Sunday, 19 January 2020

*శ్రీసూక్తం/PRT



*శ్రీసూక్తం/ విశిష్టత/తాత్పర్యం*
ఓంశ్రీమాత్రే నమః

*వేద సంస్కృతిలో హృదయంలో భక్తిని ప్రోది చేయడానికి వేదసూక్త పఠనాన్ని విశేషంగా చేయాలని మహర్షులు ప్రతిపాదించారు. పురుషసూక్తం, శ్రీసూక్తం వేదసూక్తాల్లో సుప్రసిద్ధమైనవి.*

*ఆర్షధర్మాన్ని ప్రతిష్ఠించడానికి, వేద సంస్కృతిని సంరక్షించడానికి, జ్ఞాన సముపార్జనకి, సకల ఐశ్వర్యసిద్ధికి వేదసూక్త పఠనం తప్పనిసరిగా చేయాలి. పురుష దేవుళ్లను అర్చన చేసేటప్పుడు వేదోక్తంగా పురుష సూక్త విధిలో పురోహితుని ద్వారా పూజదికాలను చెయ్యాలి. స్త్రీ దేవతామూర్తుల్ని పూజించేటపుడు శ్రీసూక్త విధాయకంగా గోత్ర నామాదులతో అర్చన చేయడం, చేయించడం జరుగుతుంది. విశేషంగా నిర్వహించే పూజల్లో శ్రీ సూక్త విధాయకంగా అర్చనలుంటాయి.* 

*సూక్తులన్నీ ఉన్నతమైన వేదాంత భావాలతో నిండి ఉంటాయి. వేదసూక్త పఠనంలోని పారలౌకిక ప్రయోజనాన్ని భక్తులు గ్రహించాలి. శ్రీ సూక్తం ఎంతో మహిమాన్వితమైనది. ఐశ్వర్య ప్రదాయిని అయిన శ్రీ మహాలక్ష్మీదేవి కరుణాకటాక్షాన్ని పొందాలంటే శ్రీ సూక్తాన్ని మించిన వేదసూక్తం మరియొకటి లేదు. నిత్య పూజాక్రియల్లో శుభకార్య నిర్వహణలో ఈ సూక్త పఠనానికి ప్రాధాన్యత ఉంది.* 

*నిజమైన సిరి జ్ఞానమే అని శ్రీ సూక్తం ద్వారా జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రార్థించాలి.శ్రీ సూక్తంలోని మంత్రాలన్నీ విలువైనవి. ఒక మంత్రంలో జేష్టాదేవి దరిచేరకుండా చేయమనే ప్రార్థన ఉంటుంది. దారిద్య్రం అనగానే కేవలం ధనలేమి వల్ల సంక్రమించే అభాగ్యం కాదు. మానవుని ఆలోచనలు ఉతృష్టముగా లేనపుడు , ఉన్నతమైనవి కానపుడు భావదారిద్య్రం ఏర్పడుతుంది. అటువంటి భావ దారిద్య్రము లేకుండా చేయమని శ్రీ మహాలక్ష్మికి చేసే ప్రార్థనల్లో ఎంతో విశిష్టార్ధమున్నది.*

*అమంగళకరమైన బాహ్య ఆటంకాలన్నింటినీ తొలిగించి హృదయం లోపల ఉన్న అజ్ఞానమనే మాయను మటుమాయం చేయమని ఆవిష్ణుపత్నిని, వైకుంఠనివాసినిని ప్రార్థించడం ఈ సూక్తంలో విశేషం. జ్ఞానమే నిజమైన సంపద అని పలుచోట్ల ఈ సూక్తం తెలుపుతుంది.దేవతలను ప్రార్థించే మంత్రాలను ఋక్కులని వ్యవహరిస్తారు. అటువంటి కొన్ని ఋక్కులు కలిసి ఒక సూక్తము, కొన్ని సూక్తాలు కలిసి ఒక అనువాకము అలా కొన్ని అనువాకములు కలిసి ఒక మండలం అని వ్యవహరిస్తారు.*

*గోసమృద్ధిని, వాక్కులో సత్యాన్ని మనస్సు నిండా సంతోషాన్ని ,ఆనందాన్ని ప్రసాదించమని సిరిసంపదలకు ఆది దేవతయైన శ్రీ మహాలక్ష్మి కృప ఎల్లప్పుడూ ఉండాలనే ధ్యానంతో కూడిన ఒక విలువైన మంత్రం ఈ సూక్తంలో ఉంటుంది.శుచిగా ఇంద్రియ నిగ్రహంతో పరిశుద్ధమైన మనస్సుతో ధనలక్ష్మి కరుణ కొరకు ఎల్లప్పుడూ జపిస్తుండాలి. పద్మాసనురాలైన లక్ష్మీ మాత దేని వలన ప్రపంచంలో సుఖాలంటాయో వాటిని ప్రసాదించమని ఈ సూక్తంలోని ఒక ప్రార్థన లోని ప్రబోధం.*


*పుత్రుల్ని, పౌత్రుల్ని వాహనాదుల్ని ఇవ్వమని ఆయుష్మంతులుగా చేయమని సూర్యుని లోని తేజస్సు, చంద్రునిలోని ప్రకాశము రెండూ కలిపి విరాజిల్లుతున్న శ్రీ మహాలక్ష్మిని ఉపాసిస్తున్నట్లుగా ఓ మంత్రంలో ఉంటుంది. భక్తి పొందాలంటే శ్రీ సూక్తం ఎల్లప్పుడూ జపించాలి. మహాలక్ష్మి కృపతోనే వర్షాలు కురుస్తాయి. పంటలు పండుతాయి. సౌభాగ్యం చేకూరుతుంది. సర్వమంగళ స్వరూపిణియైన శ్రీ మహాలక్ష్మికి సర్వవేళలా మనతో వసించాలని భక్తితో ప్రార్థించాలి. క్షీర సముద్రంలో పుట్టిన, మహావిష్ణువుకు ప్రియమైన మహాలక్ష్మికి నమస్కరించాలి.*


*ముక్తిని, మోక్షాన్ని, కార్యసిద్ధిని కలుగ జేసే వరలక్ష్మిని, శ్రీదేవిని తమ పట్ల ప్రసన్నంగా ఉండమని, తెల్లని వస్త్రాలు ధరించినది భూదేవిగా, తులసిమొక్కగా , విష్ణువుకు ప్రియసఖిగా ఉన్న లక్ష్మీదేవికి నమస్కరిస్తున్నాము. సర్వులు సంపదలను లక్ష్మీదేవి కృపతోనే అనుభవిస్తున్నారు. అందరికీ సిరిసంపదలు ప్రసాదించమని ప్రతి ఒక్కరు ఆ సిరులిచ్చే తల్లిని భక్తిపూర్వకంగా ప్రార్థించాలి.*

****
*శ్రీ సూక్తం*
*ॐॐॐॐॐॐ*

*ఓం || హిర’ణ్యవర్ణాం హరి’ణీం సువర్ణ’రజతస్ర’జామ్ | చంద్రాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో మ ఆవ’హ ||*


*తాం మ ఆవ’హ జాత’వేదో లక్ష్మీమన’పగామినీ”మ్ | యస్యాం హిర’ణ్యం విందేయం గామశ్వం పురు’షానహమ్ ||*


*అశ్వపూర్వాం ర’థమధ్యాం హస్తినా”ద-ప్రబోధి’నీమ్ | శ్రియం’ దేవీముప’హ్వయే శ్రీర్మా దేవీర్జు’షతామ్ ||*


*కాం సో”స్మితాం హిర’ణ్యప్రాకారా’మార్ద్రాం జ్వలం’తీం తృప్తాం తర్పయం’తీమ్ |పద్మే స్థితాం పద్మవ’ర్ణాం తామిహోప’హ్వయే శ్రియమ్ ||*


*చంద్రాం ప్ర’భాసాం యశసా జ్వలం’తీం శ్రియం’ లోకే దేవజు’ష్టాముదారామ్ | తాం పద్మినీ’మీం శర’ణమహం ప్రప’ద్యే‌உలక్ష్మీర్మే’ నశ్యతాం త్వాం వృ’ణే ||*


*ఆదిత్యవ’ర్ణే తపసో‌உధి’జాతో వనస్పతిస్తవ’ వృక్షో‌உథ బిల్వః |తస్య ఫలా’ని తపసాను’దంతు మాయాంత’రాయాశ్చ’ బాహ్యా అ’లక్ష్మీః ||*


*ఉపైతు మాం దేవసఖః కీర్తిశ్చ మణి’నా సహ |ప్రాదుర్భూతో‌உస్మి’ రాష్ట్రే‌உస్మిన్ కీర్తిమృ’ద్ధిం దదాదు’ మే ||*


*క్షుత్పి’పాసామ’లాం జ్యేష్ఠామ’లక్షీం నా’శయామ్యహమ్ |అభూ’తిమస’మృద్ధిం చ సర్వాం నిర్ణు’ద మే గృహాత్ ||*


*గంధద్వారాం దు’రాధర్షాం నిత్యపు’ష్టాం కరీషిణీ”మ్ |ఈశ్వరీగ్‍మ్’ సర్వ’భూతానాం తామిహోప’హ్వయే శ్రియమ్ ||*


*మన’సః కామమాకూతిం వాచః సత్యమ’శీమహి | పశూనాం రూపమన్య’స్య మయి శ్రీః శ్ర’యతాం యశః’ ||*


*కర్దమే’న ప్ర’జాభూతా మయి సంభ’వ కర్దమ | శ్రియం’ వాసయ’ మే కులే మాతరం’ పద్మమాలి’నీమ్ ||*


*ఆపః’ సృజంతు’ స్నిగ్దాని చిక్లీత వ’స మే గృహే | ని చ’ దేవీం మాతరం శ్రియం’ వాసయ’ మే కులే ||*


*ఆర్ద్రాం పుష్కరి’ణీం పుష్టిం సువర్ణామ్ హే’మమాలినీమ్ |సూర్యాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో మ ఆవ’హ ||*


*ఆర్ద్రాం యః కరి’ణీం యష్టిం పింగలామ్ ప’ద్మమాలినీమ్ |చంద్రాం హిరణ్మ’యీం లక్ష్మీం జాత’వేదో మ ఆవ’హ ||*


*తాం మ ఆవ’హ జాత’వేదో లక్షీమన’పగామినీ”మ్ | యస్యాం హిర’ణ్యం ప్రభూ’తం గావో’ దాస్యో‌உశ్వా”న్, విందేయం పురు’షానహమ్ ||*


*ఓం మహాదేవ్యై చ’ విద్మహే’ విష్ణుపత్నీ చ’ ధీమహి | తన్నో’ లక్ష్మీః ప్రచోదయా”త్ ||*


*శ్రీ-ర్వర్చ’స్వ-మాయు’ష్య-మారో”గ్యమావీ’ధాత్ పవ’మానం మహీయతే” | ధాన్యం ధనం పశుం బహుపు’త్రలాభం శతసం”వత్సరం దీర్ఘమాయుః’ ||*

*ఓం శాంతిః శాంతిః శాంతిః’ ||*
*****
*శ్రీ సూక్తశ్లోకాలు/అర్థం  ~1*

*ॐॐॐॐॐॐॐॐॐ*

  *శ్లో  హిరణ్య వర్ణామ్ హరిణీమ్ సువర్ణ రజత స్రజామ్*
       *చంద్రామ్ హిరణ్మయీమ్ లక్ష్మీమ్ జాతవేదో మమావహః*

 *హిరణ్య వర్ణామ్* ~ కిరణమయములగు వర్ణము గలది; అనగా సూర్యుని కిరణములలో గల అన్ని వర్ణములు తన రూపముగా గలది.

*హరిణీమ్* ~ ఆడులేడివలె చపలమైన గమనముగలది.

*సువర్ణ రజత స్రజామ్* ~ మంచి వర్ణములను పుట్టించు వెండి వంటి స్వచ్చమైన కిరణము.

 *చంద్రామ్* ~ ఆహ్లాదకరమైనది

*హిరణ్మయీమ్* ~ కిరణముల రూపము గలది. హకార రేఫములే తన రూపములుగా గల మంత్ర మూర్తి.

 *లక్ష్మీమ్* ~ లక్ష్మి

*జాతవేదః* ~ తనయందు వేదము పుట్టినవాడు. అనగా జీవులలో 'నేను '  అను ప్రజ్ఞ గానున్న  పురుషమూర్తి యగు అగ్ని, వానినుండియే వానికి సమస్త జ్ఞానము భాసించును.

*మమ ఆవహః*~ అట్టి జాతవేదుడు నాకు లక్ష్మీ వైభవము సాధించి పెట్టును గాక అని  అర్థము.

      కిరణముల రూపము గలది;  హకార రేఫములే తన రూపములుగా గల మంత్ర‌మూర్తి; లక్ష్మీ చిహ్నములు గలది. సూర్యకిరణముల వలననే ఆకారాలు, రంగులు మున్నగు రూప చిహ్నములు అవతరించుచున్నవి. అలాగే శబ్ధమయములగు నామచిహ్నములునూ అవతరించుచున్నవి‌ ~ తనయందు వేదములు పుట్టినవాడు‌ ~ అనగా జీవులలో నేను అను  ప్రజ్ఙగా ఉన్న పురుషమూర్తి అగు అగ్ని వాని నుండియే వానికి సమస్త జ్ఙానము భాసించును. నాకు సాధించి పెట్టును గాక! అనగా అట్టి  జాతవేదుడు నాకు లక్ష్మీ వైభవాన్ని సాదించి పెట్టును గాక! అని అర్థము.


*శ్రీ సూక్త  శ్లోకం   ~2*

 *తామ్ మ ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీమ్*
*యస్యామ్ హిరణ్యాం విందేయం గామశ్వం పురుషానహమ్*

      వేదమునందు పుట్టిన వెలుగైన అగ్నీ!  ఎన్నడునూ నన్ను విడిచిపోని లక్ష్మిని నాకు ఆవహింప జేయుము. దానివలన కిరణముల బంగారము, గోవులు, అశ్వములు,  పురుషులు(పరివారము) అను సంపదను నేను పొందగలను.

 *జాతవేదః* ~  ఓ జాతవేదుడా!

 *అనపగామినీం* ~ విడిచిపోని యామెను

  *తామ్ లక్ష్మీమ్* ~ ఆ లక్ష్మిని

   *మే* ~ నాకు

   *ఆవహ* ~ ఆవహింప జేయుము

   *యస్యామ్*~ ఎవని వలన

   *హిరణ్యం*~ కిరణముల వెలుగుల సిరులను

    *గాం* ~ గోవును

    *అశ్వం*~ గుర్రమును

    *పురుషాన్* ~ స్థ్రీ పురుషులను (పరిచారమును)

    *అహమ్*~  నేను

    *విందేయమ్* ~ పొందగలను.

      జాతవేదుడు అనగా వేదములయందు పుట్టినవాడు, వేదములను పుట్టించువాడు. చక్కగా సంస్కరింపబడిన మనలోని ప్రజ్ఞలే మానవుడు వ్రాయని గ్రంధాలు. అనపగామిని అనగా విడిచిపోవనిది. సంస్కారమున్నవాని చుట్టునూ ఆవరించియుండు శాంతిప్రదమగు సాన్నిధ్యము ~ దీనినే వర్చస్సు, ఇష్టదేవత,  కళ అని అంటారు.  ఇదే సర్వ సమర్ధతలకూ కారణము. ధర్మశీలుని ఆవరించి పరులకుపకరించు ఆత్మవిశ్వాసముగా ఇది వర్తించును. ఆవహింపజేయుట అనగా దేవతను ఆవాహనము చేయుట. ఇది కోరినవారు  నిత్యార్చనలో దేవతలకు పూజానంతరము ఉద్ద్వాసనము చెప్పరాదు.  గామ్ ~ గోవును ~ అశ్వం ~ గుర్రాన్ని అనగా ప్రాణమయ శరీరమనబడు అగ్నిని ~ దీనినే అశ్వర్థమందలి అశ్వర్తమందలి అశ్వర్తమందలి అశ్వమని వేదాలకవి సంప్రదాయము చెప్పును. పురుషాన్ అనగా పురుషులనూ పురుషసూక్తమున చెప్పబడిన పపరమపురుషుని రూపాలుగా నరులను ఆదరిించుట!!


*శ్రీ సూక్తము ~ శ్లోకం ~ 3:*

*అశ్వపూర్వాం  రథమధ్యాం హస్తినాద ప్రభోధినీమ్*
 *శ్రియం దేవీం ఉపహ్వయే శ్రీర్మా దేవీర్జుషతామ్:*

        తొలుత అశ్వములు, నడుమన రథములు, కొసకు ఏనుగులు నిలబడి శబ్దములు చేయుచుండగా మేల్కొలుపులను పొందుచూ, వెలుగుల నాశ్రయించుట్టి శ్రీదేవిని మేము ఉపాసన చేయుదుము. మమ్ము ఆ శ్రీదేవి అభిలషించి  ప్రోత్సహించును గాక!

        *అశ్వపూర్వామ్* ~ అశ్వములు తొలుతగా  గలది;

        *రథమధ్యామ్*~ రథములు   నడుమగా గలది

        *హస్తినాద*~ ఏనుగుల నాదముచే;

        *ప్రభోధినీం*~ మేల్కొలుప బడినది;

        *శ్రియం* ~ ఆశ్రయించునది;

        *దేవీం* ~ వెలుగుల రూపు గలది;

        *ఉపహ్వయే*~  ఉపాసన చేయుదును; రమ్మని  పలుకుదును;

        *శ్రీందేవీం*~ ఆశ్రయించునది, వెలుగులు గలదియు అగు ఆ శ్రీదేవి;

        *మా* ~ నన్ను;

        *జుషతామ్*~ అభిలషించును గాక!


 *శ్రీ సూక్తము ~  శ్లోకం ~ 4:*

 *కాంసోస్మితాం హిరణ్య ప్రాకారా ఆర్ద్రామ్*
 *జ్వలంతీం తృప్తాం తర్పయంతీమ్*
  *పద్మే స్థితాం పద్మవర్ణాం తామిహోపహ్వయే:*

         పరమపురుషుడగు నారాయణుడు, ఎవరిని తన అస్తిత్వముగా నేర్పరచుకొనెనో, అట్టి కిరణమయ ప్రాకారము రూపముగల ఆమెను, పద్మమున నిలిచిన పద్మ వర్ణ మూర్తిని అగు నామెను, శ్రీదేవిని నాయందు ఆవాహనము చేయుచున్నాను.

 *సహః* ~ అతడు, వేదపురుషుడు;

  *కాం*  ~ ఎవతెను;  అస్మితాం ~అస్తిత్వముగా, నేనున్నాను అను ప్రజ్ఙగా, సంకల్పరూపిణిగా(పొందెనో);

*హిరణ్య ప్రాకారాం*~ బంగారు వన్నె కిరణముల యావరణము గల దానిని;
*ఆర్ద్రామ్*~ ద్రవ స్వరూపిణిని;‌ లేక రస స్వరూపిణిని, ఎర్రని రంగు గూడ కలిగిన ఉదయారుణ సూర్యకాంతి గలదానిని;
*జ్వలంతీ*~ జ్వాలా రూపము గల దానిని;
*తృప్తామ్* ~ తృప్తి గల దానిని;
*తర్పయంతీం*~ తృప్తిని కలిగించుచున్న దానిని;
*పద్మే స్థితాం* ~ పద్మమునందు ఉన్న దానిని;
*పద్మ వర్ణాం* ~ తమ్మి పువ్వు రంగు కల దానిని;
  *పత్ + మ* ~ పదముల శోభతో కూడిన రంగు కల దానిని;
*తామ్ శ్రియం* ~ ఆ శ్రీదేవిని;
*ఇహ*~ ఇచ్చటకు, నాయందు స్థూల సూక్ష్మాది సృష్టి లోకమందు;
*ఉపహ్వయే* ~ సమీపమునకు పిలుచుచున్నాను.
*ఆర్ద్ర* ~ ఉదయ సూర్యరశ్మి ద్రవమువలె వ్యాపించునది యయ్యు, అగ్నిగా వేడి వెలుగుల నిచ్చునది. మరియూ ఆర్ద్ర అను నక్షత్రము లక్ష్మీ సమృధ్ధిగల సౌర కుటుంబము. దాని వెలుగును ఉపాసించుట లక్ష్మీ ప్రదము. ఇది భూమికి పగడము వలె కనిపించును. పగడముల  చెట్లు ఈ నక్షత్ర ప్రభావము వలన ఉధ్భవించుచున్నవి. కనుక పగడములు కూడా లక్ష్మీ ప్రదములే~ స్థ్రీలచే ధరింపబడును. ప్రేరేపించును గాక!


*శ్రీసూక్తము ~ శ్లోకము ~ 5*

 *చద్రాం ప్రభాసాం యశసా జ్వలంతీం*
 *శ్రియం లోకే దేవ జుష్టా  ముదారామ్*
 *తాం పద్మినీం ఈం శరణ మహం ప్రపద్యే*
  *అలక్ష్మీ ర్మే నశ్యతాం త్వాం వృణే:*

         చంద్రాత్మకమైనది, వెలుగులను వెదజల్లునది, ప్రశస్థిచే లోకమునందు (లోకములుగా) వెలుగుచున్నది, దేవతల ప్రీతిని చూరగొన్నది, ఔదార్యం గలది, పద్మ లక్షణములు గలది,  ఈం కార స్వరూపిణియగు ఆ శ్రీదేవికి నేను శరణాగతి  చేయుచున్నాను. నిన్ను  వరించుటవలన నాయందున్న అలక్ష్మి నశించు గాక!

*ప్రతిపదార్థాలు*

 *చంద్రాం* ~ చంద్రతత్వంగలది,  షోడశ కళాత్మకమైనది;
*ప్రభాసాం* ~ ప్రశస్తమైన వెలుగు గలది;
*యశసా* ~ ప్రసిధ్ధికి వలసిన లక్షణములచే;
*లోకే* ~ లోకము నందు;
*జ్వలంతీం* ~ ప్రకాశించు దానిని;
*దేవజుష్టాం* ~ దేవతల మక్కువను చూరగొనిన దాని‌ని;
*ఉదారాం*  ~ దానము చేయు గుణము కల దానిని;
 *పద్మినీం* ~ పద్మ లక్షణములు గల నామెను;
*ఈం*  ~ఈంకార స్వరూపిణిని;
*తాం*~ ఆమెను ( అట్టి శ్రీదేవిని);
*అహమ్* ~ నే‌ను శరణము పొందుచున్నాను;
*త్వాం* ~ ‌ని‌‌న్ను;
*వృణే*  ~  వరించుట యందు ( ఆవరించుట యందు);
 *మే*  ~ నాయొక్క;
*అలక్ష్మీః*~  అశుభ లక్షణము;
*నశ్యతాం*~ నశించును గాక!


*శ్రీ సూక్తము ~  శ్లోకం ~ 6:*

 *ఆదిత్య వర్ణే తపసోధిజాతో వనస్పతి స్తవ వృక్షోధ బిల్వః,*
*తస్య ఫలాని తపసా నుదంతు మాయాంతరాయస్చ బాహ్యా అలక్ష్మీ:*

       *ఆదిత్యుని వర్ణముతో వెలుగొందు ఓ శ్రీదేవీ! నీ తపస్సుచేత అధిష్టించి పుట్టినది బిల్వము అను వనస్పతి.  దాని ఫలములు మా తపస్సు చేత,*
*మాలోని మాయా సంభవములైన లోపలి, వెలుపలి అవలక్షణములను*
*తొలగించు గాక!*

*ప్రతిపదార్థాలు*

 *ఆదిత్యవర్ణే*  ~ ఆదిత్యుని వర్ణము గలదానా;
 *తపసః* ~ తపస్సులకు;
 *అధిజాతః*~ అదిష్టానముగా పుట్టినది యగు వనస్పతి అను జాతికి చెందిన;
 *వృక్షః* ~ వృక్షము;
 *అథః*~ అటుపైన ( తపస్సునకు అనంతరముగా పుట్టిన);
 *బిల్వ* ~ మారేడు చెట్టు;
 *తస్య ఫలాని* ~ దానియొక్క ఫలములు;
 *తపసా*~ తపస్సు చేత;
*అంతరాయా + చ* ~ లోపలి నుండీ కలుగుననియు;
*బాహ్యా + చ* ~ పరిసరములనుండి కలుగుననుయు అగు;
*అలక్ష్మీః* ~ అలక్ష్మీ కరములగు;
 *మాయాః* ~ మాయా సంభవ లక్షణములను;
 *నుదంతు* ~ పోగొట్టును గాక: నశించునుగాక!


*శ్రీ సూక్తము ~  శ్లోకం ~ ~ 7:*

*ఉపైతు మాం దేవ సఖః కీర్తిశ్చ మణినా సహ*
*ప్రాదుర్భూతోస్మి రాష్ట్రేస్మిన్    కీర్తి  వృధ్ధిం దదాతు మే;*

*భావము*

       *కీర్తి తోడను, మణులతోడను కలిసి దేవతలకు సఖుడగు కాముడు నా కెదురు ‌వచ్చి సమీపించుగాక! నే నుధ్భవించిన ఈ రాష్ట్రము‌ నందతడు నాకు సమృధ్ధిని కలిగించును గాక‌.*

 *దేవసఖః* ~ దేవతలకు సఖుడు అగు కాముడు;

      *కీర్తిః + చ*~  కీర్తియునూ;

      *మణినా సః*~ మణితో కూడా;

      *మాం*~ నన్ను;

      *ఉప + ఏతు*~ సమీపించును గాక;

      *అస్మిన్ రాష్ట్రే*~ ఈ రాష్ట్రము నందు;

      *ప్రాదుర్భూతః + అస్మి*~ ఉధ్భ వించితిని;

      *మే* ~ నాకు;

      *కీర్తిం*~ ఆ కాముడు కీర్తిని;

      *వృధ్ధిం* ~ సంవృధ్ధిని;

      *దదాతు* ~ ఇచ్చును గాక!


*శ్రీసూక్తము ~ శ్లోకము ~ (8)*

*క్షుత్పిపాసా మలామ్ జ్యేష్టాః అలక్ష్మీ  నాశయామ్యహం*
*అభూతిః అసమృధ్ధిం చ సర్వాః

నిర్ణుద మే గృహాత్:*

        *ఆకలి దప్పుల మలిన లక్షణము గల జ్యేష్టా దేవి అనబడు అలక్ష్మిని నేను నశింపజేయుదును. సంపద, సమృధ్ధి నా ఇంటి నుండి* *తరగకుండా అనుగ్రహించి నీవును అలక్ష్మిని పోగొట్టుము.*

 *క్షుత్*~ ఆకలి;
 *పిపాసా* ~ దప్పిక;
 *మలాం* ~ మల స్వభావము గల దానిని;
 *జ్యేష్టాః*~ జ్యేష్టాదేవిని అనగా దారిద్య దేవతను;
 *అలక్ష్మీ*~ శుభ లక్షణములకు వ్యతిరేకమైన దానిని;
 *అహం* ~ నేను;
 *నాశయామి* ~ నశింపజేయుచున్నాను;
*అభూతిః* ~ సంపద లేకుండుటను;
 *అసమృధ్ధిం చ*~ సమృధ్ధి లేకుండుటను;
 *సర్వాః*~ సమస్త స్వరూపమగు జ్యేష్టాదేవిని;
 *మే గృహాత్*~ నా ఇంటినుండీ;
 *నిర్ణుద*~ పోగొట్టుము.

          *ఒంటికి సంభంధించినది, ఇంటికి సంభంధించినది అగు* *దారిద్ర్యమురెండు విధములు:  మొదటిది కర్మాధీనము ~ అనగా జీవుడు సత్కర్మచే నశింపజేసుకొన వలసినది. అనగా  అనుగ్రహముచే తొలగిపోవలదినది. అందు మొదటిదానిని నేను‌ తొలగించుకొందును. రెండవ దానిని నీవు తొలగింపుమని ఇందలి* *ప్రార్థన. పూర్వ కర్మ నశించుటకు సత్కర్మయూ, దైవానుగ్రహమునకు* *ప్రార్థనయూ సహజమైన పధ్ధతులు. ఇవి తారుమారు అయినచో పని చేయవు. దుష్కర్మ చేసి ప్రార్థన చేసినచో ఆపదలు తొలగవు. సత్కర్మ చేసి కలిసిరానిచో  సుఖము కలుగదు. రెండింటి సామ్యము కొరకు ఈ మంత్రమును*


*శ్రీ సూక్తము ~  శ్లోకం ~ 9:*

  *గంధ ద్వారాం దురాధర్షాం నిత్యపుష్టాం కరీషిణీం*
   *ఈశ్వరీగ్ం సర్వ భూతానాం తామిహోపహ్వయే శ్రియం:*

*గంధద్వారాం* ~ గంధమే తన ద్వారముగా కల దానిని, సుగంధముతో
కూడిన ద్వారము కల దానిని;
*దురాధర్షాం*~ తేలికగా సమీపించుటకు వీలుకాని దానిని, జంకు కలిగించుటకు సాధ్యపడని దానిని;
*నిత్యపుష్టాం*~ నిత్యమూ పుష్టియైన దానిని;
*కరీషిణీం* ~ కరములచే అనగా కిిరణములచే పొందబడిన ఈషణములు కలదానిని(ఈషణములు అనగా ఆకార రేఖలు లేక అభిలాషలు)
*సర్వ భూతానాం* ~ సమస్త జీవరాశులకు;
*ఈశ్వరీం* ~ స్ధిదేవత యైన దానిని;
*తాం శ్రియం* ~ ఆ శ్రీదేవిని;
*ఉపహ్వయే* ~ సమీపించుటకు ఆహ్వానించుచున్నాను.
సుగంధముతోకూడిన ‌ద్వారముగలది. సులభంగా సమీపించుటకు వీలు కానిది, ఎల్లప్పుడూ పుష్టిగా ఉండేది, కిరణములచే ఆకారము కట్టుకొన్నది.
సర్వజీవులకూ పరమేశ్వరి అగు నా శ్రీదేవిని మమ్ము సమీపింపుమని‌ ఆహ్వనించు చున్నాను. ఉపాసించబడును.


*శ్రీ సూక్తము ~ శ్లోకం ~ 10:*

  *మనసః కామ మాకూతిమ్ వాచః సత్య మశీ మహి*
*పశూనాం రూపమన్నస్య మయి శ్రీః శయతాం యశః:*

 *మనసః* ~ మనస్సు యొక్క;
  *కామమ్* ~ కోరికను;  అకూతిమ్ ~ కుతూహలమును;
  *వాచః* ~ వాక్కుయొక్క;  సత్యం  ~ సత్యమును;   
  *పశూనాం* ~ పశువులయొక్క;  అన్నస్య ~ అన్నముయొక్క;
   *రూపం* ~ రూపములు;  అశీమతి ~ నీ యందు రూపొందిచుకొని
    అనుభవించెదము;
    *యశః*  ~ కీర్తి స్వరూపమగు; 
   *శ్రీః* ~ శ్రీదేవి;  
  *మయి* ~ నాయందు;
   *శ్రయ తామ్*~ ఆశ్రయమును చెందునుగాక;

      *మనస్సు యొక్క కోరికను, కుతూహలమును, వాక్కు యొక్క సత్యమును, నీయందు రూపొందించుకొందుము. పశు సంపద యొక్క, అన్నము యొక్క రూపమును నీయందు రూపించుకొందుము. కీర్తి స్వరూపమగు శ్రీదేవి నా యందు ఆశ్రయము చెందునుగాక.*

       *మనస్సునకు కోరిక, కుతూహలము సహజములు. వాక్కునకు సత్యము సహజము. అసత్యమాడిన వాక్కునందు కూడా అతడు అసత్యమాడెనను సత్యము సహజముగా నుండును. వాక్కు భావ ప్రకటన స్వరూపము గనుక. ఎట్లుద్దేశింపబడిన సత్యమట్లే వ్యక్తమగుట సత్యము. ఈ సహజ సంపదను లోకదృష్టి యొక్క నానాత్వము వైపునకు చెదర నీయక నీయందు ప్రయోగింతు మని అర్థము.*

 *పశువుల యన్నము అనగా పచ్చిక, నీరు మున్నగునవి. వానిని పెట్టి* *పోషించుటవలన పశువులు గవ్య సంపద నిచ్చు‌ను గనుక, పై* *వస్తువులను సంపదయొక్క రూపములుగ దర్శించి యాదరింతుమని* *అర్థము. అనగా మంచి ఆహారాదులచే పశువులయందు భూత దయ, ఆదరము కలిగి వుండి ఈ లక్షణములను నీ రూపమున* *నర్చింతుమని అర్థము. అట్లు ప్రవర్తించిన వారి సత్ప్రవర్తనము వలన లోకమున కలుగు సత్కీర్తియే శ్రీ స్వరూపము. అట్టి స్వరూపమునకు* *ఆశ్రయమిత్తుమని ఇందలి ప్రార్థనము.*
*దీనివలన శ్రీదేవి సహజముగా గొనవలెనని కోరుకొనుట ముఖ్యము.*


*శ్రీ సూక్తము ~ శ్లోకం ~ 11:*

  *కర్దమేన ప్రజాభూతా మయి సంభవ కర్దమ*
   *శ్రియం వాసయ మే కులే మాతరం పద్మ మాలినీం:*

 *కర్దమేన*‌ ~ కర్దముని చేత; 
*ప్రజాభూతా*~ సంతతిగ పొందబడినదగు;
 *శ్రియం* ~ శ్రీదేవిని;  
*మాతరం*~ మాతృస్వరూపిణిని;
 *పద్మమాలినీం* ~ పద్మ మాల ధరించినదానిని;
 *మే కులే* ~ నా వంశమునందు;
‌  *వాసయ* ~ వసింపజేయుము;  
  *కర్దమ*~ ఓ కర్దముడా!
‌‌‌  *మయి*~ నా యందు;  
  *సంభవ*~ నీవునూ  ఉధ్భవింపుము.

 *తాత్పర్యము:*

         కర్దముడను ప్రజాపతి చేత సంతతిగ పొందబడిన సువర్ణ కర్దమ స్వరూపిణిని నాయందు కర్దమ స్వరూపిణివై యుధ్భవింపుము. ఓ కర్దమ ప్రజాపతీ! మాతృ స్వరూపిణియు, పద్మాలంకృతయు నగు శ్రీదేవిని మా వంశమునందు  వసింపజేయుము.


        కర్దముడు సృష్టి కారకులగు ప్రజాపతులలో ఒకడు. ఇతడు తన భార్యయందు  సృష్టి సమస్తమును శ్రీ కళయైన హిరణ్య కర్దమముగా నుధ్భవింప జేసెను.  ఇతని మహిమవలన  సూర్యకిరణముల నుండి యుధ్భవించింన మరుత్తులు వాయువులైనవి. అవే సూర్యకిరణములనుండి పుట్టిన అగ్ని వలన వాయువులు జలములైనవి. జలము పృథ్వీ తత్వమైనది. వాయు, జల, పృథ్వీ తత్వముల సమ్మిశ్రమగు కర్దమముపై (బురదపై) సూర్య కిరణములు ప్రసరించి జీవ సృష్టిని కలిగించినవి. ఇది యంతయూ కర్దమ ప్రజాపతి  ప్రభావము. ప్రకృతి శ్రీ స్వరూపిణి గనుక కర్దముని సంతతిగా ఉధ్భవించినదని పురాణములయందు నిరూపింపబడినది.


*శ్రీ సూక్తము ~  శ్లోకం ~ 12:*

 *ఆప సృజంతు స్నిగ్ధాని చిక్లీత వస మే గృహే*
 *నిచ దేవీం మాతరం శ్రియం  వాసయ మే కులే:*

 *ప్రతిపదార్థాలు*

*స్నిగ్ధాని* ~ మెరుపుకాంతులు కలిగిన;  *ఆపః* ~ జలములు;
*సృజంతు* ~ సృష్టించుగాక;  *చిక్లీత*~ ఓ చిక్లీతుడా;
 *మే గృహే*~ నా గృహమున;  *వస*~ వసియింపుము;
*మాతరం* ~ తల్లియగు;  *శ్రియం దేవిం* ~ శ్రీదేవిని;
*మే కులే*~ నా వంశమునందు;
*నివాసయ చ* ~ నివసించునట్లు చేయుము.

 *తాత్పర్యము*

*ఓ చిక్లీతుడా ! సరసములైన జలములు సృష్టించు గాక! నీవు నా* *గృహమున వసింపుము.  మాతయైన శ్రీదేవిని నా వంశమున నిశ్చలముగా వసింప జేయుము.*
    
        *చిక్లీతుడు లక్ష్మీ పుత్రులు ముగ్గురిలో నొకడు. కర్దముడు, చిక్లీతుడు,*
*ఆనందుడు,  అను ముగ్గురూ లక్ష్మీ పుత్రులు సృష్టికి ప్రజాపతులుగా పని చేయుదురు.  కేదనము అనగా తడుపుట.  జలమునకు* *తడుప‌పు  నట్టి శక్తి నిచ్చు దేవతయే చిక్లీతుడు.  తడి యనునది జీవమునకు చిహ్నము.  దానివలననే భూమి వర్షమున తడియుట, సృష్టి  విత్తనమును‌‌‌‌   మొలకెత్తించుట జరుగుచున్నది. వర్షములు లేకుండుట క్షామమునకు సూచకము.  చిక్లీతుడు అను ప్రజాపతి వర్షముచే భూమిని తడిపి పంట పండించు దేవత. పూర్వకాలమున ఇతడు రైతుల ఇష్ట దైవముగా ఆరాధింపబడువాడు. ఇతడు ప్రసన్నుడైనచో స్నిగ్నిదములైన ఆపస్సులు ప్రసన్నములగును.  అనగా మెరుపుకాంతులతో విద్యుత్ అనబడు ప్రాణశక్తిని తమలోని అంకురశక్తిగా పీల్చుకొని భూమికి దిగివచ్చు మేఘముల జలములివి.  క‌నుకనే,  సంపదలనిచ్చుచూ లక్ష్మికి‌ రూపములై ఉన్నవి‌.  తల్లి గర్భములో జలములు కారణముగా పిండము జీవించును గనుక మాతృ స్వరూపిణియైన జలములను చిక్లీతుడు సకాలమున భూమికి గొని రావలెనని ఇందలి ప్రార్థన.*


*శ్రీ సూక్తము ~ శ్లోకం ~ 13:*

  *ఆర్ధ్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీమ్:*
 *చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహః:*

         *ఆర్ద్రాం* ~దయార్ద్ర స్వరూపిణి, రస స్వరూపిణి, ఆర్ద్రా నక్షత్రమునుండి వెలుగుచున్న మహిమ కలదానిని;

          *పుష్కరిణీం* ~ పోషణను  కలిగించునది; తెల్ల కలువలమాలను ధరించినది; పుష్కరిణి అంటే కోనేరు; అందు పోషింపబడు తెల్ల కలువ పువ్వులు కలది అని అర్థము.

          *పుష్టిం* ~ పోషణ స్వరూపిణిని;  పింగళాం ~ పింగళ వర్ణము(తేనెరంగు)
కలది;

          *పద్మమాలినీం* ~ పద్మముల మాలను ధరించినదా‌నిని;

          *చంద్రాం*~ చంద్రుని స్వరూపమైన చల్లని వెలుగులు గలదానిని;

          *హిరణ్మయీం* ~ బంగారు రంగున వెలుగొందుదానిని; కిరణ్మయ స్వరూపిణిని;

          *లక్ష్మీం* ~ శుభ లక్షణములు గలదానిని;

          *మే + ఆవహః* ~ నాయందు ఆవాహన చేయుము.

      *ఓ జాతవేదుడా!  ఆర్ద్ర స్వరూపిణియు, కలువపువ్వుల, *తమ్మిపువ్వుల*దండ ధరించినదియు, పోషణము, పుష్టి కలిగించునదియు, పింగళవర్ణము గలదియు, హిరణ్మయ మూర్తియు, చంద్రుని స్వరూపము గలదియు అగు లక్ష్మిని నాయందు ఆవహింపజేయుము.*

       *ఆర్ద్ర* అనగా *దయార్ద్ర స్వరూపిణి; రస స్వరూపిణి; ఆర్ద్రా* *నక్షత్రమునుండీ వెలుగుచున్న మహిమ కలదానిని. పుష్కరిణి అంటే కోనేరు; అందు పోషింపబడు తెల్ల కలువ పువ్వులు కలది అని అర్థము.* *చంద్రుడు తెల్లకలువలను వికసింపచేసి శోభ కలుగజేయును. కనుకనే ఇక్కడ శ్రీదేవి  వర్ణింపబడినది.*

         *గృహారామమున కోనేరు, తెల్ల కలువలుండుట లక్ష్మీప్రదము. ఆర్ద్రా నక్షత్రమున వానినారంభము చేయుట శుభప్రదము. *పింగళ* అనగా *తేనె* *రంగు కలది. తేనె లక్ష్మీకరములగు ఆహారములలో ఒకటి. దానిని సేవించుట ఆయురారోగ్య ఐశ్వర్య ప్రదము; మరియూ పింగళనాడి లక్ష్మీ* *స్వరూపము. దానినే సూర్యనాడి అని అంటారు. దాని వల్ల యోగులకు* *ఊర్ధ్వగతి. భోగమోక్షములు*


*శ్రీసూక్తము ~ శ్లోకం ~ 14:*

 *ఆర్ద్రాం యః కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీమ్*
*సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ:*

*ప్రతిపదార్థాలు*
 
*కరిణి*~ ఏనుగులుకలది; 
*యష్టిం*~ యజ్ఙదండముయొక్క స్వరూపమైనది;
*సువర్ణ*~ బంగారురంగుకలది లేక మంచి వర్ణములచే వ్యక్తమగునది;
వర్ణములు అనగా అక్షరములు మరియు రంగులు; మంచి అక్షరముల సముదాయముతో శుభమైన పద ప్రయోగముతో చేయు  సంభాషణలలో
లక్ష్మి ఉండును. సూర్యుని కాంతినుండీ ఏడు రంగులుధ్భవించును. కనుక
లక్ష్మి సువర్ణ స్వరూపిణి;
*హేమమాలిని* ~ బంగారు హారములుగలది;
*సూర్య* ~ సూర్యుని వెలుగు తన స్వరూపముగా కలది.

*తాత్పర్యము*

       ఏనుగులు సంపదను, లక్ష్మీ ప్రసన్నమును సూచించును కనుక,  అటునిటు
ఏనుగులతో లక్ష్మిని ధ్యానము  చేయవలెను. ఈ ధ్యానమునే గజలక్ష్మి అని
అందురు. యజ్ఞమున యజ్ఞశాలలోని స్థంభము పశువును బలి యిచ్చుటకు గుర్తు.

జీవుని పశుత్వమును బలియిచ్చి దివ్యత్వమును వర్ధిల్లజేయుట వలన
లక్ష్మీ కళ పెరుగును.

         సూర్య అనగా సూర్యుని ఆకారము, కాంతి, రంగులు, పేరులు తన
స్వరూపముగా గలది అని అర్థము. గుణమయి యగు ప్రకృతి అంతయూ
లక్ష్మీ స్వరూపము. అందుండు పురుషుడే అంతర్యామియై       
సౌరకుటుంబములోని లోకములన్నిటనూ వ్యాపించి యుండి నారాయణుడుగా తెలియబడు చున్నాడు. లక్ష్మి ఈ మంత్రమున నారాయణ సహితముగా ధ్యానము చేయబడి సాధకుని లోనికి ఆవహింపబడుచున్నది...


*శ్రీ సూక్తము ~ శ్లోకము 15:*

  *తాం మ ఆహవ జాతవేదో లక్ష్మీ మనపగామినీ*
   *యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వాన్*
    *విందేయంపురుషానహమ్:*

*ప్రతిపదార్థాలు:-*

*జాతవేదాః* ~ ఓ జాతవేదుడా!  
*యస్యాం*~ఎవతెయందు;
*హిరణ్యం* ~ బంగారమును;  
*గావః* ~  గోవులను; 
*దాస్యః* ~దాసీజనమును;
*అశ్వాన్*~ అశ్వములను;  
*పురుషాన్*~ పురుషులను;
*అహం* ~ నేను;  
*విందేయం*~ పొందగలనో; 
*తాం*~ ఆమెను;
 *అనపగామినీమ్*~ ఎడబాయని లక్షణములు గల దానిని;
 *లక్ష్మీం*~ శుభ లక్షణ దేవతను;
*ఆవహః*~ ఆవహింపజేయుము;

*తాత్పర్యము:-*

           అపగమనము అనగా నెడబాయుట. ఆ లక్షణములు లేనిది
అనపగామిని. అభ్యాసమైన శుభలక్షణము ఎడబాయదు. సంపద దాని నెడబాయదు. హిరణ్యమనగా బంగారు రంగు వెలుగు. జీవ స్వరూపమైన సూర్యకిరణము. గోవు అనగా తెల్లనిరంగు కిరణములు. సూర్యుని ఈ కిరణములవలన. ఆనందమయ కోశము మేల్మొనును. దాసులనగా ఇంద్రియములు. ఇవి దాస్యము చేయుట యోగవిద్య. అశ్వమనగా ప్రాణమయ శరీరము. దీనివలన చైతన్యము, గమనము కలుగును. పురుషుడనగా జీవుడు. శ్రీసూక్త సిధ్ధి వలన సర్వజీవ మైత్రి
కలుగును. దా‌నితో సంపద కలుగును.


*శ్రీ సూక్తము ~ శ్లోకం ~ 16:* *(ఫలశృతి శ్లోకము:)*

          *యశ్శుచిః  ప్రయతో భూత్వా జుహుయా దాజ్య మన్వహం*
            *శ్రియః పంచదశర్చం చ శ్రీ కామః సతతం జపేత్:*

*ప్రతిపదార్థాలు:-*

 *యః*~ ఎవడు;  శ్రీకామః ~ సంపదకోరునో ( అతడు);
*శుచిః* ~ శుచికలవాడై;  
*ప్రయతః*~ ప్రయత్నముకలవాడై(శ్రధ్ధావంతుడై);
*అన్వహం* ~ అనుదినము; 
 *ఆజ్యం*~ నేతిని;
*జుహూయాత్*~  హోమము చేయవలెను;  చ ~ మరియు;
*శ్రియః*~ శ్రీదేవి యొక్క; 
*పంచదశ*~ పదునైదు;
*ఋచం* ~ ఋక్కుల సమూహమును;
*సతతం*~ ఎల్లప్పుడును; 
*జపేత్*~ జపించవలెను.

*తాత్పర్యము:-*

        శుచిమంతుడై,  ప్రయత్నము గలవాడై అనుదినమూ శ్రీసూక్తము యొక్క పదునైదు ఋక్కులను శ్రీకాముడైనవాడు నేతితో హోమము చేయుచూ జపించవలెను.


         శ్రీకాముడనగా సంపద కోరినవాడు. ఇది ఇహలోక పరలోక సంపద.
నేతిని హోమము చేయుట బహిర్యాగము. మధురమైన మైత్రీ భావమును
జపించుట అనగా, ఎల్లప్పుడునూ నిలుపుకొనుట అంతర్యాగము. శ్రీదేవి
అంతర్యాగముచే చక్కగా నారాధింప బడదగిన దనియూ, బహిర్యాగ
మునకు దుర్లభ రూపమున లభించుననియూ, శ్రీవిద్య యందు చెప్ప
బడినది. శుచిత్వ మనగా శరీరము, మనస్సు, ఇంద్రియములు శుచిగా
ఉండుట. ప్రయత్నము లేక శ్రధ్ధ యనగా నెల్లప్పుడునూ శ్రీదేవిని గుర్తుంచు
కొనుట, అనగా సర్వ జీవరాశులయందునూ దర్శించుట‌.
 
        *ఇది శ్రీసూక్తమునకు ఫల శృతి.*

*****He is the supreme being within Shaivism, one of the major traditions within contemporary Hinduism  #Arudra_Darshan_2020 #Rudra_Darshan #Lord_Shiva #Lord_Nataraja #Rudrayamala_Tantra_Homam #Rudra_Abhishekam #Ganga_Devi_Puja #Pallikondeshwarar_Temple_Puja



హిందూమత సాహిత్యం ప్రకారం, చిదంబరం అనేది శివుని యొక్క ఐదు పవిత్రమైన ఆలయాల్లో ఒకటి. పంచ భూతాలకి ఒక్కొక్క ఆలయం నిర్మించబడంది. చిదంబరం ఆకాశతత్త్వానికీ, తిరువనైకవల్ జంబుకేశ్వర జలతత్త్వానికీ, కంచి ఏకాంబరేశ్వర భూమితత్త్వానికీ, తిరువణ్ణామలై అరుణాచలేశ్వర అగ్నితత్త్వానికీ మరియు కాళహస్తీశ్వర స్వామి వాయుతత్త్వానికీ నిదర్శనాలు.

చిదంబర కథ పరమశివుడు తిల్లైవన సంచారంతో మొదలౌతుంది, (వనం అనగా అర్ధం అడవి మరియు తిల్లై వృక్షాలు - ఒక ప్రత్యేకమైన నీటి చెట్టు- ఇది ప్రస్తుతం చిదంబరం దగ్గరలోని పిఛావరం నీటిచలమల్లో పెరుగుతోంది. ఆలయ చెక్కడాలు తిల్లై వృక్షాలు క్రీశ 2వ శతాబ్దంలోనివిగా వర్ణిస్తాయి.అజ్ఞానం యొక్క దమనంసవరించు

తిల్లై వనాలలో కొంతమంది మునులు లేదా 'ఋషులు' నివసించేవారు, వారు మంత్రశాస్త్రం యొక్క ప్రాముఖ్యతను నమ్మారు మరియు భగవంతుడిని కొన్ని క్రతువులు మరియు 'మంత్రాల'తో నియంత్రించవచ్చని భావించారు. దేవుడు, 'పిచ్చతనాదర్' రూపంలో, ఒక సాధారణ యాచకుడివలే, ఎంతో అందమైన మరియు ప్రకాశవంతమైన అడవిలో సంచరిస్తాడు. అతనిని మోహిని అవతారంలోనున్న అతని సహవాసియైన విష్ణువు అనుసరిస్తాడు. ఋషులు మరియు వారి భార్యలు, ఎంతో ప్రకాశవంతమైన ఈ యాచకుడు మరియు అందమైన ఆతని సహవాసిని చూసి ముగ్ధులౌతారు.

ఆనందభరితులైన వారి యొక్క ఆడవారిని చూసి, ఋషులు ఆగ్రహిస్తారు మరియు మంత్రాలతో కూడిన క్రతువులను ఆచరించి అసంఖ్యాకమైన 'సర్పాల'ను (సంస్కృతం: నాగ) ఆమంత్రిస్తారు. యాచకుడైన ఆ భగవంతుడు సర్పాలను ఎత్తి వాటిని మెడకు మరియు నడుముకి దట్టంగా చుట్టుకొని ఆభరణములవలె ధరిస్తాడు. మరింత ఆగ్రహించిన ఋషులు, ఒక భయానకమైన పులిని ఆమంత్రించగా, దాన్ని కూడా శివుడు చీల్చి, ఆ పులి చర్మాన్ని నడుము చుట్టూ శాలువా వలె ధరిస్తాడు.

పూర్తిగా విసుగు చెందిన ఋషులు, వారి యొక్క ఆధ్యాత్మిక శక్తిని మొత్తం కూడదీసుకొని, ఒక శక్తివంతమైన రాక్షసుడు ముయాలకన్ - అను, అజ్ఞానానికి మరియు గర్వానికి చిహ్నమైన ఒక శక్తివంతమైన రాక్షసుడిని ఆమంత్రిస్తారు. పరమ శివుడు ఒక చిరునవ్వుతో, రాక్షసుడి యొక్క వెన్ను మీద కాలు మోపి, కదలకుండా చేసి ఆనంద తాండవం (ఆద్యంతరహితమైన చిద్విలాస నృత్యం) చేస్తాడు మరియు ఆతని నిజ స్వరూపాన్ని చూపిస్తాడు. భగవంతుడు వాస్తవమని మరియు అతను మంత్రాలకు మరియు ఆగమ సంబంధమైన క్రతువులకు అతీతుడని గ్రహించి, ఋషులు లొంగిపోతారు.

ఆనంద తాండవ భంగిమసవరించు,

పరమ శివుని యొక్క ఆనంద తాండవ భంగిమ, యావత్ ప్రపంచంలో ప్రసిద్ధమైన భంగిమలలో ఒకటిగా, అనేకులు (ఇతర మతస్థులు కూడా హిందూ మతానికి చెందిన దీన్ని కొనియాడి) గుర్తించారు. ఈ దివ్య నృత్య భంగిమ భరతనాట్య నర్తకుడు ఎలా నర్తించాలో తెలియజేస్తుంది.
ఆదిశేషువు అనే సర్పం, తల్పం వలె మారి విష్ణువుగా సాక్షాత్కరించిన భగవంతుని సేవిస్తుండగా, ఆనంద తాండవం గురించి విని దానిని చూసి తరించవలెనని ఉత్సాహపడతాడు. అంతట భగవంతుడు ఆదిశేషువుని దీవించి, అతనికి యోగ స్వరూపుడైన 'పతంజలి' రూపాన్ని ప్రసాదించి తిల్లై అడవులకి వెడలి పొమ్మని, అతను అచిరకాలంలోనే నృత్యంలో విన్యాసాలు చేయగలడని చెబుతాడు.
పతంజలి యోగి మరియు అతని యొక్క ఉత్తమ శిష్యుడైన ఉపమన్యు యోగి యొక్క కథలు విష్ణు పురాణం అదే విధంగా శివ పురాణంలో కూడా వర్ణించబడ్డాయి. వారు తిల్లై వనంలోకి వెళ్లి ప్రార్థించిన శివలింగ రూపంలోని పరమశివుడు, ప్రస్తుతం పూజిస్తున్న తిరుమూలాటనేస్వరర్ లోని దేవుడు ఒక్కడే (తిరు - శ్రీ, మూలటనం - స్వయంభువుడైన, ఈశ్వరర్ - ఈశ్వరుడు). పరమ శివుడు, నటరాజుగా అతని యొక్క చిద్విలాస నృత్యాన్ని (ఆనంద తాండవం) ఈ ఇద్దరు మునులకు పూసం నక్షత్రం ఉన్న రోజున, తమిళ మాసం తాయ్ (జనవరి – ఫెబ్రవరి) లో ప్రదర్శించాడని పురాణాలు చెబుతాయి.

చిదంబర రహస్యాలు:
భారతదేశంలో అనేక పురాతన ఆలయాలు ఉన్నాయి. వీటిలో కొన్ని ఆలయాలను వేల ఏళ్ల కిందట నిర్మించారు. ఇక దక్షిణ భారతదేశంలో తమిళనాడులో ఉండే ఆలయాలు మరీ ప్రత్యేకం. వాటిలో చిదంబర ఆలయం కూడా ఒకటి. ఇది భారతదేశంలోని ఆలయాల్లో దీనికి ఓ ప్రత్యేకత ఉంది. తమిళనాడులోని కడలూరు జిల్లాలోని చిదంబరం గురించి చెప్పగానే నటరాజ స్వామి గుర్తుకు వస్తుంది. చిదంబరం అంటే ఆకాశలింగం. ఈ ఆలయంలో స్వామి నటరాజ రూపం. ఇదీ అని చెప్పలేని చంద్రమౌళీశ్వర స్పటిక లింగరూపం. రూపం లేని దైవసాన్నిధ్యం అనే మూడు స్వరూపాల్లో స్వామి దర్శనమిస్తాడు. ఆ మూడో రూపమే చిదంబర రహస్యం. అందుకే ఏదైనా విషయం గురించి మాట్లాడేటప్పుడు చిదంబర రహస్యం అని అంటారు.

గర్భాలయంలో వెనుక గోడపై ఓ చక్రం ఉటుంది. దాని ముందు బంగారు బిల్వ పత్రాలు వేలాడుతుంటాయి. అయితే ఇవి కనిపించకుండా ఓ తెర ఉంటుంది. దర్శనానికి వచ్చే భక్తులకు అర్చకులు ఆ తెరను నామమాత్రంగా తొలగించి చూపిస్తారు. ఆ ప్రదేశాన్నే శివోహంభవ అంటారు. శివ అంటే దైవం, అహం అంటే మనం. అంటే మనసు అంటే ఆ దైవంలో మనసు ఐక్యమయ్యే ప్రదేశమని అర్థం. ఏ రూప లేకుండానే అజ్ఞానాన్ని తొలగించుకుంటూ దైవ సాన్నిథ్యాన్ని అనుభూతి చెందడమే ఈ క్షేత్ర ప్రాశస్త్యం. అదే చిదంబర రహస్యం.

ఈ ఆలయానికి ఉన్న మరో ప్రత్యేకత ఏంటంటే నటరాజస్వామిని దర్శించుకుని బయటకు వచ్చి వెనుదిరిగి చూస్తే ఆలయ గోపురం మన వెనుకనే వస్తున్న అనుభూతి కలుగతుంది.🙏🙏


Saturday, 18 January 2020

ఆత్మ పరమాత్మ



🌻 Q 58:-- ఆత్మ పరమాత్మలో విలీనం అవడం జరుగుతుందా? 🌻

Ans :--
1) ప్రతి ఆత్మశకలం చైతన్య పరిణామం చెందుతూ ఎక్కడ తన ఉనికి కోల్పోకుండా ఆనంతకాలం ప్రయాణిస్తూనే ఉంటుంది. ఈ విశ్వంలో మన ఉనికి ఎప్పటికి నిలిచి ఉంటుంది. అనంత బ్రహ్మాండంలో విలీనమవడం జరుగదు. అలా జరిగితే ఇప్పుడున్న ఈ ప్రపంచము మనకు కనపడేది కాదు.

2) మూలచైతన్యం నుండి వెలువడిన ఆత్మశకలం సొంత వ్యక్తిత్వాన్ని కలిగి ఉండి సొంత లక్ష్యాలు నిర్దేశించుకుని పరిణామం చెందుతాయి.

3) 3d తలం అయిన భూమి పైన ఉన్న మనకు అహం వల్ల మనం ఎన్నో పరిమితులలో ఉన్నాము. 

మనం ఈ లోకానికే పరిమితం కాదని ఇతర లోకాలలో ఇతర డిమెన్షన్స్ లో కూడా మనం ఉన్నామని తెలుసుకోవాలి.
🌹 🌹 🌹 🌹 🌹

🌻 Q 57 :-- మానవ జాతికి, ఇతర జీవజాతులకు మధ్య సంబంధం? 🌻

Ans :--
1) మనకి ఆత్మ ఉన్నట్లే రాయికి ఆత్మ ఉంది. భూమి మరియు భూమి మీద సమస్థ ప్రాణికోటి సమిష్టిగా చైతన్య పరిణామం చెందుతున్నారు.

2) ఒక జీవజాతి చైతన్య పరిణామం ఇంకో జీవజాతి చైతన్య పరిణామం తో పరస్పరం దోహదపడుతూ అభివృద్ధి చెందుతున్నాయి. ఈ విధంగా మానవజాతి చైతన్య పరిణామానికి సమస్థ జీవకోటి సహాయం చేస్తున్నాయి.

3) ఆత్మ చైతన్య పరిణామానికి భూమ్మీద మనిషి ఎంత ముఖ్యమో electron, చీమ, రాయి, పక్షి, జంతువు , క్రిములు, కీటకాలు, వృక్షాలు, పక్షులు అంతే ముఖ్యం. ఇవన్నీ ఒకదానిపై మరొకటి ఆధారపడి జీవిస్తున్నాయి. భూమి మీద ఒక జాతి నిష్క్రమిస్తే అన్ని జాతులు నిష్క్రమిస్తాయి.
🌹 🌹 🌹 🌹 🌹

🌻 Q 56:-- మానవుని దేహం ఎలా ఏర్పడింది? 🌻

Ans :--
1)చైతన్య శక్తిని కేంద్రీకరించడం ద్వారా మనం కోరుకున్న రీతిలో భౌతిక దేహం ఏర్పడింది.

2) మన దేహం విద్యుదయస్కాంత శక్తి, జీవరసాయినిక శక్తి తో నిండి ఉంది. భూమి మీద మూలకాలన్నింటిచేత భూభౌతిక పరిస్థితులుకు అనుగుణంగా మన దేహం నిర్మింపబడింది.

3) దేహం అంటే మాంసపు ముద్ద కాదు. భూమి మీద జీవరాసులన్ని అదే విద్యుదయస్కాంత శక్తి జీవరసాయినిక శక్తి గల దేహాలను తీసుకుని చైతన్య పరిణామం చెందుతున్నాయి.

4) పరమాణువు నుండి రాయి, ఏకకణ జీవి, జంతువు మనిషి అలాగే భూమి వరకు అదే శక్తి నిండి ఉంది. 
🌹 🌹 🌹 🌹 🌹

Q 22 :--మన ఆలోచనలు భౌతిక ప్రపంచంలో ఎలా వాస్తవ రూపం చెందుతాయి?

Ans :--
మన అంతరంగం నుండి వెలువడిన ప్రతి ఆలోచన వాస్తవ రూపం చెందుతుందని మనం గుర్తుంచుకోవాలి.మన మైండ్ నుండి ప్రతి క్షణము అనేక ఆలోచనలు వెలువడుతూ ఉంటాయి.

ఆలోచన తీవ్రమైనదైతే మనం పదే పదే ఆ ఆలోచనను ఆలోచిస్తూ ఉన్నామంటే ఆ ఆలోచనకు శక్తిని అందిస్తున్నామనమాట. 

మన ఆలోచన యొక్క తీవ్రత ఎక్కువయ్యే కొద్దీ ఆ ఆలోచన భౌతిక తలంలో(physical plane)లో వాస్తవ రూపం చెందుతుంది.
     
బలహీనమైన ఆలోచనలు కు శక్తి సరిపోకపోవడం వల్ల అవి ఆ శక్తి, frequency తగ్గ లోకాలలో వాస్తవ రూపం పొందుతాయి.

ఇక్కడ మనలో ఒకేసారి 3 ఆలోచనలు వచ్చాయనికోండి. అవి ఎలా వాస్తవ రూపం పొందుతాయో గమనిద్దాం.

1) ఆలోచన 1:--
మనం రేపు సాయంకాలం 4 గంటలకు telephone bill కట్టాలనుకుందాం.

2) ఆలోచన 2 :--
మనకు ఇంకో ఆలోచన వచ్చింది.
రేపు సాయంత్రం 4 గంటలకు friend ని కలవాలనుకున్నాం.

3) ఆలోచన 3 :--
రేపు సాయంత్రం 4 గంటలకు movie కి వెళదాం అనుకున్నాం.

పై మూడు ఆలోచనలు రేపు 4 గంటలకు సంబంధించినవి.

వీటిని మైండ్ లో ఏర్పడిన సంభావ్య క్రియలుగా పరిగణించడం జరుగుతుంది. పై మూడు ఆలోచనలలో మనం ఒకదాని పట్లే శక్తిని కేంద్రీకరింపబడడం జరుగుతుంది. కాబట్టి ఆ ఒక్క ఆలోచనే భౌతికంగా సృష్టింపబడింది.అంటే ఆ ఆలోచన మాత్రమే జరిగింది.

మరి మిగతా రెండు ఆలోచనలు ఏమయ్యాయి అని doubt రావచ్చు. మిగతా రెండు ఆలోచనలకు మనం శక్తిని ఇవ్వకపోవడం వల్ల ఆ రెండు ఆలోచనలు ఆ శక్తి,frequency ఉన్న లోకాలలో వాస్తవం పొందుతాయి.

కాబట్టి మనలో కలిగే ప్రతి ఆలోచన వాస్తవ రూపం చెందుతుంది. కావున అద్భుతమైన ఆలోచనలు ఆలోచించండి. ఆలోచన పట్ల ఎరుకను సాధించండి.
🌹 🌹 🌹 🌹 🌹

Q 21) అంతర్ ప్రపంచం మనకు ఎలా సహాయ పడుతుంది?

Ans :--
1) మనము సంగీతం నేర్చుకోవాలనుకున్నాం అనుకోండి.ఆ వాంఛ మన అంతర్ ప్రపంచంలో కలిగిందనుకోండి. ఈ వాంఛ బాహ్య ప్రపంచంలో వాస్తవ రూపం పొందేందుకు గల సర్వ సామర్ధ్యాలు మన అంతర్ శక్తిలో ఉన్నప్పుడే మనకు ఆ idea వస్తుంది.

2) ఉదాహరణకు ఒక వ్యక్తి పేదరికంలో ఉన్నాడనుకోండి. ఆ వ్యక్తి ఆ పేదరికాన్ని గట్టి సంకల్పంతో వదిలించుకోవాలన్న వాంఛ కలిగిందనుకోండి. ఆ పేదరికాన్ని వదిలించుకోవడానికి కావాల్సిన భౌతిక పరిస్థితులు సృష్టింపబడతాయి.

3) నేను ఫలానా పని చేయగలను అనే స్పందన మనలో కలిగిందంటే ఆ పనిని సాధించగల సామర్ధ్యం మన అంతర్ ప్రపంచంలో కలిగి ఉన్నామని అర్థం. మన అంతర్ ప్రపంచానికి అసాధ్యం అంటూ ఏది ఉండనే ఉండదు.
🌹 🌹 🌹 🌹 🌹



Q 19:--మానవుడు భూమి మీద ఎందుకు జన్మ తీసుకున్నాడు?

Ans:--
1)భౌతిక పదార్ధాన్ని,భౌతిక సంఘటనలను, భౌతిక పరిస్థితులును,భౌతిక వాస్తవాన్ని,మానవ చైతన్య వికాసాన్ని...... సంపూర్ణంగా అధ్యయనం చేసుకుని జ్ఞానపరిధిని విస్తరింప చేసుకోవడానికి భూమి మీద జన్మ తీసుకున్నాడు.

2) ఆత్మ చైతన్య వికాసాన్ని అనేక కోణాలలో వ్యాపింప చేసుకోవడానికి,అన్ని శక్తి సామర్ధ్యాలు, మన అంతర్ శక్తిలో ఇముడ్చుకుని భూమి అనే ప్రయోగశాలలో ప్రవేశించడం జరిగింది.

3) భూమి పైన జన్మ తీసుకోకముందే మనకు అనంతమైన అవకాశాలను వినియోగించుకుని చైతన్య పరిణామం చెందగల సర్వ సమర్ధతలు మనము కలిగి ఉన్నాము. మనం సంకల్పించుకున్న దానికంటే ఎక్కువుగా ఇవ్వడానికి ఈ విశ్వం ఎల్లవేళలా సిద్ధంగా ఉంది.

4) మనం కోరుకోకుండా ఏ భౌతిక సంఘటన,మన జీవితంలోకి ప్రవేశించడం జరుగదు.మనము ఏవైతే కోరుకుంటున్నామో అవే మనం భౌతిక పరిస్థితులగా ఎదుర్కుంటున్నాము.
🌹 🌹 🌹 🌹 🌹
Q 18 ) స్వప్నావస్థ మరియు జాగృదావస్థ ఎలా ఉపయోగపడతాయి?

Ans : - -
1) మనం భూమి మీద జన్మ తీసుకున్న క్షణం నుండి జాగృదావస్థ మరియు స్వప్నావస్థ లలో చైతన్య పరిణామం చెందుతుంటాము.

జాగృదావస్థలో మన పురోగతి గోరంత అయితే స్వప్నావస్థ లో ఆత్మ పురోగతి, జ్ఞాన సముపార్జన కొండంత అని చెప్పవచ్చు. స్వప్నావస్థ లో జాగృదావస్థ కంటే కొన్ని లక్షల రెట్లు పురోగతి ఉంటుంది.

2) బాహ్య ప్రపంచంలో ఒక జీవిత కాలంలో మనం పొందిన జ్ఞాన సముపార్జన +
జీవితానుభవాలు  స్వప్నావస్ధ లో ఒక గంట కాల వ్యవధిలో పొందవచ్చు.

3) దేహం యొక్క ఆరోగ్యస్థితి జాగృదావస్థ కంటే స్వప్నావస్థ లో ఎక్కువ మెరుగుపడుతుంది.

4) జాగృదావస్థ లో జీవరసాయినిక చర్యలు దేహ ఆరోగ్య రక్షణ వ్యవస్థను పతిష్టపరచలేవు. స్వప్నావస్థలో దేహం శక్తిని ఉత్తేజాన్ని పొందుతుంది.

5) అన్ని స్థితిలలోని జీవితానుభవాల్ని మైండ్ తన సాధనమైన మెదడు ద్వారా రికార్డ్ చేసుకుంటుంది.

6) ప్రతి జీవాత్మ తన అంతర్ ప్రపంచం తో అనుసంధానం అవ్వాలి. నిద్ర ప్రక్రియ ఈ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంది.

7) నిద్రలో ఇతర లోకాల,ఇతర dimensions యొక్క జ్ఞాన సముపార్జన శక్తి సముపార్జన జరుగుతుంది.

8) 3D తలంలో ప్రతి జీవాత్మ నిద్ర పోవాల్సిందే.లేకపోతే మనుగడ లేదు.

9)ఈ భౌతిక ప్రప్రంచం లో జీవాత్మ తన జీవితాన్ని కొనసాగిస్తున్నంతకాలం మైండ్ మెదడు అనే సాధనాన్ని వినియోగించుకుంటుంది.

10) మనిషికి మేధస్సు మైండ్ ద్వారా వస్తుంది .మెదడు అనేది మేధస్సును సృష్టింపదు.
🌹 🌹 🌹 🌹 🌹
Only admins can send messages

Q 17) Conscious మైండ్ vs Multidimensionality

స్వప్నావస్థ vs జాగృదావస్థ
(Dream state vs awakening state )

Ans :--
1) Conscious మైండ్ మల్టిడిమెన్షనల్ గా చైతన్య పరిణామం చెందుతుంటుంది.

2) Multidimensional గా ఉన్న మనోశక్తిని మెదడు అనే సాధనం ద్వారా 3D (3డైమెన్షనల్)  తలమైన భూభౌతిక ప్రపంచంతో సంయోగం చెందించి ప్రత్యక్ష సంబంధం ఉండేటట్లు చేస్తుంది.

3) అంతర్ ప్రపంచం నుండి మైండ్ పంపే సందేశాలను సంకేతాలను మన మెదడు ద్వారా channeling చేసి బాహ్యప్రపంచం లోకి భౌతిక సంఘటనలతో మనకు సంబంధాన్ని కలుగజేస్తుంది. అలానే భౌతిక ప్రపంచంలో సమాచారాన్ని సందేశాల్ని మెదడు ద్వారా channeling చేసి అంతర్ ప్రపంచానికి అందించడం జరుగుతుంది.

4) multidimensional వ్యవస్థ లో ఆత్మశక్తికి ప్రతీది సాధ్యమే.

5) 3 dimensional తలంలో ఆత్మ జీవాత్మగా జన్మించినప్పుడు, కాలం-దూరం అనే చట్రంలో కొన్ని నమ్మకాలకు, విశ్వాసాలకు లోనై తన అంతర్ ప్రపంచం లో గల అపారమైన అనంత శక్తిని మర్చిపోవడం జరుగుతుంది.

6) ఆత్మ తనకు గల అపారమైన అంతర్ శక్తిని మర్చిపోయి 3D తలంలో కాలం-దూరం అనే చట్రంలో ఇరుక్కుని పరిమిత
జ్ఞానంతో కూడిన నమ్మకాలతో బుద్ధిని కోల్పోవడాన్ని భ్రాంతి అంటారు.

7) మనం multidimensional ఆత్మ అని తెలుసుకోవాలి.ఏక కాలంలో అనేకానేక దేహాలతో అనేకానేక లోకాలలో చైతన్య పరిణామం చెందుతున్న ఆత్మలం మనం అని తెలుసుకోవాలి.
🌹 🌹 🌹 🌹 🌹

Q 16) దేహం తనకు వచ్చిన వ్యాధిని ఎలా నయం చేసుకోగలదు?

Ans :
1) మన దేహం కోటానుకోట్ల జీవకాణాలతో ఏర్పడింది. ప్రతి జీవకాణానికి ఆత్మ,మైండ్ ఉంటాయి. అన్ని వ్యక్తిగత మైండ్స్ కలిసి ఒక సామూహిక మైండ్ గా మారి మన సంకల్పశక్తి, ఊహాశక్తి కి అనుగుణంగా స్పందిస్తాయి.

2) కొన్ని సంవత్సరాల తరబడి ఒక వ్యక్తి దీర్ఘకాలిక వ్యాధితో బాధ పడుతున్నట్లైతే ఆ వ్యక్తి ఆ వ్యాధి నాయమవ్వాలని, సంకల్పిస్తే అతను ఆ వ్యాధి నాయమైనట్లు,దేహం ఆరోగ్యంగా ఉన్నట్లు అతను ఊహాశక్తితో కలలు కంటే, తక్షణమే దేహంలోని జీవకాణాల సామూహిక మైండ్ దానికి స్పందించి దేహంలో సరికొత్త జీవరసాయనాలు, విద్యుదయస్కాంత శక్తి విడుదలై ఆ వ్యాధి నయం చేయబడుతుంది.

3) మన ఊహాశక్తి, emotions, feelings, ఆశయాలు,భయాలు,సంకల్పాలు,ద్వారా విద్యుదాయస్కాంత శక్తిని మెదడు సంగ్రహించి మైండ్ కి చేరవేస్తుంది.

4) దేహాన్ని విడిచి పెట్టిన తర్వాత కూడా మైండ్ continue అవుతుంది. కానీ మెదడు భౌతిక పదార్ధం తో తయారు చేయబడింది కాబట్టి దేహం మరణించిన వెంటనే
మెదడు పంచభూతాలలో కలిసిపోతుంది.
🌹 🌹 🌹 🌹 🌹

Q14) విశ్వశక్తి , మనోశక్తి,
ఊహాశక్తి  ఏ విధంగా పనిచేస్తాయి?

Ans:--
1) ఒక వ్యక్తి లక్ష్యాన్ని ఏర్పరుచుకుని బలంగా సంకల్పించినప్పుడు దానికనుగుణంగా విశ్వమయ మనోశక్తి (universal మైండ్) ప్రతిస్పందించి ...... విశ్వశక్తి (cosmic energy) మన లక్ష్యం కేంద్రంగా మనవైపు ప్రవహిస్తుంది. విశ్వశక్తి ప్రవాహానికి మన లక్ష్యం కేంద్రంగా ఏర్పడి ఆకర్షిస్తుంది.

2) ఈ విశ్వచైతన్యంలో ప్రతి ఆత్మ శకలం ఒక కేంద్రబిందువే. కేంద్ర బిందువు పరిధి పెరిగే కొద్ది విశ్వచైతన్య శక్తి పరిధి కూడా విస్తరిస్తూ ఉంటుంది.

3)for ex:--
మనం మన ఇంటి గోడ ద్వారా ప్రయాణించాలనుకున్నాం అనుకోండి. conscious మైండ్ పరిధిలో reasoning మైండ్ కి ఇది అసాధ్యం అనిపిస్తుంది. కానీ ఆత్మశక్తి పరిధిలో అది చాలా సులభమని మన మనోశక్తికి తెలుసు.

ఈ విశ్వమంతా శక్తిమయమే. మన కళ్ళకు కనిపించే గోడ ఘనపదార్ధంగా reasoning మైండ్ నిర్ధారించుకుంటుంది. వాస్తవానికి ఆ గోడ భౌతిక పదార్ధ రూపంలో ఉన్న శక్తి స్వరూపం.

మనం పూర్తిగా విశ్వసించి గోడ గుండా ప్రయాణం చేయాలని సంకల్పిస్తే మన దేహం దానికనుగుణంగా ప్రతిస్పందించి శక్తి స్వరూపంగా మారి గోడ గుండా ప్రయాణించడం జరుగుతుంది. శక్తి ప్రసారానికి ఈ విశ్వంలో ఏ యానకమూ(medium)అవసరం లేదు.

మన ఆత్మశక్తి సూక్ష్మశరీర సముదాయం (astral body) సహాయంతో పర్వతాలు,గొళాలు, నక్షత్రాలు గుండా చొచ్చుకునిపోయి ఆనంతదూరాన్ని క్షణ కాలంలో ప్రయాణించగలదు. కాంతి తరంగాలు ఏ మీడియం లేకుండా అనంత దూరం ప్రయాణిస్తాయి కదా.

4) శారీరక వైకల్యం ఉన్న వ్యక్తి కోల్పోయిన అవయవం తిరిగి పొందినట్టు బలంగా సంకల్పించి మనోశక్తి ద్వారా ఊహించుకుంటే, అందుకనుగుణంగా భౌతిక పరిస్థితులు ఏర్పడి సంకల్పం నెరవేరుతుంది.

ఒకవేళ ఆ అవయవాన్ని అమర్చడానికి వైద్య శాస్త్రం అభివృద్ధి చెంది ఉండకపోతే అతని బలమైన సంకల్పానికి అనుగుణంగా వైద్యశాస్త్రం అభివృద్ధి చెందించబడుతుంది.

ఒకవేళ అతని సంకల్పం బలహీనంగా ఉంటే అతనికి అతని అంతర్ శక్తి మీద నమ్మకం లేకపోతే అతని లక్ష్యం తాలూకు ఆలోచనా తరంగాలు ఇంకో dimension లోకి ప్రయాణించి అక్కడ వాస్తవాన్ని పొందుతాయి.

5)for ex:--
ఒక స్త్రీ తన వైవాహిక జీవితంలో అసంతృప్తిగా,నిరాశామయమైన జీవితం అనుభవిస్తుంటే, ఆమె తన ఊహా శక్తి ద్వారా తన వైవాహిక జీవితం సాఫీగా సాగిపోతున్నట్లు, తన జీవిత భాగస్వామితో ప్రేమను పంచుకుంటున్నట్లు, అనేక విధాలుగా, అనేక కోణాలతో ఊహించుకుంటే, అదే ఆమె జీవితంలో సృష్టించబడుతుంది.

ఆమె జీవిత భాగస్వామి ఆమె యొక్క ఊహాశక్తికి ప్రభావితం అవుతాడు,అతని ప్రవర్తనలో మార్పు వస్తుంది. దూరం కాలంకి అతీతంగా మన ఊహాశక్తి జీవితాన్ని మార్చేస్తుంది. ఊహాశక్తి పనిచేస్తుందా అనే సందేహాలు పెట్టుకోవద్దు. బలమైన నమ్మకపు వ్యవస్థని అలవర్చుకోండి.
🌹 🌹 🌹 🌹 🌹

Q13) intelligence అంటే ఏమిటి? అనంత జ్ఞానం దానితో సాధించ వచ్చా?

A:--
1) intelligence అంటే conscious మైండ్ని సరిఅయిన రీతిలో వినియోగించడం అని అర్థం.

2) మనకు తెలిసినంతవరకు తర్కం(logic), విశ్లేషణ(analysys), జ్ఞాపకశక్తిని మాత్రమే intelligence అనుకుంటాం.

అయితే మరి కోటానుకోట్ల జీవజాతులు మనుగడ సాగిస్తున్నాయి. అవి చైతన్య పరిణామం చెందుతున్నాయి.

ఒక్క మనిషే గొప్పగా చైతన్య పరిణామం చెందుతుంది అని మనం భావిస్తాము అలా అయితే ఒక్క మనిషి సృష్టే ఉంటే సరిపోతుంది కదా. ఇన్ని జీవజాతుల సృష్టి ఎందుకు? మనల్ని మనం ప్రశ్నించుకోవాలి?

ఎందుకంటే మనకంటే జంతువులే చైతన్య పరిణామంలో ఎక్కువ అభివృద్ధిని సాధిస్తున్నాయి.మనిషి మనుగడ ఇతర జీవజాతుల సహకారంతోనే సాధ్యమవుతుంది,అందరూ తెలుసుకోండి.

3) మనం మన దేహం లో జరిగే ప్రక్రియలన్ని గమనిద్దాం, జీర్ణక్రియ, గుండె కొట్టుకోవడం, ఊపిరితిత్తులు, రక్త ప్రసరణ, వీటన్నింటికి intelligence తో అవసరమేముంది.

ఇవన్నీ జీవజాతులన్నింటిలో ఎంతో సక్రమంగా జరుగుతున్నాయి. ఇదంతా ఎలా జరుగుతుంది... మనల్ని మనం ప్రశ్నించుకోవాలి... వీటన్నింటిని అంతర్ ప్రపంచం నడిపిస్తున్నదని తెలుసుకోండి.

4) ఒక మనిషి తనలాంటి మరో మనిషిని సృష్టించగలిగాడా? లేదు.....ఎప్పుడైతే మనిషి సాధనతో తన అంతర్ ప్రపంచాన్ని వాడుకోగలుగుతాడో, అప్పుడే మనిషి మనుగడ, intelligence లో అభివృద్ధి జరుగుతుంది.

5) ఒక చిన్న విత్తనం మహా వృక్షంగా ఎలా ఎదుగుతుంది, electron గమనం, భూమి, సౌరవ్యవస్థ గమనం, ఇవన్నీ క్రమ పద్ధతిలో ఎలా పరిభ్రమిస్తున్నాయి, ఆలోచించండి. ఇవన్నీ అంతర్ ప్రప్రంచం ద్వారానే సాధ్యమవుతున్నాయి.

6) మన సంఘం ఇచ్చిన జ్ఞానపరిధిలోనే మన intelligence ఎదిగి ఉంది,మనం ఎప్పుడైతే సంకల్పశక్తి, ఊహాశక్తి, ద్వారా అంతర్ ప్రయాణం చేస్తామో అప్పుడే అనంత జ్ఞానం అనుభవం లోకి వస్తుంది.

7) స్వప్నాల ద్వారా astral travel ద్వారా మాత్రమే మనం అపారమైన జ్ఞానాన్ని, అప
రిమిత జ్ఞానాన్ని ఈ భూమి పైకి తేగలము.
🌹 🌹 🌹 🌹 🌹

Q 12) intelligence అంటే ఏమిటి?

Ans) :
1)ఇంటెలిజెన్స్ అనేది conscious మైండ్ పరిధిలో ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడం, తర్కం (logic),
విశ్లేషణ (analysys), reasoning ఇవన్నీ intelligence ద్వారా పుడతాయి.

2) అహం intelligence ని ప్రభావితం చేస్తూవుంటుంది.

3) మనం ఎవరైనా ఎక్కువ logic తో ఆలోచించినా, ఎక్కువ విశ్లేషణ (analysis) చేసినా ఆ వ్యక్తిని తెలివైనవాడిగా గుర్తిస్తాము.

ఎక్కువ వాక్చాతుర్యం ఉన్న ఆ వ్యక్తిని తెలివైన వాడిగా గుర్తిస్తాము. కానీ ఈ measurements అన్ని సరైనవి కావు. ఎవరైతే అంతర్ ప్రపంచం ద్వారా వచ్చే భావనలను అర్థం చేసుకుని ఆచరిస్తారో, వారు ఆధ్యాత్మికంగా ఎదుగుతారు.

4) intelligence పరిధిని కొవ్వొత్తి వెలుగుతో పోలిస్తే అంతర్ ప్రపంచం లోని మైండ్ ని అనగా subconscious మైండ్ ని సూర్యుడి వెలుగుతో పోల్చవచ్చును.

5) ప్రకృతిలో అన్ని జీవరాసులు సమానమే, ప్రకృతికి తెలివైనవాళ్ళు, పిచ్చివాళ్ళు, బుద్ధిమాంద్యం (mentally retarded) కలవారు అందరూ సమానమే. అందరిలో ఉన్న మైండ్, అంతర్ ప్రపంచం ఒక్కటే. చైతన్య పరిణామ వికాసంలో ఒకరు ముందు, ఒకరు వెనుక అంతే.

6) ఒక రకంగా చెప్పాలంటే తెలివైన వాళ్ళు logic, analysys తో అంతర్ ప్రపంచం మాట వినరు. పిచ్చివాళ్ళు, బుద్ధిమాంద్యం కలవారు అంతర్ ప్రపంచం మాట విని మన కంటే ఆధ్యాత్మికంగా వారే చైతన్య వికాసం చెందుతున్నారు. కొన్ని ప్రత్యేక లక్ష్యాలతో వారు జన్మ తీసుకోవడం జరుగుతుంది.

7)  దొంగ పాత్రలో ఉన్న వ్యక్తి, పోలీస్ పాత్రలో ఉన్న వ్యక్తితో దెబ్బలు తినడం, భౌతిక ప్రపంచంలో ఈ drama బాధాకరంగా ఉంటుంది.

కానీ ఆత్మ పరంగా ఇది ఒక సవాల్. ఈ అనుభవం ద్వారా దొంగలు పాఠాలు నేర్చుకుని మనోశక్తిని వ్యాకోచింప చేసుకుంటారు.

8) car drivers, పర్వతారోహకులు (mountainers), sportsmen వీరు ఎంచుకున్న లక్ష్యాలు వీరికి సవాళ్లు గాను ఇతరులకు బాధాకరంగాను ఉంటాయి.

9) అంగవైకల్యం తో జన్మించే వ్యక్తి చైతన్య శక్తిని ఒక దిశలో కేంద్రీకరింపచేసి కొన్ని అనుభవాలు, పాఠాలు నేర్చుకోవడం కోసం అలాంటి జన్మ తీసుకోవడం జరుగుతుంది....

అలానే జన్మించాలనే rule ఏమి లేదు. ఈ విశ్వంలో ఏ శక్తి మనల్ని నియంత్రించడం గాని,శాసించడం కానీ చెయ్యదు. అంతా మన ఇష్టానుసారంగానే జరుగుతుంది.

10) ఆధ్యాత్మికంగా ఎదగడం, అనుభవాల ద్వారా మనోశక్తిని విస్తరించడం అంటే అంతర్ ప్రపంచం లో ఉన్న అనంత జ్ఞానాన్ని వినియోగంలోకి తేవడం అని అర్థం.మన జ్ఞానం పెరిగేకొద్ది మన subconscious మైండ్ వినియోగం లోకి వస్తుంది.
🌹 🌹 🌹 🌹 🌹

Q 11b) ఆలోచన అంటే ఏమిటి? ఆలోచన యొక్క విశిష్టత ఏంటి?

Ans. )
1) ఆలోచనలు, feelings,  emotions అన్ని అహం నుండి పడుతున్నాయి.
అహం మన వ్యక్తిత్వం నుండి, సంఘం నుండి ఏర్పడిన బుద్ధి వల్ల వస్తుంది.

మనం మన సాధనతో, conscious మైండ్కి suggestions ఇవ్వాలి. అంతర్ ప్రపంచం తనకు తానుగా ఏది మనకు ఇవ్వదు.

2) వాయువును మన కళ్ళతో చూడలేము, కానీ ఇంద్రియాలు పసిగట్టగలవు. అలాగే ఆలోచనలు కూడా మన కళ్ళకు కనపడవు. వీటిని telepathy ద్వారా పసిగట్టవచ్చు.

3) ఆలోచనలకు బలమైన ఉక్కు కడ్డీలను వంచే శక్తి, laser కిరణాలను కేంద్రీకరించి ఏ వస్తువునైనా రెండు ముక్కలుగా చేసే శక్తి ఉంది.
for ex:--ezypt లో పెద్ద పెద్ద టన్నుల బరువున్న రాళ్లను అప్పటి కాలంలో వారి ఆలోచనా శక్తిని కేంద్రీకరింపచేసి ఆ రాళ్లను ఎత్తి పిరమిడ్ లను నిర్మించారు.

4) ఒక ప్రాంతంలోని వారంతా వర్షాలు రావాలని సంకల్పిస్తే భౌతిక వాతావరణం మారి వర్షాలు కురుస్తాయి. for ex:--యజ్ఞాలు.... యోగులు, ఋషులు వారి ఆలోచనాశక్తితో వర్షాలు రావాలని సంకల్పిస్తే వర్షాలు వస్తున్నాయి.

5) మన ఆలోచనలకు బలమైన అయస్కాంత ఆకర్షణ శక్తి ఉంది. దాని ద్వారా ఇతరుల ఆలోచనలును ప్రభావితం చేయవచ్చు. అలాగని మన ఆలోచనలు ద్వారా ఇతరులకి హాని చేయడం, ప్రమాదం తలపెట్టడం, లాంటివి జరగవు. వాళ్ళ సంకల్పం లేనిదే ఆలోచనలు వారిని ప్రభావితం చేయలేవు.

6) మనం మన ఆలోచనలును,నమ్మకాలను పరిశీలించాలి. ఆలోచనల పట్ల ఎరుక ఉండాలి. ఆలోచనలను పరిశీలన, పరీక్షించడం, ద్వారా సక్రమమైన రీతిలో వాటిని ఉపయోగించుకోవచ్చు.

7) ఆలోచన ఒక్కసారి మన మైండ్ నుండి వెలువడితే దానిని ఉపసంహరించడం మన చేతిలో లే
దు, అది ఎక్కడో ఒక చోట వాస్తవ రూపం చెందుతుంది.
🌹 🌹 🌹 🌹 🌹

మనోశక్తి  - Mind Power - 9 🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి
📚. ప్రసాద్ భరద్వాజ

Q 10 :--వర్తమానంలో ఉండడం వల్ల లాభాలేంటి? వర్తమానంలో జీవిస్తే గతాన్ని ఎలా పునర్నిర్మించవచ్చు? మరియు భవిష్యత్తును ఎలా మలచుకోవచ్చు?

A:-- 1) వర్తమానమే బహుమానం. గతంలో ఏమైనా వర్తమానం మన చేతుల్లో ఉంది.

2) వర్తమానాన్ని చక్కపెడితే భవిష్యత్తు automatic గా మారుతుంది. ఎందుకంటే భవిష్యత్తు లో ఏమి జరగాలో ముందే నిర్ణయించబడదు.

3) భవిష్యత్తు ని ఎలా కావాలంటే అలా మలుపు తిప్పుకోవచ్చు. for ex:--బంకమట్టిని తీసుకుందాం. దానిని ఎలా కావాలంటే అలా మలుపు తిప్పవచ్చు. అదేవిధంగా వర్తమానాన్ని సరిచేస్తే భవిష్యత్తు కూడా మారుతుంది.

4) chess game ని పరిశీలిద్దాం.
పావులను కదపడంలో కొన్ని తప్పులు చేసామనుకోండి, అలాగని ఆట గతం లో లేదు.  ఇప్పుడు మనం వర్తమానంలో ఆ పావులను సక్రమంగా కదుపుతున్నామో లేదా అనే దానిపైనే గెలుపు, ఓటములు ఆధారపడి ఉంటాయి. వర్తమానంలో కదిపే పావులతో గతంలోని ఆట automatic గా మారుతుంది.అప్పుడు భవిష్యత్తు యొక్క గెలుపు, ఓటములు కూడా automatic గా మారుతాయి.

అంటే ఇక్కడ ఏమయ్యింది, వర్తమానం గతాన్ని పునర్నిర్మించింది, భవిష్యత్తుని కూడా సృష్టించింది. అంతేగాని గతము, భవిష్యత్తు వర్తమానాన్ని సృష్టించలేదు.

5) గతకాలంలో చేసిన తప్పులు, గతజన్మలో చేసిన తప్పులు ఇప్పుడు నెమరువెయ్యడం అర్థరహితం.

ఎందుకంటే మనం ఎన్నో జన్మలు దాటుకుని, ఎంతో జ్ఞానాన్ని ఆర్జించాము. దానిని వర్తమానంలో implement చేస్తే చాలు. గతం తుడిచి పెట్టుకుపోతుంది. భవిష్యత్తు మలచబడుతుంది.

6) ఒకవేళ గతంలోకి చూడవలసివస్తే, ఆనందంగా ఉన్న క్షణాలు, ఆరోగ్యంగా ఉన్న క్షణాలు, విజయాలు సాధించిన క్షణాలు, గుర్తు తెచ్చుకోవాలి. అప్పుడు అవి మనకు మరింత ఆనందాన్ని, ఆరోగ్యాన్ని, విజయాలను, ఇస్తాయి.

7) మనలో ఏమన్నా లోపాలున్నాయని మనం గుర్తిస్తే, మనం కొంత సాధన చేసి చైతన్య శక్తిని ఆ లోపాలవైపు కేంద్రీకరిస్తే చాలు, ఆ లోపం సరిదిద్దబడి, విజయాన్ని పొందుతాము.
🌹 🌹 🌹 🌹 🌹


Q 8 :-- conscious మైండ్ మనకున్న తప్పుడు అభిప్రాయాలతో మనల్ని పరిధుల్లో ఎలా ఉంచుతుంది?

A:-- 1) జీవితం దుఃఖమయం, గతజన్మ పాపం వల్ల దేహం తీసుకోవడం జరిగింది. నాకు మహిమాన్విత శక్తి లేదు. గతంలో చేసిన కర్మల వల్ల దుఃఖిస్తున్నాను.

 పరిస్థితులు ముందు నేను నిస్సహాయుడ్ని, వాటిని అదుపులో ఉంచలేను. నా వ్యక్తిత్వం ప్రవర్తన బాల్యం నుండి వచ్చింది. దానిని నేను మార్చలేను.

2) అందరూ చెడ్డవాళ్ళగానే కనిపిస్తున్నారు, నేను గొప్పవాడ్ని. నాకు తెలిసిన సత్యం ఇంకెవ్వరికి తెలియదు. నా తెగవాళ్ళు గొప్పవాళ్ళు, మిగతా వారందరు హీనమైనవారు.

3) వయస్సు పెరిగే కొద్ది దేహం యొక్క శక్తి క్షీణించి,శ రీరం అనారోగ్యాలుపాలు
అవుతుంది.

4) నాకు సృజనాత్మకత లేదు, ఊహించడం, కలలు కనడం కూడా రాదు.

5) దురదృష్టం ఎప్పుడు నన్ను వెంటాడుతూవుంటుంది. ధనం వల్ల వచ్చే లాభం ఏమి లేదు.ఆశాపూరితులే ధనార్జన చేస్తారు, ధన సంపాదన వల్ల ఆధ్యాత్మికంగా ఎదగలేరు. ఆనందంగా జీవించలేరు.

6) పూర్వీకుల జీన్స్ ద్వారా నాకు అనారోగ్యం, ఊబకాయం వచ్చింది. ఏ పనిని సక్రమంగా చేయను, నా స్వభావమే అంత, నన్ను ఎవరు ఇష్టబడరు.

ఇలాంటి తప్పుడు అభిప్రాయాలతో మనం ఎన్నో పరిమితులతో conscious మైండ్ ని ఉపయోగించుకోలేక పోతున్నాము.
🌹 🌹 🌹 🌹 🌹


🌹. మనోశక్తి  - Mind Power - 22🌹
 Know Your Infinite Mind
🌴. సేత్ విజ్ఞానం - చానెలింగ్  ద్వారా  మానవజాతికి అందించిన సందేశాలు. 🌴
సంకలనం : శ్రీవైష్ణవి 
📚. ప్రసాద్ భరద్వాజ 

Q 22 :--మన ఆలోచనలు భౌతిక ప్రపంచంలో ఎలా వాస్తవ రూపం చెందుతాయి?

Ans :--
మన అంతరంగం నుండి వెలువడిన ప్రతి ఆలోచన వాస్తవ రూపం చెందుతుందని మనం గుర్తుంచుకోవాలి.మన మైండ్ నుండి ప్రతి క్షణము అనేక ఆలోచనలు వెలువడుతూ ఉంటాయి.

ఆలోచన తీవ్రమైనదైతే మనం పదే పదే ఆ ఆలోచనను ఆలోచిస్తూ ఉన్నామంటే ఆ ఆలోచనకు శక్తిని అందిస్తున్నామనమాట. 

మన ఆలోచన యొక్క తీవ్రత ఎక్కువయ్యే కొద్దీ ఆ ఆలోచన భౌతిక తలంలో(physical plane)లో వాస్తవ రూపం చెందుతుంది.
     
బలహీనమైన ఆలోచనలు కు శక్తి సరిపోకపోవడం వల్ల అవి ఆ శక్తి, frequency తగ్గ లోకాలలో వాస్తవ రూపం పొందుతాయి.

ఇక్కడ మనలో ఒకేసారి 3 ఆలోచనలు వచ్చాయనికోండి. అవి ఎలా వాస్తవ రూపం పొందుతాయో గమనిద్దాం.

1) ఆలోచన 1:--
మనం రేపు సాయంకాలం 4 గంటలకు telephone bill కట్టాలనుకుందాం.

2) ఆలోచన 2 :--
మనకు ఇంకో ఆలోచన వచ్చింది.
రేపు సాయంత్రం 4 గంటలకు friend ని కలవాలనుకున్నాం.

3) ఆలోచన 3 :--
రేపు సాయంత్రం 4 గంటలకు movie కి వెళదాం అనుకున్నాం.

పై మూడు ఆలోచనలు రేపు 4 గంటలకు సంబంధించినవి.

వీటిని మైండ్ లో ఏర్పడిన సంభావ్య క్రియలుగా పరిగణించడం జరుగుతుంది. పై మూడు ఆలోచనలలో మనం ఒకదాని పట్లే శక్తిని కేంద్రీకరింపబడడం జరుగుతుంది. కాబట్టి ఆ ఒక్క ఆలోచనే భౌతికంగా సృష్టింపబడింది.అంటే ఆ ఆలోచన మాత్రమే జరిగింది.

మరి మిగతా రెండు ఆలోచనలు ఏమయ్యాయి అని doubt రావచ్చు. మిగతా రెండు ఆలోచనలకు మనం శక్తిని ఇవ్వకపోవడం వల్ల ఆ రెండు ఆలోచనలు ఆ శక్తి,frequency ఉన్న లోకాలలో వాస్తవం పొందుతాయి.

కాబట్టి మనలో కలిగే ప్రతి ఆలోచన వాస్తవ రూపం చెందుతుంది. కావున అద్భుతమైన ఆలోచనలు ఆలోచించండి. ఆలోచన పట్ల ఎరుకను సాధించండి.
🌹 🌹 🌹 🌹 🌹

🌻 13. మనము గంగాస్నానము చేస్తాము. గంగాస్నానము పాపక్షయకరమేకాదు; చచ్చిపోయినతరువాత జీవునియొక్క బూడిదకు గంగస్పర్శ కలిగితే, జీవుడు లేకపోయినప్పటికీ-పూర్వశరీరంలో ఉండిన జీవుడు, ప్రేతరూపంలో ఉన్నప్పటికీకూడా-ముక్తిని పొందుతున్నాడు.

ఈ ఆర్య రహస్యము యెవరికీ అర్థంకానటు వంటిది. అసలు ఎలాగ అర్థం అవుతుంది! ఏమిటి దీని అర్థం! తర్కంతో చెపితే తెలిసే విషయం కాదిది. అసలు తర్కమేలేదు దీనికి.

ఏనాడయితే మనం ఆర్యసంస్కృతిలో ఉన్న మౌలికసూత్రాలను, ధర్మాలను ప్రశ్నించకుండా విశ్వాసంతో నమ్మటానికి అలవాటు చేసుకుంటామో,అప్పుడే మనకు భవిష్యత్తు ఉన్నది.

మన బుద్ధి కుశలతచేత దానిని పరీక్షించి, దానికి మన తర్కాన్ని అన్వయించి, “నా తర్కానికి ఇది నిలబడింది. కాబట్టి ఇది సత్యమే” అనుకుంటే; మనకు తెలిసిన తర్కం, మనకుండే విజ్ఞానం చాలా తక్కువ. దానిని పరీక్షించేందుకు మనము అధికారులమే కాదు. మనకు ఉండేటటువంటి యుక్తి, బుద్ధికుశలత చాలా అల్పం.

కాబట్టి గంగ అనేటువంటి వస్తువు అప్పటికీ ఇప్పటికీ, ఎప్పటికీ కూడా పవిత్రమయినదే! యజ్ఞంలో మనం గంగోదకం చల్లుకొని పవిత్రుల మవుతున్నాము. గంగ కటువంటి శక్తి ఉంది.

జీవితంలో ఒక్కమాటైనా గంగాస్నానం చేసితీరమని ప్రతి భారతీయుడికీ పెద్దలు చెప్తారు. అయితే కొందరు, “గంగ అపవిత్రంగా ఉందండీ!” అంటారు. అయ్యా! మురికి ఉంది కాని అపవిత్రంగాలేదు” అని సమాధానం చెప్పాలి.

అది ఎలాగ అంటే “నీవు వెళ్ళి ఆ యోగికి నమస్కారం చేసావు కదా! నీ శరీరంలో ఉన్నట్లుగానే ఆయన శరీరంలో కూడా మలమూత్రాలు ఉన్నాయి. ఆయనకెందుకు నమస్కరించావు?

ఆయనలో రక్తమాంసాలు, చర్మము క్షీణించి అందంగా కూడా లేడాయన. కేవలం సుందరమైన దేహంతో, రూపంతో అందంగా ఉన్నాడని నీవు ఎవడికైనా నమస్కారం చేస్తావా?” అని అదిగితే, ఏమిటి సమాధానం.

🌻 14. కాబట్టి బయటికి కనబడేటటువంటి శుభ్రత, అశుభ్రత అనేటటువంటివి భౌతికమైనవి. ‘పవిత్రతా అనేది దీనికి పైన, వెనుక ఉండేటటువంటి రహస్యం.

అది ఒక తత్వం. ఆ తత్త్వానికే మనం మొక్కుతాము. గంగానదిలో ఎంత మురికి ఉన్నా పవిత్రమయినదే! అలాగని మురికిచేస్తే ఫరవాలేదు అని అనటం లేదు.

అంత పవిత్రమయిన గంగను మురికి చెయ్యటం పాపంగా భావించాలి మనం. కాబట్టి అది శుభ్రంగా లేకపోవచ్చు గాని, ‘పవిత్రం’గానే ఉంది. అదీ ఆ రెండింటికీ ఉన్న తేడా. నీళ్ళు శుభ్రంగా ఉంటే ఇంట్లో స్నానం ! చేస్తాము. సబ్బు పెట్టుకొని, చక్కగా వేడినీళ్ళు పెట్టుకొని చేస్తాము.

ఆ నీళ్ళను పవిత్రమయినవి అంటామా! శుభ్రంగా ఉన్నాయి అనిమాత్రమే అర్థం. ఆ రెండస్తులలో ఆర్యుడు ప్రతీవస్తువునూ చూస్తాడు. భౌతికస్థితి, తాత్వికస్థితి అని రెండు దృక్పథములు ఉన్నాయి ఆర్యులకు. అది గుర్తుపెట్టుకోవాలి.

🌻 15. ఒకప్పుడు ప్రశ్నలు పుట్టేవికావు. కృష్ణుడి రాసక్రీడ యందు అవినీతి లేదా? అనే ప్రశ్న పూర్వం ఎవరూ అడగలేదు. ఇప్పుడు అడుగుతున్నారు. ఎలా అడుగుతున్నారు అంటే, అధికారం లేకుండా అడుగుతున్నారు.

కృష్ణుడు అవినీతిపరుడు, అవినీతిలో సంచరించాడు అనే మాట అనే ముందు మనం ఎంతటి అవినీతిలో ఉన్నామో ఒక్కమాటు గుర్తు చేసుకుంటున్నామా! మనను మనం అలా ప్రశ్నించుకున్నామా? మనసా, వాచా, కర్మణా అంత నీతిమంతులుగా ఉన్నామా మనం! ఆ ప్రశ్న వెయ్యటానికి మనకీ అధికారం ఎక్కడినుంచి వచ్చిందనేది మొదటిప్రశ్న! సమాధానం తరువాత. 

అధికారం లేకుండానే ప్రశ్నడగటం నేర్చుకోవటం చేతనే, ఆర్యధర్మం ఇలా అవమానం పాలవుతోంది. ప్రతీవాడినీ ప్రశ్నించవచ్చు. తప్పుకాదు. కాని అలా అడిగేముందు – అతడి ప్రవర్తనలో వక్రత్వాన్ని దూషించే ముందు, ముందర మన ప్రవర్తన సక్రమంగా ఉంటేనే అలాగ అడగటానికి వీలవుతుంది.


సశేషం....
🌹 🌹 🌹 🌹 🌹

Q 6 :-- higher ఫ్రీక్వెన్సీ లో ఉన్న లోకాల వారు వారి ఆలోచనలను ఎలా ఉపయోగిస్తారు?

A:--1) higher energy,  higher frequency గల ఉన్నత లోకాలలో వారు telepathy కమ్యూనికేషన్ ఉపయోగిస్తారు. అనగా మనం ఒకటి సంకల్పిస్తే ఆ ఆలోచన తరంగాలు ఆ ఎదుటివ్యక్తి యొక్క మనోశక్తి గ్రహించ గలుగుతుంది. ఆ విధంగా సంభాషించు కుంటారు.

2) వారికి ఎంతో పారదర్శకత ఉంటుంది, ఒకరి మైండ్ లోని ఆలోచనలు మరొకరు సులభంగా పసిగట్టగలరు. ఏది దాచిపెట్టలేరు.

3) వినాశకర ఆలోచనలు మైండ్ నుండి వెలువడడం జరగదు.

4) అక్కడి జీవజాతులు ఉన్నతమైన ఆలోచనలను వెలువరించడం ద్వారా ఉన్నత రీతిలో పరిణామం చెందుతున్నారు.

5) వారికి చైతన్య శక్తి యొక్క స్థితిగతులు దాని పర్యవసానాలు బాగా తెలుసు. కావున జీవజాతులు మధ్య పరస్పర సహకారం ఉంటుంది.

6) సంభావ్య ఆత్మలు అనగా మనం ఆలోచించిన ప్రతిసారి మన ద్వారా మనం ఒక అంశాత్మను సృష్టిస్తున్నాం అన్నమాట. మన ఆలోచన ద్వారా సృష్టించబడ్డ అంశాత్మ ఆ ఫ్రీక్వెన్సీ గల లోకంలో అనుభవాలను పొందుతూ చైతన్య వికాసం చెందుతుంటుంది.

7) ఉన్నత ఆత్మలు వారి సంభావ్య ఆత్మలతో telepathy ద్వారా ఆలోచనలు పంచుకుంటూ అభివృద్ధి చెందుతుంటారు.

8) చైతన్యశక్తి యొక్క డైనమిక్స్ తెలిసినప్పుడు ఆలోచనలను వినాశకర రీతిలో ఉపయోగించరు.
🌹 🌹 🌹 🌹 🌹


Q 5 :-- మన నుండి వెలువడిన ఆలోచనా తరంగాలు ఎంత వేగంగా ప్రయాణిస్తాయి?

A:-- మన నుండి వెలువడిన ఆలోచనా తరంగాలు కాంతి వేగం కంటే అధిక వేగంతో ప్రయాణిస్తాయి.

ఆలోచనా తరంగాల వేగం లెక్కకట్టేంత పరిజ్ఞానం ఇంకా మన సైన్స్ కు లేదు.
మనం సంకల్పించిన వెంటనే మన ప్రతిరూపం (counter self) వేరే గాలక్సీ లోని వేరే లోకం లోకి అయిన అక్కడ ప్రత్యక్షీకరించబడుతుంది.

ఆలోచనాతరంగాలు విద్యుదాయస్కాంత శక్తిని కలిగివుండి చైతన్యశక్తితో (consciousness) తో ప్రయాణిస్తాయి.
🌹 🌹 🌹 🌹 🌹 


Q 4 :-- టెలిపతీ telepathy అంటే ఏమిటి?

A:-- మనం ఒక వ్యక్తి గురించి తీవ్రంగా ఆలోచించినపుడు, మన ఆలోచనా తరంగాలు ఆ వ్యక్తిని చేరుతాయి. అతని మనోశక్తి ఆ ఆలోచనా తరంగాలు ను పసిగట్టగలుగుతుంది. దీనినే టెలిపతి అంటారు.
 
Telepathy ద్వారా జంతువులతో, పక్షులతో, వృక్షాలు తో సముద్రంతో, భూమితో, అలా ఏ వస్తువుతో నైనా సంభాషించవచ్చు. ఈ విశ్వంలో ప్రతి ప్రాణితో telepathy ద్వారా సంభాషించగలం.

మైండ్ టు మైండ్ కమ్యూనికేషన్, పదార్ధాన్ని దాని భౌతిక స్వరూపంతో కాకుండా, దాని చైతన్య శక్తి తో సంభాషించగలగడం.

పూర్వపు నాగరికతల్లో మానవజాతి జంతుజాతి, వృక్షజాతి, పక్షిజాతి, ఇలా అన్నిటితోను సంభాషించేవారు.

  మొక్కలతో సంభాషించి ఎన్నో ఔషధాలను మన ఋషులు మనకు అందించారు.


Q 3:-- భౌతిక పదార్ధం ఎలా సృష్టించ బడుతుంది?

A:-- మన మైండ్ నుండి వెలువడే ఆలోచనా తరంగాలు ఎంత సాంద్రత తో, ఎంత తీవ్రతతో, ఉన్నాయో దాన్ని బట్టి చైతన్యశక్తి భౌతిక పదార్ధంగా రూపాంతరం చెందుతుంది.


       మైండ్ నుండి వెలువడే ఆలోచనా తరంగాలు బలహీనమైతే దానికనుగుణంగా మిధ్యా భౌతిక రూపం (pseudo physical form) ఏర్పడుతుంది. ఆలోచన తరంగాల ఫ్రీక్వెన్సీ, శక్తి, సాంద్రతలకు సరిపడే లోకంలో అక్కడ పరిస్థితులుకు అనుగుణంగా భౌతిక రూపం ఏర్పడుతుంది.


అంతేకాని మన మైండ్ నుండి వెలువడిన ఆలోచనా తరంగాలు నశించిపోవడం గాని,మటుమాయమైపోవడం గాని జరుగదు.

      
మన ఆలోచనలు భౌతిక వాస్తవం పొందాలంటే మన మైండ్ లో,మన మనో ప్రపంచంలో, ఎంత గాఢంగా వాంచిస్తున్నాం అన్న దాన్ని బట్టి ఉంటుంది.
      
మన ఆలోచనల తీవ్రత,ఫీలింగ్స్,ఎమోషన్స్, ఎంత తీవ్రంగా ఉన్నాయి, మన నమ్మకపు వ్యవస్ధ ఎలా ఉంది, అనేది ముఖ్యమైంది.
       
మన మనోశక్తి ద్వారా మన దేహాన్ని సృష్టించుకున్నామన్నది ఎం
త నిజమో,మన ఆలోచనలు వాస్తవ రూపం పొందుతాయన్నది కూడా అంతే నిజం.
🌹 🌹 🌹 🌹 🌹



Q. 1. :  మైండ్ (mind) లేదా మనోశక్తి (mind power)కి మెదడు (brain) కి మధ్య తేడాలేంటి ? ఇవి నిర్వహించే పనులు ఏంటి?

A. 1) brain (మెదడు) అనేది దేహంలో ఒక అవయవం.

గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, ప్రేగులు, కళ్ళు ఎలాగో మెదడు కూడా ఒక అవయవం. శాస్త్రవేత్తలు మెదడును ముక్కలుగా చేసి పరిశోధన చేశారు. చిన్నమెదడు, పెద్దమెదడు, మెడుల్లాఅబ్లాంగేట, ఎడమ మెదడు, కుడి మెదడు, అని అనేక పేర్లు పెట్టారు.

2) మైండ్ లేదా మనోశక్తి ఆత్మశక్తికి అంతర్ ప్రపంచానికి సంబంధించింది. మైండ్ చర్మచక్షువుకు కనిపించదు. శాస్త్ర పరికరాలకు అంతు చిక్కదు.


3) మెదడు దేహంలోని అన్ని భాగాలను నియంత్రిస్తుంది, మరియు దేహంలోని నాడులన్నింటికి అనుసంధానింపబడి ఉంటుంది.


4) మైండ్ గుండె కొట్టుకోవడం, ఊపిరితిత్తులు పనిచేయడం, జీర్ణవ్యవస్థ లాంటి ఎన్నో ప్రక్రియలను నడిపిస్తుంది. ఈ ప్రక్రియలను నడిపించడానికి మైండ్ మెదడు అనే సాధనాన్ని ఉపయోగించు కుంటుంది.


5) ఆలోచనా తరంగాలు (thought waves) మైండ్ లో ఉత్పత్తి అయి మెదడు ద్వారా బయటకు వస్తాయి. ఒక డాక్టర్ బ్రెయిన్ ని కణవిభజన చేయగలడు కాని , ఆ మెదడులోకి ఆలోచనలు ఎక్కడి నుండి వచ్చాయో అనే విషయం చెప్పలేడు.


6) దేహం ఏర్పడక ముందే ఆత్మ మరియు మైండ్ రెండు ఉన్నాయి. దేహం నశించిన తర్వాత కూడా ఆత్మ మరియు మైండ్ రెండూ ఉంటాయి.


7) మైండ్ యొక్క ఊహాశక్తి నుండి జనించిందే ఈ దేహం, ఈ దేహం ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది, కానీ మైండ్ జన్మపరంపరలుగా, మనతోనే ఉంది.జన్మ పరంపరల నుండి జ్ఞానాన్ని, అనుభవాల్ని, చైతన్యశక్తిని, మైండ్ మోసుకొస్తూ ఉంది.


8) గత కోటానుకోట్ల జన్మల తాలూకూ జ్ఞానాన్ని కూడా మైండ్ లో నిక్షిప్తం అయి ఉంది. మరణించిన తర్వాత దేహాన్ని వదిలేస్తాము. కానీ జ్ఞానం, అనుభవాలు, చైతన్య శక్తి సంస్కారాలు, అన్ని నిక్షిప్తం అయి ఉంటాయి. అవి తర్వాత కూడా continue అవుతాయి.


9) ప్రతి జన్మకు మైండ్ వ్యాకోచం చెందుతూ ఉంటుంది. ఈ భూమి మీద జన్మపరంపర పరిసమాప్తి అయిన తర్వాత ఆత్మ మరో లోకంలో జన్మ తీసుకుంటుంది. అక్కడ కూడా మైండ్ అక్కడి జ్ఞానాన్ని, అనుభవాల్ని, పొందుతూ వ్యాకోచం చెందుతుంది.


10) ఈ విశ్వంలో ప్రతి ఆత్మశకలానికి మైండ్ ఉంది. అణువు, పరమాణువు, ఎలెక్ట్రాన్, ప్రతీది చైతన్యశక్తి మరియు మైండ్ ని కలిగి ఉన్నాయి. అన్నింటి మైండ్స్ అనుసంధానింపబడి ఉన్నాయి.


11)మనిషికి ఆత్మ, మైండ్ ఎలాగైతే ఉంటుందో, అలాగే భూమికి, భూమిపై ఉన్న సకల జీవరాశులకు ఆత్మ, మైండ్ ఉంటాయి. మూలకాలు, ఏకకణ జీవులకు కూడా ఆత్మ, మైండ్ ఉంటాయి.


12) సీతాకోకచిలుక, సాలెపురుగు, ఇవి వాటి మనోశక్తి ద్వారానే అందమైన దేహాన్ని, గూటిని నిర్మించుకుంటున్నాయి. పక్షులు వేల మైళ్ళు వెళ్లి ఆహారాన్ని సంపాదిస్తున్నాయి. జంతువులు జీవజాతులన్ని, ప్రకృతి వైపరిత్యాలని ముందుగానే పసిగడుతున్నాయి. ఇవన్నీ మనోశక్తి ద్వారానే సాధ్యం.


13) సంకల్పం, ఊహాశక్తి, ఇంటలిజెన్స్, తర్కం, విశ్లేషణ, స్వప్నాలు, ఆలోచనాశక్తి, clairvoyance, telepathy, సహజావబోధన, జ్ఞాపకశక్తి, ఈ ప్రక్రియలన్ని మైండ్ ద్వారానే జరుగుతున్నాయి.


14) మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు, అనేవి మైండ్ కి సంబంధించినవి. కామం, క్రోధం, రాగం, ద్వేషం, లాంటివన్ని మైండ్ నుండి పడుతున్నాయి.


జీవరాసులన్నీ కలిస్తేనే ప్రకృతి. ప్రకృతి అనే మహాసముద్రం లో మనిషి ఒకానొక అల మాత్రమే.

🌹 🌹 🌹 🌹 🌹




శ్రీగురుభ్యోనమః🙏

 అష్టాదశశక్తి పీఠములలో  మధుర మీనాక్షి ఆలయ పీఠము ప్రముఖమైనది. మీనముల వంటి చక్కని విశాలనేత్రములతో ఒకే ఒక మరకత శిలతో అమ్మవారి విగ్రహము చెక్కబడినది. ఆకుపచ్చ, నీలము కలగలిపిన మరకత మణి శరీరకాంతి ఆ తల్లి ప్రత్యేకత.

మధురను పరిపాలించే ఆ పాండ్యరాజులంతా ఆ తల్లిని ఆడపడుచుగా, కులదేవతగా, జగజ్జననిగా ఆరాధిస్తారు. "దేవీ భాగవతపురాణము" లో మణిద్వీపవర్ణనలా ఆ ఆలయాన్ని పాండ్య రాజులు రూపొందించారు. అంతటి సౌందర్యరాశి, చతుష్షష్టి కళానిలయమైన "మీనాక్షి"  గూడా రాత్రివేళ తామస శక్తిస్వరూపిణిగా మారి ప్రాణిహింసకు పాల్పడుతున్నది. ఆమెను శాంతింపచేయడానికి యావద్భారతములోని మూలమూలల నుండి వేదపండితులను, ఋత్విక్కులను పిలిపించి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు పూజలు, జపహోమాలు అన్నీ చేయించారు. వారు పూజలు చేస్తుండగా వారినీ కబళించి వేసినది మీనాక్షి.

పాండ్యరాజు నిస్సహాయంగా ఉండిపోయి తమ రాచరికపు కర్తవ్యంగా రాత్రి వేళ నగరంలో "నర సంచారం" లేకుండా నిషేధాజ్ఞలు విధించారు. సంధ్యా సమయానికల్లా ప్రజలంతా తమ తమ పనులన్నీ పూర్తి చేసుకుని రాత్రి ప్రారంభం కాగానే ఎవరి గృహాల్లో వారు బందీలుగా మారిపోయారు. ఆపద వచ్చినా, అపాయం వచ్చినా వారికిక బయటకి వచ్చే వీలు లేదు. వచ్చారో నగర సంచారానికి బయలుదేరిన అమ్మవారి కోపాగ్నికి ఆహుతై పోవలసిందే!
క్షేత్ర పాలకుడూ, మీనాక్షీ హృదయేశ్వరుడూ అయిన సుందరేశ్వరుడు కూడా ఈ జరుగుతున్నదంతా సాక్షీ భూతునిలా చూస్తూ ఉండిపోయాడు. తన దేవేరి తామస ప్రవృత్తిని మాన్పించటానికి తన అంశతో ఒక అవతార పురుషుడు జన్మించాలి. మౌనం వహించి తీరాల్సిందే తప్ప మరేమీ చేయటానికి లేదని నిర్ణయించు కున్నాడా భోళా శంకరుడు.

తన శరీరంలోని అర్ధభాగము అయిన ఈశ్వరుని అవమానపరిస్తే , తనను తాను అవమానపరచుకోవడమే అవుతుంది. బాహ్యలోకానికి ఆమెను చులకన చేసినట్లవుతుంది. ఎలా?   కాలము విచిత్రమైనది. ఏ సమయములో, ఏ ప్రాణికి, ఏ శిక్ష, ఏ పరీక్ష, ఏ దీక్ష, ఏ సమీక్ష ప్రసాదించాలో ఒక్క మహాకాలుడికే తెలుసు. ఎవరి  వంతుకు ఏది వస్తే అది వారు మంచి అయినా, చెడు అయినా, జయమైనా, పరాజయమైనా అనుభవించి తీరాల్సిందే.  

ఆది శంకరాచార్యులు మధురలో అడుగుపెట్టే నాటికి పరిస్థితి పైవిధముగా ఉన్నది. పాండ్యరాజు ఆదిశంకరులను అత్యంత భక్తి శ్రద్ధలతో స్వాగతము పలికి తన అంతఃపురంలో  సకల సేవలు చేసాడు. అద్భుత తేజస్సుతో వెలిగిపోతున్న యువబ్రహ్మచారి అయిన ఆదిశంకరాచార్యులు" నేను మధుర మీనాక్షి ఆలయం లో ఈ రాత్రికి ధ్యానము చేసుకుంటాను అని చెప్పాడు". ఆ మాటలను విన్న పాండ్య రాజు పాదాల కింద భూకంపము వచ్చినంతగా కంపించిపోయాడు."వద్దు స్వామి మేము చేసుకున్న ఏ పాపమో,  ఏ శాప ఫలితమో చల్లని తల్లి కరుణారస సౌందర్యలహరి అయిన మా మీనాక్షి తల్లి రాత్రి సమయములో తామస శక్తిగా మారి కంటికి కనిపించిన ప్రాణినల్ల బలితీసుకుంటున్నది. అందుచేత అంతఃపురంలోనే మీ ధ్యానానికి ఏ భంగము రాని విధముగా సకల ఏర్పాట్లు చేయిస్తాను. మీరు ఆలయములోకి రాత్రి వేళ అడుగుపెట్టవద్దు .అసలు అంతః పురం నుండి బయటకు ఎవరూ వెళ్ళరు. పొరపాటుగా బయటకు వస్తే వారు మరునాటికి లేనట్టే లెక్క అని వివరించి పాండ్య రాజు వేడుకున్నాడు. ఆది శంకరా చార్యులు పాండ్యరాజును శతవిధాల సమాధాన పరచాడు. 'సన్యాసులకు గృహస్తుల భిక్ష స్వీకరించే వరకే ఉండాలి కాని తర్వాత వారు గృహస్తుల గృహాలలో ఉండరాదు. మేము ఆలయములోనే ఉంటాము. జగన్మాత అయిన మీనాక్షి అమ్మవారిని మనసారా ధ్యానము చేసుకుంటే తప్ప నాకు సంతృప్తి కలగదు. మీరు అడ్డు చెప్పవద్దు' అన్నాడు. పాండ్యరాజు హతాశుడైనాడు.

దైవీ తేజస్సుతో వెలిగిపోతున్న ఈ యువబ్రహ్మచారినిక చూడనేమో అని  పాండ్యరాజు ఆవేదన చెందాడు. ఆదిశంకరాచార్యను ఆలయము లోనికి తీసుకొనివెళ్లి తిరిగి అంత:పురానికి వెళ్ళాడు. పాండ్యరాజుకు ఆరాత్రి నిద్ర లేదు. ఈ యువసన్యాసిని అమ్మవారు బలితీసుకుంటుదేమో ఆ పాపము తన తరతరాలను పట్టి పీడిస్తుందేమో అని నిద్రరాక అటు ఇటూ పచార్లు చేయసాగాడు. 

రాత్రి అయినది. గర్భగుడికి ఎదురుగా ఉన్న విశాలమైన మండపములో పద్మాసనము వేసుకొని ఆదిశంకరాచార్య ధ్యానములో కూర్చుండి పోయాడు. మరకతశ్యామ అయిన ఆ తల్లి ఆయన మనో నేత్రాలముందు ప్రత్యక్షమై భ్రుకుటి మధ్య నిలచి సహస్రారములో ఆశీనురాలై చంద్రకాంతి వంటి వెలుగులతో సుధా వర్షము కురిపిస్తున్నది.


ఆ సమయము లోనే ఆలయములోని గంటలన్నీ వాటంతట అవే మ్రోగనారంభించాయి. ఆలయములోని అన్నివైపులా దీపారాధనలోని వెలుగులు దేదీప్యమానంగా వెలగసాగాయి. గర్భగుడిలో మరకతశిల అర్చామూర్తిలో  చైతన్యము వచ్చి అమ్మవారు మెల్లగా పీఠము నుండి లేచి నిల్చున్నది.  పాద మంజీరాలు ఘల్లుమన్నాయి. సుందరేశ్వరుని వైపు తిరిగి వినమ్రంగా నమస్కరించినది. కర్ణతాటంకాలు ధగ, ధగ మెరుస్తుండగా, ఆమె ధరించి ఉన్న ఎఱ్ఱని రంగు పట్టు చీరె, బంగారు జరీ అంచుల కుచ్చెళ్ళు నేలపై జీరాడుతూ, పుడమితల్లికి స్వాంతన చెపుతున్నట్లుగా, కోటి వెన్నెలలు రాసిబోసినట్లున్న చిరునవ్వుతో ఆ తల్లి గర్భగుడి ద్వారము వద్దకు వచ్చి లిప్తకాలము ఆగినది. 


ఎదురుగా విశాలమైన మండపములో ధ్యాన సమాధిలో ఉన్న యువకయోగి ఆమె విశాల నయన దృష్టి పథం లోకి వచ్చాడు.
"ఎవరీతడు? ఈ అద్భుత తేజస్సేమిటి?  నుదుట విభూదిరేఖలు, అందులో కుంకుమబొట్టు, మెడలో రుద్రాక్షమాలలతో "బాలశివుని"లా ఉన్న ఆయోగి ని చూస్తుంటే తనలో మాతృ మమత, పెల్లుబుకుతున్నదేమిటి? ఈ వేళప్పుడు ఆలయములో ఉన్నాడేమిటి? అని ఆశ్చర్యము కలిగినది.

క్షణకాలమే ఇదంతా! గర్భగుడి "గడప" దాటిన ఆ తల్లిపై ఒకానొక ఛాయారూప "తమస్సు" ఆవరించుకుంది. ఆమెలో సాత్త్విక రూపం అంతరించి తామసిక రూపం ప్రాణం పోసుకుంటోంది. మరకత శ్యామ కాస్తా కారు మబ్బు వర్ణంలోనికి మారి భయంకర దంష్ట్రా కరాళ వదనంతో, దిక్కులను సైతం మ్రింగివేసే భయంకరమయిన చూపులతో అడుగు ముందుకు వేస్తుంది. మహాకాళీ స్వరూపంలా. 

ఇందాక తల్లి ఆకారం గర్భగుడిలో సాక్షాత్కరించిన సమయంలోనే ఆదిశంకరులు ధ్యాన సమాధి నుండి మేల్కొని "మహాలావణ్య  శేవధి" ని కళ్లారా చూసాడు. ఆయన హృదయంలో స్తోత్రం కవిత్వం రూపంలో సురగంగలా ఉరకలు వేసింది. ఆమె తామస రూపంగా మారినప్పటికీ ఆయనకు ఆ తల్లి మనోఙ్ఞ రూపంగానే కన్పిస్తుంది. కన్నతల్లి అందమైనదా ? కాదా ? అనుకోరు కదా! కన్నతల్లి కన్నతల్లే ! అంతే !

అప్రయత్నంగా ఆయన స్తోత్రం చేసాడు. అడుగు ముందుకు వేస్తూ ఆయనని కబళించాలని వస్తున్న ఆ తామస మూర్తికి ఆ స్తోత్రం అమృతపు జల్లులా చెవులకు సోకింది. దంష్ట్రా కరాళ వదనంలో రేఖా మాత్రపు చిరునవ్వు ఉదయించింది. స్తుతిస్తున్న డింభకుని భక్తి పారవశ్యానికి అచ్చెరు వొందింది. అతని ఆత్మ స్థైర్యానికి, తపశ్శక్తికి ఆశ్చర్యంగా చూచింది. నిజానికీ సమయంలో తన వదనంలోకి శలభంలా వెళ్లిపోవలిసిన వాడు. మ్రింగటానికి బుద్ధి పుట్టడం లేదేమిటి? 

అర్ధ నిమీళితాలైన కన్నులతో భక్తి పారవశ్యంతో వజ్రాసనం వేసి కూర్చుని స్తోత్రం చేశాడా యువక యోగి పుంగవుడు. "భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం" ఆ యువక యోగి లోంచి కవిత్వ గంగాఝురిగా పొంగి పొరలి వస్తోంది. జగజ్జనని తృళ్లిపడింది. తామస భావంతో నిండిపోయిన ఆమె హృదయంలో ఒకానొక సాత్త్విక తేజ: కిరణం తటిల్లతలా తటాలున మెరిసింది.


ఆహా! తన శక్తి పీఠస్థానము ఎంత అద్భుతముగా చెప్పాడీ యువకుడు? అవును తాను త్రికోణ బిందురూపిణి. శ్రీ చక్రరాజనిలయ. సహస్రారమనే మహాపద్మములో శివ, శక్తి రూపిణిగా, పరాశక్తిగా ఉండే తన ఉనికిని ఎంత చిన్న శ్లోకములో ఎంత చక్కగా వర్ణించి గుర్తుచేశాడు. మరి తనలో ఈ తామస భావాలేమిటి? తన సృష్టిని తానే కిరాతకంగా హింసించే ఈ భావనలేమిటి? ఆలోచనలో పడింది అమ్మవారు. 

ఆదిశంకరుల  ముఖకమలము నుండి, సురగంగలా వచ్చిన స్తోత్రము తరంగాలు తరంగాలుగా ఆమె కర్ణతాటంకాలను దాటి, కర్ణపుటాలను దాటి, ఆమె ఆలోచనల్లో సుడులు తిరుగుతుంది. ఏమిటిది?  ఇతడు వసిన్యాది వాగ్దేవతలకు మరో రూపమా! ఏమి పద లాలిత్యము! ఏమా కవిత్వము! ఏమా కంఠస్వరము! ఏమి భక్తితత్పరత! ఏమి వర్ణన?

శ్రీచక్ర రాజములోని నవావరణల్లోని దేవతాశక్తి బృందాలు, అణిమాది అష్టసిద్ధులు ఈ యువక యోగికి కరతలామలకము!  

"ఎవరు నాయనా నీవు ?  నాదారికి  అడ్డుగా కూర్చున్నావేమిటి?  నేనీ సమయములో సంహారకార్యక్రమము  చేపట్టాను. నిన్ను చూచి నీ స్తోత్రానికి ముగ్ధురాలినై క్షణకాలము ఆగానంతే. నీవు తొలగు. నిజానికి నీవీపాటికి నాకు ఆహారము కావలసిన వాడివి. నీవాక్కు నన్ను ఆకట్టుకొన్నది. అన్నది జగజ్జనని వాత్సల్య పూరిత సుధా దృక్కులతో ఆదిశంకరాచార్యను చూస్తూ.


ఆదిశంకరులు సాష్టాంగ దండ ప్రణామము చేసాడు. "అంబా శంభవి! చంద్ర మౌళి రబలా, కాత్యాయినీ సుందరి......" గంగాఝురిలా సాగిందా స్తోత్రం. తల్లి తల పంకించింది. "నవ విద్రుమ బింబ శ్రీన్యక్కారిరదనచ్చదా" పగడము, దొండపండు కలగలిపిన ఎర్రని రంగును స్ఫురణకు తెచ్చే ఆమె పెదవులపై వెన్నెలలాంటి నవ్వు వెల్లి విరిసి "శుద్ధ విద్యామ్ కురాకార  ద్విజ పంక్తి ద్వయోజ్వలా " అన్నట్లుగా ఆ తల్లి పలువరస ఆ నవ్వులో తళుక్కుమని మెరిసింది. "కర్పూరవీటికామోద సమాకర్షద్దిగంతరా" అన్నట్లుగా తాంబూలసేవనము వలన ఆ సువాసన దిగంతాలకు వ్యాపించింది. సరస్వతీ దేవి వీణ అయిన "కచ్ఛపి"  మధుర నాదాన్ని మించే సుస్వర సుమధుర నాదంతో జగన్మాత ఇలా అన్నది.

నీ స్తోత్రాలకు, నీ భక్తికి మెచ్చాను. నీవు, నీ కవిత్వము చిరస్తాయి అయ్యేలా ఆశీర్వదిస్తున్నాను. నీ నుంచి వచ్చిన అమ్మ వారి స్తోత్రాలు నిత్యము పారాయణ చేయగలిగిన వారు శ్రీచక్రార్చన చేసినంతటి ఫలము పొందుతారు. నీకు ఏ వరం కావాలో కోరుకో. ఆ వరమును ఇచ్చి నేను నా సంహారకార్యక్రమమును యధావిధిగా కొనసాగిస్తాను. నిన్ను సంహరించక అనుగ్రహించడమే నీకు ఇచ్చే పెద్ద వరముగా భావించు. అన్నది కించిత్ "అహం" ప్రదర్శిస్తూ తామస భావ ప్రభావంతో ఉన్న అమ్మవారు.


ఆదిశంకరులు క్షణము జాగుచేయలేదు. "బాల్యములో తెలిసీ తెలియని వయసులోనే నేను సన్యసించాను తల్లీ, శంకరుడు నా నామధేయము. దేశాటనముతోనూ, వేదాంతములకు భాష్యాలు వ్రాయడంలోనూ ఇన్ని సంవత్సరములు గడిచిపోయాయి. బాల్యావస్త దాటిపోయి యవ్వనం వచ్చేసింది. ఇది గూడా ఎంత కాలం తల్లీ!

కానీ నా  హృదయములో నా బాల్య కోరిక ఒకటి మిగిలిపోయినది. అది శల్యం లా నన్ను అప్పుడప్పుడూ  బాధిస్తూ ఉంటుంది అన్నాడు వినమ్రంగా ఆదిశంకరాచార్య. ముల్లోక జనని ముగ్ధమనోహరముగా నవ్వినది. 

"ఏ కోరికైనా తీర్చగల సమర్థురాలిని. నీ తల్లిని, జగజ్జననిని నేనుండగా  నీకేమి కొరత నాయనా! అడుగు నీకోరిక తీర్చి నేను నాసంహార కార్యక్రమమునకు వెళ్లిపోతాను. ఇంకా ఆమెలో తామసిక వాసనా బలం తరగలేదు.


పసితనపు  అమాయకత్వము వదలని ఆ యువకుని కోరికకు "మందస్మితప్రభాపూర మజ్జత్కామేశమానసా" అన్నట్టుగా ఫక్కున నవ్వినది. సౌందర్యలహరికే సౌందర్యలహరిగా భాసిస్తున్నాదా నవ్వు.

"తప్పక ఆడతాను నాయనా! నీ స్తోత్రముతో, నీ భక్తితో, నీ వినయముతో, నీపట్ల అపార మాతృవాత్సల్యము పెల్లుబికేలా చేసావు. మరి ఆట అన్నాక పందెమంటూ ఉండాలి కదా! నీకు తెలుసో తెలియదో, పశుపతితో ఆడేటప్పుడు నేను ఒక నిబంధన పెడతాను. నేను ఓడిపోతే ఆయన ఆజ్ఞ మేరకు సంవత్సరకాలం నడచుకుంటాను. నేనెప్పుడూ      ఓడిపోలేదనుకో! ఈశ్వరుడు ఓడిపోతే నేను వేసే ప్రశ్నలకు వివరంగా, విసుక్కోకుండా సమాధానము చెప్పాలి అని. ఆ ప్రశ్నలు లౌకికమైనవు కావు. ఎన్నో వేదాంత రహస్యాలు, ప్రాణికోటికి సులభతరం కావలెనన్న పరోపకార ధ్యేయంతోప్రశ్నిస్తాను. అట్లా ఏర్పడినవే, ఎన్నో దేవతా స్తోత్రాలు, కవచాలు, సహస్ర, అష్టోత్తర శతనామస్తోత్రాలు. మరి నీపందేమేమిటి నాయనా!  అన్నది జగజ్జనని. ఆమెలో పశుపతినే పాచికలాటలో ఓడించే తన నైపుణ్యము తాలూకు కించిత్తు అహం తొణికిసలాడుతోంది.


ఇదంతా గమనిస్తున్న సుందరేశ్వరుడు నిశ్శబ్దముగా లోలోపల నవ్వుకున్నాడు. ఆమె గెలుపు, తన ఓటమి ఎవరికోసము? లోకకళ్యాణార్ధము. మౌనముద్రలో ఉన్న సుందరేశ్వరుని జటాభాగము నుండి ఒకానొక కాంతి కిరణము మెరుపులా వచ్చి ఆదిశంకరునిలో ప్రవేశించడము ఆ తల్లిగమనించలేదు.  ఆదిశంకరుల శరీరము, హృదయం క్షణ కాలము దివ్యానుభూతికి లోనైనది. "శివా, పరమశివా ! తల్లితో ఆడే ఆటలో పందెముగా  ఏమి
కోరాలో వాక్కు ప్రసాదించు సుందరేశ్వరా! అనుకున్నాడు లోలోపల. అది భావనా రూపము గా పరమ శివుని నుండి అందినది.

"పందేముఏమిటి నాయనా?" అని మరల అన్నది అమ్మవారు. ఈ యువకునితో పాచికలాడి అతడిని ఓడించి తన నైపుణ్యాన్ని సుందరీశ్వరునికి కూడా తెలియచేయాలి అనే  ఉబలాటము ఆమెలో వచ్చేసింది.  "తల్లీ నేను సన్యాసిని. నాకు ధన, కనక, వస్తు, వాహనాలేవీ నాకు అక్కరలేదు. ఒక వాగ్దానాన్ని పందెపు పణముగా నేను పెడితే నీకు అభ్యంతరమా తల్లీ" అన్నాడు శంకరాచార్య. తప్పకుండా, నీ వాగ్దానము ఏమిటో చెప్పేయి అన్నది వాత్సల్యము నిండిన చిరునవ్వుతో జగన్మాత. బహుశా మరింత కవితా శక్తి ప్రసాదించమని, అది మహారాజులు మెచ్చి మహాత్కీర్తి రావాలని కోర్కె కోరుతాడాని ఉహించినదా తల్లి.

తల్లీ, నీవు కరుణామయివి. నీవు తామస శక్తివై  ఈ సంహార కార్యక్రమం చేయడము నాకు బాధాకరముగా ఉన్నది. ఆటలో నీవు ఓడిపోతే ఈ సంహారకార్యక్రమము ఆపేసి అందరినీ కాపాడాలి. నేను ఓడితే మొదటగా నేను నీకు ఆహారము అవుతాను. అన్నాడు దృఢ చిత్తముతో ఆదిశంకరాచార్య.  


జగన్మాత నవ్వింది. నిన్ను ఆహారముగా తీసుకోను నాయనా! నేను ఓడిపోతే, నీమాట ప్రకారము నేనీ సంహారకార్యక్రమము ను ఆపేస్తాను, సరేనా! అన్నది. ఆమెలో తాను ఎన్నడు ఓడిపోననే దృఢవిశ్వాసము నిండుగా ఉన్నది. పశుపతినే ఓడించే తనకు ఓటమిరాదు. రాకూడదు. ఈ యువకుని నిరుత్సాహపరచకూడదు. గెలుపు అతడికే లభిస్తుందనిపెంచేట్లుగా  మెల్లిగా ఆడుతూ చివరలో ఓడించి,  తన సంహారకార్యక్రమమును  కొనసాగించాలి అని  ఆలోచించినది. 

ఆదిశంకరాచార్య వినమ్రముగా  మ్రొక్కాడు. తల్లీ దివ్య మహిమలు గల పాచికలు 
నీవే సృష్టించు. నీవు కోరిన పందెము నీకు, నేను కోరిన పందెం నాకు పడేలా ఆ పాచికలలో నీ మహత్యము నింపు. నేను ఆటలో అన్యాయము ఆడను, అనృతము పలుకను. నీవు నాతో పాటు ఈ విశాల మండపములో కూర్చోనవసరము లేదు. నీ గర్భ గుడిలోని ఉన్నతాసనం మీద కూర్చో అమ్మా! అన్నాడు.


"ఏమిటి నాయనా ఆలోచిస్తున్నావు? ఆట మొదలుపెట్టు. పాచికలు నీవే మొదట వేయి.  చిన్నవాడివి. నీవు మొదట ఆడడము న్యాయము అన్నది మీనాక్షి అమ్మవారు. ఆమె హృదయములో మాత్రము "సుందరేశ్వరా! నీఅర్ధాంగిని. నాకు ఓటమి ఉండకూడదు. నీ దగ్గరే నేను ఓటమిని ఏనాడూ చూడలేదు. ఈ బిడ్డ దగ్గర ఓడిపోతే  నాకు చిన్నతనముగా ఉంటుంది.  మరి మీ ఇష్టము! అన్నది.  సుందరేశ్వరుడు చిరునవ్వుతో ఆశీర్వదించాడు. 

ఆదిశంకరులు " తల్లీ నీవు సృష్టించిన దివ్య పాచికలు  ఈ క్షణాన నా  చేతిలో ఉన్నాయి? నీలోని దివ్యత్వము నాలోనికి వచ్చినట్లే కదా! ఈ భావనే నన్ను పులకింపచేస్తోంది. అమ్మా జగన్మాతా! ఇంతటి అదృష్టము ఎంతటి యోగులకు దక్కతుంది?  మరల మరల ఈ అవకాశము రాదు నాకు. పశుపతితో తప్ప మరెవరితోను పాచికలాడని తల్లివి, సాధారణ మానవుడి నైన నాతో ఆడడానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమానకాలము చాలా విలువైనది. మహత్తరమైనది. 

నీ లలితాసహస్రనామము లోని  కొన్ని నామాలు, వాటి అర్ధాలు ఆలోచిస్తూ  ఈ క్షణాలకు ఒక అదుతమైన పవిత్రత, ప్రయోజకత కూడా చేకూర్చుకుంటాను. నీ నామాలు పలుకుతూనే ఆటాడతాను. అభ్యంతరమా తల్లీ! అలాగని ఆటలో ఏమరుపాటు చూపను. అన్నాడు భక్తితో. 

సాక్షాత్తూ గురురూపిణివైన నీవు, నీవు తోపింప చేసే అర్ధాలతో ఆ స్తోత్రము మరింత మహాత్వ పూర్ణమవుతుంది. అన్నాడు భక్తితో పాచికలు చేతబట్టుకొని నమస్కరిస్తూ. తన్మయురాలైనది ఆతల్లి.


సంఖ్యా శాస్త్ర ప్రకారము  పావులు కదులుతున్నాయి. సంఖ్యలకు, అక్షరాలకు అవినాభావ సంభందమున్నది. అమ్మ వారికి ఆటలో ఆసక్తి హెచ్చినది. ఇరువురి పావులు న్యాయబద్ధముగా కదులుతున్నాయి. "తాటంకయుగళీభూత తపనోడుపమండలా" అన్నట్టు అమ్మవారు అతని న్యాయమైన ఆటకు తల పంకిస్తోంది. ఆ తల్లి తాటంకాల కాంతి సూర్యచంద్రుల తేజోవలయాల్లాగా కనిపిస్తుండగా ఆది శంకరాచార్య అమ్మవారిని స్తోత్రము చేస్తున్నాడు. "విజయా విమలా వంద్యా వందారు జనవత్సలా"! అన్నాడు.

తల్లి నవ్వింది. విజయము అంటే విజయము నాదే కదా నాయనా! అన్నది. ఆట మధ్యలో ఆపి కించిత్ గర్వంగా.    విజయపరంపర మనిషిలో అహం పెరిగేంతటి మత్తును కలిగిస్తుంది. సృష్టి, స్థితి, లయాలను నేను నిర్వహించగలనన్న గర్వముతో ఉన్న ఆ తల్లి నయనాలలో, చూపులలో ఎరుపుదనము, అహం కనిపించాయి. "విజయము  నాది అయినా, నీది అయినా రెండూ ఒకటే తల్లీ.! నీలో నుండి నేను ఉద్భవించాను. నాలో నీవున్నావు. ఒక నాణేనికి బొమ్మా  బొరుసు లాగా జీవుడు, దేవుడు ఉన్నారనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందమ్మా! విజయపు అంచుకు చేరుకున్న వ్యక్తి లిప్తపాటులో అపజయాన్ని చవిచూస్తాడు. విజయలక్ష్మి  చివరి క్షణములో ఎవరిని ఉద్ధరిస్తుందో? అదే విజయ రహస్యము. అందుకే నీవు గుప్తయోగినివి. గుప్తతరయోగినివి.  ఆ గోప్యాన్ని తెలుసుకోగలగినవారికి విజయమైనా, పరాజయమైనా ఒకటే కదమ్మా! పరాజయము నీ శక్తిస్వరూపమే. ఆ పరాజయము ఎంతటి నిరాశను ఇస్తుందో అంతటి పట్టుదలను ప్రసాదిస్తుంది. ఆ పరాజయము ద్వారా పొందిన అవమానము, దైన్యము, దైవము పాదాలను పట్టుకొనేలా చేస్తుంది. ఇది మాత్రము విజయము కాదా తల్లీ! అన్నాడు ఆదిశంకరాచార్య భక్తి పారవశ్యముతో అమ్మవారికి మ్రొక్కుతూ. అమ్మవారు దిగ్భ్రాంతి చెందినది. గెలుపు ఓటములు, ద్వంద్వాలు సర్వం ఒకటిగా చూడగల దివ్య అద్వైత స్థితి కి చేరుకున్న ఈ యువకుడు కారణ జన్ముడు. సర్వము బోధించగల సమర్ధ గురువుగా రూపొందుతాడు భవిష్యత్తులో. లోలోపల అనుకోబోయిన అమ్మవారు వాత్సల్యము పెల్లుబికి రాగా పైకి అనేసింది. నాయనా! నీ ప్రతి అక్షరం ఒక కవిత్వమై, ఆ ప్రతి కవితా స్తోత్రమై, ఆ స్తోత్రము ప్రతీదీ శృతిసమ్మతమై, వేదమై, 
వేదవాణి అయి అలరారుగాక.


"నీవు వేసే పందెం నీవు వేయి. ఇద్దరి పావుల్ని న్యాయబద్ధముగా నేను కదుపుతాను. ఆ సుందరేశ్వరుని సాక్షిగా నేను కపటం, మోసము చేయను. గెలుపు, ఓటములు జగన్మాతవైన నీ అధీనం కదాతల్లీ! అని అన్నాడు ఆదిశంకరాచార్యులు. ఆలయములో ఉన్న బంగారు గిన్నెలలోని పసుపు, కుంకుమ చందనపు పొడులతో అష్టరేఖల గడులు చిత్రించాడు. అమ్మవారి పాదాలవద్ద ఉన్న పుష్పాలను తన పావులుగాను, అమ్మవారి అలంకరణ సామాగ్రి లోని మంచి ముత్యాలను అమ్మవారి పావులుగాను సిద్ధము చేసాడు. జగన్మాత సంతోషించినది. దివ్యాపాచికలను సృష్టించింది. ఆ యువకునితో ఆట పూర్తయ్యేంతవరకు  నీ కోరిక మేరకు నేను నా స్థానములో కూర్చుంటాను, అంటూ గర్భగుడి లోనికి వెనక్కి వెనక్కి నడిచింది. ఆ సమయములో సర్వచరాచరకోటికి తల్లి అయిన ఆమెలో యువకయోగీశ్వరునిపై మాతృమమత పెల్లుబికింది. ఎంత చిన్న కోరిక కోరాడీ డింభకుడు. ఓడించకూడదు అనే జాలి కూడా కలిగినది. 

పీఠము మీద ఆసీనురాలైన మరుక్షణములో ఆమెలో ఇందాక ఉన్న తామస భావము  మాయమై నిర్మలత్వము వచ్చేసినది. ఆదిశంకరులు ఆమెలో కోరుకున్న మొదటి మార్పు ఇదే. తన స్తోత్రశక్తితో అది సాధించాడాయన. మనసులో సుందరేశ్వరునికి మ్రొక్కాడు. "పరమశివా! జగన్మాతతో ఆడుతున్న ఆట పర్యవసానం లోకకళ్యాణముగా మారేటట్లు అనుగ్రహించు. గెలుపు, ఓటములు రెండూ నీ దృష్టిలో సమానమైనవి. నీవు నిర్వికారమూర్తివి. ఈ ప్రాణికోటి హింస, అమ్మవారి తామస శక్తి అన్నది ఆగాలి. అది ఆమె మాతృత్వానికే కళంకం. ఇది అర్ధము చేసుకొని నీవు సాక్షీభూతునిగా వుండి ఈ ఆట నడిపించు అని మనసారా ప్రార్ధించాడు. వెంటనే అతని హృదయానికి చందన శీతల స్పర్శ లాంటి అనుభూతి కలిగినది. 

అది ఈశ్వర కటాక్షము అని అర్ధమయినది.


"ధన్యుడిని తల్లీ! ధన్యుడిని. నా ప్రతి స్తోత్రములో నీవు, నీశక్తి అంతర్లీనమై నిలిస్తే చాలు. ఆ బ్రహ్మకీటజననీ! ఈక్షణములో "నిర్వాణ షట్కము" అనే కవిత నాలో శ్లోకరూపములో పెల్లుబికివస్తోంది. నీ ఆశీస్సులతో అది కవిత్వముగా  నా హృదయములో రూపుదిద్దుకుంటున్నది. అంటూనే నిర్వాణ షట్కము లోని 5 శ్లోకాలు ఆశువుగా చెప్పేసాడు. 

ఆ "అహంనిర్వికల్పో! నిరాకార రూపో , విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణే , నచా సంగతం నైవముక్తిర్న బంధం, చిదానంద రూపమ్ శివోహం, శివోహం"

రాచనగరులో తెల్లవారు ఝాము ఆయినందుకు
గుర్తుగా మేలుకొలుపు నగారా మ్రోగుతున్నది. అమ్మవారు తృళ్ళిపడినది. ఈ యువక యోగి మధురవాక్కులలో కాలము ఆగిపోయినది. కాలము వదిగిపోయినది.

తల్లీ! ఇంకా కొద్దిగా ఆట ఉన్నది. నీవు "విశ్వాసాక్షిణివి, సాక్షివర్జితవు" కూడా అని అన్నాడు. 

విశ్వానికి సాక్షిణి ని నేను. సాక్షివర్జితను ఎలా అవుతున్నానో చెప్పగలవా! అన్నది జగన్మాత అతని నోటివెంట ఆ నామాల అర్ధాలు వినాలనే కుతూహలంతో.


తల్లీ! రెప్పపాటు లేనపుడు సృష్టిని కాపాడడం, రెప్పపాటు జరిగినపుడు లయం జరగడము రెండూ నీ ప్రక్రియలే గదా అమ్మా! సర్వ విశ్వానికి సాక్షిణి వైన నీవు ప్రాణులకు కాలము తీరినపుడు, నీ సువిశాల నయనాల నల్లని కనురెప్పలను క్షణకాలం  రెప్పపాటు సాకుతో మూసుకొని సాక్షివర్జితవు అవుతావు. అలా చేయకపోతే నీవు సృష్టించిన సృష్టిలో నియమోల్లంఘన జరిగిపోతుంది. అవునా తల్లీ! అన్నాడు.

ఎక్కడో కదలాడుతున్న ఒక మధురానుభూతి, ఒకమాతృ మమత ఈయువకుని చూచినప్పటినుంచి తనలో కలుగుతూనే ఉన్నది. తనతో మూడు ఝాములు ఆడిన ఆట కేవలము వినోదమా! కాదు, కాదు. ఇంకేదో కారణము ఉన్నది. విఘ్నేశ్వరుడు, షణ్ముఖుని లాగా ఏ జన్మలోనో తన బిడ్డా? 

ఆట పూర్తి కాలేదు ఈ రోజు. సంహార కార్యక్రమము ఆగిపోయినది. తనలో తామస శక్తి మరుగై సాత్విక శక్తి నిండిపోయి, అపారకరుణ జాలువారుతుంది. ఇక బ్రహ్మ ముహూర్త కాలము వస్తున్నది. ఆలయ పూజారులు వస్తారు. అభిషేకాలు, పూజా విధులు నిర్వర్తిస్తారు. మరికాసేపటిలో కాలాన్ని ఖచ్చితముగా అమలుపరిచే సూర్యభగవాను డొస్తాడు. "భానుమండలమధ్యస్థా"  తన స్థానము. ఎంత మార్పు ఒక్క రాత్రిలో. ఈ యువకుడు ఏ మంత్రము వేశాడో! అమాయకత్వముతోనే ఆకట్టుకున్నాడు. తన ఆట కట్టేసాడా! తీరా తను ఆట ఒడిపోదుకదా! పశుపతినే ఓడించగలిగిన తాను ఈ యువకుని చేతిలో ఓడిపోతే ఈ సంహార శక్తి ఆపెయ్యాలి. ఇక ఆట మీద దృష్టి కేంద్రీక రించినది. క్షణకాలం భయవిహ్వలతతో చలించిన ఆమె విశాలనయనాలు  చూస్తూ ఆది శంకరులు భక్తిపూర్వకముగా నమస్కరించాడు.

అమ్మవారి కుండలినీ యోగ శ్లోకాలు సహస్రనామ స్తోత్రము లోనివి( "పాయసాన్న ప్రియా త్వక్ స్థా పశులోక భయాంకరీ")  గానము చేస్తూ పావులు చక చకా కదిపాడు. అమ్మవారిలో పట్టుదల పెరిగి త్వరత్వరగా పెద్ద పెద్ద పందేలు పడేలా పాచికలను వేస్తున్నది. 

దూరముగా శివభక్తులు వచిస్తున్న నమక, చమకాలు, అమ్మవారి సుప్రభాతగానాలు ప్రారంభము అయ్యాయి. ప్రతి పనికి ఒక నిర్దిష్ట సమయము, సమయపాలన ఉండి తీరాలి. అదే ముక్తి పధానికి మొదటి మెట్టు. "నాయనా! చివరి పందెము నాది. నా పావులన్నీ మధ్య గడిలోకి వచ్చాయి. నేను గెలిచాను" అంది అమ్మవారు సంతోష తరంగాలలో తేలిపోతూ. " అవును తల్లీ, భూపురత్రయము, నాలుగు ద్వారాలలోకి వచ్చేశాను నేను కూడా. తొమ్మదవ ఆవరణ చేరాము తల్లీ, నీవు బిందువులో  యధాస్థానములో జగన్మాతగా కూర్చున్నావు. నీవే  గెలిచావు తల్లీ! నీ చేతిలో ఓటమి కంటే నీ బిడ్డకు కావలసిన కైవల్యము ఏమున్నదమ్మా! అన్నాడు దివ్య పాచికలు అమ్మవారి ముందు పెడుతూ. జగన్మాత చేతిలో ఓటమి కూడా గెలుపే తల్లీ, ఇలాంటి ప్రత్యక్ష ఆట ఎవరికి దక్కుతుంది? అన్నాడు.

నేను గెలిచాను. మరి మన ఒప్పందం ప్రకారం నా సంహారకార్యక్రమమును నేను కొనసాగిస్తాను. జగన్మాతనైన నాతో పాచికలాడి నీ కోర్కె తీర్చుకొని, పునర్జన్మ లేని మోక్షాన్ని సాధించుకున్నావు నాయనా! అంది అమ్మవారు. 

అవును తల్లీ! ఆట పరముగా విజయము నీది. కానీ తల్లీ, ఆట వైపు ఒక్క సారి తేరిపారి చూడమ్మా! సంఖ్యాశాస్త్రపరముగా, అక్షరసంఖ్యా శాస్త్ర పరముగా, మంత్ర శాస్త్రపరముగా గెలుపునాది అన్నాడు శంకరాచార్య దృఢస్వరముతో. అమ్మవారు ఏమిటి? సంఖ్యాశాస్త్రపరముగానా! అన్నది. ఏదీ స్ఫురించని అయోమయస్థితిలో.


"నవావరణములతో కూడిన శ్రీచక్రరూపము. శ్రీచక్రములోని ఉగ్రబీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తామస శక్తి మాయమైనది. శ్రీ చక్రము నీదేహమైతే, సహస్రనామావళి నీ నామము. నీ అపారకరుణతో, ఈ రాత్రంతా నా తపస్సు ధారపోసి  నేను ఏర్పరిచిన ఈ శ్రీ చక్రరాజాన్ని నీవు తిరస్కరిస్తావా! నీవు చేసిన ఈ సృష్టినీ, నీ ఉనికిని, నీవే అర్ధరహితమని నిరూపిస్తావా! అలా చేస్తే ఆస్తికత ఉండక నాస్తికత ప్రబలి, సర్వసృష్టి జడత్వము లోకి, తమస్సు లోకి జారిపోదా! అంటూ క్షణకాలం ఆగాడు ఆదిశంకరాచార్యులు. దిగ్భ్రాంతి పొందిన అమ్మవారు మండపము లోనికి దృష్టి సారించింది. కోటి సూర్య ప్రభలతో శ్రీచక్రము అక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది. తాను చతుష్షష్టి కళలతో, షోడశ కళలతో బిందు త్రికోణరూపిణిగా కొలువై ఉన్నది. అద్భుతముగా తనని శ్రీచక్రములో బంధించాడు. కాదు, కాదు కొలువు చేయించాడు.

గెలుపు తనదా! కాదు కాదు ఆ యువక యోగిదే. 

ఆదిశంకరుడు అమ్మా! నా మీద  ఆగ్రహించకు. ఆగ్రహము వస్తే నన్నొక్కడినే బలి తీసుకో. నాకు, నీకు సాక్షీ భూతుడు సుందరేశ్వరుడున్నాడు. ఆ పరమశివుని గూడా పిలుద్దాము.  న్యాయనిర్ణయము ఆ స్వామి చేస్తాడు. అప్పుడు చూచినది అమ్మవారు సుందరేశ్వరునివైపు. పశుపతినే పాచికలాటలో ఓడించిన జగజ్జనని నేడు ఒక బిడ్డ చేతిలో ఓడిపోయినది.


ఒక్కసారి నీ పాదాల వద్ద నుండి  మండపములో  చిత్రించిన ఈ ఆట చిత్రము వరకు నీ  విశాలనయనాల చల్లని దృష్టి సారించు తల్లీ!  తొమ్మిది "నవం"తో ఆట ప్రారంభించాను గుర్తుందా తల్లీ!  నీవు నాకు ప్రసాదించిన "ధారణ" శక్తితో మన ఇద్దరి పందేలు ఒక్కటి కూడా తప్పు పోకుండా ఏకరువు పెడతాను తల్లీ, ఒక్క సంఖ్య, ఒక్క అక్షరం 
పొల్లు పోదు. తప్పు, తడబాటు నాకు రాదు. సంఖ్యలకు సరిఅయిన బీజాక్షరాలను  చూడు తల్లీ!

నలబై నాలుగు కోణాలు, తొమ్మిది ఆవరణలు కలిగిన శ్రీచక్రరాజ చిత్రాన్ని, ప్రతిష్టను, ఈ ఆట చిత్రములో చూడు అమ్మా, "మాతృకావర్ణరూపిణి" అయిన నీవు ఒక్కసారి పరికించిచూడు. పందెపు సంఖ్య సరిగ్గా సరిపోయేలా, సాత్విక బీజాక్షరాలను సంఖ్యా శాస్త్రపరముగా మలచి, ఏ పొరబాటు రానివ్వకుండా న్యాయబద్ధముగా పావుల్ని కదిపాను. ఆటలో అన్యాయము చేయలేదు. అందుకు సుందరేశ్వరుడే సాక్షి. పంచభూతాలు, సర్వదేవతా గణాలు సాక్షి. బిందువు మొదలు, భూపురత్రయము వరకు, ప్రతి ఆవరణకు ఒక ప్రత్యేక అధిష్టానదేవత, ఆ దేవతాశక్తులు పరివేష్టించి ఉన్నాయి. "అకారాది క్షకారాంత" దేవతా శక్తి స్వరూపాలకు వారి వారి ఆహార్యాలు,ఆయుధాలు, శరీరపు రంగుతో సహా, ఆయా ఆవరణలలో పరివేష్టితులైన వారిని, ఆయా ముద్రాదేవతలను, నవరసాధిష్టాన దేవీ స్వరూపాలను, యోగినీ దేవతలను, చక్రీశ్వరులను, సంఖ్యా పరముగా బీజాక్షరాలతో నిలిపాను. ఒక్క సారి పరిశీలించి చూడమ్మా! షట్చక్రాల ప్రత్యక్ష, పరోక్షభోధే శ్రీచక్రార్చన గదా తల్లీ! 

నీ శక్తి పీఠాలలో ప్రతిష్ఠితమైన యంత్రాలలోని ఉగ్రబీజాలు తొలగించి, క్రొత్తగా సాత్విక బీజాక్షరాల సహిత శ్రీచక్రప్రతిష్ఠ చేస్తూ వస్తున్నాను. ఆ కార్యక్రమములో భాగముగా తల్లీ, నీతో పాచికలాడాను. సంఖ్యాశాస్త్రపరముగా అక్షరాలను సమీకరించి, నిన్ను స్తోత్రము చేస్తూ, నీ ఆశీస్సులతో వాటిని ప్రాణ ప్రతిష్ట చేసాను. అదే నీ ముందున్న. "బిందు, త్రికోణ, వసుకోణ, దశారయుగ్మ మన్వస్ర, నాగదళ, షోడశ పత్ర యుక్తం, వృత్తత్రయంచ, ధరణీ సదన త్రయంచ శ్రీ చక్రరాజ ఉదిత : పరదేవతాయా:


"ఏమిటీ వింత స్వామీ!" అంటూ భర్త వైపు  కించిత్ లజ్జ, కించిత్ వేదన తో  బేలగా చూచినది మధుర మీనాక్షి.  ఈ యువకుడు అద్భుత రీతిలో సంఖ్యల అక్షరాలను సంధించి యంత్రప్రతిష్ఠ చేసాడు. శ్రీచక్రయంత్రాన్ని సర్వ మానవాళికి శ్రేయోదాయకముగా ప్రసాదించాడు. "స్వామీ సుందరేశ్వరా! ఏది కర్తవ్యం? అమ్మవారు ఆర్తిగా పిలిచింది. "సుందరేశా! నా యుక్తిని నీవు సమర్ధిస్తావో, క్షమిస్తావో నీ ఇష్టం!" అంటూ ప్రార్ధించాడు ఆది శంకరాచార్య. ఆయన హృదయములో "సౌందర్యలహరిగా" తాను కీర్తించిన రూపము తల్లిగానూ, "శివానందలహరిగా" తాను కీర్తించిన ఈశ్వరుని రూపము తండ్రిగానూ, తన తప్పుకు క్షమాపణ వేడుకుంటూ "శివ అపరాధ  క్షమాపణ స్తోత్రము"  గంగా ఝురిలా ఉరకలు వేసిందా క్షణములో. 

అందాకా మౌనంగా ఉన్న నిర్వికారమూర్తి సుందరేశ్వరుడు అపుడు కళ్ళు తెరిచాడు. ఒకవైపు అహము తగ్గిపోయిన ఆర్తితో దేవేరి పిలుస్తోంది. మరోవైపు భక్తుడు కర్తవ్యము తెలుపమంటూ ప్రార్ధిస్తున్నాడు. సర్వ దేవీ, దేవ గణాలు ఆ స్వామి తీర్పు కోసము ఎదురు చూస్తున్నాయి. శివుడు కళ్ళు తెరిచాడు. చిరునవ్వు నవ్వాడు. నందీశ్వరుడు ఒక్కసారి తల విదిలించి రంకె వేసాడు. మధురాపట్టణమంతా  మారు మ్రోగిందా రంకె. ప్రమధ గణమంతా అప్రమత్తులై స్వామి వెంట కదలడానికి సిద్ధమయ్యారు. ఒక్క సారి కైలాసమే కదిలి వచ్చినది. ఆలయ గంటలు అదే పనిగా మ్రోగాయి. భక్త్యావేశముతో ఈశ్వరుని నక్షత్రమాలికా స్తోత్రముతో ఆది శంకరులు స్తోత్రము చేయసాగాడు. ఆయన నోటివెంట సురగంగ మహోధృత జలపాతములా స్తోత్రములు వస్తున్నాయి. ఈశ్వరుడు సర్వదేవతా ప్రమధగణ సమేతంగా మీనాక్షి ఆలయ మండపములో సాక్షాత్కరించాడు. 

"దేవీ!" అన్నాడు పరమశివుడు.  
మధుర మీనాక్షి వినమ్రంగా లేచి నిల్చుని చేతులు జోడించినది.  ఇప్పుడామె "మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానసా". తామసము మచ్చుకైనా లేని మమతా పూర్ణ. భర్త ఆజ్ఞ, తీర్పు శిరోధార్యముగా భావించే సాధ్వి. సదాశివ కుటుంబిని, సదాశివ పతివ్రత. పరమ శివుడు ఇలా అన్నాడు. దేవీ! నీ అహాన్ని, నీ తామస స్వభావాన్ని అదుపు చేయలేకపోయాను. ఎందరో నిర్దాక్షిణ్యముగా బలైపోయారు.  ఈ ప్రాణి కోటిని రక్షించేదెవరు? నీ తామస శక్తినెవరూ జయించలేరు. నేను ప్రయత్నము చేస్తే నా అర్ధశరీరాన్ని అవమానపరచటమే అవుతుంది. అందుకని సకల దేవతలు, నేనూ సాక్షీ భూతులుగ ఉండిపోయాము. నీ తామస శక్తిని అదుపు చేయగల యంత్రాన్ని, మంత్ర పూతముగా సిద్ధము చేయాలి. 
అందుకు ఒక కారణ జన్ముడు దిగి రావాలి. అతడు ముక్త సంగునిగా జన్మించి, ఏ మలినము అంటని బాల్యములో సన్యసించి, సర్వదేవతా సాక్షాత్కారం పొంది, మంత్రద్రష్టగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృప్రేమ తోనే జయించగల్గాలి.

అందుకే ఆ సమయము కోసము వేచిఉన్నాను. ఇతడు నా అంశంతో జన్మించిన అపర బాల శంకరుడు. అతడి సర్వ శాస్త్ర పరిజ్ఞానం, అతడి కవితా శక్తి, అతడిని ఆసేతు హిమాచలం పర్యటన సలిపేలా చేసినది. అతి నిరాడంబముగా సాగించిన అతని పర్యటన యొక్క ఉద్దేశము అతని హృదయానికి, పరమశివుడనైన నాకు మాత్రమే తెలుసు. 

కాలక్రమేణా మహామంత్రద్రష్టలైన కొందరు తమ స్వార్ధ పూరిత ఆలోచనలతో  తామే సర్వలోకాలకు అధిపతులు కావాలనే కోరికతో నీ పీఠాలలోని యంత్రాలకు మరింత ఉగ్రరూపము సంతరించుకొనేలా పూజలు, యజ్ఞాలు, హోమాలు, బలులు నిర్వహించి నీలో తామసిక శక్తిని ప్రేరేపించి, ప్రోత్సహించారు. వారు చేసిన పూజలన్నీ నిశా సమయములోనే   కావడముతో నీలో రాత్రిపూట తామస శక్తి పెరిగి పోయినది. వారు పతనమైపోయారు.  బ్రష్టులయ్యారు. కానీ నీలో తామసిక రూపము స్థిరపడిపోయినది.

 లోక కళ్యాణము తప్ప మరొకటి కోరని ఈ శంకరాచార్య నీలో ఈ తామసిక శక్తిని రూపుమాపి, నీవు మాతృమూర్తిగా సర్వప్రాణికోటిని రక్షించాలి తప్ప, భక్షించకూడదు అని ప్రతిజ్ఞ బూనాడు. శక్తి పీఠాలలో ఉన్న శ్రీచక్రాలలో సాత్విక కళలని ప్రతిష్టించాడు. 
నీవు ఆటలో గెలిచినా, నైతికంగా ఓడిపోయావు. ఈ శ్రీచక్రము సర్వ గృహస్తులకు శ్రేయోదాయకమైనది అని సుందరేశ్వరుడు అన్నాడు. 

అమ్మవారు దిగ్భ్రాంతి పొందినది. ఈ యువకుడు నిస్సందేహముగా అపరబాల శంకరుడే. భర్త అయిన శంకరుని వైపు, బిడ్డలాంటి బాల  శంకరునివైపు మార్చి, మార్చి చూచినది. ఆ ఇద్దరిలో కనిపిస్తున్న ఈశ్వరశక్తి దర్శనము అయినది. అమ్మవారిముఖములో ప్రశాంతత చోటుచేసుకొన్నది.

శ్రీగురుభ్యోనమః🙏
అమ్మవారు భక్తిగా పరమశివునికి శిరసా నమస్కరించి, ఆదిశంకరాచార్యను మనసారా ఆశీర్వదించి చిరునవ్వులు చిందించినది.ఆ సమయములోనే పాండ్యరాజు అంత:పురములో నందీశ్వరుని  రంకె విన్నాడు. మధురమీనాక్షి ఆలయ ఘంటారావాలు విన్నాడు. తెల్లవార్లు నిద్రపోక ఆందోళనగా ఉన్న ఆ రాజు అమ్మవారి తామసానికి ఆదిశంకరాచార్య బలిఅయి ఉంటాడని భయబ్రాంతుడయ్యాడు. రాజుతో పాటు పరివారం, అంత:పుర కాంతలు ఆలయము వైపు పరుగులు తీశారు. ఆ యువక యోగి మరణిస్తే, తాను జీవించి ఉండడము అనవసరం అనుకున్నాడు. ఆ నిర్ణయానికి వచ్చి, కత్తి దూసి ఆత్మాహుతికి సిద్ధమై, ఆలయ ప్రవేశము చేసిన మహారాజుకు, ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులు క్రొత్త శ్రీచక్రానికి కాస్త దూరంలో నిల్చుని ఉన్నారు. వారిని స్తోత్రము చేస్తూ తన్మయత్వములో మునిగి ఉన్న ఆదిశంకరులు ధృగ్గోచరమయ్యారు. 

పాండ్యరాజు "స్వామీ! నీవు జీవించే ఉన్నావా! నన్ను ఘోర నరకములో పడకుండా చేశావా! అంటూ ఆదిశంకరునికి, ఆదిదంపతులకు మ్రొక్కాడు. తల్లీ! మరల నీసాత్విక రూపాన్ని కళ్లారా చూస్తున్నాను అని వారి పాదాలను అభిషేకించాడు. సుందరేశ్వరుడన్నాడు "నాయనా పాండ్యరాజా! ఇక నీవు ఆవేదన పడవద్దు. ఆదిశంకరుల శ్రీచక్రప్రతిష్ఠతో మీ ఇంటి ఆడపడుచు అయిన మీనాక్షి ఇక రాత్రివేళ తామస శక్తిగా మారదు. శ్రీచక్రమును దర్శించినా, స్పర్శించినా, న్యాయబద్ధమైన, యోగ్యమైన, అర్హత కలిగిన సర్వకోరికలు నెరవేరుతాయి. ఈ తెల్లవారినుండే శ్రీచక్రార్చనకు నాంది పలుకుదాము. అమ్మవారి శ్రీచక్రము అమ్మవారి ప్రతిబింబము. శ్రీచక్రము ఎక్కడ ఉంటే అక్కడ అమ్మవారు కొలువై ఉన్నట్లే. గృహాలలో పవిత్రముగా ఉంచుకొని, నియమనిష్టలతో ఉంటే ఫలితము కలుగుతుంది సుమా!"పాండ్యరాజును అమ్మవారు ఆశీర్వదించినది. 

ఆదిశంకరులు చిత్రించి, ప్రాణప్రతిష్ఠ చేసిన శ్రీచక్రము మధురమీనాక్షి ఆలయములో భూమిలోనికి వెళ్లి ప్రతిష్ఠితమైపోయినది. ఆ యంత్రప్రభావము కోటానుకోట్ల రెట్లు పెరిగిపోయి అదృశ్యముగా నిక్షిప్తమైనది. అర్హులైన భక్తులు ఆ యంత్రప్రాంతములో మోకారిల్లి, నమస్కరించినపుడు వారి హృదయములో ప్రకంపనలు కల్పించి ఆశీర్వదిస్తుందాయంత్రము.
పాండ్యరాజు తన జన్మ సార్ధకమైనదని ఆనందించాడు. 

నాయనా! శంకరాచార్యా, నీజన్మ ధన్యమైనది, నీవు కారణజన్ముడవు. మరేదయిన వరము కోరుకో! అన్నది అమ్మవారు. ఏ వరము వద్దు తల్లీ! నా నోటి వెంట నీవు పలికించే ప్రతి స్తోత్రము లోనూ, మీ స్మరణ ఎడతెగకుండా అక్షరరూపమై విరాజిల్లేటట్టుగానూ, ఆ శ్లోకాలు భక్తి శ్రద్ధలతో పఠించే  వారి జీవితాలు ధన్యమయేట్టు గాను,నాకు ఈ వైరాగ్యము అచంచలముగా కొనసాగి, నా శరీరపతనము ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగేదీ, ఎవరికీ అంతుబట్టని విధముగా ఉండాలి. నన్ను నీ పాదాలలో ఐక్యము అయిపోయేటట్లు ఆశీర్వదించు తల్లీ! అన్నాడు.
అలాగే నాయనా! తథాస్తు అన్నది అమ్మవారు.  తెల్లవారినది. ఆలయములో అమ్మవారు, స్వామి వారు యధాస్థానాలలో అర్చా మూర్తులుగా వెలిశారు. 

శంకరులు చేసిన శ్రీచక్రనమూనాలు  విశ్వకర్మలకు అందాయి. శ్రీవిద్యోపాసకులకు, శ్రీవిద్య పట్ల ఆసక్తి, భక్తి, అకుంఠిత విశ్వాసము ఉన్న వారికి శ్రీచక్రార్చన నియమముగా చేసే వారికి, లలితా సహస్రనామము తప్పులు లేకుండా పారాయణ చేయగా  చేయగా అర్హత సాధించుకున్న వారికి అందుబాటులోకి వచ్చేసాయి.
అమ్మవారి ప్రతిరూపాలుగా గృహాలను, గృహస్తులనూ పావనము చేస్తున్నాయి.

🙏🙏🙏🙏🙏🙏🙏

                
                   స్వస్తి

           శుభం భూయాత్!