ప్రాంజలి ప్రభ చైతన్య గీతం (11))
రచయిత: మల్లాప్రగడ రామకృష్ణ
మనసుకు మనసు తోడు లేనిదే స్మరణ ఉండదు
వయసుకు వలపు తోడు లేనిదే జీవితమే ఉండదు
అందుకే నేను అంటా "ఓ శ్రీ రామ స్మరణం "మోక్షదాయకం
ఆనంద నిలాయానికి ఆధారం ఆరోగ్యామృత స్మరణం
గణితం గతి స్మరణం
చరితం చిర స్మరణం
భారతం మధు స్మరణం
వనితం ప్రియ స్మరణం
మనసుకు మనసు తోడు లేనిదే స్మరణ ఉండదు
వయసుకు వలపు తోడు లేనిదే జీవితమే ఉండదు
యుగళం స్నేహ స్మరణం
తమకం సిరి స్మరణం
పరువం ప్రేమ స్మరణం
నమకం శివ స్మరణం
అందుకే నేను అంటా "ఓ శ్రీ రామ స్మరణం "మోక్షదాయకం
ఆనంద నిలాయానికి ఆధారం ఆరోగ్యామృత స్మరణం
విదితం వీర స్మరణం
కమలం భాను స్మరణం
గరళం రుద్ర స్మరణం
మకుటం రాజు స్మరణం
మనసుకు మనసు తోడు లేనిదే స్మరణ ఉండదు
వయసుకు వలపు తోడు లేనిదే జీవితమే ఉండదు
చమకం ఋషి స్మరణం
సకలం విద్యా స్నరణం
ముభావం ధూర్తి స్మరణం
మురిపం రాధా స్మరణం
అందుకే నేను అంటా "ఓ శ్రీ రామ స్మరణం "మోక్షదాయకం
ఆనంద నిలాయానికి ఆధారం ఆరోగ్యామృత స్మరణం
ఫలితం నామ స్మరణం
విరహం వేశ్య స్మరణం
బ్రమరం లోక స్మరణం
విషమం మూర్ఖ స్మరణం
మనసుకు మనసు తోడు లేనిదే స్మరణ ఉండదు
వయసుకు వలపు తోడు లేనిదే జీవితమే ఉండదు
వినయం విధి స్మరణం
ప్రణయం పెల్లి స్మరణం
అజ్ఞానం కోప స్మరణం
విజ్ఞానం జీవి స్మరణం
మనసుకు మనసు తోడు లేనిదే స్మరణ ఉండదు
వయసుకు వలపు తోడు లేనిదే జీవితమే ఉండదు
అందుకే నేను అంటా "ఓ శ్రీ రామ స్మరణం "మోక్షదాయకం
ఆనంద నిలాయానికి ఆధారం ఆరోగ్యామృత స్మరణం
--((**))--
ప్రాంజలి ప్రభ చైతన్య గీతం (10 )
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
నీవే నా అణువణువునా ఉన్నావు క్షమించు
నా అంతరాత్మకే ఎన్నో ఆశలు నింపావు క్షమించు
నీ మాటలు నా మనసుకి జ్ఞప్తికి వచ్చును క్షమించు
ఓ మధుసూధన మాధవ మురారీ క్షమించు
ఒప్పే చెప్పాలనుకున్నా క్షమించు
తప్పే చేసానని ఉన్నా క్షమించు
కోపం తోపల్కియు ఉన్నా క్షమించు
నమ్మే మౌనం కలదన్నా క్షమించు
పాటే ప్రాణం అనుకున్నా క్షమించు
మాటే పట్టింపను కోలే క్షమించు
చరణం
పెదాల పదాలు పల్కు క్షమించు
నరాల కదల్చు పల్కు క్షమించు
చిరాకు వదల్చు పల్కు క్షమించు
తరించి కుదించె పల్కు క్షమించు
నా మనవి చిత్తగించి నన్ను బుజ్జగించి క్షమించు
నీ తెలివి అప్పగించి నన్ను బుజ్జగించి క్షమించు
నా పలుకు ఆలోచించి నన్ను బుజ్జగించి క్షమించు
నీ కొరకు వేచి ఉన్న నన్ను బుజ్జగించి క్షమించు
చూపులలో మార్పును గమనించి క్షమించు
తీర్పులలో ఓర్పును గమనించి క్షమించు
మార్పులలో కూర్పును గమనించి క్షమించు
మాటలలో నేర్పును గమనించి క్షమించు
ఒప్పే చెప్పాలనుకున్నా క్షమించు
తప్పే చేసానని ఉన్నా క్షమించు
కోపం తోపల్కియు ఉన్నా క్షమించు
నమ్మే మౌనం కలదన్నా క్షమించు
పాటే ప్రాణం అనుకున్నా క్షమించు
మాటే పట్టింపను కోలే క్షమించు
నీవే నా అణువణువునా ఉన్నావు క్షమించు
నా అంతరాత్మకే ఎన్నో ఆశలు నింపావు క్షమించు
నీ మాటలు నా మనసుకి జ్ఞప్తికి వచ్చును క్షమించు
ఓ మధుసూధన మాధవ మురారీ క్షమించు
--((**))--
ప్రాంజలి ప్రభ చైతన్య గీతం - 9
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
దేశాన్ని హరితవనం గా మార్ఛరా
ఆహారం పొంది ఆరోగ్యంగా బతకరా
మన:శాంతికి అదే ముఖ్య లక్ష్యం రా
కామధేనువు కల్పతరువు అవ్వా లంటే
జంతువులన్నీ అంతరించ కుండా చూడాలి .
భూమి సస్య శ్యామలమై పంట పండాలంటే
ధర్మం, న్యాయం, సత్యంగా మొక్కలను పెంచాలి .... దేశాన్ని
ప్రాణ వాయులిచ్చి ఫలము లొసగా లంటే
చెట్లకు మందు లేసి నీరుపోసి పెంచాలి
ముందు తరములకు మేలు కలుగా లంటే
మొక్క విలువ తెల్సి నడువ గలగాలి ..... ... దేశాన్ని
కార్మిక, కర్షకలు, ఏకమై శ్రమించాలి
అడవిలో మనుష్యులు బ్రతికుండాలంటే
అడవిలో సంపదంత వృద్ధి పరచాలి ... దేశాన్ని
కంటికింపుగా కన్పడే చెట్లను పెంచాలి
ఋషులకు నెలవులు నిత్యం అవ్వాలంటే
అడవుల్ని, వనాల్ని, రక్షణ కల్పించాలి ... దేశాన్ని
మొక్కల నాటి, నీరు పోసి, నిత్యం పెంచాలి
అజ్ఞానంతో చెట్లను నరక కుండాలంటే
ప్రత్యేక రక్షణా వ్యవస్థను కల్పించాలి ... దేశాన్ని
చెట్టు, పుట్ట, జలాలు సక్రమంగా ఉంచాలి
చెట్టు ఇలవేల్పు ఇంటింటా పెంచుతూఉంటే
మీ ఆరోగ్యానికి మందని గమనించాలి ... దేశాన్ని
ఆహారం పొంది ఆరోగ్యంగా బతకరా
మన:శాంతికి అదే ముఖ్య లక్ష్యం రా
ప్రాంజలి ప్రభ చైతన్య గీతం -8-
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
గతాన్ని మరచిపోండి
వర్తమాన్నాన్ని ఆస్వాదించండి
భవిషత్తుకు పునాది వేసుకోండి
ముగ్గులతో అందంగా ఉంచాలి లోగిళ్ళు
నిత్యం మంగళ తోరణాలతో ఉంచాలి వాకిళ్లు
జీవిత గమ్యానికి వేసు కోవాలి పునాది రాళ్లు
కొందరిని ఎదుర్కోలుతో చూపాలి సవాళ్లు ....... గతాన్ని
వేపపూతలో చేదును గ్రహించి తొలగించు కుళ్ళు
కోయిల కూతలతో మురిపించి మరిపించాలి కళ్ళు
చేదు కారం తీపి వగరు పులుపు కలగలుపు మళ్ళు
మారిన మార్పుకాలానను సరించు ఉంచుకో వళ్ళు .... గతాన్ని
నిత్యం సుఖ శాంతులను అందించేవి కౌగిళ్ళు
న్యాయ సంకల్పం దృఢమైతే వుండవు సంకెళ్లు
ధర్మం తప్పక గర్వం చూపక చూపాలి పరవళ్లు
పూజ పుర స్కారాలతో ఆనందపర్చే తిరునాళ్ళు ..... గతాన్ని
గతాన్ని మరచిపోండి
వర్తమాన్నాన్ని ఆస్వాదించండి
భవిషత్తుకు పునాది వేసుకోండి
--((**))--
ప్రాంజలి ప్రభ చైతన్య గీతం -7
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
ప్రతి ఒక్కరికి యుగాది పండుగ ప్రాంజలి ప్రభ
శుభాకాంక్షలు తెలియపరుస్తున్నది
యుగాది పచ్చడి రుచి చూడు
పంచాంగము ద్వారా భవిషత్తు విను
అంధకారం తొలగించే
అధికరాన్ని ఓటు ద్వారా ఎన్నుకో
సంపద స్థిరం కాదు
ఆశ అసలే వద్దు
న్యాయ మార్గ స్వల్పధనం శ్రేష్టం
వక్రమార్గపు బుద్ధి పాప హేతువు
అధికరాన్ని ఓటు ద్వారా ఎన్నుకో
ప్రాణికోటికి హిత మొనర్చే
నదులు చెరువులు సంధానం చేసే
ఫల వృక్షములు పెంపు చేసే
అందమైన నగరం గా మార్చే
అధికరాన్ని ఓటు ద్వారా ఎన్నుకో
ఉచిత విద్యా సహకరించే
నిరుద్యోగ బ్రుతి అందచేసే
కల్యాణానికి ధనం సహకరించే
అతితక్కువ రేటుకు ఆహరం అందించే
అధికరాన్ని ఓటు ద్వారా ఎన్నుకో
తెలుగుదేశ ప్రగతికి తోడ్పడే
ఆత్మగౌరవాన్ని నిలబెట్టే
కూడు, గుడ్డ, గూడు కల్పించే
కలాలకు అతీతంగా ఉండే
అధికరాన్ని ఓటు ద్వారా ఎన్నుకో
రోగానికి సహకరం అందించే
మరణ ఖర్చుకు సహయం అందించే
అప్పుల బాధను తొలగించే
అత్మియతగా ఆదుకొనే
అధికరాన్ని ఓటు ద్వారా ఎన్నుకో
యుగాది పచ్చడి రుచి చూడు
పంచాంగము ద్వారా భవిషత్తు విను
అంధకారం తొలగించే
అధికరాన్ని ఓటు ద్వారా ఎన్నుకో
--((**))--

ప్రాంజలి ప్రభ చైతన్య గీతం -6
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
నన్ను నీవు మరిచావు
నిన్ను నేను మరువ లేకున్నాను
నేనే నువ్వు, నువ్వే నేను అనుకున్నాము
ఊపిరి సలపని ఊహై నిలిచావు
ఊహల కందని ఉనికై మిగిలావు
మాటల కందని మనసై నలిగావు
జాబిల్లి కందని తారవై జరిగావు ..... నన్ను
ఆకలి తీర్చని అరుగై అలిగావు
వాకిలి తెర్చిన పొదుపై మిగిలావు
కావడి మోసిన మనిషై మరిచావు
కౌగిలి చిక్కక చినుకై తడిపావు ..... నన్ను
కలసి కలవని బతుకై నిలిపావు
తలచి తలవని తలపై తడిపావు
మరచి మరవని మెరుపై మురిసావు
కళలు కరగని నిజమై కలిసావు ...... నన్ను
నన్ను నీవు మరిచావు
నిన్ను నేను మరువ లేకున్నాను
నేనే నువ్వు, నువ్వే నేను అనుకున్నాము
యదపొంగుల ఆశ తీర్చావు
--((**))--

రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
ఏమని చెప్పేది ఎలా చెప్పేది
ఎండి పోయిన బతుకుకు దారేది
కాన్నీరు తుడిచి ఆదుకొనే పార్టీ ఏది
ఆ పార్టీకే ఓటు అని ఎలా చెప్పేది
గుండెలు మండుచుండెన్
బండగ బారి కరగ కుండెన్
మెండు శక్తి వ్యర్ధమయ్యెన్
అండ లేని బ్రతుకయ్యెన్ ..... ఏ
వడగళ్ల వడి మనస్సయ్యెన్
జడివాన జత కరువయ్యెన్
తడి పొడి ఖర్చు మోపయ్యెన్
కుండ వంటి మేను మండెన్ ..... ఏ
వడుదుడుకుల వరుసయ్యేన్
కడు కన్నీరు కధల్గా మారెన్
నడ వడి నడకల్గా మారెన్
గడబిడి గంతుల జీవితమయ్యేన్ .... ఏ
ఏమని చెప్పేది ఎలా చెప్పేది
ఎండి పోయిన బతుకుకు దారేది
కన్నీరు తుడిచి ఆదుకొనే పార్టీ ఏది
ఆ పార్టీకే ఓటు అని ఎలా చెప్పేది
--((**))--

ప్రాంజలి ప్రభ చైతన్య గీతం -4
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
చేసిన పుణ్యమే దక్కు ఫలమురా
ఎంతటెంతటి సిరులున్న ఏమి ఫలము
ఎన్ని సుఖములు కలిగిన ఏమి ఫలము
బిడ్డల మమకారము పొందక ఏమి ఫలము
బిడ్డల సఖ్యత నుండకపోతే ఏమి ఫలము
ఏమి ఫలము, ఏమి ఫలము, అనకురా
చేసిన పుణ్యమే దక్కు ఫలమురా
ఉన్నత ఉద్యోగము ఉన్న ఏమి ఫలము
అతివసుఖ మనుభవించిన ఏమి ఫలము
ఆశతీర త్రాగి ఆడినా పాడినా ఏమి ఫలము
అహంకారం అంటి పెట్టుకున్నా ఏమి ఫలము
ఏమి ఫలము, ఏమి ఫలము, అనకురా
చేసిన పుణ్యమే దక్కు ఫలమురా
పరువు ప్రతిష్ట అని పాకులాడిన ఏమి ఫలము
విజ్ఞానం ఉన్నా అజ్ణాణంగా ఉంటే ఏమి ఫలము
సంసారంలోచిక్కి భాద్యత మరిస్తే ఏమి ఫలము
వయసులో ఉండి దైవాన్నే మరిస్తే ఏమిఫలము
ఏమి ఫలము, ఏమి ఫలము, అనకురా
చేసిన పుణ్యమే దక్కు ఫలమురా
చేసిన పుణ్యమే దక్కు ఫలమురా
చేసిన పుణ్యమే దక్కు ఫలమురా
--((**))--

ప్రాంజలి ప్రభ చైతన్య గీతం -3
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
చావుకు అంతం లేదు
జీవితానికి పొంతన లేదు
గంగ సంద్రంలో కల్వక తప్పదు
ఎంత వారైన కాటికి చేరక తప్పదు
సొగసైన స్త్రీ పొందినా
ఉత్తమ పుత్రులుదయించినా
సిరి సంపదలతో తులతూగినా
దృఢమైన యవ్వనం సంక్రముంచినా
కాలంతో పాటు ధర్మాలు చేసినా
కాటికి చేరక తప్పదు కలియుగానా ..... చా
కవిత్వాలు ఎన్ని చెప్పినా
అపూర్వ గళముతో గానము చేసినా
రమణీయ దృశ్యాలను గాంచినా
రాయిని అందమైన శిల్పం మార్చినా
సకల మంత్రాలు నేర్చుకొని ప్రయోగించినా
కాటికి చేరక తప్పదు కలియుగానా ..... చా
తల్లి తండ్రులను పూజించినా
గురు సేవలను నిత్యం చేసినా
సమ బుద్ధితో శాంతిని కల్పించినా
దేశ సేవకు సహకరించినా
వేదపారాయణం గావించినా
కాటికి చేరక తప్పదు కలియుగానా ..... చా
అందుకే ప్రేమించి, ప్రేమను పంచితే
ప్రజల హృదయాలలో ఉంటావు ఈ జగనా
చావుకు అంతం లేదు
జీవితానికి పొంతన లేదు
గంగ సంద్రంలో కల్వక తప్పదు
ఎంత వారైన కాటికి చేరక తప్పదు ... తప్పదు .. తప్పదు
--((**))--
ప్రాంజలి ప్రభ చైతన్య గీతం- 2
మల్లాప్రగడ రామకృష్ణ
సత్య మైన నీ మనసు
అను రాగమై పలికెను సత్యంగా
నిత్య మైన నీ భావము
భవ్య రాగమై పలికెను నిత్యంగా
కలిసొచ్చిన విధియే
కదిలొచ్చిన గతియే
వెన్నుతట్టిన నిధియే
కన్నులలో కాంతియే
నీ మనసుతో సమమాయే
హృదయంలో నింపె శాంతియే.... సత్య
ఎవరు ఏమన్నా సరే
యదలో నవ్వులు పంచుటయే
నీడలా వెంటాడినా సరే
సుఖాన్ని నీకు అందించుటయే.... సత్య
పున్నమి వెన్నెల కమ్మినా సరే
మనసుతో పంచుకొను మమతయే
సుందరస్వప్నాలు కమ్మినా సరే
సుఖాలు పొందు మన:శాంతియే....సత్య
నేలపైన నింగి ఉన్నా సరే
కమ్మిన వెతలు తొలగించుటయే
నింగి క్రింద నేల ఉన్నాసరే
నిగ్రహాశక్తితో శాంతినిపంచుటయే
సత్య మైన నీ మనసు
అను రాగమై పలికెను సత్యంగా
నిత్య మైన నీ భావము
భవ్య రాగమై పలికెను నిత్యంగా
--((**))--
ప్రాంజలి ప్రభ చైతన్య గీతం (1)
మల్లాప్రగడ రామకృష్ణ
అమ్మా ఆదుకో ... అమ్మా ఆదుకో ...
ఆత్మస్వరూపిణి ఆదుకో ..
అది పరాశక్తి ఆదుకో ..
అఖిలాండకోటి సూత్రధారి ఆదుకో .... 2
వేద వేదంగ వేదాంత వేదవతి
అఖిల విద్యా సంధాన సరస్వతి
సకల కళాతీత మంగళ రూపిణి
నిత్య సౌభాగ్య ఆనంద దాయిణి ..... అమ్మా ..
సకల పాప వినాసిని
సంసారాబ్ది దు:ఖహారిణి
సమస్త గుణ సంధాయిణి
విశ్వ ప్రేమ స్వరూపిణి .... అమ్మా
సమస్త శ్రమ నివారిణి
గీర్వాణ జ్ఞాన స్వరూపిణి
త్వమేవ సంధ్యా గాయిత్రి
చైతన్య ప్రాంజలి ప్రభ వాగ్దేవి ..... అమ్మా
--((**))--
ప్రాంజలి ప్రభ చైతన్య గీతం - 20
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
ఈ గీతం ఎవరికోసం ఎవరికోసం ... ...
ఈ గీతం ఎవరికోసం ఎవరికోసం ... ...
పెరుగులెట్టే మనసును ఆపగలదా
పేదరికాన్ని రూపు మాపగలదా
ఈ లోకంలో సత్యాన్ని బతికించ గలదా
ఈ గీతం ఎవరికోసం ఎవరికోసం .....
ఈ గీతం ఎవరికోసం ఎవరికోసం ....
ఆశలన్నీ ఒడిసిపట్టి సేవచేసే తల్లి బాధ తీర్చ గలదా
దీక్షగా సహకరించి ఆదుకుంటున్న తండ్రిని ఆదుకోగలదా
కంటి చుక్క దిగమింగి సుఖాన్నిచ్చే అవనిని ఓదార్చ గలదా
చిత్తశుద్ధి విధిగా మేఘాన్ని కురిపించే అంబరాన్నీ ఆపగలదా
ఈ గీతం ఎవరికోసం ఎవరికోసం .....
ఈ గీతం ఎవరికోసం ఎవరికోసం ....
నవచరిత సృష్టించే భారత మాత దాస్య శృఖలాలని విడిపించగలదా
మేలుకొలుపుతో వెలుగును పంచె సూర్యుడ్ని నిలపగలదా
చల్లని గాలిలో వెన్నెలనుపంచె చంద్రుడ్ని వద్దనగలదా
పరిమళాలను అందించే లతలను ఆస్వాదించే తుమ్మెదలను ఆపగలదా
ఈ గీతం ఎవరికోసం ఎవరికోసం .....
ఈ గీతం ఎవరికోసం ఎవరికోసం ....
పరుగులెటో తెలియని ఈ..లోకానికి ఆదర్శం.. చెప్పగలదా
ఏమి చదివెనో ఏమో..మనోవేగ మధిగమించె..దారి చూప గలదా
కసికన్నా గురువెవ్వరు..సంకల్పమె అసలు బలం.. అని చెప్ప గలదా
దేశాలే అవాక్కైన..సమయం వ్యర్ధమైనా మనుష్యుల బుద్ధిని మార్చగలదా
ఈ గీతం ఎవరికోసం ఎవరికోసం .....
ఈ గీతం ఎవరికోసం ఎవరికోసం ....
పెరుగులెట్టే మనసును ఆపగలదా
పేదరికాన్ని రూపు మాపగలదా
ఈ లోకంలో సత్యాన్ని బతికించ గలదా
--((**))--
ప్రాంజలి ప్రభ చైతన్య గీతం - 19
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
మనసును కించ పరుచుకోలేక,
మనుఁగడకు దారిలేక,
మోనంగా ఉండి వ్రాస్తున్నా లేఖా....
కొందరి జాతకాలు అగమ్య గోచరాలని అనలేక
కాలంతో సర్దుకు పోయే గుణాన్ని పంచు కోలేక
ఉన్న దానితో తృప్తిని పొందలేక
ఎదో వెలితి ఎద పొంగులను చల్లార్చుకోలేక వ్రాస్తున్నా లేఖా
మన హృదయాలు కన్నీటి ధారలాగా మారి
కవి హృదయాన్ని కదిలించలేక పోతున్నాయా
హృదయజ్వాలను చల్లార్చే మార్గం లేక
రవి కాంచని ప్రదేశము కాన రాక
కవి కాంచని వ్యధలను నీకు తెలపలేక
నమ్మిన నీతులు బతికించుకోలేక
కమ్మిన చీకట్లు తొలిగించుకోలేక
సోకించే బ్రతుకుని బ్రతికిచుకోలేక
వీడలేని స్వార్దముతో, చెప్పుకోలేని
విశ్వాసముగా ఉండలేక, జీవచ్ఛవంగా
మనలేక వ్రాస్తున్న నీకు లేఖా ....
బాధను పంచలేక,
మనసును కించ పరుచుకోలేక,
మనుఁగడకు దారిలేక,
మోనంగా ఉండి వ్రాస్తున్నా లేఖా.
--((**))--
ప్రాంజలి ప్రభ చైతన్య గీతం - 18
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
బావా చెప్పాలను కున్నది చెప్పలేక
విన్న మాట వ్రాయటానికి మనసు రాక
మనస్సు మూగబోయిందని నీతో అనలేక
వ్రాస్తున్నా " కట్టెలా కాలి పోలేక "
కన్నీటి జ్వాల, "హృదయ తాపన్నీ" తగ్గించ లేక
కవి హృదయంతో, " మౌనరాగాన్నీ" కదిలించి లేక
రవి వెల్లువకు, "కన్ను కానరాక" కలత చెంద లేక
తీరని వ్యధను చూపలేక, మనసుతో చెప్పలేక
మనిషి నిరంతరం, చావు బతుకులమధ్య,
సుఖ దు:ఖాల మధ్య, చీకటి వెలుగుల మధ్య,
యద తాప మనలేక, కన లేక, అనలేక, ఒకటే లేఖా ......
నమ్మిన నీతులు, నడకగా, ముందుకు సాగలేక
కమ్మిన చీకట్లు, ఉదయ కలలుగా, కరిగి పోలేక
తరములు మారినా, శోకించు బతుకుకు, దారిలేక
స్వార్ధముతో, తనవాదనే, గొప్పదని ఒప్పుకో లేక
మనిషి నిరంతరం, చావు బతుకులమధ్య,
సుఖ దు:ఖాల మధ్య, చీకటి వెలుగుల మధ్య,
యద తాప మనలేక, కన లేక, అనలేక, ఒకటే లేఖా .....
బావా చెప్పాలను కున్నది చెప్పలేక
విన్న మాట వ్రాయటానికి మనసు రాక
మనస్సు మూగబోయిందని నీతో అనలేక
వ్రాస్తున్న కట్టెలా కాలి పోలేక .... పోలేక ... పోలేకా ...
--((**))--
ప్రాంజలి ప్రభ చైతన్య గీతం- 17
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
మానవుడిగా మనుగడ సాగిస్తూ సాగాలిరా
దైవాంసపై ఏకాగ్రత సాగిస్తూ బ్రతకాలిరా
నమ్ముకున్న దానిపై నమ్మకం ఉంచాలిరా
ప్రేమను పొంది అందరికి ప్రేమనందిస్తూ
వినయ విధేయతలు అందిస్తూ సాగాలిరా
నవ్వారంటే దుర్యోధనుడిలా మారక్కర్లేదు
ధనం లేకపోతే కుచేలుడిలా యాచించక్కర్లేదు
కక్ష సాదింపుకు శకుని లా మారక్కర్లేదు
ధర్మాన్ని రక్షించుటకు సారధిగా మారక్కర్లేదు
కృష్ణుని లా వస్త్రాలు అందిన్చ నక్కర్లేదు
రాముడి లా అరణ్యాలు పోనక్కర్లేదు
రావణుడిలా పట్టు పట్టి ఉండనక్కర్లేదు
విశ్వామిత్ర లా తీవ్రకృషి చేయనక్కర్లేదు
శిబి చక్రవర్తి లా మాంంసం కోసి పంచక్కర్లేదు
బలి చక్రవర్తి లా సర్వం దానం చేయనక్కర్లేదు
ధర్మరాజు లా జూదమాడి భాదను పంచక్కర్లేదు
అర్జుని లా పేడివాడుగా మారి బ్రతకక్కర్లేదు
మానవుడిగా మనుగడ సాగిస్తూ సాగాలిరా
దైవాంసపై ఏకాగ్రత సాగిస్తూ బ్రతకాలిరా
నమ్ముకున్న దానిపై నమ్మకం ఉంచాలిరా
ప్రేమను పొంది అందరికి ప్రేమనందిస్తూ
వినయ విధేయతలు అందిస్తూ సాగాలిరా
--((**))--
ప్రాంజలి ప్రభ చైతన్య గీతం -16
రచయత: Mallaapagada రామకృష్ణ
రా రా మది దోచి సుఖం పొందరా
రా రా పువ్వులొ మకరందం దోచరా
రా రా మన్మధ బాణం సంధించరా
రా రా సుధామధురిమమే అనురాగమే రా
రా రా మనోమయములే సుమభావమే రా
రా రా తమోగుణములే మనసాయనే రా
రా రా ప్రభాభవములే ప్రతిభాలయే రా
రా రా మనుష్య మమతే మది దోచగా రా
రా రా అనూహ్య శిఖరం ఇది పొందగా రా
రా రా సమత్వ సమతా ఇది ముందుగా రా
రా రా పటుత్వ పదిలం ఇది నిత్యమూ రా
రా రా పెదాల రుచియే జత చేయగా రా
రా రా పదాల సరదా జత చేసుకో రా
రా రా సుఖాల పరదా జత కల్పుకో రా
రా రా పువ్వులొ మురళీ జత చేయుకై రా
ప్రాంజలి ప్రభ చైతన్య గీతం -15
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
వ్యక్తమౌ నీ ప్రేమ మాపై - శక్తిగా మారి నిన్నే కొలిచే
యుక్తమౌ నీ బాట మాపై - ముక్తిగా మారి నిన్నే కొలిచే
సూక్తమౌ నీ వాక్కు మాపై - భక్తి గా మారి నిన్నే కొలిచే
భక్తితో నిరతమ్ము బడనీయమ్మా
భక్తి భావన లేని బ్రతుకేలనమ్మా
భక్తి యే నని మోక్షమార్గమనమ్మా
భక్తి తో నీతోడు భంధవ్వమేనమ్మా
భక్తి తో నీ పూజ చేయనీ యమ్మా
భక్తి కి రక్తి అడ్డు రానీయ కమ్మా
భక్తి తో నీపల్కు పంచనీయమ్మా
శక్తి పంచి మమ్ము ఆదుకోవమ్మా
స్వార్ధాన్ని తుంచి భక్తినిపెంచమ్మా
అర్ధాన్ని చూసుకొనేటట్లు చూడమ్మా
అర్ధంలోని పరమార్ధాన్ని తెలపమ్మా
నిస్వార్ధ భావం మాలో ఉంచమ్మా
వ్యక్తమౌ నీ ప్రేమ మాపై - శక్తిగా మారి నిన్నే కొలిచే
యుక్తమౌ నీ బాట మాపై - ముక్తిగా మారి నిన్నే కొలిచే
సూక్తమో నీ వాక్కు మాపై - భక్తి గా మారి నిన్నే కొలిచే
భక్తితో నిరతమ్ము బడనీయమ్మా - భక్తి భావన లేని బ్రతుకేలనమ్మా
అమ్మా అమ్మా పెద్దమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మా
నీ వేనమ్మ మాకు నిజమైన పెద్దమ్మా
--((**))--
ప్రకటన: "అంబికా దర్బార్ బత్తి 'వెలిగించి అమ్మను కొలుద్దాం - ఇల్లంతా పూల పరిమళాలతో నింపుదాం .
ప్రాంజలి ప్రభ చైతన్య గీతం - 1 4
- అమ్మ ఆవేదన
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
బాబు " నింద నీపై మోపను"
నీకు "అపకీర్తి తెచ్చేది చేయను"
నిన్ను మోసి "రక్తాన్ని పంచాను"
నన్ను చూడలేదని "నిందించను"
విద్యాబుద్ధులు నేర్పించినాను
వదలి వెళ్ళావని నిలదీయ్యలేను
పాలిచ్చే రొమ్మునే తన్నివెళ్ళినను
కోపంతో తిట్టి నిన్ను తక్కవ చేయను
మలమూత్ర మాలిన్యాలను మోసాను
అమ్మనే అపహాస్యం చేసావని అనను
సంపాదనను నష్ట పరిచి యున్నను
ముష్టి దానిగా మార్చినా ఏమీఅనను
అవయవాలు శక్తి తగ్గి ఉడికి ఉన్నాను
మందు ఇప్పించలేవని అసహించుకోను
వృధ్ధాశ్రమములో చేర్చి వెళ్ళి పోయినను
నా అభ్యర్ధన వినుము నిన్ను క్షమిస్తున్నాను
వళ్ళంతా రోగాలతో నిండి పోయున్నాను
స్వఛ్ఛంద మరణానికి నిన్నే కోరుతున్నాను
ఒక్క సారి వస్తే అపకీర్తి రాకుండా చేస్తాను
ప్రాణం నీవడిలో వదలాలని ఆసిస్తున్నాను
బాబు "నింద నీపై మోపను"
నీకు "అపకీర్తి వచ్చేది చేయను"
--((**))--
ప్రకటన : బాబు తలకాయ నెప్పిగా ఉన్నదా ఇదిగో "అమృతాంజనం " వ్రాసుకో వెంటనే తగ్గుతుంది
--((**))--
ప్రాంజలి ప్రభ చైతన్య గీతం (13)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
ప్రియమైన మావారు మనసిచ్చి
మదిలోని మాయను తొలగించే
ప్రియమైన నాసతి మనసిచ్చి
మదిలోని మాయను తొలగించే
ఎదురొచ్చె ప్రేమలే - ఎరుపొచ్చె మనసుకే
మనసొచ్చె ఆశకే - మమతిచ్చె మగువలే
మగువచ్చె ఆశతో - తనువిచ్చె తరుణమే
మొగుడొచ్చె కోర్కతో - వయసంత సరిగమే ... ప్రియ
మనప్రేమ మాత్రమే - బతికించు సమయమే
మన సేవ లక్ష్యమే - జతపర్చు తరుణమే
మన సోయ గాలులే - తరునిమ్చు హృదయమే
మన కళ్ళ చూపులే - చిగురించు లతలులే ... ప్రియ
వెలిగేటి దీపమే - మెరిసేటి మెరుపుయే
కలిసేటి కవ్వమే - నవనీత కరుగుటే
చిగురంత పువ్వునే - నలిపేను పరుగుతో
వలపంత దోచనే - అలుపంత కరిగినే .... ప్రియ
ప్రియమైన మావారు మనసిచ్చి
మదిలోని మాయను తొలగించే
ప్రియమైన నాసతి మనసిచ్చి
మదిలోని మాయను తొలగించే
--((**))--
ఓ శ్రీ మతిగారు - అలాగే " బూష్టు " కలిపి తెస్తా శ్రీవారు
--((**))--
ప్రాంజలి ప్రభ చైతన్య గీతం - 12
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
మనసు నీదిరా, వయసు నీదిరా
సొగసు నీదిరా, వలపు నీదిరా
మనోవేదన వదలి కళ్ళు తెలవరా
మానవత్వాన్ని తెల్సుకొని బతకరా
మత్తుకు చిక్కక నిజం తెల్సుకో
ఆశకు పోక ఉన్నదాన్ని చూసుకో
ఆరాటం వదలి వినయం నేర్చుకో
ఆలోచించి శక్తిని సద్వినియోగం చేసుకో ..... మ
కాటా లాంటి కష్ట నష్టాలకు ఓర్చుకో
నిత్యమూ చీకటి వెలుగుల్లో దిద్దుకో
మంచి చెడులు కావడిలా భావించుకో
మనుగడలో ఉన్న మర్మాన్ని తెలుసుకో .... మ
నిత్యం కఠినంగా పలకడం మానుకో
నిత్యం అబద్ధాలు పలకడం మానుకో
నిత్యం అసంబద్ధ ప్రలాపం మానుకో
దోషాలు, వాగ్దోషాలు ఎంచడం మానుకో
మనసు నీదిరా, వయసు నీదిరా
సొగసు నీదిరా, వలపు నీదిరా
మనోవేదన వదలి కళ్ళు తెలవరా
మానవత్వాన్ని తెల్సుకొని బతకరా
ప్రకటన : "మీరా " షాంపో రుద్దుకొని తలారా స్నానం చేస్తే మెదడు బాగా పనిచేసి మనస్సుకు శాంతి కలుగుతుంద
--((**))--
ప్రాంజలి ప్రభ చైతన్య గీతం - 11
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
మనసు నీదిరా, తెలివి ఉందిరా
మనోవేదన వదలి కళ్ళు తెలవరా
మానవత్వాన్ని తెల్సుకొని బతకరా
మత్తుకు చిక్కక నిజం తెల్సుకో
ఆశకు పోక ఉన్నదాన్ని చూసుకో
ఆరాటం వదలి వినయం నేర్చుకో
ఆలోచించి శక్తిని సద్వినియోగం చేసుకో ..... మ
కాటా లాంటి కష్ట నష్టాలకు ఓర్చుకో
నిత్యమూ చీకటి వెలుగుల్లో దిద్దుకో
మంచి చెడులు కావడిలా భావించుకో
మనుగడలో ఉన్న మర్మాన్ని తెలుసుకో .... మ
నిత్యం కఠినంగా పలకడం మానుకో
నిత్యం అబద్ధాలు పలకడం మానుకో
నిత్యం అసంబద్ధ ప్రలాపం మానుకో
దోషాలు, వాగ్దోషాలు ఎంచడం మానుకో
మనసు నీదిరా, తెలివి ఉందిరా
మనోవేదన వదలి కళ్ళు తెలవరా
మానవత్వాన్ని తెల్సుకొని బతకరా
--((**))--
వీడ్కోలు గీతిక
మల్లాప్రగడ రామకృష్ణ గారు, యెకౌంట్సు ఆఫీసర్ గా" 30-06-2019 " నాడు పదవీ విరమణ సందర్భముగా
వీడ్కోలి దె గైకొనుమా విద్యా వినయశీలుడా
మల్లాప్రగడ వంశంలో ఉదయించిన రామ కృష్ణుడా
గణిత శాస్త్ర, పండితపుత్ర, తెలుగు రచయిత,
గురువర్యా అగణిత గుణ సంపన్నా
అభినందనలు, అభిమానంతో పదవీ విరమణ పొందే వేళ వీడ్కోలు..........
తల్లి తండ్రలను, గురువులను, సేవిస్తూ
శ్రీ దేవితో మీ బంధం ఆది దంపతుల రీతి
'సమీర',జాహ్నవి, ప్రత్యూష లనే సంతాన ప్రాప్తి తోడ
మృదు భాషణం - ప్రియ భాషణం
మిత భాషణం - మందస్మిత భాషణం
వృత్తి గురించి ప్రవృత్తి గురించి ఏమని చెప్పగలము మీ జ్ణాన కౌశలం
ఎంతని వర్ణించ గలం మీ నిత్య యోగాభ్యాసనం
మూడు దశాబ్దాల అనుభవ శాలివి
బాధ్యతతో మీ విధులను పూరించి
అందరికీ ఆదర్శ నీయులుగా ఉండి
టైపిష్టుగా అడుగు పెట్టి, యెకౌంటెంటుగా
జూనియర్ యెకౌంట్స్ ఆఫీసర్గా, అసిస్టెంట్ ట్రజరీ ఆఫీసర్గా, యెకౌంట్స్ ఆఫీసర్గా, ట్రజరీ డిప్యూటి డైరక్టర్ ఇన్చార్జీగా ఉద్యోగ భాద్యతలు నిర్వహించి ప్రతిఒక్కరి మనస్సును గెలిచిన ఆఫీసర్ గారికి పదవీ విరమణకు వీడ్కోలు
అరువది వసంతాల మీ జీవన పయనంలో
వృత్తికే అర్ధభాగము అంకిత మయ్యారు
తెల్లవారుజామున కధలు, కవితలు, పద్యాలు
అంతర్జాలంలో "ప్రాంజలి ప్రభ" గా తెలుగు సాహిత్యాన్ని అందిస్తూ ఉన్నారు మీరు
మీ శేషజీవితం సుఖసంతోష సమ్మిళతమై
కలకాలం సాగాలని మనసారా కాంక్షింతుము.
వీడ్కోలు గైకొనుమా విద్యా వినయ శీలుడా
--((***))--
✍జగనన్న ముఖ్యమంత్రి గా రాజన్న రాజ్యం. 2 లో
అదిరిపోయిన సామాజిక న్యాయం.....
👌మీకు ఆశ్చర్యం కలుగడం ఖాయం...
😭అయితే మీ కోసమో...
✍ప్రపంచంలో కని విని ఎరుగని సామాజిక న్యాయం.
🙏జయహో ఆంధ్రప్రదేశ్... జయహో ఆంధ్రప్రదేశ్ 🙏
###########
నరుణ్ణి, నారాయణునిగా చేసేది దైవీసంపద.
నరుణ్ణి వానరుడిగా చేసేది ఆసురీసంపద.
మనిషిలో దైవంశా ఉన్నది, రాక్షసాంశా ఉన్నది. *తన కర్మలతో
తాను దేవుడూ కావచ్చు. రాక్షసుడూ కావచ్చు*.
* "యధేచ్చసి తథాకురు" - నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో - అంటూ భగవంతుడు మనకు కర్మ స్వాతంత్ర్యాన్ని ప్రసాదించాడు*.
నా కర్మ! నా గ్రహచారం! అంటూ ఏడుస్తూ కూర్చోవాల్సిన పని లేదు. 'క్లైబ్యం మాస్మ గమః' - పిరికి పందవు కావద్దు! - అని హెచ్చరిక. మరి ఏం చేయాలి? 'ఉద్ధరేదాత్మనాత్మానం' - *నిన్ను నీవు ఉద్ధరించుకో! పురుషార్ధం చెయ్యి - అని ప్రోత్సహిస్తున్నాడు*.
###########
*తన వెంట వచ్చే సంపద (పుణ్యం, పాపం, జ్ఞానం) గురించి ఆలోచించడు మానవుడు. విడిచి పెట్టిపోయే సంపదల (డబ్బు, ఇల్లు, పొలం, స్థలం, నగలు .....) కోసం జీవితం చివరి రక్తపు బొట్టు వరకు - చివరి శ్వాసవరకు తపించి పోతూనే ఉంటాడు. అన్నీ ఉన్నప్పుడు అహంకారం. అంతా ఉడిగిపోయిన తరువాత శ్రద్ధ. శ్వాసలున్నంత వరకు ఎవరన్నా లెక్కలేదు. శ్వాస ఎగిరిపోయే సమయంలో డాక్టర్ల కాళ్ళ మీద పడతాం*. వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర మందు ఉంటుందే గాని ఆయుష్షు ఉండదు గదా! రోగానికి మందు ఉంటుంది గాని రోగికి మందు ఉండదు. కనుక ఓ మానవుడా! నీ గడియ గడియా అయిపోతున్నదని గడియారం టకటకా గంటలు కొట్టి హెచ్చరికలు చేసున్నది. ఖబడ్దార్ *మేలుకో! మేలుకొని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో*. నీలో జరిగే ఈ ఆసురీసంపదకు దైవీసంపదకు మధ్య పోరాటాన్ని గమనించు. నీ బలం దైవీసంపదకు ఇవ్వు. ఆసురీసంపదను పారద్రోలు. అప్పుడే నీ లక్ష్యం నెరవేరుతుంది.
###########
