంటి వానికి హాని చేయడం అంటే వన్య ప్రాణిని చంపినట్లే”.
"సామీ ఈ డప్పుకు అంత ధర ఎలా పలుకుద్ది. నీరు తగిలితే సాలు దుర్గంధం అవుతుంది. మీరు సూస్తే అగ్రకులపోల్లు. కొంపదీసి నేను తప్పుసేసినట్టున్నాను. నా డప్పు నాకు ఇచ్చేయండి. మీ నగా నట్రా తీసుకోండి" అని ప్రాధేయపడ్డాడు.
బీర్బల్ నవ్వి “నాకు ఈ డప్పు కావాలి. దీనితో నాకు చాలా పనుంది. నీవు బాధపడకు. నేను సంగీత విద్వాంసుల వద్ద ఈ డప్పు కొట్టడం నేర్చుకున్నాను. సరే నీ పేరు చెప్పలేదు.”
"సామీ, మాకు మంచి పేరు ఏమి ఉంటుంది? నా పేరు పులొండ. నాకు మా పెద్దలు సెప్పిందేమిటి అంటే నా తల్లి ఈ అడవి మార్గానపడి పోతుంటే నొప్పులు వొచ్చినాయంట. నా తండ్రి ఆ కొండల్లో తీసుకుపోయినాడంట. తీరా అది పులి ఉండే సోటంట. నన్ను నా తల్లి కనేసింది. అప్పటికే మా ప్రజలు పోగయినారు. వారు అక్కడ పులి తచ్చాడడం సూసి దాన్ని ఎంటబెట్టి నన్ను ఇంటికి తీసుకువచ్చి పులివొండలో పుట్టినందుకు పులొండ అని పేరు పెట్టుకున్నారు.” అన్నాడు.
బీర్బల్ పకపకమని నవ్వాడు. ఆ తర్వాత ఆ బోయవాడు వెళ్లిపోతుంటే “మరి నీకు డప్పులేనందున భయం లేదా?” అని అడిగాడు.
"సేతుల్లో బంగారం పడింది కదా ఇక పులి భయం ఏముంటాది. ఎలాగోలా తప్పించు కుని పట్టణం పట్టిపోయి కొన్నాళ్లకు సరిపడా బత్యాలు కొనుక్కుంటాను.” అని సంభరంగా చెప్పి వెళ్లిపోయాడు.
📖
బీర్బల్ నవ్వుకున్నాడు. పులొండగాడు చెప్పినది కట్టుకధ. వాడు తెలివిగా పులుల భయం ఉందని చెప్పి ఇలా అడవిమధ్యలో డప్పులు అమ్ముకుంటున్నాడు అని గ్రహించాడు. ఆటవికుడు అయినా తను తయారుచేసుకునే డప్పుకు భలేగా గిరాకీని కల్పించుకుంటున్నాడు. ఈ అడవుల్లో కనిపించే బాటసారులను ఇలా చక్కగా దోచుకుంటున్నాడు అని తనలో తాను నవ్వుకున్నాడు. అనవసరంగా పులి బండ ఉచ్చులోపడ్డానని బాధపడకుండా అక్కణ్నించి బయలుదేరాడు.
దట్టమైన అడవుల్లోంచి వెళ్తున్న బీర్బల్ కు ఆకలి వేసింది. అప్పుడు మధ్యాహ్నం అయ్యింది. గుర్రం బాగా అలిసిపోయింది. చెట్టుకింద రాలిన పండ్లు ఏరుకుని తిని కడుపు నింపుకున్నాడు. చెట్టు నీడన
కూర్చుని అధిక ధరకు కొన్న డప్పును లయబద్ధంగా దరువు వేయసాగాడు. ఆ చుట్టుప్రక్కల మారుమ్రోగింది ఆ డప్పుల శబ్దం. అక్కడికి చేరువలో విశ్రాంతిలో ఉన్న విక్రమార్క బిరుదాంకితుడు హేమరాజ్
చెవులారా ఆ డప్పుల శబ్దం విన్నాడు.
"ఇలా మనస్సును ఆహ్లాదపరిచినట్టు డప్పుకొడ్తున్నవారు ఎవరు? నాలా యుద్ధం లో అలసిసొలసినవారికి ఆనందించేందుకు ఎంతో బావుంటుంది. ఈ అడవిలో ఉన్న ఆ డప్పుగాడ్ని సగౌరవంగా తీసుకురండి" అని చెప్పి పంపాడు.
వెంటనే నాలుగు గుర్రాలు అటుగా కదిలాయి. కొండకు చేరువగా ఉన్న పండ్ల తోటలో కూర్చుని దరువు వేస్తున్న బీర్బల్ ని చేరుకుని “అయ్యా తమరు ఉన్న పళంగా రావాలి. మా ప్రభువు మిమ్మల్ని తీసుకురమ్మన్నారు" అని విన్నవించారు.
ఆ భటులు దుస్తుల్ని చూసి ఎవరైంది ఇట్టే తెలుసుకున్నాడు. మారుమాట్లాడకుండా వారి వెనుక నడిచాడు.
బీర్బల్ తన గుర్రం నడిపించుకుంటూ హేమరాజ్ ముందు నిలబడ్డాడు.
"ఎవరు నీవు? నిన్ను చూస్తే వాద్యకారుడి లా లేవు. మారువేషంలో మా రహస్యాలు పసిగట్టడానికి వచ్చినవాడిలా ఉన్నావు. నిజం చెప్పి ప్రాణాలు రక్షించుకో! నీకు ఈ డప్పుతో పనేంటి? ఒక కులం వాళ్లకే ఈ డప్పు పరిమితంగా ఉంది కానీ, నీవు పట్టుకు తిరుగుతున్నావు” అనుమానంగా అడిగాడు హేమరాజ్.
చుట్టూ కూర్చున్న మంది మార్బలం కత్తుల పై చేతులు బిగించారు. వారిలో నుండి దండనాయకుడు ముందుకు వచ్చి “దేవరా, అనుజ్ఞ ఇవ్వండి. వీడిచే మొత్తం కక్కిస్తాం. వీడు తమరు అనుమానించిన ట్టుగా శత్రు గూఢచారి అయి ఉంటాడు. మనం ఇప్పుడు యుద్ధ వాతావరణంలో ఉన్నాము కనుక ఎవరిని నమ్మరాదు.” అని అనుజ్ఞ కోరాడు.
మందిలో ఒకడు అశ్వశాస్త్రం చదివిన వాడు “దేవరా ఈతదు నడిపే గుర్రం చాలా ముసలిది. ఇది స్వారీ చేయడానికి పనికి రాదు. తెలిసి ఎందుకు నడుపుచున్నాడు. ఈతడు అనుమానించ దగ్గవానిలా ఉన్నా ఆ డప్పు, ఈ గుర్రం కలిగి ఉన్నందున ఎందుకో ఈతడు మతి తక్కువవాడిలా ఉన్నాడనిపిస్తోంది. ఇలాంటి ముసలి గుర్రం వలన అడవుల్లో చాలా ప్రమాదం. వీటి నుంచి ఒక రకమైన వాసన వస్తుంది. అది మనకు తెలియకుండానే చాలా దూరం వ్యాపిస్తుంది. దాంతో ఆ వాసన క్రూర మృగాల ముక్కు పుటలకు తాకుతుంది. అంతే! అవి వెతుక్కుంటూ వచ్చేస్తాయి. ఈతడు చాలా అదృష్టవంతుడు ఇంత వరకు ఏ మృగం బారిన పడలేదు. ఈ ముసలి గుర్రాలను వేటగాళ్లు వేటకు ఉపయోగిస్తుంటారు.” అశ్వశాస్త్ర పరిజ్ఞాన వంతుడు విడమర్చి చెప్పాడు. అంతా ఆశ్యర్యంగా విన్నారు.
బీర్బల్ చేతులు మోడ్చి ఎదురుగా నిలబడి..
“విక్రమాదిత్య బిరుదాంకితులైన హేమరాజ్ తమరిని దర్శించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను గౌర్ ప్రాంతపు బ్రాహ్మణుడను పేరు బీర్బల్. చదివినది అంతంత మాత్రమే మంచి మాటకారినని పదిమంది నా మాటల్ని విని ఆనందిస్తు ఉంటారు. నా పేదరికం వల్ల నా మాటకారి తనాన్ని మీవంటి పెద్దల ముందువినోదంగా మార్చుకుని ఆ పదిమందిని నవ్విస్తూ బతుకు ఈడుస్తున్నాను. మీలా కత్తి పట్టిన సాహస బ్రాహ్మణుడను కాను. మీ గురించి విన్నాను అపర చాణక్యులని అంతా చెప్పుకొనగా విని ఆనందించేవాడిని. ఇప్పుడు ప్రత్యక్షంగా చూసాను. నేను ఇలా స్వజాతీయుడిచే శిక్షింపబడినా సన్మానింప బడినా నా వంటి అల్పునకు చాలా ఎక్కువ. ఇక మీరు అనుమానించినట్టు నేను గూఢచారిని కాను. ఇది నా ఊరు అని చెప్పుకోలేనివాడిని, దేశదిమ్మరిని, పలువురు రాజుల వద్ద ఛలోక్తులతో బతికేవాడ్ని. నాకు తొలుత ఆశ్రయం ఇచ్చినవాడు హుమాయూన్. కవులంద రితో కలిసి ఒకసారి నన్ను తన ప్రక్కనే కూర్చోబెట్టుకున్నాడు. ఆ తరువాత రాజ పుత్రవీరులు. వారెవ్వరి వద్ద నేను ఎక్కువ కాలం ఉండలేకపోయాను. అందుకే చెప్పాను దేశదిమ్మరిని. ఆ మధ్య ఎవరి ప్రాపకం లభించక, చివరికి చావాలనుకుని ఆత్మహత్యా ప్రయత్నం చేసాను. దేవుడు లా నన్ను భైరంఖాన్ రక్షించాడు. ప్రస్తుతం అతని పంచన ఉన్నాను. ఇక ఈ డప్పును చాలా ధరపెట్టి కొన్నాను. ఎందుకు అంటే..” అని ఇంకా చెప్తుండగా మధ్యలో అక్కడ వింటున్నవారు “నీవు బుద్ధిహీనుడవు కనుక” అని నవ్వుతూ అన్నారు. ఆ ఈసడింపులకు హేమరాజ్ కూడా ఎందుకో నవ్వాడు.
🎭
*సశేషం*
꧁☆•┉
అక్బర్ - బీర్బల్ కధలు -11*
🎭
రచన : యర్నాగుల సుధాకరరావు
ఆ ఈసడింపులకు హేమరాజ్ కూడా ఎందుకో నవ్వాడు.
'అయ్యా చాలా ధరపెట్టి కొన్నందుకు నోరు పారేసుకోకండి. తర్వాత మీరే చాలా బాధ పడతారు. విషయానికి వస్తాను. ఈ డప్పును రోజూ మనకు నచ్చే విధంగా దరువు వేస్తే మనకి ఎలాంటి ఆపదరాదు. నేను నిత్యం ఏదో ఒక చిక్కులో ఇరుక్కుం టున్నాను, అలానే ఈ డప్పు శక్తి వలన తప్పించుకుంటున్నాను. అది నా అదృష్టం. నా గుర్రం ముసలిది అదృష్టదేవత. దీన్ని హుమాయూన్ నడిపేవాడు. అతడు చేసినన్ని యుద్ధాలు నాకు తెలిసి ఏ చక్రవర్తీ ఇంతవరకు చేయలేదు. ఈ గుర్రం తో కదనరంగంలోకి వెళ్లినపుడు విజయమే వరించేది. అతడి వద్ద ఛలోక్తులు చెప్పే నాకు ఆయన తదనంతరం ఈ గుర్రం నాకు దక్కేలా చేసాడు. ఇటీవల అక్బర్ పాదుషా వారు యుద్ధానికి వెళ్తూ ఈ గుర్రం కావాలి అని కబురు పంపారు. నేను దానంగా పుచ్చుకున్న గుర్రం తిరిగి ఇవ్వడానికి నాకు ఇష్టంలేక ఇదిగో ఇలా అడవులపట్టి పారిపోతున్నాను. నేను మతిహీనుడను కాను.” అన్నాడు.
ఒక్కసారిగా అందరి చూపులు గుర్రం, డప్పు పై నిలిచాయి.
హేమరాజ్ లేచి ఆ గుర్రాన్ని తడిమి చూసి "ఇది చాలా ముసలిది అయిపోయింది. దీన్ని అంతగా ఇష్టపడి హుమాయూన్ స్వారీ చేసాడా? అతడికి జ్యోతీషంపై నమ్మకం ఎక్కువే. దీనిలో ఏదో శక్తి ఉండి ఉండాలి. నీకు ఏమయినా తెలుసా? ఏమీ లేకుండా ఎందుకు నమ్ముతాడు. అతడు మంచి కవి, విద్యావంతుడు. జగమెరిగిన వాడు. అంతటివాడు ఊరకే దీన్ని ఉపయోగించడు.”
"ఇది ఒక ఫకీరుచే బహుమతిగా హుమాయూన్ పొందిన తరువాత చాలా యుద్ధాల్లో విజయం పొందాడు. చివరికి నాకు ఇచ్చాడు. దీని కోసం అశ్వశాలలో ఒక ప్రత్యేక గది నిర్మించాడు."
"అలాంటి గది ఏమీలేదే నేను అశ్వశాలల విభాగం అధిపతిని. నాకు తెలియని శాలలు ఎక్కడున్నాయి? నీవు అబద్ధం చెప్తున్నావు" మధ్యలో అందుకున్నాడు ఒకడు.
“ఓ అశ్వపతి ఇలా చెబుతున్నందుకు నీకు సిగ్గుగా లేదు. ఇలాంటి మాట అదే అక్బర్ పాదుషా ముందు చెప్పి ఉంటే నీ తల ఈసరికే నేల మీద పొర్లాడి ఉండేది. దేవరా ఇప్పుడు నన్ను, ఈ అశ్వశాలాధిపతిని మీ అధీనంలో ఉన్న ఢిల్లీకి పంపండి. నేను చూపుతాను. అలా చూపకుంటే నన్ను కడతేర్చండి.” అన్నాడు బీర్బల్.
ఆ మాటలు విన్నంతనే అక్కడ వారంతా బిక్కముఖాలు వేసారు.
"నేను అబద్ధం ఎందుకు చెప్పాలి. ఈ ముసలి గుర్రంని చక్రవర్తి నాకు ఇచ్చాడు. కనుక మోజుతో తిప్పుతున్నాను. ఇది నాకు పెనుభారం. ఇది ఇక అట్టేకాలం బతకదు. దీని కోసం నా ప్రాణాలు మీతో పందెంకుపోయి బలిపెట్టగలనా?"
హేమరాజ్ ఆ గుర్రం కళ్లాలు అందుకుని దాని వీపు నిమిరాడు. "నాకు ఈ గుర్రం కావాలి. నీ వద్ద ఉన్న ఆ డప్పు కూడా ఇచ్చేయ్. నీకు కావల్సినంత ధనం ఇప్పించగలను. ఏమిస్తే ఇవ్వగలవు." అని అడిగాడు.
అక్కడ నిశ్శబ్దం చోటుచేసుకుంది.
"మీరు కోరడం నేను కాదనడమా దేవరా! మీ వద్ద నాకు ధనం వద్దు. ఉచితంగానే తీసుకోండి. మీద ఉంటే నాకంతే చాలు.”
"ఈ యుద్ధంలో నేను దీన్ని ఎక్కి కదన రంగానికి వెళ్లగలను. హుమాయూన్ వంటి సాహసయోధుడు ఈ గుర్రం వలన చాలా విజయాలు సాధించాడు. ఈతనికి మోయ లేని బంగారు ఆభరణాలు ఇప్పించి పంపండి. ఈ గుర్రంకు కావల్సిన గుగ్గిల్లు పెట్టి సిద్ధం చేయండి." అని తన వారికి ఆదేశాలు జారీచేశాడు.
"నాకు బంగారు నగలు వద్దు. దేవరా నేను కోరింది దయతో ఇప్పించండి. నా చిన్నప్ప ట్నించి ఒక ఏనుగుకు స్వంతదారును కావాలనుకున్నాను. నేను నా గుర్రం ఇవ్వలేదని ఆ అక్బర్ పాదుషా నన్ను పట్టు కుని ఏమైనా చేయవచ్చు. బతికినన్నాళ్లు ఏనుగు మీద ఊరురా తిరగాలని నా కోరిక ఈ విధంగా అయినా నా కోరిక తీరుతుంది. మీరు ఇచ్చు నగలతో ఇట్టి ఏనుగును నేను కొనలేను. ఇవ్వగలిగితే ఒక ఏనుగు ఇప్పించండి.” అని బీర్బల్ తన కోరికను వెల్లడించాడు.
"ఏనుగు కావాలని కోరడం చాలా వింతగా ఉంది. అయినను నీ కోరిక కాదనను. సరే నీవు నా వద్ద ఉండిపోరాదు. నీన్ను అన్ని విధాల సౌకర్యంగా చూడగలను. ఎందుకు అన్యమతస్థుల వద్ద ఊడిగం చేస్తావు.” హేమరాజ్ నవ్వుతూ అడిగాడు.
“నేను భైరంఖాన్ వద్ద పనికి కుదిరాను. నా ప్రాణాలను ఆయన రక్షించాడు. నేను చావాలనుకుంటుంటే నాకు అతని వద్ద ఉదరపోషణకై అవకాశం కల్పించాడు. ఇప్పుడు గురుదాస్ పూరు వెళ్తున్నాను.”
"అతడు పానిపట్టు యుద్ధంలో నా చేతిలో చావక తప్పదు. మరి ఇంక నీవతన్ని చూడవు. అందుకే నీకు చెప్తున్నాను. నా వద్ద ఉండిపో, అతడిచ్చినదానికంటే రెట్టింపు ఇవ్వగలను.” అన్నాడు హేమరాజ్.
“నేను అతనికి ఒక మాట చెప్పాను. తమరు నా మాట చెవి వరకే పరిమితం చేస్తే చెప్పగలను.” అని హేమరాజ్ చెవిలో గుసగుసగా చెప్పాడు.
“భైరంఖాన్ జయాపజయాలు దైవాధీనాలు. హేమరాజ్ న్ను చంపవలిసి వస్తే ఆ పనిచేయకు, అతడు బ్రాహ్మణుడు. బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంటుంది. అది ఏడు జన్మల వరకు వదలదు అని చెప్పాను.”
ఆ మాటకు మొదట చిర్రెత్తినా హేమరాజ్ బీర్బల్ ని తీక్షణంగా చూస్తూ "అలా ఎందుకు చెప్పావు?” అని నీళ్లు నమిలాడు.
"బ్రాహ్మణునిపై కత్తి ఎత్తడం పాతకం కాదా!”
హేమరాజ్ కొద్దిసేపటి వరకు తీవ్రంగా ఆలోచించాడు.
“సరే నీవు నీ కోరిక ప్రకారం ఒక ఏనుగు తీసుకుని వెళ్లిపోవచ్చు" అని చెప్పి తన శిబిరంలోకి దూసుకుపోయాడు.
హేమరాజ్ వెనుకున్నవారు శిబిరంలోకి వెళ్లి
"ఈతడు అక్బర్ సంరక్షకడైన భైరంఖాన్ వద్ద పనిచేసేవాడు. ఈతన్ని బంధించి చాలా విషయాలు తెలుసుకోవాలను కుంటున్నాం. వెంటనే బంధించి రహస్యాలు కక్కిద్దామా” అని అడిగారు.
“ఈతడు మనలా యుద్ధపిపాసి కాడు. రాజకీయాల జోలికి పోని విదూషకుడు. ఇటువంటివారిని హింసించడం పాపం. ఎక్కడ ఏ రాజ్యం కూలిపోయినా అక్కడ కవులను, విదూషకులను గాయకులను నాట్యకత్తెలను ఇతరత్రా వృత్తిపనివారిని బంధించరు హింసించరు. ఆపాటి రాజ ధర్మం మీకు తెలియదా? కానివి నాచే చేయించాలని చూడవద్దు. ఈతడు తనకేమి కాదనే ధైర్యంతో ఏదీ దాచకుండా చెప్పగలిగాడు. కనుక మీరు అతన్ని ఏ విధంగానూ అ డ్డుగా నిలవవద్దు." అని చెప్పి వాళ్ళ నోళ్లు మూయించి పంపేసాడు.
అప్పటికే యుద్ధానికి సన్నద్ధం అయి వస్తున్న వేల సంఖ్యలోగల ఏనుగులలో జాతి ఏనుగును తీసుకువచ్చి ఇచ్చారు. దాని మావటి ఏనుగుకు బీర్బల్ తో పరిచయం చేసాడు. "ఇది కోపంతో ఎదురు తిరగదు. మంచి జాతి ఏనుగు. చాలా ఖరీదైనది. నీ అదృష్టం బాగుండి నీకు ప్రభువులు ఇచ్చారు. ఈ భారీ జంతువుకు దాణాగా ఏమి ఇవ్వాలో చెప్తాను. శ్రద్ధగా విను" అని దాణా వివరాలు చెప్పాడు.
ఆ తరువాత బీర్బల్ వారి వద్ద సెలవు పుచ్చుకుని ఏనుగు ఎక్కి బయలుదేరి వెళ్లిపోయాడు.
🎭
*సశేషం*
꧁☆•┉
*అక్బర్ - బీర్బల్ కధలు -12*
🎭
రచన : యర్నాగుల సుధాకరరావు
అర్ధరాత్రివేళ, హేమరాజ్ వద్దకు బందీలుగా పది మందిని తీసుకువచ్చి నిలిపారు సైనికులు.
"వీళ్లు మన అధీనంలోగల పల్లెలో జగడమాడుకుంటూ మాకు దొరికారు. ఢిల్లీలో షిక్ దార్, అమీన్, ఫోతేదార్, కానుంగోలు, కార్ కూన్ లుగా పనిచేసారు. వీళ్లని అనుమానించగా వీరితో వీరి అతిధి బీర్బల్ నామధేయుడు ఒకరు వీరి గురించి ఏదీ దాచకుండా చెప్పినందున వీరిని ప్రాణాలతో తమముందుకి తీసుకువచ్చాం” అన్నారు సైనికులు.
"బీర్బల్ ఇంతవరకు ఇక్కడే ఉండేవాడు. అతడు మంచి మాటకారి. సరే వీరి గురించి ఏమి చెబితే మీకు అనుమానం పటాపంచులైపోయి వీరిని బందీగా తీసుకు వచ్చారు ? ఈ యుద్ధ సమయంలో అనుమానితులైన శత్రువులను తెలిసిన వెంటనే చంపాలి కానీ మీరు ఆ పని చేయకుండా తీసుకువచ్చారు.” అన్నాడు హేమరాజ్.
"వీరు నిద్రపోవడానికి ఒక పందిరిమంచం కోసం రాత్రంతా నిద్రపోకుండా తగవులాడు కున్నారట. నువ్వెంత అంటే నువ్వెంత అని ఒకటే కీచాలాట. కోల్పోయిన పదవులు వాటి ఆధిక్యత గురించి వీరి పోరాటం సాగిందట అని బీర్బల్ చెప్పాడు. వీళ్లు
పేటలో ఉన్నా కోటలో ఉన్నా ఒకటేనని చెప్పాడు. అలాంటి వారిని చంపడం పాతకం అని వదిలేసాం. ఇదీ విషయం ప్రభూ".
హేమరాజ్ పకపకమని నవ్వాడు. "కోటలో ఉన్నా పేటలో ఉన్నా ఒకటే అంటే ఏమిటి? మగతనం లేని మగాళ్లని కదా! మరి అక్కడే వదిలేయలేకపోయారా ?”
"వీరితో బీర్బల్ వెళ్లిపోతూ ఏదో గుసగుస గా మాట్లాడాడు. ఏం మాట్లాడాడా అని వీరిని హింసించి మరీ అడిగాం. విషయం తెలిసింది. ఒకసారి మొగలాయిల చేతుల్లోంచి జారిపోయిన ఢిల్లీ ఒకవేళ
తిరిగి చేతికి వస్తే పాతవారికి ఎవరికి అక్కడ ఉద్యోగాలు ఇవ్వబడవు. కానీ మీరు ఢిల్లీ కారాగారంలో ఉంటే మీకు దేశ రక్షకులుగా గుర్తింపు లభించి మరింత హోదాగల ఉద్యోగాలు దొరకగలవు అని
చెప్పాడంట. దాంతో వీళ్లు తెగసంబరపడి పోతున్నా రు.”
ఆ మాట విని అక్కడ ఉన్న వారంతా నవ్వారు. హేమరాజ్ పడిపడి నవ్వాడు. "అయితే కారాగారంలో ఉన్నవారంతా
ఈరకం దేశరక్షకులన్న మాట. వారె వాహ్ ఎంత చక్కగా చెప్పాడు."
నవ్వులతో మునిగిందా ప్రదేశం.
హేమరాజ్ నవ్వాపుకుని ఆ పదిమందిని ఎగాదిగా చూసి "మిమ్మల్ని భలేగా గుర్తించాడు. మీలాంటివాళ్లు ఢిల్లీ రక్షణ విభాగంలో పనిచేస్తే అక్బర్ మళ్లీ ఢిల్లీని గుప్పిటలోకి తీసుకోగలడా? మీరు అల్లాట ప్పాలు” అని నవ్వాడు. ఆ తరువాత కొంతసేపటికి మళ్లీ గొంతు విప్పాడు. “మరి బీర్బల్ ని ఎందుకు వదిలేసారు ? అతడి మాటలను నమ్మి వదిలేసారా?” అని ప్రశ్నించాడు.
“అతడు చతురసంభాషకుడు. అతనిలో మాకు ఎలాంటి రాజకీయం కన్పించలేదు. అలాంటివాడిని ఎందుకు నిర్బంధించాలా అని విడిచిపెట్టాం. మీ వద్ద అతన్ని ఉండాల్సిందిగా అతని హాస్యోక్తులతో మిమ్మల్ని నవ్వించాల్సిందిగా కోరాం. అతడు ఏమా త్రం వీలుపడదు అని ఖరాఖండిగా కాదన్నాడు. దాంతో మాకు కోపం వచ్చింది. వెంటనే అతనికి ప్రత్యక్షం గా హాని చేయకపోయినా విడిచిపెట్టే ముందు అతన్ని ఒకింత మోసం చేసాం.” అని ఇంకా ఏమేమో చెప్తుండగానే హేమరాజ్ నవ్వి “మీరు మోసపోతారు కానీ, బీర్బల్ మోసపోడు.” అన్నాడు.
అక్కడ చుట్టూ ఉన్నవారంతా ఉత్కంఠగా వినసాగారు.
“ఏం మోసం చేసారు ? చెప్పండి పర్వాలేదు.” హేమరాజ్ ద్రాక్ష సారాయి నాలుగు గుక్కలు వేసుకుని ఆసక్తిగా అడిగాడు.
"ఒక ముసలి గుర్రం ఇచ్చాం. దానితో వాడు ఈ అడవి దాటిపోలేడు. ఏ క్రూరజంతువు కో బలి అయిపోయి ఉంటాడు.”
ఆ మాటలు విన్నంతనే హేమరాజ్ కు తాగినది దిగిపోయింది. మత్తెక్కిన కన్నులు పుచ్చ పువ్వుల్లా సాగదీసుకుపోయాయి. ఎదురుగా గుగ్గిల్లు తింటూ కన్పిస్తున్న గుర్రం వైపు చూసాడు. అంతలోనే చెప్తున్న వారు ఆ గుర్రాన్ని చూసి "ప్రభూ మేము బీర్బల్ కు ఇచ్చిన వీసమెత్తు ధర పలకని ముసలి గుర్రం ఇదే. ఇక్కడ గుగ్గిల్లు తింటూ ఉందేమిటి? దీనికి అంత ఖరీదైన తిండి పెట్టడానికి మన సైనికులకు బుర్ర లేనట్టుంది. అడవుల్లో తిరుగాడేటప్పుడు ఈ ముసలి గుర్రాలను ముందు నడిపిస్తాం, ఏ పులో వస్తే దాన్ని ఆరగిస్తుంది. మన మీదకు రాదు. ఈ గుర్రం ఇక్కడికి ఎలా వచ్చింది?" అని ఆశ్చర్యపోయారు.
అక్కడ నిశ్శబ్దం అలుముకుంది.
హేమరాజ్ పక్కనే ఉన్న డప్పును చూసి మరింత అయోమయంలో పడ్డారు ఆ సైనికాధికారులు.
"ఈ అడవిలో ఒక బతకనేర్చిన బోయ వాడు పిచ్చిపట్టిన పులులు మీద పడ్తున్నాయి అని చెప్పి ఈ డప్పు కొట్టుకుంటూ అడవి దాటండి అని చెప్తుంటాడు. అతడి వద్ద తీసుకున్నారా దేవరా!” అని అడిగారు.
"ఈ డప్పు మహిమగలది అని, ఆ ముసలి గుర్రం చక్రవర్తి హుమాయూన్ కు బాగా కలిసివచ్చినది అని చెప్పి నాకు అత్యధిక ధరకు అమ్మాడు. నేను మీ అందరికంటే పెద్ద అల్లాటప్పయ్యను.”
తనను తానే పరిహసించుకుంటూ చెప్పి తెరలు తెరలుగా నవ్వాడు హేమరాజ్. ఆ వెంటనే తేరుకుని “నా కళ్లెదుట ఆ గుర్రం ఉండరాదు. దాన్ని ఈ అడవిలో వదిలే యండి” అని చెప్పి ఒకింత అవమానంగా ముఖం పెట్టి ద్రాక్షసారాయి తాగడంలో మునిగాడు.
"బీర్బల్ ఏనుగు మీద ఎంతో దూరం పోలేడు. తెల్లారేలోగా వెతికి పట్టుకుని తీసుకురమ్మంటారా?” సైనికాధికారులు అడిగారు.
“వద్దు అతన్ని వెతికి తీసుకురావద్దు. ఒకవేళ తెచ్చినా అతడు మనకు మరోసారి టోకరా పుచ్చగలడు. అతడు మనకు బుద్ధి వచ్చేలా ప్రవర్తించాడు. మోసం చేయలేదు. ఎన్నో నిజాలు చెప్పి కొన్ని అబద్ధాలతో మనల్ని బుట్టలో వేసుకున్నాడు. అంతా వెళ్లి నిద్రపొండి. ఆ బీర్బల్ను వీలుంటే నేను చనిపోయేలోగా మరొకసారి చూడాలను కుంటున్నాను. అతడు నవ్వించే శక్తిగల వాడు. అతడి చర్యలు అతడు ఇక్కడ లేకపోయినా నవ్విస్తున్నాయి.” అన్నాడు హేమరాజ్.
నవ్వుతూ తన శబిరంలోకి వెళ్లిపోయాడు. తన తల్పం పై నిద్రపోతూ బీర్బల్ గురించి ఆలోచించాడు. అతడు వెళ్లిపోతూ తన చెవి వరకు పరిమితం చేసి చెప్పిన ఒక విషయం పదే పదే చెవిలో గింగురుమనసా గింది. శత్రువు చేతికి తను చిక్కినాచంపద్దు అని చెప్పాడు ఎందుకు? తోటి బ్రాహ్మణుడ నని కులాభిమానమా లేక తను నిజంగా ఓడిపోతాడా అని ఊహించాడా ? ఏది ఏమైనా నేను ఎవరినో తెలియకుండానే నా ప్రాణాన్ని కాపాడే ప్రయత్నం చేసాడు. కన్నులు బరువెక్కుతుంటే నిద్రలోకి జారుకున్నాడు.
🎭
*సశేషం*
꧁☆
*అక్బర్ - బీర్బల్ కధలు - 13*
🎭
రచన : యర్నాగుల సుధాకరరావు
ఒక సైనికుడు ఉదయాన్నే ఒక తాటాకు పత్రం తీసుకువచ్చాడు. అప్పటికే హేమరాజ్ లేచి జరగబోయే యుద్ధం కోసం ఆలోచించసాగాడు. వేకువజామున కొందరు యుద్ధనిపుణులు వచ్చి రకరకాలు గా యుద్ధ తంత్రాలు చెప్పి వెళ్లారు.
"ప్రభూ నేను సైన్యంలోంచి తప్పిపోయిన వాడిని. ఉదయాన్నే అడవిలో నుంచి వస్తుండగా పెద్ద ఏనుగుపై ఒక వ్యక్తి కనిపించి నాకు ఈ పత్రం తమకు ఇమ్మని చెప్పాడు. ఇదేదో పాటలా ఉంది" అని అందించాడు.
హేమరాజ్ తాటాకు పత్రం వైపు అదోలా చూసి..
“పాట రాసే కవి ఎవడూ అడవిలో తిరగడు. కనుక ఎవరు పంపారా అని ఆలోచించడం శుద్ధ దండుగ. రాసేది పంపేది గుండె ధైర్యం ఉన్న ఒక్క బీర్బల్ కే సాధ్యం అతడే ఇచ్చి ఉంటాడు. ఏదో రాసుంటాడు? నేను ఒక్కడినే చదువుకుని నవ్వుకునే దానికంటే ఇక్కడ మనతో వచ్చిన కవిచే చదివిస్తాను. అంతా వినండి. ఇప్పటికి యుద్ధరచనతో మన తలలు వేడెక్కాయి. కాసేపు బీర్బల్ రాసింది ఏమయినా మనల్ని నవ్విస్తుందని నేను నమ్ముతాను.” అని పకపకమని నవ్వి అక్కడ ఒక కవికి ఇచ్చి చదవమన్నాడు.
ఆ కవి పత్రం అందుకుని సన్నగా నవ్వి అందరిని చూసి పెద్దగా రాగాలాపనతో చదివాడు.
“బతికేందుకు దారిలేక చావబోతే, సైతాన్ తోటలో మామిడి పండ్లు దొరికే, వాటితో ప్రాణాలు నిలిచే”
ఢాం! ఢాం!!
“మామిడిలు తినీ తిని రోతపుట్టే, చావే మంచిదనిపించే.. ఖాను వచ్చే ఆశలు పెట్టే, బతకాలి అని పెద్ద కొలువు ఇచ్చే..”
ఢాం! ఢాం!!
“ఒంటినిండా నగా నట్రాలే, ఖరీదైన జీవితం దొరికే, ఆ నగానట్రలకు అక్బర్ కుంటి కోతికి ధర పలికే”
ఢాం! ఢాం!!
“అక్బర్ ధరను కోతి ఇచ్చినవాడికే, ముఖాన కొట్టే కోతి కథ నడిపినందుకే, మెచ్చి పెద్దకొలువు నిచ్చే”
ఢాం! ఢాం!!
“అక్బర్ ఇచ్చిన కొలువూ వదిలే, పెద్దలతో పరుగులు తీసే, పదవులే లేని పెద్దలు కొట్టుకునే, తల్పం వదులుకునే”
ఢాం! ఢాం!!
“చావు తప్పి కన్నులొట్టబోయే, పెద్దల్ని పట్టి ఇచ్చే, కాలం చెడిన గుర్రంతో కారడవుల పాలయ్యే..”
ఢాం! ఢాం!!
“అక్బర్ ఇచ్చిన నగలతో కర్ణకఠోర డప్పు వచ్చే, ముసలి గుర్రం విక్రమాదిత్యకు స్వారీ అయ్యే..
ఢాం! ఢాం!!
“బక్క గుర్రం, దరువులు డప్పు పోయే, జాతి ఏనుగు వచ్చే ఊరేగుతూ ఊరుపోయే..”
ఢాం! ఢాం!!
ఆ కవిత విని అంతా ముసిముసిగా నవ్వారు. హేమరాజ్ పడిపడి నవ్వాడు. "భలేగా రాసాడయ్యా! మనం జాతి ఏనుగునిచ్చి రేపోమాపో చావనున్న గుర్రాన్ని కొనుగోలు చేసాం. రాత్రి ఆ ముసలి గుర్రాన్ని అడవిలో వదిలేయమ న్నాను. అలా దాన్ని వదలకండి. మనతో తీసుకుపోదాం. ఢిల్లీ వెళ్లాక దానికి ప్రత్యేక శ్రద్ధతో సాకాలి. ఇదో గొప్ప గుర్రం. దానిలో మనం బీర్బల్ను చూసుకోవచ్చు.” అని అక్కడ మంత్రి సామంత దండనాయకుల కు ఛలోక్తిగా చెప్పా డు.
📖
పానిపట్టు వద్ద ఇరువర్గాల పోరు ఉధృతంగా సాగింది. ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిపోతారో తెలియని విధంగా పోరు భయంకరంగా సాగింది. అతి చిన్న వయస్సులో ఉన్న అక్బర్ ఏమాత్రం బెదరక కదనరంగాన కత్తులు ఝళిపించ సాగాడు. అతని చుట్టూ రక్షణ రేఖల్ని ఛేదించ వీలుకాని విధంగా ఏర్పాటు చేసాడు పాదుషా సంరక్షకుడు భైరంఖాన్. పోరు ఎంత భయంకరంగా సాగినా హేమరాజ్ లెఖకు మించిన సైన్యాన్ని అక్కడ మోహరించడం వలన చాలా ప్రమాదంలో పడింది. ఒక్కసారి కాల్బలం, గజబలం, ఒకే చోట చేరిపోవడంతో వారిలో కుమ్ములాట అయ్యింది. కట్టు తెగిన వరదలా ఒక అగాధంలోకి గజబలం దూసుకుపోయింది. ఒకటే హహాకారాలు. హేమరాజ్ సైన్యం ఎటుపోతున్నామో తెలి యని పరిస్థితిలో చిక్కుకుపోయింది. ఇదే అదను అనుకుని మొగలాయిలు వీరులు విజృంభన సాగించారు. దొరికినవాడిని దొరికినట్టే తెగనరికారు. అక్కడ శవాలు గుట్టలయ్యాయి. ఎట్టి పరిస్థితిల్లో హేమ రాజ్ ఓడాల్సింది లేదు. మొగలాయిలను తరిమి తరిమి కొట్టాల్సిందిపోయి అతడు ఊహించని విధంగా అతడి సైన్యం ఓటమి బాటలో పడింది. సాయంత్రానికి తీవ్రంగా శరాఘాతాలతో గాయపడిన హేమరాజ్ బందీ అయ్యాడు.
(రెండవ పానిపట్టు యుద్ధం గురించి ఇక్కడ ప్రస్తావన వచ్చినది కనుక అవసరం ఏ మేరకు ఉందో అంతవరకు మాత్రమే ఇచ్చాం. పూర్తి నిడివి ఇవ్వలేదు. కనుక గమనించగలరు) అతడిని సైన్యం మధ్య నుంచి తీసుకుపోవాలని పలువురి
ప్రయత్నాలు ఫలించలేదు. చివరికి అక్బర్ ముందు పడేసారు. అప్పటికి హేమరాజ్ చేష్టలుడిగి ఉన్నాడు. అతన్ని వధించవల సిందిగా సేనానులు వివిధ దళపతులు పట్టుబట్టారు. వారిచే అలా అన్పించింది
భైరంఖానే.
పట్టుమని పదహారునిండని అక్బర్ హేమరాజ్ ను చంపేయాలన్నంత కసిలో లేడు. కారాగారంలో వేయమన్నాడు. అతడిలో ఏ మూలనో జాలి కన్పించింది. "పాదుషావారు ఉపేక్షించకుండా దొరికిన శత్రువుని మీరే స్వయంగా చంపేయండి.” భైరంఖాన్ అక్బర్ చేతికి కత్తిని ఇచ్చి చెప్పాడు. అక్కడ ఉన్న వారంతా వాళ్ళని అయోమయంగా ఉత్కంఠగా చూసారు. అప్పుడే కన్నులు తెరిచాడు హేమరాజ్.
"శత్రువు హేమరాజ్ యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఏ క్షణమైనా చావచ్చు. అలా అతను చావకూడదు. కనుక పాదుషావారూ! వెంటనే ఈ విక్రమాదిత్య బిరుదాంకితుడైన హేమరాజ్ ను మీ చేతుల మీదుగా చంపేయండి" మరోసారి చెప్పాడు భైరంఖాన్.
అక్బరు ముఖంలో రంగులు మారాయి. కత్తి ఎత్తి పట్టుకున్నాడు.
"మాకు ఆదేశించండి మేమే ఈ హేమరాజ్ తలను బంతి ఆట ఆడగలం మీకెందుకు వృథా శ్రమ” అని కత్తులతో ముందుకు దూసుకువచ్చారు వివిధ దళాధిపతులు. వారి వైపు గుర్రుగా చూసాడు భైరంఖాన్.
"పాదుషావారే తన కత్తికి ఈ యుద్ధ పిపాసిని ఎర వేయాలి. ఆ రక్తంతో ఈ పానిపట్టు నేలను తర్పణం చేయాలి. మీరెవరూ వద్దు వెనక్కుపొండి.”
'భైరంఖాన్ సింహగర్జన చేసాడు.
దాంతో అక్బర్ కత్తి ఎత్తాడు. అతడిలో నరాలు పొంగాయి. ఎత్తిన కత్తి బలంగా సర్రున దించబోయాడు. అక్కడ అందరిలో నరాలు తెగిన ఉత్కంఠ.
📖
"ఆగు చిరంజీవి, అక్బర్ ! గెలుపు గుర్రం ఎక్కినందున నా రక్తంతో నీ ఖడ్గం తడవాలి. కానీ, నేను, నీవు ఈ క్షణం పోరాడుతూ లేము. అలా పోరుతుంటే నీ ఖడ్గానికి బలి కావడం వేరు. అది నీకు కీర్తినిస్తుంది. కానీ, ఇప్పుడు నేను నీ బందీని. నన్ను చంపాల్సింది నీవు కావు. నీ ఎంగిలి మెతుకులు తినేవారు. ఇక్కడ ఉన్నవారు ఎవరికైనా ఆదేశించి నన్ను చంపించు. బందీని, నిరాయుధుడను, శక్తి లేనివాడ్ని నన్ను చంపిన హీనత్వం నీకు వద్దు. నీవు చక్రవర్తివి. ధర్మా ధర్మములు గురించి నీవు ఇలాంటి సమయంలో ఆలోచించాలి. అప్రతిష్టకు పోకు. బ్రాహ్మణ హత్యాపాతకానికి భయపడి నీసంరక్షకుడు తాను చేయకుండా నీచే ఆ పాపం చేయిస్తున్నాడు. చచ్చే ముందు నిజాలే కదా ఎవరైనా చెప్పేది.” అని తీవ్ర గాయాల పాలయిన హేమరాజ్ గొంతు ఖంగుమంది. అక్కడ అంతా భైరంఖాన్ వైపు తీక్షణంగా చూసారు.
ఎవరికివారే లోలోపల అనుకున్నారు. 'నిజమే వీడు బ్రాహ్మణుడు. వీడిని చంపితే అదేదో పాపం ఏడు జన్మల వరకు నీడలా వెంటాడుతుందని వారి మతం చాటి చెప్తోంది. మనకెందుకు ఇలాంటి సాహసం అని మెల్లగా కరవాలాలు ఒరల్లోకి నెట్టేసారు.
"రేయ్, నీవా బ్రాహ్మణుడవు. కసాయివి నీవు కదనంలోకి ఉరికినా, ఊళ్ల మీద పడినా పాపం అని చూడకుండా ముసలి పిల్లా పిచుక అనకుండా నరుక్కుంటూ పోతావు. నీ ముందు ఆ చాణక్యుడు
కూడా సాటిరాడు. నీవు రాజకీయ కుతంత్రపు హైందవుడవు. ప్రభూ! ఎత్తిన కత్తిదించవద్దు. తెగ నరకండి." భైరంఖాన్ అక్బర్ ను ఉసిగొలిపాడు.
“పాదుషా భవిషత్ ఉన్నవాడివి. నీవు చంపకు. ఈ ఖాన్ చే నన్ను చంపించు. నీవు ఆదేశించినా ఈ భైరంఖాన్ చంపడు. పాతక భయం!" మృత్యు ఒడిలోకి ఒరిగి పోతూనే హేమరాజ్ చెప్పాడు.
"నీకెలా తెలుసు? మా సంరక్షకులు ఖాన్ బబా ఆంతర్యం తెలుసుకున్నట్టు చెప్తున్నావు.” అక్బర్ అనుమానంగా అడిగాడు.
"బీర్బల్ ఈతనిచే నన్ను చంపవద్దని చెప్పి ప్రమాణం చేయించుకున్నట్టు నాకు తెలుసు" చెప్పి ఒంటి నిండా గుచ్చుకున్న బాణాలు పెట్టే శరీరపు రంపపు కోతను తట్టుకోలేక విలవిలలాడిపోయి లుంగలు చుట్టుకుపోయాడు. అతడికి చనిపోవాలని ఆశగా ఉంది.
అక్బర్ తల తిప్పి ఖాన్ బాబా వైపు చూసాడు.
భైరంఖాన్ ఎలా బదులు ఇవ్వాలో తెలియని పరిస్థితిలో తలదించుకున్నాడు. అక్బర్ తన చుట్టూ ఉన్నవారి వైపు ఓరగా చూసాడు. అప్పటికే అంతా కత్తులు ఒరలో పెట్టుకున్నారు.
అక్బర్ హేమరాజ్ ను చూసి అదోలా నవ్వి
“నాకు ఎలాంటి పాపభయం లేదు. ఇక బందీని చంపడంలో నేను చిన్నబోయినది లేదు.” అని చెప్పి ముందుకు అడుగులు వేసాడు. సర్రున కత్తి దూసి హేమరాజ్ తలను నరికేసాడు.
(అక్బర్ గురించి ఎక్కువమంది చరిత్రకారులు సర్వమతాభిమాని అని, హిందువులపట్ల సహనం, గౌరవం కనబరిచాడు అని రాసారు. కొంతమేరకు హిందూ ద్వేషం అత్యంత క్రూరంగా కనబరిచే సన్నివేశాలు అక్బర్ జీవితంలో కూడా కోకొల్లలు జరిగాయి.)
ఆ తరువాత అక్బర్ సేనావాహిని ఢిల్లీ వైపు సాగిపోయేందుకు సిద్ధం అయ్యింది.
🎭
*సశేషం*
꧁
*
**అక్బర్ - బీర్బల్ కధలు -14*
🎭
రచన : యర్నాగుల సుధాకరరావు
ఆ తరువాత అక్బర్ సేనావాహిని ఢిల్లీ వైపు సాగిపోయేందుకు సిద్ధం అయ్యింది.
అక్బర్ పెంపుడు తల్లులు విజయాన్ని మూటకట్టుకుని వచ్చిన అక్బర్ పాదుషాని ముద్దులతో ముంచెత్తారు. వారిలో జీజీ అప్యాయంగా తీసుకెళ్ళి ఢిల్లీ సింహాసనం పై కూర్చుండబెట్టి తను చాలా బాగా తయారు చేసే పాయసాన్ని తినిపించింది. అప్పుడు అక్బర్ పై పితూరీలు చెప్పాడు భైరంఖాన్.
“ఇతడు వయస్సుకు మించిన పనులు చేస్తున్నాడు. యుద్ధంలో చిక్కిన వారిని యుద్ధ ఖైదీలుగా కాకుండా మన సైన్యంలో చేర్చుకునే స్థాయికి ఎదిగాడు. ఇంకా చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నాడు. "
అక్కడ ఉన్న మిగిలిన పెంపుడు తల్లులు అంతగా పట్టించుకోకపోయినా, పాయసం తినిపిస్తున్న జీజీ మండిపడింది. మహం అనే మరోకామె ఏకంగా ఒక అడుగు ముందుకు వేసి అక్బర్ చెవి రెండు చక్కర్లు తిప్పి వదిలింది. లేత చెవిడిప్ప కదిలి పోయింది. అక్బర్ పంటిబిగువులో నొప్పి భరించాడు. కన్నుల్లో నీళ్లు ఊరాయి.
అక్కడే ఉన్న రాజోద్యోగులు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అక్బర్ తలను నిమిరిన భైరంఖాన్..
"కొన్నాళ్లు ఓపికపడితే ఇక రాజకార్యాలతో తలమునకలు కావడమే. అప్పుడు కావాలనుకున్నా ఈ బాల్యం రాదు” అని రుసరుసలాడుకుని మరీ వెళ్లిపోయాడు భైరంఖాన్.
ఢిల్లీ తిరిగి అక్బర్ వశం అయ్యిందని తెలిసి ఏనుగు ఎక్కి బయలుదేరాడు బీర్బల్. అక్కడకి వారం తరువాత గమ్యం చేరుకున్నాడు. భైరంఖాన్ అతడికి ప్రత్యేక విడిది ఏర్పాటు చేసాడు. అప్పటికి యుద్ధంలో బాగా అలిసిపోయినందున విందులు వినోదాల్లో గడపాలనుకున్నాడు. బీర్బల్ విడిదిలో భైరంఖాన్ మద్యం సేవిస్తూ గడుపుతూ అక్కడ్నించే రాజకీయ పావులు కదపసాగాడు. అందులో ప్రధానం గా అక్బర్ కు చేరికగా ఉన్నవారిని ఏరివేయడం ప్రారంభించాడు. అక్బర్ కు కత్తి యుద్ధం నేర్పే కోట రక్షకుడైన టార్డీబేగ్ ను విచారణ జరిపి చంపించివేసాడు. టర్కీజాతి వారికి హుమాయూన్ హయాం లో ఇవ్వబడిన జాగీర్లను రద్దు చేసి వారి స్థానంలో తనకు అనుకూలంగాఉన్నవారిని నియమించాడు. పాపం టర్కీ వారిని నిరుపేదలుగా చేసి తరిమాడు.
హేమరాజ్ లోగడ ఢిల్లీని ఆక్రమించుకున్న ప్పుడు బందీలయినవారిని పునఃవిచారణ జరిపించి కొందర్ని వదిలి మరికొందరికి కోట రహస్యాలు వెల్లడించారనిహతమార్చాడు. వారిలో హుమాయూన్ అంటే పడిచచ్చే అశ్వికదళాధిపతి జలాలుద్దీన్ ఖాన్ను బహిరంగంగా కాకుండా రహస్యంగా ఉరి
తీయించాడు. అతడి కొడుకు ముబారకా ఖాన్ను నూరు కొరడా దెబ్బలు కొట్టించి నగరం నుంచి తరిమేసాడు. అక్బర్ అప్పటి వరకు నిర్వహించే గజదళ రక్షణ నుంచి తొలగించి తనే దానికి రక్షణాధికారి గా నియామకం చేసుకున్నాడు. భైరంఖాన్ ఏవిధంగా చూసుకున్నా ఢిల్లీలో చక్రం తిప్పడంలో వేగం పెంచాడు. అక్బర్ చాటున తనే చక్రవర్తిగా ఏలసాగాడు. నిర్ణయాలు అన్నీ చకచకా సాగించాడు.
ఒకనాటి రాత్రి వెండి వెన్నెల్లో ప్రశాంతంగా గడుపుతూ "ఏం బీర్బల్ నీవు ఇప్పుడు నాకు వినోదాన్ని పంచే చతుర సంభాషివి మాత్రమే కావు. ప్రియ నేస్తానివి. చూసావా ఎక్కడ చూసినా నా గురించే చర్చ. నాకు ఎదురు తిరిగిన వారిని ఒక్కడ్ని కూడా వదలకుండా ఒక్క శత్రు శేషం లేకుండా చేసుకున్నాను. అక్బర్ చిన్నపిల్లవాడిలా ఉండకుండా అప్పుడే తోక జాడించాడు. మొదలకంటా కోసివేసాను.” అని పకపక మని వ్యంగ్యంగా నవ్వాడు.
బీర్బల్ మౌనంగా విని నోరు విప్పాడు.
“ఖాన్ బాబా పాదుషా కావాలనుకుంటు న్నారా? అక్బర్ ను పదవీచ్యుతిని చేయాలనుకుంటున్నారా? మరి ఎందుకు ఈ శత్రు సంహారం? టార్డీబేగ్ ని చంపించా ల్సినంత తప్పు అతడేం చేసాడు. అతనిపై మీ వెనుక ఉన్న సైన్యంలో జాలి ఎక్కువగా కన్పిస్తోంది. అశ్వికదళాధిపతిని చంపించి అతడి కొడుకు ముబారక్ ను నూరు కొరడా దెబ్బలు కొట్టించి నగరం నుంచి గెంటించారని విన్నాను. అది అమానుషం గానే అనిపిస్తోంది. ఆ ముబారకా ఖాన్ పఠాన్ జాతికి చెందినవాడు. వాడు పగతో రెచ్చిపోయాడని విన్నాను. పఠాన్లు అంత తొందరగా ఏదీ మరిచిపోరు. వాడి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే”
బీర్బల్ మాటలకు అంతవరకు ఉత్సాహం గా ఉన్న ఖాన్ ఆశ్చర్యంగా విన్నాడు.
“ఏం మాట్లాడుతున్నావు? నా ఉన్నతి నీకు అక్కర్లేదా? నాకు వ్యతిరేకంగా పనిచేస్తు న్నావా? టార్డీ బేగ్ న్ని లోగడ ఢిల్లీ కోటకు రక్షకుడిగా చేసాను. వాడు శృతిమించిన తెలివి ప్రదర్శించి కోటను వదలి వెలుపల కాచుకుని దండెత్తి వస్తున్న హేమరాజ్ను
ఎదుర్కోవాలనుకోవడం ఏమేరకు న్యాయం? సరే అది గతం. అక్బర్ ను అడుగడుగునా వెనకేసుకురావడం. నా మాటను ఖాతరు చేయకపోవడం నేను
భరించలేకనే అక్బర్ తో సహ అందరి పదవుల్ని ఊడగొట్టి మూలపెట్టాను. వాడిని చంపితేగాని నాకు శాంతి లేదని పించింది కనుకనే టార్డీబేగ్ న్ను అంతం చేసాను. అశ్విక దళాధిపతిని చంపి వాడి కొడుకు తిరుగుబాటును వెంటనే అణిచి వేసి కొరడా దెబ్బలతో ఒళ్లు హూనం చేయించాను.
యువకుడు పైగా నేను నమ్ముకునే షియా మతాన్ని అనుకరించేవాడు కనుక కొరడా దెబ్బలకు మాత్రమే పరిమితం చేసి వది లాను.” తను చేసింది అన్ని విధాల న్యాయమైంది అని వెనుకేసుకుని మరీ చెప్పాడు.
బీర్బల్ నవ్వాడు.
"ఇదంతా రాజకీయమే. మీరు చేసిన ప్రతీది తప్పిదమే. కోటలో మీకుగా మీరు మీ స్థానాన్ని కదిలించుకున్నట్లే అయ్యింది. అక్బరు గజదళం నుంచి తప్పించడం, టర్కీవారి గెంటివేత కొన్ని హత్యలు
ఇవన్నీ దిగజారుడుతనానికి పరాకాష్ఠగా కన్పిస్తున్నాయి. నామాట మీద ఏమాత్రం గౌరవం ఉన్నా అక్బర్ పాదుషా మనస్సు రంజింపచేయాలి. నగర ప్రజల మనస్సులో తిష్టవేసేందుకు మరిన్ని దుర్గాలను జయించి మీ స్థానాన్ని సుస్థిరంచేసుకోండి.” చెప్పి ఆ గదిలోంచి వెళ్లిపోయాడు.
భైరంఖాన్ కు ఒక్కసారి తల గిర్రున తిరిగినట్లు అయ్యింది. బీర్బల్ చెప్పినది నూటికి నూరుపాళ్లు నిజం అని మనస్సు లో అనుకున్నాడు. వేకువజాము వరకు ఆలోచించాడు. 4ఏళ్లుపాటు నిర్విరామం గా యుద్ధాలు చేసాడు. గ్వాలియర్, రణతంబోర్, ఘక్కర్ ప్రాంతాలను జయించి అక్బర్ పాదుషా ముందు పెట్టాడు. భైరంఖాన్ కు అన్నివిధాలు రాజపుత్రులు సహకరించారు.
ఎన్ని యుద్ధాలు చేసినా, ఎంతగా రాజ్య విస్తరణ చేసినా ఖాన్ బాబా పట్ల అక్బర్ వికలమనస్కుడైయ్యాడు. బీర్బల్ గురించి ఎన్నిమార్లు అడిగినా తన వద్ద లేడని ఆ పానిపట్టు యుద్ధంనాడు తను చూడడమే నని పదేపదే అబద్ధాలు చెప్పడం అక్బర్ కు ఎంత మాత్రం నచ్చలేదు.
ఎంతకాదనుకున్నా తనకు సంరక్షకుడని ఇంతకాలం మిన్నకున్నాడు. లేకుంటే బీర్బల్ ను ఉన్నపళంగా భైరంఖాన్ నుంచి తన వద్దకు రప్పించుకోగలడు. వేగులవారి నుంచి ఎప్పటికప్పుడు బీర్బల్ గురించి అతడు ఖాన్ బాబాతో ముచ్చటించే చతుర సంభాషణను పదేపదే వింటూనే ఉన్నాడు. అతను ఖాన్ బాబాను ఎలా నమ్మగలడు. బీర్బల్ ని తనకు అప్పగించ మంటే ఎందుకు కాదంటున్నాడు. బీర్బల్ వంటివాడితో తాను ఎంతగా ఆనందించే వాడు. ఎందుకు ఇలా చేస్తున్నాడు. ఏది ఏమయినా ఖాన్ బాబా తోక తను కోయ కపోతే మున్ముందు చాలా ప్రమాదం అని మాత్రం మనస్సులో అనుకున్నాడు.
🎭
*సశేషం*
꧁☆•
అక్బర్ - బీర్బల్ కధలు -15*
🎭
రచన : యర్నాగుల సుధాకరరావు
అక్బర్ ఏదో సందర్భంలో బీర్బల్ గురించి అడుగుచున్నందున భైరంఖాన్ కి తల తిరిగినట్టు అయ్యేది. అందుకే బీర్బల్ ని ఢీల్లీ నుంచి ఆగ్రా కి రహస్యంగా పంపించే సేవాడు. మళ్లీ అక్బర్ "ఏమిటి ఖాన్ బాబా ఆరోజు మనందర్ని ఆశ్చర్చపరిచిన చతురుడు బీ ర్బల్ కన్పించాడా..? ఈ మధ్య ఆగ్రాలో ఉన్నట్లుగా చాలామంది చెప్పుకోగా విన్నాను.” అని అడగడంతో తిరిగి రహస్యంగా బీర్బల్ ను ఢిల్లీకి తీసుకురావడం జరిగేది. ఇలా కనీసం యాభైసార్లయినా ఆగ్రా ఢిల్లీల మధ్య బీర్బల్ రహస్యంగా తిరిగి ఉంటాడు. బీర్బల్ కానీ భైరంఖాన్ కానీ ఏనాడు విసుక్కోలేదు.
బీర్బల్ ఒకశక్తి. చతురుడే కాడు రాజకీయ పరిజ్ఞానంలో దిట్ట. ఈతడు అక్బర్ ని కలుసుకుంటే ప్రపంచమే జయించగలుగు తాడు. కనుక ఏనాడు కలవనీయరాదు. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే బీర్బల్ ను హతమార్చడమే తప్ప, అప్పగించడం కల్ల. ఇదే భైరంఖాన్ మస్తిష్కంలో పాతుకు పోయి న తీవ్రమైన దృఢ నిర్ణయం.
మరోవైపు పెంపుడు తల్లులు చెలరేగి పోయారు. జీ జీ ఆమె భర్త షాముద్దీన్ ను ముఖ్యమంత్రిగా నియమింపచేసుకుంది. మహంత కుమారుడు ఆదాంఖాన్ ను సేనానిగా చేసుకుంది. ఈ నియామకాల
వెనుక అక్బర్ ప్రధానపాత్ర వహించాడు. ఖాన్ బాబా కు తెలియకుండానే జరిగిపో యాయి. పైగా ఖాన్ బాబా పై విపరీతంగా చాడీలు చెప్పే పనిలో మహం నిర్విరామం గా పనిచేసేది. ఆమె చేతి మీదుగానే
మూడు పూటలు అక్బర్ తినేది. అందుకే ఆమెకు మంచి అవకాశం లభించింది. ముద్ద ముద్దకు చాడీలు నమ్మేట్టు చెప్పేది. అందులో ఆమె దిట్ట.
బైరంఖాన్ 1560 సెప్టెంబర్ నెలంతా ఆగ్రాలో ఉండగా అక్బర్ అతనికి విధుల నుండి సత్వరమే తప్పుకోవల్సిందిగా ఆదేశాలు పంపించాడు. దీని వెనుక పెంపుడు తల్లి మహం ఉంది. భైరంఖాన్ క్షణకాలం నమ్మలేకపోయినా వెంటనే తోక తొక్కిన పాములా రెచ్చిపోయి తన పరివారంతో తిరుగుబాటు చేసాడు. బీర్బల్ ని అడిగాడు. “ఇప్పుడేం చేస్తే బావుంటుంది?" అని.
“చూసావా అక్బర్ బాలనాయకత్వం వాడి పెంపుడు తల్లులు ఆడపెత్తనాలు. నన్నే ఎదిరించే దిశలోకి వచ్చారు. వారిని అసలు వదలను నేను ఏమిటో చూపిస్తాను. ఇంత వరకు నేను హుమాయూను ఇచ్చిన
మాటకు కట్టుబడ్డాను. ఇప్పుడా కట్లు వాళ్లే తెంచేసుకున్నారు. ఇప్పుడు నేను వేటాడక తప్పదు. అని చిందులు వేసాడు.
“ఖాన్ బాబా నామాట మన్నించి కోపాన్ని దిగమింగుకోండి. అక్బర్ పై తిరుగుబాటు ను మీరు ఈ దశలో చేయలేరు. మీకు అన్ని వైపుల నుంచి సహకారం కావాలి. అందుకు మీకు కీలకపదవి అవసరం. అది ఇప్పుడు లేదు. మీకు ఎవరూసాయపడరు. మీ వెనుక ఉన్న బలగాలు దళాలు ఇప్పుడు పనిచేయవు. ఆ పైన మీ ఇష్టం.”
“నీవు పదిమందిని పకాలున నవ్వించగల వే గాని కసిక్కున పొడిచే ఆలోచనలకు శ్రీకారం చుట్టలేవు. నిన్ను అడగడం దండుగ. నావెనుక ఉన్నవారు కావాలంటే ప్రాణాలు అర్పించగలరు" అని వాదించి వయోభారం లెక్కచేయకుండా కత్తి పట్టుకుని దిగిపోయాడు.
కానీ, వెనుక ఉన్నవారు సమర సన్నాహం తో కదం తొక్కినా, కొంతసేపటికి వారి మతపిచ్చి అందుకు సహకరించలేదు. సున్నీ మతస్థులు ఎక్కువగా ఉన్నందున షియామతాభిమాని అయిన భైరంఖాన్ పట్ల విరక్తిచెంది కరవాలాలు ఒరలో దోపుకుని తాము తిరుగుబాటు చేయలేం, పాదుషా వారిని ధిక్కరించలేం అని వెనుదిరిగిపోయారు. ఏమీచేయలేని స్థితి లో మిగిలాడు బైరంఖాన్. ఎలాంటి మంది మార్బలం లేకుండా ఢిల్లీకి తిరిగి వచ్చాడు. అతడికి నిత్యం స్వాగతసత్కారాలు ఉండేవి. ఇప్పుడలాంటివి ఏవీ లేకుండా ఒంటరిగా కోటలోకి ప్రవేశించాడు. కొందరు సైనికులు నవ్వులు లీలగా విన్పిస్తుంటే వెను దిరిగి చూడకుండా తిన్నగా అక్బర్ పాదుషావారి దర్శనంకు వెళ్లాడు. పాదుషా అనుమతి లభించలేదు. వారం పడిగాపుల తరువాత గాని కలవలేకపోయాడు.
పాదుషా ఆశీనుడై ఉండగా ఇరువైపులా ఇద్దరు పెంపుడు తల్లులు కూర్చుని హేయంగా భైరంఖాన్ వైపు చూడసాగారు.
"రండి ఖాన్ బాబా మీరు మాకు చేసిన సేవలు చాలా గొప్పవి.” అని.. అక్బర్ పాదుషా చెప్తుండగా,
“బేటా ఎందుకు ఉపోద్ఘాతం. దోషుల విషయంలో నాన్చరాదు. ఈతడు నీ సంరక్షకుడే. నీ గురువు టార్డీబేగ్ను ఈతడు క్షమించి వదిలేసాడా? నేరం ఎవరు చేసినా శిక్షార్హులేకదా! కనుక నేరుగా విషయానికి వచ్చేయ్" అని మహం హుకుంజారీ చేసింది.
ఖాన్ బాబా ఆమె మాటలకు హతాశుడయ్యాడు.
ఆ వెంటనే జీజీ భర్త ప్రధానమంత్రి ఖాన్ బాబా చేసిన నిర్వాకాలు ఏకరువుపెట్టాడు.
"ఇతనిని కఠినంగా శిక్షించాలి. పాదుషా వారు నేరుగా శిక్ష వేయగలిగితే సరిపోతుంది. లేకుంటే మేమే ఆ శిక్షను నిర్ణయించగలం.” అని అక్బర్ కి చెప్పాడు.
ఖాన్ బాబా తలెత్తి అక్కడున్న వారిని చూసి సన్నగా నవ్వాడు. ఆ చూపులో, చిరునవ్వులో నిన్నటి వరకు నా కనుసన్న ల్లో బతికే మీరా నాకు శిక్షవిధించేది? ఏది ఏమయినా రాజలు ప్రాపకం ఎప్పటికైనా ప్రాణాల మీదకు వస్తుంది అంటే ఇదే కదా!” అనుకుని తలదించుకున్నాడు. అక్బర్ లేచి అల్లంత దూరంలో ఉన్న భైరంఖాన్ దగ్గరగా వచ్చి..
“ఖాన్ బాబా మన్నించండి. మీ సేవలు అమోఘం. మీరే నాకీ సామ్రాజ్యాన్ని విస్తరించి మరీ కట్టబెట్టారు. ఊహలు పోసుకోని నన్ను చక్రవర్తిని చేసారు. ఇంత వరకు నా మేలును కోరారు. మీకు విశ్రాంతి నివ్వాలని ఇలా పిలిపించాను. కల్పి, చందేరిలకి గవర్నర్ గా నియమించగలను. హాయిగా శేషజీవితం మీకు ఇష్టమొచ్చిన రీతిని గడపండి. యుద్ధాలకు మీరు మరి వెళ్లనక్కర్లేదు. మాకు ఆదేశించండి మేము ఆ పని చేసుకుని మీరు ఇంతవరకు విస్తరించిన ఈ సామ్రాజ్యాన్ని మరింత పెంచగలం" అని చేతులు పట్టుకున్నాడు..
అంతవరకు త్రాచులా బుసలుకొట్టిన భైరంఖాన్ మంచులా కరిగిపోయాడు. గట్టిగా అక్బర్ ను వాటేసుకున్నాడు.
"బేటా నా మీద నీకు జాలి ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నీ స్థానం లో ఎవరున్నా నా తిరుగుబాటును మన్నించలేరు. నన్ను చిత్రవధ చేస్తారు. నీవన్నట్టు నాకు విశ్రాంతి అవసరం. పదవుల పైన ఆశలేదు. యుద్ధాలు చేసి బాగా అలసిపోయాను. నేను మక్కా వెళ్లాలని అనుకుంటున్నాను. అంతకు మించి ఏ ఆశలేనివాడ్ని. నా శేషజీవితం అక్కడే గడిపేయాలనుకుంటున్నాను. నా కోరిక తీర్చు". అన్నాడు.
మహం వెంటనే స్పందించి..
“బేటా ఈతని కోరిక వెనుక పెద్ద ఎత్తుగడ ఉంది. కనుక నిరాకరించాల్సిందే. ఈతడు ఇక్కణ్నించి బయటికి వెళ్లాడంటే మన శత్రువులతో చేరి మన మీదకు దండెత్తి వస్తాడు. ఈ అవకాశాన్ని చేజార్చుకోవద్దు. వెంటనే కారాగారంలోకి నెట్టేసి శిక్షించు" అని అరిచి చెప్పింది. ఆమె మాటకు అక్కడున్న పలువురు రాజోద్యోగులు వంతపాడారు.
"ఖాన్ బాబా విషయంలో ఎవరేమి చెప్పినా వినదలుచుకోలేదు. నాకు మూడేళ్లప్పుడు నా తండ్రి శత్రువులతో యుద్ధం చేస్తున్నప్పు డు నా పినతం డ్రులు ఇరుపక్షాలు పోరు మధ్య కోట గోడ మీద కావాలని నన్ను పెట్టిపోయారు. అప్పుడు కొన్నివందల తూటాలు నన్ను రాచుకుంటూపోయాయి. ఆ తరుణంలో యుద్ధం చేస్తున్న నా తండ్రి నన్ను చూసి కాళ్లు చేతులు ఆడని పరిస్థితి లో నిశ్చేష్టుడయ్యాడు. అప్పుడు ఈ భైరాంఖాన్ తన ప్రాణాలు పణంగా పెట్టి ఇరుపక్షాల మధ్య గోడ మీద తుపాకులకు, ఫిరంగులకు ఎరగా ఉన్న నన్ను కాపాడి తీసుకువచ్చాడు. ఈతని భుజంలో పెద్ద తుపాకి గాయం అయ్యింది. ధారగా రక్తం స్రవిస్తుంటే నన్ను ఏ తుపాకి గుళ్లకు బలి కాకుండా కాపాడిన ఈ మహనీయుడ్ని ఎలా శిక్షించగలను. నాకు ఎవరూ ఏమి చెప్పవద్దు. నాయీ సంరక్షకుడ్ని నేను ఏవిధంగా చూసుకోవాలో నాకు తెలుసు. ఎలాంటి వారికైనా క్షణికమైన కోపాలు తాపాలు సహ జం. కనుక ఖాన్ బాబా తిరుగుబాటును నేను గుర్తించడమేలేదు.”
"బేటా, నీ చుట్టు ఏదో వలయం అల్లుకున్న ట్టుగా నేను అనుకుంటున్నాను. జాగ్రత్త! నీ తండ్రి నేను ఎంతో కష్టపడి సాధించిన రాజ్యలక్ష్మిని కాపాడు. నీవు ఎప్పుడు అడుగుతుంటావే బీర్బల్ గురించి ఈ రోజు అతన్ని నీకు కానుకగా ఇవ్వగలను. అతడు నా వద్దే ఉన్నాడు. అతడి విషయం లో నేను నీతో అబద్దాలు చెప్పాను. ఎందుకో అతడిని వదులుకోలేకపోయాను. అతడు మాటలు, చేతలు, కదలికలు అన్నీ బావుంటాయి. నీకు ఏదోరోజు ఏమి ఇవ్వ కుండా వెళ్లిపోతాను అని అనుకున్నాను. కానీ, నీకు ఇవ్వగలిగినది, నీవు చాలా కాలంగా కోరుకుంటున్న వెలలేని కానుక బీర్బల్నే ఇస్తున్నాను” అని చెప్పితలదించు కుని వెళ్లిపోయాడు.
🎭
*సశేషం*
꧁☆
అక్బర్ - బీర్బల్ కధలు -16*
🎭
రచన : యర్నాగుల సుధాకరరావు
లంకంత కొంపలో ఒక్క చమురు దీపం వెలుగుతోంది.
నిశ్శబ్ధం అక్కడ రాజ్యమేలుతోంది. చిన్నబోయిన ముఖంతో భైరంఖాన్ చీకటిలో నిలబడి ఉన్నాడు.
"బీర్బల్ నేను నిన్ను అక్బర్ పాదుషాకు సమర్పించుకున్నాను. ఎందుకో తెలుసా?" శూన్యంలోకి చూస్తూ అడిగాడు.
"ఏముంది మీకు అన్ని పదవులు పోయాయి. ఆ లోచనలేని మీ ప్రవర్తన ఒంటరిని చేసింది. నన్ను అప్పగించకుండా మీరు మీతో తీసుకుపోవడం కల్ల. మక్కా యాత్రకు అక్బర్ మిమ్మల్ని ఒక్కడ్ని పంప డు. పూర్వపరిచయాలతో మీరు కొందరు శత్రువుల్ని కూ డగడతారని మీవెంట నమ్మకమైనవారిని కనీసం వందమందికి పైగా రాజభక్తులను పంపుతాడు. కనుక చేసేదిలేక నన్ను అప్పగిస్తున్నారు. ఎట్టి పరి స్థితిలో నన్ను వదులుకోరు. అలా వదులు కోవల్సి వస్తే నన్ను చంపిపారేయాల్సిన ఆదేశాలు లోగడ మీ మనుష్యులకు మీరు ఇవ్వడం జరిగింది. నేను నిజం చెప్పానా లేక ఇది నా ఊహ మాత్రమేనా ?"
భైరంఖాన్ అంతులేని ఆశ్చర్యానికి గురయ్యాడు. తన మనస్సులో మాటను ఎలా ఈ బీర్బల్ చెప్పగలిగాడు.
సరిగ్గా అప్పుడే వచ్చారు సైనికులు, వారి వెనుక ఒక పల్లకి ఉంది. దాన్ని చూడగానే భైరంఖాన్ కి కోపం వచ్చింది. తమాయించు కోక తప్పలేదు. శూన్యంలోకి చూస్తూ నిలబడ్డాడు.
"ఖాన్ బాబా! పాదుషావారు ఏమనగా తమ వద్ద ఉన్న బీర్బల్ అనే హాస్య చక్రవర్తిని మా వెంట పంపించాల్సిందిగా మీరు పాదుషావారికి ఇచ్చిన మాట నిలబెట్టుకోవల్సిందిగా తమకు తెలియ పరచమన్నారు.” వినమ్రంగా చెప్పాడు ఒక సైనికుడు.
"ఇదిగో ఈతడే ఆ బీర్బల్, తీసుకుపొండి. వారం క్రితం నాకు అధికారాలు పోయాయి. అప్పుడు నేను ఇంతగా బాధపడలేదు. నేడు నా ఆనందాన్ని బీర్బల్ రూపంలో తీసుకుపోతున్నారా? తీసుకుపొండి” అని కసిరి పొమ్మన్నాడు.
“జయము జయము బీర్బల్ హాస్య చక్రవర్తీ! విచ్చే యుడు. తమవంటి పెద్దలని పాదుషావారి వద్దకు తీసుకుపోవడం మా పూర్వజన్మ సుకృతం”. అని వంగి వంగి సలాములు చేసారు.
“రోజూ ఇలానే మీరు స్తోత్రపాఠాలు ఖాన్ బాబా గురించి చేసేవారు. తమవంటి వారిని తీసుకుపోవడం పూర్వజన్మ సుకృతం అనేవారు. ఇప్పుడు నా వంతు అయ్యింది. ఆయనకు పదవితో బాటు పల్లకీ లేదు, పరిచారికలు లేరు, స్తోత్రాలు లేవు. అందుకే పెద్దలంటారు రాజు మంచి తనం అల్లుడి మంచితనం ఒక్కటేనని. రాజుకు ఎప్పుడు కోపం వస్తుందో తెలియదు. సరే, మీరంతా పల్లకిని మోసుకుపోవడానికి వచ్చారు. అటు తిరిగి నిలబడండి. నేను వచ్చి పల్లకీ ఎక్కగానే మీరు మోసుకుపొండి. దారిలో ఎవరు ఏమీ మాటలాడరాదు.”
"మీ ఆజ్ఞను పాటిస్తాం. మీరు పల్లకీలో కూర్చోండి. ఆ నల్ల మేఘం ఆ చందమామ ను మింగేయగానే వచ్చి తీసుకుపోతాం.” సైనికులు ఏక కంఠంతో చెప్పి ఆకాశంలోకి చూసుకుంటూ కొంచెం దూరంగా చీకటిలో కూర్చున్నారు.
ఖాన్ బాబా దుఃఖంతో బీర్బల్ ని చూడ సాగాడు. బీర్బల్ పెద్ద తలగడ దిండుని వస్త్రంలో చుట్టి దానిపై అరబ్బీలో రాసిన పత్రం అతికించి పల్లకీలో ఒకమూల పెట్టి వచ్చేసాడు. ఖాన్ బాబా అయోమయంగా చూడసాగాడు. చూస్తుండగానే చందమా మను నింగిలో మబ్బుతునక మింగేసింది.
అంతవరకు ఆకాశంలోకి చూసుకుని నిలబడిన సైనికులు వచ్చి అంతా కలిపి పల్లకీని లేవనెత్తి 'గున్ గునా ....గున్ గునా........... గున్నరే ...... గున్ గు నా.... ' అని పల్లకి పాట (ఇప్పటికీ ఉత్తరాదిలో
ప్రముఖంగా విన్పించే పాట) ఆలపిస్తూ తీసుకుపోయారు.
“అదేమిటి నువ్వు పోలేదు. నీ ధైర్యం నిన్ను ఇంతగా తెగించమందా.. ఆ అక్బర్ చదువుసంధ్యలు లేనివాడు. నీవేదో రాసావు అతడు ఎవరిచేతనో చదివించు కుని నిప్పులు చెరుగుతాడు. నా మాట
విను.. ఆ పల్లకీ కంటే ముందే నీవు ఆ గుర్రంపై దూసుకు వెళ్లిపో !” భైరంఖాన్ హితవు చెప్పాడు.
“ఖాన్ బాబా చూస్తూ ఉండండి. రేపు ఉదయానికి మళ్లీ అక్బర్ పాదుషా నుంచి వర్తమానం వస్తుంది. ఈ రాత్రి మీతో చాలాసేపు ముచ్చటించిగాని ఆ కొలువుకు పోను. నా ప్రాణదాతవు.”
"బీర్బల్ నీకు ఈ మొండివానిపై ఇంత ప్రేమ ఉన్నందుకు నేను చాలా సిగ్గుపడ్తున్నాను. నిన్ను నేను పాదుషాకు అప్పగించాల్సి వస్తే ప్రాణాలతో సమర్పించకుండా చంపి శవంగా ఇవ్వాలనుకున్నాను. నీ చతురత నాకు మాత్రమే పరిమతం కావాలనుకున్నా ను. విధి నా నుంచి నిన్ను దూరం చేసింది. నా వద్ద ఏ భయం లేకుండా ఉన్నావంటే నేను నమ్మలేకపోతున్నాను. నేను నీ విషయంలో చాలా కఠోరంగా ఉన్నానని తెలిసి ఈరాత్రి నాతో ఉండాలనుకున్న నీవు చతురతగల వ్యక్తివే కాదు మహాశక్తి వి”. కన్నుల్లో నీటిపొర కదలాడగా చెప్పాడు భైరంఖాన్.
పల్లకీ దించారు. అక్బర్ అతని పెంపుడు తల్లులు ముచ్చటగా చూసారు. "బేటా నీవు ఇంతగా చెప్పావంటే బీర్బల్ చాలా గొప్పవాడై ఉంటాడు. అందుకే మాకు చూడాలని ఉంది.” అని కన్నులు పెద్దవి చేసి చూడసాగారు. పల్లకీలోంచి ఎంతకీ దిగనందున అక్బర్ పెద్దగా నవ్వి "హాస్య చక్రవర్తీ బీర్బల్ కి ఇదే మా స్వాగతం." అని పిలిచాడు.
పల్లకీలోంచి ఎలాంటి కదలికలు లేనందున వంగి చూసాడు. లోపల పెద్ద తలగడ దిండు ఉంది. దానికి ఒక పత్రం రాసి ఉంది. వెంటనే అక్కడే ఉన్న ప్రధాన మంత్రిచే చదివించాడు.
అక్బర్ పాదుషావారికి,
దీర్ఘాయుష్మాన్ భవా! అని దీవించి రాసుకున్న లేఖా విన్నపం. ఉత్త బీర్బల్ అయిన నన్ను మా పోషకుడు ఖాన్ బాబా తమరు పంపించమన్నారని ఆత్రుతతో మీ సన్నిధికి వెళ్లమన్నారు. నేను సిద్ధం
అయ్యాను. కానీ మీ సైనికులు బీర్బల్ అనే హాస్య చక్రవర్తిని పంపమన్నారు అని చెప్పారు. నేను చెప్పే మాటలకు ఖాన్ బాబా కడుపుబ్బ నవ్వేవారు. ఆయన హాస్య ప్రియుడు. నిత్యం ఎందరో హాస్య గాళ్లను తన విడిదిలోకి రప్పించుకుని వారి మాటలు, నవ్వించేవిగా ఉంటే వారిపంట పండినట్టే. పదేపదే చెప్పించుకుని ఆరాత్రి వారికి హాస్యచక్రవర్తి అని బిరుదునిచ్చి ఘనంగా సన్మానించేవారు. అలాగే రాత్రి వారికి తన విడిదిలో ప్రత్యేకమైన తల్పంపై నిద్రపోనిచ్చేవాడు. ఈ తలగడ దిండు ఎందరో హాస్య చక్రవర్తులకి నిద్రపోతున్న ప్పుడు చోటునిచ్చింది. చాలామందికి లభించిన హాస్యచక్రవర్తి బిరుదు నాకు మాత్రమే దక్కలేదు. కనుక దీన్ని తమ పరిశీలనార్ధం పంపుతున్నాను. మీరు కోరిన హాస్యచక్రవర్తులకు చోటునిచ్చిన ఈ తలగడదిండుపై తలపెట్టుకుని నిద్రపోని నేను ఈరాత్రి ఎలాగైనా ఖాన్ బాబా వారిని మెప్పించి హాస్యచక్రవర్తి బిరుదునుపొంది మీరు కోరిన విధంగా హాస్యచక్రవర్తిగా తమ సన్నిధికి రాగలను. అంతవరకు సెలవు.
ఇట్లు ఉత్త బీర్బల్.
ఎంత కండకావరం! ఈ చెత్త లేఖ రాసి, నాలుగు మాటలు చెప్పి పొట్టనింపుకునే వికటగాళ్లు తల పెట్టుకుని నిద్రించే తలగడ దిండు పంపడమా? వాణ్ణి ఉన్నపళంగా బంధించి ఈడ్చుకురండి.” అని కోపంగా ఆదేశించాడు లేఖ చదివిన ప్రధాన మంత్రి.
"ఆగండి ఇందులో ఏదో మర్మం ఉండి ఉంటుంది. ఈ రాత్రికి అతన్ని వదిలేద్దాం. మనం తీసుకువచ్చేది మనల్ని ఆనందంలో ముంచెత్తి పరిసరాలను మరిపించేవాడ్ని కదా, బాధించితే అతను ఎలా ఆనందాన్ని మనకు పంచి ఇస్తాడు. అతడి దుఃఖం మనం చూడలేక చావాలి.” అని అక్బర్ చెప్పి ప్రధానమంత్రిని నిలువరించాడు.
పెంపుడు తల్లులు కూడా కోపంతో ఊగిపోయారు. “బిడ్డ అక్బర్ ఏదో ముచ్చటపడ్తుంటే ఆ బీర్బలు కోతిలా కొమ్మల్లో నక్కి దాక్కుంటున్నాడు. ఆ రాజద్రోహి ఖాన్ బాబా ఏదో నూరిపోసి ఉంటాడు." అని పండ్లు పటపట కొరికారు.
అక్కడే ఉండి చోద్యం చూస్తూన్న ఒక అరబ్బీ కవి నోరు విప్పాడు.
“మన పాదుషావారు అన్నట్టు ఆ బీర్బల్ పంపించింది పెద్ద అర్ధంతో కూడినది. ఆయన తలగడ దిండు పంపినది ఎందుకో తెలుసా? పాదుషా ఆదేశాన్ని మన్నించి ఖాన్ బాబా వెంటనే బీర్బల్ ని వెళ్లమన్నా డు. అయితే మన సైనికులు హాస్యచక్రవర్తి బీర్బల్ కావాలి అని అడిగారు. ఇక్కడే బీర్బల్ మెలిపెట్టి హాస్యగాళ్లు నిద్దురపోయే తలగడ దిండును మాత్రమే పంపిస్తూ లేఖ కూడా రాసాడు. తాను ఉత్త బీర్బల్ అని , హాస్యచక్రవర్తి అనే బిరుదును ఇవ్వడానికి వాస్తవానికి ఖాన్ బాబాకు ఉన్న హోదా ఏమిటి? లోగడ ఖాన్ బాబా తానో చక్రవర్తిలా ఇలాంటి పదవులు ఇవ్వడం సత్కారాలు చేయడం చేసేవాడు. సుతిమెత్తగా అతన్ని పాదుషాముందు ఎగతాళి చేస్తూ తలగడ దిండును పంపాడు బీర్బల్. ఎలాగూ ఖాన్ బాబా మక్కాకు రేపే బయలుదేరుతున్నాడు. కనుక చివరిరాత్రి ఆయన వద్దనే ఉండిపోయాడు" అని నిగూఢంగా తెలియపరిచాడు.
"ఈ రాత్రంతా ఖాన్ బాబాతో తను నిద్ర పోకుండా పిచ్చాపాటి మాట్లాడుకుంటాడు. హాస్యచక్రవర్తి బిరుదును తనకు కట్టబెట్ట మని కోరుతాడు. ఖాన్ బాబా అది ఎట్టి పరిస్థితిలో ఇవ్వలేడు. ఎందుకంటే బీర్బల్ ఇక ఉండేది పాదుషావారి వద్ద కనుక ఖాన్ బాబా ఇవ్వలేడు." వివరించి చెప్పాడు.
అక్బర్ పెద్దగా నవ్వాడు.
"శెహభాష్ బీర్బల్ నీవు చతురుడవే. నేను ఊహించినదానికంటే ఎక్కువగానే ఉన్నావు." పెద్దగా పొగిడి చప్పట్లు చరిచాడు. పెంపుడు తల్లులు ముఖాలు వివర్ణమైయ్యాయి. 'ఇదేమిటి? ఆ భైరంఖాన్ పోయాడంటే ఎవడీ బీర్బల్ తెగ రెచ్చిపోతున్నాడు.' అని మనస్సులో అనుకున్నారు.
📖
వేకువజాము వరకు బీర్బల్, ఖాన్ బాబా ఎదురెదురుగా కూర్చుని హాయిగా మాట్లాడుకున్నారు. పగలబడి నవ్వుకున్నా రు. చివరగా ఖాన్ బాబా లేచి నిలబడి "ఈరోజుతో మనం మరి కలుసుకోలేనంత గా విడిపోతున్నాం. నీవు పాదుషావారిని నొప్పి కలిగించకుండా నీ జీవితం గడిపేయ్. మక్కాకు వెళ్లి నేను తిరిగి రావడం అంటూ జరిగితే కలుద్దాం. ఇంతకీ తలగడ దిండు పంపావు కారణం ఏమిటి? అందులో ఏదో రహస్యం దాగి ఉంటుంది. నీవు ఏదో చతురతను అందులో నిక్షిప్తం చేసి ఉంటావు.” అన్నాడు.
“ఏముంది పాదుషావారికి చెప్పకనే చెప్పాను. ఉత్త బీర్బలు అని తలగడ దిండులా ఎంత మెత్తమెత్తగా ఉంటానో చెప్పాను. పాదుషావారు ఊహించినట్టు హాస్యచక్రవర్తి బిరుదు ఇక్కడ మీ ఖాన్ బాబా వారి వద్ద ఉండిపోయింది. ఎందరికో ఆ బిరుదునిచ్చిన ఖాన్ బాబా వారు ఏ కారణం చేతనో నాకు ఇవ్వలేకపోయారు కనుక నేను ఈరాత్రి ఎలాగైనా ఖాన్ బాబా ని మెప్పించి హాస్యచక్రవర్తి అయి మీ ముందుకు వస్తాను అని లేఖ రాసాను.” అని నవ్వుతూ చెప్పాడు.
ఖాన్ బాబా బిక్కముఖం వేసాడు.
"బీర్బల్ నిన్ను మించిన హాస్యచక్రవర్తి ఎవరుంటారు కానీ, నీకు ఆ బిరుదు ఇవ్వకపోవడానికి కారణం ఉంది. నీవు
నాకు మాత్రమే పరిమితం. అప్పుడు ఇస్తే నీవు నా నుంచి దూరమవుతావని ఇవ్వలేకపోతిని. ఇప్పుడు నేను ఒక సామాన్యుడను. రాజోద్యోగివైన నీకు ఎలాంటి బిరుదును ఇవ్వలేను. ఒకప్పుడు పాదుషా తరుపున పాలించాను కనుక నేను బిరుదులను సత్కారాలను చేయగలిగాను.” అని చెప్పాడు.
అంతలోనే సైనికులు వచ్చారు. మక్కా యాత్రకు అవసరమైన సదుపాయాలను సమకూర్చుకుని మరీ వచ్చారు.
కొంతసేపటికి ఖాన్ బాబా మందిమార్బలం తో మక్కా యాత్రకు ఉత్తరదిశ వైపుకు, ఏనుగు ఎక్కి బీర్బల్ రాజవీధి వైపుకు సాగిపోయారు. ఇద్దరి కళ్లలో నీళ్లు నిలిచాయి. బీర్బల్ ఏనుగు మీద ఠీవిగా కూర్చుని నడుపుతున్నాడు. అతడి వెనుక గుర్రాలపై సైనికులు అనుసరించారు.
కొంతదూరం వెళ్లాక ఏనుగు అదుపు తప్పి పరుగులు తీసింది. దాని మీద కూర్చున్న బీర్బల్ మాత్రం ప్రశాంతంగా ఉన్నందున సైనికులు ఆశ్చర్యపోయారు. కొంతమంది ఏనుగుశాలల వైపు గుర్రాలను పరుగులు తీయించారు. మావటీలను తీసుకువచ్చి అదుపు తప్పిన ఏనుగును నిలువరించే ప్రయత్నాలు చేయసాగారు. ఏనుగు నగరం వదిలి ఆగ్రా వెళ్లే త్రోవలో పడింది. సైనికులు కొంతదూరం వెళ్లాక ఏమిచేయా లో పాలుపోక ఏనుగును ఎలా దారికి తీసుకురావాలా అని రకరకాల దారులు వెతికి తలా ఒకదారి పట్టిపోయారు. అంకుశంతో ఏనుగును పొడిచి పరుగులు తీయించిన బీర్బల్ హాయిగా నవ్వుకుంటూ ఏనుగుపై జాలిపడి మూపురం నిమిరి దాని వేగం తగ్గించి ఆగ్రా దిశగా సాగిపోయాడు.
ఆగ్రాకు వెళ్లే త్రోవలు తనకు తెలిసినంతగా భైరంఖాన్ కు కూడా తెలియవు. దానికి కారణం పలుమారులు అక్బర్ దృష్టిలో పడకుండా పరుగులు తీయాల్సిన పరిస్థితి తాను లోగడ చవిచూచాడు. దగ్గర దారిలో అడవి మార్గం గుండా ఆగ్రాకు సాగిపోయాడు.
🎭
*సశేషం*
*అక్బర్ - బీర్బల్ కధలు - 17*
🎭
రచన : యర్నాగుల సుధాకరరావు
ఆగ్రాలో గడపగడప వెతుకులాట ప్రారంభం అయ్యింది. అక్బర్ చాలామంది భటులను పంపాడు బీర్బల్ ఎక్కడున్నా వెతికితెమ్మ ని. పాపం బెదరిన ఏనుగువలన బీర్బల్ కి ఏమైందో అని చాలా బాధపడ్డాడు. చివరికి ఖాన్ బాబా లోగడ విడిది చేసిన కొంప వద్ద ఏనుగు కట్టి ఉండడం కన్పించింది. లోపల వారికి బీర్బల్ విశ్రాంతిగా నడుంవాల్చి
కన్పించాడు. సైనికులు లోపలికి పరుగెత్తారు.
"బీర్బల్ తమకేం కాలేదు కదా! బెదరిన ఏనుగును అదుపు చేయలేనందున ఆరోజు మీతో బయల్దేరిన సైనికులను పాదుషా కారాగారంలో పడేసారు. ఆ అల్లా దయ వలన తమకు ఏమీ కాలేదు." అని ఆనందం వ్యక్తం చేసారు.
తిరిగి ఆ సాయంత్రమే అంతా ఆగ్రా నుంచి బయలుదేరారు. ఏనుగు ప్రయాణం తమకి ఈ పరిస్థితిలో కూడదు అని చెప్పారు. ఎంతమంది ఎంతకాదన్నా ఏనుగుపై ఠీవి గా కూర్చుని ఆగ్రా నుంచి ఢిల్లీకి ప్రయాణం చేసాడు బీర్బల్. వెనుక వందలాది మంది సైనికులు గుర్రాలపై ఒంటెలపై బీర్బల్ ను అనుసరించారు. ఢిల్లీకి వచ్చాక అక్కడ మళ్లీ ఏనుగును రహస్యంగా అంకుశంతో పొడవసాగాడు. అంతే, దాని మూపురం అప్పటికే గాయపడి ఉన్నందున పెద్దగా ఘీంకరించి పరుగులు తీసింది. ఒక్కసారి కలకలం మొదలయ్యింది.
రాజవీధిలో ఏనుగు భీభత్సం సృష్టించింది. దాన్ని కదలనీయకుండా బల్లాలతో అడ్డుకు న్నారు సైనికులు. ఎవరెన్ని చేసినా దాని పని అది చేసుకుపోసాగింది. ఎలాగైనా నిరోధించాలి లేకుంటే పాదుషా ఆగ్రహానికి గురికాక తప్పదు. శతవిధాల ప్రయత్నాలు ప్రారంభించారు సైనికులు.
మళ్లీ ఏనుగు మొరాయించి చెలరేగి పోతోంది అని కోటలో పాదుషాకు తెలిసింది. అతడి ప్రక్కనే ఉన్న పెంపుడు తల్లుల్లో మహం కోపంతో కదంతొక్కింది. ఈ బీర్బల్ కు ఏనుగు ముచ్చటేమిటి? ఆ హేమరాజ్ ఇచ్చిన ఏనుగు అది. అతడి లాంటిదే, అందుకే ఇంతగా అందర్ని వెర్రివాళ్లను చేస్తోంది” అని కోపాన్ని ప్రదర్శించింది.
"అతడు ఎంత చెప్పినా వినడు. చాలాసార్లు ఏనుగును కదలనీయకుండా చేసాం. అప్పుడు దిగిపోయేందుకు అతడు ప్రయత్నం చేయడంలేదు. అతడు కావాలని అంకుశంతో పొడిచి దాన్ని బెదరగొడ్తున్నాడని మావటీలు చెప్తున్నారు” అని నివేదించారు.
మహం మరింత వెర్రిదానిలా వారి వైపు చూసి "ఆ ఏనుగును హతమార్చి బీర్బల్ ను బంధించి తీసుకురండి. కనకపు సింహాసనమున ఒక కుక్కను తీసుకువచ్చి కూర్చోబెడితే అది ఎంగిలాకు కనపడగానే నాకేందుకు పరుగెత్తిందట. అలా ఉంది ఈతని నీచపు బుద్ధి, భలే చూపించుకున్నాడు.” అంది.
అక్బర్ ఏమీ అనలేకపోయాడు. తను నోరు విడిచి చెప్పడానికి అవకాశం లేని విధంగా ఉంది. బీర్బల్ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాడు.
నిజమే అతడు కనకపు సింహాసనంపై కూర్చోవడానికి వెనుకంజ వేయడానికి కారణం ఏమిటి? ఎందుకు ఇంతవింతగా ప్రవర్తిస్తున్నాడు. చాలా హీనంగా, హాస్య స్పదంగా ఉంది అని మనస్సులో అనుకున్నాడు.
క్షణాల్లో బీర్బల్ ను సైనికులు తీసుకువచ్చారు. తొలిసారిగా అక్కడ ఉన్నవారంత చూసి ఆశ్చర్యపోయారు. బీర్బల్ అందంగా పాలారాతి విగ్రహంలా ఎత్తుగా ఉన్నాడు. అందరి వైపు వింతగా చూసాడు. అతడిలో అలసట, శరీరంపై గాయాలు ఉన్నాయి.
"ఓయీ, నీకు అక్బర్ పాదుషావారి కొలువంటే అంత అవహేళనగా ఉందా? ఎందరో రోజూ వచ్చి పాదుషావారి కొలువు లో ఏ చిన్నపాటి పని దొరుకుతుందా అని ఎదురు చూసి పడిగాపులు పడ్తుంటే నీకు ఏమీకాదా? నీవు తలపొగరుతో నేరం చేసి తివి. నిన్ను కఠినంగా శిక్షించాలనుకుంటు న్నాం.” రాజమాత మహం కోపంగా బీర్బల్ ని నిలదీసింది.
"పాదుషావారి కొలువు ఎవరుకాదనుకోరు. నిన్న సంరక్షకుడు భైరంఖాన్ ను వండిన తరువాత ఏరిపారేసిన కరివేపాకులా తీసి వేసిన విధానం నాకు భయం కలిగించింది. పాదుషావారు చిన్నవారు, వారి తరుపున పాలిస్తున్న పెంపుడు తల్లులు పాలనలో పోటీపడ్తున్నారు. ఇక్కడ ఎన్నో తప్పులు జరుగుతున్నాయి. నన్నే తీసుకోండి. నా ఏనుగును చంపితే గాని నన్ను కిందకి దించలేరా? ఆ ఏనుగు అడవి లోంచి రాలేదు. ఇక్కడ ఈ గజశాలల్లో బతికేది.
ఇక్కడ మావటులకు అలవాటు అయినదే. దాన్ని నగరం మధ్య చంపి నన్ను కిందకు దించారు. ఇదేం విధానం? నేను ఇక్కడ కొలువులో చేసేది పాదుషా వారిని ఆనందంలో ఓలలాడించాలి. నన్ను భయ భ్రాంతుడిని చేయడంలో మర్మం ఏమిటి? నేను చిన్ని పాదుషా వారికి దగ్గరవుతానని ముందే నన్ను చట్రంలో బిగుస్తున్నారు." బీర్బల్ ఏదీ దాచకుండా తన మనస్సులో ఉన్నది చెప్పాడు.
"ఎంత కండకావరం మా పాలనను మా సమక్షంలో ఎత్తిచూపుతున్నావు.. నీకు బతకాలని లేదా ?” ఇద్దరు పెంపుడు తల్లులు ఏకకంఠంతో అరిచారు.
"బీర్బల్ నీవు అధిక ప్రసంగం చేయుచున్నా వు. మేము మా సంరక్షకులైన ఖాన్ బాబా ను మక్కాకు మంది మార్బలం ఇచ్చి పంపించాం. ఇందులో అతడు కరివేపాకు ఎలా అయ్యాడు. ఆయన్ని మేము ఏనాడు చిన్నబుచ్చలేదు. కాదని నీవు నిరూపించ గలవా? అభియోగం చేస్తే సరిపోదు.” అక్బర్ చిరుకోపం ప్రదర్శించాడు.
“పాదుషావారు శాంతంగా వినండి. మక్కాకి ఖాన్ బాబాతో తోడుగా వెళ్లిన వారు ఎవరు? ఆ ఖాన్ బాబా వెనుక పనిచేసిన సైనికులు కాదు. మీ పెంపుడు తల్లులైన మహంవారి బలగాల్లో కొందరు. అదీ ఎందుకు వెళ్తున్నారు? అనేకానేక యుద్ధాల్లో ఖాన్ బాబా విజయం వరించినా ఆ పక్కనే ఎందరో శత్రువులను తయారు చేసుకున్నాడు. ఎందరినో ఘోర శిక్షలకు గురిచేసిన చరిత్ర అతనికి ఉంది. ఈ మొఘలుల ఏలుబడిలో ఆయనకు ప్రతి చోట శత్రువులున్నారు. ఇప్పుడు ఎలాంటి పదవిలేదు. ఒక యోగిలా మక్కాకు బయల్దేరాడు. అతని కోసం శత్రువులు కాచుకుని ఉన్నారు. ఇప్పడు అతన్ని సమీపించడం చాలా తేలిక. ఖాన్ బాబాను మట్టుబెట్టేవాడు కన్పించగానే మీరు పంపిన రక్షకులు ఎటో తప్పుకుంటారు. నిరాయుధుడైన బాబాకి ఏమి కావాలి? నాకు తెలిసిన ఈ రహస్యం ఖాన్ బాబాకి తెలియదు. చెప్పాల్సినదే కానీ, నేను చెప్ప లేకపోతిని. అతనికి చెప్పినా ఒంటరిగా ఏంచేయగలడు? మక్కాయాత్ర మానుకుని ఉండిపోతే ఇప్పటికే అతనికి రాజద్రోహ ముద్ర ఒకటి తగిలించబడింది. ఆయన ఉప్పు పులుసులు తిన్నవాడిని కనుక ఆయన్ని రక్షించేందుకు పాదుషావారికి చెప్తే సరిపోతుంది అని ఆశపడ్డాను.”
ఒక్కసారి అక్కడ భయంకరమైన నిశ్శబ్దం చోటు చేసుకుంది. కొలువులో పలువురు మూతులు కొరుక్కున్నారు.
అక్బర్ పాదుషా భృకుటి ముడిపడింది.
"ఏమన్నావు బీర్బల్, ఖాన్ బాబాకు శత్రువులెవరున్నారు. బాబాను మట్టుబెట్టే వాడు కన్పించగానే వెనుక ఉన్నవారు తప్పుకుంటారా? ఎవరా మట్టుబెట్టేది. చాలా స్పష్టంగా చెప్పు. ఇంతగా విడమర్చి చెప్పినవాడవు ఆ గుట్టు కూడా విప్పు”
“ఖాన్ బాబా కొన్నాళ్లు క్రితం మీ అంతరంగికుడు అశ్విక దళాధిపతి అయిన జలాలుద్దీన్ న్ను అన్యాయంగా చంపించి అతని కొడుకుకి అకారణంగా నూరుకొరడా దెబ్బలు కొట్టించి, నగర బహిష్కరణ చేసాడు. ఆ కొడుకు ముబారకాన్ ఇప్పుడు పగతో రగిలిపోతున్నాడు. అతడే ఖాన్ బాబాను మట్టుబెట్టేవాడు.”
పాదుషాకు మతిపోయినట్టు అయ్యింది. అక్కడే ఉన్న ప్రధానమంత్రిని అడిగి ఖాన్ బాబా వెనుక వెళ్లినవారి గురించి వాకబు చేసాడు. బీర్బల్ చెప్పినదే నిజం. వాళ్లంతా ఖాన్ బాబా వెనుక పనిచేసినవారు కారు.
మహంకు అహం దెబ్బతింది. వెంటనే త్రాచులా లేచింది.
“ఏయ్ బీర్బల్, నువ్వు రాజకీయాలు వల్లెవేసే జిత్తులమారిలా ఉన్నావు. నీన్ను ఇంకా మాట్లాడనిస్తే ఇక్కడ లేనిపోనివి నూరిపోసేలా ఉన్నావు. ఈ అసందర్భ
ప్రేలాపిని తీసుకుపొండి. కఠిన కారాగారం లో రాచిరంపాన పెట్టండి." అన్నది.
కపోలాలు అదురుతుండగా ఉగ్రంగా ఆదేశాలిచ్చింది మహం రాజమాత. ఆ క్షణం ఆమె కన్నులు ఎరుపెక్కి నిప్పులు రాల్చాయి.
“ఆగండి మాతా నేను ఎటు తేల్చుకోలేక
పోతున్నాను.” అని అక్బర్ ఆమెను వారించాడు.
"బేటా నువ్వు చిన్నవాడివి. అసలు నీకు ఏంతెలుసు. ఇటువంటి దేశదిమ్మరుల మాటలు విని ఏం తేల్చుకోగలవు." అని సముదాయించింది. మరో తల్లి జీజీ కూడా తలనిమిరింది.
"సరే బీర్బల్ నీకు తప్పును సరిదిద్దుకునేం దుకు అవకాశం ఇస్తున్నాను. రాజమాతల పై నీవు వేసిన అభాండాలకు క్షమాపణలు చెప్పుకుంటే మన్నించగలను.” అని అక్బర్ ఓ అవకాశం ఇచ్చాడు బీర్బల్ కి.
సభలో గంభీరమైన నిశ్శబ్దం చోటు చేసుకుంది..బీర్బల్ ఇప్పుడు ఏం చేస్తాడో అని చూస్తున్నారు సభలోని వారు..
🎭
*సశేషం*
꧁☆
*అక్బర్ - బీర్బల్ కధలు - 18*
🎭
రచన : యర్నాగుల సుధాకరరావు
"నేను అభాండాలు వేయలేదు. నాకు రాజమాత లపై మంచి అభిప్రాయం ఉంది. కానీ, వారు చేసిన నిర్వాకంపై విచారం ఉంది. భయం ఉంది.” దృఢచిత్తంతో చెప్పాడు బీర్బల్.
ఇద్దరు తల్లులు అక్బర్ చెరో చెవిని పట్టుకుని..
“బేటా నీవు చిన్నవాడవు. నీకు ఇంకా అనుభవం కావాలి. ఇలాంటి వారిని శిక్షించాలన్నా నీకు మరి కొన్నేళ్లు పడ్తుంది. నీవు ఢిల్లీకి రాజువయినా ఈ తల్లులకు పసివాడివే” అని చెవి సున్నితంగా
నులిమి వదిలారు.
అంతలోనే ఖాన్ బాబా వెంట వెళ్లినవారు హడావుడిగా వచ్చారు.
“మన్నించండి పాదుషా మేము ఖాన్ బాబా వెనుక వెళ్లాం ఆయన మాకు దల్లార్ పూర్ వద్ద కన్పించకుండాపోయారు. వెతికి చివరికి వచ్చేసాం.” అని విన్నవించారు.
"మీకు ముబారక్ ఖాన్ ఎదురయ్యాడా? అతడిని చూసిన వెంటనే ఖాన్ బాబా ను వదిలి వచ్చేయమని ఎవరు చెప్పారు.”
అక్బర్ తీక్షణంగా వారిని అడిగాడు. అదే అక్బర్ తొలిసారి స్వతంత్రించి నిప్పులు చెణిగి మరీ నిజం రాబట్టిన సంఘటన.
ఆ వచ్చినవారు నిజం చెప్పేసారు.
“ప్రధానమంత్రి షామ్సుద్దీన్ చెప్పి పంపారు. కానీ మాకు ముబారక్ ఖాన్ కన్పించలేదు. ఒకవేళ కన్పించి ఉంటే మేము ఖాన్ బాబాను వదిలి వచ్చేసేవా ళ్లం.”
అక్బర్ తలపట్టుకున్నాడు. తల్లులు వైపు చూడలేకపోయాడు వారు ఏమీ మాట్లాడ లేకపోయారు. అక్బర్ సింహాసనం దిగి బీర్బల్ ని కౌగిలించుకుని..
"ఖాన్ బాబాను రక్షించే ఏర్పాట్లు చేయించ గలను. ఈ రోజు నుంచి నాకు మిత్రుడవు, రాజకీయ చతురత కల్గిన చతురుడవు నీవే.” అని కళ్ల నీళ్లు తిప్పుకున్నాడు.
ఏ సుమూహూర్తానా కలుసుకున్నారో కానీ, పదిహేనేళ్ల అక్బర్ కి ఇరవై ఏళ్ల బీర్బల్ కి విడదీయరాని స్నేహం కుదిరి వారి మధ్య నవ్వులు పువ్వులు అయ్యింది. చరిత్ర పుటల్లో వారిని తలవని చరిత్ర అభిమాని లేడంటే అతిశయోక్తి కాదు.
📖
*కన్నుకు కన్ను పన్నుకు పన్ను :*
రాజ్యాన్ని తనే స్వయంగా పాలించాలనే కాంక్ష అక్బర్ కి రోజు రోజుకు ఎక్కువ కాసాగింది. తన సంరక్షకుడు ఖాన్ బాబా ను మక్కాకు పంపి పాలనకు సిద్ధపడినా పెంపుడు తల్లులు వలన అడుగడుగునా పాలనలో అవరోధం ఎదురుకాసాగింది. ఇదే అక్బర్ కి పెద్ద సమస్య అయ్యింది. మరోవైపు ఖాన్ బాబా ఆచూకి ఇంకా తెలియలేదు. వెళ్లిన వేగులు వచ్చారే తప్ప ఏ విషయం చెప్పలేకపోయారు.
ఆ రాత్రి బీర్బల్ ని తన మహల్ కి రప్పించి తన మనస్సులో ఖాన్ బాబా గురించిన దుఃఖం చెప్పుకున్నాడు. నన్ను లాలించి అనేక విషయాలు చెప్పేవాడు. అతడ్ని మట్టుబెట్టాలనుకోవడం ఇక్కడ రాజకీయా లు ఎంతహీనంగా తయారయ్యాయో చూసావా? అని చాలా బాధపడ్డాడు.
"విచారించకండి పాదుషా ఎవరికి ఏమీ రాసుంటే అది జరుగుతుంది. నేను పానిపట్టు వద్ద ఒక దయ్యాల తోటలో చావాలనుకుని వెళ్లాను. అక్కడకు ఖాన్ బాబా వచ్చారు. ఆయన తను ఎవరైంది చెప్పి తన వద్దకు రమ్మంటే ముందు రాను పొమ్మన్నాను. అతడు ముక్కోపి. నన్ను చంపేందుకు కత్తి ఎత్తారు. అలాంటిది నన్ను ఆయన బతికించారు. కొన్నాళ్లు పెంచి పోషించారు. ఇది విధిలిఖితం కాదా? పాదుషావారి దయను పొందకుండా స్వయంగా ఆలోచనలకు శ్రీకారం చుట్టి మీదకు తెచ్చుకున్నాడు. ఏది ఏమయినా కుట్రలకు బలికాకతప్పదు."
"ఖాన్ బాబాను వధించేందుకు మన మంత్రి షామ్సుద్దీన్ ఉపయోగించినది మానవ మృగం అయిన ముబారకా ఖాన్ ని. అతడు పిన్నవయస్సులో ఒక హత్య చేసిన చరిత్ర ఉంది. తమ తండ్రిగారు వాడి ని దయతలచి వదిలేసారు. వాడు తన తండ్రిని అకారణంగా చంపిన ఖాన్ బాబా ను చంపకుండా వదలను అని శపధం చేసినాడు. అటువంటివాడికి పాలుపోసి పగతో రగిలిపోయే పాముగా చేసారు మీ పెంపుడు తల్లులు.”
“ఖాన్ బాబాను మనం ఏవిధంగా రక్షించలేమా?" అక్బర్ సూటిగా అడిగాడు.
"ఆయన ఎక్కడుంది తెలియడం లేదు. పైగా ఒక్కసారి అన్ని పదవులు పోయి సన్యాసిని చేసినందున అతడు సర్వం కోల్పోయిన వాడిలా అయిపోయాడు. ఎక్కడకు పోయాడో ఏమో? తెలిస్తే ఏమై నా చెయ్యగలం.” అని చెప్తుండగా ఒక భటుడు వచ్చి "ఏలికకు విన్నపం. ఒక ఘోరమైన వార్తను మోసుకువచ్చాను. మన్నించాలి ఖాన్ బాబాను అనిహిల్ వాడ్ అనే చోట చెరువు గట్టు మీద దేశబహిష్కా రానికి గురయిన ముబారకాన్ నరికి చంపేసినట్టు వేగు వచ్చింది. అక్కడ మన వారు కొందరు ఖాన్ బాబాను సమాధి చేసారని తెలిసింది.” అని చెప్పి వెళ్లి పోయాడు.
పిడుగులాంటి వార్త విని అక్బర్ చిన్న పిల్లాడిలా ఏడ్చాడు. బీర్బల్ కు కళ్లనీళ్లు తిరిగాయి. చాలాసేపటివరకు ఇద్దరు మౌనంగా రోధించారు. ఖాన్ బాబా తీపి గుర్తులు మననం చేసుకున్నారు.
మహం వచ్చింది. “ఏమి మునిగిందని బేటా ఇలా రోధిస్తున్నావు.. ఖాన్ బాబా చేసిన తప్పుడు నిర్ణయాలు ఈరోజు అతడి హత్యకు కారణం అయ్యాయి. హంతకుడు ముబారక్ వందమంది సైనికులకు
సమానం. అట్టివానిని నూరుకొరడా దెబ్బలు కొట్టించి వాడి కళ్లముందే అకారణంగా వాడి తండ్రిని చంపించి నగర బహిష్కరణ చేయిస్తే వాడు ఊరుకుంటా డా? పగతో రెచ్చిపోకుండా ఉంటాడా?”
అక్బర్ ఆమె వైపు కోపంగా చూసి మౌనం వహించాడు.
"ఏమయ్యా బీర్బల్ నువ్వు పాదుషాకు సంతోషం కలిగించే విషయాలు చెప్పడానికి కదా నిన్ను బంగారు ఆసనంపై కూర్చుండ బెట్టాము. నువ్వు చావు కబుర్లు చల్లగా చెప్తు మరింత బాధపెట్టేట్టున్నావు.
ఇలాగైతే నీకు నగర బహిష్కరణ తప్పదు.” హెచ్చరించింది మహం.
"జీ మాం. నేను చెప్పాను. ఖాన్ బాబా చావు మనకు చాలా మంచిదే కదా! ఎందుకు ఏడవడం అన్యాయంగా ఒకర్ని చంపాడు. వాడికొడుకు పగతో బాబాను చంపాడు. ఇందులో తప్పేమి ఉంది. అని చెప్తుంటే చిన్ని పాదుషావారికి అర్ధం కావడంలేదు. ఈలోగా మీరు వచ్చారు. మీరు చెప్పండి. తప్పకుండా వింటారు.”
“భళీ బీర్బల్ నువ్వు చాలా సమర్ధుడవు. తప్పుగా నిన్ను అర్ధం చేసుకున్నాను. ఎంత చక్కగా చెప్పావు. బేటా నిన్ను సంరక్షించి నంత మాత్రనా అతడు గొప్పవాడు కాలేడు. అతడో తప్పుల తడక. అయినా నీవు చక్రవర్తివి. నీకు తన పరభేదాలుండ రాదు. శిక్షించాల్సివస్తే ఎవరినైనా వదల రాదు. ధర్మబద్ధుడవు కావాలి అందుకు దృఢ దీక్ష అవసరం.” చెప్పి వెళ్లిపోయింది.
అక్బర్ కోపంగా చూసాడు. "ఏమిటి బీర్బల్, ఖాన్ బాబా చావు మనకు ఎంతో మంచిదా అలా ఎప్పుడు నాకు చెప్పావు?”
"ఏం చేయమంటారు పాదుషావారు. ఒక్కోసారి అబద్ధం చెప్పాలి. ఇప్పుడు ఇలా చెప్తే రేపు మీ నిర్ణయాలు పాకాన పడతాయి. మాళవ యుద్ధంలో మీరు ఈమె కుమారుడిని సర్వసేనానిగా నియమించి పంపారు. అక్కడ అతడి నిర్వాకం చాలా ఘోరంగా ఉందని వేగులు అందాయి. వాటిని మీకు తెలియకుండా ఇక్కడ మీ పెంపుడు తల్లులు జాగ్రత్తపడ్డా రు. మనం రేపు మాళవం వెడదాం.”
"నిజమే నాకు ఖాన్ బాబా గుర్తుకువచ్చి దుఃఖం ఆగడంలేదు. ఈ నగరం వదిలి కొన్నాళ్లు దూరంగా వెళ్తే తప్ప నా మనస్సు కి శాంతిలేదు. తప్పకుండా వెళదాం.ఇంతకీ మాళవంలో ఘోరాలు ఏం జరిగాయి ? అక్కడ మహం కొడుకు వరుసకు నా సోదరుడు ఉన్నాడు కదా! అతడు వెళ్లి కత్తి ఝళిపించడంతో మాళవాన్ని వదిలి అక్కడ రాజు బాబ్బహదూర్ ప్రాణాలు అరచేత పెట్టుకుని పారిపోయాడు."
అక్బర్ ఆసక్తిగా చెప్పాడు.
అక్బర్ మాళవం వెళ్లున్నట్టు తెలిసిన మహం మాతా ఎదురొచ్చి "బేటా నీవే స్వయంగా వెళ్తున్నందున నాకు గొప్ప సంతోషంగా ఉంది. అక్కడ నీ సోదరుడు అదే నా పుత్రుడు ఆదంఖాన్ కి నాదీవెనలు అందచేయ్. వాడు వెళ్లిన వెంటనే మాళవాన్ని తన గుప్పిట్లోకి తీసుకున్నందు కు వాడిని అక్కడ నియమించి వచ్చేయ్. వాడికి మీలాగే పాలన అంటే పరమ ఇష్టం” అని చెప్పి అక్బర్ తల నిమిరి నుదురుపై ముద్దుపెట్టుకుంది.
"బీర్బల్ నీవెంట వస్తున్నాడు. నీకు ఉబుసుపోతుంది. అన్నట్టు అక్కడ నీవు వెళ్తున్నది చక్రవర్తి హోదాలో, కనుక నీవు అక్కడ పరిస్థితులు చూసుకుని ఆదంఖాన్ వీరత్వానికి తగిన గుర్తింపునిచ్చి నీవు అక్కడే వాడికి తగిన హోదా కల్పిస్తావని ఆశపడ్తున్నాను!"
"జీ, మాఁ భౌగోళికంగా అనేక రహదారు లకు నిలయంగా మాళవం ఉన్నందున దాని అవసరం మనకు ఏర్పడింది. దాన్ని ప్రత్యక్షంగా చూడాలి. మన వశంఅయ్యింది కదా! నేను వెళ్తున్నదే అందుకు, నాకు చెప్పరాని ఆనందంగా ఉంది.”
"కన్నుకు కన్ను, పన్నుకు పన్ను అనే సామెత వినే ఉంటావు. అలా చేసిన నీ సోదరునికి నీవు గుర్తించి అక్కడ ఏలికను చెయ్యగలవని ఆశిస్తున్నాను. నా కుమారుడ్ని చక్రవర్తివయిన నీవు గుర్తించాలి" చెప్పి పంపింది.
దారిలో అక్బర్ అడిగాడు. "బీర్బల్, మహం కన్నుకు కన్ను పన్నుకు పన్నులా గుర్తించమంది అంటే ఏమిటి?”
"ఏముంది ఆమె కుమారుడు ఒక రాజ్యం జయించి మీకు అర్పించాడు. వాడిని సేనానిగా చూస్తే ఎలా? రాజ్యంకు రాజ్యం ఇవ్వాలి. అంటే అక్కడ రాజును చెయ్యి అని చెప్పకనే చెప్పింది. తల్లిగా ఆమె కోరిక సబబే కానీ, ఆ ఇవ్వడమనేది చక్రవర్తికి ఉండాలి. పుచ్చుకునేవాడికి కూడా అర్హత ఉండాలి. మాళవంలో ఉన్న సేనాని ఆదంఖాన్ కొన్నాళ్లు ఖాన్ బాబా వద్ద
శుశ్రూష చేసినవాడే కదా, ఈరోజు బాబా ను హత్య చేయించడంలో ప్రధాన పాత్ర వహించాడు. తల్లి చెవులు తెంపిన వాడికి అంటే ఖాన్ బాబాను ఖతమ్ చేసిన వాడికి రేపు సవతి సోదరుడైన మీరు ఏమికారు అని చెప్పడం దీని ఆంతర్యం.
“నా ఊహనే నీవు చెప్పావు. ఆదంఖాన్ నాకంటే ఎక్కువగా ఖాన్ బాబా వద్ద చేరికగా పెరిగాడు. పలు విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు కానీ వాడు చివరికి నమ్మక ద్రోహం చేసాడు. ఖాన్ బాబా విషయంలో ఇంత దారుణంగా ప్రవర్తించడం నేను జీర్ణించుకోలేకపోతున్నాను.” అక్బర్ చెప్పి పెద్దగా ఆవులించాడు.
మాళవంలో ప్రవేశించాక, అక్బర్ కి అక్కడ ఎదురైనవి చాలా ఘోరమైన దృశ్యాలు. ఒక్కసారి అతడి చిన్న మనస్సు చివుక్కు మంది. పలువురు హిందువులు ఊచకోత కు గురయ్యారు. అక్కడ మనుష్యులు నివసిస్తున్నట్టుగాలేదు. పట్టపగలు మొగల్ సైనికులు దొరికిన ఆడవారినిబలాత్కరించి ఎదురు తిరిగిన వారిని అడ్డంగా నరికేస్తూ నానాభీభత్సం సృష్టిస్తూ శ్మశానాన్ని తలపింపచేయడం కళ్లార చూసాక అక్బర్ పక్కనే ఉన్న ఆదంఖాన్ ను ప్రశ్నించాడు.
"ఏమిటి ఇదంతా ఇక్కడ పౌరులకు రక్షణ ఏమీలేనట్టుంది. మన సైనికులు చాలా ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. ఎవరూ ధైర్యం గా ఇళ్లల్లోంచి బయటికి రాలేకపోతున్నారు. కనీసం చక్రవర్తి వచ్చినప్పుడు సైనికుల్లో కన్పించే భయం భక్తి కన్పించడంలేదు.”
అక్బర్ ప్రశ్నకు అయోమయంలో పడ్డాడు ఆదంఖాన్. ఆ వెంటనే తేరుకున్నాడు.
“సోదరా నాకంటే చిన్నవాడవు. చాలాపెద్ద వాడిలా రాజకీయ మర్మాలు ఎరిగినవాడి లా భలే ప్రశ్నించావు. నీకు తెలియంది ఇక్కడ ఏముంది. మనకు ముందు ఏలిన రాజు బహదూర్ హిందువు. మన మతం వారిని చిన్నచూపు చూసేవాడని విన్నాను. అందుకే ఇక్కడ హిందూవులను ఊచకోత కోసాను. సంగీతం, నృత్యాలతో ఈ మాళవం వేశ్య వాటికల్ని తలపించేట్టు పాలించాడు. ఆ కళాకారుల్ని అందర్ని కట్టకట్టి కారాగారంలోకి నెట్టేసాను. ఆ బహదూర్ ఉంపుడుకత్తె రూపవతి జగదేక సుందరి అని చెప్పుకోగా ఆమెను పట్టి ఆమె అందాన్ని తిలకించాను. నిజమే ఆమె గొప్ప సౌందర్యరాశి. ఆమెను చెరపట్టి నా దాన్ని చేసుకోవాలనుకున్నాను. కానీ ఆమె తిరస్కరించింది. ఫలితం చూపించాను. మన రాకాసి మూక సైనికులకు విందు చేయాలని అప్పగించాను. పాపం ప్రాణ భీతితో ఆత్మహత్య చేసుకుంది. అదిగో ఆ భవనంలో ఆమె శవం పడి ఉంది. ఈరోజు తెల్లవారు జామున చచ్చింది. లేకుంటే
మన సైనికులకు విందు అయ్యేది." అని పగలబడి నవ్వాడు.
అక్బర్ విని తలపంకించాడు. “చాలా బాగా పని చేసావు. నీ సేవల్ని గుర్తించాల్సి ఉంది. తక్షణం నీ వెంట పంపిన సైన్నాన్ని సమాయత్తపరిచి నాముందు నిలబెట్టు. వారితో నేరుగా మాట్లాడుతాను. ఏ ఒక్క రు రాకుండా శిబిరాల్లో ఉండరాదని చెప్పు. ఆ ఏర్పాట్లు చేయించు. అలాగే ఇక్కడ తలుపులు బిడాయించుకున్న పౌరులను అందరిని బయటికి రమ్మనండి. దాక్కుంటే కుదరదు. వారిని స్వయంగా చూడాలి." అక్బర్ హుకుం జారీ చేసాడు.
తాను చేసిన ఘనకార్యాలకు చిన్నవాడైన అక్బర్ కి నచ్చినందుకు ఆదంఖాన్ చాలా ఆనందించాడు. వెంటనే ఆ ఏర్పాట్లు చేసాడు. మాళవకోట వెలుపల విశాలమైన మైదానంలో అక్బర్ కొలువు తీరాడు. బీర్బల్ అక్బర్ పక్కనే కూర్చుని ఆసక్తిగా తిలకించసాగాడు. అక్కడ గుమిగూడిన నగరపౌరులకు, ఆదంఖాన్ వెంట ఉన్న సైనికులకు, అక్బర్ వెంట వచ్చిన ఢిల్లీ సేనానులకు ఏంచేయనున్నాడోనని ఉత్కంఠగా ఉంది. అప్పటికే కొందరు పరమత ద్వేషం అక్బర్ కి ఉంది అని అనుమానించారు. ఈ నగరంలో మిగిలి ఉన్న హిందూవులను నరకమని ఆదేశాలి స్తాడేమోనని కంగారుగా కొందరు మత సహన పరులు చూడసాగారు. కనుకనే హేమరాజ్ బ్రాహ్మణుడని చూడకుండా స్వహస్తాలతో నరికి చంపాడు అని మరికొందరు చెవులు కొరుక్కున్నారు. అక్కడ అక్బర్ అంటే అందరికి భయం పట్టుకుంది. ఆదంఖాన్ను వెనకేసుకుని వస్తున్నందున పౌరులు మరింత భయంతో అక్కడకు చేరారు.
పందొమ్మిదేళ్ల అక్బర్ ఠీవిగా కూర్చున్నాడు. అతడి ప్రక్కనే నిలబడ్డాడు ఆదాంఖాన్ అతడి పరివారం. అక్కడ నిశ్శబ్దం చోటు చేసుకుంది. అక్బర్ లేచి నిలబడి తొలిసారి గొంతు విప్పాడు.
🎭
*సశేషం*
꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂
అక్బర్ - బీర్బల్ కధలు - 19*
🎭
రచన : యర్నాగుల సుధాకరరావు
పందొమ్మిదేళ్ల అక్బర్ ఠీవిగా కూర్చున్నాడు. అతడి ప్రక్కనే నిలబడ్డాడు ఆదాంఖాన్ అతడి పరివారం. అక్కడ నిశ్శబ్దం చోటు చేసుకుంది. అక్బర్ లేచి నిలబడి తొలిసారి గొంతు విప్పాడు.
“అంతా సావధానంగా వినండి. ఆదాంఖాన్ వెనుక ఢిల్లీ నుంచి బయల్దేరిన సైనికులారా మీరు యుద్ధానికి వచ్చి ఈ రాజ్యాన్ని సునాయాసంగా గెలుచుకున్నారు. ఆ తర్వాత మీకు తాత్కాలికంగా నాయకత్వం వహించే ఆదంఖాన్ చెప్పిన నీచకృత్యాలకి పాల్పడి నగరాన్ని భీభత్సం చేసారు. ఎందుకు హిందూవులను పనిగట్టుకుని ఊచకోతకోసారు. పాపం తలుపులు బిడాయించుకుని వారు ఎన్నాళ్లు తిండి తిప్పలు లేకుండా ఉంటారు చెప్పండి."
అక్బర్ తొలిపలుకులకు సైనికులు బిక్కముఖాలు వేసారు.
“మీలో ఎంతమంది ఇలా రాక్షసంగా
ప్రవర్తించారు. వాళ్లంతా ఆ వైపుకు వచ్చి నిలబడండి.” గర్జించాడు. బిలబిలమని ఒకవైపుకి సైనికులు పరుగులు తీసి నిలబడ్డారు. అంతా కలిసి ఐదారు వందల మంది వరకు మాత్రమే ఉన్నారు.
“ఇంకా ఎవరైనా ఉంటే ఆ మందలో కలవండి, రేపు నిజనిర్ధారణ చేసాక తీవ్ర శిక్షలకు గురికావల్సి వస్తుంది." మరోసారి హెచ్చరించాడు. ఇంక తప్పదని మరి కొంతమంది వెళ్లి చేరారు.
“ఆదంఖాన్! నీవు చేసిన తప్పుల్ని ఒప్పులుగా నీకు నీవే అనుకుని నాకు చెప్పావు. నీవు ఈ రాజ్యం జయించాక ఇక్కడ నీవు చేయాల్సింది ఢిల్లీ ఆదేశాల మేరకే కదా! అలాకాకుండా చాలా ఘోర నిర్ణయాలు నీకుగా నీవే తీసుకున్నావు. ఇక్కడి రాజు బహదూర్ లలితకళలను పోషించేవాడు. అవి మనకు గిట్టనివి కావే, ఆ కళాకారులను కారాగారంలో ఎందుకు నెట్టావు? బహదూర్ ఉంపుడుకత్తెను రాచి రంపాన పెట్టి చివరికి ఆమె ఆత్మహత్య చేసుకునే పరిస్థితి కల్పించావు. ఆమె అందం ఆమెకు శత్రువైంది. ఇక్కడ హిందూవులను తల్లి ఎదుటే పిల్లల పై ఆత్యాచారాలు చేయించావు. నీవు మానవ ముసుగులో తిరుగాడే మృగానివి. కనుక నీవు దండనార్హుడవే. ఈతన్ని బంధించి ఆ నేలపై కూర్చుబెట్టండి.” ఆదేశించాడు అక్బర్.
ఒక్కసారిగా నగర పౌరుల్లో ఉద్వేగం మొదలయ్యింది. "అక్బర్ పాదుషా వారికి జై" అని నినదించారు.
క్షణాల్లో ఆదంఖాన్ ని బంధించి నేల మీదకి విసురుగా తోసి కూర్చోబెట్టారు సేనానులు. అతడు మండిపాటుతో చూస్తు "అక్బర్ భయ్యా, నీకేమైనా పిచ్చా ? నాపై ఇంత క్రూరంగా ప్రవర్తిస్తావా? నా ప్రాణాలను ఒడ్డి ఈ మాళవాన్ని నీకు కట్టబెడితే నాకు ఇచ్చే
బహుమానం ఇదా! నీవు నా తల్లికి అదే నీ పెంపుడు తల్లికి ఏంచెప్తావు. నిన్ను పెంచి పోషించినందుకు ఆమెకు కడుపుకోత కోసావే నీవు మాతృద్రోహివి." అన్నాడు.
“ఇక్కడ బంధుత్వాలు వందల ప్రాణాలకు హాని కల్గించాయి. నేను వరుసకు సోదరుడనని కదా నీ ఇష్టం వచ్చినట్లు పైశాచికంగా వేలమందిని ఊచకోత కోయించావు. నీలో కనీసం చేసిన తప్పిదానికి పశ్చాత్తాపం లేదు. నీవంటి వాడికి జీవించే హక్కు లేదు. ఈతన్ని ఆ కోట బురుజు మీద నుంచి క్రిందకు నెట్టేయండి. ఎదుటివాడి చావులో ఆనందం వెతుక్కునే నీకు ఆ చావులో నరకం ఒక్కింత తెలియాలి. తక్షణం శిక్ష అమలు చేయాలి” అని ఆదేశించాడు.
అక్కడ భయంకరమైన వాతావరణం నెలకొంది.
ఆదాంఖాన్ ని పెడరెక్కలు విరిచి తీసుకు పోయి కోట బురుజుపై నుంచి కిందకు విసురుగా తోసేసారు ఢిల్లీ సైనికులు. అతడు చివరికేక విని నగరపౌరులు ఆనందంలో తేలియాడారు. ఆ వెంటనే బహిరంగంగా హిందూవులకు అక్బర్ క్షమాపణలు చెప్పుకున్నాడు. చెరసాలలో ని కళాకారులను బంధవిముక్తులను చేసి వారికి వెలలేని ఆభరణాలు కానుకలు ఇచ్చాడు. ఆత్మహత్య చేసుకున్న రూప వతిని రాజలాంచనాలతో అంత్యక్రియలు చేయించాడు. అక్కడ నమ్మకమైన వారిని నియమించి వెనుదిరిగాడు.
"బీర్బల్ ఎందుకు నిన్నటి నుంచి నీవు ముసురుపట్టినట్టున్నావు. ఏమయ్యింది? ఆదంఖాన్ చేసిన నిర్వాకాన్ని నేను భరించలేకపోయాను. అందుకే వాడిని కడ తేర్చాను. వాడు మానవమృగంలా కన్పించాడు. నా తీర్పు నీకు నచ్చలేదా? నేను తొందరపడ్డానా?” అడిగాడు అక్బర్.
"పులి కడుపులో పులి పుడుతుంది అని పలువురు అంటే ఏమో అనుకున్నాను. ఈరోజు ప్రత్యక్షంగా చూసాను. మీ తీర్పు పట్ల సర్వత్రా హర్షం వ్యక్యం అయ్యింది. అందుకే ముసురు పట్టినట్టయ్యాను.
ఇంతటి యోధుని వద్ద నాకు కొలువు దక్కినందుకు నా బాధ్యతలు మరింత పెరిగాయి అని మన్నుతిన్న పాములా ఉన్నాను." చెప్పాడు బీర్బల్. ఆ మాటలకు అక్బర్ పకపక మని నవ్వాడు.
ఢిల్లీకి తిరిగి వచ్చాక మహం మాఁ వచ్చి "బెటా ఆదంఖాన్ నాకేదైన వర్తమానం పంపాడా? మన సైనికులను యుద్ధ ఖైదీల ను తీసుకువచ్చినట్టు తీసుకువస్తున్నారు. అక్కడ ఏం జరిగింది? నా పుత్రుడు క్షేమంగా ఉన్నాడు కదా!” అని ప్రశ్నలు కురిపించింది.
అక్బర్ బదులీయకుండా "క్షమించు మాఁ! నేను నీవాశించినట్లు కన్నుకు కన్నుగా పన్నుకు పన్నుగా వ్యవహరించాను.” చెప్పి ఆమె వద్ద నుంచి నిష్క్రమించాడు.
“నాయనా బీర్బల్, నీవైనా చెప్పవా అక్కడ ఏమయ్యింది ? నాకెందుకో భయంగా ఉంది. నా కొడుకు క్షేమంగా ఉన్నాడా ? ఏదో కీడు సెంకిస్తోంది నా మనస్సు.
శత్రువులను జయించిన నా కొడుకు గాయాలతో ఏమైన ఆయిపోయాడా, అక్బర్ మాటలు అదోలా ఉన్నాయి. అందుకే గాభరా పడ్తున్నాను. నేను భరిం చలేకున్నాను. కనుక ఏదీ దాచకుండా చెప్పు.” ఒక విధంగా చేతులు పట్టుకుని ప్రాధేయపడింది.
"మాఁ మీ ఆదాంఖాన్ పాదుషాకు తెలియ కుండా అక్కడ ఎన్నో ఘోరాలు చేసినందు న అక్కడ కొన్నివేలమంది అమాయకులు ఊచకోతకు గురయ్యారు. చక్రవర్తి సమక్షం లో కోట బురుజుపై నుంచి తోసి చంపేసారు అక్కడ బాధిత కుటుంబాలవారు. ఆదంఖాన్ మరణించాడు."
ఆమాట విన్నంతనే కుప్ప కూలింది మహం. ఆ తరువాత ఆమె కొడుకు ఎలా చనిపోయింది తెలుసుకోలేదు. మంచం పట్టిపోయి నెలరోజుల్లో మరణించింది. మరో పెంపుడు తల్లి భర్తను పాదుషా మంత్రి పదవి నుంచి బహిష్కరించడం వలన ఆ దంపతులు విచారగ్రస్తులై రాణీ వాసంకే పరిమితం అయ్యారు.
ఇక్కడితో అక్బర్ పెంపుడు తల్లుల హవాకు తెర దిగిపోయింది. ఇలాంటి శుభఘడియల కోసం అనుక్షణం ఎదురు చూసిన అక్బర్ సర్వస్వతంత్రుడైయ్యాడు. అక్బర్ పాలనలో ఎదురులేకుండా
పోయింది. అంతకుముందు ముస్లిం చక్రవర్తి అయిన షేర్ షా పాలననే అనుకరించాడు.
📖
*నుయ్యి తవ్వితే దయ్యం వచ్చింది*
ఒకరోజు అక్బర్ పాదుషా కొలువు తీరి ఉన్నాడు.
“ఆరోజు ప్రజల నుంచి ఒక్క ఫిర్యాదు లేనందున ఈ రోజు చాలా బావున్నది. నేరాలు తగ్గుముఖం పట్టి నట్లున్నాయి కదూ! " అని అక్బర్ తన పక్కనే కూర్చున్న న్యాయనిపుణులతో అన్నాడు. ఇక దర్బార్ చాలించే సమయంలో ఇరువురు ఫిర్యాదీలు రానేవచ్చారు.. వారితో మరి కొంతమంది కూడా ఉన్నారు. వారిని చూడగానే బీర్బల్ నవ్వాడు.
“పాదుషావారి నమ్మకం వమ్ము చేసి వచ్చారు. వీళ్లని చూస్తే పీకలోతు సమస్య తెచ్చిపెట్టినట్టున్నారు.” బీర్బల్ అనేసి వారి వైపు చూసాడు. ఆ వచ్చిన వారు పాదుషా వారికి నమస్కరించారు.
"అయ్యా మాది పఠాన్ గ్రామం. మాకు వేసవిలో నీళ్లులేనందున ఒక బావి అవసరం ఏర్పడింది. అందుకు కొత్వాలు వారిని అడిగితే ఆయన ఇక్కడ తమ కొలువులో ఉన్న అధికారులు ద్వారా బావి తవ్వించేందుకు అవసరమైన పరికరాలు, ధనం ఇప్పించారు. బావి తవ్వేందుకు నేను సిద్ధమయ్యాను. అందుకు మా గ్రామ ప్రజలు అంగీకరించారు. నేను తవ్వుతుండ గా ఒక దయ్యం అందులోంచి వచ్చింది. రోజు అది గ్రామంలో అందరిని పట్టి పీడిస్తోంది. నేను తవ్వినందున ఆ దయ్యం వచ్చింది. అందుకు నేను బాధ్యత వహించాల్సిందేనని రచ్చబండ వద్ద తీర్మానం చేసారు. నా ఆస్థులు జప్తు చేస్తా మంటున్నారు. ఇదేం అన్యాయం? నూతులు తవ్వే వృత్తితో బతుకుతున్నా ను. నేను తవ్వితే నుయ్యి కాదు దయ్యం వస్తుంది అని ఆ చుట్టుప్రక్కల గ్రామాల వారికి తెలిసి ఎవరు నన్ను పిలవడంలేదు. మరోవైపు నన్ను నిరుపేదను చేసి తరిమే యడానికి సిద్ధపడ్తున్నారు.” అని చెప్పి లబోదిబోమని ఏడ్చాడు.
అతడి మాటలకు ఒక్కసారి కొలువులో ఉన్న వారంతా గొల్లుమని నవ్వారు. అక్బర్ సభనుద్దేశించి ఎందుకు నవ్వుతున్నారు, ఇందులో అంత నవ్వాల్సింది ఏముంది?” అని అడిగాడు.
"ప్రభూ నుయ్యి తవ్వితే నిజంగా దయ్యం వస్తుందా..? అసలు దయ్యం ఉందా అందుకే నవ్వాం" ఒకడు నిర్భయంగా చెప్పాడు.
"దయ్యం ఉందా లేదా ముందు తేలితే ఈ తగవు తీర్చవచ్చు. సరే గ్రామ పెద్ద నీవు చెప్పు. దయ్యం నూతిలోంచి వచ్చినట్లు నీవు చూసావా ఇంకెవరైనా చూసారా?” అక్బర్ అడిగాడు.
🎭
*సశేషం*
꧁꧂
No comments:
Post a Comment