Sunday, 6 March 2022

chandassu




*ఆధ్యాత్మిక సంభాషణామృతం ఆనందామృతం*


01..*. ద్వంద్వత్వం మరియు విభజనను అధిగమించిన తరువాత, మరొక సృష్టిని వ్యక్తీకరించే శక్తి పుడుతుంది.*

02.*కాలమెప్పుడు నిన్ను నన్ను తరుముతూ, మనస్సును ఉద్రేక పరుస్తూ లోక విజ్ఞానం తెలుసుకో తెలియనివారికి తెలిపి మనసు శాంతి పరచు*

03...ఈ భవనం ఎందుకు కట్టావు? అని చీమ మనల్ని ప్రశ్నించడం;

ఈ సృష్టి ఎందుకు చేశావు? అని మనం దేవుణ్ణి ప్రశ్నించడం రెండూ ఒకటే.

 *పరమాత్ముని బుద్ధిని మన బుద్ధితో  గ్రహించలేం.*

04..అబద్ధం అని తెలిసిన సినిమా కథలో లీనమై అందులోని సుఖదుఃఖాలకు లోనయిపోతుంటాము.

 మరి మనం కనిపెట్టిన ప్రయోగాలకు మనం ఇలా లోనైపోతుంటే., 

*సృష్టి అనేది భగవంతుని క్రియ ప్రక్రియలు 

* . అందులోని సుఖదుఃఖాలకు లోనయిపోవడం ఆశ్చర్యమేమీ కాదు.


5..భగవద్గీత..14/1

దేనిని తెలిసికొని మునులందరును పరమసిద్ధిని పొందిరో అట్టి జ్ఞానములలో కెల్ల ఉత్తమమైన ఈ దివ్యజ్ఞానమును నీకిప్పుడు నేను మరల తెలియ జేయుదును.*


6..నీకు నీవు ఒక బారెడు దూరంలో ఉండడం అలవాటు చేసుకో..,

ఆశ పాశలకు దూరమైతే.....

ఆత్మ, పరమాత్మ అర్థాలు వాటికవే తెలుస్తాయి.


07..ఒకరు:- దేవుడున్నాడా?

బాబు:- దేవుడే ఉన్నాడు.

ఒకరు ::బుద్ధి ఉన్నదా?

బాబు :: అడగాలని ఆలోచన.

ఒకరు :: కర్మ యున్నదా?

బాబు :: జన్మ యే కదా.

ఒకరు ::శక్తి ప్రకటనమైనప్పుడు ప్రాణం ఉంది అంటున్నాము.

బాబు ::శక్తి ప్రకటనం లేకపోతే శవం అంటున్నాము కదా.


8..మనస్సు ఒక పాత్ర లాంటిది..

దానిలో పూలు పెడితే పూలకుండీ అవుతుంది. 

చెత్త వేస్తే చెత్తకుండీ అవుతుంది.

9..ఈ జాగ్రదవస్థ 'ఓ పెద్ద కల' అని తెలుసుకున్నాక ఇందులోని ప్రతిఘట్టము నవ్వులాటగా ఉంటుందే తప్ప దేనికి భయము, కోపము, సుఖము తాత్కాలికంగా స్మరించడం, స్పందించడం అనేది ఉండదు.


10.. పొట్టు ఉంటే వరిగింజ.

వరిగింజ తిరిగి మొలకెత్తుతుంది.

 పొట్టును తొలగిస్తే బియ్యపుగింజ.

 బియ్యపుగింజ తిరిగి మొలకెత్తదు.


వరి గింజ = జీవుడు 

బియ్యపు గింజ = దేవుడు

పొట్టు = అజ్ఞానం 

మొలకెత్తడం = తిరిగి జన్మించడం.

అనగా, అజ్ఞానం తొలగితేనే జన్మరాహిత్యం కలుగును.


11..*సుగుణాన్ని గుణించి, ధర్మాన్ని కూడికతో, అధర్మాన్ని తీసివేతతో, దుర్గుణాన్ని భాగించి, సంసారాన్ని నూరుశాతం నవ్వులతో జీవితం*


12..ఒకరు:: శరీరం?

గురువు :: *మానవ శరీరము యోగికి తోలు తిత్తిలా, కాముకుడికి కోరిక తీర్చేదిగా, క్రూర మృగానికి మాంసం ముద్దలా*, 

 *పదార్థం ఒక్కటే అయినా వారి చూపును, భావమును బట్టి పలు రకాలుగా. కనుక వ్యత్యాసం మన చూపులోనే *.

13..ఒకరు :: మనకు తోడు 

గురువు :: *సూర్యచంద్ర కదలికలు, ప్రకృతి పంచ భూతాలు మాత్రమే*.

ఒకరు :: మరి సంసారం 

గురువు :: వయసు బట్టి ఆలోచనలు 

*ఎవరికి ఎవరు బంధువులు? భార్య ఎవరు? తల్లి ఎవరు? తండ్రి ఎవరు? కుమారుడు ఎవరు?* 

*నదీజలాలలో కర్రతునకలు తేలుతూ వచ్చి చేరుతాయి, మళ్ళీ విడిపోయి తమ దారిలో తమంతకు తాము వెళ్ళిపోతాయి. అలాగే బంధువులు కూడా. నీటిలో బుడగలు ఎగిసిపడుతూ మరుగైనట్లు, బంధువులనే వారు పుడతారు. వారికి వారే విడిపోతారు. ఇలాంటి బ్రతుకులో ఏ పండితుడు ఆసక్తి కనబరచుతాడు?*


14..*సుఖం మధ్యలో దుఃఖం, దుఃఖం మధ్యలో సుఖం చేరి ఉంటాయి. అలాగే, (నీళ్ళు, బురద) (పాలు, నీళ్లు ) ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి*.


15..జింకలు జింకలతో, గోవులు గోవులతో, గుఱ్ఱాలు గుఱ్ఱాలతో, మూర్ఖులు మూర్ఖులతో,  పండితులు పండితులతో

 సమానశీలము, భార్య భర్తల కలయిక, సమానమైన వ్యసనాలు (అంటే కష్టాలు, బాధలు కూడా) కలిగినవారి నడుమ స్నేహం ఏర్పడుతుంది. అదే యీ కలియుగం


16..ఒకరు:- స్వామి రమణ మహర్షి, రాఘవేంద్ర స్వామి, వీరబ్రహ్మేంద్రస్వామి, యోగివేమన లాంటి మహనీయులందరూ ఎక్కడికి వెళ్లారు?

 సద్గురు:- నిద్రలో నీవు ఎక్కడికి వెళుతున్నావో., అక్కడికే (సుషుప్తావస్థ)


17..నాది అని చెప్పబడే ఏది?

'నేను' కాదు అని తెలిస్తే వేదాంతం తెలిసిపోయినట్లే.


18. మనం నాలుగు పదార్థాలం :-

 దేహ పదార్థం మనకు తల్లిదండ్రుల నుండి వచ్చింది.

 మనో పదార్ధం మనకు సమాజం నుండి వచ్చింది.

 బుద్ధి పదార్థం మనకు గత జన్మల నుండి వచ్చినది.

 ఆత్మ పదార్థం మనకు మహా మూల చైతన్యం నుండి వచ్చినది.

 పై మూడు అందరికీ వేరే వేరే. కానీ, ఆత్మ పదార్థం అందరికీ ఒక్కటే. 

 కనుక ఆత్మ పదార్థంలో ఎవరైతే స్థితమవుతారో వారి జీవితం లోనే ఆనందం లభ్యమవుతుంది.

19..ఒకరు:- అంతా ఈశ్వరేచ్ఛ అన్నారు? మరి జీవునికి స్వేచ్ఛ లేదా?

సద్గురు:- మైదానంలో గుంజకు కట్టివేయబడిన ఆవు మెడకు కట్టి ఉన్న తాడు పొడవును బట్టి ఆ మేరకు ఆవుకు (జీవునికి) ఉన్న స్వేచ్ఛ.


20..జ్ఞానికి తన దేహం

 'ఓ వాహనం'., 

ఈ జగత్తులో విహరించడానికి.

****

21.." తామరాకుపైని నీటి బొట్టు కద 

  చంచల బతుకిది తెరచుకో నీ యెద 

  కమ్ముకున్న వ్యాధులు అభిమానములు 

  జగతిలో శోకముగ శతమానములు "

         

22.." చచ్చు వారలెవరు ? చావని వారెవరు?

  చచ్చి బ్రతికి యుండు జనము లెవరు ?

  విచ్చల విడిగాను వివరించి చూడరా!


23..ఉద్దేశపూర్వకంగా తెచ్చుకున్న మరపుకు 'మాయ' అని పేరు.

మళ్లీ ఉద్దేశపూర్వకంగా తెచ్చుకునే జ్ఞప్తికి 'ధ్యానం' అని పేరు.

సదా పరాన్ని గూర్చి తలపోస్తూ ఉండటమే పారాయణం.

____


24..తాను బ్రహ్మం అనేది మరచి మల్లిక అయినట్టు..

తాను మల్లిక అనేది మరచి బ్రహ్మం కావాలి.

____

25..వ్యాపారి:- ఆధ్యాత్మిక జ్ఞానం అంతా ఒక్క మాటలో చెప్పగలరా?

గురువు:- నిశ్శబ్దం 

వ్యాపారి:- మరి ఆ నిశ్శబ్దాన్ని ఎలా అందుకుంటాం?

గురువు:- ధ్యానం ద్వారా 

వ్యాపారి:- అయితే ధ్యానం ఎలా చేస్తారు?

 గురువు:- నిశ్శబ్దంగా ఉండటం ద్వారా 

వ్యాపారి:- నిశ్శబ్దంగా నిష్క్రమించాడు...

26..ఆత్మ తప్ప మరేది లేదని గ్రహించడమే ఆత్మసాక్షాత్కారం.


27.. కర్మకు ఆచారం అవసరం.

 భక్తికి ఆర్తి అవసరం.

 జ్ఞానానికి విచారం అవసరం.


28..బయట ఉండే స్వాముల సందేశాలను వినండి.

మీ లోపల ఉండి చెప్పే స్వామి సందేశాలను అనుసరించండి.

ఇది నా ఇల్లు అన్నప్పుడు నేను వేరు, ఇల్లు వేరు అని స్పష్టంగా తెలుస్తోంది కదా!


29..ఇది నా దేహము అంటే నేను, దేహము ఒకటయ్యే అవకాశం లేదు. నువ్వు దేన్నైనా చూస్తున్నావు అంటే

 ఆ దృశ్యం నీ కంటే వేరైనది అని అర్థం.

చూడబడే ఈ దేహం దృశ్యం అవుతుంది.

 చూసే నీవు ద్రష్టవు అవుతావు.


20.. శరీరమే - ఉత్సవ మూర్తి.

  ఆత్మే - మూల విరాట్.

21.." తామరాకుపైని నీటి బొట్టు కద 

  చంచల బతుకిది తెరచుకో నీ యెద 

  కమ్ముకున్న వ్యాధులు అభిమానములు 

  జగతిలో శోకముగ శతమానములు "

         

22.." చచ్చు వారలెవరు ?  చావని వారెవరు?

  చచ్చి బ్రతికి యుండు జనము లెవరు ?

  విచ్చల విడిగాను వివరించి చూడరా!


23..ఉద్దేశపూర్వకంగా తెచ్చుకున్న మరపుకు 'మాయ' అని పేరు.

మళ్లీ ఉద్దేశపూర్వకంగా తెచ్చుకునే జ్ఞప్తికి 'ధ్యానం' అని పేరు.

సదా పరాన్ని గూర్చి తలపోస్తూ ఉండటమే పారాయణం.

____


24..తాను బ్రహ్మం అనేది మరచి మల్లిక అయినట్టు..

తాను మల్లిక అనేది మరచి బ్రహ్మం కావాలి.

____

25..వ్యాపారి:- ఆధ్యాత్మిక జ్ఞానం అంతా ఒక్క మాటలో చెప్పగలరా?

గురువు:- నిశ్శబ్దం 

వ్యాపారి:- మరి ఆ నిశ్శబ్దాన్ని ఎలా అందుకుంటాం?

గురువు:- ధ్యానం ద్వారా 

వ్యాపారి:- అయితే ధ్యానం ఎలా చేస్తారు?

 గురువు:- నిశ్శబ్దంగా ఉండటం ద్వారా 

వ్యాపారి:- నిశ్శబ్దంగా నిష్క్రమించాడు...

26..ఆత్మ తప్ప మరేది లేదని గ్రహించడమే ఆత్మసాక్షాత్కారం.


27.. కర్మకు ఆచారం అవసరం.

 భక్తికి ఆర్తి అవసరం.

 జ్ఞానానికి విచారం అవసరం.


28..బయట ఉండే స్వాముల సందేశాలను వినండి.

మీ లోపల ఉండి చెప్పే స్వామి సందేశాలను అనుసరించండి.

ఇది నా ఇల్లు అన్నప్పుడు నేను వేరు, ఇల్లు వేరు అని స్పష్టంగా తెలుస్తోంది కదా!

29..ఇది నా దేహము అంటే నేను, దేహము ఒకటయ్యే అవకాశం లేదు. నువ్వు దేన్నైనా చూస్తున్నావు అంటే

 ఆ దృశ్యం నీ కంటే వేరైనది అని అర్థం.

చూడబడే ఈ దేహం దృశ్యం అవుతుంది.

 చూసే నీవు ద్రష్టవు అవుతావు.

30..  శరీరమే - ఉత్సవ మూర్తి.

  ఆత్మే -  మూల విరాట్.


31..అవసరంఅవకాశము అనుకరణయు 

అసలు ఆనంద ఆవేశం ఆత్రమదియు 

నిజమునెడిశక్తి నిలకడ నియమమదియు 

వ్యక్తి విజయవాంఛ చెలిమి వాక్కు గతియు


32..సుఖములు యెల్లలేయగుట భుక్తి సమమ్ము యనేది కష్టమే  

వికసిత సౌఖ్యమే యగుట విశ్వ విజేత మనస్సు కష్టమే 

సకలము భోజ్యమే యగుట సంబరమౌను గుణమ్ము కష్టమే 

ఒకరికి ఒక్కరౌ సుఖ శుభోద సమర్ధసుబుద్ధి యిష్టమే


33..(భగవద్గీత 2/22 

.జీర్ణమైన వస్త్రములనొదిలి కొత్త వస్త్రములను ధరించినట్లె, 

నిరుపయోగమైన శరీరమును వదిలి ఆత్మ కొత్త శరీరంలోకి ప్రవేశించును.


34..ప్రయత్నం.. నీ సత్య ధర్మం

ఫలితం..... దైవ నిర్ణయం

పరిస్థితులు ..కాల ప్రకృతి వరం

ఎదుర్కోవడం... నీ మనోధైర్యం


35.. చావు అంటే ఏమిటి?

భౌతిక శరీరం మరియు సూక్ష్మ శరీరం మధ్య ఉండే 'ప్రాణయమ తీగ' (Silver Cord) తెగిపోవడమే చావు అంటే. చావు అనేది భౌతిక శరీరానికి మాత్రమే. ఈ శరీరం కొన్ని అణువుల సముదాయం.  ఈ సముదాయానికి కొంత కాల పరిమితి మాత్రమే ఉంటుంది. చావు అనేది 'నేను' అనబడే 'నా'కు కాదు. ఈ భౌతిక శరీరానికి మాత్రమే.


36..చావు తర్వాత ఏమవుతుంది?

చావు తరువాత ఆత్మ, సూక్ష్మ శరీరంతో (ఏడు శరీరాలలో ఒకటి) సూక్ష్మ లోకాలకు వెళ్తుంది.


37.. అయితే నేను చిరంజీవినా?

జీవి ఎప్పుడూ చిరకాలంగా ఉండేదే! చావు, నాశనం అనేవి లేవు. ప్రతి జీవి యొక్క పరమార్ధం 'పరిపూర్ణత'ను సాధించడమే.


38.. పరిపూర్ణత ఎప్పుడు కలుగుతుంది?

మనం ఈ భౌతిక శరీరంలో ఉండి, అన్ని పాత్రలు ధరించి, ప్రతి ఒక్క పాఠము నేర్చుకొని 'పరిపూర్ణం' (perfect) అయినప్పుడు మాత్రమే.


39.. నేను ఈ శరీరాన్ని ఎన్నిసార్లు దాల్చాలి?

మనం ప్రతి జీవితంలోనూ 'ఏమి నేర్చుకోవాలో' ముందుగానే మన ఆత్మ నిర్ణయించుకుంటుంది. 

మన లక్ష్యం నెరవేర్చేవరకు మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తవలసి వస్తుంది. మన లక్ష్యం ఈ భౌతిక జీవితంలోనే నెరవేర్చాలి. 


40.. అయితే, నేను ఈ శరీరం కాదా?

అవును, మనం ఈ భౌతిక శరీరం కాదు. ప్రతి ఉదయం మనం స్నానం చేసి వేరే గుడ్డలు మార్చినట్లు, ఈ జన్మ తరువాత ఇంకో జన్మ తీసుకొంటాము. మనం వేసుకొనే బట్టలను జాగ్రత్తగా చూసుకొన్నట్లే ఈ శరీరాన్ని కూడా మనం జాగ్రత్తగా చూసుకోవాలి.

****

41..గురువుకు శిష్యుడు కూడా గురువుగానే కనిపిస్తాడు,


శిష్యుడు అని అనిపిస్తే ఆ గురువు - గురువు కాడు.


42..కన్ను మూస్తే కనబడే చీకటిని చూస్తూ ఉంటే, ఆ చీకటే కాసేపటికి వెలుగుగా మారుతుంది. ఎందుకంటే., 'చూసేవాడే' వెలుగు కాబట్టి.


'43..తత్' (అది) అని మాత్రమే అనగలిగిన ఆ ఏక వస్తువుకు---

భక్తులు - భగవంతుడు అని;  జ్ఞానులు - ఆత్మ అని పేర్లు పెట్టుకున్నారు.


44..➡️ గ్రామ మునసబు యొక్క నేను గ్రామమంత.

➡️ దేశాధినేత యొక్క నేను దేశమంత.

➡️ జ్ఞాని యొక్క నేను విశ్వమంత.


45..➡️ అలను తాకిన తాకేది సముద్రాన్నే.

➡️ కుండను తాకిన తాకేది మట్టినే.


 ప్రపంచాన్ని చూస్తున్నా చూసేది దైవాన్నే.


46..👉 సినిమా జరుగుతున్నప్పుడే 'తెర'ను చూడగలగడం -- జీవన్ముక్తి.


👉 సినిమా అయిపోయిన తర్వాత 'తెర'ను చూడడం -- విదేహముక్తి.


47..పంచకోశాలు - అనువైన వైద్యం:-


➡️ అన్నమయ కోశం - అల్లోపతి (ఆంగ్ల వైద్యం), ఆయుర్వేదం

➡️ ప్రాణమయ కోశం - ఆక్యుపంక్చర్ (సూదుల వైద్యం),  ఆయుర్వేదం

➡️ మనోమయ కోశం - హోమియోపతి (బలోపేత క్రియ {పొటెన్సీ} - మందు మోతాదు  ఎంత తక్కువ అయితే అంతా ఎక్కువ ప్రభావం), ఆయుర్వేదం

➡️ విజ్ఞానమయ కోశం -   హిప్నాటిజం (ఉద్దేశపూర్వకంగా సృష్టి చేయబడే నిద్ర)

➡️ ఆనందమయ కోశం - ధ్యానం (మెడిటేషన్)


 ప్రాథమికం - చికిత్స

 ద్వితీయం - నిద్ర 

 అంతిమం - ధ్యానం


49..శంకరాచార్యులు:-  జరుగు.. జరుగు..


చంఢాలుడు:- ఏది జరగాలి??

 శరీరమా?  చైతన్యమా?

➡️ శరీరం జడం.. అది జరగలేదు.

➡️ చైతన్యం అనంతం.. అది జరిగే అవకాశం లేదు.

 మరి ఏది జరగాలి?


50..కర్ణుని జన్మ రహస్యం -

➡️ తెలియనంత వరకు సూత పుత్రుడు.

➡️ తెలిసాక కుంతీపుత్రుడు.


 జగత్ స్వరూప రహస్యం -

➡️ తెలియనంత వరకు మిథ్య నేను.(కెరటం/ఆభరణం)

➡️  తెలిసాక అసలు నేను (సముద్రం/బంగారం)


051..శివుడు తేజోలింగంగా సాక్షాత్కరించినప్పుడు దాని ఆద్యంతాలు కనిపెట్టడానికి బ్రహ్మవిష్ణువులు ప్రయత్నించారు.
➡️ కనుగొన్నాను అని అబద్ధం చెప్పి శివుని శాపానికి గురయ్యాడు బ్రహ్మ.
➡️ కనుగొనలేమని నిజం చెప్పి శివుని నుండి విష్ణువు 'చక్రాన్ని' బహుమానంగా పొందాడు.

అంతరార్థం:-
👉  సైన్స్ (బ్రహ్మ) బహిర్ముఖ ప్రయాణం చేసి చేసి, అలా అనంతంగా ప్రయాణించి అలసిపోతుంది.
👉 ఆధ్యాత్మికత (విష్ణువు) అంతర్ముఖ ప్రయాణం చేసి,  ఆత్మ మూలాన్ని కనుగొని అందులో హాయిగా విశ్రమిస్తుంది.

52..శివ తత్వం:-

➡ శివం - శుభకరం, శుభాన్ని కలిగించేవాడు.
➡ త్రినేత్రం - ధ్యానం.
➡ ఢమరుకం - సంగీతం.
➡  తాండవాభినయం -  నృత్యం.
➡ శివుని చేతిలోని అగ్ని - నిప్పుతో చెలగాటం అనగా జీవితంలో ఎట్టి ఒడిదుడుకులు ఎదురైనా, ధైర్యంగా ఎదుర్కోవటం.
➡ భిక్ష పాత్ర -  ప్రతి ఒక్కరి నుండి జ్ఞానం నేర్చుకోవడం.
➡ కపాలం - శరీరం యొక్క చివరి దశని సూచిస్తాయి.
➡ కోరుకునేది - చితా భస్మం కాదు.  చిత్త భస్మం. (అనగా శూన్య స్థితి)

53..మల్లిక:- నాలో నేను లీనమైపోతున్నాను..
సద్గురు:-  లీనమవ్వండి.. తప్పేముంది.. అప్పుడే కదా మల్లిక పాత్ర సక్సెస్ అయ్యేది.
మల్లిక:- అప్పుడు ఎడంగా ఉండటం జరగదు కదా!
సద్గురు:- ఇదొక పాత్ర అని తెలిసినప్పుడు.. పాత్రకు ఎడంగా ఉన్నట్లే కదా!!

54..నేను ఉన్నాను' అని ఆభరణం అంటుంది., బంగారం అంటుంది..

➡️ బంగారం(ఆత్మ) చెప్పే 'నేను ఉన్నాను' - శాశ్వత సత్యం.
➡️ ఆభరణం(దేహం) చెప్పే 'నేను ఉన్నాను' - తాత్కాలిక సత్యం.

55..దేహ స్వభావం తెలిసిపోయింది - అది ఎప్పటికైనా నశిస్తుంది.

మనసు స్వభావం తెలిసిపోయింది - అది అంతటా చరిస్తుంది.

ఆత్మ స్వభావం తెలిసిపోయింది - అది అంతటా నిండిపోయింది.

56..భగవంతుడు - మొత్తంగా ఉన్నాడు, గుప్తంగా ఉన్నాడు.

కడియంలో బంగారం వలె.

57..ఆత్మహత్య మహా పాపం:-

➡️ ఆత్మకు చావు లేదు పుట్టుక లేదు.
➡️ హత్య జరిగేది దేహానికే గాని, ఆత్మకు కాదు.
అర్థం చేసుకోవలసినది ఏమనగా,  'ఆత్మ ప్రగతి'ని మధ్యలోనే ఆపుకుంటున్నారని అర్థం. తద్వారా ఒక జన్మ వృథా.

అందువల్ల, ఆత్మ పురోగతి యొక్క హత్యయే మహా పాపము.

58..పూజ కోటి సమం స్తోత్రం;  స్తోత్ర కోటి సమో జపః !
జప కోటి సమం ధ్యానం;   ధ్యాన కోటి సమో లయః !!
( ఉత్తరగీత - బ్రహ్మ సందర్శన యోగం 52 వ శ్లోకం)

తాత్పర్యం :-
➡ కోటి పూజలతో సమానం ఒక స్తోత్రం.
➡ కోటి స్తోత్రాలతో సమానం ఒక జపం.
➡ కోటి జపాల తో సమానం ఒక ధ్యానం.
➡ కోటి ధ్యానాలతో సమానం ఒక లయం.
              " మనో లయమే మోక్షం".

అంతరార్థం:-
పూజ :- భగవంతుడు ఉన్నాడని తెలుస్తుంది.
స్తోత్రం:- భగవంతుని గుణగణాలు తెలుస్తాయి.
జపం:- భగవంతుణ్ణి పదే పదే తలుస్తాం.
లయం:- భగవత్ పదార్థమని తెలుసుకుంటాము.

59..మన శరీరంలో విద్యుదయస్కాంత శక్తి కణాలు (Electro Energy units) హై ఫ్రీక్వెన్సీ లో ఉన్నప్పుడు  బ్యాక్టీరియా లేదా వైరస్ లు దేహ ఆరోగ్య రక్షణ వ్యవస్థను ముట్టడించలేవు.

వీటిని (EE units) పెంచుకోవడానికి అతి సులభమైన మార్గము అంతర్ ప్రయాణం లేదా ధ్యానం.

60..👉 తపస్సు(ధ్యానం) వలన నీ చుట్టూ ఆరా(దివ్య శక్తి) ఏర్పడుతుంది.
👉 ఆ ఆరాను దాటి ఏ దుష్టశక్తి( వైరస్సులు, చేతబడులు etc) నీ దరి చేరవు.

ఏ దుష్టశక్తి అయినా
➡ బహిర్ముఖుణ్ణే నాశనం చేస్తుంది.
➡ అంతర్ముఖుణ్ణి నమస్కరించి వైదొలగుతుంది.
*-**

61..మే డే* *సందర్భంగా ప్రపంచ కార్మికుల* *కందరికి శుభాభినందనలు. శుభాకాంక్షలు.*

*భూమ్మీద ఉన్న వారిలో ఒక్కొక్కరు ఒక్కొక్క వాహనంలో ఒక్కొక్క వేగంతో ప్రయాణిస్తుంటారు.

* నిజానికి వీరందరూ భూమితోపాటు పడమర నుండి తూర్పుకు గంటకు 1674 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తున్న వారే.అదే విధంగా.,
 
*జీవుల్లో స్థితి భేదాలు కనిపించినప్పటికీ,
ప్రతి జీవి 'మహా మూల చైతన్యము' వైపుకే సమాన వేగంతో ప్రయాణిస్తున్న వారే.

62..సీ..రాత్రి పగలు గూడ రాజ్యాభివృద్ధిగా
జనుల రక్షిత భావజాతి నుంచి
బట్టెడన్నముపంచ బరిశ్రమించ బ్రతుకు
గట్టిపనులుచేయ గమ్య మెంచి
రక్తము పీల్చెడి రక్కసి యంత్రాలు
మనిషి పనులులేక మాట లెంచి
శ్రమజీవుల కళలు సరళరీతినసాగె
కార్మికుల బతుకు కాల మెంచి

కదముతొక్కగళమునెంచి గమ్య మవధి
శ్రమకు దగ్గఫలమునెంచ శ్రావ్యశక్తి
కష్ట జీవి బతుకు నిత్య కాల యుక్తి
ప్రాంజలి ఘటించి తెలిపేద ప్రభల గీత
***-

63..ఉ..పచ్చని చెట్టు నీడ మది భావము వెచ్చగ నుండ గల్గుటన్
వచ్చిన వారి సేవగతి వారికి వీలుని కల్గ చేయుటన్
నచ్చిన నచ్చకుండినను నమ్ముచు దీక్షత దక్షతేయగున్
లచ్చిని పూజచేసినను లాలన పాలన సఖ్యతేయగున్

64..శా..అల్పంబౌ పదమాలయేలపలుకై ఆదర్శ భావమ్ముగన్
శిల్పంబౌ చరితమ్మురీతికదిలే సేద్యమ్ము జెయూతగన్
దల్పంగన్ సమరమ్ముగాను సహజం ధర్మమ్ము సాధ్యంబుగన్
కల్పంబై నదిగా మదీయ భవమే కర్తవ్య సందర్భమున్

65..కళలు కాలమహిమ నెంచ కథలు చెప్ప
కక్ష సాధన రోదన గతులు తప్ప
ఇచ్ఛ వినువీధులమయము యిoతి స్వేచ్చ
దీక్ష లెన్నైన నడకలు దీన బ్రతుకు

66..సీ..గుర్తుచేసడివారు గురువుగారు మనసు
మాత్రమే సరి చేయు మాన్య వరులు
సర్వ యుక్తిగనుపంచ సమయ సద్భావము
సకల సంపదపంచ సౌఖ్య పరులు
వాగ్దేవి లీలలు వాగ్దాటి వివరణ
కలికాలమున పద్య కావ్య వరులు
దైవవాక్కు తెలప ధన్యతా వాక్కులు
ఆదిదంపతుల సమయాన సిరులు

అమ్మ పలుకుగా జగదాంబ ఆత్మధీర
అయ్య శివలీల వివరణ ఆత్మ ధీర
దివ్య మైన త్రిమూర్తుల దీక్ష ధీర
ప్రాంజలి ఘటించి తెలిపేద ప్రభల గీత

67..*. శ్రీమద్భగవద్గీత - 14/3
: ఓ భరతవంశీయుడా! బ్రహ్మముగా పిలువబడు మహతత్త్వము సమస్త జననమునకు ఆధారమై యున్నది. సర్వజీవుల జన్మను సంభవింపజేయుచు నేనే ఆ బ్రహ్మము నందు బీజప్రదానము కావించుచున్నాను.*

*అట్టి మహతత్త్వము ముండకోపనిషత్తు (1.1.9) నందు బ్రహ్మముగా వర్ణింపబడినది. “తస్మాదేతద్ బ్రహ్మ నామ రూపమన్నం చ జాయతే”.  అట్టి బ్రహ్మము నందు భగవానుడు జీవులను బీజరూపమున ఉంచును. భూమి, జలము, అగ్ని, వాయువు మొదలుగా గల చతుర్వింశతి మూలకములన్నియును భౌతికశక్తిగా పరిగణింపబడును మరియ అవియే మహద్భ్రహ్మమనబడును భౌతికప్రకృతిని రూపొందించును.

68.. *అవగాహన పెరిగినప్పుడు మరియు మీరు స్పష్టంగా అప్రమత్తంగా మారినప్పుడు, అంగీకరించడం అనేది సహజ పరిణామం.*

69..*పుణ్యముల వలన క్రమముగ సాయుజ్య మేర్పడును.చివరకు సారూప్య మేర్పడును. సారూప్య మేర్పడుటయే లభ్యమగుట. తన రూపమున శ్రీమాతయే యున్నదని తెలిసి ఆనంద పరవశుడై కీర్తించుచు, దర్శించుచు, సేవించుచూ తాదాత్మ్యము చెందును. ఇది పరాకాష్ఠ.
*****

71..*భూమ్మీద ఉన్న వారిలో ఒక్కొక్కరు ఒక్కొక్క వాహనంలో ఒక్కొక్క వేగంతో ప్రయాణిస్తుంటారు.

* నిజానికి వీరందరూ భూమితోపాటు పడమర నుండి తూర్పుకు గంటకు 1674 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తున్న వారే.

  అదే విధంగా., 

* జీవుల్లో స్థితి భేదాలు కనిపించినప్పటికీ,

 ప్రతి జీవి 'మహా మూల చైతన్యము' వైపుకే సమాన వేగంతో ప్రయాణిస్తున్న వారే.

***

72..కర్ణుని జన్మ రహస్యం -

* తెలియనంత వరకు సూత పుత్రుడు.

* తెలిసాక కుంతీపుత్రుడు.


 జగత్ స్వరూప రహస్యం -

* తెలియనంత వరకు మిథ్య నేను.(కెరటం/ఆభరణం)

* తెలిసాక అసలు నేను (సముద్రం/బంగారం)

*****


73..తే. గీ.ధన్యవాదాలు మీకును ధరణి నందు 

అన్యధా పదపలుకులు ఆశ చిలుకు 

మాన్య మహనీయ పరులకు మనసు తెలుపు 

గమ్యమెరుగని కథలగు కాల గమన 


74..తే. గీ. పదనిస సరిగమలు కావ్య పలుకు లీల 

నిరతము గురి రిక్తమగుట నీడ లీల 

ప్రేమగ గతి యుక్తి యగుట ప్రీతి లీల 

కనుల మమతల కలయిక కలలు లీల 

(దత్తపది.. సస.. రిరి.. గగ.. మమ)


75..తే. గీ..గీత నాహృదయమునందు గెలువ నిచ్చి 

తెలుసుకొనుము నింక యనుచు తేజమదియె 

నరయ నాశరహితమౌ జ్ఞానమగు రీతి 

కృష్ణుడిటుల పలికె వాక్కు కృపయు జూప


76..తే. గీ. మంచి చెడును కూడ మనిషి మార్గ మవుట 

మైత్రి కోరు వారు సహజ మంచి కాంచు

కక్ష పూను వారు కలహించు కాల మందు 

చెడును చూపు చుండు ననుచు చెలిపలుకగు


77.ఉ..పట్టుట మక్కువే యగుట పాఠము తెల్పియు నేర్ప జీవమై 

అట్టుల యే ననేటిగతి ఆశల పాశము జీవమార్గమై 

కొట్టుట తిట్టుటే యనక కోపము తాపము మార్గమౌనమై 

కట్టుమనస్సు నుంచకయె కాలము తీర్పగు సర్వ ధర్మమై 

(దత్తపది.. పట్టు.. అట్టు.. కొట్టు.. కట్టు )


78..దక్షతే మాపద కల్గ చేయవిధి ధర్మమ్మోను సత్యమ్ముగన్ 

రక్షణే సౌఖ్యము చూపకల్గితివి రమ్యత్వమ్ము తత్త్వమ్ముగన్ 

శిక్షణే పుట్టుట గిట్టుటౌ యనుచు శీఘ్రమ్మోను దైవమ్ముగన్ 

కక్ష లేనట్టిది జీవసాగరము కార్యమ్మోను నేస్తమ్ముగన్

(దత్తపది.. దక్ష.. రక్ష .. శిక్ష.. కక్ష )


79..ఉ..దండములయ్యవిఘ్నపతి తప్పులునెంచకుమానసంబునన్

మెండుగమోదకాలిడుదు మెండగుపత్రసుమాలపూజతో 

నిండగునీదయాऽऽమృతమునెమ్మదిఁగోరెదపార్వతీసుతా 

పండుగయౌనుమాకెపుడువాంఛితకామ్యఫలంబుఁగల్గగా !!! "

(దత్తపది దండము, మెండుగ, నిండుగ, పండుగ )


80..మ.ధనమే మాపద కల్గచేయవిధి ధర్మమ్మోను సత్యమ్ముగన్ 

రణమే సౌఖ్యము చూపకల్గితివి రమ్యత్వమ్ము తత్త్వమ్ముగన్ 

క్షణమే పుట్టుట గిట్టుటౌ యనుచు క్షేమంమ్మోను దైవమ్ముగన్ 

గుణమేయట్టిది జీవసాగరము గుర్వమ్మోను నేస్తమ్ముగన్

(దత్తపది..ధన.. రణ.. క్షణ.. గుణ )

*****


***

81..మాతృగర్భం నుండి భూగర్భం వరకు మనం చేసే ప్రయాణమే జీవితం.

***

82..మూడవస్థల్లోనూ ముగ్గురు కర్తలు ఉన్నారు.

ముగ్గురు కర్తలకు మూడు పేర్లు పెట్టారు మన ఋషులు.


1. జాగ్రదవస్థలో ఉండే కర్త -

వ్యష్ఠిగా వైశ్వానరుడు, సమిష్టిగా విరాట్ పురుషుడు.

2. స్వప్నావస్థలో ఉండే కర్త -

 వ్యష్ఠిగా తైజసుడు, సమిష్టిగా హిరణ్యగర్భుడు.

3. సుషుప్తావస్థలో ఉండే కర్త -

 వ్యష్ఠిగా ప్రాజ్ఞుడు, సమిష్ఠిగా ఈశ్వరుడు అని పేర్లు.


 ఈ మూడింటి సమిష్టియే తురీయము.

దీనికి సాక్షి ఒకడు ఉన్నాడు., వాని పేరే పరబ్రహ్మము.

***

83..ప్రకృతిని చూసి మనం నేర్చుకోవలసినవి:-


చెట్టు - త్యాగం 

పర్వతం - నిశ్చలత్వం

సముద్రము - కలుపుకొనే స్వభావం 

సూర్యుడు - పోషకత్వం

చంద్రుడు - ఆహ్లాదము

భూమి - క్షమ

నీరు - ఇమిడిపోవడం

అగ్ని - అబేధ దృష్టి

వాయువు - వ్యాపనము

ఆకాశము - అన్ని తనలోనే ఉన్న ఏమీ లేనట్లు కనబడే నిరాడంబరము

***

84..సంక్రాంతి = సమ్యక్ + క్రాంతి.


సమ్యక్ = సరి అయిన

క్రాంతి = ఆత్మ జ్ఞానం (Enlightenment.)


➡ కాంతి = Physical Light (సూర్యుని ద్వారా)

➡ క్రాంతి = Spiritual Light (ఆత్మ జ్ఞానం ద్వారా)


✳ సూర్యుడు లేకపోతే 'భౌతిక అంధకారం' కలుగును.

✳ ఆత్మ జ్ఞానం లేకపోతే 'ఆధ్యాత్మిక అంధకారం' కలుగును. 

 ఆధ్యాత్మిక అంధకారం పోవాలంటే "ధ్యాన సాధన, స్వాధ్యాయ సాధన, సజ్జన సాంగత్య సాధన" చేయవలెను.

***

85..✳ జీవాత్మ:- ఒక జీవిని నడిపించడానికి ఆ శరీరం లోపల పరిమితమైన శక్తి ఉంటుంది. దానిని జీవాత్మ అంటారు.

✳ పరమాత్మ:- జీవాత్మ వంటి శక్తే విశ్వమంతా వ్యాపించి ఉంటుంది. దానిని పరమాత్మ అంటారు.


 రెండు శక్తులు ఒకటే.

 ఒకటి పరిమితమైనది, రెండవది అనంతమైనది.

 రెండూ ఒక దానితో మరొకటి అనుసంధానమైతే దానిని 'యోగం' అన్నారు. మరి ఆ యోగంలో ఉండాలంటే 'ఆలోచనలు లేని స్థితి'ని పొందాలి.

***

86..కల్పతరువు - కామధేనువు - చింతామణి:-

(ఆధ్యాత్మిక అంతరార్ధాలు)


➡️ కల్పన అంటే 'మనోశక్తి'. మన మనోశక్తి ద్వారా మనం సాధించలేనిది అంటూ ఏదీ లేదు!

➡️ కామం అంటే 'కోరిక'. మనం గట్టిగా ఏది కోరుకుంటే అది అచిరకాలంలో మన వద్దకు వచ్చి తీరుతుంది!

➡️ చింతన అంటే 'మేధస్సు యొక్క ఉపయోగం'. శాస్త్రీయ చింతన ద్వారానే అన్ని చిక్కులను విడదీయవచ్చు.


కనుక 

👉 'శుద్ధమైన కల్పన' అన్నదే అన్నీ ఇచ్చే "కల్పతరువు"

👉 'సరియైన కామం' అన్నదే అన్నీ ప్రసాదించే "కామధేనువు"

👉'శాస్త్రీయ చింతన' అన్నదే చిక్కులన్నీ విప్పే "చింతామణి".


 ఇవన్నీ అందరి దగ్గర ఉన్నవే; బయట ఎక్కడో లేవు. ధ్యాన శక్తితో మన అంతర్ శక్తులను మనమే ఉద్దీపనం చేసుకోవాలి.

***

87..భూమ్మీద ఉన్న వారిలో ఒక్కొక్కరు ఒక్కొక్క వాహనంలో ఒక్కొక్క వేగంతో ప్రయాణిస్తుంటారు.

➡ నిజానికి వీరందరూ భూమితోపాటు పడమర నుండి తూర్పుకు గంటకు 1674 కిలోమీటర్లు వేగంతో ప్రయాణిస్తున్న వారే.

  అదే విధంగా., 

➡ జీవుల్లో స్థితి భేదాలు కనిపించినప్పటికీ,

 ప్రతి జీవి 'మహా మూల చైతన్యము' వైపుకే సమాన వేగంతో ప్రయాణిస్తున్న వారే.

***


88..కం..ఆహా మామిడి గుత్తులు 

ఓహో యేమి సొగసాయె ఒకటా రెండా 

దాహమ్ము తీర్చ రసమే 

స్వాహా యయ్యెడి ఫలములు సాధ్యము గానే

***

89..కం..దిక్కులు జూపెడి ఎండలు 

మక్కువ తో మజ్జి గివ్వ మానస మగుటన్ 

చుక్కాని వోలె దప్పిక 

చక్కగ తీర్చే కుటుంబ చాతుర్యముగన్

***

90..మ.

నవరాగమ్మగు భార్యలై సుఖము నమ్మాబల్కు చూనుండగా 

భవుడై పార్వతి గంగ శోభ కళ భవ్యంబౌను దాహమ్ముగా 

భవబంధంవిధి యాటపత్నులతొ భాగ్యంమౌను సౌమ్యమ్ముగా 

శివ వామార్ధము వీడి శీర్షమున నిల్చెన్ గౌరి గంగమ్మతో

*****

91..కథ కంచికి, మనం ఇంటికి:-


కంచి = భూ లింగం 

* "కథ కంచికి" అనగా మరణించిన మన భౌతిక దేహాన్ని ఈ భూలోకంలోనే వదిలేస్తామని

* "మనం ఇంటికి" అనగా ఆత్మ పదార్థం తన స్వస్వరూపమైన మహా మూల చైతన్యానికి చేరుతుందని అంతరార్థం.

***


92..చిదంబరంలో తెర వెనుక ఉండే రహస్యం ఏమిటంటే...


* చిదంబరం = చిత్+అంబరం

చిత్ = జ్ఞానం; అంబరం = ఆకాశం. 

ఈ రెండు అనంతమైనవే.  


* చిదంబరంలో తెర తీస్తే ఏమీ ఉండదు.

ఆ ఏమిలేనితనాన్ని (అంబరాన్ని) గుర్తించే (జ్ఞానం) తానే చిదంబరేశ్వరుడు అని అంతరార్థం.

***

93..మా'న'వుడు + ఆధ్యాత్మికత = మా'ధ'వుడు.


* న అంటే నకారాత్మకం -ve

* ధ అంటే ధనావేశం +ve

 ఆధ్యాత్మికత = ధ్యానం + స్వాధ్యాయం + సజ్జన సాంగత్యం

***

అనారోగ్యం రెండు రకాలు - శారీరకం, మానసికం 


మొదటిది - మనల్ని చావుకి దగ్గర చేస్తుంది. 

రెండవది - మనల్ని ఆనందానికి దూరం చేస్తుంది.

***

94..మనం చేసే సాధనలన్నీ ఆత్మను పొందటానికి కాదు.,


శరీరం నేను కాదు అని తెలుసుకోవటానికే.

***


95..సీ..మంచి తనము కొంత, మానవత్వము కొంత, 

క్రొత్త దనముకొంత, కొంత పాత,

సరళ భాషయు కొంత, సరస భావము కొంత, 

సహజపాఠముకొంత సమయ శాంత 

పాపపుణ్యముకొంత ప్రాయాణమే కొంత 

కప్పి చెప్పెడికొంత ,  గొప్ప నేత 

సంస్కృతి కథకొంత సంఘసేవయు కొంత 

మంచి చెడులుకొంత మనసు కాంత 

***

తే.. పాపభీతి వల్లమనిషి పనులు కొంత 

విసుగు చెందకుండా కొంత వేచి చూడ 

ఫలితమదియెశుభము కొంత కలత వద్దు 

ప్రాంజలి ఘటించి తెలిపేద ప్రభల గీత 

****

96..క్షమ:: న న త త గ..యతి 8

విభవము గలిగే వింత జీవమ్ముగా 

అభయము వలనే ఆత్ర భావమ్ముగా 

ప్రభలగు కళలే ప్రాభ వమ్మేను గా 

రభస యనకుమా లక్ష్మి నారాయణా

***

97..తే.గీ..వాలికి బలమనె యహమ్ము వాక్కు దురద 

కామ గర్వ ధీరోదత్త కాల పురుష 

అన్నదమ్ముల సఖ్యత అలక రూపె 

చెలిమి ధర్మ బాణము మృత్యువె కబలించె

**-*

98..తే. గీ..ఉన్నదా లేదనియువాద యుండ కుండ

నమ్మకమ్మగుటయు యాత్మ నాడి యగుట 

ప్రాణ మే శ్వాస హృద్యమ్ము పలుకు వేడి 

వాసు దేవుని లీలలు వరుస తట్టు 

***

99..ఉ..రాముని బంటుగా సహన సాధన కర్తగ ఆంజనేయుడే 

శోముని వద్ద విద్యకళ పొందియు దక్షత దీక్ష భక్తుడే 

ప్రేమయనేది సేవయగు ప్రీతిని పంచెడి మార్గ ధీరుడే 

రామ జపమ్ము గాబ్రతుకు రక్షణ దుష్టల శిక్ష మారుతీ

***

100..సీ..వెలుగును చూడరా వేకువ నందునే 

 వినయపు వాక్కులు విశ్వమగుట 

 కమ్మరి కుమ్మరి కంసాలి మేదరి 

 చేయూత బ్రతుకు శీఘ్రమగుట  

బ్రాహ్మణ వేదము బాధ్యత సంపద

వత్తితో నూనె ప్రమిద వెలుగులగుట 

అన్యుల ఏకమే ఆశ్రయము మనకు

కులములు కలియుట కూడు యనుట 


నిష్ఠ శాంతిసౌఖ్యమునిచ్చు నీడచాలు

ధర్మ సంతాన సమతృప్తి ధరణి చాలు

ఎవరి పనులు వారి ఫలము యెరుక చాలు 

ప్రాంజలి ఘటించి తెలిపేద ప్రభల గీత 

****


101..తే. గీ. అరయునాస్తియనకయడ్డు మాటయనక

తట్టు పడకమదినిపంచి దన్నుకోక

తనది కాదను కొని దానతపము తనము

ప్రాంజలి ఘటించి తెలిపేద ప్రభల గీత

****

 102.. తే. గీ.పట్టు విడుపులు ప్రేమగా పడతి నీడ 

అట్టుడికినయెండ తీవ్రత గట్టు నీడ 

కొట్టు కొనక బ్రతుకుశోభ కోరు నీడ 

కట్టు బొట్టు తీరు పలుకు  కంటి నీడ

***

103..తే. గీ.పది పదులు నెంచి సగము పంచి సగము 

నూరు పదులు నెంచి సగము నూక సగము 

నూరు సగమెనిమిది నెంచి నుంచి పంచి 

ఏబది కలిపి వెయ్యి కళలు యేలు వాడు

****

104..ఉ..భగ్గున మండెవేడివిధి బయ్యమె తోడగు సూర్య లీలలే 

నెగ్గుట వీలుగాజనులు నీడల చేరుట గాబరాయగున్

దిగ్గున మేల్కొనే పనులు దివ్వెల వెల్గుల తాపమేగతిన్ 

తగ్గక యెండలే ధరణి తట్టుకొనేస్థితి దైవ లీలలే

***

105..ఉ..నాకను పాపచిత్రమగు నామది నీమది గాను వోమహీ 

శ్రీకర చిన్మయాభవము జీవమనోమయ విశ్వమేయగున్ 

బ్రాంతిగ శక్తియుక్తగుట భాగ్య మనస్సగు దివ్య వెల్గుగా 

ఆకస మందు గానబడె నందముగా శత చంద్ర బింబముల్


106.. ప్రకృతియెవిరుద్ధమార్గము ప్రాభ వించె 

సెగలు పెరుగుటే నిజమగు సేవ కరువు 

కళలు కళ్ళలగు కథలు కాల తరువు 

సమరమును జేసినప్పుడే శాంతి దిక్కు


107..అనడు తప్పు తప్పని చెప్ప గలిగినోడు 

వినడు దుష్టచతుష్టయ విలువ పలుకు 

కనడు అంగంగ దృశ్యము కాంత కులుకు 

బుద్ధి విపరీత మవకయే భుక్తి కోరు


108..తే. గీ. నడక యాగును వడగాలి నాట్య మయ్యె

పడిన లేవలేవవుపైకి పడక గతియు 

అడుగు పెట్టకు నవినీతి నాట్య మౌను 

చెడిన బాగుపడకళలు చింత చేరు


109..

110..*వేసవి సెలవులలో జీవుల కాలక్షేపము*


మల్లాప్రగడ వారి ప్రాంజలి ప్రభ


111..ఇదిగా (శరీరంగా) ఉండి దానిని (ఆత్మని) అనుభవించాలని చూస్తున్నావు.


అదిగా (ఆత్మగా) ఉండి దీనిని (శరీరాన్ని) అనుభవించు.

****

112..జీవితాన్ని డిజైన్ చేసింది తానే., దానిని అనుభవించేది తానే.


➡️ మొదటి తాను కూడా తానేనని మర్చిపోవడం వలన వచ్చిన తిప్పలే ఇవన్నీను.

 ➡️ ఆ నేనే ఈ నేనని గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నానికే 'ఆధ్యాత్మికం' అని పేరు.

****

113..నిన్నెవరూ పట్టించుకోకపోవడం- ఒంటరితనం.


నీవెవరినీ పట్టించుకోకపోవడం - ఏకాంతం.

****

114..మంచి గుణముయే మనుగడ 

సంచిత భావము గలిగియు సకలము గనుటన్ 

వంచన మరచి కదులుటయె 

కంచికి చేర్చే శుభమగు కథలౌను సుధీ

.

****

115..అన్నం ముద్ద గొంతు దిగే వరకు మనకు తెలుస్తుంది. 

తర్వాత జీర్ణం అవ్వడంలో మన పాత్ర ఎంత ఉంది? అని ఆలోచిస్తే అహంకారం పతనమవుతుంది.

*****

116..➡️ ఏది నేను కాదు - సాధన

➡️ అన్ని నేనే - సిద్ధి

******

117..భగవంతునికి, భక్తునికి మధ్య దూరం ఉంటేనే భక్తి, అనుగ్రహం అనే మాటలు వస్తాయి.


ఆ ఇద్దరు దగ్గరయ్యే కొద్దీ ఏకత్వం ఆవహిస్తుంది.

******

118..బంగారం తన లక్షణాలేవి వదులుకోకుండానే నగగా మారుతుంది.


 పరమాత్మ తన అసలు స్వభావాన్ని వదలకనే ద్వైత ప్రపంచంగా మారుతాడు.

*******

119..దేహమును ధరించిన వారంతా,  ధరించిన సంగతి --

  పాత్రతో మమేకం అవడం వలన మరిచారు...  

     ఎందుకంటే? 

 పాత్ర రక్తి కట్టడానికి తాత్కాలిక మరపు అవసరం.

       'జ్ఞప్తియే జ్ఞానము'.

******

120..➡️ అజ్ఞాని చూపు నేరుగా రూపాలపైనే పడుతుంది.

➡️ జ్ఞాని చూపు మొదట చైతన్యం పైన పడి, తర్వాత రూపము వైపుకు ప్రసరిస్తుంది.

******

121..➡️ అజ్ఞాని చూపు నేరుగా రూపాలపైనే పడుతుంది.

➡️ జ్ఞాని చూపు మొదట చైతన్యం పైన పడి, తర్వాత రూపము వైపుకు ప్రసరిస్తుంది.

*****

122..ఉండేది ఒక్కడే.


👉 తలంపుల  పరంపరలో తలమునకలై ఉన్నప్పుడు తాను జీవుడు.

👉 తలంపులను ఉపసంహరించుకుని నిశ్చలంగా ఉంటే తాను దేవుడు.

******

123..కౌరవులు - 100 - స్వార్థపరులు.

పాండవులు - 5 - నిస్వార్థపరులు.

కృష్ణుడు - 1 - జ్ఞాని.


👉 సృష్టిలో స్వార్థపరులు ఎంతోమంది.

👉 నిస్వార్ధపరులు తక్కువమంది.

👉 ఎక్కడో గాని ఒకరు జ్ఞానులు ఉండరు.,

 అని మహాభారతం నుండి తెలుసుకోవచ్చు.

*****

124..విఘ్నేశ్వర పూజ:-

[ విఘ్నము + ఈశ్వర + పూజ]


➡ విఘ్నము అంటే అడ్డంకులు 

➡ ఈశ్వరుడు చేసేది ధ్యానము (తపస్సు)

➡ పూజ అనగా 'పూ'ర్తిగా 'జ'యించడం 


 విఘ్నేశ్వర పూజ అంటే ..,

"ధ్యానం చేస్తే విఘ్నాలు తొలగి ఆ సంకల్పము పూర్తిగా జయమవుతుంది" అని అంతరార్థం.

******

125.."ధ్యానం  నిర్విషయం మనః"


 మనస్సులో ఏ విషయము లేకుండా చేసుకోవడమే ధ్యానము

******

"ధ్యానం  నిర్విషయం మనః"


 మనస్సులో ఏ విషయము లేకుండా చేసుకోవడమే ధ్యానము

******

126..✳ పరీక్షలలో ప్రశ్నాపత్రం ఒకటే ఉంటుంది,  ఆన్సర్ చేసే పేపర్లు చాలా ఉంటాయి;


✳ ఆధ్యాత్మికంలో ఆన్సర్ ఒకటే ఉంటుంది, ప్రశ్నా పత్రాలు చాలా ఉంటాయి.


➡ శాస్త్రాలు అనేవి ప్రశ్నాపత్రాలు.,  

ఆ ఒకే ఒక్క ఆన్సర్ 'నేను'. (ఆత్మ)

********

127..నేను స్వతంత్రుడినా?  అస్వతంత్రుడినా? అని నిన్ను నీవు  ముందు ప్రశ్నించుకో.


👉 నీవు స్వతంత్రుడివే అయితే,  'నా కర్మకు నేనే బాధ్యుణ్ణి' అని అనుకుని ప్రశాంతంగా ఉండు.

👉 నీవు అస్వతంత్రుడివే అయితే,  'కర్త భగవంతుడు' అని స్థిమితంగా ఉండు.

*******

128..శివుడు తేజోలింగంగా సాక్షాత్కరించినప్పుడు దాని ఆద్యంతాలు కనిపెట్టడానికి బ్రహ్మవిష్ణువులు ప్రయత్నించారు.

➡️ కనుగొన్నాను అని అబద్ధం చెప్పి శివుని శాపానికి గురయ్యాడు బ్రహ్మ.

➡️ కనుగొనలేమని నిజం చెప్పి శివుని నుండి విష్ణువు 'చక్రాన్ని' బహుమానంగా పొందాడు.

....

129.. అంతరార్థం:-

👉 విజ్ఞానం/ సైన్స్ (బ్రహ్మ) బహిర్ముఖ ప్రయాణం చేసి చేసి, అలా అనంతంగా ప్రయాణించి అలసిపోతుంది.

👉 జ్ఞానం/ ఆధ్యాత్మికత (విష్ణువు) అంతర్ముఖ ప్రయాణం చేసి,  ఆత్మ మూలాన్ని కనుగొని అందులో హాయిగా విశ్రమిస్తుంది.

*******

130..బంగారం + రాగి = నగ

మహామూల చైతన్యం (పరమాత్మ) + రాగద్వేషాలు (మాయ) = జీవుడు.


 నగ - రాగి = బంగారం

 జీవుడు - రాగద్వేషాలు (మాయ) = పరమాత్మ.

*******

131..ఆకాశంలో విహరించే ఒకానొక "మేఘం" కిందకి దిగివచ్చి ఒకానొక "చెరువు"లా మారినప్పుడు...

 అక్కడ మేఘంలోనూ, ఇక్కడ చెరువులోనూ నీరే ఉన్నట్లు.,


దైవత్వంతో నిండిన మనం పైలోకాలలో ఉన్నప్పుడూ మనమే, భూలోకంలోనూ ఉన్నప్పుడు మనమే.

****

132..జననం అంటే?  కార్యంగా 'ఉండడం'.


మరణం అంటే? గుప్తంగా 'ఉండడం'.


మోక్షం అంటే? లీనమై 'ఉండడం'.

****-

133..ఇది నీది - అది నాదని 'వంతు'లతో భాగాహారాలు వేసి భాగాలు పంచుకుంటారు.


 నిజానికి అన్ని భాగాలు భగ'వంతు'ని లోనివే..

****

134..భోగి అద్దంలో క్షయమయ్యే శరీరాన్ని చూసుకుంటాడు!


 యోగి తనలో అక్షయమైన ఆత్మను దర్శించుకుంటాడు!

****:*


135..జీవుడిలో దేవుడు దాగి జీవుడితో ఆట ఆడుతున్నాడు.


ఇప్పుడు జీవుడు దేవుడిలో దాగి ఆ ఆట దేవుడిదే అని నిశ్చింతగా ఉండాలి.

******

136..కర్మఫలం కర్మ చేసిన వానికి మాత్రమే చెందదు. ఆ ఫలం ప్రపంచంలో ఉన్న సకల చరాచరానికి పంచబడుతుంది.. అంటారు గురువుగారు.


 వాన చుక్క సముద్రంలో పడి సముద్రవ్యాప్తమైనట్టుగా...

*****

137..నిరంతరం మార్పులతో కూడిన జీవుని ప్రయాణం;


ఎట్టి మార్పులు లేని నిశ్చలతత్వం అయినా పరమాత్మ వైపుకే.

*****

138..'నీవు ముక్తి పొందాలంటే దేహాత్మ భావం తొలగాలి' అంటారు.


దేహాత్మ భావమే పోయాక వాడికి ముక్తితో మాత్రం పనేముంటుంది ?

*****


139..👉 నీవు చూచే ప్రతి దృశ్యం కింద 

👉 నీవు తలచే ప్రతి తలంపు కింద 

👉 నీవు పొందే ప్రతి అనుభవం కింద 


"భగవదిచ్ఛ" అనే పదం చేర్చు. ఇక ఏ ఘర్షణకు తావుండదు.


140..ప్రతి ఒక్కరికి అత్యంత ఇష్టమైనవి ఏవి?

 అవునన్నా, కాదన్నా తన నామరూపాలే.


  ఈ రెండింటిని తీసివేస్తే - తానే కదా తాను వెదుగుతున్న దేవుడు.


141..ప్రాంజలి ప్రభ... 007 (మల్లాప్రగడ )


మెలకువలో సుఖం దొరకదు.

నిద్రలో దుఃఖం ఉండదు.

ఎందుకంటే నిద్రలో తానే ఉండడు కాబట్టి.

****


142..సూర్యుడి నుండి వచ్చే   ఏడుకిరణాలు-సప్త జ్ఞాన భూమికలు.

జ్ఞానం 

జ్ఞానంలో ఏడు స్థితులున్నాయి. వీటినే సప్త జ్ఞాన భూమికలు అంటాం. 

(1) శుభేచ్ఛ 

(2) విచారణ 

(3) తనుమానసం

(4) సత్త్వాపత్తి 

(5) అసంసక్తి 

(6) పదార్ధభావని 

(7) తురీయం 

అన్నవే సప్త జ్ఞాన భూమికలు.


 1)శుభేచ్ఛ : నాకు బ్రహ్మజ్ఞానం కావాలి అన్న ఇచ్ఛ; నేను శాశ్వత దుఃఖరాహిత్య పదవి పొందాలి అన్న తీవ్ర ఆకాంక్ష.


2)విచారణ : బ్రహ్మజ్ఞాన ప్రాప్తి ఏ విధంగా పొందాలి? అన్న మీమాంస; బ్రహ్మజ్ఞాన ప్రాప్తి విధానమే – ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం అని తెలుసుకోవడం.


3)తనుమానసం : ఇంక విచారణ ద్వారా సాధనా మార్గం తెలుసుకున్నాం గనుక, తత్ సాధనలో నిమగ్నులై ఉండడమే తనుమానసం. అంటే,  ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాలకు ఏ రోజూ విఘ్నం లేకుండా గడపడం. అదే తనుమానసం.


4)సత్త్వాపత్తి : శుద్ధసాత్త్వికం సాధించడమే సత్త్వాపత్తి, అంటే తమోగుణం, రజోగుణం అన్నవి పూర్తిగా శూన్యమైన స్థితి. ఇక మిగిలింది శుద్ధ సాత్త్వికమే. తమోగుణం అంటే సోమరితనం, రజోగుణం అంటే నాకు తెలుసు అనే అధికార దర్పం. 

ఈ నాల్గవ జ్ఞానభూమిక ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాల సాధన తీవ్రస్థాయి నందుకునే స్థితి; ఆ తీవ్రత ద్వారా నాడీమండలం పూర్తిగా శుద్ధమైన స్థితి; 

మనస్సు పూర్తిగా కంట్రోలు అయిన స్థితి; అదే యోగి అయిన స్థితి. అహం బ్రహ్మాస్మి అని చక్కగా సిద్ధాంతపరంగా తెలుసుకున్న స్థితి. బ్రహ్మవిదుడు అయిన స్థితి.


5)అసంసక్తి : దివ్యచక్షువు ఉత్తేజితమవుతున్న స్థితి. తనువు, మరి సంసారం,రెండూతాత్కాలికమైనవే అని సంపూర్ణంగా తెలుసుకున్న స్థితి. కనుక, ఈ రెంటి మీద పూర్తిగా అనాసక్తి పొందిన స్థితి; అదే అసంసక్తి. దీన్నే పద్మపత్రమివాంభసా అన్నాడు కృష్ణుడు గీతలో. అయితే ఇతనికి సంసారంలో అసంసక్తి వున్నా, ధర్మ-నిష్టుడు, మరి కర్మ – నిష్టుడు; తనువు పట్లా, మరి సంసారం పట్లా తటస్థ దృష్టి కలిగి వున్నవాడు. దివ్యచక్షువు ఉత్తేజితమైంది కనుక, సత్యద్రష్ట కాబోతున్నాడు కనుక, పూర్తిగా దాని మీదే ఆసక్తినీ, ఏకాగ్రతనూ నిలిపినివాడు. ఇదే అసంసక్తి. ఇతనినే బ్రహ్మవిద్వరుడు అంటాం.


6)పదార్ధభావని : అంటే దివ్య చక్షువును క్షుణ్ణంగా ఉపయోగించు కుంటున్నవాడు. ప్రతి పదం యొక్క అర్ధంలో, ప్రతి వస్తువు యొక్క భావంలో ప్రత్యక్షంగా నివసిస్తున్న వాడు. అంటే బ్రహ్మవిద్వరీయుడు అయిన స్థితి. ఇదే సిద్ధస్థితి; ఇదే సవికల్ప సమాధిస్థితి కూడా. అంటే ఎన్నో సమాధానాలు దొరికినా ఇంకా కొద్దిగా, సంశయాలు వున్న స్థితి.


7)తురీయం : ఇది మానవుని యొక్క పూర్ణవికాసస్థితి, సిద్ధుడు బుద్ధుడు అయిన స్థితి. అందరినీ యోగులుగా, 

సిద్ధులుగా, బుద్ధుళ్ళుగా మలచడానికి కంకణం కట్టుకొని, తత్ పరిశ్రమలో పూర్తిగా నిమగ్నమై వున్నవాళ్ళనే బుద్ధుడు అంటాం. ఇదే సహస్రదళ కమలం .ఒక్కొక్క మనిషినీ యోగిగా మలచి నప్పుడల్లా సహస్రదళకమలంలో ఒక్కొక్క రేకు విచ్చుకుంటుంది. ఇతనినే బ్రహ్మ విద్వరిష్టుడు అంటాం.తురీయం అంటే సర్వసామాన్యమైన జాగృత, స్వప్న, సుషుప్త స్థితులను దాటినవాడు. తురీయ అంటే మూడింటినీ దాటిన అని అర్థం; 

అంటే నిర్వికల్పసమాధి స్థితి కి చేరుకున్న స్థితి. సమాధి అంటే సమాధానాలు తెలుసుకున్న స్థితి. నిర్వికల్ప సమాధి అంటే ఏ సందేహాలూ, ఏ సంశయాలూ లేని స్థితి...స్వస్తీ..

****

'నారీ' (శక్తి) తత్వాన్ని 'అర్థం' చేసుకోవడమే "అర్ధనారీశ్వర" తత్వం.

150


*****

సాధకుడు - దేవుడు ఉండే చోటును వెతికేవాడు.


సిద్ధుడు - దేవుడు లేని చోటును వెతికేవాడు.

*****

151..➡ భౌతిక సుఖం -- కాస్త జలాన్ని తీసుకుని నెత్తిన చల్లుకోవడం 


➡ మానసిక సుఖం -- తొట్టి స్నానం 


➡ ఆత్మ సుఖం -- జలపాతం కింద చేసే స్నానం లాంటిది.

****

152..శిష్యుడు:- ప్రసాద్ సన్యాసదీక్ష తీసుకున్నారు..


సద్గురు:- ప్రసాద్ సంసారాన్ని వదిలి,  బట్ట రంగు మార్చినంత మాత్రాన అది సన్యాసం కాదు. సంసారి గా ఉంటూనే 'ప్రసాద్'ని  (దేహ భావనను) వదిలేయగలిగితే అదే నిజమైన సన్యాసం.

*****

153..సద్గురువు - శిష్యుల న్యాయాలు:-


 1. విహంగ న్యాయం:-


 పక్షి గుడ్లను పెట్టి పొదిగి తన రెక్కల స్పర్శ చేత గుడ్లను పిల్లలుగా చేస్తుంది.


 అలాగే సద్గురువు తన 'స్పర్శ' చేత శిష్యునికి ఆత్మజ్ఞానాన్ని అందిస్తాడు.

( స్పర్శ ప్రేమ మయంగా ఉండవచ్చు లేదా కొట్టవచ్చు కూడా)

******

154..2. భ్రమర కీటక న్యాయం:-


 భ్రమరం ఒక కీటకాన్ని తెచ్చి దాని చుట్టూ తిరుగుతూ 'ఝుంకార' శబ్దం చేస్తుంది. అప్పుడు ఆ కీటకము ఝుంకారము వల్ల భ్రమరంగా మారిపోతుంది. 

 అలాగే సద్గురువు శిష్యునకు 'వాక్కు' ద్వారా బోధ చేస్తూ తన వలే తయారు చేస్తాడు.

( వాక్కు మధురం గా ఉండవచ్చు లేదా తిట్టవచ్చు )

*****

155..3. మీన న్యాయం :-


చేప గుడ్లను పెట్టి వెనకకు తిరిగి వాటిని తీక్షణం గా చూస్తుంది.  తల్లి చేప దృష్టి సోకగానే గుడ్లు పిల్లలు గా మారుతాయి.


 ఇదేవిధంగా సద్గురువు కరుణామృత 'దృష్టి' ప్రసరించడం వల్ల శిష్యుడు జ్ఞాన పరిపుష్టి పొందుతాడు.

*****


156..4. తాబేటి తలపు న్యాయము :-


 తాబేలు ఒకచోట గుడ్లు పెట్టి ఆహారానికి వెళుతుంది.  ఆ గుడ్లు పిల్లలు కావాలని 'సంకల్పిస్తుంది '. 

ఆ సంకల్పబలంతో ఆ గుడ్లు పిల్లల గా తయారవుతాయి.


 అలాగే శిష్యుడు ఎక్కడ ఉన్నా అతను పర బ్రహ్మ జ్ఞానాన్ని పొందాలి, పరమార్థ జ్ఞానాన్ని చేరాలి అని 'సంకల్పిస్తారు'. 

ఆ దివ్య సంకల్పంతో శిష్యుడు అభివృద్ధి పొంది పరమార్ధం పొందుతారు.

****

157...ఉనికి ఒక్కనికే...


 ఆ ఒక్కడిని 

➡️ అతడు అంటే కర్మయోగం

➡️ నీవు అంటే భక్తి యోగం

➡️ నేను అంటే జ్ఞాన యోగం


 ఆ ఒక్కడు..

👉 పరోక్షంగా అనిపిస్తే .. నీవు కర్మయోగివి

👉 ప్రత్యక్షంగా దర్శిస్తే .. నీవు భక్తియోగివి

👉 స్వరూపంగా అనుభవిస్తే .. నీవు జ్ఞానయోగివి

***+*

158..యుగాల పర్యంతం ఈ ఆధ్యాత్మిక సమస్య తెగడం లేదు.,  కారణమేమంటే...


👉 సుబ్బారావు (నామరూపాలు) నేను కాదని తెలిసిపోయింది.

👉 సుబ్బారావు'గా' ఉన్నది ఎవరు అనేది తెలియడం లేదు.


సుబ్బారావు:-  మరి నేనెవడను?

సద్గురు:-  ఎవడు ఉంటే 'సుబ్బారావు' ఉంటాడో.,

ఎవడు లేకపోతే 'సుబ్బారావు' ఉండడో వాడే నీవు.

**--**


159..ఒకరు:- జీవితం ముగిసిపోతుందంటే, ఒక విధమైన విచారం..


సద్గురు:- చదువు ముగిసిపోతుందంటే సంతోషం., ఉద్యోగం వస్తుందని.

జీవితం ముగిసిపోతుంది అంటే ఎందుకంతా విచారం., ఆ 'మహా మూలచైతన్యం'తో హాయిగా గడుపుతానని సంతోషపడాలి కదా..

*****

160..రమేష్:- దీపావళి సందేశం ఇవ్వండి స్వామి..


సద్గురు:- 'రమేష్ నేను కాదు' అని తెలుసుకోవడమే నరకాసుర వధ. అదే నిజమైన దీపావళి.

-****

161..సీ..అక్కిరాజు పలుకు ఆశీర్వచన మౌను 

ఆత్మీయ అనురాగ అద్భుతవిధి 

భాషపండితపుత్ర భవబంధ వెలుగుగా 

బాధ్యత నెరిగియు బంధ ధరణి 

దినదినా భిగనుయె దీనుల సేవలై 

స్నేహచరితముగా చెలిమి చేయు 

జన్మదినము నాడు జనులకు సేవలు 

గణితపు దిట్టగా గళము విప్పె 


ఎంత చెప్పినా తక్కువే యేమి యనడు 

తెలిసినది చెప్ప గలవాడు వినయ ముంచి 

మనసు బంగార మగుటయె మంచి వాడు 

ప్రాంజలి ఘటించ శ్రీధరా ప్రభల గీత

***

162.. శుకుడు జనకుని ప్రార్ధించి తనకు పరిపూర్ణ జ్ఞానాన్ని ప్రసాదించమని కోరారు. "అయితే గురుదక్షిణను ముందుగానే నాకు ఇచ్చి వేయాలి" అన్నారు జనకులు. శుకుడు ఆశ్చర్యపోయాడు.


'బ్రహ్మ జ్ఞానం కలిగిన తర్వాత నువ్వు నాకు గురుదక్షిణ ఇవ్వలేవు'. ఎందుకంటే ఆ స్థితిలో గురు శిష్యుల బేధం తొలగిపోతుంది అన్నారు జనకులు. 


163..స్థితప్రజ్ఞత!


వ్యాసమహర్షి కుమారుడైన శుకుడు జన్మతః పరిపూర్ణుడు. వ్యాసుడు, కుమారునికి జ్ఞాన బోధ చేశాడు. సత్యాన్ని బోధించాడు. పిదప పరిపూర్ణ జ్ఞానసిద్ధి పొందడానికి జనక మహారాజు వద్దకు శిష్యునిగా శుకుణ్ణి పంపాడు. జనకుడు మహాజ్ఞాని. ఆయనను విదేహ జనకుడు అని కూడా అంటారు. 'విదేహ' అంటే శరీర ధ్యాస లేనివాడని అర్థం. నిరంతరం ఆత్మభావనలో ఉండేవాడు.


శుకుడు జ్ఞానార్థియై తన వద్దకు వస్తున్న సంగతి జనకునకు ముందే తెలుసు. అందుచేత ఆయన ముందుగానే కొన్ని ఏర్పాట్లు చేసి ఉంచాడు. శుకుడు రాజప్రాసాదం సింహద్వారం వద్దకు చేరాడు. ద్వారపాలకులు అతణ్ణి పట్టించుకోలేదు. వారు అతనికి కూర్చొనేందుకు ఒక ఆసనం మాత్రం చూపించారు. అతడక్కడ మూడు రాత్రులు, మూడు పగళ్ళు గడిపాడు. ఏ ఒక్కరూ అతనితో మాట్లాడటం గానీ, నీవెవరివి, ఎక్కడి వాడివి అని అడగడం గానీ జరగలేదు. అతడు గొప్ప మహర్షి కుమారుడు అయినప్పటికీ రాజసౌధపు రక్షకభటులు అతడిని ఏ మాత్రం పట్టించుకోలేదు.


అలా ఉండగా అకస్మాత్తుగా మంత్రులు, దండనాయకులు, ఇతర రాజోద్యోగులు అక్కడకు వచ్చారు. వారు శుకుణ్ణి సకల మర్యాదలతో లోపలికి తీసుకు వెళ్ళారు. కోటలోని మణిమయ గృహాలు చూపెట్టారు. పన్నీటి స్నానాలు చేయించి, పట్టు వస్త్రాలు కట్టబెట్టారు. ఆ విధంగా శుకుణ్ణి ఎనిమిది రోజుల పాటు రాజభోగాలలో ముంచి తేల్చారు. ప్రశాంత గంభీరమైన శుకుని మోములో ఈషణ్మాత్రమైనా మార్పు కనిపించలేదు. అతడు కోట బయట ముఖద్వారం వద్ద వేచి ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో, ఈ భోగాల నడుమ కూడా అలాగే ఉన్నాడు.


తుదకు శుకుణ్ణి జనకుని వద్దకు తీసుకువెళ్ళారు. రాజు తన సింహాసనంపై ఆసీనుడై ఉన్నాడు. వాద్యాలు మనోహర సంగీతాన్ని స్రవిస్తున్నాయి. నాట్యగత్తెలు నాట్యం చేస్తున్నారు. మరెన్నో వినోదాలతో అలరారుతోంది సభా భవనం. అంచుల వరకు పాలతో నిండి ఉన్న ఒక పాత్రను శుకుని చేతికి ఇప్పించాడు జనకుడు. ఆ పాత్ర నుండి ఒక్క చుక్క పాలైనా భూమిపై పడకుండా ఆ సభ చుట్టూ ఏడుసార్లు ప్రదక్షిణ చేసి రమ్మని శుకుణ్ణి ఆజ్ఞాపించాడు రాజు. శుకుడు ఆ పాత్ర చేతబట్టి, సంగీత ఘోషతో, నాట్యగత్తెల అందాలతో ఆకర్షణీయమైన ఆ సభ చుట్టూ ఏడుసార్లు తిరిగి వచ్చాడు. ఒక్క చుక్క కూడా పాత్ర నుండి భూమిపై పడలేదు. ఆ మనస్సును పోయింది. అతడు స్థితప్రజ్ఞుడు. ఈ ప్రపంచంలోని ఏదీ ఆకర్షించలేక

క్షీరపాత్రతో రాజును సమీపించాడు శుకుడు. అప్పుడు జనకుడు ఇలా అన్నాడు. - "నీ తండ్రి నీకు బోధించిన జ్ఞానం, నీకు నీవై నేర్చుకున్న జ్ఞానం పరిపూర్ణమైనవి. నేను కేవలం వాటిని మాత్రమే తిరిగి నీకు చెప్పగలను. నీవు సత్యాన్ని తెలుసుకున్నావు. ఇక ఇంటికి వెళ్ళవచ్చు" అని అభినందించాడు.

****

164..దేహం - అణువుల సముదాయం.

మనస్సు - ఆలోచనల సముదాయం.

బుద్ధి - అవగాహనల సముదాయం.

ఆత్మ - అనుభవాల సముదాయం.

****-

165..👉 నీవు చూచే ప్రతి దృశ్యం కింద 

👉 నీవు తలచే ప్రతి తలంపు కింద 

👉 నీవు పొందే ప్రతి అనుభవం కింద 


"భగవదిచ్ఛ" అనే పదం చేర్చు. ఇక ఏ ఘర్షణకు తావుండదు.

****

166..➡️ నీ శరీరం భగవంతుని శరీరంలో (సృష్టిలో) అంతర్భాగం.

➡️ నీ మనస్సు భగవంతుని మనస్సులో (మాయలో) అంతర్భాగం.


 జీవుని బంధమోక్షములు భగవంతుని లీలా విలాసములు.

*****

167..మరణం అనేది మలుపు.


మోక్షం అనేది ముగింపు.

****

168..రెండు కరెంటు తీగలు ఉన్నాయి.

 ఒకటి AC వైరు, మరొకటి DC వైరు. ఒకటి షాక్ కొడుతుంది, మరొకటి షాక్ కొట్టదు. కానీ రెంటిలోను కరెంటు ఉంటుంది.


అట్లాగే ప్రతి అణువులోను అనగా - చైతన్యంలోనూ, జడంలోను ఆత్మ ఉన్నది.

****

169..నిద్ర నుండి మేల్కొనగానే నిద్రలోని మన అనుభవాలన్నీ లీనమైనట్లుగా,


 "నేనే బ్రహ్మము" అనే ఎరుక కలిగాక యుగయుగాల్లో సంచితమైన కర్మ అంతా నశించిపోతుంది.

*****

170..మనలోని అవాజ్ఞ్మానస (వాక్కు, మనస్సుకు అందని శక్తినే) గోచరమగు శక్తినే మనం 'దైవం' అంటుండేది.

**--


171..నీరూపు నాలో సదా నిల్పనీవా

కారుణ్యమే నీ కృపా నిత్యమీవా

సారూప్య మే నీ దయా సత్యదేవా 

ఆరోగ్యమే నా మదీ విద్య సేవా


172..ఉ..మచ్చికజేయనొక్కడు సమానసహాయము చేయ నెంచగన్

విచ్చినపువ్వు మాదిరిసువిద్యల సేవల ధర్మంమేయగున్ 

ఖచ్చిత మార్గమేచెలిమి కామ్యసుమిత్ర సుభావ్యమేయగున్

నచ్చిన మాటలన్నికళ నాటక రంగము నాణ్యతే యగున్ 


173..కం..ప్రానేశ్వరుండ నైతిని 

జానవె జగమెరిగినదాన జాతర వలదే

వేణువు నూదుట నేర్పేన్

ధ్యానపరంపరయె దేవి ధ్యాసయె నీపై


174..తే. గీ.మన మగాడు మనమధ్య మనసెరిగిన 

మమత మాధుర్యమును జూప మానసవర 

మన్ననకు మారని మహిమ మనిషి యతడు 

మనలను కలిపే మహనీయ మంగళ హరి


175..కం..కలలో కాంచన మెరుపే 

ఇలలో ఇల్లాలు కళలు యిచ్ఛామలుపే 

వలలో చిక్కాక మదీ

కలిలో కలిసే కదులుట కాల గమనమున్


176..తే. గీ. ఆడదానిని జూడగ నర్ధమగుట

బ్రాహ్మ కైననెత్తు కళలు రిమ్మ తెగులు

బ్రహ్మ గావ్రాత కథలుగా బలిమి పెంచు 

ప్రాంజలి ఘటించు తెలిపేద ప్రభల గీత


177..తే. గీ.కోరు కోవడం సులభమే కోలు కొనుట 

కోరి వయసు మేలుకు జోడి కోప మవదు 

జారక హృదయమును పంచ జతగ మార 

కరుణ కాలమే మనసుగా కామ్య బుద్ధి


178..మ..రమణీయమ్ముగ కాలనిర్ణయమురమ్యార్ధమ్ము గా యీశ్వరా 

కమననీయమ్మగు సామదానము కర్తవ్యమ్ముగా యీశ్వరీ

సమరమ్మేజయబాగ్యదాయకముసద్భావమ్ముగా యీశ్వరా 

గమనమ్మే పరిశీలమే యగుట కామ్యార్ధమ్ము గాయీ శ్వరీ


179.. కం.విజ్ఞానముపంచుటకే 

సుజ్ఞానుల విలువపెంచ సుఖమున్ పంచా 

అజ్ఞానాంతము చూడా

ప్రజ్ఞా ప్రాభవముగానె ప్రబలై క్రాంతీ


180.. తే. గీ.ఓం నమోవేంకటరమణ ఒడుదుడుకులు 

ఓర్పు లయలగు విధిగాను వరదలగుట 

సర్వ సమ్మోహనం దేవ సమయ మిదియు 

విశ్వ విశ్వాస సహనమే విజయ మిచ్చు

శ్రీ కాశీ అన్నపూర్ణ దేవి అనుగ్రహ ప్రాప్తిరస్తు 🙏


181..➡️ శరీరానికి - శాకాహారం

➡️ మనస్సుకు - సజ్జన సాంగత్యం

➡️ బుద్ధికి - స్వాధ్యాయం

***

182..రెండే రెండు స్థితులున్నాయి.

👉 దేహ స్థితిలో - సమస్య తెగదు.

👉 ఆత్మ స్థితిలో - అసలు సమస్యే లేదు.

➡️ ఆత్మకు - ధ్యానం

**

183..ఒకరు:- మొత్తం ఇది ఒక కల అని తెలిశాక బాధపడే అవకాశం ఉండదు కదా?


సద్గురు:- ఎందుకు ఉండదు? సినిమాలోని బాధలు ఒట్టివే అని తెలిసినా కూడా చూసి బాధపడుతున్నాము కదా! బాధలు వస్తే బాధపడవచ్చనేమో గాని, అది వాస్తవం కాదనే స్పృహ లోపల ఉండాలి.

***

184..బహిరేంద్రియాల మీద నియంత్రణ - మధ్యమ స్థాయి సాధన.


అంతరేంద్రియం అనగా మనస్సు మీద నియంత్రణ - ఉత్తమ స్థాయి సాధన.

***

185..Struggle for Existence (Exam) - పరిణామ క్రమంలో భాగంగా ప్రకృతి ఎప్పుడు మన అస్తిత్వానికి సంబంధించిన రకరకాల పరీక్షలకు మనల్ని గురి చేస్తూ ఉంటుంది.


Survival of the fittest (Result) - ఆ పరీక్షల్లో నెగ్గినవారినే అర్హులుగా ఎంచి.. క్రమక్రమంగా అప్పుడు వారికి చెందవలసినవి వారికి అందజేస్తూ ఉంటుంది.

***

186..ఇంట గెలిచి రచ్చ గెలవడం:-


 అంతరార్థం-

ఆత్మ ఇంట గెలిచిన ఒకానొకరు మాత్రమే, ప్రాపంచక రచ్చలో కూడా గెలుస్తూ సమత్వపు స్థితిలో తన జీవితాన్ని సంపూర్ణంగా జీవిస్తుంటాడు.

****

187..భిన్నత్వంతో కూడిన ఈ సృష్టిలో ఏది అందరికీ ఒకేలా ఉండదు. 


కొందరూ సత్యయుగంలో ఉంటే, మరికొందరు కలియుగంలో కొట్టుమిట్టాడుతూ ఉండవచ్చు.

***

188..➡ బారసాలలో ఉయ్యాలలో వేసి మొదటిసారిగా పేరు పెట్టి పిలుస్తారు.

➡ స్మశానంలో దింపుడు కల్లం వద్ద దింపి చివరిసారిగా పేరు పెట్టి పిలుస్తారు.


 రెండు సమయాల్లో తాను పలుకడు.

 ఎందుకంటే తాను 'పేరు లేని స్థితి'లో ఉంటాడు కాబట్టి.

****

189..భూమి ఆకాశంలో తిరుగుతోంది అన్న విషయం జ్ఞప్తిలో ఉన్నవాడు., భూమ్మీద నిశ్చలంగా కూర్చుని ఉన్నా - వాడు ఆకాశయానం చేస్తున్న వాడే.


 ఉన్నది పరమాత్మ ఒక్కడే. ఉన్న సకలము పరమాత్మలోనివే అన్న విషయం జ్ఞప్తిలో ఉన్నవాడు., సంసారంలో ఉన్నా - వాడు పరమాత్మలో ఉన్నవాడే.

***

190..➡️ ఆహారాన్ని భస్మం చేసేది జఠరాగ్ని

➡️ దేహాన్ని భస్మం చేసేది చితాగ్ని 

➡️ అహాన్ని భస్మం చేసేది జ్ఞానాగ్ని

191.* మన శరీరంపై మనం పట్టు కలిగి ఉండడం 'దమము'

* మన మనస్సుపై అదుపు కలిగి ఉండడం 'శమము'


పై రెండింటిపై పట్టు కలిగి ఉండడమే "యోగము".

***

192 * తనకు వచ్చిన కల గురించి పక్కవాడు నిర్ధారణ చేయడం ఎంత అర్ధరహితమో,

 

        ధ్యానం యొక్క అనుభవం గురించి, మరొకరు నిర్వచించడం కూడా అంత అర్థరహితమే.


 తన కలకు తానొక్కడే సాక్షి.

 తన అనుభవానికి తానొక్కడే సాక్షి.

***

193..ఏకకాలంలో ఒకే మనంగా జీవిస్తున్న మన రెండు జీవితాలలోని

* 'జీవవత్ కర్మపూరిత కోణం' బయటికి కనబడితే

* 'సాక్షివత్ కర్మతీత కోణం' మాత్రం బయటకి కనబడకుండా (లోపలకి) ఉంటుంది.

* ***

194..మట్టి, బంగారం రెండు ఒకలా కనబడితే --


"స్వర్ణ యోగం" సిద్ధించినట్లే.

***

195..నువ్వు చేసే పని నీకు నచ్చి నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకోగలిగితే చాలు.


 అందరికీ నచ్చేట్టు చేయాలంటే దానికి నీ జీవితం సరిపోదు.

***

196 * 'అసమానత' అనేదే ప్రపంచం నడవడానికి ఇంధనం.

* 'సమానత' అంటూ వస్తే అది ప్రళయాన్ని సూచిస్తుంది.


E.C.G.లో కనబడే సరళరేఖ మరణాన్ని సూచించినట్లు.

***

197..ఒకానొక అజ్ఞాని ప్రతి ఒక్క వరాన్ని ఒక శాపంలా మలచుకుంటే...


ఒకానొక సుజ్ఞాని ప్రతి శాపాన్ని ఒక వరంలా మలచుకుని జీవిస్తూ ఉంటాడు.

***

198..సృష్టికి 'సహ సృష్టి' చేస్తూ.. తనను తాను ఎప్పటికప్పుడు ఉద్ధరించుకుంటూ ఉండడమే ఆత్మ యొక్క లక్ష్యం.

***

199.* "నేను శరీరం" మాత్రమే అనుకుంటే ఆ జీవితం - మహా సంక్షోభం

* "నేను ఆత్మను" అనుకుంటే ఆ జీవితం - మహా సంబరం

****