Saturday, 13 July 2019




*స్వామి వివేకానంద స్ఫూర్తి...

*నిజమైన విజయానికి, నిజమైన సుఖానికి గొప్ప రహస్యం ఇది; ఎవరు ప్రతిఫలాన్ని ఆశించరో, ఎవరు పూర్తిగా నిస్వార్ధపరులో వారే అందరికంటే ఎక్కువగా విజయవంతులు కాగలరు.*

*ఆటపాటల్లో, వేషభాషల్లో, సుఖదుఃఖాల్లో, అన్ని దైనందిన అలవాట్లలో నీతి తప్పని ధీరలై జీవించండి. అలాంటి ఆదర్శంతో జీవితాన్ని నిర్మించుకుంటే ఇతరులు కూడా మిమ్మల్ని అనుసరిస్తారు.*

*ఒకరు మహామేధావిగా ఉండవచ్చు. అయినా ఆధ్యాత్మికంగా అతడు శిశువుగానే ఉండొచ్చు.

*వికాసమే జీవితం, సంకుచితత్వమే మరణం. ప్రేమే జీవితం, ద్వేషమే మరణం.

*స్వాధీనంలో లేకుండా, పెడత్రోవ పట్టిన మనస్సు మనల్ని మరింత కిందికి దిగజార్చి నాశనం చేస్తుంది. స్వాధీనంలో ఉండి, సరైన త్రోవ చూపెట్టిన మనస్సు మనల్ని రక్షిస్తుంది. ముక్తిని ప్రసాదిస్తుంది.
*నీలో అనంతశక్తి ఉందని విశ్వాసం కలిగి ఉండు. జాగరూకుడవై ఆ శక్తిని వ్యక్తపరచు. "నేను ఏదైనా సాధించగలను". అని సంకల్పించు. పాము విషం కూడా గట్టిగా తిరస్కరిస్తే మీపట్ల నిర్వీర్యమైపోతుంది. "చేయలేను" అని అనవద్దు. ప్రతికూల భావనలు రాకూడదు జాగ్రత్త!
*లోపం ఉన్నదని భావించడమే లోపాన్ని సృజిస్తున్నది. బలం, పరిపూర్ణతల గురించి భావించడమే లోపాన్ని సరిదిద్దగలదు.

*మనం చేసే ప్రతి ఆలోచన మన శరీరాలు అనే ఇనుప ముద్దలపై పడే చిన్న సుత్తి దెబ్బల లాంటిది. దాని నుండి మనం ఏమి కావాలని అనుకుంటున్నామో అలా రూపొందుతాం. మన ఆలోచనలు ఎలా తయారు చేస్తే అలా అయ్యాం మనం. అందువల్ల మీరేం ఆలోచిస్తున్నారు అనే దాని పట్ల జాగ్రత్త వహించండి.
*మనస్సు శాంతితో, ఏకాగ్రతతో ఉన్నప్పుడే, మన శక్తి అంతా ఉత్తమ కార్యసాధనలో వినియోగపడగలదు. ఈ ప్రపంచంలో ప్రభవించిన ఉన్నతమైన కార్యశీలుర జీవితచరిత్రలను చదివితే వారంతా స్థిరచిత్తులని గ్రహించగలరు.
*శరీరాన్ని గురించి మనమెంత తక్కువగా ఆలోచిస్తే అంత మంచిది. ఎందుకంటే, మనలను కిందికి దిగలాగేది ఈ శరీరమే. సంగత్వం, దేహాత్మబ్రాంతి - ఇవే మన దుఃఖాలకు కారణం.
*మన చుట్టూ ఉండే విషయాలు ఎన్నటికీ మెరుగుపడవు. అవి ఎప్పుడూ ఒకేలా ఉంటాయి. వాటిలో మనం తెచ్చిన మార్పుల ద్వారా మనమే పరిణతిని పొందుతాం.

*రాత్రీ పగలూ ఒక్కటిగా కూడజాలవు. రాముడు కాముడు ఒక్కచోట ఉండలేరు.
*లక్ష్య వస్తువుపై ఏకాగ్రత పెంచుకోవడానికి ముందు మీరు ఇతర విషయాల పట్ల ఆసక్తిని తగ్గించుకోవాలి.
*పిరికితనాన్ని మించిన మహాపాతకం మరొకటి లేదు. పిరికిపందలు రక్షించబడరు. అది నిశ్చయం.

*విజయం పొందాలంటే, మొక్కవోని పట్టుదలను, ప్రబలమైన సంకల్ప శక్తిని నీవు కలిగి ఉండాలి. 'నేను సముద్రాన్నే తాగేస్తాను. నా సంకల్ప శక్తితో పర్వతాలు కూడా పొడి పొడి కావలసిందే! అని పట్టుదల గలవాడు అంటాడు. అటువంటి వీర్యోత్సాహంతో, ధృఢ సంకల్పంతో కష్టపడి పని చేయి. తప్పక గమ్యాన్ని చేరతావు.

*ఒక ప్రాపంచిక క్షుద్రకీటకం మాదిరి చావటంకంటే, సత్యాన్ని భోధిస్తూ కార్యరంగంలో మరణించటం ఉత్తమం.

*స్త్రీకి గాని, పురుషుడుకి గాని - హృదయపవిత్రతే మొదటి సుగుణం.

*మనం తలపెట్టిన ప్రతీ కార్యంలోను మెచ్చుకొనేవారు కొందరు, తప్పులెన్నేవారు కొందరు ఉంటారు.

*మీలోని దివ్యత్వాన్ని పెంపొందించేది పుణ్యం; పాశవికతను పెంచేది పాపం.
*ఏ వ్యక్తి అయినా, ఏ దేశమైనా ఉన్నత స్థితికి చేరుకోవాలంటే మూడు లక్షణాలు అవసరం. అవి-
1. మంచితనానికి ఉన్న శక్తి పట్ల అఖండ విశ్వాసం.
2. అసూయ, అనుమానం లేకుండా  ఉండడం.
3. మంచిగా ఉండాలనుకునే వారికీ, మంచి చేయదలచుకునే వారికి తోడ్పడటం.
*లేవండి! మేల్కొనండి! ఇకపై నిద్రించకండి (అజ్ఞానాంధకారము నుండి బయటకు రండి). ప్రతి ఒక్కరిలోనూ కోరికలు, దుఃఖాలను తొలగించుకొనే శక్తి ఉంది. నమ్మండి! అప్పుడు ఆ శక్తి ప్రకటితమవుతుంది.
*ధీరులూ, సమర్ధులైన కార్యసాధకులకే అదృష్టం అనుకూలిస్తుంది. దిగంతాలను తాకే వీరోచితమైన ధైర్యోత్సాహాలతో ప్రయత్నిస్తూ కడదాకా వేచి ఉండేవారే అధ్బుతాలను సుసాధ్యం చేయగలరు.
*ప్రతీ వ్యక్తి సొంత ఆదర్శాన్ని తీసుకుని, దానిని సాధించడానికి ప్రయత్నించాలి. తానెన్నటికీ సాధించే ఆశ లేని ఇతరుల ఆదర్శాలను ఆచరించడం కంటే, తను నమ్మిన ఆదర్శాన్ని సాధించే వరకు ప్రయత్నించడమే పురోగతికి ఖచ్చితమైన మార్గం.

*నాయనలారా! నిజమైన మానవులవ్వండి. అదే నేను కోరేది. దీనిలో మీరు కొంతైనా విజయం సాధించినా, నా జీవితం సార్ధకమైనట్లు భావిస్తాను.
*ధ్యైర్యం, నీతిపరత్వం తప్ప నా బిడ్డలైన మీకు మరే మతం అవసరం లేదు.
*కృతజ్ఞత, అతిధిసత్కారం భారతీయుల ప్రత్యేక లక్షణాలని మనం గుర్తించాలి.

 
*ఒక సత్కార్యాన్నో ఘనకార్యాన్నో నువ్వు చెయ్యాలనుకుంటే దానికి ఎలాంటి ఫలం కలుగుతుందో అనే చింతన నీకు ఉండకూడదు.*

*పద్మం వికసించినప్పుడు దానిలోని మకరందం కోసం తేనెటీగలు వాటంతట అవే వస్తాయి.  అదేవిధంగా మీలోని 'సౌశీల్యం' అనే పద్మాన్ని పూర్తిగా వికసించనివ్వండి. అప్పుడు ఫలితాలు వాటంతట అవే చేకూరతాయి.*

*_విశ్వాసమే బలం_*

*నీలో అనంతశక్తి ఉందని విశ్వాసం కలిగి ఉండు. జాగరూకుడవై ఆ శక్తిని వ్యక్తపరచు. "నేను ఏదైనా సాధించగలను" అని సంకల్పించు. పాము విషం కూడా గట్టిగా తిరస్కరిస్తే మీపట్ల నిర్వీర్యమైపోతుంది. జాగ్రత్త! "చేయలేను" అనవద్దు. ప్రతికూల భావనలు రాకూడదు.*

*అధ్భుతానికి, నిస్వార్ధానికి, శ్రమకు, అనుగ్రహానికి, మాతృత్వానికి ఆదర్శం భారతీయ మహిళ.*

*మన ప్రస్తుత స్థితికి మనమే భాద్యులం. ఏం కాగోరుతామో ఆ విధంగా అవడానికి మనకు శక్తి ఉంది. మన వర్తమాన స్థితికి పూర్వకర్మల ఫలితమైతే మనం పొందగోరే స్థితి ప్రస్తుత కర్మల ఫలితంగా పొందవచ్చునని నిశ్చయమోతుంది. కాబట్టి ఎలా ప్రవర్తించాలో మనం తెలుసుకోవాలి.*

*అభివృద్ధి చెందడానికి మొదట మనపై, తరువాత భగవంతునిపై విశ్వాసం కలిగి ఉండాలి. తనపై విశ్వాసం లేనివానికి భగవంతునిపై విశ్వాసం కలగడం కల్ల.*

*భగవంతుణ్ణి ఏ పేరుతో పిలిచినా చివరకు చేరుకొనేది ఒకే గమ్యానికే.*

*_విశ్వాసమే బలం_*

*విశ్వాసం! విశ్వాసం! ఆత్మవిశ్వాసం! భగవంతునిపై విశ్వాసం! ఇదే ఔన్నత్య రహస్యం!*

రాబోయే  కాలం లో పిల్లలకి   "A.B.C.D"       లు ఇలా వుంటాయ్
            👇
A _ Android , B_ Bluetooth., C_ Chating, . D_ Download., E_ Email
F_ Facebook., G_ Google ., H_ Hotspot ., I_ Instagram ., J_ Java
K_ Kingston ., L_ Laptop ., M_ Message ., N_ Nokia ., O_ online
P_ Print ., Q_ Quikr  ., R_ Ram ., S_ Skype ., T_Twitter
U_ USB  ., V_ Virus ., W_ Wi Fi ., X_  xender ., Y_ Youtube  And ni Z_ Zero Marks In Exam...