Friday, 25 November 2022

సమస్యను పరిష్కరించడం....



సమస్యను పరిష్కరించడం....

తల్లీ ! దండం బటంచు దారకు మొక్కెన్ 

దార  =  భార్య

✅✅✅

మల్లీ మాయకు చిక్కీ

తుల్లీ ప్రేమను తెలుపుట దూరుత యగుటన్

జల్లు కిరుణాల తీరుగ 

తల్లీ దండం బటంచు దారకు మొక్కెన్

ऊँ!

----

" आर्या..

--

శ్రీఫణిపతిశయనాక్షం,

సౌఫల్యకారక చైతన్యకారమ్..

కుఫలమతినియంతారం ,

హిరణ్మయకిరణం రవిం భజే !!! "

----

చక్ర భాష్య మిదియు చలనమై సాగుటే

వక్రతుండ మనసు వ్యక్త పరుచు

సక్రమమ్ము ఇదియు సందియాలనుతీర్చు

సహన ప్రాంజలి కళ శారదాంబ

 ఆటవెలది:

ఆదిపూజలందు నధి నాయ కుండవు

విద్య  బుధ్ధులివ్వు విరివి గాను

కరిముఖుడవు నీవు కరుణను చూపుము

వక్రతుండమీకు వందనమలు.

: చక్ర భాష్య మిదియు చలనమై సాగుటే

వక్రతుండ మనసు వ్యక్త పరుచు

సక్రమమ్ము ఇదియు సందియాలనుతీర్చు

సహన ప్రాంజలి కళ శారదాంబ

మనసు ధర్మాన్ని బట్టియే మార్గ మెంచు

ధైర్య సంపద బ్రతికించు ధరణి యందు

స్వర్గ మైనది ప్రేమయే సమయమందు

ప్రాంజలి ఘటించి చండికా పద్య గీత

" సుమతిమతిబలందుష్టభూతాదివైరిం ,

కుమతిదహనకారం , శిష్టపూజ్యాభివంద్యమ్..

గమనసదృశవాయుం , వాయ్వంశజాతం ,

విమలసుజనభక్తం , రామభక్తంనమామి !!! "

----

మాత్రభద్ధముగా

చెడుతలపే తలచి వేదనై కష్టముగన్

విడివడు సేవలు మనో విధానం సమయమ్

అడుగిడు ఆశలు వినోదమేగా తెలిపెన్

కొడుకును దావలచి యొక్క కూతుం గనియెన్

 సమస్యా పూరణ: వైద్యుడి గొప్పదనము...

**********

తేటగీతి:

ప్రజల సేవయె తన ప్రథమ కర్తవ్యము

గాను తలచు వాడు, గాచ రోగి

ప్రాణములను స్వీయ ప్రాణము లడ్డెడి

వాడు, తరచి చూడ,  వైద్యు డొకడె

 సమస్యా పూరణ: కళత్రం వర్ణన

*************

బ్రతుకుయంత గడుపు పతిసేవ జేయుచు,

పతిని యనుసరించు పవలు రేయి,

మెట్టినిల్లె తనకు పుట్టినిల్లు యనును,

మగని క్షేమమెపుడు మరువదు సతి


*******
ప్రాంజలి ప్రభ వారి.10-12-2022

దత్తపది పూరించండి

భారము , సారము , కారము , దూరము

ఇచ్చా చందస్సు

*******
🌹🌹🌹🌹🌹

భారమవదు బంధము తృప్తి భాద్యతగుట
సార మున్నను లేకున్న సహన మధియె
కారము మమ కారమునయ్యె కాని దైన
దూరము అనక దగ్గర దూత యగుట

🙏భారము -దూరము -కారము -సారము 🙏
భారము దల్లి దండ్రులన భావ్యము గాదు!స బంధు వర్గమున్,
దూరము పెట్టవద్దుర!సు దూ రము గానగు! మధ్యమధ్య సా
కారము జేసుకొన్న , మమ కారము లన్నియు జ్ఞప్తి వచ్చు! నా
సారము గ్రోల వచ్చు, యది సాధ్యమె! తీరిక చేసు కొమ్ము రా!!

🙏నీవు -చావు -రావు -పోవు 🙏
నీవొక యాటబొమ్మవని, నీ జననంబది యాటయంచు, తా
చావును దప్ప దంచు, మరి, చావుకు చింతను పొంద ధర్మమే?
రావవి మంచి చెడ్డలవి, రావవి సంపదలెన్నియైన నూ!
పోవును!! పుట్టు చావులవి పూర్తిగ దైవ క్రీడలే!!!

సమస్యా పూరణ :దత్తపది
*చావు, నీవు, పోవు, రావు*
************
తేటగీతి :
*చావు* పుట్టుకలన్నవి సమమె కాద
యందరికి, *నీవు* రమ్మని యనగ *రావు*,
పొమ్మని యనిన నిను వీడి *పోవు*, విధికి
ఎదురు పోరుట సాధ్యమే యెవరికైన
----
" కం.
--
* చావు * నెవరికినితప్పదు
* నీవు * సదమలహృదయునిగనియతిఁగనుండన్
* పోవు * నపకీర్తియుండిన
* రావు* దురితములుదఱికిని రాగాత్మ.. కనన్ .."
----

ఉత్పలమాల

నీవును నేనుగా కలసి నీడల మధ్యన జీవితమ్ముగన్
చావున నే మనోబలము సాహస కర్మయు శాంతి నిచ్చుటన్
పోవుట ఉండుటే కలలు పోరులగాయతు ప్రేమ నందునన్
రావుయు చెప్పి ఆశ కల రక్షణ లేనిది కాలనిర్ణయమ్

మత్త కోకిల

చావు తప్పదు పుట్టుతేయగు చింత ఏలను నీకునూ
నీవు నిర్మల మానసమ్ముగ నేస్తమాయెను ఇప్పుడే
పోవు వారిని వచ్చువారిని గొప్ప చెప్పక ఉండుటే
రావు అన్నను వచ్చి యున్నను రచ్చ దేనికి నీకులే

న్యస్తాక్షరి....... ధ ర్మ  దా త -- పద్య పాదాది న రావాలి.


కంద పద్యము 

ధర్మము మనగడ నందు మ

ర్మము కలియు బ్రతులనందు రంగులు మార్చూ 

దానము జీవితమగుటే 

తరుణీ సహనం సహాయ తాపము తీర్చూ

తేటగీతి                                        . 

ధరణి లో అవమానాలు దారిగా ఆజ్యం మ 

ర్మమము తెలియక జీవుడు రాత్రి పగలు

దారి వెతుకుపక్షియగుట తప్పు చేసి 

తరతరాల బ్రతుకు మారక తన్ను కొనుట       

ఆటవెలది 

దరువు ఉన్న చోట తప్పొప్పు లన్ని మ 

ర్మమము మాయ బ్రాంతి రంగు మార్చు 

దాన మన్న లేక దారిద్ర మనుగడ      

తరతరాల బ్రతుకు తారుమారు 


0001 న్యస్తాక్షరి.......... వై   కుం  ఠ  ము  పద్య పాదాది న  రావాలి........

వైన తీయభవిత ఇదీ వైర మవని

కుంపటి సెగలు తప్పవు కూటి కళ ప

ఠము ఇదియగుట సహజము ఠంక శబ్ద

ము కదిలేనులే కలలకు ముఖ్య మౌను

0002 న్యస్తాక్షరి....... సు  స్వా గ తం పద్య పాడాది న రావాలి...

 సుమధుర పలుకులు పికము సుధలు చెల్లు

 స్వాగతము పలికి వలపు సాధు వీచు

 గతము వర్ధమాన  జగము  గారవిల్లు

 తంత్ర మంత్రమగుట ఏను  తల్లడిల్లు.

 సుమతి మాట వినకశోభ సుఖము వదలి 

 స్వార్ధ పైత్యమే మనిషిగా సాగనీక

 గతము తవ్వేగుణము మతి గమ్య మౌను

 తంత్ర మంత్ర మనుచు బొంకు తరుణ మందు

 * సు * రుచిరతనూవిలాస్యవిశోభితమ్ము

 * స్వా * మిబాలకృష్ణునితాండవమ్ముఁగనఁగ

 * గ * రుడవాహన శ్రీపతి గతియె మనకు 

 * తండ్రి * యు తల్లియు నాతఁడె త్రాతయుగద !!! "

0003 దత్తపది........ జొన్నలు కందులు పెసలు రాగులు

జొన్నలుడికించు అన్నము చొప్ప కాదు

కందులుడికించు పప్పుయు కధలు కాదు

పెసలు పిండిగా దోశలు పేద కాదు

రాగులు పిండిగా జావయు రక్ష కాదు

 జొన్నరొట్టెలు బహురుచి జొల్లుకురియు

 కందులపొడి గంధగుమలు కండ పెంచు

 పెసలు పునుకులు నోటికి  పెంచు రుచియు

 రాగిజావయు బలమిచ్చి రమ్య మగుటె.

0 co


0004 దత్తపది....... పప్పు  చారు చట్ని పెరుగు

 ఏమి టా పప్పు పులు సుయు ఏల వంక 

నీరు లాగ చారుణు చేసి నీతి అనకు

ఇదియు చెట్ని సాంబారగు ఇష్ట మవదు

పెరుగు పుల్లని వాసన ప్రియము ఏలట

0005 దత్త పది.. దీపం శాపం పాపం కోపం

హృదయ దీపం వెలుగు లన్ని హాయి గొలుపు

గతము శాపం మనుగడనే గాయ పరచ

నిత్య చేయు పాపము వల్ల నిజము కరువు

మనిషి కే వచ్చు కోపము మాయ వలన

0006 దత్తపది..చూడు.. కూడు..పోడు... లోడు

కాపురమ్ము వేరగుటయే కథలు చూడు

వంట  సంపద బట్టియే వార్పు కూడు

కొత్త సంసారమే సాగు కోరి పోడు

తప్పని తెలిపే మనిషియే తోడు లేడు

0007 దత్తపది.. మార .. చేర...జార...దూర...

మారనీకుమా ప్రేమను మాయవున్న

చేరనీ కుమా సవితిని చింత యున్న

జార నీకుమా మనసును జాలి అన్న

దూర నీకుమా దూర్థుల దుష్ట చెలిమి

0008 దత్తపది.. ఓటు.. ఘాటు..పాటు.. చేటు

ఓటు రాజ్యాంగ నేతల ఓర్పు గెలుపు

ఘాటు పీల్చలేని బ్రతుకు గరము గరము

పాటు గ్రహపోటు ఎక్కువే పలుకు మాయ 

చేటు జరగ నున్నదిఅని చింత  చూపు


0009 వర్ణన.........

అవినీతి , లంచం......జాతికి చేటు 

వర్ణించండి.

మీకిష్టమైన పద్యంలో......

🛑🛑🛑

నీతి అవినీతి మధ్యన నీడ తలుపు

మంచి చెడుల మధ్య మనిషి మనసు మాయ

అవసర అనవసర మైన ఆశ మెరుపు

పనులకొరకు ఓర్పుయు లేని ప్రగతి జీవి

లంచ మనెడి రోగి లక్ష్మీ పుత్రుడగుటే

తిండి నిద్ర లేక తిక్క పుట్టు

ఆశ చావ కుండి ఆరాట పోరాట

అలుక అష్ట కష్ట మగుట జీవి

చంద్రిక

మనిషి అవినీతి సమాన బ్రతకులోన ఆకలెక్కువేలె

ధనము చుట్టు తిరుగు దారి నెంచియు మెండుగ భద్ర మను

మనసు చిక్కిపోయి మాన అవమానము భువిని నిలిచి పోవు

మనము యన్న మరచి మనిషిని దోచేటి బుద్ది ఏల నీకు

మత్త కోకిల 

వ్యక్తి ఆశ కవాట బేరసవాక్కు కార్యము స్వర్గమై

యుక్తి తెల్పుట యుద్యమమ్ముయు యక్తి నీడలు నర్కమై

శక్తి యున్నను లంచ మేను సుసాధ్య మవ్వుట కాలమై

ముక్తి కానిది ఒప్పు చేయుట ముఖ్య మేలను జీవితం


0010 దత్తపది  : దాన వీర శూర కర్ణ

దాన మిచ్చె బ్రతుకు దాశ్యము కాదులే

వీర విపృని వలెను విజయ మౌను

సూర మదిని కలిగి సూర్యుని తేజమై

కర్ణ కవచ ధారి కావ్య మగుట

దానగుణము కలిగి ధరలోన బతకాలి

వీరలక్షణముల వెలుగ వలెను

శూరతకిరవౌచు ధర సేవ చేయాలి

కర్ణములకు మాట కళను నింపు

***

0011 సమస్యను పరిష్కరించడం......

ఇంటి కెల్ల రోత యింతి గాదె...

చంటి పాప వలెను చల్లగా చూసెడి 

కంటి నీరు యన్న కార్చ కుండ

పంటి బిగువు నుంచి పలుకు ప్రకటితయు

ఇంటి కెల్ల రోత యింతి గాదె

పంటి పదునే బదులగు

ఇంటి కె రోతయను యింతి ఈశ్వర యిచ్చే

కంటికి చూపుయు ఆనక

తుంటరి యనెడి మనసేను తూ కము మల్లే

0

012 దత్తపది........
తూము
వాము
జాము
నోము
బ్రతుకుతూ ముఖ్య మన్నదీ బంధ మైన
ప్రకృతి కరువా ముడుపులు గా ప్రతిభ విలువ
పోరు సలుపు జాము ఇదియే కోలు కోక
నిత్యమూ నోములు భజన నీడ కొరకు
వాము జీల కర్ర వ్యాధికి మందుయే
తూము గుండె నీరు తూక మగుట
జాము రాత్రి నిద్ర జాతర రగడయే
నోము లెన్ని చేసి నొప్పి అనకు
మత్తకోకిల
తూము నీరుపొలమ్ము పారియు భూమి తడ్పుటయే కదా
వాము చెట్లను రైతు పెంచిసవాలు నెంచియు సాగుటే
జాము రాత్రి సహాయ మెంచియు జాత రైనను ధైర్యమై
నోము సెల్పియు భూమి పూజయు నొప్పి తెల్పక కోయుటే

013 న్యస్తక్షరీ.. మా ర్గ శి ర
మావి తోటలో మధ్యన మనసుయే స్వ
ర్గమయ సహనము స్వేశ్చ మార్గమవు టేను
శిఖర మైన తరువు నెక్కి స్థితియు చూసి
రవ్వ వెలుగుల ప్రేమ యే రమ్య పరచె
014 న్యస్తాక్షరి............
పా
తా
ము
పద్య పాదాది న రావాలి
పాప ప్రక్షాళన జరుపు పదవి పొంది
తాన తందాన అనుటయే తాప మంగ
ళముయు సంపాదన పరమై లయల పలుకు
ముందు జాగర్త కొరకునే ముడుపు కట్టు
పాడు బుద్ది పతనమైన ప్రగతి కోరు
తాళ మనెడి గుణముయేను తప్పుదారి
ళయకరుని శాప మనుచునే లక్షణమ్ము
ముందు చూపియు ఓటుకు ముఖము చూపు
పావ నోదకంబు శిరము పట్టిలేడు
తా ధవళ బూతి రాలును చంద్ర కళ త
ళ తళ లస్థిరములటంచు లయడు దెల్పు
ముక్తి నీయవె శంకరా ముష్టి నాకు
🙏
015 వర్ణన.......
పాద రక్షలు.(చెప్పులు) వలన లాభాలు.
మీకు ఇష్టమైన పద్యంలో......
మనిషి జన్మకు ఒక్కార్ధ మన్ననగుట
నీకు సాధ్యము ప్రేమించ నీదు భక్తి
నమ్మిన కరవక నె నుండి నటన కాదు
పాద రక్షలు ఋణముగా పలక రింపు
టటకిత టటకితయు టా టా యనుచు నుండి
పద పద యనుచుండు పాదరక్ష
పృద్వి పైన వేడి పూర్తిపోంది సుఖము
పాదములకు నీడ పాదరక్ష లగు
ఆ.వె. మట్టి, ముళ్ళు, రాళ్ల, మేటి పాదము రక్ష
తొడుగు కిర్రు చెప్పు తప్పట డుగుమారు
నందచందమృదు ననరుగా నొప్పుటే
చేప్పు కులుకు వలపు చేష్ట జూపు
016 ప్రాంజలి ప్రభ వారి.28-11-2022 దత్తపది పూరించండి లేదు , రాదు , పోదు , చేదు ఇచ్చా చందస్సు ******* 🌹🌹🌹🌹🌹 లేదు యనుత లేకుండగా చేయు నడియె రాదు యనుత చదువు చున్న రాక పోవు పోదు యనుత ధీమాయున్న పోవు చుండ చేదు మాటలు ఎక్కవు చెవికి బాధ లేదు మాటకు నిలకడ లయలు మారు రాదు విసుగన్నది ఎపుడు రాత్రి పగలు పోదు మక్కువ ఎప్పుడూ పోరు నందు చేదు వేప తినగ తీపి చేష్ట లుడికి లేదు లేదు పలుక లోభిగుణమునమ్ము పెట్టెలోపలున్న పైస మురుగు దాన ధర్మదాత ధన్యమై జీవించు లక్ష్మిదేవి మురిసి లాభమగుట 0 co

017 దత్తపది పూరించండి,  కట్టె, కొట్టె, తెచ్చె, వచ్చె ఇచ్చా చందస్సు

ఇట్టె కూలు నటుల ఇండ్లన్ని కట్టె
ఉద్య మించు వారి నోరు గొట్టె
అప్పు మూట నతడె మనకును తెచ్చె
బంగ రంబుగ నిటుల మనకు వచ్చె(తెలంగాణ)

018 దత్తపది: చెప్పులు-తప్పులు-పప్పులు-నెప్పులు

నెప్పులు మరిచి నొప్పుల నీతి విడిచి
పప్పుల ను దొంగిలించిన మెప్పురాదు
తప్పులను మెచ్చి చూపరు దయను సుంత
చెప్పులను విప్పి చెంపలు చెండుతారు

తప్పులు చేయుతే సహజ తాపము పర్గియు తాను ఒప్ప కే
నెప్పులు తెల్పుతే కధలు నేర్పరి దాహము తోడు ఉన్ననూ
చెప్పులు చేత బట్టుటయు చేష్టలు మారియు చేయు కాల మే
పప్పులుడక్క సేవలగు పాలలొ నీళ్లుగ కల్సిబత్కుటే

019 సమస్యను పరిష్కరించడం.....
గుండ్రాతిని జూచినంత గొల్లున నేడ్చెన్ చండ్రా నిప్పులు సెగలే నిండా ముంచే సకాల నీడలు కదిలే బండా మారియు జీవియు గుండ్రా తిని జూచినంత గొల్లున నీడ్చెన్ రండ్రాయంచునుపిలిచిన బండ్ఱాతిమనిసినిఁగనిన బడుగుజనాళిన్ తీండ్రముతోనెదిరించక * గుండ్ఱాతినిఁజూచినంత గొల్లునేడ్చెన్ * .." బండ్రాతి గుండె తోడను, గాండ్రించుచు "మీ ల "నీ బకం బిట మ్రింగన్! నెండ్రియు కిందకు జూడగ గుండ్రాతిని జూచి నంత గొల్లున యేడ్చెన్!!

సమస్యను పరిష్కరించడం..... గుండ్రాతిని జూచినంత గొల్లున  నేడ్చెన్ 


* లేద * నెడిమాటకూడదు

* రాద * నునిశ్చయమునుండరాదునరునకున్

* పోదే * మియుసాయమిడిన

*చేద * గు సంఘటనలిచ్చు జేతృసకాంక్షల్ !!! "

----

" కం.

---

* ఉట్టి * నిఁగలవెన్నపెరుగు

* చిట్టి * చిటికరములఁదీసి చిన్నయ తినగా

* పట్టి * యనిఁజూడకవెసను

* కట్టి * విడిచెజాలిలేక కన్ననినంతన్ !!! "

" కం.

*  ఱేఁడు *నుతినునుగ యన్నమె

* కాడు * నుమోయుబసవుఁడును కళ్యాణమిడున్

* మోడు * నుచిగురించునుగా

* చూడు * మువెనుకఁటిసమయము శుభఫలములకై !!! "

" కం.

భీకరపరిస్థితులలో

వైకల్యమునొందనిమది పౌరుషకృతియౌ

సాకల్యఫలమునకు నిశ్

* శోకమెభూషణముఁగనవిశుద్ధమనమునన్ *  !!! "

" కం.

--

*  ఱేఁడు *నుతినునుగ యన్నమె

* కాడు * నుమోయుబసవుఁడును కళ్యాణమిడున్

* మోడు * నుచిగురించునుగా

* చూడు * మువెనుకఁటిసమయము శుభఫలములకై !!! "


దత్తపది..........

మంచము
కంచము
లంచము
పంచము

నిత్య కామం చమురు వల్ల నీడ పెరుగు
మనసు శోకం చమురు వల్ల మాయ కలుగు
విజయ వాంఛ లంచము వల్ల వెగత పుట్ట
సేయు పంచముఖి శివుని సేవ లన్ని

కంచము, మంచము, లంచము, పంచము
******
కంచము ను  జూడ మించు యాకలి సహజము,
మంచము నుజూడ నిద్రయే ముంచుకొచ్చు,
లంచము గొనుటె వరికైన మంచి దగునె,
పంచము ప్రసాదమనుట పాప మౌగ
కం.
--
* మంచము * నిద్దురనిచ్చును..
* కంచమ* యస్సుది వలదయ కలుములువోవన్
* లంచము * కాఠిన్యమొసఁగు
* పంచకు * ముదురితఁపుచేష్ట పగతురకైనన్ .."
----

కంచ ముందర కంచయే కనుల ముందు
మంచ ముందర ఉట్టియే మనసు తీర్చు
లంచమును పొంది బాధయే లయల గుండు
పంచము ఎవరికి ధనము పగలు రాత్రి

ఇష్టపది 
పుణ్యమైన పనులు పరిహారమగుటయే
ఈ శరీరానికి ఇచ్ఛా జగత్తుయే
సంతోషమ్ము సగము శాంతి కుటుంబమే
పాండిత్య ప్రతిభయు ప్రగతి దేశమునకే
మనసున సుఖముయే మనుగడ బలముయే
అన్యమనస్కులు ఆకర్షణ యగుటే 
అన్యుల సేవయే ఆదరణ కళయే
జగత్తులో విధి జీవగమనముయే
నిత్య దయామయ నీడల కరుణయే
దుఃఖమేలయు నీకు దునియనందు కలమే
పోరాట సత్యమై పొంగేటి విధిలీలె
కథల చరిత మేను కావ్య సంపుట మాయె
🙏🙏🙏
వర్ణన...........
కవిత్వ ప్రయోజనం.....వర్ణించండి
మీకు ఇష్టమైన పద్యాలుగా
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
***
ఆటవెలది 
కవి మనసు బాల్య లీలలై కలలు తెలుపు
యవ్వన హృదయ వాంచ్ఛల ఎతుల గతియు
మనిషి వార్ధత్వ జీవితం మధురమగుట
ఈరహస్య కలగ ప్రాప్తి ఈ కవికళ
***
తేటగీత
 గుండె చప్పుడదియు గుర్తు చేయుటవిధి
బ్రతుకు బండి శబ్ద భయము ఏల
సృష్టి మొదలు యదియు సృతి లయ కారక 
శబ్దము సుడిగుండ శాంత మిచ్చు
***
వాస్తవికతపై పోరాట వ్యాధి యగుట
భోతిక శరీర ఏకపు బోధ జన్మ
ఏప్రయోజనం కోరక ఎల్లవేళ
సాధనక్రియ తెలుపుటే సాధు నీతి
***
*_పద్యచంద్రిక_
అలవిగాని కథను అలక దీర్ప నెంచి తరము తృప్తి పరచ 
కలము రాత ఇదని గలిగిన మనసుగా నాకలి పద్యమై 
జలధిని గన మొక్కి  కళకళ కదలికే కనులు గాంచ కవిత 
గాల మైన బ్రతుకు గమ్య తెలుప నెంచ గనుకవిత్వ మాయ
***
మత్తకోకిల
రమ్య మైన రసాస్వధామ సరాగ గాన మనోమయమ్ 
సౌమ్య భావ సహాయ సంధి సుసౌఖ్య సంఘ కళోదయమ్ 
కామ్య లక్ష్య విదీ వినోద సకామ బుద్దియు కావ్య సంభవ ఉద్యమమ్ 
గమ్య మేది య నేన ఆశయ కాల గీత కవిత్వమే

0

*******
ప్రాంజలి ప్రభ వారి.7-12-2022
దత్తపది పూరించండి
పెట్టవు, తట్టవు, గిట్టవు నెట్టవు
ఇచ్చా చందస్సు
......
వర్ణన.........
తటాక  (చెరువు)  వర్ణన.
మీకిష్ట మైన పద్యంలో
*******
🌹🌹🌹🌹🌹