సర్వేజనా సుఖినోభవంతు
| భారత్ గురించి 35 'మైండ్ బ్లోయింగ్' నిజాలివి. వీటిని చదువుతుంటేనే ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ఆ నిజాలు మీకోసం...
1. ప్రపంచంలో ఇంగ్లీష్ అత్యధికంగా మాట్లాడే రెండో దేశం భారత్. తొలి దేశం అమెరికా. 2. ప్రపంచంలోని రాజ్యాంగాల్లో ఇండియాదే అతి పెద్దది. 448 ఆర్టికల్స్, 25 భాగాలు, 12 షెడ్యూళ్లతో ఉంటుంది. 3. ఆసియా సింహాలను పరిరక్షిస్తున్న ఏకైక దేశం ఇండియానే. 4. ప్రపంచంలో అత్యధిక శాఖాహారులున్న దేశం కూడా మనదే. దాదాపు 40 శాతం భారతీయులు మాంసాహారం ముట్టరు. 5. ఇండియాలోని రోడ్లతో భూమి అంతటినీ 117 సార్లు చుట్టేయొచ్చు. 6. భారత సాఫ్ట్ వేర్ కంపెనీలు 90 దేశాలకు తమ ప్రొడక్టులను ఎగుమతి చేస్తాయి. అమెరికా సహా మరే దేశానికీ ఈ ఘనత దక్కలేదు. 7. మార్స్ పరిశీలనకు ఉపగ్రహాలను పంపేందుకు ఇతర దేశాలు వెచ్చించిన మొత్తంలో 75 శాతం తక్కువకే ఇస్రో విజయం సాధించింది. 8. యూఎస్, జపాన్ ల తరువాత సూపర్ కంప్యూటర్లను తయారు చేసిన, చేస్తున్న ఏకైక దేశం ఇండియానే. 9. 2014లో జరిగిన ఎన్నికల్లో ఇండియాలో ఓట్లు వేసిన వారి సంఖ్య 54 కోట్లు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల మొత్తం జనాభా కన్నా ఇదే అధికం. 10. మరో ఏడాది నాటికి ప్రపంచంలోని కార్మిక శక్తిలో 25 శాతం ఇండియా నుంచే వెళుతుందని అంచనా. 11. జాతీయ క్రీడ అంటూలేని దేశాల్లో ఇండియా ఒకటి.హాకీ వున్నా అంతగా ప్రాచుర్యం లేదని నా అభిప్రాయం. 12. ఇండియాలో సుమారు 1000 భాషలున్నాయి. జాతీయ భాష కూడా లేదు. హిందీ, ఇంగ్లీష్ లు అధికార భాషలుగా గుర్తింపు పొందాయి. 13. అన్ని యూరోపియల్ భాషలకూ మూలమైన సంస్కృతం ఇండియాలో పుట్టిందే. 14. ప్రపంచ తొలి యూనివర్శిటీ క్రీస్తు పూర్వం 700 సంవత్సరాలకు ముందే ఇండియాలో మొదలైంది. అదే తక్షశిల. ఇక్కడ ప్రపంచ నలుమూలల నుంచి 10,500 మంది విద్యార్థులకు 60 సబ్జెక్టుల్లో బోధనలు సాగాయనడానికి ఆధారాలున్నాయి. 15. గతంలో భారత రూపాయి ఎన్నో దేశాల్లో అధికారిక కరెన్సీగా చలామణి అయింది. ఒమన్, దుబాయ్, కువైట్, బహ్రయిన్, ఖతార్, కెన్యా, ఉగాండా, సీషల్స్, మారిషస్ దేశాలు అధికారిక కరెన్సీగా రూపాయిని వాడాయి. 16. ఇప్పటివరకూ జరిగిన ప్రపంచ స్థాయి పోటీల్లో ఓటమెరుగని జట్టుగా భారత కబడ్డీ జట్టు నిలిచింది. భారత కబడ్డీ ఆటగాళ్లు తామాడిన అన్ని వరల్డ్ కప్ పోటీల్లో విజేతలుగా నిలిచారు. 17. వరల్డ్ రికార్డులను క్రియేట్ చేయడంలో ప్రపంచంలో మూడో స్థానం మనది. తొలి రెండు స్థానాల్లో అమెరికా, బ్రిటన్ ఉన్నాయి. 18. ప్రపంచంలో బంగారాన్ని అత్యధికంగా వినియోగిస్తున్న దేశాల్లో ఇండియా రెండవది. 19. ప్రపంచంలోనే సుగంధ ద్రవ్యాలను అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఇండియానే. 20. 1990లో జరిగిన గల్ఫ్ వార్ సమయంలో అతిపెద్ద ప్రజల తరలింపును భారత్ చేపట్టింది. ఆ దేశాల్లో ఉన్న సుమారు 1.7 లక్షల మందిని 488 ఎయిర్ ఇండియా విమానాలు 59 రోజులు శ్రమించి దేశం దాటించాయి. 21. ఐక్యరాజ్యసమితి నిర్వహించే శాంతి దళాల్లో అత్యధికులు భారతీయులే. 22. గడచిన 1000 సంవత్సరాల్లో భారత్ స్వయంగా ఏ దేశంపైనా దాడి చేయలేదు. 23. 1896 వరకూ ప్రపంచానికి వజ్రాలను అందించిన ఏకైక దేశం ఇండియా మాత్రమే. కృష్ణా నది డెల్టా, ముఖ్యంగా ఇప్పటి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనే ప్రపంచ ప్రఖ్యాత వజ్రాలెన్నో లభించాయి. 24. చైనా, అమెరికాల తరువాత అతిపెద్ద సైనిక శక్తి మనదే. 25. ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే ప్లాట్ ఫాం ఖరగ్ పూర్ లో ఉంది. దీని పొడవు 2.773 కిలోమీటర్లు. 26. ప్రపంచంలో తొలిసారిగా పర్సనలైజ్డ్ స్టాంపులను అందించిన దేశం ఇండియానే. 27. ఇండియాలో రోజుకు 14,300 రైళ్లు తిరుగుతుండగా, అవి ప్రయాణించే దూరం చంద్రడికి, భూమికి మధ్య ఉన్న దూరానికి మూడున్నర రెట్లు అధికం. 28. ప్రపంచంలో అత్యధికంగా సినిమాలు తీసే దేశం కూడా ఇండియానే. 29. ప్రపంచంలో అత్యంత పురాతన నగరం మనదేశంలోనే ఉంది. అదే వారణాసి. 30. ఇసియాలోనే అత్యంత పరిశుభ్ర గ్రామం మేఘాలయాలో ఉంది. దాని పేరు మౌలినాంగ్. ప్రపంచంలోనే అత్యధికంగా వర్షం పడే ప్రాంతమూ మేఘాలయాలో ఉంది. అదే చిరపుంజి. ఇక్కడ ప్రతియేటా సరాసరిన 467 అంగుళాల వర్షపాతం నమోదవుతుంది. 31. అత్యధిక విద్యార్థులు ఉన్న స్కూలు కూడా మనదే. లక్నోలోని సిటీ మాంటిస్సోరి పాఠశాలలో ఏటా 45 వేల మంది విద్యను అభ్యసిస్తుంటారు. 32. పన్నెండేళ్లకు ఓసారి జరిగే గంగానది కుంభమేళాకు వచ్చే ప్రజల సంఖ్య అంతరిక్షం నుంచి కూడా కనిపించేంత ఎక్కువగా ఉంటుంది. 33. సంఖ్యాశాస్రాన్ని ఆర్యభట్ట కనుగొంటే, బ్రహ్మగుప్త సున్నా విలువ ప్రపంచానికి తెలిపారు. 34. ఆల్ జీబ్రా, త్రికోణమితిలను ప్రపంచానికి అందించింది ఇండియానే. 35. మానవ చరిత్రలో తొలి వైద్య విధానం 'ఆయుర్వేద'ను అందించింది ఇండియానే. ఇవే కాదు, ఇంకెన్నో ఘనతలను ఇండియా సాధించింది, సాధిస్తూ ఉంది. | ||
****
వేంగీ(తూర్పు) చాళుక్యుల వంశావళి
1) కుబ్జ(మొదటి) విష్ణువర్ధనుడు. క్రీ. శ. 624----641---18సంవత్సరాలు.
2) మొదటి జయసింహవల్లభుడు. క్రీ. శ. 641 ---673----30--33.సం।।
3) ఇంద్ర భట్టారకుడు. క్రీ. శ. 673 --7రోజులు.
4) రెండవ విష్ణువర్థనుడు. 673---681-----9 సం।।
5) మంగి యువరాజు. 681---705 ---25 సం।।
6) రెండవ జయసింహ వల్లభుడు.705----717----13 సం।।
7) కొక్కిలి 705----717---6 నెలలు.
8) మూడవవిష్ణు వర్థనుడు 718---752 ----37--35 సం।।
9) మొదటి విజయాదిత్యుడు. 753---770 ---18-19సం।।
10) నాల్గవ విష్ణువర్ధనుడు. 770---806---35-36సం।।
11) రెండవ విజయాదిత్యుడు. 806---846---40-41-46.సం।।
12) ఐదవ విష్ణువర్ధనుడు. 846---847--1 1/2--1 2/3సం।।
13) గుణగ(మూడవ) విజయాదిత్యుడు. క్రీ. శ. 848---891.---44 సం।।
14) మొదటి చాళుక్య భీముడు. క్రీ. శ. 892---922 ---30 సం।।
15) నాల్గవ విజయాదిత్యుడు. క్రీ. శ. 922----6 నెలలు.
16) మొదటి అమ్మరాజు. క్రీ. శ. 922 నుండి --------7 సం।।
17) ఐదవ విజయాదిత్యుడు---15 రోజులు
18) తాడప ------ 1 నెల.
19) విక్రమాదిత్యుడు----- 1 సం।।11-9 నెలలు.
20) భీముడు------6 నెలలు.
21) యుధ్ధమల్లుడు --- క్రీ. శ. 934 వరకు. -----7 సం।।
22) రెండవచాళుక్య భీముడు ---934---945----12 సం।।
23) రెండవ అమ్మరాజు/ ఆరవ విజయాదిత్యుడు. ----945---970---25 సం।।
24)దానార్ణవుడు ---970---973---3 సం।।
25) అరాచక కాలం ---973---999---27 సం।।
26) మొదటి శక్తి వర్మ ---999----1011---12 సం।।
27) విమలాదిత్యుడు---1011----1018-- -7 సం।।
28) రాజరాజు---1019---1060--40--41 సం।।
29) రెండవ శక్తివర్మ---1061--1062 --1 సం।।
30) ఏడవ విజయాదిత్యుడు---1062--1076---- 15 సం।।
తరువాత
కులోత్తుంగ చోరుడు.

