Thursday, 3 November 2016

G.K.3

 ఓం శ్రీ రామ్ - ఓం శ్రీ మాత్రేనమ:
సర్వేజనాసుఖినోభవంతు 

105

తే. గీ.ఇచ్చు గుణమున్న మనసుకు ఇచ్ఛ హాయి                                        
సంపదయెకొంత సంతోష శాంతినిచ్చు
ధనముయే నిజ వ్యామోహ మాయ జూపు
దానగుణముగాధర్మము  త్యాగబుద్ధి 
  
కోటీశ్వరుడైన అతిధిని అడిగాడు- ‘’మిమ్మల్ని అత్యధికంగా సంతోష పెట్టినదేది?’’* 

* నా జీవితంలో నాలుగు దశల్లో సంతోషాన్ని చూశాను. చివరికి నిజమైన సంతోషం అంటే ఏమిటో అర్థం చేసుకోగలిగాను.*

*మొదటి దశలో సంపదను, విలాసవంతమైన వస్తువులను సమకూర్చుకోవడంలో ఆనందాన్ని పొందాను. కానీ  సంతోషం కాదు..*

*ఇక రెండో దశలో అత్యంత ఖరీదైన (విలాస)వస్తువులను సేకరించడం మొదలు పెట్టాను. అయితే వాటి వల్ల లభించే ఆనందం కూడా తాత్కాలికమైనదే! అది  లభించిన ఆనందం ఎంతోకాలం నిలవలేదు.’*

*ఇక మూడో దశలో  కూడా  విలాసవంతమైన పర్యాటక విశ్రాంతి క్షేత్రాలను కొనుగోలు చేయడం వంటివి ఆనందాన్ని ఎంతోకాలం పొందలేక పోయాను.’*

*ఇక ఆ నాలుగో దశ ఏమిటంటే -నా స్నేహితుడొకరు, దివ్యాంగులైన పిల్లల కోసం కొన్ని చక్రాల బళ్ళు కొనివ్వమని అడిగాడు. స్నేహితుని కోరికను మన్నించి వాటిని కొన్నాను. అయితే నా స్నేహితుడు తనతో వచ్చి వాటిని స్వయంగా ఆ పిల్లలకు నేనే అందజేయాలని పట్టుపట్టాడు. చివరికి ఒప్పుకుని అతడితో వెళ్లాను. నా చేతుల మీదగా పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆ పిల్లల మొహాల్లో, కళ్ళల్లో ఆనందపు మెరుపులు, వెలుగులు గమనించాను. ఆ పిల్లలు ఆ వీల్ చైర్స్ లో కూర్చుని అటు ఇటు సంతోషంగా తిరగడం చూశాను. వాళ్ళంతా ఏదో విహారయాత్రకు వెళ్ళినట్లు వినోదించడం చూశాను.’*

*అయితే చివరికి వారి నుంచి వీడ్కోలు తీసుకుని, నేను వెళ్ళిపోతున్న సమయంలో నిజమైన సంతోషం ఏమిటో తెలిసి వచ్చింది.*

*ఒక పిల్లవాడు నా కాళ్ళను పెనవేసుకుని ఆపాడు.* 

*నేను సున్నితంగా విడిపించుకో చూశాను. అయితే ఆ పిల్లవాడు నా మొహంలోకి పరీక్షగా చూస్తూ, తన చేతి పట్టును మరింత బిగించాడు.*

*నేను కాస్త వంగి అనునయంగా ఆ పిల్ల వాడిని అడిగాను- నీకు ఇంకా ఏమైనా కావాలా? అని.*

*అప్పుడు ఆ పిల్లవాడు ఇచ్చిన సమాధానం నాకు నిజమైన ఆనందాన్ని కలిగించడమే కాదు, నా జీవితాన్నే మార్చేసింది. ఆ పిల్లవాడు ఏమన్నాడూ అంటే...*

🌹🌹🌹*నేను మీ ముఖాన్ని బాగా గుర్తు పెట్టుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే స్వర్గంలో నేను మిమ్మల్ని మళ్లీ ఎప్పుడో కలుసుకున్నప్పుడు, మిమ్మల్ని గుర్తుపట్టాలిగా, మళ్లీ ఒకసారి అప్పుడు నా కృతజ్ఞతలు తెలియజేయాలని!* 

కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది
భుక్తికోసం మనసుతిరుగు తుంటుంది
శక్తి సంపదకాదు త్యాగ గుణం అనిపించింది
అందుకే దేవుణ్ణి ఆర్ధిస్తున్నా నాలో నాలోత్యాగం ఉంచమని కోరుతున్నా

మీ మల్లా ప్రగడ

*

రోజుకొక కథ..ప్రాణభీతి*(104)

మృత్యువు ఎవరి మీద ఆపేక్ష చూపదు. ఎవరినీ ద్వేషించదు. ఎవరి పక్షపాతీ కాదు. పండితులు, పామరులు ధనిక, పేద అన్న తేడా లేనే లేదు. ఏ వయసు వారైనా దానికి ఒకటే. ఎవరినీ ఉపేక్షించదు. ప్రాణి ఆయువు తీరగానే తన విధిని నిర్దాక్షిణ్యంగా నెరవేర్చే సమదర్శి. నిర్వికార స్వభావి.

పుట్టిన ప్రతి జీవికి చావు తప్పదు. ఈ సత్యం తెలియడానికి ఏ జ్ఞానమూ అవసరం లేదు. ఇంగిత జ్ఞానం చాలు. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో నిత్యం కంటికి కనిపించే అత్యంత సాధారణ విషయం... మరణం. ఈ భూమి నుంచి ప్రాణులన్నిటికీ సహజాతి సహజమైన నిష్క్రమణం మన రక్తసంబంధీకులైన, ఆప్తులైన, ఆత్మీయులైన వారి విషయంలో జరిగినప్పుడు తల్లడిల్లిపోతాం! మనకూ అది తప్పదన్న ఆలోచన వస్తే భీతిల్లిపోతాం. చావు తథ్యమన్న సత్యాన్ని బుద్ధి గ్రహించినంత త్వరగా, మనసు అంగీకరించదు. ఈ శరీరం మీద మమకారం, భ్రాంతి, ప్రేమానుబంధాల బంధం అది. 
సృష్టి ఆరంభం నుంచి ఇప్పటివరకు ఏ జీవీ శాశ్వతంగా ఇక్కడ ఉండిపోలేదు! పుట్టారు.. గిట్టారు. మృత్యువు ఎవరికీ మినహాయింపు ఇవ్వలేదు. ఈ సత్యాన్ని ఆకళింపు చేసుకున్న వారు మృత్యువు అంటే భయపడరు. తమ లక్ష్యాలను త్వరత్వరగా చేరుకునే ప్రయత్నం చేస్తారు. అయితే, మరణాన్ని నిలువరించేందుకు లేదా వాయిదా వేసేందుకు ప్రయత్నించిన వారు మన ఇతిహాసాల్లో ఉన్నారు. యయాతి అనే రాజు శాప ఫలితంగా తనకు ప్రాప్తించిన అకాల వార్ధక్యం నుంచి బయట పడేందుకు కొడుకు యవ్వనాన్నే కోరాడు. దుర్యోధనుడు మడుగులో, పరీక్షిన్మహారాజు తక్షకుని నుంచి తప్పించుకునే ఆశతో ఒంటిస్తంభపు మేడ కట్టించుకుని దాగుండటంలో... ఉన్నది ప్రాణభీతే. మానసిక పరిపక్వతతో యయాతికి, విజయమో వీరస్వర్గమో అన్న కృతనిశ్చయంతో దుర్యోధనుడికి, పురాణకథలను వినడంతో పరీక్షిత్తుకు మృత్యుభయం తొలగింది. ఆ భయం తొలగినప్పుడే స్థైర్యం వస్తుంది. అంతిమయాత్రకు కావాల్సిన మానసిక సంసిద్ధత లభిస్తుంది. 

రసవాద సంప్రదాయాల్లో, ప్రజలు జీవనామృతం కోసం అన్వేషించారు. దీర్ఘాయుష్షు కోసం, అమరత్వం కోసం ప్రయత్నాలు చేశారు. శక్తియుక్తుల్ని వ్యర్థం చేసుకున్నారు. జ్ఞానోదయం అయ్యింది. ఈ భూమి మీద మన ఉనికికి అర్థం ఒనగూరాలంటే మంచిని సంపాదించుకోవాలి. మంచి పనులు చేయాలి. మనిషిని జంతుప్రపంచం నుంచి వేరుచేసి ప్రత్యేకతను చాటేది అతని ఆలోచనాశక్తే. అది నిరంతరంగా కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది. దానికి వివేకం తోడైతే మనిషి చేసే పనులు అర్థవంతమైనవీ, లోకప్రయోజనకరమైనవీ అవుతాయి.
ప్రేమ, కరుణ, పరోపకారం, శాంతి, క్షమ, సహానుభూతి... అనే మానవీయ లక్షణాలు మనిషిని ఉన్నతుణ్ని చేస్తాయి. వీటిని తమ జీవితాలలో ఆచరించినవారు, భౌతికంగా భూమిమీద లేకున్నా, వారి గొప్పదనం నిలిచిపోతుందనటానికి సాక్ష్యం... మన ముందున్న ఎందరో మహానుభావుల జీవితకథలు. నిజానికి మనిషికి అమరత్వాన్ని ఇచ్చేది ఇదే కదూ! మృత్యువును జయించటమన్నా అదేగా?! 
*
******

రోజుకొక కథ.. (103)

తే. గీ.ఇచ్చు గుణమున్న మనసుకు ఇచ్ఛ హాయి                                        
సంపదయెకొంత సంతోష శాంతినిచ్చు
ధనముయే నిజ వ్యామోహ మాయ జూపు
దానగుణముగాధర్మము  త్యాగబుద్ధి 

కోటీశ్వరుడైన అతిధిని అడిగాడు- ‘’మిమ్మల్ని అత్యధికంగా సంతోష పెట్టినదేది?’’* 

* నా జీవితంలో నాలుగు దశల్లో సంతోషాన్ని చూశాను. చివరికి నిజమైన సంతోషం అంటే ఏమిటో అర్థం చేసుకోగలిగాను.*

*మొదటి దశలో సంపదను, విలాసవంతమైన వస్తువులను సమకూర్చుకోవడంలో ఆనందాన్ని పొందాను. కానీ  సంతోషం కాదు..*

*ఇక రెండో దశలో అత్యంత ఖరీదైన (విలాస)వస్తువులను సేకరించడం మొదలు పెట్టాను. అయితే వాటి వల్ల లభించే ఆనందం కూడా తాత్కాలికమైనదే! అది  లభించిన ఆనందం ఎంతోకాలం నిలవలేదు.’*

*ఇక మూడో దశలో  కూడా  విలాసవంతమైన పర్యాటక విశ్రాంతి క్షేత్రాలను కొనుగోలు చేయడం వంటివి ఆనందాన్ని ఎంతోకాలం పొందలేక పోయాను.’*

*ఇక ఆ నాలుగో దశ ఏమిటంటే -నా స్నేహితుడొకరు, దివ్యాంగులైన పిల్లల కోసం కొన్ని చక్రాల బళ్ళు కొనివ్వమని అడిగాడు. స్నేహితుని కోరికను మన్నించి వాటిని కొన్నాను. అయితే నా స్నేహితుడు తనతో వచ్చి వాటిని స్వయంగా ఆ పిల్లలకు నేనే అందజేయాలని పట్టుపట్టాడు. చివరికి ఒప్పుకుని అతడితో వెళ్లాను. నా చేతుల మీదగా పంపిణీ కార్యక్రమం జరిగింది. ఆ పిల్లల మొహాల్లో, కళ్ళల్లో ఆనందపు మెరుపులు, వెలుగులు గమనించాను. ఆ పిల్లలు ఆ వీల్ చైర్స్ లో కూర్చుని అటు ఇటు సంతోషంగా తిరగడం చూశాను. వాళ్ళంతా ఏదో విహారయాత్రకు వెళ్ళినట్లు వినోదించడం చూశాను.’*

*అయితే చివరికి వారి నుంచి వీడ్కోలు తీసుకుని, నేను వెళ్ళిపోతున్న సమయంలో నిజమైన సంతోషం ఏమిటో తెలిసి వచ్చింది.*

*ఒక పిల్లవాడు నా కాళ్ళను పెనవేసుకుని ఆపాడు.* 

*నేను సున్నితంగా విడిపించుకో చూశాను. అయితే ఆ పిల్లవాడు నా మొహంలోకి పరీక్షగా చూస్తూ, తన చేతి పట్టును మరింత బిగించాడు.*

*నేను కాస్త వంగి అనునయంగా ఆ పిల్ల వాడిని అడిగాను- నీకు ఇంకా ఏమైనా కావాలా? అని.*

*అప్పుడు ఆ పిల్లవాడు ఇచ్చిన సమాధానం నాకు నిజమైన ఆనందాన్ని కలిగించడమే కాదు, నా జీవితాన్నే మార్చేసింది. ఆ పిల్లవాడు ఏమన్నాడూ అంటే...*

*నేను మీ ముఖాన్ని బాగా గుర్తు పెట్టుకోవాలి అనుకుంటున్నాను. ఎందుకంటే స్వర్గంలో నేను మిమ్మల్ని మళ్లీ ఎప్పుడో కలుసుకున్నప్పుడు, మిమ్మల్ని గుర్తుపట్టాలిగా, మళ్లీ ఒకసారి అప్పుడు నా కృతజ్ఞతలు తెలియజేయాలని!* 

కాలచక్రం తిరుగుతూనే ఉంటుంది
భుక్తికోసం మనసుతిరుగు తుంటుంది
శక్తి సంపదకాదు త్యాగ గుణం అనిపించింది
అందుకే దేవుణ్ణి ఆర్ధిస్తున్నా నాలో నాలోత్యాగం ఉంచమని కోరుతున్నా

మీ మల్లా ప్రగడ

*
బ్రహ్మ జ్ఞానమంటే ఏమిటి?* (102)

తే. గీ. చదువు వున్నసంస్కారము చెలిమి నమ్ము
మందు తగ్గగుణము యున్న మంచి దగును
ఆత్మ జ్ఞాన స్వభావము అణుకువ యగు
వేద శాస్త్రాలుగా నిజ విద్య మేలు

అత్యున్నత బ్రహ్మ జ్ఞానమును పొందిన వానికి శాస్త్ర పఠనము వలన ప్రయోజనము లేదు. అలానే శాస్త్ర పఠనము ద్వారా ఎట్టి ఔన్న త్యమును పొందలేము. శాస్త్రాలలోని వివిధ పదాలు కిక్కిరిసిన అరణ్యము లాంటివి. అందులో చిక్కుకొనిన బయటపడుట చాలా కష్టము. వాటి వలన మనస్సు వికలమ గును. అందువలన తెలివి కలిగినవారు ప్రీతితో నిజమైన ఆత్మ స్వభావమును గ్రహించుట అవసరము. అజ్ఞానమనే నాగుపాముచే కాటు వేయ బడిన వ్యక్తికి బ్రహ్మజ్ఞానాన్ని పొందుటయే సరైన వైద్యము. అందుకు వేదాలు, శాస్త్రాలలోని మంత్రాల ద్వారా వైద్యము చేయాలి.

కేవలము మందు పేరు పదేపదే ఉచ్చరించుట వలన రోగము తగ్గదు. ఆ మందును సేవించవలసి ఉంటుంది. అలానే బ్రహ్మమును స్వయముగా తెలుసుకొనుట ద్వారానే వ్యక్తి బ్రహ్మాన్ని పొందగలడు. బ్రహ్మము, బ్రహ్మము అని పదేపదే ఉచ్చరించుట వలన బ్రహ్మ జ్ఞానము లభించదు. 63. బ్రహ్మము, తాను ఒక్కటే అను జ్ఞానము స్వయముగా సమాధి స్థితి ద్వారా పొందకుండా, అలానే తానే చిదా త్మను అని గ్రహించకుండా, బ్రహ్మము వేరు తాము వేరు అని ద్వంద్వ భావముతో ఉన్నప్పుడు అది అజ్ఞానమని పిలవబడుతుంది. ఆ అజ్ఞానమే తన యొక్క చెడు పనులకు కారణమని గ్రహించాలి. అది తొలగినప్పుడే ముక్తి. కేవలము బ్రహ్మము, బ్రహ్మము అని ఎన్ని సార్లు ఉచ్చరించినను బ్రహ్మాన్ని పొందలేముకదా!

ఒక రాజు తన చుట్టూ ఉన్న శత్రువులను జయించకుండా తానే చుట్టుప్రక్కల గొప్పవాడినని, తానే చెప్పుకొనినందువలన అతడు చక్రవర్తి కాలేడు. భూగర్భములో ఉన్న ధనాగారము వెలికితీయా లంటే, తగిన వ్యక్తి యొక్క సలహా సంప్రదింపుల ద్వారా త్రవ్వకాలు జరిపి అడ్డుగా ఉన్న రాళ్ళను, మట్టిని తొలగించి ఆ ధనాగారాన్ని పొందినప్పుడే ఫలితము. అలా కాకుండా బయట నుండి ధనాగా రము, ధనాగారము అని పలుమార్లు పలికినా అది బయటపడదు. అలానే ఆత్మ జ్ఞానము పొందాలంటే దాని చుట్టూ ఆవరించి ఉన్న మాయ మరియు దాని ప్రభావాలను తొలగించకుండా, బ్రహ్మ జ్ఞానాన్ని పొందలేము.

బ్రహ్మ జ్ఞానాన్ని పొందిన వ్యక్తి యొక్క సూచనల ప్రకారము సాధన, ధ్యాన మార్గాలను అనుసరించవలసి ఉంటుంది. కేవలము అసంబద్దమైన వాదనల ద్వారా బ్రహ్మ జ్ఞానాన్ని పొందలేము. అందువలన తెలివిగల వ్యక్తి స్వయముగా అన్ని విధములైన పద్ద తుల ద్వారా కృషి చేసినప్పుడే; పుట్టుక, చావులనే బంధనాల నుండి విముక్తిని పొందగలడు. అలా కాక రోగి మందు పేరును మరలమ రల పలుకుట వలన రోగము తగ్గదు. తగిన మందు సేవించినప్పుడే రోగము తగ్గుతుంది.

ఓ జ్ఞానీ శ్రద్ధతో వినుము. నేను ఎవరికైతే ఈ విషయాన్ని చెప్పు చున్నానో, అది విన్నవారు వెంటనే సంసార బంధనాల నుండి విముక్తి పొందగలరు🙏🙏🙏
******
సహన ఫలం.....* రోజుకొక కథ..(101)

ఆ ::నమ్మకమ్ము యున్న నటన నిజము చెప్పు
కమ్ముకున్న బాధ కాల మార్పు
సహన విజయ మౌను సాహస ఫలమగు 
సమయ వోర్పు మనసు సుఖము చేర్చు 

*ఒక అడవిలో రెండు చిలకలు ఉన్నాయి. ఒక వేటగాడు ఆ రెంటినీ పట్టి రాజుగారికి కానుకగా సమర్పించాడు. రాజు వాటి అందానికి, మాటలకు ముగ్ధుడై బంగారు పంజరాలు చేయించి పెంచుకోసాగాడు. వాటికి రుచికరమైన ఆహారం అందిస్తూ, వాటిని అల్లారుముద్దుగా చూసుకుంటున్నాడు.*

*కొన్నాళ్లు గడిచాయి. ఒకరోజున అదే వేటగాడు ఒక అందమైన కోతిని పట్టి తెచ్చి రాజుకు సమర్పించాడు. దాని చేష్టలకు ముచ్చటపడ్డ రాజు, దాన్ని ఎంతో శ్రద్ధతో పెంచుతున్నాడు. కొత్తగా వచ్చిన కోతి మీద శ్రద్ధ పెరగడంతో చిలుకల మీద ఆశ్రద్ద ఏర్పడింది. వాటికి సరైన ఆలనాపాలన లేక చిక్కిపోయాయి.*

*ఈ పరిస్థితి చూసిన చిన్న చిలుక, పెద్ద చిలుకతో -"చూశావా అన్నా! రాజుగారికి కోతిమీద ఇష్టం పెరిగింది. మనకు అన్న పానీయాలు అందడం లేదు. మనం ఇక్కడి నుంచి వెళ్లిపోదాం" అంది.*

*అప్పుడు అన్న చిలుక-"తమ్ముడూ! తొందరవద్దు. రాజుకి మన మీద ప్రేమ లేక కాదు. కొత్తగా వచ్చింది కాబట్టి కోతిమీద అతని ప్రేమ మళ్లింది. అది కోతి. దాని చేష్టలే దాన్ని ఇక్కడి నుంచి తరిమేస్తాయి. సహనం వహించు" అన్నాడు.*

*ఆ రాజుగారికి ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. ఒకసారి వారు ఆ కోతి దగ్గరకు వచ్చి ఆటపట్టించారు. కోతికి కోపం వచ్చి, పళ్లు బైటకు తీసి, చెవులు రిక్కించి గట్టిగా అరిచి వాళ్ల మీదికి దూకింది. దానితో వాళ్లు భయంతో కేకలు పెట్టారు. రాజుకి విషయం తెలిసి, 'ఆ కోతిని బైటికి తరిమేయండి' అని ఆజ్ఞాపించాడు.*

*కోతిపోయాక రాజుగారి ఆలనాపాలనా చిలుకల మీదకి మళ్లింది. చిలుకల అందం, మధుర భాషణం వల్ల వీటికి తిరిగి మర్యాదలు దక్కాయి. వాటి "సహన గుణమే" వాటికి మేలు చేసింది.*

మల్లాప్రగడ